
సాక్షి, ముంబై : స్టాక్‌మార్కట్లు భారీ నష్టాల్లోకిజారుకున్నాయి. ఆరంభంలో 100 పాయింట్లకు పైగా ఎగిసి ఉత్సాహంగా ఉన్న మార్కెట్లలో ఉన్నట్టుండి అమ్మకాల వెల్లువ కొనసాగింది. దీంతో సెన్సెక్స్ 261 పాయింట్లు కుప్పకూలి 38635 స్థాయికి చేరింది. నిఫ్టీ 84 పాయింట్లు క్షీణించి 11514 కి క్షీణించింది.
దాదాపు అన్ని రంగాలు నష్టపోతున్నాయి. ఆటో, ఫైనాన్స్, ఫార్మా సెక్టార్లలో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్ మహీంద్ర బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, గెయిల్, ఎం అండ్ ఎం, టాటా మోటార్స్, యస్ బ్యాంకు , బజాజ్ ఆటో, హీరో మోటో భారీగా నష్టపోతున్నాయి. టైటన్, టీసీఎస్ మాత్రం లాభపడుతున్నాయి. క్యూ1 ఫలితాల జోష్‌తో ర్యాలీస్ ఇండియా 6 శాతం లాభాలతో కొనసాగుతోంది. ఎలాంటి మార్పులు లేకుండానే 2019 ఆర్థిక బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతిందని, దీంతో అమ్మకాల జోరు కొనసాగుతోందని మార్కెట్ ఎనలిస్టులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment