
ఈ భూమి మీద అత్యంత ఖరీదైన పదార్థం
తయారీకి లక్షల సంవత్సరాలు
ప్రపంచంలో అత్యంత ఖరీదైంది అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది ప్లాటినం, వజ్రాలు, బంగారం వగైరా గుర్తొస్తాయి. కానీ వీటన్నింటికి మించి షాకింగ్ ధర పలికే వస్తువు ఒకటి ఉంది. దాని పేరు ఎప్పుడైనా విన్నారా? అంత రేటు పలకడానికి గల కారణాలు ఏంటి? భూమిలో పుడుతుందా? లేకపోతే ల్యాబ్‌లో తయారువుతుందా? తెలుసుకుందాం.
ప్రపంచంలో అత్యంత ఖరీదైన పదార్థం పేరు యాంటీమాటర్ (Antimatter) దీని ఒక్కో గ్రాము ధర వింటే నిజంగా షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఏదో ఒకటీ, రెండు వేలు, కాదు, కోట్లు అంతకన్నా కాదు. ఏకంగా రూ. 53 వేల కోట్లు (62 ట్రిలియన్ డాలర్లు). ఒక్క గ్రాములో అతి తక్కువ పరిమాణంలో తయారీకి లక్షల సంవత్సరాల సమయం పడుతుంది. మిగతా ఖరీదైన పదార్థాల్లా దీనిని భూమి నుంచి తవ్వి తీయడానికి కుదరదు. దానిని సృష్టించడం, నిల్వ చేయడం అనేది అనేక సవాళ్లతో కూడుకొని ఉంటుంది. దాదాపు అసాధ్యమని చెప్పవచ్చు.. ఇది అందుబాటులోకి వస్తే అంతులేని శక్తి ఉత్పత్తికి అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
బంగారం, వజ్రాలు లేదా అరుదైన లోహాల మాదిరిగా కాకుండా, యాంటీమ్యాటర్‌ను భూమి నుండి తవ్వలేరు. దీనికి బదులుగా దీనిని అత్యంత నియంత్రిత వాతావరణంలో అణువు ,అణువును కలుపుతూ అత్యంత జాగ్రత్తగా తయారు చేయాలి. ఈ ప్రక్రియలో ఒక గ్రాములో కొంత భాగాన్ని సేకరించడానికి కూడా బిలియన్ల సంవత్సరాలు పట్టవచ్చు. విశ్వంలోని ఆటమ్‌లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లు, సబ్ ఆటమిక్ కణాలతో కూడిన ‘మ్యాటర్’తో ఆవిర్భవించింది. ప్రతి మ్యాటర్ కణాలకు ప్రతిబింబం లాంటి (Mirror image) యాంటీమ్యాటర్ కణాలు ఉంటాయి. మ్యాటర్ కణాలకు పాజిటివ్ ఛార్జ్ ఉంటే, యాంటీమ్యాటర్ కణాలకు నెగటివ్ ఛార్జ్ ఉంటుంది. దీని తయారీ చాలా క్లిష్టమైన ప్రక్రియ అంటున్నారు శాస్త్రవేత్తలు. ఒక్క గ్రాములో పదోవంతు తయారు చేయడానికి లక్షల సంవత్సరాలు పడుతుంది. ఫలితంగా ఒక్క గ్రాము యాంటీమ్యాటర్ తయారీకి రూ.53 వేల కోట్లు ఖర్చవుతుందని 1999లో నాసా శాస్త్రవేత్త హరోల్డ్ గెర్రిష్ అంచనా వేశారు. స్విట్జర్లాండ్‌లోని ది యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లిర్ రీసెర్చ్(CERN)లోని కణ భౌతిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ మైఖేల్ డోజర్ యాంటీమాటర్ నానోగ్రామ్‌లో 100వ వంతు భాగం తయారీకి దాదాపు ఒక కిలోగ్రాము బంగారం రేటు అంత ఖర్చవుతుందన్నారు.
సాధారణ పదార్థంతో దాని పరస్పర చర్య అనేది ప్రధానమైన ఛాలెంజ్. ఎందుకంటే పదార్థం, యాంటీమ్యాటర్ కలిసినపుడు భారీ పేలుడు సంభవిస్తుంది. ఇలా ఒకదానికొకటి నాశనం చేసుకుంటాయి. ఈ సమయంలో అపారమైన శక్తి ఉత్పత్తి అవుతుంది. అలాగే తయారైన వెంటనే ఇది అదృశ్యమైపోతుందని నమ్ముతున్నారు. అందుకే యాంటీమ్యాటర్‌ను భద్రపర్చడం, దీనిపై అధ్యయనం చేయడం చాలా కష్టతరం.
తయారీ తరువాత దీన్ని శూన్యంలో ఉంచాలి, సూపర్ కూల్డ్ అయస్కాంత క్షేత్రాలను ఉపయోగించి భద్రం చేయాలి. మ్యాటర్‌తో కలవకుండా యాంటీమ్యాటర్‌ను భద్రపరిచే ప్రయత్నాలు సాగాలి. ఇది కేవలం ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ క్షేత్రాల్లో మాత్రమే సాధ్యమని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సెర్న్ ఇప్పుడు యాంటీమ్యాటర్ తయారీకి ప్రయత్నిస్తోంది. అత్యాధునిక సాంకేతికతతో నియంత్రిత వాతావరణంలో దీనిని ఉత్పత్తి చేయడానికి, శాస్త్రవేత్తలు అపారమైన శక్తిని ఉపయోగించనున్నారు. CERNలో, పరిశోధకులు శక్తివంతమైన కణ యాక్సిలరేటర్‌లను ఉపయోగించి ప్రోటాన్‌లను ఇరిడియం లక్ష్యంతో ఢీకొట్టే ముందు అధిక వేగంతో ముందుకు నడిపిస్తారు. (దున్నకుండా.. కలుపు తీయకుండా.. రసాయనాల్లేకుండానే సాగు!)
యాంటీ మ్యాటర్‌పై అధ్యయనాలు
యాంటీ మ్యాటర్ అంతులేని శక్తిని ఉత్పత్తి చేస్తుంది కాబట్టి అంతరిక్ష పరిశోధనలకు దీనిని ఉపయోగించవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. యాంటీమాటర్ ఉత్పత్తిలో ఉన్న కష్టం, ఖర్చును దృష్టిలో ఉంచుకుని, శాస్త్రవేత్తలు ఈ అంతుచిక్కని పదార్ధంపై తీవ్ర పరిశోధనలను కొనసాగిస్తున్నారు.
విశ్వం ప్రారంభంలో సమాన మొత్తంలో పదార్థం, యాంటీమాటర్ సృష్టించబడ్డాయని శాస్త్రవేత్తలు విశ్వాసం. అవి ఒకదానికొకటి పూర్తిగా నాశనం చేసుకుని ఉండి ఉంటే, ఎలాంటి మ్యాటర్ మిగిలి ఉండకపోతే నేడు మనం చూస్తున్న గెలాక్సీలు, నక్షత్రాలు , గ్రహాలు ఎలా ఉండేవి అనేది ప్రధానమైన ప్రశ్న. ఒకవేళ మనకు కనిపించకుండా యాంటీమ్యాటర్ గెలాక్సీలు దాగి ఉన్నాయా? దీన్ని అర్థం చేసుకోవడానికే ఈ పరిశోధనలు.
ఇదీ చదవండి: మదర్స్ ప్రైడ్ : తల్లిని తలుచుకొని నీతా అంబానీ భావోద్వేగం
Comments
Please login to add a commentAdd a comment