భారతదేశం అటు సంప్రదాయం, ఇటు ఆధునికత కలగలిసిన దేశం. దేశంలోని రియల్ ఎస్టేట్ రంగంలోనూ ఇది స్పష్టంగా కనిపిస్తుంది. వ్యాపారవేత్త ముఖేష్ అంబానీకి చెందిన ఐకానిక్ హౌస్ ‘యాంటిలియా’ నుంచి హీరో షారుక్ ఖాన్‌కు చెందిన విలాసవంతమైన ‘మన్నత్’ వరకు.. అన్నీ విలాసవంతమైన, ఆధునిక భవన నిర్మాణాలకు ఉదాహరణగా నిలిచాయి. భారతదేశంలో అత్యంత ఖరీదైన బంగ్లాలలో ఇవి కొన్ని..
1. యాంటిలియా: ముఖేష్ అంబానీ
దేశంలోని అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ ఇల్లు యాంటిలియా అత్యంత ఖరీదైన ఇళ్ల జాబితాలో నంబర్ వన్ ప్లేస్‌లో ఉంది. దక్షిణ ముంబైలోని ఈ భవనం మొత్తం 27 అంతస్తులను కలిగి ఉంది. 15వ శతాబ్దపు స్పానిష్ ద్వీపం పేరు ఈ భవనానికి పెట్టారు. జీక్యూ ఇండియా తెలిపిన వివరాల ప్రకారం ఈ భవనం విలువ ఒకటి నుండి రెండు బిలియన్ డాలర్ల మధ్య ఉంటుంది. ఇది బకింగ్‌హామ్ ప్యాలెస్ తర్వాత ప్రపంచంలో రెండవ అత్యంత ఖరీదైన ఇల్లు. యాంటిలియాలో హెల్త్ స్పా, బహుళ స్విమ్మింగ్ పూల్స్, థియేటర్, యోగా, డ్యాన్స్ స్టూడియో, బాల్‌రూమ్, ఐస్‌క్రీమ్ పార్లర్, మూడు హెలిప్యాడ్‌లు, హ్యాంగింగ్ గార్డెన్‌లు, పార్కింగ్ స్థలం మొదలైన ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి.
2. మన్నత్: షారుక్ ఖాన్
అరేబియా సముద్రపు అలల సుందర దృశ్యాలను చూపే ‘మన్నత్’ బాలీవుడ్ రారాజు షారుక్ ఖాన్ నివాసం. ముంబైలోని బాంద్రాలో ఉన్న ఈ బంగ్లా ఖరీదు రూ.200 కోట్లకు పైమాటే. అతని భార్య గౌరీ ఖాన్ ఈ ఆరు అంతస్తుల భవనాన్ని తన ఆలోచనల మేరకు తీర్చిదిద్దారు. ఇంటీరియర్‌ను అద్భుతంగా రూపొందించారు. ఈ భవనంలో జిమ్, లైబ్రరీ, స్విమ్మింగ్ పూల్, ప్రైవేట్ సినిమా, అందమైన టెర్రస్ ఉన్నాయి.
3. గులిత: ఆనంద్ పిరమల్
ముకేశ్ అంబానీ కుమార్తె ఇషా అంబానీని ఆనంద్ పిరమల్ వివాహం చేసుకున్నారు. ఈ సందర్భంగా పిరమల్ గ్రూప్ చైర్మన్ అజయ్ పిరమల్ తన కుమారుడు ఆనంద్ పిరమల్‌కు ఈ విలాసవంతమైన ఇంటిని బహుమతిగా ఇచ్చారు. ముంబైలోని ఈ ఐదు అంతస్తుల డైమండ్ ఆకారపు భవనం అద్భుతానికి ఉదాహరణగా నిలిచింది. దీని రీగల్ డిజైన్ కారణంగా బయట నుండి ఎంతో అందంగా కనిపిస్తుంది. జీక్యూ ఇండియా అంచనా ప్రకారం ఈ బంగ్లా విలువ సుమారు రూ.450 కోట్లు. ఈ గ్రాండ్ డైమండ్ ఆకారపు భవనంలో ప్రైవేట్ పూల్, అండర్ గ్రౌండ్ పార్కింగ్, స్పేస్ డైనింగ్ ఏరియా, డైమండ్ రూమ్ తదితర లగ్జరీ సౌకర్యాలు ఉన్నాయి.
4. జతియ హౌస్: కుమార్ మంగళం బిర్లా
ముంబైలోని మలబార్ హిల్‌లోని జతియ హౌస్ ప్రముఖ వ్యాపారవేత్త కుమార్ మంగళం బిర్లా నివాసం. ఈ బంగ్లా 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. జీక్యూ ఇండియా తెలిపిన వివరాల ప్రకారం ఈ బంగ్లా ఖరీదు రూ. 425 కోట్లు. విలాసవంతమైన ఇంటీరియర్ ఈ భవనం సొంతం. అందమైన సముద్ర దృశ్యం భవనానికి ప్లస్ పాయింట్. ఈ భవనంలో 20 పెద్ద బెడ్‌రూమ్‌లు, ఓపెన్ యార్డ్, గార్డెన్ మొదలైనవి ఉన్నాయి.
5. జేకే హౌస్: గౌతమ్ సింఘానియా
ముంబైలోని బ్రీచ్ కాండీ ప్రాంతంలో ఉన్న జేకే హౌస్ వ్యాపార దిగ్గజం గౌతమ్ సింఘానియా నివాసం. గౌతమ్ సింఘానియా రేమండ్ గ్రూప్ చైర్మన్. ఈ 30 అంతస్తుల భవనం ఆధునిక డిజైన్‌తో రూపొందింది.అరేబియా సముద్ర దృశ్యాలు భవనంలోని వారిని అలరిస్తాయి. జీక్యూ ఇండియా తెలిపిన వివరాల ప్రకారం ఈ భవనం విలువ సుమారు రూ. ఆరు వేల కోట్లు. ఇందులో రెండు స్విమ్మింగ్ పూల్స్, ఐదు పార్కింగ్ అంతస్తులు, హెలిప్యాడ్, స్పా, జిమ్, హోమ్ థియేటర్ మొదలైన ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment