ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హిమాయత్‌నగర్ (హైదరాబాద్): న్యూడ్ ఫొటోలను మార్ఫింగ్ చేసి తన వద్ద నుంచి డబ్బులు స్వాహా చేశారంటూ నగరానికి చెందిన ఓ యువకుడు మంగళవారం సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యువకుడికి చెందిన ఫొటోలను మార్ఫింగ్ చేసి ఫొటో పక్కనే మరో యువతి ఫొటోలను ఉంచి ఓ వ్యక్తి తనను బెదిరించాడని, డబ్బులు ఇవ్వకపోతే స్నేహితులు, బంధువులకు వాట్సాప్‌లో షేర్ చేస్తానని బెదిరించడంతో అతడికి రూ. 2.89 లక్షలు ఇచ్చినట్లు తెలిపాడు. అయినా మరిన్ని డబ్బులు డిమాండ్ చేస్తుండటంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment