APSRTC Bus Fell Into Valley in Paderu - Sakshi
Sakshi News home page

పాడేరు ఘాట్‌ రోడ్డులో ప్రమాదం.. 100 అడుగుల లోయలో పడ్డ ఆర్టీసీ బస్సు

Published Sun, Aug 20 2023 3:55 PM | Last Updated on Sun, Aug 20 2023 7:32 PM

Rtc Bus Fell Into Valley In Paderu - Sakshi

సాక్షి, అల్లూరి సీతారామరాజు జిల్లా: పాడేరు ఘాట్‌ రోడ్డులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 100 అడుగుల లోయలో ఆర్టీసీ బస్సు పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. మలుపులో వేగంగా వస్తున్న బైక్‌ను తప్పించే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. పిట్టగోడను ఢీ కొట్టి బస్సు లోయలోకి దూసుకుపోయింది.

ఘాట్‌ రోడ్డు వ్యూ పాయింట్‌ దగ్గర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. చోడవరం నుంచి పాడేరు వెళ్తుండగా ఘటన జరిగింది. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
చదవండి: నా భర్త సంసారానికి పనికిరాడు.. పెళ్లయి రెండేళ్లయినా.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement