సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్‌లో ఫేక్ ఫాస్ట్‌ట్రాక్(Fastrack) వాచ్‌లు అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బ్రాండెడ్ ఫాస్ట్‌ట్రాక్ వాచ్‌లు అంటూ సాధారణ వాచ్‌లను అధిక రెట్లకు విక్రయిస్తున్నారు. ముఠా వద్ద కోటి రూపాయల విలువైన 6వేలకుపైగా ఫేక్ ఫాస్ట్‌ట్రాక్ వాచీలను స్వాధీనం చేసుకున్నారు.
ముఠాలో సభ్యులైన ముగ్గురు బీహార్ రాష్ట్రానికి చెందిన యువకులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో చార్మినార్ పరిసరాల్లో వాచ్‌లను ముఠా అమ్ముతోంది. వాచ్‌లు అమ్ముతుండగా పక్కా సమాచారంతో పోలీసులు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.
కాగా యువతలో ఫాస్ట్‌ట్రాక్ వాచ్‌లంటే ఒక ప్రత్యేక క్రేజ్ ఉంది. దీనిని క్యాష్ చేసుకునేందుకు ముఠా యత్నించినట్లు తెలుస్తోంది. అన్ని బ్రాండెడ్ వస్తువులకు నకిలీవి సృష్టించి అమ్మినట్లే ఫాస్ట్‌ట్రాక్ వాచ్‌లకు కూడా ఫేక్ వాచ్‌లను తయారుచేసి లాభాలు ఆర్జింజేందుకు ప్రయత్నించి పోలీసులకు ముఠా సభ్యులు చిక్కారు.
Comments
Please login to add a commentAdd a comment