సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో, ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణతో కీలక సూచీలు అయిదురోజుల లాభాలకు బ్రేక్ వేసాయి. ప్రధానమద్దతు స్థాయిలకు దిగువకు చేరాయి. సెన్సెక్స్ 38 వేల దిగువకు చేరింది. నిఫ్టీ 11100 స్థాయిని కోల్పోయింది. ఆరంభంలో లాభపడినా, డే గరిష్టంనుంచి దాదాపు 490 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ ప్రస్తుతం 303 పాయింట్లు నష్టంతో 37626 వద్ద, నిఫ్టీ 97 పాయింట్ల నష్టంతో 11064 వద్ద కొనసాగుతున్నాయి.
ప్రధానంగా ఆటో, ఐటీ షేర్లు నష్టపోతుండగా, మెటల్, ఫార్మా రంగ షేర్లు లాభపడుతున్నాయి. ఫలితాల జోష్‌తో ప్రైవేటు రంగ బ్యాకు యాక్సిస్ భారీగాలా భపడుతోంది.ఇంకా పవర్ గ్రిడ్, టైటన్,ఎన్‌టీపీసీ, కోల్ ఇండియా, ఐసీఐసీఐ,రిలయన్స్ , వేదాంతా లాభాల్లో కొనసాగుతున్నాయి. హీరో మోటో, టాటా మోటార్స్,మారుతి, టాటాస్టీల్, ఇన్ఫోసిస్, ఎల్ అండ్‌టీ బీపీసీఎల్, విప్రో నష్టపోతున్నాయి. మరోవైపు దేశీయ కరెన్సీ రూపాయి ఫ్లాట్‌గా ముగిసింది. డాలరు మారకంలో ఒకపైసా లాభంతో 74.75 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment