
చైనాలో భూకంపం
బీజింగ్ : చైనా వాయవ్య ప్రాంతంలోని క్విన్ఘై ప్రావిన్స్లో బుధవారం అర్ధరాత్రి భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.9గా నమోదు అయిందని యూఎస్ జియోలాజికల్ సర్వే గురువారం వెల్లడించింది. అయితే ఎక్కడ ఆస్తి నష్టం... ప్రాణ నష్టం కాని సంభవించినట్లు సమాచారం అందలేదని తెలిపింది.
భూకంప కేంద్రాన్ని 10 కిలోమీటర్ల దూరంలో కనుగొన్నట్లు పేర్కొంది. చైనాలో తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయని ...అవి మరీ అధికంగా ఆ దేశ నైరుతి ప్రాంతంలో వస్తున్నాయని దేశ భూకంప కేంద్ర సంస్థ ఈ సందర్భంగా గుర్తు చేసింది.