![Police Seek Custody Of Bathula Prabhakar In Prism Pub Shooting Case](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/Police-Seek-Custody-Of-Bath.jpg.webp?itok=0g7GdmuO)
సాక్షి, హైదరాబాద్: ప్రిజం పబ్బు కాల్పుల కేసులో బత్తుల ప్రభాకర్‌ను గచ్చిబౌలి పోలీసులు 7 రోజుల కస్టడీ కోరారు. కస్టడీ పిటిషన్‌పై కోర్టు.. సోమవారం విచారణ చేయనుంది. ప్రిజం పబ్ కాల్పుల కేసులో నిన్న(గురువారం) సాఫ్ట్‌వేర్ రంజిత్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. . ప్రభాకర్‌కు రంజిత్ బస్సులో పరిచయం అయ్యాడు. ప్రభాకర్‌కు బ్యాంక్ అకౌంట్‌లు సమకూర్చి హెల్ప్ చేసిన రంజిత్.. ఇద్దరు బీహార్‌కు వెళ్లి గన్స్ కొనుగోలు చేశారు. ప్రభాకర్ అరెస్ట్‌తో పారిపోయిన రంజిత్‌ను నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ జరిగింది..
పశ్చిమగోదావరి జిల్లాలోని గోపవరం గ్రామానికి చెందిన మిన్నీ రంజిత్ 2022లో రాజమండ్రిలో ఓ ఆర్టీసీ బస్సులో బత్తుల ప్రభాకర్‌కు పరిచయమయ్యాడు. ఈ నెల 1వ తేదీన ప్రభాకర్, రంజిత్, రోహిత్‌లు కారులో బీర్లు తాగుతూ ఐటీ కారిడార్‌లో తిరిగారు. ఈ క్రమంలో కారు బ్రేక్‌డౌన్ కావడంతో గ్యారేజ్‌కు వెళ్లారు. ఆ సమయంలోనే ప్రభాకర్ ఫోన్‌చార్జింగ్ పెట్టుకునేందుకు ప్రీజం పబ్‌కు వెళ్లాడు. ఊహించని రీతిలో పోలీసులు పట్టుకోవడంతో కాల్పులు జరపగా, హెడ్‌కానిస్టేబుల్ వెంకట్‌రెడ్డికి గాయాలైన విషయం తెలిసిందే.
బిహార్‌లో ఉద్యోగం చేస్తున్న రంజిత్‌కు 2023లో ఐటీ కారిడార్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం వచ్చింది. కేపీహెచ్‌బీలో ఉంటున్న సమయంలో తరచుగా ప్రభాకర్ అతని వద్దే ఉండేవాడు. అక్కడి నుంచి రంజిత్ వట్టినాగులపల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌కు వెళ్లాడు. అక్కడ ఇరుకుగా ఉందని చెప్పి నార్సింగిలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలోని ఫ్లాట్‌ను రంజిత్ పేరిట బత్తుల ప్రభాకర్ అద్దెకు తీసుకున్నారు. కొద్ది నెలల తర్వాత ఒడిశాకు చెందిన ఓ యువతితో ప్రభాకర్ సహజీవనం చేశాడు.
ఇదీ చదవండి: మమత హత్య కేసు.. వీడిన మిస్టరీ
దీంతో రంజిత్ గచ్చిబౌలి టీఎన్‌జీవోస్ కాలనీలో స్నేహితుడు రోహిత్‌తో కలిసి ఉంటున్నాడు. రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానని నమ్మించి రంజిత్ క్రెడిట్ కార్డులు ఉపయోగించుకొని ఆ తర్వాత డబ్బు తిరిగిఇచ్చేవాడు. అలా ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడటంతో రంజిత్ యూపీఐలు, క్రెడిట్ కార్డులను ప్రభాకర్ వాడుకున్నాడు. రంజిత్ పేరిట కొనుగోలు చేసిన కారులోనే పబ్‌లు, జిమ్‌లకు వెళ్లేవారు.
గన్‌లు కావాలని అడగ్గా, రంజిత్ బిహార్‌లో తనకు తెలిసిన వారిని పరిచయం చేశాడు. వారి ద్వారా మూడు కంట్రీమేడ్ గన్‌లను ప్రభాకర్ కొనుగోలు చేశాడు. గన్‌ల కొనుగోలులో రంజిత్ ప్రమేయం ఉండటం, బ్యాంక్ లావాదేవీలు రంజిత్ ద్వారానే జరిగాయని పోలీసులు చెబుతున్నారు. ఘటన జరిగిన రోజు కారులో రంజిత్‌తో పాటు రోహిత్ కూడా ఉన్నాడని, ప్రభాకర్ లావాదేవీలు, చోరీల్లో అతని ప్రమేయం లేదని పోలీసులు వెల్లడించారు. ఏ 2 రంజిత్ నుంచి కారు, కేటీఎం బైక్, ఫోన్, కొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment