smallest
-
ప్రపంచంలో అతిచిన్న కెమెరా ఇదే
ఇది ప్రపంచంలోనే అత్యంత చిన్నదైన ఇమేజ్ సెన్సర్ చిప్. అమెరికన్ కెమెరాల తయారీ కంపెనీ ‘ఓమ్నివిజన్’ కెమెరాల్లో ఉపయోగించే ఈ ఇమేజ్ సెన్సర్ చిప్‌ను ‘ఓవీఎం 6948’ పేరుతో ఇటీవల రూపొందించింది.‘చిప్ ఆన్ టిప్’ అనే ప్రచారంతో అందుబాటులోకి తెచ్చిన ఈ చిప్ ప్రపంచంలోనే అత్యంత చిన్న ఇమేజ్ సెన్సర్ చిప్‌గా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. దీని పొడవు 0.65 మి.మీ., వెడల్పు 0.65 మి.మీ., మందం 1.158 మి.మీ. అంటే, దాదాపు ఒక పంచదార రేణువంత పరిమాణంలో ఉంటుంది.ఇది 48 మెగాపిక్సెల్ సామర్థ్యంతో ఫొటోలు తీయడానికి ఉపయోగపడుతుంది. ఎండోస్కోప్ సహా వివిధ వైద్య పరికరాల కెమెరాల్లో ఉపయోగించడానికి ఇది అత్యంత అనువుగా ఉంటుంది. ఇది సెకనుకు 30 ఫ్రేముల సామర్థ్యంతో వీడియోలు కూడా తీయగలదు. -
ప్రపంచంలోనే అతిచిన్న జైలు.. ఖైదీలు ఎందరో తెలుసా?
ఇది ప్రపంచంలోనే అతిచిన్న చెరసాల. ఇద్దరు ఖైదీల సామర్థ్యం మాత్రమే గల ఈ జైలు బ్రిటన్‌లోని సార్క్ దీవిలో ఉంది. ఇంగ్లండ్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఇంగ్లిష్ చానల్‌లోని చానల్ దీవుల ద్వీపసమూహంలో ఒకటైన సార్క్ దీవి విస్తీర్ణం 5.4 చదరపు కిలోమీటర్లు మాత్రమే! ఈ దీవి జనాభా 562 మంది.ఈ దీవిలో 1856లో ఈ జైలును నిర్మించారు. చెక్కపీపాను దీనికి పైకప్పుగా ఏర్పాటు చేయడం ఇందులోని మరో విశేషం. తొలిరోజుల్లో ఈ జైలుకు విద్యుత్ సౌకర్యం కూడా ఉండేది కాదు. జైలు నిర్మించిన దాదాపు శతాబ్దం తర్వాత మాత్రమే దీనికి విద్యుత్తు సౌకర్యం వచ్చింది. ఇందులో ఇద్దరు ఖైదీల కోసం రెండు గదులు, రెండు గదుల మధ్య సన్నని నడవ మాత్రమే ఉంటాయి. ఈ జైలు ఇప్పటికీ వినియోగంలో ఉండటం విశేషం.అయితే, ఈ జైలులో ఖైదీలను ఎక్కువకాలం నిర్బంధంలో ఉంచరు. ఏదైనా నేరారోపణతో పట్టుబడిన నిందితులను ఈ జైలులో రెండు రోజుల వరకు ఉంచుతారు. కోర్టులో హాజరుపరచిన తర్వాత ఇక్కడి నుంచి గ్రంజీ దీవిలోని పెద్ద జైలుకు తరలిస్తారు. సార్క్ దీవి అధికార యంత్రాంగానికి బ్రిటిష్ రాచరికం పరిమితంగా మాత్రమే న్యాయవిచారణ అధికారాలను ఇచ్చింది.ఇక్కడ పట్టుబడిన ఖైదీలను రెండు రోజులకు మించి నిర్బంధించరాదని, అంతకు మించిన శిక్ష విధించాల్సిన నేరానికి పాల్పడినట్లయితే వారిని గ్రంజీ జైలుకు తరలించాలని 1583లో అప్పటి బ్రిటిష్ రాచరికం ఆదేశాలు జారీచేసింది. ఆనాటి ఆదేశాలే ఇక్కడ ఈనాటికీ అమలులో ఉన్నాయి. అయితే, ఈ జైలుకు తరచు ఖైదీల రాక ఉండదు. తక్కువ జనాభా గల ఈ దీవిలో నేరాలు కూడా చాలా తక్కువ.ఇవి చదవండి: 'అపార్ట్మెంట్ 66బి’ గురించి.. కనీసం మాట్లాడాలన్నా ధైర్యం చాలదు! -
అది దేశంలోనే అత్యంత చిన్న నగరం.. ఒకప్పుడు పారిస్‌తో పోల్చేవారు!
భారతదేశం పలు విభిన్నతలు, ప్రత్యేకతలు కలిగిన దేశం. దేశంలో అనేక చారిత్రక కట్టడాలు ఉన్నాయి. ఇవి మనదేశ ఘనతను చాటుతాయి. వీటికి ఆకర్షితులైన విదేశీ పర్యాటకులు కూడా ఇక్కడకు వస్తుంటారు. మనదేశంలో మ్తొతం 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో పలు నగరాలు ఉన్నాయి. అయితే దేశంలో అత్యంత చిన్న నగరం కూడా ఉంది. ఆ నగరంలో జనసంఖ్య 2011లో 98,916 మాత్రమే. కోవిడ్ కారణంగా జనాభా గణన ఇటీవలి కాలంలో జరగలేదు. పంజాబ్‌లోని కపూర్థలా అందమైన చారిత్రక కట్టడాలకు, విశాలమైన రహదారులకు పేరొందింది. ఒకానొక సమయంలో దీనిని పంజాబ్ పారిస్ అని పిలిచేవారు. ఇక నగరాన్ని స్ణాపించిన నవాబ్ కపూర్ పేరిట ఈ ప్రాంతానికి కపూర్థలా అనే పేరు వచ్చింది. భారతీయ రైల్వోలతో ఈ నగరానికి విడదీయరాని అనుబంధం ఉంది. ఇక్కడ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఉంది. రైల్వే బోగీలు ఇక్కడే తుదిమెరుగులు దిద్దుకుంటాయి. ఇక్కడి జగత్జీత్ ప్యాలెస్ ఒకప్పుడు కపూర్థలా రాజ్యానికి రాజైన మహారాజా జగత్జీత్ సింగ్‌కు నివాసంగా ఉండేది. ఇప్పుడు ఈ ప్యాలెస్‌లో సైనిక స్కూల్ నడుస్తోంది. ఈ మహల్‌ను1908లో నిర్మించారు. ఇక్కడి వాస్తకళ ఈ నాటికీ అందరినీ అలరిస్తుంటుంది. కపూర్థలా నగరానికి పంజాబ్‌లోని అన్ని పట్టణాల నుంచి రవాణా సదుపాయం ఉంది. అలాగే అమృత్‌సర్‌లోని విమానాశ్రయం నుంచి కూడా ఇక్కడకు సులభంగా చేరుకోవచ్చు. జలంధర్ రైల్వే స్టేషన్ నుంచి కూడా కపూర్థలాకు చేరుకోవచ్చు. ఇది కూడా చదవండి: మత్స్యకారుల చేతికి డాల్ఫిన్.. ఇంటికెళ్లి కూర వండేసుకున్నాక.. -
ప్రపంచంలోనే అతి చిన్న స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు మాత్రం అదుర్స్!
చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ యూనిహెర్ట్జ్ 3 అంగుళాల డిస్ప్లే, పారదర్శక డిజైన్‌తో 'జెల్లీ స్టార్' స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ సరికొత్త ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఫోన్ ప్రపంచంలోనే అతి చిన్న స్మార్ట్‌ఫోన్ అని కంపెనీ పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక ప్యానెల్లో పారదర్శక డిజైన్‌తో నథింగ్ ఫోన్ 1 వంటి ఎల్ఈడీ నోటిఫికేషన్ లైట్‌ను ఇచ్చింది కంపెనీ. ఫోన్ లోపల ఉన్న భాగాలు పారదర్శక బ్యాక్ ప్యానెల్ నుంచి కనిపిస్తాయి. ధర, లభ్యత ఈ బుల్లి స్మార్ట్ ఫోన్‌ను 8జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్‌తో ఒకే వేరియంట్లో కంపెనీ విడుదల చేసింది. ఇందులో మైక్రో ఎస్డీ కార్డ్ కోసం పోర్ట్ కూడా ఉంది. కంపెనీ ఈ ఫోన్‌ను హాంకాంగ్‌లో మాత్రమే విడుదల చేసింది. భారత కరెన్సీ ప్రకారం దీని ధర దాదాపు రూ.17 వేలు. అక్టోబర్ నెల నుంచి ఈ ఫోన్ కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. స్పెసిఫికేషన్లు 480 x 854 పిక్సెల్ రిజల్యూషన్‌తో 3 అంగుళాల ఎల్ఈడీ డిస్ప్లే. MediaTek Helio G-99 ఆక్టాకోర్ ప్రాసెసర్ Android 13 ఆపరేటింగ్ సిస్టమ్ 48 MP రియర్ కెమెరా, 8 MP ఫ్రంట్ కెమెరా 2000mAH బ్యాటరీ -
నిర్మలా సీతారామన్ మరో రికార్డు, ఎక్కువగా వాడిన పదాలు ఏంటో తెలుసా?
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రెజెంటేషన్ సందర్భంగా ఆమె మరో రికార్డు క్రియేట్ చేశారు. వరుసగా ఐదోసారి కేంద్ర బడ్జెట్‌ను సమర్పించిన ఆమె ఈ సారి బడ్జెట్‌ను కేవలం 87 నిమిషాల్లో (గంటా 27 నిమిషాల్లో) ముగించారు. తద్వారా అతి తక్కువ సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డును క్రియేట్ చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం 2023-24 బడ్జెట్‌ను దాదాపు 16236 పదాలతో అతి చిన్న బడ్జెట్ ప్రసంగం చేశారు. సాధారణంగా కనీసం 2 గంటల పాటు జరిగే బడ్జెట్ ప్రసంగాలలో ఇది అతి చిన్నది. భారతదేశ చరిత్రలో అతి ఎక్కువ ,తక్కువ బడ్జెట్ ప్రసంగాలు ►ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020 బడ్జెట్ ప్రసంగంలో 2 గంటల 42 నిమిషాల పాటు ప్రసంగించారు. ఇది బడ్జెట్ ప్రసంగాల చరిత్రలో సుదీర్ఘమైనది. వ్యవధి పరంగా సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డును సీతారామన్ సొంతం చేసుకున్నారు. ► భారత తొలి (పూర్తి) మహిళా ఆర్థిక మంత్రి సీతారామన్, 2019లో తన తొలి బడ్జెట్ ప్రసంగంలో, 2 గంటల 17 నిమిషాలు మాట్లాడారు. ఇంకా రెండు పేజీలు మిగిలి ఉన్నప్పటికీ, అస్వస్థతకు గురై తన ప్రసంగాన్ని కుదించుకుని ప్రసంగంలో మిగిలిన భాగాన్ని చదివినట్లుగా పరిగణించాలని ఆమె స్పీకర్‌ను కోరారు. ►ఆ తరువాత ఫిబ్రవరి 1, 2020న 2020-21 కేంద్ర బడ్జెట్‌ను సమర్పిస్తూ 2 గంటల 42 నిమిషాల పాటు ప్రసంగించి తన రికార్డును తానే బద్దలు కొట్టారు. 2021లో ఆమె గంటా 50 నిమిషాల పాటు ప్రసంగించారు. ►ఇక మాజీ ఆర్థిక మంత్రి జస్వంత్ సింగ్ తన 2003 బడ్జెట్ ప్రసంగంలో 2 గంటల 13 నిమిషాల పాటు ప్రసంగించారు. ►మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన 2014 బడ్జెట్ ప్రసంగంలో 2 గంటల 10 నిమిషాల పాటు ప్రసంగించారు. ► పదాల గణన పరంగా, 1991లో మన్మోహన్ సింగ్ సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం చేశారు. ప్రసంగంలో 18,650 పదాలు ఉన్నాయి. కాగా రానున్న ఎ న్నికలు, మోదీ సర్కార్‌కు చివరి బడ్జెట్ కావడంతో పన్ను చెల్లింపు దారులకు భారీ ఊరట కల్పించారు. అలాగే వేతన జీవుల ఆదాయ పన్నుల ట్యాక్స్ శ్లాబ్స్‌లో మార్పులు తీసుకొచ్చారు. పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రసంగంలో పన్ను, అభివృద్ధి, రాష్ట్రాలు, ఆదాయం , ఆర్థిక పదాలు ఎక్కువగా ఉపయోగించగా. పన్ను అనే పదాన్ని ఎక్కువగా 51 సార్లు, అభివృద్ధి 28 సార్లు, రాష్ట్రాలు 27 సార్లు, ఆదాయం 26 సార్లు, ఫైనాన్స్ అనే పదాన్ని 25 సార్లు ఉపయోగించారు. స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు అయిన నేపథ్యంలో అన్ని వర్గాల అభివృద్ధికి దోహదపడే అమృత్కాల్ బడ్జెట్ అనే పదాన్ని కూడా ఎక్కువగానే ప్రస్తావించారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5371520960.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ప్రపంచంలోనే చిన్న టీవీ వచ్చేసింది, ధర వింటే?
టీవీ అనగానే ఒకప్పుడు 21 అంగుళాలవే ఉండేవి.. ఇప్పుడు ఏకంగా 75 అంగుళాలు అంతకన్నా ఎక్కువ సైజుల్లోనూ లభిస్తున్నాయని తెలుసు.. కానీ ఈ భారీ సైజులకు పూర్తి వ్యతిరేకంగా ప్రపంచంలోకెల్లా అత్యంత చిన్న టీవీలను అమెరికాకు చెందిన టైనీ సర్క్యూట్స్ అనే కంపెనీ తయారు చేసింది. చిన్న టీవీలు అనగానే ఏదో మన స్మార్ట్ఫోన్ల సైజులో ఉంటాయిలే.. ఇందులో ప్రత్యేకత ఏముందని అనుకోకండి.. ఎందుకంటే ఇవి అంతకన్నా చిన్నవి మరి!! అంటే ఒక పోస్టల్ స్టాంపు సైజులో కేవలం అర అంగుళం, అంగుళం సైజుల్లో తయారైనవి అన్నమాట!! మార్కెట్లో టీవీల సైజులు రోజురోజుకూ పెరుగుతుంటే ఈ కంపెనీ మాత్రం ఇలా వెరైటీగా బుజ్జిబుజ్జి టీవీలను తయారు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రెండు నమూనా టీవీలను తాజాగా ఆవిష్కరించింది. 0.6 అంగుళాల తెరతో టీనీటీవీని, ఒక అంగుళం స్క్రీన్‌తో టైనీటీవీ–2ను తీసుకొచ్చింది. పాతకాలం టీవీల్లో చానళ్లు మార్చుకొనేందుకు, వాల్యూమ్ పెంచుకొనేందుకు వీలుగా ఉండే గుండ్రటి నాబ్లను వీటికి కూడా ఏర్పాటు చేసింది. అయితే ఈ టీవీల్లో సాధారణ చానళ్ల ప్రసారాలు మాత్రం రావు! మరి ఇంకేం వస్తాయంటారా? ఈ టీవీల్లో అమర్చిన 8 జీబీ మెమరీ కార్డుల ద్వారా 10 గంటల నుంచి 40 గంటల వరకు వీడియోలను ప్లే చేసుకోవచ్చు. అయితే వీటిలో కొన్ని ప్రీ ఇన్స్టాల్డ్ వీడియోలను కూడా కంపెనీ సిద్ధం చేసింది. ఈ బుజ్జి టీవీల్లో మరో ప్రత్యేకత ఏమిటంటే కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్‌లో ఉండే ఫేవరేట్ సినిమాలు, వ్యక్తిగత వీడియోల ఫైళ్లను కంపెనీ అందించే ఉచిత సాఫ్ట్వేర్ ద్వారా వేరే ఫార్మాట్లోకి మార్చుకొని ఇందులో వీక్షించొచ్చు. ఇంతకీ వీటి ధర ఎంతో తెలుసా సుమారు 4-5 వేల రూపాయలు. -
World's Smallest Revolver: బొమ్మ రివాల్వర్ అనుకునేరు.. నిజమైనదే!
ఫొటోలో ఒక పెద్దమనిషి అరచేతిలో ఇమిడిపోయిన బుల్లి రివాల్వర్ చూశారు కదూ! ఇది పిల్లలు ఆడుకునే టాయ్ రివాల్వర్ కాదు, ట్రిగ్గర్ నొక్కితే తూటాలను వెదజల్లే సిసలైన రివాల్వర్. దీని పనితనం పిట్ట కొంచెం కూత ఘనం అనే స్థాయిలో ఉంటుంది. చూడటానికి మోర్టార్ తూటా సైజులో ఉండే ఈ రివాల్వర్‌లో కూడా సాధారణ రివాల్వర్ మాదిరిగానే ఆరు తూటాలు పడతాయి. స్విట్జర్లాండ్‌కు చెందిన ఆయుధాల తయారీ సంస్థ ఈ మినీ గన్ను రూపొందించి, ఇటీవల గిన్నిస్ రికార్డును సాధించింది. ఈ రివాల్వర్ పొడవు 5.5 సెం.మీ., ఎత్తు 3.5 సెం.మీ. దీని బరువు 19.8 గ్రాములు. దీని ఖరీదు మాత్రం సాధారణ రివాల్వర్ల కంటే చాలా ఎక్కువే. ఎంతంటే, 6,300 స్విస్ ఫ్రాంకులు (రూ.5.14 లక్షలు). దీనిని కొంటే, దీనితో పాటు ఒక లెదర్ కేసు, 24 తూటాలు ఉచితంగా దొరుకుతాయి. అయితే, దీనిని దిగుమతి చేసుకోవడాన్ని అమెరికా, బ్రిటన్ సహా కొన్ని దేశాలు నిషేధించాయి. చదవండి: Viral: సింహాన్ని పరుగులు పెట్టించిన భౌభౌ!! -
ఈ బుల్లి ఫోన్ ప్రత్యేకతలు వింటే..
సాక్షి, న్యూఢిల్లీ : 'ప్రపంచంలో అతిచిన్న మొబైల్ ఫోన్' ను యుకేకి చెందిన జాంకో లాంచ్ చేసింది. ‘జాంకో టైనీ టీ1’ పేరుతో ప్రారంభించిన ఈ ఫోన్ ఎంత చిన్నదంటే కేవలం మనిషి బొటన వేలంత పొడవు మాత్రమే ఉంటుంది. అంతేకాదు ఒక కాయిన్ కంటే తక్కువ బరువు వుంటుంది. కేవలం 13 గ్రాములు. ఇందులో సింగిల్ నానో సిమ్ వేసుకోవచ్చు. ఫోన్ బుక్‌లో 300 కాంటాక్ట్స్, 50 మెసేజ్‌లను, 50 కాల్‌లాగ్స్‌ను మాత్రమే స్టోర్ చేసుకునే సదుపాయం. ఇంటర్నెట్ యాక్సెస్ లేని ఈ ఫోన్ ప్రపంచంలోని అన్ని దేశాల్లో 2018, మే నెలలో మార్కెట్లోకి రానుంది. ఇక రేటు విషయానికొస్తే సుమారు రూ.2,500. ఇంత ప్రత్యేకమైన ఫోన్లో బ్లూటూత్, మైక్రో యూఎస్బీ, లౌడ్ స్పీకర్లు ఫీచర్లు సహా ఇతర ఫీచర్లు కూడా చాలా ప్రత్యేకమైనవే అని చెప్పాలి. అయితే భారీ స్క్రీన్లు, అద్భుతమైన కెమెరాలతో దూసుకుపోతున్న స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్లో ఈ బుల్లిఫోన్ యూత్‌ను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి! టైనీ టీ 1 ఫీచర్స్.. 0.49 ఇంచ్ ఓలెడ్ డిస్ప్లే 32 x 64 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ మీడియాటెక్ ఎంటీకే 6261డి మదర్‌బోర్డు 2జీ 32 ఎంబీ స్టోరేజ్ 200 ఎంఏహెచ్ కెపాసిటీ బ్యాటరీ, 3 రోజులు స్టాండ్‌బై, 180 నిమిషాల టాక్ టైం -
ప్రపంచంలోనే బుల్లి ఉడత
జకార్తా: ఇండోనేసియాలోని బోర్నియో అడవుల్లో ప్రపంచంలోనే అంతరించి పోయే జాతుల జాబితాలో ఉన్న అతి చిన్నదైన ఉడతను పరిశోధకులు కనుగొన్నారు. 73 మిల్లీమీటర్ల పొడవు, 17 గ్రాముల బరువైన ఈ బుల్లి ఉడతను సెప్టెంబర్ 16 వ తేదీన కనుగొన్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. దక్షిణ కాలిమంతన్ ప్రావిన్స్‌లోని మెరటస్ కొండలపై కనిపించిన ఈ ఉడతను శాస్త్రీయ పరిభాషలో బోర్నియన్ పిగ్మీ లేదా ఎక్సిలిసియురస్ ఎక్సిలిస్ అని పిలుస్తారు. సముద్ర మట్టానికి వెయ్యి మీటర్ల ఎత్తులో ఇవి సంచరిస్తుంటాయని శాస్త్రవేత్తలు వివరించారు. -
అంధులకు అండగా..
అంధులు, దృష్టి లోపం ఉన్నవారు ఇతరుల సాయం లేకుండా తమ పనులు తామే చేసుకునేందుకు సహకరించే కొత్త పరికరం అందుబాటులోకి వచ్చింది. చేతికి ధరించే ఉంగరంలా ఉండే ఈ అతి చిన్న పరికరం 3.5 మీటర్ల దూరంలో ఉన్న ఏ వస్తువునైనా ఇట్టే గుర్తించి వైబ్రేషన్ ద్వారా అప్రమత్తం చేస్తుంది. ఈ పరికరాన్ని చేతికి ధరించి ప్రయాణిస్తే నడిచే మార్గంలో వచ్చే ఎలాంటి అడ్డంకులనైనా అధిగమించవచ్చని సృష్టికర్తలు చెప్తున్నారు. లైవ్ బ్రెయిలీ అధినేత అభినవ్ వర్మ ఇప్పుడు అంధులకు అత్యంత ఉపయోగకరంగా ఉండే అతి చిన్న పరికరాన్ని రూపొందించారు. ఈ పరికరాన్ని చేతికి ధరిస్తే మూడు, నాలుగు మీటర్ల ముందుగానే వారికి వచ్చే అడ్డంకులను గుర్తించి వైబ్రేషన్ ద్వారా అప్రమత్తం చేస్తుంది. సెకనులో 50వ వంతు సమయంలో అడ్డంకులను గుర్తించగలిగే ఈ పరికరంతో పాటు, దీనికి అనుసంధానంగా బ్యాటరీతో నడిచే మరో రెండు పరికరాలను కూడ అభినవ్ తయారు చేశారు. ఈ 'మినీ' పరికరం అంధుల సాధారణ అవసరాలకు ఉపయోగపడటంతోపాటు, దీనిద్వారా విద్యార్థులు తమ పుస్తకాలను ఆడియో రూపంలో రికార్డు చేసుకొని వినే సదుపాయం కూడ ఉంది. ఐఐటీ ఖరగ్ పూర్ విద్యార్థి అభినవ్ తోపాటు అతడి స్నేహితుల బృందం విభిన్న ఆలోచనతోనే ఈ చిన్న పరికరం రూపం దాల్చింది. అంధులు కర్రసాయం లేకుండా నడవలేరా? వారు సాధారణ ప్రజల్లా నడవాలంటే ఏం చేయాలి అన్న కోణంలో ఆలోచించిన విద్యార్థులు ఈ చిన్న గాడ్జెట్ ను కనుగొనే ప్రయత్నం చేశారు. మూడేళ్ళ క్రితం వారు విద్యార్థులుగా ఉన్నపుడు అంధులకోసం సృష్టించిన గ్లౌవ్స్ వంటి పరికరం విజయవంతం కావడంతో మరింత ఉపయోగంగా ఉండే అతి చిన్న పరికరాన్ని తయారు చేసేందుకు అభినవ్ చదువు పూర్తయిన తర్వాత సన్నాహాలు ప్రారంభించాడు. తాను స్వయంగా స్థాపించిన ఎంబ్రోస్ కంపెనీలో విభిన్నంగా వస్తువులను రూపొందించే ప్రయత్నం చేశాడు. అనేక ప్రయోగాలు, ప్రయత్నాల అనంతరం అభినవ్.. కేవలం 29 గ్రాములు బరువుండే అతి చిన్న రింగులాంటి లైవ్ బ్రెయిలీ పరికరాన్ని రూపొందించి విజయం సాధించాడు. చేతికి పెట్టుకునే ఉంగరంలా ఉండే ఈ చిన్న రింగు.. అంధులు వాడే కేన్ కు పది రెట్లు తేలిగ్గా ఉండటంతోపాటు... కేవలం 50 సెకన్ల లోపే అడ్డు వచ్చే వస్తువులను గుర్తించి అప్రమత్తం చేస్తుంది. అంతేకాదు వస్తువు దూరం, బరువు వంటి విషయాలను బట్టి పరికరం వైబ్రేట్ అవుతుంది. తాము రూపొందించిన ఈ చిన్న పరికరం సహాయంతో దృష్టిలోపం ఉన్నవారు నడవడమే కాదు ఏకంగా పరుగులు కూడా పెట్టొచ్చని అభినవ్ బృందం చెప్తున్నారు.