Paderu
-
ఏజెన్సీకి సైతం పాకిన ర్యాగింగ్ భూతం
సాక్షి, అల్లూరి సీతారామరాజు జిల్లా: ర్యాగింగ్ భూతం ఏజెన్సీకి సైతం పాకింది. పాడేరు సెయింటెన్స్ స్కూల్ హాస్టల్ విద్యార్థినుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 7వ తరగతి బాలికలపై 10వ తరగతి విద్యార్థులు దాడి చేశారు. వసతి గృహంలో ర్యాగింగ్ జరుగుతుందని విద్యాశాఖ అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనపై అధికారులు విచారణ చేట్టారు. ఈ ఘటనపై డీఈవో గోప్యంగా విచారణ జరుపుతున్నారు -
AP: గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. బాలికలకు అస్వస్థత
సాక్షి, అల్లూరి: పాడేరులోని గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. నిల్వ ఉంచిన ఆహారం విద్యార్థినులకు పెట్టడంతో వారికి వాంతులు, విరేచనాలు కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. అల్లూరి జిల్లా పాడేరులోని గోమంగి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా ఎనిమిది మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. నిల్వ ఉంచిన ఆహారం విద్యార్థినులకు పెట్టడంతో వారికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. వారి పరిస్థితి సీరియస్‌గా మారడంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్ధినులను చూసి వారి పేరెంట్స్ ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాపాయం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, మెగా పేరెంట్ టీచర్స్ మీట్లో మిగిలిపోయిన వంటకాలను గురుకుల సిబ్బంది మరుసటి రోజు వడ్డించినట్టు సమాచారం. దీని వల్లే వారు అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. -
Andhra Pradesh: ఏజెన్సీ గజగజ
ఏజెన్సీ ప్రాంతంలో సాయంత్రం 4గంటల నుంచే చలిగాలులు విజృంభిస్తున్నాయి. పాడేరు ఘాట్‌లో చలితీవ్రత మరింత ఎక్కువైంది. శనివారం పాడేరు మండలం మినుములూరు కేంద్ర కాఫీ బోర్డులో 10 డిగ్రీలు, చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 14డిగ్రీలు, అరకులోయ కేంద్ర కాఫీబోర్డులో 14.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏజెన్సీవ్యాప్తంగా ఉదయం 10గంటల వరకు పొగమంచు దట్టంగా కురిసింది. సాయంత్రం నుంచే అన్ని వర్గాల ప్రజలు చలిమంటలను ఆశ్రయించారు. ఘాట్ ప్రాంతాల్లో చలి మరింత ఇబ్బంది పెడుతోంది.– సాక్షి, పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా) -
సీఎం చంద్రబాబుకు ఘోర అవమానం
అల్లూరి సీతారామరాజు, సాక్షి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఘోర అవమానం ఎదురైంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సంధ్యారాణి సోమవారం పర్యటించారు. అయితే.. మంత్రి సంధ్యారాణి పర్యటన సందర్భంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. టీడీపీ నేతలు ఏర్పాటుచేసిన ఆ ఫ్లెక్సీల్లో సీఎం చంద్రబాబు ఫొటో కనిపించకపోవటం గమనార్హం. అయితే మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫోటోలు పెట్టి.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటో పెట్టని వైనం కనిపించింది. దీంతో పాడేరులో ఫ్లెక్సీల ఏర్పాటు అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
పులివెందుల, పాడేరు మెడికల్ కాలేజీలకు అనుమతులు
సాక్షి, అమరావతి : వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో కొత్త వైద్య కళాశాలకు అనుమతులు రాకుండా సీఎం చంద్రబాబు ప్రభుత్వం మోకాలడ్డినప్పటికీ అనుమతులు రాక మానలేదు. 2024–25 విద్యా సంవత్సరానికి 50 ఎంబీబీఎస్ సీట్లతో అడ్మిషన్లు చేపట్టడానికి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అనుమతులు మంజూరు చేసింది. దీంతోపాటు పాడేరు వైద్య కళాశాలకు కూడా 50 సీట్లను మంజూరు చేశారు. వాస్తవానికి ఈ రెండు కళాశాలలతో పాటు, ఆదోని, మార్కాపురం, మదనపల్లె వైద్య కళాశాలల్లో ఒక్కోచోట 150 సీట్లతో తరగతులు ప్రారంభించాలని గత ప్రభుత్వంలోనే చర్యలు ప్రారంభించారు.అయితే, కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేసే ఉద్దేశ్యంతో చంద్రబాబు ప్రభుత్వం కావాలని అనుమతులు రాబట్టేలా చర్యలు తీసుకోలేదు. దీంతో తొలివిడత తనిఖీల అనంతరం ఐదుచోట్ల కొంతమేర వసతుల కొరత ఉన్నాయని ఎన్ఎంసీ అనుమతులు నిరాకరించింది. తొలివిడత తనిఖీల్లో తీసుకున్న నిర్ణయంపై అప్పీల్‌కు వెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం చివరి నిమిషంలో అధికారులకు అనుమతులిచ్చిప్పటికీ వసతుల కల్పన మాత్రం చేపట్టలేదు.దీంతో గత ప్రభుత్వంలో కల్పించిన వసతుల ఆ«ధారంగా వర్చువల్ ఇన్స్పెక్షన్ అనంతరం ప్రభుత్వం అండర్ టేకింగ్ ఇస్తే పులివెందులకు 50 సీట్లు మంజూరు చేస్తామని ఎన్ఎంసీ ప్రకటించింది. అయినప్పటికీ ప్రభుత్వం అండర్‌టేకింగ్ ఇవ్వలేదు. అండర్‌టేకింగ్ ఇవ్వకపోయినప్పటికీ ఎన్ఎంసీ అనుమతులు మంజూరుచేయడంతో వైద్యశాఖ అధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. -
పాడేరు మెడికల్ కాలేజీకి 50 ఎంబీబీఎస్ సీట్లు
సాక్షి, అమరావతి: 2024–25 విద్యా సంవత్సరానికి పాడేరు వైద్య కళాశాలలో 50 ఎంబీబీఎస్ సీట్లలో ప్రవేశాలకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కళాశాలకు మంగళవారం లెటర్ ఆఫ్ పర్మిషన్ (ఎల్ఓపీ) ఇస్తూ ఎన్ఎంసీ నుంచి సమాచారం అందింది. వాస్తవానికి ఈ విద్యా సంవత్సరంలో పాడేరుతో పాటు మదనపల్లె, మార్కాపురం, పులివెందుల ఆదోని కాలేజీల్లో ఒక్కో దానిలో 150 ఎంబీబీఎస్ సీట్లతో ప్రవేశాలు చేపట్టడానికి వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే చర్యలు ప్రారంభించారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడేవరకు ఆ కళాశాలల బోధనాస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది నియామకం, వనరుల కల్పనకు చర్యలు తీసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వం కొత్త వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో ఐదు కళాశాలలకు ఎన్ఎంసీ నుంచి అనుమతులు తెచ్చేందుకు ఏమాత్రం ప్రయత్నించలేదు. ఈ ఏడాది జూన్ నెల 24న కళాశాలలను ఎన్ఎంసీ బృందాలు తనిఖీ చేశాయి. కొంత మేర వనరుల కొరత ఉన్నందున తొలి విడతలో అనుమతులు నిరాకరించారు. కొరతను అధిగమిస్తే రెండో విడత తనిఖీలు చేసి అనుమతించే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకుండానే చివరి నిమిషంలో అప్పీల్‌కు వెళ్లారు. ఈ నేపథ్యంలో పులివెందుల, పాడేరు వైద్య కళాశాలల్లో ఎన్ఎంసీ వర్చువల్ ఇన్స్పెక్షన్ చేపట్టి, తొలి విడత తనిఖీల్లో ఉన్న పరిస్థితులే ఉన్నట్టు గుర్తించింది. ఉన్న వసతులతో ప్రభుత్వం అండర్‌టేకింగ్ ఇస్తే 50 సీట్లకు పులివెందుల కళాశాలకు అనుమతిస్తామని తెలిపింది. అయినా ప్రభుత్వం అండర్‌టేకింగ్ ఇవ్వలేదు. పాడేరు కళాశాల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం కూడా ఉండటంతో ఎన్ఎంసీ ఇక్కడ అండర్‌టేకింగ్ లేకుండానే ఎల్ఓపీ మంజూరు చేసినట్టు తెలిసింది. అయినా, 150 సీట్లు రావాల్సిన చోట అందులో మూడో వంతు సీట్లే మంజూరు అయ్యాయి. మిగిలిన నాలుగు వైద్య కళాశాలలకు అనుమతులపై ఇంకా సస్పెన్షన్ కొనసాగుతోంది. 2019–24 మధ్య రాష్ట్రంలో 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన వైఎస్ జగన్ ప్రభుత్వం 2023–24లో ఐదు కళాశాలలను ప్రారంభించి 750 ఎంబీబీఎస్ సీట్లను సమకూర్చింది. ఈ ఏడాది మరో ఐదు కళాశాలలకు అనుమతులు వచ్చి 750 సీట్లు సమకూరితే తమకు వైద్య విద్య అవకాశం లభిస్తుందని ఎందరో విద్యార్థులు, తల్లిదండ్రులు కోటి ఆశలు పెట్టుకున్నారు. అయినా కేంద్రంలో భాగస్వామిగా ఉండి కూడా ఈ విద్యా సంవత్సరం ఐదు కళాశాలల్లో వంద శాతం సీట్లను చంద్రబాబు ప్రభుత్వం రాబట్టలేక విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
15 మంది బాలికలకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
సాక్షి, పాడేరు: జిల్లాలోని డుంబ్రిగుడ మండలం జామిగుడ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో మరో 15 మంది గిరిజన బాలికలు ఆదివారం అస్వస్థతకు గురయ్యారు. వారికి ఆదివారం మధ్యాహ్నం వాంతులు, కడుపునొప్పితో పాటు జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలతో కనబడ్డాయి. కిల్లోగుడ వైద్య బృందం ప్రాథమిక వైద్యసేవలు అందించి, మెరుగైన వైద్యానికి హుటాహుటిన అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.అక్కడ వైద్యపరీక్షలు నిర్వహించడంతో వారు కోలుకుంటున్నారు. అనారోగ్య పరిస్థితులు తగ్గుముఖం పట్టాయని తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకుంటున్న సమయంలో మరో 15 మంది అస్వస్థతకు గురవడంతో మిగిలిన విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. మరో వైపు కలెక్టర్ దినేశ్‌కుమార్ ఆదేశాల మేరకు జామిగుడ ఆశ్రమ పాఠశాలలో నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీటి పంపిణీ చేపట్టారు.50 మంది విద్యార్థినులు డిశ్చార్జిరెండు రోజుల నుంచి అరకు ప్రాంతీయ ఆస్పత్రిలో వైద్యసేవలు పొందుతున్న జామిగుడ పాఠశాలకు చెందిన బాధిత విద్యార్థినులు 61 మందిలో 50 మంది కోలుకున్నారు. వారిని అంబులెన్స్‌ల్లో జామిగుడ ఆశ్రమ పాఠశాలకు తరలించారు. ఆదివారం ఆస్పత్రిలో చేరిన 15 మందితో కలిపి, మొత్తం 26 మంది గిరిజన విద్యార్థులు వైద్యుల వైద్యసేవలు, తల్లిదండ్రుల పర్యవేక్షణలో అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.నూజివీడు ట్రిపుల్ ఐటీ ఫుడ్ కాంట్రాక్టర్లపై క్రిమినల్ చర్యలుసాక్షి, అమరావతి : కలుషితాహారం ఘటనపై విచారణ కమిటీ సిఫారసుల మేరకు నూజివీడు ట్రిఫుల్ ఐటీలో ప్రస్తుతం కేటరింగ్ సేవలు అందిస్తున్న పైన్ క్యాటరింగ్ సర్వీసెస్, అనూష హాస్పిటాలిటీ సేవలను తక్షణమే రద్దు చేయడంతో పాటు బాధ్యులైన వారిపై క్రిమినల్ చర్యలకు విద్య, ఐటి శాఖ మంత్రి లోకేశ్ ఆదేశాలు జారీ చేశారు. ఆ సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా మరే ఇతర టెండర్లలో పాల్గొనకుండా బ్లాక్ లిస్టులో పెట్టాలని చెప్పారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు.కొత్త కాంట్రాక్టర్లను నియమించే వరకు విద్యార్థులందరికీ ఆహారాన్ని అందించడానికి తాత్కాలికంగా కేఎంకే క్యాటరింగ్ సేవలను ఉపయోగించుకోవాలని ట్రిపుల్ ఐటి అధికారులకు సూచించారు. ‘పెండింగ్‌లో ఉన్నఫుడ్ కోర్టు అద్దెను రెండు వారాల్లోగా ఏజెన్సీ నుంచి వసూలు చేయాలి. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బయటి ఆహారాన్ని క్యాంపస్‌లోకి అనుమతించొద్దు. ఫుడ్ కోర్టుకు సంబంధించిన కొత్త టెండర్ల ప్రక్రియను వారం రోజుల్లో ప్రారంభించాలి. అప్పటి వరకు ఫుడ్ చెయిన్ల నుంచి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి. -
చంద్రబాబుది అధర్మ యుద్ధం.. పాడేరు, అరకు నేతలతో సీఎం జగన్ భేటీ (ఫొటోలు)
-
జలదిగ్బంధంలో ఏజెన్సీ గ్రామాలు..
-
ఎగ్జిట్ పోల్స్ పై పాడేరు ఎమ్మెల్యే రియాక్షన్
-
నమ్మక ద్రోహులు..
నమ్మక ద్రోహం పేరు చెబితే అందరికీ గుర్తుకు వచ్చేది మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, మాజీ ఎంపీ కొత్తపల్లి గీత. వీరికి రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్సార్సీపీకి ద్రోహం చేసి పార్టీ ఫిరాయించారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రజలు వారికి బుద్ధిచెప్పారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసిన గిడ్డి ఈశ్వరి ఘోర పరాజయం పాలయ్యారు. ఈ ఎన్నికల్లో అత్యధికంగా గిరిజనులంతా వైఎస్సార్సీపీ వైపే నిలిచారు. మాజీ ఎంపీ కొత్తపల్లి గీతదీ అదే పరిస్థితి. ఎన్నికైన నాటి నుంచి ఆమె వైఎస్సార్సీపీ ఆశయాలకు తిలోదకాలిచ్చి.. ఆర్థికంగా ఎదిగేందుకు.. కేసుల్లోంచి బయటపడేందుకు ప్రాధాన్యమిచ్చారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రస్తుత ఎన్నికల బరిలో ఉన్న వీరికి గిరిజనులు మళ్లీ ఓటుతో బుద్ధి చెప్పనున్నారు.సాక్షి, పాడేరు: మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి.. మాజీ ఎంపీ కొత్తపల్లి గీత.. వీరు రాజకీయాలకు కొత్త అయినప్పటికీ ప్రజలకు సేవ చేసేందుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అవకాశం కలి ్పంచారు. 2014 ఎన్నికల్లో పాడేరు ఎమ్మెల్యేగా గెలుపొందిన గిడ్డి ఈశ్వరి, అరకు ఎంపీ కొత్తపల్లి గీత ఆర్థిక ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చి గిరిజనుల సమస్యలను పట్టించుకోలేదు. వ్యక్తిగత ఎదుగుదలను ఆశించిన వీరు రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్సార్సీపీకి నమ్మక ద్రోహం చేసి పార్టీ ఫిరాయించారు. ఆ తరువాత 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున పాడేరు అసెంబ్లీకి పోటీ చేసిన గిడ్డి ఈశ్వరి ఘోర పరాజయం పాలయ్యారు. ఈఎన్నికల్లో గిరిజను లు ఓటుతో తగిన గుణపాఠం చెప్పి తాము జగనన్న వెంటే ఉన్నామని మళ్లీ నిరూపించారు. ‘గిడ్డి’ చేరికతో గ్రూపుల మయం మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి టీడీపీలో చేరికతో పాడేరు అసెంబ్లీలో ఆ పార్టీ గ్రూపులుగా విడిపోయింది. ఆది నుంచి పారీ్టలో ఉన్నవారిని పక్కనబెట్టి స్వార్థ రాజకీయాలకు ఆమె తెరలేపారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీంతో సీనియర్లంతా ఆమె నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఆమెకు మద్దతు ఇచ్చేది లేదని ఇప్పటికే వారంతా బహిరంగంగా ప్రకటించడంతో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు ప్యాకేజీ..ప్రలోభాలకు లోనై వైఎస్సార్సీపీని వీడారని అప్పట్లో ఆమెపై జోరుగా ప్రచారం సాగింది. రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్సార్సీపీకి నమ్మక ద్రోహం చేయడం.. టీడీపీలో సీనియర్లకు ఝలక్ ఇవ్వడం వంటి అంశాలు ఈ ఎన్నికల్లో ఆమెకు నష్టం చేయవచ్చని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు తల నరుకుతానని హెచ్చరిక వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఫొటోతో 2014లో పాడేరు ఎమ్మెల్యేగా గెలిచిన గిడ్డి ఈశ్వరి వైఎస్సార్సీపీకి ద్రోహం చేశారు. 2015లో బాక్సైట్ వ్యతిరేక పోరాటంలో భాగంగా ఆమె చింతపల్లి వద్ద అప్పటి సీఎం చంద్రబాబు తల నరుకుతానని హెచ్చరించడం అప్పటిలో సంచలనమైంది. తరువాత ఆమె అదే పార్టీలో చేరడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ► ఆర్థిక, రాజకీయ అవసరాలకు తలొగ్గిన ఈశ్వరి 2017 నవంబర్‌లో టీడీపీలో చేరారు. టీడీపీ ప్రభుత్వంలో రాజకీయంగా లబ్ధి పొందినప్పటికీ గిరిజనుల ఆదరణ కోల్పోయారు. ఈ పరిస్థితుల్లో 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసిన ఆమె వైఎస్సార్సీపీ అభ్యర్థి కొట్టగుళ్లి భాగ్యలక్షి్మకి పోటీ ఇవ్వలేకపోయారు. కేసు నుంచి తప్పించుకునేందుకు.. అరకు మాజీ ఎంపీ, ప్రస్తుత బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత 2014 ఎన్నికల తరువాత నకిలీ ఎస్టీ కేసును ఎదుర్కొన్నారు. ఎస్టీలోని వాలీ్మకి కులస్తురాలని వైఎస్సార్సీపీని నమ్మించి 2014లో అరకు పార్లమెంట్ సీటు పొందారు. పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి నాయకత్వంపై నమ్మకంతో గిరిజనులు ఆమెను 91,398 ఓట్ల భారీ మెజారిటీతో గెలిపించారు. ఆ ఎన్నికల్లో ఓటమి చెందిన టీడీపీ అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి అరకు ఎంపీ గీత ఎస్టీ కాదని ఆమెపై కోర్టులో కేసు వేశారు. ఆమె ఎస్టీ కాదని, నకిలీ ధ్రువపత్రంతో చదువులు, ఉద్యోగం, పదవులను అక్రమంగా అనుభవించారని ఆధారాలు చూపిస్తూ సంధ్యారాణి విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఆమె 2015లో టీడీపీకి చేరువైంది. ఈమెపై కోర్టులో కేసు పెట్టిన సంధ్యారాణి ఉపసంహరించుకున్నారు. కేసునుంచి బయట పడేందుకే టీడీపీతో చేతులు కలిపారన్న విమర్శలను ఆమె ఎదుర్కొన్నారు. బ్యాంక్నుమోసగించారని.. ► పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను మోసగించిన కేసులో భర్తతోపాటు ఆమెకు సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా విధించింది. దీనిపై హైకోర్టును ఆశ్రయించి బెయిల్ పొందారు. బ్యాంకును మోసగించి రూ.42 కోట్ల మేర రుణం పొందారన్నది వారిపై అభియోగం. ► తెలంగాణలోని రాయదుర్గం సమీపంలో వందెకరాల భూవివాదంలో ఆమె పాత్రపై కేసు నడుస్తోంది. గిరిజన సంక్షేమానికి దూరంకొత్తపల్లి గీత ఎంపీగా ఉన్న సమయంలో అరకు పార్లమెంట్ పరిధిలోని గిరిజనుల సంక్షేమాన్ని విస్మరించారు. ఓట్లు వేసి గెలిపించిన గిరిజనులకు కూడా ద్రోహం చేశారు. టీడీపీతో అవసరం తీరాక సొంతంగా జన జాగృతి పేరుతో పార్టీని పెట్టారు. 2019లో విశాఖ ఎంపీ స్థానానికి పోటీచేసిన ఆమె ఘోర పరాజయం పాలయ్యారు. కేవలం 1500 లోపు మాత్రమే ఓట్లు వచ్చాయి. ఆ తరువాత ఈ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకున్న ఆమె వారి సహకారంతో బీజేపీ నేతగా మారారు. ఇప్పుడు అరకు ఎంపీ అభ్యర్థిగా ఆ పారీ తరఫున బరిలో ఉన్నారు. టీడీపీ వ్యవహారాల్లో కూడా ఆమె తలదూర్చుతున్నారని ప్రచారం జరుగుతుండటంతో ఆ పార్టీ శ్రేణులు రగిలిపోతున్నాయి. పాడేరు, అరకు నియోజకవర్గాల్లో టీడీపీ ముఖ్య నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్సార్సీపీకి ద్రోహం చేసిన వీరి పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగానే ఉంది. మళ్లీ గతంలో మాదిరిగా అదే ఫలితం ఎదురుకానుంది. -
ఇచ్చిన హామీని నెరవేర్చిన సీఎం వైఎస్ జగన్
-
పాడేరు మెడికల్ కాలేజీ.. సిద్ధం
గిరిజనుల జీవన ప్రమాణాలు పూర్తిస్థాయిలో పరిపుష్టం చేసేందుకు ప్రభుత్వం శరవేగంగా చర్యలు తీసుకుంటోంది. పాడేరులో నిర్మిస్తున్న వైద్య కళాశాల పనులు ఓ వైపు వేగంగా పూర్తి చేస్తుండడంతో పాటు, ఆ స్థాయి వైద్య సేవలను ముందుగానే అందుబాటులోకి తెస్తోంది. సాక్షి,పాడేరు: గిరిజనులకు ఉన్నత వైద్యసేవలు కల్పించడం లక్ష్యంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రతిపక్ష నేత హోదాలో ఆయన పాడేరులో మెడికల్ కళాశాలను నిర్మిస్తామని హమీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే రూ.500కోట్లతో పాడేరులో మెడికల్ కళాశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.ప్రస్తుతం 35ఎకరాల విస్తీర్ణంలో తలారిసింగి పాలి టెక్నిక్ కళాశాల ప్రాంగణంలో మెడికల్ కళాశాల,సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి,నర్సింగ్ కళాశాల భవన నిర్మాణాలు పూర్తి కావచ్చాయి. ఈఏడాదిలో మొత్తం అన్ని భవనాలను పూర్తి చేసే లక్ష్యంతో ఎన్సీసీ నిర్మాణ సంస్థ చురుగ్గా పనులు నిర్వహిస్తోంది. జిల్లా జనరల్ ఆస్పత్రిగా పేరుమార్పు వైద్య విధాన పరిషత్‌లో ఇంతవరకు పనిచేసిన పాడేరు జిల్లా ఆస్పత్రిని ప్రభుత్వం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌లో ఇటీవల విలీనం చేసి జిల్లా జనరల్ ఆస్పత్రిగా పేరు మార్చారు. మెడికల్ కళాశాల నిర్మాణ పనులు పూర్తయ్యేందుకు ఇంకా గడువు ఉండడంతో ముందస్తుగానే పాడేరు జిల్లా జనరల్ ఆస్ప త్రిలో 420 బెడ్లలో రోగులకు 24గంటల పాటు ఉన్నత వైద్యసేవలకుచర్యలు చేపట్టింది. పాడేరు జిల్లా ఆస్పత్రిలో అదనపు అంతస్తును యుద్ధప్రాతిపదికన ఇటీవల పూర్తి చేసి, అన్ని సదుపాయాలతో పడకలను అందుబాటులోకి తెచ్చింది. వీటిలో 50 ప్రత్యేకంగా గర్భిణులకు, మరో 50 మాతా శిశువుల ఆరోగ్యసేవలకు, 50 పడకలు రక్తహీనత సమస్య ఉన్న మహిళా రోగులకు కేటాయించనున్నారు. జాతీయ వైద్యమండలి పరిశీలనకు ఏర్పాట్లు జిల్లా జనరల్ ఆస్పత్రిలో అందుబాటులోకి తెచ్చిన 420 బెడ్లు,ఇతర సౌకర్యాలు,వైద్య నిపుణులు,అందించే సేవలను సమగ్రంగా పరిశీలించేందుకు జాతీయ వైద్య మండలి పర్యటించనుంది. ఈ మండలి పరిశీలన తరువాత మెడికల్ కళాశాలకు అనుబంధంగా జిల్లా జనరల్ ఆస్పత్రి సేవలు పూర్తిస్థాయిలో ప్రారంభం కానున్నాయి. 256 పోస్టుల భర్తీకి చర్యలు మెడికల్ కళాశాల,అనుబంధ జిల్లా జనరల్ ఆస్పత్రులకు సంబంధించి వివిధ విభాగాల్లో 706 పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ముందుగా 256 పోస్టుల భర్తీని కలెక్టర్ అధ్యక్షతన కమిటీ వేగవంతం చేసింది. మిగిలిన వైద్యులు,నర్సింగ్,ఇతర విభాగాల పోస్టులకు వైద్య ఆరోగ్యశాఖ త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనుంది. విధుల్లో వైద్య నిపుణులు పాడేరు మెడికల్ కళాశాల,అనుబంధ జిల్లా జనరల్ ఆస్పత్రి ద్వారా జిల్లా ప్రజలకు నిరంతర ఉన్నత వైద్యసేవలు అందించే లక్ష్యంతో ముందస్తుగానే ప్రభుత్వం వైద్యులను నియమించింది. పాడేరు మెడికల్ కళాశాలలో ప్రిన్సిపాల్‌తో పాటు నలుగురు అసోసియేట్ ప్రొఫెసర్లు, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫె సర్లు, 17మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. రోగులకు ఉన్నత వైద్యసేవలు రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాల,అనుబంధ జిల్లా జనరల్ ఆస్పత్రి ద్వారా ఉన్నత వైద్యసేవలు అందించే లక్ష్యంతో చర్యలు తీసుకుంటోంది. భవనాల నిర్మాణాలతో సంబంధం లేకుండా 420 పడకలతో జిల్లా జనరల్ ఆస్పత్రిలో అన్ని వైద్యసేవలను అందుబాటులోకి తెచ్చాం. అన్ని విభాగాల వైద్యపోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. – డాక్టర్ డి.హేమలతాదేవి, ప్రిన్సిపాల్,పాడేరు మెడికల్ కళాశాల -
చింతపల్లిని వణికిస్తున్న చలిపులి
సాక్షి, పాడేరు(అల్లూరి సీతారామరాజు జిల్లా): జిల్లాలోని ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టడంతో చలి తీవ్రత పెరిగింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అరకులోయ, చింతపల్లిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురువారం చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 7 డిగ్రీలు, అరకులోయ కేంద్ర కాఫీ బోర్డులో 8.3 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రోజుల వ్యవధిలోనే భారీగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చలి తీవ్రత పెరగడంతో గిరిజనులు వణికిపోయారు. పాడేరు మండలం మినుములూరులో 11డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏజెన్సీ అంతటా పొగమంచు దట్టంగా కురుస్తోంది. ఉదయం 10 గంటలకు కూడా మంచు తెరలు అలుముకుంటున్నాయి. చింతపల్లితో పాటు లంబసింగి, గూడెంకొత్తవీధి ప్రాంతాల్లో ప్రయాణికులు కూడా చలి తీవ్రతకు ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి చలిగాలులు వీస్తుండటంతో ప్రజలు చలిమంటలను ఆశ్రయిస్తున్నారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ ఎడ్యుకేషన్..ఘనత మన సీఎం జగన్ దే
-
చింతపల్లిలో 11, అరకులో 12.3 డిగ్రీలు
సాక్షి,పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా పొగమంచు దట్టంగా కురుస్తోంది. ఉదయం 9 గంటల వరకు పాడేరు, చింతపల్లి, అరకులోయ ప్రాంతాల్లో మంచుతెరలు వీడటంలేదు. ఘాట్ ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కారణంగా లైట్ల వెలుగులో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఉష్ణోగ్రతలూ రోజురోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి. చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో శనివారం 15.5 డిగ్రీలు నమోదు కాగా ఆదివారం 4.5 డిగ్రీలు తగ్గి 11 డిగ్రీలు నమోదైంది. అరకులోయ కేంద్ర కాఫీ బోర్డులో 12.3 డిగ్రీలు, పాడేరు మండలంలోని మినుములూరు కేంద్ర కాఫీ బోర్డు వద్ద 13 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు కాఫీబోర్డు వర్గాలు తెలిపాయి. ఆయా ప్రాంతాల్లో సాయంత్రం నుంచి చలిగాలులు విజృంభిస్తున్నాయి. మంచు అందాలకు ఫిదా... జిల్లా వ్యాప్తంగా చలిగాలుల తీవ్రత ఉన్నప్పటికీ మంచు అందాలను తిలకించేందుకు పర్యాటకులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పర్యాటకులు భారీగా తరలివచ్చి అందాలను వీక్షిస్తూ పరవశిస్తున్నారు. మారేడుమిల్లి ప్రాంతంలోని గుడిసె, చింతపల్లి మండలంలోని లంబసింగిలోని చెరువులవెనం, పాడేరు మండలంలోని వంజంగి హిల్స్, హుకుంపేట మండలంలోని సీతమ్మకొండ, అరకులోయ మండలంలోని మాడగడ హిల్స్ ప్రాంతాలకు వేకువజామునే చేరుకుని పొగమంచు, సూర్యోదయం, మేఘాల అందాలను వీక్షిస్తున్నారు. -
పాడేరులో బస్సు ప్రమాదం
సాక్షి, పాడేరు, పాడేరు రూరల్, సాక్షి, అమరావతి, నెట్వర్క్: విశాఖ నుంచి పాడేరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఘాట్ రోడ్డులో అదుపుతప్పి లోయలోకి దూసుకుపోయిన ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. మరో 28 మందికి గాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి గుడివాడ అమర్నాథ్ అక్కడకు చేరుకున్నారు. ఆర్టీసీ, పోలీస్ శాఖ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని సీఎం జగన్ ఆదేశించారని తెలిపారు. శాశ్వత అంగవైకల్యం పొందిన వారికి రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున పరిహారం అందజేస్తామన్నారు. పాడేరు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి పరామర్శించారు. అత్యవసర వైద్యం అవసరమైతే విశాఖ కేజీహెచ్ లేదా కార్పొరేట్ ఆస్పత్రులకు తరలించాలని, క్షతగాత్రులు పూర్తిగా కోలుకునే వరకు వైద్య సాయం అందించాలని స్పష్టం చేశారు. పాడేరు ఘాట్‌లో ప్రమాదాలు నివారించేందుకు రవాణ శాఖ అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామన్నారు. ఎలా జరిగింది..? మధ్యాహ్నం 12 గంటల సమయంలో విశాఖ కాంప్లెక్స్ నుంచి ఆర్టీసీ బస్సు(ఏపీ 31జెడ్ 0285) పాడేరుకు బయలుదేరింది. ఈ క్రమంలో చోడవరంలో కొంతమంది ప్రయాణికులు ఎక్కారు. మొత్తం 34 మంది ప్రయాణికులతో బస్సు వెళుతోంది. పాడేరుకు 12 కిలోమీటర్ల దూరంలో ఘాట్‌లోని వ్యూపాయింట్ వద్ద మలుపులో రోడ్డు పక్కన చెట్టు కొమ్మలను తప్పించే ప్రయత్నంలో బస్సు అదుపు తప్పింది. రక్షణ గోడను ఢీకొట్టి వందడుగుల లోయలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం సూర్రెడ్డిపాలెంకు చెందిన నరవ నారాయణమ్మ(50), అల్లూరి జల్లా పాడేరు మండలం జి.కొత్తూరు గ్రామానికి చెందిన గిరిజనుడు సీసా కొండన్న(55) తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద ఘటనను ప్రత్యక్షంగా చూసిన ద్విచక్రవాహనదారులు గడ్డంగి రమేష్, ఆనంద్, కారులో వెళ్తున్న టి.శేషగిరి లోయలోకి దిగి బాధితులను కాపాడారు. గాయాలపాలైన వారిన రోడ్డుపైకి మోసుకొచ్చి 108 సాయంతో పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. లోయలో బస్సు కింద పడి ఉన్న మృతదేహాలను బయటకు తీసేందుకు సీఐ సుధాకర్, ఎస్ఐ రంజిత్, స్థానికులంతా ఎంతో శ్రమించారు. కలెక్టర్ సుమిత్‌కుమార్ జిల్లా ఆస్పత్రిని సందర్శించి బాధితులను పరామర్శించారు. మెడికవర్‌కు తరలింపు క్షతగాత్రుల్లో కొందరిని మెరుగైన వైద్యం కోసం రాత్రి విశాఖలోని మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో రోలుగుంట మండలం యర్రవరం గ్రామానికి చెందిన ఒకే కుటుంబ సభ్యులు కిల్లో బోడిరాజు (39), బొట్ట చిన్నమ్ములు (48), బొట్ట దుర్గాభవాణి (14), బొట్ట రామన్న (14), సామర్ల బాబురావు (50) ఉన్నారు. ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు. చిన్నమ్ములుకు తీవ్రగాయాలైనట్లు వైద్యులు వెల్లడించారు. ఆమె తలకు బలమైన గాయం కావడంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. మనవడు, మనవరాలిని చూసేందుకు వెళ్లి.. బస్సు ప్రమాదంలో అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం సూరెడ్డిపాలేనికి చెందిన నారాయణమ్మ మృతి చెందడంతో గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి. అనారోగ్యంతో ఉన్న తమ మనవడు, మనవరాలిని చూసేందుకు ఈశ్వరరావు, నారాయణమ్మ దంపతులు ఉదయం 10 గంటల సమయంలో సబ్బవరం వద్ద బస్సు ఎక్కారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కోడలికి ఫోన్ చేసి దారిలో ఉన్నట్లు చెప్పారు. అంతలో ప్రమాదం జరగడంతో నారాయణమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. కళ్ల ముందే భార్య చనిపోవడంతో ఈశ్వరరావు గుండెలవిసేలా రోదించారు. ఆయనకు స్వల్ప గాయాలు కావడంతో పాడేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. తల్లి మృతి చెందిన వార్త తెలియటంతో కుమారులు ప్రసాద్, అర్జునరావు, వెంకట రమణ విషాదంలో కూరుకుపోయారు. చెట్టును తప్పించబోయి.. ‘వంజంగి కాంతమ్మ వ్యూ పాయింట్’ వద్ద రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న చెట్టు పక్క నుంచి బస్సును పోనిచ్చే క్రమంలో డ్రైవర్ అంచనా తప్పింది. బస్సు రోడ్డు అంచు వరకు వెళ్లడంతో వెనుక చక్రాలు రక్షణ గోడను దాటి లోయవైపు జారిపోవడం అంతా క్షణాల్లో జరిగిపోయింది. ఆ సమయంలో నేను పాడేరు నుంచి బైకుపై ఘాట్ రోడ్డులో దిగువకు వస్తున్నా. ఎదురుగా బస్సును చూసి బైకు పక్కకు తీసి ఆపా. చెట్టును దాటుకుని వస్తుందనుకున్న బస్సు ఒక్కసారిగా లోయలోకి జారిపోవటాన్ని చూసి చేష్టలుడిగిపోయా! రోడ్డు అంచుకు పరిగెత్తుకుని వెళ్లాం. అన్నీ పరిమి డొంకలు కావడంతో కిందకు వెళ్లడానికి అవకాశం లేదు. తుప్పల్లో పడిపోయి ఒకరు చనిపోగా.. బస్సులో మరొకరు మృతి చెందారు. గాయాలతో బయట పడ్డ వారిని అంతా కలసి 108, ఇతర వాహనాల్లో పాడేరు ఆస్పత్రికి తరలించాం. బస్సులో ఆర్నెళ్ల చిన్నారి కూడా ఉంది. కళ్ల ముందే లోయలోకి.. మైదాన ప్రాంతానికి కారులో వెళుతున్నాం. మా కళ్ల ముందే ఆర్టీసీ బస్సు లోయలోకి దూసుకుపోయింది. లోయలోకి దిగి తీవ్ర గాయాల పాలైన ప్రయాణికులను రోడ్డుపైకి మోసుకొచ్చాం. అదే దారిలో వస్తున్న కొందరు వాహనదారులు మాకు సహాయపడ్డారు. ఇద్దరు వృద్ధులు చనిపోయారు. పోలీసులకు సమాచారం అందించి అంబులెన్స్‌లు, 108 వాహనాల్లో గాయపడిన వారిని పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించాం. – ప్రత్యక్ష సాక్షులు గడ్డంగి రమేష్‌బాబు, పూజారి ఆనంద్, శేషగిరి చెట్టు కొమ్మను తప్పించబోయి.. ఘాట్‌లో బస్సును నెమ్మదిగా నడుపుతున్నా. మలుపులో రోడ్డు పక్కన ప్రమాదకరంగా ఉన్న చెట్టు కొమ్మను తప్పించబోయే క్రమంలో బస్సు అదుపు తప్పింది. అదే సమయంలో ఓ బైక్ ఎదురుగా రావడంతో బస్సు లోయలోకి దూసుకుపోయింది. చెట్టు అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దిగువ రోడ్డులో బస్సు బోల్తా కొట్టి ఉంటే ప్రాణనష్టం అధికంగా ఉండేది. ఇద్దరు ప్రయాణికులు మృతి చెందడం, అనేకమంది గాయపడడం ఎంతో బాధగా ఉంది. –కిముడు సత్తిబాబు, బస్సు డ్రైవర్ ఆ చిన్నారి మృత్యుంజయురాలు.. పాడేరు ఘాట్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో నెలల వయసున్న ఓ శిశువు సురక్షితంగా బయటపడింది. డుంబ్రిగుడ మండలం తూటంగి గ్రామానికి చెందిన తాంగుల జ్యోతి, సత్యనారాయణ దంపతులకు నాలుగు నెలల క్రితం శిశువు జన్మించింది. ప్రస్తుతం వీరు విశాఖలో ఉంటున్నారు. పాడేరు మండలం పి.గొందూరులో తమ బంధువుల ఇంటికి వచ్చేందుకు విశాఖలో బస్సెక్కారు. ప్రమాదంలో తల్లి జ్యోతి తన బిడ్డకు ఎలాంటి గాయాలు కాకుండా కాపాడుకుంది. ఆమె తలకు మాత్రం తీవ్ర గాయమైంది. క్షతగాత్రులలో కొందరి వివరాలు.. అల్లూరి జిల్లా చింతపల్లి మండలం కోటగున్నలకు చెందిన పాంగి సింహాద్రి, హుకుంపేట మండలం ఇసుకగరువుకు చెందిన వంతాల కోటిబాబు, అడ్డుమండకు చెందిన వంచంగిబోయిన రవిబాబు, పాడేరు మండలం దిగుమోదాపుట్టుకు చెందిన కిరసాని వెంకటేష్, కించూరు పంచాయతీ దోనెలకు చెందిన కోడా పద్మ, కిండంగి గ్రామానికి చెందిన జంబు మాధవి, డోకులూరు పంచాయతీ మండిపుట్టుకు చెందిన బోయిన నాగేశ్వరరావు, గెడ్డంపుట్టుకు చెందిన చల్లా పెంటమ్మ, జి.మాడుగుల మండలం గెమ్మెలి పంచాయతీకి చెందిన పి.చిట్టిబాబు, అనకాపల్లి జిల్లా వి.మాడుగుల మండలం లోవ కృష్ణాపురం గ్రామానికి చెందిన కిముడు సత్తిబాబు, చింతపల్లి మండలం కోటగున్నల గ్రామానికి చెందిన పాంగి సింహాద్రి, గెమ్మెలి నగేష్, హుకుంపేట మండలం రంగశీల పంచాయతీ ఒంటిపాకకు చెందిన బంటు రఘునాథ్, అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం సూరెడ్డిపాలేనికి చెందిన నరవ ఈశ్వరరావు, నాతవరం మండలం యర్రవరంలోని ఒకే కుటుంబానికి చెందిన బొట్టా చిన్నమ్మలు, బొట్టా నర్శింహమూర్తి, బొట్టా దుర్గాభవాని, బొట్టా రమణ, ముంచంగిపుట్టు మండలం సొనియాపుట్టుకు చెందిన కిల్లో బొదినేష్, హుకుంపేట మండలం భీమవరం పంచాయతీ గంగరాజుపుట్టు గ్రామానికి చెందిన కొర్రా బొంజుబాబు, ముంచంగిపుట్టు మండలం కిలగాడకు చెందిన సమల లక్ష్మీకాంత్. -
బస్సు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా
సాక్షి, అమరావతి: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అల్లూరి జిల్లా, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా కలెక్టర్లు, ఆయా జిల్లాల పోలీసు యంత్రాంగానికి సీఎం ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలంటూ అధికారులను సీఎం ఆదేశించారు. ఘటనకు దారితీసిన కారణాలపై అధికారులు దృష్టిసారించాలని సీఎం పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. కాగా, పాడేరు ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 100 అడుగుల లోయలో ఆర్టీసీ బస్సు పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. చెట్టు కొమ్మను తప్పించబోయి లోయలో పడింది. ఘాట్ రోడ్డు వ్యూ పాయింట్ దగ్గర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. చోడవరం నుంచి పాడేరు వెళ్తుండగా ఘటన జరిగింది. చదవండి: మార్గదర్శి మోసాలు.. సంచలనాలు మరిన్ని వెలుగులోకి -
పాడేరు ఘాట్ రోడ్డులో ప్రమాదం.. లోయలో పడ్డ ఆర్టీసీ బస్సు
సాక్షి, అల్లూరి సీతారామరాజు జిల్లా: పాడేరు ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 100 అడుగుల లోయలో ఆర్టీసీ బస్సు పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. మలుపులో వేగంగా వస్తున్న బైక్‌ను తప్పించే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. పిట్టగోడను ఢీ కొట్టి బస్సు లోయలోకి దూసుకుపోయింది. ఘాట్ రోడ్డు వ్యూ పాయింట్ దగ్గర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. చోడవరం నుంచి పాడేరు వెళ్తుండగా ఘటన జరిగింది. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చదవండి: నా భర్త సంసారానికి పనికిరాడు.. పెళ్లయి రెండేళ్లయినా.. -
సి‘కిల్’ సెల్‌పై సర్కారు యుద్ధం
సాక్షి, పాడేరు: సికిల్ సెల్ అనీమియా.. తలసేమియా. ఈ వ్యాధుల మధ్య స్వల్ప వ్యత్యాసాలున్నా రెండూ అత్యంత ప్రమాదకరమైనవే. ఇవి శరీరంలో ఎర్ర రక్త కణాలను ప్రభావితం చేసి రక్తహీనతను కలిగించే వారసత్వ రుగ్మతలే. వీటితో ఎక్కువగా గిరిజనులు బాధపడుతుంటారు. చికిత్స లేని ఈ వ్యాధుల నుంచి గిరిజనులను రక్షించేందుకు.. జీవిత కాలమంతా పూర్తి ఆరోగ్యంతో బతికేలా చర్యలు చేపట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక కార్యక్రమానికి సోమవారం శ్రీకారం చుట్టారు. ఆయన ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అల్లూరి జిల్లా పాడేరులో ‘రుధిర రక్షణ’ యజ్ఞాన్ని ప్రారంభించింది. సికిల్ సెల్, తలసేమియా మరణాల నుంచి గిరిజనుల్ని రక్షించేందుకు పెద్ద యుద్ధమే తలపెట్టింది. ఏమిటీ.. సికిల్ సెల్! సికిల్ సెల్ అనీమియా అనేది వంశపారంపర్య వ్యాధులలో ఒకటి. ఇది ఎర్ర రక్త కణాల నిర్మాణంపై ప్రభావం చూపుతుంది. ఎర్ర రక్త కణాలు సాధారణంగా గోళాకారంలో రక్తనాళాల నుంచి సులభంగా వెళ్లేలా ఉంటాయి. సికిల్ సెల్ అనీమియాలో కొన్ని ఎర్ర రక్త కణాలు సికిల్స్ (కొడవలి) లేదా చంద్రవంక ఆకారంలో తయారవుతాయి. ఇవి రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటాయి. నిజానికి శరీరంలోని వివిధ అవయవాలకు రక్తం ద్వారానే ఆక్సిజన్ అందుతుంది. సికిల్ సెల్స్ రక్తప్రవాహాని అడ్డుకోవడం వల్ల ఆవయవాలకు ఆక్సిజన అందక సమస్యలు తలెత్తి మరణానికి దారి తీసే ప్రమాదం ఉంది. సాధారణంగా ఎప్పటికప్పుడు పుట్టే ఎర్ర రక్త కణాలు 120 రోజుల వరకు జీవిస్తాయి. కానీ.. సికిల్ సెల్ రక్త కణాలు మాత్రం పుట్టిన 10 నుంచి 20 రోజులకే మరణిస్తాయి. అందువల్ల ఈ రుగ్మత ఉన్నవారికి రక్తహీనత తలెత్తి ప్రాణాపాయానికి దారి తీస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందంటే.. రాష్ట్రంలో సికిల్ సెల్, తలసేమియా బారిన పడిన వారికి ప్రభుత్వం నెలకు రూ.10 వేల చొప్పున ఇప్పటికే పింఛన్లను పంపిణీ చేస్తోంది. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, నంద్యాల, ప్రకాశం, పల్నాడు, శ్రీకాకుళం, ఏలూరు జిల్లాల పరిధిలో 19 లక్షల 90 వేల 277 మంది సికిల్ సెల్, తలసేమియా బాధితులు ఉన్నట్టు ప్రభుత్వం అంచనా వేసింది. వీరందరికీ వ్యాధి నిర్థారణ పరీక్షలు చేసేందుకు చర్యలు చేపట్టింది. నిర్థారణ అయితే.. సికిల్ సెల్ పాజిటివ్‌గా నిర్థారణ అయితే వారికి ఉచితంగా కౌన్సెలింగ్, మందులను ప్రభుత్వం సమకూరుస్తుంది. 2047 కల్లా రాష్ట్రంలో సికిల్‌సెల్ లేకుండా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రంలో ఐదు చోట్ల ఇంటిగ్రేటెడ్ సెంటర్స్ ఫర్ హిమోగ్లోబినోపాథిస్ పరీక్షల ప్రయోగశాలను సీఎం జగన్ ఏర్పాటు చేశారు. పాడేరు జిల్లా ఆస్పత్రి, విశాఖలోని కేజీహెచ్, కాకినాడ, గుంటూరు, కర్నూలు పట్టణాల్లోని టీచింగ్ ఆస్పత్రుల్లో ఈ ల్యాబ్‌లను అభివృద్ధి చేశారు. చదవండి: మార్గదర్శి’లాంటి స్కాం ఇప్పటివరకు జరగలేదు -
పాడేరు–లంబసింగి రహదారికి పచ్చజెండా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో రెండు రహదారులు, ఒక రోడ్ ఓవర్ బ్రిడ్జ్ (ఆర్వోబీ) నిర్మాణానికి జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పాడేరు–లంబసింగి రహదారి నిర్మాణానికి ఆమోదముద్ర వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దాంతోపాటు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సీతారాంపురం–దుత్తలూరు రహదారితోపాటు ఓ ఆర్వోబీ నిర్మాణానికి ఆమోద ముద్ర వేసింది. ఈ మూడు ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.545 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లను ఖరారు చేసింది. దుత్తలూరు రోడ్డుకు రూ.267 కోట్లు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో సీతారామపురం నుంచి దుత్తలూరు వరకు 36.40 కి.మీ. మేర పావడ్ సోల్డర్స్‌తో రెండు లేన్ల రహదారి నిర్మాణానికి ఎన్హెచ్ఏఐ నిర్ణయించింది. అందుకోసం రూ.267 కోట్లతో టెండర్ల ప్రక్రియను ఖరారు చేసింది. అన్నమయ్య జిల్లా మదనపల్లి సమీపంలోని చిన్నతిప్ప సముద్రం సమీపంలోని రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద ఆర్వోబీ నిర్మాణానికి ఎన్హెచ్ఏఐ నిర్ణయించింది. సేతు భారతం ప్రాజెక్ట్ కింద ఈ రెండు లేన్ల ఆర్వోబీ నిర్మాణానికి రూ.72.50 కోట్లతో టెండర్లను ఖరారు చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యాటక ప్రాంతాలను అనుసంధానిస్తూ రహదారులను విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. అందులో భాగంగా ఇప్పటికే రాజమహేంద్రవరం నుంచి రంపచోడవరం మీదుగా అరకుకు నాలుగు లేన్ల రహదారి నిర్మిస్తున్నారు. మరోవైపు జిల్లా కేంద్రం పాడేరు నుంచి లంబసింగికి కూడా రహదారి నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆంధ్రా కశ్మిర్‌గా గుర్తింపు పొందిన లంబసింగిని పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చేయవచ్చన్నది ప్రభుత్వ ఉద్దేశం. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం పాడేరు–లంబసింగి మధ్య 48 కి.మీ. మేర పావడ్ సోల్డర్స్‌తో రెండు లేన్ల రహదారిని నిర్మించాలని నిర్ణయించింది. అందుకోసం రూ.206 కోట్లతో టెండర్ల ప్రక్రియను ఇటీవల ఖరారు చేసింది. త్వరలోనే పనులు ప్రారంభించి 2024 మార్చి కల్లా పూర్తి చేయాలని ఎన్హెచ్ఏఐ భావిస్తోంది. -
హైస్పీడ్‌లో వైఎస్సార్ మెడికల్ కాలేజ్ నిర్మాణం.. టార్గెట్ డిసెంబర్..!
సాక్షి, పాడేరు: జిల్లా కేంద్రమైన పాడేరులో చేపట్టిన డాక్టర్ వైఎస్సార్ వైద్య కళాశాల నిర్మాణ పనులు జోరందుకున్నాయి. ఇప్పటికే అన్ని విభాగాలకు సంబంధించి 25 శాతం పనులు పూర్తయ్యాయి. ఇందుకు సుమారు రూ.70 కోట్లు వెచ్చించారు. ఎన్సీసీ నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరుకు పూర్తిచేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. చలిగాలులను తట్టుకుంటూనే సుమారు 500 మంది వరకు కూలీలు శ్రమిస్తున్నారు. స్థానిక తలారిసింగి ప్రభుత్వ ఆదర్శ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంతంలో సుమారు 35 ఎకరాల విస్తీర్ణంలో రూ.500 కోట్లతో చేపట్టిన నిర్మాణ పనులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించడం తెలిసిందే. ఈ నిధుల్లో సగం కేంద్ర ప్రభుత్వం వెచ్చిస్తోంది. మూడు బ్లాక్‌ల్లో పనుల జోరు మెడికల్ కళాశాల నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.ఇక్కడ పనులపై సీఎం జగన్మోహన్రెడ్డి, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు స్థానిక అధికారులతో సమీక్షిస్తుంటారు. ప్రస్తుతం మెడికల్ కళాశాలకు సంబంధించి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి భవన నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి.ఈ బ్లాక్‌లోని పలు భవన నిర్మాణాలు మూడవ అంతస్తుకు చేరుకున్నాయి. కొన్ని భవనాల నిర్మాణ పనులు మొదటి అంతస్తు దాటాయి. నర్సింగ్ కళాశాల విభాగానికి సంబంధించి ఒక బ్లాక్‌లో భవన నిర్మాణం రెండవ అంతస్తు శ్లాబ్‌కు సిద్ధమైంది. ఇదే బ్లాక్‌లోని పలు భవనాల పనులు పిల్లర్ల స్థాయిలో ఉన్నాయి. ప్రధాన వైద్య కళాశాల బ్లాక్‌కు సంబంధించి ఎన్సీసీ ఇంజనీరింగ్ అధికారులు మరింత దృష్టి పెట్టారు. భూమిని చదును చేసి పిల్లర్లకు బాగా లోతుగా తవ్వే పనులకే చాలా సమయం పట్టింది. ప్రస్తుతం ఆయా పనులన్ని సజావుగా జరగడంతో పిల్లర్ల నిర్మాణాలు చురుగ్గా జరుగుతున్నాయి. గడువులోగా పూర్తి చేస్తాం చలితీవ్రత అధికంగా ఉన్నప్పటికీ ప్రతికూల వాతావరణంలోను నిర్మాణ పనులకు ఇబ్బందులు లేకుండా ఎన్సీసీ సంస్థ పనిచేస్తోంది. నాణ్యతలో రాజీ లేకుండా నిరంతరం తమ ఇంజనీరింగ్ అధికారులు కూడా నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు.నిర్మాణ సామగ్రి శాంపిళ్లను కూడా ల్యాబ్‌ల్లో నాణ్యత నిర్థారణ పరీక్షలు జరిపిస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈఏడాది డిసెంబర్ నెలాఖరుకు మొత్తం పనులన్నీ పూర్తి చేసే లక్ష్యంతో ఉన్నాం. శీతాకాలం ముగియగానే పనులు మరింత వేగవంతం చేస్తాం. – డీఏ నాయుడు, ఎగ్జిక్యుటివ్ ఇంజనీర్, ఏపీఎస్ఎంఐడీసీ. -
తూర్పు కనుమల అభివృద్ధిపై విభిన్న వైఖరి!
అప్పటి వరకూ ఎవరూ ప్రవేశించని చోట– ‘లోపలికి వెళ్లడం’ అనేసరికి, ఒక్కొక్క ప్రభుత్వం తీరు ఒక్కొక్క విధంగా ఉంటుంది. ప్రధా నంగా వాటి దృక్పథంపై అది ఆధారపడి ఉంటుంది. ఆ ప్రకారమే, అది తనతో– ‘రాజ్యాన్ని’ అంటే– ‘ఎగ్జి క్యూటివ్’ ‘జ్యుడీషియరీ’ వంటి వ్యవస్థలను, అవి ఇంకా చేరని మారుమూలల ఉన్న మానవ సమూహాల వద్దకు తనతో తీసుకు వెళుతోంది. ప్రజా స్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ఒక్క– ‘లెజిస్లేటి వ్’కు మాత్రమే అటువంటి గమన శక్తి ఉంటుంది. రాష్ట్ర విభజన తర్వాత, తూర్పు కనుమలలోని మన్యం – ‘లోపలికి వెళ్లడం’ అనే విషయంలో, అక్కడ మొదటి పదేళ్ల కాలంలో ఏమి జరుగుతున్నది అనేది లోతైన సమీక్ష అవసరమైన అంశం. వామపక్ష తీవ్రవాద సిద్ధాంత కార్యాచరణకు తూర్పు కనుమల మన్య ప్రాంతం నాలుగు దశాబ్దాల పాటుగా క్రియాశీల స్థావరం కావడంపై, ఇప్పుడు ప్రభుత్వ– ‘ఫోకస్’ తప్పనిసరి అయింది. అయితే అది– ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కో తీరుగా అర్థమయింది. ఒకరు అంటారు– ‘విదేశాల నుంచి పోలీస్ శాఖ కొనాల్సిన ‘కమ్యూనికేషన్’ ఉపకరణాలు సకాలంలో ప్రభుత్వం కొని ఉంటే, ఒక గిరిజన ఎమ్మెల్యే నక్సల్స్ చేతిలో చనిపోయేవాడు కాదు’ అని. మరొక ప్రభుత్వ దృష్టి, అందుకు భిన్నంగా– ఆ ప్రాంతాన్ని... అక్కడ భూమిలోని ఖనిజ నిక్షేపాలను విలువైన ఆదాయ వనరుగా చూడ్డంగా కాకుండా, ఆ ప్రాంత ప్రజా ప్రయోజనాల దృష్టి నుంచి దాన్ని చూడాలి అని అనుకోవచ్చు. వామపక్ష తీవ్రవాద చర్యల్ని కట్టడి చేయడానికి 1989లో ఏపీ పోలీస్‌లో– ‘గ్రే హౌండ్స్’ విభాగం మొదలయింది. ప్రస్తుతం విశాఖపట్టణం వద్ద తాత్కాలిక ‘క్యాంపు’ల్లో ఉండి పనిచేస్తూ ఉంది. అయితే సాయుధ దళాల దన్నుతో కాకుండా... పౌరపాలన దృష్టితో ఈ ప్రాంత అభివృద్ధిని చేపట్టాలి అనే– ‘దార్శనికత’ ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు అది మునుపటికి భిన్నంగా ఉంటుంది. ఇలా భిన్నమైన దృక్పథాల మధ్య 2022 నాటికి ఇప్పటి యువ నాయకత్వానికి ఉన్న కొత్త చూపు నుంచి వచ్చినవే– పాడేరు కేంద్రంగా ‘అల్లూరి సీతారామరాజు’ జిల్లా, పార్వతీపురం కేంద్రంగా ‘మన్యం’ జిల్లాలు. అంటే– ‘లోపలికి వెళ్లడం’ అనేది చిన్న పరిపాలనా యూనిట్ల ద్వారా... సూక్ష్మ స్థాయికి పరిపాలన తీసుకు వెళ్లడం వల్లనే సాధ్యమని ఈ ప్రభుత్వం నమ్మకం. నిజానికి ఇది– ప్రపంచ దేశాల చరిత్రలో కాలపరీక్షకు నిలిచిన సత్యం. అలా చూసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల్లో– గ్రామ సచివాలయాల ఏర్పాటు, విద్య–వైద్య రంగాల్లో సంస్కరణలు, ఉత్తర్వులు వెలువడిన వెంటనే కొత్త జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు ఏజెన్సీ ప్రాంతంలో పని మొదలు పెట్టడం, ప్రతి సోమవారం జరిగే– ‘స్పందన’ ప్రజా ఫిర్యాదులకు రద్దీ పెరగడం, పాడేరులో కొత్తగా మెడికల్ కాలేజీ నిర్మాణం చురుగ్గా జరగడం, రోడ్లు, వంతెనల నిర్మాణం, ఇవన్నీ అమలవుతున్న సంక్షేమ పథకాలకు అదనంగా ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులుగా కనిపిస్తున్నాయి. గతంలో ప్రాంతమూ–ప్రజల మధ్య పెనవేసుకుపోయి ఉండే బంధాన్ని విస్మరిస్తూ రూపొందించే అభివృద్ధి నమూనాలు, వీరి పక్షాన మావోయిస్టులు – ‘రాజ్యాన్ని’ వ్యతిరేకించడానికి బలమైన కారణమైంది. కానీ– ఇప్పుడు ప్రభుత్వ దృక్పథం మారింది. అప్పటి వరకు ఉన్న పట్టు జారిపోతున్నప్పుడు, వ్యూహాలు మార్చుకోవడం ఎవరికైనా తప్పదు. విభజన తర్వాత, ఇంత త్వరగా ఇటువంటి కొత్త వాతావరణం ఏజెన్సీ గ్రామాల్లో ఏర్పడుతుందని వారు కూడా అనుకుని ఉండక పోవచ్చు. దాంతో– ముఖ్యులైన మావోయిస్టుల లొంగుబాట్లు మొదలయ్యాయి. కొత్తగా వచ్చి చేరుతున్నవారు లేరు అంటున్నారు. ఈ జూన్ నెలలో జరిగిన నాయకుల అరెస్టు సందర్భంగా 33 మంది మావోయిస్టులు, 27 మంది మిలీషియా సభ్యులు పోలీసులకు లొంగిపోయారు. రూ. 39 లక్షల నగదు, అత్యంత విలువైన ఆయుధాలు స్వాధీనం అయ్యాయి. మళ్ళీ మరొకసారి ఈ సెప్టెంబర్ 7న పెదబయలు వద్ద మరొక అత్యంత భారీ ఆయుధాలు, కమ్యూనికేషన్ సిస్టం, స్కానర్లు సీఆర్పీఎఫ్ పోలీస్ దళాలు వెలుపలికి తీశాయి. ఈ జిల్లాలో రెండు నెలల వ్యవధిలో రెండవసారి ఛేదించిన ఆయుధాల నిల్వలివి. ఈ మొత్తం వ్యవహారంలో ఆసక్తికరమైన అంశం ఏమంటే– ఇప్పట్లో ఇక్కడ వీటి అవసరం ఉండదని, వారు వీటిని జక్కిని అటవీ ప్రాంతంలో భూమిలో పూడ్చిపెట్టి, ఛతీస్‌గఢ్‌లో భద్రత వున్న రహస్య ప్రాంతాలకు వెళ్లిపోయారు. (క్లిక్ చేయండి: విద్యారంగంలో దూసుకుపోతున్న ఏపీ) జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పర్యావరణాన్నీ, జీవవైవిధ్యాన్నీ పరిరక్షిస్తూనే స్థానిక ఆదివాసుల ఆవాసాల మధ్య పర్యాటక రంగం అభివృద్ధి కొరకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అందుకు పాడేరులో– ‘ఒబెరాయ్ హోటల్స్ గ్రూప్’ 7 స్టార్ హోటల్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక మారు మూల ప్రాంత అభివృద్ధి కోసం పార్వతీపురం మన్యం జిల్లాగా ఏర్పడ్డంతో ఇక్కడి – కురికుట్టి వద్ద 1200 మెగావాట్లు, కర్రివలస వద్ద 1,000 మెగా వాట్లు సామర్థ్యం గల అదానీ గ్రీన్ ఎనర్జీ పవర్ ప్రాజెక్టులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇవి పూర్తి అయ్యాక, ఒకప్పుడు – గ్రే హౌండ్స్ పోలీసులతో ‘ఏఓబీ’గా పిలవబడిన ఆంధ్ర–ఒడిస్సా సరిహద్దున, ఒక్కొక్క పవర్ ప్రాజెక్టు వల్ల 3,000 మందికి ఉపాధి లభిస్తుంది. ఏదేమైనా–ఏటిట్యూడ్ ఈజ్ ఎవ్రిథింగ్ (దృక్పథమే సమస్తమూ) అనేది, అన్ని కాలాలకు వర్తించే పాత సూక్తి. - జాన్సన్ చోరగుడి అభివృద్ధి, సామాజిక అంశాల వ్యాఖ్యాత -
వికేంద్రీకరణకు మద్దతుగా పాడేరులో రౌండ్ టేబుల్ సమావేశం
-
వికేంద్రీకరణకు మద్దతుగా గిరిజనుల ఉద్యమాలు...
-
అమరావతి రైతుల పేరిట ఉత్తరాంధ్రలో యాత్ర ఎలా?: చెట్టి ఫాల్గుణ
సాక్షి, అల్లూరి జిల్లా: విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని ఏర్పాటుతోనే గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ తెలిపారు. వికేంద్రీకరణకు మద్దతుగా పాడేరులో గిరిజన సంఘాల అధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి పార్టీలకతీతంగా అన్ని వర్గాలను ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ మాట్లాడుతూ.. 'శ్రీకృష్ణ కమిషన్ కూడా వెనుక బడిన విశాఖ లో రాజధాని ఏర్పాటు చేయాలని సూచించిందని తెలిపారు. చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతి నినాదం అని మండిపడ్డారు. అమరావతి రైతుల పేరిట ఉత్తరాంధ్రలో ఎలా యాత్ర చేపడతారని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు మాటలకు తలొగ్గి ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులు వికేంద్రీకరణపై విమర్శలు చేస్తున్నారని పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మండిపడ్డారు. ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులకు కూడా అమరావతి రాజధాని ఇష్టం లేదన్నారు. విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని ఏర్పాటు అయితే ప్రయోజనం ఉంటుందని టీడీపీ నేతల్లో కూడా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు మాటలు వినడం మాని ఇప్పటికైనా టీడీపీ నాయకులు బయటకు రావాలని కోరారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే ఉత్తరాంధ్ర అంతటా అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అన్నారు. హైదరాబాద్‌ను విడిచి రావడంతో ఏపీకి నష్టం జరిగిందని ఆదివాసీ ఐక్యవేదిక అభిప్రాయపడింది. విభజన సమయంలోనే వికేంద్రీకరణ జరిగి ఉంటే అమరావతిలో పెట్టిన డబ్బు వృథా అయ్యేది కాదని స్పష్టం చేసింది. వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని గిరిజన ఉపాధ్యాయ సంఘం తెలిపింది. గిరిజనుల అభివృద్ధి విశాఖ రాజధానితోనే సాధ్యమని, విశాఖ కేంద్రంగా రాజధాని సాధిస్తామని ధీమా వ్యక్తం చేసింది. ఒకే చోట అభివృద్ధి ఎప్పటికైనా ప్రమాదకరని, గిరిజనులు ప్రాజెక్టుల కోస భూములు త్యాగం చేశారని గెజిటెడ్ ఉద్యోగుల సంఘం తెలిపింది. అమరావతి రైతులు ఉచితంగా భూములు ఇవ్వలేదని పేర్కొంది. -
విశాఖలో 7 స్టార్ హోటల్ ఏర్పాటుకు ప్రణాళిక
ప్రపంచవ్యాప్తంగా హోటల్స్ రంగంలో అగ్రగామిగా ఉన్న ఒబెరాయ్ సంస్థ విశాఖలో తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు ముందుకొచ్చింది. రిసార్ట్‌తో పాటు స్టార్ హోటల్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. భీమిలి మండలం అన్నవరం సాగరతీరంలో ఒబెరాయ్ సంస్థకు స్థలాన్ని కేటాయించేందుకు పర్యాటక శాఖ సమాయత్తమవుతోంది. పాడేరులోనూ టూరిజం సెంటర్ ఏర్పాటు చేసేందుకు ఈ ప్రముఖ సంస్థ సుముఖత వ్యక్తం చేసింది. సాక్షి, విశాఖపట్నం: పర్యాటక రంగంలో పరుగులు పెడుతున్న విశాఖపట్నం వైపు దిగ్గజ సంస్థలు అడుగులు వేస్తున్నాయి. విదేశీ పర్యాటకులు విశాఖను సందర్శించేందుకు మొగ్గు చూపుతుండటంతో.. టూరిజంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా హోటల్స్ రంగంలో దిగ్గజమైన ఒబెరాయ్ హోటల్ విశాఖలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఒబెరాయ్ గ్రూప్స్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రాజరామన్ శంకర్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పలు చోట్ల తమ కార్యకలాపాలు విస్తరించేందుకు సుముఖంగా ఉన్నట్లు ప్రకటించారు. విశాఖలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు. అన్నవరంలో 7 స్టార్ హోటల్ భీమిలి సమీపంలోని అన్నవరం సముద్రతీరంలో తమ హోటల్ సామ్రాజ్యాన్ని స్థాపించాలని ఒబెరాయ్ సంస్థ భావిస్తోంది. ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర, జిల్లా పర్యాటక శాఖ అధికారులతో ఆ సంస్థ ప్రతినిధులు సంప్రదింపులు జరిపారు. ఇటీవలే జిల్లా టూరిజం అధికారులతో కలిసి విశాఖపట్నం బీచ్ పరిసరాలను సందర్శించారు. బీచ్ ఒడ్డున టూరిజం శాఖకు ఎక్కడెక్కడ ఎంత మేర భూములున్నాయో వాటన్నింటినీ పరిశీలించారు. చివరిగా అన్నవరం సాగరతీరం ఒబెరాయ్ గ్రూప్ ప్రతినిధులకు నచ్చడంతో.. ఆ స్థలంలో ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. అన్నవరంలో పర్యాటక శాఖకు దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో భూములున్నాయి. వీటిలో 40 ఎకరాలను ఒబెరాయ్ సంస్థకు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక్కడ 7 స్టార్ హోటల్ నిర్మించాలని సంస్థ భావిస్తోంది. వీటితో పాటు రిసార్టులు కూడా ఏర్పాటు చేయాలని సమాలోచనలు చేస్తోంది. పాడేరులో టూరిజం సెంటర్ విశాఖతో పాటు ఏజెన్సీ ప్రకృతి అందాల్లోనూ పెట్టుబడులు పెట్టేందుకు ఒబెరాయ్ గ్రూప్ ఆసక్తి చూపిస్తోంది. పాడేరు రీజియన్ పరిధిలో టూరిజం సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. విశాఖ మన్యంలోని అందాలను తిలకించేందుకు ఆసక్తిగా వచ్చే దేశ, విదేశీ పర్యాటకులు.. ఆ ప్రాంతంలో ఏఏ వనరులు, వసతులు కావాలని కోరుకుంటారో.. వాటన్నింటినీ ఒకే ప్రాంతంలో అందించేలా టూరిజం సెంటర్ ఉండబోతోంది. రిసార్టులు, హోటల్, టూరిజం ప్యాకేజీలు, ఇతర సౌకర్యాలన్నీ వన్ స్టాప్ సొల్యూషన్‌గా ఒబెరాయ్ సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మొత్తంగా ఉమ్మడి విశాఖ పట్నంలో రూ.300కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు ఒబెరాయ్ సంస్థ సిద్ధమవుతోంది. (క్లిక్: తూర్పు తీరం.. పారిశ్రామిక హారం; క్యూ కడుతోన్న పారిశ్రామిక దిగ్గజాలు) ఒబెరాయ్ గ్రూప్స్ అంటే.? భారత్‌కు చెందిన ఒబెరాయ్ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో హోటళ్లను విస్తరించిన సంస్థ. 5 స్టార్ లేదా 7 స్టార్ హోటల్స్ రంగంలో అగ్రగామిగా వెలుగొందుతోంది. ఐదు దేశాల్లోని 20కిపైగా నగరాల్లో హోటళ్లను, 2 క్రూయిజ్ షిప్‌లను ఒబెరాయ్ సంస్థ నిర్వహిస్తోంది. 1934 నుంచి హోటల్స్ రంగంలో సేవలందిస్తూ అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. భారత్‌లో ముంబయి, గుర్గావ్, చెన్నై, భువనేశ్వర్, కోచ్చి, ఆగ్రా, జైపూర్, ఉదయ్‌పూర్, హైదరాబాద్ నగరాల్లో మాత్రమే హోటళ్లను నడుపుతోంది. తాజాగా విశాఖలో తమ ప్రస్థానాన్ని ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. త్వరలో మరోసారి ఒబెరాయ్ సంస్థ ప్రతినిధులు స్థల పరిశీలన కోసం నగరానికి రానున్నట్లు పర్యాటక శాఖ ప్రతినిధులు తెలిపారు. (క్లిక్: ఏపీకి పెట్టుబడులు రావడం పవన్‌కు ఇష్టం లేనట్లే ఉంది!) -
Araku Valley: అందమైన పెళ్లికి ఆదివాసీలే పేరంటాలు
సాక్షి, అమరావతి: ప్రకృతి అందాల నెలవైన అరకు లోయలో ‘గిరి గ్రామదర్శిని’ ఆదివాసీ జీవన ప్రపంచాన్ని ఆవిష్కరిస్తోంది. పచ్చటి కొండలు, లోతైన లోయలు, జాలువారే జలపాతాల నడుమ అరకును సందర్శించే పర్యాటకులకు మరపురాని అనుభూతిని అందిస్తోంది. అన్నిటికి మించి గిరిజన సంప్రదాయ వస్త్రధారణలో పర్యాటకులకు వివాహ వేడుక అవకాశాన్ని కల్పిస్తోంది. అరకులోని గిరిజన మ్యూజియానికి దాదాపు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘పెదలబుడు’ గ్రామంలో ప్రభుత్వం ప్రత్యేకంగా గిరిజన గ్రామాన్ని నిర్మించింది. ఒడిశా సరిహద్దున గల ఈ ప్రాంతంలో దాదాపు 92 శాతం జనాభా గిరిజనులే. గిరిజన ఆచారాల్లో ఒదిగిపోవచ్చు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు డివిజన్లోని ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఐటీడీఏ) ఆదివాసీల జీవనశైలి, వారి సంప్రదాయాలు, ఆచారాలు, ఆహారపు అలవాట్లను అర్థం చేసుకోవడానికి ‘గిరి గ్రామదర్శిని’ని తీర్చిదిద్దింది. ఈ గ్రామంలో పర్యాటకులకు సాధారణ స్థానిక ఆదివాసీ వాతావ రణాన్ని అందిస్తూ సుమారు 15కి పైగా సంప్రదాయ గిరిజన గుడిసెలను ఏర్పాటు చేసింది. గిరిజనుల జీవన విధానాన్ని అనుభవించాలనుకునేవారు ఈ కాటేజీలను బుక్ చేసుకుని ఒకట్రెండు రోజులు బస చేయవచ్చు. ఈ సమయంలో పర్యాటకులు స్థానిక గిరిజన సమూహాలతో మమేకమై గడిపేందుకు ఏర్పాట్లు చేశారు. ఆదివాసీల మాదిరిగానే కట్టు, బొట్టు, ఆభరణాలు ధరించి వారి ఆచార వ్యవహారాల్లో పాల్గొనవచ్చు. ఎద్దుల బండిపై సవారీ, రాగి అంబలి, విలు విద్య క్రీడా కేంద్రం, బొంగరం ఆట, కొమ్మ రాట్నం, థింసా ఆడుకునేందుకు ప్రత్యేక స్థలం, నాగలి పట్టి దుక్కి దున్నడం ఇలా ఒకటేమిటి అనేక అంశాలు గిరి గ్రామదర్శినిలో ఉన్నాయి. గిరిజనుల ఆట విడుపు అయిన కోడి పుంజులను పట్టుకోవడం కూడా పర్యాటకుల కార్యకలాపాల్లో భాగం చేశారు. (క్లిక్: జాతీయ సదస్సులో మరోసారి ‘అరకు కాఫీ’ అదుర్స్) అక్కడే పెళ్లి చేసుకోవచ్చు గిరి గ్రామదర్శినిలో పర్యాటకులను ఆదివాసీ వివాహ పద్ధతి ఎక్కువగా ఆకట్టుకుంటోంది. వినూత్న రీతిలో వివాహం చేసుకోవాలనుకునే యువతకు, ఇప్పటికే వివాహమైన జంటలకు గిరిజన వివాహ అనుభూతిని అందిస్తోంది. పెదలబుడు ఎకో టూరిజం వెల్ఫేర్ సొసైటీ ఈ కాన్సెప్ట్‌ను రూపొందించింది. ఇందులో వధూవరులతోపాటు, స్నేహితులు, బంధువులను కూడా గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో ముస్తాబు చేస్తారు. గుడిసెను వెదురు, పూలు, ఆకులతో అలంకరిస్తారు. ఇక్కడి గిరిజన పూజారి గిరిజన సంప్రదాయాల ప్రకారం వివాహ తంతును నిర్వహించేందుకు మూడు నుంచి నాలుగు గంటల సమయం తీసుకుంటారు. ఆచారమంతా గిరిజన సంగీతంతో మార్మోగుతుంది. పెళ్లి విందు కూడా స్థానిక జీవన శైలిలో ఉంటుంది. క్యాంప్ ఫైర్ చుట్టూ థింసా నృత్యం చేస్తూ స్థానిక గిరిజన మహిళలు అతిథులను అలరిస్తారు. గిరిజన వివాహాలు పూర్తిగా మహిళలతో నిర్వహిస్తుండటం కూడా ఇక్కడి విశేషం. ఈ తరహా వివాహాన్ని కోరుకునేవారు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. (క్లిక్: పర్యాటక ప్రాంతాలు కళకళ.. భారీగా ఆదాయం) -
Photo Feature: వంజంగి కొండలపై పాల సముద్రం..
సాక్షి, పాడేరు: వంజంగి హిల్స్‌లో మూడు రోజులుగా పొగమంచు, మేఘాల అందాలు అలరిస్తున్నాయి. శనివారం వేకువజామున 5గంటలకు సూర్యోదయం కనువిందు చేసింది. ఆహ్లాదకర వాతావరణంతో పాటు సూర్యోదయం అందాలను పర్యాటకులు ఆస్వాదించారు. వంజంగి హిల్స్‌లో మంచు అందాలు నెలకొనడంతో మళ్లీ పర్యాటకుల సందడి మొదలైంది. చదవండి: Photo Feature: మేమా.. టైంకు రావడమా.. సీలేరు: దారాలమ్మతల్లి ఆలయం సమీప అటవీ ప్రాంతం పొగమంచుతో కనువిందు చేసింది. శనివారం వేకువజాము నుంచి ఉదయం 8 గంటల వరకు దట్టంగా పొగమంచు కురిసింది. ఘాట్ మీదుగా ప్రయాణం సాగించిన వాహనదారులు, స్థానికులు ఈ పొగమంచు అందాలను వీక్షించి ఎంతో పరవశించారు. -
వావ్ అనిపించే వాటర్‌ఫాల్స్.. చూపు తిప్పుకోలేరు!
సాక్షి, ముంచంగిపుట్టు: పరవళ్లు తొక్కుతున్న నదీ జలాలు.. వాగులు, సెలయేర్లు.. కొండలు, కోనలు.. ఇలా ఒకటేమిటి ప్రతిదీ మన్యంలో అద్భుత దృశ్యంగా పర్యాటకుల మనసు దోచుకుంటున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఆంధ్ర–ఒడిశా సరిహద్దులో జలపాతాలు హొయలొలుకుతున్నాయి. తొలకరి వర్షాలతో కొండ ప్రాంతాల నుంచి వరద నీరు పోటెత్తడంతో జలపాతాల నీటి ఉధృతికి తోడై మరింత కనువిందు చేస్తున్నాయి. చిన్న జలపాతాలు సైతం ఎంతో అద్భుతంగా కనిపిస్తూ ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. ఆంధ్ర–ఒడిశా సరిహద్దులో డుడుమ జలపాతం 2,700 అడుగుల పైనుంచి మంచు తెరల మధ్య జాలు వారుతూ ఆహ్లాద పరుస్తోంది. ముంచంగిపుట్టు మండలం కుమడ పంచాయతీ జడిగూడ జలపాతం సైతం విశేషంగా ఆకట్టుకుంటోంది. ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల సరిహద్దులో తారాబు జలపాతం నింగికి ఎగసి పడుతున్నట్లు కనిపిస్తోంది. బరడ పంచాయతీ హంశబంద, జర్జుల పంచాయతీ బురదగుంట జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. వీటిని చూసేందుకు ఆంధ్ర, ఒడిశా సరిహద్దులతోపాటు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చి విశేష అనుభూతిని పొందుతున్నారు. అక్కడ చుట్టు పక్కల వంటలు చేస్తూ పాటలు పాడుతూ డ్యాన్సులు చేస్తూ, సెల్ఫీలు, ఫొటోలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు. పాల కడలి స్నోయగాలు మేఘాల కొండగా విశ్వవ్యాప్తి పొందిన పాడేరు మండలం వంజంగి హిల్స్ పొగమంచు, మేఘాలతో గురువారం ఉదయం పాలసముద్రంలా దర్శనమిచ్చింది. వేకువజాము నుంచి ఉదయం 10గంటల వరకు కొండల నిండా మంచు పరుచుకుంది. ఇక్కడి ప్రకృతి అందాలు పర్యాటకులను అబ్బురపరిచాయి. పలు ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు ప్రకృతి అందాలను వీక్షించి పరవశించారు. – సాక్షి, పాడేరు -
మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాలు.. ఏవోబీలో రెడ్ అలర్ట్
సాక్షి, పాడేరు/ముంచంగిపుట్టు/కొయ్యూరు: ఏజెన్సీలో మావోయిస్టులు జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు 50వ అమరవీరుల వారోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏవోబీ వ్యాప్తంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. కొద్ది రోజుల కిందట ఏవోబీ ప్రత్యేక జోనల్ కమిటీ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ ఉదయ్ అలియాస్ గణేష్ పేరిట విడుదలైన లేఖలో వారోత్సవాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఒడిశాలోని మల్కన్‌గిరి, కోరాపుట్ జిల్లాలతో పాటు అల్లూరి జిల్లాలోని పాడేరు, చింతపల్లి, రంపచోడవరం, చింతూరు పోలీసు సబ్ డివిజన్ల పరిధిలోని పోలీసు బలగాలు వారం రోజుల నుంచి కూంబింగ్ చేపడుతున్నాయి. చింతూరుకు సరిహద్దులో ఉన్న చత్తీస్‌గఢ్ ప్రాంతంలో కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ మావోయిస్టుల వారోత్సవాలను భగ్నం చేసేలా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. సీఆర్పీఎఫ్తో పాటు ఇతర పోలీసు బలగాలు అటవీ ప్రాంతాల్లో మకాం వేశాయి. మండల కేంద్రాలు, ప్రధాన జంక్షన్లలో ఆయా పోలీసులు వాహన తనిఖీలు చేపడుతున్నారు. బాంబ్, డాగ్ స్క్వాడ్‌తో కూడా తనిఖీలు జరిపారు. ముంచంగిపుట్టులో ఎస్ఐ కె.రవీంద్ర ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. సీఆర్పీఎఫ్ పోలీసులు ముంచంగిపుట్టు నుంచి రాముల గ్రామం వరకు కల్వర్టులు, వంతెనలను బాంబు స్క్వాడ్‌తో పరిశీలించారు. జోలాపుట్టు, మాచ్‌ఖండ్, ఒనకఢిల్లీల్లో బీఎస్ఎఫ్ బలగాలు నిఘా పెంచాయి. నాయకులంతా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, ఎక్కడికి వెళ్లినా తమకు సమాచారం అందించాలని పోలీసులు నోటీసులను జారీ చేశారు. కొయ్యూరు మండలంలోనూ పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఏడాది కాలంలో ఏవోబీ పరిధిలో 12 మంది మావోయిస్టులు మరణించారు. అలా మరణించిన వారికి వారోత్సవాల్లో మావోయిస్టులు నివాళులర్పిస్తారు. ఈ సందర్భంగా యాక్షన్టీంలను రంగంలోకి దించే అవకాశం ఉండడంతో పోలీసులు నిఘా పెంచారు. పాడేరు, చింతలవీధి, గబ్బంగి, కరకపుట్టు తదితర ప్రాంతాల్లో ఎస్ఐలు లక్ష్మణ్‌రావు, రంజిత్‌లు తమ సిబ్బందితో తనిఖీలు చేపట్టారు. ప్రైవేటు వాహనాలు, ఆర్టీసీ బస్సులలో రాకపోకలు సాగిస్తున్న వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. (క్లిక్: ఆంధ్రాలోనే ఉంటాం.. భద్రాచలాన్ని ఆంధ్రాలో కలపాలి) -
Photo Feature: పచ్చని గిరులపై మేఘాల పల్లకి
పాడేరు–విశాఖపట్నం ప్రధాన రహదారిలోని ఘాట్‌లో ఆదివారం మేఘాలు కనువిందు చేశాయి. కొండలను తాకుతున్న మేఘాలను చూసి పర్యాటకులు, రోడ్డు ప్రయాణికులు, మోదమ్మ పాదాలు సందర్శనకు వచ్చిన భక్తులు పరవశించిపోయారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రకృతి.. పచ్చదనంతో చూపరులను కట్టిపడేస్తోంది. – సాక్షి, పాడేరు -
Veduru Kanji: వెదురు కంజి.. టేస్టు అదుర్స్.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!
ప్రకృతి అందాల సమాహారం విశాఖ మన్యం. ఎన్నో వింతలు, విశేషాలతో పాటు గిరిజన సంప్రదాయం అందరికీ కట్టిపడేస్తుంది. అడవిలో లభించే ఆకుకూరలు, కాయలతో చేసే వంటకాలు నోరూరిస్తాయి. ఇదే కోవకు చెందుతుంది వెదురు కంజి. వెదురు నుంచి తీసిన చిగుళ్లను కూర వండుకొని తింటారు. ఈ కూర టేస్టే వేరు. - సాక్షి,పాడేరు/ముంచంగిపుట్టు వెదురు కొమ్ముల సీజన్ ఇది గిరిజన ప్రాంతాల్లో వెదురు కొమ్ముల సీజన్ ప్రారంభమైంది. వెదురు చెట్లకు మొదల్లో చిగుళ్లను గిరిజనులంతా వెదురు కొమ్ములుగా పిలుస్తుంటారు. ఈ చిగుళ్లను సేకరించి వాటిని మంచి శాఖాహార వంటగా గిరిజనులతో పాటు మైదాన ప్రాంత ప్రజలు కూడా అధికంగా తింటారు. వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో వెదురు చెట్ల మొదళ్లకు చిగుళ్లు వచ్చాయి. అడవులతో పాటు గిరిజనులు సొంతంగా వేసుకున్న వెదురు చెట్ల వద్ద ఈ చిగుళ్లను సేకరించి ఇళ్లకు తీసుకువస్తున్నారు. వేపుడు, ఇగురు కూరలుగా ఈ సీజన్లో దొరికే వెదురు కొమ్ముల్లో పోషక విలువలు అధికంగా ఉంటాయని, అవి తినడం ద్వారా ఆరోగ్యానికి దోహదం చేస్తుందని గిరిజనుల నమ్మకం. ఈ వెదురు కొమ్ములను వేపుడు, ఇగురు కూరలుగా వండుకుని తింటారు. కొంత మంది ఈ చిగుళ్లను పొడవుగా కోసి ఉడకబెట్టిన తర్వాత బాగా ఆరబెట్టి వరుగులుగా తయారు చేసుకుంటారు. ఆ వరుగులను సుమారు ఆరు నెలల వరకు ఇళ్లల్లో దాచుకుని ఎప్పుడు తినాలనుకున్న వాటిని నానబెట్టి కూరలుగా వండుకుంటారు. వారపు సంతలు, మండల కేంద్రాల్లో ప్రస్తుతం వెదురు కొమ్ములను గిరిజనులు విక్రయిస్తున్నారు. రూ.20 నుంచి రూ.80 ధరతో వాటా అమ్ముడవుతోంది. పాడేరు డివిజన్‌తో పాటు రంపచోడవరం డివిజన్లోని మారెడుమిల్లి, చింతూరు, అడ్డతీగల, రాజవొమ్మంగి, వై.రామవరం ప్రాంతాల్లో ఈ సీజన్లో వెదురు కొమ్ములకు మంచి డిమాండ్ ఉంటుంది. అనంతగిరి, లంబసింగి, పాడేరు, సీలేరు, మారెడుమిల్లి, మోతుగూడెం ఘాట్ రోడ్ల వెంబడి కూడా వెదురు వనాలు అధికంగా ఉన్నాయి. పర్యాటకులు, పలు వర్గాల ప్రజలు కూడా వెదురు కొమ్ముల వంటకాలకు అలవాటుపడ్డారు. ఈ సీజన్లో కొనుగోలు చేస్తుంటారు. వెదురు కంజి- ఉపయోగాలు ఇవీ ►వెదురు కంజి కూర తయారు చేసే ముందు రెండు మూడు సార్లు బాగా కడగాలి. అప్పుడే వెదురు కంజిలో ఉండే చేదు పోతుంది. వెదురు కంజిని బాగా ఉడకబెట్టి దాని కషాయాన్ని తాగితే శరీరానికి తక్షణమే వేడి చేస్తుంది. ►సుగర్, కపం, మూల వ్యాధి నివారణకు ఆయుర్వేద పరంగా దీనిని వాడతారు. ►రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ►జీర్ణశక్తి పెంచుతుంది. ►కడుపులో నులి పురుగును తొలగిస్తుంది. ►గాయాలైనప్పుడు వెదురు కంజిని పేస్ట్‌గా చేసి గాయంపై రాస్తారు. ►మారుమూల గిరిజనులు పాము, తేలు కాటుకు ఔషధంగా సైతం వినియోగిస్తున్నారు. తక్షణమే వేడి చేస్తుంది వెదురు కొమ్ములను గర్భిణులకు ఎక్కువగా వండి పెడతాం. ఇందులో ఉన్న గుణాలు గర్భిణులకు ఎంతో మేలు చేస్తాయి. గిరిజన ప్రాంతంలో వాతావరణం చల్లగా ఉండడం వల్ల శరీరానికి వెంటనే వేడి చేసే గుణం ఇందులో ఉంది. వెదురు కొమ్ముల కూర కూడా ఎంతో రుచికరంగా ఉంటుంది. ఈ నాలుగు నెలలు మాత్రమే వెదురు కొమ్ములు లభ్యమవుతాయి. – ఎస్.భాగ్యవతి, గృహిణి, నర్సిపుట్టు అమ్మకాలు బాగున్నాయి వారపు సంతల్లో వెదురు కొమ్ముల అమ్మకాలు బాగున్నాయి. కొమ్ముల వాటా రూ.50 చొప్పున విక్రయిస్తున్నాం. గతంలో గిరిజన ప్రాంతానికి చెందిన వారే కొనుగోలు చేసేవారు. ఇప్పుడు మైదాన ప్రాంతం నుంచి వచ్చి కూడా వెదురు కొమ్ములను కొనుగోలు చేస్తున్నారు. కొమ్ములను పచ్చిగా, ఉడక బెట్టి అమ్ముతున్నాం. శనివారం ముంచంగిపుట్టు వారపు సంతలో కొమ్ములు తెచ్చిన గంటల వ్యవధిలోనే అమ్ముడైపోయాయి. – కె.సుబ్బరావు, కూరగాయల వ్యాపారి, తల్లాబుతోట. చదవండి: Health Tips: ఖాళీ కడుపుతో ఇవి తింటే చాలా డేంజర్..! అవి కూడా అతిగా వద్దు! -
ఇలా విని... అలా నియామకం
సాక్షి, పాడేరు: గిరిజనుల సమస్యల పరిష్కారంలో ఐటీడీఏ పీవో ఆర్.గోపాలకృష్ణ తనదైన ముద్ర వేసుకుంటున్నారు. తన పరిధిలో వాటికి ఆగమేఘాల మీద పరిష్కారం చూపుతూ సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్నారు. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం వేర్లమామిడి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు బదిలీ కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మంగళవారం పాడేరు కలెక్టరేట్‌కు తరలివచ్చారు. వీరంతా అక్కడ ఉండటాన్ని పీవో గమనించి పిలిచి ఎందుకు వచ్చారని అడిగారు. ఇటీవల తమ ఉపాధ్యాయుడిని చింతపల్లి మండలం ఉమరాసగొంది పాఠశాలకు బదిలీ చేశారని వాపోయారు. వెంటనే గిరిజన సంక్షేమ శాఖ విద్యా విభాగం అధికారులకు ఫోన్ చేసి ఉపాధ్యాయుడిని నియమించాలని ఆదేశించారు. అయితే అదే రోజు సాయంత్రం పాఠశాలకు తాత్కాలిక ఉపాధ్యాయినిగా ఎం.రాజేశ్వరిని నియమిస్తూ పీవో ఆదేశాలు జారీ చేశారు. కొక్కిరాపల్లి ఆశ్రమ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఆమెను బుధవారం విధుల్లోకి చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించిన ఐటీడీఏ పీవోకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. శరవేగంగా నిర్మాణాలు పూర్తి చేయాలి ఏజెన్సీలో చేపట్టిన నిర్మాణపు పనులు శరవేగంగా పూర్తి చేయాలని ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ ఇంజినీర్లను ఆదేశించారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, అంగన్వాడీ, డిజిటల్ లైబ్రరీ భవనాలు, మిషన్ కనెక్ట్ పాడేరు, రెండో దశ నాడు–నేడు నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. వీటికి సంబంధించి బిల్లులు సమర్పిస్తే త్వరితగతిన చెల్లిస్తామన్నారు. 58 గ్రావిటీ తాగునీటి పథకాలను నిర్దేశించిన సమయానికి పూర్తి చేయాలని ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీర్లను ఆదేశించారు. ఎప్పటికప్పుడూ పనులను పర్యవేక్షించాలన్నారు. కొత్త జిల్లాలో ప్రభుత్వ అంచనాల మేరకు పని చేయాలన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఈఈలు డీవీఆర్‌ఎం రాజు, కె.వేణుగోపాల్, పంచాయతీరాజ్ ఈఈ కె.లావణ్యకుమార్, గృహ నిర్మాణ శాఖ ఈఈ రఘుభూషణరావు పాల్గొన్నారు. హెచ్‌ఎన్‌టీసీల అభివృద్ధికి ప్రణాళికలపై ఆదేశం ఐటీడీఏ పరిధిలోని ఉద్యానవన విభాగాల(హెచ్‌ఎన్‌టీసీ) అభివృద్ధికి సమగ్రమైన కార్యచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ ఆదేశించారు. తన కార్యాలయంలో చింతపల్లి, కొత్తవలస హెచ్‌ఎన్‌టీసీల అభివృద్ధిపై ఉద్యానవన, డ్వామా అధికారులతో ఆయన మాట్లాడారు. ఏజెన్సీలోని అగ్రి టూరిజం అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. హెచ్‌ఎన్‌టీసీల్లో పండ్ల, పూలమొక్కలు, మెడిసిన్ ప్లాంట్ల నర్సరీలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వీటి ని పర్యాటకులు, స్థానిక గిరిజన రైతులకు సరఫరా చేస్తా మన్నారు. ఐటీడీఏ ఏపీవో ఎం.వెంకటేశ్వరరావు, డ్వామా పీడీ ఎన్.రమేష్‌రామన్, పీహెచ్‌వో అశోక్, డ్వామా ఏపీడీ రామారావు, ఉద్యానవన శాస్త్రవేత్త బిందు పాల్గొన్నారు. -
పాడేరులో అల్లూరి విగ్రహావిష్కరణ
సాక్షి, పాడేరు: అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో సోమవారం ఆవిష్కరించనున్నట్లు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్లో జరిగే విగ్రహావిష్కరణ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు పీడిక రాజన్నదొర, బూడి ముత్యాలనాయుడు, అల్లూరి సీతారామరాజు జిల్లా ఇన్చార్జి, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున, అరకు, రంపచోడవరం ఎమ్మెల్యేలు చెట్టి ఫాల్గుణ, నాగులపల్లి ధనలక్ష్మి హాజరవుతారని వివరించారు. -
అడ్డాకులకు అదిరే ధర
సాక్షి,పాడేరు : ఏజెన్సీలోని అటవీ ప్రాంతాల్లో సహజసిద్ధంగా ఉన్న అడ్డాకుల సేకరణతో గిరిజన రైతులు పూర్వం నుంచి జీవనోపాధి పొందుతున్నారు. గత రెండేళ్ల నుంచి అడ్డాకులకు డిమాండ్ నెలకొనడంతో వ్యాపారులు గిరిజనుల నుంచి పోటీపోటీగా కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం సీజన్ కావడంతో వారపు సంతలో కనీసం రూ.3 లక్షల మేర వ్యాపారం జరుగుతోంది. రెండు దిండ్లు అడ్డాకులు రూ.1800 నుంచి రూ.2 వేలకు కొనుగోలు చేస్తున్నారు. పాడేరు డివిజన్ పరిధిలో సుంకరమెట్ట, అరకు, కించుమండ, హుకుంపేట, జి.మాడుగుల, వంట్లమామిడి, మద్దిగరువు, తాజంగి, అన్నవరం, చింతపల్లి, లోతుగెడ్డ వారపుసంతల్లో రెండు వారాల నుంచి అడ్డాకుల వ్యాపారం భారీగా జరుగుతోంది. మైదాన ప్రాంత వ్యాపారులు.. ఏజెన్సీలో వారపు సంతల్లో నర్సీపట్నం, వడ్డాది, రావికమతం, కొత్తకోట, రోలుగుంట, ఎస్.కోట, విజయనగరం ప్రాంతాలకు చెందిన వ్యాపారులంతా పోటా పోటీగానే అడ్డాకులను కొనుగోలు చేస్తుండటంతో గిరిజనులకు మంచి ధర లభిస్తోంది. ఈ ఆదివారం పాడేరు మండలం వంట్లమామిడి, అరకులోయ మండలం సుంకరమెట్ట వారపుసంతల్లో అడ్డాకుల వ్యాపారం భారీగానే జరిగింది. ఈ రెండు సంతల్లోను కనీసం రూ.8లక్షల మేర విక్రయాలు జరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు. వందలాది కుటుంబాలకు ఉపాధి ఏజెన్సీలోని గిరిజన రైతుల వద్ద సీజన్లో రూ.20 నుంచి రూ.30 వేలకు పైగా ఆదాయం సీజన్ ముగిసే లోపు ఒక్కో కుటుంబం కనీసం రూ.20వేల నుంచి 30వేల వరకు అడ్డాకుల అమ్మకాల ద్వారా ఆదాయాన్ని అర్జిస్తున్నాయి. గతంలో గిరిజన సహకార సంస్థ అడ్డాకులను కిలోల రూపంలో కొనుగోలు చేసేది. అడ్డాకుల వినియోగం అప్పట్లో తగ్గడం, ప్రైవేటు వ్యాపారుల నుంచి ఆదరణ కరువవడంతో పదేళ్ల నుంచి అడ్డాకులను జీసీసీ కొనుగోలు చేయడం లేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ వినియోగాన్ని నిరోధించే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తుండడంతో అడ్డాకులకు మళ్లీ పూర్వ వైభవం వచ్చే అవకాశాలున్నాయి. గిరి రైతులకు అడ్డాకులు సిరులు కురిపిస్తున్నాయి. మార్కెటఖ పరిస్థితులు కలిసి రావ డంతో రెండేళ్ల నుంచి మెరుగైన ఆదాయం పొందుతున్నారు. ఈ ఏడాది వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేయడంతో గిరిజనులకు ఊహించని ధర లభించింది. దీనికి తోడు ప్లాస్టిక్ వినియోగం తగ్గుతుండటంతో ఆదాయం మరింత మెరుగుపడే అవకాశం ఉంది. -
ప్రమాదకర మలుపులో రెండు బైకులు ఢీ..
సాక్షి, పాడేరు: మైదాన ప్రాంతాలకు వెళ్లే పాడేరు ప్రధాన రోడ్డులో కందమామిడి జంక్షన్ సమీపంలోని ప్రమాదకర మలుపు వద్ద సోమవారం ఉదయం రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గిరిజన యువకుడు మృతి చెందగా, మరో నలుగురు యువకులకు గాయాలయ్యాయి. పాడేరు మండలం వనుగుపల్లి పంచాయతీ చింతగున్నలకు చెందిన పాంగి వెంకట్(20), మోదాపల్లి పంచాయతీ గుర్రగరువుకు చెందిన మర్రి శేఖర్, మర్రి కామేష్ పల్సర్ బైక్‌పై మోదాపల్లి వెళ్తున్నారు. అదే సమయంలో అనకాపల్లికి చెందిన సిరిపురపు రాజు నరేంద్ర, శరగడం కుమార్ మరో బైక్‌పై వస్తున్నారు. కందమామిడి జంక్షన్ సమీపంలో ప్రమాదకర మలుపు వద్ద వీరు ఎదురెదురుగా రావడంతో బలంగా ఢీకొన్నారు. రెండు బైకుల మీదున్న వారంతా ఎగిరిపడ్డారు. పల్సర్ బైక్‌పై మధ్యలో కూర్చున్న పాంగి వెంకట్ తలకు తీవ్ర గాయమవడంతో హుటాహుటిన పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందాడు. మిగిలిన నలుగురిలో సిరిపురపు రాజు నరేంద్ర, మర్రి శేఖర్‌లకు తీవ్ర గాయాలవడంతో కేజీహెచ్‌కు తరలించామని పాడేరు ఎస్ఐ లక్ష్మణ్‌రావు తెలిపారు. ఈ సంఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. అయితే మృతుడు వెంకట్ స్వగ్రామం చింతగున్నలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ట్రాక్టర్ ప్రమాదంలో రైతు మృతి రోలుగుంట: మండలంలోని కుసుర్లపూడిలో ఆదివారం సాయంత్రం ట్రాక్టర్ చక్రం కింద పడి గొర్లె చెల్లయ్యనాయుడు(37) మృతి చెందాడు. దీనిపై మృతుడు అన్నయ్య పెద్దియ్యనాయుడు సోమవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై బి.నాగకార్తీక్ కేసు నమోదు చేశారు. ఆదివారం ఉదయం చెల్లయ్యనాయుడు తన పొలంలో దుక్కు పనులు చేసేందుకు ట్రాక్టర్ తీసుకెళ్లాడు. సాయంత్రం కురిసిన వర్షానికి పనులు నిలిపివేసి తిరిగి వస్తున్న క్రమంలో కాలు జారి ట్రాక్టర్ చక్రం కిందే పడిపోయాడు. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై సంఘటనా స్థలాన్ని పరిశీలించి శవ పంచనామా చేశారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, పదేళ్ల పాప ఉన్నారు. -
భారీగా వడగళ్ల వాన
సాక్షి, పాడేరు: జిల్లాలో పాడేరు, హుకుంపేట, జి.మాడుగుల, డుంబ్రిగుడ, పెదబయలు మండలాల్లో ఆదివారం మధ్యాహ్నం ఈదురు గాలులు, వడగళ్లతో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రంగా కాసింది, మధ్యాహ్నం 12గంటల తర్వాత వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. పాడేరు, హుకుంపేట ప్రాంతాల్లో సుమారు రెండు గంటల పాటు వర్షం కురిసింది. భారీ సైజులో వడగళ్లు పడ్డాయి. పాడేరు పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన కురవడంతో స్థానికులు తమ సెల్ కెమెరాల్లో బంధించి, సామాజిక మాద్యమాల్లో పోస్టు చేశారు. వడగళ్లను సేకరించేందుకు పిల్లలు పోటీపడ్డారు. పాడేరు ఘాట్‌రోడ్డులో పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. దీంతో వాహనచోదకులు ఇబ్బందులకు గురయ్యారు. ప్రధాన గెడ్డలు, వాగుల్లో వరద నీరు ఉధృతంగా ప్రవహించింది. కొయ్యూరు: మండలంలో సుమారు గంట పాటు పెద్ద శబ్దాలు, తీవ్రమైన కాంతితో ఉరుములు, మెరుపులు రావడంతో పాటు పిడుగులు పడడంతో ప్రజలు తీవ్ర భయందోళనకు గురయ్యారు. -
వేడెక్కుతున్న మన్యం
సాక్షి,పాడేరు : చల్లని ప్రాంతమైన జిల్లాలో ఎండ తీవ్రత నెలకొంది. శుక్రవారం సూర్యోదయం తరువాత నుంచి ఎండ చుర్రుమంది. పాడేరులో 37 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. ఏజెన్సీ వ్యాప్తంగా ఎండ తీవ్రత నెలకొనడంతో అన్ని వర్గాల ప్రజలు ఉష్ణ తాపంతో ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ, ఉపాధిహామీ పనులకు వెళ్లే గిరిజనులతో పాటు పశువుల కాపరులు కూడా అధిక ఎండతో అవస్థలు పడ్డారు. పాడేరు వారపుసంతలో కూడా ఎండతో గిరిజనులు, వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాయంత్రం వరకు వేడిమి వాతావరణం నెలకొంది. మండల కేంద్రాలు ప్రధాన జంక్షన్లు, గ్రామాల్లో శీతల పానీయాల అమ్మకాలు జోరందుకున్నాయి. -
విస్తారంగా కూరగాయల సాగు
సాక్షి, పాడేరు: ఏజెన్సీలో విస్తారంగా కూరగాయలు సాగు చేస్తున్నారు. కొద్ది రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు కూరగాయల పంటలకు ఎంతో మేలు చేస్తున్నాయి. కొద్దిపాటిగా ఉన్న నీటి నిల్వలతో మాలి జాతి గిరిజనులు రబీలో పలు రకాల కూరగాయల పంటలను సాగు చేస్తున్నారు. అయితే ఈ ఏడాది వేసవి ప్రారంభం నుంచి ఎండలు అధికమవడంతో లోతట్టు ప్రాంతాల్లోని నీటి నిల్వలు కూడా అడుగంటాయి. పంట కాల్వల్లో నీటి ప్రవాహం తగ్గిపోయింది. దీంతో రబీలో సాగవుతున్న పలు రకాల కూరగాయల పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలతో చెరువులు, కాల్వలు, చిన్న గెడ్డల్లో నీటి నిల్వలు పెరిగాయి. ఏజెన్సీలోని అరకులోయ మండలం పెదలబుడు, చినలబుడు, బస్కి, డుంబ్రిగుడ మండలం సొవ్వ, సాగర, హుకుంపేట మండలంలోని సంతారి, శోభకోట, తీగలవలస, రంగశీల, పాడేరు మండలంలోని గుత్తులపుట్టు, వనుగుపల్లి, ఇరడాపల్లి, కిండంగి, పెదబయలు మండలంలోని గలగండ, ముంచంగిపుట్టు మండలంలోని దోడిపుట్టు, చింతపల్లి మండలంలోని చౌడుపల్లి, లోతుగెడ్డ, లంబసింగి, తాజంగి, జి.కె.వీధి మండలంలోని దారకొండ, గుమ్మిరేవుల, మాలివలస, రింతాడ ప్రాంతాల్లో మాలి జాతి గిరిజనులు ఆకు కూరలతో పాటు పలు రకాల కూరగాయలను సాగు చేస్తున్నారు. క్యారెట్, బీట్రూట్, క్యాబేజీ, కాలిఫ్లవర్, టమాట, వంగ, బీన్స్‌తో పాటు పలురకాల మిర్చి, ఆకు కూరల పంటలన్నింటికి ఈ అకాల వర్షాలు ఊపిరి పోసినట్టయిందని గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పంటలు ఆరోగ్యంగా ఎదగడంతో పాటు అధిక దిగుబడులకు కూడా ఈ వర్షాలు ఎంతో అనుకూలించాయి. -
ఆర్వీ నగర్‌కు రానున్న కాఫీ పరిశోధన స్థానం
కాఫీ రైతులకు శుభవార్త. కాఫీ పరిశోధనస్థానం వెనక్కి రానుంది. గతంలో ఆర్వీనగర్లో ఉన్న కాఫీ పరిశోధన స్థానం భవనాలను మావోయిస్టులు పేల్చేయడంతో మన్యం ముఖద్వారమైన నర్సీపట్నం తరలించారు. అక్కడ నుంచి శాస్త్రవేత్తలు సేవలందిస్తున్నారు. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పడిన నేపథ్యంలో మళ్లీ ఆర్వీ నగర్ తరలించేందుకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. అరకు ఎంపీ గొడ్డేటి మాధవిని కేంద్ర కాఫీబోర్డు సభ్యురాలిగా నియమించడంతో కాఫీ రైతులకుమరింత మేలు జరగనుంది. గూడెంకొత్తవీధి : కాఫీ పరిశోధన స్థానం సేవలు రైతుల చెంతకే రానున్నాయి. ఇప్పటివరకు నర్సీపట్నంలో ఉన్న ఈ కేంద్రం అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పాటు నేపథ్యంలో మళ్లీ ఆర్వీ నగర్‌కు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఆరింటిలో ఒకటి.. కాఫీ సాగుకు సంబంధించి దేశ వ్యాప్తంగా ఆరు కేంద్ర కాఫీ పరిశోధన కేంద్రాలు ఉండగా వాటిలో ఒకదానిని జీకేవీధి మండలం ఆర్.వి.నగర్లో నెలకొల్పారు. కాఫీకి సంబంధించి మేలు రకాలను గుర్తించి వాటిని రైతులకు అందించడం, ఏయే రకాలు మన్యానికి అనుకూలమనే విషయాలపై ఇక్కడ కొంతకాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. కేంద్ర కాఫీబోర్డు ఆధ్వర్యంలో విస్తరణ విభాగం ఉంది. కాఫీ తోటలను విస్తరించడం, రైతులకు అవసరమైన విత్తనాలను, యంత్రాలను, కాఫీ కల్లాలను ఈ విభాగం సమకూరుస్తోంది. మావోయిస్టులు పేల్చేయడంతో.. ఆర్వీనగర్లో ఉన్న ప్రాంతీయ పరిశోధన స్థానాన్ని 18 ఏళ్ల క్రితం మావోయిస్టులు ల్యాండ్‌మైన్‌తో పేల్చేశారు. దీంతో భవనాల కొరత ఏర్పడింది. అప్పటి అవసరాల రీత్యా శాస్త్రవేత్తలు పరిపాలన సౌలభ్యం, అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాన్ని ఏజెన్సీ ముఖద్వారమైన నర్సీపట్నం తరలించారు. అప్పటి నుంచి 18 ఏళ్లుగా ఈ కార్యాలయం నుంచే శాస్త్రవేత్తలు పరిశోధనలు, విధులు కొనసాగిస్తున్నారు. ఇక్కడ డీడీ స్థాయి అధికారితో పాటు పలువురు శాస్త్రవేత్తలు, ఇతర క్షేత్రస్థాయి సిబ్బంది ఉన్నారు. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పాటుతో ఇప్పటికే మైదాన ప్రాంతాల్లోని కార్యాలయాలన్నీ మన్యానికి చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కాఫీ పరిశోధన సంస్థ, కేంద్ర కాఫీ ప్రాంతీయ పరిశోధన స్థానం అల్లూరి జిల్లాలోనే కొనసాగించనున్నారు. శాస్త్రవేత్తల సేవలు మరింత చేరువ చేసే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏజెన్సీలో మావోయిస్టుల కార్యకలాపాలు కూడా తగ్గుముఖం పట్టడం పరిశోధన స్థానం వెనక్కి రావడానికి అనుకూలమైన అంశంగా పలువురు పేర్కొంటున్నారు. లక్షన్నర ఎకరాల్లో సాగు కాఫీ సాగుకు సంబంధించి అల్లూరి సీతారామరాజు జిల్లా జాతీయస్థాయిలో ప్రత్యేక గుర్తింపు సంతరించుకుంది. సుమారు 1.3 లక్షలకు పైగా కుటుంబాలు లక్షన్నర ఎకరాల్లో కాఫీని వాణిజ్య పరంగా సాగు చేస్తున్నారు. ఏటా పదివేల టన్నుల వరకు కాఫీ గింజలను ఉత్పత్తి చేస్తున్నారు. పోడు వ్యవసాయం నిరోధించి గిరిజనులతో కాఫీసాగు చేపట్టడం ద్వారా అడవులను రక్షించవచ్చని భావించిన కేంద్ర ప్రభుత్వం కేంద్ర కాఫీబోర్డు ద్వారా కాఫీ తోటల పెంపకాన్ని ప్రోత్సహించింది. ఈ పరిస్థితుల్లో పరిశోధనస్థానం మళ్లీ ఆర్వీ నగర్‌కు వచ్చే అవకాశం ఉండటంతో గిరి రైతులకు మేలు చేకూరనుంది. శాస్త్రవేత్తల సహకారం అవసరం ఇప్పటికే మన్యం కాఫీకి మంచి గుర్తింపు ఉంది. కాఫీ సాగులో మేలైన దిగుబడులతో పాటు శాస్త్రీయ విధానాలు ఆచరించేందుకు వీలుగా శాస్త్రవేత్తల సహకారం అవసరం. వారి సేవలను పూర్తిస్థాయిలో కాఫీ రైతులకు చేరువ చేస్తాం. మన్యం కాఫీకి గిట్టుబాటు ధరలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం. అంతర్జాతీయ స్థాయిలో మన్యం కాఫీకి మరింత పేరు దక్కేలే తమవంతు కృషిచేస్తా. – గొడ్డేటి మాధవి, అరకు ఎంపీ, కేంద్ర కాఫీబోర్డు సభ్యురాలు కాఫీ సాగు విస్తీర్ణం పెంపునకు చర్యలు రానున్న మూడేళ్లలో కాఫీ సాగు విస్తీర్ణం మరింత పెరిగేలా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇందుకు జి.మాడుగుల, కొయ్యూరు, పాడేరు, జీకే వీధి మండలాల్లో ఎకో పల్పింగ్ యూనిట్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే లక్షన్నర ఎకరాల్లో కాఫీ సాగు జరుగుతోంది. విస్తీర్ణం పెంపుతో పాటు దిగుబడులు పెంపు ద్వారా గిరిజనుల ఆదాయం రెట్టింపు అవుతుంది. తద్వారా గిరిజనుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. – కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, పాడేరు ఎమ్మెల్యే ఉత్పత్తిదారుల సంఘాలకు చేయూత కాఫీ రైతుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఐటీడీఏ సంపూర్ణ సహకారం అందిస్తోంది. వ్యక్తిగతంగా కాకుండా కాఫీ రైతులంతా సంఘటితంగా రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా ఏర్పడుతున్నాం. ఎఫ్‌పీవో ప్రోత్సహిస్తుంది. పరిశోధన స్థానం ఆర్వీ నగర్‌కు తిరిగి వస్తే గిరి రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. – అడపా విష్ణుమూర్తి, కాఫీ రైతుల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు, జి.కె.వీధి మండలం -
అడవిబిడ్డలకు ఉన్నత విద్యను అందిస్తోన్న ఏపీ ప్రభుత్వం
-
పాడేరు ఐటీడీఏ ఈఈపై ఏసీబీ దాడులు
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం : గిరిజన సంక్షేమ శాఖ అధికారిపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) శనివారం దాడులు నిర్వహించింది. పాడేరు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఈఈ) కాట్రెడ్డి వెంకటసత్యనగేష్కుమార్పై అక్రమాస్తులపై ఫిర్యాదు రావడంతో ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. దీనికి సంబంధించిన వివరాలపై ఏసీబీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. విశాఖతో పాటు మూడు ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు కొనసాగాయి. విశాఖ, అనకాపల్లిలోని నగేష్‌కుమార్ ఇళ్లు, పాడేరులోని కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో నగేష్‌కుమార్, ఆయన కుటుంబ సభ్యుల పేరుతో రెండు ఫ్లాట్లు, 9 ఇళ్ల స్థలాలు, 6.50 ఎకరాల సాగు భూమి, రెండు కార్లు, నగదు, బంగారు, వెండి వస్తువులను గుర్తించారు. వాటి విలువ రూ.2,06,17,622 ఉంటుందని అంచనా వేశారు. మొత్తంగా ప్రాథమిక దర్యాప్తులో ఆదాయానికి మించి రూ.1,34,78,180 ఆస్తులు కలిగి ఉన్నట్టు గుర్తించారు. బ్యాంకు లాకర్లను తెరవాల్సి ఉంది. ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ ప్రధాన కార్యాలయం పేర్కొంది. -
అది కొడైకెనాలో.. కుల్లూలోయ కాదు.. మన విశాఖే
పౌరాణిక సినిమాల్లో నారదుల వారు తంబుర మీటుతూ.. మేఘాల్లోంచి అలా వెళ్లిపోతుంటే.. పాల కడలిలో శేషతల్పంపై విష్ణుమూర్తి పవళిస్తుంటే.. భలే అనిపించేది. అదంతా సినిమా పనితనం. మరి ధవళ వర్ణం మేఘాలు ముద్దాడుతుంటే.. నింగి తలుపులు తెరుచుకుంటూ సూరీడు చొరబడుతుంటే.. పాల కడలి కళ్ల ముందు ఉప్పొంగుతుంటే.. పచ్చని కొండలన్నీ బంగారం తాపడం చేసినట్టు మెరిసిపోతుంటే.. ఏ తనువు మాత్రం మురిసిపోదు? అలాంటి అనుభవాలకు కొడైకెనాలో.. కుల్లూలోయకో వెళ్లిపోనక్కర లేదు. విశాఖ జిల్లా వంజంగి కొండల్ని పలకరిస్తే చాలు.. పాల సంద్రం లాంటి పొగమంచు అందాలు వీక్షించేందుకు లక్షలాది మంది పర్యాటకులు తరలి వస్తున్నారు. పాడేరు: వంజంగి హిల్స్‌తో పాటు సముద్ర మట్టానికి సుమారు 4,500 అడుగుల ఎత్తులో ఉన్న బోలెంగమ్మ పర్వత శిఖరం ప్రకృతి ప్రియులకు స్వర్గధామం. ఏడాది వ్యవధిలో సుమారు 2లక్షలకు పైగానే పర్యాటకులు వంజంగి హిల్స్‌ను సందర్శించారు. మారుమూల వంజంగి పంచాయతీ శివారు గ్రామాలకు వంజంగి హిల్స్ వరంగా మారింది. గిరిజనులకు జీవనోపాధి కల్పిస్తోంది. పర్యాటకాభివృద్ధికి ప్రభుత్వ కృషి వంజంగి హిల్స్ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి వంజంగి హిల్స్ ప్రకృతి అందాలను రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లారు. ఇక్కడ సూర్యోదయం, పాల సముద్రం లాంటి మంచు అందాల దృశ్యాలను ఫొటోలు, వీడియోల రూపంలో చూపించడంతో ఆయన స్పందిస్తూ పర్యాటక శాఖ ఉన్నతాధికారులను వంజంగి హిల్స్‌కు పంపించారు. పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ రాంప్రసాద్, డీఎం ప్రసాదరెడ్డిల బృందం వంజంగి హిల్స్‌లో పర్యాటక అభివృద్ధిపై సమగ్ర సర్వే చేపట్టి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. వంజంగి హిల్స్‌కు వస్తున్న పర్యాటకులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు అంచనాలను రూపొందిస్తోంది. అందాలు అద్భుతం సోషల్ మీడియా, అంతర్జాలంలో వంజంగి హిల్స్ ప్రకృతి అందాలు హల్చల్ చేస్తుండటం సంతోషంగా ఉంది. అత్యంత ఎత్తులో ఉన్న బోలెంగమ్మ పర్వతంపై ఉదయం సూర్యోదయం దృశ్యాలు అబ్బురపరుస్తున్నాయి. కుటుంబ సమేతంగా ఈ కొండను సందర్శించాను. వంజంగి హిల్స్ అందాలు అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ పర్యాటకులకు సౌకర్యాలు కల్పించేందుకు ఐటీడీఏ చర్యలు తీసుకుంటోంది. – ఆర్.గోపాలకృష్ణ, పీవో, ఐటీడీఏ, పాడేరు ఉండిపోవాలనిపిస్తుంది వంజంగి హిల్స్‌లోని పాల సముద్రం లాంటి మంచు అందాలు అద్భుతంగా ఉన్నాయి. రాత్రంతా అడవిలో మకాం వేసి తెల్లారకముందే బోలెంగమ్మ శిఖరానికి చేరుకుని సూర్యోదయంతో పాటు మంచు అందాలను వీక్షించాక ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది. – కోడూరు హిమబిందు, యూట్యూబర్, విశాఖపట్నం వంజంగి హిల్స్‌కు ఎలా వెళ్లాలంటే.. విశాఖపట్నం నుంచి పాడేరుకు 117 కిలోమీటర్ల దూరం. ప్రయాణ సమయం 3 గంటలు. పాడేరుకు 8 కిలోమీటర్ల దూరంలో వంజంగి కొండలున్నాయి. పాడేరు నుంచి వంజంగి హిల్స్ జంక్షన్ వరకు పక్కా తారురోడ్డు సౌకర్యం ఉంది. అక్కడి నుంచి వంజంగి హిల్స్‌గా పేరొందిన బోనంగమ్మ కొండ వరకు సుమారు రెండు కిలోమీటర్ల వరకు మట్టి రోడ్డు ఉంది. జంక్షన్ నుంచి బోనంగమ్మ కొండకు కాలినడకన సమయం గంటన్నర నుంచి రెండు గంటలు. ► తెల్లవారుజామున 4 గంటల సమయానికే బోనంగమ్మ కొండకు పర్యాటకులు చేరుకోవాలి. ►రాత్రి బస చేసేందుకు ఎలాంటి కాటేజీలు లేవు. స్థానిక గిరిజనులు టెంట్లను అద్దెకు ఇస్తున్నారు. పాడేరులో లాడ్జీలు అందుబాటులో ఉన్నాయి. ► వంజంగికి ప్రత్యేకంగా రవాణా సౌకర్యాలు అందుబాటులో లేవు. పర్యాటకులు సొంత వాహనాల్లోనే వస్తుంటారు. పాడేరు పట్టణంలోని కార్లు, ఆటోలు మాత్రం ముందుగా బుక్ చేసుకుంటే అద్దెకు వస్తాయి. ► తినడానికి పలు రకాల చికెన్ వంటకాలు, అల్పాహారం, నూడుల్స్, నీళ్లు అమ్ముతారు. ► పాడేరు నుంచి 46 కిలోమీటర్ల దూరంలో అరకులోయ, 30 కిలోమీటర్ల దూరంలో జి.మాడుగుల మండలం కొత్తపల్లి జలపాతం, 60 కిలోమీటర్ల దూరంలో లంబసింగి పర్యాటక ప్రాంతాలున్నాయి. ► పాడేరుకు 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న మత్స్యగుండం క్షేత్రం, పాడేరు మోదకొండమ్మ తల్లి ఆలయం, ఘాట్‌లోని కాఫీ తోటలు, అమ్మవారి పాదాలు గుడి, అక్కడ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఎత్తయిన డల్లాపల్లి ప్రాంతాలు పర్యాటక ప్రాంతాలుగా గుర్తింపు పొందాయి. -
పైన బంగాళాదుంపలు.. అడుగున గంజాయి ప్యాకెట్లు
అగనంపూడి (గాజువాక)/యలమంచిలి రూరల్/పాయకరావుపేట: గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పాడేరు నుంచి తరలిస్తున్న 790 కేజీల గంజాయి బస్తాలను స్వాధీనం చేసుకుని ముగ్గుర్ని అరెస్టు చేశారు. దువ్వాడ సీఐ టి.లక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.. బంగాళాదుంపల లోడు వ్యాన్‌లో అడుగున గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్టు దువ్వాడ పోలీసులకు సమాచారం అందడంతో గురువారం వేకువజామున దువ్వాడ పోలీసులు దాడి చేశారు. అగనంపూడి టోల్‌గేటు వద్ద కాపుకాసి గంజాయి బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. పాడేరు నుంచి వీఎస్‌ఈజెడ్‌కు సమీపంలోని డాక్‌యార్డ్ కాలనీలోని స్టాక్ యార్డ్‌కు వీటిని తరలించి తరువాత, అక్కడి నుంచి నుంచి రైలు లేదా రోడ్డు మార్గంలో తమిళనాడుకు చేరవేయడానికి నిందితులు ప్లాన్ వేశారు. గురువారంఇదే రీతిలో సరుకు తరలిస్తున్న సమయంలో పోలీసులు మాటువేసి సరుకుతోపాటు తమిళనాడుకు చెందిన భాస్కర్ చంద్రశేఖర్, జాన్సన్ శంకర్‌తోపాటు డాక్‌యార్డ్ కాలనీకి చెందిన దుక్కా నరేష్‌లను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్టు సీఐ చెప్పారు. ఈ దాడిలో ఎస్ఐ రామదాస్, సిబ్బంది పాల్గొన్నారు. కాగా, ఆటోలో గంజాయి తరలిస్తుండగా విశాఖ జిల్లా యలమంచిలి మండలం రేగుపాలెం వద్ద అడ్డుకున్నట్టు యలమంచిలి ఎస్ఐ సన్నిబాబు తెలిపారు. 100 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని పాంగి మహేష్ అనే నిందితుడిని అరెస్ట్ చేసి.. రిమాండ్‌కు తరలించినట్టు చెప్పారు. ఇదిలావుండగా.. కారులో తరలిస్తున్న 50 కేజీల గంజాయిని పాయకరావుపేట సమీపంలో పట్టుకుని ఇద్దరిపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ పి.ప్రసాదరావు తెలిపారు. గంజాయి సాగు నిర్మూలనపై అవగాహన సాక్షి, విశాఖపట్నం/పాడేరు: పాడేరు ఏఎస్పీ జగదీష్.. చింతపల్లి ఏఎస్పీ తుషార్‌డుడి ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగును నిర్మూలించాలని సుమారు 600 మంది విద్యార్థులతో అవగాహన కల్పించారు. పాడేరులో తలారిసింగి గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో గిరిజన విద్యార్థులను సమావేశపర్చి గంజాయి సాగు, అక్రమ రవాణా వల్ల గిరిజనులకు జరుగుతున్న నష్టంపై ఏఎస్పీ అవగాహన కల్పించి .. తల్లిదండ్రులను చైతన్యపర్చాలని సూచించారు. అనంతరం ‘గంజాయి సాగు వద్దు–వ్యవసాయమే ముద్దు’ అంటూ ప్రదర్శన చేశారు. ప్లకార్డులతో గిరిజన విద్యార్థులు, పాడేరు ఏఎస్పీ జగదీష్, ఇతర అధికారులు -
అక్రమ ఆపరేషన్లపై సబ్‌కలెక్టర్ విచారణ
పాడేరు: విశాఖ ఏజెన్సీ పాడేరు మండలంలోని మారుమూల గ్రామం ఈదులపాలెంలో మెడికల్ షాపులో అక్రమంగా కుటుంబ సంక్షేమ ఆపరేషన్లు నిర్వహించిన ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణకు కలెక్టర్‌ను ఆదేశించింది. విచారణాధికారిగా నియమితులైన పాడేరు సబ్ కలెక్టర్ వి.అభిషేక్ మంగళవారం ఉదయమే ఈదులపాలెం చేరుకుని విచారణ చేపట్టారు. ఏడీఎంహెచ్‌వో డాక్టర్ కె.లీలాప్రసాద్, తహసీల్దార్ ప్రకాష్‌రావు, ఇతర అధికారులు, ఈదులపాలెం వైద్యుల సమక్షంలో విచారణ నిర్వహించారు. గిరిజన మహిళలకు కుటుంబ సంక్షేమ ఆపరేషన్లు నిర్వహించిన మెడికల్ షాపును తనిఖీ చేశారు. మెడికల్ షాపు నిర్వహకుడితోపాటు సమీప గిరిజనులను కూడా ఆయన విచారించారు. ఆపరేషన్లు చేయించుకున్న కొంతమంది మహిళలను సబ్ కలెక్టర్ పరామర్శించి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. ఇక్కడే ఆపరేషన్లు చేయించుకోవడానికి దారితీసిన పరిస్థితులపై ఆరాతీశారు. ఆపరేషన్లు చేసిన అనకాపల్లికి చెందిన వైద్యుడు, ఫిమేల్ నర్సు వివరాలను సేకరించారు. స్థానికంగా ప్రభుత్వ వైద్య సిబ్బంది ఒకరిద్దరు సహకరించారనే ఆరోపణలపైన కూడా విచారణ జరిపారు. మెడికల్ షాపులో అక్రమంగా ఆపరేషన్లు జరిపారని నిర్ధారణకు వచ్చిన ఆయన పాడేరు పోలీసులకు కూడా తగిన సమాచారం అందించారు. ఆయన సమగ్ర విచారణ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నారు. మరోవైపు జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్లు మెడికల్ షాపును పరిశీలించి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. షాపునకు తాళాలు వేశారు. -
2,520 కిలోల గంజాయితో వ్యాన్ సీజ్
పాడేరు: ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పెద్ద మొత్తంలో పోలీసు శాఖ పట్టుకుంది. మంగళవారం సాయంత్రం విశాఖ జిల్లా పాడేరు మండలం చింతలవీధి జంక్షన్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ఏపీ30యూ3517 నంబర్ గల ఐచర్ వ్యాన్ తనిఖీ చేయగా ఈ గంజాయి అక్రమ రవాణా వెలుగు చూసిందని ఎస్ఐ లక్ష్మణ్ బుధవారం తెలిపారు. వ్యాన్ వెనుక భాగంలో తనిఖీ చేస్తున్న సమయంలో వాహనంలో ఉన్న డ్రైవర్, ఇతర సిబ్బంది తప్పించుకుని పరారయ్యారని ఎస్ఐ తెలిపారు. ఈ ఐచర్ వ్యాన్‌ను సీజ్ చేశామని, 2,520 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.75 లక్షలు ఉంటుందన్నారు. పరారైన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. -
మిరియం సాగులో కేరళకు పోటీ
సాక్షి, విశాఖపట్నం: మిరియాల సాగుకు కేరళ పెట్టింది పేరు. ఇప్పుడు విశాఖ మన్యంలోనూ మిరియాలు సాగవుతున్నాయి. దిగుబడిలోనే కాకుండా నాణ్యతలోనూ మన్యం మిరియం కేరళకు గట్టి పోటీ ఇస్తోంది. కేరళలో పండే మిరియాల కంటే నాణ్యమైన ఆర్గానిక్ మిరియాలను విశాఖ మన్యం అందిస్తోంది. ఎరువులు, క్రిమి సంహారక మందులు వాడకుండానే.. ఇంకా చెప్పాలంటే పైసా పెట్టుబడి లేకుండానే గిరిజన రైతులు వీటిని పండిస్తున్నారు. ఈ ఏడాది ఒక్క మిరియాల పంట ద్వారానే మన్యం రైతులు రూ.150 కోట్ల వరకూ ఆదాయాన్ని ఆర్జించారంటే విశేషమే మరి. విశాఖ మన్యంలో కాఫీ తోటల్లో అంతర పంటగా మిరియాల సాగు జరుగుతోంది. కాఫీ తోటల ద్వారా కాపును బట్టి ఎకరానికి రూ.25 వేల నుంచి రూ.40 వేల వరకూ ఆదాయం వస్తుంటే.. అందులో అంతర పంటగా వేస్తున్న మిరియాలతో రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకూ అదనపు ఆదాయం సమకూరుతోంది. 98 వేల ఎకరాల్లో అంతర పంటగా.. మిరియాల సాగుకు సూర్యరశ్మితో పాటు తగిన నీడ కూడా ఉండాలి. నీరు నిలవని ఏటవాలు భూమి అవసరం. పాదులు 20 నుంచి 30 అడుగుల ఎత్తుకు పెరుగుతాయి కాబట్టి వాటికి ఆసరాగా ఎత్తయిన చెట్లు ఉండాలి. విశాఖ మన్యంలోని కొండవాలు ప్రాంతాలు సాగుకు అనుకూలంగా ఉండటంతో ప్రస్తుతం 98 వేల ఎకరాల కాఫీ తోటల్లో రైతులు అంతర పంటగా మిరియాల పాదులు వేశారు. ఒకసారి మొక్క వేస్తే రెండో ఏట నుంచే కాపు మొదలవుతుంది. 20 సంవత్సరాల పాటు జనవరి నుంచి ఏప్రిల్–మే నెల వరకూ ఫలసాయం వస్తుంది. ఈ ప్రాంతంలో కాఫీ మొక్కలకు నీడ కోసం పొడవుగా ఎదిగే సిల్వర్ ఓక్ చెట్లను పెంచుతున్నారు. ఆ చెట్ల మొదలులో మిరియం మొక్కలు నాటుతున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో.. పాడేరు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ద్వారా గిరిజన రైతులను మిరియాల సాగు వైపు ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ప్రస్తుతం కరియా ముండ, పన్నియూరు–1 అనే రకాల మిరియాలు సాగవుతున్నాయి. వాటికన్నా అధిక దిగుబడి, నాణ్యమైన ఉత్పత్తిని ఇచ్చే మేలు రకాల మొక్కల (మదర్ ప్లాంట్ల)ను కోజికోడ్‌లోని భారత సుగంధ ద్రవ్యాల పరిశోధన సంస్థ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ్–ఐఐఎస్ఆర్) నుంచి తీసుకొచ్చి చింతపల్లిలో నర్సరీల్లో అభివృద్ధి చేస్తున్నారు. వీటిలో శక్తి, మలబార్ ఎక్సెల్, పౌర్ణమి, గిరిముండ, పంచమి, శుభకర, శ్రీకర రకాల మొక్కలు ఉన్నాయి. రికార్డు స్థాయిలో దిగుబడి వాతావరణం అనుకూలించడంతో ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో దాదాపు 4 వేల మెట్రిక్ టన్నుల మిరియాల దిగుబడి వచి్చంది. 3.2 కిలోల పచ్చి మిరియాలను ఎండబెడితే ఒక కిలో ఎండు మిరియాలు వస్తాయి. వాటి ధర కిలో రూ.360 నుంచి రూ.400 వరకూ ఉంది. ఈ లెక్కన గిరిజన రైతులకు దాదాపు రూ.150 కోట్ల వరకూ అదనపు ఆదాయం మిరియాలతో సమకూరింది. లాభసాటి మొక్కల అభివృద్ధి కేరళ నుంచి లాభసాటి రకాల మిరియం మొక్కలను తెచ్చి నర్సరీల్లో అంట్లు కట్టడం ద్వారా అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పటికే జీకే వీధి, చింతపల్లి, పాడేరు మండలాల్లో రైతులకు మొక్కలు ఉచితంగా పంపిణీ ప్రారంభించాం. రానున్న రోజుల్లో మిగతా మండలాల్లోనూ అందిస్తాం. ఎకరాకు వంద మొక్కలు చొప్పున అవసరమవుతున్నాయి. – రాధాకృష్ణ, ఉద్యాన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, పాడేరు ఐటీడీఏ రైతులకు సహకారం ఎరువులు, సస్యరక్షణ ఖర్చు లేకపోయినా మిరియాల కోత రైతులకు కాస్త కష్టమైన పని. ఇందుకు వెదురుతో చేసిన నిచ్చెనలు వాడుతున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్పైస్ బోర్డు అభివృద్ధి చేసిన అల్యూమినియం నిచ్చెనలను ఉచితంగా సమకూరుస్తున్నాం. క్లీనింగ్, గ్రేడింగ్ మెషిన్లను ఇస్తున్నాం. ఇప్పటివరకూ 20 వేల మంది రైతులకు బృందాల వారీగా సమకూర్చాం. – డాక్టర్ వెంకటేశ్వర్ సలిజామల, ప్రాజెక్టు అధికారి, పాడేరు ఐటీడీఏ -
1,744 కిలోల గంజాయి స్వాధీనం
పాడేరు: విశాఖ జిల్లాలో బుధవారం భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పాడేరులో 1,200 కిలోలు, మర్రిబంద వద్ద 544 కిలోలు పట్టుకున్నారు. వ్యాన్‌లో పసుపు బస్తాల మాటున తరలిస్తున్న 1,200 కిలోల గంజాయిని పాడేరు పాత బస్టాండ్ వద్ద అంబేడ్కర్ సెంటర్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముంచంగిపుట్టు మండలం జోలాపుట్టు ప్రాంతం నుంచి పసుపు లోడుతో వస్తున్న వ్యాన్‌ను తనిఖీ చేయగా పసుపు బస్తాల కింద గంజాయి బస్తాలున్నట్లు గుర్తించారు. గంజాయిని స్వాధీనం చేసుకుని డ్రైవర్, క్లీనర్‌తో పాటు మరో గిరిజనుడిని అరెస్టు చేశారు. ఈ గంజాయి విలువ రూ.36 లక్షలు ఉంటుందని ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. యలమంచిలి మండలం మర్రిబంద వద్ద 544 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు సీఐ వి.నారాయణరావు తెలిపారు. దీన్ని తరలిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. -
‘నేను ఎవరికీ ఇష్టం లేదు.. బతకాలని లేదు’
సాక్షి, కొయ్యూరు(పాడేరు): ‘నేనంటే ఇంటిలో ఎవరికీ ఇష్టం లేదు... నాకు నేనే నచ్చను.. సంతోషం ఆవిరవుతున్న క్షణం ఇది.. నాకు బతకాలని లేదు..’ అంటూ లేఖ రాసి ఓ విద్యార్థి డార్మెటరీలో కట్‌చేసిన రగ్గు పీలికతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానిక గురుకుల పాఠశాలలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పాడేరు మండలం లగిజేపల్లి పంచాయతీ గురుపల్లికి చెందిన పూజారి హరికృష్ణరాజు, సరస్వతి కుమారుడు సౌజిత్‌రాజు (15) స్థానిక గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఐదేళ్లుగా ఇదే పాఠశాలలో చదువుతున్నాడు. అమ్మ ఒడి పథకానికి సంబంధించి పాఠశాలలో సోమవారం విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు నిర్వహించిన సమావేశంలో రాజు పాల్గొన్నాడు. అతని తల్లిదండ్రులు హాజరుకాలేదు. పండగ సెలవులు ఇవ్వడంతో మధ్యాహ్న భోజనం అనంతరం విద్యార్థులందరూ తమ స్వగ్రామాలకు వెళ్లిపోయారు. స్వగ్రామాలకు వెళ్తున్నట్టు అందరితో పాటు సౌజిత్‌రాజు కూడా రిజిస్టర్లో సంతకం చేశాడు. మా నాన్న వచ్చి నన్ను తీసుకెళ్తాడని స్నేహితులతో చెప్పి అక్కడే ఉండిపోయాడు. సాయంత్రం ఆరుగంటలకు ఒకసారి, ఎనిమిది గంటలకు మరోసారి పాఠశాల వాచ్‌మన్ కోటి డార్మెటరీలో గదులన్నీ చెక్ చేశాడు. విద్యార్థులెవరూ కనిపించలేదు. చదవండి: ప్రాణం తీసిన గూగుల్ మ్యాప్స్..! మంగళవారం ఉదయం లైట్లు ఆర్పేందుకు వెళ్లిన కోటికి సౌజిత్‌రాజు విగతజీవిగా కనిపించాడు. వెంటనే ప్రిన్సిపాల్ శ్రీనివాసరావుకు సమాచారం అందించడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొయ్యూరు సీఐ వెంకటరమణ, ఎస్ఐ నాగేంద్రలు పాఠశాలకు వెళ్లి పరిశీలించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులను విచారణ జరుపుతామని సీఐ,ఎస్ఐలు తెలిపారు. అందరితో పాటు పాఠశాల నుంచి బయటకు వెళ్లిపోయిన రాజు అర్ధరాత్రి సమయంలో డార్మెటరీకి చేరుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. సమాచారం తెలుసుకుని రాజు తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని గుండెలవిసేలా రోదించారు. స్నేహితులు, పాఠశాల సిబ్బంది శోకసంద్రంలో మునిగిపోయారు. పర్యవేక్షణ సరిగా లేకపోవడంతోనే ఇలా జరిగిందని రాజు బంధువులు, తల్లిదండ్రులు కొద్ది సేపు వాచ్‌మన్ కోటితో వాగ్వాదం చేశారు. చదవండి: ‘చోర్ సింగర్’.. సిటీలోనూ వాంటెడ్ !! లేఖను చదువుతున్న తండ్రి హరికృష్ణరాజు తదితరులు రాజు కోసం వడ్డాది వెళ్లాం.. శుక్ర, శనివారాల్లో పాఠశాలకు రెండు సార్లు ఫోన్ చేస్తే సోమవారం అమ్మఒడి సమావేశం అయిన తరువాత ఇంటికి పంపిస్తామని చెప్పారు. దీంతో రాజు వస్తాడని సోమవారం రాత్రి వడ్డాది వెళ్లాం. అక్కడ చాలా సేపు వేచి ఉన్నామని రాజు తండ్రి హరికృష్ణరాజు విలపిస్తూ విలేకరులకు తెలిపాడు. రాత్రి తొమ్మిది గంటలు దాటిన తరువాత వడ్డాది నుంచి పాడేరు వచ్చేందుకు ఎలాంటి వాహనాలు ఉండవు. దీంతో తమ బిడ్డ వడ్డాదిలో ఉండిపోయి ఉంటాడని భావించి అక్కడ వెతికామని చెప్పారు. ఎక్కడా కనిపించకపోవడంతో మంగళవారం వస్తాడన్న ఆశతో వెళ్లిపోయామన్నారు. ఉదయం లేవగానే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడన్న పిడుగులాంటి వార్త వినాల్సి వచ్చిందని వాపోయాడు. ఆరు పేజీల లేఖ ఆత్మహత్య చేసుకునే ముందు సౌజిత్ రాజు ఆరు పేజీల లేఖ రాశాడు. ఇంగ్లిష్ మీడియం కావడంతో తెలుగులో తప్పులు వస్తాయని పేర్కొన్నాడు. చిన్ననాటి విషయాలు, స్నేహితులతో ఆడుకున్న పాత జ్ఞాపకాలు ప్రస్తావించాడు. నాకు ఒత్తిడి పెరిగిపోతోంది. ఇంటికి వెళ్లాలంటే భయంగా ఉందని తెలిపాడు. తల్లిదండ్రులు మందలించారని పేర్కొన్నాడు. సొంత గ్రామానికి వెళ్లాలని లేదని తెలిపాడు. పరీక్షల అట్ట, కొన్ని నోట్‌పుస్తకాలపై పబ్జీతోపాటు ప్రీఫైర్ ఆటల బొమ్మలు వేసి ఉన్నాయి. అయితే ఈ ఆటలంటే నాటు ఇష్టం లేదంటూ ఆ లేఖలో తెలిపాడు. నా చావుకు ఎవరూ బాధ్యులు కారని పేర్కొన్నాడు. -
అన్నలారా.. మేమెలా బతకాలి?
సాక్షి, పాడేరు: అన్నల్లారా.. అమాయక గిరిజనులను చంపకండి! నా భర్త కృష్ణారావును అన్యాయంగా హతమార్చారు. కనీసం ప్రజాకోర్టు కూడా నిర్వహించకుండానే అర్ధరాత్రి సమయంలో తీసుకువెళ్లి దారుణంగా చంపడం న్యాయమా.. అంటూ కృష్ణారావు భార్య గెమ్మెలి సిరుసో కన్నీటిపర్యంతమయ్యారు. జి.మాడుగుల మండలం వాకపల్లి గ్రామంలో పోలీసు ఇన్ఫార్మర్ నెపంతో గెమ్మెలి కృష్ణారావు అనే గిరిజనుడిని మావోయిస్టులు ఆదివారం అర్ధరాత్రి హతమార్చారు. కృష్ణారావు మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం జి.మాడుగుల సీఐ జి.డి.బాబు, ఇతర పోలీసులు పాడేరు జిల్లా ఆస్పత్రిలోని మార్చురీకి సోమవారం తీసుకువచ్చారు. చదవండి: (మన్యంలో మావోయిస్టుల ఘాతుకం) కృష్ణారావు మృతదేహానికి శవపరీక్షలు జరుపుతున్న సమయంలోనే మృతుడి భార్య సిరుసోతో పాటు వదిన గెమ్మెలి పార్వతమ్మ, ఇతర కుటుంబ సభ్యులంతా మావోయిస్టుల హత్యాకాండను నిరసించారు. సిరుసో మాట్లాడుతూ తన భర్త కృష్ణారావు పోలీసుల ఇన్ఫార్మర్ కాదని.. గ్రామంలో వ్యవసాయ పనులు, కూలీనాలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, పోలీస్ ఇన్ఫార్మర్ ముద్ర వేసి చంపడం దారుణమన్నారు. తన భర్త మొదటి భార్య చనిపోయిందని, ఆమెకు పుట్టిన బిడ్డతోపాటు తనకు జన్మించిన ముగ్గురు పిల్లలు మొత్తం నలుగురిని మావోయిస్టులు అనాథలను చేశారని వాపోయారు. మృతుడి వదిన గెమ్మెలి పార్వతమ్మ మాట్లాడుతూ మావోయిస్టులు ఎప్పుడూ ఎలాంటి హెచ్చరికలు చేయలేదని, కృష్ణారావు పోలీసు ఇన్ఫార్మర్గా పనిచేయలేదని, ప్రజాకోర్టు కూడా నిర్వహించకుండానే తన మరిదిని అన్యాయంగా చంపారని ఆందోళన వ్యక్తం చేశారు. మావోయిస్టులు అమాయక గిరిజనులను చంపవద్దని, తమలాంటి కుటుంబాలను వీధిపాలు చేయవద్దని ఆమె ప్రాధేయపడ్డారు. వాకపల్లికి కృష్ణారావు మృతదేహం తరలింపు మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన గెమ్మెలి కృష్ణారావు మృతదేహానికి పాడేరు జిల్లా ఆస్పత్రిలో వైద్యులు శవపరీక్ష నిర్వహించారు. పాడేరు డీఎస్పీ డాక్టర్ వీబీ రాజ్‌కమల్, జి.మాడుగుల సీఐ జి.డి.బాబు, ఇతర పోలీసులంతా జిల్లా ఆస్పత్రి శవపరీక్షల విభాగానికి చేరుకున్నారు. శవపరీక్షలను దగ్గరుండి జరిపించారు. అనంతరం కృష్ణారావు మృతదేహాన్ని అంబులెన్సులో వాకపల్లికి తరలించారు. -
పీపీఈ కిట్‌తో వ్యక్తి హల్చల్.. పరుగో పరుగు
సాక్షి, విశాఖపట్నం : విశాఖ మన్యంలో పీపీ కిట్‌తో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. అతన్ని చూసిన జనాలు భయంలో పరుగులు తీశారు. వివరాల్లోకి వెళితే.. పాడేరు రహదారిపై శనివారం ఉదయం ఓ వ్యక్తి రోడ్డుపై పీపీఈ కిట్ ధరించి కనిపించాడు. కనిపించిన వారందరిని పలకరిస్తూ దగ్గరకు వెళ్లాడానికి ప్రయత్నించాడు. దీంతో ప్రజలు అతను కోవిడ్ రోగిగా భావించి దూరంగా పరుగులు తీశారు. విషయం తెలిసిన వైద్య అధికారులు తమ ఆసుపత్రిలో ఉన్న రోగులను సరి చూసుకున్నారు.అందరూ ఉండడంతో ఆ వ్యక్తి రోగి కాదని గుర్తించారు. చదవండి: ఈ చిన్నారి నా హృదయాన్ని దోచుకున్నాడు: కేటీఆర్ అయితే వ్యర్థాలతో పడేసిన పీపీఈ కిట్‌ను ధరించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దాదాపు రెండు గంటల పాటు పాడేరు మెయిన్ రోడ్డుపై ఈ అపరిచితుడు సంచరించడంతో ప్రజలకు కొంత ఆందోళనకు గురయ్యారు. తీరా అతన్ని ఆపి దూరం నుంచే ప్రశ్నించగా.. ఆ వ్యక్తి చెప్పిన సమాధానం విని అందరూ షాక్‌కు గురయ్యారు. చలి తీవ్రత తట్టుకోలేక పీపీఈ కిట్ వేసుకున్నానని చెప్పడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం అతనితో పీపీఈ కిట్ విప్పించి అక్కడి నుంచి పంపించి వేశారు. -
విశాఖపట్నం: పీపీఈ కిట్‌తో హల్చల్..
-
పెళ్లి కొడుకు మృతి, 9మందికి తీవ్రగాయాలు
సాక్షి, జి.మాడుగుల (పాడేరు): మండలంలో గడుతూరు పంచాయతీ మగతపాలెం గ్రామం వద్ద శుక్రవారం రాత్రి వ్యాన్ బోల్తా ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉండగా, 35 మందికి స్వల్ప గాయాలయ్యాయి. వివరాల్లోకెళ్తే.. గూడెంకొత్తవీధి మండలం రింతాడ పంచాయతీ, కడుగుల గ్రామానికి చెందిన గిరిజన యువకుడు వంతాల శివ వారం రోజుల క్రితం మగతపాలెం గ్రామానికి చెందిన గిరిజన యువతిని వివాహం చేసుకున్నాడు. కడుగుల గ్రామం నుంచి వ్యాన్‌లో నవ వధూవరులు, వారి బంధువులు చుట్టరికం నిమిత్తం గురువారం మగతపాలెం వచ్చారు. అక్కడి నుంచి శుక్రవారం రాత్రి 45 మంది వ్యాన్‌లో తిరుగు పయనమయ్యారు. (దారుణం: అత్యాచారం.. ఆపై నోట్లో గడ్డిమందు పోసి) మగతపాలెం సమీపంలోని ఘాట్‌రోడ్డుకు వచ్చేసరికి వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. ఇదే వ్యాన్‌లో ఉన్న పెళ్లి కొడుకుతో పాటు, కడుగుల గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. సీదరి పొట్టి, వంతాల పండు, వంతాల శివ, రవి, శ్రీరాములు, కృష్ణ, పవన్బాబు, వంతాల వెంకటరావుతోపాటు మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తుండగా పెళ్లికొడుకు వంతాల శివ మార్గం మధ్యలో మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఉపేంద్ర తెలిపారు. -
'సీఎం వైఎస్ జగన్ అన్ని వర్గాల అభిమాని'
సాక్షి, విశాఖపట్నం: మెడికల్ కళాశాల స్థలాలను బుధవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని.. మంత్రులు అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్, అరకు ఎంపీ మాధవి, ఎమ్మెల్యే ఫల్గుణ, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిలతో కలిసి పరిశీలించారు. పర్యటనలో భాగంగా త్వరలో నిర్వహించే మెడికల్ కాలేజీ నమూనాలను పరిశీలించిన మంత్రి ఆళ్ల నాని అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మంత్రుల బృందం పాడేరులో వైద్యాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి ఆళ్ల నాని మట్లాడుతూ.. టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి 35 ఎకరాలు మెడికల్ కాలేజీ కోసం కేటాయించాం. పాడేరు మెడికల్ కాలేజ్ నిర్మాణ పనులకు ఆగస్టులో టెండర్లు పిలుస్తాం. పాడేరు మెడికల్ కాలేజీ ఆవరణలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని కూడా ఏర్పాటు చేస్తాం. అన్ని పనులు అత్యంత త్వరితగతిన పూర్తి చేసి మెడికల్ తరగతులు ప్రారంభం అయ్యేలా ఏర్పాట్లు చేయనున్నట్లు మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు.చదవండి: ఈ నెల 11న ఏపీ కేబినెట్ సమావేశం మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. 'సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల అభిమాని. అదనంగా గిరిజనుల పక్షపాతి. గిరిజనుల ఆరోగ్యం కోసం అన్ని రకాలుగా సీఎం శ్రద్ధ వహిస్తున్నారు. త్వరలో ఈ ప్రాంతంలో మెడికల్ కాలేజీ నిర్మాణంతో గిరిజనుల జీవితాలు మారనున్నాయని' అవంతి శ్రీనివాస్ తెలిపారు. కాగా రాష్ట్రంలోని గిరిజన ప్రాంతంలో తొలిసారిగా మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గత ఏడాది నిర్ణయించారు. అందులో భాగంగానే పాడేరు, అనకాపల్లి ప్రాంతాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు స్థలాలను పరిశీలించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అలాగే.. పాడేరులో మెడికల్ కాలేజీ కోసం స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల పక్కనున్న 35 ఎకరాల భూమిని గుర్తించి ఇప్పటికే ప్రభుత్వానికి అధికారులు స్వాధీనం చేశారు. ఈ కాలేజీకి కేంద్ర ప్రభుత్వం పీఎంఎస్ఎస్వై కింద రూ.195 కోట్లను తన వాటాగా మంజూరు చేసిన విషయం తెలిసిందే. అనకాపల్లి మెడికల్ కాలేజీ కోసం అనకాపల్లి మండలం గొలగాం, కోడూరు, పిసినికాడ గ్రామాల్లో ఖాళీ స్థలాలను ప్రాథమికంగా గుర్తించారు. చదవండి: పెనుముప్పుగా నిబంధనల ఉల్లంఘన..! -
పాడేరు టు తమిళనాడు
నెల్లూరు(క్రైమ్): విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతమైన పాడేరు నుంచి తమిళనాడుకు గంజాయి అక్రమరవాణా చేస్తున్న ఇద్దరు మహిళలను నెల్లూరులోని చిన్నబజారు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.2.50 లక్షల విలువచేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం చిన్నబజారు పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నగర డీఎస్పీ జె.శ్రీనివాసులురెడ్డి వివరాలను వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రం తేని జిల్లా ఉత్తమపాళ్యం తేవారం గ్రామానికి చెందిన తంగమాయన్ మణిమాల కొంతకాలంగా విశాఖపట్నంలోని ఏజెన్సీ ప్రాంతమైన పాడేరులో తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి తమిళనాడుకు తరలించేది. అక్కడ అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకోసాగింది. పాడేరు, చోడవరం పోలీసులు గతంలో ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. కొంతకాలం క్రితం ఆమెను నెల్లూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. 15 రోజుల క్రితం కండీషన్ బెయిల్ (ప్రతి గురువారం నెల్లూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో హాజరవ్వాలి)పై ఆమె జైలు నుంచి విడుదలైంది. వియ్యంకురాలితో కలిసి.. పలుమార్లు జైలుకు వెళ్లినా మణిమాల ప్రవర్తనలో మార్పురాలేదు. ఈ నేపథ్యంలో ఆమె తమిళనాడు రాష్ట్రం తేని జిల్లా ఉత్తమపాళ్యం కులంతేవర్కు చెందిన తన వియ్యంకురాలు జయపాల్ తమిళ్రాశితో కలిసి గంజాయి అక్రమరవాణా చేయసాగింది. అందులో భాగంగా వారు రెండురోజుల క్రితం పాడేరు దాని పరిసర ప్రాంతాల్లో రూ.2.20 లక్షలు విలువచేసే 22 కేజీల గంజాయిని కొనుగోలు చేశారు. వాటిని ఎవరికీ అనుమానం రాకుండా ప్యాక్ చేసి తమిళనాడుకు బయలుదేరారు. అయితే గురువారం కండిషన్ బెయిల్ నిమిత్తం నెల్లూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో హాజరుకావాల్సి ఉండడంతో తిరిగి తమ గ్రామం నుంచి రావడం కష్టం అవుతుందని మణిమాల భావించింది. నెల్లూరులో దిగి రెండురోజులు ఏదో ఒక లాడ్జిలో ఉండి గురువారం పోలీస్‌స్టేషన్‌లో హాజరై తిరిగి తమ గ్రామానికి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని మణిమాల తన వియ్యంకురాలికి తెలియజేసి ఇద్దరూ కలిసి ఈనెల 18వ తేదీ సాయంత్రం నెల్లూరుకు చేరుకున్నారు. మద్రాస్ బస్టాండ్‌లో ఓ హోటల్ సమీపంలో ఆటో కోసం వేచి ఉండగా వారి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందనే సమాచారం చిన్నబజారు ఇన్స్పెక్టర్ ఎం.మధుబాబుకు సమాచారం అందింది. దీంతో ఆయన తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. వారివద్దనున్న బ్యాగుల్లో గంజాయిని గుర్తించారు. గంజాయి ప్యాకెట్లతోపాటు రెండు సెల్ఫోన్లు, రూ.1,450 నగదు స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారిని విచారించి కేసు నమోదుచేసి అరెస్ట్ చేశామని డీఎస్పీ తెలిపారు. సిబ్బందికి అభినందన నిందితులను అరెస్ట్ చేసి పెద్దఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకునేందుకు కృషిచేసిన ఇన్స్పెక్టర్ మధుబాబు, ఎస్సై రవినాయక్, ఏఎస్సై శ్రీహరి, హెడ్‌కానిస్టేబుల్ భాస్కర్‌రెడ్డి, క్రైమ్ కానిస్టేబుల్ రాజా తదితరులను డీఎస్పీ అభినందించారు. సమావేశంలో ఇన్స్పెక్టర్ ఎం.మధుబాబు, ఎస్సై రవినాయక్ తదితరులు పాల్గొన్నారు. -
మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం
-
ఆర్ఆర్ఆర్ షూటింగ్ వీడియో వైరల్
పాడేరు: దర్శకధీరుడు రాజమౌళి సినిమాల షూటింగ్‌లన్నీ గోప్యంగానే జరుగుతాయి. చివరి వరకు సినిమాలో ముఖ్య అంశాలు వెలుగులోకి రాకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. జూనియర్ ఎనీ్టఆర్, రామ్‌చరణ్‌లు హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలోనే ఇదే పంథాను అనుసరించారు. అయితే పాడేరు ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కొమరం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్ లుక్ ఇప్పుడు బయటకు రావడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. పాడేరు ప్రాంతంలో రెండు రోజుల నుంచి ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అమ్మవారి పాదాల గుడికి దూరంగా ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ షూటింగ్ జరుగుతోంది. షూటింగ్ ప్రాంతానికి సినీ అభిమానులను, మీడియాను కూడా చిత్రం యూనిట్ రానివ్వడం లేదు. మంగళవారం జూనియర్ ఎన్టీఆర్ అడవిలో జరిగిన షూటింగ్లో పాల్గొని,రాత్రికి హైదరాబాద్ వెళ్లిపోయారు. అయితే ఈ జూనియర్ ఎనీ్టఆర్ కొమరం భీమ్ పాత్రలో నటించిన పలు సన్నివేశాల చిత్రీకరణకు సంబంధించిన బయటకు వచ్చేసింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాతో పాటు పలు టీవీ చానళ్లలో హల్చల్ చేసింది. బుధవారం జరిగిన షూటింగ్లో మాత్రం జూనియర్ ఎనీ్టఆర్ పాల్గొనలేదు. మిగిలిన నటులతో యుద్ధ సన్నివేశాలను దర్శకుడు రాజమౌళి చిత్రీకరించారు. వీడియో క్లిప్ వైరల్‌పై దర్శకుడు రాజమౌళి గుర్రుగా ఉన్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన ఎన్టీఆర్ లుక్‌ను బుధవారం రివీల్ చేసేశారు. -
ఉపాధ్యాయురాలిపై మృగాడి వికృత చేష్టలు
సాక్షి, పాడేరు: విశాఖ మన్యంలో ఓ మృగాడి వికృత చేష్టలకు గిరిజన ఉపాధ్యాయురాలు మానసిక క్షోభను అనుభవిస్తుంది. రోజు రోజుకు ఆగడాలు శృతిమించుతుండడంతో ఎట్టకేలకు ఉపాధ్యాయ సంఘాలతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనకు సంబంధించి ప్రాథమిక సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పాడేరు ప్రాంతంలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న గిరిజన మహిళ భర్త 15 నెలల క్రితం మృతి చెందాడు. దీంతో ఆమె తన ఇద్దరి పిల్లలతో కలిసి నివసిస్తుంది. పొట్టకూటి కోసం వలస వచ్చిన తూర్పుగోదావరి జిల్లా దివిలీకి చెందిన ఆకుల అచ్యుత్‌కుమార్ చూపు ఆమెపై పడింది. తాను అండగా ఉంటానని, ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మ బలికాడు. ఆమెతో సన్నిహితంగా ఉంటూ రహస్యంగా ఉపాధ్యాయురాలి ఫొటోలు చిత్రీకరించాడు. ఏజెన్సీలో పనిచేస్తున్న సుమారు 250 మంది ఉపాధ్యాయుల ఫోన్ నంబర్లు సేకరించి వాట్సాఫ్ గ్రూపు తయారు చేశాడు. వాట్సాప్ గ్రూపుతో పాటు ఫేస్బుక్లో కూడా ఉపాధ్యాయురాలి అసభ్యకర ఫొటోలను అప్లోడ్ చేశాడు. ఈ సంఘటనపై ఆమె గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. రోజు రోజుకు అచ్యుత్ కుమార్ ఆగడాలు ఎక్కువ కావడంతో ఇటీవల ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చదవండి: మద్యం, మాంసం రుచిచూపి.. ప్రియుడితో కలిసి ఈ విషయం తెలుసుకున్న తోటి ఉపాధ్యాయులు ఆమెకు ధైర్య చెప్పి మరోసారి మహిళ ఉద్యోగ సంఘం తరఫున పోలీసులకు వాస్తవాలను వివరించి సాక్ష్యాలను అందజేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. ఈ సంఘటనపై పోలీసుల వాదన మరోలా ఉంది. ఉపాధ్యాయురాలి భర్త చనిపోయిన అనంతరం అచ్యుత్‌కుమార్, ఉపాధ్యాయురాలు అన్నవరం దేవస్థానంలో వివాహం చేసుకున్నారని, కుటుంబ కారణాల రీత్యా వీరిద్దరు దూరమయ్యారంటున్నారు. తన భార్యతో కలిసే ఉంటానని కోర్టును ఆశ్రయించగా భార్య పోలీసు స్టేషనులో వేధిస్తున్నట్టు పోలీసులకు ఫిర్యాదు చేసిందన్నారు. కొన్నాళ్ల తర్వాత వీరిద్దరు కలిసారని, అచ్యుత్‌కుమార్ వద్ద ఉంటున్న మొబైల్లో ఓ వీడియో బయటకు వచ్చిందన్నారు. ఉపాధ్యాయురాలి ఫిర్యాదు మేరకు ఈ నెల 6న పాడేరులో అచ్యుత్‌కుమార్‌ను పట్టుకునే ప్రయత్నం చేయగా తమపై దాడికి ప్రయత్నించారన్నారు. దీంతో నిందితుడిపై రెండు కేసులు నమోదు చేసి 6న రాత్రి రిమాండ్‌కు పంపించామని చెప్పారు. ఉపాధ్యాయురాలు పోలీసులపై చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. -
‘మూడు నెలలలోనే హామీ నెరవేర్చారు’
సాక్షి, విశాఖపట్నం: బాక్సైట్ తవ్వకాల లీజు రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని వైఎస్సార్సీపీ పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అన్నారు. గిరిజనులందరి తరఫున తాము సీఎంకు కృతజ్ణతలు చెబుతున్నామన్నారు. తవ్వకాల ద్వారా వచ్చే కోట్ల రూపాయిల ఆదాయంపైనే గత ప్రభుత్వం దృష్టి పెట్టిందనివిమర్శించారు. బాక్సైట్ తవ్వకాలను నిషేదిస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చి మోసం చేసిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు జీఓ నెంబర్ 97 తీసుకువచ్చి బాక్సైట్ తవ్వకాలకు అనుమతిచ్చారని గుర్తుచేశారు. ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి శుక్రవారం విశాఖపట్నంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘ఎన్నికల ముందు బాక్సైట్ తవ్వకాల లీజును రద్దు చేస్తానని చెప్పిన వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చారు. మూడు నెలలలోనే మాట నిలబెట్టుకున్నారు. వైఎస్ జగన్ నిర్ణయాన్ని చాలా మంది హేళన చేశారు. బాక్సైట్ తవ్వకాలు జరిపితే కోట్ల రూపాయిల ఆదాయం ప్రభుత్వానికి వస్తుందంటున్నారు. కానీ బాక్సైట్ తవ్వకాలతో వచ్చే ఆదాయం కన్నా గిరిజనుల జీవితాలే ముఖ్యమనుకున్నారు. బాక్సైట్ తవ్వకాల లీజు రద్దు చేయడం వల్ల గిరిజనులంతా జీవితాంతం వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటాం.’ అని అన్నారు. -
శునక విశ్వాసం; యజమాని మృతదేహం లభ్యం
సాక్షి, పాడేరు(విశాఖపట్టణం) : విశాఖ ఏజెన్సీలో భారీ వర్షాల కారణంగా మత్స్యగెడ్డలో గల్లంతైన గిరిజనుడి ఆచూకీ కొన్ని రోజుల తర్వాత అతని పెంపుడు కుక్క కారణంగా లభ్యమైంది. పాడేరు మండలం పాతరపుట్టుకి చెందిన లక్ష్మయ్య 20 రోజుల క్రితం వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి వస్తున్న సమయంలో మత్స్యగెడ్డ ప్రవాహానికి కొట్టుకుపోయాడు. కుటుంబ సభ్యులు మృతదేహం కోసం ఎంత గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. కాగా అతడి పెంపుడు కుక్క మాత్రం పట్టు వదలకుండా గాలిస్తూనే ఉంది. చివరికి వరద ఉధృతి తగ్గడంతో మంగళవారం మధ్యాహ్నం ఇసుక దిబ్బల్లో కూరుకుపోయిన లక్ష్మయ్య మృతదేహం జాడ కనుక్కుంది. కాళ్లతో అతడి చొక్కాను బయటకు లాగే ప్రయత్నం చేసింది. వెంటనే దుర్వాసన రావడంతో కుటుంబ సభ్యులు వచ్చి మృతదేహాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని ఆర్ఐ వెంకటరమణ, వీఆర్ఏ సింహాచలానికి చేరవేశారు. పెంపుడు కుక్క పుణ్యమా అని ఎట్టకేలకు మృతదేహం లభ్యమైంది. అయితే వ్యక్తి చనిపోయాడన్న వార్త తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. -
పాడేరులో గిరిజన మెడికల్ కాలేజ్
సాక్షి, అమరావతి : గిరిజనులకు వైద్య సేవలదించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం జిల్లాలోని పాడేరులో గిరిజన మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పాడేరు ఏరియా ఆస్పత్రిలోనే గిరిజన మెడికల్ కాలేజ్‌ను తాత్కాలికంగా ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీనికి వైఎస్సార్ ట్రైబల్ మెడికల్ కాలేజీగా నామకరణం చేసింది. గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందించడం కోసం ఈ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
టూరిస్ట్ బస్సు బోల్తా,ముగ్గురు మృతి
-
విశాఖలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
సాక్షి, విశాఖ పట్నం : జిల్లాలోని పాడేరు మండలం వంటలమామిడి ఘట్రోడ్డులో మంగళవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి ప్రైవేట్ టూరిస్ట్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందగా మరో 37 మంది ప్రయాణీకులకు తీవ్ర గాయాలయ్యాయి.బస్సు బ్రేకులు ఫెయిల్ అవ్వడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. కాకినాడకు చెందిన కొంత మంది భక్తులు రాయగడ మజ్జి గౌరమ్మ ఆలయానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో పాడేరు నుంచి విశాఖ వచ్చే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. మల్లన్న దర్శనం కోసం వెళ్తుండగా... నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిలో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి చెట్టును ఢికొట్టింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సున్నిపెంట ఆసుపత్రికి తరలించారు. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రకు చెందిన జగధీశ్వర్‌రెడ్డి భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. -
ఈశ్వరి... నిన్ను నమ్మం
సాక్షి, విశాఖపట్నం: ‘‘చంద్రబాబు ఖబడ్దార్.. గిరిజనుల జోలికొస్తే తాట తీస్తా.. బాక్సైట్ జోలికి వస్తే మా సంప్రదాయ ఆయుధాలతో తల నరకుతా.. నీకు దమ్ముంటే నాపై పోటీకి దిగు.. బాక్సైట్ రిఫరెండెంగా నేను పోటీ చేస్తా.. నువ్వు పోటీ చేసినా.. నీ తరఫున ఎవరినైనా బరిలోకి దింపినా పర్వాలేదు..డిపాజిట్ కూడా దక్కదు. నువ్వు గెలిస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తా..నేను గెలిస్తే నువ్వు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయ్’’ ఈ మాటలన్నది ఇంకెవరో కాదు..ఒకప్పటి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే.. ప్రస్తుత పాడేరు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి. గిడ్డి ఈశ్వరి సుమారు మూడున్నరేళ్ల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆడిన మాటలు సంచలనమయ్యాయి. అయితే అంతలోనే పార్టీ ఫిరాయించి ఆయన పంచనే చేరిన ఈశ్వరి తీరుపై గిరిజనం మండిపడుతున్నారు. నిన్ను ఎలా నమ్మేదని ప్రశ్నిస్తున్నారు. 2015 డిసెంబర్ 10వ తేదీన చింతపల్లిలో బాక్సైట్‌కు వ్యతిరేకంగా జరిగిన సభలో గిడ్డి ఈశ్వరి ఆవేశంగా ప్రసంగించారు. ఏకంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి తలనరుకుతానంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెనుదుమారాన్ని లేపాయి. వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీలో ఓ ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చిపెట్టాయి. అదే సభలో నా చివరి ఊపిరి ఉన్నంత వరకు జగనన్నతోనే ఉంటానంటూ లక్షలాది మంది గిరిజనుల సాక్షిగా ప్రతిజ్ఞ కూడా చేశారు. సాధారణ ఉపాధ్యాయురాలునైన తాను చట్టసభలో అడుగుపెట్టేందుకు జగనన్నే కారణమంటూ గొప్పలు చెప్పారు. కానీ సరిగ్గా ఏడాదిన్నర క్రితం టీడీపీ ప్రలోభాలకు లొంగిపోయి కన్నతల్లి లాంటి వైఎస్సార్ సీపీకి, ఓట్లు వేసి గద్దెనెక్కించిన గిరిజనుల నమ్మకాన్ని వమ్ము చేస్తూ చీకటి ఒప్పందాలతో పార్టీని ఫిరాయించారు. ఆ తర్వాత తాను ఎందుకు పార్టీ ఫిరాయించాల్సి వచ్చిందో తన అనుచరుల వద్ద సిగ్గులేకుండా చెప్పుకొచ్చారు. టీడీపీలోకి వెళ్తే మంత్రి పదవి ఇస్తానన్నారు.. కేబినెట్ విస్తరణ కాస్త ఆలస్యమైతే రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవి ఇస్తానని హామీ ఇచ్చారని, అంతేకాకుండా ఎమ్మెల్యే గ్రాంట్స్ ఇస్తారు, పెద్ద ఎత్తున కాంట్రాక్టు పనులు కూడా చేసుకోవచ్చునంటూ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మంత్రి కాదు కదా కనీసం కార్పొరేషన్ డైరెక్టర్ పదవి కూడా ఇవ్వలేదు. కానీ ఎమ్మెల్యే గ్రాంట్(ఎస్డీఎఫ్) నిధులతో పాటు వందల కోట్ల విలువైన కాంట్రాక్టులను తాను తన అనుచరులు చేజిక్కించుకుని అందినకాడికి అడ్డగోలుగా సంపాదించారన్న ఆరోపణలు టీడీపీ నేతలే వ్యక్తం చేస్తున్నారు. కేవలం అవినీతికి పాల్పడేందుకే గిడ్డి పార్టీ ఫిరాయించారని, ఇంతటి అవినీతి ఎమ్మెల్యేను తాము ముందెన్నడూ చూడలేదంటూ సొంత పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఈశ్వరికి టికెట్ ఇవ్వొద్దంటూ త్రీమెన్ కమిటీ సభ్యులతో పాటు మెజార్టీ టీడీపీ శ్రేణులు అమరావతి వరకు నిరసనలు వ్యక్తం చేశారు. అధినేతకు కూడా తేల్చిచెప్పారు. కానీ కోట్లు కుమ్మరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పడంతో మాజీ మంత్రి మణికుమారి, ఇతర ఆశావాహులను కాదని ఈశ్వరికే చంద్రబాబు టికెట్ ఇచ్చారు. ఎన్నికల ప్రచారం టీడీపీ తరఫున ఈశ్వరికి వెళ్లిన ప్రతిచోట బాక్సైట్ సభలో ఆమె చేసిన వ్యాఖ్యలను గిరిజనులు గుర్తు చేస్తున్నారు. అంతేకాదు పార్టీ ఫిరాయించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రమంతా ఏమౌవుతుందో నాకు తెలియదు కానీ పాడేరు, అరుకు నియోజకవర్గాల్లో ఎవరు నిలబడినా వైఎస్సార్సీపీ విజయఢంకా మోగిస్తుందని ఈశ్వరి నోరు జారారు. ప్రస్తుతం టీడీపీ అభ్యర్థిగా ప్రచారం చేస్తుండగా గిరిజనులు ఎక్కడికక్కడ ఏ ముఖం పెట్టుకుని వస్తున్నావ్..నీకు ఎందుకు వేయాలి ఓటు అంటూ నిలదీస్తున్నట్టుగా తెలియవచ్చింది. నాటి చింతపల్లి సభలో ఆమె అన్న మాటలను గుర్తు చేసుకుంటున్నారు. ‘అల్లూరి సీతారామరాజు ప్రాంగణం సాక్షిగా, ఈ కొండల సాక్షిగా, గిరిజనుల సాక్షిగా మా గిరిజన మానోభావాలన్నీ జగనన్నే అన్నావు. జగనన్నను మా గుండెల్లో పెట్టుకున్నాం. ఆయన్నే సీఎం చేసుకుంటాం అన్నావ్‌గా..మళ్లీ ఇప్పుడు చంద్రబాబును సీఎం చేయాలని ఎలా కోరుతున్నావ్ అంటూ ఈశ్వరిని ప్రశ్నిస్తున్నారు. బాక్సైట్ జోలికి వస్తే చంద్రబాబు తలనరుకుతావ్ అన్న నువ్వు మళ్లీ ఆ పార్టీ తరఫున ఓట్లు అడగడానికి వస్తే ఎలా వేస్తాం అంటూ నిలదీస్తున్నారు. బాక్సైట్ గనుల తవ్వకాలను ఆపే శక్తి మా గుండెల్లో దాచుకున్న జగనన్నకే ఉందంటూనే మాత తప్పి టీడీలో చేరిన నీకు తగిన గుణపాఠం చెబుతామని గిరిజనులు చెబుతున్నారు. ఇటీవల పాడేరు ఎన్నికల సభలో కూడా ఇదే విషయాన్ని రాజన్న బిడ్డ, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాక్సైట్ గనుల తవ్వకాలపై స్పష్టమైన హామీనిచ్చారు. గిరిజనుల మనోభావాలకు విరుద్ధంగా బాక్సైట్ గనుల తవ్వకాల జోలికి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తాము చంద్రబాబును నమ్మమని గిరిజనులు తెగేసి చెబుతున్నారు. -
పాడేరు ఎన్నికల ప్రచార సభలో వైఎస్ జగన్
-
బాక్సైట్ మైనింగ్‌ను పూర్తిగా నిషేధిస్తాం: వైఎస్ జగన్
-
మోసపూరిత సీఎంగా దేశంలో నెంబర్‌వన్ స్థానం చంద్రబాబుదే
-
ఆ విషయంలో చంద్రబాబే నెంబర్‌వన్: వైఎస్ జగన్
-
ఆ విషయంలో చంద్రబాబే నెంబర్‌వన్: వైఎస్ జగన్
సాక్షి, విశాఖపట్నం, పాడేరు: ఐదేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ని మద్యం అమ్మకాల్లో, రైతుల అత్మహత్యల్లో నెంబర్‌వన్‌గా నిలిపారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. అబద్ధాల ద్వారా ప్రజలను మోసం చేసి, గిరిజనులను, దళితులను అన్యాయానికి గురిచేసిన చంద్రబాబుకు మోసపూరిత సీఎంగా దేశంలో నెంబర్‌వన్ స్థానం ఇవ్వచ్చని ఎద్దేవా చేశారు. ఐదేళ్ల తన పాలనలో ప్రజలకు ఏం చేశారో చెప్పకుండా.. మీ భవిష్యత్తు తన చేతిలోనే ఉందని మరోసారి మోసానికి దిగే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు పాలనలో పేదవాడి బతుకులు ఏమైనా బాగుపడ్డాయా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖపట్నం జిల్లా పాడేరులో జరిగిన ఎన్నికల ప్రచారం సభలో వైఎస్ జగన్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాడేరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాగ్యలక్ష్మి, అరకు లోక్‌సభ అభ్యర్థి గొడ్డేటి మాధవిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ... ‘‘సుధీర్ఘమైన పాదయాత్రలో రాష్ట్రంలోని గిరిజనులు, దళితులు ఏవిధంగా కష్టాలు పడుతున్నారో దగ్గరనుంచి చూశాను. చంద్రబాబు నాయుడిపాలనలో అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఆరు గిరిజన అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవడం చంద్రబాబుకు నచ్చలేదు. అందుకే వారిపై కక్ష్యసారింపు చర్యలకు పాల్పడుతున్నారు. దివంగత వైఎస్సార్ హయాంలో ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. గిరిజనులకు ఏడు లక్షల ఎకరాల భూ పంపిణీ చేసిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుంది. మా నాన్న గారు పోతూపోతూ మా కుటుంబాన్ని మీ చేతుల్లో పెట్టారు. మీ అందరికి అండగా ఉండమని మమల్ని మీ దగ్గరికి పంపారు. ఇటీవల మహానాయకుడు అనే సినిమాలో దొంగల్లుడు అనే క్యారెక్టర్ మాదీరిగా.. చేయనిది చేసిట్టుగా.. చేసింది చేయట్టుగా చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. సొంత మామానే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి. ధర్మారాజుకు ధర్మం చేయడమెలాగో ఆయనే నేర్పిన విధంగా అబద్ధాలు మాట్లాడుతారు. ఇలాంటి వ్యక్తి చేతిలో మన భవిష్యత్తును పెడతామా?. వెనుకబడిన ఈ ప్రాంతానికి గిరిజన యూనివర్సిటీ, మెడికల్ కాలేజీ ఎంతో అవసరం. గిరిజన ప్రాంతాల్లో 500లకు పైగా జనాభా ఉంటే పంచాయతీలను చేయాల్సి ఉంది. ఎన్నో ఏళ్లుగా వాటికై డిమాండ్ చేస్తున్నా టీడీపీ ప్రభుత్వం కనీసం పట్టించుకోవడంలేదు. మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వాటిని నిర్మిస్తామని హామీ ఇస్తున్న. అధికార పార్టీ అండదండలతో బాక్సైట్ మాఫీయా చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతల పోరాటంతో అదికాస్తా తక్కుముఖం పట్టింది. మన ప్రభుత్వంలో మైనింగ్‌ను పూర్తిగా నిషేధిస్తాం. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచిన గిద్ది ఈశ్వరీ బాక్సైట్ మైనింగ్ గురించి చంద్రబాబుపై అనేక విమర్శలు చేశారు. ఐదేళ్ల కాలంలో 560 అవార్డులు తీసుకువచ్చా అని ప్రచారం చేస్తున్నారు. అవినీతి, అక్రమాలు, రైతుల ఆత్మహత్యలు, తాగుడు ఏపీగా మార్చినందుకు ఆయనకు నిజంగానే అవార్డులు ఇవ్వాలి. ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు డబ్బు సంచులు పట్టుకుని ప్రజలు మభ్యపెట్టడానికి మరోసారి బయలుదేరారు. ఆయనిచ్చే మూడువేలకు మోసపోవద్దు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటాం. నవరత్నాలు ద్వారా పేదల బతుకులు మారుతాయని నాకు బలంగా నమ్మకముంది. తల్లికి అన్నం పెట్టలేని వాడు చిన్నమ్మకు బంగారు గాజులు కొనిస్తాడన్నాన్నడంటా.. అలా ఉంది చంద్రబాబు నాయుడు వ్యవహారం. ఐదేళ్ల పాలనలో ఏమీ చేయకుండా.. తనను మరోసారి గెలిపిస్తే అభివృద్ది చేస్తామని చెప్పుకుంటూ ఓట్లు అడుగుతున్నారు. ఏ సమావేశానికి పోయినా ఏపీని నెంబర్‌వన్ చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు. పేద ప్రజలను మోసం చేయడంలో ఆయనే నెంబర్‌వన్, నిరుద్యోగులను, విద్యార్థులను, రైతులను, డ్వాక్రా మహిళలను మోసం చేయడంలో చంద్రబాబే నెంబర్‌వన్, ఇతర పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేను కొనుగోలు చేయడంలో ఆయనే నెంబర్‌వన్. ఇలాంటి వ్యక్తి సీఎంగా మనకు అవసరమా?.’’ అని వ్యాఖ్యానించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మహానాయకుడు అనే సినిమాలో దొంగల్లుడు అనే క్యారెక్టర్ ఆయనదే
-
మరుగుతున్న నూనెలో తల ముంచి కిరాతకం..
పాడేరు రూరల్: తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదన్న కారణంగా ఓ మహిళపై దారుణమైన రీతిలో వ్యవహరించాడో రాక్షసుడు. సలసల కాగుతున్న నూనెలో ఆమె తలను ముంచి కిరాతకంగా వ్యవహరించాడు. ఈ సంఘటన శనివారం రాత్రి పాడేరులో జరిగింది. పోలీసులు, బాధితురాలి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని పాత బస్టాండ్ వీధిలో నివాసం ఉంటున్న రత్నం (45) అనే మహిళ భర్త ఎనిమిదేళ్ల క్రితం మృతి చెందాడు. దీంతో కుటుంబ పోషణ భారం ఆమెపై పడింది. ఇద్దరు పిల్లలను పెంచేందుకు పాత బస్టాండ్ వద్ద పకోడి, బజ్జీల దుకాణం నిర్వహిస్తోంది. పెట్టుబడి కోసం పది నెలల క్రితం అమె పాడేరుకు చెందిన పెంటారావు అనే వ్యక్తి వద్ద డైలీ ఫైనాన్స్ కింద రూ.20వేలు అప్పు తీసుకుంది. అందులో ఇప్పటి వరకు రూ.10,600 చెల్లించింది. ఆమె అనారోగ్యం కారణంగా ఇటీవల షాపు తెరవలేదు. అప్పు ఇచ్చిన వ్యక్తి వచ్చి డబ్బు చెల్లించామని ఒత్తిడి తెచ్చాడు. ఈ నెల 15న పెంటారావు ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఆ నేపథ్యంలోనే శనివారం రాత్రి 8.30 గంటల సమయంలో మళ్లీ వచ్చిన పెంటారావు బజ్జీలు, పకోడీలు వేసే సలసల మరుగుతున్న నూనెలో ఆమె తల, ముఖం భాగాలను ముంచేశాడు. ఆమె తెరుకునే లోపలే అక్కడ నుంచి వెళ్లిపోయాడు. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించగా 50 శాతం చర్మం కాలిపోయిందని వైద్యులు చెప్పారు. ఈ సంఘటపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
'పొగ'బట్టింది
విశాఖపట్నం, జి.మాడుగుల(పాడేరు): కుమార్తె చదువు, ఆరోగ్యం,యోగక్షేమాలు గురించి తెలుసుకోడానికి వచ్చిన తల్లి అనంతలోకాలకు వెళ్లిపోయింది. చలి నుంచి రక్షణ కోసం గదిలో పెట్టిన నిప్పుల కుంపటి ఆ కుటుంబంలో పెనువిషాదాన్ని నింపింది. అందరికీ ఊపిరాకుండా చేసి ఒకరిని బలిగొంది. నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వారంతా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యసేవలు పొందుతున్నారు. ఈ ఘటన మండలంలోని ఉరుము గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. జి.మాడుగుల పంచాయతీఉరుము గ్రామానికి చెందిన కొటారి సింహచలం, శ్వేతకుమారి (శాంతి)(35) దంపతులకు ముగ్గురు పిల్లలు. పెద్ద కుమార్తె ప్రియదర్శిని పాడేరు గురుకులంలో ఏడో తరగతి చదువుతోంది. చిన్నకుమార్తె సౌజన్య, కొడుకు శ్రీరామ్‌లను తీసుకుని ఉపాధి కోసం ఏలూరు సమీపంలోని గంగన్నపాలేం వెళ్లారు. అక్కడ కోళ్లఫారంలో పనికి కుదిరారు. గురుకులంలో చదువుతున్న ప్రియదర్శిని చూడటానికి మంగళవారం తల్లి శ్వేతకుమారి చినపాప సౌజన్యతో కలిసి పాడేరు వచ్చింది. అనంతరం తల్లీకూతుర్లు స్వగ్రామం ఉరుము వెళ్లారు. బంధువు కొటారి చిన్నతల్లి ఇంటిలో రాత్రికి పాపతో కలిసి శ్వేతకుమారి నిద్రపోయింది. వీరితో ఇంటియజమాని చిన్నతల్లి, తూబే లింగమ్మ, కొటారి చిట్టమ్మలు ఒకే గదిలో పడుకున్నారు. చలి తీవ్రత అధికంగా ఉండటంతో వెచ్చదనం కోసం గదిలో నిప్పుల కుంపటి ఏర్పాటు చేసుకున్నారు. తలుపులు, కిటికీలు మూసేసి నిద్రలోకి జారుకున్నారు. నిప్పుల కుంపటి పొగ గదినిండా అలముకుంది. దాని ధాటికి గురై అంతా అపస్మారకస్థితికి చేరారు. బుధవారం ఉదయం 8గంటల వరకు ఇంటిలోని వారు ఎవరూ నిద్రలేవకపోవటంతో అనుమానం వచ్చి పొరుగింటివారు బలంగా తలుపులు, కిటికీలు తెరిచి చూడగా ఐదుగురూ నురగలు కక్కుతూ కనిపించారు. ఇంటిలోకి వెళ్లి పరిశీలించగా శ్వేతకుమారి చనిపోయి ఉంది. తీవ్ర అస్వస్థతకు గురైన నలుగురిని జి.మాడుగుల పీహెచ్‌సీకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి పాడేరు ఏరియా అస్పత్రికి తీసుకెళ్లారు. సంఘటన స్థలాన్ని వైఎస్సార్సీపీ పాడేరు సమన్వమకర్త మత్స్యరాస విశ్వేశ్వరరాజు, గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు మత్స్యరాస వరహాలరాజు పరిశీలించారు. మృతి కారణాలను తెలసుకున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. శేతకుమారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. -
బస్సులో 40మంది.. డ్రైవర్‌కు గుండెపోటు..!
పాడేరు రూరల్: గుండెపోటు వచ్చినా ప్రయాణికుల ప్రాణాలే ముఖ్యమనుకున్న ఆర్టీసీ డ్రైవర్ వారిని సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చి చివరకు మృత్యువు ఒడిలోకి జారుకున్న విషాదకర ఘటన విశాఖ జిల్లా పాడేరులో శనివారం జరిగింది. ఇదే జిల్లా నాతవరానికి చెందిన ఈఎస్.నారాయణ పాడేరు ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం పాడేరు–అరుకు మార్గంలో నైట్‌డ్యూటీ విధులకు వెళ్లాడు. తిరిగి శనివారం మధ్యాహ్నం అరుకు నుంచి పాడేరుకు 40 మంది ప్రయాణికులతో వస్తుండగా పాడేరుకు ఐదు కిలోమీటర్ల దూరంలో చింతలవీధికి చేరుకునే సరికి డ్రైవర్ నారాయణకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. దాన్ని భరిస్తూ ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానానికి చేర్చాలన్న ఉద్దేశంతో బస్సును పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు చేర్చి సంతకం పెట్టి డ్యూటీ దిగి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తోటి సిబ్బంది అతడిని వెంటనే స్థానిక ప్రాంతీయ ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని ఆస్పత్రి మార్చూరిలో భద్రపరిచి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. మృతుడు నారాయణకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
కిడారి,సోమా కుటుంబీకులను ఆదుకుంటాం
-
జై మోదకొండమ్మ
పాడేరు రూరల్ : ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు, మన్యం ప్రజల ఆరాధ్య దైవం శ్రీ మోదకొండమ్మ తల్లి చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న జై మోదకొండమ్మ సినిమా షూటింగ్ పాడేరు మండలంలోని పరిసర ప్రాంతాల్లో జోరుగా సాగుతోంది. బుధవారం డల్లాపల్లి, అమ్మవారి పాదాలు తదితర చోట్ల హీరోయిన్, ఇతర నటీనటులపై పలు సన్నివేశాలను చిత్రీకరించారు. పాడేరు, చింతపల్లి, మాడుగుల ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుతున్నామని చిత్ర యూనిట్ తెలిపింది. రెండు నెలల్లో షూటింగ్ పూర్తి చేస్తామన్నారు. సీనియర్ నటుడు సత్యప్రకాష్, శివకృష్ణ, కృష్ణవేణిలతోపాటు మిస్ కర్ణాటక ఐశ్వర్య, పి.శ్యామ్ సుందర్, మాస్టర్ కౌశిక్, మాస్టర్ వినయ్, గొల్లపూడి గౌరీశంకర్, లక్ష్మి, పాడేరుకు చెందిన డాక్టర్ శివాజీరాజు, సరోజలు నటిస్తున్నారు. పోలాకి శివ దర్శకత్వం వహిస్తున్నారు. -
హోదా కోసం పాడేరులో వైఎస్సార్సీపీ వినూత్ననిరసన
-
రాజ్యాంగ దినోత్సవం రోజునే ప్రజాస్వామ్యం ఖూనీ
-
సిట్టింగ్ వేసి మందు బాటిల్ ఓపెన్ చేయబోతే..
పాడేరు రూరల్: సిట్టింగ్ వేసిన మందుబాబు.. తీరా బాటిల్ తెరవబోయేసరికి షాక్ తిన్నాడు. మందుతాగాలన్న కోరిక సంగతేమోగానీ ఒక్కక్షణం.. ‘బతికిపోయానురా దేవుడా’ అనుకున్నాడు. విశాఖపట్నం జిల్లా పాడేరులో చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. పట్టణానికి చెందిన ఓ వ్యక్తి స్థానిక శ్రీనివాస లాడ్జి ఎదురుగా ఉన్న వైన్ షాపులో సోమవారం హాఫ్‌బాటిల్ మద్యం కొన్నాడు. ఇంటికెళ్లి గ్లాసు, వాటర్ ప్యాకెట్, స్టఫ్.. సిద్ధం చేసుకుని తీరా మందుబాటిల్ ఓపెన్ చేయబోతు ఆగిపోయాడు. బాటిల్ లోపల పెద్ద పెద్ద సాలె పురుగులు చనిపోయి ఉండటాన్నిచూసి షాకయ్యాడు. కొద్దినిమిషాల తర్వాతగానీ తేరుకున్న మందుబాబు.. ఆ బాటిల్‌ను తీసుకెళ్లి వైన్‌షాప్ యజమానికి చూపించాడు. అయితే సదరు బాటిల్ తన షాపులో కొన్నది కాదని ఆ యజమాని వాదించాడు. దీంతో ఇద్దరి మధ్య కాసుపు వాగ్వాదం నడిచింది. ఇంతలోనే విషయం తెలుసుకున్న పోలీసులు వైన్‌షాప్ వద్దకు చేరుకుని బాధితుడిని అక్కడి నుంచి పంపేశారు. ఇంతకీ బాటిల్లోకి పురుగులు ఎలా వచ్చాయి? స్థానికంగా కలకలం రేపిన ఈ వ్యవహారంపై ఎక్సైజ్ సీఐ రాజారావును ‘సాక్షి’ వివరణ కోరగా.. ‘పురుగులు కనిపించిన మద్యం బాటిల్ సీల్ వేసే ఉంది. అంటే, స్థానికంగా కల్తీ అయినట్లు కాదు. ఖచ్చితంగా మద్యం తయారీ కేంద్రం(కంపెనీ)లోనే తేడా జరిగి ఉండొచ్చు’ అని సమాధానమిచ్చారు. కాబట్టి మద్యం ప్రియులూ.. కాస్త జాగ్రత్త. ఏ బాటిల్లో ఏముందో జర చూసుకొని.. -
పెద్ద నోట్ల రద్దు: ఏటీఎం ధ్వంసం చేసిన కానిస్టేబుల్
పాడేరు: పెద్ద నోట్ల రద్దుతో ప్రజల్లో ఆగ్రహావేశాలు పెరిగిపోతున్నాయి. చివరకు ఓ పోలీసు కానిస్టేబుల్ కూడా అసహనానికి గురై ఏటీఎంను ధ్వంసం చేశాడు. విశాఖ జిల్లా పాడేరులో ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామంలో ఒక్క స్టేట్ బ్యాంక్ ఏటీఎం మాత్రమే ఉంది. పెద్ద నోట్ల రద్దుతో నోట్ల కొరత ఏర్పడి అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో డబ్బులు తీసుకోవడానికి రాత్రివేళ ఆ ఏటీఎం వద్దకు వచ్చిన కానిస్టేబుల్ కొద్దిసేపు వరుసలో నిలబడ్డాడు. తన వంతు వచ్చేసరికి ఆ మిషన్ పనిచేయలేదు. అసహనంతో ఏటీఎంను గట్టిగా నాలుగైదుసార్లు కాలుతో తన్నాడు. అయినా కోపం తగ్గకపోవడంతో రెండో ఏటీఎంనూ ధ్వంసం చేశాడు. దీంతో రెండు ఏటీఎంలు ధ్వంసమై అసలుకే పనిచేయకుండా పోయాయి. ఉన్న ఒక్క కేంద్రాన్ని మూసేయడంతో శనివారం డబ్బుల కోసం వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బ్యాంకుల వద్ద గంటలతరబడి క్యూలో నిలబడాల్సి వచ్చింది.