
తెగుసిగల్ప, హోండురాస్ : సెంట్రల్ అమెరికాలోని కరేబియన్ ద్వీపంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రతతో ప్రకంపనలు వ్యాపించాయి. దీంతో అమెరికా వర్జిన్ ఐలాండ్, ప్యూరిటో రికోలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
అమెరికా జియాలజిస్ట్‌లు తెలిపిన వివరాల ప్రకారం తెగుసిగల్స రాజధాని హోండురాన్‌కు 519 కిలో మీటర్ల దూరంలోని బర్రా పటుకా, జార్జ్ టౌన్‌లో ఈ భూకంపం చోటు చేసుకుంది. దీని ప్రభావంతో వర్జిన్ ఐలాండ్, ప్యూరిటో రికో ప్రాంతాల్లో సునామీ సంభవించే అవకాశం ఉందని తొలుత పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది. ఈ భూకంపం 10 కిలో మీటర్ల మేర తీవ్ర ప్రభావం చూపి భూమి పెద్ద మొత్తంలో చీలిపోయినట్లు వెల్లడించింది. అయితే, ఎంతమేరకు నష్టం జరిగందనే దానిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment