United States Geological Survey
-
భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు
తెగుసిగల్ప, హోండురాస్ : సెంట్రల్ అమెరికాలోని కరేబియన్ ద్వీపంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రతతో ప్రకంపనలు వ్యాపించాయి. దీంతో అమెరికా వర్జిన్ ఐలాండ్, ప్యూరిటో రికోలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా జియాలజిస్ట్‌లు తెలిపిన వివరాల ప్రకారం తెగుసిగల్స రాజధాని హోండురాన్కు 519 కిలో మీటర్ల దూరంలోని బర్రా పటుకా, జార్జ్ టౌన్లో ఈ భూకంపం చోటు చేసుకుంది. దీని ప్రభావంతో వర్జిన్ ఐలాండ్, ప్యూరిటో రికో ప్రాంతాల్లో సునామీ సంభవించే అవకాశం ఉందని తొలుత పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది. ఈ భూకంపం 10 కిలో మీటర్ల మేర తీవ్ర ప్రభావం చూపి భూమి పెద్ద మొత్తంలో చీలిపోయినట్లు వెల్లడించింది. అయితే, ఎంతమేరకు నష్టం జరిగందనే దానిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. -
ఈక్వెడార్‌లో భూవిలయం
♦ 7.8 తీవ్రతతో భూకంపం.. 235 మంది మృతి ♦ 1557 మందికి గాయాలు కుప్పకూలిన ఇళ్లు.. కొద్దిలో తప్పిన సునామీ ముప్పు! క్విటో: దక్షిణ అమెరికా ఖండదేశం ఈక్వెడార్ చిగురుటాకులా వణికిపోయింది! శనివారం రాత్రి(స్థానిక కాలమానం ప్రకారం) 12 గంటలకు 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. 235 మంది దుర్మరణం పాలయ్యారు. 1557 మంది గాయపడగా అనేకమంది శిథిలాల కింద చిక్కుకున్నారు. మాంటా, పోర్టోవీజో, గుయాక్విల్ నగరాల్లో పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు చెప్పారు. భూకంపం తర్వాత 55 సార్లు చిన్నపాటి ప్రకంపనలు వచ్చాయి. దేశ రాజధాని క్విటోకు వాయవ్య దిశలో 170 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దాదాపు ఒక నిమిషం పాటు ఈక్వెడార్తోపాటు పెరూ ఉత్తర భాగం, కొలంబియా దక్షిణ ప్రాంతం కంపించింది. ఈక్వెడార్‌లోనే ఎక్కువ నష్టం చోటుచేసుకుంది. పలు ప్రాంతాల్లో అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. తీర పట్టణమైన గుయాక్విల్‌లో ఓ వంతెన కుప్పకూలడంతో కారు ధ్వంసమైంది. భవనాలు ఊగిపోవడంతో జనం భయంతో పరుగులు తీశారు. దారుణంగా దెబ్బతిన్న పెడెర్నాలస్ పట్టణంలోనే 400 మంది మరణించి ఉంటారని భావిస్తున్నారు. అక్కడ 40 హోటళ్లు కుప్పకూలాయి. ‘నా జీవితంలో ఇంతటి తీవ్ర భూకంపం ఎన్నడూ చూడలేదు. భూమి చాలాసేపు కంపించింది. బయటకు పరుగెత్తాలనుకున్నా. కానీ కనీసం నడవలేకపోయా’ అని క్విటో వాసి టోరెస్ పేర్కొన్నారు. భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న పెడెర్నాలెస్ పట్టణంలోని వందలమంది రాత్రంతా ఆరుబయటే పడుకున్నారు. ఈ పట్టణంలో పలువురు లూటీలకు పాల్పడ్డారని, ప్రజల్ని రక్షించేందుకు తాము ప్రాధాన్యమిస్తున్నామని స్థానిక అధికారులు వెల్లడించారు. విపత్తుపై దేశాధ్యక్షుడు రఫేల్ కొరెయ, ఉపాధ్యక్షుడు జార్జ్ గ్లాస్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆరు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ.. నష్టం ఎక్కువగా చోటుచేసుకున్న ఆరు రాష్ట్రాల్లో ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది. పోలీసు, సైన్యం, విపత్తు నిర్వహణ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. 10 వేల మంది సైన్యంతో పాటు 4,600 మంది పోలీసులు భూకంప బాధిత ప్రాంతాలకు తరలివెళ్లారు. పెడెర్నాలెస్, పోర్టోవీజో నగరాల్లో ప్రజలకు 3 వేల ఆహార పొట్లాల్ని, 8 వేల నిద్ర సామగ్రిని అందచేశారు. వాటికన్ సిటీ వెళ్లిన అధ్యక్షుడు రఫెల్ పర్యటన రద్దు చేసుకొని ఈక్వెడార్ బయల్దేరారు. భూకంపం తర్వాత సునామీ వచ్చే ప్రమాదం ఉన్నట్లు హవాయికి చెందిన సునామీ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. అయితే ఆ ప్రమాదం కొద్దిలో తప్పిపోయిందని, సునామీ ప్రమాదమేమీ లేదంటూ తర్వాత పేర్కొంది. భూగర్భంలో టెక్టానిక్ ఫలకాల సరిహద్దులపై ఈక్వెడార్ ఉండడంతో ఈ దేశంలో తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. దీంతో 1900 నుంచి ఇప్పటివరకు రిక్టర్ స్కేల్‌పై 7.0 లేదా అంతకుమించిన తీవ్రతతో ఏడుసార్లు భూకంపాలు సంభవించాయి. 1987 మార్చిలో సంభవించిన భూకంపంలో వెయ్యి మంది మరణించారు. జపాన్‌లో బిక్కుబిక్కుమంటూ... కుమమొటో: జపాన్ భూకంప ప్రభావం నుంచి ప్రజలు ఇంకా కోలుకోలేదు. చిన్న చిన్న ప్రకంపనలు భయపెడుతుండడంతో జనం ఇళ్లలో ఉండేందుకు ఇష్టపడడం లేదు. ఒజు పట్టణంలోని పలువురు స్థానిక పార్కులో కార్లలో నిద్రిస్తున్నారు. కుమమొటో, మహిషి నగరాల్లో వేలాది మంది శనివారం రాత్రంతా ఆరుబయటే నిద్రించారు. జపాన్‌లో గురు, శనివారాల్లో వచ్చిన రెండు భూకంపాల ధాటికి 41 మంది మృతిచెందగా.. 1,500 మంది గాయపడ్డం తెలిసిందే. గల్లంతైన వారి కోసం జపాన్, అమెరికా వైమానిక దళాలు గాలిస్తున్నాయి. అసో పర్వత ప్రాంతంలో అదృశ్యమైన ఆరుగురి కోసం గాలింపు కొనసాగుతోంది. మినమియాసో ప్రాంతంలో అదృశ్యమైన వారికోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. సహాయక కార్యక్రమాల్లో అమెరికా ఆర్మీ సాయం తీసుకుంటున్నామని ప్రధాని షింజో అబే తెలిపారు. ఇప్పటికీ కుమమొటోలో 80 వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా లేదు. 4 లక్షల గృహాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. నగరంలో 200 ఇళ్లు, భవంతులు దెబ్బతిన్నాయని, 91 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని స్థానిక అధికారులు తెలిపారు. -
ఈక్వెడార్ భూకంపం: 235కు చేరిన మృతుల సంఖ్య
ఈక్వెడార్ రాజధాని క్వీటోను కుదిపేసిన భారీ భూకంపం రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.8గా నమోదు తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికల జారీ క్వీటో: ఈక్వెడార్ రాజధాని క్వీటోను భారీ భూకంపం కుదిపేయగా మృతుల సంఖ్య గంటగంటకూ పెరిగిపోతోంది. భూకంప ధాటికి మృతిచెందిన వారి సంఖ్య 235 కి పెరిగినట్టు ఆ దేశ అధికారులు ఆదివారం రాత్రి వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆ దేశ ఉపాధ్యక్షుడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్టు జార్జ్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో రాజధాని క్వీటోలో భూప్రకంపనల తీవ్రత బలంగా ఉండటంతో అక్కడి ప్రాంతీయ తీరప్రాంతాల్లో సునామీ హెచ్చరికలను జారీ చేశారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కాగా, స్థానిక కాలమానం ప్రకారం శనివారం 11.58 గంటల ప్రాంతంలో భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల దూరంలో బలమైన భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.8గా నమోదైనట్టు అమెరికా జీయోలాజికల్ సర్వే వెల్లడించింది. క్వీటోకు పశ్చిమ-వాయువ్యంగా 173 కిలోమీటర్ల దూరంలో, మరో చోట ఆగ్నేయ దిశగా మూస్నేకు 28 కిలోమీటర్ల దూరంలో భూప్రకపంనలు చోటుచేసుకున్నాయి. 11 నిమిషాల కాల వ్యవధిలో ఒకే ప్రాంతంలో రెండు భూకంపాలు కుదిపేసినట్టు యూస్‌జీయస్ వెల్లడించింది. తొలుత 4.8 గా ఉన్న భూకంప తీవ్రత, ఆ తర్వాత 7.8 తీవ్రత నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. -
ఈక్వెడార్‌లో భారీ భూకంపం, సునామీ హెచ్చరిక
♦ ఈక్వెడార్ రాజధాని క్వీటోను కుదిపేసిన భారీ భూకంపం ♦ భూకంప ధాటికి 28 మంది దుర్మరణం ♦ రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.8గా నమోదు ♦ తొలుత భూకంప తీవ్రత 4.8 గా నమోదు ♦ తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికల జారీ ఈక్వెడార్: ఈక్వెడార్ రాజధాని క్వీటోలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.8గా నమోదైనట్టు అమెరికా జీయోలాజికల్ సర్వే వెల్లడించింది. రాజధాని క్వీటోలో భూప్రకంపనల తీవ్రత బలంగా ఉండటంతో అక్కడి ప్రాంతీయ తీరప్రాంతాల్లో సునామీ హెచ్చరికలను జారీ చేశారు. భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల దూరంలో శనివారం (స్థానిక కాలమానం)11. 58 గంటల ప్రాంతంలో భారీగా భూప్రకంపనలు చోటుచేసుకున్నట్టు పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం పేర్కొంది. ఈ భూకంప ధాటికి 28 మంది దుర్మరణం చెందినట్టు పేర్కొంది. క్వీటోకు పశ్చిమ-వాయువ్యంగా 173 కిలోమీటర్ల దూరంలో 11.58 గంటల ప్రాంతంలో ఏర్పడగా, మరో చోట ఆగ్నేయ దిశగా మూస్నేకు 28 కిలోమీటర్ల దూరంలో భూప్రకపంనలు చోటుచేసుకున్నట్టు పేర్కొంది. 11 నిమిషాల కాల వ్యవధిలో ఒకే ప్రాంతంలో రెండు భూకంపాలు కుదిపేసినట్టు యూస్‌జీయస్ వెల్లడించింది. తొలుత భూకంప తీవ్రత 4.8 గానూ, రెండో భూకంప తీవ్రత 7.8 గా నమోదైనట్టు తెలిపింది. ఈ భూకంప ధాటికి క్వీటోలో భవనాలు ధ్వంసం కాగా, 28 మంది మృత్యువాత పడినట్టు ఆ దేశ ఉపాధ్యక్షుడు జార్జ్ గ్లాస్ పేర్కొన్నారు. గుయాస్‌లో ఇద్దరు, పోర్ట్వ్యిజో నగరంలో 16 మంది, మాంటాలో 10 మంది మృతిచెందినట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్టు జార్జ్ పేర్కొన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. కాగా, జపాన్‌లో రెండ్రోజుల వ్యవధిలో సంభవించిన రెండు భారీ భూకంపాలు కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ భూకంప ధాటికి మృతుల సంఖ్య 41కు పెరిగగా, 1500 మంది గాయపడ్డారు. క్యుషు ద్వీపంలోని కుమమొటో ప్రాంతాన్ని శనివారం తెల్లవారుజామున (స్థానిక కాలమానం) 1.30 నిముషాలకు మరో భూకంపం కుదిపేయడంతో 32 మందికి మరణించిన సంగతి విధితమే. -
అలస్కాలో భూకంపం
వాషింగ్టన్ : అలస్కాలో శనివారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.2గా నమోదు అయిందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఎక్కడ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కానీ సంభవించినట్లు సమాచారం మాత్రం అందలేదని తెలిపింది. అయితే సునామీ వచ్చే సూచనలు ఏమీ లేవని పేర్కొంది. భూకంప కేంద్రం 58 మైళ్ల అడుగున సంభవించినట్లు గుర్తించామని యూఎస్ జియోలాజికల్ సర్వే చెప్పింది. -
ఇండోనేషియాలో భూకంపం
జకార్తా: ఇండోనేషియాలోని పశ్చిమ ప్రాంతంలో శుక్రవారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.5గా నమోదు అయింది. ఈ మేరకు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఇంతవరకు ప్రాణ, ఆస్తి నష్టం కాని సంభవించినట్లు సమాచారం అందలేదని తెలిపింది. అయితే భూకంపంపై సమాచారం అందిన వెంటనే ఇండినేషియా విపత్తు నివారణ సంస్థకు చెందిన బృందాలు ఇప్పటికే సదరు ప్రాంతాల్లో తరలించి సహాయక చర్యలు చేపట్టినట్లు చెప్పింది. కాగా సునామీ వచ్చే అవకాశం మాత్రం లేదని పేర్కొంది. సుంబా ప్రాంతంలో 30 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. -
రోజురోజుకు పెరిగిపోతున్న తైపీ మృతుల సంఖ్య
తైపీ : తైవాన్‌లో సంభవించిన భారీ భూకంపం మృతుల సంఖ్య 55కు చేరుకుంది. ఈ నెల 6న ఈశాన్య తైవాన్ లో భూకంపం రావడంతో వందల మంది గాయాలపాలయ్యారు. కొద్ది మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. మృతుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై ప్రాథమికంగా 5.8గా నమోదు అయినప్పటికీ, తర్వాత తీవ్రత 6.7గా నమోదు అయింది. ఇప్పటికీ 80 మందికి పైగా ఆచూకీ లభ్యం కాలేదని అధికారులు వెల్లడించారు. వేయ్ గువాన్ లో ఓ కాంప్లెక్స్ కుప్పకూలి అక్కడ చాలా నష్టం సంభవించింది. తైవాన్ లో భూకంపం సంభవించిన ప్రాంతాల్లో సునామీ వచ్చే అవకాశం లేదని యూఎస్ జియోలాజికల్ సర్వే గతంలోనే స్పష్టం చేసింది. ప్రాణ, ఆస్తి నష్టం భారీగా జరిగినప్పటికీ వాటి పూర్తి వివరాలు అందుబాటులో లేవని, ఓ అంచనాకు రాలేదని అధికారులు వివరించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు రక్షణ బృందాల సహాయక చర్యలు ఇప్పటికీ కొనసాగుతున్నట్లు స్థానిక అధికారులు పేర్కొన్నారు. -
తైవాన్‌లో భూకంపం
తైపీ : ఈశాన్య తైవాన్‌లో మంగళవారం రాత్రి భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.8గా నమోదు అయింది. ఈ మేరకు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. మంగళవారం రాత్రి 10.19 గంటలకు ఈ భూకంపం చోటు చేసుకుందని తెలిపింది. అయితే ఈ భూకంప ధాటికి ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం కాని సంభవించినట్లు సమాచారం అందలేదని పేర్కొంది. సునామీ వచ్చే అవకాశం కూడా లేదని స్పష్టం చేసింది. భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. -
రష్యాలో భూకంపం
హాంగ్‌కాంగ్ : తూర్పు రష్యాలో శనివారం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.0గా నమోదు అయింది. ఈ మేరు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. రష్యా యోలిజీవో పట్టణానికి 95 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. అయితే ఈ భూకంప ధాటికి ప్రాణ, ఆస్తి నష్టం కానీ జరిగినట్లు సమాచారం అందలేదని పేర్కొంది. సునామీ విపత్తు వచ్చే అవకాశం లేదని ది నేషనల్ అండ్ పసిఫిక్ వార్నింగ్ సెంటర్ స్పష్టం చేసింది. -
వాయువ్య పాక్‌లో స్వల్ప భూప్రకంపనలు
ఇస్లామాబాద్ : వాయువ్య పాకిస్థాన్‌లోని పలు జిల్లాల్లో శనివారం స్వల్పంగా భూమి కంపించింది. భూకంప కేంద్రాన్ని ఆఫ్ఘానిస్థాన్ - తజికిస్థాన్ సరిహద్దుల్లో కనుగొన్నట్లు పాకిస్థాన్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అయితే ఎక్కడ ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కాని సంభవించలేదని తెలిపింది. కాగా ఆప్ఘాన్‌లోని పశ్చిమ ప్రాంతంలో 13 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. జనవరి 8వ తేదీన ఇదే ప్రాంతంలో భూకంపం సంభవించిందని గుర్తు చేసింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5 గా నమోదు అయిందని చెప్పింది. -
చైనాలో భూకంపం
బీజింగ్ : చైనా వాయవ్య ప్రాంతంలోని క్విన్ఘై ప్రావిన్స్‌లో బుధవారం అర్ధరాత్రి భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.9గా నమోదు అయిందని యూఎస్ జియోలాజికల్ సర్వే గురువారం వెల్లడించింది. అయితే ఎక్కడ ఆస్తి నష్టం... ప్రాణ నష్టం కాని సంభవించినట్లు సమాచారం అందలేదని తెలిపింది. భూకంప కేంద్రాన్ని 10 కిలోమీటర్ల దూరంలో కనుగొన్నట్లు పేర్కొంది. చైనాలో తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయని ...అవి మరీ అధికంగా ఆ దేశ నైరుతి ప్రాంతంలో వస్తున్నాయని దేశ భూకంప కేంద్ర సంస్థ ఈ సందర్భంగా గుర్తు చేసింది. -
ఇంపాల్ సమీపంలో భారీ భూకంపం
-
చిలీలో భూకంపం
చిలీ: చిలీ తీరంలో బుధవారం భూ ప్రకంపనలు సంభవించాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.9గా నమోదు అయిందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. 10 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని కనుగొన్నట్లు తెలిపింది. భూకంపం సంభవించినప్పుడు మొట్టమొదటగా తీవ్రత 6.6గా నమోదు అయిందని పేర్కొంది. అయితే భూకంపం ధాటికి ఎక్కడ ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం కాని సంభవించినట్లు తమకు సమాచారం అందలేదని చెప్పింది. ఇదే ప్రాంతంలో ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో భూకంపం వచ్చి... 15 మంది మరణించారని యూఎస్ జియోలాజికల్ సర్వే గుర్తు చేసింది. -
టోక్యో నగరంలో భూకంపం
టోక్యో : జపాన్ రాజధాని టోక్యోలో శనివారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.4 గా నమోదు అయింది. ఈ భూకంపం దాటికి పలు నివాసాలు, భవనాలు కదిలాయని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. అయితే ఎక్కడ ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కానీ సంభవించినట్లు సమాచారం అందలేదని తెలిపింది. టోక్యో తీరంలో 70 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది. -
పుపువా న్యూగినియాలో భూకంపం
సిడ్నీ: పుపువా న్యూగినియాలో ఆదివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.7గా నమోదు అయిందని యూఎస్ జియోలాజిస్టులు వెల్లడించారు. భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం కానీ లేదని తెలిపారు. పుపువా న్యూగినియా, టారన్ నైరుతి ప్రాంతంలో 58 కిలో మీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం గుర్తించినట్లు చెప్పారు. సునామీ వచ్చే సూచనలు కూడా ఏమీ లేవన్నారు. ఈ మేరకు యూఎస్ జియోలాజిస్టులు తమ వెబ్సైట్లో వెల్లడించారు. -
సాల్మన్ దీవుల్లో భూకంపం
సిడ్నీ : పసిఫిక్ మహాసముద్రంలోని సాల్మన్ దీవుల్లో గురువారం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.9గా నమోదైంది. భూకంపం భూమి లోపల 19 కిలోమీటర్ల లోతులో ఏర్పడింది. ఈమేరకు అమెరికా జియాలజికల్ సర్వే సంస్థ వెల్లడించింది. సునామీ ప్రమాదం లేదని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ప్రపంచంలో భూకంపం వచ్చే ప్రాంతాల్లో ఇది ఒక్కటని పేర్కొంది. గత మూడేళ్ల కాలవ్యవధిలో దాదాపు 30 స్వల్ప భూకంపాలు సంభవించాయని యూఎస్ జియోలాజికల్ సర్వే చెప్పింది. -
జపాన్‌లో భూకంపం
టోక్యో: జపాన్‌లోని ఈశాన్య ప్రాంతంలో బుధవారం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.8గా నమోదు అయిందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ భూకంపం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కాని సంభవించినట్లు సమాచారం అందలేదని తెలిపింది. పసిఫిక్ మహాసముద్రం హన్ష్ ద్వీపంలోని తూర్పు కోస్తా ప్రాంతంలో 38.9 కిలోమీటర్ల అడుగు భాగంలో ఈ భూకంపం సంభవించిందని పేర్కొంది. సునామీ హెచ్చరికలు కూడా ఏమీ చేయలేదని యూఎస్ జియోలాజికల్ సర్వే చెప్పింది. -
ఇండోనేసియాలో భారీ భూకంపం
జకార్తా: దక్షిణ మధ్య ఇండోనేసియా సమీపంలోని సముద్ర గర్భంలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.0 గా నమోదు అయింది. భూకంపం వల్ల ఎటువంటి నష్టం సంభవించలేదని యూఎస్ జియోలాజికల్ సర్వీసు వెల్లడించింది. అయితే సునామీ హెచ్చరికలు చేయాల్సిన పరిస్థితి లేదని తెలిపింది. ఇండోనేసియాలోని నెబె నగరానికి 132 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో 547 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభించిందని పేర్కొంది. -
మెక్సికో పసిఫిక్ తీరంలో భూకంపం
మెక్సికో: మెక్సికో జాలిస్కో రాష్ట్రంలోని పసిఫిక్ తీరంలో ఆదివారం భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.2 గా నమోదయింది. అయితే భూకంపం వల్ల ఎవరికి ఎటువంటి ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం కాని జరిగినట్లు సమాచారం అందలేదని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఆదివారం ఉదయం ఈ భూకంపం సంభవించింది. -
పెరూలో భూకంపం
లిమా: పెరూ రాజధాని లిమాలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.6గా నమోదు అయింది. లిమాకు 45 కిలోమీటర్లు దూరంలో సముద్రంలో ఈ భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే శనివారం వెల్లడించింది. భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం కాని సంభవించలేదని తెలిపింది. ఈ భూకంపం శుక్రవారం రాత్రి వచ్చిందని పేర్కొంది. -
చీలీలో భారీ భూకంపం, రిక్టర్ పై 6.4గా నమోదు!
శాంటియాగో: చీలీ దేశంలో భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.4 శాతంగా నమోదైంది. చీలీ రాజధాని శాంటియాగో ఆగ్నేయ ప్రాంతానికి 67 మైళ్ల దూరంలో భూకంపం సంభవించినట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. శాంటియాగోతోపాటు మరో ఐదు ప్రాంతాల్లో భూకంప తీవ్రత ఉందని ఆదేశ జాతీయ అత్యవసర సంస్థ తెలిపింది. శాంటియాగో రాజధానిని ప్రకంపనలు సుమారు 40 సెకన్లపాటు కుదిపేసాయని అధికారులు ప్రకటించారు. సునామీ హెచ్చరికలు లేవని అధికారులు తెలిపారు. -
చైనాను వణించిన భూకంపం
హాంగ్‌కాంగ్: చైనాను మరో భూకంపం వణికించింది. నైరుతి చైనాలోని సిచౌన్ ప్రావిన్స్ లో ఆదివారం ఉదయం 6.07 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూకంపన తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదయింది. అయితే ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. నైరుతి జిలౌడు ప్రాంతానికి రెండు కిలోమీటర్లు, యున్నన్ ప్రావిన్స్ లోని జహయోటాంగ్ ప్రాంతానికి 96 కిలోమీటర్ల దూరంలో భూకంపన కేంద్రాన్ని గుర్తించారు. రెండు వారాల క్రితం చైనాలో సంభవించిన భూకంపం 615 మందిని బలి తీసుకుంది. 3,143 మంది గాయపడ్డారు. వరుస భూకంపాలతో చైనా వాసులు వణుకుతున్నారు. -
మెక్సికోలో భూకంపం, రిక్టర్ స్కేల్ పై 5.8
న్యూయార్క్: మెక్సికోలోని ఆక్సాకా స్టేట్ లో బుధవారం భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.8 గా నమోదైందని యూఎస్ జీయోలాజికల్ సర్వే వెల్లడించింది. పసిఫిక్ తీరంలోని శాంటియాగో పినోటెపా కు 16 కిలో మీటర్ల దూరంలో భూప్రకంపనలు సంభవించాయని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టం వివరాలు అందలేదని అధికారులు తెలిపారు. భూకంప తీవ్రత 5.8గా నమోదైనందున ఆస్థి, ప్రాణ నష్టం వాటిల్లే అవకాశం ఉందని అధికారుల అంచనా వేస్తున్నారు. -
అలాస్కాలో భూకంపం, సునామీ హెచ్చరిక!
లాస్ ఎంజెలెస్: ఆలాస్కా తీరప్రాంతాన్ని భూప్రకంపనలు కుదిపేసాయి. అలాస్కాలో భూప్రకంపనలు రిక్టర్ స్కేల్ పై 8 పాయింట్లుగా నమోదు కాగా.. స్థానికంగా సునామీ హెచ్చరికలు జారీ చేసినట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. అయితే తమ వద్ద ఉన్న సమాచారం మేరకు ప్రమాదకరమైన సునామీ సూచనలు కనిపించడం లేదని పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ వెల్లడించింది. అంతేకాక హవాయికి కూడా ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేమి లేదని వెల్లడించింది. లిటిల్ సిట్ కిన్ ఐలాండ్ మారుమూల ప్రాంతంలోని 24 కిలో మీటర్ల దూరంలో అక్కడి కాలమానం ప్రకారం 8.53 నిమిషాలకు భూకంపం సంభవించినట్టు తెలుస్తోంది. వెస్టర్న్ ఆలూషియన్స్ ప్రాంతంలోని నికోల్స్ స్కీ, ఉమ్నాక్ ఐలాండ్ నుంచి అట్టు ఐలాండ్ వరకు ఈ ప్రభావం ఉంటుందని ది నేషనల్ సునామీ వార్నింగ్ సెంటర్ తెలిపింది. ఈ ప్రాంతాల్లో సునామీ సంభవిస్తే అనేక గంటలపాటు ఈ ప్రభావం ఉంటుందని వార్నింగ్ సెంటర్ హెచ్చరించింది. Follow @sakshinews -
పాకిస్థాన్‌లో భూకంపం
ఆగ్నేయ పాకిస్థాన్‌లోని వివిధ ప్రాంతాలలో శుక్రవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. ఆ ఘటనలో ఒకరు మరణించగా, 30మంది గాయపడ్డారని యూఎస్ జియోలాజికల్ సర్వే డిపార్ట్మెంట్ వెల్లడించింది. సింధ్‌లోని దౌర్ ప్రాంతంలో ఈ రోజు తెల్లవారుజామున 3.50కి భూమీ కంపించిందని... రిక్టార్ స్కేల్‌పై 4.5గా భూకంప తీవ్రత నమోదైందని తెలిపింది. మరి కొద్ది సేపటికే మళ్లీ భూమి కంపించిందని రిక్టార్ స్కేల్‌పై 4.6గా దాని తీవ్రత నమోదైందని వెల్లడించింది. భూకంప తీవ్రతకు కొన్ని జనం ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారని.... కొన్ని ప్రాంతాలలో నివాసాలపై కప్పులు కూలిపోయానని తెలిపింది. భూకంపం నేపథ్యంలో స్థానిక పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అలాగే నేడు జరగాల్సిన ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా వేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. -
లాస్ ఎంజెలెస్ లో భూకంపం
అమెరికాలోని లాస్ ఎంజెలెస్ నగరంలో భూకంపం సంభవించింది. తక్కువ తీవ్రత నమోదైన భూప్రకంపనలు రిక్టర్ స్కేల్ పై 5.1 గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూప్రకంపనల కారణంగా డిస్నీలాండ్ లో రైడింగ్, ఇతర కార్యక్రమాలను నిలిపివేసినట్టు అధికారులు తెలిపారు. భూకంపం కారణంగా గ్యాస్ లీకైనట్టు, వాటర్ పైపులు పలిగిపోయాయని, ఇంట్లోని కొన్ని వస్తువులు షెల్ఫ్ నుంచి కింద పడ్డాయని స్థానికలు వెల్లడించారు. ప్రాణానష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా అందుబాటులోకి రాలేదని తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా డిస్నీలాండ్ ను మూసివేసినట్టు ఎన్ బీసీ4 చానెల్ తెలిపింది. లాస్ ఎంజెలెస్ కు 45 కిలోమిటర్ల దూరంలోని లా హంబ్రా సమీపంలో చోటు చేసుకుందని తెలిపారు. 1994లో లాస్ ఎంజెలెస్ చోటుచేసుకున్న భూకంప (6.7) ప్రమాదంలో 10 బిలియన్ల ఆస్తి నష్టం, 60 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. -
ఇండోనేషియాలో భూకంపం
ఇండోనేషియాలో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. ఆ భూకంప తీవ్రత రిక్టార్ స్కేల్‌పై 6.1 నమోదు అయింది. ఇండోనేషియాలోని పశ్చిమ తైమూరు రాజధాని ఢిల్లీ సమీపంలోని బండ సముద్రంలో ఆ భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. అయితే భూకంపం వల్ల సునామీ లాంటి విపత్తులు సంభవించే అవకాశం లేదని తెలిపింది. అయితే ఈ ఏడాది జనవరి నెలలో ఇండోనేషియాలోని జావా ద్వీపంలో ఇదే తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ ఘటనలో దాదాపు వంద ఇళ్లు వరకు నష్టం జరిగిందని గుర్తు చేసింది. అలాగే గతేడాది జులైలో సుమిత్రా ద్వీపంలో ఇదే తరహా అదే తీవ్రతతో వచ్చిన భూకంపంలో 35 మందికిపైగా మృత్యువాత పడ్డారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. -
చిలీలో భూకంపం
చిలీ రాజధాని శాంటియాగోలోని మధ్య ప్రాంతంలో ఈ రోజు తెల్లవారుజామున భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే శుక్రవారం వెల్లడించింది. భూకంప తీవ్రత రిక్టార్ స్కేల్‌పై 6.6గా నమోదు అయిందని తెలిపింది. అయితే భూంకంపం వల్ల ప్రాణనష్టం కానీ ఆస్తినష్టం కాని సంభవించినట్లు ఇంకా తమకు సమాచారం అందలేదని పేర్కొంది. ప్రపంచంలో భూకంపం తరచుగా సంభవించే దేశాల్లో చీలి ఒకటని చెప్పింది. అయితే 2010లో సునామీ సందర్భంగా చిలీలో సంభవించిన భూకంపం వల్ల 500 మంది మృత్యువాత పడ్డారని అలాగే దాదాపు 2.5 లక్షల ఇళ్లు నేలమట్టమైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే ఈ సందర్భంగా గుర్తు చేసింది. -
ఇండోనేషియాలో భూకంపం
సులవేసి ద్వీపకల్పంలో ఈ రోజుల తెల్లవారుజామున భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టార్ స్కేల్‌పై 5.7గా నమోదు అయిందని యూనైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. వాయువ్వ గొరొన్టలో నగరంలో మంగళవారం తెల్లవారుజామున 3.11 నిమిషాలకు ఆ భూకంపం చోటు చేసుకుందని తెలిపింది. అయితే ఎటువంటి నష్టం చోటు చేసుకోలేదని పేర్కొంది. ఇండోనేషియాలో్ ఇటీవల తరుచుగా భూకంపాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది జులైలో అచీ ప్రావెన్స్లో సంభవించిన భూకంపం వల్ల 35 మంది మరణించగా, వేలాది మంది నిరాశ్రయులైన సంగతి తెలిసిందే. -
జపాన్‌లో భూకంపం
జపాన్‌లో ఈ రోజు తెల్లవారుజామునా భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్జీఎస్) బుధవారం ఇక్కడ వెల్లడించింది.భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్‌పై 6.5 మాగ్నిట్యూడ్‌గా నమోదు అయిందని తెలిపింది. అయితే భూకంపం వల్ల ఎటువంటి అస్తినష్టం కానీ ప్రాణనష్టం కానీ సంభవించిలేదని పేర్కొంది. టోక్యోకు దక్షిణాన గల పసిఫిక్ సముద్రంలో వందల కిలోమీటర్ల దూరంలో ఇది చోటు చేసుకుందని పేర్కొంది. అయితే భూకంప తీవ్రత కొద్దిగా ఎక్కువగా ఉన్న సునామీ లాంటి విపత్కర పరిస్థితులు ఏమి చోటు చేసుకోవని జపాన్ వాతావరణ సంస్థకు చెందిన అధికార ప్రతినిధి ఈ సందర్భంగా పేర్కొన్నారు. అలాగే భూకంపం వల్ల ఫుకుషిమా అణు ఇంధన సంస్థ ప్లాంట్‌లో ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదని టోక్యో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ (టీఈపీపీ) తెలిపింది. కానీ ఇటీవల పుకుషిమా ప్లాంట్‌లోని ట్యాంక్ నుంచి రేడియోధార్మిక నీరు లీకవుతున్న నేపథ్యంలో వాటిని డ్రైయినేజ్ వ్యవస్థ ద్వారా పసిఫిక్ మహాసముద్రంలోకి వదులుతున్నామని ఆ ప్లాంట్ ఉన్నతాధికారులు ఈ సందర్బంగా గుర్తు చేశారు. అయితే భూకంపం వల్ల ఆ ప్లాంట్‌లో విపత్కర పరిస్థితులు ఏర్పడలేదని చెప్పారు. అయితే భూకంప తీవ్రత వల్ల నగరంలోని పలు భవనాలు కొద్దిగా ఊగాయని జపాన్‌లోని పాత్రికేయులు వెల్లడించారు.