valley
-
బండరాళ్ల మధ్య తలకిందులుగా ఇరుక్కున్న మహిళ..!
పాపం.. రెండు బండరాళ్ల మధ్య ఇరుక్కుని ఓ మహిళ నరకం అనుభవించింది. ఆమెను రక్షించేందుకు స్నేహితులు ప్రయత్నాలు ఫలించలేదు. చేసేది లేక ఎమర్జెన్సీ సర్వీస్‌కు సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన ఎమర్జెన్సీ సర్వీస్...న్యూ సౌత్ వేల్స్: పర్వత ప్రాంతంలోని బండరాళ్ల మధ్య నడుస్తున్న మహిళ చేతిలోని సెల్‌ఫోన్ జారిపడింది. ఫోన్‌ను అందుకునే క్రమంలో ఆమె రెండు బండరాళ్ల మధ్య సందులో తలకిందులుగా ఇరుక్కుపోయారు. సుమారు ఏడు గంటల యాతన అనంతరం ఆమెను సహాయక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఆ్రస్టేలియాలోని న్యూ సౌత్ వేల్స్లో ఉన్న హంటర్ వ్యాలీలో నెలారంభంలో చోటు చేసుకున్న ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.బాధిత మహిళ పేరు మటిల్డా కాంప్‌బెల్. రాళ్ల మధ్య మూడుమీటర్ల సందులో ఇరుక్కుపోయిన మటిల్డాను కాపాడేందుకు ఆమె స్నేహితులు ఎంతగానో ప్రయత్నించారు. వీలు కాకపోవడంతో ఎమర్జెన్సీ సర్వీస్‌కు సమాచారమిచ్చారు. వారు వచ్చి అర టన్ను బరువున్న ఒక రాయిని పక్కకు జరపగలిగారు. అయినప్పటికీ, మటిల్డాను రక్షించడం సవాల్‌తో కూడుకున్న వ్యవహారమనే అంచనాకు వచ్చారు.‘పదేళ్లుగా ఎన్నో ఘటనలను దగ్గర్నుంచి చూస్తున్నా. కానీ, ఇటువంటిది ఇదే మొదటిసారి’అని ఎమర్జెన్సీ సరీ్వస్ పారామెడిక్ పీటర్ వాట్స్ పేర్కొన్నారు. ‘మటిల్డా ఇరుక్కుపోయిన ప్రాంతం ఎస్ ఆకారంలో ఉంది. అందుకే, ఆమె కాళ్లు ఇరుక్కున్న బండరాళ్లను కదలకుండా ఉంచుతూనే ఆమె పట్టేంత జాగాను ఏర్పాటు చేయడం ఎంతో క్లిష్టమైన వ్యవహారం. దాదాపు ఏడుగంటల శ్రమ అనంతరం ఆమెను సురక్షితంగా బయటకు తేగలిగాం’అని తెలిపారు.చదవండి: ట్రంప్ గెలిస్తే.. పుతిన్ కీవ్‌లో కూర్చుంటారు.. కమలా హారిస్ వార్నింగ్అయినా కూడా ఆమెకు గీసుకుపోయిన గాయాలే తప్ప, ఎటువంటి హాని కలగకపోవడం ఆశ్చర్యపరిచే విషయమని చెప్పారు. ఇంతా చేసినా మటిల్డా ఫోన్ మాత్రం దొరకలేదని వాట్స్ చెప్పారు. ఇంత జరిగినా, ఫోన్‌ను పోగొట్టుకోవాల్సి వచ్చినందుకు మటిల్డా విచారం వ్యక్తం చేయడం కొసమెరుపు..! -
Himachal: హఠాత్తుగా ముంచెత్తిన వరద.. చాంగుట్- టింగ్రేట్ రోడ్డు మూసివేత
హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్ స్పితి జిల్లాలోని మయాడ్ ప్రాంతాన్ని అకస్మాత్తుగా వరదలు ముంచెత్తాయి. శనివారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో మయాడ్ ఘాటీలోని చాంగుట్ కాలువలోకి అకస్మాత్తుగా వరదలు రావడంతో చాంగుట్ నుండి టింగ్రేట్ వరకుగల రహదారిని అధికారులు మూసివేశారు.ఈ వరదల కారణంగా ఇంతవరకూ ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదు. స్థానికులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా, కులు, మండీ జిల్లాల్లో సంభవించిన వరదల్లో సుమారు 45 మంది గల్లంతు కాగా, వారిని వెదికేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. దీనిలో ఆర్మీ, ఎన్డిఆర్ఎఫ్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), ఎస్డీఆర్ఎఫ్, సీఐఎస్ఎఫ్, పోలీస్, హోంగార్డు బృందాలకు చెందిన మొత్తం 410 మంది సిబ్బంది పాల్గొంటున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. pic.twitter.com/rPvdpWnTvo— Lahaul & Spiti Police (@splahhp) August 3, 2024 -
లాల్ చౌక్‌లో నేతల సందడి.. స్వేచ్ఛాయుత ఓటుకు జనం సిద్దం!
దేశంలో ఎన్నికల వేడి కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో కశ్మీర్లో వినూత్న ఉదంతం చోటుచేసుకుంది. గతంలో కశ్మీర్ లోయలో ఎన్నికలు ప్రకటించినప్పుడు వేర్పాటువాదులు బహిష్కరణకు పిలుపునిచ్చేవారు. దాని ప్రభావం స్పష్టంగా కనిపించేది. అయితే ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా ఎలాంటి బహిష్కరణ పిలుపు లేకుండా ఇక్కడ లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి.ప్రస్తుతం శ్రీనగర్‌లోని చారిత్రక లాల్ చౌక్ రాజకీయ నినాదాలతో మారుమోగుతోంది. క్లాక్ టవర్ ఎన్నికల సభలకు వేదికగా నిలిచింది. గత మూడు దశాబ్దాలుగా వేర్పాటువాదుల బంద్ పిలుపులు, రాళ్లదాడులు, ఎన్కౌంటర్లు, ఊరేగింపులకు అడ్డాగా నిలిచిన క్లాక్ టవర్ ప్రాంతంలో ఇప్పుడు వేర్పాటువాదుల బహిష్కరణ పిలుపు లేకుండా వివిధ రాజకీయ పార్టీల బహిరంగ సభలు జరుగుతున్నాయి.దీనిని 2019 తరువాత వచ్చిన భారీ మార్పుగా పరిగణిస్తున్నారు. స్థానికుడు సుహైల్ అహ్మద్ మాట్లాడుతూ కాశ్మీర్లో గత కొన్నేళ్లలో వేర్పాటువాదులపై ఎన్ఐఏ తదితర ఏజెన్సీలు చర్యలను కఠినతరం చేశాయి. వేర్పాటువాదులలోని కొందరు గృహనిర్బంధంలో ఉండగా, మరికొందరు జైలులో ఉన్నారని తెలిపాడు. మరో యువకుడు జహూర్ హుస్సేన్ మాట్లాడుతూ గతంలో బహిష్కరణ పిలుపు ఇచ్చేవారికి భయపడి ఓట్లు వేసేవారు కాదని, అయితే ప్రతి ఒక్కరికీ తమ ప్రతినిధిని ఎన్నుకునే హక్కు ఉందని, ఈసారి తామంతా తమ హక్కును వినియోగించుకుంటామని తెలిపారు.అల్తాఫ్ ఘంటాఘర్, నౌహట్టా, జామియా మసీదు, గోజ్వారా, రాజౌరి కడల్, సిమెంట్ కడల్, ఈద్గా తదితర ప్రాంతాలలో రాజకీయ పార్టీలు ఎటువంటి భయం లేకుండా ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. ఒకప్పుడు అశాంతితో అట్టుడికిపోయే లాల్ చౌక్‌లో ప్రస్తుతం రాజకీయ నేతలు శాంతి సందేశం ఇస్తూ, తమకు ఓటు వేయాలని కోరుతున్నారు. -
లోయలో పడ్డ తవేరా..10 మంది మృతి
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది మృత్యువాతపడ్డారు. జమ్మూ–శ్రీనగర్ హైవేపై రంబన్ జిల్లాలో గురువారం అర్ధరాత్రి దాటాక ఘటన చోటుచేసుకుంది. తవేరా ట్యాక్సీ అదుపుతప్పి 300 అడుగుల లోయలో పడిపోయింది. డ్రైవర్‌తో పాటు అందరూ చనిపోయారు. ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
ప్రపంచ అందగత్తెల వ్యాలీ ఎక్కడుంది? వారి దీర్ఘాయువు సీక్రెట్ ఏమిటి?
ప్రపంచంలోనే అత్యంత అందమైన అమ్మాయిలు ఏ ప్రాంతంలో ఉన్నారనే టాపిక్ ప్రస్తావనకు వచ్చినప్పుడు పాకిస్తాన్‌లోని ఒక ప్రదేశం చర్చకు వస్తుంది. అందుకే ఆ ప్రదేశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రాంతంలోని మహిళలు 80 ఏళ్ల వయసులో కూడా యవ్వనంగా, ఎంతో అందంగా ఆకట్టుకునేలా కనిపిస్తారు. అందుకే ఇక్కడి అమ్మాయిలను అత్యంత అందగత్తెలుగా భావిస్తారు. దీనికితోడు మంచి ఆరోగ్యం కారణంగా ఇక్కడి మహిళలు 60 ఏళ్లు దాటిన తరువాత కూడా తల్లులయ్యే సామర్థ్యాన్ని కలిగివుంటున్నారు. ఈ ప్రదేశం మరెక్కడో కాదు మన పొరుగుదేశమైన పాకిస్తాన్లో ఉంది. దీని పేరు హుంజా వ్యాలీ. ఇక్కడి స్త్రీలు ఎంతో అందగత్తెలుగా పేరొందారు. వారి క్రమశిక్షణతో కూడిన జీవనశైలి కారణంగా ఇక్కడి మహిళలు 100 సంవత్సరాలకు పైగా జీవిస్తున్నారు. ఇక్కడ ప్రజలు చాలా అరుదుగా అనారోగ్యానికి గురవుతుంటారు. దీనికి కారణం ఇక్కడ ప్రవహించే నదిలో ఆరోగ్యాన్ని పెంపొందించే ఖనిజాలు ఉన్నాయి. ఈ కారణంగానే ఇక్కడి ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని చెబుతారు. హుంజా వ్యాలీ ప్రజలు మధ్యాహ్నం ఒకసారి, రాత్రిపూట మాత్రమే ఆహారం తీసుకుంటారు. దీనికితోడు ఇక్కడ ప్రజలు ఇక్కడివారినే వివాహం చేసుకుంటారు. ఇక్కడి ప్రజలు వ్యవసాయం చేస్తారు. వ్యవసాయంలో రసాయనాలు వాడకుండా స్వచ్ఛమైన ఆహారాన్ని ఉత్పత్తి చేసి, దానినే తింటారు. ప్రపంచంలోని ఆయుర్దాయం ఎక్కువగా ఉండే ప్రదేశాలను బ్లూ జోన్లు అంటారు. హుంజా వ్యాలీ కూడా బ్లూ జోన్ పరిధిలోకే వస్తుంది. ఇక్కడి ప్రజలు మాంసాహారానికి దూరంగా ఉంటారు. ఇది కూడా చదవండి: సింగపూర్ ట్రిప్‌కు ఐఆర్సీటీసీ బడ్జెట్ ప్యాకేజీ -
ఇండియా ఫస్ట్ సన్‌రైజ్.. నాగాలాండ్ మంత్రి వీడియో వైరల్..
కోహిమా: నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే నాగాలాండ్ మంత్రి టెమ్జెన్ ఇమ్నా అలోంగ్.. ఏదో ఒక కొత్త విషయంతో అభిమానుల ముందుకు వస్తుంటారు. కామెడీ, సందేశాత్మక, నాలెడ్జ్‌కు సంబంధించిన వీడియోలను పోస్టు చేస్తూ ఉంటారు. తాజాగా భారత దేశంలో సూర్యోదయం మొదట అయ్యే దృగ్విషయాన్ని వీడియో రూపంలో పోస్టు చేశారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని డాంగ్ వ్యాలీని టెమ్జెన్ షేర్ చేశారు. అప్పుడే వెలుతురు వస్తుండగా.. అందమైన లోయ ప్రాంతాలు మనోహరంగా కనిపించాయి. మేఘాలు తాకుతున్న పర్వత శిఖరాల మధ్య నది పరవళ్లు, పచ్చని లోయ ప్రాంతాల్లో విహారాన్ని గుర్తు చేశారు. ఈశాన్య భారతం అందాలు సింపుల్‌గా ఒక్క వీడియోలో చూపించారు. గూగుల్ చేసి చూడండి అని ట్యాగ్‌ను జతచేసి వీడియోను పోస్టు చేశారు. భారత్‌లో మొదట సూర్యోదయం అయ్యే ప్రదేశంగా డాంగ్ లోయను చెప్పుకుంటారు. Google Kar Ke to Dekho 🤨 pic.twitter.com/FJYzzK9jYC — Temjen Imna Along (@AlongImna) September 13, 2023 ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. నెటిజన్లు కామెంట్లతో నింపేశారు. ప్రస్తుతం ఈశాన్య భారతం ట్రిప్‌లోనే ఉన్నా.. చాలా అందమైన ప్రదేశం అని ఓ యూజర్ కామెంట్ చేశారు. ఈ ప్రదేశాన్ని ఒక్కసారైనా తప్పకుండా చూడాలని మరో యూజర్ స్పందించారు. దేశంలో సూర్యుడు మొదట ముద్దాడే డాంగ్ లోయను మీరూ చూసేయండి మరి..! ఇదీ చదవండి: పార్క్‌లో సరదాగా.. -
పాడేరు ఘాట్ రోడ్డులో ప్రమాదం.. లోయలో పడ్డ ఆర్టీసీ బస్సు
సాక్షి, అల్లూరి సీతారామరాజు జిల్లా: పాడేరు ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 100 అడుగుల లోయలో ఆర్టీసీ బస్సు పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. మలుపులో వేగంగా వస్తున్న బైక్‌ను తప్పించే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. పిట్టగోడను ఢీ కొట్టి బస్సు లోయలోకి దూసుకుపోయింది. ఘాట్ రోడ్డు వ్యూ పాయింట్ దగ్గర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. చోడవరం నుంచి పాడేరు వెళ్తుండగా ఘటన జరిగింది. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చదవండి: నా భర్త సంసారానికి పనికిరాడు.. పెళ్లయి రెండేళ్లయినా.. -
నీతి–మనా లోయ మహిళలపై ప్రధాని మోదీ ప్రశంసలు
డెహ్రాడూన్: భోజపత్ర కాలిగ్రఫీని జీవనోపాధిగా మార్చుకున్న ఉత్తరాఖండ్‌లోని నీతి–మనా లోయ మహిళలను ప్రధాని మోదీ ప్రశంసించారు. ఆదివారం ‘మన్ కీ బాత్’లో వారి కృషిని ఆయన ప్రస్తావించారు. ‘పురాతన కాలంలో మహాభారతాన్ని భోజపత్రపైనే రాశారు. మన సంస్కృతిలో భాగమైన భోజపత్రతో నీతి–మనా లోయ మహిళలు కళాఖండాలు, సావనీర్లు రూపొందిస్తున్నారు. దీనితో తమ జీవితాలనే మార్చేసు కున్నా రు’అని కొనియాడారు. ఈ లేఖనాలను అందరూ ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నార న్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు సాంస్కృతిక వారసత్వాన్ని ఉపయోగించుకోవడం అభినందనీయమన్నారు. వీరి కృషి కారణంగా ఈ ప్రాంతం పర్యాటకపరంగా ప్రాచుర్యంలోకి వచ్చిందన్నారు. అక్టోబర్‌లో చైనా సరిహద్దు సమీపంలోని బద్రీనాథ్‌ను సందర్శించిన సమయంలో స్థానిక మహిళ ఒకరు అందమైన భోజపత్ర లేఖనాన్ని బహుమతిగా అందేజేసినట్లు గుర్తుకు తెచ్చుకున్నారు. నీతి–మనా లోయలోని మనా గ్రామాన్ని ప్రధాని మోదీ అప్పట్లో మొట్టమొదటి భారతీయ గ్రామంగా అభివర్ణించారు. -
లోయలోకి వాహనం పల్టీ...
జమ్మూ: విద్యుత్ ప్రాజెక్ట్‌లో పనిచేసే కార్మికులతో వెళ్తున్న వాహనం లోయలోకి పల్టీలు కొట్టడంతో ఏడుగురు మరణించిన ఘటన జమ్మూకశ్మీర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కిష్ట్వార్ జిల్లాలోని దఛన్ సమీపంలోని దాంగ్‌దూరు విద్యుత్ ప్రాజెక్ట్ దగ్గర్లో బుధవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ప్రాజెక్ట్ సైట్ సమీపంలో ప్రమాదం జరగడంతో వందలాది మంది కార్మికులు ఘటనాస్థలికి చేరుకుని మృతుల కుటుంబాలకు కంపెనీనే నష్టపరిహారం చెల్లించాలని, క్షతగాత్రులకు తక్షణ ఆర్థికసాయం అందించాలని నిరసనకు దిగారు. భారీ వర్షం పడుతుండటంతో డ్రైవర్‌కు సరిగా కనిపించకపోవడంతో కొండ మలుపులో వాహనం అదుపుతప్పింది. దీంతో కొండ నుంచి వందల మీటర్ల లోయలోకి వాహనం పల్టీకొట్టి పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో ఇద్దరు జార్ఖండ్ కార్మికులుసహా ఏడుగురు మరణించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని ఆస్పత్రికి తరలి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సహా పలు పార్టీల నేతలు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. -
వీడని మిస్టరీ!
సాక్షి రాయచోటి : గువ్వలచెరువు ఘాట్‌లో మూడు మృతదేహాలు బయటపడిన సంఘటన సంచలనంగా మారింది. కారణాలు తెలియక ఒకవైపు..వారి వివరాలు లభించక మరోవైపు.. పోలీసులు అన్వేషణ కొనసాగిస్తున్నారు. మృతుల తలలకు గాయాలు ఉండడంపై హత్యగా నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తును వేగవంతం చేశారు. అయితే నిందితులు ఎక్కడో చంపి ఇక్కడికి తీసుకొచ్చి.. ఘాట్ లోయలోకి విసిరేసి వెళ్లిపోయినట్లు అంచనా వేస్తున్నారు. అందులోనూ మృతి చెంది దాదాపు 10–12 రోజులు కావడంతో మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా మారిపోయాయి. కేవలం వారి ఒంటిపై ఉన్న దుస్తులు, గొలుసులు, ఇతర చిన్నపాటి ఆధారాల మేరకు కేసు దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. కర్నూలు–చిత్తూరు జాతీయ రహదారి–44లో అనునిత్యం వాహనాల రద్దీ ఉన్న నేపథ్యంలో రాత్రి సమయంలో ఘాట్ లోయలో మృతదేహాలను పడేసినట్లు స్పష్టమవుతోంది. అసలు వారెవరు? కడప–రాయచోటి సరిహద్దు ప్రాంతంలోని ఐదవ మలుపు వద్ద కొండకింద లోయలో కనిపించిన ఆ మృతదేహాలు ఎవరివి అన్నది అంతుచిక్కడం లేదు. అసలు వారెవరు...ఎక్కడి వారు...ఎందుకు చంపాల్సి వచ్చింది...ఇతర వివరాల కోసం పోలీసులు పడరాని పాట్లు పడుతున్నారు. ఒకవైపు ఇన్ఫార్మర్ల ద్వారా కూపీ లాగుతూ మరోవైపు ఉన్న ఆధారాల మేరకు విచారిస్తున్నారు. రాయచోటికి చెందిన టైలర్ పేరు మృతుని షర్టుపై ఉండటంతో సంబంధిత టైలర్ ద్వారా ఆరా తీశారు. అయితే అతను చాలా ఏళ్ల క్రితమే టైలర్ వృత్తిని మానుకున్నట్లు వెల్లడించినట్లు తెలిసింది. అయితే షర్టుపై ఉన్న గుర్తుల నేపధ్యంలో రాయచోటి ప్రాంతానికి చెందిన వారే అయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే సీసీ కెమెరాల ద్వారా వాహనాల రాకపోకలకు సంబంధించిన వ్యవహారాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తోటల వద్ద కాపలాదారుల వివరాల సేకరణ ప్రధానంగా మృతుల్లో ఒక వ్యక్తి మెడలో సిల్వర్ గొలుసు, మహిళ నైటీ ధరించి ఉండడం చూసి మృతులు యానాదులు లేదా ఎరుకుల సామాజిక వర్గానికి చెందిన వారై ఉంటారని అనుమానిస్తున్నారు. మామిడి, చీనీ తోటల వద్ద కాపలా దారులుగా ఎక్కువగా వారే ఉంటారు కనుక వారి వివరాలు సేకరిస్తున్నారు. తోటల వద్ద జరిగిన గొడవే హత్యలకు కారణంగా ఉండవచ్చన్న కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మిస్సింగ్ కేసులపై ఆరా వైఎస్సార్ జిల్లాతోపాటు అన్నమయ్య జిల్లాలోని అన్ని పోలీసుస్టేషన్ల పరిధిలో మిస్సింగ్ కేసులకు సంబంధించిన వాటిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా సచివాలయాల పరిధిలోని మహిళా పోలీసులకు సమాచారం ఇచ్చి గ్రామాల్లో వారం, పది రోజులుగా కనిపించకుండా పోయిన వారి వివరాలు సేకరించాలని ఆదేశాలు ఇచ్చారు. ఎందుకంటే కొంతమంది కుటుంబ సభ్యుల ఆర్థిక, ఆస్తుల వ్యవహారంలో గొడవలు జరిగి మృతి చెందినట్లయితే వ్యవహారం బయటికి పొక్కకుండా జాగ్రత్త పడే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మిస్సింగ్ కేసు నమోదు కాకపోయినా గ్రామాల్లో అదృశ్యమైన వారి వివరాలు సేకరిస్తున్నారు. పోలీసు బృందాలతో గాలింపు మృతుల వివరాలు కనుగొనేందుకు ప్రత్యేకంగా ఏడెనిమిది పోలీసు బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కడప డీఎస్పీ వెంకట శివారెడ్డి నేతృత్వంలో పోలీసు బృందాలు దర్యాప్తులో ముందుకు వెళుతున్నాయి. దర్యాప్తు ముమ్మరం గువ్వలచెరువు ఘాట్‌లో మూడు మృతదేహాలకు సంబంధించి వైఎస్సార్‌తోపాటు అన్నమయ్య జిల్లాలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ప్రధాన్చంగా వైఎస్సార్, అన్నమయ్య, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలకు సంబంధించిన మహిళా పోలీసులకు సమాచారం అందించాం. గ్రామాల్లో కనిపించని వారితోపాటు మిస్సింగ్ వివరాలు కూడా తెప్పించుకుంటున్నాం. కేసుకు సంబంధించి ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తూ మిస్టరీని ఛేదించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. తోటల వద్ద కాపలా ఉన్న వారి వివరాలు తీసుకుంటున్నాం. – కేకేఎన్ అన్బురాజన్,జిల్లా ఎస్పీ, వైఎస్సార్ జిల్లా -
లోయలోకి దూసుకుపోయిన కారు
రంపచోడవరం: రంపచోడవరానికి సుమారు 15 కిలోమీట ర్ల దూరంలోని బర్డ్స్ నెట్ రిసార్ట్స్ సమీపంలో సోమవారం సాయంత్రం బొలేరో వాహనం బోల్తా కొట్టి లోయలో పడింది. కాకినాడ నుంచి చత్తీస్‌గఢ్ రాష్ట్రం కుంట వెళ్తున్న ఈ వాహనంలో నలుగురు ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. కారులో ప్రయాణికుల వివరాలు తెలియరాలేదు. -
ఇళ్లే మిగిలాయి!
ఈ ఫొటోలోని ఇళ్లను చూస్తున్నారుగా. కొండపైన భలే కట్టుకున్నారు కదా. యెమెన్ హధర్మట్ ప్రాంతంలోని డవన్ లోయలో ఉంది ఈ ప్రాంతం. దీనికి సుమారు 500 ఏళ్ల చరిత్ర ఉంది. అప్పట్లో ఇదో గ్రామం. పేరు హైద్ అల్ జజిల్. వందలాది మంది నివసించేవారు. కానీ 2004 నాటి జనాభా లెక్కల్లో ఇక్కడ 17 మందే ఉన్నారని తేలింది. ఇప్పుడు ఇక్కడ ఒక్కరంటే ఒక్కరే ఉంటున్నారు. మంచి వేతనాలు వస్తున్న, అన్ని సౌకర్యాలున్న సౌదీ అరేబియాకు అనేక మంది వలస వెళ్లారు. దీంతో వరదలు వచ్చి ఇక్కడి ఇళ్లు చాలా వరకు దెబ్బతిన్నాయి. ఎవరూ పట్టించుకోకపోవడంతో మరింత శిథిలమయ్యాయి. కొన్నాళ్లుగా కాల్పుల మోతతో దద్దరిల్లిన యెమెన్‌లో కాల్పుల విరమణ ఒప్పందం జరగడంతో ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. ఫొటోగ్రాఫర్ తారిక్ జైదీ ఇటీవల ఈ ప్రాంతానికి వెళ్లి అక్కడి పరిస్థితులను తన కెమెరాలో బంధించారు. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
బస్సు రూపంలో వెంటాడిన మృత్యువు....మిన్నంటిన రోదనలు
దేవుడా ఎంత పని చేశావయ్యా.. సంతోషంగా శుభకార్యానికి వెళ్తున్న వారిని ఎందుకింత నిర్దయగా కబళించావు.. మేము ఏం పాపం చేశామయ్యా.. ఇంత విషాదాన్ని మా కుటుంబాలకు మిగిల్చావు’ అంటూ బస్సు ప్రమాద బాధితులు రోదించిన తీరు అందరినీ కలచివేసింది. తిరుపతి సమీపంలోని భాకరాపేట వద్ద లోయలో బస్సు బోల్తాపడిన ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలను అంబులెన్సుల్లో ధర్మవరానికి తీసుకురాగానే బాధితుల రోదనలు మిన్నంటాయి. సాక్షి, ధర్మవరం టౌన్/ అర్బన్/ తనకల్లు/ కదిరిటౌన్/ పుట్టపర్తి: ధర్మవరంలోని ప్రముఖ పట్టు చీరల వ్యాపారి మలిశెట్టి మురళి కుమారుడు వేణు వివాహ నిశ్చితార్థ వేడుకలకు తిరుచానూరులోని రాధాకృష్ణ కల్యాణమండపానికి బయల్దేరిన వారిని బస్సు ప్రమాద రూపంలో మృత్యువు వెంటాడింది. భాకరాపేట వద్ద లోయలో శనివారం రాత్రి బస్సు బోల్తాపడిన ఘటనలో అక్కడికక్కడే ఎనిమిది మంది మృతి చెందగా, ఆదివారం సాయంత్రం మరొకరు చనిపోయారు. దీంతో మృతి చెందిన వారి సంఖ్య తొమ్మిదికి చేరుకుంది. మృతుల్లో ధర్మవరానికి చెందిన మలిశెట్టి మురళి (45), తమ్ముడు మలిశెట్టి గణేష్ (42), మరో తమ్ముడు శివ భార్య కాంతమ్మ (38), బంధువు, పెళ్లిళ్ల పేరయ్య అయిన మలిశెట్టి వెంగప్ప (75), భార్య నాగలక్ష్మి (60), తనకల్లు మండలం కొక్కంటి క్రాస్‌కు చెందిన జింకా చంద్ర కుమార్తె చందన (10), ధర్మవరానికి చెందిన బస్సు డ్రైవర్ నబీరసూల్ (42), కదిరికి చెందిన క్లీనర్ షకీల్ (22), మలిశెట్టి మురళి స్నేహితుడు, విలేకరి అయిన బుక్కపట్నం మండలం మారాలకు చెందిన ఆదినారాయణరెడ్డి (45) ఉన్నారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు, మరో కుటుంబంలో దంపతులు ప్రాణాలు కోల్పోవడం తీరని విషాదం మిగి ల్చింది. గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు 33 మంది ఉన్నారు. కన్నీటి వీడ్కోలు.. బస్సు ప్రమాద మృతుల్లో ఎక్కువమంది ధర్మవరానికి చెందిన ఒకే కుటుంబానికి చెందినవారు ఉన్నారు. తిరుపతి ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మలిశెట్టి మురళి, తమ్ముడు గణేష్, మరో తమ్ముడు శివ భార్య కాంతమ్మ మృతదేహాలను ఆదివారం అంబులెన్స్‌లో కొత్తపేట ఉషోదయ స్కూల్ వద్దకు తీసుకొచ్చారు. అప్పటికే అక్కడకు చేరుకున్న బంధువులు, కుటుంబ సభ్యులు, పట్టణ ప్రజలు బోరున విలపించారు. మృతదేహాలను ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సోదరుడు, వైఎస్సార్సీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి, ఏపీ ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ వడ్డే బాలాజీ, దేవరకొండ రమేష్, గుండా ఈశ్వరయ్య సందర్శించి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గరుడంపల్లి సమీపాన మలిశెట్టి మురళి పొలంలో నిర్వహించిన ముగ్గురి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మలిశెట్టి వెంగప్పకు హిందూ శ్మశాన వాటికలోను, డ్రైవర్ నబీరసూల్‌కు ముస్లిం శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి. కదిరిలో క్లీనర్ షకీల్, బుక్కపట్నం మండలం మారాలలో విలేకరి ఆదినారాయణరెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. చిన్నారి చందనకు తనకల్లు మండలం కొక్కంటి క్రాస్ సమీపంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. మృత్యువులోనూ వీడని బంధం.. ధర్మవరం పట్టణానికి చెందిన మలిశెట్టి మురళి, తమ్ముడు గణేష్, మరో తమ్ముడు శివ భార్య కాంతమ్మ బస్సు ప్రమాదంలో మృతిచెందారు. ముగ్గురు అన్నదమ్ములూ పట్టుచీరల వ్యాపారం చేసుకుంటూ జీవించేవారు. కానీ బస్సు ప్రమాదం ఆ ఇంట విషాదాన్ని నింపింది. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల బాధ వర్ణనాతీతంగా మారింది. మురళి కుమారుడు వేణు (పెళ్లికొడుకు), భార్య లలితమ్మ, తమ్ముడు గణేష్ భార్య భైరవి తిరుపతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మురళి మృతితో అన్నదమ్ముల కుటుంబాలు పెద్ద దిక్కు కోల్పోయినట్లయ్యింది. నీ వెంటే నేనూ.. ధర్మవరానికి చెందిన మలిశెట్టి వెంగప్ప శనివారం రాత్రి బస్సు ప్రమాదంలో మృతిచెందగా, గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతని భార్య నాగలక్ష్మి (60) ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచింది. భర్త మృతి చెందిన విషయం కూడా ఆమెకు తెలియకనే కన్నుమూసింది. అర్ధంతరంగా ముగిసిన విలేకరి జీవితం.. బుక్కపట్నం మండలం మారాల గ్రామానికి చెందిన ఆదినారాయణరెడ్డి బస్సు ప్రమాదంలో మృతిచెందారు. ఆదినారాయణరెడ్డి 20 ఏళ్లుగా పత్రికారంగంలో విలేకరిగా పనిచేస్తున్నారు. మలిశెట్టి మురళి స్నేహితుడు కావడంతో ఆయన కుమారుడి నిశ్చితార్థానికి ఆదినారాయణరెడ్డి బస్సులో వెళ్లారు. అలా వెళ్లిన విలేకరి అర్ధంతరంగా తనువు చాలించాడు. ఈయనకు భార్య గౌతమి, కుమార్తె మనీషా, కుమారుడు గణేష్‌రెడ్డి ఉన్నారు. అయ్యో ‘పాపం'.. ధర్మవరం కొత్తపేట నివాసి జింకా చంద్ర కుమార్తె జింకా చందన (10) స్థానిక మున్సిపల్ స్కూల్లో నాలుగో తరగతి చదువుతోంది. బంధువుల నిశ్చితార్థానికి వెళ్లి బస్సు ప్రమాదంలో చందన మృతి చెందింది. తండ్రి చంద్ర తిరుపతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వీరి సొంతూరు తనకల్లు మండలం కొక్కంటి క్రాస్. ఛిద్రమైన పేదల బతుకులు బస్సు ప్రమాదంలో మృతి చెందిన డ్రైవర్ నబీరసూల్, క్లీనర్ షకీల్ నిరుపేదలు. ఈ ప్రమాదంతో రెండు కుటుంబాలు ఛిద్రమయ్యాయి. కదిరికి చెందిన క్లీనర్ షకీల్ అవివాహితుడు. నార్పల మండలం గూగూడుకు చెందిన డ్రైవర్ నబీరసూల్ 12 ఏళ్ల క్రితం పొట్టకూటి కోసం తాడిపత్రికి వెళ్లాడు. అక్కడి నుంచి ధర్మవరం చేరుకుని డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఊహించని విధంగా మృత్యువాత పడటంతో ఇతని భార్య, ఇద్దరు పిల్లల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇతని సోదరుడు హైదర్‌వలి కూడా లారీడ్రైవర్‌గా వెళ్తూ 16 క్రితం ముదిగుబ్బ వద్ద రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. (చదవండి: లోయలో పడ్డ బస్సు.. ప్రమాదానికి కారణాలివే..!) -
300 అడుగుల లోతు.. చిమ్మ చీకటి.. ప్రాణాలను పణంగా పెట్టి..
300 అడుగుల లోతు.. చిమ్మ చీకటి.. ఎవరు ప్రాణాలతో ఉన్నారో తెలియదు, ఎవరు చనిపోయారో తెలియదు.. ఘటనా స్థలికి చేరుకోవడం ప్రాణాలతో చెలగాటం. శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో టూరిస్టు బస్సు భాకరపేట మొదటి ఘాట్ లోయలో పడిపోయిందనే సమాచారం అందగానే జిల్లా కలెక్టర్ హరినారాయణతో పాటు పోలీసు శాఖ అప్రమత్తమైంది. అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు, సీవీఎస్ఓ గోపీనాథ్‌జెట్టి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుమారుడు హర్షిత్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. వీరితో పాటు స్థానికులు ప్రాణాలను ఫణంగా పెట్టి లోయలోకి దిగి క్షతగాత్రులకు సహాయక చర్యలు చేపట్టారు. సాక్షి బృందం, తిరుపతి: అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని మారుతి నగర్‌కు చెందిన మలిశెట్టి మురళి కుమారుడు మలిశెట్టి వేణు(25) నిశ్చితార్థం నారాయణవనం మండలం తుంబూరుకు చెందిన అమ్మాయితో నిశ్చయించారు. ఆదివారం ఈ వేడుకను తిరుచానూరులోని రాధాకృష్ణ కల్యాణ మండపంలో ఏర్పాటు చేశారు. అందులో భాగంగా శనివారం ఉద యం 11 గంటలకు టూరిస్టు బస్సులో ధర్మవరం, చుట్టుపక్క ప్రాంతాల నుంచి సుమారు 55 మంది బయలుదేరారు. అతి వేగంతో పాటు ఫిట్నెస్ లేని బస్సు కావడంతో భాకరపేట సమీపంలోని ఘాట్‌లో 300 అడుగుల లోతున్న లోయలోకి పడిపోయింది. చదవండి: చిత్తూరులో విషాదం.. లోయలో పడ్డ బస్సు రక్తసిక్తం.. బస్సు లోయలోకి పడిపోవడంతో ఆ ప్రాంతంలో హాహాకారాలు మిన్నంటాయి. క్షతగాత్రులు రక్షించండి, కాపాడండి అంటూ పెద్ద ఎత్తున రోదించారు. చెల్లాచెదురుగా పడిన మృతులు, క్షతగాత్రులతో ఆ ప్రాంతం బీతావహంగా మారిపోయింది. స్థానికులతో పాటు, పోలీసులు ఘటనా స్థలికి చేరుకునేందుకు ప్రాణాలను ఫణంగా పెట్టారు. తాళ్లు, చెట్ల సాయంతో ఘటనా స్థలికి చేరుకున్నారు. ఒకరికొకరు తోడుగా.. క్షతగాత్రులను కాపాడేందుకు ఒకరికొకరు తోడుగా లోయలోకి చేరుకున్నారు. ఒక్కో క్షతగాత్రుడిని బయటకు తీసుకొచ్చేందుకు ఆరుగురు చొప్పున అరగంట పాటు శ్రమించాల్సి వచ్చింది. ఇదే సమయంలో అక్కడకు చేరుకున్న అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు, సీవీఎస్ఓ గోపినాథ్‌జెట్టి స్వయంగా క్షతగాత్రులకు ప్రాథమక చికిత్సలు చేశారు. కలెక్టర్ హరినారాయణన్ దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. పది 108 వాహనాలు 12కు పైగా ట్రిప్పులు, ఒక ప్రయివేట్ వెహికల్, నాలుగు మినీ వ్యాన్లతో క్షతగాత్రులను రుయాకు తరలించారు. పెళ్లి కొడుక్కి తీవ్ర గాయాలు ప్రమాదంలో పెళ్లి కుమారుడు వేణుకు తీవ్ర గాయాలయ్యాయి. ఇతని పిన్నమ్మ ఘటనా స్థలిలోనే ప్రాణాలు విడిచింది. మరో ఆరుగురు మరణించగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బస్సులో మొత్తం 55 మంది ఉండగా, 48 మంది రుయాలోని అత్యవసర విభాగం, ఎంఎం వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. క్షతగాత్రుల్లో 11 మందికి పైగా చిన్నారులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఆసుపత్రిలో పరిస్థితిని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి బాస్కర్‌రెడ్డి, ఏఎస్పీ సుప్రజ, డీఎస్పీ మురళీకృష్ణ, సూపరింటెండెంట్ డాక్టర్ భారతి, తిరుపతి రూరల్ ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, అర్బన్ తహసీల్దార్ వెంకటరమణ తదితరులు వైద్య సేవలను దగ్గరుండి పర్యవేక్షించారు. -
సగం కొట్టేసిన బిల్డింగ్‌లా కనిపిస్తోందా.. అలా అనుకుంటే పొరపాటే!
సడన్‌గా చూస్తే.. సగం కొట్టేసిన బిల్డింగ్‌లా కనిపిస్తోంది కదూ.. నిజానికిది పూర్తిగా కట్టేసిన బిల్డింగ్.. దీని డిజైనే అంత.. ఇలాంటి వింత డిజైన్ సృష్టికర్త నెదర్లాండ్స్‌కు చెందిన ఎంవీఆర్‌డీవీ సంస్థ. ఆమ్స్టర్డంలో 75 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ మూడు భవంతుల సముదాయాన్ని వచ్చే ఏడాది ప్రారంభించనున్నారు. దూరం నుంచి అలా కనిపిస్తోంది గానీ.. దగ్గర్నుంచి చూస్తే.. దేనికది బ్లాక్స్లాగ కట్టినట్లు ఉంటుంది. అంతేకాదు.. వీటిపైనే ఎక్కడికక్కడ మొక్కలు, చెట్లను పెంచుతారట. మొత్తం 13 వేల రకాల మొక్కలు, చెట్లకుఇది నిలయంగా మారుతుందని చెబుతున్నారు. ఈ భవంతుల సముదాయంలో వాణిజ్య కార్యాలయాలతోపాటు 200 అపార్టుమెంట్లు, రూఫ్ గార్డెన్, స్కైబార్ ఉంటాయి. -
ప్రమాదం: లోయలో పడ్డ ఆర్టీసీ బస్సు
సాక్షి, తిరుపతి: భాకరాపేట ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు లోయలో పడటంతో 22 మందికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని రుయా ఆస్పత్రికి తరలించారు. బళ్లారి నుంచి తిరుపతికి వస్తుండగా ప్రమాదం జరిగింది. డ్రైవర్ కి గుండెనొప్పి రావటంతో బస్సు అదుపు తప్పిందని సమాచారం. -
స్కూటీ బ్రెకులు ఫెయిల్.. గుట్టపై నుంచి అదుపు తప్పి..
సాక్షి, తిర్యాణి(ఆదిలాబాద్): మండలంలోని గుడిపేట గ్రామానికి చెందిన ఆత్రం పార్వతి బాయి జైనూర్‌కు వెళ్లి మంగళవారం సాయంత్రం తిరిగి ఇంటికి వస్తుండగా పంగిడిమాదర గుట్ట వద్ద తన స్కూటీ బ్రెకులు ఫెయిల్ కావడంతో అదుపుతప్పి గుట్ట పై నుంచి లోయలోకి పడిపోయింది. దీంతో పార్వతి బాయి స్పృహ తప్పిపోయింది. అటుగా వెళ్తున్న కొందరు యువకులు గుర్తించి స్కూటీతోపాటు ఆమెను రోడ్డు పైకి తీసుకొచ్చి ఇంటికి పంపించారు. అదృష్టవశాత్తు ఎటువంటి త్రీవ గాయాలు కాలేదు. తానను కాపాడిన యువకులకు కృతజ్ఞతలు తెలిపారు. -
లోయలో పడిన బస్సు.. 24 మంది మృతి
లాపాజ్(బొలివియా): దక్షిణ అమెరికాలోని బొలివియాలో విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడడంతో 24 మంది మృతి చెందగా.. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బస్సు దాదాపు 100 మీటర్ల లోతు ఉన్న లోయలో పడడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను వెలికి తీస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
Spiti Valley: నింగికీ నేలకూ మధ్య ఓ నది
పదిహేను వేల అడుగుల ఎత్తు. లామాలకు ఇష్టమైన ప్రదేశం. ఎటు చూసినా మంచుకొండలు. మంచు కరిగి నీరవుతోందా లేక... చుట్టూ ఉన్న మంచు చల్లదనానికి నీరు గడ్డకట్టిపోతోందా? ఏమో! రెండూ నిజమే కావచ్చు!! స్పితిలోయలో ఏడాదిలో కొంతకాలం కొండలు కరిగి నీరవుతుంటే... మరికొంత కాలం నీరు మంచుగా మారుతుంది. కంటి ముందు మంద్రంగా ప్రవహిస్తున్న నది చూస్తూ ఉండగానే ప్రవాహం వేగం తగ్గిపోయి గడ్డకడుతుంది. ఇది హిమాలయ శ్రేణుల్లో విస్తరించిన ప్రదేశం. కులు నుంచి స్పితిలోయకు వెళ్లే దారిలో కనిపిస్తుంది కుంజుమ్ కనుమ. శీతాకాలంలో పర్వతాలను కప్పేసిన మంచు కరిగి కుంజుమ్ కనుమ మీదుగా పల్లానికి ప్రవహిస్తుంది. అదే స్పితి నది. స్పితి లోయలో ప్రవహిస్తున్న నది. ఈ నది మరీ పెద్దదేమీ కాదు. ప్రవాహ దూరం నూటముప్పై కిలోమీటర్లు మాత్రమే. స్పితి అంటే... మధ్యనున్న నేల అని అర్థం. అటు నింగికీ– ఇటు భూమికీ మధ్యనున్న నేల కావడంతో దీనికి అదే పేరు స్థిరపడింది. లామాల నివాసం హిమాచల్‌ప్రదేశ్‌లోని స్పితిలోయ బౌద్ధం కొలువుదీరిన ప్రదేశం. బౌద్ధలామాలు మౌనంగా పర్వతసానువుల్లో అలవోకగా నడిచిపోతుంటారు. పదిహేను వేల అడుగుల ఎత్తు బోర్డు దాటి ముందుకెళ్లి కొండ మలుపు తిరిగితే అనేక బౌద్ధారామాలు, చైత్యాలతోపాటు ‘కీ’ మోనాస్టెరీ, టాబో మోనాస్టెరీలు కనిపిస్తాయి. ఇవి బౌద్ధం పురుడుపోసుకున్న తొలినాళ్లలో కట్టిన బౌద్ధచైత్యాలు. అందుకేనేమో ఇది దలైలామాకు అత్యంత ఇష్టమైన ప్రదేశం అయింది. -
లోయలో పడిన ఎస్యూవీ: ఐదుగురి దుర్మరణం
బనిహాల్/జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో విషాద సంఘటన జరిగింది. ఖుని నల్లాహ్ దగ్గర్లో శనివారం ఓ ఎస్యూవీ అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారని అధికారులు తెలిపా రు. లోయలో పడేముందు ఎస్యూవీ ఓ కారును ఢీకొందని చెప్పారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సీఆర్పీఎఫ్ బలగాలు అక్కడికి చేరుకొని సహాయక కార్యక్రమాలు చేపట్టాయి. లోయలోకి తాళ్ల సాయంతో బలగాలు దిగాయని రక్షణ శాఖ ప్రతినిధి చెప్పారు. ప్రమాద స్థలంలో ముగ్గురు, మరొకరు ఆస్పత్రికి తరలిస్తుం డగా మరణించారు. మరో మృతదేహాన్ని ఘటనా స్థలానికి కొంత దూరం లో కనుగొన్నారు. మృతులను సీఆర్పీఎఫ్ హెడ్‌కానిస్టేబుల్ షగుణ్ కుమార్, వనీత్ కౌర్, గారు రామ్, మహ్మద్ రఫీ, సంజీవ్‌కుమార్‌గా గుర్తించారు. గాయపడిన ఇండియన్ రిజర్వ్ పోలీస్ అజిత్‌కుమార్‌ను జమ్మూకు తరలించారు. చదవండి: వైద్య సిబ్బంది సాహసం: వ్యాక్సిన్ కోసం నది దాటి -
లోయలో పడిన బస్సు.. 27 మంది మృతి
జకర్తా: ఇండోనేషియాలోని జావా దీవిలో గురువారం తెల్లవారుజామున అర్థరాత్రి దాటాకా ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. యాత్రికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తూ లోయలో పడిపోవడంతో 27 మంది మృతి చెందగా.. మరో 35 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ జావాలోని ఇస్లామిక్ జూనియర్ హైస్కూల్‌కు చెందిన విద్యార్థులు తమ తల్లిదండ్రులతో పాటు టీచర్లు కలిసి బుధవారం విహారయాత్రకు బయల్దేరారు. బుధవారం అర్థరాత్రి దాటాకా సుమేడాంగ్ జిల్లాలో ప్రయాణిస్తున్న సమయంలో బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయకచర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికి తీయగా.. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ ప్రారంభించారు. కాగా బస్సు బ్రేకులు పనిచేయకపోవడం వల్లే ప్రమాదం సంభంవించి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: తల తెంచుకొని శరీరాన్ని పెంచుకుంటుంది బయటపడిన బంగారు కొండ.. మట్టికోసం ఎగబడ్డ జనం -
లోయలోకి దూసుకెళ్లిన బస్సు
సాక్షి, వరంగల్ : ఎద్దుల బండిని తప్పించబోయి బస్సు లోయలోకి దూసుకెళ్లిన ఘటన మంగళవారం ఉదయం మండలంలోని ఏటూరు గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో బస్సులోని 45 మంది ప్రయాణికులు ఎలాంటి గాయలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏటూరునాగారం బస్ స్టేషన్ నుంచి 8గంటలకు బస్సు బయల్దేరింది. 8.30సమయంలో ఏటూరు మూలమలుపు వద్ద హఠాత్తుగా ఎద్దులబండి రావడంతో తప్పంచే క్రమంలో బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో డ్రైవర్ దేవేందర్ చాకచక్యంగా బస్సును అదుపు చేయడంతో ప్రమాణికుంతా ఊపిరి పీల్చుకున్నారు. చుట్టుపక్కల పొలాల్లో ఉన్న రైతులు వచ్చి ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీశారు. -
లోయలో పడిన బస్సు
సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు జిల్లాలో గురువారం ఓ ప్రైవేటు బస్సు (హెచ్‌పీ 66–7065) అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 44 మంది మృతి చెందగా, మరో 34 మందికి గాయాలయ్యాయి. జిల్లాలోని బంజార్ తెహ్సిల్ వద్ద ఉన్న ధోత్ మోర్హ్ దగ్గర బస్సు 300 అడుగుల లోతున్న లోయలో పడిందని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ షాలిని అగ్నిహోత్రి తెలిపారు. ఎక్కువ మందిని ఎక్కించడం, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నామని బంజార్ పట్వారీ షీతల్ కుమార్ అన్నారు. హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ ప్రమాదం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై లోతైన విచారణ చేపట్టాల్సిందిగా సీఎం సంబంధిత అధికారులను ఆదేశించారు. విషయం తెలుసుకున్న రవాణా శాఖ మంత్రి గోవింద్ కులు జిల్లాకు బయలుదేరారు. ప్రమాదంలో చనిపోయిన, గాయపడిన వారి కుటుంబాలకు జిల్లా యంత్రాంగం రూ. 50 వేల తక్షణ ఆర్థిక సాయం అందించింది. ప్రభుత్వం రోడ్లను క్షుణ్నంగా పరిశీలించి, అవసరమైన చోట్ల రోడ్డు వెడల్పును పెంచాలని సేవ్ లైఫ్ ఫౌండేషన్ సభ్యుడు పీయూష్ తివారీ డిమాండ్ చేశారు. కాలువలో వ్యాను బోల్తా ముగ్గురు పిల్లల మృతి లక్నో: పెళ్లి నుంచి తిరిగొస్తుండగా 29 మంది ప్రయాణిస్తున్న వ్యాను కాలువలో పల్టీ కొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు పిల్లలు గల్లంతయ్యారు. వారిలో ముగ్గురి మృత దేహాలను గురువారం వెలికితీశారు. లక్నోకు సమీపంలోని నగ్రాం ప్రాంతంలోని ఇందిరా కెనాల్లో గురువారం తెల్లవారుజామున 3 గంటలకు వ్యాను బోల్తా పడింది. పొరుగున ఉన్న బారాబంకీ జిల్లాలో ఓ పెళ్లినుంచి తిరిగొస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని లక్నో జిల్లా మేజిస్ట్రేట్ కౌశల్‌రాజ్ శర్మ తెలిపారు. ప్రమాదం తరువాత 22 మందిని రక్షించగలిగారు. 5 నుంచి 10 ఏళ్లలోపు ఏడుగురు పిల్లలు గల్లంతవ్వగా, గాలింపుల అనంతరం మూడు మృతదేహాలను వెలికితీశారు. మిగిలిన నలుగురిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. -
లోయలో పడ్డ లారీ, 10 మంది మృతి
-
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
కుప్పం రూరల్: చిత్తూరు జిల్లా కుప్పం మండలం పెద్దవంక అటవీ ప్రాంతం సమీపంలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మామిడికాయలతో వెళ్తున్న లారీ అదుపుతప్పి లోయలో పడటంతో తమిళనాడుకు చెందిన ఏడుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 21 మందికి తీవ్ర గాయాలయ్యాయి. తమిళనాడు వేలూరు జిల్లా కల్లనరసంబట్టు గ్రామానికి చెందిన 31 మంది కూలీలు మామిడి కాయలు కోసేందుకు కుప్పం మండలం విజలా పురం గ్రామానికి వచ్చారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ మామిడి కాయలు కోసి లారీలోకి నింపి అదే వాహనంలో తిరుగు ప్రయాణం అయ్యారు. ఓ వైపు జోరు వర్షం.. చిమ్మచీకట్లోనే లారీ వేలూరుకు ప్రయాణమైంది. కుప్పం మండలం పెద్దవంక సమీపంలోని అటవీ ప్రాంతంలోని ఘాట్ వద్ద లారీ అదుపు తప్పి సుమారు 50 అడుగుల లోయలోకి బోల్తా కొట్టింది. మామిడికాయలతో పాటు కూలీలు లోయలోకి పడిపోయారు. ఈ ప్రమాదంలో లారీ నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి.. తమిళనాడు, ఏపీ పోలీసులకు సమాచారం అందించాడు. అడవిలో మిన్నంటిన ఆర్తనాదాలు.. రోజంతా కష్టపడి అలసి సొలసి లారీలోనే కునుకుతీస్తున్న కూలీలు.. లారీ అదుపు తప్పిన విషయం తెలుసుకునే లోపే లోయలోకి జారిపోయారు. అర్ధరాత్రి అడవిలో కూలీల ఆర్తనాదాలు మిన్నంటాయి. ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, వైద్యాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లారీ, మామిడికాయల కింద వున్న కూలీలను ఒక్కొక్కరిని వెలికి తీస్తున్నారు. అందులో ఏడుగురు మరణించినట్టు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. క్షతగాత్రులను తమిళనాడులోని వేలూరు, కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించారు. చిత్తూరు కలెక్టర్ ప్రద్యుమ్న, ఎస్పీ రాజశేఖర్‌బాబు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలను పర్యవేక్షించారు.