ఫొటోలో ఒక పెద్దమనిషి అరచేతిలో ఇమిడిపోయిన బుల్లి రివాల్వర్ చూశారు కదూ! ఇది పిల్లలు ఆడుకునే టాయ్ రివాల్వర్ కాదు, ట్రిగ్గర్ నొక్కితే తూటాలను వెదజల్లే సిసలైన రివాల్వర్. దీని పనితనం పిట్ట కొంచెం కూత ఘనం అనే స్థాయిలో ఉంటుంది. చూడటానికి మోర్టార్ తూటా సైజులో ఉండే ఈ రివాల్వర్‌లో కూడా సాధారణ రివాల్వర్ మాదిరిగానే ఆరు తూటాలు పడతాయి.
స్విట్జర్లాండ్‌కు చెందిన ఆయుధాల తయారీ సంస్థ ఈ మినీ గన్‌ను రూపొందించి, ఇటీవల గిన్నిస్ రికార్డును సాధించింది. ఈ రివాల్వర్ పొడవు 5.5 సెం.మీ., ఎత్తు 3.5 సెం.మీ. దీని బరువు 19.8 గ్రాములు. దీని ఖరీదు మాత్రం సాధారణ రివాల్వర్ల కంటే చాలా ఎక్కువే. ఎంతంటే, 6,300 స్విస్ ఫ్రాంకులు (రూ.5.14 లక్షలు). దీనిని కొంటే, దీనితో పాటు ఒక లెదర్ కేసు, 24 తూటాలు ఉచితంగా దొరుకుతాయి. అయితే, దీనిని దిగుమతి చేసుకోవడాన్ని అమెరికా, బ్రిటన్ సహా కొన్ని దేశాలు నిషేధించాయి.
Comments
Please login to add a commentAdd a comment