మురికి కాలువలో గంజాయి బ్యాగులు
Published Tue, Aug 29 2017 11:38 AM | Last Updated on Tue, Sep 12 2017 1:17 AM
విజయనగరం: విజయనగరం జిల్లాలో పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడింది. మురికి కాలువలో పెద్ద ఎత్తున గంజాయి బ్యాగులు పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ సంఘటన జిల్లాలోని సాలూరులో మంగళవారం వెలుగు చూసింది. ఆదివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు కోటదుర్గమ్మ గుడి సమీపంలోని కాలువలో సుమారు 25 బ్యాగుల గంజాయిని పడేసి వెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.
Advertisement
Advertisement