Billionaires
-
ట్రిలియనీర్లు వచ్చేస్తున్నారహో!
దావోస్: ఇప్పటిదాకా మనం కుబేరులను చూసే అబ్బో అనుకుంటున్నాం.. ఇకపై ట్రిలియనీర్ల సంగతి విని నోరెళ్లబెట్టాల్సిందే! ప్రపంచవ్యాప్తంగా కుబేరుల సంపద కుప్పలుతెప్పలుగా పెరిగిపోతోంది మరి. వచ్చే దశాబ్ద కాలంలోనే కనీసం ఐదుగురు ట్రిలియనీర్లుగా (ట్రిలియన్ అంటే లక్ష కోట్ల డాలర్లు. మన కరెన్సీలో రూ.86 లక్షల కోట్లు) అవతరించనున్నారట!! స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు సందర్భంగా ‘టేకర్స్, నాట్ మేకర్స్’ పేరుతో విడుదల చేసిన నివేదికలో ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ ఈ విషయాన్ని వెల్లడించింది.2024లో ప్రపంచ బిలియనీర్ల సంపద ఏకంగా 2 ట్రిలియన్ డాలర్లు దూసుకెళ్లింది. 2023తో పోలిస్తే మూడింతల వేగంగా వృద్ధి చెంది 15 ట్రిలియన్ డాలర్లకు ఎగబాకడం విశేషం. ప్రస్తుతం 440 బిలియన్ డాలర్ల సంపదతో కుబేరుల కింగ్‌గా ప్రపంచాన్ని ఏలుతున్న ఎలాన్ మస్‌్క.. తొలి ట్రిలియనీర్ రేసులో స్పేస్ఎక్స్ రాకెట్లా దూసుకుపోతున్నారు. ఆయన తర్వాత రెండో స్థానంలో ఉన్న అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ సంపద మస్్కతో పోలిస్తే దాదాపు సగమే (239 బిలియన్ డాలర్లు)!అసమానతలు పెరిగిపోతున్నాయ్ ప్రపంచ కుబేరుల సంపదలో 60 శాతం వారసత్వంగా, గుత్తాధిపత్య బలం, రాజకీయ సంబంధాల ద్వారానే సమకూరుతోందని, వాళ్ల స్వశక్తితో సంపాదించినది కాదని కూడా ఆక్స్‌ఫామ్ నివేదిక పేర్కొంది. 1990 నుంచి ఇప్పటిదాకా పేదల స్థితిగతులు ఏమాత్రం మారలేదని స్పష్టం చేసింది. విచ్చలవిడి సంపద వృద్ధికి అడ్డుకట్ట వేసి, సమాజంలో నెలకొన్న తీవ్ర ఆర్థిక అసమానతలను తగ్గించాలంటే బిలియనీర్లపై భారీగా పన్నులు విధించాల్సిన అవసరం ఉందని కూడా ప్రభుత్వాలను అభ్యర్థించింది. ‘వలసవాదంతో వివిధ దేశాల నుంచి సంపదను కొల్లగొట్టిన కొన్ని అగ్ర రాజ్యాలు వాటికి తగిన మూల్యాన్ని చెల్లించాలి.ప్రపంచంలో కోట్లాది మంది ఆకలితో అలమటిస్తుంటే.. కుబేరుల సంపద మాత్రం ఆకాశమేహద్దుగా ఎగబాకుతుండటం ఆందోళనక కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంపద సృష్టిలో అత్యధిక మొత్తం బహుళజాతి కార్పొరేట్ కంపెనీల చేతిలోకి వెళ్లిపోతోంది. ఈ ఆధునిక వలసవాదం మరింత ఆందోళనకరం. కోట్లకు పడగలెత్తిన కుబేరులపై పన్నుల మోత మోగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమితాబ్ బెహర్ పేర్కొన్నారు.అమెరికా అధ్యక్షుడిగా బిలియనీర్ ట్రంప్ పగ్గాలు చేపడుతుండగా.. ఆయన సలహాదారుగా ప్రపంచ అపరకుబేరుడు మస్క్ ఉన్నారని, ప్రపంచానికి ఇదొక మేల్కొలుపుగా అభిప్రాయపడ్డారు. అమెరికా చరిత్రలోనే తొలిసారిగా ట్రంప్ కేబినెట్లో ఏకంగా 13 మంది బిలియనీర్లు కొలువుదీరిన విషయాన్ని బెహర్ ప్రస్తావించారు. రిపోర్ట్ హైలైట్స్...⇒ ప్రపంచంలో టాప్–10 అపర కుబేరుల సంపద 2024లో రోజుకు 10 కోట్ల డాలర్ల చొప్పున ఎగబాకింది. వారి సంపద రాత్రికిరాత్రి 99 శాతం ఆవిరైపోయినా కూడా బిలియనీర్లుగానే కొనసాగుతారు. ⇒ ప్రపంచంలోని మొత్తం బిలియనీర్ల సంపద సగటున రోజుకు 570 కోట్ల డాలర్ల చొప్పున పెరిగింది.⇒ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తదితర గ్లోబల్ నార్త్ దేశాల్లోని 1% అపర కుబేరులకు గ్లోబల్ సౌత్ దేశాల ఆర్థిక వ్యవస్థల నుంచి గంటకు 3 కోట్ల డాలర్ల సంపద బదిలీ అవుతోంది.⇒ ప్రపంచ జనాభాలో గ్లోబల్ నార్త్ దేశాల వాటా 21 శాతమే అయినప్పటికీ... ప్రపంచ సంపదలో 69 శాతం ఆ దేశాలదే!కొత్త కుబేరులు రయ్ 2024లో మొత్తం కుబేరుల సంఖ్య 2,769కి ఎగబాకింది. 2023లో ఉన్న 2,565 మంది బిలియనీర్లతో పోలిస్తే కొత్తగా 204 మంది ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. అంటే సగటున వారానికి నలుగురు బిలియనీర్లు ఆవిర్భవించినట్లు లెక్క. ఇక ఆసియా నుంచి కొత్తగా 41 మంది కొత్త బిలియనీర్లు అవతరించారు. ఆసియా బిలియనీర్ల మొత్తం సంపద గతేడాది 299 బిలియన్ డాలర్లు దూసుకెళ్లింది. -
రూ.1,275 లక్షల కోట్లకు ప్రపంచ కుబేరుల సంపద
ప్రపంచ కుబేరుల సంపద అనూహ్యంగా 2024లో 2 ట్రిలియన్ డాలర్ల(రూ.170 లక్షల కోట్లు)కు పెరిగి 15 లక్షల కోట్ల డాలర్ల (రూ.1275 లక్షల కోట్ల)కు చేరిందని ఆక్స్‌ఫామ్(Oxfam) తాజా నివేదిక వెల్లడించింది. ఇది రోజుకు 5.7 బిలియన్ డాలర్లకు సమానమని తెలిపింది. ఇది గతేడాది కంటే మూడు రెట్లు పెరుగుదలను సూచిస్తుంది. ఇది అతి సంపన్నుల సంపద పెరుగుదలను, ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాల మధ్య పెరుగుతున్న ఆర్థిక అసమానతలను నొక్కి చెబుతుంది.నివేదికలో కీలక అంశాలు‘టేకర్స్ నాట్ మేకర్స్’ అనే శీర్షికతో రూపొందించిన ఆక్స్‌ఫామ్ నివేదికలో బిలియనీర్ల సంపద 2023 కంటే 2024లో మూడు రెట్లు వేగంగా వృద్ధి చెందింది. బిలియనీర్ల సంఖ్య 2024లో 204 పెరిగి మొత్తం 2,769కి చేరింది. అందులో 41 మంది ఆసియాకు చెందిన వారున్నారు. ఆసియాలో బిలియనీర్ల సంపద విలువ 299 బిలియన్ డాలర్ల (సుమారు రూ.25.42 లక్షల కోట్ల) మేర పెరిగింది.ఈ ఏడాది సమకూరిన సంపదలో గణనీయమైన భాగం 60% వారసత్వం, వ్యవస్థ లేదా కంపెనీలపై గుత్తాధిపత్యం, క్రోనీ కనెక్షన్ల(అధికారంలోని వ్యక్తులతో సత్సంబంధాలు కలిగి ఉండడం) ద్వారా చేకూరింది. 30 ఏళ్లలోపు ఉన్న బిలియనీర్‌కు తమ సంపద వారసత్వంగా వచ్చిందే. వచ్చే 20-30 ఏళ్లలో ప్రస్తుత 1000 మందికి పైగా బిలియనీర్లు తమ 5.2 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.442 లక్షల కోట్ల)సంపదను తమ వారసులకు అందించనున్నారు.కుబేరుల సంపద గణనీయంగా పెరిగినప్పటికీ దాదాపు సగం మంది రోజుకు 6.85 డాలర్ల(రూ.550) కంటే తక్కువ ఆదాయంతో మనుగడ సాగిస్తున్నారు. ఈ సంఖ్యలో 1990 నుంచి మెరుగుదల కనిపించడంలేదు.ఇదీ చదవండి: కెనడా, మెక్సికోలపై సుంకాలు.. ప్రభావితమయ్యే వస్తువులుఆర్థిక అసమానతలుపెరుగుతున్న బిలియనీర్ల సంపద, ప్రపంచ పేదరికం మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని ఈ నివేదిక చూపుతుంది. మహిళలు తీవ్రమైన పేదరికంతో అసమానంగా ప్రభావితమవుతున్నారు. 10 మందిలో ఒకరు రోజుకు 2.15 డాలర్లు(రూ.170) కంటే తక్కువ ఆదాయంతో జీవిస్తున్నారు. ఈ అసమానతలను పరిష్కరించడానికి వ్యవస్థాగత మార్పులు అవసరమని నివేదిక చెబుతుంది. అతి సంపన్నుల(Billionaires)పై పన్ను విధించడం, గుత్తాధిపత్యాలను తొలగించడం వంటి విధానాలను అనుసరించాలని సూచిస్తుంది. ఆర్థిక అసమానతలపై ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు ఆందోళనలు వెలిబుచ్చిన విషయాన్ని ఆక్స్‌ఫామ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమితాబ్ బెహర్ గుర్తు చేశారు. -
ధనవంతులపై.. భారత్ మరింత పన్ను విధించాలి: ఫ్రెంచ్ ఆర్థికవేత్త
భారతదేశంలో సంపన్నులు, సంపన్నులుగానే ఉన్నారు, పేదవారు.. పేదవారుగానే ఉన్నారు. ఈ అసమానతలు మన దేశంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. దీనిని నివారించాలంటే.. ఇండియాలోని ధనికులపైన అధిక పన్నులు విధించాలని ఫ్రెంచ్ ఆర్థికవేత్త 'థామస్ పికెట్టీ' (Thomas Piketty) పేర్కొన్నారు.10 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆస్తులున్న వ్యక్తులపైన 2 శాతం సంపద పన్నును విధిస్తే.. భారతదేశ వార్షిక ఆదాయం 2.73 శాతం పెరుగుతుంది. అదే విలువగల ఆస్తిపైన 33 శాతం వారసత్వ పన్ను విధించవచ్చని ఆయన అన్నారు. ప్రపంచంలోని అత్యంత సంపన్నులపై పన్ను విధించేందుకు.. కలిసి పని చేసేందుకు 20 ప్రధాన దేశాల ఆర్థిక మంత్రులు వాగ్దానం చేసారు. దీనిని భారత్ కూడా అనుసరించాలని ''21వ శతాబ్దంలో రాజధాని'' (Capital in the 21st Century) పుస్తక రచయిత కోరారు.ఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో.. ధనవంతులపై పన్ను విధించడంలో భారతదేశం చురుకుగా ఉండాలని పికెట్టీ పేర్కొన్నారు. ఒక శాతం అగ్రశ్రేణి సంపన్న భారతీయులు కలిగి ఉన్న జాతీయాదాయ నిష్పత్తి.. అమెరికా, బ్రెజిల్ దేశాల సంపన్నులను మించిపోయిందని ఆయన అన్నారు.ఇదీ చదవండి: అంబానీ, టాటా, అదానీ.. వీళ్లు చేసిన ఫస్ట్ జాబ్ ఏంటో తెలుసా?2022 - 2023లో.. భారతదేశంలోని ధనవంతులైన 1 శాతం మంది దేశానికి చెందిన సంపదలో 40.1 శాతాన్ని కలిగి ఉన్నట్లు సమాచారం. కాగా ఇటీవల ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితా ప్రకారం.. ఇండియాలోని 100 మంది ధనవంతుల సంపద ట్రిలియన్ డాలర్లు దాటేసినట్లు తెలిసింది. -
దూసుకెళ్తున్న భారత్.. భారీగా పెరిగిన బిలియనీర్లు
భారతదేశం ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో సంపద సృష్టికి హాట్‌స్పాట్‌గా ఉద్భవించింది. పదేళ్లలో ఇండియాలోని బిలియనీర్ల నికర విలువ దాదాపు మూడు రేట్లు పెరిగి 905.6 బిలియన్లకు చేరింది. దీంతో భారత్ ఇప్పుడు మొత్తం బిలియనీర్ సంపదలో ప్రపంచవ్యాప్తంగా మూడవ స్థానంలో నిలిచినట్లు స్విట్జర్లాండ్ స్విస్ బ్యాంక్‌గా పేరుపొందిన 'యూబీఎస్' నివేదికలో వెల్లడించింది.యూబీఎస్ నివేదిక ప్రకారం.. భారతదేశంలో బిలియనీర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ జాబితాలోకి కొత్తగా 32 మంది చేరారు. దీంతో 153 మంది నుంచి బిలియనీర్ల సంఖ్య 185కు చేరింది. వీరి మొత్తం నికర విలువ ఒక్కసారిగా (905.6 బిలియన్స్) పెరిగింది. భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ రూ.76 లక్షల కోట్ల కంటే ఎక్కువే అని తెలుస్తోంది.ప్రపంచ వ్యాప్తంగా 2024లో బిలియనీర్ల సంఖ్య 2682కు చేరింది. అంతకు ముందు సంవత్సరంలో ఈ సంఖ్య 2,544గా ఉంది. నికర విలువ కూడా ఈ ఏడాది 12 ట్రిలియన్ డాలర్ల నుంచి 14 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. అమెరికాలో బిలియనీర్ల సంఖ్య 751 నుంచి 835కి పెరిగింది, వారి మొత్తం సంపద 4.6 ట్రిలియన్స్ నుంచి 5.8 ట్రిలియన్లకు పెరిగింది.చైనాలో మాత్రం బిలియనీర్ల సంఖ్య 520 నుంచి 427కి చేరింది. వారి సంపద 1.8 ట్రిలియన్ డాలర్ల నుంచి 1.4 ట్రిలియన్లకు పడిపోయింది. భారత్ విషయానికి వస్తే.. ఇక్కడ బిలియనీర్ల సంఖ్య 153 నుంచి 185కు చేరింది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. -
అంబానీ, టాటా, అదానీ.. వీళ్లు చేసిన ఫస్ట్ జాబ్ ఏంటో తెలుసా?
భారతదేశంలో ప్రతి ఏటా ధనవంతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం మన దేశంలోని కుబేరుల జాబితాలో ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, శివ్ నాడార్, సావిత్రి జిందాల్, దిలీప్ సాంఘ్వీ, కుమార మంగళం బిర్లా మొదలైనవారు ఉన్నాయి. వీరిలో కొందరు వారసత్వంగా ధనవంతులైనప్పటికీ.. కొందరు మాత్రం కష్టపడి చిన్న ఉద్యోగాలు చేస్తూ ఎదిగారు. ఈ కథనంలో అలాంటి వాళ్ళ గురించి తెలుసుకుందాం.ధీరూబాయ్ అంబానీ (Dhirubhai Ambani)రిలయన్స్ సంస్థ ఏర్పడటానికి కారణమైన ధీరూబాయ్ అంబానీ.. తన తొలినాళ్లలో కుటుంబ పోషణ కోసం అనేక పనులు చేశారు.కానీ అవి నచ్చకపోవడంతో మిడిల్ ఈస్ట్ ఆసియా దేశమైన యెమెన్‌కు వలస వెళ్లి పెట్రోల్ బంకులో పని మొదలు పెట్టారు. అప్పట్లో ఆయన సంపాదన రూ. 300 మాత్రమే. కొంతకాలం పెట్రోల్ బంకులో పనిచేసి.. స్వదేశానికి వచ్చి చిన్నగా వ్యాపారాన్ని ప్రారంభించారు. అదే ఇప్పుడు ఇంతపెద్ద రియలన్స్ ఇండస్ట్రీస్‌గా మారింది.సుధామూర్తి (Sudha Murthy)ఇన్ఫోసిస్ నారాయణమూర్తి భార్య సుధామూర్తి చదువు పూర్తయిన తరువాత.. టాటా మోటార్స్ (TELCO)లో ఉద్యోగం చేశారు. ఆ కంపెనీ మొదటి మహిళా ఇంజినీర్ సుధామూర్తి కావడం గమనార్హం. ఈ రోజు ఇంజినీరింగ్ రంగంలో కూడా మహిళలు ముందుకు వెళ్తున్నారంటే.. అది సుధామూర్తి కారణంగానే.రతన్ టాటా (Ratan Tata)దివంగత రతన్ టాటా.. ప్రారంభంలో టాటా కంపెనీలో ఉద్యోగిగా చేరారు. అమెరికన్ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ 'ఐబీఎమ్' నుంచి మంచి శాలరీ ప్యాకేజీతో వచ్చిన జాబ్ వదులుకున్నారు. టాటా స్టీల్ కంపెనీలోనే పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి సంస్థా చైర్మన్ స్థాయికి ఎదిగారు.కిరణ్ మజుందార్ షా (Kiran Mazumdar Shaw)బయోకాన్ వ్యవస్థాపకురాలైన.. కిరణ్ మజుందార్-షా ప్రారంభంలో ఆస్ట్రేలియాలో బ్రూవర్‌గా తన వృత్తిని ప్రారంభించారు. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, ఆమె బ్రూయింగ్ పరిశ్రమలో లింగ వివక్షను ఎదుర్కొన్నారు. ఆ తరువాత క్రమంగా వ్యాపార సామ్రాజ్యంలో అంచెలంచెలుగా ఎదిగారు.ఇంద్రా నూయి (Indra Nooyi)పెప్సికో మాజీ సీఈఓ అయిన.. ఇంద్రా నూయి 18 సంవత్సరాల వయస్సులో బ్రిటిష్ టెక్స్టైల్ సంస్థలో వ్యాపార సలహాదారుగా తన వృత్తిని ప్రారంభించారు. ఇప్పుడు ఈమె వేలకోట్ల సామ్రాజ్యానికి అథినేత్రిగా నిలిచారు.గౌతమ్ అదానీ (Gautam Adani)ఈ రోజు భారతదేశంలో రెండవ అత్యంత ధనవంతుడిగా ఉన్న గౌతమ్ అదానీ.. డైమండ్ సార్టర్‌గా తన మొదటి ఉద్యోగాన్ని ప్రారంభించారు. ఆ తరువాత ఈ రంగంలో కొంత అనుభవం తెచ్చుకున్న తరువాత ముంబైలోని జవేరీ బజార్లోనే సొంతంగా వజ్రాల వ్యాపారాన్ని ప్రారంభించారు. నేడు వివిధ రంగాల్లో ఎదుగుతూ.. కుబేరుడిగా నిలిచారు. -
ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు (ఫొటోలు)
-
ఇండోనేషియాలో అత్యంత సంపన్న కుటుంబం ఇదే..
ఆసియాలో అత్యంత సంపన్నుడు ఎవరు అంటే.. అందరూ చెప్పే సమాధానం ముకేశ్ అంబానీ. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత అయిన ఈయన నికర విలువ 120.3 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువని తెలుస్తోంది. నీతా అంబానీ, అంబానీ వారసులు అందరూ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూనే ఉన్నారు. ఆసియాలో రెండో అత్యంత సంపన్న కుటుంబం ఏదనే విషయం ఇక్కడ తెలుసుకుందాం.ఆసియాలో రెండో అత్యంత సంపన్న కుటుంబం హార్టోనో ఫ్యామిలీ అని తెలుస్తోంది. వీరి నికర విలువ 38.8 బిలియన్ డాలర్లు అని సమాచారం. వీరి కుటుంబ ఆదాయం జార్మ్ గ్రూప్‌తో ప్రారంభమైంది. ప్రస్తుతం వీరు సిగరెట్ పరిశ్రమలోని అగ్రగాములలో ఒకరుగా ఉన్నారు.హార్టోనో సోదరుల కూడా వ్యాపార రంగంలో గణనీయమైన వృద్ధి సాధించారు. వీరు ఇండోనేషియాలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకులలో పెట్టుబడులు కూడా పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. హార్టోనో కుటుంబానికి ఎలక్ట్రానిక్స్, ప్రాపర్టీ, అగ్రిబిజినెస్ వంటి వ్యాపారాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: అన్నింటా రికార్డులే.. నిర్మలమ్మ ఖాతాలో మరో ఘనతహార్టోనో ఫ్యామిలీ అధీనంలో జకార్తాలోని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ పాలిట్రాన్ అండ్ ప్రైమ్ రియల్ ఎస్టేట్ ఉన్నాయి. వీరి కుటుంబ వ్యాపారం ఇండోనేషియాలో ఆర్థిక వృద్ధికి గణనీయంగా దోహదపడింది. దీన్ని బట్టి చూస్తే వీరి సంపద ఎంత ఉంటుందనేది ఇట్టే అర్థం చేసుకోవచ్చు. -
అంబానీ నుంచి మస్క్ వరకు.. బిలినీయర్లకు ఉన్న అలవాట్లు ఇవే!
ప్రపంచంలో వందల కోట్ల జనాభా ఉన్నారు. ఇందులో కొంత మంది మాత్రమే బిలినీయర్లుగా ఎదిగారు. కోటీశ్వరులుగా ఎదిగిన చాలా మంది కొన్ని అలవాట్లను తూ.చ ఖచ్చితంగా పాటిస్తున్నారు. ముకేశ్ అంబానీ నుంచి ఇలాన్ మస్క్ వరకు సక్సెస్ సాధించిన వ్యక్తులందరూ ఎలాంటి అలవాట్లను పాటిస్తారనేది ఈ కథనంలో చూసేద్దాం..ఉదయం త్వరగా మేల్కొనటంముకేశ్ అంబానీ నుంచి ఇలాన్ మస్క్ వరకు దాదాపు చాలామంది బిలినీయర్లు రాత్రి ఎంత సమయానికి నిద్రపోయినా.. ఉదయం మాత్రం 5:30 గంటలకే నిద్రలేస్తారు. ఇది వారి ఫిట్‌నెస్‌కు మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యానికి దోహదపడుతుంది. ప్రతి ఒక్కరూ రాత్రి త్వరగా పడుకుని ఉదయం ముందుగా నిద్రలేవాలి. ఇది ఓ మంచి అలవాటు.చదవడంచదవడం అనేది చాలామంది అలవాటు. బిల్ గేట్స్ సంవత్సరానికి 50 పుస్తకాలు చదువుతానని గతంలో పేర్కొన్నారు. ఇది సమాజం పట్ల అవగాహనను మాత్రమే కాకుండా.. మానసిక ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. కాబట్టి పుస్తక పఠనం అలవాటు చేసుకోవడం ఉత్తమ అలవాటు.వ్యాయామంఅమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ ప్రతి రోజూ వ్యాయామంతోనే రోజు మొదలుపెడతారు. శారీరక దృఢత్వం కోసం వ్యాయామం చేయడం అలవాటుగా చేసుకోవాలి. ప్రతి రోజూ కనీసం ఒక అరగంట వివిధ రకాల వ్యాయామాలు చేయాలి. ప్రతిరోజూ వ్యాయామం కూడా దినచర్యలో భాగం చేసుకోవడం ఉత్తమ అలవాటు.నిద్రశరీరానికి ఆహారం ఎంత అవసరమో.. నిద్ర కూడా అంతే అవసరం. రాత్రి కనీసం ఎనిమిది గంటలకు తగ్గకుండా ప్రతి ఒక్కరు నిద్రపోవాలి. ఇది వారి ఆలోచనా శైలిని పెంచుతుంది. బిలినీయర్లు ప్రతి రోజూ ఒకే సమయానికి నిద్రపోతారు. ప్రతి ఒక్కరు నిద్రకు సరైన సమయం కేటాయిస్తే ఒక నెలరోజుల్లో మీలో మార్పు వస్తుందని అమెరికన్ వ్యాపారవేత్త మార్క్ క్యూబన్ చెబుతున్నారు.సామజిక కార్యక్రమాల్లో పాల్గొనటంసక్సెస్ సాధించడానికి సామజిక అనుబంధాలు కూడా చాలా ముఖ్యం. ముకేశ్ అంబానీ నుంచి ఇలాన్ మస్క్ వరకు చాలామంది సామజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల వారిలో ఓ నూతన ఉత్సాహం వస్తుందని నమ్మకం. కాబట్టి సాధ్యమైనప్పుడల్లా సామజిక కార్యక్రమాల్లో పాల్గొనటం ఉత్తమం. -
బ్లూం బెర్గ్ గ్లోబల్ సూపర్ రిచ్ క్లబ్లో భారతీయ కుబేరులు
ప్రపంచ దేశాల్లోని ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా 15 మంది కుభేరులు 100 బిలియన్ డాలర్ల సందపతో వరల్డ్ సూపర్ రిచ్ క్లబ్లో చేరినట్లు తెలుస్తోంది. బ్లూంబెర్గ్ నివేదిక ప్రకారం..ద్రవ్యోల్బణం, స్టాక్ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితిని అధిగమించి ఈ ఏడాది 15 మంది ఉన్న నికర విలువ 13 శాతం పెరిగి 2.2 ట్రిలియన్ డాలర్లకు చేరింది. వెరసి ప్రపంచంలోనే 500 మంది వద్ద ఉన్న సంపదలో దాదాపు నాలుగింట ఒకవంతు వీరివద్దే ఉంది. 15 మంది ఇంతకు ముందు 100 బిలియన్ డాలర్లు దాటినప్పటికీ, వారందరూ ఒకే సమయంలో ఆమొత్తానికి చేరుకోవడం ఇదే మొదటి సారి. ఇక వారిలో కాస్మోటిక్స్ దిగ్గజం ‘లో రియాల్’ సామ్రాజ్య వారసురాలు ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్, డెల్ టెక్నాలజీస్ ఫౌండర్ మైఖేల్ డెల్, మెక్సికన్ బిలియనీర్ కార్లోస్ స్లిమ్లు మొదటి ఐదునెలల్లో ఈ అరుదైన ఘనతను సాధించారు. 1998 నుంచి తమ కంపెనీ గత ఏడాది డిసెంబర్లో అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచిందంటూ బెటెన్‌కోర్ట్ మేయర్స్ తెలిపింది. ఆ తర్వాతే 100 బిలియన్ల సంపదను దాటారు. దీంతో బ్లూంబెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ జాబితాలో 100 బిలియన్ల నికర సంపదను దాటిన 15 మందిలో ఒకరుగా నిలిచారు. 14 స్థానంలో కొనసాగుతున్నారు.ఆ తర్వాత టెక్నాలజీ,ఏఐ విభాగాల్లో అనూహ్యమైన డిమాండ్ కారణంగా డెట్ టెక్నాలజీస్ షేర్లు లాభాలతో పరుగులు తీశాయి. ఫలితంగా డెల్ సంపద 100 బిలియన్ల మార్కును ఇటీవలే దాటింది. ఇప్పుడు 113 బిలియన్ల సంపదతో బ్లూమ్‌బెర్గ్ సంపద సూచికలో 11వ స్థానంలో ఉన్నారు.లాటిన్ అమెరికాలో అత్యంత ధనవంతుడు కార్లోస్ స్లిమ్ 13వ స్థానం, ఎల్వీఎంహెచ్ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బెర్నార్డ్ ఆర్నాల్ట్‌కు తొలి స్థానం, అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ రెండవ స్థానం, ఎలాన్ మస్క్ 3వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ ఎలైట్ గ్రూప్‌లోకి భారత్ నుంచి ముఖేష్ అంబానీ గౌతమ్ అదానీ సైతం చోటు దక్కించుకోవడం గమనార్హం. -
ప్రముఖ కంపెనీలకు ఇకపై బాస్‌లు వీరే..
సంపన్నులైన వ్యాపార దిగ్గజాలు వారి బిజినెస్ కార్యకలాపాలను తమ వారసులకు అప్పగిస్తున్నారు. ఇప్పటికే ఆసియాలోనే కుబేరుడైన ముఖేశ్ అంబానీ తన వారసులకు వ్యాపారాలను అప్పగించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వ్యాపారస్థులు తమ తర్వాత తరాన్ని పరిచయం చేస్తున్నారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఫోర్బ్స్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్స్ ర్యాంకింగ్ 2024లో ఉన్న 2,781 మందిలో దాదాపు మూడింట ఒకవంతు మంది అంటే మొత్తం 934 మంది తమ వారసులకు వ్యాపారాన్ని అప్పగించారు. వీరు నడిపిస్తున్న కంపెనీలు, వాటి మార్కెటింగ్ విలువ ఏకంగా 5 ట్రిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంది.ముఖేశ్ అంబానీరిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ సంపద దాదాపు 113.5 బిలియన్ అమెరికన్ డాలర్లు. రిలయన్స్ టెలికాం విభాగం జియో ఇన్ఫోకామ్‌కు తన పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ సారథ్యం వహిస్తున్నారు. కూతురు ఇషా అంబానీ రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. రెండో కుమారుడు అనంత్ అంబానీ పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు.బెర్నార్డ్ ఆర్నాల్ట్ప్రపంచ కుబేరుల్లో మొదటి స్థానంలో ఉన్న బెర్నార్డ్ ఆర్నాల్ట్‌కు డెల్ఫిన్ ఆర్నాల్ట్, ఆంటోయిన్ ఆర్నాల్ట్, జీన్ ఆర్నాల్ట్, ఫ్రెడెరిక్ ఆర్నాల్ట్, అలెగ్జాండర్ ఆర్నాల్ట్ అనే వారసులున్నారు. తన కుటుంబ సంపద మొత్తం 214.1 బిలియన్ అమెరికన్ డాలర్లు. తన వారసులు బెర్నార్డ్ ఆర్నాల్ట్ కంపెనీ ఎల్వీఎంహెచ్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. డెల్ఫిన్ ఆర్నాల్ట్(49) 2023లో మాంటిల్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఆంటోయిన్ ఆర్నాల్ట్(46) ఎల్వీఎంహెచ్ కమ్యూనికేషన్స్, ఇమేజ్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇనిషియేటివ్ విభాగాన్ని పర్యవేక్షిస్తారు. అలెగ్జాండర్ ఆర్నాల్ట్(31) కమ్యూనికేషన్ విభాగంలో పనిచేస్తున్నారు. ఫ్రెడెరిక్ ఆర్నార్ట్(29)ట్యాగ్‌హ్యూర్ పదవీకాలం తర్వాత 2024లో ఎల్వీఎంహెచ్ వాచెస్‌కు సీఈఓగా చేరారు. జీన్ ఆర్నాల్ట్(25) 2021లో ఎల్వీఎంహెచ్లో చేరారు. లూయిస్ విట్టన్ వాచీల విభాగానికి మార్కెటింగ్ హెడ్‌గా చేస్తున్నారు.అదానీ గ్రూప్గౌతమ్ అదానీ ఛైర్మన్‌గా ఉన్న ఈ గ్రూప్ సంపద సుమారు 102.4 బిలియన్ అమెరికన్ డాలర్లు. ఆయనకు కరణ్, జీత్ అదానీలు ఇద్దరు కుమారులు. పర్డ్యూ యూనివర్శిటీ నుంచి ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్ అయిన కరణ్ తన తండ్రి తర్వాత అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఏపీసెజ్) మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. జీత్ అదానీ 2019లో అదానీ గ్రూప్‌లో చేరారు.షాపూర్జీ పల్లోంజీ గ్రూప్షాపూర్ మిస్త్రీ స్థాపించిన ఈ గ్రూప్ సంపద 37.7 బిలియన్ యూఎస్ డాలర్లుగా ఉంది. షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ వారసుడిగా పల్లోన్ మిస్త్రీ సంస్థను ముందుండి నడిపిస్తున్నారు. ఈ గ్రూప్‌నకు నిర్మాణం, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి పేరుంది. ఇందులో టాటా సన్స్ వాటా కలిగి ఉంది.ఇదీ చదవండి: 15 టన్నుల కల్తీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్టుఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్లాఓరీల్ సంస్థ వ్యవస్థాపకుడు ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్ 94.5 బిలియన్ డాలర్ల సందప కలిగి ఉన్నారు. ప్రపంచంలోని ప్రముఖ సౌందర్య సాధనాల దిగ్గజ సంస్థగా లాఓరీల్‌కు మంచి పేరుంది. ప్రపంచంలోని అత్యంత సంపన్న మహిళ ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్ వారసులు జీన్-విక్టర్, నికోలస్ మేయర్స్. జీన్-విక్టర్ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో పనిచేస్తున్నారు. నికోలస్ మేయర్స్ కుంటుంబం పెట్టుబడి సంస్థకు సంబంధించిన వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు. -
ఐదు అత్యంత విలాసవంతమైన భవనాలు.. ఎవరుంటారక్కడ?
భారతదేశం అటు సంప్రదాయం, ఇటు ఆధునికత కలగలిసిన దేశం. దేశంలోని రియల్ ఎస్టేట్ రంగంలోనూ ఇది స్పష్టంగా కనిపిస్తుంది. వ్యాపారవేత్త ముఖేష్ అంబానీకి చెందిన ఐకానిక్ హౌస్ ‘యాంటిలియా’ నుంచి హీరో షారుక్ ఖాన్‌కు చెందిన విలాసవంతమైన ‘మన్నత్’ వరకు.. అన్నీ విలాసవంతమైన, ఆధునిక భవన నిర్మాణాలకు ఉదాహరణగా నిలిచాయి. భారతదేశంలో అత్యంత ఖరీదైన బంగ్లాలలో ఇవి కొన్ని.. 1. యాంటిలియా: ముఖేష్ అంబానీ దేశంలోని అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ ఇల్లు యాంటిలియా అత్యంత ఖరీదైన ఇళ్ల జాబితాలో నంబర్ వన్ ప్లేస్‌లో ఉంది. దక్షిణ ముంబైలోని ఈ భవనం మొత్తం 27 అంతస్తులను కలిగి ఉంది. 15వ శతాబ్దపు స్పానిష్ ద్వీపం పేరు ఈ భవనానికి పెట్టారు. జీక్యూ ఇండియా తెలిపిన వివరాల ప్రకారం ఈ భవనం విలువ ఒకటి నుండి రెండు బిలియన్ డాలర్ల మధ్య ఉంటుంది. ఇది బకింగ్‌హామ్ ప్యాలెస్ తర్వాత ప్రపంచంలో రెండవ అత్యంత ఖరీదైన ఇల్లు. యాంటిలియాలో హెల్త్ స్పా, బహుళ స్విమ్మింగ్ పూల్స్, థియేటర్, యోగా, డ్యాన్స్ స్టూడియో, బాల్రూమ్, ఐస్‌క్రీమ్ పార్లర్, మూడు హెలిప్యాడ్లు, హ్యాంగింగ్ గార్డెన్లు, పార్కింగ్ స్థలం మొదలైన ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. 2. మన్నత్: షారుక్ ఖాన్ అరేబియా సముద్రపు అలల సుందర దృశ్యాలను చూపే ‘మన్నత్’ బాలీవుడ్ రారాజు షారుక్ ఖాన్ నివాసం. ముంబైలోని బాంద్రాలో ఉన్న ఈ బంగ్లా ఖరీదు రూ.200 కోట్లకు పైమాటే. అతని భార్య గౌరీ ఖాన్ ఈ ఆరు అంతస్తుల భవనాన్ని తన ఆలోచనల మేరకు తీర్చిదిద్దారు. ఇంటీరియర్‌ను అద్భుతంగా రూపొందించారు. ఈ భవనంలో జిమ్, లైబ్రరీ, స్విమ్మింగ్ పూల్, ప్రైవేట్ సినిమా, అందమైన టెర్రస్ ఉన్నాయి. 3. గులిత: ఆనంద్ పిరమల్ ముకేశ్ అంబానీ కుమార్తె ఇషా అంబానీని ఆనంద్ పిరమల్ వివాహం చేసుకున్నారు. ఈ సందర్భంగా పిరమల్ గ్రూప్ చైర్మన్ అజయ్ పిరమల్ తన కుమారుడు ఆనంద్ పిరమల్‌కు ఈ విలాసవంతమైన ఇంటిని బహుమతిగా ఇచ్చారు. ముంబైలోని ఈ ఐదు అంతస్తుల డైమండ్ ఆకారపు భవనం అద్భుతానికి ఉదాహరణగా నిలిచింది. దీని రీగల్ డిజైన్ కారణంగా బయట నుండి ఎంతో అందంగా కనిపిస్తుంది. జీక్యూ ఇండియా అంచనా ప్రకారం ఈ బంగ్లా విలువ సుమారు రూ.450 కోట్లు. ఈ గ్రాండ్ డైమండ్ ఆకారపు భవనంలో ప్రైవేట్ పూల్, అండర్ గ్రౌండ్ పార్కింగ్, స్పేస్ డైనింగ్ ఏరియా, డైమండ్ రూమ్ తదితర లగ్జరీ సౌకర్యాలు ఉన్నాయి. 4. జతియ హౌస్: కుమార్ మంగళం బిర్లా ముంబైలోని మలబార్ హిల్‌లోని జతియ హౌస్ ప్రముఖ వ్యాపారవేత్త కుమార్ మంగళం బిర్లా నివాసం. ఈ బంగ్లా 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. జీక్యూ ఇండియా తెలిపిన వివరాల ప్రకారం ఈ బంగ్లా ఖరీదు రూ. 425 కోట్లు. విలాసవంతమైన ఇంటీరియర్ ఈ భవనం సొంతం. అందమైన సముద్ర దృశ్యం భవనానికి ప్లస్ పాయింట్. ఈ భవనంలో 20 పెద్ద బెడ్రూమ్లు, ఓపెన్ యార్డ్, గార్డెన్ మొదలైనవి ఉన్నాయి. 5. జేకే హౌస్: గౌతమ్ సింఘానియా ముంబైలోని బ్రీచ్ కాండీ ప్రాంతంలో ఉన్న జేకే హౌస్ వ్యాపార దిగ్గజం గౌతమ్ సింఘానియా నివాసం. గౌతమ్ సింఘానియా రేమండ్ గ్రూప్ చైర్మన్. ఈ 30 అంతస్తుల భవనం ఆధునిక డిజైన్‌తో రూపొందింది.అరేబియా సముద్ర దృశ్యాలు భవనంలోని వారిని అలరిస్తాయి. జీక్యూ ఇండియా తెలిపిన వివరాల ప్రకారం ఈ భవనం విలువ సుమారు రూ. ఆరు వేల కోట్లు. ఇందులో రెండు స్విమ్మింగ్ పూల్స్, ఐదు పార్కింగ్ అంతస్తులు, హెలిప్యాడ్, స్పా, జిమ్, హోమ్ థియేటర్ మొదలైన ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. -
Forbes: డబ్బున్నోళ్ల లిస్ట్.. అందరికంటే రిచ్ ఈ పెద్దాయనే..
అమెరికన్ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ తన 2024 సంపన్నుల జాబితాను తాజాగా విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో ఫ్రెంచ్ లగ్జరీ గూడ్స్ సంస్థ ఎల్వీఎంహెచ్ (LVMH) బెర్నార్డ్ ఆర్నాల్ట్, ఆయన కుటుంబం 233 బిలియన్ డాలర్లు (రూ. 19.43 లక్షల కోట్లు) సంపదతో అగ్రస్థానంలో ఉన్నారు. 2024లో రికార్డు స్థాయిలో 2,781 మంది బిలియనీర్లు ఉన్నారని ఫోర్బ్స్ తెలిపింది. గత సంవత్సరం కంటే ఈ సంఖ్య 141 ఎక్కువ. 2021లో నమోదైన రికార్డు కంటే 26 ఎక్కువ. ఈ లిస్ట్‌లోని బిలియనీర్ల మొత్తం సంపద 14.2 ట్రిలియన్ డాలర్లు (11.8 కోట్ల కోట్లు) అని పేర్కొంది. ఆర్నాల్ట్, ఆయన కుటుంబం తర్వాత టెస్లా అధినేత ఎలాన్ మస్క్ 195 బిలియన్ డాలర్ల (రూ. 16.26 లక్షల కోట్లు) నికర సంపదతో రెండవ స్థానంలో ఉన్నారు. ఈయన తర్వాత అమెజాన్ యజమాని జెఫ్ బెజోస్ 194 బిలియన్ డాలర్ల (రూ. 16.17 లక్షల కోట్లు) నెట్‌వర్త్‌తో మూడవ స్థానంలో ఉన్నారు. ఇక భారత్‌కు చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ 116 బిలియన్ డాలర్ల (రూ. 9.67 లక్షల కోట్లు) సంపదతో టాప్ టెన్‌లో 9వ స్థానంలో నిలిచారు. ఈకాగా ఈసారి ఫోర్బ్స్ లిస్ట్‌లో కొత్తగా పలువురు సెలబ్రిటీలు చేరారు. పాప్ సంచనం టేలర్ స్విఫ్ట్ ఫోర్బ్స్ 2024 బిలియనీర్ల జాబితాలో అడుగు పెట్టింది. అక్టోబర్‌లో బిలియనీర్ హోదాకు చేరుకున్న ఈ పాప్ సూపర్ స్టార్, ప్రపంచ బిలియనీర్ల జాబితాలో రిహన్న, కిమ్ కర్దాషియాన్, ఓప్రా విన్ఫ్రే, స్టార్ వార్స్ సృష్టికర్త జార్జ్ లూకాస్లతో కలిసి చేరారు. 1.1 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 9,169 కోట్లు) భారీ నెట్‌వర్త్‌తో స్విఫ్ట్ 14వ స్థానంలో నిలిచింది. ఫోర్బ్స్ టాప్ టెన్ లిస్ట్ ఇదే.. -
బిలియనీర్ల నగరం ముంబై
ముంబై: బిలియనీర్ల విషయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబై తాజాగా బీజింగ్‌ను అధిగమించింది. మంగళవారం విడుదలైన హురున్ గ్లోబల్ రిచ్ లిస్టు ప్రకారం ముంబైలో 92 మంది అత్యంత సంపన్నులు ఉండగా బీజింగ్‌లో ఈ సంఖ్య 91గా ఉంది. ఇక చైనాలో మొత్తం 814 మంది బిలియనీర్లు ఉండగా భారత్‌లో 271 మంది ఉన్నారు. దేశీయంగా కుబేరుల మొత్తం సంపద 1 లక్ష కోట్ల డాలర్ల స్థాయిలో ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ 115 బిలియన్ డాలర్ల సంపదతో అత్యంత సంపన్న భారతీయుడిగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. గత ఏడాది వ్యవధిలో ఆయన సంపద మరో 40 శాతం (33 బిలియన్ డాలర్లు) పెరిగింది. ఇక హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికతో గణనీయంగా దెబ్బతిన్న గౌతమ్ అదానీ తిరిగి కోలుకున్నారు. ఆయన సంపద 62 శాతం వృద్ధి చెందింది. అంతర్జాతీయంగా అంబానీ పదో స్థానంలో ఉండగా, అదానీ 15వ స్థానంలో ఉన్నారు. 231 బిలియన్ డాలర్లతో టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ నంబర్ వన్‌గా ఉన్నారు. కొత్త బిలియనీర్లయిన వారి విషయంలో చైనాను భారత్ అధిగమించింది. భారత్ నుంచి ఈ లిస్టులో 94 మంది చోటు దక్కించుకోగా, చైనా నుంచి 55 మందికి చోటు దక్కింది. గత ఏడాది వ్యవధిలో ముంబైలో 27 మంది బిలియనీర్లు కాగా, బీజింగ్‌లో ఆరుగురు మాత్రమే ఈ హోదా దక్కించుకున్నారు. -
డొనాల్డ్ ట్రంప్‌నకు జాక్‌పాట్..!
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ కుబేరుల జాబితాలో చోటు సంపాదించారు. కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆయనకు చెందిన ఒక కంపెనీ డీల్ ఇటీవల పూర్తయింది. దాంతో ఆయన ఆస్తుల విలువ భారీగా పెరిగింది. ఫలితంగా బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో ప్రపంచంలోని తొలి 500 మంది సంపన్నుల జాబితాలో ఆయన స్థానం సంపాదించారు. ఇటీవల జరిగిన పరిణామాల కారణంగా తాజా అంచనాల ప్రకారం ట్రంప్ సంపద విలువ 4 బిలియన్ డాలర్లు (రూ.33 వేల కోట్లు) పెరిగి 6.5 బిలియన్ డాలర్లకు(సుమారు రూ.54 వేల కోట్లు) చేరింది. గతంలో ఎప్పుడూ ఆయన ఆస్తుల విలువ ఈ స్థాయికి చేరలేదని మీడియా కథనాల ద్వారా తెలిసింది. ట్రంప్‌నకు చెందిన సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’ సంస్థ డిజిటల్ వరల్డ్ అక్విజేషన్ కార్ప్ (డీడబ్ల్యూఏసీ)తో విలీనం ప్రక్రియ పూర్తయింది. ఇది దాదాపు 29 నెలలుగా సాగుతూ వస్తోంది. మార్కెట్లో డీడబ్ల్యూఏసీ షేర్లు ఒకేసారి 35శాతానికి పైగా ర్యాలీ అయ్యాయి. దాంతో ట్రంప్ సంపద కూడా భారీగా పెరిగి 6.5 బిలియన్ డాలర్లకు చేరినట్లు సీఎన్‌బీసీ పేర్కొంది. విలీనం తర్వాత ఏర్పడ్డ కొత్త కంపెనీ నేటి నుంచి నాస్డాక్లో డీజేటీ పేరిట ట్రేడింగ్ కానుంది. ఇదీ చదవండి: రూ.3 వేలకోట్లతో మరో పోర్టును కొనుగోలు చేసిన అదానీ ఆస్తులు పెరగడంతోపాటు ట్రంప్‌నకు భారీ జరిమానా విధింపు విషయంలో పై కోర్టులో ఊరట లభించింది. తన సంపదకు సంబంధించి గతంలో తప్పుడు లెక్కలు చెప్పినట్లు అభియోగాలు వచ్చాయి. దాంతో విచారణ జరిపిన అమెరికా కోర్టు ఆయనకు రూ.3,788 కోట్ల (45.4 కోట్ల డాలర్ల) జరిమానా విధించింది. ట్రంప్ తనపై వచ్చిన అభియోగాలను, దిగువ కోర్టు విధించిన జరిమానాను సవాలు చేస్తూ పై కోర్టును ఆశ్రయించారు. ఇటీవల దిగువ కోర్టు ఉత్తర్వు అమలు కాకుండా నిలిపివేయటానికి అప్పీల్స్ న్యాయస్థానం ఓ షరతు విధించింది. పది రోజుల్లో రూ.1,460 కోట్ల(17.5కోట్ల డాలర్ల)ను చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ మొత్తాన్ని జమ చేస్తే రూ.3,788 కోట్లను వసూలు చేయకుండా నిలిపేసేలా ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పింది. దాంతో ట్రంప్‌నకు భారీ ఊరట లభించినట్లైంది. -
కుబేరుల బిడ్డలు : ఘనమైన బహుమతులు, వీటి విలువ తెలుసా?
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి తన 4 నెలల మనవడు గ్రాహ్కు రూ. 240 కోట్ల విలువైన 15 లక్షల ఇన్ఫోసిస్ షేర్లను బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఏయే సెలబ్రీటీలు తమ వారసులకు ఏయే ఖరీదైన గిఫ్ట్‌లు వార్తల్లో నిలిచాయి. నారాయణ మూర్తి కుమారుడు రోహన్ మూర్తి , అపర్ణ కృష్ణన్‌ల కుమారుడైన ఏకగ్రాహ్కు సుధా,మూర్తి దంపతులకు మూడో మనవడు . యూకే ప్రధాని రిషి సునక్ భార్య అక్షతామూర్తి వీరి పెద్ద కుమార్తె. అక్షత, రిషీలకు కృష్ణ , అనౌష్క అనే ఇద్దరు పిల్లలున్నారు. అంబానీ పెద్ద కోడలి గిఫ్ట్ ఆకాష్ అంబానీ భార్య శ్లోకా మెహతాకు అంబానీ పెద్ద కోడలు కూడా ఖరీదైన బహుమతి దక్కించుకుని అప్పట్లో వార్తల్లో నిలిచారు. రూ. 451 కోట్ల విలువైన మౌవాద్ ఎల్' నెక్లెస్‌ను నీతా అంబానీ కోడిలికి పెళ్లి బహుమతిగా ఇచ్చారు. కుమారుడికి పుట్టినరోజుకి పూనావాలా గిఫ్ట్ ఏంటంటే.. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనావాలా, DC కామిక్ పుస్తకాన్ని పోలిన బ్యాట్మొబైల్ను తన కుమారుడికి బహుమతిగా ఇచ్చారు. 2015లో తన కుమారుడి 6వ పుట్టినరోజు సందర్భంగా, అదార్ పూనావల్ల తన Mercedes-Benz S-క్లాస్‌ని బ్యాట్‌మొబైల్ మోడల్లో తీర్చిదిద్దేలా చేశారు.ఈ మార్పులు పూర్తి చేయడానికి ఆరు నెలలకు పైగా పట్టిందట. శివ నాడార్ కూడా ప్రముఖ టెక్ సంస్థ హెసీఎల్ ఫౌండర్ పౌండర్, ఛైర్మన్ శివ్ నాడార్ 2014లో తన ఏకైక కుమార్తె రోష్ని కోసం ఒక లగ్జరీ ఇంటిని కొనుగోలు చేశారు. తూర్పు ఢిల్లీలోని ఫ్రెండ్స్ కాలనీలోని ఈ బంగ్లా విలువ రూ. 115 కోట్లు. ఇషా అంబానీ ట్విన్స్ కోసం ఇషా అంబానీ వ్యాపారవేత్తగా సత్తా చాటుతున్న ఇషా అంబానీ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ముఖేష్ అంబానీ , నీతా అంబానీ ఏకైక కుమార్తె, ఇషా అంబానీ 2018లో బిలియనీర్ ఆనంద్ పిరమల్‌ను వివాహం చేసుకుంది. ఈ పెళ్లి సందర్భంగానే అజయ్ పిరమల్ స్వాతి పిరమల్ దంపతులు ఇషా , ఆనంద్ పిరమల్లకు ముంబైలోని ‘గులిటా’ అనే ఒక విలాసవంతమైన ఇంటిని బహుమతిగా ఇచ్చారు. దీని విలువ రూ.450 కోట్లు అని సమాచారం. అలాగే ఇషా, ఆనంద్ దంపతులు ట్విన్స్ పుట్టిన సందర్భంగా అంబానీ ప్రత్యేకంగా తయారు చేసిన అల్మారాను బహుమతిగా ఇచ్చారు. 2022లో పుట్టిన కృష్ణ-ఆదియాలకు ఖరీదైన గిఫ్ట్ ఇవ్వడం విశేషం. బిల్‌గేట్స్ ముద్దుల బిడ్డ కోసం మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు , బిలియనీర్ బిల్ గేట్స్ తన కుమార్తె జెన్నిఫర్ గేట్స్ నాసర్‌పై తనకున్న ప్రేమను ఘనంగా చాటుకున్నాడు. బిల్ గేట్స్ తన కూతురికి 277 కోట్ల రూపాయల విలువైన 124 ఎకరాలగుర్రపు ఫారమ్‌ను బహుమతిగా ఇచ్చాడు. అమెరికాలోని ఫ్లోరిడాలోని వెల్లింగ్టన్లో ఉన్న ఈ గుర్రపు ఫారమ్‌ను ఎవర్గేట్ స్టేబుల్స్ అంటారు.ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన తరువాత తన కుమార్తె రైడింగ్ కెరీర్‌ను మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఈ గిఫ్ట్ ఇచ్చారట. -
Forbes Billionaires 2023: నూతన కుబేరుడు బెర్నార్డ్ ఆర్నాల్ట్
పారిస్: ఫ్రాన్సుకు చెందిన ప్రముఖ లగ్జరీ వస్తువుల కంపెనీ ఎల్వీఎంహెచ్ సీఈవో బెర్నార్డ్ ఆర్నాల్ట్(74) అత్యంత సంపన్నుడిగా స్థానం సంపాదించారు. ఎలాన్ మస్క్ స్థానంలో ఆర్నాల్ట్‌ను చేరుస్తూ తాజాగా ఫోర్బ్స్ కంపెనీ రియల్ టైం బిలియనీర్ల జాబితాను ప్రకటించింది. ప్రపంచ కుబేరుడి స్థానంలో ఎలాన్ మస్క్ ఆస్తుల విలువ శుక్రవారం 204.5 బిలియన్ డాలర్లకు తగ్గిపోగా, బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఆస్తుల విలువ ఏకంగా 23.6 బిలియన్ డాలర్లు పెరిగి 207.8 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు ఫోర్బ్స్ వివరించింది. ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీ షేర్ల విలువ గురువారం ఒక్కసారిగా 13 శాతం తగ్గడంతో ఆ మేరకు మస్క్ ఆస్తిలో 18 మిలియన్ డాలర్ల మేర కోతపడింది. అదే సమయంలో, ఎల్వీఎంహెచ్ షేర్ల విలువ శుక్రవారం 13 శాతం పెరుగుదల నమోదు చేసుకోగా ఆ కంపెనీ మార్కెట్ విలువ 388.8 మిలియన్ డాలర్లకు ఎగబాకిందని ఫోర్బ్స్ తెలిపింది. బెర్నార్డ్‌కు ఎల్వీఎంహెచ్తోపాటు లూయిస్ విట్టన్, ట్యాగ్ హ్యుయెర్, డామ్ ప్రిగ్నోన్, టిఫ్ఫనీ అండ్ కో వంటి ప్రముఖ బ్రాండ్లు కూడా ఉన్నాయి. 500 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ కలిగిన ఏకైక యూరప్ కంపెనీగా గత ఏడాది ఏప్రిల్‌లో ఎల్వీఎంహెచ్ గుర్తింపు పొందింది. -
ప్రపంచంలో యంగెస్ట్ బిలియనీర్స్ వీరే.. ఒక్కొక్కరి ఆస్తి ఎంతంటే?
Top 5 Youngest Billionaires: ఫోర్బ్స్ ఇటీవల ప్రపంచంలోని అత్యంత పిన్న వయస్కులైన బిలియనీర్ల జాబితాను విడుదల చేసింది. ఇందులో మొదటి ఐదు స్థానాల్లో ఎవరు ఉన్నారు, వారు ఎలా సంపాదిస్తున్నారు, వారి ఆస్తులు ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. క్లెమెంటే డెల్ వెచియో ఫోర్బ్స్ విడుదల చేసిన యంగెస్ట్ బిలియనీర్ల జాబితాలో అగ్ర స్థానం పొందిన వ్యక్తి 'క్లెమెంటే డెల్ వెచియో'. ఇతని ఆస్తి 4 బిలియన్ డాలర్లు. భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 30వేల కోట్ల కంటే ఎక్కువ. ఇటాలియన్ బిలియనీర్ లియోనార్డో డెల్ వెచియో కుమారుడు క్లెమెంటే, తండ్రి మరణం తర్వాత వారసత్వంగా 12.5 శాతం వాటాను పొంది.. 18 సంవత్సరాలకే ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన బిలియనీర్ అయ్యాడు. కిమ్ జంగ్ యౌన్ సౌత్ కొరియాకు చెందిన 'కిమ్ జంగ్ యౌన్' ఫోర్బ్స్ విడుదల చేసిన యంగెస్ట్ బిలియనీర్ల జాబితాలో రెండవ స్థానం పొందిన యువకుడు. ఆన్లైన్ గేమింగ్ కంపెనీ నెక్సాన్‌లో అతిపెద్ద వాటాదారు కూడా. తన తండ్రి కిమ్ జంగ్-జు 2022లో 54 ఏళ్ల వయసులో మరణించిన తరువాత ఇతని ఆస్తి 2.5 బిలియన్ డాలర్లు అని తెలుస్తోంది. ఇతని వయసు ప్రస్తుతం 19 సంవత్సరాలు. కెవిన్ డేవిడ్ లెమాన్ జర్మనీకి చెందిన కెవిన్ డేవిడ్ లెమాన్ దేశంలోని డ్రగ్‌స్టోర్ చైన్ డీఎమ్ (Drogerie Markt)లో 50 శాతం యాజమాన్య వాటాను కలిగి ఉన్నాడు. దీని వార్షిక ఆదాయం 14 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ అని తెలుస్తోంది. గొయెట్జ్ వెర్నర్ జర్మనీలోని కార్ల్స్రూహ్లో తన మొదటి డిఎమ్ స్టోర్‌ను స్థాపించినప్పటి నుంచి ఇప్పటికి 3,700 కంటే ఎక్కువ ప్రదేశాలలో స్టోర్లను కలిగి ఉన్నట్లు సమాచారం. 1974లో కెవిన్ డేవిడ్ లెమాన్ తండ్రి గెంతెర్ (Guenther) 'డీఎమ్'లో పెట్టుబడి పెట్టారు. ఆ తరువాత 2017లో కెవిన్ డేవిడ్‌కు 50శాతం వాటాను బదిలీ చేశారు. ఇతని ఆస్తి ఫోర్బ్స్ ప్రకారం 1.7 బిలియన్ డాలర్లు అని తెలుస్తోంది. కిమ్ జంగ్ మిన్ ఫోర్బ్స్ జాబితా ప్రకారం, కిమ్ జంగ్ మిన్ నాలువ అతి తక్కువ వయసున్న బిలియనీర్. దక్షిణ కొరియాకు చెందిన ఈమె NXCలో సుమారు 31 శాతం వాటాను కలిగి ఉంది. ఇది ప్రఖ్యాత ఆన్లైన్ గేమింగ్ దిగ్గజం నెక్సాన్‌లో అతిపెద్ద వాటాదారుగా కూడా ఉంది. కిమ్ జంగ్ మిన్ ఆస్తి 1.4 బిలియన్ డాలర్లు. ఇదీ చదవండి: 19 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఆస్తి ఎంతో తెలిస్తే అవాక్కవుతారు! లూకా డెల్ వెచియో ఫోర్బ్స్ జాబితాలో ఐదవ యంగెస్ట్ బిలియనీర్ లూకా డెల్ వెచియో. 22 సంవత్సరాల ఇతడు దివంగత లియోనార్డో డెల్ వెచియో ఆరుగురి సంతానంలో ఒకరు. తండ్రి ఆస్తిలో 12.5 శాతం వారసత్వ వాటా రావడం మాత్రమే కాకుండా.. ఇతడు ఎస్సిలర్లుక్సోటికా హోల్డింగ్‌లు, ఇన్సూరెన్స్ జనరల్‌లో షేర్లు, రియల్ ఎస్టేట్ డెవలపర్ కోవివియోలో కూడా షేర్స్ కలిగి ఉన్నట్లు సమాచారం. -
బిలియనీర్ జాబితాలో ఎంట్రీ.. రూ.8వేల కోట్ల సంపద.. ఎలా సాధ్యమైందంటే
మంచి బిజినెస్ ఐడియా ఉంటే కోటీశ్వరులు కావడం సులువేనని చాలా మంది నిరూపిస్తున్నారు. స్టార్టప్ కంపెనీ స్థాపించి లాభాలు పొందుతున్నారు. తర్వాత కొన్ని రోజులకు ఐపీఓ ద్వారా స్టాక్మార్కెట్లో లిస్ట్ అయి కోట్లు గడిస్తున్నారు. దాంతో ఏళ్లుగా మార్కెట్లో ఉంటున్న సంపన్నుల సరసన కొత్త బిలియనీర్లు చేరుతున్నారు. ఈ క్రమంలో తాజాగా భారత బిలియనీర్ల జాబితాలో కొత్తగా ప్రదీప్ రాథోడ్ స్థానం సంపాదించారు. అసలు ఈయన ఎవరు? ఏ వ్యాపారం చేస్తుంటారు.. వంటి అంశాల గురించి తెలుసుకుందాం. వంట గదుల్లో ఉపయోగించే వస్తువులు, థర్మోవేర్ ఉత్పత్తులను తయారుచేసే కంపెనీ సెల్లో వరల్డ్ ఛైర్మన్‌గా ప్రదీప్ రాథోడ్ వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఆయన కంపెనీ ఐపీవో ద్వారా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. మార్కెట్లోని డిమాండ్ వల్ల పెట్టుబడిదారులు, రిటైల్ ఇన్వెస్టర్లు కంపెనీ స్టాక్‌ను కొనుగోలు చేయడంతో స్టాక్ ధర అమాంతం పెరిగింది. దాంతో తన సంపద కూడా పెరిగి బిలియనీర్‌గా మారిపోయారు. ఆయనకు కంపెనీలో 44 శాతం వాటా ఉంది. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ప్రదీప్ రాథోడ్ వద్ద రూ.8,300 కోట్ల సంపద ఉన్నట్లు ఫోర్బ్స్ ప్రకటించింది. ఆయన బడామియా చారిటబుల్ ట్రస్ట్‌కు ట్రస్టీగా కొనసాగుతున్నారు. జేఐటీఓ అడ్మినిస్ట్రేటివ్ ట్రైనింగ్ ఫౌండేషన్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. సెల్లోవరల్డ్ కంపెనీ కిచెన్ వేర్, థర్మోవేర్, పెన్నులు, స్టేషనరీ ఉత్పత్తులను తయారు చేస్తోంది. 2017లో గాజు ఉత్పత్తుల తయారీలోకి కంపెనీ ప్రవేశించింది. 1974లో ఈ కంపెనీని స్థాపించారు. కంపెనీ తయరుచేస్తున్న ఉత్పత్తులు, కంపెనీ రాబడులు, వ్యాపార విస్తరణ వంటి అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని ఇటీవల మార్కెట్లో లిస్ట్ చేశారు. ప్రస్తుతం కంపెనీ డామన్, హరిద్వార్, చెన్నై, కలకత్తాల్లో కలిపి 13 తయారీ కేంద్రాలు కలిగి ఉంది. 2023 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర లాభం 30 శాతం పెరిగి రూ.285 కోట్లుగా నమోదైంది. ఇదీ చదవండి: పసితనంలోనే పొదుపు పాఠాలు.. ఎందుకంటే.. ప్రస్తుతం ప్రదీప్ రాథోడ్ కుమారుడు గౌరవ్, తమ్ముడు పంకజ్ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్లుగా ఉన్నారు. రాథోడ్ కుటుంబం విమ్‌ప్లాస్ట్ లిమిటెడ్ కంపెనీకి ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్నారు. ఇది సెల్లో బ్రాండ్‌కు అనుబంధంగా ఉంటూ అనేక ప్లాస్టిక్ ఫర్నిచర్ ఉత్పత్తులను తయారు చేస్తోంది. ఇది గతంలోనే బీఎస్ఈలో లిస్ట్ అయింది. ఈ కంపెనీ రూ.700 కోట్ల మార్కెట్ క్యాపిటల్‌ను కలిగి ఉంది. -
దిగ్గజ పారిశ్రామికవేత్తలు చిన్నవారైపోతే, ఇలా ఉంటారా? (ఫోటోలు)
-
ప్రపంచ కుబేరుడి భార్యకు కాఫీ ధర ఎక్కువైందట!
ఇడహొ: ప్రపంచ కుబేరుల్లో వారెన్ బఫెట్ ఒకరు. ఆయన ఆస్తి 115 బిలియన్ డాలర్లకు పైమాటే. అటువంటి వ్యక్తి భార్య కాఫీ ధర ఎక్కువగా ఉందంటూ ఫిర్యాదు చేయడం ఆసక్తికర అంశంగా మారింది. సన్ వ్యాలీలో ఇటీవల బిలియనీర్ల సమ్మర్ క్యాంప్ జరిగింది. ఓ రిసార్టులో జరిగిన ఈ కార్యక్రమంలో వారెన్ బఫెట్ భార్య ఆస్ట్రిడ్ బఫెట్ కప్పు కాఫీకి నాలుగు డాలర్లు వసూలు చేయడంపై అక్కడి సిబ్బందికి ఫిర్యాదు చేశారట. ఇతర ప్రాంతాల్లోని కాఫీ ధరతో పోలిస్తే ఇది ఎక్కువేనంటూ అసహనం వ్యక్తం చేశారట. ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కాగా, సంపద ఎంతున్నా వారెన్ బఫెట్ మహా పొదుపరి. 1958లో 31,500 డాలర్లకు కొనుగోలు చేసిన ఇంట్లోనే ఆయన ఇప్పటికీ నివసిస్తున్నారు. -
News Cartoon: వాళ్లతో పాటు మనం డబుల్, త్రిబుల్ పెరుగుతున్నాం!
వాళ్లతో పాటు మనం డబుల్, త్రిబుల్ పెరుగుతున్నాం! -
నెలకు 50 లక్షలు సంపాదిస్తున్న ఆయా..!
-
అపర కుబేరులు జిమ్‌లో ఉంటే ఎలా ఉంటుంది - ఫోటోలు
-
అపర కుబేరులు జిమ్‌లో ఉంటే ఇలాగే ఉంటారా? ఫోటోలు చూడండి!
ప్రపంచ కుబేరులైన ఎలాన్ మస్క్, ముఖేష్ అంబానీ ఎప్పుడూ తమ వ్యాపారాల్లో బిజీగా ఉంటారనే విషయం అందరికి తెలిసిందే. ఎప్పుడూ బిజీగా ఉండే వీరు ఒక వేళా జిమ్‌లో వర్కౌట్లు చేస్తే ఎలా ఉంటుంది? అని ఆలోచించే ఉంటారు. అయితే అలాంటి వారు సాహిద్ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన ఫోటోలను తప్పకుండా చూడాల్సిందే. ఇన్స్టాగ్రామ్ యూజర్ సాహిద్ షేర్ చేసిన ఫోటోలు కేవలం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించినవి మాత్రమే. ఇందులో జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న ముఖేష్ అంబానీ, రతన్ టాటా, ఎలోన్ మస్క్, జెఫ్ బెజోస్, బెర్నార్డ్ అర్నాల్ట్, వారెన్ బఫెట్ మొదలైనవారు ఉన్నారు. ఈ చిత్రాలకు ఇప్పటి వరకు వెయ్యికంటే ఎక్కువ లైకులు వచ్చాయి. కొంత మంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇందులో ఒకరు 'మనీ+మజిల్=పవర్' అంటూ కామెంట్ చేశారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) రూపొందించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. AI అందుబాటులోకి వచ్చిన తరువాత గతాన్ని, భవిష్యత్తుని ఊహించేస్తున్నారు. ఒక వ్యక్తి చిన్నప్పుడేలా ఉండేవాడు, ముసలివాడైతే ఎలా ఉంటాడు అనేది కూడా ఇది గ్రహించేస్తోంది. (ఇదీ చదవండి: ఇండియాకు కేఎఫ్సి, పిజ్జా హట్ రావడానికి కారణం ఇతడే..!) ఈ ఫోటోలు చూసిన వారిలో కొంత మంది బిలీనియర్లు చిన్నప్పుడేలా ఉండేవారు, అలంటి చిత్రాలను కూడా రూపొందించండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. AI మీద అవగాహన ఉన్న సాహిద్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే మహేంద్ర సింగ్ ధోని, నరేంద్ర మోదీ వంటి ఫోటోలు కూడా ఉన్నాయి. ఇవన్నీ చూసేవారిని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. (ఇదీ చదవండి: ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్ - ఈ ధరతో ఒక కారు కొనేయొచ్చు!) ఈ ఫొటోలన్నీ మిడ్‌జర్నీ అనే AI అప్లికేషన్ ద్వారా రూపొందించినట్లు షాహిద్ పోస్ట్ ద్వారానే వెల్లడించారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. View this post on Instagram A post shared by SK MD ABU SAHID (@sahixd) -
బిలియనీర్లు C/O బుల్లి పట్టణాలు
సాక్షి, అమరావతి: సంపద సృష్టిలో చిన్న పట్టణాలు పెద్ద నగరాలతో పోటీపడుతూ తగ్గేదేలేదంటున్నాయి. దేశవ్యాప్తంగా రూ.వెయ్యి కోట్లకు పైగా సంపద కలిగిన వారిలో 178 మంది చిన్న పట్టణాల్లోనే నివసిస్తున్నట్టు ఐఐఎఫ్ఎల్ హూరన్ ఇండియా రిచ్ లిస్ట్–2022 నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా రూ.వెయ్యి కోట్లపైగా సంపద కలిగిన వారు 1,103 మంది ఉండగా.. అందులో 178 మంది చిన్న పట్టణాలకు చెందిన వారేనని వెల్లడించింది. ఈ 178 మంది కలిసి రూ.6,37,800 కోట్ల సంపదను సృష్టించారు. అత్యధికంగా గుజరాత్లో 38 మంది బిలియనీర్లు చిన్న పట్టణాల్లో ఉంటే.. తమిళనాడులో 29 మంది బిలియనీర్లు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు పట్టణాల్లో ఆరుగురు బిలియనీర్లు ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. చిన్న పట్టణాల్లో అత్యధికంగా గుజరాత్‌లోని సూరత్‌లో 19 మంది బిలియనీర్లు నివసిస్తున్నారు. ఈ 19 మంది కలిసి రూ.51 వేల కోట్ల సంపద సృష్టించారు. ఆ తర్వాత తమిళనాడులోని కోయంబత్తూర్‌లో 14మంది కలిసి రూ.38,200 కోట్ల సంపద కలిగి ఉన్నారు. రాజస్థాన్‌లోని రాజ్‌కోట్‌లో ఏడుగురు, పంజాబ్‌లోని లుథియానాలో ఏడుగురు బిలియనీర్లు ఉన్నారు. నగరాల్లో చూస్తే ఒక్క ముంబైలోనే అత్యధికంగా 283 మంది బిలియనీర్లు నివసిస్తున్నారు. ఆ తర్వాత స్థానంలో ఢిల్లీలో 185 మంది, బెంగళూరులో 89 మంది బిలియనీర్లు నివసిస్తున్నారు. హైదరాబాద్‌లో 64 మంది, చెన్నైలో 51 మంది బిలియనీర్లు నివసిస్తున్నారు. పట్టణాల్లో సూరత్.. త్రిసూర్ సంపద విలువ పరంగా చూస్తూ సూరత్, త్రిస్సూర్, కోయంబత్తూర్ పట్టణాలు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. సూరత్‌లో 19 మంది బిలియనీర్లు రూ.51 వేల కోట్ల సంపదను కలిగి ఉంటే త్రిస్సూర్‌లో నలుగురు బిలియనీర్లు రూ.40 వేల కోట్ల సంపద కలిగి ఉన్నారు. కోయంబత్తూర్‌లో 14 మంది రూ.38,200 కోట్ల సంపదను, హరిద్వార్‌లో ఒకరే రూ.32,400 కోట్ల సంపదను కలిగి ఉన్నారు. కేరళలోని పట్టణాల్లో బిలియనీర్ల సగటు సంపద విలువ ఇతర రాష్ట్రాల కంటే అత్యధికంగా ఉంది. ఎర్నాకుళంలో నలుగురు కలిసి రూ.18,800 కోట్లు, కొట్టాయంలో ఒకరే రూ.8,600 కోట్లు, తిరువనంతపురంలో ముగ్గురు కలిసి రూ.10,800 కోట్ల సంపద కలిగి ఉన్నారు. మన రాష్ట్రంలో ఆరుగురు మన రాష్ట్రం విషయానికి వస్తే.. విశాఖలో అత్యధికంగా ముగ్గురు బిలియనీర్లు ఉన్నారు. ఆ ముగ్గురి సంపద విలువ రూ.7,100 కోట్లు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రూ.వెయ్యి కోట్ల సంపదతో ఒకరు, విజయవాడలో రూ.3,600 కోట్ల సంపద కలిగిన ఒకరు, తిరుపతిలో రూ.2,800 కోట్ల సంపదతో ఒకరు ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. -
ధనవంతులు ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ ఎక్కడుందంటే?
ప్రపంచంలోని ధనవంతుల జాబితా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. గడచిన కొన్ని సంవత్సరాలలో ప్రపంచంలో ధనవంతుల సంఖ్య భారీగా పెరిగింది. ఇటీవల ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్స్ విడుదల చేసిన నివేదికల ప్రకారం ప్రపంచంలో మొత్తం 2,640 మంది బిలియనీర్లు ఉన్నట్లు తెలిసింది. ప్రపంచంలో ఎక్కువ మంది ధనవంతులున్న దేశాల్లో మొదటి స్థానంలో ఉన్న దేశమేది, చివరి స్థానంలో ఉన్న దేశమేది, ఇందులో ఇండియా స్థానం ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. ఫోర్బ్స్ వెల్లడించిన నివేదికల ప్రకారం, అత్యధిక బిలినియర్లు ఉన్న దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంది. అమెరికాలో మొత్తమ్ 735 మంది బిలినియర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలో అత్యధిక ధనవంతులున్న దేశం అమెరికా అయినప్పటికీ ప్రపంచ ధనవంతుడు మాత్రం ఫ్రాన్స్‌కు చెందిన వాడు కావడం గమనార్హం. ప్రపంచ జనాభలో మాత్రమే కాకుండా.. ఎక్కువ మంది బిలినీయర్లు ఉన్న దేశంగా చైనా రెండవ స్థానం ఆక్రమించింది. చైనాలో మొత్తం 495మంది ధనవంతులున్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. గతంలో వెల్లడైన జాబితాలో మొత్తం 539 మంది ధనవంతులను, దీన్ని బట్టి చూస్తే ఈ సరి చైనాలో ధనవంతుల సంఖ్య తగ్గింది. (ఇదీ చదవండి: మరణం తర్వాత కూడా భారీగా సంపాదిస్తున్న యూట్యూబర్.. ఇతడే!) ప్రపంచ జనాభాలో రెండవ స్థానంలో ఉన్న భారత్, ధనవంతుల జాబితాలో మూడవ స్థానంలో ఉంది. మన దేశంలో మొత్తం 169మంది బిలినియర్లు ఉన్నట్లు సమాచారం. భారతేశంలో ఉన్న బిలినియర్ల సంపద సుమారు 675 బిలియన్ డాలర్లు. ఇక నాలుగు, ఐదు స్థానాల్లో జర్మనీ, రష్యా ఉన్నాయి. ఈ దేశాల్లో ఉన్న బిలినియర్ల సంఖ్య వరుసగా 126, 105 మంది. జర్మనీలోని రిచెస్ట్ పర్సన్‌గా స్క్వార్జ్ గ్రూప్ అధినేత డైటర్ స్క్వార్జ్ నిలిచారు. ఆయన సంపద ప్రస్తుతం 42.9 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే గత ఏడాది నుంచి ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా రష్యాలో దిగ్గజ వ్యాపారులు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక చివరి స్థానంలో హంగేరి, స్విజర్లాండ్ వంటి దేశాలు 58వ స్థానంలో ఉన్నాయి. -
అదానీకి హిండెన్‌బర్గ్ షాక్, మరో బిలియనీర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి,ముంబై: హిండెన్‌బర్గ్ రిపోర్ట్ సృష్టించిన అలజడితో అత్యంత సంపన్నుడైన గౌతం అదానీ సంపద కీలకమైన 100 బిలియన్ల మార్క్‌కు దిగువకు పడిపోయింది. తాజా డేటా ప్రకారం ఆసియా, భారతదేశంలోని అత్యంత సంపన్న బిలియనీర్- గౌతం అదానీ సంపద శుక్రవారం మరింత పతన మైంది. ప్రపంచ సంపన్నుల జాబితాలో అతని ర్యాంకింగ్ శుక్రవారం ఏడో స్థానానికి పడిపోయింది. తద్వారా ప్రపంచంలోని మొదటి ఐదుగురు సంపన్నుల జాబితా నుంచి అదానీ తప్పుకున్నారు. 100 బిలియన్ డాలర్ల దిగువకు ఫోర్బ్స్ రియల్ టైమ్స్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం, అదానీ సంపద రోజులో 22.5 బిలియన్ల డాలర్లకు పైగా క్షీణించి 96.8 బిలియన్ల డాలర్లకు చేరింది. ఫలితంగా అదానీ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కంటే దిగువ స్థానంలో ఉన్నారు. అదానీ షేర్ల భారీ ర్యాలీతో మొదట 2వ స్థానానికి చేరుకున్నారు గౌతం అదానీ. ఆ తరువాత చాలా కాలం పాటు 3వ స్థానంలో కొనసాగి, ఇటీవల నాలుగోప్లేస్కు దిగజారిన సంగతి తెలిసిందే. బిల్ అక్మాన్ వ్యాఖ్యలు అదానీ గ్రూప్ అవకతవకలపై అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హింబెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ ఆరోపణలపై బిలియనీర్, అమెరికాకు చెందిన ప్రముఖ పెట్టుబడిదారుడు బిల్ అక్మాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక "అత్యంత విశ్వసనీయమైనది, చాలా లోతుగా పరిశోధించబడింది" అంటూ బిల్ అక్మాన్ ట్వీట్ చేశారు. హిండెన్‌బర్గ్ ఫారెన్సిక్ రీసెర్చ్ పూర్తి రిపోర్ట్ ఆధారంగానే, తప్ప తామెలాంటి ఇండిపెండెంట్ పరిశోధన చేయలేదంటూ అదానీ-హిండెన్‌బర్గ్ వివాదంలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే అదానీ కంపెనీల్లో, లేదా హెర్బా లైఫ్‌లో తమకు ఎలాంటి పెట్టుబడులు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు అదానీ ఎంటర్ ప్రైజెస్ భారత క్యాపిటల్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద ఎఫ్‌పీవో (ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్) కు ముందు హిండెన్‌బర్గ్ రిపోర్ట్ రావడం గమనార్హం. నేటినుంచి( జనవరి 27) 31 వరకు నిర్వహించే ఎఫ్‌పీవోలో రూ.20 వేల కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. రూ. 3.4 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న అదానీ ఎంటర్ ప్రైజెస్ ఆఫర్ ప్రైస్‌ను ధరను రూ.3,112 నుంచి రూ.3,276గా నిర్ణయించింది. -
బెజోస్ నుంచి మస్క్ దాకా, ప్రపంచ బిలియనీర్లకు భారీ షాక్
న్యూఢిల్లీ: అమెరికా ఎకానమీలో ముదురుతున్న మాంద్యం భయాలకు తోడు, ఊహించినదానికంటే ఎక్కువగా నమోదైన అధిక ద్రవ్యోల్బణం కారణంగా అక్కడి మార్కెట్లు భారీ పతనాన్ని నమోదు చేశాయి. ఫలితంగా భారీగా ఫెడ్ వడ్డింపు తప్పదనే భయాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలోని అత్యంత సంపన్న బిలియనీర్ల సంపద మంగళవారం నాడు 93 బిలియన్ డాలర్ల మేర పడిపోయింది. ఇది తొమ్మితో అత్యంత దారుణమైన రోజువారీ నష్టమని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. (బెజోస్,మస్క్ సరే! మరి అదానీ, అంబానీ సంపద మాట ఏంటి?) బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం అమెరికా కుబేరుల సంపద భారీగా తుడుచిపెట్టుకుపోయింది. ముఖ్యంగా అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ సంపద ఒక్క రోజు లోనే రూ. 80 వేల కోట్లు (9.8 బిలియన్ డాలర్లు)ను కోల్పోయారు.. అలాగే టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ నికర విలువలో రూ.70 వేల కోట్లు (8.4 బిలియన డాలర్లను) పడిపోయింది. అంతేకాదు మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్, లారీ పేజ్, సెర్గీ బ్రిన్ , స్టీవ్ బాల్మెర్లు ఇదే బాటలో పయనించారు. వీరి సంపద మొత్తం 4 బిలియన్ డాలర్లకు పైగా క్షీణించగా, టాప్ 10 జాబితాలోని ఇతర బిలియనీర్లు వారెన్ బఫెట్, బిల్ గేట్స్ వరుసగా 3.4 బిలియన్ డాలర్లు, 2.8 బిలియన్ డాలర్లను కోల్పోయారు. కాగా అమెరికా వినియోగదారుల ధరల సూచీ అంతకుముందు ఏడాదితో పోలిస్తే 8.3 శాతం మేర పెరిగింది. ఇది 8.1 శాతంగా ఉంటుందని నిపుణులు అంచనా వేశారు. దీంతో ఇది మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఇన్వెస్టర్ల అమ్మకాలతో గత ఐదు రోజుల్లో అమెరికా స్టాక్ మార్కెట్లు తీవ్రంగా నష్టపోతున్నాయి. -
30 గంటలకు ఒక కొత్త బిలియనీర్
దావోస్: కరోనా వైరస్ మహమ్మారి వెలుగు చూసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అసమానతలు పెరిగిపోయినట్టు ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ తెలిపింది. కరోనా కాలంలో ప్రతి 30 గంటలకు ఒక బిలియనీర్ (బిలియన్ డాలర్లు అంతకుమించి సంపద కలిగినవారు) కొత్తగా పుట్టుకువచ్చినట్టు చెప్పింది. ఈ ఏడాది ప్రతి 33 గంటలకు సుమారు పది లక్షల మంది తీవ్ర పేదరికంలోకి జారుకుంటారని ఈ సంస్థ అంచనా వేసింది. ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశం సందర్భంగా దావోస్‌లో ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికకు ‘ప్రాఫిటింగ్ ఫ్రమ్ పెయిన్’ (బాధ నుంచి లాభం/కరోనా కాలంలో పేదల కష్టాల నుంచి లాభాలు పొందడం) అని పేరు పెట్టింది. పెరిగిన ధరలతో బిలియనీర్లకు పంట దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత స్థాయిలో నిత్యావసరాల ధరలు పెరిగిపోయినట్టు తెలిపింది. దీంతో ఆహారం, ఇంధన రంగాల్లోని బిలియనీర్లు తమ సంపదను ప్రతి రెండు రోజులకు బిలియన్ డాలర్లు (రూ.7,700 కోట్లు) చొప్పున పెంచుకున్నట్టు వివరించింది. 573 మంది కొత్త బిలియనీర్లు కరోనా విపత్తు సమయంలో (రెండేళ్ల కాలంలో) కొత్తగా 573 మంది బిలీయనీర్లు పుట్టుకొచ్చినట్టు ఆక్స్‌ఫామ్ నివేదిక వెల్లడించింది. దీన్ని ప్రతి 30 గంటలకు ఒక బిలీయనీర్ ఏర్పడినట్టు తెలిపింది. 26 కోట్ల మంది తీవ్ర పేదరికంలోకి ఈ ఏడాది 26.3 కోట్ల మంది ప్రజలు తీవ్ర పేదరికంలోకి జారుకుంటారని అంచనా వేస్తున్నట్టు ఆక్స్‌ఫామ్ ప్రకటించింది. ప్రతి 33 గంటలకు పది లక్షల మంది పేదరికంలోకి వెళ్తారని వివరించింది. 23 ఏళ్ల కంటే రెండేళ్లలో ఎక్కువ కరోనాకు ముందు 23 ఏళ్లలో ఏర్పడిన సంపద కంటే కరోనా వచ్చిన రెండేళ్లలో బిలియనీర్ల సంపద ఎక్కువ పెరిగినట్టు ఆక్స్‌ఫామ్ నివేదిక తెలిపింది. ‘‘ఇప్పుడు ప్రపంచంలోని బిలియనీర్ల సంపద విలువ ప్రపంచ జీడీపీలో 13.9 శాతానికి సమానం. 2000లో ప్రపంచ జీడీపీలో బిలియనీర్ల సంపద 4.4 శాతమే’’అంటూ ప్రపంచంలోని అసమానతలను ఆక్స్‌ఫామ్ తన నివేదికలో ఎత్తి చూపింది. ‘‘కార్మికులు తక్కువ వేతనానికే, దారుణమైన పరిస్థితుల మధ్య ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. అధిక సంపద పరులు వ్యవస్థను దశాబ్దాలుగా రిగ్గింగ్ చేశారు. వారు ఇప్పుడు ఆ ఫలాలను పొందుతున్నారు. ప్రైవేటీకరణ, గుత్తాధిపత్యం తదితర విధానాల మద్దతుతో ప్రపంచ సంపదలో షాక్‌కు గురిచేసే మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు’’అని ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ ఈడీ గ్యాబ్రియెల్ బుచెర్ అన్నారు. ఆకలి కేకలు.. ‘‘మరోవైపు లక్షలాది మంది పస్తులు ఉండాల్సిన పరిస్థితి. మనుగడ కోసం వారు తదుపరి ఏం చేస్తారన్నది చూడాలి. తూర్పు ఆఫ్రికా వ్యాప్తంగా ప్రతి నిమిషానికి ఒక వ్యక్తి ఆకలితో చనిపోతున్నారు. ఈ స్థాయి అసమానతలు మానవత్వంతో మనుషులు కలిసి ఉండడాన్ని విచ్ఛిన్నం చేస్తోంది. ఈ ప్రమాదకరమైన అసమానతలను అంతం చేయాలి’’అని బుచెర్ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో ఐదు అతిపెద్ద ఇంధన సంస్థలైన బీపీ, షెల్, టోటల్ ఎనర్జీ, ఎక్సాన్, చెవ్రాన్ కలసి ప్రతి సెకనుకు 2,600 డాలర్ల లాభాన్ని పొందాయని ఆక్స్‌ఫామ్ నివేదిక తెలిపింది. రికార్డు స్థాయి ఆహార ధరలతో శ్రీలంక నుంచి సూడాన్ వరకు సామాజికంగా అశాంతిని చూస్తున్నాయని.. 60% తక్కువ ఆదాయం కలిగిన దేశాలు రుణ సంక్షోభంలో ఉన్నాయని తెలిపింది. సంపన్నుల ఐశ్వర్యం ‘‘2,668 బిలియనీర్ల వద్ద 12.7 లక్షల కోట్ల డాలర్ల సంపద ఉంది. ప్రపంచంలో అట్టడుగున ఉన్న 301 కోట్ల ప్రజల (40 శాతం) ఉమ్మడి సంపద కంటే టాప్ 10 ప్రపంచ బిలియనీర్ల వద్దే ఎక్కువ ఉంది. సమాజంలో దిగువ స్థాయిలో ఉన్న వ్యక్తి 112 ఏళ్లు కష్టపడితే కానీ.. అగ్రస్థానంలో ఒక వ్యక్తి ఏడాది సంపాదనకు సరిపడా సమకూర్చుకోలేని పరిస్థితి నెలకొంది’’అని ఆక్స్‌ఫామ్ నివేదిక తెలిపింది. ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశాలు ఈ నెల 22న దావోస్‌లో ప్రారంభం కాగా, 26న ముగియనున్నాయి. -
ప్రపంచ కుబేరుల జాబితాలో అంబానీ,అదానీ స్థానమేంటో తెలుసా ??
-
బిక్కచచ్చిపోతున్న బిలియనీర్లు
-
పుతిన్ యుద్దోన్మాదం.. బిక్కుబిక్కుమంటున్న రష్యన్ బిలియనీర్లు
ఆర్థిక ఆంక్షల నేపథ్యంలో రష్యా వెలుపల భారీగా ఆస్తులు కలిగి ఉన్న రష్యన్ బిలియనీర్లు బిక్కుబిక్కుమంటున్నారు. తమ వ్యాపార సామ్రాజ్యాలకు ఎక్కడ బీటుల వారుతాయోనని, తమ ఆస్తులు జప్తు చేస్తారేమోననే భయాలు వెంటాడుతున్నాయి. ప్రపంచం మొత్తం వారిస్తున్నా ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించారు రష్యా అధ్యక్షుడు పుతిన్. రష్యన్ సైనిక దళాల తీరుతో ఉక్రెయిన్‌లోని నగరాలపై బాంబుల వర్షం కురుస్తోంది. మరోవైపు రష్యా తీరును నిరసిస్తూ అమెరికా, యూరోపియన్ యూనియన్‌తో పాటు అనేక దేశాలు ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నాయి. వీటి ప్రభావం రష్యన్ బిలియనీర్లపై భారీగా పడనుంది. ఆర్థిక ఆంక్షల వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యే రష్యన్ కుబేరుల్లో ఈ నలుగురు ముందు వరుసలో ఉన్నారు. అలిషర్ ఉస్మానోవ్ రష్యన్ మెటల్ టైకూన్‌గా పేరున్న అలిషర్ ఉస్మానోవ్ 14 బిలియన్ డాలర్ల సంపద కలిగి ఉన్నారు. భవిష్యత్తును ముందుగానే ఊహించిన ఆయన ప్రారంభం దశలో ఉన్నప్పుడే అమెరికన్ కంపెనీ ఫేస్బుక్లో భారీగా ఇన్వెస్ట్ చేశారు. లండన్‌లో 300 మిలియన్ డాలర్ల విలువ చేసే ఎస్టేట్స్‌ని కలిగి ఉన్నారు. అదృష్టవశాత్తు ఇటీవల బ్రిటిష్ సాకర్ క్లబ్లో తన వాటాలు అమ్ముకుని 700 మిలియన్ డాలర్ల సొమ్మును వెనక్కి తీసుకున్నాడు. మిఖైల్ మరాటోవిచ్ ఫ్రిడ్మ్యాన్ రష్యలో ప్రైవేట్ బ్యాంకర్‌గా ఫేమస్ మిఖైల్ మరాటోవిచ్ ఫ్రిడ్మ్యాన్. 11.4 బిలియన్ డాలర్ల సంపద కలిగిన ఈ బిజినెస్ టైకూన్‌కి పాటు ఇజ్రాయిల్ సిటిజన్‌షిప్ ఉంది. ఆది నుంచి ఉక్రెయిన్‌పై రష్యా దాడిని విమర్శిస్తున్న బిజినెస్‌మ్యాన్‌గా ముద్ర పడ్డారు. ఎక్కువ కాలం రష్యా వెలుపలే జీవిస్తుండటంతో పుతిన్ పాలనకు వ్యతిరేకంగా చాలా సార్లు గళం విప్పారు. ఈయనకు రష్యా లోపల వెలుపల విలువైన ఆస్తులు ఉన్నాయి. అమెరికా మిత్ర పక్షాలతో పాటు రష్యా ప్రభుత్వం నుంచి కూడా మిఖైల్కి ఇబ్బందులు తప్పవని నిపుణులు అంటున్నారు. పీటర్ అవెన్ రష్యా దేశంలో రాజకీయ ప్రాబల్యం కలిగిన వ్యాపారవేత్తల్లో పీటర్ అవెన్ ఒకరు. ఆల్ఫా బ్యాంక్ గ్రూపుని నిర్వహిస్తున్న ఈయన సంపద 4.3 బిలియన్ డాలర్లుగా ఉంది. ఎకామిస్ట్, రైటర్‌గా అనే విభాగాల్లో ప్రావీణ్యం కలిగిన పీటర్ అవెన్ మరో వివాస్పద బిజినెస్ టైకూన్ మిఖైల్ మరాటోవిచ్తో అనేక వ్యాపారాల్లో భాగస్వామిగా ఉన్నారు. రష్యా దాడి కారణంగా ఇంటా బయట ఈయనకు ఉక్కపోత ఎదురువుతోంది అలెక్సీ మర్ధాషోవ్ రష్యాలో స్టీలు ఉత్పత్తిదారుల్లో ఒకటైన సివర్స్టాల్లో భాగస్వామిగా ఉన్నారు లెక్సీ మర్దాషోవ్. మరో ప్రముఖ కంపెనీ టీయూఐలో 30 శాతం వాటాలు ఉన్నాయి. ప్రపంచలోనే అతి పెద్ద ట్రావెల్ టూరిజం కంపెనీలు ఆయన సొంతం. ఈయన నికర సంపద 29 బిలియన్ డాలర్లుగా ఉంది. ట్రావెల్ కంపెనీ యజమానిగా, స్టీలు ఉత్పత్తిదారుడిగా పలు దేశాలతో అలెక్సీ కంపెనీలు లావాదేవీలు నిర్వహిస్తుంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకులు సైతం రష్యాతో సంబంధాలు తెంచుకోవడం అలెక్సీకి మింగుడుపడటం లేదు. చదవండి: రష్యా ఆర్థిక పరిస్థితి అతలాకుతలం -
గప్పాలొద్దు, దోచుకుంది చాలదా?.. ఎలన్ మస్క్‌కు చురకలు
టాప్ బిలియనీర్ హోదా, స్పేస్ఎక్స్ ప్రయోగాలు, క్రిప్టో కరెన్సీ ఇన్ఫ్లుయెన్సర్, సోషల్ మీడియా సెన్సేషన్, టైమ్ పర్సన్ 2021 ఇయర్ ఘనత .. వెరసి నిత్యం వార్తల్లో నిలిచే సెలబ్రిటీగా పోయిన ఏడాది మొత్తాన్ని ఏలేశాడు ఎలన్ మస్క్. అఫ్కోర్స్.. అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. అయితే కిందటి ఏడాది చివర్లో ఆయన చేసిన ఓ ట్వీట్ రాజకీయ విమర్శలకు కారణమైంది. డిసెంబర్ 20వ తేదీన ఎలన్ మస్క్ తన ట్విటర్లో ఓ ట్వీట్ చేశాడు. ఏడాదిగానూ ఏకంగా 11 బిలియన్ డాలర్ల పన్ను చెల్లించబోతున్నట్లు ప్రకటించుకున్నాడు. దీంతో ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన వ్యక్తి చెల్లించే పన్ను గురించి ఆసక్తికర చర్చ నడించింది. అయితే ఈ ట్వీట్‌పై ఎలన్ మస్క్‌ను తిట్టిపోస్తున్నారు అమెరికా చట్టప్రతినిధులు. ఎలన్ మస్క్ సహా ధనవంతులెవరూ సరైన పన్నులు చెల్లించడం లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. For those wondering, I will pay over $11 billion in taxes this year — Elon Musk (@elonmusk) December 20, 2021 ఈ విమర్శలు చేసేవాళ్లలో ఇండో-అమెరికన్ కాంగ్రెస్ఉమెన్ ప్రమీలా జయపాల్ కూడా ఉన్నారు. ప్రమీలా యూఎస్ హౌజ్‌లో తొలి ఇండో-అమెరికన్ కాంగ్రెస్ ఉమెన్ కూడా. పన్నుల చెల్లింపుపై గొప్పలకు పోతున్నారా? అంటూ ఆమె ఎలన్ మస్క్‌ను నిలదీశారు. ‘పన్ను చెల్లింపు విషయంలో గప్పాలు కొట్టుకోవద్దు.. ఆ చెల్లించేది సరైన పన్నులు కావనేది అందరికీ తెలుసు’ అని ఆమె పేర్కొన్నారు. ఎలన్ మస్క్ ఒక్కరోజు సంపాదనే 36 బిలియన్ డాలర్లు. కానీ, 11 బిలియన్ డాలర్లు ట్యాక్స్ చెల్లిస్తున్నట్లు గొప్పగా చెప్పుకుంటున్నారు. కేవలం కరోనా టైంలోనే 270 బిలియన్ డాలర్లు వెనకేసుకున్నాడు. ధనికులు తమ న్యాయమైన వాటాను చెల్లించే సమయం వచ్చేసింది’ అంటూ వ్యాఖ్యానించారామె. మరోవైపు రిపబ్లికన్ సెనేటర్ టెడ్ క్రూజ్ కూడా ‘ఎలన్ మస్క్ దోపిడీ’ మీద తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా చట్టప్రతినిధులకు, అమెరికాలోని బిలియనీర్లకు మధ్య ట్యాక్స్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. సక్రమంగా పన్నులు చెల్లించని బిలియనీర్ల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేసేందుకు ప్రత్యేక చట్టాల్ని రూపొందించింది బైడెన్ ప్రభుత్వం. దీని నుంచి తప్పించుకునేందుకు ఎలన్ మస్క్ సహా పలువురు టెక్ మేధావులు ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషిస్తున్నారు. ఇక 40.8 శాతం అత్యధిక పన్ను రేటుతో, 280 బిలియన్ డాలర్ల నికర విలువ సంపదన ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన మస్క్, టెస్లా షేర్ల ద్వారా దాదాపు 10.7 బిలియన్ డాలర్ల ఫెడరల్ పన్ను బిల్లును చెల్లించాల్సి ఉంటుందని ప్రోపబ్లికా నివేదిక పేర్కొంది. అయితే మస్క్ సహా ఇతర బిలియనీర్లు 2018లో ఫెడరల్ ఆదాయపు పన్నులు చెల్లించలేదని ప్రోపబ్లికా దర్యాప్తు ఒక నివేదిక విడుదల చేసింది. 2014 మరియు 2018 మధ్య కాలంలో, మస్క్ తన సంపద $13.9 బిలియన్లు పెరిగినప్పటికీ, 1.52 బిలియన్ డాలర్ల ఆదాయంపై కేవలం 455 మిలియన్ల డాలర్ల పన్నులు చెల్లించాడు. చదవండి: పాపం ఎలన్ మస్క్..! తినడానికి తిండి లేని రోజుల్లో ఏం చేసేవాడో తెలుసా? -
బిలియనీర్స్.. 42 మిలియన్ల మందిని కాపాడండి!
అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, టెస్లా అధినేత ఎలన్ మస్క్‌లు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు. ఇటీవల విడుదలై ఫోర్బ్స్ లెక్కల ప్రకారం ప్రపంచ ధనవంతుల జాబితాల్లో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. కానీ వీళ్లు దానం చేయడంలోనే ఏక్ నెంబర్ పిసినారులుగా అప్రతిష్టను మూటగట్టుకున్నారు. అయితే పిసినారులుగా ఉన్న వీళ్లిద్దరూ ఒకే సారి 6 బిలియన్ డాలర్లు డొనేట్ చేస్తే 42 మిలియన్ల మంది ( 4కోట్ల 20లక్షల మంది) ఆకలి కేకల నుంచి బయట పడతారని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. ఆకలి కేకలు.. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం గణాంకాల ప్రకారం..వరల్డ్ వైడ్‌గా 155 మిలియన్ల మందికి సరైన ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపింది. తాజాగా ఇదే అంశంపై యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ డేవిడ్ బీస్లీ..ప్రముఖ మీడియా సంస్థ సీఎన్ఎన్తో మాట్లాడారు. గతేడాది ప్రపంచ వ్యాప్తంగా 155 మిలియన్ల మందికి సరైన ఆహారం లేదు. వారిలో 42 మిలియన్ల మంది ఆకలి కేకలతో అలమటిస్తున్నారు. వారిని కాపాడేందుకు ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్‌లు ఒకే ఒక్కసారి 6 బిలియన్లను దానం చేయాలని కోరుతున్నాం. కోవిడ్ సమయంలో జెఫ్‌బెజోస్ ఆస్తి 6 బిలియన్లు పెరిగింది. తాజాగా ఎలన్ మస్క్ ఒక్కరోజే 6 బిలియన్లు సంపాదించారు. ఆ మొత్తాన్ని డొనేట్ చేయాలి. అలా డొనేట్ చేయమని మేం రోజులు, వారాలు లేదంటే సంవత్సరాల పాటు అడగంలేదు. కేవలం ఒకే ఒక్కసారి ఇస్తే సరిపోతుంది. ఇద్దరు బిలియనీర్లు దానం చేస్తే 42 మిలియన్ల మందిని కాపాడినట్లవుతుందని సీఎన్ఎన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాదు యూఎస్ మొత్తం మీద 400మంది బిలియనీర్లు ఉన్నారు. గతేడాది వీరి సంపాదన 1.8 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ఈ 400 మంది సంపాదించిన మొత్తంలో 36శాతం పేదలకు ఖర్చుపెట్టాలని కోరుతున్నాం' అని డేవిడ్ బీస్లీ మాట్లాడారు. ఫోర్బ్స్ లెక్కల ప్రకారం.. గత మంగళవారం (26వ తేదీ) రోజు ప్రపంచంలోనే అంత్యత ధనవంతుల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం.. టెస్లా అధినేత ఎలన్ మస్క్ 253.8 బిలియన్లు డాలర్లు, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ 196.1 బిలియన్ల డాలర్లతో సంపాదనలో పోటీ పడుతున్నారు. ఎలన్ మస్క్ కేవలం ఒక్కరోజే టెన్ బిలియన్ డాలర్లను అర్జించారు. చదవండి: ఎలన్ నువ్వు అసాధ్యుడివయ్యా..! అనుకుంటే ఏదైనా చేస్తావ్..! -
ప్రపంచ కుబేరులలో డీమార్ట్ బాస్
ముంబై: కరోనా టైంలో అన్నివర్గాలను ఆకర్షించి.. విపరీతంగా లాభాలు ఆర్జించింది డీమార్ట్ బ్రాండ్ సూపర్ మార్కెట్. తాజాగా ఈ స్టోర్ల ప్రమోటర్ రాధాకృష్ణన్ ఎస్.దమానీ తాజాగా ప్రపంచ సంపన్నుల జాబితాలో చేరారు. 19.2 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 1.42 లక్షల కోట్లు) నెట్‌వర్త్‌ను సాధించడం ద్వారా బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో 98వ ర్యాంకులో నిలిచారు. వెరసి టాప్–100 గ్లోబల్ కుబేరుల్లో ఒకరిగా తొలిసారి ఆవిర్భవించారు. ప్రపంచ సంపన్నులపై రోజువారీ ర్యాంకింగ్‌లను ఈ ఇండెక్స్ ప్రకటిస్తుంటుంది. డీమార్ట్ రిటైల్ చైన్ నిర్వాహక సంస్థ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌కు ప్రమోటర్ అయిన దమానీ.. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ కూడా. దేశీ కుబేరులు: టాప్–100 గ్లోబల్ జాబితాలో దమానీ కంటే ముందు వరుసలో దేశీ దిగ్గజాలు.. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, విప్రో వ్యవస్థాపకులు అజీమ్ ప్రేమ్‌జీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ గౌరవ చైర్మన్ శివ నాడార్, స్టీల్ టైకూన్ లక్ష్మీ మిట్టల్ సైతం నిలిచారు. కాగా.. డీమార్ట్ రిటైల్ స్టోర్ల విస్తరణ నేపథ్యంలో దమానీ సంపద వేగంగా వృద్ధి చెందుతూ వచ్చింది. ముఖ్యంగా దాదాపు ప్రతీ ప్రొడక్టులు.. వాటిపై రీజనబుల్ డిస్కౌంట్ల ప్రకటన, ఎక్కువ ప్రొడక్టులతో వినియోగదారుల్ని ఆకర్షించడం, టౌన్లకు సైతం విస్తరించిన మార్ట్లు, ముఖ్యంగా కరోనా టైం నుంచి అన్ని వర్గాలను మార్ట్‌లకు రప్పించుకోవడం ద్వారా డీమార్ట్ వాల్యూను విపరీతంగా పెంచుకోగలిగారాయన. తద్వారా స్టాక్ మార్కెట్లలో మధ్య, చిన్నతరహా కంపెనీలలో అత్యధికంగా ఇన్వెస్ట్ చేసే దమానీ.. వేల్యూ ఇన్వెస్టర్‌గా గుర్తింపు పొందారు. పెట్టుబడులను దీర్ఘకాలంపాటు కొనసాగిస్తుంటారు. అయితే సంపద వృద్ధికి ప్రధానంగా ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ దోహదం చేసింది. దమానీకి అధిక వాటాలున్న లిస్టెడ్ కంపెనీలలో వీఎస్టీ ఇండస్ట్రీస్, ఇండియా సిమెంట్స్, సుందరం ఫైనాన్స్, ట్రెంట్‌లను పేర్కొనవచ్చు. డీమార్ట్ దూకుడు ఐపీవో ద్వారా 2017 మార్చిలో స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ షేరు రేసుగుర్రంలా పరుగు తీసింది. దీంతో రూ. 39,813 కోట్ల నుంచి ప్రారంభమైన కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ (విలువ) తాజాగా రూ. 2.36 లక్షల కోట్లకు దూసుకెళ్లింది. ఇది ఆరు రెట్ల వృద్ధికాగా.. దమానీ, ఆయన కుటుంబ వాటా విలువ రూ. 32,870 కోట్ల నుంచి రూ. 1.77 లక్షల కోట్లకు జంప్ చేసింది. గత ఏడాది కాలంలోనే డీమార్ట్ షేరు 62 శాతం పురోగమించడం గమనించదగ్గ అంశం!. -
బిలియనీర్లేకానీ... పన్ను చెల్లింపు అంతంతే!
అమెరికాలో అత్యంత సంపన్నులైన అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్, టెస్లా మోటార్స్ అధినేత ఎలన్ మస్‌్క, బెర్కషైర్ హాథవే చీఫ్ వారెన్ బఫెట్ 2014–18 మధ్య చెల్లించింది ఉమ్మడిగా 3.4 శాతం ఆదాయపన్ను మాత్రమేనని ప్రోపబ్లికా ఇన్వెస్టిగేషన్ పేర్కొంది. ఈ కాలంలో వీళ్ల మొత్తం సంపద 400 బిలియన్ డాలర్లు పెరిగితే, ఇందులో కేవలం 13.6 బిలియన్ డాలర్ల పన్నునే చెల్లించారు. అమెరికాలో పన్ను రేట్ల పెంపు డిమాండ్‌కు ఈ అంకెలు ఊతం ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘ట్రేడింగ్ ఎకనమిక్స్’ నివేదిక ప్రకారం వ్యక్తిగత ఆదాయంపై అత్యధిక ఆదాయపన్ను రేటు (%) భారాన్ని మోపుతున్న టాప్– 10 దేశాల జాబితా వరుసగా.. ►ఐవరీ కోస్ట్ - 60 శాతం ►ఫిన్లాండ్ - 56.95 శాతం ►జపాన్ - 55.97 శాతం ►డెన్మార్క్ - 55.9 శాతం ►ఆ్రస్టియా - 55 శాతం ►స్వీడన్ - 52.9 శాతం ►అరుబా - 52 శాతం ►ఇజ్రాయెల్, బెల్జియం, స్లొవేనియా - 50 శాతం ►నెదర్లాండ్స్ - 49.5 శాతం ►ఐర్లాండ్, పోర్చుగల్ - 48 శాతం -
ధనవంతులు ఎక్కువగా ఇష్టపడే దేశం తెలుసా?
సింగపూర్: విస్తీర్ణ పరంగా చూస్తే భారత్ రాజధాని ఢిల్లీ అంత కూడా లేని చిన్న దేశం సింగపూర్. 55 ఏళ్ల క్రితం ఆ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు చాలామంది ప్రజలు మురికివాడల్లోనే జీవించేవారు. అలాంటిది పూరి గుడిసెల నుంచి ధగధగలాడే ఆకాశ మేడల దేశంగా ఎదిగింది. అతి తక్కువ కాలంలోనే శక్తిమంతమైన, సంపన్న దేశంగా సింగపూర్ ఎదగడానికి అక్కడి పౌరులు చాలా త్యాగాలు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు రవాణా, భద్రత, ఉత్పాదకత, ఆరోగ్యం లాంటి అనేక అంశాల్లో సింగపూర్ ముందు వరసలో ఉంది. అక్కడి నేతలు, అధికారులు అవినీతికి పాల్పడకుండా నిరోధించడానికి చాలా కఠినమైన చట్టాలను ప్రవేశపెట్టింది. సింగపూర్‌లో సగటు ఆదాయం కూడా ఇతర దేశాలతో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలా మంది విదేశీ ధనవంతులు అక్కడ స్థిరనివాసాలు ఏర్పరుచుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. కరోనా మహమ్మారితో వచ్చిన మార్పు జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారం...చైనా, ఇండోనేషియా ,మలేషియా నుంచి చాలా మంది ధనవంతులు షాపింగ్ చేయడానికి, క్యాసినోలో బాకరట్ ఆడటానికి లేదా ప్రపంచ స్థాయి క్లినిక్‌లలో వైద్య పరీక్షలు పొందటానికి సింగపూర్ వస్తుంటారు. కరోనా మహమ్మారి అన్నింటినీ మార్చింది. ఎంతో మంది వ్యాపారవేత్తలు తమ కుటుంబంతో సహా వచ్చి నెలల తరబడి సింగపూర్‌లో నివాసం ఉంటున్నారు. కొన్ని సందర్భాల్లో తుపాను నుంచి బయటపడటానికి వసతిని కోరుతున్నారు. అంతే కాకుండా తలసరి ప్రాతిపదికన మలేషియా, ఇండోనేషియాలో మరణాల రేటు సింగపూర్ కంటే 10 నుంచి 30 రెట్లు ఎక్కువని ఈ అధ్యయనంలో పేర్కొన్నారు. ఇక కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి సింగపూర్ కఠినమైన ఆంక్షలను అవలంబిస్తోంది. ఇప్పటివరకు ఆ దేశ జనాభాలో 30శాతం మందికి వ్యాక్సిన్లను అందించారు. ఇది చైనా, మలేషయా, ఇండేనేషియా దేశాలతో పోల్చితే రెండు రెట్లు ఎక్కువ. (చదవండి: వైరల్: వేలంలో 213 కోట్లు పలికిన ‘‘ది సాకురా’’) -
కుబేరులు డబ్బుల్!
దేశంలో పారిశ్రామిక బిలియనీర్లు (బిలియన్ డాలర్లు/రూ.7,300 కోట్లు అంతకుమించిన సంపద కలిగిన వారు) రోజురోజుకీ మరింత బలపడుతున్నారు. ఏటేటా వీరి సంఖ్య కూడా పెరుగుతూ వెళుతోంది. దేశంలో అగ్రగామి 15 రంగాలకు చెందిన బిలియనీర్ల ఉమ్మడి సంపద గత ఐదేళ్లలో ఏకంగా 60 శాతం పుంజుకుని 2020 డిసెంబర్ చివరికి రూ.37.39 లక్షల కోట్లకు చేరుకున్నట్టు హురూన్ ఇండియా నివేదిక తెలిపింది. 2016లో ఈ 15 పరిశ్రమల్లోని బిలియనీర్ల ఉమ్మడి సంపద విలువ రూ.23.26 లక్షల కోట్లుగా ఉన్నట్టు పేర్కొంది. 2016లో టాప్–15 రంగాల్లో 269 మంది బిలియనీర్లు ఉంటే 2020 నాటికి ఈ సంఖ్య 613కు విస్తరించింది. ముఖ్యంగా ఫార్మా రంగం అత్యధిక సంపద పరులతో ఈ జాబితాలో ముందుంది. 2020లో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను అమలు చేసిన కాలంలోనూ ఫార్మా రంగం ఎటువంటి ఆటంకాల్లేకుండా పనిచేసిన విషయాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది. తిరుగులేని ఫార్మా... దేశీయంగా సంపదపరుల జాబితాలో ఫార్మా రంగం 2016 ఏడాది నుంచి ఏటా మొదటి స్థానంలోనే ఉంటూ వస్తోంది. 2016 నాటికి ఈ రంగంలో 39 మంది బిలియనీర్లు ఉండగా.. 2020 చివరికి వచ్చేసరికి ఈ సంఖ్య 121కు వృద్ధి చెందింది. అలాగే, 2016 నాటికి ఉన్న ఉమ్మడి సంపద రూ.5,20,800 కోట్ల నుంచి రూ.8,12,800 కోట్లకు విస్తరించింది. కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ రంగంలోని 55 మంది బిలియనీర్ల ఉమ్మడి సంపద రూ.3.43 లక్షల కోట్లుగా ఉంది. ఎక్కువ మంది బిలియనీర్లతో 2016లో రెండో స్థానంలో ఉన్న ఎఫ్ఎంసీజీ రంగం.. ఐదేళ్లు తిరిగేసరికి 11వ స్థానానికి పడిపోయింది. సంఖ్యా పరంగా దిగువకు వచ్చినప్పటికీ.. ఈ రంగంలోని బిలియనీర్ల సంపద రూ.2.45 లక్షల కోట్ల నుంచి రూ.3.55 లక్షల కోట్లకు పెరిగింది. టెక్నాలజీయే ముందుకు తీసుకెళ్లేది.. ‘‘భారత కంపెనీలు దేశ చరిత్రలో అత్యంత వేగంగా విలువను వృద్ధి చేసుకున్నట్టు ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. టెక్నాలజీ ఆధారిత సంపద సృష్టి పూర్తి సామర్థ్యాన్ని అందుకుంటే అప్పుడు బిలియనీర్ల విషయంలో అమెరికాను భారత్ వెనక్కి నెట్టేస్తుంది’’ అని హురూన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అనాస్ రెహమాన్ పేర్కొన్నారు. 2020 చివరికి సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ రంగం 50 మంది బిలియనీర్లను కలిగి ఉండగా, వీరి ఉమ్మడి సంపద రూ.5,70,300 కోట్లుగా ఉంది. 2016లో ఈ రంగం 21 మంది బిలియనీర్లతో, రూ.2,42,800 కోట్లతో మూడో స్థానంలో ఉండడం గమనార్హం. ఐదేళ్ల తర్వాత కూడా ఈ రంగం అత్యధిక బిలియనీర్ల పరంగానూ అదే స్థానాన్ని కాపాడుకుంది. ముంబైలో బిలియనీర్ల సంఖ్య 217కు చేరుకుంది. ఇదే నగరంలో 2016 చివరికి 104 బిలియనీర్లు ఉన్నారు. 129 మందితో ఢిల్లీ రెండో స్థానంలోనూ, 67 మంది బిలియనీర్లతో బెంగళూరు, 50 మంది బిలియనీర్లతో హైదరాబాద్, 38 మంది బిలియనీర్లతో అహ్మదాబాద్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. బిలియనీర్ల సంఖ్య విషయంలో ఈ ఐదు నగరాలు గత ఐదేళ్లలోనూ టాప్–5లోనే కొనసాగాయి. చెన్నైలో 37 మంది, కోల్‌కతాలో 32 మంది బిలియనీర్లు ఉన్నారు. -
తొలి ట్రిలియనీర్‌గా చరిత్ర సృష్టించబోతోందెవరు..?
ఫోర్బ్స్ ఎప్పుడూ టాప్ 10 ‘బిలియనీర్’లు అనే జాబితాను మాత్రమే ఇస్తుంటుంది? ట్రిలియనీర్ల జాబితాను ఇవ్వదు. ఎందుకు? ఎందుకంటే ఈ భూమి మీద ట్రలియనీర్లే లేరు!! బిలియనీర్ అంటే కనీసం వెయ్యి మిలియన్ల విలువైన నికర ఆస్తులు కలిగి ఉన్న వ్యక్తి. ట్రిలియనీర్ అంటే కనీసం వెయ్యి బిలియన్ల విలువైన నికర ఆస్తి ఉన్న వ్యక్తి. ఫోర్బ్స్మ్యాగజీన్లో తరచు కనిపించే జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్, బిల్ గేట్స్, మార్క్ జుకర్‌బర్గ్ వీళ్లంతా కూడా (డాలర్ల లెక్కలో) బిలియనీర్లే. ట్రిలియనీర్లు కారు. భవిష్యత్తులో వీళ్లే ట్రిలియనీర్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరైతే వీళ్లలో ఎవరు తొలి ట్రిలియనీర్‌గా చరిత్ర సృష్టించవచ్చు? బిలియనీర్లుగా ఇప్పుడు తొలి రెండు స్థానాలలో ఉంటూ వస్తున్న జెఫ్ బెజోసా? లేకా ఎలాన్ మస్కా? వీళ్లిద్దరూ కాకుండా మిగతావాళ్లెవరైనా?! ఊహించగలరా? మన ఊహలన్నీ పైపైన అంచనాలుగా ఉండొచ్చు. మన అంచనాలు నిజం కూడా అవొచ్చు. అయితే ప్రస్తుతం ఈ భూమండలం మీద ఉన్న బిలియనీర్లలో ఎవరికి మొదటిసారి ‘ట్రిలియనీర్’ అనే గుర్తింపు దక్కుతుందా అని లెక్కలు వేసిన కొందరు.. ఎలాన్ కానీ, జెఫ్ బెజోస్ కానీ అంటున్నారు. వాళ్లిద్దరిలో కచ్చితంగా ఎవరో, వాళ్లిద్దరూ కాకుండా మిగతా వాళ్లలో ఎవరో చెప్పలేమని కూడా చేతులు ఎత్తేస్తున్నారు! చేతులు ఎత్తేయడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. స్టాక్ మార్కెట్‌ను బట్టి రాత్రికి రాత్రి బిలియనీర్ల పొజిషన్ల మారిపోతున్నప్పుడు.. తొలి ట్రిలియనీర్‌ను ఎవరో సరిగ్గా వేసిన అంచనా కూడా ఆఖరి నిముషంలో తలకిందులు అవొచ్చు! అయితే అందరికన్నా ముందు ‘ట్రిలియన్’కు ఎవరైతే టచ్ అవుతారో వారే చరిత్రలో ఎప్పటికీ ‘తొలి ట్రిలియనీర్‌గా’గా ఉండిపోతారు. మర్నాడే ఇంకొకరు ట్రిలియన్ మార్క్‌ని రీచ్ అయినా ‘తొలి ట్రిలియనీర్’ అన్న రిచ్‌నెస్ ఎక్కడికీ పోదు. ఆ ఎక్కడికీ పోనీ రికార్డు అయితే ఎలాన్ మస్క్‌దే అవుతుందని ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్ట్ బిలియనీర్ చామంత్ పలిహపతయ నమ్ముతున్నారు. అంటే.. కాబోయే తొలి ట్రిలియనీర్ ఎలాన్ మస్క్ అన్నమాట! ఆయన నమ్మితే సరిపోతుందా? చామంత్ ఊరికే నమ్మడం లేదు. మనల్ని నమ్మమని చెప్పడం లేదు. ఆయన లెక్కలు ఆయనకు ఉన్నాయి. ఎలాన్ మస్క్ స్పేస్ ట్రావెల్, ఎలక్ట్రికల్ ఆటోమొబైల్స్ బిజినెస్‌లో ఉన్నారు. ఈ భూమి మీద మారుమూల ప్రాంతాలను సైతం కనెక్ట్ చేయగల ‘స్టార్లింగ్’ స్పేస్ ఇంటర్నెట్ కూడా ఆయనదే. ప్రతి ఒక్కరికీ అవసరమైనది ఇవ్వగల వ్యాపారి (ఇది చిన్నమాట) ప్రతి ఒక్కరి నుంచీ పొందగల వ్యాపారి అవుతాడు కనుక ఎలాన్ మస్కే మొదటి ట్రిలియనీర్‌గా ఈ భువనాధీశుడు అవుతాడు. మార్స్‌లో కాలనీని నిర్మించబోతున్నది కూడా అతడేనన్న విషయం మనం మరువకూడదు. ఇక ఎలాన్ మస్కే తొలి ట్రిలియనీర్ అవుతారని చామంత్ అతడిలో ఇంకా ఏం చూసి చెబుతున్నారంటే.. వాతావరణ మార్పుల్ని ‘మానవయోగ్యం’గా మెరుగు పరిచేవారు వరల్డ్స్ రిచెస్ట్ అవుతారు కనుక.. కేవలం కార్లను మాత్రమే తయారు చేయకుండా, ఎన ర్జీ కంపెనీగా కూడా ఎనర్జీని పండిస్తున్న, ఎనర్జీని స్టోర్ చేస్తున్న ‘టెస్లా’ అతడిని టాప్10 లోని మిగతా వాళ్ల కన్నా ముందు ‘ట్రిలియనీర్’ను చేయవచ్చట! ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్‌లు బిజినెస్‌లో ఇప్పుడు పోటాపోటీగా ఉన్నారు. ఒకటీ రెండు స్థానాల్లో ఉన్నారు. ఈ రెండు స్థానాల్లోనే వారు పైకీ కిందికి మారుతున్నారు. ప్రస్తుతం వాళ్ల ఆస్తుల నికర విలువ ఇంచుమించు 150 బిలియన్ డాలర్ల దగ్గర కిందా మీదా అవుతోంది. ఇంత ‘నెక్ టు నెక్’లో ఉన్నప్పుడు జెఫ్ బెజోస్ తొలి ట్రిలియనీర్ కాకూడదనేముంది?! అవును ఏముంది? అవొచ్చు. 1994లో బెజోస్ ‘అమెజాన్.కామ్’ అనే పేరుతో ఆన్లైన్ బుక్‌స్టోర్ ప్రారంభించారు. ఇప్పుడు అమెజాన్ పేరుతో ఉన్న మొత్తం ఆస్తులు 192 బిలియన్ డాలర్లు. కరోనా వైరస్ అతడిని మరింత ధనికుడిని చేసింది. ఆ వైరస్ ప్రపంచాన్ని కమ్ముకోవడంతో కోట్లమంది వినియోగదారులు బెజోస్ ఆన్లైన్ వ్యాపారంపై ఆధారపడి అతడి రాబడిని ఒక్కసారిగా పెంచేశారు. ఒక్క 2020 లోనే బెజోస్ ఆన్లైన్ వ్యాపారం దాదాపుగా 50 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఫోర్బ్స్ బిలియనీర్ జాబితాలో ప్రస్తుతం బెజోస్ నికర ఆస్తుల విలువ 200 బిలియన్ డాలర్లకు దగ్గరగా ఉంది. అమెరికన్ వెబ్సైట్ ‘బిజినెస్ ఇన్సైడర్’ అంచనాల ప్రకారం 2026 నాటికి బెజోస్ ట్రిలియనీర్ అవొచ్చు. అప్పటికి ఆయనకు 62 ఏళ్లు వస్తాయి. చిన్న వ్యాపారాల ఆర్థిక సలహాల వేదిక ‘కంపారిజన్’ నివేదిక కూడా బెజోసే తొలి ట్రిలియనీర్ కావచ్చని ఊహిస్తోంది. అయితే తొలి ట్రిలియనీర్ అయ్యే తొలి ‘యంగెస్ట్ పర్సన్’ జుకర్‌బర్గ్ కావచ్చునని అంచనా వేస్తోంది. ప్రస్తుతం జుకర్‌బర్గ్ వయసు 36 ఏళ్లు. అతడికి 51 ఏళ్లు వచ్చేనాటికి .. అంటే మరో పదిహేనేళ్లలో అతడు ట్రిలియనీర్ అవొచ్చని కంపారిజన్ అంటోంది. తొలి ట్రిలియనీర్ అయ్యే అవకాశాలు ఉన్న వ్యక్తులలో ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ తర్వాత బిల్ గేట్స్ నిలుస్తారని మరికొన్ని అంచనాలు చెబుతున్నాయి. గేట్స్ నికర ఆస్తుల విలువ ప్రస్తుతం అటూ ఇటుగా 140 బిలియన్ డాలర్లు. అయితే 2018 నాటి ‘ఆక్స్‌ఫామ్’ నివేదికను బట్టి చూస్తే మస్క్, బెజోస్ కన్నా ముందే గేట్స్ ‘ట్రిలియనీర్’ అవుతారు. గేట్స్ 2013లో తన గేట్స్ ఫౌండేషన్ ద్వారా లోక కల్యాణానికి 28 బిలియన్ డాలర్లను ధారపోశారు. ప్రస్తుతం ఆయన వయసు 65. ఈ ధారపోయడం కొనసాగకపోతే కనుక భవిష్యత్తులో ఆయన ఎవరి అంచనాలకూ అందనంత ధన సంపన్నుడు అవుతారని రెండేళ్ల క్రితం నాటి ఆక్స్‌ఫామ్ అంచనాలను బట్టి లెక్క వేయవచ్చు. మస్క్, బెజోస్, గేట్స్.. ఎవరు తొలి ట్రిలియనీర్ అయినా వారు చరిత్రలో నిలిచిపోతారు. అది వారొక్కరి సంపదే కాదు. వారి నుంచి ఏదైతే పరిజ్ఞానాన్ని, ఏవైతే సేవల్ని, ఏ విధమైన అభివృద్ధిని అందుకుందో ఆ ప్రపంచ మానవాళి సంపద కూడా. -
నంబర్ వన్ కుబేరుడిగా మళ్లీ ఎలాన్ మస్క్
న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దిగ్గజం టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరోసారి అగ్రస్థానం దక్కించుకున్నారు. దీంతో అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ మళ్లీ రెండోస్థానానికి పరిమితమయ్యారు. మస్క్‌కి చెందిన రాకెట్ల తయారీ సంస్థ స్పేస్ఎక్స్ తాజాగా సెకోయా క్యాపిటల్ తదితర ఇన్వెస్టర్ల నుంచి 850 మిలియన్ డాలర్ల నిధులు సమీకరించింది. కంపెనీ విలువ 74 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టి ఇన్వెస్టర్లు మదుపు చేశారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం మస్క్ సంపద నికర విలువ 11 బిలియన్ డాలర్లు ఎగిసి.. 199.9 బిలియన్ డాలర్లకు చేరింది. తద్వారా ఆయన నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు. బెజోస్ సంపద 194.2 బిలియన్ డాలర్లుగా ఉంది. టెస్లా షేర్లు పడిపోవడంతో ఈమధ్యే స్వల్పకాలం పాటు బెజోస్ టాప్ బిలియనీర్‌గా నిల్చారు. -
టాప్ 5 లోకి దూసుకొచ్చిన ముకేశ్ అంబానీ
సాక్షి, ముంబై: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ (63) ప్రపంచ కుబేరుల జాబితాలో శరవేగంగా దూసుకుపోతున్నారు. రిలయన్స్ టెలికాం విభాగం జియోలో వరుస భారీ పెట్టుబడులతో అంబానీ తాజాగా అత్యంత ధనవంతుల జాబితాలో 5వ స్థానానికి ఎగబాగారు. తద్వారా దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్, టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్‌లను వెనక్కి నెట్టేశారు. ప్రపంచంలో టాప్ 10 బిలియనీర్స్‌లో ఏకైక ఆసియా వ్యక్తి రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ కావడం విశేషం. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం 75.1 బిలియన్ డాలర్ల నికర విలువతో ముఖేష్ అంబానీ 5వ స్థానానికి చేరుకున్నారు. బర్క్‌షైర్ హాత్వే సీఈఓ వారెన్ బఫెట్‌ను వెనక్కి నెట్టేశారు ముఖేష్ అంబానీ. ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ తర్వాతి స్థానంలో అంబానీ ఉన్నారు. మార్క్ జుకర్ బర్గ్ 88.1 బిలియన్ డాలర్ల నికర విలువతో 4వ స్థానంలో ఉన్నారు. మరోవైపు 5వ స్థానం కోసం ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్, అంబానీ మధ్య భారీ పోటీ నెలకొంది. టెస్లా షేర్ల ధర భారీగా పెరగడంతో మస్క్ నికర సంపద 74 బిలియన్ డాలర్లకు చేరుకుంది. (జియో మార్ట్ దూకుడు: ఉచిత డెలివరీ) ఈ జాబితాలో 185.8 బిలియన్ డాలర్లతో అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ టాప్ టాప్ ప్లేస్‌లో ఉండగా, 113.1 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, మూడో స్థానంలో లగ్జరీ గూడ్స్ ఎల్వీహెచ్ బ్రాండ్ మోయిట్ హెన్నెస్సీ ఛైర్మన్ బెర్నార్డ్ అర్నాల్ట్ ఫ్యామిలీ ఉంది. 89 బిలియన్ డాలర్ల నికర విలువతో నాలుగో స్థానంలో మార్క్ జుకర్ బర్గ్, ఆరో స్థానంలో వారెన్ బఫెట్, ఏడో స్థానంలో ఒరాకిల్ కార్పొరేషన్ ఫౌండర్ లార్రీ ఎల్లిసన్, ఎనిమిదో స్థానంలో మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓ స్టీవ్ బాల్మర్, పదో స్థానంలో గూగుల్ కోఫౌండర్ లారీ పేజ్ ఉన్నారు -
కరోనా : భారీ సంపదనార్జించిన బిలియనీర్లు
వాష్టింగ్టన్: కరోనా మహమ్మారి సంక్షోభం కాలంలో అమెరికా అతలాకుతలమవుతోంది. ఆర్థికవ్యవస్థ మరింత మందగమనంలోకి కూరుకుపోతోందని స్వయంగా ఫెడ్ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఈ కాలంలో కూడా అమెరికాకు చెందిన టెక్ దిగ్గజాలు భారీ సంపదను ఆర్జించాయి. ముఖ్యంగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్, అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ భారీ లాభాలను సాధించారు. అమెరికాలో పలు సంస్థల తీవ్ర నష్టాలు, వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్న తరుణంలో వీరి సంపద 45 శాతం ఎగియడం గమనార్హం. (అమెజాన్‌లో 50 వేల ఉద్యోగాలు) (2026 నాటికి జెఫ్ బెజోస్, మరి ముకేశ్ అంబానీ?) రెండు నెలల కరోనా వైరస్ కాలంలో టెక్నాలజీ స్టాక్స్ లాభాల్లో దూసుకుపోవడంతో వీరు మరింత ధనవంతులయ్యారు. బెజోస్ సంపద 30 శాతం పెరిగి 147.6 బిలియన్ డాలర్లకు చేరుకోగా, జుకర్‌బర్గ్ సంపద 45 శాతం పెరిగి 80 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రధానంగా లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇంటికే పరిమితం కావడంతో క్లౌడ్ బిజినెస్, వీడియో కాన్ఫరెన్స్ , గేమింగ్ వ్యాపారం పుంజుకోవడం, కొత్త ప్రోగ్రామ్ ప్రకటనలతో అమెజాన్, ఫేస్బుక్ షేర్లు లాభాలను నమోదు చేశాయి. (మోసగాళ్లకు చెక్ : మెసెంజర్లో కొత్త ఫీచర్) తాజాపరిశోధనల ప్రకారం ఈ కాలంలో అమెరికాలోని 600 మంది బిలియనీర్లు టెక్ స్టాక్స్‌లో ర్యాలీతో మరింత ధనవంతులయ్యారు.ఈ బిలియనీర్ల మొత్తం నికర విలువ మార్చి18- మే19 మధ్యకాలంలో 434 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 32.97 లక్షల కోట్లు) పెరిగింది. మరోవైపు మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ బెర్క్‌షైర్ హాత్వే వారెన్ బఫెట్ స్వల్ప లాభాలకు పరిమితమయ్యారు. వీరు వరుసగా 8.2 శాతం, 0.8 శాతం లాభాలను నమోదు చేయగలిగారు. టాక్స్ ఫెయిర్‌నెస్ , ఇన్స్టిట్యూట్ ఫర్ పాలసీ స్టడీస్ ప్రోగ్రామ్ ఫర్ ఈక్వాలిటీ అనే సంస్థలు ఈ విశ్లేషణ చేశాయి. (కరోనా : ఉద్యోగులను తొలగిస్తున్న టెక్ దిగ్గజం) -
కరోనా: బంకర్లలోకి బిలియనీర్స్
వాషింగ్టన్: ప్రాణాంతకమైన కరోనా వైరస్ బారిన పడకుండా తప్పించుకునేందుకు అమెరికాలోని శతకోటీశ్వరులు న్యూజిలాండ్ వెళ్లిపోయి అక్కడి తమ విలాసవంతమైన బంకర్ల (నేల మాళిగలు)లో తలదాచుకుంటున్నారు. వారిలో సిలికాన్ వ్యాలీకి చెందిన శతకోటీశ్వరులు కూడా ఎంతో మంది ఉన్నారు. ఏదో ఒక రోజు ప్రపంచ ప్రళయం (డూమ్స్ డే) వచ్చి అందరూ చనిపోతారని నమ్మే కొంత మంది శతకోటీశ్వరులు న్యూజిలాండ్‌లో అత్యంత ఖరీదు చేసే విలాసవంతమైన బంకర్లను ఎన్నడో కొని పెట్టుకున్నారని ‘డెయిలీ మెయిల్’ వెల్లడించింది. వారిలో ‘పేపాల్’ వ్యవస్థాపకుడు, ఫేస్బుక్ శతకోటీశ్వరుడు పీటర్ తియాల్, టెక్సాస్‌లోని బ్లూబెర్గ్ కంపెనీ జనరల్ మేనేజర్ గేరీ లించ్ కూడా ఉన్నారు. పీటర్ తియాల్ న్యూజిలాండ్‌లోని అందమైన క్వీన్స్‌టౌన్‌లో మల్టీపర్సన్ భవనాన్ని కొనుగోలు చేశారు. అంటే భూమిపైన మామూలుగా కనిపించే ఆ భవనంలోనే అవసరమైనప్పుడు తలదాచుకునేందుకు ‘ప్యానిక్ రూమ్’ ఒకటి ఉంది. దాన్ని ఆయన 4.7 మిలియన్ డాలర్లు (దాదాపు 35.15 కోట్ల రూపాయలు) పెట్టి కొనుగోలు చేసినట్లు తెల్సింది. ఇప్పుడాయన అక్కడికి వెళ్లారో, లేదో తెలియడం లేదు. అయితే గేరీ లించ్ లాంటి శతకోటీశ్వరులు ప్రాణాంతకమైన కరోనా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోందంటూ వార్తలు వెలువడిన తొలుతలోనే అమెరికా నుంచి విమానాలు పట్టుకొని న్యూజిలాండ్ వెళ్లారు. వారిలో ప్రముఖ వ్యాపారవేత్త మిహాయి దినులెస్కూ తన భార్యతో కలిసి మార్చి 12వ తేదీన న్యూజిలాండ్ వెళ్లారు. రైజింగ్ ఎస్ కంపెనీ న్యూజిలాండ్‌లో ఇలాంటి బంకర్లను కొన్నింటిని ఇప్పటికే నిర్మించగా మరికొన్నింటిని నిర్మిస్తోంది. వాటిని మూడు మిలియన్ డాలర్ల నుంచి ఎనిమిది మిలియన్ డాలర్ల వరకు విక్రయిస్తోంది. వాటిలో 22 మంది నిద్రించే అవకాశం ఉన్న మూడు మాస్టర్ బెడ్ రూమ్‌లు, లివింగ్ రూమ్, డైనింగ్ హాల్, కిచెన్‌తోపాటు ఓ ఫిట్నెస్ సెంటర్, స్విమ్మింగ్ పూల్ ఉన్న బంకర్లు కూడా ఉన్నాయి. కొన్ని బంకర్లు కూడా భూమిలోపల రెండు, మూడు అంతస్తులుగా ఉన్నాయి. వాటన్నింటికి కావాల్సిన ఆక్సిజన్, విద్యుత్ నిరంతరాయంగా సరఫరాకు ఏర్పాట్లు ఉన్నాయి. వాటిల్లో కొందరు శతకోటీశ్వరులు ఏడాది పాటు కొదవ లేకుండా తినుపదార్థాలను నిలువ చేసుకున్నారు. చదవండి: కరోనా కట్టడిపై చిగురిస్తున్న ఆశలు -
కోవిడ్ క్రాష్ : అంబానీకి నష్టం ఎంతంటే?
సాక్షి, ముంబై: కోవిడ్-19 కల్లోలానికి ప్రపంచ మార్కెట్లు విలవిల్లాడాయి. అటు దేశీయ ఈక్విటీమార్కెట్లు కూడా ఫిబ్రవరి చివరి వారంలో భారీగా నష్టపోయాయి. గత ఆరు సెషన్లుగా వరుస నష్టాలతో ఇన్వెస్టర్ల సంపద రూ.10 లక్షల కోట్లు ఆవిరైపోయింది. శుక్రవారం ఒక్కరోజే రూ.4 లక్షల కోట్లకు పైగా సంపద నిమిషాల్లో కరిగిపోయింది. కరోనా వైరస్ వ్యాప్తికి ఎక్కడా అడ్డుకట్టపడకపోవడంతో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు భారీ అమ్మకాలకు దిగారు. దీంతో దేశంలోని కుబేరులు కూడా సంపదను కోల్పోయారు. (5 నిమిషాల్లో రూ. 5 లక్షల కోట్లు హాంఫట్) ముఖ్యంగా ఈ సంవత్సరం మొదటి రెండు నెలల్లోని బలహీన ధోరణి భారత బిలియనీర్ల సంపదను ప్రభావితం చేసింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ సూచిక ప్రకారం, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఈ ఏడాది తన సంపదలో 5 బిలియన్ డాలర్లకు పైగా కోల్పోయారు.ఇండెక్స్‌లో పదిహేనవ స్థానంలో ఉన్న ఆసియా టాప్ బిలియనీర్ మొత్తం నికర విలువ 53.5 బిలియన్ డాలర్లు. సెన్సెక్స్1500 పాయింట్లు కుప్పకూలడంతో, మార్కెట్ క్యాప్ పరంగా టాప్‌లో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర శుక్రవారం 4.12 శాతం క్షీణించి రూ.1,328 కు చేరుకుంది, మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ .8.4 లక్షల కోట్లకు పడిపోయింది. (టెక్ దిగ్గజాలకు కోవిడ్-19 సెగ) ఇదే వరుసలో ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా 884 మిలియన్ డాలర్లు కోల్పోయారు. విప్రో లిమిటెడ్ చైర్మన్ అజిమ్ ప్రేమ్‌జీ సంపద రెండు నెలల కాలంలో 869 మిలియన్ డాలర్లు క్షీణించింది. అలాగే గౌతమ్ అదానీ 496 మిలియన్ డాలర్లను కోల్పోయారు. విప్రో షేర్లు 4.53, అదానీ ఎంటర్ప్రైజెస్ 6.5శాతం నష్టపోయాయి. ఇంకా టీసీఎస్, హెచ్డీఎఫ్సీ, ఇన్ఫోసిస్ షేర్లు 2.5 -3.5 శాతం మధ్య, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్ షేర్లు 4-5 శాతం మధ్య కుప్పకూలిన సంగతి తెలిసిందే. బెంచ్‌మార్క్ సూచికలు 7 శాతం పతనం కావడంతో సెంటిమెంటు పూర్తిగా దెబ్బతిందనీ జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ విశ్లేషించారు. కరోనా మహమ్మారి ముప్పు ఊహించనదానికంటే పెద్దగా ఉండనుందని అంచనా వేశారు. (కోవిడ్-19 : స్విస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం) -
ప్రపంచ కుబేరుల సంపద ఎంతంటే?
న్యూఢిల్లీ : ప్రపంచంలో కుబేరుల సంఖ్య పెరిగిపోతోంది. వేల కోట్ల రూపాయలు గల బిలియనీర్ల సంఖ్య 2,816కు చేరుకున్నట్లు 2020 సంవత్సరానికి ‘హరూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్’ విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది. వీరి మొత్తం ఆస్తుల విలువ 11.2 ట్రిలియన్ డాలర్లు. అంటే దాదాపు 800 లక్షల కోట్ల రూపాయలు. ఈ మొత్తం అమెరికా, చైనాలను మినహాయిస్తే ఏ దేశ జీడీపీకన్నా ఎక్కువే! (చదవండి: సంపన్న భారతీయుడు ముకేశే) గతేడాది ప్రపంచ బిలియనీర్ల సంఖ్య సంఖ్యకు ఈ ఏడాది 346 మంది అదనంగా చేరారు. వాస్తవానికి గతేడాది జాబితా నుంచి 130 మంది బిలియనీర్లు తొలగిపోగా ఈ ఏడాది అదనంగా 479 మంది చేరారు. జాబితా నుంచి తొలగిపోయిన జాబితాలో 16 మంది మృతులు ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ‘అమెజాన్’ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (56) తనకున్న రికార్డును ఈ ఏడాది కూడా నిలబెట్టుకున్నారు. గతేడాది ఆయన నుంచి విడాకులు తీసుకున్న మాకెంజీ బెజోస్ ఈ ఏడాది కొత్తగా బిలియనీర్ల జాబితాలో చేరారు. విడాకుల వల్ల ఆమెకు అమెజాన్ నుంచి దాదాపు రెండు కోట్ల షేర్లు రావడమే అందుకు కారణం. జనవరి 31వ తేదీ నాటికి బిలియనీర్ల ఆదాయం గతేడాదితో పోలిస్తే 16 శాతం పెరిగింది. చైనాలో ఎక్కువ మంది బిలియనీర్లు ఉండగా, టాప్ టెన్‌లో మాత్రం ఏడుగురు అమెరికన్లు ఉన్నారు. 84 బిలియన్ డాలర్లతో ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ (35), 68 బిలియన్ డాలర్లతో గూగుల్ వ్యవస్థాపకులు (46) సెర్గీ బిన్, 67 బిలియన్ డాలర్లతో లారీ పేజ్ (46)లు, 67 బిలియన్ డాలర్లతో మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో స్టీవ్ బాల్మర్ (63) తదితరులు టాప్ టెన్‌లో ఉన్నారు. -
ఆ 63 మంది కుబేరుల ముందు... బడ్జెట్ దిగదుడుపు!
దావోస్: పెరిగిపోతున్న ఆర్థిక అసమానతలను ప్రతిబింబిస్తూ.. మన దేశ జనాభాలో 70 శాతం (సుమారు 95.3 కోట్ల మంది) జనాభాతో పోలిస్తే 1 శాతం కుబేరుల సంపద ఏకంగా నాలుగు రెట్లు పైగా ఉంది. దేశీయంగా 63 మంది బిలియనీర్ల మొత్తం సంపద విలువ.. పూర్తి ఆర్థిక సంవత్సర బడ్జెట్ పరిమాణాన్ని (2018–19లో రూ. 24.42 లక్షల కోట్లు) మించింది. ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్న నేపథ్యంలో సామాన్యుల పక్షం వహించాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ మానవ హక్కుల సంస్థ ఆక్స్‌ఫామ్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) 50వ వార్షిక సమావేశాలు ప్రారంభం కానున్న సందర్భంగా ’టైమ్ టు కేర్’ పేరిట ఆక్స్‌ఫామ్ దీన్ని విడుదల చేసింది. దీని ప్రకారం.. ప్రపంచ జనాభాలో సుమారు 60 శాతం (460 కోట్లు) ప్రజలకు మించిన సంపద 2,153 మంది బిలియనీర్ల దగ్గర ఉంది. ‘అసమానతలను తొలగించే కచ్చితమైన విధానాలు లేకుండా సంపన్నులు, పేదల మధ్య వ్యత్యాస సమస్యలను పరిష్కరించడం కుదరదు. కానీ చాలా కొన్ని ప్రభుత్వాలు మాత్రమే ఈ దిశగా కృషి చేస్తున్నాయి‘ అని ఆక్స్‌ఫాం ఇండియా సీఈవో అమితాబ్ బెహర్ పేర్కొన్నారు. 24 వరకూ జరగనున్న డబ్ల్యూఈఎఫ్ సదస్సులో భారత్ నుంచి పలువురు వ్యాపార దిగ్గజాలు, ప్రభుత్వ అధికారులు పాల్గొననున్నారు. నివేదికలోని మరికొన్ని ఆసక్తికర అంశాలు.. ► టెక్నాలజీ సంస్థ సీఈవో ఓ ఏడాదిలో సంపాదించే మొత్తాన్ని ఆర్జించాలంటే సాధారణ మహిళా పనిమనిషికి 22,277 ఏళ్లు పడుతుంది. ఆమె ఏడాది సంపాదనను.. సెకనుకు రూ. 106 చొప్పున టెక్ సీఈవో 10 నిమిషాల్లో సంపాదిస్తున్నారు. ► మహిళలు, బాలికలు రోజుకు 326 కోట్ల గంటల పనిని ఎలాంటి భత్యాలు లేకుండా చేస్తున్నారు. దీనికి లెక్కగడితే ఏటా రూ. 19 లక్షల కోట్లవుతుంది. ఇది 2019లో దేశీ విద్యారంగానికి కేటాయించిన మొత్తం బడ్జెట్ (రూ. 93,000 కోట్లు)కు 20 రెట్లు ఎక్కువ. ► సంక్షేమ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు పెంచడంద్వారా 1.1 కోట్ల మేర కొత్త ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది. తద్వారా 2018లో కోల్పోయిన 1.1 కోట్ల ఉద్యోగాలను తిరిగి సృష్టించవచ్చు. ► అంతర్జాతీయంగా చూస్తే మొత్తం ఆఫ్రికాలో మహిళల దగ్గరున్న సంపద కన్నా ప్రపంచంలో టాప్ 22 మంది బిలియనీర్ల వద్ద ఉన్న సంపదే ఎక్కువ. ► వచ్చే 10 ఏళ్ల పాటు ఒక్క శాతం కుబేరులు తమ సంపదపై అదనంగా కేవలం 0.5 శాతం పన్ను చెల్లించిన పక్షంలో.. వృద్ధులు, బాలల సంక్షేమం, విద్యా, వైద్యం వంటి రంగాల్లో 11.7 కోట్ల పైచిలుకు ఉద్యోగాల కల్పనకు అవసరమైన పెట్టుబడులకు సరిసమానంగా ఉంటుంది. సోషల్ మొబిలిటీలో అట్టడుగున భారత్.. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలు కూడా ఉన్నత స్థాయిలకు చేరేందుకు అనువైన పరిస్థితులను సూచించే సోషల్ మొబిలిటీ సూచీలో భారత్ అట్టడుగు స్థానంలో ఉంది. డబ్ల్యూఈఎఫ్ రూపొందించిన కొత్త సూచీలో .. 82 దేశాల జాబితాలో 76వ స్థానంలో నిల్చింది. అయితే, దీన్ని మెరుగుపర్చుకోగలిగితే అత్యధికంగా లాభపడే దేశాల్లో చైనా, అమెరికా తర్వాత భారత్ కూడా ఉంటుందని సంబంధిత నివేదికలో డబ్ల్యూఈఎఫ్ పేర్కొంది. ఆర్థిక, సామాజిక నేపథ్యంతో పనిలేకుండా అందరూ పూర్తి స్థాయిలో ఎదిగేందుకు సమాన అవకాశాలు ఏ దేశంలో ఎంత మేర లభిస్తున్నాయన్నది తెలిపేందుకు ఈ సూచీ ఉపయోగపడుతుంది. ప్రధానంగా విద్య, వైద్యం, టెక్నాలజీ తదితర 5 అంశాల ప్రాతిపదికన దీన్ని లెక్కిస్తారు. ఈ విషయాల్లో డెన్మార్క్ టాప్‌లో ఉంది. డబ్ల్యూఈఎఫ్ సదస్సు ప్రారంభం... ప్రపంచ దేశాల అధినేతలు, విధానకర్తలు, వ్యాపార దిగ్గజాలు, ఇతరత్రా ప్రముఖులు హాజరవుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ క్లాస్ ష్వాబ్ ఈ సందర్భంగా ఆహూతులకు స్వాగతం పలికారు. ‘ఈ 50వ వార్షిక సదస్సులో పాల్గొంటున్న అన్ని దేశాలు, భాగస్వాములు, సభ్యులు, సాంస్కృతిక సారథులకు, యువ నేతలకు స్వాగతం‘ అని ఆయన పేర్కొన్నారు. వ్యాపార సంస్థలు కేవలం వ్యాపారానికే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతతో మెలగాల్సిన అవసరం ఉందన్న ఉద్దేశంతో ఫోరం ఏర్పడిందని, ఇప్పటికీ అదే స్ఫూర్తితో కొనసాగుతోందని ష్వాబ్ చెప్పారు. ఈ సందర్భంగా బాలీవుడ్ నటి దీపికా పదుకొణె సహా పలువురు ప్రముఖులకు క్రిస్టల్ అవార్డ్స్ పురస్కారాలను ప్రదానం చేశారు. మానసిక ఆరోగ్యం ఆవశ్యకతపై అవగాహన పెంచేందుకు కృషి చేసినందుకు గాను పదుకొణె ఈ అవార్డుకు ఎంపికయ్యారు. వివిధ దేశాల నుంచి 3,000 పైగా ప్రతినిధులు సదస్సులో పాల్గొంటున్నారు. -
2 రోజుల్లో రూ.29 వేల కోట్లు
సాక్షి, ముంబై: రిలయన్స్ అధినేత, బిలియనీర్ ముకేశ్ అంబానీ సంపద అప్రతిహతంగా పెరుగుతోంది. ప్రధానంగా జియో ఫైబర్ ప్రకటన అనంతరం అంబానీ మునుపెన్నడూ లేనంతగా అమాంతం ఎగిసింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ఆధారంగా 49.9 బిలియన్ డాలర్ల సంపదతో ఆసియాలో అత్యంత ధనవంతుల జాబితాలో 13వ స్థానంలో ఉన్న అంబానీ తాజాగా మరింత దూసుకుపోతున్నారు. ఆగస్టు 12 నాటి రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశం అనంతరం రెండురోజుల్లోనే రూ.29వేల కోట్లు మేర పుంజుకున్నాయి. మార్కెట్ వ్యాల్యూ రూ.80 వేల కోట్లు పెరిగింది. 42వ రిలయన్స్ ఏజీఎంలో సౌదీ కంపెనీ ఆరామ్కోతో అతిపెద్ద ఎఫ్‌డిఐ డీల్‌ను ప్రకటించారు అంబానీ. 20శాతం వాటాలు ఆరామ్కోకు విక్రయిస్తున్నామనీ, తద్వారా రానున్న 18 నెలల్లో (మార్చి , 2021 నాటికి) రిలయన్స్ ఇండస్ట్రీస్ రుణాలు లేని కంపెనీగా అవతరించనుందని ప్రకటించడం ఇన్వెస్టర్లను ఉత్సాహపర్చింది. అలాగే అతి తక్కువ ధరలు, బంపర్ ఆఫర్లతో గిగా ఫైబర్‌ను సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు మూడీస్, మోర్గాన్ స్టాన్లీ లాంటి సంస్థలు రిలయన్స్‌కు అప్‌గ్రేడ్ రేటింగ్‌ను ఇచ్చాయి. దీంతో మంగళ, బుధవారాలు రిలయన్స్ షేర్లు దలాల్ స్ట్రీట్‌లో మెరుపులు మెరిపించాయి. బుధవారం మార్కెట్లు క్లోజ్ అయ్యే సమయానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు రూ.1,288.30వద్ద ఉండగా, శుక్రవారం రూ.1,279 వద్ద ట్రేడ్ అవుతోంది. ఆగస్ట్ 12వ తేదీ ప్రకటన తరువాత రిలయన్స్ షేర్లు 11 శాతం పెరిగాయి. అదే విధంగా అంబానీ ఆస్తులు 4 బిలియన్ డాలర్లు అంటే మన రూపాయల్లో 28,684 కోట్లు పెరిగింది. వార్షిక ప్రాతిపదికన అంబానీ సంపద 6 శాతం పెరగ్గా, రిలయన్స్ షేర్లు 15 శాతం ఎగిసాయి. -
ప్చ్...సూపర్ రిచ్!
దేశాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ధనవంతులు మరింత పన్ను చెల్లించడానికి సిద్ధం కావాలంటూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కోటీశ్వరులు చెల్లించే ఆదాయ పన్నుపై సర్‌చార్జీలను భారీగా పెంచేశారు. సర్‌చార్జీల పెంపువల్ల రూ.2–5 కోట్ల ఆదాయం ఉన్న వారిపై నికరంగా 3%, రూ.5 కోట్లు ఆదాయం దాటినవారిపై 7% వరకు అదనపు భారం పడుతుంది. ఈ సర్‌చార్జీల పెంపుతో రూ.5 కోట్లు ఆదాయం దాటిన వారు నికరంగా 42.74% పన్ను చెల్లించాల్సి రానుంది. ఇది అగ్ర రాజ్యం అమెరికాలోని వ్యక్తిగత ఆదాయ పన్ను రేటు కంటే అధికం. అమెరికాలో గరిష్టంగా ఆదాయ పన్ను రేటు 40 శాతంగా ఉంది. ఇప్పుడు ఆ రికార్డును సీతారమన్ బద్ధలు కొట్టారు. సంపన్నులపై సర్‌చార్జీలను పెంచడం ద్వారా రూ.12,000 కోట్ల అదనపు ఆదాయం రానుంది. ఇదే సమయంలో రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్న వారు ఎటువంటి పన్ను చెల్లించనవసరం లేదని ఆమె పేర్కొన్నారు. నిజానికి ఈ వెసులుబాటు గత ఓటాన్ అకౌంట్ బడ్జెట్లోనే కల్పించారు. ఆదాయ పన్ను శ్లాబుల్లో ఎటువంటి మార్పులు చేయకుండా సెక్షన్ 87 కింద లభించే రిబేటును రూ.3.50 లక్షల నుంచి రూ.5 లక్షలకు వరకు అప్పట్లోనే పెంచారు. దీనివల్ల రూ.5 లక్షల లోపు ఆదాయం వున్న వారు చెల్లించాల్సిన పన్నుపై రిబేటు లభిస్తుంది. సంపన్నులపై భారం ఇలా పెరిగింది.. ప్రస్తుతం పన్ను పరిధిలోకి వచ్చే వార్షికాదాయం రూ.10 లక్షల దాటితే 30% గరిష్ట పన్ను విధిస్తున్నారు. ఇది కాకుండా రూ.50 లక్షలు ఆదాయం దాటిన వారిపై రెండు రకాల సర్‌చార్జీలను విధిస్తున్నారు. రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల లోపు ఆదాయం ఉన్న వారిపై 10 శాతం, రూ. కోటి దాటితే 15% సర్ చార్జి విధిస్తున్నారు. దీనిపై 4% సుంకం అదనం. ఇప్పుడు రూ.2 కోట్ల నుంచి 5 కోట్ల లోపు ఉన్నవారిపై సర్ చార్జీని 15 శాతం నుంచి 25 శాతానికి, అదే రూ.5 కోట్లు దాటితే 15 శాతం నుంచి 37 శాతానికి పెంచుతూ బడ్జెట్లో ప్రతిపాదన చేశారు. దీంతో రూ.2–5 కోట్ల లోపు ఆదాయం ఉన్న వారు చెల్లించే నికర పన్ను రేటు (శ్లాబ్ రేటు+ సర్‌చార్జీ+ సుంకం) 35.88 శాతం నుంచి 39 శాతానికి పెరిగింది. అదే విధంగా రూ.5 కోట్ల ఆదాయం దాటిన వారి పన్ను భారం 42.74 శాతానికి చేరింది. గృహరుణంపై మరింత మినహాయింపు అందరికీ ఇళ్లు అన్న లక్ష్యాన్ని తొందరగా చేరుకోవడానికి అందుబాటు ధరల్లోని గృహాలపై పన్ను మినహాయింపు పరిమితిని పెంచుతూ బడ్జెట్లో నిర్ణయించారు. ప్రస్తుతం గృహరుణాలపై చెల్లించే వడ్డీపై రూ.2 లక్షల వరకు పన్ను మినహాయింపు లభించేది. ఇప్పుడు ఈ మొత్తాన్ని రూ.3.5 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. కానీ ఇంటి విలువ రూ.45 లక్షలలోపు ఉంటేనే ఈ పెంపు వర్తిస్తుంది. అలాగే మార్చి 31, 2020లోగా కొనుగోలు చేసిన ఇళ్లకు మాత్రమే ఈ మినహాయింపు లభిస్తుంది. 15 ఏళ్ల కాలానికి రుణం తీసుకుంటే వడ్డీ మినహాయింపు పరిమితిని అదనంగా రూ.1.5 లక్షలకు పెంచడం వల్ల సుమారుగా రూ.7 లక్షల వరకు ప్రయోజనం చేకూరనుందని సీతారామన్ పేర్కొన్నారు. పన్ను పరిధిలోకి మరింత మంది పన్ను పరిధిలోకి తీసుకువచ్చేందుకు బడ్జెట్లో పలు నిర్ణయాలను ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఏడాదికి రూ.50 లక్షలు దాటి చెల్లింపులు చేసే వారితో పాటు కాంట్రాక్టర్లు, వృత్తినిపుణులపై 5% టీడీఎస్‌ను విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే కరెంట్ అకౌంట్ ఖాతాలో రూ. కోటికి మించి డిపాజిట్ చేస్తే, రూ. లక్ష మించి విద్యుత్ బిల్లు చెల్లిస్తే, అదే విధంగా ఏడాదిలో విదేశీ పర్యటనల రూపంలో రూ.2 లక్షలు ఖర్చు చేస్తే రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. ట్యాక్స్ శ్లాబులు ప్రస్తుతం అమల్లో ఉన్న ఆదాయ పన్ను శ్లాబుల్లో ఈసారి బడ్జెట్ సందర్భంగా ఎలాంటి మార్పులూ చేయలేదు. అయితే శ్లాబులేవీ లెక్కించకుండా రూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న వారికి ఎటువంటి పన్ను భారం లేకుండా గత ఓటాన్ అకౌంట్ బడ్జెట్లోనే నిర్ణయం తీసుకున్నారు. సెక్షన్ 87 రిబేటు పరిమితిని నాటి బడ్జెట్ సందర్భంగా రూ.3,50,000 నుంచి రూ.5,00,000కు పెంచారు. దీంతో రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారు చెల్లించాల్సిన పన్నుపై రిబేటు లభించడం ద్వారా ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈసారి బడ్జెట్లో మాత్రం వార్షికాదాయం రూ.2 కోట్లు దాటిన వారిపై మాత్రం అదనపు సర్‌ఛార్జీ విధిస్తున్నట్లు ప్రకటించారు. -
ప్రపంచ కుబేరుల్లో ముకేశ్ అంబానీకి 13వ స్థానం
న్యూఢిల్లీ: ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ‘ఫోర్బ్స్’ తాజాగా ప్రకటించిన ఈ ఏడాది ప్రపంచ కుబేరుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ చీఫ్ ముకేశ్ అంబానీ 13వ స్థానంలో నిలిచారు. గతేడాదిలో 40.1 బిలియన్ డాలర్ల సంపదతో 19వ స్థానంలో ఉన్న ఈయన.. ఈ ఏడాదిలో 50 బిలియన్ డాలర్ల సంపదతో ప్రస్తుత ర్యాంక్‌కు ఫోర్బ్స్ మ్యాగజైన్ మంగళవారం వెల్లడించింది. ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా మరోసారి అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ నిలిచారు. ప్రపంచ బిలియనీర్ల జాబితాలో మొత్తం 106 మంది భారతీయులకు చోటు దక్కింది. వీరిలో ముకేశ్ అంబానీ తరువాత.. విప్రో అజిమ్ ప్రేమ్‌జీ 36వ స్థానంలో నిలిచారు. ఈయన సంపద 22.6 బిలియన్ డాలర్లు. హెచ్‌సీఎల్ కో–ఫౌండర్ శివ్ నాడార్ 82వ స్థానంలో నిలవగా.. ఆర్సెలర్ లక్ష్మీ మిట్టల్ 91వ స్థానాన్ని దక్కించుకున్నారు. వరుసగా ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ బిర్లా (122), అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ (167), భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ (244), పతంజలి ఆయుర్వేద సహ వ్యవస్థాపకులు ఆచార్య బాల్కృష్ణ (365), పిరమల్ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ అజయ్ పిరమల్ (436), బయోకాన్ ఫౌండర్ కిరణ్ మజుందార్ షా (617), ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు ఎన్.ఆర్. నారాయణ మూర్తి (962), ఆర్‌కామ్ చైర్మన్ రిలయన్స్ అనిల్ అంబానీ (1349) స్థానాల్లో నిలిచారు. -
కోటీశ్వరులూ వలస పక్షులే!
ఉన్న ఊరిని వదిలి వెళ్లాలని ఎవరికి ఉంటుంది? బతికేందుకు దారి లేకపోతేనో.. సంపాదన సరిపోకపోతేనో.. దేశం కాని దేశానికి వలస వెళ్లడం తప్పదు.. కానీ అప్పటికే కోట్ల రూపాయల సంపద ఉన్నా మరింత సంపాదన కోసం వెళ్లే ‘వలస’లూ పెరిగిపోతున్నాయి.. లాభాలు చాల్లేదనో, పెట్టుబడికి రెట్టింపు ఆదాయం లభిస్తుందనో, పన్నులు కట్టనక్కర్లేదనో, వ్యాపారాలకు రాయితీలున్నాయనో.. ఇలా కారణాలేమైతేనేం.. పైసా ఎక్కువొస్తే చాలంటూ పరాయి దేశానికి పరుగులు తీస్తున్న కోటీశ్వరుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతోందని ఆఫ్రో ఆసియా బ్యాంకు అధ్యయనం చెబుతోంది. దక్షిణాఫ్రికాకు చెందిన ఈ బ్యాంకు కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా కోటీశ్వరుల వలసలపై అధ్యయనం చేస్తోంది. వివిధ దేశాల్లో ఆస్తుల రిజిస్ట్రేషన్లు, బోలెడంత డబ్బున్న వారికి ప్రయాణ ఏర్పాట్లు, ఇతర విలాసాలను అందించే వారి నుంచి వివరాలు సేకరించి ఏటా ‘గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ రివ్యూ’ పేరుతో నివేదికను విడుదల చేస్తోంది. ‘వలస’సంపన్నుల్లో రెండో స్థానం మనదే.. - స్వదేశాల నుంచి ఇతర దేశాలకు వలసవెళుతున్న సంపన్నుల సంఖ్యలో మనదేశం ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. అత్యధికులు ఆస్ట్రేలియాకు వలస వెళుతుండగా.. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అరబ్ దేశాలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. - గతేడాది మన దేశం నుంచి వలస వెళ్లిన కోటీశ్వరుల సంఖ్య 7 వేలు. - 2016లో విదేశీ బాట పట్టిన వారి సంఖ్య 9,500 - 2014 నుంచి ఇప్పటివరకూ మొత్తం 23 వేల మంది కోటీశ్వరులు భారత్‌ను వదిలి వెళ్లారు. వీరిలో అధికులు బ్రిటన్, దుబాయ్, సింగపూర్లలో శాశ్వత నివాసాలు ఏర్పరచుకున్నారు. - ప్రపంచ సంపదపై తయారు చేసిన తాజా నివేదిక ప్రకారం భారత దేశంలో 2,45,000 మంది కోటీశ్వరులు ఉండగా.. 2022కల్లా ఈ సంఖ్య 3,72,000కు చేరనుంది. దేశంలోని కోటీశ్వరుల్లో 2.1 శాతం మంది ఇప్పటికే వలసబాట పట్టారు. ఇది చైనా కంటే ఎక్కువ. - 2016లో ప్రపంచంలోని మొత్తం సంపద 192 లక్షల కోట్ల డాలర్లు కాగా.. 2017 చివరికల్లా 12 శాతం పెరిగి 215 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ప్రపంచంలోని మిలియనీర్లలో రెండు శాతం మంది భారతదేశంలోనే ఉన్నారు. బిలియనీర్లలో మన వాటా 5 శాతం. - ప్రపంచవ్యాప్తంగా సంపద తరలింపు విస్తృతమవుతోంది. ఎన్‌డబ్ల్యూ వరల్డ్ నివేదిక ప్రకారం గతేడాదిలో 95,000 మంది కోటీశ్వరులు తమ దేశాలను వీడి ఇతర దేశాలకు వలసవెళ్లారు. 2016లో ఈ సంఖ్య 82,000కాగా.. 2015లో 64,000 మాత్రమే. - అభివృద్ధి చెందిన దేశాలైన చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, సింగపూర్, వియత్నాంలతో పోలిస్తే ఆస్ట్రేలియా వ్యాపారానికి అనువని అంచనా. పైగా భద్రత విషయంలోనూ ఈ దేశానికి మంచి పేరు ఉంది. ఎందుకు వెళుతున్నారు? అభివృద్ధి చెందిన దేశాల్లో మంచి వ్యాపార అవకాశాలు, అక్కడ వ్యాపారస్తులకు కల్పించే రాయితీలు మన దేశంలోని పెట్టుబడిదారులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. భవిష్యత్ తరాలకు మన దేశంలో అవకాశాలు తక్కువగా ఉండడం, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో వారసత్వంగా వచ్చే ఆస్తులపై పన్నుల్లేకపోవడం వంటివి కూడా వలసలకు కారణమవుతున్నాయి. పశ్చిమ ఆసియాలో, సింగపూర్‌లాంటి చోట్ల అమలు చేస్తున్న అత్యధిక పన్నుల కారణంగా కూడా అక్కడి సంపన్నులు వారి దేశాల నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకుని.. చౌకగా వ్యాపారానికి అనువుగా ఉండి, ఎక్కువ రాయితీలు కలిగిన దేశాలకు వస్తున్నారు. -
భారత బిలీనియర్స్ అంతకంతకు పైపైకే....
న్యూఢిల్లీ : భారత్... ప్రస్తుతం అత్యధిక బిలీనియర్స్ ఉన్న జాబితాలో ప్రపంచంలో మూడో స్థానంలో నిలుస్తోంది. వచ్చే దశాబ్దంలో ఈ బిలీనియర్స్ సంఖ్యను భారత్ మరింత పెంచుకోనుందట. తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్న రిపోర్టుల ప్రకారం భారత్ తన బిలీనియర్ల జాబితాలో అదనంగా 238 మంది చోటు దక్కించుకోబోతున్నట్టు వెల్లడైంది. ఆఫ్రాఆసియా బ్యాంకు గ్లోబల్ హెల్త్ మైగ్రేషన్ రివ్యూ ప్రకారం భారత్‌లో ప్రస్తుతం 119 మంది బిలీనియర్లు ఉన్నారని, ఈ సంఖ్య 2027 నాటికి 357కు ఎగియనుందని తెలిసింది. వచ్చే 10 ఏళ్లలో భారత్ అదనంగా 238 మంది బిలీనియర్లను సృష్టిస్తుందని, చైనా 448 మందిని బిలీనియర్ల జాబితాలో చేర్చుకుంటుందని ఈ రివ్యూ అంచనావేస్తోంది. ప్రస్తుతం అమెరికా 62,584 బిలియన్ డాలర్లతో ప్రపంచంలో అత్యంత సంపన్నమైన దేశంగా ఉంది. ఈ దేశంలో కూడా బిలీనియర్ల సంఖ్య 2027 నాటికి 884కు పెరగబోతుందని భావిస్తోంది. దీని తర్వాత 697 మందితో చైనా, 357 మందితో భారత్ రెండు, మూడో స్థానంలో ఉంటాయని రివ్యూ పేర్కొంది. 1 బిలియన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ సంపద ఉన్నవారిని బిలీనియర్లుగా గుర్తిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 2,252 మంది బిలీనియర్లు ఉన్నారు. ఈ సంఖ్య 2027 నాటికి 3,444కు పెరగనుంది. మొత్తం సంపద పరంగా ప్రపంచంలో భారత్ ఆరో సంపన్న దేశంగా ఉంది. భారత సంపద 8,230 బిలియన్ డాలర్లు. పెద్ద మొత్తంలో వ్యాపారవేత్తలు, మంచి విద్యావ్యవస్థ, ఐటీలో గణనీయమైన వృద్ధి, బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్, రియల్ ఎస్టేట్, హెల్త్‌కేర్, మీడియా సెక్టార్లు భారత్ సంపద వృద్ధికి సహకరించనున్నాయని రిపోర్టు తెలిపింది. ప్రపంచ సంపద కూడా వచ్చే దశాబ్దంలో 50 శాతం కంటే ఎక్కువగా పెరిగనుందని పేర్కొంది. -
ఫోర్బ్స్ జాబితా: ప్రపంచ కుబేరుడు ఈయనే
ప్రపంచంలో అతి సంపన్నులైన వ్యక్తుల జాబితాను ఫోర్బ్స్ వెల్లడించింది. 2018 ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితాలో అందరూ ఊహించినట్టుగా మైక్రోసాప్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ను వెనక్కి నెట్టి అమెజాన్ వ్యవస్థాపకుడు ,సీఈవో జెఫ్ బెజోస్ తొలిసారి ప్రథమస్థానానికి దూసుకు వచ్చారు. బెజోస్ సంపదను 112 బిలియన్ డాలర్లుగా ఫోర్బ్స్ అంచనా వేసింది. దీంతో ఈ భూభాగంపై అపరకుబేరుడిగా ఆయన నిలిచారు. బెజోస్ జీవితంలో గత ఏడాది అతికీలకమైందని ఫోర్బ్స్ అసిస్టెంట్ ఎండీ లూయిసా క్రోల్ వ్యాఖ్యానించారు.. ప్రపంచ బిలియనీర్లను ట్రాక్ చేయడం ప్రారంభించినప్పటి నుంచి బెజోస్ అతి పెద్ద విజయం సాధించిన సంవత్సరమిదని పేర్నొన్నారు. ఈ 12 నెలల కాలంలో ఆయన 39 బిలియన్ల డార్లకుపైగా ఆర్జించినట్టు తెలిపారు. బిల్ గేట్స్ 90 బిలియన్ డాలర్లతో రెండవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.. ఇక ఈ జాబితాలో 84 బిలియన్ డాలర్లతో బిలియన్ డాలర్లతో అమెరికన్ వ్యాపార దిగ్గజం వారెన్ బఫెట్ మూడవ స్థానాన్నిసాధించగా , సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ అధిపతి మార్క్‌జుకర్‌బర్గ్ 71 బిలియన్ల డాలర్ల సంపదతో అయిదవ స్థానంలో నిలిచారు. అయితే ధనికులు, పేదల మధ్య అంతరం మరింత విస్తరించినట్టు ఫోర్బ్స్ తేల్చింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 2,200 మంది బిలియనీర్లు. 9.1 ట్రిలియన్ డాలర్ల విలువైన నికర విలువను కలిగి ఉన్నారని నివేదించింది. 2018 ఫోర్బ్స్ లిస్ట్ టాప్-15 జెఫ్ బెజోస్ బిల్ గేట్స్ వారెన్ బఫ్ఫెట్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ అండ్ ఫ్యామిలీ మార్క్ జుకర్‌బర్గ్ అమంగియో ఒర్టెగా కార్లోస్ స్లిమ్ హెల్ అండ్ ఫ్యామిలీ చార్లెస్ కోచ్ డేవిడ్ కోచ్ లారీ ఎల్లిసన్ మైఖేల్ బ్లూమ్‌బెర్గ్ లారీ పేజ్ సర్జీ బ్రిన్ జిమ్ వాల్టన్ ఎస్. రాబ్సన్ వాల్టన్ -
ఫోర్బ్స్ కుబేరుడు మళ్లీ అంబానీయే
న్యూఢిల్లీ: ఏదీ శాశ్వతం కాదంటారు.. మార్పు సహజమంటారు.. అన్నీ మారతాయంటారు.. కానీ ఇక్కడ ఒకటి మాత్రం స్థిరంగా ఉంటూ వస్తోంది. అదేంటనుకుంటున్నారా? ఫోర్బ్స్ జాబితాలో తొలి స్థానం. ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ అయిన ఫోర్బ్స్ తాజాగా ‘ఇండియాలోని వంద మంది బిలియనీర్ల జాబితా–2017’ను విడుదల చేసింది. ఇందులో మొదటి స్థానాన్ని మరోసారి రిలయన్స్ ఇండస్ట్రీస్ చీఫ్ ముకేశ్ అంబానీయే దక్కించుకున్నారు.అంబానీ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంటూ రావడం ఇది వరుసగా పదోసారి. ఆయన నికర సంపద విలువ దాదాపు రూ.2.5 లక్షల కోట్లుగా (38 బిలియన్ డాలర్లు) ఉంది. గతేడాదితో పోలిస్తే అంబానీ సంపద 15.3 బిలియన్ డాలర్లు పెరిగింది. దీంతో ఆయన ఆసియాలోని టాప్–5 కుబేరుల్లో ఒకరిగా నిలిచారు. రిఫైనింగ్ మార్జిన్లు మెరుగుపడటం, రిలయన్స్ జియో విజయవంతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ధర పరుగులు పెట్టడం వంటివి అంబానీ సంపద పెరుగుదలకు కారణం. కాగా ఈ వంద మంది జాబితాలో అందరూ బిలియనీర్లే. కనీసం 1.46 బిలియన్ డాలర్ల సంపద ఉన్నవారే జాబితాలో స్థానం సంపాదించుకున్నారు. గతేడాది ఈ పరిమితి 1.25 బిలియన్ డాలర్లుగా ఉంది. ‘భారత ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నప్పటికీ జాబితాలో ఉన్నవారి మొత్తం సంపద విలువ 26 శాతం వృద్ధితో రూ.31 లక్షల కోట్లకుపైగా (479 బిలియన్ డాలర్లు) ఎగిసింది. ♦ జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు మూడేళ్ల కనిష్ట స్థాయి 5.7 శాతానికి పడిపోయింది. దీనికి పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలుపై నెలకొని ఉన్న అనిశ్చితి వంటి అంశాలు ప్రధాన కారణం. అయితే స్టాక్ మార్కెట్ మాత్రం కొత్త గరిష్టాలకు చేరింది. ఇది దేశంలోని వంద మంది ధనికుల సంపద పెరుగుదలకు దోహదపడింది’ అని వివరించింది. షేర్ హోల్డింగ్స్, ఇతర ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఈ జాబితాను రూపొందించినట్లు తెలిపింది. ♦ గతేడాది రెండో స్థానంలో ఉన్న సన్ ఫార్మా దిలీప్ సంఘ్వీ ఈ సారి తొమ్మిదో స్థానానికి పడిపోయారు. ఈయన సంపద విలువ 12.1 బిలియన్ డాలర్లుగా ఉంది. ♦ ముకేశ్ సోదరుడు అనిల్ అంబానీ 45వ స్థానంతో సరిపెట్టుకున్నారు. సంపద విలువ 3.15 బిలియన్ డాలర్లు. ♦ అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ 13 నుంచి పదో స్థానానికి ఎగబాకారు. ఈయన సంపద 6.3 బిలియన్ డాలర్ల నుంచి 11 బి. డాలర్లు. ♦ పతంజలి ఆయుర్వేద్‌కు చెంది న ఆచార్య బాలకృష్ణ 48వ స్థానం నుంచి ఏకంగా 19వ స్థానానికి చేరుకున్నారు. ఈయన సంపద విలువ దాదాపు రూ.43,000 కోట్లుగా (6.55 బిలియన్ డాలర్లు) ఉంది. ♦ జాబితాలో కొత్తగా స్థానం పొందిన వారిలో నుస్లీ వాడియా అత్యంత సంపన్నుడిగా ఉన్నారు. ఈయన 5.6 బిలియన్ డాలర్ల సంపదతో 25వ స్థానంలో నిలిచారు. ♦ వెటరన్ ఇన్వెస్టర్ రాధాకిషన్ దమానీ మళ్లీ జాబితాలో స్థానం పొందారు. ఈయన 9.3 బిలియన్ డాలర్ల సంపదతో 12వ స్థానంలో నిలిచారు. ఈయనతో పాటు మరో ఇద్దరూ జాబితాలో మళ్లీ స్థానం పొందారు. వారిలో ఫ్యూచర్ గ్రూప్ కిశోర్ బియానీ మళ్లీ 2.75 బిలియన్ డాలర్లతో 55వ స్థానంలో ఉన్నారు. ఫార్మా దిగ్గజాల సంపద ఆవిరి.. జాబితాలోని 12 మంది సంపద తగ్గింది. వీరిలో సగం మంది ఫార్మా రంగానికి చెందిన వారే ఉండటం గమనార్హం. దిలీప్ సంఘ్వీ సంపద విలువ గరిష్టంగా 4.8 బిలియన్ డాలర్ల మేర తగ్గింది. దీంతో ఈయన మూడేళ్ల నుంచి ఉంటూ వస్తున్న రెండో స్థానాన్ని వదులుకోవాల్సి వచ్చింది. లుపిన్ షేరు ధర పడిపోవడం వల్ల గుప్తా కుటుంబం 40వ స్థానానికి పడిపోయింది. స్థానం పేరు సంపద (బిలియన్ డాలర్లు) 1 ముకేశ్ అంబానీ 38 2 అజీమ్ ప్రేమ్‌జీ 19 3 హిందూజా బ్రదర్స్ 18.4 4 లక్ష్మీ మిట్టల్ 16.5 5 పల్లోంజి మిస్త్రీ 16 మహిళా బిలియనీర్లు ఏడుగురు.. ఫోర్బ్స్ వంద మంది బిలియనీర్లలో ఏడుగురు మహిళలు స్థానం దక్కించుకున్నారు. వీరిలో ఒ.పి.జిందాల్ గ్రూప్ చైర్పర్సన్ సావిత్రి జిందాల్ టాప్‌లో ఉన్నారు. ఈమె 7.5 బిలియన్ డాలర్ల సంపదతో 16వ స్థానంలో నిలిచారు. సావిత్రి జిందాల్ తర్వాతి స్థానంలో లుపిన్ ఫార్మాకు చెందిన గుప్తా కుటుంబం ఉంది. వీరు 3.45 బిలియన్ డాలర్ల సంపదతో 40వ స్థానంలో ఉన్నారు. వీరికి లుపిన్‌లో 47 శాతం వాటాలున్నాయి. మంజు దేశ్‌బంధు గుప్తా.. లుపిన్కు నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉన్నారు. ఈమె లుపిన్ వ్యవస్థాపకులు దేశ్ బంధు గుప్తా భార్య. ఈయన ఈ ఏడాది జూన్‌లో చనిపోయారు. వినోద్ అండ్ అనిల్ రాయ్ గుప్తా కుటుంబం 3.11 బిలియన్ డాలర్ల సంపదతో 48వ స్థానంలో ఉంది. వీరికి హావెల్స్ ఇండియాలో 60 శాతం వాటాలున్నాయి. జైన్ కుటుంబం 3 బిలియన్ డాలర్ల సంపదతో 51వ స్థానంలో ఉంది. టైమ్స్ ఆఫ్ ఇండియాను ప్రచురించే మీడియా గ్రూపు బెన్నెట్ కోలెమన్ అండ్ కో వీరిదే. అమాల్గమేషన్స్ గ్రూప్ కుటుంబం 63వ స్థానంలో ఉంది. వీరి సంపద విలువ 2.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ట్రాక్టర్ల కంపెనీ టఫే వీరిదే. లీనా తివారీ 2.19 బిలియన్ డాలర్ల సంపదతో 71వ స్థానంలో ఉన్నారు. ఈమె యూఎస్వీ ఇండియా చైర్పర్సన్. బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా 2.16 బిలియన్ డాలర్ల సంపదతో 72వ స్థానంలో నిలిచారు. -
అయ్యో.. 11 మందికి బిలీనియర్ ట్యాగ్ పోయింది!
నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంతో 11 మంది తమ బిలీనియర్ ట్యాగ్ ను కోల్పోయారు. అవినీతిపై ఉక్కుపాదం మోపుతూ నకిలీ కరెన్సీకి వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దుతో వీరు బిలీనియర్ జాబితా నుంచి కిందకి పడిపోయినట్టు తాజా సర్వేలో వెల్లడైంది. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ మంగళవారం విడుదల చేసిన రిపోర్టులో ఈ విషయాలు వెల్లడయ్యాయి. పెద్ద నోట్ల రద్దు వంటి ప్రభుత్వం తీసుకునే సంచలనాత్మక నిర్ణయాలతో భారత్ ఎంతో క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొందని హురున్ రిపోర్ట్ ఇండియా చీఫ్ రీసెర్చర్, మేనేజింగ్ డైరెక్టర్ రెహమాన్ జునైడ్ తెలిపారు. పారదర్శకతమైన కరెన్సీ ఎకనామిక్స్ పారశ్రామికవేత్తల్లో సానుకూల ప్రభావాన్ని నెలకొల్పుతుందని తాము విశ్వసిస్తున్నట్టు చెప్పారు. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ నేడు విడుదల చేసిన రిచెస్ట్ ఇండియన్స్ 2017 జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, చైర్మన్ ముఖేష్ అంబానీ మళ్లీ అగ్రస్థానంలో నిలిచారు. గ్లోబల్ ర్యాంకిగ్స్ లో ఆయన 28 స్థానంలో నిలిచారు. ఆయన తర్వాత దేశీయంగా రెండో ర్యాంకింగ్ లో ఎస్పీ హిందూజా అండ్ ఫ్యామిలీ(గ్లోబల్ గా 74) , మూడో స్థానంలో దిలీప్ సంఘ్వీ(గ్లోబల్ గా 74), నాలుగో ర్యాంక్ లో పల్లోజి మిస్త్రీ(గ్లోబల్ గా 97)లు ఉన్నారు. ఈ రిపోర్టు ప్రకారం 132 మంది భారతీయులు లేదా భారతీయ సంతతి బిలీనియర్ల నికర సంపద 1 బిలియన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది. 42 మంది బిలీనియర్లకు ముంబై నిలయంగా ఉండగా.. దాని తర్వాత న్యూఢిల్లీ, అహ్మదాబాద్ లు ఉన్నాయి. గ్లోబల్ గా బీజింగ్, న్యూయార్క్ ను అధిగమించింది. ''బిలీనియర్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్'' గా బీజింగ్ అగ్రస్థానంలో నిలిచింది. -
హైదరాబాద్‌లో 9 వేల మంది మిలియనీర్లు..
హైదరాబాద్ : భారత్‌లో అత్యంత సంపద కలిగిన వారు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నారంటే ? ముంబై అని చెబుతోంది ఓ సంస్థ నివేదిక. దేశ ఆర్థిక రాజధానిగా పేరుపొందిన ముంబైలోనే అత్యధికంగా బిలియనీర్లు, మిలియనీర్లు ఎక్కువగా ఉన్నారని తెలిపింది. దేశంలో అత్యధికంగా సంపద కలిగిన వ్యక్తులు ఏ నగరంలో ఉన్నారనే విషయంపై న్యూ వెల్త్ వరల్డ్ (ఎన్డబ్ల్యూడబ్ల్యూ) అనే సంస్థ సర్వే నిర్వహించింది. ఇటీవల ఆ సంస్థ విడుదల చేసిన సర్వే నివేదికలో ఈ విషయం పూర్తిగా వెల్లడైంది. ముంబైలో అధిక మొత్తంలో సంపద కలిగిన వ్యక్తులు ఉన్నారని నివేదికలో ఎన్డబ్ల్యూడబ్ల్యూ చెప్పింది. ముంబైలో 28 మంది బిలియనీర్లు ఉండగా, 46 వేల మంది మిలియనీర్లు ఉన్నారు. ఆ తర్వాత స్థానం ఢిల్లీకి దక్కింది. ఢిల్లీలో 18 మంది బిలియనీర్లు ఉండగా, 23 వేల మంది మిలియనీర్లు ఉన్నారు. ఆ తర్వాత క్రమంలో బెంగుళూరు, హైదరాబాద్, కోల్‌కతా, చెన్నై, పూణె, గూర్గాం నగరాల్లో అత్యధికంగా బిలియనీర్లు, మిలియనీర్లు ఉన్నట్టు ఆ రిపోర్ట్ తెలిపింది. -
డిగ్రీల్లేని బిలియనీర్లు..!
పరీక్షల్లో తక్కువ మార్కులొచ్చాయని, కోరుకున్న కాలేజీలో సీటు దక్కలేదని, తల్లిదండ్రుల కారణంగా ఇష్టమైన కోర్సులో చేరలేకపోయామని బాధపడి.. అఘాయిత్యాలు చేసుకుంటోన్న యువతరాన్ని ప్రస్తుతం మనం చూస్తున్నాం. ప్రతిష్టాత్మక ఐఐటీల నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా పొంది, దాన్ని రెజ్యూమెలో అప్డేట్ చేసుకుని చూసుకుంటే బాగానే ఉంటుంది. కానీ, అది మన జీవితాన్ని ఎంత వరకూ ప్రభావితం చేస్తుందనేదే ప్రశ్న. డిగ్రీ పట్టాలు సాధించాలని కాలేజీల్లో చేరి, మధ్యలోనే నిష్ర్కమించి జీవిత గమనంలో విజేతలుగా మారినవారు మన చుట్టూ చాలా మందే ఉన్నారు. వారిలో కొందరు బిలియనీర్లూ అయ్యారు! డిగ్రీల్లేని ఆ బిలియనీర్లే వీరు!! స్టీవ్ జాబ్స్: ప్రస్తుతం యువత క్రేజీగా వాడే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు ‘ఆపిల్’ సంస్థ తయారుచేసేవే అనడంలో సందేహం లేదు. ఐఫోన్, ఐప్యాడ్, ఐమ్యాక్, ఐవాచ్.. ఇలా ఏదైనా కానీ ఆపిల్ ఉత్పత్తులు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుర్తింపే వేరు. ఈ గుర్తింపునీ, అందుకు కారణమైన నాణ్యతనీ సంస్థకు అందించాడు ఆ కంపెనీ దివంగత సీఈవో స్టీవ్‌జాబ్స్. వీడియోగేమ్ డెవలపర్‌గా కెరీర్ ప్రారంభించిన ఈయన.. రెండేళ్లకే 1976లో సొంత కంపెనీ ప్రారంభించాడు. తర్వాత వీరి ప్రస్థానం ఓ చరిత్ర. అనతికాలంలోనే ఆపిల్ టెక్నాలజీ దిగ్గజంగా మారింది. వీరి చిన్నసైజు కంప్యూటర్లు వినియోగదారులను విపరీతంగా ఆకర్షించాయి. తన మేధ, నాయకత్వ లక్షణాలతో రూ.వందల కోట్లు సంపాదించిన జాబ్స్‌కు డిగ్రీ లేదు. రీడ్ కాలేజీలో చేరి, ఆరు నెలలకే చదువు ఆపేశాడు జాబ్స్! ల్యారీ ఎల్లిసన్: ప్రఖ్యాత సాఫ్ట్వేర్ దిగ్గజం ఒరాకిల్ అధినేత ల్యారీ ఎల్లిసన్దీ డిగ్రీ లేని కథే. 46 ఏళ్ల వయసులోనే అమెరికాలోనే మూడో సంపన్నుడిగా రికార్డు సృష్టించాడు. కానీ, డిగ్రీ మాత్రం సంపాదించుకోలేకపోయాడు. చిన్ననాటి నుంచీ చురుకైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్న ఎల్లిసన్.. ఇల్లినాయిస్ యూనివర్సిటీ నుంచి ‘సైన్స్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డునూ అందుకున్నాడు. అయితే, తన సవతి తల్లి చనిపోవడంతో రెండో ఏడాదే అక్కడ చదువు ఆపేశాడు. తర్వాత చికాగో యూనివర్సిటీలో చేరి, అక్కడా పూర్తి కాలం కొనసాగలేకపోయాడు. కంప్యూటర్ ప్రొగ్రామర్‌గా కెరీర్ ప్రారంభించి, సొంత కంపెనీ తెరిచాడు. కమర్షియల్ అప్లికేషన్లు తయారు చేస్తూ, ఐటీ ఇండస్ట్రీకి దన్నుగా నిలిచాడు. బిల్ గేట్స్: ప్రపంచవ్యాప్తంగా బిల్‌గేట్స్ పేరు తెలియనివారే లేరు. అంతగా సుపరిచితుడు ఈ టెక్నాలజీ రారాజు. ప్రపంచ సాఫ్ట్వేర్ విభాగాన్ని ఏలుతున్న మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడిగా ఎనలేని కీర్తి గడించాడు. దీంతో పాటే రూ.వేల కోట్లను తన బ్యాంక్ అకౌంట్లలో నింపుకొన్నాడు. అయితే, ఈయనకు కాలేజీ డిగ్రీ మాత్రం లేదండోయ్. హార్వర్డ్ లాంటి విఖ్యాత యూనివర్సిటీలో ప్రవేశం పొందినా, మధ్యలోనే చదువుకు స్వస్తి చెప్పాడు. దీనికి కారణం కూడా మైక్రోసాఫ్టే! అవును, 1975లో తన స్నేహితుడు పాల్ అలెన్‌తో కలిసి మైక్రోసాఫ్ట్ కంపెనీని స్థాపించాడు. సాఫ్ట్వేర్ అభివృద్ధి పనుల్లో పడి, కాలేజీకి వెళ్లడం గేట్స్‌కు సాధ్యం కాలేదు. అయినప్పటికీ విజయవంతమైన వ్యాపారవేత్తగా, నాయకుడిగా ఎదిగాడు. మార్క్ జుకెర్‌బర్గ్: ప్రస్తుతం ఈమెయిల్ ఐడీ లేని వారున్నారేమో కానీ, ఫేస్బుక్ ఐడీ లేని వాళ్లు మాత్రం లేరంటే నమ్మాల్సిందే. నెటిజన్లలోకి అంతగా చొచ్చుకుపోయిందీ సోషల్ నె ట వర్కింగ్ సైట్. ఒకరకంగా చెప్పాలంటే నెటిజన్లు తమ సమయాన్ని చాలావరకూ నెట్టింట్లోనే గడిపేలా చేసింది ఫేస్బుక్కే. ఇంతటి సత్తా ఉన్న వెబ్సైట్ వ్యవస్థాపకుడికి డిగ్రీ కూడా లేదంటే నమ్ముతారా? కానీ, నిజమే! అతి చిన్న వయసులోనే బిలియనీర్‌గా మారిన మార్క్ జుకెర్‌బర్గ్.. హార్వర్డ్ యూనివర్సిటీలో చదివే రోజుల్లోనే ఫేస్‌బుక్‌ను ప్రారంభించాడు. తొలుత యూనివర్సిటీకే పరిమితమైన ఈ వెబ్సైట్ తర్వాత రోజుల్లో విశ్వమంతా వ్యాపించింది. అలా తన వ్యాపారాన్ని మరింత విస్తరింపజేసేందుకే జుకెర్‌బర్గ్ 2004లో డిగ్రీని మధ్యలోనే వదిలేశాడు. రాల్ఫ్ లారెన్: ప్రపంచ ప్రఖ్యాత ఫ్యాషన్ బ్రాండ్ పోలో గురించి వినే ఉంటారు. ఈ బ్రాండ్‌ను ఇష్టపడని యువత ఉండరు. ముఖ్యంగా ఈ సంస్థ అందించే స్పోర్ట్స్ దుస్తులు ఎంతో ఆదరణ పొందాయి. దుస్తులనే కాదు.. ఫుట్‌వేర్, జువెల్లరీ, సుగంధ ద్రవ్యాలు, గృహోపకరణాలు ఇలా ‘రాల్ఫ్ లారెన్ కార్పొరేషన్’ నుంచి వచ్చిన ఏ వస్తువైనా ఎగబడి కొంటారు వినియోగదారులు. ఇంతటి ఘనమైన కంపెనీని నడిపేది ఎవరో తెలుసా? 75 ఏళ్ల రాల్ఫ్ లారెన్! ఫ్యాషన్ దిగ్గజంగా ఈయన పేరు పాశ్చాత్య దేశాల్లో మార్మోగి పోతుంది. కొన్ని వందల కోట్ల రూపాయల వ్యాపారాన్ని సృష్టించిన రాల్ఫ్ కూడా డిగ్రీ పూర్తి చేయలేదు. బరూచ్ కాలేజీలో రెండేళ్ల పాటు చదివాక, మధ్యలోనే ఆపేసి, ఆర్మీలో చేరాడు. అక్కడ నెక్ టైలు కుట్టుకుంటూ వస్త్ర ప్రపంచంలోకి ప్రవేశించాడు. తర్వాత జరిగిందంతా చరిత్రే! -
స్టార్టప్స్‌తో పెరగనున్న సంపన్నులు
2020 నాటికి మరో 12 మంది కొత్త బిలియనీర్లు న్యూఢిల్లీ : భారత్‌లో బిలియనీర్ల, మిలియనీర్ల సంఖ్య మరింత పెరగనుంది. దేశంలో 2020 నాటికి కొత్తగా 12 మందికిపైగా బిలియనీర్లు అవతరిస్తారనే విషయం అసోచామ్ సర్వేలో వెల్లడైంది. దీనికి స్టార్టప్స్ బూమ్ కారణమని పేర్కొంది. స్టార్టప్స్ జోరుకు ఈ-కామర్స్, ఎంటర్టైన్మెంట్, పేమెంట్ గేట్వేస్, రేడియో ట్యాక్సీ, టెక్నాలజీ సంబంధిత రంగాలు బాగా ఊతమిస్తున్నాయని, ఆయా రంగాల్లో పెట్టుబడులు మరింత పెరిగే అవకాశం ఉందని వివరించింది. రానున్న కాలంలో ఆసియా స్టార్టప్ దిగ్గజ దేశాల సరసన భారత్ కూడా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తంచేసింది. చైనాలో మాదిరిగా భారత్‌లో స్టార్టప్‌ల వృద్ధికి సంబంధించిన నిర్మాణాత్మక సమస్యలు లేవని తెలిపింది. ట్రావెలింగ్ రంగంలో ముఖ్యంగా టికెట్, బుకింగ్ విభాగాలకు మంచి డిమాండ్ ఉందని పేర్కొంది. అలాగే ఈ-కామర్స్ రంగంలో కిరాణా, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్ వస్తు విభాగాల డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్స్, సినిమా టికెటింగ్ వంటి అంశాలకు మంచి ఆదరణ లభించిందని వివరించింది. బ్రాడ్‌బ్యాండ్ విస్తరణ వల్ల చిన్న చిన్న పట్టణాలకు కూడా ఇంటర్నెట్ వ్యాప్తి జరిగితే ఈ ట్రెండ్ మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. పలు రంగాల్లోని స్టార్టప్‌లపై ఇన్వెస్టర్లు ఆసక్తిని కనబరుస్తున్నారని తెలిపింది. స్టాక్ ఎక్స్ఛేంజ్ల నుంచి స్టార్టప్‌లు నిధులను సమీకరించడానికి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ అనువైన పరిస్థితులను సృష్టిస్తున్నప్పటికీ ఆ విధంగా నిధులను సమీకరించడానికి మరింత సమయం పడుతుందని పేర్కొంది. -
కోటీశ్వరులతో బాబు కుమ్మక్కు
బుక్కరాయసముద్రం : ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోటీశ్వరులతో రాష్ర్ట ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, దేశ ప్రధాని నరేంద్రమోడి కుమ్మక్కయ్యారని సీపీఐ రాష్ర్ట కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రజాసంక్షేమానికి తిలోదకాలిచ్చి ఇద్దరూ విదేశీ పర్యటనకు సిద్ధం కావడం సిగ్గుచేటని అన్నారు. కార్మికులను అణగదొక్కేందుకు ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయని మండిపడ్డారు. రుణమాఫీకి ఆధార్‌కార్డును అనుసంధానం చేయాలనడం దారుణమని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆధార్ అనుసంధానాన్ని వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు ప్రస్తుతం అదేపంథాను అనుసరించడం దారుణమని అన్నారు. రాష్ట్ర రాజధాని నిర్మాణం అంటూ రైతులకు సంబందించిన భూమలను లాక్కొని కోట్ల రుపాయలను కొల్లగొడుతున్నారని ఆరోపించారు. ప్రతి పేదోనికి 200 రోజులు పని దినాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ నేతలు ఆవుల శేఖర్, భీమలింగప్ప, కేశవరెడ్డి, జాఫర్, నారాయణస్వామి పాల్గొన్నారు. -
కుబేరుల గని.. ముంబై వర్సిటీ
* పూర్వ విద్యార్థుల్లో 12 మంది బిలియనీర్లు * టాప్ 10 వర్సిటీల్లో 9వ స్థానం న్యూఢిల్లీ: అత్యధిక సంఖ్యలో సంపన్నులను సృష్టించిన టాప్ 10 విశ్వవిద్యాలయాల్లో యూనివర్సిటీ ఆఫ్ ముంబై తొమ్మిదో స్థానం దక్కించుకుంది. ముంబై వర్సిటీ నుంచి బ్యాచిలర్స్ పట్టా పుచ్చుకున్న వారిలో ఏకంగా 12 మంది బిలియనీర్లుగా ఉన్నారు. దీంతో కోట్లకు పడగలెత్తిన పూర్వ విద్యార్థులు .. అత్యధిక సంఖ్యలో ఉన్న వర్సిటీల్లో ఒకటిగా ముంబై విశ్వవిద్యాలయం నిల్చింది. అమెరికా వర్సిటీలను మినహాయిస్తే ఇంత ఎక్కువ సంఖ్యలో బిలియనీర్లను అందించిన ఏకైక విశ్వవిద్యాలయం ఇదొక్కటే. వెల్త్-ఎక్స్, యూబీఎస్ ఈ ఏడాది నిర్వహించిన బిలియనీర్ సెన్సస్‌లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ జాబితాలో 25 మంది బిలియనీర్ పూర్వ విద్యార్థులతో యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా (16 మంది), ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం (14 మంది) వరుసగా టాప్ ఫైవ్‌లో ఉన్నాయి. ముంబై విశ్వవిద్యాలయంలో చదివిన బిలియనీర్ల సంఖ్య.. అటు ఎంఐటీ, ఎన్‌వైయూ, యూనివర్సిటీ ఆఫ్ కొలంబియా, డ్యూక్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వంటి ప్రఖ్యాత వర్సిటీల కన్నా అధికం కావడం గమనార్హం. టాప్ 20 బిలియనీర్ స్కూల్స్‌లో 16 అమెరికాలోనే ఉన్నాయి. మిగతా నాలుగింటిలో.. ముంబై విశ్వవిద్యాలయం, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ (బ్రిటన్), లొమొనొసొవ్ మాస్కో స్టేట్ యూనివర్సిటీ(రష్యా), ఈటీహెచ్ జ్యూరిక్(స్విట్జర్లాండ్) ఉన్నాయి. -
ఎన్నికల బరిలో కోటీశ్వరులు..!
-
గ్రామ పంచాయతీ బరిలో కోటీశ్వరురాలు
సాక్షి, ముంబై: నవీముంబైలోని ఖార్ఘర్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఏకంగా రూ.200 కోట్లు ఆస్తులున్న ఓ మహిళ అభ్యర్థి పోటీ చేయడం స్థానిక రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన నామినేషన్లో పెద్ద మొత్తంలో ఆస్తులున్నాయని, పన్ను ఏటా ప్రభుత్వానికి చెల్లిస్తున్నట్లు లీనా గరాడ్ తెలిపి ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఖార్ఘర్ గ్రామపంచాయతీకి ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నికలు జరిగాయి. సోమవారం ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అందులో రూ.200 కోట్ల ఆస్తులున్న లీనా గరాడ్ భారీ మెజారిటీతో గెలిచారు. ఆమె ఖార్ఘర్ కాలనీ ఫోరం తరఫున వార్డు నంబర్-3 నుంచి పోటీ చేశారు. లీనా భర్త అర్జున్ గరాడ్ పోలీసు శాఖలో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. ఆయనకు నెలకు రూ.30 వేల జీతం. అయితే ఈ డబ్బులతో ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు ఎలా కూడగట్టారనేది రాజకీయ నాయకులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇదివరకు జరిగిన లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు వెల్లడించిన ఆస్తులు ఈ స్థాయిలో లేవని తెలుస్తోంది. ఈ ఆస్తులు ఎలా వచ్చాయో ఆమె వెల్లడించారు. ‘ప్రస్తుతం నవీముంబైలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రతిపాదనలో ఉంది. ఇక్కడ మాకు అనేక సొంత స్థలాలున్నాయి. విమానాశ్రయం కారణంగా ప్రస్తుతం వాటి ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. తాను గత 13 ఏళ్ల నుంచి బిల్డర్ రంగంలో ఉన్నాను. తమ వద్ద 17 వివిధ రకాల కంపెనీల కార్లు ఉన్నాయి. ఇందులో అత్యధిక శాతం వాహనాలకు నంబర్లు 100 ఇలా ఉన్నాయి. అందుకు ఆర్టీఓ అధికారులు కేటాయించిన మొత్తాన్ని చెల్లించి ఈ లక్కీ నంబర్లను పొందామ’ని వివరించారు. ఈ వాహనాల కొనుగోలుకు రూ.10 కోట్లు రుణాలు తీసుకున్నామని వెల్లడించారు. అయితే ప్రముఖ రాజకీయ నాయకులు గణేశ్ నాయక్ (ఎన్సీపీ) రూ.3 కోట్లు, అజిత్ పవార్(ఎన్సీపీ) రూ.10 కోట్లు, అశోక్ చవాన్ (కాంగ్రెస్) రూ.24 కోట్లు, సురేశ్ జైన్ (శివసేన) రూ.82 కోట్లు, మంగళ్ లోఢా (బీజేపీ) రూ.68 కోట్లు ఉన్నట్టు వారు పోటీచేసినప్పుడు ఈసీకి సమర్పించిన నామినేషన్లలో ఉన్నాయి. -
ఆసియాలో కుబేరుల జోరు..
న్యూఢిల్లీ: ఆర్థిక అనిశ్చిత పరిస్థితులున్నప్పటికీ, ఆసియా ప్రాంతంలో బిలియనీర్ల సంఖ్య పెరుగుతోందని వెల్త్-ఎక్స్ మ్యాగజైన్, యూబీఎస్ల బిలియనీర్ సెన్సస్ 2013 తాజా నివేదిక పేర్కొంది. ఈ ఏడాది ఆసియా ప్రాంతంలో 18 మంది కొత్తగా బిలియనీర్లయ్యారని , ఇదొక రికార్డని ఈ నివేదిక పేర్కొంది. 3 కోట్ల డాలర్లకు పైగా సంపద ఉన్న వారిని ఈ నివేదిక బిలియనీర్లుగా వ్యవహరించింది. ఆసియాలో బిలియనీర్ల జోరు ఇలానే కొనసాగితే, ఐదేళ్లలో బిలియనీర్ల విషయంలో ఈ ప్రాంతం దక్షిణ అమెరికా సరసన చేరుతుంది. మొత్తం మీద ఆసియాలో 44,505 మంది కొత్త ఆల్ట్రా హై నెట్‌వర్త్ వ్యక్తులున్నారు. వీరందని సంపద 6,590 కోట్ల డాలర్లుగా ఉంది. మొత్తం మీద ఈ ఏడాదికి అంతర్జాతీయంగా బిలియనీర్ల సంఖ్య 2,170కు చేరింది.