most expensive
-
అత్యంత ఖరీదైన హ్యాండ్‌బ్యాగ్‌లు..కోట్లలోనే..! (ఫొటోలు)
-
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్!..ఒక లీటర్‌కే..!
మన ప్రాథమిక అవసరాల్లో నీరు కూడా ఒకటి. నీరు లేకుండా భూమిపై మనుగడ సాగించడం అనేది అసాధ్యం. పెరుగుదలకు, నిర్వహణకు ఎంతో అవసరం నీరు. మానవ శరీరం దాదాపు 60% నీటితోనే ముడిపడి ఉంటుంది. మానవ శరీర పనితీరుకు అత్యంత అవసరం ఇది. ముఖ్యంగా జీర్ణక్రియ, శోషణ,పోషకాల రవాణాను సులభతరం చేయడంలో నీను ప్రధాన పాత్ర పోషిస్తుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. సెల్యులార్ ఫంక్షన్‌కు మద్దతు ఇస్తుంది. వంట చేసే దగ్గర నుంచి క్లీన్ చేయడానికి, చెట్లకు, జంతుజాలం ఉనికికి నీరు అవసరం. అలాంటి నీరుని అత్యంత ధరల్లో కూడా విక్రయిస్తారనే విషయం గురించి విన్నారా?. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్ ఒకటి ఉంది. ఒక లీటర నీటికే ఎంత వెచ్చించాలో వింటే కంగుతింటారు. ఎందుకంతా అంటే..ఈ నీటిని చాలా ప్రత్యేకంగా తయారు చేయడం, దాని స్వచ్ఛత, ఫ్యాకేజింగ్ విధానం తదితరాల కారణంగా అంత లగ్జరీయస్ ఉంటుంది ఈ వాటర్ బాటిల్ ధర. వీటిని ప్రసిద్ధి బ్రాండ్ విడుదల చేస్తుంది. దీనిని ఫిల్లికో జ్యువెలరీ వాటర్ అని పిలుస్తారు. ఈ బాటిల్స్‌ని స్వరోవ్స్కీ స్పటికాలతో అలంకరిస్తారు. చక్కటి ఆభరణాల ముక్కలతో డిజైన్ చేస్తారు. అందువల్ల దీని ధర అంత రేంజ్లో ఉంటుంది. జపాన్‌లో కోబ్‌లోని సహజమైన నీటి బుగ్గ నుంచి తీసుకున్న నీరు ఇది. నాణ్యతకు ప్రసిద్ధి చెందింది. దీనికి తగ్గట్టుగా బాటిల్ డిజైన్ కూడా లగ్జరియస్‌గా ఉంటుంది. ప్రతి బాటిల్‌ని బంగారంతో డిజైన్ చేస్తారు. ఈ డిజైన్ని జపాన్ హస్తకళను హైలెట్ చేసేలా రూపొందిస్తారు. కొన్నిబ్రాండ్లు బంగారం, ప్లాటినం, అంతకంటే విలువైన రాళ్లతో డిజైన్ చేస్తారు. ఆ బాటిల్‌కి ప్రత్యేకమైన ఆకర్షణను తీసుకురావడమే గాకుండా అంత డబ్బు వెచ్చించి కొనుగోలు చేస్తున్నందుకు తగ్గట్టుగా ఆ బాటిల్ లుక్ ఉంటుంది. ఇంతకీ ఈ బాటిల్ లీటర్ నీటి ధర ఏకంగా రూ. 1,16,000/-(చదవండి: చీరకట్టులో హులా హూపింగ్..అథ్లెటిక్ సామర్థ్యాలతో..!) -
దేశంలో ఖరీదైన కారు ఈయన దగ్గరే.. ఇప్పుడు మరో కారు..
దేశంలో అత్యంత ఖరీదైన కార్లు ఉన్న వ్యాపారవేత్తల గురించి మాట్లాడేటప్పుడు ముఖేష్ అంబానీ, గౌతమ్ సింఘానియా, రతన్ టాటా వంటి పేర్లు మాత్రమే వినిపిస్తాయి. అయితే భారత్‌లో అత్యంత ఖరీదైన కారు వీఎస్ రెడ్డి అనే వ్యాపారవేత్త దగ్గర ఉంది.బెంట్లీ ముల్సానే ఈడబ్ల్యూబీ సెంటినరీ ఎడిషన్ దేశంలో అత్యంత ఖరీదైన కారు. దీని ధర రూ .14 కోట్లు. ముఖేష్ అంబానీ, రతన్ టాటా, గౌతమ్ సింఘానియా వంటివారి వద్ద ఉన్న రోల్స్ రాయిస్, ఫెరారీ కార్ల కంటే దీని ధర ఎక్కువ. దీని ఓనర్ వీఎస్ రెడ్డి ఇప్పుడు రూ .3.34 కోట్లు పెట్టి కొత్త మెర్సిడెస్-మేబాచ్ ఎస్ 680 కారు కొన్నారు.మెర్సిడెస్-మేబాచ్ ఎస్ 680.. మేబాచ్ ఎస్-క్లాస్ ప్రీమియం వెర్షన్. ఇందులో 6.0-లీటర్ టర్బోఛార్జ్డ్ వి12 ఇంజన్ ఉంది. ఇది 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్‌తో ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 610బీహెచ్పీ పవర్, 900ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది.ఎవరీ వీస్ రెడ్డి అంటే..ప్రముఖ న్యూట్రాస్యూటికల్ కంపెనీల్లో ఒకటైన బ్రిటిష్ బయోలాజికల్స్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టరే వీఎస్ రెడ్డి. 'ది ప్రోటీన్ మ్యాన్ ఆఫ్ ఇండియా'గా పేరొందిన కర్ణాటకకు చెందిన వీఎస్ రెడ్డి పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. తాను ఆటోమోటివ్ ఔత్సాహికుడినని, దేశంలోని అన్ని బ్రాండ్ల కార్లు తన వద్ద ఉండాలనుకుంటానని ఈవీవో ఇండియా మ్యాగజైన్‌తో మాట్లాడుతున్న సందర్భంగా వీఎస్ రెడ్డి చెప్పారు. -
ఐదు అత్యంత విలాసవంతమైన భవనాలు.. ఎవరుంటారక్కడ?
భారతదేశం అటు సంప్రదాయం, ఇటు ఆధునికత కలగలిసిన దేశం. దేశంలోని రియల్ ఎస్టేట్ రంగంలోనూ ఇది స్పష్టంగా కనిపిస్తుంది. వ్యాపారవేత్త ముఖేష్ అంబానీకి చెందిన ఐకానిక్ హౌస్ ‘యాంటిలియా’ నుంచి హీరో షారుక్ ఖాన్‌కు చెందిన విలాసవంతమైన ‘మన్నత్’ వరకు.. అన్నీ విలాసవంతమైన, ఆధునిక భవన నిర్మాణాలకు ఉదాహరణగా నిలిచాయి. భారతదేశంలో అత్యంత ఖరీదైన బంగ్లాలలో ఇవి కొన్ని.. 1. యాంటిలియా: ముఖేష్ అంబానీ దేశంలోని అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ ఇల్లు యాంటిలియా అత్యంత ఖరీదైన ఇళ్ల జాబితాలో నంబర్ వన్ ప్లేస్‌లో ఉంది. దక్షిణ ముంబైలోని ఈ భవనం మొత్తం 27 అంతస్తులను కలిగి ఉంది. 15వ శతాబ్దపు స్పానిష్ ద్వీపం పేరు ఈ భవనానికి పెట్టారు. జీక్యూ ఇండియా తెలిపిన వివరాల ప్రకారం ఈ భవనం విలువ ఒకటి నుండి రెండు బిలియన్ డాలర్ల మధ్య ఉంటుంది. ఇది బకింగ్‌హామ్ ప్యాలెస్ తర్వాత ప్రపంచంలో రెండవ అత్యంత ఖరీదైన ఇల్లు. యాంటిలియాలో హెల్త్ స్పా, బహుళ స్విమ్మింగ్ పూల్స్, థియేటర్, యోగా, డ్యాన్స్ స్టూడియో, బాల్రూమ్, ఐస్‌క్రీమ్ పార్లర్, మూడు హెలిప్యాడ్లు, హ్యాంగింగ్ గార్డెన్లు, పార్కింగ్ స్థలం మొదలైన ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. 2. మన్నత్: షారుక్ ఖాన్ అరేబియా సముద్రపు అలల సుందర దృశ్యాలను చూపే ‘మన్నత్’ బాలీవుడ్ రారాజు షారుక్ ఖాన్ నివాసం. ముంబైలోని బాంద్రాలో ఉన్న ఈ బంగ్లా ఖరీదు రూ.200 కోట్లకు పైమాటే. అతని భార్య గౌరీ ఖాన్ ఈ ఆరు అంతస్తుల భవనాన్ని తన ఆలోచనల మేరకు తీర్చిదిద్దారు. ఇంటీరియర్‌ను అద్భుతంగా రూపొందించారు. ఈ భవనంలో జిమ్, లైబ్రరీ, స్విమ్మింగ్ పూల్, ప్రైవేట్ సినిమా, అందమైన టెర్రస్ ఉన్నాయి. 3. గులిత: ఆనంద్ పిరమల్ ముకేశ్ అంబానీ కుమార్తె ఇషా అంబానీని ఆనంద్ పిరమల్ వివాహం చేసుకున్నారు. ఈ సందర్భంగా పిరమల్ గ్రూప్ చైర్మన్ అజయ్ పిరమల్ తన కుమారుడు ఆనంద్ పిరమల్‌కు ఈ విలాసవంతమైన ఇంటిని బహుమతిగా ఇచ్చారు. ముంబైలోని ఈ ఐదు అంతస్తుల డైమండ్ ఆకారపు భవనం అద్భుతానికి ఉదాహరణగా నిలిచింది. దీని రీగల్ డిజైన్ కారణంగా బయట నుండి ఎంతో అందంగా కనిపిస్తుంది. జీక్యూ ఇండియా అంచనా ప్రకారం ఈ బంగ్లా విలువ సుమారు రూ.450 కోట్లు. ఈ గ్రాండ్ డైమండ్ ఆకారపు భవనంలో ప్రైవేట్ పూల్, అండర్ గ్రౌండ్ పార్కింగ్, స్పేస్ డైనింగ్ ఏరియా, డైమండ్ రూమ్ తదితర లగ్జరీ సౌకర్యాలు ఉన్నాయి. 4. జతియ హౌస్: కుమార్ మంగళం బిర్లా ముంబైలోని మలబార్ హిల్‌లోని జతియ హౌస్ ప్రముఖ వ్యాపారవేత్త కుమార్ మంగళం బిర్లా నివాసం. ఈ బంగ్లా 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. జీక్యూ ఇండియా తెలిపిన వివరాల ప్రకారం ఈ బంగ్లా ఖరీదు రూ. 425 కోట్లు. విలాసవంతమైన ఇంటీరియర్ ఈ భవనం సొంతం. అందమైన సముద్ర దృశ్యం భవనానికి ప్లస్ పాయింట్. ఈ భవనంలో 20 పెద్ద బెడ్రూమ్లు, ఓపెన్ యార్డ్, గార్డెన్ మొదలైనవి ఉన్నాయి. 5. జేకే హౌస్: గౌతమ్ సింఘానియా ముంబైలోని బ్రీచ్ కాండీ ప్రాంతంలో ఉన్న జేకే హౌస్ వ్యాపార దిగ్గజం గౌతమ్ సింఘానియా నివాసం. గౌతమ్ సింఘానియా రేమండ్ గ్రూప్ చైర్మన్. ఈ 30 అంతస్తుల భవనం ఆధునిక డిజైన్‌తో రూపొందింది.అరేబియా సముద్ర దృశ్యాలు భవనంలోని వారిని అలరిస్తాయి. జీక్యూ ఇండియా తెలిపిన వివరాల ప్రకారం ఈ భవనం విలువ సుమారు రూ. ఆరు వేల కోట్లు. ఇందులో రెండు స్విమ్మింగ్ పూల్స్, ఐదు పార్కింగ్ అంతస్తులు, హెలిప్యాడ్, స్పా, జిమ్, హోమ్ థియేటర్ మొదలైన ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. -
రూ. 20 కోట్ల శునకం!!
మియాపూర్: సినిమాల్లో గెస్ట్ అప్పియరెన్స్‌లు.. బడా ఫంక్షన్లలో ప్రదర్శనలు.. ఎక్కడికెళ్లినా విస్తృత మీడియా కవరేజీ.. సెల్ఫీల కోసం ఎగబడే ప్రజలు.. ఇవన్నీ ఏ ప్రముఖుడి లైఫ్ స్టైల్‌ను తెలియజేసే వర్ణన అనుకుంటున్నారా? కానే కాదు.. దేశంలోనే అత్యంత ఖరీదైన, భారత్‌లో అరుదుగా పెంచే కకేషియన్ షెపర్డ్ జాతికి చెందిన ఓ శునకం అనుభవిస్తున్న విలాస జీవితం తాలూకు ఉదాహరణలు. దీని ఖరీదు రూ. వేలు, రూ. లక్షలు కూడా కాదు.. అక్షరాలా రూ. 20 కోట్లు!! కాడబామ్ హేడర్ అనే ఈ శునకం శనివారం హైదరాబాద్‌లోని మియాపూర్‌లో సందడి చేసింది. దీన్ని చూసేందుకు, సెల్ఫీలు దిగేందుకు స్థానికులు ఎగబడ్డారు. ఇండియన్ డాగ్ బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సతీష్ ఈ శునకాన్ని రూ. 20 కోట్లుపెట్టి ఈ ఏడాది జనవరిలో నగరానికి చెందిన ఓ డాగ్ బ్రీడర్ నుంచి కొనుగోలు చేశారు. తాజాగా నగరంలో పెట్ షో నిమిత్తం దీన్ని బెంగళూరు నుంచి తీసుకురాగా అది మార్గమధ్యలో కాస్త అలసటకు గురైంది. దీంతో మియాపూర్ మదీనాగూడలోని విశ్వాస్ పెట్ క్లినిక్‌లో దీనికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో అనేక పోటీల్లో తన శునకం పాల్గొని ఇప్పటివరకు 32 పతకాలు సాధించిందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రదర్శనలతోపాటు సినిమాల్లోనూ నటించిందని వివరించారు. దీనితోపాటు రూ. 10 కోట్ల విలువచేసే టిబెటన్ మాస్టిఫ్, రూ. 8 కోట్ల విలువచేసే అలాస్కన్ మాలమ్యూట్ జాతి శునకాలు తన వద్ద ఉన్నాయన్నారు. మూడేళ్ల వయసున్న కాడబామ్ హేడర్ రోజుకు 3 కేజీల చికెన్‌ను ఆహారంగా తీసుకుంటుందని... ఈ కుక్క కోసం నెలకు రూ. 3 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఇంతకంటే ఖరీదైన ప్యాలెస్ మరొకటి లేదు! ముఖేష్ అంబానీ యాంటిలియా దీని తరువాతే..
ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఇల్లు ఏదంటే, చాలామంది ముంబైలోని యాంటిలియా పేరు చెబుతారు. దీని కంటే ఖరీదైన ప్యాలెస్ మరొకటి ఉందంటే నమ్మడానికి కొంత సమయం పట్టొచ్చు, కానీ ఇది నిజం. ఈ ఖరీదైన ప్యాలెస్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బిలియనీర్ ముఖేష్ అంబానీ యాంటిలియా కంటే ఖరీదైన భవనం 'బకింగ్‌హామ్ ప్యాలెస్'. ఇది ప్రస్తుతం కింగ్ చార్లెస్ III నేతృత్వంలోని బ్రిటన్ రాజకుటుంబ నివాసం. 1703లో నిర్మించిన ఈ ప్యాలెస్ ప్రపంచంలో అత్యంత ఖరీదైనదిగా కీర్తి పొందుతోంది. 19వ శతాబ్దంలో క్వీన్ విక్టోరియా అధికారంలోకి వచ్చిన తరువాత ఈ రాజభవనాన్ని మళ్ళీ పునర్నిర్మించారు. ఆ తరువాత కూడా చాలా సంవత్సరాలు ఇది కొన్ని కొన్ని మార్పులు పొందుతూనే ఉంది. ప్రస్తుతం బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో 775 గదులు ఉన్నాయి. ఇందులో 19 స్టేటురూమ్‌లు, రాయల్స్, అతిథుల కోసం 52 బెడ్రూమ్లు, సిబ్బందికి 188 బెడ్రూమ్లు, 92 ఆఫీసులు, 78 బాత్రూమ్లు ఉన్నాయి. ఇదీ చదవండి: సినిమాలకు దూరంగా హీరోయిన్.. అయినా కోట్లు ఖరీదు చేసే అపార్ట్మెంట్ కొనేసింది! ఈ భవనం విక్రయిస్తే 4.9 బిలియన్ల కంటే ఎక్కువ డబ్బు రావొచ్చని అంచనా. ముఖేష్ అంబానీ విలాసవంతమైన యాంటిలియా ధర కంటే ఇది మూడు రెట్లు ఎక్కువ. బ్రిటీష్ వారు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలను పాలించినప్పటి నుంచి బకింగ్‌హామ్ ప్యాలెస్ అత్యంత విలువైన ఆభరణాలకు, సంపదకు నిలయంగా విరాజిల్లింది. ముఖేష్ అంబానీకి చెందిన యాంటిలియా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రెండవ ప్యాలెస్. దీని విలువ రూ. 15000 కోట్లు కంటే ఎక్కువ. 27 అంతస్తులు కలిగిన ఈ భవనంలో మొదటి ఆరు అంతస్తులలో అంబానీ కుటుంబంలోని వ్యక్తులు ఉన్నారు. మిగిలిన అంతస్తుల్లో ఎన్నెన్నో విలాసవంతమైన సదుపాయాలు ఉన్నట్లు సమాచారం. -
ప్రపంచంలోనే ఖరీదైన కాయిన్.. కిలోలకొద్దీ బంగారం, వజ్రాలు.. చూస్తే కళ్లు చెదరాల్సిందే!
World's Most Expensive Coin: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాయిన్‌ను బ్రిటన్‌లో ఆవిష్కరించారు. దివంగత క్వీన్ ఎలిజబెత్-2 (Queen Elizabeth 2) గౌరవార్థం ఈ నాణేన్ని రూపొందించారు. ఇది అన్ని కాలాలలో అత్యంత విలువైనదని భావిస్తున్నారు. దాదాపు 4 కిలోల బంగారం (Gold), 6,400 కంటే ఎక్కువ వజ్రాలతో (Diamonds) తయారు చేసిన ఈ నాణెం విలువ సుమారు 23 మిలియన్ డాలర్లు (రూ.192 కోట్లు) అని సీఎన్ఎన్ వార్తా సంస్థ నివేదించింది. (Birmingham bankrupt: బ్రిటన్‌లో సంచలనం.. దివాలా తీసిన ప్రముఖ నగరం!) లగ్జరీ లైఫ్ స్టైల్ బ్రాండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ తయారు చేసిన ఈ నాణేన్ని క్వీన్ ఎలిజబెత్-2 మొదటి వర్ధంతి సందర్భంగా విడుదల చేశారు. కామన్వెల్త్ దేశాల్లోని హస్తకళాకారులు 16 నెలలపాటు శ్రమించి దీన్ని తయారు చేశారు. దీన్ని మరింత ఘనంగా రూపొంచాలనుకున్నా వజ్రాల కొరత కారణంగా సాధ్యం కాలేదు. స్కై న్యూస్ ప్రకారం.. 9.6 అంగుళాల కంటే ఎక్కువ వ్యాసం కలిగిన ఈ నాణెం బాస్కెట్‌బాల్ పరిమాణంలో ఉంది. దీనిపై ప్రఖ్యాత పోర్ట్రెయిట్ కళాకారులు మేరీ గిల్లిక్, ఆర్నాల్డ్ మచిన్, రాఫెల్ మక్లౌఫ్, ఇయాన్ ర్యాంక్-బ్రాడ్లీలు దివంగత చక్రవర్తి చిత్రాలను తీర్చిదిద్దారు. దీని మధ్య భాగంలో అమర్చిన నాణెం 2 పౌండ్లపైగా బరువుంటుంది. చుట్టూ ఉన్న చిన్న నాణేలు ఒక్కొక్కటి ఒక ఔన్స్ బరువు కలిగి ఉంటాయి. నాణెం అంచుల్లో క్వీన్ సూక్తులను ముద్రించారు. 2021 జూన్ లో సోథెబైస్ న్యూయార్క్‌లో 18.9 మిలియన్ డాలర్లు పలికిన అరుదైన 1933 యూఎస్ "డబుల్ ఈగిల్" నాణెమే ఇప్పటి వరకు వేలంలో విక్రయించిన అత్యంత ఖరీదైనది. ఇది గిన్నిస్ వరల్డ్ రికార్ట్‌లో నమోదైంది. Introducing The Crown – a once in a lifetime tribute to The Queen An extraordinary tribute coin created to commemorate the enduring legacy of Her Majesty Queen Elizabeth II. We invite you to view the piece and the making of in more detail on our website. pic.twitter.com/SiZXjfvjPB — The East India Company (@TheEastIndia) September 7, 2023 -
వామ్మో రూ. 1.15 కోట్లు.. ఇది టీవీ ధర!
Samsung Micro LED TV: కోటి రూపాయల కంటే ఖరీదైన టీవీ గురించి ఎప్పుడైనా విన్నారా? రూ.1 కోటి కంటే ఎక్కువ ఖరీదు చేసే టీవీని ప్రముఖ టెలివిజన్ కంపెనీ భారతదేశంలో విడుదల చేసింది. 110-అంగుళాల భారీ మైక్రో ఎల్ఈడీ టీవీని రూ. 1,14,99,000 ధరకు శాంసంగ్ తాజాగా లాంచ్ చేసింది. అల్ట్రా-ప్రీమియం వీక్షణ అనుభవాన్ని ఇష్టపడే వినియోగదారుల కోసం మైక్రో ఎల్ఈడీ టీవీని రూపొందించనట్లు శాంసంగ్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ శామ్సంగ్ మైక్రో ఎల్ఈడీ టీవీ భూమిపై రెండో అత్యంత కఠినమైన పదార్థం నీలమణితో తయారు చేశారు. శాంసంగ్ మైక్రో ఎల్ఈడీ టీవీ ఆగస్ట్ 2 నుంచి దేశంలోని ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో, శాంసంగ్ అధీకృత వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. టీవీ ప్రత్యేకతలివే.. 24.8 మిలియన్ మైక్రోమీటర్-సైజ్ అల్ట్రా-స్మాల్ ఎల్ఈడీ అంటే పెద్ద సైజు ఎల్ఈడీలలో 1/10వ వంతు. ఆకట్టుకునే డెప్త్, వైబ్రెంట్ కలర్స్, అధిక స్థాయి స్పష్టత, కాంట్రాస్ట్ ద్వారా ఈ మైక్రో ఎల్‌ఈడీలన్నీ ఒక్కొక్కటిగా కాంతి రంగును ఉత్పత్తి చేస్తాయి. మైక్రో ఎల్ఈడీ టెక్నాలజీలో మైక్రో ఎల్ఈడీతోపాటు మైక్రో కాంట్రాస్ట్, మైక్రో కలర్, మైక్రో హెచ్డీఆర్, మైక్రో ఏఐ ప్రాసెసర్ ఉన్నాయి. ఓటీఎస్ ప్రో, డాల్బీ అట్మాస్, క్యూ-సింఫనీలతో కూడిన అరేనా సౌండ్ సిస్టమ్ ఇందులో ఉంటుంది. అద్భుతమైన త్రీడీ సౌండ్, సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తుంది. మైక్రో ఏఐ ప్రాసెసర్ మల్టీ-ఇంటెలిజెన్స్ ఏఐ అప్‌స్కేలింగ్, సీన్ అడాప్టివ్ కాంట్రాస్ట్, డైనమిక్ రేంజ్ ఎక్స్పాన్షన్+ పాత వీడియోలను కూడా మెరుగ్గా ప్రదర్శిస్తుంది. -
ప్రైవేట్ జెట్ ఉన్న ఈ టాప్ బిలియనీర్ల గురించి తెలుసా? (ఫొటోలు)
-
ప్రపంచం లోని టాప్-10 ఖరీదైన స్నీకర్స్
-
రూ. 1600 కోట్ల ఇంద్రభవనం అమ్మకానికి ఎక్కడో తెలుసా? భారతీయుడి మోజు
విలాసవంతమైన టవర్స్; లగ్జరీ భవనాలు, ఎత్తైన శిఖరాలకు పెట్టింది పేరైన దుబాయ్‌లో రియల్ ఎస్టేట్కున్న డిమాండ్ మామూలుది కాదు. వెర్సైల్స్‌ను తలపించే మార్బుల్ ప్యాలెస్ ధర వింటే షాక్‌వుతారు. మార్కెట్లో దీని ధర రూ. 1,600 కోట్లు (750 మిలియన్ దిర్హామ్‌ల) పలుకుతోంది. విలాసవంతమైన భవనాలు ఎక్కువగా ఉండే నగరంలో మార్కెట్లో అత్యంత ఖరీదైన ఇల్లు అమ్మకానికి వుంది. ఇలాంటి ఇంద్రభవనంపై మోజుపడుతున్నవారిలో భారతీయుడు ఉండటం విశేషం. మార్బుల్ ప్యాలెస్ అదిరిపోయే ఫీచర్లు రియల్ ఎస్టేట్ ఏజెంట్లచే "మార్బుల్ ప్యాలెస్" గా పిలుస్తున్న ఈ భవనాన్ని అతి ఖరీదైన ఇటాలియన్ మార్బుల్ స్టోన్‌తో నిర్మించారు. Luxhabitat Sotheby's International Realty విక్రయిస్తున్న ఈ భవన నిర్మాణం దాదాపు 12 సంవత్సరాలు పట్టిందట. 60వేల చదరపు అడుగుల ఇంటిలో ఐదు బెడ్రూమ్లు ఉంటాయి. ఇందులో మాస్టర్ బెడ్రూమ్ 4,000 చదరపు అడుగులు ఒక పెద్ద భవనాన్ని మించిఅన్నమాట. (ఫేస్బుక్ మూత పడనుందా? కోర్టు సంచలన వ్యాఖ్యలు) ఇంకా 15-కార్ల గ్యారేజ్, 19 రెస్ట్రూమ్లు, ఇండోర్ అలాగే అవుట్డోర్ పూల్స్, రెండు రూఫ్‌లు, 80,000 లీటర్ (21,000 గాలన్లు) కోరల్ రీఫ్ అక్వేరియం, ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్ ఎమర్జెన్సీ రూమ్‌లు తదితర ఫీచర్లలో ఉన్నాయి. ఇది 70 వేల చదరపు అడుగుల స్థలంలో గోల్ఫ్ కోర్స్‌కి ఎదురుగా ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో ఉంది. (అపుడు పాల ప్యాకెట్ కొనలేక పాట్లు, ఇపుడు 800 కోట్ల ఆస్తులు!) ఈ ఆస్తిని ఎవరైనా కొనుక్కెవచ్చు లేదా అద్దెకు తీసుకోవచ్చు, లేదా టెన్నిస్ లేదా పాడెల్ బాల్ కోర్ట్ కోసం ఉపయోగించవచ్చు అంటున్నారు. బ్రోకర్ కునాల్ సింగ్. ఈయన అంచనా ప్రకారం, కేవలం ఐదు నుండి పది మంది సంపన్నులు దీన్ని కొనుగోలు చేయగలరు. అంతేకాదు గత మూడు వారాల్లో కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఇంటిని చూశారు. ఇందులో రష్యాకు చెందిన కొనుగోలు ప్రతినిధి ఒకరు కాగా, రెండో కస్టమర్ ఎమిరేట్స్ హిల్స్‌లో ఇప్పటికే మూడు నివాసాలను కలిగి ఉన్న ఇండియన్ కావడం గమనార్హం. ఆయన భార్య ఇంకొంచెం మెరుగైన దాని కోసం చూస్తోందని అందుకే నిర్ణయం తీసుకోలేదని సింగ్ పేర్కొన్నాడు. -
టాప్ 10 అత్యంత ఖరీదైన మొక్కలు
-
ప్రపంచంలోని టాప్ 20 అత్యంత ఖరీదైన ఇళ్లు
-
రూ.2,500 కోట్ల భవంతి! ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది ఇదే..
ఫొటోలో కనిపిస్తున్న ఈ భవంతి విలువ తెలిస్తే ఆశ్చర్యపోతారు. ‘ది హోల్మ్’ అని పిలిచే దీని ప్రస్తుత ధర రూ. 2,500 కోట్లు పలికి, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భవంతిగా నిలిచింది. (వెంట వచ్చే రిఫ్రిజిరేటర్.. మొబైల్ ఫోన్లోనే కంట్రోలింగ్) లండన్‌లో 1818లో జార్జియన్ ప్రాపర్టీ డెవలపర్ జేమ్స్ బర్టన్ అనే వ్యక్తి దీనిని నిర్మించాడు. ముందు బర్టన్ వంశస్థులే ఇందులో నివాసం ఉండేవారు. కొద్ది రోజులు బర్టన్ కళశాలగా మార్చారు. ఆ తర్వాత ఆర్థిక పరిస్థితుల కారణంగా 1980లో ప్రైవేటు నివాసంగా మార్చారు. ఇక అప్పటి నుంచి అనేక సార్లు, అనేకమంది దీనిని మార్కెట్లో అమ్మకానికి ఉంచారు. ప్రతిసారి అనుకున్నదాని కంటే ఎక్కువ ధర పలుకుతూనే ఉంది. (నేను ‘మోనార్క్’ని... సెల్ఫ్‌డ్రైవింగ్ ట్రాక్టర్) గత సంవత్సరం సౌదీ రాజకుటుంబ సభ్యుల్లో ఒకరు దీనిని రూ.1500 కోట్లకు కొనుగోలు చేశారు. వారే ఇప్పుడు రూ.2,500 కోట్ల ధరకు అమ్మకానికి ఉంచారు. ఈ వేలం ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభం కానుంది. చూడాలి ఈసారి హోల్మ్ను దక్కించుకునే ఆ యజమాని ఎవరో! -
పంపించింది పెన్ను కాద్సార్! గన్ను!
పంపించింది పెన్ను కాద్సార్! గన్ను! -
దేశంలోనే ఖరీదైన పెంట్ హౌస్
ముంబై: దేశంలోనే అత్యంత ఖరీదైన పెంట్‌హౌస్‌ను వెల్స్పన్ గ్రూప్ చైర్మన్ బీకే గోయెంకా ఇటీవలే కొనుగోలు చేశారు. ముంబైలోని వర్లీ ప్రాంతం అన్నీబీసెంట్ రోడ్డులో ఉన్న లగ్జరీ టవర్లలో త్రీసిక్స్టీ వెస్ట్ ఒకటి. ఇందులోని పెంట్‌హౌస్ ఖరీదు రూ.240 కోట్లు. టవర్ 63, 64, 65 ఫోర్లలోని 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ పెంట్ హౌస్ కొనుగోలుకు సంబంధించిన వ్యవహారాలను గత బుధవారం బీకే గోయెంకా పూర్తి చేసినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం తెలిపింది. దేశంలో ఇప్పటి వరకు ఇదే అత్యంత ఖరీదైన అపార్ట్‌మెంటని పేర్కొంది. దీనిని ఆనుకునే ఉన్న మరో పెంట్‌హౌస్‌ను కూడా నిర్మాణ సంస్థ యజమాని వికాస్ ఒబెరాయ్ రూ.240 కోట్లు పెట్టి కొన్నట్లు ఆ కథనంలో వివరించింది. -
పెంట్ హౌస్ రూ.240 కోట్లా.. ఎక్కడో తెలుసా?
మీరు చదుతున్నది నిజమే. ముంబైలోని ఓ అపార్ట్మెంట్లోని పెంట్ హౌస్ రూ.240 కోట్లకు అమ్మడుపోయింది. ఈ అపార్ట్మెంట్ ముంబై నగరంలోని వోర్లీ ప్రాంతంలో ఉంది. వెల్సన్ గ్రూప్ చైర్మన్ బీకే గోయెంకా ఇంత భారీ మొత్తం చెల్లించి దీన్ని సొంతం చేసుకున్నారు. ఖరీదైన ఈ ట్విన్ టవర్స్ పేరు ‘360వెస్ట్’. ఇందులో 63, 64, 65 అంతస్థుల్లో ఈ పెంట్‌హౌస్ ఉంది. దీని విస్తీర్ణం 30వేల చదరపు అడుగులు. నగరంలో అత్యంత విలాసవంతమైన ‘360వెస్ట్’ అపార్ట్మెంట్లో ట్రిపులెక్స్ పెంట్ హౌస్ భారీ ధరకు అమ్ముడుపోయి అత్యంత భారీ అమ్మకాల్లో ఒకటిగా నిలిచింది. ఈ భారీ డీల్ బుధవారం జరిగింది. ఇందులో నివసించేందుకు పారిశ్రామికవేత్త ఈ ఖరీదైన ట్రిపులెక్స్ పెంట్ హౌస్‌ను కొనుగోలు చేశారు. అయితే పక్కగా ఉన్న మరో పెంట్ హౌస్‌ను బిల్డర్ వికాస్ ఒబెరాయ్ రూ.24 కోట్లకు కొనుగోలు చేయడం గమనార్హం. కాగా గత వారంలోనే ఒబెరాయ్ రియల్టీ సంస్థ.. ఈ విలాసమంతమైన ‘360వెస్ట్’ భవన సముదాయాన్ని రూ.4వేల కోట్లకు కొనుగోలు చేసినట్లు బీఎస్ఈ, ఎన్ఎస్సీల్లో నమోదు చేసుకుంది. ఇందులో 63 అపార్ట్‌మెంటులు ఉన్నాయి. ల్యాండ్ ఏరియా 5.25 లక్షల చదరపు అడుగులు. సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న సముదాయం రెండు భవంతులుగా ఉంటుంది. ఇందులో ఒకటి రెసిడెన్సియల్ ప్రాజెక్ట్ కాగా మరొకటి రిట్జ్-కార్ల్టన్ హోటల్. (ఇదీ చదవండి: ఓలా కొత్త స్కూటర్లు వచ్చేశాయి.. ధర ఎంతో తెలుసా?) -
ప్రపంచంలోనే ఖరీదైన బీరు ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే ఖరీదైనవి, విలువైనవి ఎవరికైనా ఆసక్తి ఎక్కువే. అందులోనూ పురాతనమైన వైన్, షాంపైన్ ఖరీదైన లగ్జరీ డ్రింక్స్‌గా మందుబాబులను ఊరిస్తూ ఉంటాయి. తాజాగా ఒక బీరు బాటిల్ అంత్యంత ఖరీదైన ధరతో వార్తల్లో నిలిచింది. ఈ బీరు బాటిల్ ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవ్వక తప్పదు. అవును ఈ బీరు బాటిల్ ధర అక్షరాలా ఐదు లక్షల డాలర్ల అంటే మన భారతీయ కరెన్సీలో రూ.4 కోట్ల పైనే అన్నమాట. 140 సంవత్సరాల క్రితం నాటి ‘అల్ సాప్స్ ఆర్కిటిక్ అలె’ వేలంలో అత్యంత ధర పలికి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా చరిత్ర కెక్కింది. ఒక వ్యక్తి ఈ బీరు బాటిల్‌ని 5,03,300 డాలర్లకు కొనుగోలు చేయడం విశేషం. అల్సాప్స్ అనే బీర్ల తయారు కంపెనీ దీన్ని తయారుచేసింది. దీంటోల ఆల్కహాల్ 10 శాతం ఉండటమే దీని ప్రత్యేకత అట. లండన్‌లోని పురాతన వస్తువులు, ఆర్ట్వర్క్కి సంబంధించిన ఆంటిక్ట్రేడ్ సమాచారం ప్రకారం, ఓక్లహోమాకు చెందిన ఒక కస్టమర్ 2007లో ఈబే ఆన్లైన్ వేలంలో దీన్ని 304 డాలర్లకు సొంతం చేసుకున్నాడు. ఈ బీరు బాటిల్‌ని స్టోర్‌లో వేలానికి పెడితే 157 మంది పోటీపడ్డారు. మసాచుసెట్స్ రాష్ట్రానికి చెందిన ఒక వ్యాపారి ఈ బీరు బాటిల్‌కి డెలివరీ ఛార్జి కింద 19.5 డాలర్లు తీసుకున్నాడని వెల్లడించింది. ఈ బీరు బాటిల్‌పైన పాత పేపర్‌తో లామినేటెడ్ కవర్ ఉంది. ఆ కాగితం మీద చేతితో రాసిన అక్షరాలు, పెస్సీ జి.బోల్స్టర్ అనే పేరుతో సంతకం ఉంది. అందులో ‘ఈ బాటిల్ 1919లో నా దగ్గర ఉంది’ అని రాసి ఉంది. ఆ నోట్‌ని బట్టి ఈ బీరు బాటిల్‌ని ధ్రువ ప్రాంతాలకు వెళ్లేవాళ్ల కోసం 1852లో ప్రత్యేకంగా తయారుచేశారు అన్నట్లుగా తెలుస్తోంది. కాగా సర్ ఎడ్వర్డ్ బెల్చర్ అనే నౌకాదళం అధికారి ఆర్కిటిక్ చల్లటి వాతావరణానికి తగ్గట్టుగా ఒక బీరు బాటిళ్లను తయారుచేయాలని 1852లో అల్సాప్స్ కంపెనీని కోరాడట. అందుకని ఆర్కిటిక్ ధ్రువంలో గడ్డకట్టకుండా ఉండేందుకు ఆల్కహాల్ శాతం ఎక్కువ (10శాతం) ఉండేలా ఈ బీరుని తయారుచేశారు. ఎడ్వర్డ్ ఈ బీరు బాటిళ్లను బ్రిటీష్ నౌకాదళం అధికారి, ఆర్కిటిక్ యాత్రికుడు సర్ జాన్ ఫ్రాంక్లిన్, అతని టీం కోసం ఆర్కిటిక్ ధ్రువానికి పంపించాడని యాంటిక్ ట్రేడ్ వెబ్సైట్ తెలియజేస్తోంది.ఎరేబస్, టెర్రర్ , వారి సిబ్బందిని కనుగొనడానికి రెస్క్యూ ప్రయత్నాల తర్వాత బీర్ బాటిల్ కనుగొన్నారట. దురదృష్టవశాత్తు, ఇద్దరు సిబ్బందికి సంబంధించిన ఆధారాలు ఎప్పుడూ కనిపించలేదు. -
ప్రపంచంలోనే ఖరీదైన ద్రాక్ష, ఒక్కోటి రూ.35వేలు
సాక్షి, న్యూఢిల్లీ: మొన్న ఖరీదైన మామిడి పళ్లు గురించి విన్నాం.ఇపుడిక ప్రపంచంలోనే అతి ఖరీదైన, అరుదైన ద్రాక్ష పండ్లు గురించి తెలుసుకుందాం. ప్రపంచంలో అనేక రకాల ద్రాక్షలు కనిపిస్తాయి. కానీ చక్కటి రంగు,రుచితో పింగ్‌పాంగ్ బంతి సైజులో ఉండే ‘రూబీ రోమన్ ద్రాక్ష’ ప్రత్యేకతే వేరు. ఈ రకానికి చెందిన ప్రతి ద్రాక్ష బరువు 20 గ్రాముల కంటే ఎక్కువే. రుచిలో కూడా రాయల్‌గా ఉంటాయి. అయితే వీటిని కొనాలంటే మాత్రం జేబుకు భారీ చిల్లు తప్పదు. ఐఫోన్, తులం బంగారం కంటే కంటే ఎక్కువ పెట్టాల్సిందే. ఇంతకీ ఏంటబ్బా అంత స్పెషాలీటీ! రూబీ రోమన్ ద్రాక్ష అని పిలిచే ఈ ద్రాక్ష తక్కువ పుల్లగా, ఎక్కువ తీపిగా, జ్యూసీగా జ్యూసీగా ఉంటుంది. అందుకే అంత పాపులర్. ఈ ద్రాక్ష కిలో ధర 11 వేల డాలర్లు. అంటే అక్షరాలా రూ.7.5 లక్షలు. షాకవ్వకండి..ఇది నిజం. అందుకే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ద్రాక్షగా ఖ్యాతి దక్కించుకుంది. రూబీ రోమన్ ద్రాక్ష జపాన్‌లో 2019లో రికార్డు ధరకు అమ్ముడుపోయింది. ఫైల్ ఫోటో జపాన్‌లోని ఇషికావా దీవిలో పరిమిత సంఖ్యలో రుబీ రోమన్ ద్రాక్ష పండ్లను పండిస్తారు. 2008 నుంచి పండించడం మొదలుపెట్టారు. జపనీస్ లగ్జరీ ఫ్రూట్ మార్కెట్లో వీటికి చాలా డిమాండ్. ఈ ద్రాక్షనుమొదట మార్కెట్లో విక్రయించరు. వేలంలో అధిక ధర చెల్లించిన వారికి మాత్రమే సొంతం. అందుకే దీన్ని కొనుగోలు చేసేందుకు ఔత్సాహికులు క్యూ కడతారు. ప్రతీ ఏడాది రికార్డు ధరను సొంతం చేసుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. 2019లో ఈ ద్రాక్షను కనజవాలో వేలానికి పెట్టగా, జపాన్‌కు చెందిన హయాకురాకుసో అనే సంస్థ ఈ ద్రాక్ష గుత్తిని వేలంలో గెలుచుకుంది. మొత్తం 24 ద్రాక్ష పండ్ల గుత్తిని 12 లక్షల యెన్లకు సొంతం చేసుకుంది. అంటే ఒక ద్రాక్ష ధర సుమారు రూ.35 వేలన్న మాట. మార్కెట్లో ప్రవేశపెట్టిన గత 11 ఏళ్లలో ఎన్నడూ ఇంత ధర పలకలేదని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ అసోసియేషన్ వెల్లడించింది. కాగా సాధారణ రోజుల్లో ఈ ద్రాక్ష గుత్తి ధర 460 డాలర్లు (రూ.31,537) వరకు ఉంటుందని స్థానిక రైతులు చెప్పారు. అలాగే వీటిని ఎక్కువగా ఇతరులకు బహుమతిగా ఇచ్చేందుకు కొనుగోలు చేస్తారనీ, వీఐపీ గెస్టులకు గిఫ్ట్‌గా ఇచ్చేందుకు కొన్ని విలాసవంతమైన హోటల్స్ కొనుగోలు చేస్తుంటాయని తెలిపారు. కాగా మధ్యప్రదేశ్‌లోని ఒక జంట జపనీస్ మియాజాకి మామిడి పండ్లను పండించి ఇటీవల వార్తల్లోకె క్కిన సంగతి తెలిసిందే.కిలోకు రూ.2.70 లక్షలతో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడిగా రికార్డు కొట్టేసిన వీటి రక్షణకు నలుగురు భద్రతా సిబ్బందిని, ఆరుకుక్కలను ఏర్పాటు చేసుకోవడం విశేషంగా నిలిచింది. -
174 కోట్లకు రిస్ట్ వాచ్ వేలం!
న్యూఢిల్లీ : ‘పాటక్ ఫిలిప్పీ గ్రాండ్ మాస్టర్ చిమ్’గా వ్యవహరించే అత్యంత క్లిష్టమైన, ఖరీదైన చేతి గడియారాన్ని ‘క్రిష్టీ’ వేలం వేయగా ఓ ప్రైవేటు బిడ్డర్ ఏకంగా 24.2 మిలియన్ డాలర్ల (దాదాపు 174 కోట్ల రూపాయలు)కు కొనుగోలు చేశారు. జెనీవాలోని డెస్ బెర్గూస్ నగరంలోని ఫోర్ సీజన్ హోటల్ నుంచి ఓ ప్రైవేట్ బిడ్డర్ దీనిని కొనుగోలు చేశారు. వాస్తవానికి దీనికి రెండు మిలియన్ పౌండ్ల ధర పలక వచ్చని వేలం నిర్వాహకులు అంచనా వేశారు. ఎవరి ఊహలకు అందనంతగా ధర పలకడం ఆశ్చర్యమని, ప్రపంచంలోనే ఇప్పటి వరకు గడియారాల వేలంలో ఇంత ధర పలకడం ఇదే మొదటి సారని, ఇది ప్రపంచ రికార్డని వారు వ్యాఖ్యానించారు. 2017లో హాలివుడ్ నటుడు పాల్ న్యూమన్ తన డెటోనా చేతి గడియారాన్ని వేలం వేయగం 13.5 మిలియన్ పౌండ్లకు (దాదాపు 124 కోట్ల రూపాయలు) అమ్ముడు పోయింది. అప్పటికి అదే ప్రపంచ రికార్డు. ఈ పాటక్ ఫిలిప్పీ గ్రాండ్ మాస్టర్ గడియారాన్ని తయారు చేయడం చాలా సంక్లిష్టమట. ఇందులో మరో విశేషముంది. దీని డయల్ స్క్రీన్‌ను నలుపులోకి గులాబీ రంగులోకి ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు. ఈ గడియారం వేలం ద్వారా వచ్చిన మొత్తం డబ్బులను చారిటీకే వెళతాయని జెనీవాలోని క్రిష్టీ వేలం సంస్థ యజమాని సబైన్ కెగెల్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా డీఎండీగా పిలిచే మజిల్ డిజార్డర్‌తో బాధ పడుతున్న రోగులకు వైద్య చికిత్సలు అందించడం కోసం పాటక్ ఫిలిప్పీ సహా 50 ఖరీదైన గడియారాలు వేలానికి వచ్చాయని, వాటన్నింటిని దాతలు ఉచితంగా ఇచ్చారని, తాము కూడా ఎలాంటి చార్జీలు వసూలు చేయకుండానే వేలం వేశామని సబైన్ కెగెల్ వివరించారు. 174 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన బిడ్డర్ వివరాలను తెలియజేయడానికి క్రిస్టీ నిర్వాహకులు నిరాకరించారు. -
ఆ నెంబర్ ప్లేట్ జస్ట్ రూ.132 కోట్లు మాత్రమే...!
భారతీయులకు ఫ్యాన్సీ నెంబర్లున్న వాహనాలంటే ఎంత క్రేజే మనందరికీ తెలిసిందే. సినిమాస్టార్స్, వ్యాపారవేత్తలు, ఇతర రంగాల సెలబ్రెటీలు మొదలుకుని ఒకస్థాయి వారి వరకు తమ వాహనానికి కోరుకున్న అంకెలున్న రిజిస్ట్రేషన్ నెంబర్ కోసం ఉవ్విళ్లూరుతున్నారు. మనదేశంలో ప్రాంతీయ రవాణా సంస్థల వేలంలో 9999, 6666, 1234, 786, AK 47. 8055 (ఇంగ్లిష్ అక్షరాల్లో బాస్‌గా కనిపించే సారూప్యత కారణంగా) ఇలా వారి వారి అభిరుచులకు అనుగుణంగా కార్లు, ద్విచక్ర వాహనాల నెంబర్లు కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇలాంటి లక్కీ నెంబర్‌ను ఎంత ధరకు దక్కించవచ్చునని అనుకుంటున్నారు ? లక్షో, రెండు లక్షలో అంతగా కాకపోతే, మరీ ఇష్టపడి తప్పనిసరిగా పలానా నెంబర్‌నే దక్కించుకోవాలని అనుకుంటే ఎక్కువలో ఎక్కువ 20 లక్షల వరకు పెట్టవచ్చునని ఉదారంగా అంచనా వేసుకోవచ్చు. కానీ...ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, అరుదైన ఈ నెంబర్ ప్లేట్ ధర అక్షరాలా రూ. 132 కోట్లు. ఇంత డబ్బుకు 4,500 మారుతి సుజుకి ఆల్టో కార్లు,, పది విలువైన బుగాటి వేయ్రాన్స్ కార్లు వస్తాయి. శ్రీమంతులైన కస్టమర్లు కోరుకున్న విధంగా హై ఎండ్ లగ్జరీ కార్లకు అదనపు సొబగులు, మరిన్ని ప్రత్యేకతలు కల్పిస్తున్న ప్రపంచ ప్రసిద్ద ‘ఖాన్ డిజైన్స్’ అధిపతి అఫ్జల్ ఖాన్ 1.45 కోట్ల పౌండ్లకు ఈ నెంబర్‌ను బ్రిటన్‌లో వేలానికి పెట్టాడు. ఇంతకీ ఈ నెంబర్ ఏమిటంటే...అత్యంత వేగంగా నడిపే కార్లతో పోటీ నిర్వహించే అంతర్జాతీయ క్రీడకు ప్రాతినిధ్యంగా నిలిచే ఎఫ్–1 (ఫార్మూలా–1) అనే నెంబర్ అది. ఎఫ్ అక్షరంతో పాటు ఒకే డిజిట్ 1 అంకె కారణంగా ఇది ప్రత్యేకంగా నిలుస్తోంది. ప్రస్తుతం ఈ నెంబర్‌ను ఖాన్ తన బుగాటి వేయ్రాన్ కారుకు ఉపయోగిస్తున్నాడు. 2008లో ఈ నెంబర్‌ను ఆయన దాదాపు రూ. 4 కోట్లకు (6.19 లక్షల డాలర్లకు) కొన్నాడు. ఇప్పుడు దానిని 3,200 శాతం ఎక్కువ లాభానికి అమ్మాలని అనుకుంటున్నాడు. 1904 నుంచి 104 ఏళ్ల పాటు ఈ నెంబర్ ప్లేట్‌కు ఎసెక్స్ సిటీ కౌన్సిల్ సొంతదారుగా ఉంది. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఈ దేశాల్లో ఐఫోన్లు చాలా ఖరీదైనవి!
ఐఫోన్ బ్రాండు అంటేనే.. కొంచెం ఖరీదైనది. వాటిని కొనాలంటే డబ్బులెక్కువ వెచ్చించాల్సిందే. అయితే బ్రెజిల్, ఇండియా, స్వీడన్, డెన్మార్క్ లేదా ఇటలీ వెళ్లినప్పుడు అసలు ప్రయాణికులు తమ ఐఫోన్లను చేజార్చుకోవద్దని డ్యుయిస్ బ్యాంకు చెబుతోంది. ఎందుకో తెలుసా? ఈ దేశాల్లో ఐఫోన్ ధరలు భారీగా ఉంటాయట. ఒకవేళ ఈ దేశాల ప్రయాణంలో ఐఫోన్లను పోగొట్టుకుంటే, మళ్లీ దాన్ని కొనుకోవాలంటే కొంచెం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సిందేనని చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్పత్తుల ధరలతో డ్యుయిస్ బ్యాంకు ప్రతేడాది ఓ వార్షిక రిపోర్టు తయారుచేస్తోంది. ఈ రిపోర్టులో గ్లోబల్ సిటీలోని 20కి పైగా కామన్ ఉత్పత్తుల ధరలను ఇతర దేశాలతో పోల్చి చూపిస్తోంది. ఈ మేరకు డ్యుయిస్ బ్యాంకు 2016 సంవత్సరానికి గాను విడుదల చేసిన రిపోర్టులో ఐఫోన్ ఏయే దేశాల్లో అత్యంత ఖరీదైనదో వెల్లడించింది. బ్రెజిల్ స్థానిక కరెన్సీతో పోలిస్తే అమెరికా డాలర్ల విలువ గతేడాది కంటే దిగొచ్చింది. కానీ ఐఫోన్ ధర మాత్రం బ్రెజిల్లో తగ్గలేదని తెలిపింది. ఐఫోన్ ధరలు అత్యధికంగా ఉన్న టాప్ దేశాలు దేశం 2016 ధర(డాలర్లలో) బ్రెజిల్ 931 ఇండోనేషియా 865 స్వీడన్ 796 ఇండియా 784 ఇటలీ 766 -
మలేసియా విమానం : అతి ఖరీదైన అన్వేషణగా రికార్డ్
పెర్త్: తప్పిపోయిన మలేసియా విమానం గాలింపు అతి ఖరీదైన అన్వేషణగా రికార్డులకు ఎక్కనుంది. కౌలాలంపూర్ నుంచి 227 మంది ప్రయాణికులు 12 మంది సిబ్బందితో చైనా రాజధాని బీజింగ్ బయలుదేరిన మలేషియా ఎయిర్‌లైన్స్ బోయింగ్ 777 విమానం ఎంహెచ్370 గత నెల 8వ తేది అదృశ్యమైన విషయం తెలిసిందే. ఇందులో అయిదుగురు భారతీయులు కూడా ఉన్నారు. ఈ విమానం కోసం 26 దేశాలకు చెందిన వైమానిక, నావికా దళాలు గాలించాయి. ఈ విమానం కోసం నెలరోజుల అన్వేషణకు ఇప్పటికే నాలుగు కోట్ల 40 లక్షల అమెరికన్ డాలర్లు ఖర్చయినట్లు రాయిటర్స్ అంచనా. 2009లో కూలిన ఎయిర్ ఫ్రాన్స్ విమానం కోసం రెండేళ్లు గాలించారు. దానికి అయిన ఖర్చుతో ఇది దాదాపుగా సమానం. ఇదిలా ఉండగా, ఈ విమానం బ్లాక్ బాక్స్ కోసం అన్వేషణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ రోజు కూడా ఈ అన్వేషణలో 11 మిలటరీ విమానాలు, మూడు పౌర విమానాలు, 14 షిప్‌లు పాల్గొన్నాయి.