మన ప్రాథమిక అవసరాల్లో నీరు కూడా ఒకటి. నీరు లేకుండా భూమిపై మనుగడ సాగించడం అనేది అసాధ్యం. పెరుగుదలకు, నిర్వహణకు ఎంతో అవసరం నీరు. మానవ శరీరం దాదాపు 60% నీటితోనే ముడిపడి ఉంటుంది. మానవ శరీర పనితీరుకు అత్యంత అవసరం ఇది. ముఖ్యంగా జీర్ణక్రియ, శోషణ,పోషకాల రవాణాను సులభతరం చేయడంలో నీను ప్రధాన పాత్ర పోషిస్తుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. సెల్యులార్ ఫంక్షన్‌కు మద్దతు ఇస్తుంది. వంట చేసే దగ్గర నుంచి క్లీన్ చేయడానికి, చెట్లకు, జంతుజాలం ఉనికికి నీరు అవసరం. అలాంటి నీరుని అత్యంత ధరల్లో కూడా విక్రయిస్తారనే విషయం గురించి విన్నారా?. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్ ఒకటి ఉంది. ఒక లీటర నీటికే ఎంత వెచ్చించాలో వింటే కంగుతింటారు. ఎందుకంతా అంటే..
ఈ నీటిని చాలా ప్రత్యేకంగా తయారు చేయడం, దాని స్వచ్ఛత, ఫ్యాకేజింగ్ విధానం తదితరాల కారణంగా అంత లగ్జరీయస్ ఉంటుంది ఈ వాటర్ బాటిల్ ధర. వీటిని ప్రసిద్ధి బ్రాండ్ విడుదల చేస్తుంది. దీనిని ఫిల్లికో జ్యువెలరీ వాటర్ అని పిలుస్తారు. ఈ బాటిల్స్‌ని స్వరోవ్స్కీ స్పటికాలతో అలంకరిస్తారు. చక్కటి ఆభరణాల ముక్కలతో డిజైన్ చేస్తారు. అందువల్ల దీని ధర అంత రేంజ్‌లో ఉంటుంది. జపాన్‌లో కోబ్‌లోని సహజమైన నీటి బుగ్గ నుంచి తీసుకున్న నీరు ఇది.
నాణ్యతకు ప్రసిద్ధి చెందింది. దీనికి తగ్గట్టుగా బాటిల్ డిజైన్ కూడా లగ్జరియస్‌గా ఉంటుంది. ప్రతి బాటిల్‌ని బంగారంతో డిజైన్ చేస్తారు. ఈ డిజైన్‌ని జపాన్ హస్తకళను హైలెట్ చేసేలా రూపొందిస్తారు. కొన్నిబ్రాండ్‌లు బంగారం, ప్లాటినం, అంతకంటే విలువైన రాళ్లతో డిజైన్ చేస్తారు. ఆ బాటిల్‌కి ప్రత్యేకమైన ఆకర్షణను తీసుకురావడమే గాకుండా అంత డబ్బు వెచ్చించి కొనుగోలు చేస్తున్నందుకు తగ్గట్టుగా ఆ బాటిల్ లుక్ ఉంటుంది. ఇంతకీ ఈ బాటిల్ లీటర్ నీటి ధర ఏకంగా రూ. 1,16,000/-
(చదవండి: చీరకట్టులో హులా హూపింగ్..అథ్లెటిక్ సామర్థ్యాలతో..!)
Comments
Please login to add a commentAdd a comment