
లాపాజ్(బొలివియా): దక్షిణ అమెరికాలోని బొలివియాలో విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడడంతో 24 మంది మృతి చెందగా.. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బస్సు దాదాపు 100 మీటర్ల లోతు ఉన్న లోయలో పడడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను వెలికి తీస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment