plunges
-
Dubai Floods: దుబాయ్‌లో వర్ష బీభత్సం.. అంతటా అల్లకల్లోలం!
వర్ష బీభత్సానికి ఎడారి దేశం దుబాయ్ విలవిలలాడిపోతోంది. కేవలం గంటన్నర వ్యవధిలో అంటే 90 నిమిషాల్లో.. ఏడాదిలో కురవాల్సిన వర్షమంతా ఒకేసారి కురిసింది. May Allah protect Dubai and all Muslim Ummah! pic.twitter.com/DBULtsnODg — Allah Islam Quran (@AllahGreatQuran) April 17, 2024 భారీ వర్షానికి తోడు వేగంగా వీచిన ఈదురు గాలులకు చెట్లు నేల కూలాయి. కుండపోత వర్షానికి రోడ్లన్నీ జలమయంగా మారాయి. మాల్స్ అన్నీ నీటితో నిండిపోయాయి. Dubai is experiencing serious flood disaster, but who added the screaming and gunshots sound to the video 🤦 pic.twitter.com/TYteXtM4dT — Lawrence I. Okoro ( Sir Law ) (@LawrenceOkoroPG) April 17, 2024 దుబాయ్ ఎయిర్ పోర్టులోనూ వర్ష బీభత్సం ప్రత్యక్షంగా కనిపించింది. దీంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బయటి రోడ్లను చూస్తే అవి చెరువులను తలపించాయి. రైల్వే వ్యవస్థ చాలావరకూ దెబ్బతింది. సబ్ వేలన్నీ నీట మునిగాయి. రోడ్లపై నిలిపివుంచిన కార్లు నీటిలో కొట్టుకుపోయాయి. pic.twitter.com/zdHha4kaYv — Taswar Sial (@TaswarSial) April 17, 2024 దుబాయ్ తీరాన్ని తాకిన తుఫాను కారణంగా ఈ ప్రకృతి విలయం సంభవించింది. భారీ వర్షాల కారణంగా పోటెత్తిన వరదలతో యూఏఈ అంతటా జన జీవనం స్తంభించింది. స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ప్రైవేట్ ఉద్యోగులకు ఆయా సంస్థలు వర్క్ ఫ్రం హోం వెసులుబాటును కల్పించాయి. Scenes of current Dubai weather pic.twitter.com/z7rGzUtlIB — Science girl (@gunsnrosesgirl3) April 16, 2024 ఫుజైరా ఎమిరేట్స్‌లో దుబాయ్‌కి మించిన వర్షపాతం నమోదయ్యింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రపంచంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్ అయిన మాల్ ఆఫ్ ఎమిరేట్స్ లోపలికి నీరు ప్రవేశించింది. నీటి ఒత్తిడికి మాల్ పైకప్పు భాగాలు ఊడి కింద పడ్డాయి. గత 75 ఏళ్లలో ఎప్పుడూ ఇంతటి భారీ వర్షాలు కురియలేదని అధికారులు తెలిపారు. The torrents in Oman are worse than in Dubai. No jokes..pic.twitter.com/O6DGA8sFMe — Henry Kabogo 💧 ❄ 🇰🇪 (@Kabogo_Henry) April 17, 2024 రోడ్లపై భారీగా నిలిచిన నీటిని అధికారులు ట్రక్కుల్లో నింపి క్లియర్ చేస్తున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా రాగల 48 గంటల్లో భారీ వర్షాలు కురియవచ్చని పేర్కొంటూ జాతీయ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రాకూడదని హెచ్చరించింది. -
దలాల్ స్ట్రీట్‌లో హిండెన్‌బర్గ్ ప్రకంపనలు:11 లక్షల కోట్ల ఢమాల్
సాక్షి,ముంబై: బడ్జెట్‌కు ముందు, దేశీయ స్టాక్ మార్కెట్లకు అదానీ షేర్ల పతనం సెగ కొనసాగుతోంది. శుక్రవారం అదానీ గ్రూపు కంపెనీల షేర్ల పతనం భారీగా కొనసాగడంతో కీలక సూచీలు భారీ పతనాన్ని నమోదు చేశాయి. అలాగే బ్యాంకింగ్, మెటల్ షేర్లలో కూడా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఒక దశలో సెన్సెక్స్ 1200 పాయింట్లు కుప్ప కూలగా, నిఫ్టీ 17500 స్థాయిని కోల్పోయింది. చివర్లో కోలుకుని సెన్సెక్స్ 874.16 పాయింట్లు లేదా 1.45 శాతం క్షీణించి 59,330.90 వద్ద, నిఫ్టీ 287.60 పాయింట్లు లేదా 1.61 శాతం దిగువన 17,604 వద్ద ముగిసింది. ఫలితంగా 11 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. గత నాలుగు నెలల్లో ఇదే అతిపెద్ద పతనమని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యంగా హిండెన్‌బర్గ్ ఆరోపణలతో గ్రూపునకు చెందిన 7 కంపెనీల షేర్లు భారీ పతనాన్ని నమోదు చేసింది. రెండురోజులుగా కొనసాగుతున్న అమ్మకాల వెల్లువలో అదానీ మార్కెట్ క్యాప్ లక్షల కోట్లు తుడుచు పెట్టుకుపోయింది. అదానీ పోర్ట్స్, అదానీఎంటర్ ప్రైజెస్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు టాప్ లూజర్స్‌గా నిలిచాయి. మరోవైపు ఆటో, ఫార్మా టాప్ గెయినర్లుగా ఉన్నాయి. టాటా మోటార్స్, బజాజ్ ఆటో, డా.రెడ్డీస్, ఐటీసీ లాభపడగా, దివీస్,అల్ట్రాటెక్ సిమెంట్ లాభపడ్డాయి. అటు డాలరు మారకంలో రూపాయి స్వల్ప లాభాల్లో 8 పైసలు ఎగిసింది. -
బెజోస్ నుంచి మస్క్ దాకా, ప్రపంచ బిలియనీర్లకు భారీ షాక్
న్యూఢిల్లీ: అమెరికా ఎకానమీలో ముదురుతున్న మాంద్యం భయాలకు తోడు, ఊహించినదానికంటే ఎక్కువగా నమోదైన అధిక ద్రవ్యోల్బణం కారణంగా అక్కడి మార్కెట్లు భారీ పతనాన్ని నమోదు చేశాయి. ఫలితంగా భారీగా ఫెడ్ వడ్డింపు తప్పదనే భయాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలోని అత్యంత సంపన్న బిలియనీర్ల సంపద మంగళవారం నాడు 93 బిలియన్ డాలర్ల మేర పడిపోయింది. ఇది తొమ్మితో అత్యంత దారుణమైన రోజువారీ నష్టమని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. (బెజోస్,మస్క్ సరే! మరి అదానీ, అంబానీ సంపద మాట ఏంటి?) బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం అమెరికా కుబేరుల సంపద భారీగా తుడుచిపెట్టుకుపోయింది. ముఖ్యంగా అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ సంపద ఒక్క రోజు లోనే రూ. 80 వేల కోట్లు (9.8 బిలియన్ డాలర్లు)ను కోల్పోయారు.. అలాగే టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ నికర విలువలో రూ.70 వేల కోట్లు (8.4 బిలియన డాలర్లను) పడిపోయింది. అంతేకాదు మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్, లారీ పేజ్, సెర్గీ బ్రిన్ , స్టీవ్ బాల్మెర్లు ఇదే బాటలో పయనించారు. వీరి సంపద మొత్తం 4 బిలియన్ డాలర్లకు పైగా క్షీణించగా, టాప్ 10 జాబితాలోని ఇతర బిలియనీర్లు వారెన్ బఫెట్, బిల్ గేట్స్ వరుసగా 3.4 బిలియన్ డాలర్లు, 2.8 బిలియన్ డాలర్లను కోల్పోయారు. కాగా అమెరికా వినియోగదారుల ధరల సూచీ అంతకుముందు ఏడాదితో పోలిస్తే 8.3 శాతం మేర పెరిగింది. ఇది 8.1 శాతంగా ఉంటుందని నిపుణులు అంచనా వేశారు. దీంతో ఇది మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఇన్వెస్టర్ల అమ్మకాలతో గత ఐదు రోజుల్లో అమెరికా స్టాక్ మార్కెట్లు తీవ్రంగా నష్టపోతున్నాయి. -
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిసాయి. సెన్సెక్స్ 509 పాయింట్లు కుప్పకూలి 53887 వద్ద నిఫ్టీ 158 పాయింట్ల నష్టంతో 16058 వద్ద స్థిరపడ్డాయి. ఫలితంగా సెన్సెక్స్ 54 వేల స్థాయిని కోల్పోగా, నిఫ్టీ 16100 దిగువకు చేరింది. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే ముగిసాయి. రిటైల్ ద్రవ్యోల్బణం డేటా, పలు చైనా నగరాల్లో కోవిడ్-19 షట్డౌన్ల కారణంగా ఆసియాలో మార్కెట్ల బలహీనత నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత కొనసాగుతోంది. ఎన్టీపీసీ, శ్రీ సిమెంట్స్, భారతి ఎయిర్టెల్, అదానీపోర్ట్స్, కోల్ ఇండియా టాప్ విన్నర్స్‌గాను, ఐషర్ మోటార్స్, హిందాల్కో, ఇన్ఫోసిస్, బీపీసీఎల్, నెస్లే టాప్ లూజర్స్‌గాను నిలిచాయి. మరోవైపు డాలరు మారంలో రూపీ మంగళవారం మరింత దిగజారింది. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు : సెన్సెక్స్ 509,నిఫ్టీ 158 పాయింట్లు పతనం -
లోయలో పడిన బస్సు.. 24 మంది మృతి
లాపాజ్(బొలివియా): దక్షిణ అమెరికాలోని బొలివియాలో విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడడంతో 24 మంది మృతి చెందగా.. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బస్సు దాదాపు 100 మీటర్ల లోతు ఉన్న లోయలో పడడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను వెలికి తీస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
లోయలో పడిన ఎస్యూవీ: ఐదుగురి దుర్మరణం
బనిహాల్/జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో విషాద సంఘటన జరిగింది. ఖుని నల్లాహ్ దగ్గర్లో శనివారం ఓ ఎస్యూవీ అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారని అధికారులు తెలిపా రు. లోయలో పడేముందు ఎస్యూవీ ఓ కారును ఢీకొందని చెప్పారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సీఆర్పీఎఫ్ బలగాలు అక్కడికి చేరుకొని సహాయక కార్యక్రమాలు చేపట్టాయి. లోయలోకి తాళ్ల సాయంతో బలగాలు దిగాయని రక్షణ శాఖ ప్రతినిధి చెప్పారు. ప్రమాద స్థలంలో ముగ్గురు, మరొకరు ఆస్పత్రికి తరలిస్తుం డగా మరణించారు. మరో మృతదేహాన్ని ఘటనా స్థలానికి కొంత దూరం లో కనుగొన్నారు. మృతులను సీఆర్పీఎఫ్ హెడ్‌కానిస్టేబుల్ షగుణ్ కుమార్, వనీత్ కౌర్, గారు రామ్, మహ్మద్ రఫీ, సంజీవ్‌కుమార్‌గా గుర్తించారు. గాయపడిన ఇండియన్ రిజర్వ్ పోలీస్ అజిత్‌కుమార్‌ను జమ్మూకు తరలించారు. చదవండి: వైద్య సిబ్బంది సాహసం: వ్యాక్సిన్ కోసం నది దాటి -
ట్రంప్‌నకు కరోనా : కుప్పకూలిన మార్కెట్లు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు కరోనా సోకిందన్న వార్తలతో అమెరికా మార్కెట్లు కుప్పకూలాయి. తనతోపాటు, భార్య మెలానియా ట్రంప్ కూడా కరోనా నిర్ధారణ అయిందని ట్రంప్ ట్వీట్ చేసిన మరుక్షణం మార్కెట్లో సెంటిమెంటు దెబ్బతింది. ఇన్వెస్టర్ల అమ్మకాలతో నష్టాల్లోకి జారుకున్నాయి. రానున్న అధ్యక్ష ఎన్నికల ప్రచార హోరు మొదలైన తరుణంలో ట్రంప్ వ్యాధి పరినపడటంతో రిపబ్లిక్ పార్టీ ఆందోళనలో పడిపోయింది. (కరోనా బారిన డొనాల్డ్ ట్రంప్ దంపతులు) డౌ ఫ్యూచర్స్ 500 పాయింట్లు, నాస్ డాక్ ఫ్యూచర్స్1.7 శాతం పడిపోయాయి. బంగారం కూడా 0.55 శాతం క్షీణించి,ఔన్సు దర 1,894.60 డాలర్లకు చేరుకుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ట్రంప్ కరోనా బారిన పడటంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొంది. ఈ వైరస్ బారిన పడిన ప్రపంచ నాయకుల జాబితాలోతాజాగా ట్రంప్ చేరారు. ఇంతకుముందు బ్రిటీష్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్, బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సనారోకు కూడా ఈ వైరస్ సోకింది. తనకు వైద్యం చేసిన డాక్టరకు వైరస్ పాజిటివ్ రావడంతో జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, అలాగే భార్యకు కరోనా సోకడంతో కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ఇంటినుంచే విధులను నిర్వర్తించిన సంగతి తెలిసిందే. కాగా రెండవసారి అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న ట్రంప్ ఈసారి కాస్త వెనుకంజలో ఉన్నారని ఒపీనియన్ పోల్స్ చెబుతుండగా ట్రంప్‌నకు ఎదురులేదని రిపబ్లిక్ పార్టీ ధీమాగా ఉంది. అటు బైడెన్ కు తిరుగే లేదని, ముఖ్యంగా మహిళల ఆదరణ లభిస్తోందని, దీంతోపాటు అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందస్తు ప్రెసిడెన్షియల్ డిబేట్లలో విజయవంతంగా మొదటి డిబేట్‌ను గెలిచారని డెమొక్రాటిక్ పార్టీ నాయకులు భావిస్తున్నారు. -
ఆటో, ఐటీ షాక్ : వరుస లాభాలకు బ్రేక్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో, ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణతో కీలక సూచీలు అయిదురోజుల లాభాలకు బ్రేక్ వేసాయి. ప్రధానమద్దతు స్థాయిలకు దిగువకు చేరాయి. సెన్సెక్స్ 38 వేల దిగువకు చేరింది. నిఫ్టీ 11100 స్థాయిని కోల్పోయింది. ఆరంభంలో లాభపడినా, డే గరిష్టంనుంచి దాదాపు 490 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ ప్రస్తుతం 303 పాయింట్లు నష్టంతో 37626 వద్ద, నిఫ్టీ 97 పాయింట్ల నష్టంతో 11064 వద్ద కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఆటో, ఐటీ షేర్లు నష్టపోతుండగా, మెటల్, ఫార్మా రంగ షేర్లు లాభపడుతున్నాయి. ఫలితాల జోష్‌తో ప్రైవేటు రంగ బ్యాకు యాక్సిస్ భారీగాలా భపడుతోంది.ఇంకా పవర్ గ్రిడ్, టైటన్,ఎన్టీపీసీ, కోల్ ఇండియా, ఐసీఐసీఐ,రిలయన్స్ , వేదాంతా లాభాల్లో కొనసాగుతున్నాయి. హీరో మోటో, టాటా మోటార్స్,మారుతి, టాటాస్టీల్, ఇన్ఫోసిస్, ఎల్ అండ్‌టీ బీపీసీఎల్, విప్రో నష్టపోతున్నాయి. మరోవైపు దేశీయ కరెన్సీ రూపాయి ఫ్లాట్‌గా ముగిసింది. డాలరు మారకంలో ఒకపైసా లాభంతో 74.75 వద్ద ముగిసింది. -
ఈ రియల్టీ షేరు ఎందుకిలా పడుతోంది?
కొద్ది రోజులుగా భారీ అమ్మకాలను చవిచూస్తున్న రియల్ ఎస్టేట్ కంపెనీ ఒమాక్సీ లిమిటెడ్ షేరు మరోసారి కుప్పకూలింది.కొనేవాళ్లు కరువుకాగా.. అమ్మకందారులు అధికంకావడంతో ఈ షేరు 5 శాతం డౌన్ సర్క్యూట్‌ను తాకింది. ఎన్ఎస్ఈలో ప్రస్తుతం రూ. 76 దిగువన ఫ్రీజయ్యింది. వెరసి వరుసగా 12వ ట్రేడింగ్ సెషన్లోనూ నేలచూపులకే పరిమితమై కదులుతోంది. జూన్ 26న నమోదైన రూ. 221 స్థాయి నుంచి నిరంతర పతనం కారణంగా ఈ షేరు 66 శాతం విలువను కోల్పోయింది. తద్వారా తాజాగా 11 ఏళ్ల కనిష్టానికి చేరింది. ఇంతక్రితం 2019 జులై 14న మాత్రమే ఈ స్థాయిలో ట్రేడయ్యింది. కంపెనీ వివరణ కంపెనీ కౌంటర్లో నమోదవుతున్న యాక్టివిటీ పూర్తిగా మార్కెట్ పరిస్థితుల ఆధారంగా జరుగుతున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఒమాక్సీ ఈ నెల మొదట్లోనే తెలియజేసింది. కంపపెనీ ప్రాజెక్టులు యథాతథంగా కొనసాగుతన్నాయని, డిమాండ్, సరఫరా అంశాల ఆధారంగానే ట్రేడింగ్‌లో ఆటుపోట్లు నమోదవుతున్నాయని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసిక ఫలితాలను కోవిడ్-19 నేపథ్యంలో ఎదురవుతున్న సవాళ్ల కారణంగా మాత్రమే వాయిదా వేసినట్లు తెలియజేసింది. ఏం జరిగింది? తనఖాలో ఉంచిన 1.6 లక్షల షేర్లను వారాంతాన(10న) రుణదాత సంస్థ వీనస్ ఇండియా అసెట్ ఫైనాన్స్ ప్రయివేట్ లిమిటెడ్ సొంతం చేసుకున్నట్లు ఒమాక్సీ ఎక్స్ఛేంజీలకు వెల్లడించింది. కంపెనీలో మొత్తం 74.15 శాతం వాటాకు సమానమైన 135.63 మిలియన్ షేర్లను కలిగిన ప్రమోటర్లు మార్చికల్లా 52.32 శాతం వాటాకు సమానమైన 70.97 మిలియన్ ఈక్విటీ షేర్లను తనఖాలో ఉంచినట్లు డేటా వెల్లడించింది. రేటింగ్ దిగ్గజం క్రిసిల్ ఏప్రిల్ 3న ఒమాక్సీ దీర్ఘకాలిక బ్యాంకింగ్ సౌకర్యాలను డౌన్‌గ్రేడ్ చేసింది. ఇందుకు భారీ రుణ భారంతోపాటు, కంపెనీ మాజీ ఎండీ సునీల్ గోయల్.. మరో డైరెక్టర్ రోహ్తాస్ గోయల్‌పై చేసిన ఆర్థిక అవకతవకల ఆరోపణలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు క్రిసిల్ పేర్కొంది. తదుపరి జూన్ 29న వెల్లడించవలసిన గతేడాది క్యూ4(జనవరి-మార్చి) ఫలితాల విడుదలను కంపెనీ జులై 29కు వాయిదా వేసింది. ఈ ప్రతికూలతల కారణంగా ఒమాక్సీ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. -
లాభాల స్వీకరణ : 34 వేల దిగువకు సెన్సెక్స్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. ఆరంభంలోనే ఒడిదుడుకులను ఎదుర్కొన్న సూచీలు మిడ్ సెషన్ నుంచి మరింత కుదేలయ్యాయి. డే హై నుంచి దాదాపు 900 పాయింట్లను కోల్పోయాయి. చివరకు సెన్సెక్స్ 414 పాయింట్ల నష్టంతో 33957 వద్ద, నిఫ్టీ 121 పాయింట్లు క్షీణించి 10046 వద్ద ముగిసింది. దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ లాభాల స్వీకరణ కనిపించింది. ప్రదానంగా బ్యాంకింగ్ షేర్లు నష్టపోయాయి. దీంతో సెన్సెక్స్ 34 వేల స్థాయిని కోల్పోయింది. -
కరోనా భయాలు : మార్కెట్ల పతనం
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోముగిసాయి. రోజంతా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్న సూచీలు చివరకు నష్టాల్లోనే ముగిసాయి. ఆరంభంలోనే 400 పాయింట్లు కోల్పోయిన మార్కెట్ , వెంటనే పుంజుకుని కనిష్టం నుంచి దాదాపు 1500 పాయింట్లు ఎగిసింది. తద్వారా 2009 తర్వాత అదే అతిపెద్ద ఇంట్రా డే లాభంగా నిలిచింది. కానీ తీవ్ర అమ్మకాల ఒత్తిడితో నిలదొక్కుకోలేక లాభాలను కోల్పోయింది. చివరకు సెన్సెక్స్ 173 పాయింట్లు క్షీణించి 29883 వద్ద, నిఫ్టీ 43 పాయింట్లు నశించి 8748 వద్ద స్థిరపడ్డాయి. ఫలితంగా సెన్సెక్స్ 30 వేల స్థాయిని, నిఫ్టీ 8800 స్థాయిని కోల్పోయాయి, ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం లాభ నష్టాల మధ్య తీవ్రంగా ఊగిసలాడింది. అయితే ఫార్మ మాత్రం లాభాలతో మురిపించింది. సన్ ఫార్మ టాప్ విన్నర్ గా నిలిచింది. ఇంకా సిప్లా, క్యాడిల్లా హెల్త్ కేర్, అరబిందో ఫార్మ, గెయిల్, భారతి ఇన్ ఫ్రాటెల్, ఎన్టీపీసీ, వేదాంతా, ఓఎన్ జీసీ, టాటా మోటార్స్, బజాజ్ ఫినాన్స్ లాభపడ్డాయి. మరో వైపు టీసీఎస్, ఇండస్ ఇండ్, టైటన్, భారతి ఎయిర్టెల్, ఐటీసీ, ఇన్ఫోసిస్, గ్రాసిం, బ్రిటానియా భారీగా నష్టపోయాయి. (పుంజుకున్న సూచీలు, 9వేల ఎగువకు నిఫ్టీ). కాగా ప్రాణాంతక కరోనావైరస్ విజృంభణ, పెరుగుతున్న కేసులు పెట్టుబడిదారుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని విశ్లేషకులు తెలిపారు. అందుకే హై స్థాయిల్లో లాభాల స్వీకరణ కనిపిస్తోందన్నారు. చదవండి : కరోనా : భారత సంతతి వైద్యురాలు కీలక నిర్ణయం (కరోనా : ట్విటర్ సీఈఓ భారీ విరాళం), ఉత్పత్తి కోత ఆశలతో పుంజుకున్న చమురు ధర -
అమెరికా మార్కెట్లు ఢమాల్ : ట్రేడింగ్ నిలిపివేత
కోవిడ్-19 (కరోనా వైరస్) గ్లోబల్ మార్కెట్లను పట్టి పీడిస్తున్నాయి. తాజాగా అమెరికా మార్కెట్లు కుప్పకూలిపోయాయి. ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజ్, ఎస్ అండ్ పీ 500 7 శాతం, నాస్డాక్ కంపోజిట్ 7.1 శాతం కుప్పకూలింది. బెంచ్ మార్క్ డౌజోన్స్ ఇండస్ట్రీయిల్ యావరేజ్ 2000 పాయింట్లకు పైగా (7.8శాతం) నష్టపోయింది. భారీ నష్టాల నేపథ్యంలో న్యూయార్క్ మార్కెట్ ట్రేడింగ్‌ను నిలిపివేశారు. 2008 ఆర్థిక సంక్షోభం తరువాత ప్రపంచ వ్యాప్తంగా ఇదే అదిపెద్ద పతనంగా నిపుణులు తెలిపారు.15 నిమిషాలు పాటు ట్రేడింగ్ నిలిపివేయడంమంటేనే అమ్మకాల సెగ ఏ స్థాయిలో వుందో అంచనా వేయవచ్చు. 15 నిమిషాల తరువాత ట్రేడింగ్ తిరిగి ప్రారంభమైనా భారీ నష్టాలుకొనసాగుతున్నాయి. అటు చమురు ధరలు రికార్డు కనిష్టానికి చేరడంతో సోమవారం ఆసియా మార్కెట్లు భారీ పతనాన్ని నమోదు చేశాయి. ఇంట్రాడేలో 2450 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ చివరికి 1942 నష్టంతో ముగిసింది. జపాన్ నిక్కీ 225 సూచీ 5శాతం, క్షీణించగా, ఆస్ట్రేలియా మార్కెట్లు 7.3 శాతం కుప్పకూలాయి. చైనాలో, షాంఘై కాంపోజిట్ బెంచ్ మార్క్ 3శాతం, పడిపోగా, హాంగ్ సెంగ్ ఇండెక్స్ 4.2 శాతం క్షీణించింది. దీంతో మహా పతనంగా, బ్లాక్ మండేగా విశ్లేషకులు అభివర్ణించారు. వైరస్ భయాలకు తోడు సౌదీ అరేబియా, రష్యా ట్రేడ్ వార్ కారణంగా చమురు ధర సోమవారం దాదాపు 30 శాతం క్షీణించి 31.14 డాలర్లకు చేరుకుంది. ఇది 1991లో గల్ఫ్ యుద్ధం ప్రారంభం తరువాత ఇదే అతిపెద్ద సింగిల్-డే పతనం. ఇంతటి పతనాన్ని ఇటీవలి కాలంలోచూడలేదని సెవెన్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ సహ వ్యవస్థాపకుడు జస్టిన్ ఉర్క్హార్ట్-స్టీవర్ట్ వ్యాఖ్యానించారు. చదవండి : రిలయన్స్‌కు చమురు షాక్ కోవిడ్‌కు ‘చమురు’ ఆజ్యం, మార్కెట్ కుదేలు -
స్టాక్‌మార్కెట్ల పతనం, 10800 దిగువకు నిఫ్టీ
సాక్షి, ముంబై: ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్ మిడ్ సెషన్లో మరింత కుదేలైంది. ఇన్వెస్టర్ల అమ్మకాలతో సెన్సెక్స్ ఒక దశలో449 పాయింట్లుకుప్ప కూలింది. తద్వారా సాంకేతికంగా కీలకమైన 37,000 పాయింట్ల మార్క్ దిగువకు చేరింది. అటు నిఫ్టీ కూడా 10800 దిగువకు జారింది. ప్రస్తుతం సెన్సెక్స్ 442 పాయింట్లు నష్టపోయి 36,618కు చేరగా, నిఫ్టీ 141 పాయింట్లు క్షీణించి 10781 వద్ద ట్రేడవుతోంది. ప్రధానంగా రియల్టీ 5.4 శాతం పతనం కాగా, మెటల్, బ్యాంక్స్, ఆటో 2-1 శాతం మధ్య నీరసించాయి. అయితే ఎఫ్ఎంసీజీ, ఫార్మా, ఐటీ రంగం స్వల్పంగా లాభపడుతోంది. యస్ బ్యాంక్, ఐబీ హౌసింగ్ 7 శాతం చొప్పున పతనం కాగా, కోల్ ఇండియా, వేదాంతా, యూపీఎల్, బజాజ్ ఫిన్, బీపీసీఎల్, ఆర్ఐఎల్, ఇండస్ఇండ్, హీరో మోటో నష్టపోతుండగా, బ్రిటానియా, డాక్టర్ రెడ్డీస్, టీసీఎస్, హెచ్‌యూఎల్, గెయిల్, ఇన్ఫ్రాటెల్, ఐటీసీ, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా లాభపడుతున్నాయి. రియల్టీ స్టాక్స్‌లో డీఎల్ఎఫ్ 14 శాతం దిగజారగా..ఒబెరాయ్, ఇండియాబుల్స్, సన్‌టెక్, ఫీనిక్స్, శోభా, బ్రిగేడ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, రిలయన్స్ ఇన్ఫ్రా 6-1.3 శాతం మధ్య నీరసించాయి. అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి మరింత పతనమైంది. ఆరంభ నష్టాలనుంచి మరింత దిగజారి 71.92 వద్ద రికార్డు కనిష్టానికి చేరింది. -
ఆర్థిక బిల్లు ఎఫెక్టా? మార్కెట్ల పతనం
సాక్షి, ముంబై : స్టాక్‌మార్కట్లు భారీ నష్టాల్లోకిజారుకున్నాయి. ఆరంభంలో 100 పాయింట్లకు పైగా ఎగిసి ఉత్సాహంగా ఉన్న మార్కెట్లలో ఉన్నట్టుండి అమ్మకాల వెల్లువ కొనసాగింది. దీంతో సెన్సెక్స్ 261 పాయింట్లు కుప్పకూలి 38635 స్థాయికి చేరింది. నిఫ్టీ 84 పాయింట్లు క్షీణించి 11514 కి క్షీణించింది. దాదాపు అన్ని రంగాలు నష్టపోతున్నాయి. ఆటో, ఫైనాన్స్, ఫార్మా సెక్టార్లలో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. హెచ్డీఎఫ్సీ, కోటక్ మహీంద్ర బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, గెయిల్, ఎం అండ్ ఎం, టాటా మోటార్స్, యస్ బ్యాంకు , బజాజ్ ఆటో, హీరో మోటో భారీగా నష్టపోతున్నాయి. టైటన్, టీసీఎస్ మాత్రం లాభపడుతున్నాయి. క్యూ1 ఫలితాల జోష్‌తో ర్యాలీస్ ఇండియా 6 శాతం లాభాలతో కొనసాగుతోంది. ఎలాంటి మార్పులు లేకుండానే 2019 ఆర్థిక బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతిందని, దీంతో అమ్మకాల జోరు కొనసాగుతోందని మార్కెట్ ఎనలిస్టులు చెబుతున్నారు. -
భారీగా తగ్గిన పసిడి ధర
సాక్షి, న్యూఢిల్లీ : గత రెండురోజులుగా చుక్కల్ని తాకిన పుత్తడి ధర భారీగా దిగి వచ్చింది. బడ్జెట్లో 10 నుంచి 12.5 శాతం దిగుమతి సుంకం ప్రతిపాదన అనంతరం నింగికెగిసిన బంగారం ధరలు మంగళవారం భారీగా క్షీణించాయి. బులియన్ మార్కెట్లో 10 గ్రా. పసిడి ధర రూ. 600 పడిపోయింది. వెండి ధర రూ. 48 తగ్గి, కిలో ధర రూ. 38,900 పలుకుతోంది. అంతర్జాతీయంగా బలహీన ధోరణి, బలపడిన డాలరు, దేశీయంగా జ్యుయల్లర్స్నుంచి తగ్గిన డిమాండ్ తదితర పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు దిగి వచ్చాయని ఎనలిస్టులు చెబుతున్నారు. ఢిల్లీలో 99.9 స్వచ్ఛత గల పది గ్రా. బంగారం ధర సోమవారం నాటి రూ. 35, 470 తో పోలిస్తే 600 తగ్గి రూ. 34870గా ఉంది. ఫ్యూచర్స్ మార్కెట్లో కూడా పది గ్రాముల బంగారం ధర 98 రూపాయిలు క్షీణించి 34,381 వద్ద ఉంది. అయితే సావరిన్ గోల్డ్ ధరలు స్థిరంగా ఉన్నాయి. -
ఫలితాల దెబ్బ : ఎస్‌బ్యాంకు షేరు పతనం
సాక్షి,ముంబై: ప్రయివేటు రంగ బ్యాంకు ఎస్ బ్యాంకునకు ఫలితాల సెగ భారీగా తాకింది. మార్చి30తో ముగిసిన గత ఏడాది నాలుగవ త్రైమాసిక ఫలితాలు ప్రకటనతో ఎస్ బ్యాంకు కౌంటర్లో అమ్మకాల వెల్లువెత్తింది. దీంతో ఏకంగా షేరు 30శాతం కుప్పకూలింది. 2005 తర్వాత ఎస్ బ్యాంక్ ఈ స్థాయిలో నష్టపోవడం ఇదే తొలిసారి. బ్యాడ్లోన్ల బెడదతో త్రైమాసికంలో 1506 కోట్ల రూపాయలను నికర నష్టాలను చవి చూసింది. అయితే గత ఏడాదితో పోలిస్తే ఆదాయం 16.29శాతం పుంజుకుని రూ. 2505 కోట్లు సాధించింది. ప్రొవిజన్లు 9 రెట్లు ఎగబాకి రూ.3661 కోట్లగా ఉన్నాయి. గత ఏడాది ఇదే క్వార్టర్లో ఇది రూ.399 కోట్లు మాత్రమే. -
డేటా లీక్: 130 బిలియన్ డాలర్లు మటాష్!
శాన్ఫ్రాన్సిస్కో: సోషల్ నెట్ వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. కేంబ్రిడ్జ్ ఎనలిటికా ద్వారా అధిక సంఖ్యలో వినియోగదారుల డేటా చోరీ నేపథ్యంలో ఫేస్బుక్ ఆదాయం భారీగా క్షీణించనుందన్న అంచనాలతో మార్కెట్లో ఫేస్బుక్ కౌంటర్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది. వినియోగదారుల వృద్ధి, రెవెన్యూ భారీగా పడిపోవడంతో మార్కెట్ ఆరంభంలోనే సంస్థ షేర్ కుప్ప కూలింది. వాడుకదారుల వృద్ధిలో విశ్లేషకుల అంచనాల కంటే తక్కువగా నమోదు చేసింది. దీంతో తీవ్ర అమ్మకాలతో ఒత్తిడితో 24 శాతానికిపైగా నష్టపోయింది. కేవలం రెండే రెండు గంటల్లో మార్కెట్ విలువలో 130 బిలియన్ డాలర్ల సంపద తుడిచిపెట్టుకు పోయింది. 2012తరువాత ఇదే అదిపెద్ద పతనమని ఎనలిస్టులు చెబుతున్నారు. అటు ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ 16.8 బిలియన్ డాలర్ల మేర వ్యక్తిగత సంపదను కోల్పోయారు. కంపెనీ ఆదాయ అంచనాల ప్రకటన తరువాత ఈ పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన ఆర్థిక అధికారి డేవిడ్ వేహ్నెర్ రాబోయే త్రైమాసికంలో బలహీనమైన ఆదాయం అంచనాలను వెల్లడించడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. రెవెన్యూ వృద్ధి రెండవ త్రైమాసికంలో "క్షీణించింది" ఇది మరింత తగ్గిపోనుందని డేవిడ్ ప్రకటించారు. ఈ క్షీణత రాబోయే సంవత్సరాల్లో కొనసాగే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. రెండవ త్రైమాసికంలో లాభాలు 31 శాతం పెరిగి 5.1 బిలియన్ డాలర్లగా నమోదు కాగా, ఆదాయాలు 42 శాతం పెరిగి 13.2 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. తాజా గణాంకాల ప్రకారం ఫేస్బుక్ నెలవారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య కేవలం 11శాతం పుంజుకుని 2.23 మిలియన్లుగా నమోదైంది. 2.25మిలియన్లుగా నమెదుకావచ్చని విశ్లేషకులు అంచనావేశారు. అలాగే రోజువారీ యూజర్ల సంఖ్య ఎనలిస్టులు అంచనాలను మిస్ చేసి 11శాతం వృద్ధితో 1.47మిలియన్లుగా నమోదైంది. భద్రత, గోప్యత అంశాలపై భారీ పెట్టుబడులు పెడుతున్నామని ఫేస్బుక్ అధిపతి జుకర్‌బర్గ్ ప్రకటించారు. సంస్థను తరువాతి త్రైమాసికం కోసం మాత్రమే కాకుండా దీర్ఘకాలికంగా నడపనున్నామంటూ ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంపొందించే వ్యాఖ్యలు చేశారు. -
దెబ్బ మీద దెబ్బ: ఇండిగో భారీ పతనం
సాక్షి, ముంబై: దేశీయ విమానయాన సేవల సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌కు అటు అధ్యక్షుడు రాజీనామా, ఇటు ఫలితాల షాక్ భారీగా తగిలింది. గత ఆర్థిక సంవత్సరం(2017-18) చివరి త్రైమాసికంలో సాధించిన ఫలితాలు ఇన్వెస్టర్లను నిరాశపరచడంతో ఈ కౌంటర్లో అమ్మకాలకు తెరలేచింది. దీంతో ఇండిగో షేరు 18 శాతానికి పైగా కుప్పకూలింది. 2016 జనవరి తరువాత ఇదే అదపెద్ద పతనమని మార్కెట్ వర్గాలు విశ్లేషించాయి. ముఖ్యంగా ఇండిగో అధ్యక్షుడు ఆదిత్య ఘోష్ రాజీనామా తర్వాత షేర్లు 26 ఏప్రిల్ నుంచి తగ్గుముఖం పట్టాయి. 26శాతం క్షీణించి దాదాపు రూ. 13650 కోట్ల విలువైన మార్కెట్ విలువ కోల్పోయింది. క్యూ4 ఫలితాల దెబ్బ క్యూ4(జనవరి-మార్చి)లో ఇండిగో నికర లాభం 75 శాతం పతనమై 118 కోట్ల రూపాయలను నమోదు చేసింది. నిర్వహణ, ఇంధన వ్యయాలు పెరగడం దీనికి కారణంమని ఇండిగో మార్కెట్ ఫైలింగ్‌లో పేర్కొంది. మొత్తం ఆదాయం మాత్రం 18 శాతం ఎగసి రూ. 6057 కోట్లకు చేరింది. ఇంధన వ్యయాలు రూ. 1751 కోట్ల నుంచి 2338 కోట్లకు పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది. అయితే గత ఏడాది ఇదే త్రైమాసికంలో రెవెన్యూ 17.8 శాతం పెరిగి రూ .5,141.99 కోట్లనుంచి రూ .656.84 కోట్లను ఆర్జించింది. ఈ త్రైమాసికంలో ఇంధన వ్యయం రూ .2,338 కోట్లు పెరిగి రూ .1,751 కోట్లకు చేరుకుంది. -
అమెరికా మార్కెట్లు మళ్లీ ఢమాల్
అమెరికన్ మార్కెట్లు మళ్లీ ఢమాల్ అన్నాయి. ఒక రోజు విరామం తరువాత మళ్లీ అమెరికా స్టాక్ మార్కెట్లలో భారీ అమ్మకాలకు తెరలేచింది. ద్రవ్యోల్బణ అంచనాలతో ఇన్వెస్టర్లలో తీవ్ర ఆందోళన నెలకొంది. దీంతో గురువారం మార్కెట్లు ఏకంగా 4 శాతం కుప్పకూలాయి. గురువారం డోజోన్స్ 1033 పాయింట్లు(4.15 శాతం) కుప్పకూలి 23,860 వద్ద ముగిసింది. ఈ బాటలో ఎస్అండ్పీ 101 పాయింట్లు(3.75 శాతం) పతనమై 2581కు చేరగా.. నాస్డాక్ 275 పాయింట్లు(4 శాతం) పడిపోయి 6,777 వద్ద స్థిరపడింది. తద్వారా జనవరి 26న నమోదైన గరిష్టాల నుంచి అమెరికా స్టాక్ మార్కెట్లు 10 శాతం పతనమయ్యాయి. తొమ్మిది సంవత్సరాల బుల్ రన్‌కు బ్రేక్ పడిందని మార్కెట్ ఎనలిస్టులు వ్యాఖ్యానించారు. అటు ఆసియన్ మార్కెట్లలో షాంఘై 5.22శాతం, నిక్కీ3.22 శాతం పతనం కావడం గమనార్హం. ఈ ప్రభావం ఇండియన్ మార్కెట్లపై ఉండనుందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచనున్న అంచనాలు స్టాక్స్‌లో అమ్మకాలకు కారణమవుతున్నట్లు పేర్కొన్నారు. -
వొకార్డ్‌కు అమెరికా డ్రగ్ రెగ్యులేటరీ దెబ్బ
న్యూఢిల్లీ: అమెరికా ఔషధ నియంత్రణా సంస్థ (యుఎస్ఎఫ్డిఎ) దేశీయ ఫార్మా దిగ్గజం వొకార్డ్ కు షాకిచ్చింది. వొకార్డ్‌కు అమెరికా ఇల్లినాయిస్లో గల అనుబంధ సంస్థ మోర్టన్ గ్రోవ్ ఫార్మాస్యూటికల్స్‌కు అక్కడి ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ) హెచ్చరికలను జారీ చేస్తూ నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని వొకార్డ్ బిఎస్ఇ ఫైలింగ్ లో బుధవారం వెల్లడించింది. అలాగే తదుపరి ఆదేశాలవరకు తమ కొత్త ఆమోదాలకు అనుమతి ఉండదని స్పష్టం చేసింది. అయితే ఈ వార్నింగ్ లెటర్‌కు సంబంధించిన వివరాలు అందించడానికి నిరాకరించింది. అలాగే మార్కెట్లో అందుబాటులో ఉన్న కరెంట్ పోర్ట్ ఫోలియో లో విక్రయాలకుఎలాంటి ఆటంకం ఉండదని వివరించింది. ఈ హెచ్చరికల కారణంగా సమస్య పరిష్కారమయ్యేంతవరకూ యూఎస్ఎఫ్డీఏ నుంచి మార్టన్ గ్రోవ్కు ఎలాంటి కొత్త అనుమతులూ లభించబోవు. ఈ ప్రకటనతో అసలే వీక్ గా ఉన్నీ కౌంటర్లో అమ్మకాలకు తెరలేచింది. దీంతో దాదాపు 7శాతం నష్టపోయింది. కాగా గత ఏడాది వొకార్డ్‌కు చెందిన యూకే అనుబంధ సంస్థ సీపీ ఫార్మాస్యూటికల్స్‌కు యూఎస్ ఎఫ్ఢీఏ నుంచి ఇలాంటి హెచ్చరికలు అందాయి. కాగా 2014లో క్వాలిఫైడ్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ ప్రొడక్ట్ (క్యుఐడిపి) హోదా పొందిన తొలి భారతీయ కంపెనీగా వొకార్డ్ చరిత్ర సృష్టించింది. -
ఫెడ్ దెబ్బ ..రుపీ ఢమాల్!
ముంబై: ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాలతో దేశీయ కరెన్సీ రూపాయి మరోసారి కుదేలైంది. డాలరుతో పోలిస్తే వరుసగా రెండో రోజూ బలహీనపడింది. బుధవారం నాటి నష్టాలను కొనసాగిస్తూ ఈ ఉదయం 17 పైసలకు పైగా కోల్పోయి రూ.68.25 ని తాకింది. ప్రస్తుతం స్వల్పంగా కోలుకుని 12 పైసల నష్టంతో 68.20 వద్ద ట్రేడవుతోంది. బుధవారం నాటి ముగింపు 13 పైసలు నష్టంతో 68.08గా నమోదైంది. అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ చైర్‌పర్శన్ జానెట్ యెలెన్ వడ్డీ రేట్ల పెంపునకు పరిస్థితులు అనుకూలిస్తున్నాయన్న వ్యాఖ్యలతో డాలరుకు ఉత్సాహమొచ్చింది. దీంతో ఇటీవల స్వల్పంగా బలహీన పడ్డ డాలర్ మళ్లీ పుంజుకుంది. యెన్, యూరో వంటి కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ తాజాగా 101ను అధిగమించింది. దిగుమతిదారులనుంచి డాలర్ డిమాండ్ పుంజుకోవడం రూపాయి విలువను ప్రభావితం చేసిందని నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు దేశీ ఈక్విటీ మార్కెట్లలో ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. ఫ్లాట్ ఆరంభమైనా, లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. అటు ఎంసీఎక్స్ మార్కెట్ లో పత్తడి ధరలు కూడా వెలవెలబోతున్నాయి. పది గ్రా. రూ.188 నష్టపోయి రూ. 28,603 వద్ద ఉంది. -
ఫలించిన ప్రజల పోరాటం
-
నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు
ముంబైః సోమవారం నాటి దేశీయ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 280 పాయింట్ల నష్టంతో 27,787 దగ్గర, నిఫ్టీ 69 పాయింట్ల నష్టంతో 8,449 దగ్గర ట్రేడవుతున్నాయి. అటు చైనా మార్కెట్లు కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి. అయితే ప్రభుత్వ తాజా ప్రకటనతో ప్రభుత్వం రంగ బ్యాకుల పేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. మరోవైపు రూపాయి పతనం కూడా కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌తోపోలిస్తే రూపాయి 15 పైసలు నష్టపోయి 65.15 దగ్గర ఉంది. -
రూపాయి, ఫలితాలే దిక్సూచి
న్యూఢిల్లీ: ఇకపై వచ్చే కంపెనీల ఆర్థిక ఫలితాలు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడుల పరిస్థితి, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు వంటి అంశాలు ఈ వారం స్టాక్ మార్కెట్లను నడకను నిర్దేశిస్తాయని నిపుణులు పేర్కొన్నారు. వీటితోపాటు అంతర్జాతీయ సంకేతాలు కూడా సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయని చెప్పారు. వచ్చే శుక్రవారం(9న) రంజాన్(ఈద్) సందర్భంగా స్టాక్ మార్కెట్లకు సెలవుకావడంతో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానుంది. ఈ వారం టాటా మోటార్స్, సన్ ఫార్మా, ర్యాన్‌బాక్సీ, టాటా పవర్ వంటి బ్లూచిప్ కంపెనీలు ఫలితాలను ప్రకటించనున్నాయి. సోమవారం(5న) పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదలుకానున్నాయి. ఈ నెల 30న ముగియనున్న సమావేశాల్లో భాగంగా ఆహార భద్రత బిల్లును ఆమోదించాల్సి ఉంది. ఇక సోమవారమే అమెరికా ఉద్యోగ గణాంకాలు వెలువడనున్నాయి. జూలై నెలకు వెల్లడైన ఉద్యోగ గణాంకాలు ఆర్థిక సంక్షోభ ప్రభావం నుంచి అమెరికా బయటపడుతున్న సంకేతాలను అందించాయి. 2008 డిసెంబర్ తరువాత నిరుద్యోగిత 7.4%కు తగ్గింది. ఈ అంశం కూడా సోమవారం మార్కెట్లను ప్రభావితం చేయవచ్చునని విశ్లేషకులు పేర్కొన్నారు. నిఫ్టీకి 5,750 కీలకం అంతర్జాతీయ అంశాలతోపాటు, కంపెనీల ఫలితాలను ఇన్వెస్టర్లు జాగ్రత్తగా గమనిస్తారని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ చెప్పారు. సమీప కాలంలో ఎన్ఎస్ఈ ఇండెక్స్ నిఫ్టీకి 5,750 స్థాయి కీలకంగా నిలవనుందని తెలిపారు. ఈ స్థాయికిపైన కొనుగోళ్ల మద్దతు లభిస్తుందని అంచనా వేశారు. కాగా, గడిచిన శుక్రవారం డాలరుతో మారకంలో రూపాయి విలువ కొత్త కనిష్ట స్థాయి 61.10 వద్ద ముగిసింది. అయితే గత కొన్ని వారాలుగా ప్రభుత్వంతోపాటు, రిజర్వ్ బ్యాంకు సైతం కరెన్సీ బలపడేందుకు వీలుగా పలు చర్యలను తీసుకుంటున్నప్పటికీ ఫలితమివ్వకపోవడం గమనార్హం. ఈ బాటలో రిజర్వ్ బ్యాంకు గత వారం రూపాయికి మద్దతుగా మరిన్ని చర్యలను ప్రకటించింది. హెడ్జింగ్‌ను చేపట్టేముందు ఎఫ్ఐఐలు తప్పనిసరిగా పార్టిసిపేటరీ నోట్ల జారీదారుల వద్ద నుంచి అనుమతిని పొందాల్సి ఉంటుంది. ఇదే విధంగా అంతక్రితం ఫారెక్స్ మార్కెట్లో స్పెక్యులేటివ్ ట్రేడింగ్‌కు చెక్ పెట్టడం, బ్యాంకుల లిక్విడిటీని కట్టడి చేస్తూ బ్యాంకు రేటును భారీగా పెంచడం వంటి చర్యలను తీసుకున్న విషయం విదితమే.