భారతదేశం ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో సంపద సృష్టికి హాట్‌స్పాట్‌గా ఉద్భవించింది. పదేళ్లలో ఇండియాలోని బిలియనీర్ల నికర విలువ దాదాపు మూడు రేట్లు పెరిగి 905.6 బిలియన్లకు చేరింది. దీంతో భారత్ ఇప్పుడు మొత్తం బిలియనీర్ సంపదలో ప్రపంచవ్యాప్తంగా మూడవ స్థానంలో నిలిచినట్లు స్విట్జర్లాండ్ స్విస్ బ్యాంక్‌గా పేరుపొందిన 'యూబీఎస్' నివేదికలో వెల్లడించింది.
యూబీఎస్ నివేదిక ప్రకారం.. భారతదేశంలో బిలియనీర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ జాబితాలోకి కొత్తగా 32 మంది చేరారు. దీంతో 153 మంది నుంచి బిలియనీర్ల సంఖ్య 185కు చేరింది. వీరి మొత్తం నికర విలువ ఒక్కసారిగా (905.6 బిలియన్స్) పెరిగింది. భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ రూ.76 లక్షల కోట్ల కంటే ఎక్కువే అని తెలుస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా 2024లో బిలియనీర్ల సంఖ్య 2682కు చేరింది. అంతకు ముందు సంవత్సరంలో ఈ సంఖ్య 2,544గా ఉంది. నికర విలువ కూడా ఈ ఏడాది 12 ట్రిలియన్ డాలర్ల నుంచి 14 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. అమెరికాలో బిలియనీర్ల సంఖ్య 751 నుంచి 835కి పెరిగింది, వారి మొత్తం సంపద 4.6 ట్రిలియన్స్ నుంచి 5.8 ట్రిలియన్లకు పెరిగింది.
చైనాలో మాత్రం బిలియనీర్ల సంఖ్య 520 నుంచి 427కి చేరింది. వారి సంపద 1.8 ట్రిలియన్ డాలర్ల నుంచి 1.4 ట్రిలియన్లకు పడిపోయింది. భారత్ విషయానికి వస్తే.. ఇక్కడ బిలియనీర్ల సంఖ్య 153 నుంచి 185కు చేరింది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment