విమానాశ్రయం అంటే సాధారణంగా, పొడవైన రన్‌వే, విశాలమైన ప్రదేశంలో చాలా పెద్దగా ఉంటుంది. కాని, కరీబియన్ దీవుల్లో నెదర్లాండ్స్ అధీనంలో ఉన్న సబా దీవిలో ‘జువాంకో ఇ. య్రాస్క్విన్’ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యంత చిన్న విమానాశ్రయంగా పేరొందింది. దీని రన్‌వే పొడవు కేవలం 400 మీటర్లు మాత్రమే! అంటే దాదాపు ఒక విమానం పొడవు కంటే కాస్త ఎక్కువ.
చుట్టూ ఎత్తైన కొండలు, పక్కనే సముద్రంతో చూడటానికి అందంగా కనిపించే ఈ విమానాశ్రయం, ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విమానాశ్రయాల్లో ఒకటి. అందుకే, ఇక్కడ పెద్ద విమానాలను అనుమతించరు. కేవలం విమానయాన సంస్థ విండైర్‌కు చెందిన చిన్న విమానాలను మాత్రమే ఇక్కడ అనుమతిస్తారు. అయితే, 1959లో రెమీ డి హానెస్ ప్రారంభించిన ఈ విమానాశ్రయం, సరైన సదుపాయాలు లేకపోవడంతో చాలాకాలం నిరుపయోగంగా ఉంది. ప్రస్తుతం డచ్ ప్రభుత్వం దీనిని పునరుద్ధరించింది. అంతేకాదు, రోజువారీగా చిన్న విమానాలను నడుపుకునేందుకు కూడా అనుమతించింది.
Comments
Please login to add a commentAdd a comment