
నిందితులు రాజుసింగ్, దేవానంద్
సాక్షి ,బంజారాహిల్స్: మంచి జీతం , సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అయినా జల్సాలకు అలవాటు పడి, జీతం సరిపోకపోవడంతో ఓ వ్యక్తి గంజాయి విక్రేతగా మారాడు. వివరాల్లోకి వెళ్తే.. ఫిలింనగర్‌లోని ఛత్రపతి శివాజీనగర్‌కు చెందిన రాంతీర్థ్ దేవానంద్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడిన అతను గంజాయికి బానిసయ్యాడు. జీతం సరిపోకపోవడంతో తానే గంజాయి విక్రయాలు చేపట్టాడు.
ఈ నెల 7న అతను ఫిలింనగర్‌లో గంజాయి సరఫరాదారు రాజుసింగ్ నుంచి రెండు కేజీల గంజాయి ప్యాకెట్‌ను తీసుకుంటూ పట్టుబడ్డాడు. తరచూ ఇదే ప్రాంతంలో దేవానంద్‌కు అతను గంజాయి తెచ్చిస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం అందడంతో నిఘా వేసిన పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి 4.3 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వీరిపై ఎన్డీపీఎస్ యాక్ట్ నమోదుచేసి రిమాండ్‌కు తరలించారు.
చదవండి: పుట్టుమచ్చలు చూపాలంటూ వేధింపులు
Comments
Please login to add a commentAdd a comment