ఫుడ్డు దొరికితే... డిస్కోనే!
‘రీఫ్ స్క్విడ్’ అనే ఈ సముద్రజీవికి ఆహారం దొరికితే.. మరిన్ని రంగులు వెదజల్లుతూ.. డిస్కో డ్యాన్స్ చేస్తుందట. కరీబియన్ దీవుల వద్ద సముద్రంలో నివసించే ఇది మొలస్కా వర్గంలోని సెఫలోపొడా క్రమానికి చెందిన జీవి. ఫ్లోరిడా కీస్ వద్ద సముద్రంలో ఓ నౌక శిథిలాల వద్ద దీనికి ఆహారం దొరకడంతో ఇలా రంగులు వెదజల్లుతూ పండగ చేసుకుంటుండగా.. అమెరికాకు చెందిన మసా ఉషియోడా అనే ఫొటోగ్రాఫర్ ఈ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించాడు. సెఫలోపొడా అంటే.. తలదగ్గరే కాళ్లు ఉండటం అని అర్థం. ఈ జీవులకు తలదగ్గర పొడవైన టెంటకిల్స్ ఉంటాయి. కాళ్లయినా.. చేతులైనా అవే. శరీరంలోని సూక్ష్మరంధ్రాల ద్వారా ఇవి రంగులను వెదజల్లుతాయి.