విజయనగరం జిల్లా పాడేరు మండలం వంతెడపల్లి అటవీ చెక్‌పోస్టు వద్ద సోమవారం మధ్యాహ్నం తనిఖీ చేస్తుండగా కారులో 100 కిలోల గంజాయిని పట్టుకున్నారు.
పాడేరు : విజయనగరం జిల్లా పాడేరు మండలం వంతెడపల్లి అటవీ చెక్‌పోస్టు వద్ద సోమవారం మధ్యాహ్నం తనిఖీ చేస్తుండగా కారులో 100 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఈ సందర్భంగా కారును వదిలేసి ఇద్దరు పారిపోతుండగా పోలీసులు వెంబడించారు. ఈ క్రమంలో జి.మాడుగుల మండలం పులుసుమామిడి గ్రామానికి చెందిన నూకరాజు(30) అనే యువకుడు గోతిలోపడి మృతిచెందాడు. మరో వ్యక్తి పరారయ్యాడు. కారును, 100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.