gang
-
రైలు దిగి ఉంటే ఖల్లాస్!
సాక్షి, హైదరాబాద్ : నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే కేడియా ఆయిల్స్ అధినేత రోహిత్ కేడియా ఇంటి నుంచి రూ.40 కోట్ల సొత్తు, నగదుతో ఉడాయించిన త్రయం మోల్హు ముఖియా, సుశీల్ ముఖియా, బసంతి తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో చిక్కింది. నగరం నుంచి ఢిల్లీ వెళ్లే రైలు ఎక్కిన వీరు ముగ్గురూ భోపాల్‌లో ట్రైన్ దిగిపోవాలని భావించారు. అదే జరిగితే వారు చిక్కడం కష్టసాధ్యమయ్యేదని, నిందితులు దొరికినా సొత్తు రికవరీ అయ్యేది కాదని అధికారులు చెబుతున్నారు. గత ఏడాది జనవరిలో దోమలగూడ ఠాణా పరిధిలో చోటు చేసుకున్న స్నేహలత దేవి ఉదంతాన్నే ఉదాహరణగా చూపుతున్నారు. నమ్మకంగా పని చేసిన మహేష్ కుమార్.. బీహార్ రాష్ట్రం, మధుబని జిల్లా, బిరోల్‌కు చెందిన చెందిన మహేష్‌కుమార్ ముఖియా 2023 డిసెంబర్లో నగరానికి వలసవచ్చాడు. తన సోదరి వద్ద ఉంటూ... స్నేహితుడి ద్వారా దోమలగూడకు చెందిన సువర్య పవ గుప్తా ఇంట్లో కేర్ టేకర్‌గా చేరాడు. గుప్తా తల్లి స్నేహలత దేవి (62) వయస్సు రీత్యా అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆమెకు సపర్యలు చేస్తూ నమ్మకం సంపాదించుకున్నాడు. గుప్తాతో పాటు అతడి కుటుంబీకులు ప్రతి రోజూ తమ వ్యాపార కార్యకలాపాల కోసం ఉదయం వెళ్లి రాత్రికి తిరిగి వచ్చేవారు. ఆ సమయంలో స్నేహలత మాత్రమే ఇంట్లో ఉంటుంది. ఈ విషయం తెలిసిన మహేష్ ఆమెను బంధించి, ఇంట్లో ఉన్న సొమ్ము, సొత్తు కాజేయాలని గత ఏడాది జనవరిలో పథకం వేశాడు. మోల్హు ముఖియాను పిలిపించి... దీనికి సహకరించడానికి తన గ్రామానికే చెందిన మోల్హు ముఖియాను పిలిపించుకున్నాడు. గత ఏడాది జనవరి 27న వచ్చిన ఇతగాడు మహేష్ వద్దే ఉన్నాడు. వృద్ధురాలిని బంధించడానికి, నోటికి వేయడానికి అవసరమైన తాళ్లు, టేపు తదితరాలతో పాటు ఓ బ్యాగ్‌ను కొనుగోలు చేశాడు. గత ఏడాది జనవరి 31న ఎప్పటిలానే పనికి వచ్చిన మహేష్... కుటుంబీకులు అంతా బయటకు వెళ్లిన తర్వాత మనోజ్‌ను రప్పించాడు. ఆ సమయంలో హాల్లోని సోఫాలో కూర్చున్న స్నేహలతపై ఇరువురూ దాడి చేశారు. ఆమెను చంపేసి రూ.కోటి విలువైన ఆభరణాలు, నగదు, ఇతర విలువైన వస్తువులు తీసుకుని ఉడాయించారు. మూడుసార్లు బీహార్ వెళ్లిన టాస్క్‌ఫోర్స్... అప్పట్లో ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. సువర్యపవ గుప్తా వద్ద మహేష్ ఇచ్చిన ఆధార్ కార్డు ఆధారంగా బీహార్ వెళ్లింది. అతడి ఆచూకీ లేకపోవడంతో మరో మూడు నెలలకు మరోసారి వెళ్లి... అతడి గ్రామానికి చెందిన వ్యక్తిని ఇన్ఫార్మర్గా మార్చుకువచ్చింది. ఎట్టకేలకు గత ఏడాది అక్టోబర్ మొదటి వారంలో మహేష్ తన గ్రామానికి చేరుకున్నాడు. ఈ విషయం ఇన్ఫార్మర్ ద్వారా తెలుసుకున్న సెంట్రల్ జోన్ టాస్‌్కఫోర్స్ పోలీసులు హుటాహుటిన వెళ్లి మహేష్ ను అరెస్టు చేశారు. అయితే సొత్తు మొత్తం తమకు సహకరించిన మోల్హుతో పాటు రాహుల్ అనే మరో నిందితుడి దగ్గర ఉన్నట్లు అతడు చెప్పాడు. దీంతో ఎనిమిది నెలల తర్వాత మహేష్, తాజా నేరంలో మోల్హు పట్టుబడినా . ఆ కేసుకు సంబందించి కనీసం రూ.100 విలువైన సొత్తు కూడా రికవరీ కాలేదు. కేడియా ఇంట్లో చోరీ చేసిన ముగ్గురూ కూడా భోపాల్‌లో రైలు దిగి ఉంటే ఇదే పరిస్థితి ఉండేదని అధికారులు పేర్కొన్నారు. -
ఫేక్ ఫాస్ట్‌ట్రాక్ వాచ్‌లు అమ్మే ముఠా అరెస్టు
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్‌లో ఫేక్ ఫాస్ట్‌ట్రాక్(Fastrack) వాచ్‌లు అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బ్రాండెడ్ ఫాస్ట్‌ట్రాక్ వాచ్‌లు అంటూ సాధారణ వాచ్‌లను అధిక రెట్లకు విక్రయిస్తున్నారు. ముఠా వద్ద కోటి రూపాయల విలువైన 6వేలకుపైగా ఫేక్ ఫాస్ట్‌ట్రాక్ వాచీలను స్వాధీనం చేసుకున్నారు. ముఠాలో సభ్యులైన ముగ్గురు బీహార్ రాష్ట్రానికి చెందిన యువకులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో చార్మినార్ పరిసరాల్లో వాచ్‌లను ముఠా అమ్ముతోంది. వాచ్‌లు అమ్ముతుండగా పక్కా సమాచారంతో పోలీసులు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. కాగా యువతలో ఫాస్ట్‌ట్రాక్ వాచ్‌లంటే ఒక ప్రత్యేక క్రేజ్ ఉంది. దీనిని క్యాష్ చేసుకునేందుకు ముఠా యత్నించినట్లు తెలుస్తోంది. అన్ని బ్రాండెడ్ వస్తువులకు నకిలీవి సృష్టించి అమ్మినట్లే ఫాస్ట్‌ట్రాక్ వాచ్లకు కూడా ఫేక్ వాచ్‌లను తయారుచేసి లాభాలు ఆర్జింజేందుకు ప్రయత్నించి పోలీసులకు ముఠా సభ్యులు చిక్కారు. -
అఫ్జల్‌గంజ్ కాల్పుల ఘటనలో నిందితుల గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: అఫ్జల్‌గంజ్ కాల్పుల ఘటనలో నిందితులను పోలీసులు గుర్తించారు. కాల్పులకు తెగబడ్డ నిందితుడు బీహార్‌కు చెందిన మనీష్‌గా గుర్తించారు. మనీష్‌తో అదే రాష్ట్రానికి చెందిన మరో నిందితుడు జతకట్టాడు. నిందితుల చోరీలు వారం రోజుల క్రితం మొదలయ్యాయి.ఛత్తీస్‌గఢ్‌లో వారం రోజుల క్రితం ఏటీఎం సిబ్బందిని బెదిరించి మనీష్ అండ్ కో రూ.70 లక్షల రూపాయలు కాజేశారు. గురువారం బీదర్‌లో ఏటీఎం సెక్యూరిటీ గార్డ్‌ను హత్య చేసి 93 లక్షలు ఎత్తుకెళ్లారు. బీదర్ నుంచి హైదరాబాద్ వచ్చి అఫ్జల్‌గంజ్ వచ్చిన మనీష్ కాల్పులు జరిపాడు. గతంలోనూ మనీష్ పై మర్డర్, దోపిడీ కేసులు ఉన్నాయి.గతంలో కేసులు నమోదైనప్పుడు మనీష్ బార్డర్ దాటి నేపాల్ పారిపోయాడు. కేసు తీవ్రత తగ్గాక ఇండియాకు వచ్చి మళ్లీ దోపిడీలు మొదలుపెట్టాడు. మనీష్‌ను పట్టుకునేందుకు నాలుగు రాష్ట్రాల పోలీసుల గాలిస్తున్నారు. తెలంగాణ, బీహార్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌లో మనీష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.బీదర్‌లో దుండగులిద్దరూ ‘ఏపీ’రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్న బైక్‌పై రూ.93 లక్షలున్న అల్యూమినియం డబ్బా ఎత్తుకొని ఉడాయించారు. అక్కడ నుంచి హైదరాబాద్ వైపు వచ్చి మార్గమధ్యలో ఆ డబ్బును బ్యాగ్‌లోకి మార్చుకున్నారు. తెలంగాణ సరిహద్దు గ్రామమైన సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ గ్రామంలోని హనుమాన్ టెంపుల్ వద్ద గల సీసీ ఫుటేజీల్లో దుండగులు కనిపించారు. సుల్తాన్పూర్, డప్పూర్, హత్నూర్, న్యాల్కల్ మీదుగా హైదరాబాద్ వెళ్లారు. అయితే ఆ డబ్బా, బైక్ ఎక్కడ వదిలేశారన్నది ఇంకా తేలలేదు. ఒకరు ఈ పెద్ద బ్యాగ్ పట్టుకొని, మరొకరు బ్యాక్ ప్యాక్ తగిలించుకొని గురువారం సాయంత్రానికి రోషన్ ట్రావెల్స్ వద్దకు వచ్చారు. ఈ ద్వయం ఎంజీబీఎస్ వైపు నుంచి ఆటోలో వచ్చి ట్రావెల్స్ వద్ద దిగినట్టు నిర్వాహకులు చెబుతున్నారు. రాయ్‌పూర్ వెళ్లడానికి అమిత్‌కుమార్ పేరుతో రెండు టికెట్లు బుక్ చేసుకున్నారు. ఆ సమయంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ సెల్‌నంబర్ ఇచ్చారు. బస్సు, సీట్ల నంబర్లు ఎస్ఎంఎస్ రూపంలో వస్తాయని, సరిచూసుకోవాలని ట్రావెల్స్ నిర్వాహకులు చెప్పారు. దీంతో ఓ దుండగుడు తన ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యిందని, ఇక్కడే ఉండి మీతోనే వచ్చి బస్సు ఎక్కుతామని వారికి చెప్పాడు. ఆ బస్సు ప్రయాణించే మార్గం, మార్గమ«ధ్యలో దాని స్టాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనే వివరాలు ట్రావెల్స్ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.రూ.93 లక్షలతో కూడిన బ్యాగ్‌ను చేత్తో పట్టుకొని మోయడం కష్టంగా ఉండటంతో ట్రాలీ బ్యాగ్ ఖరీదు చేయాలని భావించారు. అవి ఎక్కడ దొరుకుతాయంటూ ట్రావెల్స్ నిర్వాహకులను అడిగారు. మదీనా ప్రాంతంలో దుకాణాలు ఉన్నాయని చెప్పగా, అక్కడకు వెళ్లి రెండు ట్రాలీ బ్యాగ్స్ ఖరీదు చేశారు. మూసీనది సమీపంలో లేదా పబ్లిక్ టాయిలెట్లోకి వెళ్లి పెద్ద బ్యాగ్‌లో ఉన్న నగదును ఓ ట్రాలీలోకి మార్చారు. మరో దాంట్లో కొన్ని వ్రస్తాలతోపాటు హెల్మెట్ పెట్టారు. బ్యాక్ ప్యాక్‌లో మాత్రం తుపాకీ దాచి ఉంచారు. రోషన్ ట్రావెల్స్ కార్యాలయం అఫ్జల్‌గంజ్ బస్టాప్‌లోనే ఉంటుంది. అక్కడ మినీ బస్సుల్ని ఆపడానికి అవకాశం ఉండదు. దీంతో తమ ప్రయాణికుల్ని ట్రావెల్స్ బస్సుల వరకు చేర్చే మినీ బస్సుల్ని సమీపంలో ఉన్న మెట్రో ట్రావెల్స్ వద్ద ఆపుతారు. గురువారం సైతం ఇలానే ఆగడంతో..రోషన్ ట్రావెల్స్ నుంచి మిగిలిన ప్రయాణికులు, బీదర్ పోలీసులతో కలిసి ఇద్దరు దుండగులూ ఆ బస్సు ఎక్కారు. బస్సులో ప్రయాణికుల లగేజీ తనిఖీ చేస్తున్న ట్రావెల్స్ ఉద్యోగి జహంగీర్ దుండగుల ఓ ట్రాలీని తెరిచి చూసి హెల్మెట్, వస్త్రాలు గుర్తించారు. రెండోది తెరవడానికి ప్రయత్నిస్తుండగా, అందులో నగదు ఉండటంతో ఓ దుండగుడు తన బ్యాక్ ప్యాక్ నుంచి తుపాకీ బయటకు తీసి ఒక రౌండ్ కాల్చాడు. ఈ శబ్దం విన్న బస్సు డ్రైవర్ తొలుత టైరు పగిలిందని భావించి కిందకు దిగాడు. అదే అదనుగా ఇద్దరు దుండగులూ తమ ట్రాలీలతో సహా కిందకు దిగి ట్రాఫిక్‌కు రాంగ్ సైడ్‌లో నడుచుకుంటూ వెళ్లారు. ఇదీ చదవండి: Saif Ali Khan Case: హైప్రొఫైల్ కేసులో ఇంత అలసత్వమా?అదే మినీ బస్సులో ఉన్న ఇద్దరు బీదర్ పోలీసు కానిస్టేబుళ్లు వీరిని పట్టుకునే ప్రయత్నం చేసినా ఫలించలేదు. అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ సమీపం వరకు నడుచుకుంటూ వెళ్లిన దుండగులు ఓ ఆటో ఎక్కి ఎంజే మార్కెట్ మీదుగా ఉడాయించారు. ఠాణా సమీపంలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను బట్టి రాత్రి 7.09 గంటలకు దుండగులు ఆటో ఎక్కారు. దీని ప్రకారం కాల్పులు 7 గంటల ప్రాంతంలో జరిగినట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. క్షతగాత్రుడు మినీ బస్సు దగ్గర నుంచి రోషన్ ట్రావెల్స్ వరకు వచ్చి, వారికి విషయం చెప్పి, పోలీసులకు సమాచారం ఇచ్చేసరికి సమయం దాదాపు రాత్రి 7.30 గంటలైంది. దుండగులు ప్రయాణించిన ఆటో ఎంజే మార్కెట్, అబిడ్స్, ట్యాంక్‌బండ్ మీదుగా సికింద్రాబాద్ వరకు వెళ్లినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఆటో నంబర్, దాని ద్వారా డ్రైవర్‌ను గుర్తించిన అధికారులు శుక్రవారం సాయంత్రం ప్రశ్నించారు. తాను ఇద్దరినీ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న ఆల్ఫా హోటల్ వరకు తీసుకెళ్లానని చెప్పాడు. దీంతో సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రైలులో ఛత్తీస్‌గఢ్ లేదా బిహార్‌కు పారిపోయి ఉంటారని భావిస్తున్నారు. -
బిష్ణోయ్ గ్యాంగ్‌లో మేడం మాయ.. చేసే పని ఇదే..
న్యూఢిల్లీ: పంజాబీ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌తో పాటు అతని గ్యాంగ్‌కు అంతకంతకూ ఉచ్చు బిగుస్తోంది. ‘మేడమ్ మాయ’తోపాటు ఈ ముఠాలోని నలుగురు సభ్యులను జైపూర్ పోలీసులు అరెస్టు చేశారు. లారెన్స్ బిష్ణోయ్ మేడమ్ మాయకు ప్రత్యేకమైన పనులను ఇచ్చేవాడని సమాచారం.మేడమ్ మాయ జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ అనుచరులతో సన్నిహితంగా మెలుగుతుంటారు. దీనితో పాటు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సందేశాలను సంబంధితులకు అందజేసే పనిని మేడం మాయనే చేస్తుంటారు. గ్యాంగ్‌లో మేడమ్ మాయకు ఎంతో ప్రాధాన్యత ఉందని పోలీసుల విచారణలో తేలింది. ఏ ముఠా సభ్యునికి బెయిల్ ఇవ్వాలో, ఏ నేరస్తుని ఏ జైలు నుండి ఎక్కడికి మార్చాలో మేడమ్ మాయనే డిసైడ్ చేస్తుంటారు.రాజస్థాన్‌లోని జైపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేడమ్ మాయ ఈ ముఠాలో రెండేళ్లుగా పనిచేస్తున్నారు. జైలులో ఉన్న లారెన్స్ గ్యాంగ్ సభ్యుల పూర్తి వివరాలు మేడమ్ మాయ వద్ద ఉన్నాయి. జైలులో ఉన్న నేరస్తులు అందించే సందేశాలను ఆమె స్థానిక ముఠాకు చేరవేస్తుంటారు. విదేశాల్లో ఉంటున్న పలువురు నేరస్తులతో ఆమెకు మంచి పరిచయాలున్నాయి.మహిళా నేరస్తురాలు మేడం మాయ అసలు పేరు సీమా అలియాస్ రేణు. బిష్ణోయ్ గ్యాంగ్‌లో ఆమెను మేడమ్ మాయ అని పిలుస్తారు. మేడమ్ మాయపై జైపూర్, ఢిల్లీ, హర్యానాలలో పలు కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఈ ముఠాలోని ఏడుగురు నేరస్తులు పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె జైపూర్‌లో ఓ వ్యాపారిపై కాల్పులు జరిపేందుకు ప్లాన్ చేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది.ఇది కూడా చదవండి: దిగొచ్చిన బంగారం.. ఇక కొందాం.. -
మాజీ మంత్రి సిద్ధిఖీ హత్య వెనుక బిష్ణోయ్ గ్యాంగ్
ముంబై:నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ ముంబైలోని బాంద్రా ఈస్ట్ ప్రాంతంలో హత్యకు గురయ్యారు. అతనిపై ముగ్గురు నిందితులు కాల్పులు జరిపారు. వీరిలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రైమ్ బ్రాంచ్ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం అరెస్టు అయిన నిందితులు విచారణలో తాము లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందినవారమని చెప్పారని సమాచారం.అరెస్టయిన ఇద్దరు నిందితుల పేర్లు కర్నైల్ సింగ్, ధరమ్‌రాజ్ కశ్యప్ అని పోలీసులు గుర్తించారు. కర్నైల్ సింగ్ హర్యానా నివాసి కాగా, ధర్మరాజ్ కశ్యప్ ఉత్తరప్రదేశ్ నివాసి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితులు గత 25-30 రోజులుగా ఆ ప్రాంతంలో రెక్కీ చేశారు. ముగ్గురు నిందితులు ఆటో రిక్షాలో బాంద్రా వద్దకు వచ్చారు. బాబా సిద్ధిఖీపై కాల్పులు జరపడానికి ముందు, ఆ ముగ్గురూ కొంతసేపు అక్కడ వేచి ఉన్నారని పోలీసు వర్గాలు తెలిపాయి.బాబా సిద్ధిఖీపై కాల్పులు జరిపేందుకు నిందితులు 9.9 ఎంఎం పిస్టల్‌ను ఉపయోగించారు. ముష్కరులు మొత్తం ఆరు రౌండ్లు కాల్పులు జరిపారని బాంద్రా పోలీసు వర్గాలు తెలిపాయి. అందులో నాలుగు బుల్లెట్లు బాబా సిద్ధిఖీకి తగిలాయి. హత్యకు గల కారణాలు ఇంకా వెల్లడికాలేదు. పరారైన మూడో నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు. రెండు కోణాల్లో క్రైం బ్రాంచ్ దర్యాప్తు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒకటి బాంద్రాలోని ఎస్ఆర్ఏ వివాదానికి సంబంధించినది. మరొకటి లారెన్స్ బిష్ణోయ్‌కి సంబంధించినది. బాబా సిద్ధిఖీ.. బాంద్రా (పశ్చిమ) అసెంబ్లీ స్థానానికి మూడుసార్లు ప్రాతినిధ్యం వహించారు. ఇది కూడా చదవండి: మహారాష్ట్ర మాజీ మంత్రి సిద్ధిఖీపై కాల్పులు.. చికిత్స పొందుతూ మృతి -
హైదరాబాద్‌లో విస్కీ ఐస్‌క్రీమ్‌ల కలకలం
సాక్షి, హైదరాబాద్: నగరంలో విస్కీ ఐస్‌క్రీమ్‌లు కలకలం రేపుతున్నాయి. వన్ అండ్ ఫైవ్ పార్లర్లో ఎక్సైజ్ పోలీసులు సోదాలు నిర్వహించగా, విస్కీ ఐస్‌క్రీమ్‌లు బయటపడ్డాయి. పిల్లలకు ఐస్‌క్రీమ్‌కు విస్కీ కలిసి అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐస్‌క్రీమ్‌లో పేపర్ విస్కీ కలిపి విక్రయిస్తున్నారు. వన్‌అండ్ ఫైవ్ నిర్వాహకులు దయాకర్‌రెడ్డి, శోభన్‌లను అరెస్ట్ చేశారు.60 గ్రాముల ఐస్‌క్రీమ్‌లో 100 మి.లీ విస్కీని కలుపుతున్నారు. ఐస్‌క్రీమ్ క్రీమ్ విస్కీ కోసం పిల్లలు, యువత ఎగబడుతున్నారు. 11.5 కేజీల విస్కీ ఐస్ క్రీమ్స్‌ను పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 1 అండ్ 5లో హరికే కేఫ్ ఐస్ క్రీమ్ పార్లర్లో గుట్టుచప్పుడు కాకుండా విస్కీ ఐస్ క్రీమ్ అమ్మకాలు సాగిస్తున్నారు. -
అమ్మకానికి ఆడ శిశువు
-
HYD: పబ్బుల్లో డ్రగ్స్.. యువతులు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: పబ్బుల్లో డ్రగ్స్ అమ్ముతున్న ఆరుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్‌లోని పబ్‌ల్లో డ్రగ్ విక్రయాలు చేస్తున్నారు. మాదాపూర్‌లోని నోవాటెల్ ఆర్టిస్ట్రీ, ఎయిర్ లైవ్, క్లబ్ రౌగ్, క్లబ్ రాక్ పబ్బుల్లో డ్రగ్స్ దందా సాగిస్తున్నారు. బెంగళూరు, ముంబై, గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి పబ్బుల్లో విక్రయిస్తున్న మహిళల నుంచి 10 గ్రాముల ఎండీఎంఏతో పాటు కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ అమ్ముతున్న మిథున, కొంగాల ప్రియలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితో పాటు మరో నలుగురు కలిసి గత కొంతకాలం నుంచి డ్రగ్స్ అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరంతా బెంగళూరు, ముంబై, గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముతున్నట్లు గుర్తించారు. డ్రగ్స్ సప్లయర్స్ ఉస్మాన్, అజీం, అబ్దుల్లా పరారీలో ఉన్నారు. -
ఏపీ బీసీ సంఘం ఆధ్వర్యంలో 139 బీసీ కులాల సమావేశం
-
జస్ట్ ప్రెగ్నెంట్ చేస్తే చాలు!..ఏకంగా లక్షలు..! షాకింగ్ దందా!
కొన్ని నేరాలు చూస్తే మనుషుల ఆలోచనలు ఎలా ఇంతలా గగుర్పొడేచాలా ఉన్నాయిరా బాబు! అనిపిస్తుంది. అలాంటి దారుణమైన నేరాలు వెలుగోలోకి రానివి ఎన్నో ఉన్నాయి. జాబ్ పేరుతో డబ్బులు తీసుకుని మోసం చేసిన ఉదంతాలను ఎన్నో చూశాం. అవన్నీ ఒక ఎత్తు అనుకుంటే..ఇప్పుడూ ఏకంగా మానవసంబంధాలకు అర్థమిచ్చే పవిత్రమైన గర్భధారణ కూడా ఒక దందాలా నడిపిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. దీన్ని కూడా ఓ జాబ్ పేరుతో రిక్రూట్మెంట్ అంటే బాబోయ్! ఏంటీదీ? మనం మనుషులమేనా అన్నంత అసహ్యం కలగకమానదు ఈ ఘటన వింటే. కాసులు కోసం ఇంతలా దిగజారిపోతున్నాడా మావనవుడు అన్నంతగా విస్తుపోయాలా ఉంది. అసలేం జరిగిందంటే..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బీహార్‌లో మహిళలను గర్భవతులను చేస్తే డబ్బులు ఇస్తామన్న దిగ్బ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. దీన్ని ఓ ముఠా ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్ పేరుతో రాకెట్ నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆరోపణలపై పోలీసులు సుమారు 8 మందిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. బీహార్‌లోని నవాడాలో ఆ దుండగలను అదుపులోకి తీసుకున్నారు. వారంతా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్ పేరుతో వాట్సాప్, సోషల్ మీడియాల ద్వారా పురుషులను సంప్రదిస్తారు. పైగా ఈ సర్వీస్‌కు ప్రతిఫలంగా లక్షలు కూడా అందిస్తామని చెబుతున్నారు. అందుకోసం ఆ ముఠా ఆసక్తిగల వ్యక్తులను రూ. 799/తో రిజిస్టర్ చేయించుకోమని చెబుతారు. ఆ తర్వాత మహిళల ఫోటోలు పంపిస్తారు. వారు సెలక్ట్ చేసుకున్న అమ్మాయిని బట్టి సుమారు 5 వేల నుంచి 20 వేల వరకు సెక్యూరిటీ డిపాజిట్ చేయించుకుంటారు. ఆ తర్వాత వారు వారు ఎంపిక చేసుకున్న మహిళను గనుక ప్రెగ్నెంట్ చేయగలిగితే రూ. 13 లక్షల వరకు ముట్ట చెబుతారట. ఒకవేళ అలా చేయలేకపోయినా కనీసం రూ. 5లక్షల వరకు చెల్లిస్తామని ముఠా హామీ ఇచ్చిన్టలు పోలీసులు వెల్లడించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన గురించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఈ దందాకు ప్రధాన సూత్రదారితో సహా మిగిలిన నిందుతులను కూడా అదుపులోకి తీసుకుంటామని అధికారులు చెప్పుకొచ్చారు. మొన్నటివరకు అద్దె గర్భాల దందా!. ఇపుడు ఏకంగా మహిళలను ప్రెగ్నెంట్ చేసే దందా!. అసలేంటిది ఏదీ వ్యాపారం, ఏదీ ఉద్యోగం అనే ఇంకితం కూడా లేకుండా ఇంత దారుణమైన నేరాలా!. సమాజం ఎటువైపు పోతుంది. మనం ఎక్కడ ఉన్నాం అనిపిస్తోంది కదా!. టెక్నాలజీ పేరుతో ఎంతో ముందుకు వెళ్లామా లేకా ఆ టెక్నాలజీ ఇంత జుగుప్పకరమైన నేరాలకు పాల్పడేందుకు ఉపయోగపడుతుందనాలా పాలుపోవడం లేదు. నేరం ఎందువల్ల జరిగిందో పక్కనే పెడితే.. అలాంటి రిక్యూట్మెంట్లు దారణమైనవని, నేరమని తెలిసి ఆ బురదలోకి వెళ్లి నూరేళ్ల జీవితాలను బలిచేసుకుంటోంది యువత. దయచేసి సమాజం అన్నక అన్ని రకాల మనుషుల ఉంటారు. అలాగే మనిషి అన్నాక కుటుంబ పరంగా సవాలక్ష సమస్యలు ఉన్నా తప్పు చేసే అవకాశం ఉన్న వెళ్లకుండా ఉన్నవాడే గొప్పోడు. సంపాదించటం కంటే సక్రమంగా ఉండటం అన్నింటి కంటే ముఖ్యమైనది. ఏదైనా గానీ సరైన దారిలో వెళ్లి జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకోవడం మాత్రం మన చేతిలోనే ఉంటుది. ఆ విషయం మరవద్దు. (చదవండి: పీహెచ్డీ, నాలుగు మాస్టర్ డిగ్రీలు..కానీ బతుకుదెరువు కోసం ఆ వ్యక్తి..) -
కుకింగ్ చేస్తే రైస్‘పుల్లింగ్’!
సాక్షి, హైదరాబాద్: చంద్రయాన్–3 పేరుతో హైదరాబాద్‌లో ఒకరిని బురిడీ కొట్టించి రూ. 3 కోట్లు కొల్లగొట్టిన రైస్ పుల్లింగ్ గ్యాంగ్‌ను అరెస్టు చేసిన నేపథ్యంలో ఈ కేటుగాళ్ల మోడస్ ఆపరెండీని సీసీఎస్ పోలీసులు వివరించారు. సాధారణ చెంబు, బిందెలకు అతీంద్రియశక్తులు ఉన్నాయంటూ నమ్మించి నిండా ముంచడం వారి శైలి అని... సాధారణ చెంబు/బిందెను ‘రైస్‌పుల్లర్’గా మార్చడానికి ‘కుకింగ్’ చేస్తుంటారని పేర్కొన్నారు. అమోఘ శక్తులంటూ... రైస్ పుల్లింగ్ అంటే బియ్యాన్ని ఆకర్షించి తన వైపునకు లాక్కోవడం. ఇలాంటి శక్తులున్న పాత్రలు, బిందెలు, చెంబుల పేరు చెప్పి మోసగాళ్లు అందినకాడికి దండుకుంటుంటారు. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో వీటికి చేజిక్కించుకుంటే అమోఘ మైన ఫలితాలు ఉంటాయని నమ్మబలుకుతారు. సాధారణంగా కేటుగాళ్లు కస్టమర్లకు రైస్‌పుల్లింగ్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలనే చూపిస్తుంటారు. అనేక సందర్భాల్లో తాము విక్రయిస్తున్న పాత్రలను చూసే అవకాశం కొనే వారికి ఇవ్వరు. అయితే ఎవరైనా తమకు ఆ పాత్ర మహిమల్ని ప్రత్యక్షంగా చూపించాలని కోరితే మాత్రం చూపిస్తారు. ఇలాంటి ముఠాలు బియ్యాన్ని తమదైన శైలిలో అన్నంగా వండటం ద్వారా రైస్ పుల్లింగ్ చేసేలా చేస్తారు. బియ్యంలో సన్నని ఇనుప రజను కలిపి బిరుసుగా అన్నం వండుతారు. దీన్ని ఎండబెట్టడం ద్వారా మళ్లీ బియ్యంలా కనిపించేలాగా చేస్తారు. అనంతరం రైస్‌పుల్లర్‌గా పేర్కొనే పాత్ర లోపలి భాగంలో ఎవరికీ కనిపిచంకుండా అయస్కాంతం ఏర్పాటు చేస్తారు. దీంతో ఈ పాత్రకు దగ్గరగా ఇనుప రజనుతో కూడిన బియాన్ని ఉంచితే అది దానికి అతుక్కుంటుంది. ఇలాంటి షోలు చూపించే ఈ మోసగాళ్లు అమాయకులను బుట్టలో వేసుకుంటుంటారని పోలీసులు వివరిస్తున్నారు. సాధారణంగా ఇలాంటి ముఠాలకు చెందిన వారిలో అనేక మంది తొలుత బాధితులుగా మారినవారేనని పోలీసులు చెబుతున్నారు. తాము నష్టపోయిన మొత్తాన్ని తిరిగి అదే మార్గంలో సంపాదించాలనో, అసలు ఈ రైస్‌పుల్లర్లు ఉన్నాయా? లేవా? అనే అధ్యయనం కోసమో అలాంటి ముఠాలతో జట్టుకడుతున్నారు. ఒకసారి తేలిగ్గా డబ్బు వచ్చిపడిన తర్వాత అదే దందా కొనసాగించేస్తున్నారు. ప్రధానంగా తమిళనాడు, కర్ణాటకతో పాటు ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో రైస్ పుల్లింగ్, డబుల్ ఇంజిన్‌గా పిలిచే రెండు తలల పాములతో మోసాలు చేసే ముఠాలు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దొంగ సర్టిఫికేషన్లు రైస్ పుల్లింగ్ ముఠాల్లో కొన్ని ప్రత్యేకంగా కార్యాలయాలు కూడా ఏర్పాటు చేస్తుంటాయి. వాటి కేంద్రంగానే కొన్ని ఉపకరణాలను కలిగి ఉండి ఆయా రైస్‌పుల్లర్స్‌ను పరీక్షించినట్లు నటిస్తూ ఆయా ఉపకరణాలు నిజమైనవనేలా సర్టిఫికేషన్ ఇచ్చేస్తుంటారు. ఇదంతా దాన్ని కొనే వారి ఎదురుగానే జరుగుతుంది. ఇలాంటి ముఠాల చేతిలో మోసపోయిన వారి సంఖ్య పదుల్లో ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితులు ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే ఇకపై ఇంకెవరూ మోసపోకుండా అప్రమత్తం చేసిన వాళ్లవుతారని చెబుతున్నారు. కస్టడీకి తీసుకోవాలని నిర్ణయం పోలీసులు అరెస్టు చేసిన విజయ్‌కుమార్, సాయి భరద్వాజ్, సంతోష్, సురేందర్‌లను కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకుని విచారించాలని అధికారులు నిర్ణయించారు. -
హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠాను గుట్టురట్టు చేసిన నార్కోటిక్ పోలీసులు
-
హాఫీజ్పేట్లో చెడ్డీ గ్యాంగ్ కదలికలు?
హైదరాబాద్: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేసింది. ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మియాపూర్ సీఐ ప్రేమ్‌కుమార్ తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి. హఫీజ్‌పేట వసంత్ విల్లాస్లోని 75వ విల్లాలో రామ్‌సింగ్ కుటుంబం నివాసం ఉంటోంది. రాంసింగ్ కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 6న ఉదయం 10 గంటలకు కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి కామారెడ్డికి వెళ్లాడు. 7వ తేదీన సాయంత్రం ఇంటికి వచ్చి చూసే సరికి ఇంట్లో దొంగతనం జరిగిందని గ్రహించారు. ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించగా గుర్తు తెలియని నలుగురు దొంగలు ఇంట్లోకి వచ్చినట్లు తెలిసింది. అందరు చెడ్డీలపై ఉన్నారు. 6వ తేదీన అర్థరాత్రి ఇంటి వెనక ఉన్న వెంటిలేటర్ అద్దాలను పగులగొట్టి ఇంట్లోకి చొరబడిన చెడ్డీ గ్యాంగ్ ఇంట్లో ఉన్న విలువైన వస్తువులతో పాటు 30 తులాల బంగారు ఆభరణాలు అపహరించినట్లు తెలిపారు. వెంటనే మియాపూర్ పోలీసులకు డాక్టర్ రామ్‌సింగ్ ఫిర్యాదు చేశారు. పోలీసులు క్లూస్ టీమ్‌తో అక్కడికి చేరుకొని పరిశీలించారు. బాధితుడు రామ్‌సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ముమ్మరం చేశామని తెలిపారు. దొంగలు ఇతర రాష్ట్రాలకు చెందినవారుగా గుర్తించారు. సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నామని, బృందాలుగా విభజించి గాలింపు చర్యలు చేపట్టామని త్వరలోనే వారికి పట్టుకుంటామని సీఐ ప్రేమ్‌కుమార్ తెలిపారు. -
కాంగ్రెస్ కూటమి ఒక దోపిడీ ముఠా
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ కూటమి ఒక దోపిడీ ముఠా అని బీజేపీ ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ విమర్శించారు. పార్లమెంటులో ప్రజాసమస్యలు చర్చకు రాకుండా విపక్షా లు వ్యవహరించాయని, మణిపూర్ అంశంపై చర్చలు జరపాలని కాంగ్రెస్ గొడవ చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చిన విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కాంగ్రెస్‌కు తోకపార్టీల్లా వ్యవహరిస్తున్నాయని ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు. శుక్రవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్కు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమని, ప్రజాక్షేత్రంలోనే కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు బుద్ధి చెప్తామని హెచ్చరించారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకు రుణాలు పొందడం నిజం కాదా? అని ప్రశ్నించారు. ప్రధాని సమాధానం కోసం పట్టుబట్టిన విపక్షాల నేతలు ఆయన మాట్లాడుతుంటే లోక్‌సభ నుంచి ఎందుకు పారిపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు. యోధుల త్యాగాలను స్మరించేలా విగ్రహాలు ఎంఐఎం పార్టీ ఒత్తిడికి లోబడి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బత్తిని మొగిలయ్య గౌడ్ వంటి స్వాతంత్య్ర సమరయోధుల చరిత్ర మరుగున పడేలా చేశాయని డాక్టర్ లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో నెహ్రూ, తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబాలవే చరిత్ర అన్నట్లు ఈ రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. గురువారం ఢిల్లీలోని కానిస్టిట్యూ షన్ క్లబ్లో బీజేపీ నాయకుడు తూళ్ల వీరేందర్ గౌడ్ నేతృత్వంలో జరిగిన బత్తిని మొగిలయ్యగౌడ్ వర్ధంతి సభలో కేంద్ర పర్యాటక శాఖ సహాయమంత్రి శ్రీపాద్ నాయక్, ఎంపీ లక్ష్మణ్ పాల్గొని ప్రసంగించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఇలాంటి యోధుల విగ్రహాలు పెట్టడమేకాకుండా, వారి త్యాగాలను స్మరిస్తూ కుటుంబాలకు న్యాయం చేస్తామన్నారు. రజాకార్ల పోకడలను కళ్లకు కట్టేలా సినిమా తీస్తున్న రజాకర్ సినిమా బృందాన్ని ఎంపీ లక్ష్మణ్ అభినందించారు. -
పెట్టుబడుల పేరుతో మోసగిస్తున్న ముఠా అరెస్ట్
-
దొంగల ముఠాపై పోలీసుల కాల్పులు
-
హైదరాబాద్ లో డ్రగ్స్ ఫెడ్లింగ్ గ్యాంగ్ అరెస్ట్
-
థాయ్ లాండ్ లో చికోటి ప్రవీణ్ అరెస్ట్
-
ఏకే-47తో కాల్చి చంపుతాం’.. సంజయ్ రౌత్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపు
ముంబై: ప్రస్తుతం జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా మాదిరిగానే తనను కూడా హిందూ వ్యతిరేకిగా పేర్కొంటూ హత్య చేస్తామని బెదిరించినట్లు సంజయ్ రౌత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ..ఢిల్లీలో కనపడితే, నిన్ను ఏకే-47తో కాల్చి చంపుతా. సిద్దూ ముసావాలాకు పట్టిన గతే నీకు పడుతుందనిని బెదిరించినట్లు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం (ఏక్నాథ్ షిండే) మా క్యాంపు నాయకులకు భద్రత తగ్గించింది. దీని గురించి నేను ఎప్పుడూ లేఖ రాయలేదు, కానీ పదే పదే సీఎం కుమారుడు గూండాలతో మాపై కుట్రకు ప్లాన్ చేసాడు. ఈ నేపథ్యంలో మా భద్రత విషయంగా ఎన్ని సార్లు తెలియజేస్తున్న హోం మంత్రిత్వ శాఖ, వీటన్నింటిని స్టంట్‌గా పరిగణిస్తోంది’ ప్రతిపక్ష నేతల భద్రతను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. బెదిరింపుల గురించి నేను పోలీసులకు తెలియజేశాను. నేను ఎవరికీ భయపడను. నేను జైలులో ఉన్నప్పుడు నాకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయని’ సంజయ్ రౌత్ తెలిపారు. కాగా పంజాబీ గాయకుడు సిద్ధూ మూసావాలా భద్రతను తగ్గించిన తర్వాత గతేడాది మేలో పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో ఆయన్ను కాల్చి చంపిన సంగతి తెలిసిందే. లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ ఈ దాడికి బాధ్యత వహించారు. కాగా..రౌత్ ఫిర్యాదుపై ముంబయి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బెదిరింపులు వచ్చిన ఫోన్ నంబరును ట్రేస్ చేస్తున్నామన్న పోలీసులు.. ఓ అనుమానితుడిని అరెస్టు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. -
ఆయుధాలతో వచ్చి నగల దుకాణం చోరీ.. అంతా క్షణాల్లోనే..
వాషింగ్టన్: అమెరికా కాలిఫోర్నియాలోని సాన్ రేమన్లో జరిగిన ఓ దొంగతనం అధికారులను, స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. ఏడుగురు ఆగంతుకులు ఆయుధాలతో వెళ్లి సిటి సెంటర్ బిషాప్ రాంఛ్ షాపింగ్ సెంటర్ నగల దుకాణాన్ని దోచుకున్నారు. సెక్యూరిటీ గార్డు తలపై తుపాకీ గురిపెట్టి జ్యువెల్లరీ షాపులోకి చొరబడ్డారు. అందరు డోర్స్ లాక్ చేసుకోవాలని సిబ్బందిని బెదిరించారు. అనంతరం సుత్తెతో డిస్ప్లే కేస్ అద్దాలు పగలగొట్టి నగలన్నీ ఎత్తుకెళ్లారు. క్షణాల్లో చోరీని పూర్తి చేసి ఎంచక్కా రెండు కార్లలో పారిపోయారు. ఇలాంటి చోరీ ఘటనను జీవితంలో ఎప్పుడూ చూడలేదని ఓ ప్రత్యక్ష సాక్షి భయాందోళన వ్యక్తం చేశాడు. దొంగల దగ్గర తుపాకులు ఉన్నాయని, రెండు కార్లు ముందే పార్కు చేసుకుని చోరీ అనంతరం వాటిలో పారిపోయారని పేర్కొన్నాడు. గుంపుగా వచ్చి దుకాణంలోకి సెకన్లలో చొరబడ్డారని వివరించాడు. ఈ సమయంలో తాను పక్కనే రెస్టారెంట్లో ఉన్నానని, వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించినట్లు వివరించాడు. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. దొంగతనం జరగడంతో షాపును శనివారం మూసివేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. నిందితులను గుర్తించేందుకు సీసీ కెమెరాలు పరిశీలించారు. చదవండి: ఈక్వెడార్‌లో భారీ భూకంపం.. 14 మంది మృతి.. -
కొండగట్టు ఆలయ ఆభరణాల చోరీ కేసులో ముందడగు
-
కాల్‌గర్ల్‌ను బుక్ చేసుకున్నారు.. చివర్లో ఊహించని ట్విస్ట్, ఏమైందో తెలుసా?
బనశంకరి(బెంగళూరు): బెంగళూరు నగరంలో కాల్‌గర్ల్ పేరుతో డబ్బులు దండుకుంటున్న ముఠాను పోలీసులు పట్టుకుని కటకటాల వెనుక నెట్టారు. కేసుకు సంబంధించి యువతితో పాటు మొత్తం ఏడుగురిని బేగూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 17న అర్ధరాత్రి బన్నేరుఘట్ట రోడ్డు దేవర చిక్కనహళ్లి వద్ద యువతితో మంజునాథ్, రజనీకాంత్ నిలబడ్డారు. ఈ సమయంలో అక్కడికి నాలుగు బైకుల్లో వచ్చిన గ్యాంగ్ కారును డీకొట్టారని మంజునాథ్, రజనీకాంత్‌తో గొడవకు దిగారు. అనంతరం కొద్దిక్షణాల్లో వచ్చిన మరికొందరు వీరి కారులోనే కిడ్నాప్ చేశారు. కోళిఫారం గేట్ వద్ద మంజునాథ్ కిడ్నాపర్ల నుంచి తప్పించుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. కిడ్నాప్ విషయం అలర్ట్ అయిన పోలీసులు సమాచారం ఆధారంగా అపహరణకు గురైన రజనీకాంత్‌ను కాపాడారు. ప్రముఖ ఆరోపి తిరుమలేశ్‌తో పాటు నవీన్, కెంపరాజు, ముఖేశ్, మంజునాథ్, దలి్వర్సావుద్, యువతిని అరెస్ట్ చేశారు. పోలీసుల దర్యాప్తులో యువతి కాల్‌గర్ల్ అనే విషయం తెలిసింది. కిడ్నాపర్లకు సమాచారం ఇచ్చిన ముఠా యువతి: మంజునాథ్, రజనీకాంత్ యువతిని బుక్ చేశారు. అర్దరాత్రి ఇంటికి వెళుతున్న సమయంలో కిడ్నాప్‌నకు గురయ్యారు. యువతి ముందే వీరు ఉన్న స్థలం గురించి కిడ్నాపర్లకు సమాచారం అందించింది. ముగ్గురు కలిసి నిర్జీన ప్రాంతంలో ఉండగా వచ్చిన ముఠా ఇద్దరిని అపహరించారు. మంజునాథ్, రజనీకాంత్ ముందు యువతి కూడా అపహరణకు గురైనట్లు నటించింది. అన్ని అనుకున్న ప్రకారం యువతి, ఆమె గ్యాంగ్ ఇద్దరిని అపహరించారు. కానీ కారు కోళీఫారం గేట్ వద్దకు వెళ్లగానే మంజునాథ్ తప్పించుకుని పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి కిడ్నాప్ విషయం తెలిపాడు. అపహరించిన కిడ్నాపర్లు మండ్య, మైసూరు ద్వారా నంజనగూడుకు వెళ్లారు. రజనీకాంత్ విడుదలకు రూ.5 లక్షలు రూపాయలు డిమాండ్ చేశారు. ప్రస్తుతం కిడ్నాపర్లు అందరిని బేగూరు పోలీసులు అరెస్ట్ చేశారు. చదవండి భర్తకు షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన భార్య.. అసలేం జరిగింది? -
పంజగుట్టలో అర్ధరాత్రి గ్యాంగ్ హల్చల్.. యువకుడిపై 15 మంది దాడి
పంజగుట్ట: పంజగుట్టలో అర్ధరాత్రి 15 మంది యువకులు కార్లల్లో వచ్చి హల్చల్ చేశారు. ఓ యువకునిపై విచక్షణారహితంగా దాడి చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. ఖమ్మంకు చెందిన ఇస్లావత్ జయరామ్ నార్సింగ్‌లో నివాసముంటాడు. ఖమ్మంలో ఇతను ఉండే ఏరియాలోనే దేవరగట్టు శ్రీరామ్ అలియాస్ శ్రీధర్ ఉంటాడు. వీరిద్దరికీ పడదు. తరచూ గొడవలు జరుగుతుంటాయి. గత ఆరు నెలలక్రితం గుజరాత్లో శ్రీరామ్‌ను మనుషులను పెట్టి కొట్టించాడు జయరామ్. దీంతో కక్ష పెంచుకున్న శ్రీరామ్ ఎప్పుడు చాన్స్ దొరికినా జయరామ్ అంతుచూడాలనుకున్నాడు. శనివారం రాత్రి శ్రీరామ్ జయరామ్‌కు ఫోన్‌చేసి అమీర్‌పేట వద్ద ఉన్నాను దమ్ముంటే ఇక్కడకు రా అని ఛాలెంజ్ చేశాడు. దీంతో పంజగుట్ట ప్రాంతంలోనే ఉన్న జయరామ్ భయపడి అతని స్నేహితులు కౌశిక్, అభిలాష్లను పిలిపించుకుని ముగ్గురూ కలిసి యాక్టీవా ద్విచక్రవాహనంపై పంజగుట్ట మెట్రోమాల్ ముందునుండి వెలుతున్నారు. వీళ్లు ఇక్కడ ఉన్నట్లు తెలుసుకున్న శ్రీరామ్ అర్ధరాత్రి 12:30 ప్రాంతంలో 15 మందితో కలిసి కార్లల్లో వచ్చి జయరామ్‌పై విచక్షణరహితంగా దాడి చేశారు. స్థానికులు ఎంత అడ్డగించినా వినకపోవడంతో జయరామ్ స్నేహితులు పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదుచేశారు. వెంటనే పోలీసు పెట్రోకార్ అక్కడకు వెళ్లగానే జయరామ్‌ను వారి కారులో ఎక్కించేందుకు యత్నిస్తున్న శ్రీరామ్ గ్యాంగ్ అక్కడనుండి పారిపోయారు. పోలీసులు వారిని పట్టుకునేందుకు యత్నించినా ప్రయోజనం లేకపోయింది. జయరామ్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు చికిత్స అందించారు. అతని నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. చదవండి: ఖా‘కీచకులు’! విచక్షణ మరిచి సహోద్యోగులనే వేధిస్తున్న అధికారులు -
బాధితులా..? నిందితులా..? విచిత్రమైన ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: ‘బోగస్’ కరెన్సీతో హవాలా వ్యాపారం చేసిన కోల్‌కతాలో స్థిరపడిన రాజస్థాన్ గ్యాంగ్ చేతిలో మోసపోయిన నగర వ్యాపారులు మహ్మద్ యూనుస్, వెంకట శర్మ విషయంలో నగర పోలీసులకు కొత్త సందేహాలు వస్తున్నాయి. ఈ ఎపిసోడ్లో వీళ్లను బాధితులుగా భావించాలా..? నిందితులుగా పరిగణించాలా..? అనే అంశంపై మల్లగుల్లాలు పడుతున్నారు. అక్రమద్రవ్య మార్పిడికి పాల్పడటం, పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేయడం వంటి చర్యల కారణంగా అధికారులు చట్ట ప్రకా రం తదుపరి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. భారీ మొత్తం నగదు రూపంలో... డీమానిటైజేషన్ తర్వాత అమలులోకి వచ్చిన నిబంధనల ప్రకారం ఏ లావాదేవీలో అయినా రూ.2 లక్షలకు మించి నగదు రూపంలో మార్పిడి జరగకూడదు. ఆదాయపు పన్ను శాఖ సాధారణ ప్రజల కంటే వ్యాపారుల విషయంలో దీన్ని నిశితంగా గమనిస్తుంటుంది. ఈ కేసులో బాధితులుగా ఉన్న వారిలో మహ్మద్ యూనుస్ నాంపల్లిలోని మెజిస్టిక్ హోటల్లో భాగస్వామిగా ఉండగా, వెంకట్ శర్మ మాదాపూర్‌లో ఐకాన్ టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలను నిర్వహిస్తున్నారు. వీరిని కన్హయ్య లాల్ నేతృత్వంలోని బృందం గతేడాది డిసెంబర్ 24, 26 తేదీల్లో మోసం చేసి రూ.30 లక్షలు, రూ.50 లక్షలు చొప్పున కాజేసింది. వ్యాపారులు ఈ స్థాయిలో నగలు లావాదేవీలు చేయడం నిబంధనలకు విరుద్ధం. అప్పు పేరుతో తప్పుడు ఫిర్యాదు... కన్హయ్య లాల్ గ్యాంగ్ చేతిలో మోసపోయిన ఈ ద్వయం నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ సందర్భంలో ఎక్కడా కూడా హవాలా దందా విషయం పేర్కొనలేదు. కన్హయ్య లాల్, రామావతార్, భరత్‌కుమార్, రామకృష్ణ శర్మలు తమ నుంచి అప్పుగా డబ్బు తీసుకోవడం కొన్నాళ్లుగా సాగుతోందని పేర్కొన్నారు. కొన్ని రోజుల అవసరానికి వాడుకుని ఆపై తిరిగి ఇస్తుంటారని, గతేడాది డిసెంబర్లో ఇలానే రూ.80 లక్షలు తీసుకుని నకిలీ నోట్లు ఇచ్చారని తప్పుడు ఫిర్యాదు చేశారు. దీంతో ఇవే ఆరోపణలపై కేసులు నమోదయ్యాయి. నిందితులను పట్టుకుని, విచారించిన తర్వాతే పోలీసులకు అసలు విషయం తెలిసింది. భారీ మొత్తం నగదు లావాదేవీలపై ఆదాయపు పన్ను శాఖకు సమాచారం ఇవ్వాల్సి ఉంది. పోలీసులకు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఫిర్యాదు చేసినందుకు కోర్టు అనుమతితో ఇరువురిపై ఐపీసీలోని 182 సెక్షన్ ప్రకారం కేసు నమోదుకు ఆస్కారం ఉంది. ఈ అంశాలపై ఉన్నతాధికారులు న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నారు. తెలివిగా వ్యవహరించిన నిందితులు... ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న కన్హయ్య లాల్ సహా నలుగురు చాలా తెలివిగా వ్యవహరించారు. నగర వ్యాపారులను మోసం చేయాలని పథకం వేసుకున్న వీళ్లు దాని కోసం నకిలీ కరెన్సీ తయారు చేయలేదు. అలా చేస్తే ఈ కేసులు ఐపీసీలోని 489 సెక్షన్ కింద నమోదవుతాయి. దాంతో తీవ్రత పెరిగిపోవడంతో పాటు గరిష్టంగా పదేళ్ల శిక్షపడే అవకాశం ఉంది. ఈ విషయం తెలిసిన నలుగురూ నకిలీ కరెన్సీకి బదులు ‘బోగస్’ది తయారు చేశారు. కలర్ జిరాక్సు తీసిన రూ.2 వేలు, రూ.500 నోట్లను కరెన్సీ సైజులో కట్ చేసిన తెల్లకాగితాలకు అటు–ఇటు పెట్టారు. మధ్యలో ఉన్న కాగితాలకు కనిపించే చివర్లలో మాత్రం కరెన్సీ రంగు పూశారు. ఈ కారణంగానే కేసులు కేవలం ఐపీసీలోని 420 (మోసం) సెక్షన్ కింద నమోదయ్యాయి. దీని తీవ్రత తక్కువ కావడంతో పాటు నేరం నిరూపితమైనా శిక్ష ఏడేళ్ల వరకే ఉంటుంది. ఫలితంగా బెయిల్ తర్వగా లభిస్తుంది. (చదవండి: నాకిప్పుడే పెళ్లి వద్దు సార్ అంటూ పోలీసులకు వీడియో.. పెళ్లిలో ట్విస్ట్) -
కుప్పంలో పచ్చ బ్యాచ్ వీరంగం
-
హైదరాబాద్ లో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు
-
సీబీఐ అధికారులమని చెప్పి రైడ్.. రూ.30 లక్షలు దోచుకెళ్లిన గ్యాంగ్..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ భవానిపుర్‌లో ఓ ముఠా సినీ ఫక్కీలో చోరీకి పాల్పడింది. సీబీఐ అధికారులమని చెప్పి ఓ వ్యాపారవేత్త ఇంటిపై రైడ్ చేసింది. ఇల్లంతా సోదాలు చేసి రూ.30 లక్షల నగదు, ఆభరణాలు దోచుకెళ్లింది. 7-8 మంది పురుషులు కలిసి ఈ దోపిడీకి పాల్పడినట్లు బాధితుడు తెలిపాడు. వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. నకిలీ సీబీఐ అధికారుల చేతిలో మోసపోయి ఈ వ్యాపారవేత్త పేరు సురేష్ వాధ్వా(60). ఏడెనిమిది మంది మూడు కార్లలో సోమవారం ఉదయం 8గం.లకు తన ఇంటికి వచ్చారని చెప్పాడు. వాళ్ల వాహనాలపై పోలీస్ స్టిక్కర్లు ఉన్నాయని పేర్కొన్నాడు. సీబీఐ అధికారులమని చెప్పి ఇంట్లోకి వచ్చారని, ఐడీ కార్డు అడిగినా చూపించలేదని వివరించాడు. ఈ గ్యాంగ్ ఇల్లంతా సోదాలు చేసి రూ.30లక్షల నగదు, కొన్ని లక్షల విలువైన బంగారాన్ని గుర్తించి సీజ్ చేసినట్లు చెప్పారని సురేష్ తెలిపాడు. ఏమేం సీజ్ చేశారనే లిస్ట్‌తో పాటు, విచారణకు హాజరు కావాలని సమన్లు కూడా తర్వాత పంపిస్తామని చెప్పి ఆ ముఠా వెళ్లిపోయిందని పేర్కొన్నాడు. తాను మోసపోయానని తెలిసి వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు చెప్పుకొచ్చాడు. అయితే ఈ దోపిడీలో సురేశ్ సన్నిహితులు లేదా అతనికి బాగా తెలిసిన వాళ్ల ప్రమేయం ఉండి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీటీవీలను పరిశీలించి ఆ మూడు కార్ల వివరాలు తెసుసుకుని నిందితుల కోసం గాలిస్తామన్నారు. చదవండి: షాకింగ్.. ఆస్పత్రి నుంచి అంబులెన్స్ దొంగిలించిన బాలుడు -
గ్యాంగ్ నుంచి వెళ్లిపోయాడని..కిడ్నాప్ చేసి బట్టలూడదీసి...
సాక్షి, రాజేంద్రనగర్: గ్యాంగ్ నుంచి వెళ్లిపోయి తమపైనే దుష్ప్రచారం చేస్తావా అంటూ ఓ రౌడీషీటర్ తన అనుచరులతో కలిసి ఓ యువకుడిని కిడ్నాప్ చేసి బట్టలూడదీసి చితకబాదిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గతంలో రెండు సార్లు సదరు యువకుడిపై ఇదే గ్యాంగ్ దాడికి పాల్పడింది బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన స్పందించకపోవడంతో వారు మరోసారి తెగబడ్డారు. రౌడీషీటర్‌తో పాటు అతడి అనుచరులు యువకుడిని కొడుతున్న దృశ్యాలను వీడియో తీసి తమ సెల్‌ఫోన్ స్టేటస్‌లలో పోస్టు చేసుకోవడం గమనార్హం. తమతో ఎవరైనా పెట్టుకుంటే తమను కాదంటే ఇదే గతి పడుతుందంటూ హెచ్చరికలు జారీ చేశారు. రాజేంద్రనగర్ పోలీసులు, బాధితుడి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సన్‌సిటీ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఇర్ఫాన్ ట్యాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతను గతంలో రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ రౌడీïÙటర్ ఇర్ఫాన్‌తో సన్నిహితంగా ఉండే వాడు. అతడి గ్యాంగ్‌లో తిరుగుతూ గొడవలు పడేవాడు. దీంతో తల్లిదండ్రులు మహ్మద్ ఇర్ఫాన్‌ను మందలించి ట్యాక్సీ కోనుగోలు చేసి ఇచ్చారు. గత 8 నెలలుగా ట్యాక్సీ నడుపుకుంటున్న ఇర్ఫాన్ ఇంటి వద్దే ఉంటున్నాడు. దీంతో రౌడీషీటర్ ఇర్ఫాన్ తన గ్యాంగ్ నుంచి వెళ్లిపోయినందుకు రూ.50 వేలు ఇవ్వాలని అతడికి ఫోన్‌చేసి బెదిరిస్తున్నాడు. రెండు సార్లు ఇంటి వద్దకు వచ్చి గొడవపడి దాడి చేశాడు. రెండు నెలల క్రితం అతడిపై దాడి చేయడంతో బాధితుడి సోదరుడు రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మంగళవారం రాత్రి మహ్మద్ ఇమ్రాన్ తన కారును లంగర్‌హౌజ్‌లో సరీ్వసింగ్‌కు ఇచ్చి ఇంటికి వచ్చేందుకు వేచి ఉన్నాడు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన రౌడీషీటర్ ఇర్ఫాన్ అతడి స్నేహితులు జహీర్, షహీన్‌షా, ముదస్సర్, ఫవాద్‌లు మహ్మద్ ఇర్ఫాన్‌ను మాట్లాడేది ఉందంటూ ఆటోలో బలవంతంగా ఎక్కించుకుని కిస్మత్పూర్ దర్గా సమీపంలోని శ్మశానవాటిక వద్దకు తీసుకువెళ్లారు. అక్కడే అతడి దుస్తులు విప్పించి బెల్టులు, కర్రలతో చితకబాదారు. ఈ దృశ్యాలను తమ సెల్ఫోన్లలో చిత్రీకరించారు. రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజాము వరకు మహ్మద్ ఇర్ఫాన్‌పై దాడి చేసి అనంతరం సన్‌సిటిలోని ఇంటి వద్ద వదిలి వెళ్లారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించడంతో ఎవరికీ చెప్పలేదు. రౌడీషీటర్ గ్యాంగ్ రికార్డు చేసిన దృశ్యాలను తమ సెల్‌ఫోన్ స్టేటస్‌లతో పాటు గ్రూప్‌లలో పోస్టులు చేశారు. తమతో విభేదించినా, తమతో పెట్టుకున్న వారికి ఇదే గతి పడుతుందని కామెంట్ చేశారు. ఈ క్లిప్పింగ్ చూసిన మహ్మద్ ఇర్ఫాన్ సోదరుడి స్నేహితుడు సమాచారం అందించడంతో అతను మహ్మద్ ఇర్ఫాన్‌ను నిలదీశాడు. అప్పటికే గాయాలతో బాధపడుతున్న మహ్మద్ ఇర్ఫాన్‌ను రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేసి ఉషామోహన్ ఆసుపత్రికి తరలించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు స్పందించి ఉంటే... గతంలో మహ్మద్ ఇర్ఫాన్‌పై రౌడీషీటర్ ఇర్ఫాన్ గ్యాంగ్ దాడి చేసి బెదిరించింది. ఈ విషయాన్ని రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదని బాధితుడి సోదరుడు ఆరోపించారు. అప్పుడే స్పందించి ఉంటే ఈ సంఘటన జరిగేది కాదన్నాడు. ఇప్పటికైనా రౌడీïÙటర్ ఇర్ఫాన్‌తో పాటు అతడి గ్యాంగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు. (చదవండి: మానవత్వం మరుస్తున్నామా...నిద్రిస్తున్నట్లుగానే పడిపోయారు..కానీ ఒక్కరూ...) -
ఫుల్లుగా తాగి.. అర్ధరాత్రి రెస్టారెంట్‌కు వెళ్లి రచ్చ రచ్చ చేసిన గ్యాంగ్..
బెంగుళూరు: కర్ణాటక బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలో కొందరు ఫుల్లుగా తాగి రచ్చ రచ్చ చేశారు. బుధవారం అర్ధరాత్రి విలేజ్ రెస్టారెంట్‌కు వెళ్లి హల్చల్ చేశారు. రాత్రి 11.20 గం. సమయంలో రెస్టారెంట్లోకి వెళ్లిన ఈ గ్యాంగ్.. తమకు ఫుడ్ కావాలని సిబ్బందిని అడిగారు. అయితే సమయం దాటిపోయిందని, రాత్రి 11.00 గంటలకే ఆర్డర్లు తీసుకుంటామని వాళ్లు బదులిచ్చారు. దీంతో తీవ్ర ఆగ్రహం చెందిన మందుబాబులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. తమ ఆర్డర్ తీసుకోవాలన్నారు. మాటా మాటా పెరగడంతో అది పెద్ద గొడవగా మారింది. ఇరు వర్గాలు పోట్లాడుకున్నాయి. అక్కడున్న కొందరు ఈ ఫైటింగ్ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో తెగ వైరల్‌గా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేశారు. మొత్తం ఐదుగురుని అరెస్టు చేశారు. Brawl at village restaurant in Electronic City, Bangalore. Gang attacks hotel staff as they said last order is at 11pm and you’ve reached at 11:20pm and food can’t be served. 5 arrests made so far, identity of the remaining being ascertained. pic.twitter.com/RBFa4IPwyN — Nagarjun Dwarakanath (@nagarjund) December 1, 2022 చదవండి: మహిళా యూట్యూబర్‌పై ముంబై ఆకతాయిల వేధింపులు.. వీడియో వైరల్.. -
హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం
-
వీళ్లు మాములోళ్లు కాదు.. వయ్యారంగా వచ్చి.. చీరలు దోచి
సాక్షి, హైదరాబాద్: కంచిపట్టు చీరలు చూపించాలని కొందరు, సాదాసీదా చీరలు చూపించాలని మరి కొందరు మహిళలు రెండు గ్రూపులుగా చీరల దుకాణానికి వచ్చి సేల్స్‌మెన్ దృష్టి మరల్చి చీరలతో ఉడాయించిన ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్‌లో వయ్యారి వీవ్స్ పేరుతో చీరల షోరూం కొనసాగుతోంది. ఈ నెల 17న సాయంత్రం కొందరుమహిళలు రెండు గ్రూపులుగా ఈ షాప్‌నకు వచ్చారు. ఒక గ్రూపు మహిళలు కంచిపట్టు చీరలు చూపించాలని సేల్స్‌మెన్‌ను కోరగా ఆయన వాటిని చూపిస్తుండగా కొద్దిసేపటికే మరోగ్రూపు మహిళలు అక్కడికి వచ్చి సాదా చీరలు చూపించాలని కోరారు. సదరు సేల్స్‌మెన్ అటువైపు వెళ్లగానే కంచిపట్టు చీరలు చూస్తున్న మహిళలు వాటిని చాకచక్యంగా దొంగిలించారు. సేల్స్‌మెన్ ఇటు వచ్చిన కొద్దిసేపటికే సాదా చీరలు చూస్తున్న మహిళల బృందం సేల్స్‌మెన్ కళ్లు గప్పి చీరల్ని మూటలో వేసుకున్నారు. ఈ బృందం వెళ్లిపోయిన తర్వాత చీరలు చూడగా స్టాక్ తక్కువగా కనిపించడంతో సీసీ ఫుటేజ్ పరిశీలించగా సేల్స్‌మెన్ దృష్టి మరల్చి ఈ రెండు బృందాలు చీరలు దొంగిలించినట్లు గుర్తించారు. దీంతో షోరూం యజమాని తిరుమల రఘురాం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. -
ఓలా డ్రైవర్‌పై రెచ్చిపోయిన గ్యాంగ్
-
కడుపులో బంగారం మాయం.. భార్య ఫిర్యాదుతో అసలు కథ వెలుగులోకి!
సాక్షి,చెన్నై: కస్టమ్స్ వర్గాల కళ్లుగప్పేందుకు కడుపులో దాచి పెట్టుకొచ్చిన బంగారం బిస్కెట్లలో ఒకటి మాయం అయ్యింది. సినీ ఫక్కీలో సాగిన ఈ అక్రమ రవాణాలో ఓ యువకుడిని స్మగ్లర్లు కిడ్నాప్ చేశారు. ఆ బిస్కెట్ కోసం చిత్ర హింసలు పెట్టారు. చివరికి ముంబై పోలీసులు రంగంలోకి దిగి, ఆయువకుడిని రక్షించారు. ఆదివారం తిరువారూర్‌లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు.. తిరువారూర్‌కు చెందిన హిజాబ్ చెన్నైలో సెల్ ఫోన్ దుకాణం నడుపుతున్నాడు. మిత్రుడు ఔరంగ జేబ్ ద్వారా ముంబై నుంచి చెన్నైకు బంగారం అక్రమంగా తెప్పించుకుంటూ వచ్చాడు. చెన్నై విమానాశ్రయంలో కస్టమ్స్,నిఘా వర్గాల కళ్లు గప్పేందుకు సినీ ఫక్కీలో ఔరంగ జేబు మనుషులు చిన్న చిన్న బంగారం బిస్కెట్లను మింగేసే వారు. చెన్నైకు వచ్చినానంతరం కడుపు శుభ్రం చేయించే మాత్రల ద్వారా వాటిని బయటకు తీసేవారు. ఈ పరిస్థితుల్లో ముంబైకు చెందిన శంకర్ ద్వారా 2 రోజుల క్రితం చెన్నైకు ఇదే తరహాలో బంగారం తీసుకొచ్చారు. అయితే, తీసుకొచ్చిన బంగారంలో ఓ బిస్కెట్ మాయం కావడంతో శంకర్‌ను ఔరంగ జేబు, హిజాబ్, వారి అనుచరుడు విజయ్ కలిసి కిడ్నాప్ చేశారు. తిరువారూర్‌కు తీసుకెళ్లి చిత్ర హింసలు పెట్టారు. కారైక్కాల్‌లోని ఓ స్కాన్ సెంటర్‌కు తీసుకెళ్లి పరిశోధించారు. అయితే, ఆ బంగారం బిస్కెట్ ఏమైందని శంకర్‌ను తీవ్రంగా వేధిస్తున్న నేపథ్యంలో ఆదివారం ఉదయాన్నే ముంబై పోలీసులు రంగంలోకి దిగారు. భార్య ఫిర్యాదుతో.. ముంబైలో ఉన్న శంకర్ భార్య ఇచ్చిన ఫిర్యాదుతో బంగారం అక్రమ రవాణా గుట్టు వెలుగులోకి వచ్చింది. గత కొంతకాలంగా సాగుతున్న ఈ వ్యహారాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్న ముంబై పోలీసులు స్మగ్లర్ల కోసం చెన్నైకు వచ్చారు. ఇక్కడి పోలీసు సాయంతో శంకర్ సెల్ ఫోన్ నంబర్ ఆధారంగా విచారణ వేగవంతం చేశారు. తిరువారూర్‌లో శంకర్ ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో కిడ్నాపర్ల చెర నుంచి అతడిని రక్షించి, ఆస్పత్రికి తరలించారు. ఔరంగ జేబు, విజయ్ను అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నా రు. పరారీలో ఉన్న హిజాబ్ కోసం గాలిస్తున్నారు. చదవండి: ఊర్లో ఆడవాళ్లు, మగవాళ్లు నామీద ఇంత పగతో ఉన్నారా? -
అప్పు చెల్లించలేకపోవడంతో ఇంటిని ఖాళీ చేయించిన వ్యాపారి
-
హైదరాబాద్‌లో కొత్త గ్యాంగ్ హల్చల్
-
ఫ్లిప్‌కార్ట్‌లో కత్తులు కొని.. దోస్త్ కోసం 33 సార్లు పొడిచాడు
సాక్షి, హైదరాబాద్: మారణాయుధాలు కలిగి ఉన్న మైనర్‌తో సహా మరో వ్యక్తిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేసి, జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి రెండు బాకులు, ద్విచక్ర వాహనం, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. వికారాబాద్ జిల్లా, ధరూర్ గ్రామానికి చెందిన మహ్మద్ ఫవాద్ ఖురేషీ పదేళ్ల క్రితం నగరానికి వలస వచ్చాడు. రాజేంద్రనగర్ సన్సిటీలోని పీఅండ్‌టీ కాలనీలో నివాసం ఉంటూ ఆటో నడుపుకుంటున్నాడు. అదే కాలనీకి చెందిన ఓ బాలుడు ఇతని అనుచరుడు. చెడు వ్యసనాలకు బానిసలైన వీరు ఇరువురు దారి దోపిడీలు, హత్యలు చేసి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఫ్లిప్‌కార్ట్ ద్వారా రెండు కత్తలు (డాగర్స్) కొనుగోలు చేశారు. రాత్రి వేళల్లో వాటిని వెంట పెట్టుకొని దారి దోపిడీలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఈనెల 4న వారు ఇద్దరు బైక్‌పై షాహీన్‌నగర్‌లో సంచరిస్తుండగా ఎల్బీనగర్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ), బాలాపూర్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఖురేషీని జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించగా, మైనర్‌ను జువైనల్ బోర్డ్ ఎదుట హాజరుపరిచారు. దోస్త్ కోసం 33 సార్లు పొడిచాడు.. ఫవాద్ ఖురేషీ స్నేహితుడికి అతడి పిన్ని భర్తతో గొడవ జరిగింది. దీంతో బాబాయిని చంపాలని నిర్ణయించుకున్న అతను ఈ విషయాన్ని ఖురేషీకు తెలిపాడు. దీంతో వారు ఇద్దరు కలిసి బాబాయి హత్యకు ప్లాన్ చేశారు. స్నేహితుడు బేస్‌బాల్ కర్రతో బాబాయి తలపై కొట్టగా.. ఖురేషీ 33 సార్లు కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. తాజాగా ఖురేషీ పట్టుబడిన సమయంలో ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు ఈ హత్యపై విచారించగా.. ఆ హత్యలో తాను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని, దోస్త్ కోసమే చంపానని చెప్పడంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు. ఈ కేసులో అరెస్టై ఖురేషీ జైలుకు వెళ్లి గతేడాది డిసెంబర్లో విడుదలయ్యాడు. -
లారెన్స్ బిష్ణోయ్ ముఠా హిట్ లిస్ట్‌లో కరణ్ జోహార్..
పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య బాలీవుడ్లో కలకలం రేపింది. ఈ మర్డర్‌ను గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా పనే అని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో అనేక మందిని అరెస్ట్ చేశారు. వీరిలో లారెన్స్ బిష్ణోయ్ అనుచరుడు సిద్ధేష్ కాంబ్లే కూడా ఉన్నాడు. అయితే సిద్ధేష్ను విచారించిన పోలీసులకు పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. హిందీ చిత్రపరిశ్రమలోని ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్‌ను కిడ్నాప్ చేయాలని ఈ ముఠా అనుకుందట. కరణ్ జోహార్‌ను అపహరించి ఆయన నుంచి రూ. 5 కోట్లకుపైగా డబ్బు రాబట్టాలని ప్లాన్ వేశారట. ప్రస్తుతం ఈ అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, ఆయన తండ్రి సలీమ్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో సల్మాన్‌కు పోలీసులు భద్రత కూడా పెంచారు. ఇంతకుముందు కూడా 2018లో కృష్ణజింకను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్‌కు చంపేస్తామన్నా బెదిరింపులు వచ్చాయి. ఇదంతా చూస్తుంటే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాలీవుడ్‌ను టార్గెట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. చదవండి: 👇 రానున్న 'కాఫీ విత్ కరణ్' షో 7వ సీజన్.. టీజర్ రిలీజ్ మరో పెళ్లి చేసుకోబోతున్న సీనియర్ హీరో నరేష్ ! సినిమా సెట్లో ఇద్దరు నటులు మృతి.. ఆరుగురికి గాయాలు వికటించిన సర్జరీ.. గుర్తుపట్టలేని స్థితిలో హీరోయిన్ -
Banjara Hills: భూకబ్జా ముఠా హల్చల్.. ఎంపీ టీజీ వెంకటేశ్‌పై కేసు
బంజారాహిల్స్(హైదరాబాద్): బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లోని ప్రభుత్వ స్థలంలోకి ఆదివారం కొందరు రౌడీలు మారణాయుధాలతో ప్రవేశించి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ సంఘటనతో సంబంధమున్న రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్, అతని అన్న కుమారుడు విశ్వ ప్రసాద్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో ఏపీ జెమ్స్ అండ్ జ్యువెల్లెర్స్‌కు ప్రభుత్వం 2005లో కేటాయించిన రెండున్నర ఎకరాల్లో అర ఎకరం స్థలాన్ని ఓ వ్యక్తి బోగస్ పత్రాలతో ఆక్రమించుకున్నాడు. తన ఆధీనంలోకి తీసుకున్న ఈ స్థలాన్ని ఎంపీ టీజీ వెంకటేష్ అన్న కుమారుడు విశ్వప్రసాద్‌కు విక్రయించాడు. చదవండి: పరువు హత్య కలకలం.. తాళ్లతో కట్టేసి.. తలపై మేకులు కొట్టి.. విశ్వప్రసాద్ ఆదివారం 80 మంది రౌడీలను మారణాయుధాలతో ఈ ప్రభుత్వ స్థలంలోకి పంపించాడు. వారు ఈ స్థలంలోకి ప్రవేశించి అక్కడున్న సెక్యురిటీ గార్డుల్ని కొట్టి బయటకు తరిమారు. రౌడీమూకల దౌర్జన్యంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న బంజారాహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకుని 62 మంది రౌడీలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మిగిలిన రౌడీలు పరారయ్యారు. ఈ సంఘటనపై బంజారాహిల్స్ పోలీసులు ఎంపీ టీజీ వెంకటేశ్, విశ్వప్రసాద్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఒంటరిగా ఉన్న మహిళతో మాటలు కలిపి.. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి..
సాక్షి,కొత్తూరు(వికారాబాద్): నమ్మకస్తులుగా మెలిగారు.. ఒంటరిగా ఉన్న మహిళతో మాటలు కలిపారు. అదనుచూసి ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి దోపిడీకి పాల్పడ్డారు. ఈ కేసు వివరాలను మంగళవారం కొత్తూరు ఠాణాలో శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి విలేకర్లకు వెల్లడించారు. కొత్తూరు మండలంలోని ఎస్బీపల్లికి చెందిన యోషమోని భారతమ్మ ఈనెల 10న మహిళా సంఘంలో డబ్బులు చెల్లించడానికి నందిగామ మండలం మేకగూడకు బయలుదేరింది. మార్గంమధ్యలో కొత్తూరులోని కల్లు కాంపౌండ్‌లో సాయంత్రం కల్లు తాగడానికి వెళ్లింది. అక్కడ ఆమెను ఫరూఖ్‌నగర్ మండలం ఎలికట్టకు చెందిన జక్కుల శివలింగం(29), కొందుర్గు మండలం విశ్వనాథపురానికి చెందిన చెక్కలి మల్లేష్(26) పరిచయం చేసుకున్నారు. నమ్మకస్తులుగా నటిస్తూ ఎస్బీపల్లిలో దించుతామని తమ బైకుపై ఎక్కించుకున్నారు. పెంజర్ల నుంచి మేకగూడ వైపునకు వెళ్తుండగా ఆమెకు అనుమానం వచ్చి ప్రశ్నించగా తమ వద్ద మద్యం ఉందని తాగి వెళ్దామని తెలిపారు. అప్పటికే పథకం ప్రకారం పెంజర్ల శివారులోని డంపింగ్ యార్డు పరిసరాల్లో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి రాయి, చేతులతో దాడి చేశారు. అనంతరం భారతమ్మ వద్ద ఉన్న రూ.6 వేలు, 10 తులాల వెండి పట్టీలు, 5 మాసాల బంగారు చెవికమ్మలు, పాత నోకియా సెల్‌ఫోన్‌ను లాక్కొని పరారయ్యారు. కొద్దిసేపటికి స్పృహలోకి వచ్చిన ఆమె కొత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు ఈనెల 14న నందిగామ పోలీస్‌స్టేషన్ వద్ద నిందితుల వాహనాన్ని గుర్తించారు. కాంపౌండ్‌లో కల్లు తాగుతున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా దోపిడీ వివరాలు తెలిపారు. 3 బైకులు స్వాధీనం శివలింగంపై షాద్‌నగర్‌తో పాటు పలు ఠాణాలో 12 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితుడి నుంచి 5 కేసుల్లో 3 బైకులు, రూ.4 వేల నగదు, 3.9 గ్రాముల బంగారు కమ్మలు, 9.3 తులాల వెండి పట్టీలు, 60 బంగారు గుండ్ల తాడుతో పాటు బాధితురాలి నోకియా సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్‌గా పనిచేసే శివలింగం జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతుండడంతో అతడిపై పీడీ యాక్టు నమోదుకు పరిశీలిస్తున్నట్లు డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు. కేసు చేధించిన పోలీసులకు ఆయన రివార్డులు అందజేశారు. అపరిచితులతో సహవాసం వద్దు కల్లు దుకాణాలు, బస్టాండు తదితర ప్రాంతాల్లో మహిళలు, ప్రజలకు కొత్తగా తారసపడే అపరిచితులను నమ్మి సహవాసం చేయొద్దని డీసీసీ సూచించారు. వారిని నమ్మితే అన్ని విధాలుగా నష్టపోతారనే విషయాన్ని గ్రహించాలని సూచించారు. సమావేశంలో షాద్‌నగర్ ఏసీపీ కుశాల్కర్, సీఐ బాలరాజు, ఎస్ఐ శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
కరోనా పాజిటివ్ ఉన్నా.. లేనట్లుగా..
సాక్షి,చాంద్రాయణగుట్ట(హైదరాబాద్): వేర్వేరు ఘటనల్లో నకిలీ ఆర్టీపీసీఆర్ నివేదికలు, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను సృష్టిస్తున్న ఆరుగురిని దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పురానీహవేళీలోని తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నగర టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ గుమ్మి చక్రవర్తి వివరాలు వెల్లడించారు. మహబూబ్‌నగర్‌కు చెందిన పి.లక్ష్మణ్(30) పదేళ్ల క్రితం డిప్లోమా పూర్తి చేసి పలు డయాగ్నోస్టిక్ సెంటర్లలో ల్యాబ్ టెక్నిషియన్‌గా పనిచేశాడు. ఏడాది క్రితం ఆస్మాన్‌ఘడ్‌లో ‘హోం కేర్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ సెంటర్’ను ప్రారంభించాడు. ఇటీవల థర్డ్‌వేవ్ ప్రారంభం కావడంతో విమాన, ఇతర రాష్ట్ర ప్రయాణాలకు ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్ తప్పనిసరి చేయడాన్ని లక్ష్మణ్ తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. నాంపల్లికి చెందిన ప్రభాత్ కుమార్ సంఘీ(45) సహకారంతో అవసరమైన వారికి స్వాబ్‌ను పూర్తిస్థాయిలో తీయకుండా (లిక్విడ్ వేయకపోవడం) తను ఒప్పందం చేసుకున్న ల్యాబ్‌లకు పంపి నెగిటివ్ రిపోర్ట్ వచ్చేలా చేసి వినియోగదారులకు ఇచ్చేవాడు. ఇలా ఒక్కో రిపోర్ట్‌కు రూ.2–3 వేల వరకు వసూలు చేస్తున్నాడు. సమాచారం అందుకున్న దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర నేతృత్వంలోని ఎస్సైలు శ్రీశైలం, నరేందర్, మలక్‌పేట పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేసి వీరి వద్ద నుంచి 65 నకిలీ ఆర్టీపీసీఆర్ నివేదికలు, 20 శాంపిల్ కిట్లు, ఒక సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నకిలీ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను సృష్టిస్తూ వ్యాక్సిన్ తీసుకోకున్నా యూపీహెచ్ఎసీ అవుట్ సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్ సహకారంతో నకిలీ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను తయారు చేస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆసిఫ్‌నగర్‌కు చెందిన ల్యాబ్ టెక్నిషియన్ మహ్మద్ తారీఖ్ హబీబ్(28) ఏడాది క్రితం స్థానికంగానే “ఇమేజ్ డయాగ్నోస్టిక్ సెంటర్’ను ఏర్పాటు చేసి నెగెటివ్ రిపోర్ట్లు ఇచ్చాడు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్లు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించాడు. అఫ్జల్‌సాగర్ యూపీహెచ్‌సీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ‘కుమారీ’ అనే అవుట్ సోర్సింగ్ ఉద్యోగితో కలిసి పథకం పన్నాడు. మెహదీపట్నంకు చెందిన గులాం ముస్తఫా షకీల్(48), అబ్దుల్ బషీర్(37), ఇర్ఫాన్ ఉర్ రబ్ అన్సారీ (32)ల సహకారంతో వాటిని అందజేస్తున్నాడు. హుమాయన్‌నగర్ పోలీసులతో కలిసి దాడులు చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. -
యువతి ఫొటోలతో న్యూడ్ ఫొటోలు అప్లోడ్ చేస్తానంటూ..
సాక్షి, హిమాయత్‌నగర్ (హైదరాబాద్): న్యూడ్ ఫొటోలను మార్ఫింగ్ చేసి తన వద్ద నుంచి డబ్బులు స్వాహా చేశారంటూ నగరానికి చెందిన ఓ యువకుడు మంగళవారం సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యువకుడికి చెందిన ఫొటోలను మార్ఫింగ్ చేసి ఫొటో పక్కనే మరో యువతి ఫొటోలను ఉంచి ఓ వ్యక్తి తనను బెదిరించాడని, డబ్బులు ఇవ్వకపోతే స్నేహితులు, బంధువులకు వాట్సాప్‌లో షేర్ చేస్తానని బెదిరించడంతో అతడికి రూ. 2.89 లక్షలు ఇచ్చినట్లు తెలిపాడు. అయినా మరిన్ని డబ్బులు డిమాండ్ చేస్తుండటంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. చదవండి: ఎంత దారుణం.. ఇద్దరు పిల్లలను బావిలో పడేసి.. -
పోలీస్‌స్టేషన్ దగ్గర్లో జంట హత్యలు.. రోడ్డుపై ఒకరిని, ఇంటికెళ్లి మరొకరిని..
సాక్షి, చెన్నై : చెంగల్పట్టులో గురువారం సాయంత్రం 6.30 గంటల సమయంలో పోలీసుస్టేషన్‌కు కూతవేటు దూరంలో జంట హత్యలు జరిగాయి. చెంగల్పట్టు పోలీసుస్టేషన్, పాత బస్టాండ్ పరిసరాలు నిత్యం రద్దీతో ఉంటాయి. అయితే సాయంత్రం 6.30 గంటల సమయంలో అటువైపు వచ్చిన మోటార్ సైకిల్‌పై వచ్చిన ఓ యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు జనం చూస్తుండగానే నరికి చంపేశారు. ( చదవండి: వివాహితతో యువకుడి చాటింగ్.. చివరికి ఇద్దరూ కూడా.. ) అక్కడి నుంచి పరుగులు తీసిన ఆ వ్యక్తులు సమీపంలోని ఓ ఇంట్లోకి చొరబడి, అక్కడ ఉన్న ఓ వ్యక్తిని హతమార్చి పరారయ్యారు. జనం కళ్ల ముందే ఈ హత్యలు జరగడం కలకలం రేగింది. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ వేగవంతం చేశారు. హత్యకు గురైన వారు అప్పు అలియాస్ కార్తికేయన్, అలగేశన్‌గా గుర్తించారు. వీరిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నట్లు తెలిసింది. పాతకక్షల నేపథ్యంలోనే హత్యలు జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
గోల్మాల్ ‘గ్యాంగ్’ ..సీబీఐ అధికారులమంటూ ఫ్లాట్‌లోకి
గచ్చిబౌలి: సూర్య కథానాయకుడిగా నటించిన ‘గ్యాంగ్’ సినిమా గుర్తుందా? అక్రమార్కులను కొల్లగొట్టడానికి కథానాయకుడి నేతృత్వంలోని ముఠా సీబీఐ అధికారుల మాదిరిగా రెచ్చిపోతుంది. అచ్చు అలాంటి ఉదంతమే మధ్యాహ్నం గచ్చిబౌలి ఠాణా పరిధిలోని గేటెడ్ కమ్యూనిటీ జయభేరి ఆరెంజ్ కౌంటీలో జరిగింది. లాకర్లో ఉన్న 1.34 కిలోల బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల నగదుతో పరారయ్యారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. ఆ మాటే నేరగాళ్లకు కలిసొచ్చింది.. రియల్ ఎస్టేట్ సంస్థ భువన తేజ డెవలపర్స్ చైర్మన్ వెంకట సుబ్రహ్మణ్యం ఆరెంజ్ కౌంటీలోని సీ బ్లాక్‌లోని ఫ్లాట్ నంబర్ 110లో భార్య, పిల్లలతో నివసిస్తున్నారు. సీసీ కెమెరాలు, వాచ్‌మన్‌లతో ఈ గేటెడ్ కమ్యూనిటీ నిఘా నీడలో ఉంటుంది. విజిటర్స్ ఎవరైనా వచ్చినప్పుడు ప్రధాన గేటు వద్ద ఉండే వాచ్‌మన్ యజమానిని సంప్రదించిన తర్వాతే పంపిస్తుంటారు. సుబ్రహ్మణ్యం నగర శివార్లలో కొన్ని వెంచర్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిత్యం కొనుగోలుదారులు, బ్యాంకర్లు తదితరులు వచ్చిపోతుంటారు. ఇలా ఎవరు వచ్చినా వాచ్‌మన్ సంప్రదిస్తుండటంతో.. తన కోసం ఎవరైనా వస్తే నేరుగా పంపించాల్సిందిగా గతంలో చెప్పారు. దీంతో సుబ్రహ్మణ్యం కోసమంటూ ఎవరు వచ్చినా వారిని ఫ్లాట్ నం.110కు పంపడం పరిపాటిగా మారింది. పక్కా పథకం ప్రకారం.. సుబ్రహ్మణ్యం ఇంటిని కొల్లగొట్టాలని పథకం వేసుకున్న నేరగాళ్లకు ఇదే అంశం కలిసి వచ్చింది. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో కారులో వచ్చిన నలుగురు వాచ్‌మన్‌తో సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్లాలని చెప్పారు. దీంతో అతడు వారిని లోపలకు పోనిచ్చాడు. 1.10 గంటలకు ఫ్లాట్ నం.110కు వెళ్లిన నేరగాళ్లు తలుపు కొట్టారు. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న డ్రైవర్ స్వామి నాయుడు వెళ్లి తలుపు తీశారు. తాము సీబీఐ ఏజెంట్లమని సుబ్రహ్మణ్యం భార్య భాగ్యలక్ష్మికి చెప్పిన నలుగురూ నకిలీ గుర్తింపుకార్డులు చూపిస్తూ బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించారు. ఆ వెంటనే భాగ్యలక్ష్మితో పాటు డ్రైవర్ వద్ద ఉన్న మూడు సెల్ఫోన్లు తమ అధీనంలోకి తీసుకున్నారు. భాగ్యలక్ష్మితో పాటు ఆమె ముగ్గురు సంతానం, డ్రైవర్‌ను హాలులోనే కదలకుండా కూర్చోబెట్టారు. ఆదాయపు పన్ను బకాయిలంటూ... సీబీఐ అధికారుల పేరుతో ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు భాగ్యలక్ష్మితో ఆమె భర్త ఆదాయపు పన్ను శాఖకు రూ.18 కోట్లు బాకీ పడ్డారని, ఈ నేపథ్యంలోనే సోదాల కోసం వచ్చామంటూ చెప్పారు. ఇద్దరు దుండగులు హాలులోనే కాపలా ఉండగా.. మిగిలిన ఇద్దరూ నేరుగా పడక గదిలోకి వెళ్లారు. అక్కడ ఉన్న హ్యాండ్ బ్యాగ్ నుంచి లాకర్ తాళాలు తీసుకున్నారు. వాటితో లాకర్ తెరిచి అందులో ఉన్న 1.34 తులాల బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల నగదు తీసుకుని ఉడాయించారు. ఈ వ్యవహారం మొత్తం 25 నిమిషాల్లో పూర్తయింది. బాధితురాలు తన భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పగా... సీబీఐ ఏజెంట్లు అయితే బంగారు నగలు తీసుకొని ఎందుకు వెళతారంటూ ఆయన ప్రశ్నించారు. దీంతో జరిగిన వ్యవహారం గుర్తించి సాయంత్రం 5 గంటలకు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భీమవరంలో చిక్కిన నిందితులు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు ఎంట్రీ వద్ద సుబ్రహ్మణ్యం పేరు చెప్పి వెళ్లడంతో పాటు తెలుగులో స్పష్టంగా మాట్లాడటంతో పరిచయస్తుల పనిగా అనుమానించారు. బాధితుల వివరాలు తెలిసిన వాళ్లే వెనుక ఉండి దుండగులతో కథనడిపి ఉంటారని అంచనా వేశారు. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన వివరాల ఆధారంగా దుండగులు కారులో వచ్చారని, నంబర్ ప్లేట్ లేదని తేల్చారు. దాని డ్రైవర్ రోడ్డు పైనే ఆగిపోగా నలుగురు మాత్రం కౌంటీలోని ప్రవేశించినట్లు నిర్ధారణైంది. పలు ప్రాంతాల్లోని సీసీ పుటేజ్ పరిశీలించిన పోలీసులు ఆ కారు ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా విజయవాడ వైపు వెళ్లినట్లు గుర్తించారు. దీంతో పాటు సాంకేతిక ఆధారాలతో ముందుకు వెళ్లిన సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు నిందితులను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పట్టుకున్నారని తెలిసింది. (చదవండి: ప్రెగ్నెన్సీ టైంలో కరోనా రావడంతో కోమాలోకెళ్లింది..! అప్పటికే..) -
‘గ్యారెంటీ’ కోసం డీఎస్పీని సృష్టించాడు!
సాక్షి, హైదరాబాద్: వ్యాపారంలో పెట్టుబడుల పేరుతో నగరవాసిని మోసం చేసిన ముఠా అందుకు ‘గ్యారెంటీ’ కోసం ఓ నకిలీ డీఎస్పీని సృష్టించింది. వీరి చేతిలో రూ.1.2 కోట్ల మోసపోయిన బాధితుడు నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీన్ని దర్యాప్తు చేస్తున్న అధికారులు నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. మెహిదీపట్నానికి చెందిన సునీల్‌కుమార్ 2018 డిసెంబర్లో జయప్రతాప్ అనే వ్యక్తిని కలిశాడు. (చదవండి: క్రిస్మస్ చెట్టుని అలకరించాలనుకుంటున్నారా!.... తస్మాత్ జాగ్రత్తా!!) అప్పట్లో జయప్రతాప్ తన వద్ద రూ. 1.2 కోట్లు పెట్టుబడి పెడితే వ్యాపారం చేసి, వారం రోజులో రూ. 3 కోట్లు ఇస్తానంటూ చెప్పాడు. అతడి మాటలను సునీల్ పట్టించుకోలేదు. దీంతో దాదాపు ఏడాది తర్వాత మరోసారి జయప్రతాప్ హిమాయత్‌నగర్‌లోని సునీల్ కార్యాలయానికి వెళ్లాడు. ఆ సమయంలో మునిరామయ్య అనే వ్యక్తినీ వెంట తీసుకువెళ్లాడు. మునిరామయ్య తిరుపతిలో సీఐడీ విభాగం డీఎస్పీగా పనిచేస్తున్నారని, పెట్టుబడికి ఆయన గ్యారంటీగా ఉంటాడని చెప్పి సునీల్‌ను ఒప్పించాడు. దీంతో పాటు రూ.3 కోట్లకు రాసిన చెక్కులు, ఖమ్మంలో ఉన్న ఓ భూమికి సంబంధించిన పత్రాలు ఇవ్వడంతో జయప్రతాప్‌కు 2019 నవంబర్‌లో రూ.1.2 కోట్లు ఇచ్చాడు. ఎంతకూ తనకు రావాల్సిన డబ్బును జయప్రతాప్ ఇవ్వకపోవడం, అతడి ఆచూకీ లేకపోవడంతో మునిరామయ్యను సంప్రదించాలని సునీల్ భావించారు. ఏపీ సీఐడీ విభాగంలో ఆరా తీయగా... ఆ పేరుతో ఏ అధికారీ లేరని తేలింది. దీంతో జరిగిన మోసం తెలుసుకున్న బాధితుడు ఇటీవల సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు నిందితుల కోసం గాలిస్తున్నారు. (చదవండి: వామ్మో!... రూ. 7 లక్షలు టిప్పా!!... షాక్‌కి గురైన వెయిటర్!) -
స్థానిక మహిళతో వివాహం.. రాత్రి పూట బయటి కాలనీల్లో తిరుగుతూ..
సాక్షి, హైదరాబాద్: రాత్రి పూట రెక్కీ నిర్వహిస్తారు. పార్కింగ్ చేసిన కార్లను అపహరిస్తారు. రాత్రికి రాత్రే మహారాష్ట్రకు తీసుకెళ్లి విక్రయిస్తారు. ఈ అంతర్రాష్ట్ర ఆటోమొబైల్ గ్యాంగ్‌ను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. ముఠాలోని ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.50 లక్షల విలువైన 8 కార్లను స్వాధీనం చేసుకున్నారు. వివరాలను మల్కాజిగిరి డీసీపీ రక్షితకే మూర్తి, డీసీపీ క్రైమ్స్ యాదగిరిలతో కలిసి రాచకొండ పోలీస్ కమిషనరేట్ అడిషనల్ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. ► మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన ఉదయ్ మారుతీ పాటిల్, ఫర్మాల్ అలీఖాన్, ఇమ్రాన్ ఖాన్ పఠాన్, సోహ్రబ్ అలీ, యెవరుల్లా ఖాన్, సంతోష్ జగన్నాథ పవార్ ముఠాగా ఏర్పడ్డారు. ఇమ్రాన్ ఖాన్ పఠాన్ (36) కుషాయిగూడ హెచ్‌బీ కాలనీలో స్థానికంగా ఓ మహిళను పెళ్లి చేసుకొని ఇక్కడే ఉంటున్నాడు. ► రాత్రిపూట కాలనీల్లో తిరుగుతూ బయట కార్లు ఎక్కడ పార్క్ చేశారు? కెమెరాలు ఉన్నాయా? రాత్రి వేళల్లో జన సంచారం ఉంటుందా? వంటి వాటిపై రెక్కీ నిర్వహించి.. సమాచారాన్ని మహారాష్ట్రల్లోని తన గ్యాంగ్‌కు చేరవేస్తాడు. ► సమాచారం అందుకున్న ఉదయ్ మారుతీ పాటిల్ ప్లాన్ చేసి.. అనుచరులను రంగంలోకి దింపుతాడు. ఇమ్రాన్‌ఖాన్ సూచించిన ప్రాంతంలో రాత్రికి వెళ్లి కార్‌ను చోరీ చేస్తారు. ► మారుతీ స్విఫ్ట్, హోండా ఐ 10, అమేజ్ కార్లను మాత్రమే వీళ్లు లక్ష్యంగా చేసుకుంటారు. రిపేరు లేదా స్క్రాప్‌లో వచ్చిన కార్ల నంబర్ ప్లేట్లను తీసుకొని అలాంటి రంగు ఉండే కార్లనే చోరీ చేస్తారు. వాటికి అసలు కార్ నంబర్ ప్లేట్‌ను తగిలించి కస్టమర్‌కు విక్రయిస్తారు. ► వీళ్ల ప్రత్యేక మెకానిజం కారణంగా కార్ డోర్‌ను ఓపెన్ చేసినప్పుడు అలారం కూడా మోగదు. కారు డోర్‌ను ఓపెన్ చేసి నకిలీ తాళం చెవితో స్టార్ట్ చేసి రాత్రికి రాత్రే మహారాష్ట్రకు తరలిస్తారు. అక్కడికి వెళ్లాక కారు ఇంజిన్, చాసిస్ నంబర్లను మార్చేస్తారు. ఒక్కో కారుకు రూ.2 లక్షల నుంచి 3 లక్షల లాభం చూసుకొని విక్రయిస్తుంటారు. ► ఈ గ్యాంగ్ ఐదేళ్లుగా వేర్వేరు రాష్ట్రాల్లో చోరీలు చేస్తోంది. ఇప్పటివరకు తెలంగాణ, ఏపీతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 50కి పైగా కార్లను చోరీ చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ► ఇద్దరు నిందితులు ఇమ్రాన్‌ఖాన్ పఠాన్, సంతోష్ జగన్నాథ పవార్లను కస్టడీకి తీసుకొని లోతుగా విచారణ చేస్తే అసలు ఎన్ని కార్లు దొంగిలించారు? ఎవరెవరికి విక్రయించారో బయటపడుతుందని మల్కాజిగిరి డీసీపీ రక్షిత కే మూర్తి తెలిపారు. చదవండి: నాలుగేళ్ల క్రితం వివాహం.. పురుగులమందు తాగిన వివాహిత -
టీడీపీనేత బాగోతం.. మోసగాళ్ల వలలో ‘అమ్మతనం’
సాక్షి, పెందుర్తి(విశాఖపట్నం): ఓ బిడ్డ పుడతాడు. నవ మాసాలు మోసి, కన్న అమ్మ ఆ బిడ్డను కనీసం చూసుకోలేదు. కళ్ల ముందు కదలాడకుండానే ఆ బిడ్డ మరో అమ్మ చేతిలోకి వెళ్లిపోతాడు. ఎందుకంటే ఆ బిడ్డను కన్న అమ్మ ఓ అనాథో, ఓ మానసిక వ్యాధిగ్రస్తురాలో అయి ఉంటుంది. లేదంటే ఎవరి చేతిలోనో మోసపోయి అవాంఛిత గర్భం దాల్చిన బాధితురాలు అయి ఉంటుంది. బిడ్డ ఏదీ అని అడిగితే.. ‘నీకెందుకు’ అంటూ ఆమె మొహం మీద నాలుగు నోట్లు వేసి పోతారు. వారు మాత్రం లక్షలు జేబుల్లో వేసుకుంటారు. సృష్టిలో ఎంతో పవిత్రమైన అమ్మతనాన్ని నడిరోడ్డుపై అమ్మేస్తున్న ఓ ముఠా సాగిస్తున్న దందా ఇది. ఇప్పటివరకు 20 మందికి పైగా బిడ్డలను ఈ విధంగా అమ్మేసినట్లు సమాచారం. విశాఖలో ఓ తెలుగుదేశం పార్టీ నేత అండదండలతో ఆ పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్య కార్యకర్తలు, ఓ మహిళా నేత, వైద్య శాఖకు చెందిన ఓ చిరుద్యోగిని ఆధ్వర్యంలో ఈ దందా సాగుతోందని జిల్లా పోలీసులు గుర్తించారు. పెందుర్తి కేంద్రంగా సాగుతున్న ఈ అనైతిక వ్యాపారం గుట్టును రట్టు చేశారు. ప్రధాన సూత్రధారులు, టీడీపీ ముఖ్య కార్యకర్తలైన ముగ్గురిని, వైద్య శాఖ ఉద్యోగినిని అరకు పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారిస్తున్నట్లు తెలిసింది. ఈ దందాలో ఐవీఎఫ్‌లో నిష్ణాతురాలైన నగరానికి చెందిన ఓ వైద్యురాలికి కూడా భాగస్వామ్యం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదీ బాగోతం విశాఖ నగరంలోని 96వ వార్డు తెలుగుదేశం పార్టీలో కీలక పదవుల్లో ఉన్న ఇద్దరు నాయకులు, ఒక మహిళా నేత, వైద్య శాఖలో చిరుద్యోగిగా పనిచేస్తున్న మరో మహిళ ముఠాగా ఏర్పడ్డారు. వీరు జిల్లా, నగరవ్యాప్తంగా రోడ్లపై తిరుగుతున్న మానసిక వ్యాధిగ్రస్తులు, అనాధ మహిళలను గుర్తిస్తారు. వారికి మాయమాటలు చెప్పి, డబ్బు ఆశ చూపి కృత్రిమ గర్భం దాల్చేందుకు ఒప్పిస్తారు. మోసపోయి, అవాంఛిత గర్భం దాల్చిన మహిళలను కూడా బిడ్డను కనేందుకు బుజ్జగిస్తారు. పెందుర్తిలోని జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో పెద్దగా చెప్పుకుంటున్న ఓ మహిళ ఆధీనంలో ఉన్న ఫ్లాట్లలో వీరిని ఉంచుతారు. అక్కడ వీరి బాగోగులు చూసుకునేందుకు వైద్య శాఖ ఉద్యోగి కుటుంబ సభ్యులు, స్థానికంగా ఉంటున్న ఓ మహిళా దోబీ ఉంటారు. అంతా అనుకూలంగా మారిన తరువాత మహిళలను నగరంలోని ఓ ప్రముఖ మహిళా వైద్యురాలి వద్దకు తీసుకువెళ్లి ఐవీఎఫ్ ఇంజక్షన్ చేయించి మళ్లీ ఫ్లాట్లకు తీసుకువస్తారు. ఆడ బిడ్డకో రేటు.. మగకు మరో రేటు ఐవీఎఫ్ చేయించిన మహిళలకు గర్భం నిర్ధారణ అయిన తరువాత ముఠాలోని సభ్యులు పిల్లలు కావలసిన వారిని గుట్టుగా సంప్రదిస్తారు. వారికి ఏ బిడ్డ (ఆడ/మగ) కావాలో అడుగుతారు. ఆడ బిడ్డ అయితే రూ.5 లక్షల వరకు, మగ బిడ్డ అయితే రూ.10 లక్షల వరకు రేటు చెప్తారు. వారితో ఒప్పందం కుదుర్చుకున్నాక రూ.3 లక్షలు అడ్వాన్స్‌గా వసూలు చేస్తారు. గర్భం దాల్చిన మహిళకు ఆరో నెల దాటిన తరువాత రహస్యంగా లింగ నిర్ధారణ చేస్తారు. ఆ బిడ్డను ఎవరికి ఇవ్వాలో అప్పుడే నిర్ధారిస్తారు. బిడ్డ పుట్టిన తరువాత బాలింతలకు ప్రమేయం లేకుండా బిడ్డను కొనుగోలు చేసిన వారికి అప్పగించి వారి నుంచి మిగిలిన సొమ్మును పిండుకుంటారు. బిడ్డను కనీసం ఆ మహిళకు చూపించరు. బిడ్డను ఎవరికి ఇచ్చారో కూడా చెప్పరు. బిడ్డను కన్న మహిళకు లేదా ఆమెకు సంబంధించిన వారికి చిన్న మొత్తంలో డబ్బు ఇచ్చి పంపించేస్తారు. ఈ ముఠా సభ్యులు మాత్రం లక్షలాది రూపాయలు దండుకుంటారు. రెండేళ్లుగా ‘పచ్చ’గా వ్యాపారం ఈ అనైతిక వ్యాపారం రెండేళ్లుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలకంగా ఉన్న ఈ ముఠా సభ్యులకు ఓ టీడీపీ ప్రజాప్రతినిధి అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ముఠాలో ప్రధాన సూత్రదారులు టీడీపీ నేత కుటుంబానికి అత్యంత సన్నిహితులు. ఆ నేత అండదండలతో నిరాటంకంగా సాగుతున్న వీరి అనైతిక వ్యాపారాన్ని పోలీసులు ఇటీవల పసిగట్టారు. వీరి దందాపై పక్కా సమాచారం అందుకున్న అరకు పోలీసులు రెండు రోజుల క్రితం జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలోని ఫ్లాట్లలో తనిఖీలు చేశారు. ముఠాలోని నలుగురు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని ప్రస్తుతం రహస్యంగా విచారిస్తున్నారు. ముఠాలోని మిగిలిన వారితో పాటు ఐవీఎఫ్ ఇంజక్షన్లు చేస్తున్న వైద్యురాలి గురించి కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం. -
నాలుగు రోజులుగా ఠాణాలో పందెం కోళ్లు!
సాక్షి, పాల్వంచ(ఖమ్మం): నాలుగు రోజులుగా పందెం కోళ్లకు ఠాణాలో పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. వాటికి రేషన్ బియ్యాన్ని అందిస్తూ పహరా కాస్తున్నారు. విషయమేంటంటే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ మండలం దంతలబోరు శివారు అటవీ ప్రాంతంలో కోడి పందేలు నిర్వహిస్తుండగా పా ల్వంచ రూరల్ ఎస్సై సుమన్ ఆధ్వర్యంలో ఈనెల 25న దాడి చేశారు. ఈ సందర్భంగా మూడు పందెం కోళ్లతో పాటు ఐదుగురిని అరెస్టు చేశారు. అనంతరం నిందితులకు నోటీసులు జారీ చేసి వదిలేసిన పోలీసులు కోడిపుంజులను గురువారం వరకు విడుదల చేయలేదు. కిన్నెరసాని రూరల్ పోలీసుస్టేషన్ ప్రాంగణంలోనే కోడిపుంజులను బంధించారు. పుంజు ల రంగుల ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని, తదుపరి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. చదవండి: తల్లి బతికుండగానే పెద్దకర్మ! -
మోండాలో సెల్‌ఫోన్ దొంగల హల్చల్.. సీసీ కెమెరాలో రికార్డు
సాక్షి, బన్సీలాల్‌పేట్(హైదరాబాద్): సికింద్రాబాద్ మోండా మార్కెట్లో సెల్‌ఫోన్ దొంగల ముఠా హల్చల్ చేస్తోంది. మార్కెట్‌కు వివిధ రకాల కొనుగోళ్ల కోసం వచ్చేవారి సెల్ఫోన్లను దొంగలు తస్కరిస్తున్నారు. కనురెప్పపాటులో ఫోన్లు మాయం అవుతున్నాయి. ఇటీవల వినాయకచవితి సందర్భంగా మార్కెట్‌కు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజల రాకతో మార్కెట్ జన సంద్రంగా మారింది. వినియోగదారులు తమకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేస్తుంటే దొంగలు మరో వైపు తమ పని కానిచ్చేశారు. ► బోయిగూడ కట్టెలమండి ప్రాంత నివాసి పాకాల రమేష్ మార్కెట్లో పూలు కొనుగోలు చేస్తుండగా దొంగ పూలు కొంటున్నట్టు నటిస్తూ రమేష్ షర్ట్ జేబులో ఉన్న విలువైన సెల్‌ఫోన్‌ను తస్కరించాడు. అయితే ఈ తతంగం అంతా అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో నిక్షిప్తమైంది. ► సదరు దొంగ వ్యూహాత్మకంగా వచ్చి సంచి అడ్డుగా పెట్టి సెల్‌ఫోన్‌ను దొంగిలించాడు. అదే రోజు మరో ఇద్దరి సెల్ఫోన్లు కూడా చోరీకి గురయ్యాయి. దీంతో బాధితులు మోండా మార్కెట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ► సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు సమీపంలో మోండా మార్కెట్ ఉండటంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి దొంగతనాలకు పాల్పడుతూ రైళ్లలో ఇట్టే మాయమవుతున్నారు. పోలీసుల వైఫల్యంపై విమర్శలు ►నిత్యం వేలాది మంది ప్రజల రాకపోకలు...వ్యాపార కార్యకలాపాలతో రద్దీగా ఉంటే మోండా మార్కెట్లో పోలీసు నిఘా వైఫల్యంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ►విచ్చలవిడిగా ఎక్కడపడితే అక్కడ దొంగలు అడ్డూఅదుపు లేకుండా దొంగతనాలకు పాల్పడుతున్నారు. ►మోండా మార్కెట్లో కనీసం పండగ వేళల్లో అయినా పోలీసు అనౌన్స్మెంట్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తే జాగ్రత్తగా ఉంటారని పలువురు సాక్షితో వాపోయారు. ► మోండా మార్కెట్‌కు వచ్చిన అనేకమంది డబ్బు, సెల్ఫోన్లు పోగొట్టుకొని పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయలేకపోతున్నారు. ► ఇప్పటికైనా పోలీసులు ప్రత్యేక నిఘాతో దొంగతనాలకు కళ్లెం వేయాలని ప్రజలు కోరుతున్నారు. గట్టి నిఘా : క్రైమ్ ఇన్స్పెక్టర్ శేఖర్ మోండా మార్కెట్లో సెల్‌ఫోన్ దొంగతనాల నివారణకు గట్టి చర్యలు తీసుకుంటున్నాం. ఇటీవల ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. మోండా మార్కెట్ రద్దీ ప్రాంతాల్లో సివిల్‌డ్రెస్‌లో పోలీసు సిబ్బందిని ఉంచాం. ప్రజలను అప్రమత్తం చేయడానికి కార్యాచరణ రూపొందిస్తున్నాం మార్కెట్‌కు వచ్చేటప్పుడు ప్రజలు విలువైన వస్తువులను వెంట తీసుకురాకూడదు. చదవండి: షాకింగ్: పెట్రోలు పోసి నిప్పంటించిన గుర్తు తెలియని వ్యక్తులు -
భార్యను వేధించొద్దన్నందుకు ఇనుప రాడ్‌తో దాడి
లక్నో: ప్రభుత్వాలు మహిళలు, యువతుల పట్ల వేధింపుల నిరోధానికి ఎన్ని కఠిన చట్టాలు చేసిన కొందరు యువకులలో మార్పు రావండం లేదు. ప్రతిరోజు మహిళలు వేధింపులకు గురౌతున్న సంఘటనలు తరచుగా వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా, ఇలాంటి సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మీరట్‌లోని లిసారి గేట్ ప్రాంతంలో బాధిత మహిళ, తన భర్తతో కలిసి ఉంటుంది. ఈ క్రమంలో లిసారి ప్రాంతానికి చెందిన యువకుడు సదరు వివాహితను ప్రతిరోజు అనుసరించేవాడు. అంతటితో ఆగకుండా తన ఫోన్ నంబర్ ఇవ్వాలని విసిగించేవాడు. మొదట ఆ వివాహిత యువకుడిని పట్టించుకునేది కాదు. అయితే, క్రమక్రమంగా వేధింపులు మరీ ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో నిన్న (గురువారం) బాధిత యువతి తన ఇంట్లో నుంచి పనిమీద బయటకు వెళ్లింది. అదును కోసం ఎదురుచూస్తున్న యువకుడు ఆమెను వెంబడించాడు. అంతటితో ఆగకుండా ఫోన్ నంబర్ ఇవ్వాల్సిందే అని అసభ్యపదజాలంతో దూశించాడు. దీంతో తీవ్రమనస్తాపానికి గురైన సదరు వివాహిత.. ఇంటికి వెళ్లి తన భర్తకు జరిగిన విషయాన్ని తెలిపింది. కాగా, భర్తతో కలిసి యువకుడి ఇంటికి వెళ్లి అతడిని గట్టిగా నిలదీశారు. అప్పటికే అతని ఇంట్లో మరికొంత మంది స్నేహితులు కూడా ఉన్నారు. దీంతో అతను ఆగ్రహంతో ఊగిపోయాడు. వెంటనే స్నేహితులతో కలిసి అక్కడే ఉన్న ఇనుపరాడ్‌తో వివాహిత భర్తపై దాడిచేశాడు. అతను ఇంటి నుంచి బైటకు పరిగెత్తిన వెంబడించి మరీ గాయపర్చాడు. తీవ్రగాయాలపాలైన వివాహిత భర్త కిందపడిపోయాడు. కాగా, వివాహిత అరుపులు విన్న స్థానికులు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత నిందితులు అక్కడి నుంచి పారిపోయాడు. గ్రామస్తులు వెంటనే బాధితుడిని మీరట్‌లోని మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి భార్య నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న మీరట్ పోలీసులు నిందితులను గాలించడం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చదవండి: రమ్య హత్య కేసు: ఏపీ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు.. -
మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి.. ఐదుగురు కలిసి ఇంట్లో బంధించి..
జైపూర్: రాజస్థాన్‌లో మైనర్ బాలికపై ఇంటి పక్కనే ఉండే కొందరు యువకులు అఘాత్యానికి పాల్పడ్డారు. పనికోసం వెళ్లిన ఆ బాలిక అవసరాన్ని ఆసరాగా చేసుకుని.. ఆమెకు మాయమాటలు చెప్పారు. అంతటితో ఆగకుండా.. ఆ బాలికను నమ్మించి సాముహిక అత్యాచారం చేశారు. గత గురువారం (ఆగస్టు26)న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంఘటన నాగౌర్ జిల్లాలో జరిగింది. కాగా, 16 ఏళ్ల మైనర్ బాలిక.. పనికోసం తన ఇంటి పక్కన ఉండే హరిప్రసాద్ దగ్గరకు వెళ్లింది. ఆ సమయంలో రామేశ్వర్, తన మిత్రులతో కలిసి ఇంట్లో ఉన్నాడు. వారు బాలికకు మాయమాటలు చెప్పి ఇంట్లో కూర్చోబెట్టారు. ఆ తర్వాత బాలికను ఒక గదిలో బంధించారు. వారంతా కలసి బాలికపై అత్యాచారం చేశారు. అంతటితో ఆగకుండా.. విషయం ఎవరికైన చెబితే చంపేస్తామని బెదిరింపులకు గురిచేశారు. దీంతో బాధితురాలు తన ఇంటికి చేరుకుంది. ఈ క్రమంలో.. బాలిక గత కొన్ని రోజులుగా ఒంటరిగా ఉంటుంది. తీవ్ర ఒత్తిడికి గురవ్వటాన్ని ఆమె తల్లిదండ్రులు గుర్తించారు. దీంతో యువతిని కారణం అడిగారు. ఆ తర్వాత యవతి జరిగిన దారుణాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. తనపై ఐదురుగు యువకులు అత్యాచారం చేశారని కన్నీటి పర్యంత మయ్యింది. వెంటనే బాధితురాలి తండ్రి, తన కూతురితో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులకోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నామని స్థానిక పోలీసులు తెలిపారు. వారిలో ఒకరు మైనర్ బాలుడు ఉన్నట్లు తెలిపారు. మరికొంత మంది నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని నాగౌర్ పోలీసు అధికారి రామేశ్వర్ లాల్ పేర్కొన్నారు. చదవండి: ప్రియుడి కోసం బిడ్డను హింసించిన తల్లి.. అరెస్ట్ చేసిన పోలీసులు -
కారు ఆపి.. తుపాకులతో బెదిరించి..
సాక్షి, కోదాడ(నల్లగొండ): కారు ఆపి కత్తులతో, తుపాకులతో బెదిరించి రూ.3లక్షల నగదును దుండగులు దోపిడీ చేశారు ఈ ఘటన కోదాడ పట్టణ పరిధిలోని హైదరాబాద్ విజయవాడ రహదారిపై హుజూర్నగర్ ఫ్లైఓవర్ వద్ద శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. సీఐ నర్సింహారావు తెలిపిన వివరాల ప్రకారం.. హైరాబాద్లోని సబ్జీమండి పురాన్‌పూల్‌కు చెందిన జమాల్ పశువుల సంతలో బేరం చేసేందుకు శుక్రవారం రాత్రి కారులో డ్రైవర్‌తో కలిసి కోదాడకు బయలుదేరాడు. కోదాడ సమీపంలోని హుజూర్నగర్ ఫ్లైఓవర్ వద్ద సర్వీస్‌రోడ్డు దిగుతుండగా వారిని ఫాలో అయిన గుర్తుతెలియని నలుగురు వ్యక్తులు కారులో వచ్చి అడ్డగించారు. కత్తులు తీసి ఇద్దరి గొంతుపై పెట్టి చిలుకూరు శివారు వైపు తీసుకెళ్లి చంపుతామని బెదిరించారు. వారి వద్ద ఉన్న సుమారు రూ.3లక్షల నగదును తీసుకుని ఉడాయించారు. ఈ ఘటనపై బాధితుడు జమాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. చదవండి: రైటర్లు రాసిన స్కామ్! -
సిరిసిల్లలో ‘కిలేడీ’లు.. మాటలు కలిపి.. మనీ లాగేస్తూ..
సాక్షి, సిరిసిల్ల (కరీంనగర్): మద్యం మత్తులో ఉన్నవారే వారి టార్గెట్. వారిని మాటల్లో దింపి మనీ తీసుకుని వెళ్లిపోవడంలో ఆరితేరిన ‘కిలేడీ’లు సిరిసిల్ల టౌన్ పోలీసుల అదుపులో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. సిరిసిల్ల పాతమార్కెట్ ఏరియాలోని కల్లు కాంపౌండ్‌ను అడ్డాగా చేసుకుని ముగ్గురు మహిళలు, మరో వ్యక్తి మందుబాబుల జేబుల్లోంచి డబ్బులు కాజేస్తున్నట్లు తెలిసింది. దీనిపై వచ్చిన సమాచారంతో దొంగతనాలకు పాల్పడుతున్న మహిళలతో పాటు మరో వ్యక్తిపై నిఘావేశారు. ఎట్టకేలకు డబ్బులు కాజేస్తున్న విషయం నిజం అని తెలడంతో మహిళ ల ను విచారించినట్లు తెలిసింది. ఇప్పటి వరకు వీరు మూడురోజుల క్రితం రూ.30వేలు దొంగతనం చేశారని, వారి చిరునామాలు, రోజువారి పనులు తెలుసుకునే పనిలో సిరిసిల్ల టౌన్ పోలీసులు నిమగ్నమై నట్లు తెలిసింది. ఇదే విషయాన్ని సిరిసిల్ల టౌన్ ఎస్సై అపూర్వరెడ్డిని వివరణ కోరగా మూడు రోజు ల క్రితం సమాచారం వచ్చిందని దీనిపై దర్యాప్తుచేస్తున్నామని తెలిపారు. -
హైవేపై కిలేడీ గ్యాంగ్.. సామాజిక సేవ పేరుతో..
సాక్షి, ఖిలా వరంగల్: ఏడుగురు సభ్యులతో కూడిన ఓ మహిళా ముఠా హైవేలపై తిష్ట వేసి వాహనదారులను లక్ష్యంగా చేసుకుని వసూళ్లకు పాల్పడుతున్నారు. జీన్స్ పాయింట్, టీషర్ట్ ధరించి ఉన్నారని వాహనం ఆపితే అంతే సంగతులు. స్వచ్ఛంద సంస్థలు, సామాజిక సేవ పేరుతో వాహనాలను నిలిపి చందాలు వసూళ్లు చేస్తున్నారు. ఇలాంటి ఘటనే మంగళవారం మధ్యాహ్నం వరంగల్– ఖమ్మం జాతీయ రహదారిపై బొల్లికుంట క్రాస్ రోడ్డు వద్ద జరగగా బుధవారం సాయంత్రం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీరంతా రాజస్తాన్‌కు చెందిన మహిళలుగా అనుమానిస్తుండగా, మూఠాగా ఏర్పడి వచ్చి వెళ్లే వాహనదారులను చందాల పేరిట నిలువు దోపిడీ చేస్తున్నారు. వీరిని గమనించిన ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి గట్టిగా నిలదీయడంతోపాటు సెల్ఫోన్లో వీడియో తీస్తుండగా ఆటోలో పరారయ్యారు. ఏడుగురు జీన్స్ పాయింట్, టీషర్ట్స్ ధరించి ఉన్నారని, సడన్‌గా వాహనం ఆపి సామాజిక సేవ పేరుతో డబ్బులు అడిగారని పలువురు తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి మామునూరు పోలీసులు చేరుకుని వివరాలను సేకరించి గాలిస్తున్నట్లు తెలిసింది. -
శంషాబాద్ లో బీహార్ గ్యాంగ్ అలజడి
-
ఎల్బీనగర్లో ఇరానీ గ్యాంగ్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : నగరంలో చోరీలకు పాల్పడుతున్న ఇరానీ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు సభ్యులున్న ఈ గ్యాంగ్‌ను శనివారం అదుపులోకి తీసుకున్నారు. నిందితులు మహ్మద్ హుస్సేన్, వహీద్ రాజాబ్, నజీర్ అభిదిలనుంచి 811 యూఎస్ డాలర్స్, రూ.35 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలో ముగ్గురు నిందితులపై 5 కేసులు నమోదయ్యాయి. -
మళ్లీ మత్తు దోపిడీ
సాక్షి, మల్లాపూర్: నేపాలీ గ్యాంగ్ మరోసారి పంజా విసిరింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని నార్సింగి, రాయదుర్గం, రాచకొండలోని కుషాయిగూడ ఠాణా పరిధిలో జరిగిన దోపిడీల తరహాలోనే తాజాగా నాచారం ఠాణా పరిధిలో సోమవారం మధ్యాహ్నం మరో భారీ చోరీ జరిగింది. కుటుంబ సభ్యులు బయటికి వెళ్లడాన్ని ఆసరాగా తీసుకున్న నేపాలీ జంట ఇంట్లోటున్న వృద్ధురాలికి ఆహారంలో మత్తుమందు కలిపి ఇచ్చారు. ఆమె స్పృహ కోల్పోగానే బీరువాలో ఉన్న రూ.10 లక్షల నగదు, 18 తులాల బంగారం, 40 తులాల వెండి ఆభరణాలతో ఉడాయించారు. పక్కా ప్లాన్... బాధితులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.నాచారం హెచ్ఎంటీనగర్ రోడ్ నెంబర్–4/ఎ లో నివాసం ఉంటున్న చింతపల్లి ప్రదీప్‌కుమార్ బంజారాహిల్స్‌లో యాడ్ ఏజెన్సీ నిర్వహిస్తున్నాడు. అతడి భార్య మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పుత్రిలో హెడ్‌నర్స్‌గా పని చేస్తోంది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రదీప్‌కుమార్ తల్లి లలితమ్మ(60) కూడా వీరితో పాటే ఉంటోంది. వీరి ఇంట్లో ఆరు నెలల క్రితం పని చేస్తున్న నేపాలీ జంట మానేయడంతో ఉప్పల్‌కు చెందిన లక్ష్మీనారాయణ అనే ఏజెంట్ ద్వారా అర్జున్, మాయ అనే మరో నేపాలీ జంటను 14 రోజుల క్రితం ఇంట్లో పనికి పెట్టుకున్నారు. సోమవారం ప్రదీప్‌కుమార్, అతని కుమారుడు ఆఫీసులకు వెళ్లిపోయారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రదీప్‌కుమార్ భార్య, కుమార్తెతో కలిసి మేడ్చల్‌లోని బంధువుల ఇంటికి వెళ్లింది. అదే అదనుగా అర్జున్, మాయ ఇంట్లో ఉన్న వృద్ధురాలు లలితమ్మకు ఆహారంలో మత్తు మందు కలిపి ఇచ్చి çస్పృహæ కోల్పోయేలా చేశారు. అనంతరం లాకర్‌ను బద్దలు కొట్టి అందులో ఉన్న 18 తులాల బంగారం, 40 తులాల వెండి, రూ.10 లక్షల నగదు దోచుకుని పారిపోయారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చిన ప్రదీప్‌కుమార్ తల్లి స్పృహ లేకుండా పడి ఉండటాన్ని గుర్తించి నాచారం పోలీసులకు సమాచారం అందించి, తల్లిని గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంతో కలిసి ఆధారాలు సేకరించారు. దోపిడీ జరిగిన ఇంట్లో సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో కాలనీల్లోని సీసీటీవీ కెమెరాల పుటేజీని పరిశీలించారు. అయితే ఒక్క కెమెరాలోనూ వారి ఫొటోలు రికార్డుకాలేదని తేలింది. అయితే సోమవారం మధ్యాహ్నం 3.30 ప్రాతంలో డ్రిల్లింగ్ చేసిన శబ్దాలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న మల్కాజ్గిరి డీసీపీ రక్షిత కె.మూర్తి, అడిషనల్ డీసీపీ శ్రీనివాస్‌రావు, ఏసీపీ శ్యాంప్రసాద్‌రావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితులను పట్టుకునేందుకు ఎనిమిది ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఎస్ఓటి, సీసీఎస్, క్రైమ్ పోలీసులు పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. వారిని పనికి కుదిర్చిన ఏజెంట్ లక్ష్మీనారాయణతో పాటు మరో నేపాలీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న లలితమ్మ స్పృహలోకి వస్తే కేసుపై స్పష్టత వచ్చే అవకాశముందని పోలీసులు పేర్కొన్నారు. కొకైన్ విక్రయిస్తున్న నైజీరియన్ అరెస్టు సాక్షి, హైదరాబాద్: నైజీరియా నుంచి స్టూడెంట్ వీసాపై నగరానికి వచ్చి డ్రగ్ పెడ్లర్‌గా మారి కొకైన్ విక్రయిస్తున్న డానియల్ అమతుండే ఒలామిడేను పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి ఆరు గ్రాముల మాదకద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు మంగళవారం వెల్లడించారు. 2014లో నైజీరియా నుంచి స్టూడెంట్ వీసాపై వచ్చిన డానియల్ బండ్లగూడలోని సన్ సిటీలో ఉంటూ కూకట్‌పల్లిలోని ఓ కాలేజీలో బీకాం చదువుతున్నాడు. తరచు పబ్‌లకు వెళ్లే ఇతడికి డ్రగ్స్ దందా చేసే జాన్ పౌల్‌తో పరిచయమైంది. ఇతడు కూడా నైజీరియనే కావడంతో ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. పౌల్ సలహా మేరకు నగరంలో డ్రగ్ పెడ్లర్‌గా మారిన డానియల్ కొకైన్ గ్రాము రూ.8 వేలకు విక్రయిస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న మధ్య మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ బి.గట్టుమల్లు నేతృత్వంలోని బృందం మంగళవారం వలపన్ని పట్టుకుంది. ఇతడి నుంచి స్వా«ధీనం చేసుకున్న డ్రగ్, వాహనంతో సహా తదుపరి చర్యల నిమిత్తం నిందితుడిని లంగర్‌హౌస్ పోలీసులకు అప్పగించారు. ముంబై వ్యాపారినీ ముంచేశారు సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన ఇద్దరు వ్యాపారుల కరెంట్ ఖాతాల నుంచి ఈ ఏడాది జూన్‌లో రూ.86 లక్షలు కాజేసిన అంతర్జాతీయ సిమ్ స్వాపింగ్ గ్యాంగ్ ముంబైలోనూ పంజా విసిరింది. ఈ నెల మొదటి వారంలో అక్కడి ఓ పెట్రోల్ బంక్ యజమాని అధికారిక ఖాతా నుంచి రూ.2 కోట్లు స్వాహా చేసింది. ఈ ముఠాలోని ముగ్గురు నిందితుల్ని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు రెండు రోజుల క్రితం అరెస్టు చేసిన విషయం విదితమే. వీరి విచారణ, సెల్ఫోన్లు పరిశీలనలోనే ముంబై విషయం వెలుగులోకి వచ్చింది. నైజీరియాకు చెందిన షెడ్రిక్ పాల్, పశ్చిమ బెంగాల్‌లోని కళ్యాణి ప్రాంతానికి చెందిన సాగర్ మహతో ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారు. ముంబైలోని బాంద్రా ప్రాంతానికి చెందిన కమల్మఖీజా హిందుస్తాన్ పెట్రెలియం సంస్థకు డీలర్గావ్యవహరిస్తున్నాడు. షెడ్రిక్ నైజీరియా నుంచి అతడి అధికారిక ఈ–మెయిల్ ఐడీకి ఓ మాల్వేర్ పంపి దాని ఆధారంగా కమల్‌కు చెందిన లావాదేవీలను తెలుసుకున్నాడు. సదరు వ్యాపారికి చెందిన బ్యాంకు ఖాతాల వివరాలు, యూజర్ నేమ్స్, పాస్‌వర్డ్స్‌తో పాటు వాటికి లింకై ఉన్న ఫోన్ నంబర్లనూ సేకరించి సాగర్‌కు పంపాడు. దీంతో అతను తన గ్యాంగ్ సభ్యులను ముంబై పంపి తొలుత ఓ ఖాళీ సిమ్ కార్డు ఖరీదు చేయించాడు. ఈ విషయాన్ని నైజీరియాలో ఉన్న షెడ్రిక్‌కు తెలిపాడు. సిమ్ స్వాపింగ్‌కు సిద్ధమైన అతగాడు ఓ రోజు కమల్‌కు చెందిన ఈ–మెయిల్ ద్వారా సదరు సెల్‌ఫోన్ సర్వీస్ ప్రొవైడర్‌కు ప్రస్తుతం పని చేస్తున్న సిమ్ డీ యాక్టివేట్ చేసి, తాను ఖరీదు చేసిన ఎమ్టీ సిమ్‌ను అదే నంబర్‌తో యాక్టివేట్ చేయాలని మెసేజ్ పంపాడు. ‘మెయిల్ సెంట్’ అని వచ్చిన వెంటనే ఔట్ బాక్స్, ట్రాష్ల్లో అది లేకుండా డిలీట్ చేసేశాడు. ఒకవేళ కమల్ తన మెయిల్ ఓపెన్ చేసుకున్నా ఇది కనిపించకుండా ఈ జాగ్రత్తలు తీసుకున్నాడు. అయితే కమల్ వినియోగిస్తున్న ఫోన్ కంపెనీ పేరుతో లేకపోవడంతో ఈ–మెయిల్‌ను సర్వీస్ ప్రొవైడర్ పట్టించుకోలేదు. దీంతో షెడ్రిక్ ‘ప్లాన్ బి’ సాగర్ ద్వారా అమలు చేయించాడు. ముందుగా వేరే సిమ్ నుంచి కమల్ ఫోన్‌కు రెండు కాల్స్ చేశాడు. ఆపై సర్వీస్ ప్రొవైడర్‌కు ఫోన్ చేసి తన సిమ్‌కార్డు పోయిందని, దానిని బ్లాక్ చేసి తాజాగా తీసుకున్న ఎమ్టీ సిమ్ యాక్టివేట్ చేయాలని కోరాడు. సర్వీస్ ప్రొవైడర్‌కు చెందిన ప్రతినిధి ఈ పనులు చేయడానికి ముందు కస్టమర్‌ను ఖరారు చేసుకుంటాడు. దీనికోసం ఆఖరుగా వచ్చిన ఇన్కమింగ్ లేదా ఔట్ గోయింగ్ కాల్స్ వివరాలు చెప్పమంటాడు. అలా అడిగినప్పుడు సదరు ప్రతిని«ధికి అనుమానం రాకుండా సాగర్ పథకం ప్రకారం కమల్ ఫోన్‌కు రెండు కాల్స్ చేసి, ఏవేవో మాట్లాడి, రాంగ్ నంబర్ అంటూ పెట్టేశాడు. ఈ రెండు నంబర్లు చెప్పిన సాగర్ అతడి వద్ద ఉన్న సిమ్ బ్లాక్ చేయించి... తన వద్ద ఉన్న ఎమ్టీ సిమ్ యాక్టివేట్ అయ్యేలా చేశాడు. ఈ వివరాలన్నింటినీ ఇతడు నైజీరియాలో ఉన్న షెడ్రిక్‌కు చెప్పాడు. అప్పటికే సదరు వ్యాపారికి చెందిన బ్యాంకు ఖాతా వివరాలు, తన ముఠా సభ్యుల నుంచి అందిన డమ్మీ వ్యక్తుల కరెంట్ బ్యాంకు ఖాతాలు షెడ్రిక్ వద్ద ఉన్నాయి. వ్యాపారి పేరుతో తీసుకున్న డూప్లికేట్ సిమ్‌కార్డుకే ఓటీపీలు రావడంతో వీటిని వినియోగించిన షెడ్రిక్ ఈ నెల 5 రాత్రి సదరు వ్యాపారికి చెందిన బ్యాంకు ఖాతా నుంచి 31 లావాదేవీల్లో రూ.2 కోట్లను తమ డమ్మీ ఖాతాల్లోకి బదిలీ చేశాడు. u ఈ మొత్తాన్ని సాగర్ తదితరులు తమ అనుచరుల ద్వారా డ్రా చేయించారు. దీనిపై కమల్ ఫిర్యాదు మేరకు ఈ నెల 6 కేసు నమోదు చేసిన ముంబైలోని బీకేసీ సైబర్ క్రైమ్ పోలీసులు నేరగాళ్లకు చెందిన ఓ ఖాతాలో ఉన్న రూ.40 లక్షలు మాత్రం ఫ్రీజ్ చేయించగలిగారు. u నగర వ్యాపారులకు రూ.86 లక్షలు టోకరా వేసిన కేసును దర్యాప్తు చేసిన సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ గంగాధర్ నేతృత్వంలోని బృందం పశ్చిమ బెంగాల్ వెళ్లి సాగర్ తదితరుల్ని అరెస్టు చేసి తీసుకువచ్చింది. u సాగర్ ఫోన్లో షెడ్రిక్తో జరిగిన చాటింగ్స్‌ను పరిశీలించిన గంగాధర్ ముంబై వ్యాపారికీ టోకరా వేసినట్లు గుర్తించారు. ఈ మేరకు అక్కడి అధికారులకు సమాచారం అందించారు. u ఈ ముఠా టార్గెట్ చేసిన సిమ్ ప్రీ–పెయిడ్ అయితే ఒకసారి కొంత మొత్తం రీచార్జ్ చేయించేది. ప్రస్తుత సిమ్ బ్లాక్ చేయడానికి, ఎమ్టీ సిమ్ యాక్టివేట్ చేయడానికి సర్వీస్ ప్రొవైడర్ ఆఖరి రీచార్జ్ తేదీ, ఎంత మొత్తం అనేది అడుగుతారు. అందుకే ఇలా చేయించాడని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. -
డిన్నర్లో మత్తు మందు ఇచ్చి.. భారీ చోరీ
సాక్షి, గచ్చిబౌలి: కూర, గ్రీన్ టీలో మత్తు మందు కలిపిన నేపాల్ గ్యాంగ్ భారీ చోరీకి పాల్పడింది. రూ.15.10 లక్షల నగదు, రూ.15 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులతో ఉడాయించింది. మత్తు నుంచి 11 గంటల తర్వాత తేరుకున్న ఐదేళ్ల బాలుడు అయాన్ నాన్నమ్మకు కట్టిన తాళ్లను కత్తిరించడంతో ఆ కుటుంబం ప్రాణాపాయం నుంచి బయటపడింది. సోమవారం రాత్రి రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలోని బీఎన్ రెడ్డి హిల్స్‌లో చోటుచేసుకున్న ఘటన వివరాలను మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. చౌటుప్పల్‌కు చెందిన బోర్వెల్ వ్యాపారి గూడూరు మధుసూదన్ రెడ్డి, శైలజ దంపతులు కుమారుడు నితీష్‌రెడ్డి, కోడలు దీప్తి, అయిదేళ్ల మనవడు అయాన్ రెడ్డితో కలిసి బీఎన్ రెడ్డి హిల్స్‌లో నివసిస్తున్నారు. రెండేళ్ల క్రితం నవీన్ అనే మధ్యవర్తి ద్వారా నేపాల్‌కు చెందిన రవి అలియాస్ రాజేందర్, అతని చెల్లెలు సీతతో కలిసి మధుసూధన్‌రెడ్డి ఇంట్లో హౌస్‌కీపింగ్ పనుల్లో చేరారు. రవి ద్వారా 15 రోజుల క్రితం నేపాల్‌కు చెందిన మనోజ్ క్లీనింగ్, అతని భార్య జానకి వంట మనిషిగా చేరారు. అక్కడే సెల్లార్‌లోని సర్వెంట్ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. పప్పులో కలిపి.. సోమవారం రాత్రి డిన్నర్ కోసం రైస్, చపాతి, పప్పు రెడీ చేశారు. పప్పులో మత్తు మందు కలిపారు. రాత్రి 8 గంటలకు మధుసూదన్ రెడ్డి, నితీష్, దీప్తి, అయాన్ పప్పుతో రైస్, చపాతి తిన్నారు. శైలజ మాత్రం ఉదయం వండిన కూరతో చపాతి తిన్నారు. దీంతో శైలజకు నిందితులు గ్రీన్ టీలో మత్తు మందు కలిపి ఇచ్చారు. అరగంట తర్వాత అందరూ స్పృహ తప్పారు. మధుసూదన్‌రెడ్డి బాత్రూంలో పడిపోయారు. ఆయన కుమారుడు, కోడలు, మనవడు బెడ్రూంలో పడిపోయారు. శైలజ హాల్లోని కుర్చీలోనే కూర్చుని స్వల్పంగా స్పృహ తప్పారు. ఆమెను నిందితులు కుర్చీకి తాళ్లతో కట్టి, బెదిరించి వివరాలు తెలుసుకుని రూ.15.10 లక్షల నగదు, రూ.15 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రెండు సెల్ఫోన్లు చోరీ చేశారు. సెల్లార్లో ఉన్న శునకానికికూడా పెరుగన్నంలో మత్తు మందు కలిపిపెట్టారు. సర్వెంట్ క్వార్టర్ వద్ద ఓ లాకర్‌ను పగలగొట్టడంతో పాటు సీసీ టీవీ ఫుటేజీని తీసుకొని ఉడాయించారు. ఈ ఘటన రాత్రి 9 నుంచి 10 గంటలలోపే చోరీ జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయాన్ తేరుకుని.. మంగళవారం ఉదయం 7 గంటలకు అయాన్ తేరుకొని నాన్నమ్మ శైలజ వద్దకు వచ్చాడు. ఆమెకు ఉన్న తాళ్లను నాన్నమ్మ చెప్పినవిధంగా కత్తిరించాడు. వారు బయటికొచ్చి సమీపంలోని సైట్ వద్ద ఉన్న వాచ్‌మన్ రాములును పిలిచి విషయం చెప్పారు. అతను.. శైలజ బంధువులు సూర్యారెడ్డి, ఆనంద్‌రెడ్డిలను తీసుకొచ్చాడు. అనంతరం 100కు కాల్ చేసి సమాచారమిచ్చారు. మధుసూదన్ రెడ్డితో పాటు కొడుకు, కోడలు, మనవడిని కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేట్‌ఆస్పత్రికి తరలించారు. మధుసూదన్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని, మిగతావారు కోలుకుంటున్నట్లు డీసీపీ చెప్పారు. నిందితులు ఏడుగురు.. పక్కా ప్లాన్‌నే నేపాల్ గ్యాంగ్ చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. మొదట పనిలో చేసిన రవి ఆ తర్వాత సీతను పనిలో పెట్టించాడు. చోరీ చేయాలని ప్లాన్ చేసుకున్న తర్వాత మనోజ్, జానకిలను చేర్పించాడు. చోరీ సమయంలో వీరితో పాటు మరో ముగ్గురు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. సమీప రోడ్లపై ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ట్యాబ్లెట్ల పౌడర్ కలిపి ఉండొచ్చు.. నిందితులు మత్తునిచ్చే ట్యాబ్లెట్ల పౌడర్.. కూర, గ్రీన్ టీలో కలిపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. రాత్రి 10 గంటల తర్వాత నిందితులు వేర్వేరుగా నడుచుకుంటూ వెళ్లినట్లు వారు నిర్ధారణకు వచ్చారు. సెల్‌ఫోన్ నంబర్ల లొకేషన్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 44, 45 వరకు చూపించిందని పోలీసులు తెలిపారు. సంవత్సరం క్రితం శామీర్‌పేట్ పీఎస్ పరిధిలో, గత జనవరిలో నార్సింగి పీఎస్ పరిధిలో నేపాల్ గ్యాంగ్ ఇదే తరహాలో చోరీ పాల్పడినట్లుగా పోలీసులు పేర్కొంటున్నారు. తాజా చోరీ కేసులోనూ పాత నేరస్తులు ఉండే అవకాశం ఉందనే కోణంలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. ముమైత్ ఖాన్‌పై పోలీసులకు ఫిర్యాదు పంజగుట్ట: సినీ నటి మొమైత్ ఖాన్ ఒప్పందం ప్రకారం తనకు డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిందని ఓ క్యాబ్ డ్రైవర్ మంగళవారం పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి .. గత నెల 16న సినీ నటి మొమైత్ ఖాన్ కొంపల్లికి చెందిన రాజును సంప్రదించి గోవాకు వెళ్లాలని నాలుగు రోజులకు గాను రూ.22 వేలు చెల్లించేలా, రూ. 1500 బత్తా ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఒప్పందం ప్రకారం నాలుగు రోజులు కాకుండా మరో నాలుగు రోజులు అదనంగా ఉందని, అదనంగా ఉన్న రోజులకు డబ్బులు చెల్లించాలని కోరగా ఇవ్వకపోగా తనను బెదిరిస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. గోవా అడ్డాగా ఐపీఎల్ బెట్టింగ్! సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్స్పై రాజధానిలో పోలీసుల నిఘా పెరిగింది. నగరంలో టాస్క్‌ఫోర్స్, సైబరాబాద్, రాచకొండల్లో స్పెషల్ ఆపరేషన్ టీమ్ అధికారులు వరుస దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరానికి చెందిన బుకీలు ఇతర మెట్రో నగరాలను అడ్డాగా చేసుకుని తమ దందా కొనసాగిస్తున్నారు. గోవా కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్స్ నిర్వహిస్తున్న ముగ్గురు హైదరాబాదీలను అక్కడి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పట్టుకున్నారు. మోర్జిమ్ ప్రాంతంలోని ఓ హోటల్‌పై సోమవారం దాడి చేసిన ప్రత్యేక బృందం వీరిని అదుపులోకి తీసుకుంది. ప్రత్యేక యాప్‌తో బెట్టింగ్స్ ఈ త్రయం బెట్టింగ్స్ నిర్వహణకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో కూడిన యాప్ వినియోగిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. నగరానికి చెందిన సందీప్ పటేల్, కృష్ణకాంత్, భోజ భూపాల్ యాదవ్ క్రికెట్ బుకీలుగా మారారు. కొన్నేళ్లుగా ఈ దందా చేస్తున్న వీరు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ, ఎలాంటి మ్యాచ్‌లు జరుగుతున్నా తమ ‘పని’ ప్రారంభిస్తూ ఉంటారు. అయితే పోలీసుల నిఘా తప్పించుకునేందుకు వివిధ నగరాల్లో అడ్డాలు ఏర్పాటు చేసుకునే వీరికి దేశ వ్యాప్తంగా అనేక మంది పంటర్లతో (పందాలు కాసేవారు) సంబంధాలు ఉన్నాయి. లావాదేవీలను ప్రత్యేక సాఫ్ట్వేర్ కూడిన బెట్టింగ్ యాప్ ద్వారా నిర్వహిస్తున్నారు. పంటర్లకు యూజర్ ఐడీ ఆన్లైన్ ద్వారానే పరిచయమైన పంటర్లకు ప్రత్యేక యూజర్ ఐడీ, పాస్వర్డ్ కేటాయిస్తున్న వీరు అతడితో ఆన్లైన్లోనే బెట్టింగ్ కాయిస్తున్నారు. నగదు లావాదేవీలను వివిధ ఈ–వాలెట్స్ ద్వారా నిర్వహిస్తున్నారు. ప్రతి బాల్‌కు సంబంధించిన మ్యాచ్ వివరాలు, బెట్టింగ్ రేష్యో తదితరాలను ఆ యాప్ వీరికి అందిస్తూ ఉంటుంది. ఈ వ్యవహారాల్లో తమకు సహకరించడానికి వివిధ ప్రాంతాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నారు. నెల రోజులుగా గోవాలో మకాం నెల రోజుల క్రితం గోవా వెళ్లిన వీరు మోర్జిమ్ ప్రాంతంలోని ఓ హోటల్లో టూరిస్టుల ముసుగులో బస చేశారు. ఐపీఎల్ మొదలైన నాటి నుంచి పందాలు నిర్వహిస్తున్నారు. దీనిపై అక్కడి క్రైమ్ బ్రాంచ్ అధికారులకు సోమవారం సమాచారం అందడంతో దాడి చేసిన అధికారులు ముగ్గురినీ అరెస్టు చేసి, సాఫ్ట్వేర్, యాప్‌లతో కూడిన సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్, ఎల్ఈడీ స్క్రీన్లతో పాటు నగదు స్వాధీనం చేసుకున్నారు. గోవాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న హోటళ్లు, లాడ్జిల్లో ఇలాంటి ముఠాలు మరికొన్ని మకాం వేశాయని అక్కడి అధికారులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారాలపై కన్నేసి ఉంచడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. గోవాలో హైదరాబాద్‌కు చెందిన సందీప్ పటేల్, కృష్ణకాంత్, భోజ భూపాల్ యాదవ్ అరెస్టు అయిన విషయాన్ని తెలుసుకున్న ఇక్కడి పోలీసులు స్థానికంగా వీరి వ్యవహారాలపై ఆరా తీస్తున్నారు. బహుమతులిస్తాడు...ఆ తర్వాత దోచేస్తాడు సాక్షి, హైదరాబాద్: వ్యాపారవేత్తగా పరిచయం చేసుకుని అమ్మాయిలను నమ్మించి బహూమతులతో వారిని మెప్పించి...అవసరమైతే వివాహేతర సంబంధం కొనసాగించి మరీ ఆ తర్వాత బంగారు ఆభరణాలతో ఉడాయిస్తున్న కరుడుగట్టిన నేరగాడిని మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఇతడి అరెస్టుతో సైబరాబాద్‌తో పాటు ఏపీ, తమిళనాడు, గోవా రాష్ట్రాల్లో 12 కేసులు ఛేదించినట్లయ్యింది. ఎస్ఓటీ అడిషనల్ డీసీపీ సందీప్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా, టంగుటూరు శివాలయం వీధికి చెందిన అబ్దూరి సోమయ్య అలియాస్ సోమయ్య చౌదరి అలియాస్ అక్కినేని కార్తీక్ దారి మళ్లించి సొత్తు దోచుకోవడంలో దిట్ట. సైబరాబాద్‌తో పాటు, ఏపీ, గోవా, తమిళనాడు ప్రాంతాల్లో 12 దొంగతనాలు చేశాడు. లగ్జరీ హోటల్స్‌లో మకాం.. తరచూ హైదరాబాద్‌కు వచ్చి వెళ్లే సోమయ్య మాదాపూర్, గచ్చిబౌలిలోని లగ్జరీహోటల్స్, గెస్ట్ హౌస్‌లలో బస చేసేవాడు ఉండేవాడు. అక్కడికి వచ్చే యువతులతో వ్యాపారవేత్తగా పరిచయం చేసుకునేవాడు. అనంతరం వారితో సన్నిహితంగా ఉంటూ బహుమతులు ఇచ్చేవాడు. కొన్నిసార్లు వివాహేతర సంబంధం కూడా కొనసాగించేవాడు. అనంతరం అదను చూసుకుని వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలతో పాటు ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్లను కొట్టేసేవాడు. సొంతూరికెళ్లి జల్సాలు తన సొంతూరుకు వెళ్లి చోరీ సొత్తును విక్రయించగా వచ్చిన డబ్బుతో జల్సా చేసేవాడు. ఇతని నేరాలపై మాదాపూర్ ఠాణాలో ఫిర్యాదు అందడంతో ఎస్ఓటీ బృందం రంగంలోకి దిగింది. టెక్నికల్ డాటాతో అతనిపై నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు మంగళవారం నగరానికి వచ్చిన అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 12 కేసులకు సంబంధించి రూ.36 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం మాదాపూర్ పోలీసులకు అప్పగించారు. సోమయ్యపై గతంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 80 కేసులు ఉన్నాయి. ఆయా కేసుల్లో స్థానిక పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయినా అతని బుద్ధి కూడా మారలేదని, మళ్లీ దొంగతనాల బాట పట్టినట్లు అదనపు డీసీపీ తెలిపారు. అతడిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. నిందితుడిని అరెస్టు చేసిన ఇన్స్పెక్టర్ సుధీర్‌తో పాటు సిబ్బందిని రివార్డులతో సత్కరించారు. సెల్‌ఫోన్ స్నాచింగ్ గ్యాంగ్‌కు చెక్ సాక్షి, హైదరాబాద్: నగరంలోని రద్దీ మార్కెట్లను టార్గెట్‌గా చేసుకుని సెల్‌ఫోన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ముఠాకు మొఘల్‌పుర పోలీసులు చెక్ చెప్పారు. ఈ గ్యాంగ్ సూత్రధారి పరారీలో ఉండగా పాత్రధారులైన ఐదుగురిని పట్టుకున్నామని, వీరిలో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. దక్షిణ మండల డీసీపీ గజరావ్ భూపాల్‌తో కలిసి మంగళవారం కేసు వివరాలు వెల్లడించారు. అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతానికి చెందిన ప్రశాంత్ నగరంతో పాటు రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన బండి రాము, అక్షింతల కళ్యాణ్, మేకల జగపతి బాబు, తోట పోతురాజు, రామ్ చంద్ర ప్రధాన్, సహా ఇద్దరు మైనర్లతో కలిసి ముఠా ఏర్పాటు చేశాడు. ప్రశాంత్ ఆదేశాల మేరకు వీరు రద్దీగా ఉన్న మార్కెట్లు, ఇతర ప్రాంతాలకు వెళతారు. టార్గెట్‌గా చేసుకున్న వ్యక్తి చుట్టూ చేరే ఈ ముఠా అతడి దృష్టిని మళ్లిస్తుంది. మిగిలిన వారు అదును చూసుకుని అతడి జేబులోని సెల్‌ఫోన్ తస్కరిస్తారు. దొంగతనం చేసిన ఫోన్‌ను వీరు నేరుగా ప్రశాంత్‌కు అప్పగిస్తారు. అతగాడు దానిని విక్రయించగా వచ్చిన సొమ్ములో కొంత మొత్తం ముఠా సభ్యులకు ఇచ్చేవాడు. వీరు ఇదే పంథాలో నగర వ్యాప్తంగా 26 చోరీలు చేశారు. ఈ గ్యాంగ్ వ్యవహారాలపై పాతబస్తీలోని మొఘల్‌పుర పోలీసులకు సమాచారం అందింది. రంగంలోకి దిగిన అధికారులు సూత్రధారి మినహా మిగిలిన వారిని పట్టుకున్నారు. -
ప్రముఖ దర్శకుడికి బెదిరింపులు
ముంబై : అబు సలేం గ్యాంగ్‌కు చెందిన సభ్యుడిగా చెప్పుకుంటూ ఓ వ్యక్తి 35 కోట్ల రూపాయలు ఇవ్వాలని తనను డిమాండ్ చేశాడని బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ మహేష్ మంజ్రేకర్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహేష్ మంజ్రేకర్ ఫిర్యాదును స్వీకరించి దోపిడీ నిరోధక పోలీస్ విభాగానికి బదలాయించినట్టు అధికారులు తెలిపారు. తన మొబైల్ ఫోన్‌కు అబూ సలేం గ్యాంగ్ సభ్యుడి నంటూ గుర్తుతెలియని వ్యక్తి నుంచి రూ. 35 కోట్లు డిమాండ్ చేస్తూ మెసేజ్‌లు వచ్చాయని రెండురోజుల కిందట మంజ్రేకర్ దాదర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని అధికారులు తెలిపారు. సున్నితమైన కేసు కావడం, దోపిడీ, బెదిరింపుల ఆరోపణలు రావడంతో ఈ కేసును ముంబై పోలీస్‌కు చెందిన దోపిడీ నిరోధక విభాగానికి బదలాయించామని వెల్లడించారు. ఇక జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ దర్శకులు మహేష్ మంజ్రేకర్ నిర్ధేశకత్వంలో తెరకెక్కిన వాస్తవ్, అస్తివ, విరుద్ధ్ వంటి సినిమాలకు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయి.. కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన 34 ఏళ్ల వ్యక్తి అబూ సలేం ముఠా సభ్యుడిగా పేర్కొంటూ మహేష్ మంజ్రేకర్‌ను బెదిరించినట్టు గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడు మహారాష్ట్రలోని ఖేడ్ జిల్లాకు చెందిన మిలింద్ తుసంకర్‌గా పోలీసులు గుర్తించారు. తుసంకర్‌ను పోలీస్ కస్టడీకి తరలించారు. బెదిరింపులు, దోపిడీ యత్నం ఆరోపణలతో తుసంకర్పై కేసు నమోదు చేశారు. చదవండి : నాకు, నా ఫ్యామిలీకి ముప్పు : రియా -
రెహమాన్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తరువాత బాలీవుడ్ పరిశ్రమలో నెపోటిజంపై పెద్ద దుమారమే రేగింది. దీంతోపాటు సంగీత పరిశ్రమ మాఫియా గుప్పిట్లో చిక్కుకుందంటూ సోనూ నిగంలాంటి ప్రముఖ గాయకులు కూడా బహిరంగంగానే విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రముఖ సంగీత దర్శకుడు, మ్యూజిక్ మేస్ట్రో ఏఆర్ రెహమాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు సంబంధించిన కొన్ని పుకార్లు ఇండస్ట్రీలో వ్యాపించాయని, దీని వెనక ఒక గ్యాంగ్ ఉందని పేర్కొన్నారు. సంగీతాభిమానులు, బాలీవుడ్ తన నుంచి చాలా ఆశిస్తోంటే..దానికి ఒక ముఠా అడ్డుపడుతోందని ఆరోపించారు. రేడియో మిర్చి ఆర్జే సురేన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆస్కార్ అవార్డు గ్రహీత రెహమాన్ చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. బాలీవుడ్ సినిమాలకు సంగీతాన్నిఎందుకు కంపోజ్ చేయలేదని అడిగినపుడు పలు కీలక విషయాలను ఆయన వెల్లడించారు. తాను మంచి సినిమాలకు ఎపుడూ నో చెప్పలేదని, కానీ ఒక ముఠా తనపై పుకార్లను వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు. సినిమాలు తన వరకు రాకుండా కుట్ర చేస్తున్నారనీ, సమయానికి స్వరాలు ఇవ్వరనే తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని రెహమాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా రెహమాన్‌ను సంప్రదించవద్దని సలహా ఇచ్చారంటూ దిల్ బెచారా దర్శకుడు ముఖేష్ ఛబ్రా మాటలను ఆయన గుర్తు చేసుకున్నారు. రెహమాన్ దగ్గరికి వెళ్లొద్దని బాలీవుడ్లో ఛబ్రాకు పలువురు చెప్పారని అన్నారు. కానీ ముఖేష్ ఛబ్రాకు కేవలం రెండు రోజుల్లో నాలుగు పాటలకు స్వరాలు కూర్చి ఇచ్చినట్టు వివరించారు. (కరోనా: కూరలమ్ముకుంటున్న బాలీవుడ్ నటుడు) కాగా తమిళ, తెలుగు సహా అనేక భాషల్లో అద్భుతమైన స్వరాలను అందించిన రెహమాన్ హిందీలో తమాషా, రాక్‌స్టార్, దిల్ సే, గురుతో సహా ఇతర బాలీవుడ్ సినిమాలకు నేపథ్య సంగీతాన్ని అందించారు. ఆయన తాజా ఆల్బం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి చిత్రం దిల్ బెచారా. ఇటీవల మరణించిన సుశాంత్‌కు నివాళిగా రెహమాన్ బృందం వర్చువల్ మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించారు. ఒక స్పెషల్ వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఇందులో రెహమాన్ తో పాటు ఇతర ప్రముఖ గాయకులు, ఈ చిత్ర గేయ రచయిత అమితాబ్ భట్టాచార్య తమదైన రీతిలో నివాళి అర్పించిన సంగతి తెలిసిందే. (ఆ కథనంపై చలించిన సోనూసూద్) -
నటి కిడ్నాప్ ప్లాన్: ముఠా అరెస్టు
కొచ్చి: నటి షమ్నా కాసిం (పూర్ణ)ను కిడ్నాప్ చేసి భారీ ఎత్తున డబ్బు దోచుకోవాలని ప్రయత్నించిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 12 మంది సభ్యుల ముఠాలోని ఎనిమిది మందిని అరెస్టు చేశామని మిగతా నలుగురు పరారీలో ఉన్నారని కొచ్చి పోలీస్ కమిషనర్ విజయ్ సఖారే వెల్లడించారు. అలాగే వీరంతా గత మార్చి నెలలో పాలక్కాడ్‌లో ఎనిమిది మంది మోడల్స్ ను బంధించి, డబ్బుల వసూలు చేసిన కేసులో కీలక నిందితులని చెప్పారు. ఈ సందర్భంగా కిడ్నాప్, బెదిరింపునకు ప్రయత్నించిన ముఠా పథకాన్ని విజయ్ సఖారే మీడియాకు వివరించారు. మొదట షమ్నాతో వివాహ ప్రతిపాదన ద్వారా కుటుంబ సభ్యులతో సంబంధాలు ఏర్పరచుకుని, ఆ తరువాత కిడ్నాప్ చేసి, ఒక హోటల్ గదిలో బంధించి పెద్ద ఎత్తున డబ్బు గుంజాలని ప్లాన్ వేశారని వివరించారు. ఈ క్రమంలోనే షమ్నా నుండి ఒక లక్ష 50 వేల రూపాయలు డిమాండ్ చేశారని ఇది విఫలం కావడంతో కిడ్నాప్ ప్రయత్నాలను ముమ్మరం చేశారని తెలిపారు. సినిమా ఆఫర్ల పేరుతో నటీనటుల వివరాలను సేకరించి, బెదిరించి పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేయాలనేది వీళ్ల పథకమని పేర్కొన్నారు. సినిమా ప్రొడ్యూసర్లమని చెప్పి ప్రొడక్షన్ కంట్రోలర్ షాజీ ద్వారా అనేకమంది ప్రముఖుల ఫోన్ నంబర్ తదితర వివరాలను సేకరించినట్టు వెల్లడించారు. షమ్నా, ఇతర మహిళల ఫిర్యాదుల ఆధారంగా ఈ ముఠాపై ఏడు కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు. అలాగే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ హాస్య నటుడు ధర్మజన్ బోల్గట్టిను కూడా పోలీసులు విచారించారు. గ్యాంగ్‌లోని అస్గర్ అలీ తనకు రెండుమూడు సార్లు ఫోన్ చేశాడని బోల్గట్టి మీడియాకు చెప్పారు. ప్రొడక్షన్ కంట్రోలర్ షాజీ తన నంబర్‌ను ఆ గ్యాంగ్‌కు ఇచ్చాడని చెప్పుకొచ్చారు. లాక్డౌన్ సమయంలో తనను సంప్రదించిన ఈ గ్యాంగ్ షమ్ కాసింను పరిచయం చేయాలని అడిగారని బోల్గట్టి వెల్లడించారు. అయితే, ఈ కేసులో సినీ ప్రముఖులకు ఎలాంటి పాత్ర లేదని పోలీసులు స్పష్టం చేశారు. కాగా తెలుగులో సీమ టపాకాయ్, అవును సినిమాల ద్వారా పూర్ణ ప్రేక్షకులకు సుపరిచితమే. -
నగరంలో నేపాలీ గ్యాంగ్
బంజారాహిల్స్: సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, అగ్ర వ్యాపారవేత్తలను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడే నేపాల్ గ్యాంగ్ నగరంలోకి ప్రవేశించినట్లు పోలీసులకు సమాచారం అందింది. గతంలో ఆబిడ్స్‌లోని ఓ నగల దుకాణంతో పాటు ప్రముఖ వ్యాపారి ఇంట్లో చోరీకి పాల్పడి ఉడాయించిన ఈ ముఠా మళ్లీ నగరంలోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, ఎస్ఆర్నగర్ క్రైం పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ ముఠా సంపన్నులు నివసించే ప్రాంతాలను టార్గెట్‌గా చేసుకొని దోపిడీలకు పాల్పడుతుందని పోలీసులు అనుమానిస్తున్నారు. మంగళవారం ముఠా సభ్యుల ఫొటోలను వివిధ పోలీస్స్టేషన్లకు, క్రైం పోలీసులకు పంపించారు. గతంలో ఈ ముఠా చేసిన చోరీల వివరాలను కూడా వారికి చేరవేశారు. నగరంలోని పలువురు సంపన్నుల ఇళ్ల వద్ద నేపాల్‌కు చెందిన వారు సెక్యూరిటీ గార్డులుగా, ఇళ్ళల్లో పని చేస్తున్నారు. ఈ ముఠా సభ్యులు వారిని సంప్రదించి తమను ఎక్కడైనా సెక్యూరిటీ గార్డుగా, ఇళ్లల్లో పని చేయడానికి నియమించాలంటూ నమ్మిస్తారు. వారి ద్వారా విధుల్లో చేరిన అనంతరం సదరు ఇంటి పూర్తి సమాచారం, యజమానుల కదలికలు తెలుసుకొని దొంగతనాలు చేసి ఉడాయిస్తారు. ఇటీవల బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉత్తమ్ రెడ్డి ఇంట్లో రూ. 2 కోట్ల విలువైన వజ్రాభరణాలు, జూబ్లీహిల్స్ రోడ్ నెం. 28లో విల్లామేరి కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఫిలోమినా ఇంట్లో రూ. 30 లక్షల విలువైన ఆభరణాలు, ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రూ. 25 లక్షల విలువైన వస్తువులు దొంగిలించింది ఒక్కరే కావడం, సీసీ ఫుటేజీల్లో అతడి కదలికలు, ముఖవర్చస్సు నేపాలీని తలపిస్తుండటంతో పోలీసులు ఈ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ప్రశాసన్‌నగర్, పంజాగుట్ట, గచ్చిబౌలి, మాదాపూర్, మణికొండ, సోమాజిగూడ, బేగంపేట తదితర ప్రాంతాల్లో సంపన్నులు తమ ఇళ్ల వద్ద సెక్యూరిటీ గార్డులుగా విధులు నిర్వహించే నేపాలీల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. వారి పూర్తి వివరాలు, గత చరిత్ర తెలుసుకున్న తర్వాతే పనిలో చేర్చుకోవాలని పేర్కొన్నారు. సెక్యూరిటీ గార్డులుగా చేర్చుకునే ముందు ఇతర నేపాలీలను సంప్రదించాలని వారు సూచిస్తున్నారు. అనుమానాస్పద యువకుడి ఫొటోలు విడుదల ఖరీదైన నివాసాలు, ప్రముఖులను లక్ష్యంగా చేసుకొని దోపిడీలకు పాల్పడే నేపాలీ ముఠా సభ్యులు ముగ్గురితో పాటు మరో యువకుడు కూడా వీరితోనే ఉంటూ నేరాలకు పాల్పడుతున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ప్రముఖుల ఇళ్ల వద్ద సెక్యూరిటీ గార్డులు, కారు డ్రైవర్, ఇంట్లో పని చేసే నెపంతో చేరుతూ అదును చూసి దొంగతనానికి పాల్పడుతుంటాడని పేర్కొంటూ పోలీసులు ఓ యువకుడి ఫొటోలు విడుదల చేశారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లోని సంపన్నులు ఇలాంటివారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. -
అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఈస్ట్ జోన్లో అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్‌ను పోలీసు అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ గ్యాంగ్‌కు చెందిన ముగ్గురు సభ్యులను అరెస్ట్ చేశామని.. వారి నుంచి సుమారు రూ. 12 లక్షల రూపాయల నగదును స్వాదీనం చేసుకున్నామని తెలిపారు. ఈ కేసులో అబిద్ మోహినుద్దీన్, షేక్ అబ్దుల్ బాసిత్, సంబరం రాజేష్‌లను అరెస్ట్ చేశామన్నారు. రాజేష్ కుమార్ బగడియా అనే వ్యక్తిని ఈ ముఠా మోసం చేసిందని పేర్కొన్నారు. పాత నోట్లను మార్పిడి చేస్తామంటూ.. రాజేష్‌ను నమ్మించారని చెప్పారు. రెండు రోజుల్లో ఈస్ట్ జోన్ పోలీసులు ఈ కేసును చేధించారని సీపీ పేర్కొన్నారు. -
నెల్లూరులో.. టీడీపీ వర్సెస్ విష్ణు
కావలి: కావలి టీడీపీలో గందరగోళం నెలకొంది. కొత్త, పాత నేతల మధ్య కుదరని సఖ్యతతో రోజుకో వివాదం, పూటకో పంచాయతీ, సర్దుబాట్లతో తెలుగుతమ్ముళ్లు కుమ్ములాడుకుంటున్నారు. ముఖ్యంగా టీడీపీ నేతలకు, ప్రస్తుత కావలి అసెంబ్లీ అభ్యర్థి కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డికి మధ్య వ్యవహారం చెడింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నాయకులతోపాటు ఇప్పటివరకు కావలి ఇన్చార్జ్గా ఉన్న బీద మస్తాన్‌రావుకు సన్నిహితులైన నాయకులను కనీసం మనుషులుగా కూడా గుర్తించలేని స్థితిలో ఉన్న కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి కోసం పనిచేయడం అంటే ఆత్మాభిమానం చంపుకోవాల్సిన దుస్థితి అని టీడీపీ శ్రేణులు రగిలిపోతున్నారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన విష్ణువర్ధన్‌రెడ్డి గెలిస్తే కావలిని తిప్ప దొంగలు పరిపాలన చేస్తారని, కావలి ప్రజలు నిద్రపోయే పరిస్థితి ఉండదని, కావలిని దొంగలు రాజ్యమేలుతారని తామే ప్రచారం చేశామని, ఇప్పుడు ఆయనకు ఓట్లేయాలని చెబుతుంటే ప్రజలే ఆనాడు తాము చెప్పిన అంశాలను గుర్తుచేస్తున్నారని, ఇది ప్రచారంలో ఇబ్బందిగా ఉందని టీడీపీ నాయకులు వాపోతున్నారు. అందుకు తార్కాణం విష్ణువర్ధన్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేసే సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ట్రంక్‌రోడ్డులో ఉన్న వ్యాపారవర్గాల ప్రతినిధులు ఒక్కరు కూడా కనీసం పలకరించడానికి రాలేదని టీడీపీ నాయకులు గుర్తుచేస్తున్నారు. అదే వైఎస్సార్సీపీ అభ్యర్థిగా రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేసే సందర్భంలో జరిగిన ర్యాలీలో ట్రంక్‌రోడ్డులోని వ్యాపారవర్గాల ప్రతినిధులు కిక్కిరిసిన జనాల రద్దీ నడుమ ఆయనను సత్కరించారని కూడా గుర్తుచేస్తున్నారు. ఈ తేడా చాలని కావలి ప్రజల ఆదరణ ఎవరికి ఉందనే విషయం తేటతెల్లం చేస్తోందని టీడీపీ నాయకులు చెబుతుండడం గమనార్హం. అల్లూరులో అధికారపార్టీ రౌడీయిజం ఎన్నికల ప్రచారం సీరియస్‌గా జరుగుతున్న నేపథ్యంలో కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి వర్గం, ఆయన కుమారుడు, వేర్వేరుగా వైఎస్సార్సీపీ నాయకులపై రౌడీయిజం చేస్తున్నారు. రాత్రి సమయాల్లో వైఎస్సార్సీపీ నేతలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కాళ్లు విరగ్గొడతామని హెచ్చరించడం, ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ప్రజలను భయకంపితులను చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని ప్రజల్లోకి వెళ్లిపోయిందని, ప్రచారంలో ప్రజలు ఈ అంశాలపైనే తమను ప్రశ్నిస్తున్నారని టీడీపీ నాయకులే చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి సౌమ్యుడు అనే సానుకూలత ప్రజల్లో బలంగా ఉన్న నేపథ్యంలో.. ‘నా సంగతి ఎమ్మెల్యేకు పూర్తిగా తెలియదు, నేనేందో చూపిస్తా ఎమ్మెల్యేకు’.. అంటూ సాక్షాత్తూ మీడియా ముందే విష్ణువర్ధన్‌రెడ్డి హెచ్చరించడాన్ని కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారని టీడీపీ శ్రేణులు చెబుతుండడం గమనార్హం. ఇదిలా ఉంటే ప్రచారంలో పాల్గొంటున్న వారికి భోజనాల విషయంలో కూడా అభ్యర్థి మనుషులు చులకనగా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థి అనుచరుల తీరు, పార్టీ క్యాడర్‌ను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని, అందుకు నిరసనగా బుధవారం నుంచి భోజనాలు పెట్టే పథకాన్ని రద్దు చేశారు. అలాగే ఎన్నికల ప్రచారం, ఇతరత్రా అంశాల విషయంలో టీడీపీ నాయకులతోపాటు ప్రాంతాల వారీగా విష్ణువర్ధన్‌రెడ్డికి చెందిన వ్యక్తులు కూడా పరిశీలన నిమిత్తం నియమించాలనే అంశాన్ని టీడీపీ నాయకులు జీర్ణించుకోలేపోతున్నారు. తమపై నిఘా పెట్టి ఎన్నికల ప్రచారం తమను చేయమనడం ఏమిటని, అంతగా తమ పట్ల నమ్మకం లేకపోతే అసలు తమ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఎందుకు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాలన్నింటినీ టీడీపీ జిల్లా అధ్యక్షుడైన బీద రవిచంద్ర దృష్టికి తీసుకెళ్లి చర్చించి, తాము తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరిస్తున్నారు. -
ప్రేమజంటను చితకబాదిన దుండగుల ముఠా
-
చోరీ ఫోన్లకు ‘రెక్కలు’
సాక్షి, సిటీబ్యూరో: ఒకప్పుడు చోరీ చేసిన ఫోన్లను యధాతథంగా వినియోగించడం/విక్రయించడం జరిగేది.ఆ తర్వాత కొన్నాళ్లకు తస్కరించిన ఫోన్ల ఐఎంఈఐ నెంబర్లను ట్యాంపరింగ్/క్లోనింగ్ చేసి వాడటం మొదలెట్టారు.ఇప్పుడు చోరీ చేసిన వాటిలో అత్యంత ఖరీదైన సెల్ఫోన్లను గుట్టుగా విదేశాలకు తరలించేస్తున్నారు.నగరంలో అపహరణకు గురవుతున్న సెల్ఫోన్లలో ఖరీదైనవి అత్యధిక భాగం బ్యాంకాక్, చైనాలకు తరలిపోతున్నట్లు పోలీసులు గుర్తించారు. దేశంలో ఉన్నవి సైతం ప్రధానంగా కర్ణాటకలోని గుల్బర్గా మార్కెట్‌కు వెళ్తున్నాయి. ఫలితంగా వీటిని రికవరీ చేయడం కష్టసాధ్యంగా మారుతోందని అధికారులు పేర్కొంటున్నారు. అనధికారిక సమాచారం ప్రకారం నగర వ్యాప్తంగా ఏటా దాదాపు లక్ష వరకు సెల్ఫోన్లు చోరీకి గురవుతున్నాయి. రాజధానిలో అనేక ముఠాలు సెల్‌ఫోన్ పిక్‌పాకెటింగ్, స్నాచింగ్‌ను వ్యవస్థీకృతంగా చేస్తున్నాయి. బస్సు ప్రయాణికులు, పాదచారులను లక్ష్యంగా చేసుకుని ఈ సెల్ఫోన్ల చోరీ చేస్తున్నారు. బాధితు ల్లో మధ్య తరగతి వారే ఎక్కువగా ఉంటున్నారు. పర్సుల నుంచి సెల్ఫోన్ల వరకు... నగరంలోని పిక్‌పాకెటింగ్ గ్యాంగ్‌లు ఒకప్పుడు కేవలం పర్సులను మాత్రమే టార్గెట్ చేసేవి. అయితే క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగం పెరగడంతో వీరికి పర్సులతో ‘గిట్టుబాటు’ కావట్లేదు.ఈ నేపథ్యంలో ఇటీవల వీరు సెల్ఫోన్లపై దృష్టి సారించారు. పీడీ యాక్ట్ ప్రయోగం వరకు కరుడుగట్టిన రౌడీషీటర్లు ఫయాజ్, ఖైసర్, షేరూ, లతీఫ్ తదితరులు ముఠాలు కట్టి మరీ వ్యవస్థీకృతంగా సెల్‌ఫోన్ చోరీలకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఇప్పటికీ మరికొన్ని చోటా మోటా ముఠాలు ఈ దందా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి ఐదుగురు సభ్యుల ముఠాను ముషీరాబాద్ పోలీసులు శనివారం పట్టుకున్నారు. ఇలాంటి ముఠాలు పరిధులను సైతం ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఒకరి ఏరియాల్లోకి మరొకరు ప్రవేశిస్తుండటంతో వీటి మధ్య అనేక సందర్భాల్లో గ్యాంగ్ వార్స్ జరిగి హత్యలకు దారి తీస్తున్నాయి. గతంలో ఐఎంఈఐ నంబర్ మార్చేసి... ప్రతి మొబైల్‌ఫోన్‌కు ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్యూప్మెంట్ ఐడెంటిఫికేషన్‌గా పిలిచే ఐఎంఈఐ నెంబర్ ఉంటుంది. మనిషి వేలిముద్రల తరహాలోనే ప్రపంచంలోని ఏ రెండు సెల్ఫోన్లకూ ఒకే నెంబర్ ఉండదు. సదరు సెల్‌ఫోన్‌ను ఏ వ్యక్తి వినియోగిస్తున్నది తెలుసుకోవడానికి ఇది ఉపకరిస్తుంది. జాతీయ భద్రత నేపథ్యంలో ఇది ఎంతో కీలకం. ఐఎంఈఐ నంబర్ ట్యాంపర్ చేసేందుకు ఉపకరించే గ్యాడ్జెట్ విపణిలో లభిస్తున్నాయి. చోరీ ఫోన్లకు దొంగల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసే వ్యక్తులు ఈ గ్యాడ్జెట్స్‌ను వినియోగించి దానికి ఉన్న నెంబర్‌కు బదులు మరో ఐఎంఈఐ నెంబర్ కేటాయించేవారు. మరోపక్క పనికి రాని పాత ఫోన్లను రూ.వందల్లో కొనుగోలు చేస్తూ వాటి మదర్ బోర్డ్‌పై ఉన్న ఐఎంఈఐ నెంబర్ స్ట్రిప్‌ను ట్యాంపరింగ్ ద్వారా సేకరించి చోరీ వాటికి వేసే వారు. దీంతో సాంకేతికంగా చోరీ ఫోన్లను పట్టుకోవడం సాధ్యం కాదు. సరిహద్దులు దాటిస్తూ... తాజాగా చోరీ సెల్ఫోన్లను కొనుగోలు చేస్తున్న, చోరీ చేస్తున్న వారి పంథా పూర్తిగా మారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ముషీరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన ఐదుగురిలో ఒకడైన నజీరుద్దీన్ ఆరునెలల్లో దాదాపు నాలుగు సార్లు బ్యాంకాక్ వెళ్ళి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఈ కోణంపై ఆరా తీయగా, తనతో పాటు మరికొందరు ‘ఐ–ఫోన్లను’ సరిహద్దులు దాటించేస్తున్నట్లు వెల్లడించాడు. ఒక్కో విడతలో నాలుగైదు ఫోన్ల చొప్పున బ్యాంకాక్ తీసుకువెళ్లి అక్కడ మార్కెట్లో అమ్మేసి వస్తున్నట్లు అంగీకరించాడు. నగరంలో జగదీష్ మార్కెట్ తరహాలోనే ఆ దేశంలోనూ ఓ భారీ సెకండ్ హ్యాండ్ ఫోన్ల మార్కెట్ ఉందని, అయితే అక్కడ ఐ–ఫోన్లకు మాత్రమే గిరాకీ ఉన్నట్లు వెల్లడించాడు. గుల్బర్గాలోని సెకండ్ హ్యాండ్ మార్కెట్ దేశంలో చోరీ మాల్‌కు కేరాఫ్ అడ్రస్‌గా పోలీసులు గుర్తించారు. ఇలా తరలిపోతున్న వాటిని ట్రాక్ చేయడం సాధ్యం కావట్లేదని చెబుతున్నారు. రిటర్న్ రూపంలో చైనాకు... నగరంలోని అనేక ప్రాంతాలకు చెందిన చోరీ మాల్ వ్యాపారస్తులు సిండికేట్‌గా చైనా మార్గాన్ని ఎంచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గడిచిన కొన్నేళ్లుగా చైనా నుంచి వివిధ రకాలైన వస్తువులను దిగుమతి చేసుకోవడం సాధారణమైంది. ఇలా వచ్చిన మాల్లో కొంత అనేక కారణాల నేపథ్యంలో రిటర్న్ చేస్తుంటారు. వీటితో కలిపి చోరీ సెల్ఫోన్లను చైనాకు పంపేస్తున్నట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. పక్కా ప్రొఫెషనల్ చోరుల నుంచి ఖరీదు చేసిన ఖరీదైన హై–ఎండ్ ఫోన్లను మాత్రమే ఇలా పంపేస్తున్నట్లు భావిస్తున్నారు. రిటర్న్ మాల్లో గోప్యంగా దాచి పంపిస్తున్న నేపథ్యంలో కస్టమ్స్ అధికారులకూ చిక్కట్లేదని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల చోరీకి గురైన హై–ఎండ్ సెల్ఫోన్లను రికవరీ చేయడం అసాధ్యంగా మారినట్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వ్యవహారాలపై దృష్టి పెట్టిన పోలీసులు బాధ్యుల కోసం లోతుగా ఆరా తీస్తున్నారు. జాగ్రత్తలే మేలు... సెల్ఫోన్లను కోల్పోయిన సందర్భంలో బాధితులను ఎక్కువగా ఆందోళనకు గురిచేసేది దాని ఖరీదు కంటే అందులో ఉన్న డేటానే. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ స్నేహితులు, సన్నిహితులు, బంధువులు... చివరకు తల్లిదండ్రులు, భార్య ఫోన్ నెంబర్లు, అత్యంత కీలకమైన డేటాను సెల్లోనే ఫీడ్ చేసుకుంటున్నారు. ఫలితంగా ఒక్కసారి ఫోన్ పోగొట్టుకుంటే... దాదాపుగా అందరితోనూ సంబంధాలు తెగిపోతున్నాయి. విలువైన సమాచారం కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పోలీసులు సూచిస్తున్నారు. ప్రతి సెల్‌ఫోన్‌కు 15 అంకెలతో కూడిన ఐఎంఈఐ (ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ నెంబర్) ఉంటుంది. మెబైల్ ప్యాకింగ్ బాక్స్‌పైనా, అమ్మకం బిల్లుపైనా దీన్ని ముద్రిస్తారు. మీ సెల్ఫోన్లో (06) బటన్లు నొక్కితే ఈ నెంబరు డిస్ప్లే అవుతుంది. ఈ సంఖ్యను నోట్ చేసుకుని భద్రంగా ఉంచుకోవాలి. ఫోను పోయినప్పుడు దీన్నిబట్టి ఆచూకీ కనుక్కోవడానికి ప్రయత్నించవచ్చు. మీ సెల్‌ఫోన్‌ను సెక్యూరిటీ లాక్ పెట్టుకోవాలి. ప్రతి ఫోనులోనూ ఉన్న మెనూలో సెట్టింగ్స్, సెక్యూరిటీ సెట్టింగ్స్‌లో ఇది అందుబాటులో ఉంటుంది. దీనిని సెట్ చేసుకోవడం వల్ల మన ఫోను ఎవరికైనా దొరికినా, దొంగిలించినా... వినియోగించుకోవడం, అందులోని వ్యక్తిగత డేటాను చూడటం వారి వల్లకాదు. ప్రస్తుతం కొన్ని సర్వీస్ ప్రొవైడర్ కంపెనీలు, వెబ్‌సైట్స్ ఫోన్‌బుక్‌తో పాటు కొంత డేటా, ఫొటోలు బ్యాకప్/స్టోర్ చేసుకునే సౌకర్యాన్ని అందిస్తున్నాయి. వీటిని వినియోగిం చుకోవడం ద్వారా మీ ఫోన్లో సేవ్ చేసుకుంటున్న డేటా అంతా ఓచోట బ్యాకప్ అవుతుంది. దీని వల్ల ఫోన్ పోయినా... మీ డేటా సర్వర్‌లో సురక్షితంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమకు సంబంధించిన ఫోన్ నెంబర్లను కేవలం సెల్లో ఫీడ్ చేసుకోవడంతో పాటు ఆ డేటా మొత్తం డేటా కార్డు సాయంతో కంప్యూటర్లో, సీడీల్లో భద్రపరుచు కోవడం లేదా కీలక నెంబర్లన్నీ రాసి పెట్టుకోవడం మంచిది. -
హైదరాబాద్‌లో కల్తీ మద్యం కలకలం
-
పిల్లల కిడ్నాప్ ముఠా సంచారం..!
పిల్లల కిడ్నాప్ ముఠా సంచరిస్తున్నదా..? మాయమాటలు చెప్పి తీసుకెళుతున్నదా..? కింది వార్త చదివిన తరువాత.. ఈ రెండు ప్రశ్నలకు ‘ఔను’ అనే సమాధానమే వస్తుంది. కిడ్నాప్ ఇలా... ఖమ్మంక్రైం: ఓ బాలుడిని కొందరు పకడ్బందీగా కిడ్నాప్ చేశారు. అంతే చాకచక్యంగా వారి నుంచి ఆ బాలుడు తప్పించుకున్నాడు. కల్లూరుకు చెందిన గుండ్ర కుటుంబరావు–అరుణ దంపతుల కుమారుడు ప్రమోద్(11), శనివారం సాయంత్రం జ్యూస్ తాగడానికి సెంటర్‌కు వచ్చాడు. అప్పటికే అక్కడ టాటా ఏస్ వాహనంలో ఆగి ఉంది. అందులో ఇద్దరు పురుషులు, ఒక మహిళ కూర్చున్నారు. ఆ మహిళ.. ‘‘బాబూ..! ఇలా రా...’’ అని పిలిచింది. ప్రమోద్ వెళ్లాడు. ‘‘నీ పేరేమిటి..? ఏం చదువుతున్నావ్..? మీ ఇల్లు ఎక్కడ..? మాకు చూపిస్తావా..? మమ్మల్ని తీసుకెళతావా..?...’’ ఇలా ఏవేవో కబుర్లు చెబుతోంది. ఆ చిన్నారి సమాధానమిస్తున్నాడు. లోపల కూర్చున్న ఆ ఇద్దరు పురుషులు, చుట్టూ పరిసరాలను గమనిస్తున్నారు. ఆమె మాట్లాడుతూ.. మాట్లాడుతూనే.. తన చేతిలోని కర్చీఫ్‌ను ఆ చిన్నారి మొహానికి బలంగా అదిమింది. ఆ కర్చీఫ్‌కు అప్పటికే మత్తు మందు పూసి ఉండడంతో ప్రమోద్ వెంటనే స్పహ కోల్పోవడం, అతడిని ఆ ఇద్దరు పురుషులు వాహనంలో ఎక్కించడం.. క్షణాల్లో జరిగిపోయింది. ఇలా తప్పించుకున్నాడు... ఆ వాహనం ఖమ్మం దగ్గరలో ఉండగా ఆ చిన్నారి ప్రమోద్‌కు మెలకువ వచ్చింది. సరిగ్గా ఆ క్షణాన.. ఆ చిన్నారి మెదడు పాదరసంలా చక్కగా పనిచేసింది. వారికి అనుమానం రాకుండా ఉండేందుకుగాను, అలాగే పడుకుని ఉన్నాడు. క్రీగంటితో (చూసీచూడనట్టుగా) ఆ ముగ్గురిని, పరిసరాలను గమనిస్తూనే ఉన్నాడు. ఖమ్మం బస్టాండ్ వద్ద ఆ వాహనం ఆగింది. ఆ ముగ్గురూ అక్కడ టీ తాగుతున్నారు. వారు ఏమరుపాటుగా ఉండడాన్ని గమనించి, నెమ్మదిగా డోర్ తెరుచుకుని తప్పించుకున్నాడు. బిగ్గరగా ఏడుస్తూ స్టేషన్ రోడ్ వైపు పరుగెత్తుతున్నాడు. ఆ ప్రాంతంలోని రాధాకృష్ణ రెడీమేడ్ షాపు యజమాని, సిబ్బంది గమనించి ఆ బాలుడిని ఆపి, ఏమైందంటూ ఆరా తీశారు. భయంతో వణుకుతూనే.. మాటలు తడబడుతూ జరిగినదంతా చెప్పాడు. ఆ షాపు వారు వెంటనే వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు సమాచారమిచ్చారు. బాలుడితో కలిసి బస్టాండ్ వద్ద వెతికినప్పటికీ కిడ్నాపర్లుగానీ, వారి వాహనంగానీ కనిపించలేదు. ఆ బాలుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఎస్ఐ రాము ఇచ్చిన సమాచారంతో ప్రమోద్ తల్లిదండ్రులు వచ్చారు. బిడ్డడి కోసం చాలాసేపటి నుంచి వెతుకుతున్నామంటూ వారు భోరున విలపించారు. బిడ్డడిని గుండెలకు హత్తుకున్నారు. ఆ బాలుడిని వారికి ఎస్ఐ రాము అప్పగించారు. ఈ బాలుడిని కాపాడిన రాధాకృష రెడీమేడ్ షాపు యజమాని రాధాకృష్ణను ఎస్ఐలు రాము, ప్రభాకర్‌రావు, ప్రమోద్ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. -
పార్ధీ గ్యాంగ్ వస్తోంది..జగ్రత్త...
మైదుకూరు టౌన్ : ఉత్తర భారతదేశానికి చెందిన పార్ధిగ్యాంగ్ రాయలసీమ జిల్లాల్లో సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో ప్రత్యేక నిఘా ఉంచారు. ఇప్పటి వరకు కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో దోపిడీలకు పాల్పడిన ఈ గ్యాంగ్ తాజాగా చిత్తూరు జిల్లాలో సంచరిస్తున్నట్లు అక్కడి పోలీసులకు సమాచారం రావడంతో మన జిల్లా పోలీసులు ముందస్తు నిఘా ఉంచారు. ఈ గ్యాంగ్ సభ్యులు రాత్రి వేళల్లో నిర్మానుష్యమైన కాలనీల్లో, తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దోపిడీ చేయడం వీరి ప్రత్యేకత. పగటి వేళల్లో వీధుల వెంబడి సంచరించి ఇళ్లను ఎంపిక చేసుకుంటారు. శివారు కాలనీలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. వీరు పగలు బిచ్చగాళ్లుగా, కూలీలుగా, చిన్న చిన్న వ్యాపారులుగా వీధుల్లో తిరుగుతుంటారని పోలీసులు తెలుపుతున్నారు. ఈ గ్యాంగ్ సభ్యులు దోపిడీ చేసే సమయంలో ఇంట్లో అడ్డు వచ్చిన వారిని అతి కిరాతకంగా చంపడానికి కూడా వెనుకాడబోరని పోలీసుల కథనం. ఈ నేపథ్యంలో మైదుకూరు పోలీసులు పట్టణ శివారు ప్రాంతాల్లో అనుమానితులుగా ఉండే వ్యక్తులను గుర్తించి వారి వేలిముద్రలను, ఆధారాలను సేకరిస్తున్నారు. పట్టణంలోని అంకాళమ్మ గుడి, బైపాస్ రోడ్డు పక్కన నివాసం ఉండే వ్యక్తును గుర్తించి వారి వేలిముద్రలను సేకరించారు. పార్థి గ్యాంగ్ సభ్యులు పూర్తిగా హిందీలో మాట్లాడతారని, ఎవరైనా అనుమానితులుగా కనిపిస్తే వెంటనే 100కు డయల్ చేసి సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. మైదుకూరు బస్టాండు, బైపాస్ రోడ్డులో పోలీసులు ప్రత్యేక పికెట్ ఏర్పాటు చేసి నిఘా పెంచారు. -
కిరాతక కాండ
ఒంగోలు క్రైం:పదిహేను ఏళ్ల క్రితం ఒంగోలు పట్టణ శివారు ప్రాంతాల్లో చోటు చేసుకున్న కిరాతక కాండలు మళ్లీ తెరపైకి వచ్చాయి. అప్పట్లో దశరాజుపల్లి రోడ్డు, కొత్తపట్నం రోడ్డు, అగ్రహారం రోడ్డు, వెంగముక్కపాలెం రోడ్డు, పేర్నమిట్ట శివారు ప్రాంతం, త్రోవగుంట శివారు ప్రాంతం, చెరువుకొమ్ముపాలెం రోడ్డు శివారు ప్రాంతాలంటే చీకటి పడితే ఒంటరిగా అయినా, జంటగా అయినా వెళ్లాలంటే భీతిల్లిపోయేవారు. దాడులు, దోపిడీలు, అత్యాచారాలు, హత్యలు ఇలా ఒకటేమిటి రౌడీలు, ఆకతాయిలు, తాగుబోతుల దుశ్చర్యలకు అడ్డూ అదుపూ ఉండేది కాదు. దశరాజుపల్లె రోడ్డు అయితే మరీ దారుణాలు జరిగేవి. అందుకే ఆ గ్రామం 80 శాతం ఖాళీ అయింది. ప్రస్తుతం సెంట్రల్ క్రైం స్టేషన్ (సీసీఎస్) పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వస్తున్న దారుణాలు అప్ప టి పరిస్థితులను జ్ఞప్తికి తెస్తున్నాయి. శివారు ప్రాంతాలతో పాటు పరిసర ప్రాంత మండలాల్లోని ఏకాంత ప్రాం తాలు కిరాతకులకు అడ్డాగా మారాయి. సీసీఎస్ పోలీసులు ఐదారు రోజుల క్రితం చిన్నపాటి దొంగను విచారించేందుకు తీసుకొచ్చారు. ఆ దొంగ చెప్పిన దారుణాలు విన్న నేరవిభాగం పోలీసులకు కళ్లు బైర్లు కమ్మాయి. చీమకుర్తిని కేంద్రంగా చేసుకొని ఓ ముఠా సాగిస్తున్న అత్యాచారాలు, హత్యలు, దోపిడీలు, దాడుల విషయం తెలుసుకొని దర్యాప్తు ప్రారంభిస్తే రక్తం ఉడికింది. చదువు, సంధ్యాలేని ఒక కిరాతకుడు సాగిస్తున్న దారుణ దమనకాండ, కిరాతకాలు, రాక్షసత్వాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.æ జిల్లా చరిత్రలో మునుపెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో, ఎన్నడూ లేని విధంగా సాగించిన రాక్షసత్వాలు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఆ నరహంతక ముఠాకు నాయకుడు పాలపర్తి ఏసు. రెండేళ్ల వరకూ కుందేళ్లు, అడవి పందులు పట్టుకుంటూ జీవనం సాగించే ఏసు కన్ను సాగర్ కాలువపై ఏకాంతంగా గడిపేందుకు వచ్చే యువ జంటలపై పడింది. వాళ్ల ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు మొదట లక్ష్యంగా చేసుకున్నాడు. అందుకోసం తాను ఒక్కడినే అయితే సాధ్యం కాదని ఆలోచించి సాగర్ కాలువలపై చేపల వేటకు వచ్చే సంచార జాతులకు చెందిన యువకులను చేరదీశాడు. కొండలు, శ్రీను, గంగయ్య అనే యువకులను అక్కడ నుంచి అతని కిరాతక పర్వానికి శ్రీకారం చుట్టాడు. జంటగా వచ్చే వారిని గుర్తించి తొలుత యువకుడిపై దాడి చేసి తీవ్రంగా రాళ్లతో, కర్రలతో కొట్టేవారు. ఆ తరువాత యువతిపై అత్యాచారం చేసేవాడు. మిగతా వాళ్లతో కూడా అత్యాచారం చేయించేవాడు. ఆ తరువాత వాళ్ల వద్ద ఉన్న బంగారు ఆభరణాలను, నగదును లాక్కొనేవాడు. నలుగురిగా ఉన్న ముఠాను పదిమందికి పెంచా డు. ఏడాదిన్నరగా ఈ ముఠా చేయని అకృత్యాలు లేవు. 30కి పైగా అత్యాచారాలు: ఏసు ముఠా దాదాపు ఏడాదిన్నరగా సాగిస్తున్న అత్యాచారాల సంఖ్య 30కి పైగా దాటిందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అందులో 25 మందికిపైగా పెళ్లికాని యువతులు, విద్యార్థినులు ఉన్నారని తెలియటంతో పోలీసులు నోరెళ్ల బెట్టారు. వీరి అఘాయిత్యాల బారిన పడిన మహిళల్లో పెళ్లికాని ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారని తేలింది. మొదట దాడులు, ఆ తరువాత అత్యాచారాలు, అనంతరం దోపిడీలు వీరికి నిత్యకృత్యంగా మారింది. ఇంత దారుణాలు చేస్తూ విలాసవంతమైన జీవనం గడుపుతున్నా పోలీసులు మాత్రం ఆవైపు కన్నెత్తి కూడా చూడలేదంటే పోలీస్ నిఘా వైఫల్యం ఏమేరకు ఉందో అట్టే అర్థమవుతోంది. దోచుకున్న బంగారాన్ని చీమకుర్తితో పాటు పరిసర ప్రాంతాల్లో ప్రైవేటు బంగారు కుదువకట్టు వ్యక్తుల వద్ద కొంత, బంగారు తాకట్టు పెట్టే ఫైనాన్స్ కంపెనీల్లో కొంత తాకట్టు పెట్టి జల్సాగా జీవనాన్ని సాగిస్తున్నారు. సాగర్ కాలువలో గుర్తు తెలియని మృతదేహాల వెనుక వీరి పాత్ర...:తొలుత సాగర్ కాలువపై రాక్షస క్రీడను ప్రారంభించిన ఏసు ముఠా కొందరిని హతమార్చి కాలువలో పడేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలినట్లు సమాచారం. జంటగా వచ్చిన వారిపై తొలుత దాడి చేసిన ఘటనలో తీవ్రంగా ప్రతిఘటించిన వారిని విచక్షణా రహితంగా కొట్టడంతో చనిపోయినట్లు సమాచారం. చివరకు కొనఊపిరితో ఉన్నా కాలువలో పడేసినట్టు తెలుస్తోంది. సాగర్ కాలువలో రెండేళ్ల నుంచి గుర్తు తెలియని మృతదేహాల వెనుక పాలపర్తి ఏసు ముఠా హస్తం ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. యువతులు చనిపోయినా అత్యాచారం చేయాల్సిందే. బంగారు ఆభరణాలు దోచుకోవాల్సిందే. భర్తపై దాడి చేసి తీవ్రంగా కొట్టి చెట్లకు కట్టేసి అతని ముందే అత్యాచారం చేసేవారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇక స్నేహితుని ముందు ప్రియురాలిని, అన్న, తమ్ముడు ముందు సోదరిని, తండ్రి ముందు కుమార్తెను ఇలా ఈ ముఠా చేయని దురాగతాలు లేవంటే నమ్మశక్యం కాదు. ఇప్పటి వరకు సీసీఎస్ పోలీసులు మొత్తం పది మంది ఏసు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకొని విచారించటంతోపాటు దోచుకున్న బంగారు ఆభరణాలు, సొత్తును స్వాధీనం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. నిర్భయంగా బాధితులు ముందుకు వస్తే మరిన్ని దారుణాలు వెలుగు చూస్తాయి. పరువు కోసం బయటకు రావటానికి ఇష్ట పడని బాధితులు పరువు కోసం తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవటానికి ఇప్పటికీ బాధితులు ముందుకు రావటం లేదు. ఒకరిద్దరు ముందుకు వచ్చినా పూర్తి విషయాలు చెప్పకుండా దోచుకున్న బంగారు ఆభరణాల వరకు మాత్రమే చెప్పి వదిలేస్తున్నారు. సోమవారం ఒక ప్రభుత్వ ఉద్యోగిని తనకు జరిగిన అన్యాయాన్ని సీసీఎస్ పోలీసులకు చెప్పింది. అయితే ఆ బాధితురాలు చెప్పని నిజాన్ని పాలపర్తి ఏసు ముఠా చెప్పటంతో పోలీసులు నివ్వెరబోయారని తెలిసింది. ఆ ఉద్యోగినిపై అత్యంత దారుణంగా ఐదుగురు కలిసి లైంగికదాడి చేశారు. గత ఏడాది మల్లవరం డ్యాం వద్ద లైంగికదాడి జరిగింది. అప్పట్లో ఆ ఘటనను “సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఆ ఘటనను పోలీసుల చాలా తేలిగ్గా తీసుకున్నారు. అప్పట్లోనే పోలీసులు పూర్తి స్థాయిలో దృష్టి సారించి ఉంటే ఆ తరువాత ఎంతో మంది ఏసు ముఠా బారి నుంచి బయట పడేవాళ్లు. ఎక్కువ మంది బాధితులు ఒంగోలు నగరంతో పాటు టంగుటూరు, సంతనూతలపాడు, చీమకుర్తి, మద్దిపాడు, ఒంగోలు మండలం, నాగులుప్పలపాడు, పొదిలి, మర్రిపూడి, అద్దంకి, దర్శి మండలాలకు చెందిన వారే. వీరితో పాటు వివిధ కళాశాలల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థినులు కూడా వీరి అకృత్యాలకు బలయ్యారు. -
ఏలూరులో చెడ్డీ గ్యాంగ్ ?
వారు నరరూప రాక్షసులు.ఆ గ్యాంగ్ పేరు వింటేనే సామాన్యులకు హడల్. అదే చెడ్డీ గ్యాంగ్. ఈ ముఠా సభ్యులు నగలు దోపిడీ చేయటమే కాదు.. మహిళలను మానభంగం చేస్తారు. ప్రాణాలను సైతం నిర్థాక్షిణ్యంగా తీసేస్తారు. ఏలూరు టౌన్ :ఏలూరు నగరంలో ఈ గ్యాంగ్ గురువారం అర్ధరాత్రి 1.05 గంటలకు ఒక ఇంట్లో దోపిడీకి విఫలయత్నం చేసింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆ ఇంటిలో అద్దెకు ఉంటున్న యజమాని అర్ధరాత్రి వేళ పోలీసులకు సమాచారం ఇచ్చినా సకాలంలో స్పందించకపోవటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. భగవంతుడే తమని కాపాడాడని..లేకుంటే తమ కుటుంబం ప్రాణాలతో ఉండేవాళ్ళం కాదంటూ యజమాని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సుమారు 45నిమిషాల పాటు ఆరుగురు దోపిడీ దొంగల ముఠా ఇంటిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. 100 నంబర్‌కు ఫోన్ చేస్తే వారు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చినా పోలీసుల జాడ లేదని తెలు స్తోంది. విపత్కర పరిస్థితుల్లో స్నేహితులకు సమాచారం ఇవ్వటం, వరండాలో లైట్లు వేసి, అలజడి చేయటంతో కొంతసేపటికి దోపిడీ ముఠా వెనక్కుతగ్గినట్లు తెలుస్తోంది. ఈ విషయం నగరంలో దావానలంలా వ్యాప్తించటంతో నగర వాసులు బెంబేలెత్తిపోతున్నారు. జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఈ దోపిడీ ముఠా సంచరించటం పట్ల ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. పోలీస్ అధికారులు మాత్రం ఇది షోలాపూర్ గ్యాంగ్ పనే అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు నగరంలో గురువారం రాత్రి చెడ్డీ గ్యాంగ్ దోపిడీ దొంగల ముఠా హల్చల్ చేసింది. ఒక చేపల వ్యాపారి ఇంటిలో దోపిడీకి విఫలయత్నం చేసింది. శుక్రవారం ఉదయం సంఘటనా స్థలాన్ని ఏలూరు డీఎస్పీ కే.ఈశ్వరరావు, సీసీఎస్ డీఎస్పీ సత్యనారాయణ, త్రీటౌన్ సీఐ పీ.శ్రీనివాసరావు పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజ్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. దోపిడీ ముఠా ఎవరై ఉంటారనే అంశాలపై ఆరా తీశారు. రాత్రి సంఘటన జరిగిన పరిస్థితులను బాధితుని అడిగి తెలుసుకున్నారు. పోలీసులు కథనం ప్రకారం.. ఏలూరు శాంతినగర్ 8వ రోడ్డు చివర దేవరపల్లి సత్యనారాయణ అనే న్యాయవాది నివాసముంటున్నారు. ఈ భవనం కింది పోర్షన్లో సరెళ్ళ రామకృష్ణ అనే చేపల వ్యాపారి తన కుటుం బంతో అద్దెకు ఉంటున్నారు. తాను ఉంటున్న ఇంటికి రామకృష్ణ సీసీ టీవీ కెమేరాలను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి 1.05 నిమిషాలకు ఇంటి బయట అలికిడి కావటంతో అతను సీసీ కెమెరాలను గమనించాడు. ఎవరో ఆరుగురు వ్యక్తులు బయట సంచరిస్తున్నట్లు కనిపించింది. ఆరుగురు ముఠా సభ్యులు ముఖానికి టవల్ కట్టుకుని, షార్ట్‌లు, నిక్కర్లు ధరించి ఉన్నారు. వారి వద్ద కత్తులు, రాడ్లు ఉన్నట్లు సీసీ టీవీ కెమేరాల్లో కన్పించింది. వెంటనే సహాయం కోసం 100 నంబర్‌కు డయల్ చేశాడు. స్టేట్ కాల్ సెంటర్లో ఉన్న పోలీసులు జిల్లా కాల్‌సెంటర్‌కు సమాచారం వెంటనే ఇవ్వలేదు. కొంతసేపటికి స్థానిక పోలీ సులకు సమాచారం ఇచ్చినా ఫలితం లేకపోయింది. అప్పటికే 45 నిమిషాల పాటు దోపిడీ ముఠా లోనికి ప్రవేశించేందుకు విఫలయత్నం చేస్తోంది. భయాందోళనలో ఉన్న రామకృష్ణ సహాయం కోసం పై అంతస్తులో ఉంటున్న ఇంటి యజమానికి, అతని స్నేహితులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. ఈ సందర్భంలో వరండాలో లైట్లు వేయటం, ఫోన్లో స్నేహితులకు సమాచారం అందిస్తూ కొంత అలజడి చేయటంతో దోపిడీ ముఠా ఇంటి వెనుక నుంచి గోడదూకి పారిపోయింది. అనంతరం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అధికారులు అక్కడ సిబ్బందిని పహారా పెట్టారు. చెడ్డీ గ్యాంగా?.. షోలాపూర్ గ్యాంగా? ఏలూరులో దోపిడీకి విఫలయత్నం చేసింది చెడ్డీ గ్యాంగా లేక షోలాపూర్ గ్యాంగా అనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆరుగురు ముఠా సభ్యుల్లో కొందరు షార్ట్‌లు, ఇద్దరు నిక్కర్లు వేసుకుని, ముఖానికి గుడ్డలు కట్టుకున్నారు. నడుముకు కత్తులు ఉన్నాయి..ఒక వ్యక్తి భుజానికి బ్యాగు ధరించి ఉన్నాడు. ఈ ముఠా దొపిడీకి పాల్పడిన సందర్భంలో విచక్షణారహితంగా వ్యవహరిస్తారు. ఇంటిని దోచుకోవటంతోపాటు, యజమానులను సైతం నిర్ధాక్షిణ్యంగా చంపేస్తారని పోలీసులు చెబుతున్నారు. ఖాకీ సినిమా తరహాలో దోపిడీలకు పాల్ప డడం వీళ్ళకు వెన్నతోపెట్టిన విద్యగా చెబుతున్నారు. ఆలస్యమే.ప్రాణాలు కాపాడిందా? చేపల వ్యాపారి రామకృష్ణ గురువారం రాత్రి ఇంటికి ఆలస్యంగా చేరుకున్నాడు. రామకృష్ణ నిద్రకు ఉపక్రమించకముందే ఇంటిబయట ఏదో అలికిడి వినిపించింది. వెంటనే సీసీ కెమెరాలను గమనించాడు. ఈ సీసీ కెమెరాల ఆధారంగానే అప్రమత్తమై తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు. ముందుగానే వచ్చి నిద్రపోయి ఉంటే దోపిడీ దొంగలు అంతా దోచుకుపోయేవారు. ప్రాణాలకు సైతం గ్యారంటీ లేకపోయేది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవటం కూడా తమను కాపాడిందని అంటున్నారు. దోపిడీకి ఎలా ప్రయత్నించారంటే.. దోపిడీ దొంగలు ఏమి చేశారంటే...సుమారు 1.05 గంటల ప్రాంతంలో ఇంటి వెనుక వైపు గోడదూకి ప్రాంగణంలోకి ప్రవేశించారు. ఆరుగురు ముఠా సభ్యులు షార్ట్‌లు, పైన బనియన్లు ధరించి, నడుముకు కత్తులు కట్టుకుని ఉన్నారు. చుట్టుపక్కల పరిస్థితిని గమనించి, ఇంటిలోని వారు బయటకు రాకుండా అక్కడే ఉన్న మోటారు సైకిల్‌ను డోర్ లాక్కు బలమైన ప్లాస్టిక్ తాడుతో గట్టిగా కట్టేశారు. అనంతరం వెనుకవైపు ఉన్న డోర్‌ను పగులగొట్టేందుకు ప్రయత్నించారు. బయట ఇద్దరు కాపలా ఉండగా, మరో నలుగురు వ్యక్తులు డోర్‌ను పగులగొట్టేందుకు విఫలయత్నం చేశారు. వెనుకతలుపు త్వరగా పగలకపోవటం, ఈలోగా అలజడి రావటంతో వెనుదిరిగినట్లు తెలుస్తోంది. భీమడోలులో గతంలో దోపిడీ మహారాష్ట్ర షోలాపూర్ ప్రాంతానికి చెందిన ఆరుగురు ముఠా సభ్యులు 3సంవత్సరాల క్రితం భీమడోలు ప్రాంతంలో ఓ నగల దుకాణంలోకి ప్రవేశించి 50 కాసుల బంగారాన్ని దోచుకువెళ్ళారు. వాళ్ళూ ఇదే తరహాలో నిక్కర్లు, బనియన్లు ధరించి ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి ముఠానే ఇటీవల నెల్లూరు ప్రాంతంలో ఒక ఇంటిలోకి ప్రవేశించి దోచుకుని, అడ్డువచ్చిన ఇంటి యజ మానురాలిని కొట్టి చంపి, మరో ఇద్దరిని తీవ్రంగా గాయపరిచినట్లు తెలుస్తోంది. పటిష్ట చర్యలు చేపడుతున్నాం : కే.ఈశ్వరరావు, ఏలూరు డీఎస్పీ ఏలూరు నగర ప్రజలు ఏమాత్రం భయపడాల్సిన పనిలేదు. నగరంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం. రాత్రి వేళల్లో పూర్తిస్థాయి నిఘాను మరింత పెంచుతున్నాం. ఏలూరులో సంచరించిన ముఠా చెడ్డీ గ్యాంగ్‌కు సంబంధించిన వారు కాదు. షోలాపూర్ గ్యాంగ్‌గా అనుమానం ఉంది. బాధితుడు రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం. ప్రజల శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం లేకుండా నిఘా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేస్తాం. -
దారి దోపిడీ ముఠా అరెస్టు
నందిగామ (షాద్‌నగర్) : రోడ్డుకు అడ్డంగా రాళ్లు పెట్టి తుపాకీతో కాల్పులు జరిపి ఓ వ్యక్తి నుంచి రూ.77,300 అపహరించిన ముఠాను పోలీసులు 24 గంటల్లోపే కటకటాల వెనక్కి పంపారు. షాద్‌నగర్ ఏసీపీ సురేందర్ కేసు వివరాలు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మద్దూరు అనుబంధ బీక్యా తండాకు చెందిన కేత్లావత్ దశరథ్ కొంతకాలంగా కొత్తూరు మండల కేంద్రంలో ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. కొత్తూరుకు చెందిన సున్నపు గంగారాం, అతడి స్నేహితుడు చేగూరు తండాకు చెందిన ఆంగోతు రతన్ దశరథ్ వద్ద డబ్బులను కాజేయాలని పథకం వేశారు. ఈ విషయాన్ని ఫరూఖ్‌నగర్ మండలం కంసాన్‌పల్లికి చెందిన మరో స్నేహితుడు నేనావత్ రమేశ్‌కు తెలిపారు. రమేశ్.. రాజేంద్రనగర్ మండలం కిస్మత్‌పూర్‌కు చెందిన షేక్ ఇర్ఫాన్ (పాత నేరస్తుడు)కు తమ ప్లాన్ చెప్పాడు. వీరంతా కలసి శనివారం రాత్రి బైక్‌పై స్వగ్రామానికి వెళుతున్న దశరథ్ను మార్గమధ్యంలో రాళ్లు పెట్టి ఆపారు. వారి నుంచి తప్పించుకొని దశరథ్ పారిపోతుండగా అతడి వద్దనున్న నగదు బ్యాగును లాక్కుని, తుపాకీతో గాల్లోకి ఒకరౌండ్ కాల్పులు జరిపి పారిపోయారు. 24 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు దశరథ్ ఇచ్చిన ఫిర్యాదుతో షాద్‌నగర్ రూరల్ సీఐ మధుసూదన్, ఎస్సైలు శ్రీశైలం, హరిప్రసాద్‌రెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు సం ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఆదివారం ఉదయం తిమ్మాపూర్ చెక్‌పోస్టు వద్ద దోపిడీ ముఠా సభ్యులు రమేశ్, ఇర్ఫాన్, రతన్ ద్విచక్రవాహనంపై అనుమానాస్పద స్థితిలో వెళ్తుండగా వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో చోరీకి పాల్పడింది తామేనని అంగీకరించారు. వారి సమాచారంతో కొత్తూరుకు చెందిన సున్నం గంగారాంను కూడా పోలీసులు అరెస్టు చేశా రు. వారి నుంచి రూ.77,300 నగదు, 6 ఎం. ఎం.తుపాకీ, 8 తూటాలు, వాడిన తూటా, 3 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ వెల్ల డించారు. 24 గంటల్లోపే కేసును ఛేదించిన సిబ్బందిని ఏసీపీ అభినందించారు. -
కంట్లో కారం చల్లి...తుపాకితో బెదిరించి..
సాక్షి, కొత్తూర్ : దారి కాచి రోడ్డుపై వెళుతున్న వ్యక్తి కంట్లో కారం చల్లి, తుపాకితో బెదిరించి రెండు లక్షలు దోచుకున్న ఘటన కలకలం రేపింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూర్‌లో చోటుచేసుకుంది. కొత్తూర్ మండల కేంద్రంలోని మద్దూర్ పంచాయతీ బిక్య తాండకు చెందిన దశరథ్ గత కొన్ని నెలలుగా ఆన్లైన్ మనీ టాన్స్‌ఫర్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఈ శనివారం రాత్రి పదిగంటల సమయంలో అతను పనులు ముగించుకుని బైక్‌పై ఇంటికి బయలుదేరి వెళ్లాడు. గూడూరు పంచాయతీ రాగ్య.. కమల తాండ మధ్యన రోడ్డుకు అడ్డంగా రాళ్లు కనిపించడంతో అతను బైక్ ఆపాడు. అప్పటికే అక్కడ దారికాచి ఉన్న దుండగులు.. అతనిపై కారం చల్లి సుమారు రెండు లక్షలు దోచుకున్నారు. తిరగబడిన దశరథ్ను తుపాకితో బెదిరించగా అతను కేకలు వేసుకుంటూ సమీపంలోని తాండలోకి పరుగులు తీశాడు. అది గమనించిన కొందరు అతనికి సహాయంగా దొంగల కోసం వెతికారు. దీంతో ఆ ముఠాకి చెందిన ఒకడు పట్టుబడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ముఠా సభ్యుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
గుంటూరులో గుట్కా తయారీ ముఠా అరెస్ట్
-
సూర్యకి విలన్‌గా టాలీవుడ్ సీనియర్ స్టార్
‘గ్యాంగ్’ సినిమాతో మరో విజయాన్ని అందుకున్న కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, ప్రస్తుతం సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాలో ఓ టాలీవుడ్ సీనియర్ నటుడు ప్రతినాయక పాత్రలో నటించనున్నాడట. లెజెండ్ సినిమాతో విలన్ గా మారిన సీనియర్ హీరో జగపతి బాబు, తెలుగుతో పాటు మాలీవుడ్, కోలీవుడ్‌లలోనూ వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. ఇప్పటికే తమిళ నటుడు విజయ్ హీరోగా తెరకెక్కిన ‘భైరవ’, రజనీకాంత్ ‘లింగా’ సినిమాలలో విలన్‌గా నటించిన జగ్గుభాయ్.. మరో తమిళ హీరో సూర్య నెక్ట్స్ సినిమాలోనూ ప్రతినాయక పాత్రలో నటించనున్నాడు. రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విలన్ పాత్రలో ప్రముఖ నటుడు అవసరమని భావించిన చిత్రయూనిట్ జగపతిబాబును సంప్రదించారు. క్యారెక్టర్ నచ్చటంతో ఆయన కూడా ఓకె చెప్పారన్న టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతానికి జగపతిబాబు నటించటంపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. సూర్య సరసన రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవిలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఫిబ్రవరి రెండో వారంలో రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది. -
తిరుపతిలో దొంగ నోట్లు ముఠా అరెస్ట్
-
కిక్ ఇచ్చే లుక్‌లో
‘గ్యాంగ్’ సినిమా సక్సెస్‌ను పూర్తీగా ఎంజాయ్ చేయకముందే తదుపరి చిత్రాన్ని పట్టాలు ఎక్కించేశారు సూర్య. ‘7/జి బృందావన కాలనీ, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ ఫేమ్ సెల్వ రాఘవన్ దర్శకత్వంలో సూర్య ఓ సినిమా ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నిన్న మొదలైంది. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో సూర్య నటించడం ఇదే తొలిసారి. ఈ సినిమాలో సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సూర్య క్యారెక్టరైజేషన్, లుక్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందని చిత్రబృందం పేర్కొన్నారు. ఫ్యాన్స్‌కైతే ఆయన లుక్ కిక్ ఇచ్చే విధంగా ఉంటుందట. ఎస్ ఆర్ ప్రభు, ఎస్.ఆర్. ప్రకాష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను దీపావళికి విడుదల చేయాలనుకుంటున్నారు. -
సూర్య హైట్‌పై యాంకర్ల చెత్త కామెంట్స్
గ్యాంగ్ సినిమా సక్సెస్ తో ఆనందంగా ఉన్న సూర్యపై ఓ తమిళ మ్యూజిక్ ఛానల్ యాంకర్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకోసం రెడీ అవుతున్న సూర్య తరువాత కె.వి.ఆనంద్ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో అమితాబ్ బచ్చన్ నటించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అయితే సూర్య సినిమాలో అమితాబ్ నటించటంపై మాట్లాడిన యాంకర్, సూర్య హైట్ గురించి కామెంట్ చేశారు. సింగం సినిమాలో తన కన్నా ఎత్తున్న అనుష్కనే తల పైకెత్తి చూసిన సూర్య, అమితాబ్‌తో నటిస్తే స్టూల్వేసుకోవాల్సి ఉంటుందేమో అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. గ్యాంగ్ సినిమాలోనూ సూర్య హైట్‌కు సంబంధించిన ప్రస్తావన ఉంది. జాబ్ ఇంటర్య్యూలో విలన్ సూర్య హైట్ గురించి కామెంట్ చేస్తాడు. అయితే సినిమా క్లైమాక్స్‌లో విలన్ తో ఎంత ఎత్తు ఉన్నమన్నది కాదు.. ఎంత ఎత్తుకు ఎదిగామన్నది ముఖ్యమని సమాధానమిస్తాడు. సూర్యపై టీవీ యాంకర్లు చేసిన కామెంట్స్‌పై ఇండస్ట్రీ వర్గాలు తీవ్రంగా స్పందింస్తున్నారు. హీరో విశాల్. ‘ఇది హాస్యమా..?? కానే కాదు. నవ్వించటం కోసం ఎంత అనైతికంగా ప్రవర్తిస్తున్నారు. బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నారు’ అంటూ ఘాటుగా ట్వీట్ చేశాడు. సూర్య అభిమానులు యాంకర్లు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. Funny !! ???? Absolutely not. How unethical in the name of sense of humour. Totally senseless. pic.twitter.com/0e4netQd6s — Vishal (@VishalKOfficial) 18 January 2018 -
అతని కోసం గుడికి..
నయనతార ఈ మధ్య ఓ గుడికి వెళ్లారు. ఎందుకు వెళ్లారంటే ‘తానా సేంద కూట్టమ్’ హిట్టవ్వాలని. తెలుగులో ‘గ్యాంగ్’ పేరుతో రిలీజైంది. సూర్య హీరోగా విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తీ సురేష్ కథానాయికగా నటించారు. మరి.. నయనతార ఎందుకు గుడికి వెళ్లారూ అంటే... విఘ్నేష్ శివన్ కోసమని చెన్నై టాక్. ఈ ఇద్దరూ లవ్‌లో ఉన్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఆ సంగతలా ఉంచితే ‘తానా సేంద...’ సూపర్ హిట్. అంటే.. చిత్రబృందం కష్టానికి నయనతార పూజలు తోడయ్యాయా! -
నెల్లూరుది ప్రత్యేక స్థానం : హీరో సూర్య
సాక్షి, నెల్లూరు: చిత్ర పరిశ్రమలో నెల్లూరుది ప్రత్యేక స్థానమని సినీ నటుడు సూర్య పేర్కొన్నారు. నెల్లూరులోని ఎంజీబీమాల్‌కు గ్యాంగ్ చిత్ర బృందం విజయయాత్రలో భాగంగా మంగళవారం చేరుకున్నారు. ఈ సందర్భంగా చిత్రం ప్రదర్శిమవుతున్న థియేటర్లోకి హీరో సూర్య, చిత్రం బృందం వెళ్లి ప్రేక్షకులతో మాట్లాడారు. ఈ క్రమంలో గ్యాంగ్ చిత్రాన్ని విజయవంతం చేసిందనందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. నెల్లూరంటే తనకు ఎంతో ఇష్టమని, ఎంజీబీ మేనేజింగ్ డైరెక్టర్ గంగాధర్ ఇచ్చిన ఆహ్వానం సంతోషం కల్పించిందన్నారు. అనంతరం సూర్య విలేకరులతో మాట్లాడుతూ ఏడాది క్రితం నెల్లూరుకు వచ్చానన్నారు. గ్యాంగ్ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులు రిసీవ్ చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ విజయవాడ, రాజమండ్రి, వైజాగ్ ప్రాంతాల్లో ఈ చిత్రానికి మంచి కలెక్షన్లు వస్తున్నాయని, నెల్లూరులో కూడా హౌస్‌ఫుల్ కలెక్షన్‌తో ప్రదర్శితమవుతోందని తెలిపారు. గ్యాంగ్ సినిమా తన జీవితంలో అత్యంత ముఖ్యమైందని, సంక్రాంతి బరిలో భారీ పోటి ఉన్నప్పటికీ ఈ చిత్రం విజయవంతమవడం సంతృప్తికరంగా ఉందన్నారు. మరో 10 రోజుల్లో రకుల్‌ప్రీత్‌సింగ్, సాయిపల్లవి కథానాయికలుగా కొత్త చిత్రాన్ని ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. నెల్లూరు ప్రజలు తనపై చూపిస్తున్న ఆదరణ మరువలేనిదన్నారు. సమావేశంలో ఎంజీబీ మేనేజింగ్ డైరెక్టర్ గంగాధర్, ఎస్2 నిర్వాహకుడు మాగుంట ఆదిత్యబాబు పాల్గొన్నారు. ఎంజీబీమాల్లో కోలాహలం హీరో సూర్య వస్తున్నారని తెలియడంతో ప్రేక్షకులు భారీగా ఎంజీబీమాల్‌కు చేరుకున్నారు. ఒంటి గంటకు రావాల్సిన సూర్య గంటన్నర ఆలస్యంగా వచ్చినప్పటికీ ప్రేక్షకులు వేచిచూశారు. దీంతో ఆ ప్రాంతంలో అరుపులు, ఈలలతో కోలాహలం నెలకొంది. అనంతరం సూర్య రాగానే నాలుగో అంతస్తుకు చేరుకుని ప్రేక్షకులకు అభివాదం చేశారు. ఓ అభిమాని సూర్యతో సెల్ఫీ దిగేందుకు యత్నించగా బౌన్సర్లు అతడిని తోసేసే ప్రయత్నం చేశారు. అయితే దీన్ని గమనించిన సూర్య ఆ వ్యక్తితో సెల్ఫీ దిగడం గమనార్హం. -
గేట్ దూకి బయటకెళ్లిన హీరో సూర్య
సాక్షి, రాజమండ్రి : అభిమానుల తాకిడి నుంచి తప్పించుకునేందుకు నటీనటులు మరో దారి వెతుక్కునే ఘటనలు సినిమాల్లో చూస్తూనే ఉంటాం. అయితే రియల్ లైఫ్‌లో హీరో సూర్యకు కూడా అలాంటి అనుభవమే ఎదురైంది. ‘ గ్యాంగ్’ సినిమా ప్రమోషన్ కోసం రాజమండ్రి వచ్చిన సూర్య స్థానిక మేనక సినిమా థియోటర్‌కు వెళ్లాడు. అక్కడ అభిమానులను ఉద్దేశించి మాట్లాడి, తిరిగి వెళ్తుండగా అతడితో సెల్ఫీ దిగేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. అయితే అభిమానుల తాకిడి ఎక్కువ కావడంతో సూర్య గేటుదూకి అందరికీ అభివాదం చేస్తూ అక్కడి నుంచి కారులో వెళ్లిపోయాడు. సూర్యను చూసిన అభిమానులు కేరింతలు, ఈలలతో హంగామా చేశారు.