
సాక్షి, వరంగల్ : ఎద్దుల బండిని తప్పించబోయి బస్సు లోయలోకి దూసుకెళ్లిన ఘటన మంగళవారం ఉదయం మండలంలోని ఏటూరు గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో బస్సులోని 45 మంది ప్రయాణికులు ఎలాంటి గాయలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏటూరునాగారం బస్ స్టేషన్ నుంచి 8గంటలకు బస్సు బయల్దేరింది. 8.30సమయంలో ఏటూరు మూలమలుపు వద్ద హఠాత్తుగా ఎద్దులబండి రావడంతో తప్పంచే క్రమంలో బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో డ్రైవర్ దేవేందర్ చాకచక్యంగా బస్సును అదుపు చేయడంతో ప్రమాణికుంతా ఊపిరి పీల్చుకున్నారు. చుట్టుపక్కల పొలాల్లో ఉన్న రైతులు వచ్చి ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీశారు.
Comments
Please login to add a commentAdd a comment