ganja
-
ఐదు ట్రాలీ బ్యాగుల్లో నీట్‌గా ఫారిన్ గంజాయి
న్యూఢిల్లీ: రాజధానిలో మరోసారి మత్తు దందా బయటపడింది. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ గంజాయిని అధికారులు సీజ్ చేశారు. ముఠాకు సంబంధించిన ఐదుగురిని అరెస్ట్ చేసిన అధికారులు.. మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఐదుగురు ప్రయాణికులు ఎయిర్‌పోర్టులో గ్రీన్ చానెల్ దాటేందుకు ప్రయత్నించారు. అయితే వాళ్ల కదలికలు అనుమానాస్పదంగా అనిపించడంతో కస్టమ్స్ అధికారులు ఆపి తనిఖీలు చేశారు. వాళ్ల దగ్గర ఉన్న ట్రాలీ బ్యాగుల నుంచి 94 ప్యాకెట్లలో నీట్‌గా ప్యాక్ చేసిన గంజాయి బయటపడింది. అది ఫారిన్ గంజాయి అని, దాని విలువ రూ.47 కోట్ల దాకా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన కస్టమ్స్ అధికారులు.. ఆ ఐదుగురిని రిమాండ్‌కు తరలించారు. -
హైదరాబాద్ లో గల్లీగల్లీ గుప్పు మంటున్న గంజాయి
-
హైదరాబాద్ లో విదేశీ గంజాయి కలకలం
-
‘సెంట్రల్ జైలులో గంజాయి మొక్కా.. ఇంతకంటే దారుణం ఉంటుందా?’
విశాఖ: గంజాయి నిర్మూలనలో కూటమి ప్రభుత్వం పూర్తిగావైఫల్యం చెందిందని వైఎస్సార్సీపీ(YSRCP) ఎమ్మెల్సీ, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి(Varudu Kalyani) విమర్శించారు. ఇందుకు నిదర్శనమే విశాఖ సెంట్రల్ జైలులో గంజాయి మొక్క కనిపించడమేనన్నారు. ఒక సెంట్రల్ జైలులో గంజాయి మొక్క కనిపించడం దారణమన్నారు వరుదు కళ్యాణి. వంద రోజుల్లో గంజాయి నిర్మూలిస్తానని హోంమంత్రి అనిత శపథం చేశారని, ఇప్పుడు ఎక్కడ చూసినా గంజాయి సాగు అవుతుందని ధ్వజమెత్తారు.సాక్షి టీవీతో ఆదివారం మాట్లాడిన వరుదు కళ్యాణి.. ‘ చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో కూడా గంజాయి(Ganja) సాగవుతుంది. మీ వైఫల్యాలని కప్పి పుచ్చుకోవడం కోసం నెపం ప్రతిపక్షంపై నెట్టడం దుర్మార్గం. ఇది చేతకాని ప్రభుత్వం. విచ్చలవిడిగా గంజాయి దొరుకుతుందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు చెప్పారు. గంజాయి నిర్మూలనకు కాకుండా ప్రతిపక్షాలని టార్గెట్ చెయ్యడానికి మాత్రమే పోలీసులను వాడుతున్నారు. అందుకే దుర్మార్గులు మహిళలపై దాడులకు తెగబడుతున్నారు. రాష్ట్రంలో క్రైమ్ రేట్(Crime Rate) పెరిగింది. మహిళలపై దాడులు పెరిగాయి. రాష్ట్రంలోగంజాయిని అరికట్టాల్సిందే’ అని వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు.రెండు రోజుల క్రితం విశాఖలో వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. ఏపీలో చంద్రబాబు పాలన తల్లికి నిల్.. తండ్రికి ఫుల్ అన్న చందంగా ఉందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వాకం వల్ల రాష్ట్రంలో స్కూల్ విద్యార్థుల డ్రాప్ అవుట్స్ పెరిగిపోయాయని చెప్పారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరదు కళ్యాణి విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘తల్లికి వందనం పథకానికి ఎగనామం పెట్టడం దారుణం. ఎన్నికల ముందు ప్రతీ బిడ్డకు రూ.15000 చొప్పున ఇస్తామన్న మాటను కూటమి నిలబెట్టుకోవాలి. తల్లికి వందనం పేరుతో తల్లి, విద్యార్థులకు అన్యాయం చేశారు. తల్లికి వందనం పథకం ద్వారా చంద్రబాబు లక్షలాది మంది తల్లులకు వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబు పాలన తల్లికి నిల్.. తండ్రికి ఫుల్ అన్న చందంగా ఉంది.వైఎస్సార్సీపీ హయాంలో డ్రాప్ అవుట్స్ తగ్గించడం కోసం అమ్మఒడి పథకాన్ని వైఎస్ జగన్ తెచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నిర్వాకం వల్ల మళ్ళీ డ్రాప్ ఔట్స్ పెరిగే అవకాశం ఉంది. పాలిచ్చే ఆవును వదులుకొని తన్నే దున్నను తెచ్చుకున్నామని ప్రజలు బాధపడుతున్నారు. తల్లికి వందనం ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలి అని ఆమె డిమాండ్ చేశారు.ఇది చదవండి: బాబూ.. ఛార్జీలు పెంచడం సంపద సృష్టా?: వరుదు కల్యాణి -
కూటమి ప్రభుత్వం యాక్షన్ ఫెయిల్.. జైల్లోనే గంజాయి సాగు!
-
విశాఖ సెంట్రల్ జైలులో గంజాయి కలకలం..
సాక్షి, విశాఖ: విశాఖపట్నంలోని సెంట్రల్ జైలులో అసలేం జరుగుతోంది. ఇటీవల జైలులో సెల్‌ఫోన్స్ దొరికిన ఘటనపై దర్యాప్తు జరుగుతున్న క్రమంలోనే మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. సెంట్రల్ జైలులో గంజాయి దొరకడం తీవ్ర కలకలం సృష్టించింది.వివరాల ప్రకారం.. విశాఖ సెంట్రల్ జైలులో గంజాయి దొరకడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఖైదీలే ఇక్కడ గంజాయి సాగు చేస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక జైలు సూపరింటెండెంట్ మార్పు జరిగింది. ఇక, ఏదీ జరిగినా హోం మంత్రి అనిత.. గత ప్రభుత్వంపైకి నెట్టేస్తున్నారు. అయితే, విశాఖ సెంట్రల్ జైలులో నిఘా కొరవడినట్టు ప్రత్యక్షంగానే తెలుస్తోంది. దీని బట్టి కూటమి ప్రభుత్వ పాలనలో గంజాయి విచ్చలవిడిగా రవాణా జరుగుతున్నట్టు అర్థమవుతోంది. కట్టుదిట్టమైన జైలులో సైతం గంజాయి గుప్పుమనడంతో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా.. విశాఖ సెంట్రల్ జైలులో సెల్ ఫోన్లు దొరకడం సంచలనంగా మారింది. జైలు అధికారులు రెగ్యులర్ తనిఖీల్లో భాగంగా నర్మదా బ్లాక్, పెన్నా బ్యారక్ సమీపంలో పోలీసులకు సెల్ ఫోన్స్ దొరికాయి. నాలుగు రోజుల క్రితం మూడు సెల్ ఫోన్లను అధికారులు గుర్తించారు. సిమ్ కార్డులేని మొబైల్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యారక్ సమీపంలోని పూల కుండీ వద్ద భూమిలో నాలుగు అడుగల లోతున ఫోన్లను పాతిపెట్టారు. ఫోన్లను ప్యాక్ చేసి గుంతలో దాచిపెట్టారు. రెండు రాళ్లు కప్పి పైన పూల కుండీ పెట్టారు. దీంతో, సెల్ ఫోన్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో అధికారులు రంగంలోకి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
చాక్లెట్ల రూపంలో గంజాయి రవాణా
కోదాడ రూరల్: ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి హైదరాబాద్‌కు చాక్లెట్ల రూపంలో గంజాయి తరలిస్తున్న ఆరుగురు ముఠా సభ్యులను సూర్యాపేట జిల్లా కోదాడ ఎక్సైజ్ పోలీసులు ఆదివారం ఉదయం పట్టుకున్నారు. ఎక్సైజ్ సీఐ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ మండలం రామాపురం క్రాస్‌రోడ్‌లో అంతర్ రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్ట్ వద్ద ఎక్సైజ్ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ట్రావెల్స్ బస్సును ఆపారు. బస్సులో అనుమానాస్పదంగా కనిపించిన భువనేశ్వర్‌లోని మయూర్‌బంజ్‌కు చెందిన అనిల్‌కుమార్, రజని, బంకిమ్‌చంద్ర, మమితనాయక్, సంజిబాని దెబురాయ్, జానునాయక్ను కిందకు దింపి వారి వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా, 25 ప్యాకెట్లలో 5 కేజీల బరువున్న వెయ్యి గంజాయి చాక్లెట్లు బయటపడ్డాయి. ఆరుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎౖక్సైజ్ సీఐ తెలిపారు. ఈ ఆరుగురు నిందితులు హైదరాబాద్‌లో పనిచేస్తుంటారు. ట్రావెల్స్ బస్సు ఏపీలోకి ప్రవేశించిన తర్వాత పలాసలో అక్కడి పోలీసుల తనిఖీ చేసినప్పటికీ వాటిని ఆయుర్వేదిక్ చాక్లెట్లుగా వారిని నమ్మించి బయటపడ్డారు. బస్సు తెలంగాణలోకి ప్రవేశించే మార్గంలో రామాపురం క్రాస్‌రోడ్‌లో కోదాడ ఎక్సైజ్ పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యారు. -
ప్రైవేట్ బస్సులో గంజాయి చాక్లెట్ల కలకలం
-
నీతూబాయి ఆట కట్టిస్తాం..
సాక్షి, హైదరాబాద్: గంజాయి డాన్‌గా పేరొందిన నీతూబాయిని ఎట్టిపరిస్థితుల్లోనూ పట్టుకుని తీరుతామని ఎక్సైజ్‌శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి అన్నారు.ఆమె పట్ల తాము ఎలాంటి మెతక వైఖరి అవలంభించడం లేదని, కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు. నానక్‌రామ్‌గూడ కేంద్రంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గంజాయి అమ్మకాలకు పాల్పడుతున్న నీతూబాయి ఎక్సైజ్ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు. ఎక్సైజ్ శాఖతో పాటు లా ఎన్ ఫోర్స్మెంట్ ఏజెన్సీలు కూడా సీరియస్‌గా దృష్టి సారించాయన్నారు. ఆమె అక్రమ కార్యకలాపాలపై కేసులు నమోదు చేశామని, గతంలో ఆమె పలు కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చినట్లు తెలిపారు. అయినా ఆమె వైఖరిలో మార్పురాలేదన్నారు. బయటికి వచ్చిన తర్వాత కూడా యధావిధిగా గంజాయి అమ్మకాలు కొనసాగిస్తుండడంతో బెయిల్‌కు అవకాశం లేకుండా పోలీస్ శాఖ ఆమెపై పీడీ యాక్ట్ నమోదు చేసిందన్నారు. రెండు సార్లు పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపడమే కాకుండా, గంజాయి అమ్మకాల ద్వారా నీతూబాయి, ఆమె కుటుంబసభ్యులు అక్రమంగా కూడబెట్టిన స్థిర, చర ఆస్తులను జప్తు చేసినట్లు తెలిపారు. నీతూబాయ్ నుంచి రూ.15.17 లక్షలు, ఆమె కుటుంబ సభ్యులైన మధుబాయి రూ. 25.13 లక్షలు, గౌతమ్‌సింగ్ నుంచి రూ.91.21 లక్షలు, మరో వ్యక్తి నుంచి రూ. 86 లక్షల స్థిరాస్తులను జప్తు చేశామన్నారు. నీతూబాయిపై హిస్టరీ షీట్‌ను ఓపెన్ చేసినట్లు చెప్పారు. శేరిలింగంపల్లి, గోల్కొండ, గచి్చబౌలి, మొయినాబాద్, గౌరారం, నల్లగొండ టూటౌన్లతోపాటు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు ధూల్‌పేట్, నారాయణగూడలోనూ ఆమెపై కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఆమెపై 25 కేసులు ఉన్నాయని, పోలీసులు 7 కేసులు నమోదు చేశారన్నారు. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరన్నారు. ఆపరేషన్ ధూల్‌పేట్ తరహాలో నానక్‌రాంగూడలోనూ గంజాయి నిర్మూలనకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.ప్రేమంటూ వేధింపులు.. యువతి బలవన్మరణం -
ఏపీ హోంమంత్రి అనిత వివాదాస్పద వ్యాఖ్యలు
-
గంజాయి బ్యాచ్ వీరంగం
ఉప్పల్: రామంతాపూర్‌లో గంజాయి బ్యాచ్ హల్చల్ చేసింది. ఏకంగా ఇంట్లోకి చొరబడి ఓ యువకుడిని చితక బాదడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పొలీసులు, బాధితులు తెలిపిన మేరకు..రామంతాపూర్ లక్ష్మీ శ్రీకాంత్‌నగర్ కాలనీలో నివాసముంటున్న బాల నర్సింహ కుమారుడు భరత్ కుమార్(30) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం తన ఆటోను ఇంటి ముందు పార్క్‌చేసి లోపలకు వెళ్లాడు. అదే సమయంలో నలుగురు వ్యక్తులు వచ్చి ఆటోలో కూర్చుని గంజాయి తాగుతున్నారు. ఇది గమనించిన భరత్ వారిని మందలించడంతో వారు మరికొందరిని పిలిపించారు. దీంతో భరత్ భయపడి ఇంట్లోకి వెళ్లాడు. రెచ్చి పోయిన అల్లరి మూక తలుపులు పగుల గొట్టి ఇంట్లోకి చొరబడి భరత్‌ను విచక్షణా రహితంగా చితక బాదారు. ఈ దాడిని చూసిన స్థానికులు అక్కడకు వెళ్లడంతో వారు పరారయ్యారు. భరత్‌ను చికిత్స నిమిత్తం ప్రైవేటు అసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయులో ఉంచినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో కాలనీ వాసులంతా ఉప్పల్ పోలీస్‌స్టేషన్ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కొంత మంది పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. -
ధూల్‌పేట గంజాయి డాన్ అంగూర్‌బాయి అరెస్టు
సాక్షి, సిటీబ్యూరో: ఎక్సైజ్ పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న అంగూర్ బాయి ఎట్టకేలకు గురువారం కార్వాన్ ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడింది. ధూల్‌పేట్ గంజాయి డాన్‌గా గుర్తింపు పొందిన అంగూర్‌బాయిని కార్వాన్ ప్రాంతంలో ఎస్టీఎఫ్, ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి అమ్మకాల్లో రూ.కోట్లకు పడగలెత్తిన అంగూర్ బాయిపై ధూల్‌పేట్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో 3 కేసులు, మంగల్‌హట్ పోలీస్‌స్టేషన్‌లో 4 కేసులు, ఆసిఫ్ నగర్, గౌరారం స్టేషన్లలో 10 కేసులు నమోదయ్యాయి. ఆయా కేసుల్లో అరెస్టు చేసేందుకు ఎక్సైజ్, పోలీసులు పలు మార్లు ప్రయతి్నంచినా ఆమె తప్పించుకు తిరుగుతోంది. ఇప్పటికే 13 కేసుల్లో నిందితురాలిగా జైలుకు వెళ్లి వచ్చిన ఆమె కోర్టుల చుట్టూ తిరుగుతోంది. ఆమె కుటుంబ సభ్యులపై కూడా పదుల సంఖ్యలో కేసులు ఉండటం గమనార్హం. ధూల్‌పేట్‌లో గంజాయి హోల్‌సేల్, రిటేల్ అమ్మకాల్లో అరితేరిన అంగూర్ బాయిని అపరేషన్ ధూల్‌పేట్‌లో భాగంగా అరెస్టు చేశారు. ఆమెను అరెస్ట్ చేసిన ఎక్సైజ్ పోలీసులను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టర్ కమలాసన్‌రెడ్డి అభినందించారు. అంగూర్‌బాయి అరెస్ట్‌తో ధూల్‌పేటలో ఎక్సైజ్ పోలీసులు భారీ విజయాన్ని నమోదు చేశారు. -
లంచ్ బాక్స్ లో గంజాయి.. ఇద్దరు సీనియర్ అధికారులపై వేటు
-
గంజాయి సరఫరా చేస్తున్న ఫార్మసిస్ట్ అరెస్టు
ఆరిలోవ: విశాఖ కేంద్రకారాగారంలో ఖైదీలకు గంజాయి సరఫరా చేసే యత్నంలో ఓ ఉద్యోగి అధికారులకు చిక్కాడు. జైలు సిబ్బంది తనిఖీల్లో ఈ వ్యవహారం బయటపడింది. జైలు సూపరింటెండెంట్ ఎస్.కిశోర్‌కుమార్ వివరాలు ప్రకారం.. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో కడియం శ్రీనివాస్ ఫార్మసిస్ట్‌గా ఏడాది నుంచి డిప్యుటేషన్‌పై విశాఖ కేంద్ర కారాగారం ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. ఈ జైలుకు సంబంధించి ప్రత్యేకంగా నియమించిన వైద్యులు, ఫార్మసిస్టులు లేకపోవడంతో డిప్యూటేషన్‌పై వచ్చినవారే పనిచేయాల్సి ఉంటుంది.శ్రీనివాస్ మంగళవారం డ్యూటీకి వచ్చేటప్పుడు భోజనం క్యారేజీ తీసుకొచ్చారు. అందులో గంజాయి ఉన్నట్లు జైలు ప్రధాన ద్వారంవద్ద సిబ్బంది తనిఖీల్లో బయటపడింది. ప్రధాన ద్వారం సెక్యూరిటీ సిబ్బంది జైలులో పనిచేస్తున్న ఉద్యోగుల రాకపోకల సమయంలో తనిఖీలు చేస్తుంటారు. దీన్లోభాగంగా చేపట్టిన తనిఖీల్లోనే శ్రీని వాస్ క్యారేజీలో 90 గ్రాముల గంజాయి పట్టుబడింది. దీంతో శ్రీనివాస్‌పై ఆరిలోవ పోలీసులకు సూపరింటెండెంట్ ఫిర్యాదు చేశారు. గంజాయి స్వాధీనం చేసుకుని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆరిలోవ సీఐ మల్లేశ్వరరావు తెలిపారు. రిమాండ్‌పై సెంట్రల్ జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు. -
హోంమంత్రి అనిత ఇంటికి కూతవేటు దూరంలో గంజాయి సాగు
-
హైదరాబాద్ లో రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్
-
టీనేజీలోనే గంజాయి
సాక్షి, హైదరాబాద్: గంజాయి, మద్యం, సిగరెట్, డ్రగ్స్ వినియోగం, వాటికి బానిసలై పోవడం సాధారణంగా యువకులు, పెద్దల్లోనే చూస్తుంటాం. కానీ టీనేజ్ పిల్లలు కూడా ఈ చెడు అలవాట్లకు ఎక్కువగా లోనవుతున్నారట. ఆ మాటకొస్తే పిల్లల్లో ఎక్కువ శాతం గంజాయి సేవిస్తుండటం విస్మయం కలిగిస్తోంది. ఇంకో విచిత్రమైన విషయం ఏమిటంటే మానసిక రుగ్మతల కారణంగా టీనేజీ పిల్లలు ఈ వ్యసనాల బారిన పడుతుండటం. మానసిక సమస్యలు కూడా పెద్దవారికే అధికంగా ఉంటాయని అనుకుంటాం. కానీ పెద్ద వయస్సు వారికంటే యువతీ యువకుల్లోనే మానసిక రుగ్మతలు అధికంగా ఉంటున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), యూనిసెఫ్ (ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ పిల్లల అత్యవసర నిధి)లు తేలి్చచెప్పాయి.‘యువకులు, చిన్న పిల్లల మానసిక ఆరోగ్యంపై మార్గదర్శకత్వం’పేరుతో డబ్ల్యూహెచ్ఓ, యూనిసెఫ్ తాజాగా ఓ నివేదిక విడుదల చేశాయి. ఐదేళ్ల నుంచి 24 ఏళ్లలోపు వారికి సంబంధించిన మానసిక సమస్యలపై పలు ఆసక్తికర అంశాలను పొందుపరిచాయి. మానసిక రుగ్మతల నుంచి టీనేజీ పిల్లలను రక్షించాలంటే చట్టాలు సరిగా ఉండాలని, సామాజిక భద్రత..ఆర్థిక భరోసా ఉండాలని, మౌలిక సదుపాయాలు కలి్పంచాలని సూచించాయి. నివేదికలో ఏముందంటే.. పెద్దలు తట్టుకుంటారు.. పిల్లలు కుంగిపోతారు మూడో వంతు మానసిక సమస్యలు 14 ఏళ్లలోపే మొదలవుతాయి. అందులో సగం 10 ఏళ్లలోపే ప్రారంభం అవుతాయి. 15–19 ఏళ్ల వయస్సు బాల బాలికల్లో మద్యం తాగేవారు 22 శాతం ఉన్నారు. అలాగే పెద్దల కంటే టీనేజీ పిల్లల్లోనే గంజాయి వాడకం ఎక్కువగా ఉంది. ఆ వయస్సు వారిలో 5.5 శాతం మంది టీనేజీ పిల్లలు గంజాయి తాగుతున్నారు. ఆ వయస్సులోనే మద్యం, డ్రగ్స్‌కు బానిసలుగా మారుతున్నారు. 13–19 ఏళ్ల మధ్య వయస్సులోని టీనేజీ పిల్లల్లో ప్రతి ఏడుగురిలో ఒకరికి మానసిక రుగ్మత ఉంది. పెద్ద వారు మానసిక సమస్యలను తట్టుకోగలరు. కానీ చిన్న పిల్లలు తట్టుకోలేరు. చదువు, కెరీర్ వంటివి వారిపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి. 15–19 మధ్య వయస్సు వారిలో మానసిక సమస్యలు అత్యధికంగా 15 శాతం ఉండటం గమనార్హం. ఆ వయస్సులో చదువు కీలకమైన దశలో ఉంటుంది. కెరీర్‌ను నిర్ణయించుకునే దశ, ప్రేమలు, ఆకర్షణలు వంటివివారిని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ఆ వయస్సువారే వివిధ మానసిక కారణాల వల్ల నేరస్థులుగా మారుతున్నారు. ఆత్మహత్యలూ 15–24 ఏళ్లలోపు వారిలోనే అధికంగా ఉంటున్నాయి. అందులో ఎక్కువగా పురుషులే ఉంటున్నారు. బాలికలు ఎక్కువగా భావోద్వేగపరమైన ఒత్తిడికి (ఎమోషనల్ డిస్టర్బెన్స్) గురవుతుంటారు. పిల్లల్లో కడుపు నొప్పి, వాంతులు, తలనొప్పి వంటివి కూడా మానసిక రుగ్మతకు సంబంధించిన అంశాలే. పెద్దవారిలో డిప్రెషన్, యాంగ్జయిటీ వంటివి కీలకంగా ఉంటాయి. అతిగా తినడమూ, తక్కువ తినడమూ మానసిక వ్యాధి లక్షణాలే. 40 ఏళ్లలోపు వరకు మానసిక సమస్యలు ఎక్కువగా వస్తాయి. 70 ఏళ్లు పైబడిన వారిలో మతిమరుపు వస్తుంది. ఏ వయస్సు వారిలో మానసిక రుగ్మతలు ఎంత శాతం అంటే.. ⇒ 5–9 మధ్య వయస్సు వారిలో 8 శాతం ⇒ 10–14 ఏళ్లు 15 శాతం ⇒ 15–19 ఏళ్లు 15 శాతం ⇒ 20–24 ఏళ్లు 14 శాతం ⇒ 25–29 ఏళ్లు 13 శాతం ⇒ 30–34 ఏళ్లు 12 శాతం ⇒ 35–39 ఏళ్లు 11 శాతం ⇒ 40–44 ఏళ్లు 9 శాతం ⇒ 45–49 ఏళ్లు 7 శాతం ⇒ 50–54 ఏళ్లు 6 శాతం ⇒ 55–59 ఏళ్లు 5 శాతం ⇒ 60–64 ఏళ్లు 3 శాతం ⇒ 65–69 ఏళ్లు 3 శాతం ⇒ 70 ఏళ్లకు పైబడి 2 శాతం ప్రాథమిక ఆరోగ్యంలో ఇది భాగం కావాలి లింగ భేదాలు కూడా మానసిక సమస్యలకు కారణంగా ఉంటున్నాయని ఆ నివేదిక తేలి్చంది. పురుషులు కుటుంబ బాధ్యతలు, అనేక ఇతర సమస్యలతో మద్యానికి బానిసలవుతున్నారు. అలాగే బయటకు చెప్పలేని పరిస్థితులూ ఉంటున్నాయి. ఉద్యోగం, ఉపాధి, ఆర్థికంగా నిలదొక్కుకోవడం వంటివి ఇబ్బందికి గురిచేస్తాయి. మానసిక రుగ్మతలకు వైద్యం చేసే పరిస్థితులు తక్కువగా ఉన్నాయి. మానసిక ఆరోగ్యాన్ని ప్రాథమిక ఆరోగ్యంలో కలపాలి. ప్రస్తుతం ప్రాథమిక, జిల్లా ఆసుపత్రుల్లో మానసిక సమస్యలకు సంబంధించిన వైద్యులు లేకపోవడాన్ని నివేదిక ఎత్తి చూపింది. ప్రపంచవ్యాప్తంగా చిన్నపిల్లలు, యువకుల మానసిక ఆరోగ్యంపై ఆయా దేశాల బడ్జెట్లలో కేవలం 0.1 శాతం నిధులు మాత్రమే ఖర్చు చేస్తున్నారు. 80 శాతం దేశాల్లో మానసిక ఆరోగ్యంపై ఒక ప్రత్యేక వ్యవస్థ అనేది లేనేలేదు. – డాక్టర్ కిరణ్ మాదల, ప్రొఫెసర్ అనెస్థీíÙయా, గాంధీ మెడికల్ కాలేజీ, హైదరాబాద్ నివేదికలోని ఇతర ముఖ్యాంశాలు..⇒ టీనేజీ పిల్లలు బయటి పరిస్థితులు, ఇంటి పరిస్థితులకు మధ్య ఘర్షణతో మానసికంగా ఇబ్బంది పడుతుంటారు. ⇒ 5–9 ఏళ్ల పిల్లలపై స్నేహితులు, తల్లిదండ్రులు పెంచే విధానం, స్కూలు, పరిసరాల ప్రభావం ఉంటుంది. ⇒ ఆర్థిక, సామాజిక, లింగపరమైన అసమాన త్వం, సామాజిక బహిష్కరణ వంటి వాటి వల్ల పిల్లలు మానసికంగా కుంగిపోతారు. ⇒ పేదరికం, యుద్ధ వాతావరణంలో ఉండే పిల్లల్లో మానసిక సమస్యలు పెరుగుతాయి. కుటుంబంలో తల్లి మద్యానికి బానిసైతే పుట్టే పిల్లల్లో మానసిక సమస్యలు రావొచ్చు. ⇒ తల్లిదండ్రులకు మానసిక సమస్యలుండటం, తల్లిదండ్రులు..కుటుంబ కలహాలు, తల్లిదండ్రులు విడిపోవడం, పిల్లలను హాస్టళ్లలో చేర్చ డం వంటివి కూడా ప్రభావితం చేస్తున్నాయి. ⇒ మానసిక రుగ్మతకు గురైన వారికి త్వరగా చికిత్స చేస్తే పెద్దయ్యేసరికి మొండిజబ్బుగా మారకుండా చూసుకోవచ్చు. ⇒ కరోనా సమయంలో అన్ని వయస్సుల వారిలో మానసిక వ్యాధులు 25 శాతం పెరిగాయి. ఉద్యోగాలు పోవడం, చదువు మధ్యలో ఆపేయడం, ఆప్తుల్ని కోల్పోవడం, ఆసుపత్రుల పాలు కావడం లాంటి అనేక కారణాలతో మానసిక సమస్యలు పెరిగాయి. -
విశాఖలో పెరిగిపోతున్న గంజాయి బ్యాచ్ అరాచకాలు
-
ఆదిలాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత
-
9 క్వింటాళ్లకు పైగా గంజాయి పట్టివేత
అనకాపల్లి: లారీలో తరలిస్తున్న 912 కేజీల గంజాయిని సబ్బవరం పోలీసులు పట్టుకున్నారు. అనకాపల్లి ఎస్పీ ఎం.దీపిక తెలిపిన వివరాల ప్రకారం.. సబ్బవరం–కొత్తవలస రహదారిపై గుల్లేపల్లి జంక్షన్ వద్ద సబ్బవరం పోలీసులు ఆదివారం రాత్రి నుంచి తనిఖీలు చేపట్టారు. ఓ లారీని తనిఖీ చేయగా.. క్యాబిన్‌లోని రహస్య అరల్లో 456 ప్యాకెట్లు కనిపించాయి. లారీకి ప్రత్యేక అరలు తయారు చేయించి డ్రైవర్ కూర్చునే క్యాబిన్లోను, సీటు భాగంలోను గంజాయి ఉంచి రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.45.60 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.లారీని సీజ్‌చేసి తెలంగాణలోని జనగామ జిల్లా పాలకుర్తి మండలం కొండాపూర్‌కు చెందిన లారీ డ్రైవర్ బారావత్ తరుణ్ (22), ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా పనసపట్టు గ్రామానికి చెందిన సేతి మలే‹Ùరావు(24)ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న వీరయ్యరెడ్డి, అజీ్మరానగే‹Ù, బోతు వెంకట్రావు, కొండారెడ్డి, రాకేష్‌లను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. పట్టుబడిన ఇద్దరు వ్యక్తుల నుంచి నాలుగు సెల్ఫోన్లు రూ.15 వేల నగదు స్వా«దీనం చేసుకున్నారు. సబ్బవరం సీఐ పిన్నింటి రమణకు అందిన సమాచారం మేరకు ఎస్ఐ ధనుంజయ్, సిబ్బంది వాహనాల తనిఖీ చేపట్టారని ఎస్పీ దీపిక తెలిపారు.450 కిలోల గంజాయి స్వాధీనంవ్యాన్ను వెంబడించి పట్టుకున్న పోలీసులు వాహనాన్ని వదిలి పరారైన నిందితులు విజయనగరం జిల్లాలో ఘటన కొత్తవలస: విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అప్పన్నపాలెం వద్ద 450 కిలోల గంజాయిని, వ్యాన్‌ను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. కొత్తవలస సీఐ సీహెచ్ షణ్ముఖరావు తెలిపిన వివరాలు.. ఎస్.కోట మండలం సమీపంలోని బొడ్డవర చెక్‌పోస్టు వద్ద పోలీసులు సోమవారం తెల్లవారు జామున వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో అరకు నుంచి వేగంగా ఓ వ్యాన్ వచ్చింది. చెక్‌పోస్టు వద్ద ఆపేందుకు పోలీసులు ప్రయత్నంచినా విశాఖపట్నం వైపు వేగంగా దూసుకుపోయింది. దీంతో పోలీసులు విషయాన్ని ఎల్.కోట పోలీసులకు చేరవేసి అప్రమత్తం చేశారు.ఎల్.కోట ఏఎస్ఐ సత్యం, జీపు డ్రైవర్ ప్రసాద్ వెంటనే వ్యాన్‌ను గుర్తించి ఎల్.కోట కూడలి వద్ద ఆపేందుకు ప్రయతి్నంచినా ఆపకపోవడంతో వెంబడించారు. కొత్తవలస మండలం అప్పన్నపాలెం సమీపంలోకి వచ్చేసరికి రోడ్డుపైన వ్యాన్‌ను నిలిపి నిందితులు పరారయ్యారు. కొత్తవలస పోలీస్ స్టేషన్‌కు తరలించి వ్యాన్‌ను పరిశీలించగా కూరగాయాలు తరలించే కేట్లు మధ్య పెద్ద పెద్ద సంచుల్లో 5 కేజీలు, రెండు కేజీలు చొప్పున ప్యాకింగ్ చేసిన గంజాయి ప్యాకెట్లను గుర్తించారు. వీటిని తూకం వేయగా 450 కిలోలు వచి్చనట్టు సీఐ తెలిపారు. ఈ వాహనం మధ్యప్రదేశ్ రాష్ట్ర రిజి్రస్టేషన్ కలిగి ఉందని, సీబుక్ ఆధారంగా చిరునామా కోసం విచారిస్తున్నట్టు తెలిపారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామన్నారు. -
చంద్రగిరిలో యధేచ్చగా గంజాయి రవాణా!
తిరుపతి, సాక్షి: చంద్రగిరిలో జోరుగా సాగుతున్న గంజాయి అక్రమ రవాణా వెలుగుచూసింది. గాదంకి టోల్ ప్లాజా దగ్గర ఓ కారు అతివేగంగా దూసుకెళ్లింది. అయితే స్పీడ్ బ్రేకర్ వద్ద కారు డిక్కీలో నుంచి రెండు పార్సిల్స్ కింద పడ్డాయి. పోలీసులు వాటిని తనిఖీ చేయగా.. అందులో గంజాయి కనిపించింది. అది రెండు కేజీల దాకా ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. సీసీ కెమెరాల్లో కారు వెళ్లిన దృశ్యాలు నమోదు కాగా.. కారు నెంబర్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. -
‘మత్తు’ చిత్తుకు ద్విముఖ వ్యూహం
సాక్షి, హైదరాబాద్: యువత భవిష్యత్తును చిత్తు చేసే ‘మత్తు’మహమ్మారి కట్టడికి ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు. ఒకవైపు డ్రగ్స్, గంజాయి వంటి మత్తుపదార్థాల ముఠాల సప్లై చైన్ కట్టడి మరోవైపు మత్తు పదార్థాల వైపు యువత వెళ్లకుండా అవగాహన పెంచే వ్యూహంతో పనిచేస్తున్నామన్నారు. మత్తుదందాలో ఎంతటివారున్నా చట్టప్రకారం కఠిన చర్య లు తప్పవని హెచ్చరించారు.అదేవిధంగా పౌరుల కష్టార్జితాన్ని దోచుకొనే సైబర్ ముఠాలను సమర్థంగా ఎదుర్కొంటున్నామని.. గత ఆరు నెలల్లోనే రూ. 150 కోట్లను బాధితులకు రీఫండ్ చేయించగలిగామని చెప్పారు. శాంతిభద్రతల విషయంలో రాజీ లేదని, మహిళలు, చిన్నారుల భద్రత విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టామ న్నారు. చట్టాన్ని అతిక్రమిస్తే పోలీసు సిబ్బందికి క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేశారు. రాష్ట్ర ఐదో డీజీపీగా జూలై 10న బాధ్యతలు స్వీకరించిన జితేందర్ శనివారంతో పదవీబాధ్యతలు చేపట్టి నెల రోజులు పూర్తవుతున్న సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన విజన్‌ను ఆవిష్కరించారు. ప్రశ్న: పోలీస్ బాస్‌గా మీ నెల రోజుల పనితీరు ఎంతమేర సంతృప్తినిచి్చంది? జవాబు: డీజీపీగా ఈ నెల రోజుల పనితీరు ఎంతో సంతృప్తినిచి్చంది. అసెంబ్లీ సమావేశాలు సజావుగా పూర్తి చేశాం. భారీ నేరాలేవీ జరగకుండా కట్టడి చేశాం. పోలీస్ కమిష నర్లు, జిల్లా ఎస్పీలతో ఓ రోజంతా సమావేశమై రాష్ట్రంలో పోలీసింగ్ తీరుతెన్నులు, దృష్టిపెట్టాల్సిన అంశాలు, మత్తుపదార్థాల రవాణా, సైబర్ నేరాల కట్టడికి తీసుకోవాల్సిన చర్య లపై స్పష్టత ఇవ్వగలిగాం. దీనివల్ల క్షేత్రస్థాయిలో ఫలితాలు మెరుగయ్యాయి. ప్రజలకు అత్యవసర సేవలందించే డయల్ 100 సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టా. డయల్ 100 రెస్పాన్స్ టైం గతంలో కంటే సరాసరిన 5నిమిషాలు తగ్గింది. ప్రశ్న: మీ ప్రధాన ఫోకస్ ఏ అంశాలపై ఉండనుంది? జవాబు: శాంతిభద్రతల పరిరక్షణతోపాటు ప్రజలను ఆర్థికంగా గుల్ల చేస్తున్న సైబర్ నేరాల కట్టడిపై, యువతను పెడదోవ పట్టించే డ్రగ్స్, గంజాయి వంటి మత్తు ముఠాల అణచివేతపై ప్రధానంగా దృష్టి పెడుతున్నా. అదే సమయంలో మహిళలు, చిన్నారుల భద్రతలో రాజీ ఉండదు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారెవరైనా చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవు. ప్రశ్న: రాష్ట్రవ్యాప్తంగా హత్యలు, అత్యాచారాలకు అడ్డుకట్ట వేసేందుకు మీరు తీసుకుంటున్న చర్యలేమిటి? జవాబు: రాష్ట్రంలో గతంతో పోలిస్తే నేరాల సంఖ్యలో చెప్పదగ్గ స్థాయిలో పెరగలేదు. హత్యలు, అత్యాచారాలు పెరిగాయని కొన్ని రకాల దు్రష్పచారాలు జరుగుతున్నాయి. ఈ విషయాలపై గణాంకాలతో సహా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం అసెంబ్లీలో ఇటీవలే స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణలో ఎంతో కఠినంగా ఉన్నాం. విజుబుల్ పోలీసింగ్‌ను పెంచాం. ప్రశ్న: డ్రగ్స్ కేసుల్లో శిక్షలు అంతంతమాత్రమేనన్న విమర్శలపై ఏమంటారు? జవాబు: కొన్ని సాంకేతిక కారణాలతో గతంలో ఎన్డీపీఎస్ చట్టాల కింద కేసుల్లో శిక్షలు తక్కువగానే ఉండేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. టీజీ యాంటీనార్కోటిక్స్ బ్యూరోతో కలిసి దాదాపు 18 వేల మందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. పక్కాగా కేసుల నమోదు, దర్యాప్తుతో శిక్షలు పెరిగాయి. ఈ నెల రోజుల్లో నాలుగు ఎన్డీపీఎస్ కేసుల్లో శిక్షలు పడ్డాయి. ఇందులో రెండు కేసుల్లో దోషులకు పదేళ్ల చొప్పున జైలు శిక్ష ఖరారైంది. కొందరు విదేశీయులు అక్రమంగా ఇక్కడే ఉంటూ ఇక్కడ డ్రగ్స్ దందాలో దిగుతున్నారు. అలాంటి వారిపై దృష్టిపెట్టాం. డ్రగ్స్ కేసుల్లో దొరికిన వారిని స్వదేశాలకు పంపుతున్నాం. గత నెల రోజుల్లో ముగ్గురు విదేశీయులను వెనక్కి పంపాం. ప్రశ్న: దొంగతనం కేసులో ఇటీవల ఓ దళిత మహిళను పోలీసులు కొట్టడం వంటి ఘటనల్లో ఏం చర్యలు తీసుకుంటున్నారు? జవాబు: చట్టాన్ని అతిక్రమిస్తే పోలీసు సిబ్బందిపైనా కఠినంగానే ఉంటాం. ఇందులో ఏ మినహాయింపు ఉండదు. క్రమశిక్షణ చర్యలు ఎదుర్కోవాల్సిందే. శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంలో సిబ్బందిని ఎప్పటికప్పుడు సెన్సిటైజ్ చేస్తూనే ఉంటాం. ప్రశ్న: మైనర్లు వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్న ఘటనల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలేంటి? జవాబు: కేవలం మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయడంతోనే మార్పు రాదు. దీనిపై తల్లిదండ్రులు సైతం ఆలోచించాలి. తమ పిల్లలే ప్రమాదాల బారిన పడతారన్న విషయాన్ని వారు గుర్తిస్తేనే దీనికి సరైన పరిష్కారం దొరుకుతుంది. రోడ్డు ప్రమాదాల నియ ంత్రణకు అన్ని ప్రభుత్వ విభాగాల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నాం. ప్రశ్న: అతిపెద్ద ముప్పుగా మారిన సైబర్ నేరాలను ఎలా ఎదుర్కొంటున్నారు? జవాబు: సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేకంగా బ్యూరో ఏర్పాటు చేసిన ఏకైన రాష్ట్రం తెలంగాణ. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సైబర్ నేర ముఠాలకు అడ్డుకట్ట వేస్తున్నాం. గత ఆరు నెలల్లో సైబర్ బాధితులకు రూ. 150 కోట్లు రీఫండ్ చేయించడం గొప్ప ఏచీవ్మెంట్. ఒకవైపు సైబర్ కేసుల సత్వర దర్యాప్తు మరోవైపు మోసాలపై ప్రజల్లో అవగాహన పెంచుతున్నాం. ప్రశ్న: డ్రగ్స్, గంజాయిని ఎంత మేర కట్టడి చేశామనుకుంటున్నారు? జవాబు: మత్తు పదార్థాలపై ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. పూర్తిస్వేచ్ఛ ఉండటంతో డ్రగ్స్, గంజాయి వంటి మత్తుపదార్థాల కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలోకి గంజాయి రవాణా కాకుండా అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో మొబైల్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో తనిఖీలు పెంచాం. ఫలితంగా పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడుతోంది. గతానికి భిన్నంగా పబ్బులు, క్లబ్బుల్లోనూ జాగిలాలతో తనిఖీలు చేస్తున్నాం. కేసుల నమోదు పెరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ మాదిరిగానే గంజాయి కట్టడికి గంజాయి తాగిన వాళ్లను గుర్తించే కిట్లను హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ వంటి కమిషనరేట్లతోపాటు అన్ని జిల్లాలకు పంపాం.సైబర్ నేరాల కట్టడిలో యువత ముందుండాలిసైబర్ సెక్యూరిటీ హ్యాకథాన్‌లో డీజీపీ జితేందర్సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాల కట్టడిలో యువత ముందుండాలని డీజీపీ జితేందర్ పిలుపునిచ్చారు. కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా, యువత వారి ఆలోచన విధానాన్ని విస్తృతపర్చుకోవాలన్నారు. సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతోకలిసి టీజీ సైబర్ సెక్యూరిటీ ‘ది గ్రేట్ యాప్‌సెక్ హ్యాకథాన్ 2024’ నిర్వహిస్తోంది. శుక్రవారం బంజారా హిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించిన ఈ హ్యాకథాన్ ప్రారంభ కార్యక్రమానికి డీజీపీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక వినియోగం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో వ్యక్తిగత గోప్యత, సామాజిక భద్రత విషయంలో సైబర్ భద్రత అత్యంత ప్రధానంగా మారిందని డీజీపీ అభిప్రాయపడ్డారు. ⇒ టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ మాట్లాడుతూ ౖఈ హ్యాకథాన్‌లో 20కి పైగా దేశాల నుంచి 10 వేల మంది పాల్గొంటున్నారని చెప్పారు. ఈనెల 22న ఈ హ్యాకథాన్ ఫలితాలు వెల్లడిస్తామని, తెలంగాణలో మొదటి ఐదుగురు, జాతీయస్థాయిలో తొలి ఐదుగురు, అంత ర్జాతీయ స్థాయిలో తొలి ఐదుగురిని విజేతలుగా ప్రకటిస్తామ న్నారు. వీరికి తెలంగాణ సైబర్‌సెక్యూరిటీ బ్యూరోతో కలిసి పనిచేసే అవకాశం కల్పిస్తామని చెప్పారు. ⇒ ఐటీ ఎలక్ట్రానిక్స్ విభాగం డిప్యూటీ సెక్రెటరీ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ గతేడాది సైబర్ క్రైమ్ కారణంగా రూ. 7,500 కోట్లు కోల్పోగా, ఆ సొమ్మును టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు కాపాడారని చెప్పారు. దీనికి సంబంధించి రీఫండ్ ఆర్డర్లను బాధితులకు ఈ సందర్భంగా డీజీపీ జితేందర్ చేతులమీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో సెబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీలు దేవేందర్‌సింగ్, హర్షవర్ధన్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్‌కు అక్రమంగా వస్తే చర్యలు తీసుకుంటాంబంగ్లాదేశ్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తాజా పరిణామాలపై మీడియా అడిగిన ప్రశ్నలకు డీజీపీ జితేందర్ స్పందించారు. హైదరాబాద్‌లో ఉంటున్న బంగ్లా దేశీ యులపై నిఘా ఉంచామన్నారు. హైదరాబాద్‌కు అక్రమంగా వస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల ప్రకారమే నడుచుకుంటామన్నారు. -
శంషాబాద్ లో భారీగా గంజాయి పట్టివేత
-
డ్రగ్స్, గంజాయి బంద్ చేయాలంటే ఒక్కరోజు చాలు: అక్బరుద్దీన్
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్, గంజాయిని నిర్మూలించాలంటే ఒక్కరోజు చాలని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. అసెంబ్లీలో సోమవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘హైదరాబాద్‌కు డ్రగ్స్, గంజాయి ఎక్కడ్నుంచి వస్తుందో పోలీసులకు అంతా తెలుసు. నిర్మూలించాలనే ఉద్దేశం ఉంటే పోలీసులకు ఒక్కరోజు చాలు. నేరాలు చేసేవారిని, అత్యాచారాలు చేసే వారిని పట్టుకోకుండా..సామాన్యుల ఇళ్లలోకి చొరబడి విచారించడం, వారిని కొట్టడం లాంటి ఘటనలు పాతబస్తీలో ఎక్కువయ్యాయి.విధులు ముగించుకొని ఆలస్యంగా ఇంటికి వచ్చేవారిని, అత్యవసర పరిస్థితిలో బయటకు పోయేవారిని విచారణ పేరిట ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రతీ పోలీస్‌స్టేషన్‌కు మామూళ్లు అందుతున్నాయి. నిలోఫర్ కేఫ్ అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా తెరిచే ఉంటుంది. కమిషనర్‌కు చాయ్, బిస్కట్ అక్కడ్నుంచి తీసుకెళతారు కాబోలు అందుకే దాన్ని మూసివేయరు. మిగతా పేదలు, సామాన్యుల దుకాణాలను మాత్రం లాఠీలు చూపించి మూసేస్తారు.బీసీ సంక్షేమశాఖ పరిధిలోని కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు ఏడేళ్లలో భారీగా నిధులు కేటాయించినట్టు చూపించిన గత ప్రభుత్వం..ఖర్చు మాత్రం అత్యంత తక్కువగా చేసింది. గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో విద్యాశాఖను నిరీ్వర్యం చేసింది. ఫలితంగా 16 లక్షల మంది పిల్లలు వివిధ కేటగిరీల్లో డ్రాపౌట్లు అయ్యారు. ఇలాంటి తప్పిదాల వల్లే ఆ పార్టీ ఇప్పుడు ప్రతిపక్ష స్థానంలో కూర్చొంది.ప్రస్తుత ప్రభుత్వం కూడా బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలి. బీసీలకు నిధులు ఇవ్వకుంటే..వారికోసం ఎంఐఎం కొట్లాడుతుంది. బీసీలు, దళితులు, మైనారీ్టల హక్కుల సాధనలో ఎంఐఎం ముందుంటుంది. అన్ని వర్గాలకు సరైన కేటాయింపులు జరిపిన ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి. ఆయన హయాంలో నేను ఎన్నిసార్లు నిధులు డిమాండ్ చేసినా.. అవసరానికి తగినట్టు మంజూరు చేశారు’అని అక్బరుద్దీన్ వ్యాఖ్యానించారు. సర్కారీ కరెంట్ బిల్లుల బకాయిలు రూ. 28 వేల కోట్లు ∙వాటి వసూళ్ల బాధ్యతను అదానీకి అప్పగించాలి ∙పాతబస్తీ వెంట పడటం సరికాదు ∙అసెంబ్లీలో ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల నుంచి రూ.28వేల కోట్ల విద్యుత్ బిల్లుల మొండి బకాయిలు వసూలు కావడం లేదని, వాటి వసూలు బాధ్యతను అదానీ సంస్థకు అప్పగించాలని ఎంఐఎంపక్ష నేత అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు. పాతబస్తీలో 100% విద్యుత్ బిల్లులు వసూలు అవుతున్నాయని, తప్పుడు ప్రచారంతో దాని వెంటపడ్డారని ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా సోమవారం ఆయన శాసనసభలో మాట్లాడుతూ...మొత్తం రాష్ట్రంలో 20% విద్యుత్ నష్టాలున్నాయని, ఒక్క పాతబస్తీలోనే లేవన్నారు.అక్కడకాలం చెల్లిన సరఫరా వ్యవస్థ ఉండటంతోనే నష్టాలు ఎక్కువగా ఉన్నాయని గతంలో అధికారులు తనతో చెప్పారన్నారు. టీజీఎస్పీడీసీఎల్ మాజీ సీఎండీ పాతబస్తీలో తన ఇంటి వరకు కవర్డ్ కండక్టర్లతో నిరంతర సరఫరా కోసం ప్రత్యేక లైన్ వేసుకున్నారని, పాతబస్తీలో మాత్రం పనులు చేయలేదని వివరించారు. సీఎం రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ ఏరియా అభివృద్ధి సంస్థకు రూ.120 కోట్లను కేటాయించారని, మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహించే గజ్వెల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి ఎలాంటి కేటాయింపులు చేయలేదని తప్పుబట్టారు. -
టీడీపీ నేత గంజాయి సాగు
సాక్షి టాస్క్‌ఫోర్స్: గంజాయి మీద ఉక్కుపాదం మోపుతామని ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు నిత్యం ప్రచార పటాటోపం చేస్తుంటే.. మరోవైపు టీడీపీ నేతలే గంజాయి పండిస్తున్నారు. ఓ అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారంతో అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడైన టీడీపీ నేత స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్)కి చిక్కాడు. వివరాల్లోకి వెళితే.. రాయదుర్గం మండలం టి.వీరాపురంలో టీడీపీ నాయకుడు చిలకరి వన్నూరుస్వామి మామిడి తోటలో గంజాయి మొక్కలు పెంచుతూ పట్టుబడ్డాడు. వన్నూరుస్వామి ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులుకు ముఖ్య అనుచరుడు.టి.వీరాపురం గ్రామ సమీపాన కణేకల్లు క్రాస్‌కు చెందిన రవి అనే రైతు 9.5 ఎకరాల భూమిలో మామిడి, అల్ల నేరేడు పెంపకం చేపట్టాడు. ఈ తోట కాపరిగా టీడీపీ నాయకుడు వన్నూరుస్వామి కొంతకాలంగా ఉంటున్నాడు. పండ్ల తోటల మధ్య బంతి, కనకాంబరాల సాగు మొదలుపెట్టాడు. అందులోనే గుట్టుగా గంజాయి మొక్కల పెంపకం చేపట్టాడు. ఈ విషయాన్ని గ్రామానికి చెందిన ఓ అజ్ఞాత వ్యక్తి గుర్తించి.. జిల్లా టాస్క్‌ఫోర్స్ సీఐ వెంకటలక్ష్మమ్మకు సమాచారాన్ని చేరవేశాడు. ఆమె సెబ్ పోలీసులకు తెలపడంతో రంగంలోకి దిగారు. 7.25 కిలోల బరువు ఉన్న నాలుగు గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని.. నిందితుణ్ణి అరెస్ట్ చేశారు. శుక్రవారమే గంజాయి పట్టుబడగా 24 గంటల తర్వాత పోలీసులు కేసు నమోదు చేయడం విమర్శలకు తావిచ్చింది. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.21 వేలు ఉంటుందని సెబ్ అడిషనల్ ఎస్పీ రామకృష్ణ తెలిపారు. నిందితుడికి గంజాయి తీసుకునే అలవాటు ఉందని, ఈ కారణంగానే నాలుగు మొక్కలు పెంచుకున్నాడనే విషయం తమ దర్యాప్తులో వెల్లడైందని ఆయన చెప్పారు. -
కళాశాలలు అడ్డాగా గంజాయి అమ్మకాలు
-
మాదక ద్రవ్యాలపై తెలంగాణ పోలీసుల నిఘా
-
చంద్రబాబు కోటరీ ఆధ్వర్యంలో మత్తు మాఫియా
-
నా దగ్గర అన్ని అధారాలున్నాయి: బాధితురాలు
-
షణ్ముక్ గంజాయి కేసు.. దర్యాప్తులో సంచలన విషయాలు!
బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముక్, అతని సోదరుడు సంపత్ వినయ్ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తునకు వెళ్లిన పోలీసులకు వారి వద్ద గంజాయి లభ్యమైంది. వినయ్‌ని అదుపులోకి తీసుకునేందుకు తన ఫ్లాట్‌కి వెళ్లిన పోలీసులకు.. అక్కడ షణ్ముఖ్ గంజాయి సేవిస్తూ కనిపించాడు. దీంతో సంపత్ వినయ్‌తో పాటు షణ్ముఖ్‌ని నార్సింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా పోలీసులకు బాధిత యువతి తన వాంగ్మూలం ఇచ్చింది. ఆ యువతితో వినయ్‌కు మూడేళ్ల క్రితమే నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఆమెకు ఒకసారి అబార్షన్ కూడా చేయించినట్లు సమాచారం. ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని చెప్పి నయవంచనకు గురి చేశాడని యువతి పేర్కొంది. దీనికి సంబంధించి తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని బాధిత యువతి వెల్లడించింది. పోలీసులతో కలిసి వినయ్ ఫ్లాట్‌కు వెళ్లగా.. షణ్ముక్ వద్ద డ్రగ్స్, గంజాయి దొరికాయని తెలిపింది. వారితో తనకు ప్రాణహాని ఉందని.. న్యాయం కావాలని యువతి పోలీసులకు విజ్ఞప్తి చేసింది. యువతి వాంగ్మూలంలో సంచలన విషయాలు.. యువతి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. 'సంపత్‌ను యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ పరిచయం చేశాడు. మా పరిచయం ప్రేమగా మారాక సంపత్ వినయ్ పలుమార్లు నాపై లైంగిక దాడి చేశాడు. వివాహేతర సంబంధం పెట్టుకోవాలని నన్ను బలవంత పెట్టగా.. చేతికి రింగ్ పెట్టి మనం పెళ్లి చేసుకోబోతున్నామని నమ్మించాడు. ఆ తర్వాత కూడా పలుమార్లు శారీరకంగా వాడుకున్నాడు. ఒకసారి గర్భం కూడా తీయించాడు. ఈ విషయం సంపత్ పేరెంట్స్ అప్పారావుకి చెప్పా. ఎవరికైనా ఫిర్యాదు చేస్తే.. మీ ఇద్దరు కలిసి ఉన్న ఫొటోలకు సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. సంపత్‌కి మరో యువతి తో పెళ్లి అయ్యిందని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశా.'అని తెలిపింది. పోలీసులతో కలిసి నానక్‌రామ్‌గూడలోని సంపత్ ఫ్లాట్‌కి వెళ్లాను. అక్కడే షణ్ముక్ ఉన్నాడు. అతని వద్ద గంజాయి.. డ్రగ్స్ పిల్స్ ఉన్నాయి. జావేద్ అనే కానిస్టేబుల్ షణ్ముక్‌కు సహకరించే ప్రయత్నం చేశాడు. మమ్మల్ని వెంటనే కిందకు వెళ్లమని బలవంతపెట్టాడు. నన్ను కాంప్రమైజ్ అవమని కానిస్టేబుల్ ఒత్తిడి తెచ్చాడు. నా దగ్గర విడియో కూడా ఉందని యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది -
గంజాయితో పట్టుబడ్డ బిగ్ బాస్ ఫేం షణ్ముక్
-
గంజాయితో పట్టుబడ్డ షణ్ముఖ్..
-
నల్లగొండ జిల్లాలో చాక్లెట్ రూపంలో గంజాయి విక్రయాలు
-
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో గంజాయి చాక్లెట్ల గుట్టురట్టు
-
మాజీ ప్రియుడిని గంజాయి కేసులో ఇరికించిన యువతి
-
సిటీలో డ్రగ్స్, గంజాయి మాట వినపడొద్దు: సీపీ శ్రీనివాస్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రెండు నెలల్లో హైదరాబాద్‌లో డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మించాలని సీటీ పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ సీటీ పోలీసు బృందంతో ఆయన ఆదివారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడారు. డ్రగ్స్‌ను పూర్తిగా కట్టడి చేసేందుకు ఏర్పాట్లు చేయాలని అన్నారు. సిటీలో డ్రగ్స్, గంజాయి మాట వినపడద్దని తెలిపారు. నిజమైన బాధితుడికి మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్ వర్తిస్తుందని పేర్కొన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పోలీస్ కమిషనర్ పేరు చెప్పి పైరవీలు చేసే వారి పట్ల కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. ఇటీవల హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. చదవండి: TS: గవర్నర్ ప్రసంగంలో అసలు విషయం ఇదేనా? -
ఊర మాస్ శంకర్
‘సూపర్ మ్యాన్ ఏం చేశాడంటే’... ‘అబ్బా ఈ స్పైడర్ మ్యాన్లు.. సూపర్ మ్యాన్లు కాదు నాన్నా.. మన లోకల్ మ్యాన్ కథ ఏదైనా ఉంటే చెప్పు నాన్నా..’ అని చిన్నారి కూతురు అడుగుతుంది... అప్పుడు మొదలవుతుంది లోకల్ మ్యాన్ గురించి... ఆడు చిన్నప్పుడే చదువు మానేశాడనీ, అమ్మా నాన్న మాట వినలేదనీ, అన్ని చెడు అలవాట్లు ఉన్నాయనీ, పది రూపాయలుంటే పార్కులో, పది వేలుంటే పార్క్ హయత్‌లో ఉంటాడని చెప్పడంతో ఆ లోకల్ మ్యాన్ ఊర మాస్‌గా పెరిగినవాడని అర్థం అవుతుంది. అతని పేరు ‘గాంజా శంకర్’. సాయి ధరమ్ తేజ్ టైటిల్ రోల్లో రూపొందుతున్న చిత్రం ‘గాంజా శంకర్’. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఆదివారం సాయిధరమ్ పుట్టినరోజు సందర్భంగా గాంజా శంకర్ పాత్రను పరిచయం చేస్తూ, విడుదల చేసిన టీజర్లో పైన పేర్కొన్న డైలాగ్స్ ఉన్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: రిషీ పంజాబి, సమర్పణ: శ్రీకర స్టూడియోస్. -
అంతర్రాష్ట్ర గంజాయి ముఠా పట్టివేత
గన్నవరం: కృష్ణాజిల్లాలోని గన్నవరంలోని ఓ ఇంటి ఆవరణలో ఉన్న కారులో ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన సుమారు వంద కిలోల గంజాయిని కేంద్ర ప్రత్యేక బృందం పట్టుకుంది. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. స్థానిక సెయింట్‌జాన్స్ హైసూ్కల్ సమీపంలోని విద్యానగర్‌లో ఓ ఇంటిని ప్లాస్టిక్ వస్తువుల విక్రయ వ్యాపారం చేసే రాజస్థాన్‌కు చెందిన కుటుంబం మూడు నెలల క్రితం అద్దెకు తీసుకుంది. వీరి ఇంటికి గురువారం రాజస్థాన్‌కు చెందిన నలుగురు యువకులు కారులో వచ్చారు. ఆ కారులో అక్రమంగా గంజాయి తరలిస్తున్నారన్న సమాచారం మేరకు కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక బృందం దాడి చేసింది. అయితే భోజనాలు చేసి విశ్రాంతి తీసుకుంటున్న నలుగురు యువకుల్లో.. అధికారుల రాకను గమనించి ఇద్దరు గోడ దూకి పరారయ్యారు. మిగిలిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పట్టుబడ్డ ఇద్దరు యువకులను, గంజాయి ఉన్న కారును విజయవాడకు తరలించి విచారిస్తున్నారు. -
సైబరాబాద్ పరిధిలో రూ. 3 కోట్లు విలువ చేసే గంజాయి సీజ్
-
జైల్లో ఉన్న భర్తకి గంజాయి.. పక్కా ప్లాన్, చివరిలో అక్కడ దొరికిపోయింది!
బెంగళూరు: సాధారణంగా దంపతులు మధ్య అన్యోనత ఉండడం సహజం. ఇక కొందరు భార్యాభర్తలు ఒకరిమీద మరొకరు ఎనలేని ప్రేమను చూపిస్తుంటారు. అడిగిన వెంటనే తెచ్చి ఇవ్వడం, కాదని చెప్పలేకపోవడం, ప్రేమగా తమ తోడుని చూసుకుంటూ ఉంటారు. అయితే భార్యభర్తల మధ్య ఎంత ప్రేమ ఉన్నప్పటికీ ప్రతీ దానికి ఓ హద్దు ఉంటుంది. దాని దాటితే లేనిపోని చిక్కుల్లో పడాల్సి వస్తుంది. తాజాగా ఈ తరహా ఘటనే కలబురగిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జైల్లో ఉన్న భర్త కోసం గంజాయి అందివ్వాలని ఓ భార్య పథకం వేసింది. అనుకన్నట్టే గంజాయి సిద్ధం చేసి ఇవ్వటానికి వెళ్లిన ఆ మహిళ చివరికి తనిఖీల్లో పట్టుబడింది. పట్టణంలోని కేంద్ర కారాగారంలో జాలేంద్రనాథ్ కావళెకి అనే వ్యక్తి ఖైదీగా ఉన్నాడు. సోమవారం భర్తను కలవటానికి వచ్చిన భార్య సునీత రెండు జీన్స్ ప్యాంట్స్ అందజేసింది.భద్రతా సిబ్బంది బ్యాగును పరిశీలించగా గంజాయి లభ్యమైంది. దీంతో ఆమెను అరెస్ట్ చేశారు. చదవండి: అబిడ్స్‌లో బ్యూటీపార్లర్ నిర్వాకం.. ఆయిల్ పెట్టగానే ఊడిపోయిన మొత్తం జుట్టు -
పచ్చ మత్తులో జోగుతున్న ఈనాడు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా దాన్ని ప్రభుత్వానికి అంటగట్టనిదే ఈనాడు రామోజీరావుకు నిద్రపట్టడం లేదు. శ్రీకాకుళం జిల్లాలో కొందరు వ్యక్తుల మధ్య ఆవేశకావేశాలతో జరిగిన ఘర్షణకు గంజాయే కారణమని, అది సర్కారు నిర్వాకమని వక్రీకరించింది. గంజాయి మత్తులో రాష్ట్రంలో నేరాలు పెరుగుతున్నట్టు అవాస్తవాలతో ప్రభుత్వంపై బురద జల్లేందుకు యత్నంచింది. ‘గంజాయి రాజ్యంలో ముఠాల అరాచకం’ శీర్షికన గురువారం దుష్ప్రచారానికి పూనుకుంది. వాస్తవాల్లోకి వెళితే.. శ్రీకాకుళంలోని దమ్మాలవీధికి చెందిన టీడీపీ మాజీ కౌన్సిలర్ కేశవ రాంబాబు ఈ నెల 23న రాత్రి 8.30 గంటలకు తన బైక్‌పై వెళుతూ మార్గం మధ్యలో కొందరు యువకులతో ఘర్షణ పడ్డారు. దిల్లేశ్వరరావు అనే వ్యక్తి పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ట్రాఫి క్కు అంతరాయం కలిగింది. దీనిపై తన బైక్‌కు దారి ఇవ్వమని రాంబాబు ఆ వేడుకల్లో ఉన్న యువకులను అడిగారు. దాంతో మాధవ్, దేవా, కార్తిక్ అనే యువకులతో రాంబాబుకు వా గ్వాదం మొదలై ఘర్షణకు దారితీసింది. దాంతో ఒకరిని ఒకరు నెట్టుకున్నారు. రాంబాబు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఇరువర్గాల వారు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. దాంతో ఆ సామాజికవర్గ పెద్దలు వారి మధ్య రాజీ కుదిర్చారు. ఆ మేరకు రాంబాబు రాజీ లేఖను పోలీసులకు సమర్పంచారు. ఆ లేఖను న్యా యస్థానానికి నివేదించి అనంతరం న్యాయస్థానం ఆదేశాలతో తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనను ఈనాడు వక్రీకరించి గంజాయి మత్తు లో ఘర్షణ జరిగిందంటూ దుష్ప్రచారం చేసి, చంద్రబాబుకు అనుకూల వాతావరణం సృష్టించా లని పచ్చపాతాన్ని ప్రదర్శించడం దారుణం. -
వీళ్లు మనుషులేనా! కేదార్నాథ్ యాత్రలో దారుణం.. బలవంతంగా గంజాయి తాగించి..
ఉత్తరాఖండ్‌ను దేవభూమి అంటారు. చార్ధామ్ యాత్ర కోసం వేలాది మంది భక్తులు ఉత్తరాఖండ్‌లోకి వెళుతుంటారు. పుణ్యక్షేత్రాల్లో ఈ స్థలానికి ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. అయితే గత కొన్ని రోజులుగా కేదార్నాథ్ అధ్యాత్మికతతో కాకుండా పలు కారణాలతో వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఇద్దరు యువకులు గుర్రానికి బలవంతంగా గంజాయి తాగించేందుకు ప్రయత్నిస్తున్న వీడియో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. కేదార్నాథ్ యాత్రలో యాత్రికులు ఎక్కువగా గుర్రాలను ఉపయోగిస్తారు. గుర్రపు స్వారీ చేసేవారు, శక్తి లేని వారు కొండపైకి వెళ్లేందుకు గుర్రపు సవారిని ఎంచుకుంటారు. దీంతో గుర్రపు స్వారీ, గుర్రపు నిర్వాహకులు ఆదాయాన్ని పొందుతున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం నెట్టంట వైరల్‌గా మారిన వీడియోలో.. ఇద్దరు యువకులు గుర్రం నోరు పట్టుకున్నారు. ఒకరు గుర్రం ముక్కు రంధ్రాలను మూసేశారు. మరొక యువకుడు గుర్రానికి గంజాయిని నాసిక రంధ్రం ద్వారా బలవంతంగా తాగించేందుకు ప్రయత్నిస్తున్నాడు. గుర్రపు యజమాని గుర్రానికి ఈ విధంగా మత్తు మందు ఇస్తే భక్తుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. దీంతో యాత్రికుల భద్రతపై ప్రజల్లో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వీడియోని చూసిన నెటిజన్లు పలువురు ఘాటుగా స్పందించారు. వీళ్లు మనుషులేనా.. ఇది అమానుషమైన ఘటనని, జంతువులను ఇంత దారుణంగా హింసించే నిందితులను వీలైనంత త్వరగా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ఉత్తరాఖండ్ పోలీసులు స్పందిస్తూ.. గుర్రంతో బలవంతంగా గంజాయి తాగిస్తున్న వైరల్ వీడియోను మేము చూశాం. వీడియోలోని వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకుంటామని" చెప్పారు. #Uttrakhand Some people are making a horse smoke weed forcefully at the trek of Kedarnath temple.@uttarakhandcops @DehradunPolice @RudraprayagPol @AshokKumar_IPS should look into this matter and find the culprit behind thispic.twitter.com/yyX1BNMiLk — Himanshi Mehra 🔱 (@manshi_mehra_) June 23, 2023 చదవండి: ఇకపై బస్సు డ్రైవర్, కండక్టర్ల ఫోన్లు చెకింగ్.. ఎందుకంటే..? -
గంజాయి, అక్రమ మద్యంపై సెబ్ దాడులు
సాక్షి, అమరావతి: ఒడిశా నుంచి అక్రమంగా తరలిస్తున్న గంజాయితోపాటు డ్రగ్స్ విక్రయాలు, అక్రమ మద్యం విక్రయాలు, సారా తయారీపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) విస్తృతంగా దాడులు నిర్వహిస్తోంది. మే నెలలోనే 169 గంజాయి కేసులు నమోదు చేసి 710 మందిని అరెస్టు చేసింది. 7,222.16 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతోపాటు 92 వాహనాలను జప్తుచేసింది. మూడు మాదకద్రవ్యాల కేసులు నమోదు చేసి ఐదుగురిని అరెస్టు చేసింది. 3,100 పెంటజోయిస్ ఇంజక్షన్ సీసాలు, 4.23 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకుంది. 2,115 సారా కేసుల్లో 13,828 లీటర్ల సారా, 1,198.5 కిలోల ఊట బెల్లాన్ని స్వాధీనం చేసుకోవడంతోపాటు 1,274 మందిని అరెస్టు చేసింది. 896 అక్రమ మద్యం కేసులు నమోదు చేసి 588 మందిని అరెస్టు చేయడంతోపాటు 1,664.94 లీటర్ల అక్రమ మద్యం, 144.6 లీటర్ల బీరును స్వాధీనం చేసుకుని, 21 వాహనాలను జప్తుచేసింది. 40 లీటర్ల అక్రమ కల్లును కూడా స్వాధీనం చేసుకుంది. 30 ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా కేసుల్లో 161 మందిని అరెస్టు చేయడంతోపాటు 264 ఎర్రచందనం దుంగలను, 25 వాహనాలను జప్తుచేసింది. మే నెలలో గంజాయి కేసుల్లో 30 మందిపై, సారా కేసుల్లో ఎనిమిది మందిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్టు సెబ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: IAS vs IPS: ఐపీఎస్ రూపకు ముందస్తు బెయిల్ -
‘పుష్ప’ తరహాలో గంజాయి రవాణా.. క్యాబేజీ బుట్టల మాటున దాచి..
సాక్షి, విశాఖపట్నం: ‘పుష్ప’ సినిమా తరహాలో గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన విశాఖ జిల్లా పెందుర్తిలో చోటుచేసుకుంది. బొలెరో వాహనంలో ఇద్దరు వ్యక్తులు క్యాబేజీ బుట్టల మాటున గంజాయి అక్రమంగా తరలించే ప్రయత్నం చేశారు. అయితే బొలెరోలో గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులకు సమచారం అందింది దీంతో పెందుర్తి వద్ద పోలీసులు వాహనంలో తనిఖీలు చేపట్టగా గుట్టు రట్టైంది. క్యాబేజీ బుట్టలు కింద 14 బ్యాగుల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బొలెరో వాహనంలో ఒడిశా నుంచి గంజాయిని క్యాబేజీ బుట్టల లోడుతో తీసుకొస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గంజాయితో ఉన్న బొలెరో వాహనాన్ని, ఇద్దరు వ్యక్తులను పెందుర్తి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
మంచి జీతం, సాఫ్ట్వేర్ ఉద్యోగం.. జల్సాలకు అలవాటు పడి కక్కుర్తితో
సాక్షి ,బంజారాహిల్స్: మంచి జీతం , సాఫ్ట్వేర్ ఉద్యోగం అయినా జల్సాలకు అలవాటు పడి, జీతం సరిపోకపోవడంతో ఓ వ్యక్తి గంజాయి విక్రేతగా మారాడు. వివరాల్లోకి వెళ్తే.. ఫిలింనగర్‌లోని ఛత్రపతి శివాజీనగర్‌కు చెందిన రాంతీర్థ్ దేవానంద్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడిన అతను గంజాయికి బానిసయ్యాడు. జీతం సరిపోకపోవడంతో తానే గంజాయి విక్రయాలు చేపట్టాడు. ఈ నెల 7న అతను ఫిలింనగర్లో గంజాయి సరఫరాదారు రాజుసింగ్ నుంచి రెండు కేజీల గంజాయి ప్యాకెట్‌ను తీసుకుంటూ పట్టుబడ్డాడు. తరచూ ఇదే ప్రాంతంలో దేవానంద్‌కు అతను గంజాయి తెచ్చిస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం అందడంతో నిఘా వేసిన పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి 4.3 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వీరిపై ఎన్డీపీఎస్ యాక్ట్ నమోదుచేసి రిమాండ్‌కు తరలించారు. చదవండి: పుట్టుమచ్చలు చూపాలంటూ వేధింపులు -
బంజారాహిల్స్‌లో కారు బీభత్సం!
సాక్షి, హైదరాబాద్ (బంజారాహిల్స్): మద్యంతో పాటు గంజాయి సేవించి అదుపుతప్పిన వేగంతో కారులో దూసుకువచ్చిన ఇద్దరు యువకులు బీభత్సం సృష్టించారు. ఈ ఘటనలో ఒకరికి తీవ్రంగా, పలువురికి స్వల్పంగా గాయాలయ్యాయి. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన ముదిగొండ అనూష్ రావు (22), కొత్తపేటకు చెందిన పవన్ కళ్యాణ్‌రెడ్డి (22) స్నేహితులు. శనివారం రాత్రి శంషాబాద్‌లోని ఓ పబ్‌లో మద్యం తాగారు. గంజాయి కూడా తీసుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో శంషాబాద్ నుంచి వీరిద్దరూ కారులో ఇంటికి బయలుదేరారు. మత్తులో డ్రైవింగ్.. సిగరెట్లలో గంజాయి నింపుకొని తాగుతూ అదుపుతప్పిన వేగంతో బంజారాహిల్స్ రోడ్ నెం.2 నుంచి దూసుకెళ్తున్నారు. మాదాపూర్‌లోని సౌండ్స్ అండ్ స్పిరిట్స్ పబ్‌లో సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్‌కు చెందిన అజ్మత్, విజయ్‌కుమార్ బౌన్సర్లుగా పని చేస్తున్నారు. విధులు ముగించుకొని తెల్లవారుజామున బైక్‌పై బంజారాహిల్స్ రోడ్ నెం.2 నుంచి వెళ్తుండగా క్రీమ్‌స్టోన్ వద్ద వెనక నుంచి వేగంగా వచ్చిన అనూష్ రావు కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో అజ్మత్కు తలకు తీవ్ర గాయాలు కావడంతో సికింద్రాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. విజయ్‌కుమార్ స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనలో అనూష్‌రావు స్కూటర్‌ను ఢీకొట్టి పక్కకు తిప్పే క్రమంలో అక్కడ మరో కారును ఢీకొట్టాడు. ఆ కారు రోడ్డుకు అడ్డం తిరగడంతో వెనకాల వస్తున్న మరో కారు ఢీకొట్టింది. ఇలా నాలుగు కార్లు ఒకదానికొకటి ఢీకొట్టుకోవడంతో అందులో ప్రయాణిస్తున్న వారందరికీ స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన స్థానికంగా బీభత్సం సృష్టించింది. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రోడ్డు ప్రమాదానికి కారకులైన అనూష్‌రావు, పవన్ కళ్యాణ్‌రెడ్డిని అదుపులోకి తీసుకొని బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు చేశారు. ఇద్దరూ మద్యం తాగినట్లు గుర్తించారు. మద్యం, గంజాయితో పాటు డ్రగ్స్ కూడా తీసుకొని ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారులో గంజాయి నింపిన సిగరెట్లతో పాటు 50 గ్రాముల గంజాయి కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరి రక్త నమూనాలు, వెంట్రుకల నమూనాలు సేకరించి ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించినట్లు పోలీసులు తెలిపారు. అనూష్ రావు, పవన్ కళ్యాణ్‌రెడ్డిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారును సీజ్ చేశారు. పోలీసుల దర్యాప్తులో ఈ కారు అనూష్ రావు తల్లి పేరు మీద ఉన్నట్లుగా తేలింది. చదవండి: నల్గొండ కాంగ్రెస్‌లో కలకలం.. కోమటిరెడ్డి ఆడియో లీక్! -
ఏవోబీ నుంచి మహారాష్ట్రకు గంజాయి అక్రమ రవాణా
-
గంజాయి ఆరోపణలు.. వీడియోగ్రాఫర్ ఆత్మహత్య
సాక్షి, బెంగళూరు: యువకుడిపై గంజాయి ఆరోపణలు రావడంతో తీవ్ర మనస్తాపానికి గురై డెత్‌నోటు రాసి పెట్టి ఉరి వేసుకొన్నాడు. మృతుడు అభిషేక్ (23) వీడియోగ్రాపర్గా పనిచేసేవాడు. స్నేహితునికి ఇచ్చిన అప్పును వసూలు చేసుకోవాలని అభిషేక్ అక్కడికి వెళ్ళిన సమయంలో కొందరు గంజాయి తాగుతుండగా పోలీసులు వచ్చి అందరినీ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. నీవు కూడ గంజాయి తాగుతావా అని అభిషేక్‌ని ప్రశ్నించారు. తాగలేదని చెప్పడంతో ఇంటికి పంపించారు. విచారణకు అవసరమైతే మళ్లీ రావాలని సూచించారు. ఈ సంఘటనతో తీవ్రంగా మథనపడ్డాడు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, కానీ ఇలాంటి ఆరోపణలు రావడం భయంగా ఉందని, ఇప్పటివరకు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా భరించానని, కానీ ఎలాంటి తప్పు చేయకున్నా గంజాయి తాగినట్లు పట్టుకుని వెళ్లడాన్ని తట్టుకోలేకపోతున్నానని పేర్కొన్నాడు. ఈ మేరకు సుసైడ్ లెటర్ రాసి ఉరి చేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అశోకపురం పోలీసులు పరిశీలించి ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. -
కుదుళ్లు కట్టి... డ్రిప్ పెట్టి!
సాక్షి, హైదరాబాద్: అడవి మధ్యలో ఉన్న చదునైన ప్రాంతాల్లో చెల్లాచెదురుగానో, కొండ వాలుల్లోనే గంజాయిని సాగుచేయడం ఇప్పటివరకు వింటూనే ఉన్నాం. పోలీసులు, ప్రత్యేక బలగాలు ఈ తోటల్ని గుర్తించినప్పుడు వీటిని ధ్వంసం చేస్తుంటారు. అయితే హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులు ‘డ్రగ్ డిస్ట్రిబ్యూటర్’ ఎన్.ప్రవీణ్‌కుమార్‌ను విచారించినప్పుడు విశాఖపట్నం ఏజెన్సీ కేంద్రంగా జరుగుతున్న గంజాయి సాగులో కొత్త కోణం వెలుగుచూసింది. ఆధారాల కోసం అన్వేషిస్తుంటే... హైదరాబాద్ నుంచి విశాఖ ఏజెన్సీకి పెట్రోలియం ఈథర్... అక్కడ నుంచి సిటీకి హష్ ఆయిల్ అక్రమ రవాణా చేస్తున్న కుత్బుల్లాపూర్ వాసి ప్రవీణ్ కుమార్‌ను హెచ్–న్యూ మంగళవారం అరెస్ట్ చేసింది. ప్రవీణ్ దందాలకు సంబం«ధించిన ఆధారాల కోసం అన్వేషిస్తూ అతడి ఫోన్‌ను తనిఖీ చేసింది. అందులో కొన్ని తోటలకు సంబంధించిన వీడియోలను గుర్తించింది. కొండలకు సమీపంలో చదునైన ప్రాంతంలో ఉన్న అక్కడి మొక్కలకు కుదుళ్లు కట్టి ఉండటం, నీటి సరఫరా కోసం డ్రిప్ ఇరిగేషన్ పైపులు ఏర్పాటు చేయడం చూసింది. అక్రమార్జన ద్వారా అతడు కూడబెట్టిన సొమ్ముతో దాన్ని ఖరీదు చేసినట్లు భావించింది. దీనిపై ప్రవీణ్‌ను ప్రశ్నించగా... అది ఏజెన్సీలోని గూడెం మాడుగుల మండలంలోని అలగం గ్రామంలో అడవి మధ్యలో గిరిజనులు సాగుచేస్తున్న గంజాయి పంట అని అతడు చెప్పగా, అవాక్కవడం అధికారుల వంతయింది. అరెస్టు అయితే బెయిల్ ఇప్పిస్తాడు సాధారణంగా డ్రగ్స్‌వంటి అక్రమ దందాలు చేసే వాళ్లు ‘క్యాష్ అండ్ క్యారీ’ లేదా అడ్వాన్స్ చెల్లిస్తేనే సరుకు సరఫరా వంటి విధానాలను అవలంబిస్తుంటారు. వీరికి రెగ్యులర్ కస్టమర్లు తక్కువ కావడంతో ఈ పంథా అనుసరిస్తారు. అయితే ప్రవీణ్ మాత్రం తన హష్ ఆయిల్ దందాను క్రెడిట్ విధానంలోనూ చేస్తున్నాడు. నగరంలో ఉన్న 15 మంది పెడ్లర్స్ (అక్రమరవాణా చేసేవారు)కు వాళ్లు ఇచ్చిన ఆర్డర్ ఆధారంగా 20 నుంచి 30 డబ్బాల (ఒక్కోటి 5 ఎంఎల్) హష్ ఆయిల్ ముందే సరఫరా చేస్తాడు. దాన్ని వాళ్లు అమ్ముకున్న తర్వాత ప్రవీణ్‌కు డబ్బు చెల్లిస్తుంటారు. ఇతడి వద్ద పెడ్లర్స్‌గా పనిచేస్తున్న వారిలో ఎవరైనా అరెస్టు అయితే...వారికి బెయిల్ కూడా ఇప్పిస్తుంటాడు. అతడి వాట్సాప్‌లోని ఓ సందేశం ఆధారంగా పోలీసులు ఈ విషయం గుర్తించారు. ఇతడి వద్ద పనిచేసే విక్రమ్ అనే సరఫరాదారుడిని బెంగళూరు పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. అతడికి బెయిల్ ఇవ్వడానికి అదే నగరానికి చెందిన ఓ లాయర్‌తో ప్రవీణ్ సంప్రదింపులు జరిపాడు. అందుకు అవసరమైన ఖర్చులను కూడా పంపించాడు. ఇతడి వ్యవహారాలు, నెట్‌వర్క్‌ను పూర్తిస్థాయిలో గుర్తించడానికి మరోసారి విచారించాలని పోలీసులు నిర్ణయించారు. దీనికోసం అతడిని తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
గంజాయిపై ఏపీ పోలీసుల ఉక్కుపాదం
-
ఏపీలో మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం
-
జొమాటో డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి సప్లయ్
సాక్షి, హైదరాబాద్: జొమాటో డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి సప్లయ్ చేస్తున్న చుంచు నితీష్ చంద్రని తుకారంగేట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెడ్లర్ రాహుల్ ఆదేశాలతో అవసరమైనవారికి గంజాయి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఫుడ్ ఐటమ్‌లో కోడ్ భాషను ఉపయోగిస్తూ గంజాయి సరఫరా జరుగుతోంది. జొమాటోలో ఉద్యోగం చేస్తూ డబ్బు కోసం గంజాయి సరఫరా చేస్తున్నాడు. నితీష్ చంద్ర వద్ద 600 గ్రాముల గంజాయి, రూ.5వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు 30 మంది కస్టమర్లకు గంజాయి సరఫరా చేసినట్లు గుర్తించారు. నితీష్ చంద్ర అరెస్ట్‌తో భువనగిరి పీఎస్‌లో పెడ్లర్ రాహుల్ లొంగిపోయారు. చదవండి: (కాంగ్రెస్‌ను నాశనం చేస్తోంది వారేనా?.. గాంధీభవన్‌లో అసలేం జరుగుతోంది?) -
యాపిల్ బాక్సుల్లో చెరస్ డ్రగ్ రవాణా!.. ఇది చాలా రేటు గురూ
సాక్షి, హైదరాబాద్: గార్లిక్ బ్రెడ్–రూ.160, దోశ–రూ.250, ఫ్రూట్ సలాడ్–రూ.300, సీఫుడ్ సూప్–రూ.320.. ఎడ్విన్ కేసులో అరెస్టు అయిన డ్రగ్ పెడ్లర్ బాలమురుగన్‌కు చెందిన మోర్గన్స్ ప్లేస్ రెస్టారెంట్ మెనూ ఇది. అక్కడకు వెళ్లిన ఎవరైనా ఇంత రేటా..? అంటే.. అంతా విలువ ఉంటుందని చెప్తుంటారు నిర్వాహకులు. బాలమురుగన్ సరఫరా చేసే చెరస్ కూడా ఇలానే ఎక్కువ రేటు ఉంటుందని, ఎందుకంటే అతడి నుంచీ అదే సమాధానం వస్తుందని హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులు చెప్తున్నారు. దీనికి అతడి నుంచి వచ్చే సమాధానం వర్తీ స్టఫ్ సార్ అని. హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలీ పర్వత ప్రాంతాల్లో అది పండటమే కారణం. తదుపరి విచారణ నిమిత్తం బాలమురుగన్‌ను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ రామ్‌గోపాల్ పేట పోలీసులు నాంపల్లి కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. తులాల లెక్కన విక్రయం... హోటళ్ల వ్యాపారం చేసే బాలమురుగన్‌కు రాజస్థాన్‌లోని కోట, బుండి, పుష్కర్‌లతో పాటు హిమాచల్‌ప్రదేశ్‌లోని ధరమ్‌కోట్, గోవాలోని అంజునా బీచ్‌ల్లో మోర్గన్స్ ప్లేస్ పేరుతో రెస్టారెంట్లు నిర్వహిస్తున్నాడు. అనునిత్యం రద్దీగా ఉండే వీటిలో నాణ్యమైన ఆహారం అందిస్తున్న నేపథ్యంలోనే రేటు సైతం ఎక్కువని మురుగన్ ప్రచారం చేసుకుంటాడు. అతడు సరఫరా చేసే చెరస్ విషయంలోనూ ఇదే సూత్రం అవలంబిస్తున్నాడు. మనాలీలో దొరికే గంజాయి ఆకులు, పుష్పాల నుంచి తీసే ఈ జిగురు లాంటి పదార్థాన్ని అతగాడు కేజీల్లో ఖరీదు చేస్తున్నాడు. దాన్ని గోవా సహా ఐదు రాష్ట్రాలకు సరఫరా చేస్తూ తులాల లెక్కన అమ్ముతున్నాడు. ఒక్కో తులం పెడ్లర్లకు రూ.5 వేలకు అమ్ముతుండగా అది వినియోగదారుడి వద్దకు చేరేసరికి రూ.10 వేలు దాటుతోంది. యాపిల్ బాక్సులు ఆర్డర్ ఇస్తూ... తన హోటల్స్ నిర్వహణ బాధ్యతల్లో భాగంగా బాలమురుగన్ అనునిత్యం గోవా, రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్‌ల మధ్య చక్కర్లు కొడుతూ ఉంటాడు. గతంలో మనాలీ నుంచి ఇతగాడే చెరస్‌ను రవాణా చేసేవాడు. కూరగాయల మధ్యలో కేజీ చొప్పున ప్యాక్ చేసిన చెరస్ పెట్టి తీసుకువచ్చేవాడు. అయితే గడిచిన రెండుమూడేళ్లుగా నిఘా పెరిగిపోయింది. దీంతో ఇతగాడు యాపిల్స్ మార్గం అనుసరిస్తున్నాడు. హిమాచల్‌ప్రదేశ్‌లోని హోల్‌సేల్ యాపిల్ వ్యాపారుల నుంచి తన హోటల్ కోసమంటూ 10, 15 బాక్సులు ఆర్డర్ ఇచ్చేవాడు. వాటిని ప్యాక్ చేసే వారిని మ్యానేజ్ చేయడం ద్వారా ఒక్కో దాంట్లో కేజీ చొప్పున చెరస్ ప్యాకెట్లు పెట్టించేవాడు. ఈ బాక్సులపై ప్రత్యేక గుర్తులు పెట్టి మిగిలిన వాటిలో కలిపేసేవాళ్లు. ఈ పార్శిల్స్ గోవా వచ్చిన తర్వాత తొలుత తనకే సమాచారం ఇచ్చేలా ట్రాన్స్‌పోర్టు వ్యాపారులనూ మేనేజ్ చేసేవాడు. అలా వారి వద్దకు వెళ్లి ప్రత్యేక గుర్తులతో ఉన్న బాక్సులు తీసుకువెళ్లేవాడు. తాము సహకరిస్తున్నది చెరస్ రవాణాకని అటు హిమాచల్, ఇటు గోవాలో ఉన్న వారికీ తెలిసేది కాదు. గోవా నుంచి ఇతర రాష్ట్రాల్లోని పెడ్లర్స్‌కు హోల్‌సేల్‌గా సరఫరా చేసేవాడు. మురుగన్‌కు మరికొందరు పెడ్లర్స్... ఏళ్లుగా చెరస్, కొకైన్ వ్యాపారం చేస్తున్న బాలమురుగన్‌కు నగరంలోనూ కొందరు పెడ్లర్స్ ఉంటారని పోలీసు విభాగం అనుమానిస్తోంది. వారి వివరాలు గుర్తించడానికి లోతుగా విచారించాలని నిర్ణయించింది. దీనికోసం వారం రోజుల పోలీసు కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ నాంపల్లి కోర్టులో రామ్‌గోపాల్‌పేట పోలీసులు సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం తుది నిర్ణయం తీసుకోనుంది. -
తిరుపతి జిల్లా చంద్రగిరి బాలికల పాఠశాల వద్ద గంజాయి అమ్మకాల కలకలం
-
నువ్వు ఎవడివిరా అంటూ విచక్షణా రహితంగా పొడిచి..
ఖిలా వరంగల్: కరీమాబాద్ ఉర్సుగుట్ట జంక్షన్లో శనివారం అర్ధరాత్రి యువకుడి హత్య కలకలం రేపింది. గంజాయి మత్తులో ఓ యువకుడు స్నేహితులతో కలిసి ముగ్గురు యువకులపై దాడి చేశాడు. అందులో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరో యువకుడు ప్రాణాపాయ స్థితిలో ఎంజీఎంలో చికిత్స పొందుతున్నాడు. మరో యువకుడు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. కరీమాబాద్ ఎస్ఆర్ఆర్ తోటకు చెందిన వనం సుధాకర్‌కు ఇద్దరు కుమారులు కార్తీక్, వనం రాకేశ్(26) ఉన్నారు. రాకేశ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పీఈటీగా పనిచేస్తున్నాడు. శనివారం స్కూల్‌కు వెళ్లి వచ్చిన తర్వాత సాయంత్రం స్నేహితులను కలిసి వస్తానని ఇంట్లో చెప్పి కరీమాబాద్ ఉర్సుగుట్ట జంక్షన్లో ఉన్న మరుపల్లి నిఖిల్ బేకరికి వెళ్లాడు. అక్కడ నిఖిల్, శ్రీనాథ్, వంశీలతో రాకేశ్ మాట్లాడుతుండగా కడిపికొండ నుంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు నిఖిల్ బేకరి ఎదుట మూత్ర విసర్జన చేశారు. ఈక్రమంలో నిఖిల్, రాకేశ్ మూత్రవిసర్జన చేసిన యువకులను నిలదీశారు. దీంతో నువ్వు ఎవడివిరా అంటూ షాపు నిర్వాహకుడిని ప్రశ్నిస్తూ బైక్‌పై వచ్చిన వారు గొడవకు దిగారు. మాటామాటా పెరిగి ఘర్షణ తీవ్రస్థాయికి చేరింది. ఇంతలో బైక్‌పై వచ్చిన గాడుదల రాజేశ్‌తోపాటు మరో వ్యక్తి ఫోన్ చేసి బంటి, యోగి భాస్కర్‌ను పిలుపించుకున్నారు. ఓ పక్క ఇరువురు మాట్లాడుతుండగానే గాడుదల రాజేశ్ తన వద్ద ఉన్న కత్తి తీసి రాకేశ్‌ను విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడు. ఈక్రమంలో అడ్డుకోబోయిన నిఖిల్, శివపై దాడి చేశాడు. దీంతో నిఖిల్ కుప్పకూలాడు. శివ పారిపోతుండగా వెంటపడి కత్తితో దాడి చేశారు. అతడు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ఆ తర్వాత రాజేశ్ కత్తి చూపిస్తూ అడ్డువస్తే అందరికీ ఇదే గతి పడుతోందని హెచ్చరిస్తూ ఘటనా స్థలం నుంచి వెళ్లిపోయాడు. శివ మిల్స్‌కాలనీ పోలీసులతో పాటు గాయపడిన నిఖిల్ తల్లిదండ్రులు, రాకేశ్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. చదవండి: (వికటించిన కుటుంబనియంత్రణ ఆపరేషన్.. ఇద్దరు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం) రాకేశ్, నిఖిల్‌ను 108 వాహనంలో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు రాకేశ్ మృతి చెందినట్లు ధ్రువీకరించారు. నిఖిల్‌ను ఎమర్జెనీ వార్డుకు తరలించారు. మృతుడి సోదరుడు వనం కార్తీక్ ఆదివారం మిల్స్‌కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేయగా హత్యా నేరం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఇన్స్పెక్టర్ ముస్క శ్రీనివాస్ తెలిపారు. కాగా, స్నేహితుల వద్దకు వెళ్లకుంటే బతికేవాడి బిడ్డా అంటూ వనం రాకేశ్ మృతదేహంపై పడి తల్లిదండ్రులు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. పాతకక్షలే కారణమా..? రాకేశ్ హత్య అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇరువురు యువకుల మధ్య పాతకక్షలు ఉన్నాయా..?, క్షణికావేశంలో కత్తితో దాడి చేశారా..? అనే కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతుంది. కాగా, ఇరువురి మధ్య పాతకక్షలు ఉన్నాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. పోలీసు కస్టడీలో నిందితుడు యువకుడి హత్య కేసుతో సంబంధమున్న ఇరువురిని పోలీసులు ఇప్పటికే గుర్తించినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రధాన నిందితుడు శివనగర్‌లోని ఏసీరెడ్డి నగర్‌కు చెందిన గాడుదల రాజేశ్‌ను కస్టడీలోకి తీసుకున్నట్లు సమాచారం. అలాగే, అతడితోపాటు మరో ఐదుగురు దాడిలో పాల్గొన్నట్లు విశ్వనీయంగా తెలిసింది. మిగతా వారి ఆచూకీ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నట్లు సమాచారం. -
ప్రకాశం జిల్లాలో గంజాయి అమ్మకాలు
-
బాసర ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం
-
మెహిదీపట్నంలో గంజాయి బ్యాచ్ వీరంగం
-
కొబ్బరి కాదు.. కాలకూటం!
జయపురం(భువనేశ్వర్): కొరాపుట్ జిల్లాలో గంజాయి రవాణా ముఠా రోజుకో కొత్త మార్గాలు వెతుకుతున్నారు. అధికారుల కళ్లు గప్పి, పెద్ద ఎత్తున సరుకు ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు కూడా వారి ఆగడాలకు అడ్డుకట్ట వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొబ్బరికాయల లోడు మధ్య ట్రక్కులో తీసుకు వెళ్తున్న సుమారు 16క్వింటాళ్ల గంజాయిని జయపురం ఎక్సైజ్ పోలీసులు శనివారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఎక్సైజ్ ఎస్పీ మనోజ్‌కుమార్ సెఠి ఆదివారం వెల్లడించారు. గంజాయి రవాణా అవుతుందనే విశ్వసనీయ సమాచారం మేరకు ఇన్స్పెక్టర్ ప్రమోద్‌కుమార్ బంటువ, ఎస్ఐ దిలీప్‌కుమార్ రథ్‌తో కూడిన ప్రత్యేక బృందం జయపురం వైపు వెళ్తున్న ట్రక్కును గమనించారు. వారిచ్చిన ఆనవాళ్ల ఆధారంగా ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ దుర్భదల్ బిశ్వాల్, ఆఫీస్ ఇన్చార్జి సంజయ్‌కుమార్ కండి, ఏఎస్ఐ ఎం.లక్ష్మణరావు, మాధవేశ్ మహంతి, సిబ్బంది జయపురం ఘాట్ రోడ్డులో మాటు వేశారు. అతి వేగంగా వస్తున్న ట్రక్కుని నిలువరించి, సోదా చేయగా.. అందులో 100 బస్తాల కొబ్బరి కాయలతో పాటు 150 గంజాయి బస్తాలు బయటపడ్డాయి. పట్టుబడిన సరుకు విలువ సుమారు రూ.81 లక్షలు ఉంటుందని వెల్డించారు. ఘటనకు సంబంధించి బీహార్ రాష్ట్రానికి చెందిన డ్రైవర్ ప్రభు యాదవ్(35)ను అరెస్ట్ చేసినట్లు వివరించారు. పద్మపూర్‌లో 3 క్వింటాళ్లు.. రాయగడ: జిల్లాలోని పద్మపూర్ పోలీసులు రూ.15 లక్షల విలువైన 3క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఉత్తరప్రదేశ్‌కు చెందిన యష్‌బీర్ సింగ్(60), పన్నాలాల్ బాస్‌దేవ్(57)ను అరెస్ట్ చేశారు. పద్మపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మరిడిగుడ వద్ద శనివారం రాత్రి వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు రాయగడ వైపు వెళ్తున్న లారీని తనిఖీ చేశారు. క్రిమిసంహారక మందు సరఫరా చేసే డ్రమ్ముల్లో 300 కిలోల గంజాయిని గుర్తించారు. దీంతో లారీతో పాటు డ్రైవర్, హెల్పర్‌ను అరెస్ట్ చేసి, కోర్టుకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వివరించారు. నలుగురి అరెస్ట్.. మల్కన్‌గిరి: జిల్లాలోని చిత్రకొండ సమితి మంత్రిపూట్ గ్రామం వద్ద చిత్రకొండ పోలీసులు శనివారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో అతివేగంగా వస్తున్న వాహనాన్ని తనిఖీ చేయగా, 253 కిలోల గంజాయిని గుర్తించారు. దీనిని బీహార్‌కు తరలిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి జిల్లాలోని ఎంవీ–38 గ్రామానికి చెందిన ప్రకాష్ సర్దార్, బీహర్‌కు చెందిన సునీల్‌కుమార్, హరేంద్రకుమార్, విజేంద్రకుమార్ లను అరెస్ట్ చేశారు. నిందితులకు సోమవారం వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం, కోర్టులో హాజరు పరుస్తామని ఎస్డీపీఓ అన్షుమాన్ ద్వివేది తెలిపారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు రూ.12 లక్షలు ఉంటుందని వివరించారు. -
కొబ్బరికాయల లోడు ట్రక్కులో గంజాయి.. రూ.81 లక్షల విలువైన సరుకు
సాక్షి,, భువనేశ్వర్: కొరాపుట్ జిల్లాలో గంజాయి రవాణా ముఠా రోజుకో కొత్త మార్గాలు వెతుకుతున్నారు. అధికారుల కళ్లు గప్పి, పెద్ద ఎత్తున సరుకు ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు కూడా వారి ఆగడాలకు అడ్డుకట్ట వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొబ్బరికాయల లోడు మధ్య ట్రక్కులో తీసుకు వెళ్తున్న సుమారు 16క్వింటాళ్ల గంజాయిని జయపురం ఎక్సైజ్ పోలీసులు శనివారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఎక్సైజ్ ఎస్పీ మనోజ్‌కుమార్ సెఠి ఆదివారం వెల్లడించారు. గంజాయి రవాణా అవుతుందనే విశ్వసనీయ సమాచారం మేరకు ఇన్స్పెక్టర్ ప్రమోద్‌కుమార్ బంటువ, ఎస్ఐ దిలీప్‌కుమార్ రథ్‌తో కూడిన ప్రత్యేక బృందం జయపురం వైపు వెళ్తున్న ట్రక్కును గమనించారు. వారిచ్చిన ఆనవాళ్ల ఆధారంగా ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ దుర్భదల్ బిశ్వాల్, ఆఫీస్ ఇన్చార్జి సంజయ్‌కుమార్ కండి, ఏఎస్ఐ ఎం.లక్ష్మణరావు, మాధవేశ్ మహంతి, సిబ్బంది జయపురం ఘాట్ రోడ్డులో మాటు వేశారు. అతి వేగంగా వస్తున్న ట్రక్కుని నిలువరించి, సోదా చేయగా.. అందులో 100 బస్తాల కొబ్బరి కాయలతో పాటు 150 గంజాయి బస్తాలు బయటపడ్డాయి. పట్టుబడిన సరుకు విలువ సుమారు రూ.81 లక్షలు ఉంటుందని వెల్డించారు. ఘటనకు సంబంధించి బీహార్ రాష్ట్రానికి చెందిన డ్రైవర్ ప్రభు యాదవ్(35)ను అరెస్ట్ చేసినట్లు వివరించారు. మల్కన్‌గిరి: గంజాయితో పోలీసుల అదుపులో నిందితులు పద్మపూర్‌లో 3 క్వింటాళ్లు.. రాయగడ: జిల్లాలోని పద్మపూర్ పోలీసులు రూ.15 లక్షల విలువైన 3క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఉత్తరప్రదేశ్‌కు చెందిన యష్‌బీర్ సింగ్(60), పన్నాలాల్ బాస్‌దేవ్(57)ను అరెస్ట్ చేశారు. పద్మపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మరిడిగుడ వద్ద శనివారం రాత్రి వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు రాయగడ వైపు వెళ్తున్న లారీని తనిఖీ చేశారు. క్రిమిసంహారక మందు సరఫరా చేసే డ్రమ్ముల్లో 300 కిలోల గంజాయిని గుర్తించారు. దీంతో లారీతో పాటు డ్రైవర్, హెల్పర్‌ను అరెస్ట్ చేసి, కోర్టుకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వివరించారు. నలుగురి అరెస్ట్.. మల్కన్‌గిరి: జిల్లాలోని చిత్రకొండ సమితి మంత్రిపూట్ గ్రామం వద్ద చిత్రకొండ పోలీసులు శనివారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో అతివేగంగా వస్తున్న వాహనాన్ని తనిఖీ చేయగా, 253 కిలోల గంజాయిని గుర్తించారు. దీనిని బీహార్‌కు తరలిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి జిల్లాలోని ఎంవీ–38 గ్రామానికి చెందిన ప్రకాష్ సర్దార్, బీహర్‌కు చెందిన సునీల్‌కుమార్, హరేంద్రకుమార్, విజేంద్రకుమార్ లను అరెస్ట్ చేశారు. నిందితులకు సోమవారం వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం, కోర్టులో హాజరు పరుస్తామని ఎస్డీపీఓ అన్షుమాన్ ద్వివేది తెలిపారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు రూ.12 లక్షలు ఉంటుందని వివరించారు. -
Crime News: మంచిర్యాలలో ‘గంజాయి’ డెత్!
సాక్షి, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా సింగరేణి డివిజన్లో గంజాయి కలకలం రేగుతోంది. సింగరేణి ఉద్యోగులు.. ముఖ్యమంగా యువ ఉద్యోగులు గంజాయికి బానిసలవుతున్నారు. తాజాగా ఓ యువ ఉద్యోగి గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సింగరేణి ఉద్యోగి అనిల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గోదావరి నది నుంచి అతని మృతదేహాన్ని అధికారులు వెలికి తీశారు. గంజాయి మత్తువల్లే అనిల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని బంధువులు చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న దండేపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా.. కోల్‌బెల్ట్ ఏరియాలో గత కొంతకాలంగా గంజాయి దందా యధేచ్చగా సాగుతోంది. పలు చోట్ల గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నారు పోలీసులు. తాజా ఘటన నేపథ్యంలో సింగరేణి ఉద్యోగులకు మాదక ద్రవ్యాల నివారణపై కౌన్సెలింగ్ అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
200 కిలోల గంజాయి పట్టివేత
నక్కపల్లి: జాతీయరహదారిపై కాగిత టోల్గేట్ వద్ద గురువారం తెల్లవారు జామున పోలీసులు అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని పట్టుకున్నారు. ఎస్ఐ డి.వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం ఉదయం వాహనాలను తనిఖీలో భాగంగా విశాఖనుంచి తమిళనాడు వైపు వెళ్తున్న లారీలో కేబిన్, సీటు పైభాగంలో 100 ప్యాకెట్లలో ఉన్న 200 కిలోల గంజాయిని పట్టుకున్నారు. దీని విలువ రూ.10 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లా గోరిమేడుకు చెందిన డ్రైవర్ మహ్మద్ యూసుఫ్, క్లీనర్ ఖాదర్‌హుస్సేన్‌లపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. మోతుగూడెం చెక్‌పోస్టు వద్ద గంజాయి స్వాధీనం మోతుగూడెం: మోతుగూడెం పోలీస్‌స్టేషన్ చెక్‌పోస్టు వద్ద నిర్వహించిన తనిఖీల్లో గంజాయి స్వాదీనం చేసుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ నుంచి సమాచారం మేరకు చింతూరు అడిషన్ ఎస్పీ కృష్ణకాంత్ ఆధ్వర్యంలో చింతూరు సీఐ అప్పలనాయుడు పర్యవేక్షణలో ఎస్ఐ సత్తిబాబు చెక్‌పోస్టు వద్ద వాహనాలు తనిఖీలు నిర్వహించారు. సింధువాడ గ్రామంలో జహీరాబాద్‌కు అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఒక ఇన్నోవా వాహనాన్ని ,మోటార్ బైక్‌ను, 350 కేజీలు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. -
పైన చూస్తే చింతపండు.. లోపలే ఉంది అసలు మ్యాటర్!
మల్కన్‌గిరి(భువనేశ్వర్): జిల్లాలోని కలిమెల సమితి ఎంపీవీ–31 గ్రామం వద్ద మల్కన్‌గిరి ఎస్డీపీఓ సువేందుకుమార్ పాత్రొ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు భారీగా గంజాయిని గుర్తించారు. చింతపండు లోడ్‌తో ట్రక్‌ను తనిఖీ చేయగా, 15 క్వింటాళ్ల గంజాయి బయట పడింది. డ్రైవర్ కన్నరామ్ చౌదరి, వ్యాపారి ప్రతామ్ పాత్రొను అరెస్ట్ చేశారు. అతివేగంగా వెళ్తున్న ట్రక్‌పై అనుమానంతో వాహనాన్ని తనిఖీ చేయగా.. 63 బస్తాల్లో నింపి, చింతపండు లోడ్ మధ్య తరలిస్తున్న గంజాయిని గుర్తించారు. పట్టుబడిన సరుకు విలువ సుమారు రూ.కోటికి పైగా ఉంటుందని ఎస్డీపీఓ గురువారం ప్రకటించారు. నిందితులపై కేసు నమోదు చేసి, మల్కన్‌గిరి కోర్టులో హాజర్ పరిచారు. గంజాయిని మోటు మీదుగా తెలంగాణకు తరలిస్తున్నట్లు తేలిందన్నారు. చదవండి: చేతబడి: నిద్ర లేచి తలుపు తెరచి చూస్తే.. -
ఇదీ రూట్.. ఒరిస్సా టు మహారాష్ట్ర వయా హైదరాబాద్.. కానీ మధ్యలో..
సాక్షి, సిటీబ్యూరో: ఒరిస్సాలోని చిత్రకొండ ఏజెన్సీ నుంచి మహారాష్ట్ర, అమరావతికి హైదరాబాద్ మీదుగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన సరఫరాదారుడు, రిసీవర్ పరారీలో ఉండగా.. గంజాయి లోడ్ వాహన డ్రైవర్లను మాత్రమే అరెస్ట్ చేశారు. వీరి నుంచి 560 కిలోల గంజాయి. కారు, డీసీఎం, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర శనివారం వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర అమరావతికి చెందిన నౌషాద్ ముంబై, అమరావతి ప్రాంతాల్లో గంజాయి వ్యాపారం చేస్తున్నాడు. అతడికి ఉస్మాన్‌నగర్‌కు చెందిన సలీమ్ ఉల్లా అలియాస్ రాజు, షేక్ రెహాన్, షేక్ వసీం సహకరించేవారు. ఒరిస్సా చిత్రకొండకు చెందిన సంతోష్ ఏజెన్సీ ప్రాంతంలో స్థానిక సాగుదారుల నుంచి గంజాయిని కొనుగోలు చేసి.. వివిధ రాష్ట్రాల్లోని గంజాయి విక్రేతలకు సరఫరా చేసేవాడు. ఈ క్రమంలో 15 రోజుల క్రితం నౌషాద్.. సంతోష్‌ను సంప్రదించి, 1,000 కిలోల ఎండు గంజాయి ఆర్డర్ ఇచ్చాడు. అడ్వాన్స్‌గా రూ.2 లక్షలు చెల్లించాడు. దీంతో సంతోష్ 560 కిలోల గంజాయిని సిద్ధం చేసి నౌషాద్కు సమాచారం అందించాడు. (చదవండి: హోలీ పండుగకు భార్య మటన్ వండలేదని 100కు కాల్.. ) నౌషాద్ భద్రాచలం నుంచి మహారాష్ట్రలోని అమరావతికి బంగాళదుంపలను రవాణా చేయాలని కోరుతూ.. హైదరాబాద్‌కు చెందిన ఇక్బాల్‌ను సంప్రదించాడు. ఈనెల 15న సలీం, రెహాన్, వసీం కారులో ఖమ్మం వెళ్లారు. అక్కడ ఇక్బాల్ ఏర్పాటు చేసిన డీసీఎం తీసుకున్నారు. సలీం డీసీఎం నడుపుతూ భద్రాచలం వెళ్లి అక్కడ 3 టన్నుల బంగాళా దుంపలు లోడ్ ఎక్కించుకున్నాడు. అక్కడ్నుంచి ఈనెల 18న చిత్రకొండ ఏజెన్సీ అటవీ ప్రాంతంలో డీసీఎంను పార్క్ చేసి సంతోష్‌కు సమాచారం అందించాడు. సంతోష్ డీసీఎంలో 560 కిలోల గంజాయి లోడ్ చేసి మిగిలిన ముగ్గురికి సమాచారం అందించి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. సలీం డీసీఎంను డ్రైవ్ చేస్తుండగా రెహాన్, వసీం కారులో ఎస్కార్ట్‌గా అమరావతి బయలుదేరారు. తెలంగాణ సరిహద్దులో తనికీలు ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో నిందితులు టోల్ రోడ్లు రాకుండా డీసీఎంను దారి మళ్లించారు. హిమాయత్‌సాగర్ మీదుగా వెళుతుండగా.. విశ్వసనీయ సమాచారం అందుకున్న స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) శంషాబాద్, రాజేంద్రనగర్ పోలీసులు పీడీపీ క్రాస్‌రోడ్ వద్ద డీసీఎం, ఎస్కార్ట్‌గా వెళుతున్న కారును అడ్డుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా గంజాయి విషయం బయటపడింది. కిలో 1,250 చొప్పున కొనుగోలు చేసి.. వినియోగదారులకు రూ.20 వేలకు విక్రయిస్తున్నట్లు నిందితులు పేర్కొన్నారని పోలీసులు తెలిపారు. -
గంజాయి ఆయిల్‌తో హెడ్‌కానిస్టేబుల్ అరెస్టు
వైరా: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నుంచి ఖమ్మంకు నిషేధిత గంజాయి ఆయి ల్ను తరలిస్తున్న ఒక హెడ్ కానిస్టేబుల్‌తో పాటు మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు. ఖమ్మం జిల్లా వైరా ఎస్ఐ వీరప్రసాద్ తెలిపిన వివరాలివి. కొత్తగూడెంలోని ఆరో బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ సపావత్ రాజ్‌కుమార్.. బుద్ది దుర్గాప్రసాద్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై రూ.2లక్షల విలువైన 2 బాటిళ్ల గంజాయి ఆయిల్‌తో శుక్రవారం మధ్యాహ్నం బయల్దేరాడు. వైరా సమీపాన పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించడంతో పరిశీలించగా ఆయిల్ బయట పడింది. వీరిని అరెస్టు చేసి మధిర కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్ఐ తెలిపారు. -
గప్‌చుప్‌గా వెళ్తుంటే.. టైరు పేలింది.. గుట్టు రట్టయ్యింది!
నందిగాం: ఓ బొలేరో వాహనం అల్లం బస్తాల లోడుతో ఎంచక్కా చెక్ పోస్టులు దాటేస్తూ వెళ్లిపోతోంది. ఎవరికీ ఎక్కడా అనుమానం రాలేదు. ఇంకాసేపు అయితే జిల్లా కూడా దాటేసేదే. కానీ నందిగాం మండలం పాలవలస పేట వద్దకు వచ్చే సరికి టైరు పేలి బండి బోల్తా పడింది. ఇంకేముంది గుట్టు కాస్తా రట్టయిపోయింది. సాయం చేద్దామని వాహ నం దగ్గరకు వచ్చిన వారికి అల్లం బస్తాలతో పాటు గంజాయి కనిపించడంతో అసలు విషయం బయటపడింది. మొత్తం 386 కిలోల గంజాయి దొరికింది. జనాలను చూసిన డ్రైవర్, క్లీనర్లు పొలాల గుండా పరుగులు పెట్టారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. టెక్కలి వైపు నుంచి పలాస వైపు వెళ్తున్న ఎంపీ 13 జీఓ 6427 నంబర్ గల బొలేరో పికప్ బండి బుధవారం నందిగాం మండలం పాలవలస పేట వద్ద వెనుక టైర్ పేలిపోవడంతో జాతీయ రహదారిపై బోల్తా పడింది. దీంతో వ్యాన్‌లో ఉన్న అల్లం బస్తాలు రోడ్డు మీద పడ్డాయి. చుట్టుపక్కల ఉన్న వారు సాయం అందించేందుకు అక్కడకు చేరుకోగా.. డ్రైవర్, క్లీనర్లు చిన్న చిన్న గాయాలతో పొ లాల మీదుగా పరుగులు పెడుతూ కనిపించారు. దీంతో అనుమానం వచ్చిన స్థానికులు బస్తాలను ప రిశీలించి చూస్తే అల్లంతో పాటు గంజాయి బస్తాలు కనిపించాయి. వెంటనే వారంతా నందిగాం పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఈ లోగా డ్రైవర్, క్లీనర్లు మళ్లీ వ్యాన్ వద్దకు వచ్చి వాహనంలో ఉన్న బ్యాగ్ తీసుకుని మళ్లీ పారిపోయారు. నంది గాం ఎస్ఐ మహమ్మద్ యాసిన్ సంఘటన స్థలం వద్దకు చేరుకొని చెల్లా చెదురుగా పడి ఉన్న బస్తాలను తహసీల్దార్ ఎన్.రాజారావు సమక్షంలో స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మొ త్తం 13 బస్తాల్లో 386 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. ఎస్ఐ కేసు నమోదు చేయగా కాశీబుగ్గ సీఐ ఎస్.శంకరరావు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యాన్ మధ్యప్రదేశ్ వాసిదిగా గుర్తించామన్నారు. డ్రైవర్, క్లీనర్ కోసం గాలిస్తున్నారు. -
చూడ్డానికి అచ్చం దోశలా ఉంది కదూ.. కాదండోయ్..మరేంటి?
సాక్షి, సిటీబ్యూరో: గంజాయిని న్యూస్ పేపర్లో దోస మాదిరిగా ప్యాక్ చేసి, ఆర్డర్ ఇచ్చిన వారికి డోర్ డెలివరీ చేస్తున్న మలక్‌పేట వాసి హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్‌కు (హెచ్–న్యూ) చిక్కాడు. ఇతడితో పాటు సహాయకుడిగా ఉన్న సమీప బంధువునీ పట్టుకున్న అధికారులు తదుపరి చర్యల నిమిత్తం కార్ఖానా పోలీసులకు అప్పగించారు. ఇతగాడికీ ఈ సరుకును సరఫరా చేసింది అదిలాబాద్‌కు చెందిన ముఠానే అని వెల్లడైంది. మంగళ్‌హాట్ ప్రాంతానికి చెందిన కిషోర్ సింగ్ కొన్నేళ్లుగా గంజాయి వ్యాపారం చేస్తున్నాడు. అక్కడ ఇతడిపై నిఘా పెరగడంతో మకాంను మలక్‌పేటకు మార్చాడు. అదిలాబాద్‌కు చెందిన సోనే రావు నుంచి గంజాయి ఖరీదు చేస్తున్నాడు. కేజీ రూ.10 వేలకు కొని, రిటైల్‌గా కేజీ రూ.60 వేలకు అమ్ముతున్నాడు. తన వద్దకు చేరిన గంజాయిని 100 గ్రాములు చొప్పున న్యూస్ పేపర్లో దోస మాదిరిగా ప్యాక్ చేస్తున్నాడు. కస్టమర్ల నుంచి ఆర్డర్ల కోసం ప్రత్యేక ఫోన్, నంబర్ వాడుతున్నాడు. ఈ ఆర్డర్ల ప్రకారం ద్విచక్ర వాహనంపై వెళ్లి డెలివరీ చేసి రావడానికి తన సమీప బంధువు ఇంద్ర కరణ్ సింగ్‌ను నియమించుకున్నాడు. ఈ ద్వయం కొన్నాళ్లుగా ఈ పంథాలో గుట్టుగా దందా చేస్తోంది. చదవండి: రెండో భార్యతో ఉండగా.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని.. వీరి వ్యవహారం ఇలా వెలుగులోకి... హెచ్–న్యూ అధికారులు శనివారం సోనే రావుతో పాటు గంజాయి రవాణా చేసిన ఉల్లాస్, సుకారాం, హరిసింగ్‌లను అరెస్టు చేశారు. ప్రాథమిక విచారణలో తాము గంజాయిని బస్సులో తీసుకువస్తున్నామని చెప్పారు. అయితే వాటి సమయాలపై పొంతన లేని సమాధానం చెప్పడంతో హెచ్–న్యూ టీమ్ లోతుగా విచారించింది. దీంతో కారులో తెస్తున్నామని, అయితే ఆ రోజు ఉదయం తమ వాహనానికి మేడ్చెల్ వద్ద యాక్సిడెంట్ జరిగిందని చెప్పారు. నగరానికి వచ్చిన వెంటనే దాన్ని చాదర్‌ఘాట్‌లో మరమ్మతు చేయడానికి ఇచ్చామన్నారు. అక్కడ నుంచి ఆటోలో కార్ఖానా వద్దకు డెలివరీ చేయడానికి చేరుకున్నామని, ఆ డ్రైవర్‌కు విషయం చెప్పలేదని బయటపెట్టారు. అప్రమత్తమైన అధికారులు ఆటోను గుర్తించి డ్రైవర్‌ను ప్రశ్నించారు. ఆ రోజు తన ఆటో ఎక్కిన వీళ్లు మలక్‌పేటలో ఓ వ్యక్తికి బ్యాగ్ ఇచ్చారని చెప్పాడు. అలా ఆరా తీసిన హెచ్–న్యూ కిషోర్ సింగ్‌ను గుర్తించి పట్టుకున్నారు. ఇతడిచ్చిన సమాచారం ఆధారంగా ఇంద్రకరణ్‌ను పట్టుకున్నారు. వీరిద్దరినీ తదుపరి చర్యల నిమిత్తం కార్ఖానా పోలీసులకు అప్పగించారు. -
సినీఫక్కీలో లారీకి ప్రత్యేక క్యాబిన్ ఏర్పాటు చేసి..
శంషాబాద్(హైదరాబాద్): సినీ ఫక్కీలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠాకు శంషాబాద్ జోన్ ఎస్ఓటీ, చేవెళ్ల పోలీసులు చెక్ పెట్టారు. మహారాష్ట్ర పింప్రి ప్రాంతానికి చెందిన పరుశురాం,అంకుష్ పండులే గంజాయి అక్రమ రవాణాకు పథకం పన్నారు. ఇందులో భాగంగా అహ్మద్‌నగర్‌కు చెందిన ఉమేష్ గైక్వాడ్, ప్రదీప్ కలంగి, దత్తసాకత్, సతీష్ విజయ్ షిండే, విశాల్, అశోక్‌తో కలిసి ముఠా ఏర్పాటు చేశారు. వారిలో కొందరు డ్రైవర్లు ఉన్నారు. వీరు గంజాయి తీసుకువస్తే మరికొందరు వాటిని అవసరమైన వారికి విక్రయించేవారు. ఇందులో భాగంగా ఆరునెలల క్రితం అహ్మద్‌నగర్‌లో లారీకి ప్రత్యేక క్యాబిన్ తయారు చేయించారు. ముందుగా ఎస్కార్ట్.. సుత్రధారులైన పరుశురాం, అంకుష్ పండే గంజాయి సరఫరా చేసే ఖమ్మం ఏజెన్సీ ప్రాంతానికి చెందిన సుభాన్, భాషాలను సంప్రదించారు. కిలో రూ. 2500 చొప్పున 400 కిలోల గంజాయి కొనుగోలు చేశారు. పథకంలో భాగంగా ఫిబ్రవరి 22 ఖమ్మం ఏజెన్సీలో వారికి లారీని అప్పగించగా గంజాయి లోడ్ చేశారు. 27న లారీతో భద్రాచలం, సూర్యాపేట మీదుగా మహారాష్ట్రకు బయలుదేరారు. లారీని ఎవరు పట్టుకోకుండా ముందు కారులో కొందరు ఎస్కార్ట్‌గా వెళ్లారు. ముందస్తు సమాచారంతో శంషాబాద్ ఎస్ఓటీ, చేవెళ్ల పోలీసులు షాబాద్ ఎక్స్‌రోడ్డు వద్ద వారిని అదుపులో కి తీసుకున్నారు. ఖమ్మం ఏజెన్సీ ప్రాంతానికి సుభాన్, భాషా, అంకుష్ పండులే మినహా మిగతా వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి నుంచి 400 కేజీల గంజాయి, రూ.15 వేల నగదు, కారు, లారీ, 9 ఫోన్లు, బంగారు, వెండి ఉంగరాలు, గొలుసులు స్వాధీనం చేసుకున్నారు. ముఠాను పట్టుకోవడంతో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఓటీ, చెవెళ్ల పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు. -
గంజాయి మత్తులో యువకుల వీరంగం.. అడ్డుకోబోయిన మహిళపై..
సాక్షి,రహమత్‌నగర్(హైదరాబాద్): గంజాయి మత్తులో కొందరు తన భర్తపై దాడికి యత్నిస్తుండగా అడ్డుకున్న మహిళపై దాడి చేసి గాయపరచిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రహమత్‌నగర్‌లో చోటుచేసుకుంది. బాధితురాలు, పోలీసుల కథనం ప్రకారం... రహమత్‌నగర్ పోలీస్ అవుట్ పోస్టు ఎదురుగా మైదానాన్ని ఆనుకుని ఉన్న రవియాదవ్‌గల్లీలో మహేశ్‌బాబు నివాసం ఉంది. మంగళవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో మైదానం నుంచి కొందరు యువకులు బయటికి వచ్చారు. అప్పటికే గంజాయి మత్తులో ఉన్న వారు రవియాదవ్‌గల్లీలో నిలిపి ఉన్న మహేశ్‌బాబుకు చెందిన వాహనాన్ని బలంగా కొట్టారు. అక్కడే ఉన్న మహేశ్‌బాబు వారిని వారించబోగా అతనిపై దాడికి యత్నించారు. ఈ క్రమంలో తన భర్తపై జరుగుతున్న దాడికి అడ్డుకునేందుకు ఆయన భార్య సుమలత ప్రయత్నించింది. మత్తులో ఉన్న ఆ యువకులు ఆగ్రహంతో పక్కనే ఉన్న రాయితో సుమలతపై దాడి చేశారు. ఈ ఘటనలో సుమలత చేయి, కాలికి గాయాలయ్యాయి. దీంతో బాధితురాలు రహæమత్‌నగర్‌లో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అమెరికా నుంచి కొరియర్ లో హైదరాబాద్ కు దిగుమతి అయిన గంజాయి
-
60 కేజీల గంజాయి సీజ్
-
దుప్పట్లు అమ్ముతూనే.. మరోవైపు ఎవరికి తెలియకుండా..
కొరాపుట్(భువనేశ్వర్): జిల్లాలోని నందపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దుప్పట్ల విక్రయం మాటున జరుగుతున్న గంజాయి కొనుగోళ్ల గుట్టురట్టయింది. కొమరగుడా జంక్షన్ వద్ద హర్యానా నుంచి వచ్చిన సుల్తాన్ సింగ్ ఓ గుడారం ఏర్పాటు చేసుకుని, సమీప గ్రామాల్లో దుప్పట్ల అమ్మకం ప్రారంభించాడు. అయితే అతడు దుప్పట్లు అమ్ముతూనే మరోవైపు ఎవరికి తెలియకుండా గంజాయి కొనుగోలు చేస్తుండేవాడు. శుక్రవారం ఉదయం అతడు సేకరించిన గంజాయిని తరలించేందుకు సిద్ధం చేస్తుండగా, సమాచారం అందుకున్న పోలీసులు అత డి నివాసానికి చేరుకుని, రూ.660 కిలోల గంజాయి ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని అరెస్ట్ చేసి, పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ప్రమోద్‌కుమార్ బనువా తెలిపారు. -
వణుకు పుట్టిస్తోన్న బ్లేడ్‌బ్యాచ్.. రంగంలోకి కమిషనర్!
సాక్షి ప్రతినిధి విజయవాడ: వారికి గంజాయితో నిత్యం సహవాసం.. జన సంచారం అంతగాలేని ప్రాంతాల్లో ఒంటరిగా వెళ్లే వారే లక్ష్యం.. డబ్బులు ఇవ్వలంటూ బ్లేడుతో దాడి చేయడం, పోలీసులు పట్టుకోవాలని ప్రయత్నిస్తే తమను తాము కోసు కుని చస్తామంటూ బెదిరించడం వారికి సహజం.. ఇదీ విజయవాడలో హల్చల్ చేసే బ్లేడ్‌బ్యాచ్ సభ్యుల నైజం. నగరంలో అలజడి సృష్టిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న బ్లేడ్ బ్యాచ్ సభ్యుల కట్టడికి పోలీసులు చర్యలు చేపట్టారు. వారి మూలాలను శోధించే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా పోలీస్ కమిషనర్ టి.కె.రాణా స్వయంగా రంగంలోకి దిగారు. సీపీ ఆదేశాల మేరకు పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి తాగేవారు ఎంత మంది ఉన్నారనే సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు. ఇప్పటికే నగరంలో బ్లేడ్‌బ్యాచ్ ఆగడాలకు, గంజాయి తాగేందుకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలైన వన్ టౌన్, టూ టౌన్, రైల్వే అప్ యార్డు, సీపీఆర్ ఫ్లై ఓవర్, ఆర్పీఎఫ్ పోస్టు, రామరాజ్యనగర్లోని రైల్వే బ్రిడ్జ్ కింద ఖాళీ ప్రదేశాలు, జక్కంపూడి శివారులోని 60, 40 అడుగుల రోడ్ల పరిసర ప్రాంతాలను పరిశీలించారు. నేర చరిత్ర ఆధారంగా బ్లేడ్ బ్యాచ్ సభ్యులను ఆయా పోలీస్స్టేషన్లకు పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. పోలీస్ కమిషనర్ టి.కె.రాణా వన్‌టౌన్, సింగ్‌నగర్ ప్రాంతంలో బ్లేడ్‌బ్యాచ్, గంజాయి తాగేవారికి ఇప్పటికే కౌన్సెలింగ్ ఇచ్చారు. వారి కదలికలు ఎక్కువగా ఉన్న పోలీస్ స్టేషన్ల పరిధిలో సీపీ స్వయంగా పర్యటించి, బ్లేడ్ బ్యాచ్ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చేలా ప్రణాళిక రూపొందించారు. సన్మార్గంలో నడిస్తే ఉపాధి బ్లేడ్ బ్యాచ్ సభ్యులు నేర ప్రవృత్తిని మార్చుకుని మంచి మార్గంలో నడవాలని నగర పోలీస్ కమిషనర్ టి.కె.రాణా ఆధ్వర్యంలో పోలీసులు సూచిస్తున్నారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ జన జీవనానికి భంగం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనే వారికి కఠిన దండన తప్పదనే సంకేతాలు పంపుతున్నారు. నేర ప్రవృత్తి మార్చుకోని వారిని ఉపేక్షించేది లేదని, అవసరమైతే నగర బహిష్కరణ తప్పదని హెచ్చరిస్తున్నారు. మంచి మార్గంలో నడుచుకునే వారికి వ్యాపార సంస్థలతో మాట్లాడి ఉపాధి కల్పిస్తామని భరోసా ఇస్తున్నారు. బ్లేడ్‌బ్యాచ్ సభ్యులపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచి, వారి తల్లిదండ్రులను పిలిపించి పిల్లల నడవడికను గమనిస్తూ ఉండాలని సూచిస్తున్నారు. ఆగడాలకు అడ్డుకట్ట ఇలా.. బ్లేడ్ బ్యాచ్, గంజాయి తాగి చెడ్డదారుల్లో నడిచేవారికి ప్రతి ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించాలని పోలీసు అధికారులను సీపీ టి.కె.రాణా ఆదేశించారు. గంజాయి తాగేందుకు అనువుగా ఉండే ప్రదేశాలను గుర్తించి పోలీస్ గస్తీ పెంచాలని, స్థానిక ప్రజలతో సమావేశాలు నిర్వహించి పిల్లలు వ్యసనాలకు బానిసలు కాకుండా చూసేలా తల్లిదండ్రులను చైతన్యం చేయాలని సూచించారు. గంజాయి విక్రయాలకు అడ్డుకట్ట పడేలా చర్యలు తీసుకోవాలని, గంజాయి, మత్తు పదార్థాలకు బానిసలైన వారిని గుర్తించి వారిలో మార్పు తీసుకురావడానికి డీ–ఎడిక్షన్ సెంటర్లకు పంపాలని పేర్కొన్నారు. నేరాలు జరగడానికి అవకాశం ఉన్న చీకటి ప్రదేశాలను గుర్తించి, ఆ ప్రాంతాల్లో స్థానిక అధికారులతో మాట్లాడి లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలు తమ వంతు బాధ్యతగా... చెడు నడత గల వ్యక్తుల సమాచారాన్ని సమీపంలోని పోలీస్ స్టేషన్లకు స్వయంగా లేదా, 100 నంబరుకు ఫోన్ చేసి చెప్పాలని సీపీ టి.కె.రాణా ప్రజలను కోరారు. మత్తు పదార్థాల విక్రేతలు, వినియోగదారుల వివరాలను, వీధుల్లో తిరుగుతూ శాంతి భద్రతలకు భంగం కలిగించే ఆకతాయిల వివరాలను పోలీసులకు తెలపాలని కోరారు. ఈ సమాచారం ఇచ్చేవారి వివరాలను గోప్యంగా ఉంచుతామని భరోసా ఇస్తున్నారు. చదవండి: బాబోయ్ ప్రైవేట్ ట్రావెల్స్.. అడ్డంగా దోచేస్తున్నారు -
పోలీస్ శాఖలో కలకలం.. గంజాయి కేసులో పట్టుబడ్డ కానిస్టేబుల్
సాక్షి,ఖమ్మం: రెండు నెలల క్రితం గంజాయి రవాణా చేస్తూ జిల్లా పోలీసులకు పట్టుబడి సస్పెండ్ అయిన ఇద్దరు ఏఆర్ కానిస్టేబుళ్ల ఉదంతం మరిచిపోకముందే ఇదే దందా సాగిస్తూ ఇంకో ఏఆర్ కానిస్టేబుల్ పట్టుబడ్డాడు. ఈసారి గంజాయి ఆయిల్(హఫీష్ ఆయిల్) రవాణా చేస్తూ హైదరాబాద్‌లో ఉమ్మడి జిల్లాకు చెందిన కానిస్టేబుల్ పట్టుబడడం పోలీస్‌శాఖలో కలకలం సృష్టించింది. ఖమ్మం ఏఆర్ విభాగానికి చెందిన ముజీబ్ పాషా భద్రాద్రి కొత్తగూడెంలో స్పెషల్ పార్టీ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ముస్తఫానగర్‌కు చెందిన మహ్మద్ అఫ్రోజ్, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని నాయకులగూడెంనకు చెందిన గుని వెంకటేష్, చల్లా ఉపేందర్‌తో కలిసి గంజాయి(హపీష్ ఆయిల్)ను ఆంధ్రప్రదేశ్‌లోని చింతూరు నుంచి కారులో హైదరాబాద్‌కు తరలిస్తూ తాజాగా పట్టుబడ్డాడు. విచారణలో ముజీబ్ పాషా స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ అని తేలడంతో ఇక్కడి అధికారులకు సమాచారం ఇచ్చారు. తాజాగా చేపట్టిన ఉద్యోగుల విభజనలో ఆయనను భద్రాద్రి కొత్తగూడెంకు జిల్లాకు కేటాయించినట్లు సమాచారం. కాగా, విచారణ కోసం హైదరాబాద్‌నుంచి ఎస్ఓటీ పోలీసులు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఒకటి, రెండు రోజుల్లో రానున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా గంజాయి, ఆయిల్ రవాణాలో కానిస్టేబుల్ ముజీబ్ పాషాతో పాటు ఇంకా ఎవరైనా పోలీస్‌శాఖ ఉద్యోగులకు సంబంధం ఉన్న అంశంపై కూపీ లాగుతున్నారు. ఏది ఏమైనా గంజాయి అక్రమ రవాణా కేసుల్లో వరుసగా పోలీస్ సిబ్బంది పట్టుబడుతుండడంతో శాఖ ప్రతిష్ట దెబ్బతింటోందని కొందరు అధికారులు చెబుతున్నారు. -
‘మా పొట్ట కొట్టకండి సారూ.. గంజాయి పండించుకుంటాం’
మల్కన్‌గిరి(భువనేశ్వర్): జిల్లాలోని చిత్రకొండ సమితి, ధూళిపూట్ పంచాయతీలో గిరిజనుల ప్రజా మేళా సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గత కొద్దిరోజులుగా పోలీసులు ధ్వంసం చేస్తున్న గంజాయి సాగుపై గిరిజనులు ఆందోళన వ్యక్తం చేశారు. గంజాయి సాగుతో తమకు ఎంతో కొంత ఉపాధి కలుగుతోందన్నారు. ఇప్పుడు వాటిని అధికారులు నాశనం చేసి, తమ పొట్ట కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో వేరే పంటలు పండించేందుకు చాలా పెట్టుబడి అవుతుందని, అంత స్తోమత తమకు లేదన్నారు. దీంతో పెట్టుబడి అవసరం లేని గంజాయి సాగుపై ఆధారపడి బతుకుతున్నామన్నారు. ఉపాధి అవకాశాలైనా కల్పించాలని, లేకపోతే గంజాయి సాగుకి అనుమతి అయినా ఇవ్వాలని వారు కోరారు. అనంతరం చిత్రకొండ తహసీల్దారు టి.పద్మనాబ్ బెహరాకి వారు వినతిపత్రం అందజేశారు. 85 ఎకరాల గంజాయి సాగు ధ్వంసం మల్కన్‌గిరి జిల్లాలోని చిత్రకొండ సమితి, బోడపోదర్ పంచాయతీలో ఉన్న రేఖపల్లి, పల్సన్‌పోదర్, కుమార్‌గూడ ప్రాంతాల్లో అక్రమంగా 85 ఎకరాల్లో సాగు చేస్తున్న గంజాయిని చిత్రకొండ పోలీసులు సోమవారం ధ్వంసం చేశారు. నాశనం చేసిన గంజాయి సాగు విలువ దాదాపు రూ.12 కోట్లు చేస్తుందని పోలీసులు తెలిపారు చదవండి: Karnataka: ఆ ప్రాంతం మరో గోవా కానుంది.. -
ఒకపక్క ఉక్కుపాదం.. మరోపక్క గుప్పు గుప్పు
సాక్షి, నెట్వర్క్: ఎంత ఉక్కుపాదం మోపినా గంజాయి ఇంకా గుప్పుమంటూనే ఉంది. రవాణా చేస్తూ కొందరు.. పంట సాగుచేస్తూ ఇంకొందరు.. ఇంట్లోనే పెంచుతూ ఒకరు.. ఇలా రాష్ట్రవ్యాప్తంగా పలు కేసులు నమోదయ్యాయి. ఆయా దాడుల్లో దాదాపు 600 కేజీల గంజాయిను స్వాధీనం చేసుకోగా, పదుల సంఖ్యలో మొక్కల్ని పోలీసులు ధ్వంసం చేశారు. గురువారం నమోదైన ఆయా కేసుల వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని మారేడుమిల్లి నుంచి రాజమండ్రి, అశ్వారావుపేట, ఖమ్మం, హైదరాబాద్ మీదుగా మహారాష్ట్ర తరలించేందుకు నిందితులు ట్రాలీ అడుగు భాగంలో ప్రత్యేక అరను తయారుచేసి 566 కేజీల గంజాయి ప్యాకెట్లను రవాణా చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సత్తుపల్లిలో బుధవారం రాత్రి సదరు ట్రాలీని, అందులోని రూ.1.42 కోట్ల విలువైన 566 కేజీల ఎండు గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్టు గురువారం ఖమ్మం సీపీ విష్ణు ఎస్.వారియర్ తెలిపారు. మహారాష్ట్రకు చెందిన లారీ డ్రైవర్లు యోగేష్ లింబాజీ థోర్వ్, ఇర్ఫాన్ సదర్ పఠాన్‌ను అరెస్ట్చేశామని, మరో ప్రధాన నిందితుడు గణేష్ ఉబలే పరారీలో ఉన్నాడని తెలిపారు. దర్జాగా రిజర్వేషన్ కోచ్‌లో ప్రయాణం ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన నిలంచల పట్నాయక్, ప్రకాష్‌చంద్ర బెహర డబ్బులు సంపాదించాలనే ఆశతో గంజాయిని ముంబైలో అమ్మాలనుకున్నారు. 20 కేజీల ఎండు గంజాయిని 4 ప్యాకెట్లుగా ప్యాక్‌చేసి రెండు క్లాత్‌బ్యాగుల్లో పెట్టి అనుమానం రాకుండా కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రిజర్వేషన్ కోచ్‌లో ప్రయాణిస్తున్నారు. రైలు వరంగల్ రైల్వేస్టేషన్‌కు రాగానే పోలీసులు అనుమానంతో వీరిని తనిఖీచేయగా గుట్టురట్టయింది. గంజాయి విలువ రూ.2 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులకు అమ్మకం.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శివారులోని మడద క్రాసింగ్ వద్ద వాహన తనిఖీల్లో ఇద్దరు యువకుల నుంచి పోలీసులు 280 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే, మెదక్ జిల్లా రామాయంపేటలో విద్యార్థులకు గంజాయి అమ్ముతున్న నవీన్‌గౌడ్‌ను అదుపులోకి తీసుకుని 3 ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. బయట దొరకట్లేదని ఇంట్లోనే సాగు మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధి అరుంధతినగర్‌లో ఉండే ఆయాజ్‌ఖాన్ అంబులెన్స్ డ్రైవర్. గంజాయి మత్తుకు అలవాటుపడిన అతడు.. బయట ఎక్కడా సరుకు దొరక్కపోవడంతో ఇల్లు అద్దెకు తీసుకొని మేకలను పెంపకం మాటున గంజాయి మొక్కల్ని పెంచుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు గురువారం దాడిచేసి గంజాయి మొక్కలను, 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. పత్తిచేనులో ‘మత్తు’సాగు ఆదిలాబాద్ జిల్లా బొసార గ్రామంలో, బోథ్ మండలం పార్డి కె గ్రామ శివారులో పత్తిచేను మాటున గంజాయి సాగుచేస్తున్న క్షేత్రాలపై పోలీసులు దాడులు చేశారు. రెండుచోట్లా 80 గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. సాగుచేస్తున్న రైతులు సీతారాం, ఈశ్వర్‌పై కేసు నమోదుచేశారు. -
ఖమ్మం జిల్లాలో భారీగా పట్టుబడిన గంజాయి
-
పూల కుండీల్లో గంజాయి మొక్కలు
-
ఇంట్లోనే యథేచ్ఛగా గంజాయి పెంపకం
-
గంజాయి రాజకీయం
-
గంజాయి గుట్టురట్టు
ఇచ్ఛాపురం(శ్రీకాకుళం): ఇచ్ఛాపురం పోలీసు లు మరోసారి శభాష్ అనిపించుకున్నారు. కోటి విలువైన గంజాయి రవాణాను అడ్డుకుని ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు. బొగ్గు మాటున గంజాయిని ఉంచి తీసుకెళ్లిపోదామనుకున్న వారి ప్రయత్నాలకు గండి కొట్టారు. ఇచ్ఛాపురం పాత జాతీయ రహదారిలో సోమవారం 1050 కేజీల గంజాయి ని పోలీసులు స్వాధీనం చేసుకున్నా రు. ఎస్పీ అమిత్ బర్దార్ సోమవా రం తెలిపిన వివరాల మేరకు.. విశాఖ జిల్లా పెందుర్తి–ఆనందపురం మధ్య బొగ్గును జార్ఖండ్‌లోని రాంఛీకి తీసుకెళ్లే హెచ్ఆర్ 63సి 9751 నంబర్ గల లారీ సో మవారం జాతీయ రహదారి గుండా బయల్దేరింది. బొగ్గుతో పాటు 210 ప్యాకెట్ల గంజాయిని ఈ లారీలోనే ఉంచి రవాణా చేసేందుకు కొందరు ప్రయత్నించారు. అందుకు పాత జాతీయ రహదారిని మార్గంగా ఎంచుకున్నారు. అయితే దీనిపై ఇచ్ఛాపురం పోలీసులకు లీ లగా సమాచారం అందడంతో వా రు బెల్లుపడ పాత టోల్‌ప్లాజా వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. అదే దారిలో బొగ్గు లారీ కూడా రావడంతో ఆపి బండిని నిశితంగా పరిశీ లించారు. దీంతో లారీలోని 210 ప్యాకెట్లలో గల 1050 కిలోల గంజాయి బయటపడింది. గంజాయి అక్రమ రవాణాలో ఏడుగురు ఉ న్నట్లు పోలీసులు గుర్తించారు. వీ రిలో స్థానికుల పాత్ర కూడా ఉంద ని సమాచారం. లారీని పట్టుకున్న సమయంలో లారీ డ్రైవర్‌తో పాటు క్లీనర్, మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. ఇంకొకరు పరారైపోయారు. మిగిలిన ముగ్గురిని కూడా అరెస్టు చేస్తామని ఎస్పీ తెలిపారు. గంజాయి విలువ కోటి ఐదు లక్షల రూపాయలు ఉంటుందని ఆయన చెప్పారు. గంజాయిని పట్టుకున్న పట్టణ పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఇందులో కాశీబుగ్గ డీఎస్పీ ఎం.శివరా మిరెడ్డి, సీఐ ఎం.వినోద్‌బాబు, పట్టణ, రూరల్ ఎస్ఐలు వి.సత్యనారాయణ, బి.హైమావతి పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్.. ORR లో 21 కోట్ల విలువైన 3400 కిలోల గంజాయి.. పట్టుబడింది
-
విశాఖ జిల్లా అరకులో భారీగా గంజాయి స్వాధీనం
-
గంజాయి స్మగ్లింగ్ కేసులో హిందూపురం సీఐ!
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ గంజాయి స్మగ్లింగ్ కేసులో హిందూపురం టూటౌన్ లా అండ్ ఆర్డర్ సీఐ శ్రీరామ్ పేరు బయటపడింది. అనంతపురం జిల్లా ఏఆర్ కానిస్టేబుల్ మోహన్ కృష్ణ ఉప్పల్ నల్ల చెరువు ప్రాంతంలో ఇటీవల రెండు కిలోల గంజాయితో పట్టుబడ్డాడు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్టిక్కర్ ఉన్న కారుతో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న మోహన్ కృష్ణతో పాటు మరో ఇద్దరిని ఉప్పల్ ఆబ్కారీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ శ్రీరామ్ పాత్రపై విచారణ జరుపుతున్నామని ఆబ్కారీ పోలీసులు తెలిపారు. కానిస్టేబుల్ మోహన్ కృష్ణతో సీఐకి ఉన్న సంబంధాలపై ఆబ్కారీ ఆరా పోలీసులు ఆరా తీస్తున్నారు. కానిస్టేబుల్ మోహన్ కృష్ణని వారం రోజుల కస్టడీకి కోర్టు అనుమతి కోరారు. గతంలో సీఐ, కానిస్టేబుల్ కలిసి గంజాయి స్మగ్లింగ్ చేసినట్టు ఆరోపణలు రావడంతో.. సీఐ శ్రీరాంపై అనంతపురం రేంజ్ డీజీఐ బదిలీ వేటు వేశారు. -
కోర్టులో గంజాయి సిగరెట్ కాల్చాడు..
-
వైరల్ : జడ్జీ కళ్ల ముందే గంజా సిగరెట్ తాగాడు
టేనస్సీ : కోర్టు ఆవరణలో జడ్జీ ముందే ఓ వ్యక్తి గంజాయి సిగరెట్ (గంజా సిగరెట్)ను తాగిన ఘటన అమెరికాలోని టేనస్సీ నగరంలో చోటు చేసుకుంది. కోర్టు ధిక్కారణ కేసు కింద అతనికి 10 రోజులు జైలు శిక్ష కూడా విధించబడింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. విరాల్లోకి వెళితే.. టేనస్సీ నగరానికి చెందిన స్పెన్సర్ బోస్టన్ అనే ఓ 20 ఏళ్ల యువకుడు గంజాయి స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు. పోలీసులు ఇటీవల అతన్ని టెనస్సీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అతను తన వాదనలు వినిపిస్తూ.. గంజాయి విక్రయాన్ని చట్ట బద్ధం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కోర్టు బోనులోనే నిలబడి జేబులో నుంచి సిగరెట్ తీసి కాల్చాడు. అందరికి గంజాయి సిగరెట్ చూపిస్తూ.. ఇది తీసుకోవడం తప్పు కాదు.. బహిరంగంగా గంజాయి తీసుకునే అర్హత ప్రతి ఒక్కరికి ఉందంటూ గట్టిగా అరిచాడు. అప్రమత్తమైన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా, కోర్టు ఆవరణలో.. న్యాయమూర్తి ముందే సిగరెట్ కాల్చిన బోస్టన్‌కు కోర్టు ధిక్కారణ కేసు కింది 10 రోజులు జైలు శిక్ష విధించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 14కు వాయిదా వేసింది. నిందితుడు స్పెన్సర్ బోస్టన్ -
నిట్‌లో 11 మంది విద్యార్థులపై సస్పెన్షన్ వేటు
సాక్షి, వరంగల్ : చదువుల ఒడిలో మరోసారి మత్తు పొగలు చూరింది. విద్యాబుద్ధులు నేర్వాల్సిన పిల్లల్ని మైకంలో పడేసింది. దీంతో వరంగల్ నిట్‌లో గంజాయి సేవించినట్టు తేలిన 11 మంది ఇంజనీరింగ్ విద్యార్థులపై యూనివర్సిటీ యాజమాన్యం సస్పెన్షన్ వేటువేసింది. వారం క్రితం నిట్ క్యాంపస్‌లో గంజాయి సేవిస్తూ 11 మంది విద్యార్థులు సెక్యూరిటీ సిబ్బందికి పట్టుబడ్డారు. డీన్ నేతృత్వంలో నిట్ అధికారులు కమిటీ వేశారు. విచారణ చేపట్టిన క్రమశిక్షణ కమిటీ విద్యార్థులు గంజాయి తాగినట్టు తేలడంతో నిట్ నుంచి సస్పెండ్ చేసింది. (చదవండి : వరంగల్ నిట్‌లో గంజాయి.. అసలు నిజం!) -
గంజాయి మత్తుకు అడ్డాగా మిర్యాలగూడ
సాక్షి, మిర్యాలగూడ : గంజాయి మత్తుకు అడ్డాగా మిర్యాలగూడ పట్టణం మారింది. అత్యాశతో తక్కువ కాలంలో ఎక్కువగా సంపాదించాలనే కొందరు యువకులు అడ్డదారులు తొక్కుతున్నారు. అభం శుభం ఎరుగని మైనర్లను సైతం మత్తుకు బానిసలుగా చేసి వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. గత కొద్ది రోజులుగా మిర్యాలగూడ పట్టణంలో గంజాయి విక్రయాలు జోరందుకున్నాయి. విద్యార్థులు, యువకులు సైతం విక్రయాలు సాగిస్తూ దాని మైకంలో జరుగుతున్న దారుణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మంగాజి మత్తులో యువకులు చేస్తున్న దారిదోపిడీలు, చోరీలు పోలీసులకు సైతం సవాలుగా మారాయి. పోలీసుల విచారణలో మైనర్లు పట్టుబడడం ఆందోళన కలిగించే విషయం. వైజాగ్ నుంచి దిగుమతి.. కొంత మంది యువకులు ముఠాలుగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్, ఇతర ప్రాంతాల నుంచి గంజాయిని దిగుమతి చేసుకుని పట్టణంలోని పలు ప్రాంతాల్లో డంపింగ్ చేస్తున్నారు. చిన్నచిన్న పొట్లాలలో ప్యాకింగ్ చేస్తూ స్థానిక యువకులకు విక్రయాలు సాగిస్తున్నారు. ఒక్కో ప్యాకెట్‌ను రూ.200 నుంచి వెయ్యి వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం పొందుతూ జల్సాలు చేస్తున్నారు. గతంలో పట్టుబడి మైనర్లను విచారించిన పోలీసులకు విస్తు గొలిపే వాస్తవాలు తెలియడంతో నివ్వెరపోయారు. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని వారి వైఖరిని ఎప్పటికప్పుడు గమనించాలని పోలీసుల ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. బైక్‌లకు ప్రత్యేక కోడ్..! మిర్యాలగూడ పట్టణంలో గంజాయిని విక్రయించే సింబల్‌గా కొంతమంది యువకులు తమ బైక్‌లకు గంజాయి ఆకుల గుర్తులు కలిగిన స్టిక్కర్లు వేయించారు. ఈ గుర్తుల ఆధారంగా పలు ప్రాంతాల్లో గంజాయిని విక్రయిస్తున్నారు. సరిహద్దులోని దాచేపల్లి, నాగార్జునసాగర్, సూ ర్యాపేట, హాలియా వంటి ప్రాంతాల్లో విక్రయాలు సాగిస్తూ యువకులను మత్తులో చిత్తు చేస్తున్నారు. కాగా పట్టణంలోని శివారు ప్రాం తాలైన రవీంద్రనగర్ కాలనీ, ప్రకాశ్‌నగర్, హనుమాన్‌పేట, నాగార్జుననగర్, రాజీవ్‌చౌక్, బైపాస్ దాబాల వద్ద గంజాయి విక్రయాలు జోరుగా సాగిస్తున్నారు. బైక్‌లపై ఉన్న సిక్కర్ ఆధారంగా గంజాయి కావాలనుకునే వారు ఆ బైక్‌ల వద్దకు వచ్చి గంజాయిని కొనుగోలు చేస్తున్నారు. దారిదోపిడీలకు పాల్పడుతున్న యువత గంజాయి మత్తుకు అలవాటు పడిన యు వత జల్సాల కోసం దారిదోపిడీలకు సైతం పాల్పడుతుంది. ఇటీవల అద్దంకి– నార్కెట్‌పల్లి బైపాస్ రోడ్డుపై వెళ్తున్న ఒక వ్యక్తిని అడ్డగించిన కొంతమంది యువకులు దాడిచేసి రూ.2వేల నగదు, బంగారు చైన్‌ను అపహరించారు. పట్టణంలోని పలుచోట్ల బైక్‌లు, ఆటోలను సైతం దొంగిలించారు. తీగలాగితే డొంక కదిలినట్లు పట్టణంలోని శరణ్యగ్రీన్ హోంలో చైన్చోరీ విషయంలో సీసీ పుటేజిని పరిశీలించారు. పోలీసులు నింది తులను పసిగట్టే పనిలో భాగంగా పట్టణంలో వాహనాలు తనిఖీలు చేస్తుండగా గంజాయికి బానిసలుగా మారిన మైనర్లు ఈ దారిదోపిడీకి పాల్పడినట్లు గుర్తించి వారితో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. అక్రమార్జనకు ఆశపడి.. మిర్యాలగూడ అర్బన్ : జల్సాలకు అలవాటు పడి, అక్రమార్జనకు ఆశపడిన యువకులు గంజాయి విక్రయిస్తూ పోలీసులకు చిక్కారు. చివరకు కటకటాల పాలయ్యారు. గురువారం పట్టణంలోని టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో మిర్యాలగూడ డీఎస్పీ వై.వెంకటేశ్వర్రావు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం జల్మాల్‌కుంట గ్రామానికి చెందిన నూనవత్ నాగయ్య అలియాస్ నాగరాజు, భూక్యా చందు, దుపాడు గ్రామానికి చెందిన కొప్పోజు సతీష్, న్యూ బంజారాహిల్స్ తండాకు చెందిన నూనావత్ రమేష్ విలాసాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఒక ముఠాగా ఏర్పడ్డారు. తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే తలంపుతో నునావత్ సుధాకర్, బానోతు సుధాకర్, గూగులోతు సైదా, జర్సుల మస్తాన్, ఆంగోతు నాగరాజు, ధీరావత్ ముని, బానోతు రమేష్‌ల వద్ద గత ఆగస్టు, జూలై నెలలో 70కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. ఆ గంజాయిని కిలో ఒక్కంటికి వెయ్యి రూపాయలకు కొనుగోలు చేసిన పై నలుగురు వ్యక్తులు 10నుంచి 15గ్రాములుగా చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసి మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట, నేరేడుచర్ల, నకిరేకల్, నల్లగొండ ప్రాంతాల్లో 52కిలోల గంజాయిని విక్రయించారు. మిగిలిన 18కిలోల గంజాయిని కూడా విక్రయించాలని గురువారం మధ్యాహ్నం స్విప్ట్ కారులో గల సైడ్ డోర్లో పెట్టి పట్టణంలోని రవీంద్రనగర్ గల నాగరాజు ఇంటికి తరలిస్తుండగా చిల్లాపురం క్రాస్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీల్లో పట్టుకున్నట్లు తెలిపారు. కాగా ఈ కేసులో నూనావత్ నాగయ్య అలియాస్ నాగరాజు, భూక్యా చందు, కొప్పోజు సతీష్, నూనావత్ రమేష్‌లను అరెస్టు చేసి వారి నుంచి 18కిలోల గంజాయి, స్విఫ్ట్ కారును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పరారీలో ఉన్న మిగిలిన ఏడుగురు వ్యక్తులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టూటౌన్ సీఐ దొంతిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తదితరులున్నారు. గంజాయి విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు గంజాయి విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి వారిపై నిఘా పెంచుతాం. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలపై కూడా నిఘా పెంచి విక్రయదారులపై ఉక్కుపాదం మోపుతాం. మైనర్లు మత్తుకు బానిసలుగా మారకుండా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తాం. వారి తల్లిదండ్రులు కూడా పిల్లలపై శ్రద్ధ పెట్టాలి ఇతర వ్యసనాలకు బానిసలుగా మారకుండా చూసుకోవాలి. – వై.వెంకటేశ్వర్రావు, డీఎస్పీ -
‘నాకూ గంజాయి అలవాటు ఉండేది’
తనకూ గంజాయి అలవాటు ఉండేదని ప్రముఖ సినీ దర్శకుడు కే.భాగ్యరాజ్ బహిరంగంగా వెల్లడించారు. మోతీ ఆర్ట్స్ పతాకంపై మోతీఫా స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించిన చిత్రం కోలా. ఈయన మాజీ పోలీస్అధికారి కూడా కావటం విశేషం. విక్కీఆద్మియ, వైశాక్ హీరోలుగా నటించిన ఈ సినిమాలో నటి హరిణి హీరోయిన్గా నటించింది. కణ్మణిరాజా సంగీతా న్ని అందించిన ఈ చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆడియోను ఆవిష్కరించిన దర్శక, నటుడు కే. భాగ్యరాజ్ మాట్లాడుతూ.. ఈ చిత్ర సంగీతదర్శకుడు మా ఊరు వారు కావడం సంతోషంగా ఉందని అన్నారు. చిత్రం లోని పాటలకు నృత్యదర్శకురాలు రాధిక చాలా చక్కగా కొరియెగ్రఫీ చేశారని ప్రశంసించారు. ఎనర్జీ అనేది వయసును బట్టి కాకుండా మనసును బట్టి ఉంటుందన్నారు. ఫైట్‌మాస్టర్ జాగ్వుర్‌తంగం గంజాయి అలవాటు గురించి చాలా ఆవేశంగా మాట్లాడారన్న భాగ్యరాజ, ఒకప్పుడు తాను కూడా గంజాయికి అలవాటు పడిన వాడినేనని చెప్పారు. ఒకసారి తన సహాయకుడొకరు కోయంబత్తూర్‌లో గంజాయితో కూడిన సిగరెట్‌ను ఇచ్చాడన్నారు. తాను వద్దాన్నా వినకుండా కాల్చేలా చేశాడని, మొదట్లో అది బాగానే ఉందనిపిస్తుందని ఆ తరువాత దాని ప్రభావం చూపిస్తుందని చెప్పారు. గంజాయి తీసుకుంటే ఎందుకో కారణం తెలియకుండానే నవ్వేస్తుంటామని చెప్పారు. అలా గంజాయికి అలవాటు పడిన తాను ఒక సమయంలో ఏదేదో సాధించాలని వచ్చి ఇలా అయిపోయానేంటి? అన్న ఆలోచన రావడంతో ఎంతో కష్టపడి ఆ అలవాటు మానుకున్నానని తెలిపారు. ప్రస్తుతం సిగరెట్ తాగడం కూడా మానేశానని చెప్పారు. -
భారీ ఎత్తున గంజాయి స్వాధీనం
సాక్షి, కర్నూలు: విశాఖ వయా కర్నూలు టూ మహారాష్ట్ర ఇదేదో ఆర్టీసీ బస్సు అనుకుంటే పొరపాటే. గంజాయి రవాణా చేసే స్మగ్లర్లు (ముఠా) ఎంచుకున్న రూటు. మహారాష్ట్రలోని నాసిక్, సోలాపుర్ ప్రాంతాల్లో గంజాయికి అమితమైన డిమాండ్ ఉండడంతో విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి నిత్యం రవాణా చేస్తూ స్మగ్లర్లు భారీగా సొమ్ము చేసుకొంటున్నట్లు పోలీసు విచారణలో బయటపడింది. తెలంగాణ రాష్ట్రం జనగాం జిల్లా వెంకన్న కుంట గ్రామానికి చెందిన సానబోయిన సాయికుమార్, హైదరాబాద్‌లోని సంతోష్‌నగర్ దర్గాబర్మాశ్ ప్రాంతంలో నివాసముంటున్న మహ్మమద్ మునావర్, మహారాష్ట్ర సితార జిల్లా శనివార పేట్ ప్రాంతానికి చెందిన ఖాజా ఖాన్, సమీర్, ముజాఫర్, కొరేగోన్ తాలుకా దుమ్ములవాడి గ్రామానికి చెందిన విశాల్ చంద్రకాంత్ షిండే, ఉత్తరాఖండ్ రాష్ట్రం చంపావత్ జిల్లా లోహగాట్ తాలుకా రాయ్‌నగర్ చౌడీకి చెందిన ఆదిత్యరాయ్ తదితరులు ముఠాగా ఏర్పడి, గంజాయిని రవాణా చేస్తూ పోలీçసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. వారి వద్ద నుంచి రూ.50 లక్షల విలువ చేసే 651 కిలోల గంజాయి పాకెట్లతోపాటు మినీలారీ, రెండు కార్లు, రూ.20 వేల నగదు, ఐదు సెల్ఫోన్లను నాగలాపురం పోలీసులు స్వాధీనం చేసుకొని, జిల్లా కేంద్రానికి తీసుకువచ్చి అడిషనల్ ఎస్పీ దీపికా పాటిల్ ఎదుట హాజరు పరిచారు. శుక్రవారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో కర్నూలు ఇన్చార్జ్ డీఎస్పీ బాబాఫకృద్దీన్, కర్నూలు తాలుకా సీఐ పవన్‌కిశోర్, నాగలాపురం ఎస్ఐ కేశవతో కలిసి అడిషనల్ ఎస్పీ విలేకరులకు వివరాలు వెల్లడించారు. స్మగ్లర్లు ఇలా దొరికారు.. ఏపీ 16ఎక్స్6264 మినీ లారీకి డ్రైవర్ వెనుక సగభాగం ఐరన్ సీట్లో ప్రత్యేక కేబిన్ తయార్ చేసి పైభాగంలో గవాక్షం తరహాలో రంద్రం ఏర్పాటు చేసి, అందులో నుంచి రహస్య కేబిన్‌లోకి గంజాయి పాకెట్లను నింపి లారీ వెనుక భాగంలో ఖాళీ ప్లాస్టిక్ బాక్స్‌లు నింపారు. వెనుక ఒక కారు, ముందు కారులో ముఠా సభ్యులు లారీకి ఎస్కార్టుగా విశాఖ పట్నం ఏజెన్సీ ప్రాంతం నుంచి కర్నూలు మీదుగా మహారాష్ట్రలోని నాసిక్‌కు బయలుదేరారు. ఈనెల 15న రూరల్ సీఐ పవన్‌కిశోర్ ఆధ్వర్యంలో నాగలాపురం పోలీసు స్టేషన్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. లారీలో భారీ మొత్తంలో గంజాయి రవాణా చేస్తున్నట్లు అజ్ఞాత వ్యక్తుల నుంచి సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమై తనిఖీలు విస్తృతం చేశారు. రెండు కార్ల మధ్య లారీ కాన్వాయ్ రూపంలో కర్నూలు వైపు నుంచి వేగంగా దూసుకొస్తుండగా పోలీసులు అప్రమత్తమై అడ్డుకొని సోదాలు చేశారు. లారీ వెనుక భాగంలో ఖాళీ ప్లాస్టిక్ బాక్స్‌లు కనిపించడంతో అందులో ఏమి లేవనీ.. నిర్ధారణకు వచ్చారు. కారులో సోదా చేయగా వెనుక డిక్కీ భాగంలో కొన్ని గంజాయి పొట్లాలు కనిపించాయి. వెంటనే అందులో ఉన్నవారిని అదుపులోకి తీసుకొని విచారించగా లారీకి ఏర్పాటు చేసిన రహస్య కేబిన్ గుటురట్టయింది. లారీ పైభాగం మొత్తం టార్పాలిన్‌తో కప్పి ఉండడంతో దానిని తొలగించారు. పైన సుమారు ఐదడుగుల విస్తీర్ణంలో రంధ్రం కనిపించింది. అందులోంచి లారీలోకి తొంగి చూడగా రహస్య కేబిన్‌లో గంజాయి పొట్లాలు భద్ర పరిచిన విషయం బయట పడింది. హైదరాబాద్ వైపు నిఘా పెరగడంతో.. మహారాష్ట్ర సితార జిల్లా శనివార్పేట్కు చెందిన ఖాజాఖాన్ కొన్నేళ్లుగా గంజాయి వ్యాపారం చేస్తున్నాడు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రలోని నాసిక్, సోలాపుర్ ప్రాంతాలకు రవాణా చేసేవాడు. ఇటీవల ఆ మార్గంలో పోలీసుల నిఘా పెరగడంతో గంజాయి ముఠా రూటు మార్చుకుంది. విశాఖ నుంచి కర్నూలు మీదుగా రెండుసార్లు నాసిక్‌కు భారీ మొత్తంలో రవాణా చేసినప్పటికీ పోలీసుల నిఘాకు చిక్కలేదు.ఇదే సరైన మార్గమని భావించిన గంజాయి ముఠా మూడోసారి ఇదే మార్గంగుండా వెళ్తూ పోలీసుల నిఘాకు చిక్కారు. ముఠాలోని సభ్యులను లోతుగా విచారిస్తున్నామని, వారిచ్చే సమాచారం ఆధారంగా అండగా ఉన్న వ్యక్తుల సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అడిషనల్ ఎస్పీ దీపికా పాటిల్ తెలిపారు. భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను పట్టుకున్నందుకు సీఐ పవన్కిశోర్తోపాటు నాగలాపురం ఎస్ఐ కేశవ, సిబ్బందిని దీపికా పాటిల్ అభినందించారు. -
విద్యార్థులకు గంజాయి అమ్మిన వ్యక్తి అరెస్టు
సాక్షి, నూజివీడు(కృష్ణా జిల్లా) : ఇంజినీరింగ్ విద్యార్థులకు గంజాయిని విక్రయిస్తోన్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు వద్ద జగన్నాధ పండు అనే పాత నేరస్తుడు ఇంజినీరింగ్ విద్యార్థులతో గంజాయి విక్రయానికి బేరసారాలు చేస్తుండగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. అతని దగ్గర నుంచి 359 గ్రాముల ముడి గంజాయితో పాటు, అమ్మకానికి సిద్ధంగా ఉంచిన 15 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే గంజాయిని కొనుగోలు చేస్తున్న విద్యార్థులను పోలీస్‌స్టేషన్‌కు తరలించి వారి తల్లిదండ్రుల సమక్షంలో సీఐ రామచంద్రరావు, డీఎస్పీ శ్రీనివాస్‌లు కౌన్సిలింగ్ నిర్వహించారు. -
గంజాయి అక్రమ రవాణా గుట్టు రట్టు
సాక్షి, విజయనగరం: గంజాయి అక్రమ రవాణా గుట్టు రట్టు అయింది. జిల్లాలోని పాచిపెంట మండలం.. ఆంధ్రా, ఒడిషా సరిహద్దులో భారీ ఎత్తున అక్రమ రవాణా చేస్తున్న గంజాయి బయటపడింది. మండల పోలీసులు.. గంజాయి స్మగ్లర్లపై ముందస్తు సమాచారంతో సరిహద్దులో ప్రాంతంలో వాహనాలను తనిఖీలు చేశారు. దీంతో పోలీసుల తనిఖీలను పసిగట్టిన స్మగ్లర్లు గంజాయి ఉన్న తమ వ్యాన్‌ను వేగంగా నడిపి ఓ చోట బోల్తా కొట్టించి పరారయ్యారు. పరారైన గంజాయి స్మగ్లర్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. బోల్తా పడిన వ్యాన్‌లో సుమారు వందకుపైగా బ్యాగుల్లో ఉన్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
ఆ... ఆరుగురు మహా ముదుర్లు..!
సాక్షి, హిమాయత్‌నగర్: వృత్తిరిత్యా కూలిపనులు చేసుకునే ఆరుగురు యువకులు చోరీలు చేయడం ప్రవృత్తిగా మార్చుకున్నారు. జల్సాల కోసం ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్లు, ద్విచక్రవాహానాలు దొంగిలిస్తూ పలుమార్లు పోలీసులకు పట్టుబడ్డారు. ఆరుగురిలో ఇద్దరు మేజర్లు కాగా..నలుగురు మైనర్లు ఉన్నారు. వీరిలో ముగ్గురు జైలుకు వెళ్లి వచ్చినా తమ పంథా మార్చుకోలేదు. తాజాగా నారాయణగూడ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ యువకుడి నుంచి సెల్‌ఫోన్, నగదు దోపిడీ చేసి సీసీపుటేజీ ఆధారంగా కొన్ని గంటల్లోనే పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరాఖండ్‌కు చెందిన అనూజ్‌ప్రసాద్ హైటెక్‌సిటీలో క్యాటరింగ్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఈ నెల 26 రాత్రి అతను లిబర్టీ సిగ్నల్ నుంచి నారాయణగూడ ఎక్సైజ్ కార్యాలయం వద్ద ఉన్న బస్టాప్‌కు వచ్చాడు. అయితే హైటెక్ సిటీకి వెళ్లేందుకు బస్సులేకపోవడంతో బస్టాప్‌లోనే పడుకున్నాడు. అర్థరాత్రి రాంనగర్ ఫిష్‌మార్కెట్ ప్రాంతానికి చెందిన చంద్రకాంత్, మధు, సోహల్, గౌతమ్, రంజిత్, షరీఫ్ రెండు బైక్‌లపై వచ్చి అనూజ్‌ప్రసాద్‌ను బెదిరించి అతడి వద్ద ఉన్న సెల్‌ఫోన్, పర్సు, రూ.150 నగదు లాక్కుని పరారయ్యారు. వీరిలో చంద్రకాంత్, మధు మేజర్లు కాగా, మిగతా నలుగురూ మైనర్లు కావడం గమనార్హం. మరుసటి రోజు బాధితుడు అనూజ్‌ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీ పుటేజీల ద్వారా గుర్తింపు.. సీసీ పుటేజీలను పరిశీలించిన పోలీసులు సెల్‌ఫోన్ చోరీ అనంతరం నిందితులు రాంనగర్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. రాంనగర్ ఫిష్‌మార్కెట్ వద్ద స్థానికులను విచారించగా నిందితులపై కీలక సమాచారం అదించారు. దీంతో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. షరీఫ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. అందరికీ నేరరచరిత్ర.. పోలీసు స్టేషన్లో పోలీసులు నిందితులను విచారించగా పలు చోరీలు వెలుగులోకి వచ్చాయి. సోహల్, చంద్రకాంత్, మధు నగరంలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడినట్లు తెలిపారు. చంద్రకాంత్ ఉప్పల్ పీఎస్ పరిధిలో ల్యాప్‌టాప్‌లు దొంగిలించి రెండుసార్లు జైలుకు వెళ్లి వచ్చా డు. మధు చిక్కడపల్లి, నల్లకుంట పోలీసు స్టేషన్ పరిధిలో బైక్, ల్యాప్‌టాప్ చోరీ కేసులో పోలీసులకు పట్టుబడటంతో రెండు సార్లు జైలుకు వెళ్లాడు. సోహాల్ గోపాలపురం పోలీసు స్టేషన్ పరిధిలో నగదు, సెల్ఫోన్లు చోరీ చేసి జైలుకు వెళ్లాడు. గంజాయి కోసమే.. గంజాయికి అలవాటు పడిన వీరు డబ్బుల కోసం చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. మధు కార్‌వాషింగ్‌లో పనిచేస్తుండగా.. సోహల్ మటన్‌షాప్‌లో పనిచేస్తున్నాడు. వీరు మిగతా నలుగురితో కలిసి గంజాయి తాగేవారు. గంజాయి కొనేందుకు చోరీలకు పాల్పడుతున్నట్లు ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపారు. -
విజయవాడ గంజాయి అమ్మకాల్లో కొత్త కోణం
సాక్షి, విజయవాడ : నగరంలో గంజాయి అమ్మకాల్లో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. పలువురు బీటెక్ విద్యార్థులు గంజాయి విక్రేతలుగా మరినట్టుగా టాస్క్‌ఫోర్స్ పోలీసుల తనిఖీల్లో బయటపడింది. విజయవాడ పరిసరాల్లో గంజాయి అమ్మకాలపై నిఘా పెట్టిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. పలుచోట్ల తనిఖీలు చేపట్టారు. అందులో పట్టుబడ్డ ఒక బీటెక్ విద్యార్థిని విచారించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ విద్యార్థి చెప్పిన వివరాలు విని పోలీసులు షాక్ తిన్నారు. 2 నుంచి 4 కిలోల గంజాయి తీసుకోచ్చి వాటిని ప్యాకెట్లుగా మార్చి కాలేజీల్లో అమ్మకాలు చేపడుతున్నట్టుగా సదురు విద్యార్థి పోలీసుల విచారణలో వెల్లడించారు. మరోవైపు గంజాయి అమ్మకాలతో సంబంధం ఉన్న పదిమంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వారిలో ఆరుగురు బీటెక్ విద్యార్థులు ఉండటం స్థానికంగా కలకలం రేపుతోంది. అరకు వెళ్లి అక్కడి నుంచి నేరుగా గంజాయి కొనుగోలు చేస్తున్న బీటెక్ విద్యార్థులు.. వాటిని కాలేజ్‌లోని తమ సహచరులకు విక్రయిస్తున్నారు. విజయవాడలోని ఐదు కాలేజ్‌ల్లో ఇదే పరిస్థితి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. గన్నవరం, తెల్లప్రోలు, కానూరు, మొగల్రాజపురం ప్రాంతాల్లోని ఇంజనీరింగ్ కాలేజ్‌ల్లో గంజాయి విక్రయాలు జరుగుతున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. నాలుగు నెలల క్రితం నలుగురు విద్యార్థులు ఇదే విధంగా పట్టుబడగా పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయిన గంజాయి అమ్మకాలు యథావిధిగా కొనసాగుతుండటంతో.. గంజాయి అమ్మేవారితో విద్యార్థులకు ఉన్న సంబంధాలపై పోలీసులు విచారణ చేపట్టారు. -
గంజాయి రవాణా.. ముగ్గురి అరెస్ట్
విజయనగరం: ఉత్తరాంధ్రలో గంజాయి అక్రమ రవాణా యధేచ్ఛగా సాగుతోంది. అరకు నుంచి విజయనగరం జిల్లా ఎస్.కోట, కొత్తవలస మీదుగా గంజాయి తరలిస్తుండగా ముగ్గురు విద్యార్థులను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి పది కేజీల గంజాయి, మూడు సెల్ఫోన్లు, ఒక ఫోర్డ్ కారు స్వాధీనం చేసుకున్నారు. విలాసాలకు, తేలిక సంపాదనకు అలవాటు పడి విద్యార్థులు గంజాయి రవాణాకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైందని స్థానిక సీఐ శ్రీరెడ్డి శ్రీనివాస రావు వెల్లడించారు. పట్టుబడిన విద్యార్థులు చల్లా రాహుల్ రెడ్డి, కొమ్ముల సాయి సుమంత్, భోగ్యం సాయికిరణ్‌లు గుంటూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. చెన్నైకి చెందిన అశోక్ అనే మరో వ్యక్తి, వీరికి డబ్బులు ఆశగా చూపి ఇదంతా నడిపిస్తున్నట్లు విచారణలో వెల్లడైందని అన్నారు. -
బస్సులో నోట్ల కట్టల కలకలం
సాక్షి, విజయవాడ : ప్రైవేట్ బస్సులో నోట్ల కట్టలు బయటపడటంతో కలకలం రేగింది. విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వస్తున్న ప్రైవేట్ బస్సులో 30లక్షల అనధికార నగదు దొరికింది. ఆ డబ్బును తరిస్తున్న ఇద్దరు వ్యక్తులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే బస్సులో గంజాయి తరలిస్తున్న మరో ఇద్దరు కేటుగాళ్లు పట్టుబడ్డారు. దాదాపు 50కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో వెళ్తే, అనధికార సొమ్మును కూడా గుర్తించామని టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు. -
బెజవాడలో రెండు టన్నుల గంజాయి స్వాధీనం
విజయవాడ: సుమారు రెండు టన్నుల గంజాయిని విజయవాడలో పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. రాజమండ్రి నుంచి మహారాష్ర్ట వెళ్తున్న రెండు కార్లలో గంజాయిని తరలిస్తుండగా తనిఖీల్లో పట్టుకున్నారు. రామవరప్పాడు వద్ద ఒక కారు దొరకగా..పోలీసులకు దొరక్కుండా తప్పించుకుంటూ పోయిన మరో కారును ఇబ్రహీంపట్నం వద్ద చేజ్ చేసి పట్టుకున్నారు. రెండు కార్లలో కలిపి నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన నలుగురూ మహారాష్ర్టకు చెందినవారిగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘చుక్క’... చోద్యం!
సాక్షి, సిటీ బ్యూరో(హైదరాబాద్) : బయట సన్నగా వర్షం పడుతోంది. భాగ్యనగర వాసులు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. సరిగ్గా అప్పుడే అబిడ్స్ రోడ్‌లోని బీఎస్ఎన్ఎల్ టెలిఫోన్ ఎక్సెంజ్ వద్ద రోడ్డు పక్కనే ‘సాక్షి’ కెమెరాకు చిక్కిందో వింత దృశ్యం. ఓ యువతి, యువకుడు శుక్రవారం మద్యం తాగుతూ, గంజాయి పీలుస్తున్న సన్నివేశం కెమెరా కంటపడింది. ఎవరేమనుకుంటే తమకేంటి అన్నట్టుగా వారిద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ‘చుక్కే’శారు. మూసి ఉన్న దుకాణం ముందు తాపీగా కూర్చుకుని మందు మజాతో విందు చేసుకున్నారు. మత్తు సరిపోలేదో, కిక్ ఇంకా కావాలనుకున్నారో తెలియదు కానీ మద్యానికి గంజాయి, సిగరెట్ జత చేసుకున్నారు. లోకమంతా మరిచి మత్తులో మునిగి తేలారు. పబ్లిగ్గా మందేస్తున్న చుక్క, చక్కనోడిని చూసి ఆ దారిన పోయే వారంతా చకితులై నోళ్లు వెళ్లబెట్టారు. ఇదేం చోద్యమంటూ గుసగుసలాడారు. గ‘మ్మత్తు’ అంటే ఇదేనేమో! -
గంజాయి స్వాధీనం..ముగ్గురి అరెస్ట్
హైదరాబాద్ : మల్కాగిరిరి ఎక్షైజ్ పోలీసులు గంజాయి తరలిస్తున్న ఓ ముఠాను పట్టుకున్నారు. వారి నుంచి రూ.16 లక్షల విలువ చేసే గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా.. ఓ వ్యక్తి ఎక్సైజ్ పోలీసుల రాక గమనించి పరారయ్యాడు. విశాఖపట్నం జిల్లా పాడేరు నుంచి ఈ గంజాయిని హైదరాబాద్ మీదుగా ముంబాయి తరలించే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 135 కేజీల గంజాయితో పాటు రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. -
‘సరిహద్దు’లో గంజాయి గుప్పు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో గంజాయి మళ్లీ గుప్పుమంటోంది. సరిహద్దు ప్రాంతాల్లో యథేచ్ఛగా సాగవుతోంది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాలు, అంతర్రాష్ట్ర రవాణాకు సులువుగా ఉన్న గ్రామాల్లో సాగు జోరందుకుంటోంది. విత్తనాలు, పెట్టుబడి ఇచ్చి మరీ అంతరపంటగా పండించేలా రైతులను మాఫియా ప్రోత్సహిస్తోంది. 3 నెలల్లో చేతికొస్తున్న పంటను గుట్టుగా ముంబై, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీలకు సులువుగా రవాణా చేస్తోంది. అక్కడి నుంచి కాలేజీలు, పబ్బులు, విద్యార్థుల చేతుల్లోకి వెళ్తోంది. పెట్టుబడి అంతా మాఫియాదే ఢిల్లీ, బెంగళూరుకు చెందిన రెండు ప్రధాన గ్యాంగులు రాష్ట్రంలోని నారాయణ్‌ఖేడ్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, నిజామాబాద్ రూరల్, బోధన్, సంగారెడ్డిలోని రేగోడు, వటపల్లి, గాంధారి, ఎస్‌ఎస్‌నగర్, ఉట్నూర్ పరిసర ప్రాంతాలతో పాటు వికారాబాద్ గ్రామీణ ప్రాంతాలను గంజాయి సాగుకు ఎంచుకున్నాయి. పేద రైతులకు కేజీ చొప్పున గంజాయి విత్తన ప్యాకెట్లు పంచి పెట్టుబడి కింద రూ.5 వేలు అందిస్తున్నారు. పంట చేతికొచ్చిన తర్వాత తమ మనుషులు వస్తారని వాళ్లకివ్వాలని చెప్పి వెళ్లిపోతున్నారు. ఇలా మాఫియానే పెట్టుబడి పెట్టి గంజాయిని కాపు కాయిస్తోంది. మూడు నెలల్లో చేతికి.. మిర్చి, మొక్కజొన్న, కంది, పత్తి పంటల మధ్యలో అంతరపంటగా గంజాయి సాగు చేస్తున్నారు. ‘5.5 నుంచి 7 అడుగుల వరకు పెరిగే గంజాయికి పెద్దగా నీరు అవసరం లేదు. ఉదయం కురిసే మంచుతో కాపుకొస్తుంది. విత్తనం వేసిన 3 నెలల్లోపై చేతికొస్తుంది. ఒక చెట్లు 2 కేజీల గంజాయి ఉత్పత్తి చేయగలదు’అని నారాయణ్‌ఖేడ్‌కు చెందిన ఓ పోలీస్ అధికారి చెప్పారు. గంజాయి మొక్క పువ్వు రాలి పడిన ప్రతి చోట మొక్క పెరుగుతుందని, కాపు కాల్చి వేసినా మొలకలొస్తుంటాయని వివరించారు. గతంలో ఎకరాలకెకరాలు కాల్చినా మళ్లీ మొక్కలు మొలిచాయని చెప్పారు. కాగా, గంజాయి మొక్కలోని ఆకులనే మాఫియా ప్రధానంగా ఉపయోగించుకుంటుంది. కాస్త స్థలంలోనే 2 క్వింటాళ్లు.. ఒక ఎకరా భూమిలో మొక్కజోన్న వేస్తే.. ఆ ఎకరా మధ్యలోనే 10 నుంచి 15 గుంటల వరకు గంజాయి పంట సాగు చేస్తున్నారు. ఇలా సాగు చేసిన కాస్త పంట ద్వారానే 2 క్వింటాళ్ల వరకు ఉత్పతి చేస్తున్నారు. గంజాయి ఆకు తెంపిన తర్వాత వారం రోజులు ఎండ బెడతారని.. ఎండిన గంజాయికే మంచి డిమాండ్ ఉంటుందని రేగోడుకు చెందిన ఓ రైతు వివరించారు. ఎండిన గంజాయి కేజీ రూ.4 వేల వరకు ధర వస్తుందని, అది బ్రోకర్ల చేతులు మారి ముంబై, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీలో రూ.12 వేల వరకు పలుకుతుందన్నాడు. గంజాయి సాగు చేసినందుకు పెట్టుబడిగా ఇచ్చిన రూ.5 వేలతో పాటు చివరన రూ.10 వేలు ఇస్తారని చెప్పాడు. పోలీసులు పట్టుకున్నపుడు కేసులు, బెయిల్ తదితరాలు కూడా విత్తనాలిచ్చిన వ్యక్తులే చూసుకుంటారని తెలిపాడు. ఏడాదిలోనే 70 క్వింటాళ్లు స్వాధీనం.. పంట పండిన ప్రాంతం నుంచి ఆటో ద్వారా బయల్దేరి.. అక్కడి నుంచి జీపు, ప్రైవేట్ ట్రావెల్స్.. అలా అలా ముంబై, బెంగళూరులకు గంజాయి చేరుతోంది. అక్కడి నుంచి మాఫియా ద్వారా కార్పొరేట్ కాలేజీలు, బార్లు, పబ్బులు, విద్యార్థుల చేతుల్లోకి వెళ్తోందని పోలీసులు తెలిపారు. పంట సమయంలో రూ.4 వేలకు కేజీ కొనుగోలు చేసే బ్రోకర్.. మరో బ్రోకర్‌కు రూ.8 వేలకు విక్రయిస్తున్నాడని.. తర్వాత ముంబైకి తరలించే బ్రోకర్ రూ.10 వేల చొప్పున మార్కెట్లో విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైందని సంగారెడ్డి పోలీసులు వివరించారు. సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, కామారెడ్డి, వికారాబాద్ జిల్లాల నుంచే 300 క్వింటాళ్ల గంజాయి ప్రతి నెలా మార్కెట్లోకి వెళ్తోందని చెబుతున్నారు. ఒక్క ఏడాదిలోనే 70 క్వింటాళ్ల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
‘సరిహద్దు’లో గంజాయి గుప్పు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో గంజాయి మళ్లీ గుప్పుమంటోంది. సరిహద్దు ప్రాంతాల్లో యథేచ్ఛగా సాగవుతోంది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాలు, అంతర్రాష్ట్ర రవాణాకు సులువుగా ఉన్న గ్రామాల్లో సాగు జోరందుకుంటోంది. విత్తనాలు, పెట్టుబడి ఇచ్చి మరీ అంతరపంటగా పండించేలా రైతులను మాఫియా ప్రోత్సహిస్తోంది. 3 నెలల్లో చేతికొస్తున్న పంటను గుట్టుగా ముంబై, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీలకు సులువుగా రవాణా చేస్తోంది. అక్కడి నుంచి కాలేజీలు, పబ్బులు, విద్యార్థుల చేతుల్లోకి వెళ్తోంది. పెట్టుబడి అంతా మాఫియాదే ఢిల్లీ, బెంగళూరుకు చెందిన రెండు ప్రధాన గ్యాంగులు రాష్ట్రంలోని నారాయణ్‌ఖేడ్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, నిజామాబాద్ రూరల్, బోధన్, సంగారెడ్డిలోని రేగోడు, వటపల్లి, గాంధారి, ఎస్‌ఎస్‌నగర్, ఉట్నూర్ పరిసర ప్రాంతాలతో పాటు వికారాబాద్ గ్రామీణ ప్రాంతాలను గంజాయి సాగుకు ఎంచుకున్నాయి. పేద రైతులకు కేజీ చొప్పున గంజాయి విత్తన ప్యాకెట్లు పంచి పెట్టుబడి కింద రూ.5 వేలు అందిస్తున్నారు. పంట చేతికొచ్చిన తర్వాత తమ మనుషులు వస్తారని వాళ్లకివ్వాలని చెప్పి వెళ్లిపోతున్నారు. ఇలా మాఫియానే పెట్టుబడి పెట్టి గంజాయిని కాపు కాయిస్తోంది. మూడు నెలల్లో చేతికి.. మిర్చి, మొక్కజొన్న, కంది, పత్తి పంటల మధ్యలో అంతరపంటగా గంజాయి సాగు చేస్తున్నారు. ‘5.5 నుంచి 7 అడుగుల వరకు పెరిగే గంజాయికి పెద్దగా నీరు అవసరం లేదు. ఉదయం కురిసే మంచుతో కాపుకొస్తుంది. విత్తనం వేసిన 3 నెలల్లోపై చేతికొస్తుంది. ఒక చెట్లు 2 కేజీల గంజాయి ఉత్పత్తి చేయగలదు’అని నారాయణ్‌ఖేడ్‌కు చెందిన ఓ పోలీస్ అధికారి చెప్పారు. గంజాయి మొక్క పువ్వు రాలి పడిన ప్రతి చోట మొక్క పెరుగుతుందని, కాపు కాల్చి వేసినా మొలకలొస్తుంటాయని వివరించారు. గతంలో ఎకరాలకెకరాలు కాల్చినా మళ్లీ మొక్కలు మొలిచాయని చెప్పారు. కాగా, గంజాయి మొక్కలోని ఆకులనే మాఫియా ప్రధానంగా ఉపయోగించుకుంటుంది. కాస్త స్థలంలోనే 2 క్వింటాళ్లు.. ఒక ఎకరా భూమిలో మొక్కజోన్న వేస్తే.. ఆ ఎకరా మధ్యలోనే 10 నుంచి 15 గుంటల వరకు గంజాయి పంట సాగు చేస్తున్నారు. ఇలా సాగు చేసిన కాస్త పంట ద్వారానే 2 క్వింటాళ్ల వరకు ఉత్పతి చేస్తున్నారు. గంజాయి ఆకు తెంపిన తర్వాత వారం రోజులు ఎండ బెడతారని.. ఎండిన గంజాయికే మంచి డిమాండ్ ఉంటుందని రేగోడుకు చెందిన ఓ రైతు వివరించారు. ఎండిన గంజాయి కేజీ రూ.4 వేల వరకు ధర వస్తుందని, అది బ్రోకర్ల చేతులు మారి ముంబై, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీలో రూ.12 వేల వరకు పలుకుతుందన్నాడు. గంజాయి సాగు చేసినందుకు పెట్టుబడిగా ఇచ్చిన రూ.5 వేలతో పాటు చివరన రూ.10 వేలు ఇస్తారని చెప్పాడు. పోలీసులు పట్టుకున్నపుడు కేసులు, బెయిల్ తదితరాలు కూడా విత్తనాలిచ్చిన వ్యక్తులే చూసుకుంటారని తెలిపాడు. ఏడాదిలోనే 70 క్వింటాళ్లు స్వాధీనం.. పంట పండిన ప్రాంతం నుంచి ఆటో ద్వారా బయల్దేరి.. అక్కడి నుంచి జీపు, ప్రైవేట్ ట్రావెల్స్.. అలా అలా ముంబై, బెంగళూరులకు గంజాయి చేరుతోంది. అక్కడి నుంచి మాఫియా ద్వారా కార్పొరేట్ కాలేజీలు, బార్లు, పబ్బులు, విద్యార్థుల చేతుల్లోకి వెళ్తోందని పోలీసులు తెలిపారు. పంట సమయంలో రూ.4 వేలకు కేజీ కొనుగోలు చేసే బ్రోకర్.. మరో బ్రోకర్‌కు రూ.8 వేలకు విక్రయిస్తున్నాడని.. తర్వాత ముంబైకి తరలించే బ్రోకర్ రూ.10 వేల చొప్పున మార్కెట్లో విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైందని సంగారెడ్డి పోలీసులు వివరించారు. సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, కామారెడ్డి, వికారాబాద్ జిల్లాల నుంచే 300 క్వింటాళ్ల గంజాయి ప్రతి నెలా మార్కెట్లోకి వెళ్తోందని చెబుతున్నారు. ఒక్క ఏడాదిలోనే 70 క్వింటాళ్ల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు
నిజామాబాద్ నాగారం: ఇందల్వాయి మండలం గన్నారం పరిధిలో ఉన్న దాబాలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎక్సైజ్‌శాఖ టాస్క్ఫోర్సు సీఐ వెంకట్‌రెడ్డి తెలిపారు. టాస్క్ఫోర్సు సిబ్బంది దాడుల్లో మంగళవారం గన్నారం పరిధిలో ఉన్న దాబా లో దేవితండాకు చెందిన వినోద్‌కుమార్ దాబాలో ఎండుగంజాయి ప్యాకెట్లను లారీ డ్రైవర్లకు విక్రయిస్తుండగా దాడి చేసి పట్టుకున్నామన్నారు. దాబా యజమానులు అశోక్, వినోద్‌కుమార్‌పై కేసు నమోదుచేసి అరెస్టు చేశామన్నారు. 1.6 కేజీల గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నామని, దాని విలువ రూ.30 వేలు ఉంటుందన్నారు. టాస్క్ఫోర్సు ఎస్ఐ సింధూ, సిబ్బంది ఫయాజ్, మశ్చేందర్, అహ్మద్, రాజేశ్వర్, రమణ పాల్గొన్నారు. -
విశాఖలో భారీగా గంజాయి ధ్వంసం
-
అంతర్రాష్ట్ర గంజాయి ముఠా సభ్యుల అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: గంజాయి అంతరాష్ట్ర రవాణా ముఠాలోని ఇద్దరు సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. విశాఖపట్నం నుంచి ఢిల్లీకి గంజాయిని సరఫరా చేస్తున్నఈ ముఠాలోని ఇద్దరు సభ్యులు రాపురోహిత్, ప్రేమ్‌కుమార్‌ను ఎల్బీనగర్ జోన్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 30 కిలోల గంజాయి, ఒక కారు, రూ.12,000 నగదు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను హయత్‌నగర్ పోలీసులకు అప్పగించారు. కాగా మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. -
గ్యాస్ సిలిండర్లలో గంజాయి
బనశంకరి : గ్యాస్ సిలిండర్‌లో అక్రమంగా గంజాయి నింపి సరఫరా చేస్తున్న ముఠాలోని ఓ వ్యక్తిని బెంగళూరు నగరంలోని రామమూర్తినగర పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అదనపు పోలీస్ కమిషనర్ సీమంత్‌కుమార్‌సింగ్ వివరాలను వెల్లడించారు. రామమూర్తినగర విజినాపుర గులాబ్జాన్ అలియాస్ గులాబి అనే వ్యక్తి గ్యాస్ సిలిండర్ల కింది భాగాన్ని వృత్తాకారంలో కత్తిరించి దానికి తాళం వేసే రీతిలో మార్పులు చేశాడు. అందులో చిన్నచిన్న గంజాయి ప్యాకెట్లు నింపి బైకుపై వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ విక్రయిస్తున్నాడు. విజినాపుర ప్లాట్ఫారం రోడ్డులో ఆటోలో గంజాయి నింపిన గ్యాస్ సిలిండరును రవాణా చేస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీని ఆధారంగా మంగళవారం రామమూర్తినగర పోలీసులు ఆ ప్రాంతంలో కాపుకాసి ఆటోపై దాడి చేసి గులాబ్జాన్ను అరెస్టు చేశారు. ఇతడి నుంచి గంజాయి, ఓ ఆటో, సెల్‌ఫోన్ ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఇలాగే గంజాయి సరఫరా చేస్తున్న మరో వ్యక్తి సమాచారం కూడా తెలిసిందని, అతడి కోసం తీవ్రంగా గాలిస్తుమని కమిషనర్ తెలిపారు. అంతేగాక గ్యాస్ సిలిండర్లను సరఫరా చేసి వాటికి తాళం వేసే రీతిలో తయారు చేసిన వ్యక్తుల కోసం కూడా గాలిస్తున్నామన్నారు. -
22 మందిపై సస్పెన్షన్ వేటు
సాక్షి, వరంగల్ అర్బన్ : కాకతీయ మెడికల్ కళాశాలలో గంజాయి కలకలం రేపుతోంది. రెండు రోజుల క్రితం జూనియర్ విద్యార్థి బర్త్ డే పార్టీ సందర్భంగా 22 మంది విద్యార్థులు గంజాయి తీసుకున్నట్లు తెలిసింది. గంజాయి తీసుకున్న వారందరిని రెండు నెలల పాటు సస్పెండ్ చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు. మొత్తం 30 మంది సదరు విద్యార్థి బర్త్ డే పార్టీకి వెళ్లగా 22 మంది గంజాయి దమ్ము కొట్టినట్లు తెలిసింది. గంజాయి తీసుకున్న మెడికోలు అందరూ తెల్లవారే వరకూ నిద్ర మత్తులోనే ఉండటంతో సహచర విద్యార్థులు హాస్టల్ వార్డెన్‌కు సమాచారం అందించారు. మత్తులో జోగుతున్న విద్యార్థుల విజువల్స్‌ను రికార్డ్ చేసిన వార్డెన్ ప్రిన్సిపాల్‌కు అందించడంతో వారిని రెండు నెలలపాటు సస్పెండ్ చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు విచారణ కమిటీని కళాశాల నియమించింది. సమాజానికి మంచి చెప్పాల్సిన మెడికోలే ఇలా గంజాయి మత్తులో జోగుతుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గతంలో వరంగల్ నిట్ విద్యార్థులు కూడా గంజాయితో పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు మెడికోలకు గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై విచారణ చేపట్టారు. -
మురికి కాలువలో గంజాయి బ్యాగులు
విజయనగరం: విజయనగరం జిల్లాలో పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడింది. మురికి కాలువలో పెద్ద ఎత్తున గంజాయి బ్యాగులు పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ సంఘటన జిల్లాలోని సాలూరులో మంగళవారం వెలుగు చూసింది. ఆదివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు కోటదుర్గమ్మ గుడి సమీపంలోని కాలువలో సుమారు 25 బ్యాగుల గంజాయిని పడేసి వెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. -
గంజాయి, మెడికల్ డ్రగ్స్ ముఠా అరెస్ట్
-
గంజాయి, మెడికల్ డ్రగ్స్ ముఠా అరెస్ట్
కాకినాడ: కాకినాడలో గంజాయి, మెడికల్ డ్రగ్స్ ముఠాను పోలీసులు బుధవారం ఉదయం అరెస్టు చేశారు. ఈ సందర్బంగా ఆ ముఠా నుంచి భారీగా గంజాయి, మెడికల్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న నలుగురిని కాకినాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జవాడ రవి, శివప్రసాద్, భీమరాజు, రమణ అనే వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 25 కేజీల గంజాయి, 189 బాటిల్స్ టాసెక్స్, 197 బాటిల్స్ ఎస్కాఫ్ 3,465 నిట్రోవిట్ టాబ్లెట్స్, 170 నిట్రోసిన్ టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా... డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా నియంత్రిత మత్తు మందులు అమ్మిన మూడు మెడికల్ షాపుల యజమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
గంజాయి మత్తులో ఇంజినీరింగ్ విద్యార్థులు
హైదరాబాద్: నాగోల్ మమతా నగర్ కాలనీలోని గంజాయి తాగుతూ ఇంజినీరింగ్ విద్యార్థులు పట్టుబడ్డారు. ఎన్వీరావు అపార్ట్మెంట్ పై దాడులు చేసిన పోలీసులు గంజాయి తాగుతూ పేకాడుతున్న ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని విచారణకు తరలించారు. -
విశాఖ మన్యం టు హైదరాబాద్
జీలుగుమిల్లి : ఎవరికీ అనుమానం రీతిలో గుట్టు చప్పుడు కాకుండా విశాఖ మన్యం నుంచి హైదరాబాద్‌కు తరలిపోతున్న గంజాయిని పక్కా సమాచారంతో జీలుగుమిల్లి పోలీసులు మంగళవారం రాత్రి పట్టుకున్నారు. మినీ బస్సులోని సీలింగ్‌లో దాచి తరలిస్తున్న సుమారు 400 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశాఖ మన్యం నుంచి హైదరాబాద్ తదితర ప్రాంతాలకు గంజాయి భారీగా రవాణా అవుతున్నట్టు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పోలవరం డీఎస్పీ ఏటీవీ రవికుమార్ బుధవారం విలేకరులకు వివరాలు తెలిపారు. గంజాయి తరలింపుపై పక్కా సమాచారం అందడంతో జిల్లా పోలీసులు అప్రమత్తమై మంగళవారం రాత్రి జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ చేపట్టారు. మినీ బస్సు కొవ్వూరు, దేవరపల్లి, కొయ్యలగూడెం మూడు పోలీస్ స్టేషన్లను దాటుకుని జీలుగుమిల్లి సమీపంలో పోలీసులకు చిక్కింది. అయితే మూడు గంటల పాటు ఎంత తనిఖీ చేసినా గంజాయి ఆచూకీ లభ్యం కాలేదు. చివరకు మెకానిక్‌ను రప్పించి బస్సులోని సీలింగ్ రేకు బోల్టులు ఇప్పించి చూడగా అందులో గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. డీఎస్పీ, తహసీల్దార్ రాజశేఖరరావు సమక్షంలో గంజాయిని స్వా«ధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.40 లక్షలు ఉంటుందని డీఎస్పీ చెప్పారు. మినీ బస్సును సీజ్ చేసి విశాఖ జిల్లాకు చెందిన డ్రైవర్ ఈగల రమణ, హైదరాబాద్‌కు చెందిన లతీఫ్ వజీర్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్టు డీఎస్పీ చెప్పారు. కాగా లతీఫ్ వజీర్ విశాఖ మన్యంలో గంజాయి కొనుగోలు చేసి హైదబాద్‌కు తరలిస్తున్నట్టు సమాచారం. పోలవరం సీఐ బాలరాజు, ఎస్సై కాళీ చరణ్, ఏఎస్సై భాస్కర్, ఉమ ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. -
చాక్లెట్స్‌లో గంజాయి
నిజామాబాద్: జిల్లాలో అక్రమంగా సాగుతున్న గంజాయి దందా గుట్టును పోలీసులు బుధవారం రట్టు చేశారు. చాక్లెట్స్‌లో గంజాయి పెట్టి అమ్ముతున్న గ్యాంగ్‌లో ఓ వ్యక్తిని లలిత మహల్ థియేటర్ సమీపంలో అరెస్టు చేశారు. గంజాయిని చాక్లెట్స్‌లో ఉంచి ఒక్కింటికి రూ.5 చొప్పున కూలీలకు, హమాలీలకు అమ్ముతున్నట్లు గుర్తించారు. అతని వద్ద నుంచి భారీ మొత్తంలో చాక్లెట్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. రాజస్ధాన్ నుంచి గంజాయిను తెప్పించి జిల్లాలో అమ్ముతున్నట్లు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్ తెలిపారు. రూ.45 విలువైన గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. దీని వెనుక ఉన్న సూత్రధారులెవరనే దానిపై దర్యాప్తు చేపట్టామని వెల్లడించారు. -
టన్నుకుపైగా గంజాయి స్వాధీనం
దేవరపల్లి: జిల్లాలో రెండు వేర్వేరు ఘటనల్లో వెయ్యి కిలోలకు పైగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.కోటి పైనే ఉం టుందని అంచనా. విశాఖ జిల్లాలోని అటవీ గ్రామాల నుంచి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల మీదుగా హైదరాబాద్‌కు పెద్దఎత్తున గంజాయి అక్రమ రవాణా అవుతోంది. దీనిపై నిఘా పెట్టిన పోలీసులు దేవరపల్లి వద్ద విశాఖ జిల్లా రోలుగుంట గ్రామం నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న ఐషర్ వ్యాన్‌ను తనిఖీ చేయగా గంజాయి ఉన్నట్టు గుర్తించారు. కూరగాయల ప్లాస్టిక్ ట్రేల మధ్యన 32 బస్తాల గంజాయి మూటలను గుర్తించారు. వ్యాన్‌లో ఉన్న విశాఖకు చెందిన పిల్లా శ్రీను, అనకాపల్లి సమీపంలోని శకరం గ్రామానికి చెందిన వ్యాన్ డ్రైవర్లు చెరగడం సాయి, రోలుగుంటకు చెందిన మరో డ్రైవర్ కోనాల నూకరాజును అరెస్ట్ చేశారు. సాయంత్రం పోలీస్‌స్టేషన్ వద్ద జంగారెడ్డిగూడెం డీఎస్పీ వి. వెంకట్రావు వివరాలు వెల్లడించారు. విశాఖ జిల్లా రోలుగుంట గ్రామం నుంచి ఐషర్ వ్యాన్‌లో 32 బస్తాల్లో సుమారు 308 గంజాయి ప్యాకెట్లు హైదరాబాద్‌కు రవాణా అవుతున్నట్టు సమాచారం అందిందన్నారు. దేవరపల్లి వద్ద ఎస్సై పి.వాసు వ్యాన్‌ను పరి శీలించగా సుమారు 800 కిలోల గం జాయి ఉందన్నారు. వ్యాన్‌లో ఉన్న పిల్లా శ్రీను. శరగడం సాయి, కోనాల నూకరాజును అరెస్ట్ చేశామన్నారు. గంజాయి విలువ సుమారు రూ.80 లక్షల వరకు ఉంటుందని చె ప్పారు. గంజాయి రవాణాకు ప్రధాన సూత్రధారి అనకాపలి్లకి చెందిన శివ అని, ఆయన పేరునే వ్యాన్ ఉందన్నారు. శివపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. కొ వ్వూరు సీఐ శరత్‌రాజ్‌కుమార్, ఎస్సై పి.వాసు, సిబ్బందిని ఆయన అభినందించారు. లారీని ఢీకొన్న కారు.. డ్రైవర్ మృతి జగన్నాథపురం (గోపాలపురం) : గంజాయిని కారులో తరలిస్తుండగా లారీని ఢీకొట్టడంతో కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందిన ఘటన గోపాలపురం మండలం జగన్నాథపురంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ జిల్లా నర్సీపట్నం నుంచి హైదరాబాద్‌కు ఏపీ 37 ఏపీ 666 నంబర్ కారులో సుమారు 200 కిలోల గంజాయిను రవాణా చేస్తున్నారు. ఈ కారు గోపాలపురం మండలం జగన్నాథపురం వచ్చేసరికి జంగారెడ్డిగూడెం నుంచి రాజమండ్రి వైపు వెళుతున్న లారీని ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా డ్రైవర్ మృతిచెందాడు. కారులో రెండు కిలోల చొప్పున 94 గంజాయి ప్యాకెట్లు ఉన్నాయని తహసీల్దార్ ఎన్.నరసింహమూర్తి తెలిపారు. వీటి విలువ రూ.20 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఎస్సై యు.లక్ష్మీనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు డ్రైవర్ రాజమండ్రి సీటీఆర్ఐ ప్రాంతానికి చెందిన కె.వెంకటేశ్వరరావుగా భావిస్తున్నారు. కారులో డ్రైవర్‌తోపాటు మరో వ్యక్తి ఉన్నాడు. అతడి కాళ్లు, తలకు బలమైన గాయాలు కావడంతో జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కారులో ఉన్న వివిధ నంబర్ ప్లేట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
టన్నుకుపైగా గంజాయి స్వాధీనం
దేవరపల్లి: జిల్లాలో రెండు వేర్వేరు ఘటనల్లో వెయ్యి కిలోలకు పైగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.కోటి పైనే ఉం టుందని అంచనా. విశాఖ జిల్లాలోని అటవీ గ్రామాల నుంచి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల మీదుగా హైదరాబాద్‌కు పెద్దఎత్తున గంజాయి అక్రమ రవాణా అవుతోంది. దీనిపై నిఘా పెట్టిన పోలీసులు దేవరపల్లి వద్ద విశాఖ జిల్లా రోలుగుంట గ్రామం నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న ఐ షర్ వ్యాన్‌ను తనిఖీ చేయగా గంజాయి ఉన్నట్టు గుర్తించారు. కూరగాయల ప్లాస్టిక్ ట్రేల మధ్యన 32 బస్తాల గంజాయి మూటలను గుర్తించారు. వ్యాన్‌లో ఉన్న విశాఖకు చెందిన పిల్లా శ్రీను, అనకాపల్లి సమీపంలోని శకరం గ్రామానికి చెందిన వ్యాన్ డ్రైవర్లు చెరగడం సాయి, రోలుగుంటకు చెందిన మరో డ్రైవర్ కోనాల నూకరాజును అరెస్ట్ చేశారు. సాయంత్రం పోలీస్‌స్టేషన్ వద్ద జంగారెడ్డిగూడెం డీఎస్పీ వి. వెంకట్రావు వివరాలు వెల్లడించారు. విశాఖ జిల్లా రోలుగుంట గ్రామం నుంచి ఐషర్ వ్యాన్‌లో 32 బస్తాల్లో సుమారు 308 గంజాయి ప్యాకెట్లు హైదరాబాద్‌కు రవాణా అవుతున్నట్టు సమాచారం అందిందన్నారు. దేవరపల్లి వద్ద ఎస్సై పి.వాసు వ్యాన్‌ను పరి శీలించగా సుమారు 800 కిలోల గం జాయి ఉందన్నారు. వ్యాన్‌లో ఉన్న పిల్లా శ్రీను. శరగడం సాయి, కోనాల నూకరాజును అరెస్ట్ చేశామన్నారు. గంజాయి విలువ సుమారు రూ.80 లక్షల వరకు ఉంటుందని చె ప్పారు. గంజాయి రవాణాకు ప్రధాన సూత్రధారి అనకాపలి్లకి చెందిన శివ అని, ఆయన పేరునే వ్యాన్ ఉందన్నారు. శివపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. కొ వ్వూరు సీఐ శరత్‌రాజ్‌కుమార్, ఎస్సై పి.వాసు, సిబ్బందిని ఆయన అభినందించారు. లారీని ఢీకొన్న కారు.. డ్రైవర్ మృతి జగన్నాథపురం (గోపాలపురం) : గంజాయిని కారులో తరలిస్తుండగా లారీని ఢీకొట్టడంతో కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందిన ఘటన గోపాలపురం మండలం జగన్నాథపురంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ జిల్లా నర్సీపట్నం నుంచి హైదరాబాద్‌కు ఏపీ 37 ఏపీ 666 నంబర్ కారులో సుమారు 200 కిలోల గంజాయిను రవాణా చేస్తున్నారు. ఈ కారు గోపాలపురం మండలం జగన్నాథపురం వచ్చేసరికి జంగారెడ్డిగూడెం నుంచి రాజమండ్రి వైపు వెళుతున్న లారీని ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా డ్రైవర్ మృతిచెందాడు. కారులో రెండు కిలోల చొప్పున 94 గంజాయి ప్యాకెట్లు ఉన్నాయని తహసీల్దార్ ఎన్.నరసింహమూర్తి తెలిపారు. వీటి విలువ రూ.20 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఎస్సై యు.లక్ష్మీనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు డ్రైవర్ రాజమండ్రి సీటీఆర్ఐ ప్రాంతానికి చెందిన కె.వెంకటేశ్వరరావుగా భావిస్తున్నారు. కారులో డ్రైవర్‌తోపాటు మరో వ్యక్తి ఉన్నాడు. అతడి కాళ్లు, తలకు బలమైన గాయాలు కావడంతో జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కారులో ఉన్న వివిధ నంబర్ ప్లేట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
గంజాయి స్మగ్లర్ల ముఠా అరెస్టు
అరెస్టైన వారిలో అనంత, గుంటూరు, విశాఖ వాసులు అనంతపురం సెంట్రల్ : గుట్టుగా గంజాయి సరఫరా చేస్తున్న స్మగ్లర్లను అనంతపురం మూడో పట్టణ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. స్థానిక త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితులను డీఎస్పీ మల్లికార్జునవర్మ మీడియా ఎదుట హాజరుపరిచారు. వారి వివరాలు వెల్లడించారు. అనంతపురం ఆదర్శనగర్‌కు చెందిన ఎరికల నాగన్న, గుంటూరు జిల్లా రొంపిచెర్లకు చెందిన పసుమర్తి వరప్రసాద్, విశాఖపట్నం జిల్లా చింతలపల్లికి చెందిన వీర్ల సురేశ్, చేనుకుంపాకాలు గ్రామానికి చెందిన గడుతూరి శివచైతన్య అరెస్టైన వారిలో ఉన్నారు. పట్టుబడింది ఎలాగంటే.. అనంతపురం యువకులు మత్తుపదార్థాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దీనిపై దృష్టి సారించిన త్రీటౌన్ పోలీసులు గతంలో కొంతమంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరు కేవలం బాధితులు మాత్రమేనని గుర్తించి అసలు నిందితుల కోసం లోతుగా దర్యాప్తు సాగించారు. జిల్లాకు గంజాయి ఎక్కడి నుంచి సరఫరా అవుతోంది, దీని వెనుక ఉన్న ముఠా ఎవరన్న కోణంలో విచారణ ప్రారంభించారు. విశాఖ జిల్లాలోని నర్సీపట్నం, చింతపల్లి, పాడేరు తదితర ప్రాంతాల్లో గంజాయిని కుటీర పరిశ్రమగా సాగు చేసి, అక్కడి నుంచి ఆర్డర్లపై అనంతపురం, కర్నూలు, విజయవాడ, గుంటూరు, తిరుపతి తదితర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఇంకా మహారాష్ట్ర, ఢిల్లీ, హరిద్వార్, హైదరాబాద్ తదితర నగరాలకూ ఎగుమతి చేస్తున్నట్లు సమాచారం రాబట్టారు. అయితే ఇదంతా ఒక ముఠా ముందుండి నడిపిస్తోందని పసిగట్టిన పోలీసులు ముఠా కోసం గాలించారు. పైన పేర్కొన్న నలుగురు మహదేవనగర్ సమీపంలోని జాతీయ రహదారి వద్ద ఉన్నట్లు అందిన సమాచారం మేరకు వలపన్ని పట్టుకున్నారు. వారి నుంచి 12 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సీఐ మురళీకృష్ణ, ఎస్ఐ క్రాంతికుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
గురునానక్ ఇంజినీరింగ్ కాలేజీపై దాడులు
హైదరాబాద్ : ఇబ్రహీంపట్నంలోని గురునానక్ ఇంజినీరింగ్ కాలేజీపై పోలీసులు గురువారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా గంజాయి సరఫరా చేస్తున్న 8మంది విద్యార్థులను అరెస్ట్ చేశారు. కళాశాల విద్యార్థులతో పాటు బయటి వ్యక్తులకు వీరు గంజాయి సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందటంతో ఈ దాడులు చేశారు. అదుపులోకి తీసుకున్న విద్యార్థులను ఇబ్రహీంపట్నం పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వేటు పడింది
సాక్షి ప్రతినిధి, ఏలూరు : తప్పు చేసిన వారిని శిక్షించాలి్సన పోలీసులే వారికి రక్షణగా మారితే.. అక్రమాలకు ఊతమిస్తే.. ఏదో ఒక రోజున పట్టుబడి ఊచలు లెక్కించక తప్పదు. ఈ విషయాన్ని మర్చిపోయి గంజాయి అక్రమ రవాణాకు వెన్నుదన్నుగా నిలిచిన చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.దాసుపై పోలీస్ ఉన్నతాధికారులు ఎట్టకేలకు సస్పెన్షన్ వేటు వేశారు. నాన్ బెయిలబుల్ కేసులు సైతం నమోదు చేశారు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో గంజాయి రవాణా వెనుక ఒక సర్కిల్ ఇ¯ŒSస్పెక్టర్ హస్తం వెలుగుచూసిన నెలరోజుల వ్యవధిలోనే పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మరో సీఐ పాత్ర నిరూపణ కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళితే.. గత నెల 21న జిల్లాలో గంజాయి తరలిస్తున్న లారీని పట్టుకున్న విషయం తెలిసిందే. ఆ కేసులో ప్రధాన నిందితుడిని వదిలిపెట్టేందుకు ఒక అధికారి రూ.5.50 లక్షల్ని లంచంగా తీసుకున్నట్టు సమాచారం. దీనికి స్థానికంగా పనిచేస్తున్న కొందరు టీవీ చానల్ విలేకరులు డీల్ కుదిర్చారని, ప్రధాన నిందితుడు ప్రతి లోడుకు కొంత నగదు ఇచ్చేలా ఒప్పందం కుదిర్చారని నిర్ధారణ అయ్యింది. కొంతకాలంగా విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో పండించిన గంజాయిని హైదరాబాద్, మహా రాష్ట్రకు చింతలపూడి మీదుగా సరిహద్దు దాటిస్తున్నారు. గంజాయి రవాణా చేసే వాహనాలను ఎక్కడా నిలుపుదల చేయకుండా ఉండేందుకు ప్రతి లోడుకు రేటు కట్టి వసూలు చేస్తున్నారు. గత నెల 21న ఆపిన గంజాయి లారీకి సంబంధించిన వివరాలు స్పెషల్ బ్రాంచి వద్ద ఉండటం, ఆ బ్రాంచి పోలీసులు ఇచ్చిన సమాచారంతోనే లారీని పట్టుకున్నా.. చింతలపూడి సీఐ ఆ కేసులో ప్రధాన నిందితుణ్ణి వదిలివేయడాన్ని ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. మొత్తం వ్యవహారంపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ దాసు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల ఏలూరు ప్రాంతానికి రాగా.. బందోబస్తు విధులు నిర్వర్తించాలి్సన సీఐ దాసు డుమ్మా కొట్టారు. తనకు అరోగ్యం బాగుండక అసుపత్రిలో చేరానని, వైద్యులు 21 రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారంటూ ఉన్నతాధికారులకు ఎస్ఎంఎస్ పెట్టారు. అనంతరం ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేశారు. ఈ ఘటనలో ఎవరెవరు ఉన్నారన్న దానిపై విచారణ జరిపిన అధికారులు ముగ్గురిని అరెస్టు చేసి, మరికొందరి పాత్రపై విచారణ జరుపుతున్నారు. పోలీసుల అదుపులో ఉన్న ప్రధాన నిందితునితోపాటు సీఐ దాసు, అతని జీప్ డ్రైవర్, మరికొందరు పోలీసు సిబ్బందికి సంబంధించిన ఫోన్ కాల్ జాబితాలను రప్పించుకుని విచారణ జరిపారు. ఈ వ్యవహారంలో చింతలపూడికి చెందిన ఒక చానల్ విలేకరితోపాటు స్టేషన్లో పనిచేసే కీలక సిబ్బందికి కూడా సంబంధం ఉన్నట్టు గుర్తించారు. ప్రధాన నిందితునికి, సీఐకి మధ్య సంబంధాలు ఉన్నట్టు నిర్ధారణ కావడంతో పోలీసులు ఆయనపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఇతని పాత్ర నిర్ధారణ అయినప్పటికీ సస్పెన్షన్ వేటు వేసే విషయంలో పోలీసు అధికారులు మీనమేషాలు లెక్కించడం విమర్శలకు దారితీసింది. ఈ తరుణంలో ఎట్టకేలకు సీఐ దాస్‌ను సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్
- 34 కిలోల గంజాయి స్వాధీనం అనకాపల్లి: అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఒక ఆటోతో పాటు 34 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జిల్లా అనకాపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు గురువారం దాడులు చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. -
50 కేజీల గంజాయి స్వాధీనం
భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని మణుగూరులో పోలీసులు జరిపిన తనిఖీల్లో 50కేజీల గంజాయి పట్టుబడింది. పట్టణ ప్రధాన రహదారిపై తనిఖీలు చేపట్టిన పోలీసులు స్కార్పియోలో గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనలో ఓ కత్తి, ఇనుపరాడ్‌తో పాటు స్కార్పియో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు మణగూరు సీఐ మొగిలి తెలిపారు. గంజాయి ప్యాకెట్లను స్థానిక ఎమ్మార్వో తిరుమలాచారి పరిశీలించారు. కేసు నమోదు చేసి మరింత సమాచారం కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
గంజాయి సాగుపై పోలీసుల దాడులు
కోట్‌పల్లి: వికారాబాద్ జిల్లా కోట్‌పల్లి మండలం బార్వాద్ గ్రామంలో భారీ గంజాయి నిల్వలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో గంజాయి సాగు చేస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు, రెవెన్యూ సిబ్బంది బుధవారం దాడులు జరిపి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా గ్రామ శివారులోని పత్తి, కంది పంటల్లో అంతర పంటలుగా గంజాయిని సాగు చేస్తుండటాన్ని గుర్తించిన వాటిని ధ్వంసం చేశారు -
గంజాయి స్మగ్లింగ్.. పోలీసుల హస్తం!
చింతూరు: ఒడిశా నుంచి తెలంగాణకు లారీలో తరలిస్తున్న గంజాయి లోడును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలంలోని రత్నాపురం గ్రామంలో ఆదివారం రోజు తనిఖీలు చేసిన పోలీసులు ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 2,125 కిలోల గంజాయితో పాటు లారీని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ రూ. 63.70 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. గంజాయి అక్రమ రవాణకు సహకరిస్తున్న ఓ సీఐ, కానిస్టేబుల్ పై పోలీసు ఉన్నతాధికారులు కేసు నమోదు చేశారు. ఒడిశా నుంచి తెలంగాణకు భారీగా గంజాయి తరలించడానికి సహకరించిన మారేడుమిల్లి సీఐ అంకబాబుతో పాటు కానిస్టేబుల్ సత్యనారాయణపై కేసు నమోదు చేసినట్లు చింతూరు ఓఎస్డీ డాక్టర్ కే. ఫకీరప్ప విలేకరులకు తెలిపారు. -
ఎస్.కోటలో గంజాయి స్వాధీనం
విజయనగరం: విజయనగరం జిల్లా ఎస్.కోటలో శనివారం అక్రమంగా తరలిస్తున్న 15 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్‌కు చెందిన రాంసింగ్, బాబాసాగలనాథ్ ఎస్.కోట బస్టాండ్ వద్ద ఉండగా వారిని పోలీసులు సోదాలు జరిపారు. ఈ సందర్భంగా వారి వద్ద ఉన్న 15 కిలోల గంజాయిని సీజ్ చేశారు. వారిద్దరిని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి... విచారణ చేపట్టారు. -
భారీగా గంజాయి స్వాధీనం
విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా అరకులో ఎక్సైజ్ పోలీసులు శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా తరలిస్తున్న 700 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి.. ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. కారును సీజ్ చేశారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో వైపు పెద్దబయలు పోలీసులు పెద్ద మొత్తంలో గంజాయిని పట్టుకున్నారు. మండలంలోని సీకరి పంచాయతీ దరియాపల్లికి చెందిన పాంగి జయరాం, గొల్లూరి రాంబాబు కలసి 1000 కిలోల గంజాయిని కొనుగోలు చేసి నిల్వ ఉంచారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఎస్సై రామకృష్ణ ఆధ్వర్యంలో గ్రామంలో సోదాలు జరిపి ఆ గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్‌కు పంపారు. పట్టుబడిన గంజాయిని ఒడిశా తరలించేందుకు నిందితులు అదను కోసం ఎదురు చూస్తున్నారని ఎస్సై తెలిపారు. -
400 కిలోల గంజాయి పట్టివేత
జి.మాడుగుల: విశాఖపట్నం జిల్లా జి.మాడుగుల మండలం పెద్దలోతిలి పంచాయతీ కప్పలగడ్డలోని ఓ ఇంట్లో రవాణాకు సిద్ధంగా ఉన్న 400 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానికంగా ఉండే చింద్రి శివాజీ అనే వ్యక్తి ఇంట్లో ఈ గంజాయి లభించింది. ఈ ఘటనకు సంబంధించి నలుగురిని అరెస్ట్ చేశారు. ముందస్తు సమాచారం మేరకు స్థానిక సీఐ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో దాడులు జరిపి నిందితులను పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
116 కేజీల గంజాయి స్వాధీనం
రోలుగుంట: విశాఖ జిల్లా రోలుగుంట మండలం జానకి పురం గ్రామంలో మంగళవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. స్థానికంగా ఉండే ఓ పరిశ్రమ వద్ద జరిపిన సోదాల్లో 116 కేజీల గంజాయి బయటపడింది. గంజాయిని తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి ఓ బైక్, మరో కారు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సినీఫక్కీలో గంజాయి పట్టివేత
దేవరపల్లి: విశాఖ ఏజెన్సీ నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా రవాణా అవుతున్న సుమారు రూ.25 లక్షల విలువ గల 524 కిలోల గంజాయిని దేవరపల్లి వద్ద పోలీసులు పట్టుకున్నారు. గంజాయితో పాటు రూ.4.17 లక్షల నగదు, ఎనిమిది సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. గంజాయిని అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తుల వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించిన ఎస్సై ఆంజనేయులు, సిబ్బందిపై సదరు వ్యక్తులు కర్రతో దాడికి యత్నించగా ఎస్సై గాలికిలోకి ఒక రౌండు కాల్పులు జరిపారు. సంఘటనకు సంబంధించిన వివరాలను ఆదివారం రాత్రి పోలీస్‌స్టేçÙన్ వద్ద ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కొవ్వూరు రూరల్ సీఐ ఎం.సుబ్బారావు వివరించారు. విశాఖ ఏజెన్సీ నుంచి హైదరాబాద్‌కు ఐషర్ వ్యాన్ సీక్రెట్ బాక్సులో 500 కిలోల గంజాయిని రవాణా చేస్తున్నట్టు సమాచారం అందడంతో దేవరపల్లి వద్ద గస్తీకాసి పోలీసులు పట్టుకున్నారు. వ్యాన్ వెనుక గంజాయి రవాణా చేస్తున్న ఆరుగురు వ్యక్తులు ఇన్నోవా కారులో వస్తుండగా వాహనాన్ని తనిఖీ చేయగా కారులోని వ్యక్తులు ఎస్సై ఆంజనేయులు, సిబ్బం దిపై కర్రతో దాడికి యత్నించారు. దీంతో అప్రమత్తమైన ఎస్సై ఆంజనేయులు గాలిలోకి ఒక రౌండు కాల్పులు జరిపారు. అనంతరం నిందితులను అదుపులోకి తీసుకుని కారును తనిఖీ చేయగా 24 కిలోల గంజాయి, రూ. 4.17 లక్షల నగదు ఉన్నాయి. నిందితుల నుంచి గంజాయి, నగదు, ఎనిమిది సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు సీఐ తెలిపారు. ఇద్దరు పాత నేరస్తులు వరంగల్ జిల్లా ఓబులాపురానికి చెందిన బో నోతు యాకోబ్, విశాఖ జిల్లా జానకీరామ్పురానికి చెందిన అమ్మిరెడ్డి రమణ, ఓబులాపురానికి చెందిన బోనోతు సునీల్, రంగారెడ్డి జిల్లా చర్లపల్లికి చెందిన వ్యాన్ డ్రైవర్ కర్రి శ్రీశైలం, గుంటూరు జిల్లా హున్నాబాద్కు చెందిన తేజోవత్ సుకేందర్, కెతోవత్ శంఖర్ను అరెస్ట్ చేసినట్టు సీఐ సుబ్బారావు తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కొవ్వూరు డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. నిందితుడు అమ్మిరెడ్డి రమణపై విశాఖ జిల్లా కొత్తకోట పోలీస్‌స్టేషన్‌లో గతంలో నాలుగు గంజాయి కేసులు, ఆయుధాల సరఫరా కేసు నమోదయ్యాయన్నారు. రెండు ఫిస్టల్స్‌ను కూడా అక్కడ పోలీసులు రమణ నుంచి స్వాధీనం చేసుకుని రౌడీషీట్ ఓపెన్ చేశారని చెప్పారు. ఈ నేపథ్యంలో పోలీసులకు చిక్కకుండా రమణ తప్పించుకుని తిరుగుతున్నాడన్నారు. బోనాల యాకోబ్‌పై కూడా రెండు గంజాయి రవాణా కేసులు నమోదయ్యాయని చెప్పారు. నిందితులను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్న ఎస్సై ఆంజనేయులు, సిబ్బంది నాగేశ్వరరావు, బాలా జీ, గంగరాజు, శ్రీనును సీఐ అభినందించారు. -
600 కిలోల గంజాయి పట్టివేత
రంపచోడవరం: తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలోని ఫారెస్ట్ చెక్‌పోస్టు వద్ద వాహన తనీఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో 600 కిలోల గంజాయిని ఎక్సైజ్ అండ్ ఎన్స్‌ఫోర్స్‌మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. టిప్పర్ క్యాబిన్ కింద భాగంలో గంజాయి సంచులను దాచి రవాణా చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
600 కేజీల గంజాయి పట్టివేత
కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో విజిలెన్స్ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 600 కేజీల గంజాయిని వారు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ఒకరిని అరెస్టే చేశారు. అలాగే లారీని సీజ్ చేశారు. భారీ ఎత్తున గంజాయి అక్రమ రవాణా జరుగుతుందని ఆగంతకుడు విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. -
70 కిలోల గంజాయి స్వాధీనం
పాడేరు,చింతపల్లి: పాడేరు, చింతపల్లి మండలాల్లో పోలీసులు 70 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఏడుగుర్ని అరెస్ట్ చేశారు. పాడేరు మండలంలోని చింతలవీధి జంక్షన్ వద్ద రవాణా చేసేందుకు సిద్ధం చేసిన 40 కిలోల గంజాయిని పట్టుకున్నారు. హర్యానా రాష్ట్రంలో సోనీపట్ ప్రాంతానికి చెందిన అజయ్, వై.రాయత్, అమిత్ఠాఠీ, గోలు అనే నలుగుర్ని అరెస్ట్ చేసినట్టు పాడేరు ఎక్సైజ్ సీఐ ఎం.రాజారావు తెలిపారు. అలాగే చింతపల్లి మండలం గడపరాయికి చెందిన కొర్రా కామేశ్వరరావు, కొర్రా నాగేశ్వరరావు, గెమ్మెలి కొండబాబు అనే ముగ్గురు గిరిజనులను అరెస్ట్ చేసి 30 కిలోల గంజాయిన స్వాధీనం చేసుకున్నట్టు ట్రైనీ ఎస్ఐ విభూషణరావు తెలిపారు. -
400 కేజీల గంజాయి స్వాధీనం
విశాఖపట్నం: విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం కె.కోడపల్లి వద్ద ఎక్సైజ్ పోలీసులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా తరలిస్తున్న 400 కేజీల గంజాయిని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి నలుగురు వ్యక్తులతోపాటు మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించి....విచారిస్తున్నారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
360 కిలోల గంజాయి స్వాధీనం
కొవ్వూరు: అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 11 లక్షల విలువైన 360 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జిల్లా బలపంకోరుకొండ నుంచి విజయవాడకు బొలేరో వాహనంలో గంజాయి తరలిస్తుండగా.. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. బొలేరో డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి ఐదు మూటల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. -
22 కిలోల గంజాయి పట్టివేత
శంగవరపుకోట : గంజాయి స్మగ్లింగ్‌తో కొత్తదారులు వెతుకుతున్నారు. నిన్నటి వరకూ గంజాయి రవాణాలో పాత్రధారులైన మగరాయుళ్లను కాదని స్మగ్లర్లు ఇప్పుడు మహిళల్ని పావులుగా చేసి గంజాయి రవాణాకు ఉసిగొల్పుతున్నారు. విజయనగరం ఈఎస్టీఎఫ్ బందం సిబ్బంది, స్థానిక ఎక్సైజ్ అధికారులతో కలిసి బుధవారం సాయంత్రం బొడ్డవర జంక్షన్లో నిర్వహించిన రూట్‌వాచ్‌లో అక్రమంగా తరలుతున్న సుమారు 22కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలను సీఐ ఎం.ఎస్.ఎన్.వి.మణి తెలిపారు. రెగ్యులర్ రూట్‌వాచ్‌లో భాగంగా బొడ్డవర జంక్షన్లో వాచ్ చేస్తుండగా ఆర్టీస్ బస్ దిగిన ముగ్గురు మహిళలు నెత్తిపై గోనెమూటలతో వస్తున్నారు. వారితో పాటు ఇద్దరు బాలికలు ఉన్నారని తెలిపారు. వారిని అనుమానించి పట్టుకుని గోనె మూటలు తనిఖీ చేయగా అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టుబడిందని చెప్పారు. గంజాయి తూకం వేయగా 21కిలోల 800 గ్రాములు బరువున్నట్టు చెప్పారు. మహిళలు తమ పేర్లు తురురాంప్యారీ, శాంతిలాల్, అనితాసింగ్ అని, విశాఖ రైల్వే స్టేషన్‌ప్రాంతంలో ఉంటామని మాత్రం చెప్పారన్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నామని, వీరిని గురువారం కోర్టుకు హాజరు పరుస్తామని చెప్పారు. తనిఖీలో ఆమె వెంట ఎస్ఐ శంకర్‌కుమార్, హెచ్‌సి సిహెచ్.ఎస్.పి.రావు, జైరామ్‌నాయుడు తదితర సిబ్బంది పాల్గొన్నారని చెప్పారు. -
94 కిలోల గంజాయి స్వాధీనం
నర్సీపట్నం: చింతపల్లి నుంచి మైదాన ప్రాంతానికి తరలిస్తున్న 94 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, నలుగుర్ని అరెస్ట్ చేసినట్టు పట్టణ సీఐ ఆర్.వి.ఆర్.కె.చౌదరి తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం ఉదయం పట్టణ పొలిమేరలోని డిగ్రీ కళాశాల సమీపంలో వాహనాల తనిఖీ చేస్తుండగా చింతపల్లి వైపు నుంచి వస్తున్న కారులో గంజాయి ప్యాకెట్లను పోలీసులు గుర్తించారు. కారులో ప్రయాణిస్తున్న హైదరాబాద్‌కు చెందిన కాపోలు జగదీష్ , మణి రవి, గడ్డం గణేష్, మదిపల్లి సందీప్‌రెడ్డిను అరెస్టు చేశారు. గంజాయిని స్వా«ధీనం చేసుకుని, కారును సీజ్ చేశామని, గంజాయి విలువ రూ.సుమారు 3 లక్షలుంటుందని సీఐ చెప్పారు. నిందితులను కోర్టులో హాజరు పరిచినట్టు ఆయన తెలిపారు. ఈ తనిఖీల్లో ఎస్ఐ గోవిందరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
100 కేజీల గంజాయి స్వాధీనం
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా పాడేరు మండలం కరకపుట్టు వద్ద అక్రమంగా తరలిస్తున్న 100 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 4,500 స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
192 కేజీల గంజాయి పట్టివేత
విశాఖపట్నం: ప్రభుత్వాసుపత్రికి చెందిన అంబులెన్స్‌లో గంజాయి తరలిస్తున్నారని సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 192 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో శనివారం చోటు చేసుకుంది. లంబసింగి పీహెచ్‌సీకి చెందిన అంబులెన్స్‌లో గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులకు ఆగంతకుడు సమాచారం అందించారు. దీంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అంబులెన్స్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. -
పాడేరులో 30 కిలోల గంజాయి స్వాధీనం
పాడేరు : విశాఖపట్నం జిల్లా పాడేరులో 30 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ ఆర్టీసీ బస్సులో అక్రమంగా రవాణా చేస్తుండగా కండక్టర్ గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. నిందితులు మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భారీగా గంజాయి పట్టివేత : ముగ్గురు అరెస్ట్
విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలోని స్థానిక డిగ్రీ కాలేజీ వద్ద 156 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. అలాగే కారు, రెండు సెల్ ఫోన్లతోపాటు బైక్ సీజ్ చేశారు.రూ. 8, 400 నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
140 కేజీల గంజాయి పట్టివేత
రోలుగుంట: విశాఖపట్నం జిల్లా రోలుగుంట మండలం బుచ్చింపేట సమీపంలో శుక్రవారం గంజాయి పట్టుబడింది. సిందేటి వెంకటరమణ(27) అనే యువకుడి నుంచి 140 కేజీల గంజాయి, రూ. 8 వేల నగదు, ఓ వాహనం స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల రాకతో మరో వ్యక్తి పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నల్లమందు స్వాధీనం: నలుగురు అరెస్ట్
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరులో పోలీసులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా నల్లమందు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులు విశాఖపట్నం జిల్లా చింతపల్లి వాసులని పోలీసులు వెల్లడించారు. పట్టబడిన నల్లమందు విలువ రూ. 2.40 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. -
గంజాయి స్వాధీనం: నలుగురి అరెస్ట్
కోరుకొండ: అక్రమంగా గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు గంజాయి తరలిస్తున్న నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయలపల్లిలో మంగళవారం వెలుగు చూసింది. నిందితుల నుంచి రూ. 2.28 లక్షల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. -
200 కిలోల గంజాయి స్వాధీనం
విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం సమీపంలో ఆదివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా తరలిస్తున్న దాదాపు 200 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళల అరెస్ట్
బాసర: అక్రమంగా రైళ్లో గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళలను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 60 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అదిలాబాద్ జిల్లా బాసర రైల్వే స్టేషన్లో సోమవారం రైల్లో తనిఖీలు చేపడుతున్న పోలీసులకు ఇద్దరి మహిళల వద్ద భారీగా గంజాయి లభ్యమవడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
వర్నిలో గంజాయి పట్టివేత
వర్ని: నిజామాబాద్ జిల్లా వర్ని మండలం బడాపహాడ్ వద్ద అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు రావడం గమనించిన స్మగ్లర్లు కారును గంజాయిని వదిలి పారిపోయారు. కారులో ఉంచిన 26 సంచుల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించి ఒక మైనర్ బాలికను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
గంజాయి స్వాధీనం: ముగ్గురు అరెస్ట్
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలంలో సిద్దులూరు, గొట్టిముక్లలో శుక్రవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 60 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించి... వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
200 కేజీల గంజాయి పట్టివేత
విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా బుచ్చయ్యపేట మండలం విజయరామరాజుపేటలో 200 కేజీల గంజాయిని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వెయ్యి కిలోల గంజాయి స్వాధీనం
కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం వేటుకూరు జంక్షన్ వద్ద పోలీసులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 1005 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి.. ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి చెందిన రెండు లారీలు, ఓ కారు, నాలుగు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. -
270 కేజీల గంజాయి సీజ్: ఆరుగురు అరెస్ట్
కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం జడ్డంగి వద్ద శుక్రవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సులో అక్రమంగా గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 145 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వేస్టేషన్లో అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న 125 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
1500 కేజీల గంజాయి స్వాధీనం
విశాఖపట్టణం : విశాఖపట్టణం జిల్లా పాడేరు మండలం పెద్దబయలు గ్రామ శివారులోని ఈదులపుట్టు వద్ద ఒరిస్సాకు అక్రమంగా తరలిస్తున్న 1500 కిలోల గంజాయిని ఎక్సైజ్ అధికారులు బుధవారం పట్టుకున్నారు. ఈ సందర్బంగా ముగ్గురిని అరెస్ట్‌చేశారు. ముందస్తు సమాచారం మేరకు ఎక్సైజ్ సీఐ శ్రీనివాసరావు సిబ్బందితో కలసి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గంజాయిని తరలిస్తున్న వ్యాన్‌తోపాటు.... సదరు వాహనానికి పైలట్‌గా వెళుతున్న స్కార్పియో వాహనాన్ని ఎక్సైజ్ సిబ్బంది ఆపారు. గంజాయిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అందుకు సంబంధించి ముగ్గురిని ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే రెండు వాహనాలను సీజ్ చేశారు. -
11.4 కేజీల గంజాయి పట్టివేత
రాయచోటి : వైఎస్సార్ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గంజాయి రవాణా చేస్తోన్న 8 మంది ముఠాను కూడా అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 11.4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రాయచోటి-సుండుపల్లి మార్గంలో కుమ్మరపల్లి ఫారెస్ట్ చెక్‌పోస్టు వద్ద జరిపిన తనిఖీల్లో ఈ గంజాయి పట్టుబడింది. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
150 కేజీల గంజాయి పట్టివేత: ముగ్గురు అరెస్ట్
విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా గొలుగొండ మండలం రావణాపల్లిలో 150 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అందుకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి... పోలీస్ స్టేషన్‌కి తరలించారు. అలాగే కారును కూడా పోలీసులు సీజ్ చేశారు. వారిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.