న్యూఢిల్లీ: అమెరికా ఎకానమీలో ముదురుతున్న మాంద్యం భయాలకు తోడు, ఊహించినదానికంటే ఎక్కువగా నమోదైన అధిక ద్రవ్యోల్బణం కారణంగా అక్కడి మార్కెట్లు భారీ పతనాన్ని నమోదు చేశాయి. ఫలితంగా భారీగా ఫెడ్ వడ్డింపు తప్పదనే భయాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలోని అత్యంత సంపన్న బిలియనీర్ల సంపద మంగళవారం నాడు 93 బిలియన్ డాలర్ల మేర పడిపోయింది. ఇది తొమ్మితో అత్యంత దారుణమైన రోజువారీ నష్టమని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. (బెజోస్,మస్క్ సరే! మరి అదానీ, అంబానీ సంపద మాట ఏంటి?)
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం అమెరికా కుబేరుల సంపద భారీగా తుడుచిపెట్టుకుపోయింది. ముఖ్యంగా అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ సంపద ఒక్క రోజు లోనే రూ. 80 వేల కోట్లు (9.8 బిలియన్ డాలర్లు)ను కోల్పోయారు.. అలాగే టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ నికర విలువలో రూ.70 వేల కోట్లు (8.4 బిలియన డాలర్లను) పడిపోయింది. అంతేకాదు మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్, లారీ పేజ్, సెర్గీ బ్రిన్ , స్టీవ్ బాల్మెర్‌లు ఇదే బాటలో పయనించారు. వీరి సంపద మొత్తం 4 బిలియన్ డాలర్లకు పైగా క్షీణించగా, టాప్ 10 జాబితాలోని ఇతర బిలియనీర్లు వారెన్ బఫెట్, బిల్ గేట్స్ వరుసగా 3.4 బిలియన్ డాలర్లు, 2.8 బిలియన్ డాలర్లను కోల్పోయారు.
కాగా అమెరికా వినియోగదారుల ధరల సూచీ అంతకుముందు ఏడాదితో పోలిస్తే 8.3 శాతం మేర పెరిగింది. ఇది 8.1 శాతంగా ఉంటుందని నిపుణులు అంచనా వేశారు. దీంతో ఇది మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఇన్వెస్టర్ల అమ్మకాలతో గత ఐదు రోజుల్లో అమెరికా స్టాక్ మార్కెట్లు తీవ్రంగా నష్టపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment