సాక్షి,హైదరాబాద్: నగరంలో ఐటీకి పేరుగాంచిన గచ్చిబౌలిలో శనివారం సాయంత్రం (ఫిబ్రవరి1) కాల్పలు కలకలం రేపాయి. ఇక్కడున్న ఒక పబ్‌కు వెళ్లిన పాత నేరస్తుడిని పట్టుకునేందుకు పోలీసులు పక్కా సమాచారంతో పబ్‌కు వెళ్లారు. పోలీసుల రాకను గమనించిన నేరస్తుడు తన వద్దనున్న తుపాకీతో పోలీసులపైకి కాల్పులు జరిపాడు.
మొత్తం రెండు రౌండ్లు పాత నేరస్తుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో పబ్‌లో పనిచేసే బౌన్సర్‌కు, కానిస్టేబుల్ వెంకట్‌రామ్‌రెడ్డికి గాయాలయ్యాయి. అయితే చివరకు ఆ పాత నేరస్తుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాయపడ్డ కానిస్టేబుల్‌ను ఆస్పత్రికి తరలించారు. కాల్పులు జరిపిన నేరస్తుడు పలు దొంగతనం కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment