Caribbean islands
-
అతిచిన్న ఎయిర్పోర్ట్
విమానాశ్రయం అంటే సాధారణంగా, పొడవైన రన్‌వే, విశాలమైన ప్రదేశంలో చాలా పెద్దగా ఉంటుంది. కాని, కరీబియన్ దీవుల్లో నెదర్లాండ్స్ అధీనంలో ఉన్న సబా దీవిలో ‘జువాంకో ఇ. య్రాస్క్విన్’ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యంత చిన్న విమానాశ్రయంగా పేరొందింది. దీని రన్‌వే పొడవు కేవలం 400 మీటర్లు మాత్రమే! అంటే దాదాపు ఒక విమానం పొడవు కంటే కాస్త ఎక్కువ.చుట్టూ ఎత్తైన కొండలు, పక్కనే సముద్రంతో చూడటానికి అందంగా కనిపించే ఈ విమానాశ్రయం, ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విమానాశ్రయాల్లో ఒకటి. అందుకే, ఇక్కడ పెద్ద విమానాలను అనుమతించరు. కేవలం విమానయాన సంస్థ విండైర్కు చెందిన చిన్న విమానాలను మాత్రమే ఇక్కడ అనుమతిస్తారు. అయితే, 1959లో రెమీ డి హానెస్ ప్రారంభించిన ఈ విమానాశ్రయం, సరైన సదుపాయాలు లేకపోవడంతో చాలాకాలం నిరుపయోగంగా ఉంది. ప్రస్తుతం డచ్ ప్రభుత్వం దీనిని పునరుద్ధరించింది. అంతేకాదు, రోజువారీగా చిన్న విమానాలను నడుపుకునేందుకు కూడా అనుమతించింది. -
అమ్మకానికి అందమైన ఐలాండ్ పాస్‌పోర్ట్‌లు
అందమైన కరేబియన్ ద్వీప దేశం డొమినికా తమ దేశ పాస్‌పోర్ట్‌లను అమ్మకానికి పెట్టింది. ఏడేళ్ల క్రితం మారియా హరికేన్ విధ్వంసంతో దెబ్బతిన్న ఈ ఐలాండ్ పునర్నిర్మాణానికి విభిన్న రీతిలో నిధుల సమీకరణ చేపడుతోందని ‘వాషింగ్టన్ పోస్ట్’ పేర్కొంది.ప్రపంచంలోనే వాతావరణ పరిస్థితులకు తట్టుకుని నిలిచిన అత్యంత దృఢమైన ద్వీపంగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ కరేబియన్ దేశం.. ఇందుకోసం భారీ అప్పులు చేయకుండా, సంపన్న దేశాల సహాయం కోసం ఎదురుచూడకుండా నిధులు సంపాదించుకోవాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా చైనా, మిడిల్ ఈస్ట్ దేశాల్లోని సంపన్నులకు పాస్‌పోర్ట్‌ల ద్వారా తమ దేశ పౌరసత్వాన్ని విక్రయిస్తోంది.ఆ దేశ పౌరసత్వ ప్రదాన కార్యక్రమం 90ల నాటి నుంచే ఉన్నప్పటికీ హరికేన్ తర్వాత వేగంగా విస్తరించింది. ఇదే దేశ ఆదాయానికి ప్రధాన ఆదాయ వనరుగా మారింది. ఈ నిధులను కొత్త మెడికల్ క్లినిక్‌లు, రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లతో సహా కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు వినియోగిస్తున్నారు. ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి ఫ్రాన్సిన్ బారన్ ఈ చొరవను ఆపద్బాంధవిగా పేర్కొన్నారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు ఈ కార్యక్రమం తమకు "స్వయం-స్వతంత్ర ఫైనాన్సింగ్"గా ఉపయోగపడుతోందని ఆర్థిక మంత్రి ఇర్వింగ్ మెక్ఇన్టైర్ చెబుతున్నారు.ఈ పౌరసత్వ కార్యక్రమం విజయవంతం అయినప్పటికీ, పారదర్శకత, భద్రతా సమస్యలపై ఆందోళనలను పెంచింది. ఈ దేశ పౌరసత్వ కనీస ధర ఇటీవలే 2 లక్షల డాలర్లకు (రూ. 1.68 కోట్లు) పెరిగింది. అయినప్పటికీ ఇదే ప్రపంచవ్యాప్తంగా అత్యంత సరసమైన ఎంపికలలో ఒకటిగా ఉంది. 71,000 జనాభా కలిగిన ఒక చిన్న ద్వీపంలో పౌరసత్వాన్ని పొందినవారిలో కొంతమంది ఇక్కడ నివసిస్తున్నారు. -
కరీబియన్ దీవి కారుచౌక
ఫొటోలో కనిపిస్తున్నది కరీబియన్ సముద్రంలోని దీవి. దక్షిణ అమెరికా దేశం నికరగ్వా తీరానికి ఆవల పన్నెండు మైళ్ల దూరంలో ఉందిది. చుట్టూ నీలి కడలి, నడి మధ్యన పచ్చదనంతో అలరారే ఈ ప్రైవేటు దీవి పేరు ‘ఇగ్వానా దీవి’. ఐదెకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ దీవిలో అధునాతన సౌకర్యాలు చాలానే ఉన్నాయి. ఇరవై ఎనిమిది అడుగుల ఎత్తున ఉన్న అబ్జర్వేటరీ టవర్‌తో కూడిన ఒక మూడు పడకగదుల ఇల్లు, దీవి పడమటి వైపున చక్కని ఈతకొలను, వైఫై, మొబైల్, టీవీ తదితర సౌకర్యాలు, చుట్టూ ఎటుచూసినా పచ్చని అరటి, కొబ్బరిచెట్లతో ఉన్న ఈ దీవి ప్రస్తుతం అమ్మకానికి సిద్ధంగా ఉంది. దీని ధర 3.76 లక్షల పౌండ్లు మాత్రమే! లండన్ నగరంలోని ఒక సామాన్యమైన ఫ్లాట్ ధర కంటే ఇది చాలా చౌక. దీనిని ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి మరి! -
ఆ చేపలు ఎగురుతాయి.. 56 కిలోమీటర్ల వేగంతో టేకాఫ్.. వైరల్ వీడియో
సాక్షి, అమరావతి: ఈ చేపలు నీటిలో ఈదటమే కాదు.. గాలిలో ఎగురుతాయి కూడా. వీటికి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఇవి రాత్రి పూట సముద్రం ఒడ్డుకు వచ్చి నిద్రపోతాయి. అట్లాంటిక్, పసిఫిక్ సముద్ర జలాల్లో కనిపించే ఈ జీవులు ఇటీవల భారత జలాల్లోనూ దర్శనమిస్తున్నాయి. ఈ చేపల కళ్లు నీటి అడుగు ప్రాంతాలను చూడటంతోపాటు గాలిలోనూ స్పష్టంగా చూడగలిగేలా మారిపోయాయట. ఈ చేపల విశేషాలేంటో మనమూ ఓ లుక్కేద్దాం. నీటిలో ఈదే చేపలు గాల్లో ఎగురుతున్నాయి. నీటి అడుగున గంటకు 56 కిలోమీటర్ల టేకాఫ్ స్పీడ్‌తో పైకి దూసుకెళ్తున్నాయి. ఉష్ణమండల సముద్ర జలాల్లో ఎక్కువగా కనిపించే ‘ఫ్లయింగ్ ఫిష్’లు చేపల్లోనే అరుదైన జాతులుగా గుర్తింపు పొందాయి. ప్రపంచంలో దాదాపు 40 రకాల ఎగిరే చేపలు ఉన్నాయి. ఈ సముద్ర చేపల కుటుంబాన్ని ఎక్సోకోటిడే అని పిలుస్తారు. లాటిన్ భాషలో ఎక్స్ అంటే ‘బయట’ అని ‘కొయిటోస్‘ అంటే మంచం అని అంటారు. ఇవి రాత్రి పూట సముద్రపు ఒడ్డుకు వచ్చి నిద్రపోతాయి కాబట్టే వీటిని లాటిన్లో అలా పిలుస్తారట. రెండు.. నాలుగు రెక్కలతో.. సాధారణ చేపలు నీటి నుంచి ఎగిరి దూకుతుంటాయి. వాటి దూరం కూడా మహా అయితే అడుగు వరకే ఉంటుంది. కానీ.. ఫ్లయింగ్ ఫిష్ శరీరానికి ఇరువైపులా పొడవాటి, వెడల్పాటి పెక్టోరల్ రెక్కలు ఉంటాయి. ఇందులో ‘టూ వింగర్స్’ అనే చేపకు రెండు పెద్ద పెక్టోరల్ రెక్కలు ఉంటాయి. ‘ఫోర్ వింగర్స్’గా పిలిచే చేపలకు రెండు పొడవాటి పెక్టోరల్ రెక్కలతో పాటు రెండు పెల్విక్ (చిన్న) రెక్కలు ఉంటాయి. వీటి సాయంతోనే ఇవి గాల్లో సులభంగా ఎగరగలుగుతుంది. వీటి వెన్నుపూస నిర్మాణం చూస్తే పడవ చుక్కానిలా కనిపిస్తుంది. ఇవి పక్షుల స్థాయిలో ఎగరలేవు కానీ.. దాదాపు 200 మీటర్ల వరకు ఎగరగలవు. పక్షలు రెక్కలు పైకీ, కిందకి ఆడించినట్టు ఇవి రెక్కలను ఊపలేవు. నీటినుంచి పైకి వచ్చిన వేగాన్ని బట్టి వాటి రెక్కలను విచ్చుకుని మాత్రమే కొంత దూరం ఎగురుతాయి. పెద్ద చేపల నుంచి తప్పించుకునేందుకే.. ఈ అసాధారణ చేపలు 6 నుంచి 20 అంగుళాలు పొడవు ఉంటాయి. రెండు అంగుళాల పొడవు ఉన్నప్పుడే ఎగరడం ప్రారంభిస్తాయి. డాల్ఫిన్లు, వేగంగా ఈదే ఇతర పెద్ద చేపలకు ఆహారం కాకుండా తప్పించుకోవడానికి ఇవి ఎగిరే సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వీటి కళ్లు నీటి అడుగున మాత్రమే కాకుండా గాలిలో కూడా స్పష్టంగా చూడగలిగేలా మార్పు చెందాయి. ఇవి చిన్నచిన్న చేపలను, పాచిని తీని జీవిస్తాయి. ఇవి సెకనుకు దాదాపు మీటరు వేగంతో ఉపరితలం వైపు ఈదుతాయి. చెన్నయ్ తీరంలోనూ సందడి ఇవి ఉష్ణమండల, సమశీతోష్ణ సముద్ర జాతులకు చెందిన చేపలు. అట్లాంటిక్, పసిఫిక్ సముద్ర తీరాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఇటీవల వీటి గమనం బంగాళాఖాతంలోనూ కనిపిస్తోంది. భారత్, బంగ్లాదేశ్, జపాన్, వియత్నాం, ఇండోనేషియా, తైవాన్, చైనా, వెనిజులా, బార్బడోస్ జలాల్లో ఎగిరే చేపలు ఉన్నాయి. మాల్దీవులు, చెన్నయ్ తీరాల్లోనూ ఇవి తరచూ కనిపిస్తున్నాయి. 400 మీటర్లు ఎగిరి.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం ఓ ఫ్లయింగ్ ఫిష్ 30 కిలోమీటర్ల వేగంతో 45 సెకన్ల పాటు గాల్లో ఎగిరింది. ఇది 2008లో జపాన్‌లోని కగోషిమాలో ఫెర్రీలో ప్రయాణిస్తున్న ఓ చిత్ర బృందం కెమెరాకు చిక్కింది. ఇది దాదాపు 1,312 అడుగుల మేర ఎగిరినట్టుగా నమోదైంది. సాధారణంగా ఫ్లయింగ్ ఫిష్‌లు 655 అడుగుల వరకు, నీటి ఉపరితలం నుంచి 26 అడుగుల ఎత్తు వరకు ఎగురుతాయి. నీటిలోకి తిరిగి దూకినప్పుడు కూడా వేగంగా ఈత కొట్టడం ప్రారంభిస్తాయి. ఇవి అలసి పోకుండా వరుసగా 12 సార్లు గాల్లో ఎగరగలవు. చదవండి: మిసెస్ ఇండియా పోటీలకు విశాఖ మహిళ పైడి రజని పట్టిన వెంటనే తినేయాలట కరేబియన్ ద్వీప దేశాలైన బార్బడోస్, ట్రినిడాడ్, టొబాగోలకు ఈ చేపలే వాణిజ్య పరంగా కీలకంగా ఉన్నాయి. స్థానిక మత్స్యకారులు వీటిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఈ ఫ్లయింగ్ ఫిష్ మాంసం గట్టిగా లేత, తెలుపు రంగులో ఉంటుంది. దీనిని కాల్చి, వేయించి, ఆవిరితో వండుకుని తింటారు. ఎగిరే చేపలను పట్టుకున్న వెంటనే తినేయాలట. ఇవి ఎక్కువ దూరం రవాణా చేయడానికి సరిపడవు. ఇతర సముద్ర జీవుల మాదిరిగానే ఇవి కూడా కాంతికి ఆకర్షితం అవుతాయి. అందుకే మత్స్యకారులు లైట్ల వెలుతురులో రాత్రిపూట వేట కొనసాగిస్తారు. -
UK political crisis: రిషి, బోరిస్ నువ్వా, నేనా?
లండన్: బ్రిటన్ ప్రధాని రేసు ఆసక్తికరంగా మారుతోంది. భారతీయ సంతతికి చెందిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ (42) ముందున్నట్టు ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. కన్జర్వేటివ్ పార్టీ నేతగా, తద్వారా ప్రధానిగా పగ్గాలు చేపట్టేందుకు నామినేషన్ కోసం అవసరమైన 100 మంది పార్టీ ఎంపీల మద్దతు ఆయనకు ఇప్పటికే సమకూరిందని వారు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కుటుంబంతో కరేబియన్ దీవులకు విహారయాత్రకు వెళ్లిన మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ హుటాహుటిన లండన్ తిరిగొచ్చారు. ఆయనకు కూడా 100 మంది ఎంపీల మద్దతు సమకూరిందని ఆయన వర్గీయులు చెప్పుకొచ్చారు. రిషి, జాన్సన్ ఇప్పటిదాకా తాము రేసులో ఉన్నట్టు వెల్లడించలేదు. ఎంపీల మద్దతుపై కూడా ఏమీ మాట్లాడలేదు. పెన్నీ మోర్డంట్ మాత్రమే పోటీలో ఉన్నట్టు ప్రకటించారు. సోమవారం మధ్యాహ్నానికల్లా 100 మంది ఎంపీల మద్దతు సాధించిన వారి మధ్య తదుపరి పోటీ ఉంటుంది. రిషికి పెరుగుతున్న మద్దతు రిషిని సమర్థిస్తున్న మంత్రులు, పార్టీ ఎంపీల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంతో పాటు దేశ పౌరులకు విశ్వాసం కల్పించగల నేత ప్రస్తుతం రిషి మాత్రమేనని మాజీ ఉప ప్రధాని డొమినిక్ రాబ్ అభిప్రాయపడ్డారు. మళ్లీ వెనకటి రోజులకు వెళ్లేమని బోరిస్నుద్దేశించి అన్నారు. అయితే మళ్లీ ప్రధాని కావాలని తహతహలాడుతున్న బోరిస్ పోటీ లేకుండా నెగ్గేలా వ్యూహాలు పన్నుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగా రిషిని తప్పుకోవాలని కోరినట్టు ప్రచారం జరుగుతోంది. -
ఆ దేశాలకు వెళ్లినపుడు కారు, బైక్ హార్న్ కొట్టారంటే..
ప్రపంచంలోని చాలా దేశాల్లో రోడ్ల మీద అదే పనిగా హార్న్ కొట్టడం సభ్యత కాదు. ఇతరులను డిస్టర్బ్ చేయడం కింద లెక్క. ఇంకా చెప్పాలంటే సౌండ్ పొల్యూషన్‌గా కూడా పరిగణిస్తారు. కానీ కరీబియన్ కంట్రీస్‌లో మాత్రం కాదు. అక్కడ కారు, బైక్ హార్న్ కొట్టడమంటే ‘హాయ్.. హలో..’ అంటూ పలకరించడంలాంటిది. ‘థాంక్యూ’కి మారుగా కూడా హార్న్ కొట్టొచ్చు అక్కడ. రోడ్ల మీద స్నేహితులు, బంధువులు ఎవరు కలిసినా.. ఇలా హార్న్ కొట్టి పలకరించుకుంటారట అక్కడ. స్మార్ట్ టాయ్‌లెట్స్ .. అంటే అంటూ ఐబ్రోస్ ముడేయకండి. ఇవి జపాన్‌లో ఉన్నాయి. ఆ టాయ్‌లెట్స్‌లోకి వెళితే మీ నాడి చూసి మీ ఆరోగ్య రహస్యం చెప్పేస్తాయవి. చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలనూ సూచిస్తాయి. మీరు ఆరోగ్యవంతులని తేలితే.. గ్రీట్ చేసి పంపిస్తాయి. ఇంతకీ ఇవి ఏ ఆసుపత్రిలోనో.. పాథలాజికల్ ల్యాబ్‌లోనో ఉన్న టాయ్‌లెట్స్ కావు. పబ్లిక్ టాయ్‌లెట్స్. అర్జెంట్ అని పబ్లిక్ టాయ్‌లెట్స్‌లోకి వెళితే.. స్మార్ట్‌గా ఈ హెల్త్చెకప్ చేస్తుందట. వాటే టెక్నాలజీ కదా! చదవండి: ఈ ఇల్లుకు కరెంటు అక్కర్లేదు.. ఎందుకంటే.. -
నాచు.. భయపెడుతోంది!
కరీబియన్ దీవులు.. ప్రకృతి అందాలకు మారుపేరు. భువిలో స్వర్గంగా పేరుగాంచాయి. అలాంటి కరీబియన్ తీర ప్రాంతాలను ఇప్పుడు సముద్రపు నాచు తీవ్రంగా కలవరపెడుతోంది. సర్గాసమ్ అనే రకం నాచు విపరీతంగా పెరిగిపోతోంది. రోజురోజుకూ విస్తరిస్తోంది. ఈ ఏడాది జూన్ నాటికి కరీబియన్ సముద్రం, గల్ఫ్ ఆఫ్ మెక్సికో, సెంట్రల్ వెస్ట్, ఈస్ట్ అట్లాంటిక్‌లో 24.2 మిలియన్ టన్నుల నాచు పేరుకుపోయినట్లు అంచనా. ప్రమాదకరమైన ఈ నాచు జీవజాలానికి, పర్యావరణానికి ముప్పుగా పరిణమిస్తోంది. తీర ప్రాంతాల నుంచి విషపూరిత వాయువులు వెలువడుతున్నాయి. అంతేకాదు పర్యాటకం సైతం దెబ్బతింటోంది. పర్యాటకుల సంఖ్య నానాటికీ పడిపోతోంది. ఫలితంగా ఉపాధి కోల్పోతున్నామని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం కరీబియన్ తీరంలోని నాచును పక్కపక్కనే పేరిస్తే అది ఫ్లోరిడా గల్ఫ్ తీరంలోని టాంపా బే వైశాల్యం కంటే ఆరు రెట్లు అధికంగా ఉంటుందని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడాకు చెందిన పరిశోధకుడు చువాన్మిన్ హూ చెప్పారు. ఒకప్పుడు జనంతో కళకళలాడిన బీచ్‌లు నాచు కారణంగా వెలవెలబోతున్నాయని, అక్కడ వ్యాపారాలు దారుణంగా పడిపోతున్నాయని యూఎస్ వర్జిన్ ఐలాండ్స్ గవర్నర్ ఆల్బర్ట్ బ్రియాన్ చెప్పారు. తమ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతోందని వాపోయారు. కరీబియన్ బీచ్‌లను నాచురహితంగా మార్చాలని, ఇందుకు సమయం పడుతుందన్నారు. మెక్సికోలో 18 బీచ్‌ల్లో నాచు తిష్ట సముద్ర ఉపరితలంపై నాచు దట్టంగా పేరుకుపోతుండడంతో నౌకలు, పడవల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. చేపల వేట సైతం ఆగిపోతోంది. సర్గాసమ్ నాచు వల్ల అట్లాంటిక్ సముద్ర తీర ప్రాంతాల్లో ముక్కుపుటలు అదిరిపోయే దుర్గంధం వెలువడుతుండడంతో అటువైపు వెళ్లేందుకు సాధారణ జనంతోపాటు మత్స్యకారులు కూడా జంకుతున్నారు. ఈ వాసనను పీలిస్తే తల తిరగడం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు, గుండె కొట్టుకోవడంలో హెచ్చతగ్గులు వంటి లక్షణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. నాచు నిర్జీవమైపోయిన తర్వాత సముద్రంలో అడుగు భాగానికి చేరుకుంటుంది. దీనివల్ల విలువైన పగడపు దిబ్బలు కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉంది. మెక్సికోలో 18 బీచ్‌లు నాచుతో నిండిపోయినట్లు గుర్తించారు. గత నెలలో యూఎస్ వర్జిన్ ఐలాండ్స్‌లో అత్యవసర పరిస్థితి ప్రకటించారంటే నాచు ముప్పు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సర్గాసమ్ నాచు ఇంతలా వ్యాప్తి చెందడానికి కారణం ఏమిటంటే.. బలంగా వీస్తున్న ఈదురు గాలులు, సముద్రపు అలల ఉధృతి. దక్షిణ అట్లాంటిక్ వాతావరణం నాచు పెరుగుదలకు అనుకూలంగా ఉందని అంటున్నారు. నాచు వల్ల కేవలం నష్టాలే కాదు, లాభాలూ ఉన్నాయి. పీతలు, డాల్ఫిన్లు, సీల్స్, చేపలు వంటి సముద్ర జీవులకు ఇది ఆహారంగా ఉపయోగడుతోంది. సంక్షోభంలోనూ అవకాశం అంటే ఇదే. నాచును సేకరించి, ఎరువు తయారు చేయొచ్చు. కొన్ని దేశాల్లో నాచును సలాడ్ల తయారీకి ఉపగియోస్తారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
కంటికి కనిపించే... జంబో బ్యాక్టీరియా
బ్యాక్టీరియా. సూక్ష్మజీవి. కంటికి కనిపించదు. శక్తిమంతమైన మైక్రోస్కోప్‌కు మాత్రమే చిక్కుతుంది. దాని పరిమాణానికి ఏ ఐదారు వేల రెట్లో పెద్దగా ఉంటే తప్ప చూడలేం. అలాంటి ఏక కణ సూక్ష్మజీవి కంటికి కనిపిస్తే? గమ్మత్తుగా ఉంటుంది కదా! సరిగ్గా అలాంటి కంటికి కనిపించే జంబో బ్యాక్టీరియా ఒకటుందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. దాని పేరు థియోమార్గరిటా మ్యాగ్నిఫికా. తెల్లగా సేమ్యా పోగులా కన్పించే ఇది ఏకంగా ఓ సెంటీమీటర్ సైజులో ఉంటుందట. కరీబియన్ దీవుల్లో ఉన్న లెసర్ ఆంటిలిస్లోని మడ తడి అడవుల్లో నీటి అడుగున ఇది కనిపించింది. సల్ఫర్ (గంధకం) కణాలతో స్వచ్ఛమైన ధవళ వర్ణంలో ఉండే ఈ బ్యాక్టీరియా కాంతిని వెదజల్లుతూ ముత్యంలా మెరుస్తూ ఉంటుంది. ఒకవిధంగా బ్యాక్టీరియాల్లో ఇది డైనోసార్ టైపన్నమాట. బ్యాక్టీరియా అంటే అతి సూక్ష్మజీవి అనే వాదనను ఇప్పుడిది పటాపంచలు చేసింది. కొత్త పరిశోధనల దిశగా శాస్త్రవేత్తలు చూపు సారించేట్టు చేసింది. మొక్కల్ని పోలిన జీవక్రియ కాలిఫోర్నియాలోని లారెన్స్ బర్కిలీ నేషనల్ లేబొరేటరీకి చెందిన సముద్రజీవ శాస్త్రవేత్త జీన్ మేరి వోలాండ్ మరికొంత ముందుకు వెళ్లి శక్తిమంతమైన మైక్రోస్కోప్ ద్వారా ఎక్స్‌రే టొమోగ్రపీ పద్ధతి ద్వారా ఈ బ్యాక్టీరియా పొడవును కచ్చితంగా నిర్ధారించారు. ఇది దాదాపు ఒక సెంటీమీటర్ (9.66 మిల్లీమీటర్ల) పొడవున్నట్టు గుర్తించారు. మ్యాగ్నిఫికా సైజును సాధారణ బ్యాక్టీరియాతో ఆయన పోల్చిన తీరు చూస్తే అది ఎంత పెద్దదో అర్థమవుతుంది. మామూలు బ్యాక్టీరియాకూ దీనికీ హిమాలయాలంత ఎత్తున్న మనిషికి, మామూలు మనిషికి ఉన్నంత తేడా ఉందంటారు వోలాండ్! దీని జీవక్రియ మొక్కల జీవక్రియను పోలి ఉంటుంది. జడ సమ్మేళనాల నుంచి కార్పోహైడ్రేట్ల నిర్మాణం ద్వారా మ్యాగ్నిఫికా జీవక్రియ సాగుతుందని వోలాండ్ విశ్లేషించారు. తనలోని గంధకాన్ని మండించడం ద్వారా శక్తిని పొందుతుందని వివరించారు. ఈ బ్యాక్టీరియాను చాలా విశిష్టమైనదిగా గుర్తించి ఆశ్చర్యపోవడం తమ వంతయిందంటారు ఆంటిలిస్ యూనివర్సిటీకి చెందిన మాలిక్యులార్ బయాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ సిల్వినా గొంజాలెస్ రిజ్జో. ‘‘మ్యాగ్నస్ అంటే లాటిన్లో భారీ అని అర్థం. అందుకే దీనికి మ్యాగ్నిఫికా అని పేరు పెట్టాం. పైగా అందమైన ఫ్రెంచ్ పదం ‘మ్యాగ్నిఫిక్’కు కూడా ఈ పేరు దగ్గరగా ఉంటుంది’’ అన్నారాయన. దీనికంటే ముందు వరకూ అతి పెద్ద బ్యాక్టీరియా అన్న రికార్డు ‘థియోమార్గరిటా నమీబియెన్సిస్’ పేరిట ఉండేది. దాన్ని నమీబియా దగ్గర్లోని సముద్ర జలాల్లో గుర్తించారు. దాని పొడవు 0.75 మిల్లీమీటర్లని రిజ్జో చెప్పారు. బ్యాక్టీరియాల్లోకెల్లా ఈ బ్యాక్టీరియా వేరయా అన్నట్టు మ్యాగ్నిఫికా ఎందుకంత జంబో సైజులో ఉందో శాస్త్రవేత్తలు ఇతమిద్ధంగా చెప్పలేకపోతున్నారు. బహుశా భారీ బ్యాక్టీరియాల ఉనికికి ఇదో సూచన కావచ్చని వారంటున్నారు. ఇంతకన్నా పెద్ద బ్యాక్టీరియాలు కూడా ఎక్కడో ఉండే ఉంటాయని కూడా వాదిస్తున్నారు. ప్రయోగశాలలో మ్యాగ్నిఫికాను పునరుత్పత్తి చేస్తే మరిన్ని కొత్త విషయాలు తెలుస్తాయని వాషింగ్టన్ యూనివర్సిటీ (సెయింట్ లూయీ)కి చెందిన శాస్త్రవేత్త పెటా ఆన్నె లెవిన్ భావిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ బ్యాక్టీరియా అంటే... ►ఇది కేంద్రకం ఉండని ఏక కణ సూక్ష్మజీవి ►భూమిపై సర్వత్రా వ్యాపించి ఉంటుంది. పర్యావరణ వ్యవస్థలో దీనిది కీలక పాత్ర. ►కొన్నిరకాల బ్యాక్టీరియా అత్యల్ప, అత్యుగ్ర ఉష్ణోగ్రతలు, పీడనాల వద్ద కూడా మనగలుగుతుంది. ►ఒకరకంగా మానవ శరీరం పూర్తిగా బ్యాక్టీరియామయమే అని చెప్పాలి. అసలు మన ఒంట్లో మానవ జీవ కణాల కంటే కూడా బ్యాక్టీరియా కణాల సంఖ్యే ఎక్కువంటే అతిశయోక్తి కాదు! ►అయితే మన ఒంట్లో ఉండే బ్యాక్టీరియాలో చాలావరకు అపాయరహితమైనవి, ►మనకు ఉపయుక్తమైనవే. చాలా తక్కువ బ్యాక్టీరియా జాతులు మాత్రమే రోగ కారకాలు. 2009లోనే గుర్తించినా... నిజానికి ఈ జీవిని 2009లోనే గుర్తించారు. ఫ్రెంచ్ ఆంటిలెస్ యూనివర్సిటీకి చెందిన ఒలివర్ గ్రాస్ అప్పట్లో దీన్ని గుర్తించారు. కానీ దీన్ని ఫంగస్‌గా పొరబడ్డారు. నిజానికది జంబో బ్యాక్టీరియా అని మరో ఐదేళ్ల పరిశోధన తర్వాత గాని ఆయన గుర్తించలేకపోయారు. ‘‘మొదట్లో ఏదో గమ్మత్తయిన జీవి అనుకున్నాను. తెల్లటి ఫిలమెంట్లా ఉన్న ఈ జీవి అబ్బురంగా తోచింది’’ అని గ్రాస్ తన అనుభవాన్ని ఓ జర్నల్‌లో పంచుకున్నారు. ఈ పరిశోధన ఫలితాన్ని ఓ మామూలు జర్నల్‌లో ప్రచురించినప్పుడు చాలామంది శాస్త్రవేత్తలు నమ్మలేదు. కానీ ఈ పరిశోధనా క్రమాన్ని, ఫలితాన్ని తాజాగా సైన్స్ జర్నల్‌లో ప్రచురించడంతో అందరికీ నమ్మకం కుదిరింది. -
రిపబ్లిక్‌గా అవతరించిన బార్బడోస్
శాన్‌జువాన్(పోర్టోరికో): కరేబియన్ ద్వీప దేశం బార్బడోస్ గణతంత్ర దేశం(రిపబ్లిక్)గా అవతరించింది. వలస పాలన తాలుకూ ఆనవాళ్లను చెరిపేసుకునే క్రమంలో మొట్టమొదటిసారిగా రిపబ్లిక్‌గా ప్రకటించుకుంది. దీంతో, దేశాధినేత హోదా నుంచి బ్రిటిష్ రాణి ఎలిజెబెత్–2ని తొలగించింది. దాదాపు 300 ఏళ్ల బ్రిటిష్ పాలన తర్వాత 1966లో బార్బడోస్‌కు స్వాతంత్య్రం వచ్చింది. రిపబ్లిక్‌గా ప్రకటించుకునే దిశగా బార్బడోస్ రెండు దశాబ్దాలుగా ప్రయత్నిస్తోంది. గత నెలలో దేశానికి మొట్టమొదటి అధ్యక్షుడిని పార్లమెంట్ మూడింట రెండొంతుల మెజారిటీతో ఎన్నుకుంది. బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం పొంది 55 ఏళ్లవుతున్న సందర్భంగా బార్బడోస్ గవర్నర్ జనరల్ సాండ్రా మాసన్(72) మంగళవారం దేశాధినేతగా బాధ్యతలు స్వీకరించారు. పాలనా విషయాల్లో ఆమె ప్రధానమంత్రి మియా మోట్లేకు సహకరిస్తారు. దేశ రాజధాని బ్రిడ్జిటౌన్లో సోమవారం అట్టహాసంగా ప్రారంభమైన ఉత్సవాలకు ప్రిన్స్ చార్లెస్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. దేశమంతటా పండగ వాతావరణం నెలకొంది. 100 మందికి పైగా కళాకారులతో తీరప్రాంత రాజధాని నగరం బ్రిడ్జిటౌన్లో అంగరంగ వైభవంగా సంగీత కార్యక్రమాలు ఏర్పాటయ్యాయి. ఎలిజెబెత్–2ను రాణిగా గుర్తించకున్నా కామన్వెల్త్ కూటమిలో బార్బడోస్ కొనసాగనుంది. లండన్‌లోని ప్రీవీ కౌన్సిల్ బదులు ఇకపై ట్రినిడాడ్ కేంద్రంగా పనిచేసే కరీబియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్‌ను అత్యున్నత న్యాయస్థానంగా పరిగణించనుంది. మూడు లక్షల జనాభా కలిగిన ఈ దేశ ప్రధాన ఆదాయవనరు పర్యాటక రంగం. సుమారు 3 లక్షల జనాభా ఉన్న బార్బడోస్‌లో అత్యధికులు బ్రిటిష్ పాలకులు చెరకు తోటల్లో పనిచేసేందుకు బానిసలుగా తీసుకువచ్చిన ఆఫ్రికా సంతతి వారే. కరీబియన్ దీవుల్లో భాగమైన గుయానా, డొమినికా, ట్రినిడాడ్ అండ్ టొబాగో 1970లలోనే రిపబ్లిక్‌లుగా మారినా బార్బడోస్ మాత్రం ఆ హోదా తాజాగా పొందింది. -
హైతీ అధ్యక్షుడి హత్య కేసులో కీలక సూత్రధారి అరెస్టు
Port-Au-Prince: కరేబియన్ దేశమైన హైతీ అధ్యక్షుడు జోవెనెల్ మోయిస్ హత్యతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కి పడిన సంగతి తెలిసిందే. మోయిస్ హత్య వెనుక కీలక సూత్రధారిని అరెస్టు చేసినట్లు హైతీలోని అధికారులు సోమవారం తెలిపారు. ఈ ఘటనపై హైతీ పోలీసు అధికారి లియోస్ చార్లెస్ మాట్లాడుతూ.. క్రిస్టియన్ ఇమ్మాన్యుయేల్ సనోన్ (63) రాజకీయ ప్రయోజనాల కోసం ఓ ప్రైవేట్ విమానంలో పలువురు కొలంబియన్లతో హైతీలోకి ప్రవేశించాడని పేర్కొన్నారు. ఇక ఈ హత్యకు సంబంధించి గత వారం రోజుల నుంచి కనీసం పద్దెనిమిది కొలంబియన్ పౌరులను అరెస్టు చేసినట్లు తెలిపారు. అధ్యక్షుడిని చంపే కుట్ర వెనుక మరో ఇద్దరు సూత్రధాలు కూడా ఉన్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఓ ముగ్గురు హైతీ అమెరికన్లను కూడా పోలీసులు అరెస్టు చేశారు. గత నెలలో సనోన్ దేశంలోకి ప్రవేశించాడని, అతడి ఇంటి వద్ద పెద్ద ఎత్తున తుపాకులు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన మోయిస్ భార్య మార్టైన్ మోయిస్‌ను మయామి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రధానిగా ఉన్న క్లౌండ్ జోసెఫ్.. తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. -
హైతీ అధ్యక్షుడి దారుణ హత్య
పోర్ట్–అవ్–ప్రిన్స్: కరేబియన్ దేశమైన హైతి అధ్యక్షుడు జోవెనెల్ మోయిజ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. మంగళవారం అర్ధరాత్రి ఆయన నివాసంపై దాడి చేసిన దుండగులు జోవెనెల్‌ను కాల్చి చంపినట్టుగా ఆ దేశ తాత్కాలిక ప్రధాని క్లాడ్ జోసెఫ్ వెల్లడించారు. అనాగరిక, అమానవీయ, విద్వేషపూరిత చర్యగా దీనిని అభివర్ణించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దుండగుల దాడిలో గాయపడిన అధ్యక్షుడి భార్య, దేశ ప్రథమ మహిళ మార్టిన్ మోయిజ్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడికి దిగిన వారిలో కొందరు స్పానిష్ , ఇంగ్లీషు భాషలో మాట్లాడారని జోసెఫ్ ఆ ప్రకటనలో తెలిపారు. అయితే ఎవరు ఈ ఘాతుకానికి ఒడిగట్టారో ఇంకా తెలియలేదు. ప్రస్తుతం దేశంలో భద్రతా పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని జోసెఫ్ స్పష్టం చేశారు. 53 ఏళ్ల వయసున్న మోయిజ్ 2017లో అధికారంలోకి వచ్చారు. అప్పట్నుంచి ఆయన తన అధికారాన్ని పెంచుకునే ప్రయత్నాలే చేశారు. కోర్టులు, ప్రభుత్వ కాంట్రాక్టర్లు, ఆడిటర్లు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కేవలం అధ్యక్షుడికే జవాబుదారీలా ఉండేలా నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో ఎన్నికలు నిర్వహించడంలో ఆయన విఫలమయ్యారు. దీంతో అధ్యక్షుడిపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. విపక్ష నేతలు ఆయన గద్దె దిగాలని కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నారు. -
కరోనా సంక్షోభం తర్వాత తొలి క్రికెట్ లీగ్
ఆంటిగ్వా: ఒకవైపు కరోనా సంక్షోభం కొనసాగుతుండగానే వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఒక లీగ్‌ను నిర్వహించడానికి సిద్ధమైంది. విన్సీ ప్రీమియర్ లీగ్(వీపీఎల్)లో భాగంగా టీ10 క్రికెట్‌ను నిర్వహించడానికి షెడ్యూల్ ఖరారు చేసింది. తూర్పు కరీబియన్ దీవుల్లో నిర్వహించ తలపెట్టిన ఈ టోర్నీతో విండీస్‌లో మళ్లీ క్రికెట్ కళను తీసుకురావాలని యోచిస్తోంది. మే 22వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకూ ఈ లీగ్ జరుగనుంది. మొత్తం ఆరు జట్లు పాల్గొనే ఈ లీగ్‌లో 30 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఇందులో 72 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారని విండీస్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో అంతర్జాతీయ క్రికెటర్లు కూడా పాల్గొనున్నారు. (ప్రేక్షకులు వద్దు.. మనమే ‘కేక’ పెట్టిద్దాం) కాగా, కరోనా సంక్షోభం తర్వాత ఐసీసీలో సభ్యత్వం కల్గిన ఒక దేశం నిర్వహిస్తున్న తొలి క్రికెట్ టోర్నీ ఇదే కావడం విశేషం. అదే సమయంలో బంతిపై లాలాజలాన్ని రుద్దకుండా ఐసీసీ ప్రతిపాదించిన నిబంధనలు అమలు చేయబోతున్న మొదటి లీగ్ కూడా ఇదే. ‘ మేము టీ10 క్రికెట్ ఫార్మాట్‌తో తొలి అడుగు వేశాం. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఈవెంట్లు నిలిచిపోయిన తరుణంలో మరింత పొట్టి ఫార్మాట్‌ను నిర్వహించాలనుకున్నాం. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్‌ను కచ్చితంగా అలరిస్తుంది. ఈ లీగ్ సమయం 10 రోజులే కావడంతో మంచి మజా వస్తుంది. వీటిని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాం’ అని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కిషోర్ షాలో తెలిపారు. బంతిపై సలైవాను రుద్దడాన్ని నిషేధించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. ఆటగాళ్లు బౌతిక దూరం పాటిస్తూనే బరిలోకి దిగుతారన్నారు. గ్యాలరీల్లో ప్రేక్షకులు ఎవరూ ఉండరు కాబట్టి ఆటగాళ్లు భౌతిక దూరం పాటించడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదన్నారు.(‘నన్ను ఎందుకు తీశావని ధోనిని అడగలేదు’) కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దాదాపు ప్రపంచమంతా లాక్డౌన్లోకి వెళ్లిపోయింది. తద్వారా క్రీడా ఈవెంట్లు కూడా వాయిదా పడ్డాయి. క్యాష్ రిచ్ లీగ్ అయిన ఈ సీజన్ ఐపీఎల్ ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడగా, జరుగుందో.. లేదో అనేది ఇప్పటికీ డైలమాలోనే ఉంది. అదే సమయంలో అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్‌కప్ జరగాల్సి ఉంది. ఇది జరుగుతుందా.. లేదా అనే దానిపై క్లారిటీ రాలేదు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మెగాటోర్నీని నిర్వహించడం కష్టసాధ్యంగానే చెప్పవచ్చు. దీనిపై ఐసీసీతో పాటు క్రికెట్ ఆస్ట్రేలియాలు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. దానిలో భాగంగానే ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి అనుమతులు తప్పనిసరి. ఇక ఆస్ట్రేలియాకు వెళ్లేందుకు ఈ టోర్నీలో పాల్గొనబోయే ఆయా దేశాల ప్రభుత్వాలు కూడా అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. -
శభాష్ కరేబియన్
కరేబియన్.. చిన్న చిన్న ద్వీపకల్పాలతో కూడిన దేశాల సమాహారం. చుట్టూ సముద్రం. తమదైన సంస్కృతీ సంప్రదాయాలను కలిగిన వివిధ దేశాలతో కూడిన దీవులను కరేబియన్ దీవులని పిలుస్తారు. నార్త్ అమెరికా, సౌత్ అమెరికా మధ్యనున్న ఈ దీవుల్లో జరుగుతోన్న సంస్కరణలు ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్నాయి. సామాజికంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ముందు విద్యాభివృద్ధిని సాధించాలి. శతాబ్దాల నాటి కాలం చెల్లిన విధానాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ, కాలంతో పాటు మారుతూ, సమాజం నిత్యనూతనంగా విరాజిల్లాలంటే ప్రజలందరికీ సమానమైన విద్యావకాశాలు అందుబాటులో ఉండాలి. సరిగ్గా ఇలాంటి అభివృద్ధి నమూనానే అనుసరిస్తూ ప్రపంచ ప్రజల మెప్పు పొందుతోంది ఈ కరేబియన్ రీజియన్. ఈ సంస్కరణలకు మూల కారకురాలైన బార్బడోస్ ప్రధానమంత్రి మియామోట్లీ వైవిధ్యభరితమైన విద్యావిధానానికి రూపకల్పన చేసి అందరి మన్ననలు అందుకుంటున్నారు. మూడు ప్రధాన అంశాలపై ఆమె దృష్టి సారించారు. విద్యకు పునర్నిర్వచనం.. 1879 నాటి విద్యా విధానాన్నే ఇప్పటికీ అనుసరిస్తోన్న ఈ రీజియన్‌లో సెకండరీ స్కూల్ ఎంట్రన్స్ ద్వారా ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఇలా ఎంపికైన విద్యార్థులకు మాత్రమే మంచి నాణ్యత కలిగిన విద్యాసంస్థల్లో ప్రవేశం ఉంటుంది. మిగిలిన వారికి నాణ్యమైన విద్య అందుబాటులో ఉండదు. అరకొర పాఠశాలల్లోనే వారు చదువుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ విధానంలోని లోపాన్ని గుర్తించిన ప్రధానమంత్రి మియామోట్లీ దేశంలోని అన్ని పాఠశాలలనూ ఒకేరీతిన అభివృద్ధిపరిచారు. ఎంట్రన్స్ విధానాన్ని రద్దుచేసి, పాఠశాలలన్నింటినీ టాప్ స్కూల్స్‌గా మారుస్తూ సంస్కరణలు చేపట్టారు. విద్యార్థులు కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా సాంకేతిక, వృత్తి విద్యాకోర్సులను ప్రవేశపెట్టారు. వివిధ కళల్లో శిక్షణనిచ్చే ఏర్పాటు చేశారు. ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు ప్రత్యేకమైన వసతులు కల్పించారు. చుట్టుపక్కల దేశాలు సైతం ఈ ఎంట్రన్స్ విధానాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ దాన్ని అమలు చేయడంలో విఫలమయ్యాయి. అవినీతి రహితమే ప్రభుత్వ హితం సామాజిక అభివృద్ధికి అడ్డంకిగా మారిన అవినీతిని అంతమొందించడమే లక్ష్యంగా బార్బడోస్ ప్రధాని మియామోట్లీ పనిచేస్తున్నారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు అందకపోవడానికీ, నేరాల రేటు పెరగడానికీ అవినీతి కారణమవుతోంది. హైతీ దీవిలో స్థానిక ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజాధనం వృథా కావడం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో అవినీతి వేళ్లూనుకోవడంతో ప్రజా ఉద్యమాలు పెల్లుబికాయి. ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మియామోట్లీ ప్రభుత్వం అవినీతిరహిత సమాజం కోసం కృషి చేస్తోంది. మూలవాసులకు గౌరవం స్థానిక ప్రజల సాంస్కృతిక వారసత్వ హక్కులకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చిందీ దేశం. 500 ఏళ్లలో తొలిసారి 2019లో జమైకాకి తైనో చీఫ్‌ని నియమించారు. నెల క్రితం ఇన్స్టిట్యూట్ ఆఫ్ జమైకా మూలవాసులు ‘తైనో డే’ నిర్వహించుకున్నారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తైనో చెక్క కళాఖండాలను బ్రిటన్ నుంచి తిరిగి పొందేందుకు జమైకా ప్రభుత్వం జాతీయ కమిషన్ ద్వారా కృషి చేస్తున్నట్టు సాంస్కృతిక, లింగ, వినోద, క్రీడా రంగాల మంత్రి ఒలివియా గ్రాంజ్ వెల్లడించారు. మొత్తంగా ఆదివాసీల సంస్కృతినీ, వారి ఆకాంక్షలనూ గుర్తించి, గౌరవించే ప్రక్రియలో ఈ ప్రభుత్వం విజయపథంలో నడుస్తోంది. ఏ దేశమైనా తన మూలాలను అర్థం చేసుకోకుండా, తన స్వీయ చరిత్రను అవగాహన చేసుకోకుండా ముందుకెళ్లలేవు. తమ మూలాలను గ్రహించి, వాటిని గౌరవించుకుంటూ కరేబియన్ దేశం నూతన దశాబ్దంలోకి అడుగిడుతోంది. -
భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు
తెగుసిగల్ప, హోండురాస్ : సెంట్రల్ అమెరికాలోని కరేబియన్ ద్వీపంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రతతో ప్రకంపనలు వ్యాపించాయి. దీంతో అమెరికా వర్జిన్ ఐలాండ్, ప్యూరిటో రికోలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా జియాలజిస్ట్‌లు తెలిపిన వివరాల ప్రకారం తెగుసిగల్స రాజధాని హోండురాన్కు 519 కిలో మీటర్ల దూరంలోని బర్రా పటుకా, జార్జ్ టౌన్లో ఈ భూకంపం చోటు చేసుకుంది. దీని ప్రభావంతో వర్జిన్ ఐలాండ్, ప్యూరిటో రికో ప్రాంతాల్లో సునామీ సంభవించే అవకాశం ఉందని తొలుత పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది. ఈ భూకంపం 10 కిలో మీటర్ల మేర తీవ్ర ప్రభావం చూపి భూమి పెద్ద మొత్తంలో చీలిపోయినట్లు వెల్లడించింది. అయితే, ఎంతమేరకు నష్టం జరిగందనే దానిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. -
మరియా.. ఇక మహా ప్రళయమేనా?
సాక్షి, ఫ్యూర్టో రికో: సరిగ్గా రెండు వారాల క్రితం ఇర్మా హరికేన్ భీభత్సం కరేబియన్ దీవులను కకావికలం చేసేసి అక్కడి నుంచి అమెరికాపై తన ప్రతాపాన్ని చూపించేసింది. విలయతాండవ ఉధృతి త్వరగానే తగ్గినప్పటికీ.. నష్టం నుంచి బయటపడేందుకు మరికొన్ని రోజలు సమయం పట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో పెను తుఫాన్ విరుచుకుపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మరియా తుఫాన్ ఈ ఉదయం తీరం దాటినట్లు అధికారులు ప్రకటించారు. గంటకు 165 మైళ్ల (215 కిలోమీటర్ల) వేగంతో కూడిన గాలులు వీయటం ఇప్పటికే మొదలైనట్లు తెలుస్తోంది. దీంతో కేటగరీ 5 కింద తీర ప్రాంతంలో హెచ్చరికలు జారీ చేశారు. దక్షిణ ఆగ్నేయ సఫిర్ సింప్సన్ ప్రాంతం నుంచి మొదలైన ఈ తుఫాన్ బుధవారం ఉదయంలోగా ఫ్యూర్టో రికో తీరాన్ని తాకే అవకాశం ఉందని తెలుస్తోంది. డొమినికాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండటంతో అక్కడ ఉన్న 72,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు. నార్త్ కరోలినాకు నుంచి లీవార్డ్ మార్టినిక్, పోర్టారికో, యూఎస్, బ్రిటీష్ వర్జీన్ ఐల్యాండ్స్ పై మరియా ప్రభావం చూపనుంది. గత 85 ఏళ్లలో అతి శక్తివంతమైన తుఫాన్ ఫ్యూర్టో రికోను తాకబోతున్నట్లు వారంటున్నారు. మరోవైపు హరికేన్ జోస్ కూడా ప్రచండ గాలులతో అమెరికాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాగా, మరియా అట్లాంటిక్ సముద్రానికి నాలుగో అతి భయంకరమైన హరికేన్‌గా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ యేడాది 13 తుఫాన్లు అట్లాంటిక్ నుంచి ప్రారంభమై వివిధ దేశాలపై తమ ప్రభావం చూపాయి. -
ఫ్లోరిడా.. దడ దడ
నేడు అమెరికాను తాకనున్న ఇర్మా తుపాను ► కనీవినీ ఎరుగని స్థాయిలో విధ్వంసం ఉండొచ్చని ఆందోళన ► సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని 63 లక్షల మందికి విజ్ఞప్తి ► ఫ్లోరిడాలో వేలాది మంది భారతీయులు.. భారత విదేశాంగ శాఖ అప్రమత్తం ► జార్జియా, ఉత్తర, దక్షిణ కరోలినా, అలబామాల్లోనూ అత్యవసర పరిస్థితి ► శనివారం క్యూబా, బహమాస్‌లో కొనసాగిన విధ్వంసం ► ఇర్మా ధాటికి కరీబియన్ దీవుల్లో ఇంతవరకూ 25 మంది మృతి ► కేటగిరీ 3 స్థాయికి తగ్గిన ఇర్మా.. అమెరికా తీరాన్ని తాకే సమయం - ఆదివారం ఉదయం (భారత కాలమానం ప్రకారం) ప్రాంతం - ఫ్లోరిడా కీస్ ఆ సమయంలో గాలుల తీవ్రత - గంటకు 205 కిలోమీటర్లు ఎగిసిపడనున్న అలల ఎత్తు - 12 అడుగుల వరకు.. కేటగిరీ 3 అంటే..? - హరికేన్ సమయంలో గాలుల వేగం గంటకు 178– 208 కిలోమీటర్ల మధ్య ఉండటం మయామి: కరీబియన్ దీవుల్ని అతలాకుతలం చేసిన హరికేన్ ఇర్మా అమెరికాలో పెను విధ్వంసం సృష్టించేందుకు తీరం వైపునకు వేగంగా దూసుకెళ్తోంది. ఆదివారం ఉదయం ఫ్లోరిడా రాష్ట్ర తీరాన్ని తాకనున్న ఈ హరికేన్ అమెరికాలో కనీవినీ ఎరుగని విధ్వంసం సృష్టించవచ్చని ఆ దేశ జాతీయ హరికేన్ కేంద్రం హెచ్చరించింది. శనివారమంతా బహమాస్, క్యూబాల్లో భారీ నష్టం మిగిల్చిన ఇర్మా.. ‘ఫ్లోరిడా కీస్’ వద్ద అమెరికా తీరాన్ని తాకి, అనంతరం ప్రధాన భూభూగమైన మయామి–డేడ్ కౌంటీపై విరుచుకుపడనుంది. ఆ సమయంలో గంటకు 205 కి.మీ వేగంతో పెనుగాలులతో పాటు కుండపోత వర్షం ముంచెత్తవచ్చని అమెరికా జాతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముందు జాగ్రత్త చర్యగా అమెరికా చరిత్రలోనే మొట్టమొదటిసారి రికార్డు స్థాయిలో లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఫ్లోరిడాలోని పలు ప్రాంతాల్లో ఇర్మా ప్రభావం మొదలైంది. అనేక చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 63 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఫ్లోరిడా రాష్ట్ర అధికారులు విజ్ఞప్తి చేశారు. ఆ రాష్ట్ర మొత్తం జనాభాలో ఇది నాలుగో వంతుపైనే కావడం గమనార్హం. వేలాది మంది భారతీయులు పునరావాస కేంద్రాలకు తరలివెళ్లారు. జార్జియా రాష్ట్రంలోని అతిపెద్ద నగరం అట్లాంటా హోటళ్లన్నీ ఫ్లోరిడా ప్రజలతో నిండిపోయాయి. జార్జియా తీర ప్రాంతాల నుంచి 5.4 లక్షల మంది సహాయక శిబిరాలకు వెళ్లాలని ఆ రాష్ట్ర అధికారులు కోరారు. ఫ్లోరిడా, జార్జియాతో పాటు, ఉత్తర కరొలినా, దక్షిణ కరొలినా, అలబామా రాష్ట్రాల్లో కూడా అత్యవసర పరిస్థితి ప్రకటించారు. అత్యవసర సహాయం కోసం హోం ల్యాండ్, ఎమర్జెన్సీ, ఇతర విభాగాలకు చెందిన వేలాది మందితో పాటు ఆర్మీ సిబ్బందిని ఫ్లోరిడా తీర ప్రాంతాల్లో మోహరించారు. ఇంకా అత్యంత ప్రమాదకరమే.. హరికేన్ ఇర్మా ఇంకా అత్యంత ప్రమాదకరంగానే ఉందని, ఆదివారం ఉదయం తీరాన్ని తాకే సమయంలో గరిష్టంగా 205 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని, హరికేన్ కన్ను(మధ్య ప్రాంతం) నైరుతి ఫ్లోరిడా, టాంపాను ఆదివారం మధ్యాహ్నం తాకవచ్చని హరికేన్ కేంద్రం తెలిపింది. ఆదివారం మొత్తం ఫ్లోరిడా తీర ప్రాంతం మీదుగానే హరికేన్ ముందుకు కదులుతుందని, ఈ సమయంలో భారీ నష్టం జరగవచ్చని హెచ్చరించింది. శనివారం మధ్యాహ్నానికి(భారత కాలమానం ప్రకారం) హరికేన్ కేంద్రం మయామికి 245 మైళ్ల(395 కి.మీ) దూరంలో ఉండగా.. తీరంవైపునకు వేగంగా దూసుకెళ్తోంది. ‘ఫ్లోరిడాపై ఇర్మా ప్రభావం చూపనుందా? అన్నది ప్రశ్న కాదు.. ఏ స్థాయిలో బీభత్సం ఉంటుందనేదే అసలు ప్రశ్న’ అని అమెరికా అత్యవసర నిర్వహణ విభాగం చీఫ్ బ్రాక్ లాంగ్ అన్నారు. ఫ్లోరిడా కీస్‌కు పెనుముప్పు ఫ్లోరిడా కీస్‌లోని పల్లపు ప్రాంతాల్లో పెనుగాలులతో పాటు భారీ ఎత్తున అలలు ఎగసిపడవచ్చని హెచ్చరికలు జారీచేశారు. ముందు జాగ్రత్తగా హోటళ్ల నుంచి పర్యాటకుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ‘ఫ్లోరిడా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిపై ఇది ప్రభావం చూపనుంది. ఇర్మా దారి నుంచి వైదొలగకపోతే ప్రాణనష్టం సంభవించవచ్చు’ అని హరికేన్ కేంద్రం అధికారి డెన్నిస్ తెలిపారు. అమెరికా జాతీయ హరికేన్ కేంద్రం సమాచారం ప్రకారం.. గత 82 ఏళ్లలో అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడ్డ అతి తీవ్రమైన ఐదు హరికేన్లలో ఇర్మా ఒకటి. క్యూబాలో భారీ ఆస్తి నష్టం గురువారం నుంచి ఇంతవరకూ ఇర్మా ధాటికి కరీబియన్ దీవుల్లో 25 మంది మరణించారు. శుక్రవారానికి కేటగిరి 4 స్థాయికి తగ్గిన హరికేన్ తీవ్రత శనివారం మరింత బలపడి కేటగిరి 5కి చేరింది. అనంతరం మళ్లీ కేటగిరి 3 స్థాయికి తీవ్రత తగ్గింది. శనివారం క్యూబాను తాకిన ఇర్మా ఆ దేశ ఉత్తర ప్రాంతంలో భారీ నష్టాన్ని మిగిల్చింది. 1924 అనంతరం క్యూబాను కేటగిరి 5 స్థాయి హరికేన్ తాకడం ఇదే మొదటిసారి. గంటకు 200 కి.మీ పైగా వేగంతో గాలులు వీచాయని, 16 అడుగుల ఎత్తులో అలలు ఎగసిపడ్డాయని, ఆస్పత్రులు, కర్మాగారాలు, భవనాలు దెబ్బతిన్నాయని స్థానిక అధికారులు వెల్లడించారు. ఉత్తర తీర ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 10 లక్షల మందిని ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు తరలించగా.. పూర్తి నష్టం వివరాలు తెలియాల్సిఉంది. అలాగే బహమాస్ దక్షిణ ప్రాంతంలో కూడా శనివారం హరికేన్ విధ్వంసం కొనసాగింది. గాలుల తీవ్రతకు భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో పాటు, ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. బ్రిటన్ అధీనంలోని టర్క్స్ అండ్ కైకోస్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లో నష్టం తీవ్రతను అంచనా వేస్తున్నామని స్థానిక విపత్తు నిర్వహణ అధికారి తెలిపారు. భారతీయుల క్షేమంపై విదేశాంగ శాఖ అప్రమత్తం హరికేన్ ఇర్మా నేపథ్యంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఫ్లోరిడా, జార్జియా రాష్ట్రాల్లో వేలాది మంది భారతీయులు ఉన్న నేపథ్యంలో ఆ శాఖ అప్రమత్తమైంది. అమెరికా, వెనెజులా, ఫ్రాన్స్, నెదర్లాండ్స్‌లోని భారత రాయబార కార్యాలయాలు ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నాయని ఇర్మాతో ప్రభావితమయ్యే భారతీయులకు సాయపడేందుకు స్థానిక ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నాయని విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ చెప్పారు. కరీబియన్ దీవులవైపు దూసుకొస్తున్న జోస్ హరికేన్ జోస్‌ను కేటగిరి 4 స్థాయికి పెంచారు. ప్రస్తుతం కరీబియన్ దీవుల్లో లీవర్డ్ దీవులవైపు దూసుకొస్తోంది. ఇప్పటికే ఇర్మా దెబ్బకు సెయింట్ మార్టిన్ దీవి విధ్వంసం కాగా.. జోస్ ముప్పు నేపథ్యంలో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని హెలికాప్టర్ల ద్వారా హెచ్చరికలు వినిపిస్తున్నారు. మొదలైన ఇర్మా ప్రభావం ‘తుపాను సమీపానికి వచ్చేసింది. ఇప్పటికే ఫ్లోరిడా తీర ప్రాంతంలో 25 వేల మందికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. హరికేన్ తీరాన్ని తాకే సమయంలో 12 అడుగుల ఎత్తులో అలలు ఎగసిపడతాయి. ఖాళీ చేయాలని కోరితే తక్షణం తరలిపోండి. ఒకసారి తుపాను తాకితే సహాయక సిబ్బంది కూడా ఏమీ చేయలేరు’ అని ఫ్లోరిడా గర్నవర్ రిక్ స్కాట్ హెచ్చరించారు. ఫ్లోరిడాలో ఇంతవరకూ 260 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, యుద్ధప్రాతిపదికన మరో 70 షెల్టర్లు ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. నర్సుల అవసరం ఎక్కువగా ఉందని, అందువల్ల అందుబాటులో ఉన్నవారు స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ‘అమెరికా చరిత్రలోనే ఇది అత్యంత విధ్వంసకర తుపాను కావచ్చు. అధికారులు, పోలీసుల సూచనల ప్రకారం నడుచుకోండి’ అని అధ్యక్షుడు ట్రంప్ వీడియో సందేశంలో పేర్కొన్నారు. కరీబియన్ దీవుల్లో ఇర్మా విధ్వంసం ♦ సెయింట్ మార్టిన్, సెయింట్ బార్తెలెమి: ఈ ఫ్రాన్స్ దీవుల్లో కనీవినీ ఎరుగని విధ్వంసం జరిగింది.11 మంది మరణించారు. ♦ బార్బుడా: ఈ చిన్న ద్వీపంలో దాదాపు 95 శాతం ఇళ్లు, భవనాలు దెబ్బతిన్నాయి. ఒకరు మరణించారు. ♦ యాంగ్విలా: బ్రిటన్ ఆధీనంలోని ఈ ద్వీపంలో ఒకరు మరణించగా.. భారీ ఆస్తి నష్టం సంభవించింది. ♦ ప్యూర్టోరికో: ముగ్గురు మరణించారు. అమెరికా ఆధీనంలోని ఈ స్వతంత్ర దేశంలో 6 వేల మంది ఇంకా పునరావాస శిబిరాల్లోనే ఉన్నారు. లక్షలాది మంది చీకట్లోనే మగ్గుతున్నారు. ♦ అమెరికన్ వర్జిన్ ఐలాండ్స్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్: నలుగురు చొప్పున మృతి, పెను విధ్వంసం ♦ టర్క్, కైకోస్: ఈ బ్రిటిష్ ద్వీపంలో భారీ విధ్వంసం.. నష్టం వివరాలు తెలియాలి. ♦ హైతీ, డొమినికన్ రిపబ్లిక్, క్యూబా, బహమాస్: పెద్ద ఎత్తున ఆస్తి నష్టం. -
రేపు అమెరికాను తాకనున్న'ఇర్మా'
ఫ్లోరిడా రాష్ట్రంలో అత్యంత అప్రమత్తత ► 10 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు ► ఇర్మా ధాటికి కరేబియన్ దీవుల్లో 17 మంది మృతి ► ఇర్మా బాధితుల కోసం వైఎస్ జగన్ ప్రార్థన మయామి: కరేబియన్ దీవుల్లో హరికేన్ ఇర్మా బీభత్సం శుక్రవారం కూడా కొనసాగింది. ఇర్మా విధ్వంసకాండకు కరేబియన్ దీవుల్లో ఇంతవరకూ 17 మంది మృత్యువాత పడగా దాదాపు 2.5 కోట్ల మందిపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ అతిభయంకర తుపాను ఆదివారం ఉదయానికి అమెరికా ఫ్లోరిడా రాష్ట్రంలోని ‘ఫ్లోరిడా కీస్’ ప్రాంతాన్ని తాకవచ్చని అంచనావేస్తున్నారు. తీరాన్ని తాకే సమయంలో 25 అడుగుల ఎత్తున అలలు ఎగసిపడవచ్చని, గంటకు 250 కి.మీ వేగంతో పెనుగాలులు వీస్తాయని అమెరికా జాతీయ హరికేన్ విభాగం హెచ్చరించింది. ముందు జాగ్రత్తగా ఇప్పటికే ఫ్లోరిడా రాష్ట్రంలోని తీర ప్రాంతాల నుంచి దాదాపు 10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 2005లో హరికేన్ కత్రినా తర్వాత ఇంత పెద్దస్థాయిలో ప్రజల్ని తరలించడం ఇదే మొదటిసారి.ఫ్లోరిడాతో పాటు జార్జియా రాష్ట్రంపై పెను ప్రభావం చూపవచ్చన్న హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అత్యంత అప్రమత్తమైంది. అమెరికా ఆగ్నేయ ప్రాంతం మొత్తం అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఇది అత్యంత విధ్వంసకర తుపాను కావచ్చని అమెరికా ఎమర్జెన్సీ విభాగం చీఫ్ బ్రాక్ లాంగ్ హెచ్చరించారు. హరికేన్ ఇర్మా తీవ్రతను శుక్రవారం ఉదయానికి అమెరికా జాతీయ హరికేన్ విభాగం కేటగిరి 4 స్థాయికి తగ్గించింది. ప్రస్తుతం తుపాను బహమాస్ దీవుల వద్ద ఉందని, గరిష్టంగా 250 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయని, ఇంకా అత్యంత ప్రమాదకరంగానే ఉందని హరికేన్ విభాగం తెలిపింది. ఫ్లోరిడాలో తాజా పరిస్థితి పట్ల చాలా ఆందోళనగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. 60 శాతం పైగా దెబ్బతిన్న కరేబియన్ దీవులు ఇర్మా దెబ్బకు కరేబియన్ దీవుల్లోని సెయింట్ మార్టిన్ వంటి చిన్న దీవులు దాదాపు 60 శాతం దెబ్బతిన్నాయి. బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, ప్యూర్టోరికోలు కూడా బాగా నష్టపోయాయి. పెనుగాలుల ధాటికి ఇళ్ల పైకప్పులు ఎగిరిపోవడంతో పాటు, భారీ భవంతుల ముందు భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆస్తినష్టం ఊహించని స్థాయిలో ఉందని అధికారులు వెల్లడించారు. ప్యూర్టోరికోలో ఇద్దరు మరణించగా, దాదాపు 10 లక్షల మంది ఇంకా చీకట్లోనే ఉన్నారు. అమెరికన్ వర్జిన్ ఐలాండ్స్‌లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడ్డవారిని అమెరికా సహాయ సిబ్బంది హెలికాప్టర్లలో ప్యూర్టోరికోకు తరలించింది. సెయింట్ మార్టిన్, సెయింట్ బార్తెలెమి, గ్వాడెలోప్ తదితర ఫ్రాన్స్ దీవుల్లో మొత్తం 9 మంది మరణించారని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి గెరార్డ్ కొలొంబ్ తెలిపారు. మొత్తం 112 మంది గాయపడగా వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆయన చెప్పారు. ఇక బ్రిటన్ తన అధీనంలోని దీవుల్లో సహాయక చర్యల కోసం సహాయ సామగ్రి, సిబ్బందితో రెండు సైనిక విమానాల్ని పంపింది. తరుముకొస్తున్న మరో హరికేన్ డొమినికన్ రిపబ్లిక్ లో భారీ వర్షాలు, గాలులకు ఉత్తర, తూర్పు తీర ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 20 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. క్యూబాలో ముందు జాగ్రత్తగా 10 వేల మంది విదేశీ పర్యాటకుల్ని బీచ్ రిసార్ట్‌ల నుంచి తరలించారు. కాగా కరేబియన్ దీవుల వైపు మరో భయంకర హరికేన్ జోస్ దూసుకొస్తోంది. ప్రస్తుతం కేటగిరి 3 స్థాయిలో ఉన్న ఈ తుపాన్ మరింత బలపడి కరేబియన్ దీవుల మీదుగా అమెరికాలోని న్యూయార్క్, న్యూజెర్సీ, కనటికట్ రాష్ట్రాల సమీపంలో తీరాన్ని దాటవచ్చని అంచనావేస్తున్నారు. ఇర్మా బాధితుల కోసం వైఎస్ జగన్ ప్రార్థన సాక్షి, అమరావతి: హరికేన్ ఇర్మా బాధితులు ప్రతి ఒక్కరి కోసం తాను ప్రార్థిస్తున్నట్టు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ట్వీట్ చేశారు. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని కోరారు. ఆయా ప్రాంతాల్లో త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొనాలని జగన్ ట్వీటర్లో ఆకాంక్షించారు. కరీబియన్ దీవుల్లో విధ్వంసం సృష్టించిన ఈ హరికేన్.. అమెరికాపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అంచనా వేస్తున్నారు. -
హరికేన్ ‘ఇర్మా’ బీభత్సం
-
హరికేన్ ‘ఇర్మా’ బీభత్సం
► కరీబియన్ దీవుల్లో కనీవినీ ఎరుగని విధ్వంసం ► ఆరుగురి మృతి, నేలమట్టమైన వేలాది ఇళ్లు సాన్ జువాన్, మయామి: కరీబియన్ దీవుల్లో హరికేన్ ఇర్మా కనీవిని ఎరుగని విధ్వంసం సృష్టించింది. ఇర్మా ధాటికి ఇంతవరకూ ఆరుగురు మరణించగా, వేలాది ఇళ్లు నేలమట్టమవడంతో లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడ్డ హరికేన్లలోకెల్లా అత్యంత శక్తిమంతమైన ఈ తుపాను గత రెండు రోజులుగా కరీబియన్ దీవుల్ని అతలాకుతలం చేసి అమెరికాలోని ఫ్లోరిడా తీరం వైపు దూసుకెళ్తోంది. డొమినికన్ రిపబ్లిక్, హైతీలను అతలాకుతలం చేసిన హరికేన్ క్యూబా, బహమాస్ మీదుగా ఆదివారం ఫ్లోరిడా తీరాన్ని తాకవచ్చని, విధ్వంసం ఊహించని స్థాయిలో ఉంటుందని అమెరికా వాతావరణ శాఖ తేల్చింది. గంటకు 298 కి.మీ. వేగంతో వీచిన పెనుగాలులకు కరీబియన్ దీవులైన సెయింట్–మార్టిన్, సెయింట్–బార్తెలెమి, బార్బుడా, అంగ్విల్లా, వర్జిన్ ఐలాండ్స్, ప్యూర్టోరికోలు కోలుకోలేనంతగా దెబ్బతిన్నాయి. సెయింట్ మార్టిన్‌లో నలుగురు, అగ్విల్లా, బార్బుడాల్లో ఒక్కొక్కరు చనిపోయారు. ఫ్రాన్స్ దీవులైన సెయింట్–మార్టిన్, సెయింట్–బార్తెలెమిలో ఊహించనంత నష్టం జరిగిందని ఫ్రెంచ్ అంతర్గత వ్యవహారాల మంత్రి చెప్పారు. సెయింట్ మార్టిన్ 95% దెబ్బతింద ని స్థానిక అధికారి చెప్పారు. బ్రిటిష్ దీవులు అంగ్విల్లా, వర్జిన్ ఐలాండ్స్‌లో భారీ విధ్వంసం చోటుచేసుకుందని బ్రిటన్ విదేశాంగ శాఖ మంత్రి అలాన్ డంకన్ చెప్పారు. ప్యూర్టోరికోలో దారుణ పరిస్థితి అమెరికా అధీనంలోని స్వతంత్ర దేశం ప్యూర్టోరికోపై ఇర్మా పెను ప్రభావం చూపింది. దాదాపు 10 లక్షల మంది ప్రజలు చీకట్లో మగ్గుతున్నారు. 50 వేల మందికి తాగునీటి సరఫరా నిలిచిపోయిందని అత్యవసర సహాయ విభాగం తెలిపింది. డొమినికన్ రిపబ్లిక్, హైతీల్ని వణికిస్తున్న ఇర్మా.. క్యూబా, బహమాస్ మీదుగా ఫ్లోరిడా తీరం వైపు కదులుతోంది. పెను విధ్వంసం వల్ల సహాయక బృందాలు కరీబియన్ దీవులకు చేరడం కష్టంగా మారింది. బార్బుడా దీవిలో దాదాపు 60 శాతం మంది నిరాశ్రయులయ్యారని అంటిగ్వా, బార్బుడా ప్రధాని గాస్టన్ బ్రౌన్ వెల్లడించారు. వణికిస్తున్న మరో రెండు హరికేన్లు అట్లాంటిక్ సముద్రంలో మరో రెండు హరికేన్లు బలపడ్డాయి. హరికేన్ జోస్ గంటకు 207 కి.మీ వేగంతో ఇర్మా దారిలోనే ప్రయాణించవచ్చని అంచనావేస్తున్నారు. హరికేన్ కతియా మెక్సికో వైపు దూసుకుపోతోంది. 285 కి.మీ. వేగంతో గాలులు గురువారం ఉదయానికి ఇర్మా కొద్దిగా బలహీనపడినా కేటగిరీ 5 స్థాయిలోనే కొనసాగుతోందని గంటకు 285 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తున్నాయని అమెరికా జాతీయ హరికేన్ సెంటర్ తెలిపింది. ఫ్లోరిడా రాష్ట్ర గవర్నర్ అత్యవసర పరిస్థితి విధించారు. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని స్థానికులకు సూచించారు. ఫ్లోరిడా తీర ప్రాంతంలో ఇర్మా ధాటికి తీవ్ర నష్టం వాటిల్లవచ్చని, ఫ్లోరిడాతో పాటు జార్జియా, దక్షిణ కరోలినా రాష్ట్రాల్లో భారీ విధ్వంసం జరగవచ్చని ఆందోళన చెందుతున్నారు. అయితే ఇర్మా ఫ్లోరిడాలోని ఏ ప్రాంతంలో తీరాన్ని తాకవచ్చో అనేది అంచనా వేయలేకపోతున్నారు. అమెరికా చరిత్రలోనే అత్యంత నష్టాన్ని మిగిల్చే తుపానుగా మిగిలిపోవచ్చని యూనివర్సిటీ ఆఫ్ మయామికి చెందిన హరికేన్ పరిశోధకుడు బ్రియాన్ మెక్ నోల్డీ చెప్పారు. -
ఇర్మా సృష్టించిన పెనువిపత్తు!
-
ఇర్మా సృష్టించిన పెనువిపత్తు!
సాక్షి, వాషింగ్టన్: ఇర్మా తుఫాన్ కరేబియన్ దీవుల్లో పెను విపత్తును సృష్టించింది. ప్రచండమైన గాడ్పులు, వర్షాలతో బుధవారం రాత్రి ఇర్మా తుఫాన్.. అంటిగ్వా, బార్బుడా, ప్యూర్టోరికా, సెయింట్ మార్టిన్ దీవులపై విరుచుకుపడింది. దీంతో ప్రభుత్వ భవనాలు కుప్పకూలాయి. అనేక నివాసాల పైకప్పులు ఎగిరిపోయాయి. విద్యుత్, సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. మరోవైపు, 5 కేటగిరి తుఫాన్ తీవ్రతతో దూసుకుపోతున్న దక్షిణ ఫ్లోరిడా దిశగా సాగుతుండటంతో అమెరికా అప్రమత్తమైంది. హరికేన్ ఇర్మా ధాటికి బార్బుడా ఛిన్నాభిన్నమైంది. 'బార్బుడా శిథిలమయంగా కనిపిస్తోంది. గృహసముదాయాలన్నీ ధ్వంసమయ్యాయి. బార్బుడా దీవి పూర్తిగా నేటమట్టమైంది' అని అంటిగ్వా, బార్బుడా ప్రధాని గాస్టన్ బ్రౌన్ మీడియాతో తెలిపారు. ఇర్మా తుఫాన్ ధాటికి బార్బుడా దీవిలో కనీసం ముగ్గురు చనిపోయినట్టు తెలుస్తోంది. ఇందులో ఒక చిన్నారి ఉంది. ఇక సెయింట్ మార్టిన్ దీవుల్లో ఈ తుఫాన్ ధాటికి ఐదుగురు ప్రాణాలు విడిచారు. వైబ్రంట్ నైట్‌లైఫ్‌కు వేదిక అయిన సెయింట్ మార్టిన్ దీవిలో ఇర్మా పెనువిపత్తును సృష్టించిందని, 95శాతం ఆస్తులు ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు. 1800 మంది జనాభా గల బార్బుడా దీవి ఏమాత్రం నివాసయోగ్యం కాకుండా సమూలంగా ధ్వంసమైందని, ఇక్కడి ప్రజలంతా నిరాశ్రయులయ్యే పరిస్థితి నెలకొందని ప్రధాని బ్రౌన్ పేర్కొన్నారు. ఇక్కడ ధ్వంసమైన నివాసాలు పునర్నిర్మించేందుకు ఎంతలేదన్న 150మిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసినట్టు చెప్పారు. -
తుపాన్ గుప్పిట కరీబియన్ దీవులు
కింగ్స్టన్: వెస్టిండీస్ దీవులకు పెను ముప్పు పొంచి ఉంది. హరికేన్ మాథ్యూ తీవ్ర తుపాన్‌గా మారి కరీబియన్ సముద్రాన్ని దాటింది. రాబోయే రెండు రోజుల్లో ఇది జమైకాను తాకుతుందని భావిస్తున్నారు. 2007లో ఫెలిక్స్ తరువాత ఇదే అతిపెద్ద తుపాన్ అని యూఎస్ జాతీయ హరికేన్ కేంద్రం వెల్లడించింది. ఆదివారమే దీని ఫలితాలు కనిపించడం ప్రారంభమవుతుందని తెలిపింది. మాథ్యూను తీవ్రంగా పరిగణిస్తున్నామని, అప్రమత్తంగా ఉన్నామని సంస్థ డైరెక్టర్ ఇవాన్ థామ్సన్ చెప్పారు. జమైకాలో అత్యవసర విపత్తు కేంద్రాలను సిద్ధం చేశారు. తుపాన్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధత చర్చించేందుకు ప్రధాని ఆండ్రూ హాల్నెస్ అత్యవసరంగా పార్లమెంటును సమావేశపరిచారు. ప్రజలు నిత్యవసర సరకులను నిల్వ చేసుకుంటున్నారు. -
ఫుడ్డు దొరికితే... డిస్కోనే!
‘రీఫ్ స్క్విడ్’ అనే ఈ సముద్రజీవికి ఆహారం దొరికితే.. మరిన్ని రంగులు వెదజల్లుతూ.. డిస్కో డ్యాన్స్ చేస్తుందట. కరీబియన్ దీవుల వద్ద సముద్రంలో నివసించే ఇది మొలస్కా వర్గంలోని సెఫలోపొడా క్రమానికి చెందిన జీవి. ఫ్లోరిడా కీస్ వద్ద సముద్రంలో ఓ నౌక శిథిలాల వద్ద దీనికి ఆహారం దొరకడంతో ఇలా రంగులు వెదజల్లుతూ పండగ చేసుకుంటుండగా.. అమెరికాకు చెందిన మసా ఉషియోడా అనే ఫొటోగ్రాఫర్ ఈ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించాడు. సెఫలోపొడా అంటే.. తలదగ్గరే కాళ్లు ఉండటం అని అర్థం. ఈ జీవులకు తలదగ్గర పొడవైన టెంటకిల్స్ ఉంటాయి. కాళ్లయినా.. చేతులైనా అవే. శరీరంలోని సూక్ష్మరంధ్రాల ద్వారా ఇవి రంగులను వెదజల్లుతాయి. -
‘మధు’రోక్తి (cocktail.com)
కాసింతగా రమ్ము కోలాను కలిపిమ్ము వదిలిపోవును నెమ్ము ఓ వైనుతేయా! ‘తీస్కో కోకాకోలా... ఏస్కో రమ్ముసారా...’ అంటూ ఎల్లారీశ్వరి పాడిన పాటకు ఒకనాటి తరంలోని ‘రమ్’బాబులంతా ఉర్రూతలూగి తూగారు. ‘రమ్మని ఆహ్వానించినచో పొమ్మనుట పాడిగాద’ని మహాకవి ‘సిరిసిరిమువ్వ’ శతకంలో సెలవిచ్చాడు. మధువుల్లో రమ్ రూటే సెపరేటు. ఇది కాసింత నాటు కూడా. పండ్లతోనో లేదా చిరుధాన్యాలతోనో దీనిని తయారు చేయరు. నాటుసారా మాదిరిగానే దీనికి కూడా చెరుకే ముడిసరుకు. సాధారణంగా చెరుకు నుంచి వచ్చే మొలాసిస్తో రమ్ తయారు చేస్తారు. కొన్నిచోట్ల దీని తయారీకి నేరుగా చెరుకు రసాన్ని ఉపయోగిస్తారు. కొందరు ‘బుడ్డి’మంతులు రమ్‌తో నాటువైద్యం చేయడమూ కద్దు. వాతావరణం మారి, పడిశం పట్టుకునే లక్షణాలు కనిపిస్తే, గోరువెచ్చని నీటితో గుక్కెడు రమ్ము సేవిస్తారు. ‘అశ్వహృదయం’ ఎరిగిన అశ్వికులు పందెంలో పరుగులు తీసే గుర్రాలకు కూడా రమ్ము పట్టిస్తారు. రమ్ము ‘హార్స్పవర్’ పెంచుతుందనే నమ్మకం లేకపోలేదు. మన దేశం సహా నానా దేశాల్లో రమ్ తయారవుతున్నా, రమ్ తయారీకి కరీబియన్ దీవులు పేరుపొందాయి. ఎక్కువగా దొరికేది ఎర్రగా మెరిసే డార్క్ రమ్మే అయినా, మంచినీళ్లలా కనిపించే వైట్ రమ్, గోల్డ్ రమ్ వంటి వివిధ వర్ణాలూ ఇందులో ఉన్నాయి. ‘రమ్’ అనగానే కిమ్మనకుండా గ్లాసులు పుచ్చుకునే ‘రమ్’బాబుల కోసం ఈ వారం కాక్టెయిల్... డార్క్ డెవిల్ డార్క్మ్ : 30 మి.లీ. బ్రాందీ : 30 మి.లీ. కోకాకోలా : 90 మి.లీ. సోడా : 50 మి.లీ. గార్నిష్ : ఐస్ తురుము, పొడ వాటి దాల్చినచెక్క - వైన్‌తేయుడు -
కరేబియన్ దీవుల్లో నారాయణ హృదయాలయ
గుండె శస్త్రచికిత్సలకు పేరొందిన నారాయణ హృదయాలయ.. ఇప్పుడు విదేశాల్లోకి కూడా అడుగు పెడుతోంది. కరేబియన్ దీవుల్లోని గ్రాండ్ కేమన్ దీవుల్లో కొత్త ఆస్పత్రి ఏర్పాటుచేస్తోంది. హెల్త్ సిటీ కేమన్ ఐలండ్స్ (హెచ్‌సీసీఐ) పేరుతో ఏర్పాటుచేస్తున్న ఈ ఆస్పత్రి వివరాలను నారాయణ హృదయాలయ చైర్మన దేవి శెట్టి, అమెరికాకు చెందిన అసెన్షియన్ హెల్త్ అలయెన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆంటోనీ ఆర్ టెర్సింగిలతో కలిసి కేమన్ ప్రీమియర్ ఆల్డెన్ మెక్ లాఫ్లిన్ ఈ ఆస్పత్రి తొలిదశను ఆవిష్కరిస్తారు. రాబోయే 15 ఏళ్లలో దాదాపు రూ. 1.25 లక్షల కోట్లతో వివిధ దశల్లో ఈ ఆస్పత్రిని పూర్తి స్థాయిలో ఏర్పాటుచేస్తారు. 200 ఎకరాల విస్తీర్ణంలో 104 పడకలతో ఇది రాబోతోంది. ఇక్కడ ఓపెన్ హార్ట్, బైపాస్ సర్జరీలు, ఆంజియోప్లాస్టీ, వాల్వ్ రీప్లేస్మెంట్, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్ లాంటి విభాగాల్లో వైద్యసేవలు అందుతాయి. పాశ్చాత్య దేశాల్లో కూడా తక్కువ ధరలకు మెరుగైన వైద్యాన్ని ఎలా అందించచ్చో ఈ ఆస్పత్రి ఉదాహరణగా చూపిస్తుందని అంటున్నారు.4 కోట్ల మంది జనాభా ఉన్న కేమన్ ఐలండ్స్ ఉత్తర అమెరికాకు చాలా వ్యూహాత్మక స్థానంలో ఉంది. ఈ ఆస్పత్రిలో భారత్, బ్రిటన్, అమెరికాలకు చెందిన 140 మంది వైద్య సిబ్బంది ఉంటారు. నారాయణ హృదయాలయ గ్రూపునకు ఇప్పటికే మన దేశంలోని 14 నగరాల్లో 23 ఆస్పత్రులున్నాయి. ఇక బెంగళూరు శివార్లలోని హెల్త్ సిటీలో అయితే అతిపెద్ద మూలుగ మార్పిడి యూనిట్, డయాలసిస్ యూనిట్ ఉన్నాయి.