cyber police
-
Manchu Vishnu: మంచు విష్ణుకు సైబర్ వేధింపులు
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణుకు సైబర్ వేధింపులు తప్పలేదు. సోషల్‌మీడియా ద్వారా ఈ పని చేస్తున్న విజయ్ చంద్రహాసన్ దేవరకొండను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం నోటీసులు జారీ చేసి పంపారు. నేరం నిరూపణకు అవసరమైన ఆధారాలు సేకరించి, నిందితుడిపై న్యాయస్థానంలో అభియోగపత్రాలు దాఖలు చేయాలని నిర్ణయించారు. విజయ్ చంద్రహాసన్ ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. దీంతో పాటు వివిధ సోషల్‌మీడియా ఖాతాల్లో అనేక వీడియోలు అప్లోడ్ చేశారు. వీటిలో మంచు విష్ణు, ఆయనకు సంబంధించిన నిర్మాణ సంస్థ, ‘మా’లతో పాటు సినీ రంగాన్నీ కించపరిచే, అవమానించే, అభ్యంతరకరంగా చిత్రీకరించే అంశాలను పొందుపరిచాడు. ఇతను పదేపదే ఇదే పంథా అనుసరిస్తుండటాన్ని ‘మా’ సీరియస్‌గా తీసుకుంది. సంస్థ ట్రెజరర్ శివబాలాజీ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ కె.మధులత సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించారు. విజయ్ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం చేసినట్లు అంగీకరించాడు. దీంతో అతడికి నోటీసులు జారీ చేసిన అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. త్వరలోనే అవసరమైన ఆధారాలను సేకరించి, న్యాయస్థానంలో చార్జ్ïÙట్ దాఖలు చేయాలని నిర్ణయించారు. -
సైబర్ నేరగాళ్ల గుట్టురట్టు
-
ఆ లింక్‌పై క్లిక్ చేశా..రూ.2 లక్షలు పోయాయి: కీర్తి భట్ ఆవేదన
దేశంలో సైబర్ నేరాలు రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంతా డిజిటల్ మయం ఐపోయేసరికి దానికి తగ్గట్లే కేటుగాళ్లు కొత్త కొత్త ఐడియాలతో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. సామాన్యులే కాదు సెలెబ్రిటీలు కూడా ఈ సైబర్ నేరాల బారిన పడుతున్నారు. తాజాగా బిగ్‌బాస్ ఫేం కీర్తిభట్ సైబర్ నేరగాళ్ల చేతిలో దారుణంగా మోసపోయింది. కొరియర్ కోసం ఓ లింక్ క్లిక్ చేసి రూ. 2 లక్షలు పోగొట్టుకుంది. ఈ విషయాన్ని తన యూట్యూబ్ చానల్లో తెలియజేస్తూ ఓ వీడియోని వదిలారు. అసలేం జరిగింది? ఆమె మాటల్లోనే.. ‘నాకొక ముఖ్యమైన కొరియర్ రావాల్సి ఉంది. వారం రోజులు అయినా రాకపోవడంతో మెయిన్ కొరియర్ సెంటర్ వాళ్లకి కాల్ చేశా. వాళ్లు డెలివరీ చేశాం.. మెహదీపట్నంలో ఉందని చెప్పారు. ట్రాక్ చేసి చూస్తే నిజంగానే మెహదీపట్నంలో ఉన్నట్లు కనిపించింది. ఆ తర్వాత నాకొక కాల్ వచ్చింది. వాళ్లు హిందీలో మాట్లాడుతూ.. ‘మికొక కొరియర్ రావాలికదా? అన్నారు. అవును ఇంకా రాలేదు అని చెప్పాను. మీ లొకేషన్ అడ్రస్ అప్డేట్ కాలేదు మేడం. ఒక్కసారి వాట్సాఫ్ ద్వారా మీ అడ్రస్ని పంపించండి అని ఒక నెంబర్ ఇచ్చారు. నేను కాల్ మాట్లాడుతూ.. ఆ నెంబర్‌కి అడ్రస్ పంపించాను. ఆ తర్వాత మళ్లీ కాల్ చేసి అప్డేట్ కావడం లేదు.. నార్మల్ మెసేజ్ చేస్తా..దానికి రిప్లై ఇవ్వండి అని చెప్పారు. నేను ఆ నెంబర్‌కి హాయ్ అని మెసేజ్ పెట్టాను. ఆ తర్వాత నా మొబైల్ నెంబర్‌కి ఒక లింక్ వచ్చింది. దాన్ని క్లిక్ చేయమని చెప్పారు. ఆ లింక్‌ని కాపీ చేసి వాళ్లు పంపిన వేరే నెంబర్‌కి ఫార్వర్డ్ చేయమన్నారు. అలాగే చేశాను. ఆ తరువాత ముందు పంపిన వాట్సాప్ నెంబర్‌కి అదే లింక్‌ని ఫార్వర్డ్ చేసి.. దాన్నిఓపెన్ చేయమన్నారు. అడ్రస్ అప్డేట్కి రూ.2 రూపాయిలు ఎక్స్ ట్రా పే చేయాల్సి వస్తుంది మేడమ్ అని అన్నారు. రెండు రూపాయలే కదా అనుకొని నేను సరే అన్నాను. యూపీఐ మెన్షన్ చేయమని అన్నారు. నాకు డౌట్ వచ్చి.. చేయనని చెప్పాను. అప్పుడు బ్యాంక్‌కి లింక్ అయిన రిజిస్టర్ నెంబర్ ఇదేనా అని అడిగారు. ఇదే అని చెప్పాను. నాకు ప్రాసెసింగ్ అని మెసేజ్ వచ్చింది. మేడమ్ మీకు కాసేపు ఆగి కాల్ చేస్తాం.. అప్డేట్ ఇస్తాం అని అన్నారు. వాళ్లు ఫోన్ కట్ చేసిన కాసేపటికి రెండు రూపాయిలు నా అకౌంట్ నుంచి కట్ అయ్యింది. సరే రెండు రూపాయిలే కదా అని నేను పట్టించుకోలేదు. ఆ తరువాత నేను షూటింగ్‌కి వెళ్లిపోయాను. సరిగ్గా మిడ్నైట్ 12 గంటలకు రూ. 99 వేలు ట్రాన్స్ఫర్ అయినట్లు మెసేజ్ వచ్చింది. ఆ వెంటనే మరో రూ.99 వేలు కట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. బ్యాలెన్స్ చెక్ చేస్తే..నిజంగానే రూ. 2లక్షలు ట్రాన్స్ఫర్ అయినట్లు చూపించింది. . వెంటనే నాకు ఏం చేయాలో తెలియక.. కార్తీక్‌కి ఫోన్ చేస్తే.. సైబర్లో కంప్లైంట్ ఇచ్చాం. నా అకౌంట్‌ని బ్లాక్ చేయించాను. సైబర్ క్రైమ్ వాళ్లు యాక్షన్ తీసుకున్నారు. ట్రాకింగ్ స్టార్ట్ చేశారు. ఖచ్చితంగా డబ్బులు తిరిగి వస్తాయని అంటున్నారు. ఆలస్యం చేయకుండా వెంటనే కంప్లైంట్ ఇచ్చాం కాబట్టి.. ట్రాన్స్ఫర్ కాకుండా వాళ్ల అకౌంట్లను బ్లాక్ చేయించగలిగాం. ఇంకా నా డబ్బులు తిరిగి రాలేదు కానీ కచ్చితంగా వస్తాయని పోలీసులు చెబుతున్నారు. ఈ విషయంలో సైబర్ క్రైమ్ వాళ్లకి సెల్యూట్ చేస్తున్నా. ఇలాంటి సైబర్ క్రైమ్ నేరాలు మీకు జరగొచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి.ఇలాంటి సైబర్ నేరాలు జరిగినప్పుడు 1930 టోల్ ఫ్రీ నెంబర్‌కి కాల్ చేయండి’ అని కీర్తీభట్ సూచించింది. -
ఎన్నికల వేళ బరితెగిస్తున్న కేటుగాళ్లు
విజయవాడలోని గుణదలకు చెందిన ఓ వ్యక్తికి ఇటీవల ఓ టెక్ట్స్ మెసేజ్ వచ్చింది. ‘ఎన్నికల సర్వేలో చురుగ్గా పాల్గొంటున్నందున మా పార్టీ నుంచి కొన్ని రీడిమ్ పాయింట్లు ఇస్తున్నాం. ఈ పాయింట్ల కోసం ఈ కింది లింక్‌ను క్లిక్ చేయండి’ అని అందులో ఉంది. పాయింట్లు వస్తాయనే ఆశతో సదరు వ్యక్తి లింక్‌ను క్లిక్ చేసి గూగుల్ ఫామ్‌లో వివరాలు నమోదు చేశాడు. ఆ వివరాల ఆధారంగా బ్యాంక్ ఖాతాలోని నగదును సైబర్ నేరగాళ్లు ఖాళీ చేయడంతో లబోదిబోమన్న బాధితుడు సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. విజయవాడ (స్పోర్ట్స్): కాలానికి అనుగుణంగా మోసాలకు పాల్పడటంలో ఆరితేరిన సైబర్ నేరగాళ్లు ఎన్నికల సీజన్ కావడంతో రాజకీయ పార్టీలు, ఎలక్షన్ కమిషన్ పేరుతో మోసాలకు తెగబడుతున్నారు. సర్వే అంటూ, ఓటరు కార్డు సరి చేయాలంటూ ఫోన్లు చేసి ప్రజల బ్యాంక్ ఖాతాలను లూటీ చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ తరహా మోసాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజయవాడ సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎన్నికల సంఘం నుంచి నేరుగా ఎవరికీ ఫోన్ కాల్ రాదనే విషయాన్ని గ్రహించాలని సూచించారు. సర్వే పేరుతో వివరాలు సేకరించి మోసాలు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పలు రాజకీయ పార్టీలు సర్వేల పేరుతో ప్రజలకు ఫోన్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఆయా పార్టీల ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల స్వభావం తెలుసుకునేందుకు, ఓట్లు అభ్యర్థించేందుకు పార్టీలు రికార్డింగ్ కాల్స్ మాత్రమే చేస్తున్నాయి. దీనినే కొందరు నేరగాళ్లు సైబర్ మోసాలకు వాడుకుంటున్నారు. ఫోన్ చేసిన ఆగంతకుడు ఏదో ఒక పార్టీ సర్వే పేరుతో తియ్యని మాటలతో ముగ్గులోకి దించుతున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థి స్వభావంపై తాము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్తే ఆన్లైన్లో ఆకర్షణీయమైన గిఫ్ట్ పంపుతామని ఆశ పెడతారు. కొన్ని ప్రశ్నలు అడిగిన తరువాత మీరు గిఫ్ట్ పొందేందుకు అర్హత సాధించారని నమ్మిస్తారు. గిఫ్ట్ మీ ఇంటికి రావాలంటే మీ ఓటర్ కార్డ్, బ్యాంక్, ఆధార్, పాన్ వివరాలు చెప్పాలని అభ్యర్థిస్తారు. ఈ వివరాలన్నీ సేకరించిన తరువాత ఆయా బ్యాంక్ ఖాతాలో ఉన్న నగదును ఏఈపీఎస్ (ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్) ద్వారా ఖాళీ చేస్తారు. ఏఈపీఎస్ మోసాల్లో ఖాతాదారుడికి డబ్బులు వేరే ఖాతాకు డెబిట్ అయినట్టు కనీసం మెసేజ్ కూడా రాదు. ఖాతాలో నగదు లేకుండా అదే వ్యక్తి పేరున ఓ సిమ్ తీసుకుని సోషల్ మీడియా ఖాతాలతో పాటు బ్యాంక్ ఖాతా తెరుస్తున్నారు. వేరే వ్యక్తుల బ్యాంకు ఖాతాల నుంచి నేరగాళ్లు నగదును ముందుగా ఈ బ్యాంక్ ఖాతా, యూపీఐ యాప్‌లకు బదిలీ చేస్తారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే బాధితుడినే నేరగాడిగా మార్చేస్తున్నారు. సామాన్య ప్రజల పేరునే ఎక్కువగా బ్యాంకు ఖాతాలు తెరిచి నగదును ఆయా ఖాతాలకు నేరగాళ్లు బదిలీ చేస్తున్నారు. ఏదైనా ఫిర్యాదు రాగానే దాని ఆధారంగా ఆయా బ్యాంక్ ఖాతాను వెతుక్కుంటూ వెళ్లిన పోలీసులకు ముందుగా స్మార్ట్ ఫోన్ సరిగ్గా వాడటం తెలియని వ్యక్తులే తారసపడుతున్నారు. రీడిమ్ పాయింట్లు ఎరగా చూపి.. సర్వే పేరుతో నేరగాళ్లు పలు రకాల ప్రశ్నలు వేసిన అనంతరం.. సర్వేలో చురుగ్గా పాల్గొన్న మీకు కొన్ని ఎస్బీఐ రీడిమ్ పాయింట్లు ఇచ్చామని, తాము పంపే లింక్ క్లిక్ చేసి గూగుల్ ఫామ్‌లో మీ వివరాలు నింపాలని సూచిస్తారు. ఫామ్‌లో నమోదు చేసిన వివరాల ఆధారంగా బ్యాంక్ ఖాతాలోని నగదును మొత్తం ఖాళీ చేస్తున్నారు. ఓటర్ కార్డు ఆన్లైన్లో నమోదు కాలేదంటూ.. ఓటర్ కార్డు ఆన్లైన్లో నమోదు కాలేదని, వచ్చే ఎన్నికల్లో మీరు ఓటు హక్కును వినియోగించుకోలేరని ఫోన్ ద్వారా ప్రజలను నేరగాళ్లు ఆందోళనకు గురి చేస్తారు. ఎన్నికల సంఘం నుంచి మాట్లాడుతున్నామని నమ్మిస్తారు. వివరాలు చెప్తే సరి చేస్తామని, ఎనేబుల్డ్ అయిన కొత్త ఓటరు కార్డుతో నిర్భయంగా ఓటు వేయవచ్చని భరోసా ఇస్తారు. వాట్సాప్‌కు పంపే లింక్ క్లిక్ చేసి గూగుల్ ఫామ్‌లో వివరాలు నమోదు చేయాలని సూచిస్తారు. పాన్, ఆధార్‌తో పాటు అదనంగా బ్యాంక్ ఖాతా వివరాలు సేకరించి ఖాతాలోని నగదును లూటీ చేస్తారు. అప్రమత్తంగా ఉండండి ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి ఫోన్లు రావని ప్రజలు గ్రహించాలి. ఓటరు కార్డు ఆన్లైన్లో నమోదు కాలేదని వచ్చే ఫోన్లకు స్పందించవద్దు. సర్వే పేరుతోరాజకీయ పార్టీలు రికార్డింగ్ కాల్స్ మాత్రమే చేస్తున్నాయి. అవతలి వ్యక్తి మాట్లాడే సర్వేలకు స్పందించాల్సిన అవసరం లేదు. గుర్తు తెలియని వ్యక్తులకు వ్యక్తిగత వివరాలు చెప్పొద్దు.గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే గూగుల్ ఫామ్‌లో వివరాలు నమోదు చేయొద్దు. రానున్న రోజుల్లో ఈ తరహా మోసాలు ఎక్కువగా జరిగే అవకా>శం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండండి. – ఎస్డీ తేజేశ్వరరావు, ఏసీపీ, సైబర్ క్రైం, విజయవాడ -
ఆర్థిక సైబర్ నేరాలకు చెక్
సాక్షి, అమరావతి :‘బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం. మీ ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోవాలి. మీ మొబైల్ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. అది చెప్పిండి’ ఇటీవల కాలంలో మితిమీరి పెరుగుతున్న కాల్స్ ఇవీ. ఆ ఫోన్ కాల్ బ్యాంకు నుంచో లేదా ఏదైనా ఆర్థిక సంస్థ నుంచే వచ్చిందని నమ్మి ఓటీపీ చెబితే.. బ్యాంకు ఖాతాలో ఉన్న సొమ్మంతా కొల్లగొడుతున్నారు. ఇలాంటి సైబర్ మోసాలకు చెక్ పెట్టే దిశగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉపక్రమించింది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల పేరుతో మితిమీరుతున్న సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ, ఆర్థిక మంత్రిత్వ శాఖలు ఇటీవల బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలతో సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రణాళికపై చర్చించాయి. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలోని ‘ఇండియన్ సైబర్ క్రైమ్ కో–ఆర్డినేషన్ సెంటర్’ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఈ కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ప్రత్యేక సిరీస్‌తో నంబర్ల కేటాయింపు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు తమ వినియోగదారులకు కాల్ చేసే నంబర్లకు ప్రత్యేక సిరీస్ కేటాయించాలని నిర్ణయించారు. ప్రస్తుతం సాధారణ టెలికాం సంస్థలు వినియోగదారులకు కేటాయిస్తున్న 10 అంకెల సిరీస్ నంబర్లనే బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు కూడా కేటాయిస్తున్నారు. దీన్ని సైబర్ నేరగాళ్లు అవకాశంగా మలుచుకుని బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి బురిడీ కొట్టిస్తున్నారు. 2023లో అటువంటి మోసాలకు పాల్పడ్డ 1.40 లక్షల ఫోన్ నంబర్లను సైబర్ పోలీసులు గుర్తించి వాటిని బ్లాక్ చేశారు. అంటే ఈ తరహా మోసాల తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో తెలుస్తోంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి కాల్ చేస్తున్నామని చెప్పి ఆధార్ కార్డ్ అప్డేట్ లేదా పాన్ నంబర్ లింక్ చేయాలనో.. ఫోన్ నంబర్ అప్డేట్ చేయాలనో రకరకాల పేరుతో బురిడీ కొట్టించేందుకు యత్నిస్తున్నారు. అవగాహనలేకో పొరపాటులో ఓటీపీ నంబర్ చెబితే నగదు కాజేస్తున్నారు. దీనికి పరిష్కారంగా ఇక నుంచి బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సాధారణ టెలికాం వినియోగదారులకు కేటాయించే సెల్‌ఫోన్ నంబర్ సిరీస్ కేటాయించకూడదని హోం శాఖ తెలిపింది. టెలికాం రెగ్యులేటరీ ఆథారిటీ (ట్రాయ్) గతంలోనే సూచించిన విధంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ప్రత్యేకంగా నంబర్ సిరీస్ (140+...)తో ఫోన్ నంబర్లు కేటాయిస్తారు. కాబట్టి ఆ సిరీస్ నంబర్ల నుంచి కాల్ వస్తేనే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు చేసినట్టుగా భావించాలి. సాధారణ ఫోన్ నంబర్ల సిరీస్ నుంచి కాల్చేసి తాము బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి చేస్తున్నామని చెబితే.. వినియోగదారులు వెంటనే అప్రమత్తమవుతారు. సైబర్ నేరాల ముఠాల పనేనని గుర్తించి ఆ ఫోన్ కాల్స్‌కు స్పందించకుండా జాగ్రత్త పడతారు. మోసపోయిన సొమ్ము తిరిగి ఇప్పించేలా.. సైబర్ నేరాల్లో బాధితులు కోల్పోయిన మొత్తాన్ని నిర్ణిత వ్యవధిలోనే తిరిగి ఇప్పించే ప్రక్రియను కూడా కేంద్ర హోం, ఆర్థిక శాఖలు సంయుక్తంగా చేపట్టాయి. ఈ మేరకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేశాయి. బాధితుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసి.. మోసానికి పాల్పడిన వారి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడం, ఆ ఖాతాల్లో ఉన్న మొత్తం నుంచి బాధితుల సొమ్మును వారి ఖాతాలకు మళ్లించడం అనే ప్రక్రియకు నిర్ణిత గడువును నిర్దేశించాలన్నారు. బాధితులు పదేపదే పోలీస్ స్టేషన్లు, బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వారు కోల్పోయిన మొత్తాన్ని తిరిగి ఇప్పించనున్నారు. బ్యాంకులు ని ర్ణిత ఫార్మాట్లో సైబర్ పోలీసులకు సమరి్పంచాల్సిన సమాచారం నమూనాను రూపొందించారు. -
వీడియోలు మార్ఫింగ్ చేసి.. అసభ్యకరమైన కామెంట్స్: రీతూ చౌదరి
కామెడీ షో జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటోంది. కొద్దిరోజుల క్రితం తన తండ్రి మరణించడంతో ప్రస్తుతం తన కుటుంబానికి అన్నీ తానై చూసుకుంటుంది. తన కొత్త ఇంటి నిర్మాణం విషయంలో ఓ ఇంటీరియర్ డిజైనర్ వల్ల తాను మానసిక ఆందోళనకు గురయ్యానని చెబుతూ తన యూట్యూబ్ ఛానల్లో చెప్పుకొచ్చింది. అయితే తాజాగా మరో చేదు అనుభవాన్ని రీతూ చౌదరి పంచుకుంది. సోషల్ మీడియాలో మార్ఫింగ్ వీడియోలు చేస్తున్న ఆకతాయిని పోలీసులు పట్టుకున్నారని తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోను రీతూ తన ఛానల్లో షేర్ చేసింది. అదేంటో తెలుసుకుందాం. రీతూ చౌదరి మాట్లాడుతూ.. 'నా ఫోటోలను, వీడియోలను ఎవరో మార్ఫింగ్ చేశారు. వీడియోను మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఏకంగా నన్నే ట్యాగ్ చేసి పైశాచిక ఆనందం పొందారు. సోషల్ మీడియాలో నేను ఏం పెట్టినా చాలా దారుణంగా కామెంట్స్ చేశారు. ఇది జరిగిన దాదాపు ఐదు నెలలైంది. ఈ విషయాన్ని బయటికి చెప్పాలా? వద్దా? నాలో నేనే చాలాసార్లు బాధపడ్డా. బయటికి చెబితే ఏమవుతుందో అని భయపడిపోయా. ఈ వీడియో చేసేందుకు కూడా ఆలోచించా. కానీ చేయక తప్పడం లేదని' ఆవేదన వ్యక్తం చేసింది. మార్ఫింగ్ గురించి రీతూ మాట్లాడుతూ..'నేను ఎప్పటికీ స్ట్రాంగ్‌గా ఉంటా. నేను, శ్రీకాంత్ బయటికి వెళ్లేటప్పుడు ఇలాంటి వీడియోలు చూసి అతనికి చెప్పాలా? వద్దా అని కుమిలిపోయా. ఇది చూసిన శ్రీకాంత్ నువ్వు కానప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పేవాడు. నన్ను ట్యాగ్ చేసేవరకు ఇలాంటి వీడియోలు చేశారని నాకు తెలియదు. కానీ చివరికీ నేను ఈ వీడియోలను సైబర్ పోలీసులకు ఇచ్చాను. మా నాన్న పోయాక తిరిగి కోలుకునేలోపే మళ్లీ ఇలా జరిగింది. కానీ నా వల్ల అవ్వలేదు. ఒక రోజు అమ్మకు ఈ విషయం చెప్పా. కానీ అమ్మ కూడా ఇలాంటివీ పట్టించుకోవద్దని చెప్పింది. మా అన్నకు కూడా చెప్పాను. నా కుటుంబం సపోర్ట్‌గా ఉన్నందుకు సంతోషంగా ఉంది. ఈ విషయంలో విష్ణుప్రియ అండగా నిలిచారు' అని తెలిపింది. ఆ తర్వాత.. 'నేను సోషల్ మీడియాలో ఏది పెట్టినా.. నాతో వస్తావా? వన్ నైట్‌కు వస్తావా? టూ నైట్స్‌కు ఎంత? అని మేసేజ్ చేసే వాళ్లు కూడా ఉంటారు కదా? అలాంటి వాళ్ల లింక్స్ కూడా నేను పోలీసులకు ఇచ్చా. ఆఫర్స్ లేకనే ఇలా చేసిందంటూ నన్ను ఎంతోమంది టార్చర్ చేశారు. అలాంటి వారినే ఇప్పుడు సైబర్ పోలీసులు పట్టుకున్నారు. అతన్ని నేను ఇంతకుముందు కూడా కలిశాను. ఎందుకిలా చేశావంటే నాకు తెలియదు మేడం అంటున్నారు. అతనికి ఇద్దరు అక్కలు కూడా ఉన్నారంట. అతని బావ వచ్చి చిన్నపిల్లాడు మేడం వదిలేయండని సిగ్గు లేకుండా అడుగుతున్నారని' రీతూ చెప్పుకొచ్చింది. ఇంకా ఇలాంటి వాళ్లు చాలామంది ఉన్నారంటూ రీతూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అబ్బాయిని ఆసిఫాబాద్ నుంచి పోలీసులు తీసుకొచ్చారని తెలిపింది. ఇలాంటి వీడియోలు చూసి నాకే.. అసలు ఈ లైఫ్ ఏంటని అనిపించిందని రీతూ వెల్లడించింది. ఇలాంటి పిచ్చివాళ్ల ఆట కట్టించేందుకు సైబర్ పోలీసులు ఉన్నారు. ఎవరూ భయపడకండి.. సూసైడ్ చేసుకునే వరకు తీసుకురాకండి.. ధైర్యంగా ముందుకెళ్లండి' అని రీతూ చౌదరి సలహా ఇచ్చింది. ఈ వీడియోను తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా పంచుకుంది. -
ఇద్దరు సైబర్ నేరస్తుల అరెస్ట్
సిద్దిపేటకమాన్: గుర్తు తెలియని వ్యక్తులకు ఆన్లైన్లో మొదట అమ్మాయిల ఫొటోలు షేర్ చేసి పరిచయం చేసుకుంటారు. అనంతరం అశ్లీల ఫొటోలు పంపించి బాధితులను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గజ్వేల్ ఏసీపీ రమేశ్‌తో కలిసి సీపీ శ్వేత వివరాలు వెల్లడించారు. జగిత్యాల పట్టణం కీళ్లగడ్డలో నివాసం ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న ఆరేపల్లి అభిషేక్ (24), కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం పెద్దపాపాయపల్లి గ్రామానికి చెందిన భాషవేన అభినాష్ (21) డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరిరువురు సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో షేర్ చాట్‌లో అమ్మాయిల ఫ్రొపైల్ ఫొటోలతో (డీపీ) ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకునేవారు. తర్వాత స్పందించిన వ్యక్తుల వాట్సప్ నెంబర్‌కు న్యూడ్ వీడియోలు, అశ్లీల చిత్రాలు, ఫొటోలు పంపిస్తూ సైబర్ నేరస్థులు వారితో చాట్ చేసేవారు. అనంతరం వీరు చేసిన చాట్‌ను, అశ్లీల చిత్రాలను స్క్రీన్ షాట్ తీసి మొబైల్లో భద్రపర్చుకుంటారు. వీరు చాట్ చేసిన స్క్రీన్ షాట్లను వేరే నెంబర్ నుంచి బాధితుల వాట్సప్ నెంబర్లకు పంపిస్తూ మేము గచ్చిబౌలి నుంచి సైబర్ క్రైం ఎస్ఐని మాట్లాడుతున్నానని చెబుతూ మీ అశ్లీల చిత్రాలు, చాట్ చేసిన స్క్రీన్ షాట్స్, ఇతర వివరాలు తమ వద్ద వచ్చాయని, దీనిపై తమకు ఫిర్యాదు అందిందని బాధితులను బెదిరిస్తూ వారి నుంచి రూ.10వేల నుంచి రూ.20వేల వరకు వారు సూచించిన బ్యాంకు ఖాతాకు పంపించుకునేవారు. ఈ క్రమంలో కమిషనరేట్ పరిధిలోని బేగంపేట పోలీస్ స్టేషన్లో కొద్ది రోజుల క్రితం నమోదైన సైబర్ నేరంపై పరిశోధనలో భాగంగా సీపీ శ్వేత ఆదేశానుసారం గజ్వేల్ ఏసీపీ రమేశ్ ఆధ్వర్యంలో తొగుట సీఐ కమలాకర్, బేగంపేట ఎస్ఐ అరుణ్, కానిస్టేబుళ్లు రాజు, అనిల్, రామచంద్రారెడ్డిలతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. విచారణలో భాగంగా బాధితుడి వద్ద నుంచి ఇద్దరు వ్యక్తులు కుకునూర్‌పల్లి బస్టాండ్ వద్ద డబ్బులు తీసుకున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు తొగుట సీఐ కమలాకర్, ఎస్ఐ అరుణ్ ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో వారు చేసిన తప్పును ఒప్పుకున్నారు. ఎవరైనా సైబర్ మోసాలకు గురైతే ధైర్యంగా పోలీసులకు లేదా 1930కు ఫిర్యాదు చేయాలని సీపీ సూచించారు. -
హలో.. మీ పేరుతో ఓ పార్సిల్ వచ్చింది
‘‘మీ పేరు, చిరునామాతో ఉన్న ‘ఫెడెక్స్’ పార్సిల్లో మాదక ద్రవ్యాలు ఉన్నాయి. దర్యాప్తు నిమిత్తం మీపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేస్తున్నాం. ఒకవేళ మీపై కేసు నమోదు కాకుండా ఉండాలంటే కస్టమ్స్ అధికారులతో ‘ఒప్పందం’ కుదుర్చుకోండి’’ ఇదీ హైదరాబాద్‌కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగినికి వచ్చిన సైబర్ నేరగాళ్ల ఫోన్‌కాల్! యువతిని నమ్మించేందుకు ఆమె వాట్సాప్‌కు డ్రగ్స్ ఉన్న పార్సిల్, కస్టమ్స్ అధికారి ఐడీ కార్డు కూడా పంపించారు. దీంతో భయపడిన ఆమె... కేసు నమోదు చేయొద్దంటూ వేడుకొని ఆన్లైన్ ద్వారా రూ. లక్షలు సమర్పించుకుంది. సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు దోపిడీ లకు ఇటీవల కాలంలో దర్యాప్తు అధికారుల అవతారమెత్తుతున్నారు. ముంబై, ఢిల్లీ పోలీసులమని, సీబీఐ, ఈడీ, కస్ట మ్స్ అధికారులమంటూ అమాయ కులకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. భయపడి పోతున్న సామాన్యులు రూ. లక్షల్లో ముట్టజెప్పి మోసపోతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఈ తరహా కేసులు పెద్ద సంఖ్యలో నమోద వుతున్నాయని సైబర్ పోలీసులు తెలిపారు. ఎలా చేస్తున్నారంటే.. సామాజిక మాధ్యమాలు, డేటా ప్రొవైడర్ల ద్వారా సైబర్ నేరస్తులు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తారు. ఎంపిక చేసుకున్న వ్యక్తులకు ఫోన్ చేసి ఢిల్లీ, ముంబై కస్టమ్స్ అధికారులమని పేరు, చిరునామా చెబుతూ సంభాషిస్తారు. మీ పేరు, అడ్రస్‌తో ఉన్న పార్సిల్ కస్టమ్స్‌లో అనుమానాస్పదంగా కనిపించి నిలిపివేసినట్లు, తెరిచి చూస్తే అందులో మాదకద్రవ్యాలు, ఇతరత్రా చట్ట వ్యతిరేక ఉత్పత్తులు ఉన్నాయని గుర్తించినట్లు బెదిరిస్తారు. ఫోన్లో ఏమాత్రం బెరుకుగా మాట్లాడుతున్నట్లు అనిపించగానే బెదిరింపులు రెట్టింపు చేస్తారు. మనీలాండరింగ్, మాదక ద్రవ్యాల కేసులు నమోదు చేస్తామని వరుసగా ఫోన్లు చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తారు. కేసు వద్దంటే స్వాహా.. అమాయకులను నమ్మించేందుకు నకిలీ పోలీసు అధి కారుల గుర్తింపు కార్డులు సైతం కేటుగాళ్లు వాట్సాప్ చేస్తారు. ఈ వ్యవహారం నుంచి బయట పడాలంటే దర్యాప్తు సంస్థల అధికారులతో మాట్లాడి ఒప్పందం చేసుకో వాలని సలహా ఇస్తారు. ఆపై కొద్దిసేపటికి మరో నకిలీ అధికారి ఫోన్ చేసి కేసు లేకుండా ఉండాలంటే కొంత నగదు చెల్లించాల్సి ఉంటుందని సూచిస్తారు. ఇలా బాధితులను బెది రించి రూ. లక్షల్లో నగదు కొట్టేస్తున్నారు. ఈ రాష్ట్రాల నుంచే ఎక్కువ ఈ తరహా మోసాలు ఎక్కువగా ఫెడెక్స్ పార్సిల్ సంస్థ పేరుతో జరుగుతున్నాయని సైబర్ పోలీసులు విచారణలో గుర్తించారు. రాజస్తాన్, హరియాణా, జార్ఖండ్‌కు చెందిన సైబర్ ముఠాలు ఎక్కువగా ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నాయని ఓ పోలీసు అధికారి తెలిపారు. -
సైబర్ వలలో చిక్కుకున్న నటి నగ్మా.. ఒక్క క్లిక్‌తో రూ.లక్ష మాయం!
ఇటీవల కాలంలో సైబర్ నేరాలు మరింత పెరిగిపోతున్నాయి. కొత్త కొత్త తరహాలో మోసాలలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ సైబర్ మోసగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. తాజాగా సినియర్ హీరోయిన్ నగ్మా కేటుగాళ్ల వలలో చిక్కి పెద్ద మొత్తంలో మోసపోయారు. తన మొబైల్‌కు వచ్చిన మెసేజ్‌ని క్లిక్ చేసి రూ. లక్ష పోగొట్టుకున్నారు. ఫిబ్రవరి 28న నగ్మా మొబైల్‌కు బ్యాంకు వాళ్లు పంపినట్లు ఓ మెసేజ్ వచ్చిందట. అందులో ఉన్న ఓ లింక్‌ని ఓపెన్ చేయగానే వెంటనే ఆమెకు ఓ ఫోన్ కాల్ వచ్చిందట. బ్యాంక్ ఎంప్లాయ్‌గా తనను తాను పరిచయం చేసుకున్న కేటుగాడు.. కేవైసీ అప్డేట్ చేయమని చెప్పారు. ఆమె తన బ్యాంకు వివరాలు తెలియజేయనప్పటికీ.. తన్ ఆన్లైన్ బ్యాంకులోకి లాగిన్ అయి.. బెనిఫిషియరీ అకౌంట్ క్రియేట్ చేసుకుని దాదాపు లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ చేసుకున్నాడట. నేరగాడు లాగిన్ అయ్యే క్రమంలో తన మొబైల్‌కి దాదాపు 20 సార్లు ఓటీపీలు వచ్చాయని నగ్మా వెల్లడించారు. పెద్ద అమౌంట్ కాకుండా కేవలం లక్ష రూపాయలతో ఈ ఫ్రాడ్ నుండి బయటపడినందుకు నగ్మా బాధలో సంతోషం వ్యక్తం చేశారు. నగ్మా మాదిరే సదరు బ్యాంకులో ఖాతాలు ఉన్న మరో 80 మంది కూడా ఇదే తరహాలో మోసపోవడం గమనార్హం. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ముంబై సైబర్ పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. -
HYD: కాల్ గర్ల్ కోసం వెతికి వెతికి.. అడ్డంగా బుక్కయ్యాడు
క్రైమ్: కాల్‌గర్ల్ కోసం ఆన్లైన్లో వెతికిన ఓ టెక్కీ.. అడ్డంగా బుక్కయ్యాడు. మాయమాటలకు మోసపోయి.. రెండు లక్షల దాకా సొమ్ము పొగొట్టుకున్నాడు. హైదరాబాద్ నగరంలోని చందానగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉండే సదరు వ్యక్తి.. డిసెంబరు చివరివారంలో ఆన్లైన్లో ఎస్కార్ట్ సర్వీస్ ద్వారా కాల్‌గర్ల్ కోసం వెతికాడు. ఓ వెబ్సైట్లో కనిపించిన లింకు క్లిక్ చేయగానే ఒక నెంబర్ దొరికింది. ఆ నెంబర్ ద్వారా వాట్సాప్ ఛాటింగ్ కోసం యత్నించాడు. పటేల్ ఛార్మి పేరుతో పరిచయం చేసుకున్న అవతలి వ్యక్తి.. అమ్మాయిల ఫొటోలు పంపాడు. అయితే.. బుకింగ్ కోసం ముందుగా రూ.510 చెల్లించాలని కోరాడు. ఆ తర్వాత మరో రూ.5,500 పంపాలన్నాడు. మరోసారి మేసేజ్ చేసి.. సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.7,800 పంపమన్నాడు. కక్కుర్తితో సదరు ఐటీ ఉద్యోగి కూడా వివిధ సందర్భాల్లో డబ్బులు పంపుతూ పోయాడు. అలా.. మొత్తం రూ.1.97 లక్షలు పంపినట్లు చెబుతున్నాడు. చివరకు.. అంతా మోసం అని గుర్తించి సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలాంటి స్కామ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసులు సూచిస్తున్నారు. -
గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
సాక్షి, హైదరాబాద్: నాంపల్లిలోని గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ స్ట్రాటజీ టీమ్ హెడ్ ఆఫీస్‌ను సీజ్ చేయడంపై తెలంగాణ కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేస్తోంది. వార్‌రూమ్‌లో డేటాను ధ్వంసం చేశారని కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. పలుచోట్ల కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రగతి భవన్ ముట్టడికి వెళ్తున్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం గాంధీభవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కాగా మాదాపూర్‌లోని తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయంలో సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే. ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఎస్కే కార్యాలయంపై పోలీసుల దాడిని కాంగ్రెస్ నేతలు ఖండించారు.సునీల్ కార్యాలయాన్ని కుట్రపూరితంగా సీజ్ చేశారని ఆరోపించారు. ప్రభుత్వ, పోలీసు చర్యలకు నిరసనగా బుధవారం నిరసనలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలతో పాటు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. చదవండి: ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్ -
నయా ‘ఆన్లైన్’ మోసం
దొండపర్తి (విశాఖ దక్షిణ): ‘హలో సర్.. ఆన్లైన్లో మీరు పెట్టిన ఆర్డర్ వచ్చింది. కేవలం రూ.270 చెల్లించండి’ అంటూ విశాఖపట్నం ఉషోదయ జంక్షన్లో నివాసముంటున్న ఒక మహిళకు ఫోన్ వచ్చింది. ఆర్డర్ ఇవ్వలేదని చెప్పినా.. తక్కువ ధరకు ప్రొడక్ట్ వచ్చిందని చెప్పడంతో ఆమె కొరియర్‌ను తీసుకున్నారు. డబ్బులు చెల్లించాక కొరియర్‌ను తెరిచి చేస్తే అందులో పాత డ్రెస్ ఉంది. వెంటనే బిల్‌పై ఉన్న కస్టమర్ కేర్‌కు ఫోన్ చేయగా.. విషయం చెప్పకముందే ఫోన్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి మాట్లాడుతూ.. ‘మీ ఐటెమ్‌ను తిరిగి ఇచ్చేయాలనుకుంటున్నారా? మీ ఫోన్ నంబర్‌కు లింక్ పంపిస్తున్నాం. అది ఓకే చేస్తే అమౌంట్ మీకు తిరిగొస్తుంది’ అని చెప్పాడు. అసలు విషయం చెప్పకముందే సదరు వ్యక్తి అలా చెప్పే సరికి ఆమెకు అనుమానం వచ్చింది. లింక్ క్లిక్ చేస్తే ఫోన్ హ్యాక్ అవుతుందని భావించి వెంటనే ఆమె సోమవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నగరంలోకి బిహార్ గ్యాంగ్! ఆన్లైన్ లోన్ యాప్‌లు, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, డేటింగ్ యాప్‌ల ద్వారా ఫ్రెండ్ రిక్వెస్ట్ లింక్‌లు.. ఇలా అనేక మార్గాల్లో దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ఆన్లైన్ కేటుగాళ్లు ప్రజలను నిలువునా దోచుకుంటున్నారు. తాజాగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తరహాలో ఆన్లైన్ ఆర్డర్, కొరియర్ పేరుతో ప్రజలను దోచుకోడానికి కొత్త పంథాను ఎంచుకున్నారు. బిహార్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన గ్యాంగ్ నగరంలోనే తిష్టవేసి.. ఆన్లైన్లో ఆర్డర్స్ పేరుతో బుక్ చేసుకోకపోయినా ఫోన్లు చేసి కొరియర్‌ను అందిస్తున్నారని చెబుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు విశాఖ నగరంలో ఒక ప్లాట్‌లో ఉంటున్న ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పూర్తి స్థాయి విచారణ చేయాల్సి ఉందని.. ఈ ఆరుగురికి కొరియర్ మోసాలతో సంబంధం ఉందో, లేదో విచారణలో తేలుతుందని అంటున్నారు. కొరియర్లో పనికిరాని వస్తువులు కొరియర్‌ను తెరిచి చూస్తే అందులో వాడేసిన బట్టలు, పగిలిపోయిన చిన్న చిన్న వస్తువులు ఉంటున్నాయి. ఇటువంటివి డెలివరీ అయితే డబ్బులు చెల్లించిన వారు తప్పకుండా కస్టమర్ కేర్‌కు ఫోన్ చేయడం సర్వసాధారణం. ఆ గ్యాంగ్‌కు కావాల్సింది కూడా ఇదే. అలా కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసిన వెంటనే.. ఎటువంటి సమాచారం అడగకుండానే.. ‘మీ ఆర్డర్‌ను రిటర్న్ ఇచ్చేస్తున్నారా? మీకు లింక్ పంపిస్తాం. దాన్ని క్లిక్ చేస్తే మీ డబ్బులు రిఫండ్ అయిపోతాయి’ అని సమాధానమిస్తున్నారు. ఒకవేళ ఆ లింక్‌ను క్లిక్ చేస్తే బ్యాంక్ ఖాతా ఖాళీ అయిపోతుంది. ఆన్లైన్ మోసాలతో పాటు ఆర్డర్ చేయకుండా వచ్చే కొరియర్ల విషయంలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ భవానీ ప్రసాద్ సూచించారు. -
రెండేళ్లుగా అమృతపై అసభ్యకరమైన కామెంట్లు
ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృతపై అసభ్యకరమైన కామెంట్లు చేస్తూ వస్తున్న ఓ మహిళను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. రెండేళ్లుగా ఆమె ఈ పని చేస్తూ వస్తోంది. చివరకు సైబర్ పోలీసుల జోక్యంతో ఆమె కటకటాల వెనక్కి వెళ్లింది. అమృత ఫడ్నవిస్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్నది తెలిసిందే. అయితే.. స్మృతి పాంచోల్ అనే మహిళ గత రెండేళ్లుగా రకరకాల అకౌంట్లతో అమృత ఫేస్బుక్, ట్విటర్ అకౌంట్లలో అసభ్యకరమైన, అనుచితమైన కామెంట్లు చేస్తూ వస్తోంది. సుమారు 50 ఏళ్ల వయసున్న నిందితురాలు.. గత రెండేళ్లలో ఆమె 53 ఫేక్ ఎఫ్బీ ఐడీలు, 13 జీమెయిల్ అకౌంట్లు వాడినట్లు సైబర్ పోలీసులు గుర్తించారు. ఐపీసీ 419, 468 సెక్షన్ల ప్రకారం, అలాగే ఐటీ యాక్ట్ ప్రకారం ఆమెపై కేసు నమోదు అయ్యింది. ప్రస్తుతం నిందితురాలు కోర్టు రిమాండ్‌లో ఉండగా.. అసలు ఆమె అలా చేయడానికి కారణాలేంటి? ఆమె వెనుక ఎవరున్నారనే విషయాలను తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు. ఇదీ చదవండి: స్నేక్‌మ్యాన్ వినోద్.. పాపం కళ్ల ముందే కుప్పకూలాడు -
లోన్‌యాప్ సంస్థలపై కొరడా
సాక్షి, అమరావతి: ‘మీకు రుణం కావాలా.. ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా రెండు గంటల్లోనే మీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తాం’.. అంటూ గుంటూరుకు చెందిన మూర్తికి ఓ ఫోన్ వచ్చింది. కరోనాతో తన చిరు వ్యాపారం దెబ్బతినడంతో ఇబ్బందుల్లో ఉన్న ఆయన అప్పుల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగి విసిగిపోయి ఉన్నారు. దాంతో ఆ ఫోన్‌కాల్‌కు సానుకూలంగా స్పందించి ‘రూ.లక్ష లోన్ కావాలి’ అని అన్నారు. వారు అడిగిన వివరాలన్నీ యాప్‌లో అప్లోడ్ చేశారు. ఆయన అడిగింది రూ.లక్ష.. కానీ, ఇచ్చింది రూ.70వేలే.. అంటే ముందే రూ.30వేలు వడ్డీ కింద ఉంచుకుని రూ.లక్ష అప్పు ఇచ్చినట్లు చూపించారు. ఆ తరువాత నుంచి ప్రతినెలా వాయిదాలు కడుతున్నా అప్పు పెరుగుతోందే కానీ, తగ్గడంలేదు. చివరికి రూ.రెండు లక్షలు చెల్లించిన తరువాతగానీ ఆయన మోసాన్ని గుర్తించలేదు. దాంతో వాయిదాలు చెల్లించడం మానేయడంతో ఫోన్లో తీవ్రపదజాలంతో దూషణలు, బెదిరింపులు మొదలయ్యాయి. వాట్సాప్ మెసేజులు వచ్చాయి. ఆయన కుటుంబ సభ్యులను దూషిస్తూ ఆయన ఫోన్లో ఉన్న వాట్సాప్ గ్రూపుల్లో మెసేజులు ప్రత్యక్షమయ్యాయి. ఫోన్‌చేసి వేధించడం మొదలుపెట్టారు. దీంతో మూర్తి సైబర్ పోలీసులను ఆశ్రయించగా వారు దర్యాప్తు చేపట్టారు. ..ఇలా మూర్తి ఫిర్యాదుపైనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా లోన్‌యాప్ కంపెనీల ఆగడాలపై రాష్ట్ర సైబర్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. చైనా నుంచి కార్యకలాపాలు నిర్వహించే ఈ అనధికారిక సంస్థల ఆగడాల నుంచి బాధితులకు అండగా నిలుస్తున్నారు. ఈ దారుణాలకు అడ్డుకట్ట వేసేందుకు ద్విముఖ వ్యూహంతో కార్యాచరణను వేగవంతం చేశారు. మోసాలకు పాల్పడుతున్న వాటిపై కఠిన చర్యలను వేగవంతం చేశారు. మొదటి స్థానంలో తిరుపతి జిల్లా ఈ తరహా మోసాలపై రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటివరకు 63 కేసులు నమోదుచేశారు. లోన్‌యాప్ కంపెనీలపై కేసుల్లో తిరుపతి జిల్లా మొదటిస్థానంలో ఉండగా గుంటూరు, విశాఖజిల్లాలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇక ఈ కంపెనీలపై అత్యధికంగా కేసులు నమోదు చేసిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. విస్తృతంగా అవగాహన.. నిజానికి.. దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న లోన్‌యాప్ కంపెనీల్లో 90 శాతం కంపెనీలకు రిజర్వ్ బ్యాంకు అనుమతిలేదు. చైనాలో ఉంటూ ఇక్కడ అనధికారికంగా కాల్ సెంటర్లు ఏర్పాటుచేసుకుని మోసాలకు పాల్పడుతున్నాయి. అందుకే లోన్‌యాప్ కంపెనీల మోసాలపై ప్రజలకు సరైన అవగాహన కల్పించేందుకు రాష్ట్ర సైబర్ పోలీసు విభాగం ప్రత్యేక కార్యాచరణ చేపట్టి పలు సూచనలు చేసింది. అవి.. ► తెలియని వ్యక్తులు, కంపెనీలు పంపించే లింక్‌లు, ఈమెయిల్స్ ఓపెన్ చేయకూడదు. చేస్తే.. ఆ యాప్ డౌన్లోడ్ కాగానే వారి ఫోన్/ల్యాప్‌టాప్‌లోని కాంటాక్టŠస్ వివరాలు, ఇతర వ్యక్తిగత సమాచారం, వాటికి వచ్చే ఓటీపీ నంబర్లతోసహా సమాచారమంతా కూడా లోన్‌యాప్ కంపెనీకి అందుబాటులోకి వస్తుంది. ► అందుకే ఏదైనా లింక్‌ను క్లిక్ చేసేముందు ఆ కంపెనీకి గుర్తింపు ఉందా లేదా, గుర్తింపు ఉంటే ఆ కంపెనీకి రేటింగ్‌ను తెలుసుకోవాలి. ► బ్యాంకులు, గుర్తింపు పొందిన నాన్ బ్యాంకింగ్ కంపెనీలు మాత్రమే రుణాలు మంజూరు చేసేందుకు అనుమతి ఉంది. మిమ్మల్ని సంప్రదించిన కంపెనీ ఆ కేటగిరీకి చెందుతుందో లేదో పరిశీలించాలి. ► ఆధార్ నంబర్, కాంటాక్ట్స్ వివరాలు, ఫొటోలు, వ్యక్తిగత వివరాలు, ఓటీపీ నంబర్లు అడిగితే ఇవ్వొద్దు. ► ఆర్బీఐ గుర్తింపు పొందిన ఏ కంపెనీ కూడా రుణం మంజూరుచేసే ముందే కొంత మొత్తాన్ని మినహాయించుకోదు. అలా చేస్తామని ఏ కంపెనీ అయినా చెబితే మోసానికి పాల్పడుతున్నట్లే లెక్క. ► అలాగే, హామీలు, డాక్యుమెంట్లు అవసరంలేకుండా ఎవరైనా రుణం ఇస్తామన్నా విశ్వసించొద్దు. ► మీ యూపీఐ పిన్ నంబర్లు, పాస్వర్డ్, క్రెడిట్/డెబిట్ కార్డ్ నంబర్లు, సీవీవీ నంబర్లు ఎవరికీ చెప్పొద్దు. గుర్తింపు పొందిన బ్యాంకులు ఆ వివరాలు అడగవు. ► తెలియని ఖాతాల నుంచి మీ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు డిపాజిట్ అయినట్లు గుర్తిస్తే వెంటనే ఆ విషయాన్ని మీ బ్యాంకు అధికారులకు తెలియజేయండి. లేకపోతే మోసపూరిత లోన్‌యాప్ కంపెనీలు మీరు రుణం కోరితేనే బ్యాంకులో జమచేశామని చెప్పే ప్రమాదముంది. ఫిర్యాదులకు ప్రత్యేక వ్యవస్థలు మరోవైపు.. బాధితులు ఫిర్యాదు చేసేందుకు పలు వ్యవస్థలను పోలీసులు ఏర్పాటుచేశారు. అవి.. ► డయల్ 1930 : లోన్ యాప్ కంపెనీల మోసాలపై ఈ టోల్‌ఫ్రీ నంబరుకు ఫిర్యాదు చెయ్యొచ్చు. ► సైబర్‌మిత్ర వాట్సాప్ నం. 9121211100 : లోన్‌యాప్‌ల మోసాలు, వేధింపులపై దీనికీ ఫిర్యాదు చేయవచ్చు. ► సైబర్ క్రైమ్ పోర్టల్ : లోన్‌యాప్ కంపెనీలతోపాటు ఇతర సైబర్ నేరాలపై ఫిర్యాదు చేసేందుకు సంప్రదించాల్సిన సైబర్ క్రైమ్ పోర్టల్: www. cybercrime. gov. in లోన్‌యాప్ మోసాలపై కఠిన చర్యలు లోన్‌యాప్‌ల కంపెనీల మోసాలు, వేధింపులపై పోలీసు శాఖ కఠిన చర్యలు చేపడుతోంది. స్థానిక పోలీస్‌స్టేషన్‌తోపాటు బాధితులు ఫిర్యాదులు చేసేందుకు వివిధ వ్యవస్థలను అందుబాటులోకి తెచ్చాం. లోన్యాప్లపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా మోసపోయామని భావిస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలి. – కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, డీజీపీ జిల్లాల వారీగా లోన్‌యాప్ మోసాలపై నమోదైన కేసులు.. -
డోంట్ బీ ప్రాంక్..సరదా కాస్త సీరియస్ ఇష్యూగా..
సాక్షి, హైదరాబాద్, హిమాయత్‌నగర్: అది జడ్చర్ల బస్టాండ్. గురువారం మధ్యాహ్నం ఆకస్మికంగా కొందరు యువకులు ప్రత్యక్షమై భిక్షాటన పేరిట ప్రయాణికులతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ప్రారంభించారు. డబ్బులు అడుక్కుంటూ మహిళల పాదాల మీద పడ్డారు. వీరి ప్రవర్తన శృతి మించడంతో ప్రయాణికుల్లో సహనం నశించి వారిని పట్టుకుని చితకబాదారు. దాంతో యువకులు ఇదంతా ప్రాంక్ అని రహస్యంగా వీడియో చిత్రీకరణ చేస్తున్నామని వివరించారు. దీంతో మరింత అసహనానికి గురైన ప్రయాణికులు వారిని పోలీసులకు అప్పగించబోయారు. అయితే వారు కాళ్లావేళ్లా పడి బతిమాలాడడంతో వదిలేశారు. ఒకటి కాదు రెండూ కాదు ప్రాంక్ వీడియోల పేరిట పలువురు చెలరేగిపోతున్న సంఘటనలు నగరం చుట్టుపక్కల తరచు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా టాలీవుడ్ హీరో ప్రాంక్ వీడియో సృష్టించిన వివాదంతో మరోసారి ఈ ప్రాంక్ వీడియోలు చర్చనీయాంశంగా మారాయి. . ప్రాంక్...యాక్... ఇలాంటి వీడియోలకు మంచి వ్యూస్ వస్తుండడంతో అనేక మంది యూ ట్యూబర్స్ ప్రాంక్ బాట పడుతున్నారు. వీరిలో కొందరు పరిధిలో ఉండి పెద్దగా ఇబ్బంది పెట్టని ప్రాంక్ వీడియోలు చేస్తుండగా మరికొందరు మాత్రం మరీ బరి తెగిస్తున్నారు. ఓ లేడీ యూట్యూబర్ తాను చేసే ఓ గేమ్‌షో కోసం జనాల మధ్య వీడియోస్ చేస్తుంది. మెట్రో రైలులో కింద కూర్చుని కర్చీఫ్ వేసుకుని అడుక్కోవడం మొదలుకుని మెట్రో రైలులో వీరి టీమ్‌కు చెందిన అమ్మాయి అబ్బాయి ముద్దు పెట్టుకోవడం, ఇతరులను ముద్దు అడగడం వంటివీ చేయిస్తోంది. ఫిర్యాదు చేస్తే చర్యలు... ప్రాంక్ వీడియోల పేరుతో పబ్లిక్ ప్రదేశాలు సహా ఎక్కడా అశ్లీలం, అభ్యంతరకరమైన కార్యకలాపాలకు పాల్పడకూడదు. ఇటీవల ఇలాంటి వీడియోలు యూట్యూబ్‌లోనూ పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నాయి. ప్రాంక్స్ వల్ల ఇబ్బందులు ఎదురైనప్పుడు ఎవరైనా వచ్చి ఫిర్యాదు చేయవచ్చు. వీటి ఆధారంగా కేసులు నమోదు చేసుకుని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. – కేవీఎం ప్రసాద్, సిటీ సైబర్ క్రై మ్ ఏసీపీ -
జగత్ కిలాడీలకు ఝలక్
సాక్షి హైదరాబాద్: దేశ, విదేశీ పోలీసులకు ముప్పు తిప్పలు పెడుతూ.. మూడేళ్లుగా ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డుదారులను మోసం చేస్తున్న అంతర్జాతీయ నేరస్తులను సైబరాబా ద్ పోలీసులు అరెస్టు చేశారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ ఏసీపీ శ్రీధర్‌తో కలిసి సీపీ స్టీఫెన్ రవీంద్ర వివరాలు వెల్లడించారు. మూడు కాల్ సెంటర్ల ఏర్పాటు ఐటీలో విశేష అనుభవం ఉన్న న్యూఢిల్లీకి చెందిన నవీన్ భూటానీ 2017లో ఆర్‌ఎన్‌టెక్ సర్వీసెస్ కంపెనీని ఏర్పాటు చేసి.. విదేశీ కస్టమర్లకు సాంకేతిక సేవల ను అందిస్తున్నాడు. ఈ క్రమంలో ఢిల్లీకి చెందిన మోహిత్ కుమార్, మోను సింగ్‌లతో పరిచయం ఏర్పడింది. టెక్నాలజీ సేవల పేరుతో విదేశీ కస్టమర్లను మోసం చేయాలని నిర్ణయించుకొని ఢిల్లీలోని జనక్‌పురి, ఘజియాబాద్‌లోని కోశాంబి, పంజాబ్‌లోని మొహాలీలో మూడు కాల్ సెంటర్లను ఏర్పాటు చేశారు. 80 మంది టెలీకాలర్లను నియమించుకున్నారు. అమెజాన్, పేపాల్ వంటి ఈ– కామర్స్ సైట్లలో నమోదయిన ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్ వినియోగదారుల వివరాలను సేకరించారు. ‘మీరు ఫలానా రోజున ఆన్లైన్ షాపింగ్ చేశారు. మీ ఖాతా నుంచి సొమ్ము కట్ అయింది. మీరు సంబంధిత లావాదేవీలు జరపకపోతే కింద ఉన్న టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయండని’ నకిలీ మెసేజ్‌లు, ఈ– మెయిల్స్ పంపించారు. మరికొందరికి మీ కంప్యూటర్, రూటర్, ఇంటర్నెట్ సాంకేతిక పరికరాలలో సమస్యలు వచ్చాయని పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. కస్టమర్లు స్పందించగానే.. టెలీ కాలర్లు కాల్ రిసీవ్ చేసుకొని మోసానికి తెరలేపేవారు. ఎలక్ట్రానిక్స్‌ను హ్యాకింగ్ చేసి.. క్రెడిట్ కార్డ్ నంబర్, సీవీవీ, ఎక్స్పైరీ తేదీ, పిన్, పేరు ఇతరత్రా వివరాలను తస్కరించారు. వీటి సహాయంతో లావాదేవీలు నిర్వహించేందుకు నలుగురు హైదరాబాదీలతో చేతులు కలిపారు. ఇలా ఇప్పటివరకు సాంకేతిక సేవల ముసుగులో ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్దారులను రూ.25 కోట్ల మేర మోసం చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ∙అన్ని రకాల సాంకేతిక ఆధారాలను సేకరించిన సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ ఏసీపీ జీ శ్రీధర్, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌లు.. న్యూఢిల్లీకి చెందిన నవీన్ భూటానీ, మోహిత్, మోను, హైదరాబాద్‌కు చెందిన నాగరాజు బొండాడ, దొంతుల శ్రవణ్ కుమార్, సాధనాల ముక్కంటి శ్రీనివాసరావు, పవన్ వెన్నెలకంటిలను అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.1.11,40,000 నగదుతో పాటు మూ డు వాహనాలు, నాలుగు ల్యాప్‌ట్యాప్‌లు, 12 సెల్ఫోన్లు, 10 సీపీయూలు, 6 రబ్బర్ స్టాంప్‌లు, 16 చెక్కుబుక్‌లు, 18 డెబిట్ కార్డ్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఇలా బయటపడింది.. హైదరాబాద్‌లోని హెచ్డీఎఫ్సీ క్రెడిట్ ఇంటెలిజెన్స్ అండ్ కంట్రోల్ యూనిట్ ప్రతినిధి అబ్దుల్ నయీమ్.. బ్యాంక్ లావాదేవీలను పర్యవేక్షిస్తున్నప్పుడు హెచ్డీఎఫ్సీ జారీ చేసిన స్వైపింగ్ మెషీన్లో రూ.64.40 లక్షల అనధికార లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. దీంతో ఇటీవల సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఇలా ఐసీఐసీఐ, కొటక్ మహీంద్రా, ఐడీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ, ఆర్బీఎల్, యాక్సెస్ బ్యాంక్‌లకు గత ఆరు నెలల్లో రూ.50 కోట్ల మేర మోసం చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. 2018 నుంచి మోసాలకు పాల్పడుతున్నారు. కొట్టేసిన మొత్తం ఇంకా పెరిగే అవకాశముంది. ఈ ఘరానా సైబర్ నేరగాళ్లు దుబాయ్‌లో కూడా రూ.20 కోట్ల వరకు మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న దుబాయ్‌కు చెందిన అర్షద్, అమీర్, డాక్టర్ ఫహద్‌లను పోలీసులు అరెస్ట్ చేయనున్నారు. లావాదేవీలన్నీ హైదరాబాద్‌లోనే.. హైదరాబాద్‌కు చెందిన నాగరాజు బొండాడ అలియాస్ రాజు, దొంతుల శ్రవణ్ కుమార్, సాధనాల ముక్కంటి శ్రీనివాసరావు, పవన్ వెన్నెలకంటి మాదాపూర్ పోలీస్‌స్టేషన్ వెనకాలే డొల్ల కంపెనీలను ఏర్పాటు చేశారు. టెలీ కాలర్లు తస్కరించిన ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డుల వివరాలతో షాపింగ్ చేయడం కోసం మర్చంట్ సైట్లను అభివృద్ధి చేశారు. వీటికి సొంత బ్యాంక్ ఖాతాలతో పేమెంట్ గేట్వేలను అనుసంధానించారు. దీంతో మోసపూరిత క్రెడిట్ కార్డ్‌లతో వాళ్ల వెబ్సైట్లలో లావాదేవీలు జరపగానే ఆ సొమ్ము వాళ్ల ఖాతాలోనే జమ అయ్యే -
సైబర్ మోసగాళ్ల అరెస్ట్
విజయవాడ స్పోర్ట్స్: మన్‌గో గోనట్స్ వ్యాపారం చేస్తే అధిక లాభాలు వస్తాయని వ్యాపారులను నమ్మించి నగదు వసూలు చేస్తూ భారీ సైబర్ మోసానికి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాకు విజయవాడ సైబర్ పోలీసులు చెక్ పెట్టారు. గుజరాత్ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్ కేంద్రంగా ఈ నేరానికి పాల్పడుతున్న సతీష్‌శర్మ, కృష్ణశర్మను అరెస్టు చేశారు. నిందితులు ఇద్దరూ విజయవాడ హనుమాన్‌పేటకు చెందిన ఓ చెప్పుల వ్యాపారిని ఉచ్చులోకి దింపారు. ముందుగా ఫేస్బుక్ ద్వారా ఓ మహిళను ఆ వ్యాపారికి పరిచయం చేసి మన్‌గో గోనట్స్ వ్యాపారాన్ని వివరించారు. ఆఫ్రికా దేశాల్లో తక్కువ ధరకు లభించే ఈ నట్స్‌ను ఇండియాలో అమ్మితే లాభాలు గడించవచ్చని వ్యాపారిని నమ్మించారు. పలు దఫాలుగా రూ.78 లక్షలు వసూలు చేశారు. తరువాత నుంచి ఫోన్లు స్విచ్ఛాఫ్ చేశారు. దీంతో చెప్పుల వ్యాపారి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితులు గుజరాత్ కేంద్రంగా సైబర్ నేరానికి పాల్పడుతున్నట్లు గుర్తించారు. అక్కడి పోలీసుల సహకారంతో ముందుగా నిందితులు సతీష్‌శర్మ, కృష్ణశర్మకు నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులకు వారు స్పందించకపోవడంతో వారిద్దరినీ అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు సైబర్ సీఐ కె.శ్రీనివాస్ తెలిపారు. నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో రాజమండ్రి జైలుకు పంపినట్లు చెప్పారు. -
యువతి ఫొటోలతో న్యూడ్ ఫొటోలు అప్లోడ్ చేస్తానంటూ..
సాక్షి, హిమాయత్‌నగర్ (హైదరాబాద్): న్యూడ్ ఫొటోలను మార్ఫింగ్ చేసి తన వద్ద నుంచి డబ్బులు స్వాహా చేశారంటూ నగరానికి చెందిన ఓ యువకుడు మంగళవారం సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యువకుడికి చెందిన ఫొటోలను మార్ఫింగ్ చేసి ఫొటో పక్కనే మరో యువతి ఫొటోలను ఉంచి ఓ వ్యక్తి తనను బెదిరించాడని, డబ్బులు ఇవ్వకపోతే స్నేహితులు, బంధువులకు వాట్సాప్‌లో షేర్ చేస్తానని బెదిరించడంతో అతడికి రూ. 2.89 లక్షలు ఇచ్చినట్లు తెలిపాడు. అయినా మరిన్ని డబ్బులు డిమాండ్ చేస్తుండటంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. చదవండి: ఎంత దారుణం.. ఇద్దరు పిల్లలను బావిలో పడేసి.. -
Bully Boy App Case: 19 ఏళ్ల యువతే ప్రధాన సూత్రధారి!
ముంబై(మహరాష్ట్ర): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బుల్లి బాయ్ యాప్ కేసులో ముంబై సైబర్ సెల్ పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా భావిస్తున్న ఉత్తరాఖండ్‌కు చెందిన 19 ఏళ్ల యువతి శ్వేతా సింగ్‌ను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి విశాల్ కుమార్ ఝా (21)ను సోమవారమే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. విశాల్ ఇచ్చిన సమాచారం మేరకు ప్రధాన నిందితురాలైన శ్వేతా సింగ్‌ను ఉత్తరాఖండ్‌లో అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇద్దరూ ఫ్రెండ్స్ శ్వేత, విశాల్‌లకు పూర్వ పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో మరిన్ని అరెస్టులు ఉంటాయని పోలీసులు తెలిపారు. శ్వేతను ముంబైకి తీసుకురావడానికి వీలుగా ఉత్తరాఖండ్‌లోని స్థానిక కోర్టు ఆమెకు నాలుగురోజుల ట్రాన్సిట్ రిమాండ్ విధించింది. విశాల్‌ను మంగళవారం ముంబైలోని బాంద్రా మెట్రోపాలిటన్ కోర్టు ఎదుట హాజరుపరచగా న్యాయస్థానం అతనికి జనవరి 10 వరకు రిమాండ్ విధించింది. ముంబై సైబర్ పోలీసుల బృందం ఉత్తరాఖండ్‌లో అదుపులోకి తీసుకున్న శ్వేతా సింగ్ ఈ యాప్ రూపొందించడం వెనుక కీలక పాత్ర పోషించిందన్న అనుమానాలున్నాయి. ఈ యాప్‌కి సంబంధించి ఆమె ఎన్నో వేర్వేరు అకౌంట్లు కలిగి ఉంది. విశాల్‌ని, యువతిని కలిసికట్టుగా విచారించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ట్విట్టర్లో యాక్టివ్‌గా ఉండే 100 మందికిపైగా ముస్లిం మహిళల ఫోటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి బుల్లి బాయ్ అనే యాప్‌లో అప్లోడ్ చేసి వేలానికి ఉంచిన విషయం తెలిసిందే. నిందితులు ఆ ఫోటోలను వేలానికి పెట్టినప్పటికీ వారి అసలు ఉద్దేశం మైనార్టీ మహిళల్ని అవమానించడమేనని పోలీసులు భావిస్తున్నారు. విశాల్ ‘ఖాల్సా సుప్రిమసిస్ట్’ పేరుతో ట్విట్టర్ ఖాతాను నిర్వహిస్తున్నాడని, మరికొన్ని నకిలీ ట్విట్టర్ ఖాతాల పేర్లను కూడా మార్చి సిక్కుల పేర్లను పోలిన వాటిని వాడినట్లు పోలీసులు తెలిపారు. త్వరలో ఎన్నికలు జరగనున్న పంజాబ్‌లో మతపరమైన ఉద్రిక్తతలను రేకెత్తించే ప్రయత్నం ఏదైనా చేశారా? అనే కోణంలోనూ విచారించనున్నట్లు తెలిపారు. చదవండి: ముస్లిం విద్యార్థులు సూర్య నమస్కారాల్లో పాల్గొనవద్దు -
‘బాల భటులు’ సిద్ధం.. దేశ పోలీసు చరిత్రలో తొలిసారి
సాక్షి, హైదరాబాద్: ‘నేను పొందిన అవగాహన తో నన్ను నేను రక్షించుకోవడంతో పాటు సమాజాన్ని సంరక్షిస్తానని, నా పాఠశాలలో ఉన్న పిల్లలు, పెద్దలు ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే వారికి సహాయం చేస్తానని, సలహాలు సూచనలు ఇస్తానని, సైబర్ పోలీసులకు, షీ–టీమ్స్‌కు సమాజానికి మధ్య వారధిగా ఉంటానని ప్రమాణం చేస్తున్నా’ మంగళవారం తెలంగాణలోని 1650 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ‘బాల భటులు’ చేసిన ప్రమాణమిది. దేశ పోలీసు చరిత్రలోనే తొలిసారిగా తెలంగాణ పోలీసులు ఈ ప్రయోగం చేశారు. సైబర్ నేరాలను నిరోధించడానికి రాష్ట్ర మహిళ భద్రత విభాగం అమల్లోకి తెచ్చిందే ‘సైబర్ కాంగ్రెస్’. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు సైబర్ అంబాసిడర్లుగా తీర్చిదిద్దారు. విద్యాశాఖ అధికారులతో కలసి వర్చువల్‌గా 3 నెలల పాటు శిక్షణ ఇచ్చారు. ఈ బాల భటులు మంగళవారం నుంచి అధికారికంగా రంగంలోకి దిగారు. మొత్తం 33 జిల్లాల్లోని జిల్లా పరిషత్ స్కూళ్లలో జరిగిన కార్యక్రమాల్లో బాల భటులకు బ్యాడ్జీలు అందించారు. నగరంలోని మహబూబియా స్కూల్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మహిళా భద్రత విభాగం అదనపు డీజీ స్వాతి లక్రా, డీఐజీ సుమతి పాల్గొన్నారు. వీరి పర్యవేక్షణలో సైబర్ నేరాలపై చైతన్యం, అవగాహన కల్పించేందుకు సైబ్–హర్ క్యాంపెయినింగ్ జరిగింది. దీనికి కొనసాగింపుగా సైబర్ కాంగ్రెస్ చేపట్టారు. ఒక్కో పాఠశాల నుంచి ఇద్దరు రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఉన్న పాఠశాలలను 16 యూనిట్లుగా చేశారు. విద్యా శాఖ, పోలీసు విభాగంతో పాటు స్వచ్ఛంద సంస్థ యంగిస్తాన్ ఫౌండేషన్‌తో కలసి మహిళా భద్రత విభాగం పని చేసింది. ఒక్కో ప్రభుత్వ పాఠశాల నుంచి 8, 9 తరగతులు చదువుతున్న ఇద్దరిని ఎంపిక చేశారు. వీరికి సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఇతరుల్లో అవగాహన పెంచడంతో పాటు బాధితులకు సహకరించే విధానాలు నేర్పారు. స్థానిక పోలీసుస్టేషన్లకు చెందిన ఇన్స్పెక్టర్లు అనుసంధానకర్తలుగా పని చేస్తారు. మహిళలు, బాలికలపై జరుగుతున్న నేరాలపై దృష్టి పెట్టారు. సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా చైతన్యం కలిగించడంతో పాటు బాలికల భద్రతకు భంగం వాటిల్లకూడదనే లక్ష్యంతో ముందుకెళ్లారు. ఈ విద్యార్థులకు సైబర్ నేరాలపై ప్రతి వారం ఆన్లైన్లో తరగతులు నిర్వహించారు. ఎదురయ్యే సమస్యలను తెలియజేయడంతో పాటు వాటికి పరిష్కార మార్గాలను నేర్పారు. ఇంటర్నెట్ను ఎలా సద్వినియోగం చేసుకోవాలో వివరిస్తూ విద్యార్థుల నుంచి సమాచారం సేకరించారు. ఆన్లైన్ నేపథ్యంలో... కరోనా నేపథ్యంలో విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు తప్పనిసరయ్యాయి. చేతికి స్మార్ట్ఫోన్లు రావ డంతో క్లాసులతో పాటు యాప్‌ల వినియోగం, ఆన్ లైన్ గేమ్స్‌కు అలవాటు పడ్డారు. దీన్ని సైబర్ నేరగాళ్లు క్యాష్ చేసుకోవడంతో అనేకమంది విద్యా ర్థులు సైబర్ నేరగాళ్ల వల్లో చిక్కుతున్నారు. పర్యవేక్షణ లేని కొందరు పెడదారి పడుతున్నారు. వీటన్నింటికీ పరిష్కారంగా ఈ సైబర్ అంబాసిడర్లను రంగంలోకి దింపారు. సుశిక్షితులైన ఈ 3,300 మంది తమను తాము కాపాడుకోవడంతో పాటు సహ విద్యార్థులు, తల్లిదండ్రులు, స్నేహితులు, పరిచయస్తులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పి స్తారు. బాధితులుగా మారిన వారికి పోలీసులు, షీ–టీమ్స్ ద్వారా సహాయసహకారాలు అందేలా కృషి చేస్తారు. తొలి విడతలో సైబర్ అంబాసిడర్లుగా మారిన 3,300 మందిలో 1,500 మంది బాలురు కాగా, 1,800 మంది బాలికలు ఉన్నారు. -
చెప్పినట్లే చేసినందుకు 4.90 లక్షలు హుష్
సాక్షి,నిజామాబాద్ అర్బన్: బ్యాంక్ ఖాతాకు పాన్‌కార్డు లింక్ చేయమని వచ్చిన మెసేజ్ వచ్చింది. తన మొబైల్లో క్లిక్ చేసిన వ్యక్తి రూ. 4.90 లక్షలు పోగొట్టుకున్నాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ వివరాలివి. నగరంలోని కంఠేశ్వర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి బ్యాంక్ అకౌంట్‌కు పాన్‌కార్డు లింక్ చేయాలని సెప్టెంబర్ 30త తేదీ మెసేజ్ వచ్చింది. తన మొబైల్లో లింక్ క్లిక్ చేశాడు. కావలసిన సమాచారం అందించాడు. అంతలోనే తన మొబైల్ నంబర్‌కు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌చేసి ఎస్బీఐ బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామంటూ మొబైల్‌కు వచ్చిన ఓటీపీ చెప్పమని అడిగారు. ఆ నంబర్ చెప్పిన కాసేపటికే తన బ్యాంక్ ఖాతాలోని రూ.4.90 లక్షల 330 విత్‌డ్రా అయినట్లు మెస్సేజ్ వచ్చింది. అకౌంట్ నుంచి డబ్బు పోయినట్లు గుర్తించిన బాధితుడు శనివారం మూడో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై సంతోష్‌కుమార్ తెలిపారు. ఈ తరహాలో మోసపోతే 24 గంటల్లోపు 155260 లేదా డయల్ 100 కు ఫిర్యాదు చేయాలని ఆయన తెలిపారు. గుర్తు తెలియని లింక్స్ క్లిక్ చేయవద్దన్నారు. చదవండి: కొడుకు పుడితేనే మా ఇంటికి రా..!.. భర్త, అత్త వేధింపులు -
నీ కోసం యూఎస్ నుంచి వస్తున్నా.. ఎయిర్‌పోర్టులో..
సాక్షి, హిమాయత్‌నగర్(హైదరాబాద్): కాంచన్‌బాగ్‌కు చెందిన యువకుడికి కొద్ది నెలల క్రితం ఫేస్బుక్లో ఓ యువతి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టింది. కొద్దిరోజులకు మెసేంజర్ చాటింగ్ అనంతరం వాట్సాప్ నంబర్స్‌ను ఇచ్చిపుచ్చుకున్నారు. నిన్ను చూడటానికి యూఎస్ నుంచి కెనడా మీదుగా ఇండియా వస్తున్నా అని చెప్పింది. కట్ చేస్తే.. రెండు రోజుల తర్వాత నీకోసం తెస్తున్న గిఫ్టులను ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ వాళ్లు పట్టుకున్నారని, నా వద్ద ఉన్న కరెన్సీ మార్చుకునే సమయం కూడా లేదని చెప్పింది. మాటలు విన్న యువకుడు రూ.6.20 లక్షలను అకౌంట్స్‌కు పంపాడు. ఆ తర్వాత నుంచి ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో బుధవారం సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరో ఘటనలో.. నమ్మించి.. బంగారు గొలుసు లాక్కెల్లారు సాక్షి,కాచిగూడ(హైదరాబాద్): మహిళ మెడలోంచి బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన సంఘటన కాచిగూడ రైల్వే పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ వివరాల ప్రకారం.. పటేల్‌నగర్‌లో నివాసం ఉంటున్న ఇంద్రజ (25) భర్త బాలసుమన్ ఇద్దరు మూగవాళ్లు. బుధవారం విద్యానగర్‌లోని మానసిక వికలాంగుల కేంద్రానికి భార్యాభర్తలు కలిసి వచ్చారు. తిరుగు ప్రయాణంలో విద్యానగర్ రైల్వేస్టేషన్‌కు వచ్చారు. అక్కడ ఉన్న ముగ్గురు గుర్తు తెలియని దొంగలు వీరిద్దరికి రైలు టికెట్లను ఇప్పిస్తామని నమ్మించారు. భార్యాభర్తలు రైలు ఎక్కుతుండగా ఇంద్రజ మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు గొలుసును టికెట్‌ను ఇప్పించిన వారే లాక్కొని పారిపోయారు. ఈ సంఘటనపై ఇంద్రజ కాచిగూడ రైల్వే పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: మా పిన్ని ఓ లేడీ టైగర్.. రక్షించండి సార్ -
కస్టమర్ కేర్ అంటారు.. నిలువునా దోచేస్తారు..
సాక్షి, హైదరాబాద్: కరోనా, బ్యాంకుల విలీనం, వర్క్ ఫ్రం హోమ్, పార్ట్‌టైం జాబ్, కస్టమర్ కేర్, ఇన్వెస్ట్మెంట్స్ ప్రతీది సైబర్ నేరగాళ్లు మోసాలకు వేదికలుగా మలుచుకుంటున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్, నిరుద్యోగులు పార్ట్ టైం జాబ్స్లపై ఆసక్తి కనబరుస్తున్నారు. వీటిని ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్లు కంపెనీ ప్రతినిధులుగా మెయిల్స్ పంపి మోసాలకు తెర లేపుతున్నారు. పలు బ్యాంకులు విలీనం కావటంతో ఖాతాదారులకు ఫోన్ చేసి కేవైసీ అప్డేషన్ లేదా క్రెడిట్ కార్డ్ లిమిట్ పెరుగుతుందనో మాట్లాడుతూ ఖాతా, క్రెడిట్/డెబిట్ కార్డ్, సీవీవీ నంబర్లు తీసుకుంటున్నారు. ఓటీపీ రాగానే దాని నమోదు చేస్తే సరిపోతుందని చెప్పి.. ఓటీపీ తీసుకొని ఖాతాలోని సొమ్ము స్వాహా చేస్తున్నారు. బాధితులు 30–40 ఏళ్ల వయస్కులే.. సైబర్ నేరాల్లో ప్రధానంగా కస్టమర్ కేర్, ఓఎల్ఎక్స్, జాబ్, కేవైసీ, ఇన్వెస్ట్మెంట్ పేరిట మోసాలు జరుగుతుంటాయి. ఎక్కువగా 30–45 ఏళ్ల వయస్సున్న వారే బాధితులవుతున్నారని సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ కే బాలకృష్ణా రెడ్డి తెలిపారు. రాజస్థాన్ నుంచి ఎక్కువగా ఓఎల్ఎక్స్ ప్రకటనల మోసాలు, జార్ఖండ్ నుంచి కస్టమర్ కేర్ మోసాలు జరుగుతున్నాయి. పెట్టుబడుల పేరిట జరిగే మోసాలకు లింక్‌లు ఎక్కువగా విదేశాళ„Š ళ ఉంటున్నాయి. ఆయా కేసుల విచారణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని నేరస్తులను పట్టుకుంటామన్నారు. గూగుల్‌లో వెతకొద్దు.. ఏదైనా కంపెనీకి సంబంధించిన కస్టమర్ కేర్ నంబరును తెలుసుకోవాలంటే ఆయా సంస్థ అధికారిక వెబ్సైట్లోనే సమాచారం తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో గూగుల్‌లో సెర్చ్ చేయొద్దు. గూగుల్‌లో వచ్చిన నంబరుకు కాల్ చేస్తే కస్టమర్ చార్జీ కోసం రూ.10 లను మోసగాళ్లు పంపే లింక్ ద్వారా చెల్లించమని కోరినా పలు యాప్స్ డౌన్లోడ్ చేయమని అడిగినా అది మోసమని గ్రహించాలి.. – కే.బాలకృష్ణా రెడ్డి, ఏసీపీ, సైబర్ క్రైమ్, సైబరాబాద్ కమిషనరేట్ చదవండి: Bullettu Bandi Bride: ‘బుల్లెట్టు బండి’ వధువుకు బంపర్ ఆఫర్ -
ఓఎల్ఎక్స్లో సోఫా.. ఫోన్ చేసి కొంటామన్నారు కాకపోతే..
సాక్షి,అంబర్‌పేట(హైదరాబాద్): సోఫా సెట్ అమ్ముతానని ఓఎల్ఎక్స్లో పోస్టులు పెట్టిన ఓ యువకుడికి సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. ఈ సంఘటన మంగళవారం అంబర్‌పేట పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ రవీందర్ సమాచారం మేరకు... బాగ్ అంబర్‌పేటలో నివసించే అక్షయ్ ఇంట్లో ఉన్న సోఫాను రూ. 9 వేలకు అమ్ముతానని ఓఎల్ఎక్స్లో పోస్టు పెట్టాడు. దీనికి స్పందనగా సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి మీ సోఫా కొంటామని, ముందుగా క్యూ ఆర్ కోడ్ అందిస్తామని దాన్ని స్కాన్ చేయాలని కోరారు. క్యూ ఆర్‌ను స్కాన్ చేసిన అక్షయ్‌కు పంపారు. ఆ కోడ్ ఓపన్ చేసిన అతని ఖాతాలోంచి రూ. 63 వేలు కాజేశారు. దీంతో మోసపోయానని తెలుసుకున్న అక్షయ్ అంబర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: పక్కా ప్లాన్.. భర్తని అడ్డుతొలగించుకుంది chicken: భర్త చికెన్ తిన్నాడని క్షణికావేశంలో భార్య ఆత్మహత్య -
ద్యావుడా.. వీళ్ళు వాట్సాప్‌ని వదలట్లేదుగా
సాక్షి,హైదరాబాద్: ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్‌ను సైబర్ నేరగాళ్లు వదలట్లేదు. ఓ నంబర్‌ను తమ అధీనంలోకి తెచ్చుకుని దాని ఆధారంగా కాంటాక్ట్స్ లిస్ట్‌ను సంగ్రహిస్తున్నారు. అందులో ఉన్న వారికి హ్యాకింగ్ లింకు పంపి హ్యాక్ చేస్తున్నారు. వారికి సందేశాలు పంపుతూ అందినకాడికి దండుకుంటున్నారు. నగరంలో గడిచిన మూడ్రోజుల్లో నలుగురు బాధితులుగా మారారు. రూ.4 లక్షలు కోల్పోయిన వీళ్లు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు మూడు కేసులు నమోదు చేసినట్లు సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ చెప్పారు. సాధారణంగా ఎవరైనా ఒక స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్‌ను వాడుతూ... మరో ఫోన్లోకి మారితే.. ఓటీపీని పొంది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీన్ని తమకు అనువుగా మార్చుకుంటున్న సైబర్ నేరగాళ్లు కొన్ని నంబర్లతో వాట్సాప్ యాక్టివ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ► దీనికి సంబంధించిన ఓటీపీ అసలు యజమానికి వెళ్తుంది. రకరకాల పేర్లతో సంప్రదించి బురిడీ కొట్టిస్తున్న సైబర్ నేరగాళ్లు ఓ లావాదేవీలో పొరపాటున మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేశానని, దీంతో ఓటీపీ మీకు వచ్చిందని చెప్పి వారి నుంచి తీసుకుంటున్నారు. ► ఇలా ఓటీపీని చేజిక్కించుకుని తమ ఫోన్లలో వారి నంబర్‌తో వాట్సాప్ యాక్టివేట్ చేసుకుంటున్నారు. ఆ వెంటనే వారి వాట్సాప్ డీపీని కాపీ చేసి తమ దానికి పెట్టేస్తున్నారు. దీంతో పాటు సెక్యూరిటీ సెట్టింగ్స్‌ను మార్చేస్తూ టూ స్టెప్ వెరిఫికేషన్ చేస్తున్నారు. దీని వల్ల అసలు వ్యక్తి ఈ విషయం గుర్తించి తన ఫోన్లో వాట్సాప్‌ను మరోసారి యాక్టివేట్ చేసుకోవాలని భావించినా.. అది సాధ్యం కాదు. ఇలా దేశ వ్యాప్తంగా ఉన్న అనేక మంది నంబర్లు సైబర్ నేరగాళ్లు తమ అధీనంలోకి తీసుకుంటున్నారు. ► వాట్సాప్ బ్యాకప్ డేటాను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా వారి కాంటాక్ట్స్‌తో పాటు చాటింగ్స్‌ను తమ ఫోన్లోని వచ్చేలా చేస్తున్నారు. ఆపై ఆ కాంటాక్ట్స్‌లో కొందరికి అత్యవసరంగా డబ్బు కావాలంటూ సందేశాలు పంపుతూ, మరికొందరికి హ్యాకింగ్ లింకులు సెండ్ చేస్తున్నారు. ► తమ స్నేహితులు/బంధువుల నుంచే ఆ సందేశం వచ్చిందని భావిస్తున్నారు. కొందరు డబ్బు చెల్లిస్తుండగా.. మరికొందరు లింకుల్ని ఓ పెన్ చేసి తమ వాట్సాప్ కూడా హ్యాక్ అవడానికి కారకులు అవుతున్నారు. ఇలా వీరి కాంటాక్ట్స్‌లోని వారికీ సైబర్ నేరగాళ్లు సందేశాలు పంపుతూ తమ పని పూర్తి చేసుకుంటున్నారు. బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన కుమార్‌కు అతడి స్నేహితుడి నంబర్ నుంచి సోమవారం రూ.1.5 లక్షలు కావాలని సందేశం వచ్చింది. రూ.లక్ష బదిలీ చేసిన ఆయన మిగిలిన రూ.50 వేలు సర్దుబాటు కావవట్లేదని చెప్పడానికి మామూలు కాల్ చేశారు. దీంతో అసలు విషయం తెలిసి సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ► ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ సమీపంలోని వీఎస్టీకి చెందిన ఓ అధికారి నంబర్‌ను సైబర్ నేరగాళ్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీని నుంచి అందులో పని చేసే ఉద్యోగులకు డబ్బు కావాలంటూ మంగళవారం సందేశాలు పంపారు. అప్రమత్తమైన వాళ్లు సదరు అధికారి దృష్టికి విషయం తీసుకువెళ్లడంతో ఆయన సైబర్ కాప్స్‌ను ఆశ్రయించారు. ► పాతబస్తీకి చెందిన ఇద్దరు బాధితులకు వారి బంధువుల నంబర్ నుంచి ఇలానే సందేశాలు వచ్చాయి. నిజమైనవే అని భావించిన వాళ్లు రూ.1.5 లక్షల చొప్పున బదిలీ చేశారు. ఆపై అసలు విషయం తెలుసుకుని బుధవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. -
వాళ్ళ లింక్ దొరికితే ఫ్రీజ్!
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లకు పూర్తి స్థాయిలో చెక్ చెప్పడానికి వారి ఆర్థిక మూలాలను దెబ్బతీయడం ఓ మార్గమని భావిస్తున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఆ కోణంపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) సాయం తీసుకుంటున్నారు. ఒకే నో యువర్ కస్టమర్ (కేవైసీ) వివరాలతో తెరిచిన అన్ని బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేస్తున్నారు. ►∙వివిధ రకాల పేర్లతో ఎర వేసి అందినకాడికి దండుకునే సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు అత్యంత కీలకం. వీళ్లు నేరుగా ఎవరికీ కనిపించని నేపథ్యంలో ఏదైనా మోసంలో ప్రజల నుంచి డబ్బు దండుకోవడానికి వీటిని, వీటికి లింకై ఉన్న యాప్స్‌ను వినియోగిస్తుంటారు. ►ఈ నేరగాళ్లు నేరుగా తమ పేరుతో బ్యాంకు ఖాతాలు తెరవరు. అలా చేస్తే పోలీసుల దర్యాప్తు నేపథ్యంలో పక్కా ఆధారాలు లభిస్తాయని, వాటి ఆధారంగా తాము కూడా పట్టుబడతామని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కమీషన్ తీసుకుని తమ గుర్తింపు పత్రాలతో ఓపెన్ చేసి అందించే వారిని ఎంచుకుంటారు. ►బ్యాంకు ఖాతాలు తెరిచే సమయంలో కచ్చితంగా కొన్ని కేవైసీ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఇలాంటి బ్యాంకు ఖాతాలను అందించే వాళ్లు తమ కేవైసీలతో అనేక బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి సైబర్ నేరగాళ్లకు ఇస్తుంటారు. వీటిలోనే సైబర్ నేరగాళ్లు బాధితుల నుంచి డబ్బు డిపాజిట్, ట్రాన్స్ఫర్ చేయిస్తారు. ►ఏదైనా ఒక బ్యాంకు ఖాతాలో డబ్బు పడిన తర్వాత కొన్ని గంటల్లోనే దాన్ని వివిధ ఖాతాల్లోకి బదిలీ చేసేస్తుంటారు. ఒక్కో బాధితుడికి ఒక్కో బ్యాంకు ఖాతా వివరాలు ఇచ్చి వాటిలో డబ్బు పడేలా జాగ్రత్తలు తీసుకుంటారు. మరోపక్క బాధితులు ఫిర్యాదు చేసినా వీటి వివరాలు సంగ్రహించే లోపు నగదు మరోచోటకు వెళ్లిపోతుంది. ►మరోపక్క ఓ కేవైసీతో ఎక్కడెక్కడ, ఎన్ని బ్యాంకు ఖాతాలు తెరిచారు అనేది ఆయా బ్యాంకులకు తెలిసే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలోనే సైబర్ నేరగాళ్లు వరుసపెట్టి నేరాలు చేసుకుంటూపోతున్నా కేవలం ఫిర్యాదుదారుడు డబ్బు వేసిన వాటిని మాత్రమే ఫ్రీజ్ చేయడం సాధ్యమవుతోంది. ►ఈ విషయాన్ని గమనించిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు లోతుగా ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే ఒక్కో కేవైసీతో ఎన్ని బ్యాంకు ఖాతాలు తెరిచి ఉన్నాయి? అవి ఎక్కడెక్కడ ఉన్నాయి? లావాదేవీలు ఏంటి? తదితర వివరాలన్నీ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధీనంలోని ఎఫ్ఐయూ వద్ద అందుబాటులో ఉంటాయని గుర్తించారు. కీలక సైబర్ నేరాల విషయంలో ఆ బాధితుల డబ్బు వెళ్లిన బ్యాంకు ఖాతా తెరిచే సమయంలో వాటిని కేవైసీ వివరాలు సంగ్రహిస్తున్నారు. వీటిని ఎఫ్ఐయూకు పంపడం ద్వారా వాటితో తెరిచిన ఇతర ఖాతాలను తెలుసుకుంటున్నారు. అవి కూడా సైబర్ నేరాలకే వినియోగిస్తున్నట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయితే అసలు ఖాతాతో పాటు వీటినీ ఫ్రీజ్ చేయిస్తున్నారు. -
కేసీఆర్ ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం, అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంపై సోషల్ మీడియలో తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. లుక్ ఔట్ నోటీస్ ద్వారా రాజు అనే యువకుడిని ముంబై ఎయిర్ పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రాజు సౌదీ అరేబియాలో ఉంటూ జూన్‌లో కేసీఆర్ ఆరోగ్యపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన విషయం తెలిసిందే. కేసీఆర్‌కు కరోనా వైరస్ సోకిందని, దాన్ని గాంధీ ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారని అసత్య ఆరోపణలు చేశారు. దీంతో ఆతనిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. సౌదీ అరేబియా నుంచి తిరిగి వచ్చిన రాజును ముంబై ఏయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. సైబర్ క్రైమ్ పోలీసులు రాజును ముంబై నుంచి హైదరాబాద్ తీసుకువచ్చారు. ఈ కేసులో అతన్ని పోలీసులు జ్యుడీషియల్ కస్టడికి పంపారు. -
ఈ గేమ్ ఆడితే ‘రంగు’ పడుద్ది!
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ గేమ్స్‌కు యువతను బానిసలు చేసి, భారీగా డబ్బు కొల్లగొడుతున్న సంఘటనలు ఇటీవల అధికమయ్యాయి. ఈ–కామర్స్ పేరుతో సంస్థల్ని, వెబ్‌సైట్స్‌ను రిజిస్టర్ చేస్తున్న చైనా కంపెనీలు.. ఈ ముసుగులో ఆన్లైన్ గేమ్‌ను ప్రోత్సహిస్తూ ఆదాయం గడిస్తున్నాయి. తాజాగా కలర్ ప్రిడిక్షన్ పేరుతో రూపొందించిన ఓ గేమ్ యువతను నిండా ముంచుతోంది. ఒక్క ఈ ఏడాదిలోనే దేశంలో రూ.1100 కోట్ల టర్నోవర్ చేసిన ఈ గేమ్.. ఇప్పటికే రూ.110 కోట్లను విదేశాలకు తీసుకెళ్లింది. దీనిపై ఫిర్యాదు రావడంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు దర్యాప్తు చేసి ఓ చైనీయుడి సహా నలుగురు నిందితుల్ని అరెస్టు చేశారు. గురువారం కొత్వాల్ అంజనీకుమార్ ఈ వివరాలు వెల్లడించారు. ఈ గేమ్ నిర్వహిస్తున్న సంస్థలకు చెందిన రెండు బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.30 కోట్లు ఫ్రీజ్ చేశామని తెలిపారు. ఎలా ఏ మారుస్తున్నారంటే.. నిర్వాహకులు ఈ గేమ్‌ను ఓ ప్రత్యేక ప్రోగ్రామింగ్ ద్వారా రూపొందించారు. ఓ కొత్త వ్యక్తి ఇందులోకి ప్రవేశించినప్పుడు అతడి ఐపీ అడ్రస్, ఇతర వివరాలను అది సంగ్రహిస్తుంది. అనంతరం తొలుత కొన్నిరోజులపాటు అతడు పందెం గెలిచేలా చేసి బానిసగా మారుస్తుంది. ఆ తర్వాత కొన్నాళ్ళు కొన్ని గేమ్‌లలో ఓడేలా.. పూర్తిగా బానిసగా మారిన తర్వాత అన్నీ ఓడిపోయేలా ప్రోగ్రామింగ్ డిజైన్ చేసి ఉంటోంది. దీంతో దీని వలలో చిక్కి గేమ్ ఆడినవాళ్లు నష్టపోవడమే తప్ప.. లాభపడటం అనేది జరగట్లేదు. ఇలా నష్టపోయినవారిని దళారులుగా మార్చుకుంటూ మరికొంత మందిని తమ వలలో చిక్కేలా గేమ్ నిర్వాహకులు పథకం వేశారు. ఈ గేమ్‌లో సభ్యులుగా ఉన్నవారు ఎవరైనా కొత్తవారిని ఆకర్షించి వారికి రిఫరల్ కోడ్ ఇస్తే.. రూ.1000 కమీషన్‌గా ఇస్తున్నారు. అంతేకాకుండా అతడు ఆడి, కోల్పోయే మొత్తం నుంచి 10 శాతం కూడా ఇస్తున్నారు. ఇలా మరింతమందిని ఈ ఉచ్చులో దింపేలా వారిని ప్రోత్సహిస్తున్నారు. డబ్బు పోగొట్టుకుని ఆత్మహత్యలు: లాక్ డౌన్ అమలులోకి వచ్చిన తర్వాత ఈ గేమ్ ఆడేవారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. ఈ ఉచ్చులో చిక్కి రూ.లక్షల్లో కోల్పో యిన అనేక మంది యువత ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. హైదరాబాద్‌లో రూ.6 లక్షలు కోల్పోయిన ఎస్సార్‌నగర్ యువకుడితో పాటు రూ.15 లక్షలు కోల్పోయిన ఆదిలాబాద్ యువకుడు, తమిళనాడులో పలువురు ఆత్మహత్య చేసుకోవడంతో కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు రూ.97వేలు, మరో యువకుడు రూ.1.64 లక్షలు పోగొట్టుకోవడంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేసిన పోలీసులు.. ఈ సంస్థలు, వ్యవహారాలను చైనాకు చెందిన బీజింగ్ టి పవర్ అనే సంస్థ పర్యవేక్షిస్తున్నట్లు నిర్ధారిం చారు. ఈ ఆధారాలను బట్టి ఢిల్లీలో ఉంటున్న ఈ సంస్థ సౌత్ఈస్ట్ ఏషియా ఆపరేషన్స్ హెడ్‌గా ఉన్న చైనా జాతీయుడు యా హౌతో పాటు డైరెక్టర్లుగా పని చేస్తున్న ఢిల్లీ వాసులు ధీరజ్ సర్కార్, అంకిత్ కపూర్, నీరజ్ తులేలను అరెస్టు చేశారు. వీరిపై దేశంలోని వివిధ ప్రాంతాల్లో 28 కేసులు నమోదు కావడంతో అరెస్టు సమాచారాన్ని ఆయా అధికారులకు తెలపాలని నిర్ణయించారు. ఏమిటీ కలర్ ప్రిడిక్షన్? చైనాకు చెందిన సూత్రధారులు భారత్‌లో ఉంటున్న యువతను టార్గెట్ చేస్తూ కలర్ ప్రిడిక్షన్ గేమ్‌ను తయారుచేశారు. ఢిల్లీలో కార్యాలయాలు ఏర్పాటు చేసిన ఈ సూత్రధారులు.. ఈ–కామర్స్ లావాదేవీల పేరుతో అక్కడి రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌లో (ఆర్వోసీ) ఎనిమిది సంస్థల్ని నమోదు చేశారు. ఇవన్నీ ఆన్లైన్లో వివిధ ఈ–కామర్స్ వెబ్సైట్లు నడుపుతున్నాయి. ఈ సైట్స్‌లోకి ప్రవేశించినవారు ఓ మూలన ఉండే లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా కలర్ ప్రిడిక్షన్ గేమ్‌లోకి వెళ్లొచ్చు. అయితే ఎవరికి వారు నేరుగా ప్రవేశించడానికి వీలు లేదు. అప్పటికే ఈ గేమ్ ఆడుతున్న వారు ఇచ్చే రిఫరల్ ఐడీ ద్వారా గేమ్‌లోకి ప్రవేశించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. గేమ్‌లోకి ప్రవేశించిన తర్వాత అక్కడ ఉన్న ఆçప్షన్‌లో ఎరుపు, ఆకుపచ్చ, పసుపు రంగుల్లో ఒకటి ఎంచుకోవాలి. దానిపై ఎంత మొత్తం పందెం కాస్తున్నామో పేటీఎం ద్వారా చెల్లించాలి. ఇది పూర్తయిన తర్వాత గేమ్‌లో ప్రోగ్రామింగ్ రన్ అయి, ఓ రంగు వచ్చి ఆగుతుంది. పందెం కాసినవారు ఎంచుకున్న రంగు వస్తే ఆ మొత్తానికి రెండు నుంచి నాలుగు రెట్ల డబ్బు వారి పేటీఎం ఖాతాలోకి జమ అవుతుంది. రాకపోతే పందెం కాసిన మొత్తం ఆ సంస్థకు చెందుతుంది. -
‘టిక్‌టాక్ ప్రో’ ఎర క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ!
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ వేళ సైబర్ నేరగాళ్లు రూటుమార్చారు. ఇటీవల ఆరోగ్యసేతు, పీఎం కేర్స్ పేరిట నకిలీ రిక్వెస్టులు పంపి ఖాతాలు ఖాళీచేసిన కేటుగాళ్లు.. ఇప్పుడు తమ మోసాలకు భారత ప్రభుత్వం నిషేధించిన టిక్‌టాక్‌ను ఎంచుకున్నారు. టిక్‌టాక్ యూజర్లే లక్ష్యంగా సెల్ఫోన్లకు యూఆర్ఎల్ మాల్వేర్ లింకులను ఎస్సెమ్మెస్ రూపంలో పంపుతున్నారు. టిక్‌టాక్ రూపుమారిందని, దీని కోసం ‘టిక్‌టాక్ ప్రో’ అనే యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని, అందుకు కింది నీలంరంగు లింకును క్లిక్ చేయాలని సూచిస్తున్నారు. ఆ లింకులో వ్యక్తిగత సమాచారాన్ని మొత్తం దొంగిలించే మాల్వేర్ ఉంటుంది. క్లిక్‌చేస్తే మాల్వేర్ వ్యక్తిగత కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లలోకి చొరబడుతుందని, బ్యాంకు ఖాతాల వివరాలు, వ్యక్తిగత సమాచారం మొత్తం సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లిపోతుందని తెలంగాణ పోలీసుశాఖ చెబుతోంది. క్షణాల్లో బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతాయని హెచ్చరిస్తోంది. టిక్‌టాక్ పేరుతో వచ్చే వినతులకు స్పందించవద్దని, సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచి స్తోంది. లాక్డౌన్ కాలంలో ఆన్లైన్ వినియోగం పెరిగింది. పీఎం కేర్స్, ఆరోగ్యసేతు యాప్‌ల డౌన్లోడ్లు అనూహ్యంగా పెరిగాయి. ఇది గమనించిన సైబర్ నేరగాళ్లు వాటి పేరుతో ప్రభుత్వోద్యోగులకు రకరకాల లింకులుపంపి అంతర్గత రహస్యాలు తస్కరించేందుకు, బ్యాంకు ఖాతాలకు కన్నమేసేందుకు యత్నించారు. పలుచోట్ల రూ.కోట్లు కొల్లగొట్టారు. తాజాగా టిక్‌టాక్ వినియోగదారులపై సైబర్ నేరగాళ్ల కన్ను పడింది. ఇటీవల భారత ప్రభుత్వం చైనాకు చెందిన ఈ యాప్‌ను నిషేధించిన విషయం తెలిసిందే. టిక్‌టాక్ ఆదాయంలో 30 శాతం భారత్ నుంచే వస్తోంది. భారత్‌లో 2016 నుంచి ఈ యాప్‌ను 24 మంది కోట్ల మంది డౌన్లోడ్ చేసుకోగా, యాప్ నిషేధానికి గురైన జూన్ 29 నాటికి 12 కోట్ల మందికిపైగా వినియోగిస్తున్నారు. రాత్రికి రాత్రి యాప్ ఆగిపోవడంతో యూజర్లు షాక్‌తిన్నారు. టిక్‌టాక్ లేకపోవడంతో ముఖ్యంగా దీనిపై ఆధారపడిన యువత, నటులు, మోడళ్లకు ఊపిరాడటంలేదు. వీరంతా ప్రత్యామ్నాయ మార్గాల్లో టిక్‌టాక్ యాప్ కోసం అన్వేషిస్తున్నారు. ఇది గుర్తించిన సైబర్ నేరగాళ్లు ‘టిక్‌టాక్ ప్రో’ పేరుతో ఎరవేస్తున్నారు. సెలబ్రిటీలు, ప్రభుత్వోద్యోగులు చిక్కితే.. టిక్‌టాక్ యాప్ వినియోదారుల్లో యువతతోపాటు సెలబ్రిటీలు, నటులు, ఉద్యోగులు ఉన్నారు. టిక్‌టాక్ వల్ల కొందరు రాత్రికి రాత్రే సెలబ్రిటీలుగా మారారు. టిక్‌టాక్‌కు బానిసలైన వీరికి ‘టిక్‌టాక్ ప్రో’ ప్రత్యామ్నాయ యాప్ అంటూ సైబర్ నేరగాళ్లు గాలమేస్తున్నారు. వారికి తెలియకుండా రహస్య మాల్వేర్ను లింకుల్లో చొప్పిస్తున్నారు. వెంటనే సదరు వ్యక్తుల స్మార్ట్ఫోన్లు, పర్సనల్ కంప్యూటర్లలోని సమాచారం, రహస్యాలు, బ్యాంకు ఖాతాల వివరాలు సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లిపోతాయి. వ్యక్తిగత రహస్యాలు చేజిక్కితే.. బ్లాక్‌మెయిలింగ్‌కు దిగుతారు. ప్రభుత్వంలోని కీలకశాఖల్లో పనిచేసే వారి కంప్యూటర్లలోకి ఈ వైరస్ జొరబడితే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రహస్యాలు విదేశీయుల చేతికి చిక్కినట్లేనని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వినోదం కోసమంటూ వెళ్తే చివరికి విషాదమే మిగులుతుందని హెచ్చరిస్తున్నారు. -
సోషల్ మీడియా యాప్స్‌పై క్రిమినల్ కేసు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రధాన సోషల్ మీ డియా యాప్స్ వాట్సాప్, ట్విట్టర్, టిక్ టాక్‌లపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 18న కేసు నమోదైనప్పటికీ ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది.ఈ కేసులో నగరానికి చెందిన ఎస్.శ్రీశైలం ఫిర్యాదుదారుడిగా ఉన్నారు. ప్రముఖ సోషల్‌మీడియా యాప్స్‌తో పా టు వాటి నిర్వాహకులను నిందితుల జాబితాలో చేర్చారు. ఈ తరహా కేసు న మోదు కావడం దేశంలో ఇదే తొలిసారని అధికారులు పేర్కొన్నారు. గత డిసెంబర్ 12న పార్లమెంట్లో పౌరసత్వ సవరణ చట్టం ఆమోదం పొందింది. అప్ప టి నుంచి దీనికి వ్యతిరేకంగా పలు సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు రెచ్చ గొట్టే.. జాతి వ్యతిరేక ప్రచారం విస్తృతంగా జరుగుతోందని ఆరోపిస్తూ శ్రీశైలం తొలుత హైదరాబాద్ నగర పోలీసులను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయా గ్రూ ప్ల్లో పాకిస్తాన్‌కు చెందిన వారు ఉన్నారన్నారు. అయితే దీని ఆధారంగా కేసు నమోదు కాకపోవడంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. వివిధ గ్రూపుల కేంద్రంగా జరుగుతున్న ఈ విద్వేషపూరిత ప్రచారాలకు వాట్సాప్, ట్విట్టర్, టిక్ టాక్ వేదికలవుతున్నాయని న్యాయస్థానానికి విన్నవించారు. కొన్ని గ్రూపుల వివరాలను కోర్టు ముందుంచారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని సైబర్ క్రైమ్ పోలీసులను ఆదేశించింది. దీం తో టిక్‌టాక్, ట్విట్టర్, వాట్సప్‌తో పాటు వాటి నిర్వాహకులు, యాజమాన్యాల పై క్రిమినల్ కేసు నమోదైంది. ‘కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేశాం. దర్యాప్తులో వెలుగులోకొచ్చిన వివరాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. దీనిపై శ్రీశైలం మీడియాతో మాట్లాడుతూ... ‘ఇప్పటి వరకు 1200 గ్రూప్‌లు ఏర్పాటు చేసి జాతికి వ్యతిరే కంగా పోస్ట్‌లు పెడుతున్నారని గుర్తించాం. ఈ గ్రూప్‌ల్లో పాకిస్తాన్‌కు చెందిన వారు వందల మంది ఉంటున్నారు. దీన్ని కోర్టులో నిరూపించాం. దాదాపు 42 సోషియల్ మీడియా యాప్‌లు దేశానికి వ్యతిరేకంగా పని చేస్తున్నాయి. వాటిని నిషేధించాలని డిమాండ్ చేస్తున్నాం. వాట్సాప్, టిక్‌టాక్, ట్విట్టర్లకు నోటీసులు ఇస్తామని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్పారు’ అని అన్నారు. -
ఎవరైనా.. ఎక్కడి నుంచైనా!
వరంగల్ క్రైం: సైబర్ నేరాలకు సంబంధించి ఇకపై ఎవరైనా.. ఎక్కడి నుంచైనా ఫిర్యాదు చేయొచ్చని వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ విశ్వనాథ రవీందర్ తెలి పారు. వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం సైబర్ విభా గం ఆధ్వర్యాన ‘సైబర్ పోలీసు పోర్టల్’పై పోలీసు స్టేషన్ల రైటర్లకు ఒక రోజు శిక్షణ ఏర్పాటుచేశారు. ఈ సందర్బంగా సీపీ రవీందర్ మాట్లాడుతూ దేశంలో సైబర్ నేరాలను నియంత్రించి నేరస్తులను పట్టుకోవడంతో పాటు బాధితుల ఫిర్యాదులను ఎక్కడి నుంచైనా స్వీకరించేందుకుగాను కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఇండియన్ సైబర్ క్రైం కోఆరి్డనేషన్ సెంటర్ పేరుతో పోర్టల్‌ను ప్రారంభించిందని తెలిపారు. దీని వల్ల సైబర్ బాధితులు నేరుగా http://cybercrime.gov.in ద్వారా తమ నమోదు చేయవచ్చని ఆయన తెలిపారు. ఈ పోర్టల్ ద్వార అందిన ఫిర్యాదులను రాష్ట్ర సైబర్, జిల్లా సైబర్ విభాగాల ద్వారా సంబంధించి పోలీసు స్టేషన్లకు బదిలీ చేస్తారని చెప్పారు. ఆ వెంటనే విచారణ ప్రారంభమవుతుందని వివరించారు. కమిషరేట్‌లో ఓ కేసు ఇటీవల కమిషనరేట్ పరిధిలో ఓ మహిళ వ్యక్తిగత ఫొటోలను పరిచయం ఉన్న వ్యక్తి ఫేస్బుక్లో పెట్టాడని సీపీ రవీందర్ తెలిపారు. ఈ విషయమై మహిళ ఫిర్యాదు చేయగా సైబర్ విభాగం అధికారులు ఫేస్బుక్లో ఫొటోలు తొలగింపచేశారని గుర్తు చేశారు. అంతేకాకుండా నిందితుడిపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ మేరకు సైబర్ క్రైం పోర్టల్‌పై సిబ్బంది అవగాహన పెంచుకోవడంతో పాటు ప్రజలకు వివరించాలని సూచించారు. సదస్సులో అడిషనల్ డీసీపీ వెంకటలక్ష్మి, సైబర్, ఐటీ కోర్ విభాగం ఇన్స్పెక్టర్లు జనార్దన్‌రెడ్డి, రాఘవేందర్, ప్రశాంత్, సైబర్ సిబ్బంది కిషోర్, రాజు, దినేష్, ఆంజనేయులు, రత్నాకర్, నరేష్ పాల్గొన్నారు. -
నాన్నారు.. డెబిట్‌కార్డు..ఒక సన్ స్ట్రోక్!
‘నా బ్యాంకు ఖాతాలోని సొమ్మును పేటీఎం ద్వారా కాజేసిన వారిపై చర్యలు తీసుకోండి’అంటూ కొన్నాళ్ల క్రితం ఫిర్యాదు చేసిన ఓ బాధితుడు.. ‘అబ్బబ్బే.. చర్యలు వంటివి ఏమీ వద్దు’అని గురువారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల్ని వేడుకున్నాడు. ఈ మార్పునకు కారణం ఏమిటో తెలియాలంటే ఇది చదవాల్సిందే. వివరాలు.. నగరానికి చెందిన ఓ వ్యక్తి ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం ఈయన బ్యాంకు ఖాతా నుంచి నెల రోజుల వ్యవధిలో వివిధ దఫాల్లో మొత్తం రూ.70 వేలు వేర్వేరు ఖాతాల్లోకి బదిలీ అయ్యాయి. ఈ విషయం గుర్తించిన ఆయన నగర సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. దీని ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితుడి బ్యాంక్ ఖాతా స్టేట్మెంట్ పరిశీలించగా.. నగదు మొత్తం పలు దఫాల్లో వేర్వేరు ఖాతాలకు బదిలీ కావడాన్ని బట్టి ఇంటి దొంగల పాత్రను అనుమా నించారు. ఇదే విషయాన్ని బాధితుడికి చెప్పి ఎవరిపైన అయినా అనుమానం ఉందా? అంటూ ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగడానికి ఆస్కారం లేదంటూ చెప్పిన బాధితుడు అసలు నిందితుడిని పట్టుకోవాలని మరోసారి స్పష్టం చేశారు. అనంతరం బ్యాంకు నుంచి వివరాలు పొందిన పోలీసులు ఆ డబ్బు మొత్తం పేటీఎం ద్వారా బదిలీ అయినట్లు గుర్తించారు. – సాక్షి, హైదరాబాద్ అవాక్కయిన తండ్రి.. పేటీఎం సంస్థకు లేఖ రాసి ఆయా లావాదేవీలకు పాల్పడిన ఫోన్ నంబర్ తెలుసుకున్నారు. దీని వివరాలు ఆరా తీయగా ఫిర్యాదుదారుడి కుమారుడికి చెందినదిగా తేలింది. తండ్రికి తెలియకుండా ఆయన డెబిట్‌కార్డును చేజిక్కించుకున్న ఆ సుపుత్రుడు దాన్ని తన పేటీఎం ఖాతాతో లింక్ చేసుకున్నాడు. ఆపై నెల రోజుల పాటు జల్సాలు చేస్తూ తండ్రి ఖాతాలోని రూ.70 వేలు ఖర్చు చేశాడు. ఈ విషయాన్ని సదరు తండ్రికి సమాచారం ఇచ్చారు. దీంతో గురువారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్‌కు వచ్చిన ఆయన అసలు విషయం తెలుసుకుని అవాక్కయ్యాడు. తన కుమారుడిని తాను మందలిస్తానని, విద్యార్థి అయిన అతడిపై చట్టపరంగా చర్యలు వద్దని, తన ఫిర్యాదు వెనక్కు తీసుకుంటున్నానని వేడుకున్నాడు. సానుకూలంగా స్పందించిన అధికారులు కుమారుడికి ప్రాథమికంగా కౌన్సెలింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. -
ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు
శంషాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు పేలుస్తానంటూ ఓ వ్యక్తి నుంచి బెదిరింపు మెయిల్ వచ్చింది. సాయిరాం కాలేరు అనే పేరు మీద వచ్చిన ఈ మెయిల్ మంగళవారం మధ్యాహ్నం 2.31 గంటలకు ఎయిర్‌పోర్టులోని ఆర్జీఐఏ కస్టమ్స్ సపోర్ట్ మెయిల్ ఐడీకి చేరింది. సంబంధిత అధికారులు వెంటనే భద్రతా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మెయిల్లో ‘ఐ వాంట్ టు బ్లాస్ట్ బాంబ్ ఇన్ ఎయిర్‌పోర్టు టుమారో’అని ఉంది. దీంతో ఎయిర్‌పోర్టు భద్రతా అధికారులు సీఐఎస్ఎఫ్, సైబరాబాద్ పోలీసులతో పాటు కేంద్ర పౌర విమానయాన భద్రత అధికారులకు సమాచారం అందించారు. ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేసి కేసు దర్యాప్తును ప్రారంభించారు. rairamka eru@ ive.com ఐడీతో వచ్చిన మెయిల్‌ను సైబరాబాద్ సైబర్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ముందు జాగ్రత్తగా దేశీయ, అంతర్జాతీయ అరైవల్, డిపార్చుర్ టెర్మినళ్లతో పాటు పార్కింగ్ ఏరియాలను డాగ్‌స్క్వాడ్ బృందాలతో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. -
అప్పనంగా కిడ్నీలు కొట్టేస్తున్నారు
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా కిడ్నీ దాతలు కావాలంటూ సామాజిక మాధ్యమాల్లో(ఎస్‌ఓఎస్‌ఐఎంఎస్.కామ్ వంటి సైట్ల ద్వారా) చేసిన పోస్టుకు స్పందించిన దాతలకు కుదుర్చుకున్న డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్న ముగ్గురు సభ్యుల అంతర్జాతీయ ముఠాను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. గతంలో ముంబై, ఢిల్లీలో పట్టుకునేందుకు వెళ్లిన సమయంలో ప్రధాన నిందితుడు, భోపాల్ వాసి అమ్రిష్ ప్రతాప్ తప్పించుకుపోవడంతో లుక్అవుట్ నోటీసు జారీ చేయడంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఢిల్లీ విమానాశ్రయంలో పట్టుకొని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఆదివారం అప్పగించారు. అతడికి సహకరించిన ఢిల్లీవాసి రింకీ, నోయిడా వాసి సందీప్ కుమార్‌లను కూడా ట్రాన్సిట్ వారంట్‌పై సిటీకి తీసుకొచ్చారు. దేశవ్యాప్తంగా దాదాపు 40 వరకు బలవంతపు కిడ్నీల మార్పిడిలు చేసినట్టుగా అనుమానిస్తున్న ఈ ముఠా వివరాలను నాగోల్‌లోని రాచకొండ పోలీసు కమిçషనర్ క్యాంపు కార్యాలయంలో సీపీ మహేష్ భగవత్ సోమవారం మీడియాకు తెలిపారు. భారత్‌లో కిడ్నీ అవసరముందంటూ ఫేస్బుక్లో పోస్టును చూసిన నగరవాసి స్పందించి రూ.20లక్షలకు ఇచ్చేందుకు అంగీకరించాడు. ఈ ముఠా అతడిని ఈజిప్టు తీసుకెళ్లి బలవంతంగా కిడ్నీ మార్పిడి చేసి డబ్బులు ఇవ్వలేదు. ఇలా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. భార్య బాగు కోసం మోసాలబాట... ప్రస్తుతం ఢిల్లీలో స్థిరపడిన భోపాల్‌కు చెందిన అమ్రిష్ ప్రతాప్ అలియాస్ అంబారిష్ చిన్నతనంలోనే అమ్మనాన్నలను కోల్పోవడంతో తాత, నాన్నమ్మల వద్ద పెరిగాడు. 2006లో హిమాంగి అనే ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమెకు నాడీ సంబంధిత సమస్యలు రావడంతో ముంబై, న్యూఢిల్లీ నగరాల్లో చికిత్సకోసం దాదాపు రూ.40 నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చు చేశాడు. అయినా ఆమె ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఆర్థిక సమస్యల్లో పడ్డాడు. వీటని అధిగమించేందుకు తొలుత బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాల్లో పనిచేసిన అమ్రిష్ ప్రతాప్ మెడికల్ టూరిజమ్‌కు మారాడు. తొలుత చట్టవ్యతిరేకంగా అద్దెకు తల్లులు(సరోగసీ విధానం) నుంచి మొదలెట్టి ఆ తరవాత మానవ అవయవాల మార్పిడి వ్యాపారంవైపు మళ్లాడు. ఇలా డాక్టర్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, ప్రభుత్వ అధికారులు, ఏజెంట్లు, బ్రోకర్లతో కుమ్మక్కై ఈ మోసపు దందాకు తెరలేపాడు. డబ్బు అవసరమున్న వారిని గుర్తించి వారి అవయవాలు మార్పిడి చేసి డబ్బు ఇవ్వకుండా మోసం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఢిల్లీ వాసి రింకి, నోయిడా వాసి సందీప్ కుమార్‌తో పరిచయం ఏర్పడింది. టర్కీలో కిడ్నీ ఇచ్చేందుకు వచ్చిన సమయంలో సందీప్ కుమార్ ఈ మోసం గురించి తెలుసుకొని తానుకూడా అమ్రిష్ ప్రతాప్‌తో చేయికలిపి డబ్బు అవసరమున్న వారిని గుర్తించి ఇతడి చేతిలో పెట్టాడు. ఒక్కో కిడ్నీ మార్పిడికి రూ.50 లక్షల నుంచి కోటి వరకు రోగుల నుంచి ఈ ముఠా తీసుకునేది.ఇలా ఈ ముఠా రోగులు, దాతలను శ్రీలంకలో కొలంబోలొరి వెస్టర్న్ ఆస్పత్రి, ఈజిప్ట్ కైరోలోని అల్ ఫహద్ హాస్పిటల్, టర్కీ ఇజ్మిర్‌లోని కెంట్ ఆస్పతుల్లో 40 వరకు కిడ్నీ మార్పిడీలు చేశారు. డబ్బులివ్వకపోవడంతో వెలుగులోకి మోసం.. సందీప్ కుమార్ ఫేస్బుక్ ఖాతా రోహన్ మాలిక్ పేరుతో సృష్టించి భారత్‌లో కిడ్నీ అవసరముందంటూ చేసిన పోస్టు చూసిన రాచకొండ కమిషనరేట్ ప్రాంతానికి చెందిన ఓ బాధితుడు వారిని సంప్రదించారు. అనంతరం ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన ముఠాసభ్యుడొకరు వాట్సాప్‌లో బాధితుడితో సంప్రదింపులు జరిపాడు. రూ.20లక్షలు ఇస్తామంటూ ఆశ చూపాడు. ఢిల్లీకి రావాలంటూ ముఠా సభ్యులు అతనికి రైలు టికెట్ బుక్ చేశారు. గత జులై 20న అక్కడికి వెళ్లిన బాధితుడిని నోయిడాలోని ఓ హోటల్లో ఉంచారు. ఢిల్లీ మరికొన్నిచోట్ల వైద్య పరీక్షలు జరిపించారు. బాధితుడు రోగి బంధువుగా ధ్రువీకరణపత్రం సృష్టించారు. అనంతరం వైద్య వీసాపై అతణ్ని ఆగస్టులో టర్కీకి తీసుకెళ్లారు. అయితే శస్త్రచికిత్సకు ముందు డబ్బు ఇవ్వాలని బాధితుడు పట్టుబట్టడంతో అతని పాస్‌పోర్టు లాక్కొని బెదిరింపులకు దిగారు. అతడు భయపడటంతో శస్త్రచికిత్స చేయించి కిడ్నీ తీసేశారు. ఆ ముఠా బారి నుంచి బయటపడి హైదరాబాద్‌కు చేరుకున్న బాధితుడు ఈ ఏడాది ఫిబ్రవరి ఐదున రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు ఇది అంతర్జాతీయ ముఠా పనిగా గుర్తించారు. అమ్రిష్ ప్రతాప్‌ను పట్టుకోవడానికి ఢిల్లీ, ముంబైకి వెళ్లగా తప్పించుకొనిపోయాడు. అయితే లుక్ అవుట్ నోటీసు జారీతో ఢిల్లీ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు సింగపూర్ నుంచి వచ్చిన అమ్రిష్ ప్రతాప్‌ను పట్టుకొని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారమిచ్చారు. అతడిచ్చిన సమాచారంతో వారిని ట్రాన్సిట్ వారంట్‌పై సిటీకి తీసుకొచ్చారు. వీరిని పోలీసు కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని వివరాలు తెలుస్తాయని సీపీ మహేష్ భగవత్ అన్నారు.అమ్రిష్ ప్రతాప్‌పై 2016లో నల్గొండలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మాయిగూడెం పోలీసు స్టేషన్లలో రెండు కేసులు నమోదై ఉన్నాయన్నారు. దుబాయ్, వియత్నాం, చైనా, సింగపూర్, ఫిలిప్పీన్స్, బ్యాంకాక్, ఇండోనేసియా, మెక్సికోకు కూడా వెళ్లొచ్చని, అక్కడ కూడా కిడ్నీ మార్పిళ్లు ఏమైనా చేశాడా అనే విషయాలు కస్టడీలోకి తీసుకొని విచారిస్తే తెలుస్తాయని సీపీ అన్నారు. -
ఆత్మహత్య ఆలోచనను చంపుతారు!
ముంబై : 21 ఏళ్ల యువకుడొకరు.. జీతం విషయంలో హోటల్ యజమానితో గొడవపడి, మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఫేస్బుక్లో తన బాధను తెలుపుతూ సూసైడ్ నోట్ పోస్ట్ చేశాడు. ముంబైలోని మీరా రోడ్డు సమీపంలో ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. అంతే నిమిషాల్లో పోలీసులు అతని దగ్గరికి చేరుకున్నారు. అతన్ని అక్కడి నుంచి తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చి అతని ఆత్మహత్య ఆలోచనను చంపేశారు. ముంబై సైబర్ పోలీసుల ఘనతకు ఇదో చిన్న ఉదాహరణ. టెక్నాలజీ సాయంతో ఆత్మహత్యల నుంచి యువతను కాపాడుతూ అందరి మన్ననలు పొందుతున్నారు ముంబై సైబర్ పోలీసులు. సూసైడ్ నోట్‌ను ఫేస్బుక్లో పోస్ట్ చేసిన 24 గంటలలోపు సైబర్ పోలీసులు స్పందించి లోకల్ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా బాధితుడి ఇంటికి చేరుకొని రక్షించి, సీనియర్ పోలీసు అధికారులతో కౌన్సిలింగ్ ఇప్పించి వారిని రక్షిస్తున్నారు. ‘ఎక్కడ నుంచైనా సూసైడ్ నోట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే వెంటనే మాకు అలర్ట్ వస్తుంది. వారిని రక్షించడానికి కావల్సిన అన్ని అవకాశాలను వినియోగించుకుంటాం. స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేసి వివిధ మార్గాల్లో బాధితున్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తాం. సూసైడ్ చేసుకోవాలనే వారి అడ్రస్‌ను ట్రాక్ చేసిన వెంటనే లోకల్ పోలీసులకు సమాచారం అందిస్తాం. సామాజిక కార్యకర్తల సహాయం కోరుతాం. ఏవిధంగా అతన్ని రక్షించాలో ఆలోచించి వీలైనంత త్వరగా అతడి ఇంటికి చేరుకుంటాం. అనంతరం అతడు/ఆమెను తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇప్పిస్తాం. క్షణికావేశాల్లో తీసుకునే నిర్ణయాల జరిగే నష్టాన్ని వివరిస్తాం. వారిలో ఉన్న ఆత్మహత్య ఆలోచనను చంపేందుకు ప్రయత్నిస్తాం. ఈ రెండు మూడు నెలల్లో నలుగురి ప్రాణాలను కాపాడగలిగామ’ని డీసీపీ అక్బర్ పఠాన్ మీడియాకు తెలిపారు. ‘గోర్వావ్ సంస్థలో పనిచేసే ఓ 30 ఏళ్ల మహిళ ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఫేస్బుక్లో సూసైడ్ నోట్‌ను పోస్ట్ చేశారు. వెంటనే సైబర్ విభానికి చెందిన మహిళా బృందం ఆమె దగ్గరకు వెళ్లారు. ఆమెతో మాట్లాడారు. ఆమెకు గల సమస్యలను తెలుసుకున్నారు. ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి మళ్లి ఇలాంటి పిచ్చి ఆలోచనలు రాకుండా చేశార’ని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఇలాగే మరో 21 ఏళ్ల యువకుడిని కూడా రక్షించామని తెలిపారు. టెక్నాలజీని సద్వినియోగం చేసుకొని ప్రాణాలను కాపాడుతున్నారు ముంబై పోలీసులు. ముఖ్యంగా ఫేస్బుక్లో సూసైడ్, మర్డర్, ఇతర సున్నితమైన విషయాలు పోస్ట్ చేస్తే తమకు అలర్ట్ వచ్చేలా ఏర్పాటు చేశారు. దీనికి ఓ స్పెషల్ టీమ్‌ను నెలకొల్పి నిమిషాల్లో బాధితుల్ని చేరుకునేలా వ్యవస్థను రూపకల్పిన చేశారు. క్షణికావేశాల్లో తీసుకున్న నిర్ణయాల నుంచి కాపాడుతూ ఎంతో మందికి పునఃజన్మ ఇస్తున్న ముంబై సైబర్ పోలీసులపై అందరూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. -
ఫేస్బుక్లో అసభ్యకర పోస్టింగ్..
హైదరాబాద్ : దేవుళ్లను కించపరుస్తున్న ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హిందూ దేవుళ్లను కించపరుస్తూ ఫేస్బుక్లో అసభ్యకరంగా పోస్టులు చేస్తుండటంపై హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫేస్బుక్ లో ఈ మేరకు పోస్ట్ చేసిన కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన వినయ్ అనే యువకుడిని రాచకొండ సైబర్ సెల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఎమ్మెస్సీ చదువుతున్నాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇద్దరు సైబర్ నేరగాళ్ల అరెస్టు
హైదరాబాద్: నకిలీ ఫేస్ బుక్ అకౌంట్లతో మోసాలకు పాల్పడుతున్నఇద్దరిని సీసీఎస్ సైబర్ క్రెం పోలీసులు అరెస్టు చేశారు. నైజీరియాకు చెందిన నబెర్త్ చుకువెడ , ఢిల్లీ కి చెందిన నెమ్ మౌన్ కిమ్‌లు నకిలీ ఫేస్బుక్ ఐడీలతో అమాయకులను మోసం చేసి డబ్బు దండుకుంటున్నారు. వీరిపై పలు ఫిర్యాదులు రావడంతో సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులు మంగళవారం అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
‘అశ్లీల చిత్రాల’ వ్యవహారంలో మరో ట్విస్ట్
బెంగళూరు: మొబైల్లో అశ్లీల చిత్రాలను చూస్తూ అడ్డంగా మీడియాకు దొరికిపోయిన కర్ణాటక ప్రాథమిక శాఖమంత్రి తన్వీర్ సేఠ్ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ తతంగాన్ని చిత్రీకరించిన జర్నలిస్ట్‌తో పాటు కెమెరామెన్‌పై మంత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఈ ఫిర్యాదుపై ఓ సీనియర్ పోలీస్ అధికారి మాట్లాడుతూ ఐపీసీ సెక్షన్ 504 కింద టీవీ రిపోర్టర్, కెమెరామెన్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మరోవైపు ఈ వ్యవహారానికి సంబంధించి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ... మొదట నివేదికను పరిశీలించాక దీనిపై విచారణ జరిపించి అనంతరం చర్య తీసుకుంటామన్నారు. అశ్లీల దృశ్యాల వీక్షణపై మంత్రితో మాట్లాడానని, తాను ఏ తప్పు చేయలేదని తన్వీర్ సేఠ్ తనతో చెప్పారని ఆయన తెలిపారు. ఒకవేళ తప్పు జరిగితే అది ఎవరు చేసినా తప్పు తప్పేనని సిద్ధరామయ్య అన్నారు. కాగా రాయ్‌చూర్ జిల్లాలో నిర్వహించిన టిప్పుసుల్తాన్ జయంతి సందర్భంగా గురువారం మంత్రి తన్వీర్ సేఠ్ సెల్ఫోన్లో అశ్లీల దృశ్యాలు వీక్షిస్తూ మీడియాకు దొరికిపోయిన విషయం తెలిసిందే. దీంతో తన్వీర్ మంత్రిపదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.... బీజేపీతో పాటు జేడీఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. అయితే తాను ఏ తప్పు చేయలేదని, తాను అమాయకుడినని చెప్పుకొచ్చారు. ఏ తప్పు చేయనప్పుడు రాజీనామా చేయవలసిన అవసరం ఏముంటుందని, మంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని తన్వీర్ తేల్చిచెప్పారు. అలాగే ఈ ఘటనపై మాజీ ప్రధాని దేవగౌడ స్పందిస్తూ... తన్వీర్ వ్యవహారంలో ముఖ్యమంత్రి జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. మొబైల్ లో అభ్యంతరకర ఫోటోలు చూస్తు దొరికిపోయిన మంత్రికి క్లీన్ చిట్ ఇవ్వడం సరికాదని, దీనిపై విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఎన్నారై మహిళలే అతడి టార్గెట్!
♦ పెళ్లి చేసుకుంటాడు.. డబ్బుతో ఉడాయిస్తాడు ♦ పెళ్లిళ్ల పేరుతో ఎన్ఆర్ఐలను మోసం చేస్తున్న గుంటూరువాసి అరెస్టు ♦ గతంలో భూ కబ్జా, సెటిల్మెంట్లు, బలవంతపు వసూలు కేసులు ♦ భారతీమాట్రిమోనీ.కామ్‌లో సంపన్న యువతులకు వల ♦ అమెరికాలో ప్రవాస భారతీయురాలిని పెళ్లాడి రూ.20 లక్షలతో ఉడాయింపు హైదరాబాద్: భూ కబ్జాలు ... భూ సెటిల్మెంట్ దందాలు చేశాడు... అది కుదరకపోవడంతో ఐఆర్ఎస్ అధికారినంటూ సినీ ప్రొడ్యూసర్లను బెదిరించాడు... చివరకు వ్యభిచార దందా నిర్వహించాడు. అయితే ఆశించినంత డబ్బులు రాకపోవడంతో ఈసారి ఎన్నారై మహిళలను టార్గెట్ చేసుకుని పెళ్లి మోసాలకు తెరలేపాడు. ఇందులో భాగంగానే భారతీమాట్రిమోనీ.కామ్‌లో తనకు పెళ్లికాలేదని, ఒంటరిగా ఉంటున్నానని, తల్లిదండ్రులు చనిపోయారని, అమెరికాకు బిజినెస్ పనిమీద వెళుతున్నాననే ప్రొఫైల్ అప్లోడ్ చేసి ఎన్నారై మహిళలను మోసగిస్తున్న గుంటూరుకు చెందిన కె.వెంకటరత్నరెడ్డిని నగర సైబర్ క్రైమ్ పోలీసులు గుంటూరులో శుక్రవారం అరెస్టు చేశారు. విడాకులు తీసుకొని అమెరికాలో ఉంటున్న తన అక్కకూతురికి భారతీమాట్రిమోని.కామ్‌లో నిందితుడి ప్రొఫైల్ చూసి నచ్చి పెళ్లి చేసుకుందని, 20 రోజులు కాగానే అతను భారత్‌లో అత్యవసర పని ఉందని రూ.20 లక్షలు తీసుకొని వచ్చి ఆ తర్వాత పత్తా లేకుండా పోయాడని బాధితురాలి మేనమామ రాజశేఖర్‌రెడ్డి ఈ నెల 10న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ప్రొఫైల్‌ను ఇంటర్నెట్లో సెర్చ్ చేయగా అతడో నేరగాడని, అతడికి తల్లితో పాటు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నట్లు తెలిసిందన్నారు. పథకం ప్రకారం పట్టేసుకున్నారు... బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబర్ పోలీసులు నిందితుడి సెల్‌ఫోన్ నంబర్లు, పాత సెల్ నంబర్లతో పాటు అతడి ఫేస్బుక్ ఖాతాలు, ఠాణాల్లో అతడిపై ఉన్న కేసులను పరిశీలించారు. సెల్‌ఫోన్ లోకేషన్ టవర్ల ఆధారంగా గుంటూరులో ఉన్నట్లు తెలుసుకుని శుక్రవారం ఉదయం అతడిని అరెస్టు చేసి నగరానికి తీసుకొచ్చారు. ఈ ఏడాది మేలో విశాఖ పాస్‌పోర్టు ప్రాంతీయ కార్యాలయం నుంచి అతడికి పాస్‌పోర్టు వచ్చిందని, నేరచరిత ఉన్నా ట్రాక్ రికార్డును పరిశీలించకుండానే ఎస్బీ అధికారులు పాస్‌పోర్టు ఎలా జారీ చేశారన్న దానిపై వారిని వివరణ కోరనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మరో ఇద్దరికి గాలం నిందితుడు అమెరికాలోనే మేరీ అనే మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. ఈమెను వివాహం చేసుకునేందుకు అమెరికా వెళ్లిన రామ వెంకట్‌కు మరో ప్రవాస భారతీయురాలు(బాధితురాలు) వలలో పడింది. దీంతో మేరీని తర్వాత పెళ్లి చేసుకుందామని ఇప్పటికే సర్టిఫికెట్ తీసుకున్నాడు. కెనడా అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు మరో నాలుగు రోజుల్లో అక్కడికి వెళుతున్నట్లు నిందితుడు పోలీసులకు విచారణలో తెలిపాడు. ఇప్పటికే ట్రావెల్ ఏజెంట్‌తో మాట్లాడిన అతడు అంతా రెడీ చేసుకున్నాడు. నిందితుడి బ్యాంక్ ఖాతాలో రూ.4 వేల అమెరికా డాలర్లు ఉన్నాయని, వాటిని సీజ్ చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అతడి ఫేస్బుక్ ఖాతాలో 300 మంది అమ్మాయిలు ఉన్నారని, ఇతని వలలో పడి ఎవరైనా మోసపోయారనే దిశగా విచారణ చేపట్టామన్నారు. ఐదు రోజుల కస్టడీకి తీసుకొని మరిన్ని వివరాలు రాబడతామని తెలిపారు. హైదరాబాద్‌లో ఏడు... గుంటూరులో రెండు కేసులు డిగ్రీ కూడా పూర్తి చేయని వెంకట రత్నరెడ్డి ఉద్యోగం దొరకకపోవడంతో తన స్నేహితులతో కలిసి భవన శిథిలాల తొలగింపు వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. అరుుతే అందులో నష్టాలు రావడంతో సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ప్రజలను మోసగించాలని పథకం రచించాడు. ఇందులో భాగంగానే ఐఆఎర్ఎస్ అధికారిగా అవతారమెత్తి సినీ ప్రొడ్యూసర్‌తో పాటు ఇతరులను బెదిరించి డబ్బులు వసూలు చేయబోయిన కేసులో బంజారాహిల్స్, ఎస్ఆర్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్‌లో వ్యభిచార దందా నిర్వహిస్తూ దొరికిపోయాడు. గుంటూరులో పక్కింటి వారి సంత్రో కారును కూడా దొంగిలించాడు. డమ్మీ తుపాకీతో ఓ బ్యాంక్ అధికారిని బెదిరించిన కేసుతో సహా ఇప్పటివరకు అతనిపై హైదరాబాద్‌లో ఏడు, గుంటూరులో రెండు కేసులు నమోదై ఉన్నాయి. -
కుక్కలను చంపి ఫేస్బుక్లో పోస్ట్ చేశారు
-
కుక్కలను చంపి ఫేస్బుక్లో పోస్ట్ చేశారు
హైదరాబాద్ : తమిళనాడులో ఓ కుక్కను వైద్య విద్యార్థులు మేడ మీద నుంచి తోసేసిన ఘటన మరవక ముందే హైదరాబాద్ లోనూ అటువంటి అమానుష ఘటనే చోటుచేసుకుంది. మూడు కుక్కలను చంపి ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ముగ్గురు ఆకతాయిలను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. నగరంలోని ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు యువకులు కొన్ని రోజుల క్రితం ఓ కుక్కను చంపేశారు. దాన్ని వీడియో తీసి.. ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఇది గమనించిన సైబర్ పోలీసులు ఆ మైనర్లపై కేసు నమోదు చేశారు. ఇవాళ నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే తాము సరదా కోసమే ఆ పని చేశామని వాళ్లు చెప్పడం గమనార్హం. కాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వీడియో సంచలనం సృష్టిస్తోంది. -
నగలు, ఐఫోన్లంటూ మస్కా
ఫేస్బుక్ ద్వారా అమాయకులకు గాలం కస్టమ్స్ క్లియరెన్స్ ముసుగులో రూ.కోట్లు కొల్లగొట్టిన ముఠా సైబర్ పోలీసులకు చిక్కిన పాత్రధారులు పరారీలో మరో ఇద్దరు: 30 బ్యాంకు ఖాతాల సీజ్ సాక్షి, సిటీబ్యూరో: కస్టమ్స్ క్లియరెన్స్ ముసుగులో కోట్లాది రూపాయలను కాజేసిన ముఠా గుట్టును సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. ఫేస్బుక్ ద్వారా మహిళలను బుట్టలో వేసుకుని బంగారు ఆభరణాలు, ఐఫోన్లు పంపిస్తామని నమ్మించి.. కస్టమ్స్ క్లియరెన్స్ కోసం బ్యాంకులో డబ్బులు వేయించుకుని మోసగించడం వీరి నైజం. ఓ బాధితురాలి ఫిర్యాదుతో ఐదుగురు సభ్యుల ముఠాలో ముగ్గురిని అరెస్టు చేయగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వివరాలను ఆదివారం ఇన్చార్జి క్రైమ్ డీసీపీ జి.జానకీ షర్మిల వెల్లడించారు. ముఠా ఏర్పడిన తీరు ఇదీ.. బీహార్‌కు చెందిన రహ్మత్ అలీ, మహ్మద్ తన్వీర్ అన్సారీ, షా హుస్సేన్ కూలీలు. వీరిని అదే రాష్ట్రానికి చెందిన సితారే మహ్మద్, మిట్టు గతేడాది హైదరాబాద్‌లో ఉద్యోగం ఇప్పిస్తాని నమ్మించి తీసుకువచ్చారు. చందానగర్‌లో ఒక గ దిలో ఆశ్రయం కల్పించారు. వారి పేర్ల తో మాదాపూర్, చందానగర్, గచ్చిబౌలిలోని ఐసీసీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సి స్, ఎస్బీఐ, బీఓబీలతో పాటు ఇతర బ్యాంకుల్లో నకిలీ ఓటరు కార్డులు, పాన్‌కార్డులతో ఒకొక్కరితో పది బ్యాంకు ఖాతాలు తెరిపించారు. సితారే మహ్మద్ వీరితో పాటే ఉండేవాడు. మిట్టు మా త్రం ఢిల్లీలో మకాం వేసేవాడు. ఇలా మోసగిస్తారు... ఢిల్లీలో ఉన్న మిట్టు తన పేరును పీటర్గా మార్చుకుని ఫేస్బుక్ ద్వారా మహిళలను పరిచయం చేసుకుంటాడు. వారితో ఫోన్లో ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ ఆకర్షిస్తాడు. ఆ తరువాత తాను బంగారు నగలు, ఐఫోన్ ఉచితంగానే పంపిస్తానని నమ్మిస్తాడు. అయితే కస్టమ్స్ క్లియరెన్స్ కోసం కొంత డబ్బును తాను సూచించిన బ్యాంకు ఖాతాలో వేయాలని చెబుతాడు. అతడి మాటలు నమ్మి చాలామంది మహిళలు బ్యాంకులో డబ్బులు వేసి మోసపోయారు. ఈ క్రమంలోనే నాగోలుకు చెందిన ఓ మహిళను ఫేస్బుక్ ద్వారా పరిచయం చేసుకుని ఆభరణాలు, ఐ ఫోన్ పంపిస్తున్నానని మాదాపూర్ ఐసీఐసీఐ బ్యాంకులో రూ.34,000 వేయించుకున్నాడు. ఆపై యాంటీ టైస్టు ఫండ్ పేరుతో మరో రూ.1,76,000 తీసుకున్నాడు. అయితే, ఎంతకూ నగలు, ఐఫోన్ రాకపోవడంతో మోసపోయామని గ్రహించిన సదరు మహిళ గతనెల సైబర్‌క్రైమ్ ఏసీపీ ప్రతాప్‌రెడ్డికి ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన ఇన్స్పెక్టర్ ఎస్.రాజశేఖరరెడ్డి మాదాపూర్, గచ్చిబౌలిలోని ఆయా బ్యాంకుల్లో ఖాతాలను పరిశీలించగా బీహార్‌కు చెందిన రహ్మత్ అలీ, మహ్మద్ తన్వీర్ అన్సారీ, షా హుస్సేన్‌ల పేర్లు వెలుగు చూశాయి. ఆదివారం వారింటిపై దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. రూ.1,10,000 తో పాటు ఏటీఎం, పాన్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితులైన సితారే మహ్మద్, మిట్టు కోసం గాలిస్తున్నారు. విచారణలో ఈ ముఠా రూ.కోట్లను కొల్లగొట్టినట్టు గుర్తించారు. పట్టుబడ్డ ముగ్గురికి ప్రధాన సూత్రధారులు నెలలకు రూ.8000 ఇచ్చేవారిని తేలింది. -
ఫేస్బుక్లో సైబర్ కాప్స్
సైబర్ క్రైమ్ పోలీసు హైదరాబాద్ పేరుతో హోమ్ పేజ్ నెట్‌జనులకు విస్తృత అవగాహనే థ్యేయం నేడు ఆవిష్కరించనున్న నగర కమిషనర్ అనురాగ్ శర్మ సాక్షి, హైదరాబాద్: ‘‘ఆన్లైన్ ద్వారా నేరం చేసిన వారూ తప్పించుకోలేరు. సైబర్ పోలీసులు కన్నేసి ఉంచారు’’- సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసుల ఫేస్బుక్ పేజ్ నినాదమిది. ఇటీవల కాలంలో అందరికీ అందుబాటులోకి వచ్చిన ఇంటర్నెట్ ఆధారంగా ఆన్లైన్లో జరుగుతున్న నేరాలపై నెట్‌జనులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని హైదరాబాద్ నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) నిర్ణయించింది. దీని కోసం ప్రత్యేకంగా ఫేస్బుక్ పేజ్‌ను ఏర్పాటు చేసింది. ‘సైబర్ క్రైమ్ పోలీస్ హైదరాబాద్’ పేరుతో అందుబాటులోకి రానున్న ఈ పేజ్‌ను నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ శనివారం తన కార్యాలయంలో ఆవిష్కరించనున్నారు. శుక్రవారం ప్రయోగాత్మకంగా ప్రారంభమైన ఈ పేజ్ని 12 గంటల్లోనే 14 మంది లైక్ చేశారు. ఈ పేజ్ ద్వారా ప్రాథమికంగా సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని సీసీఎస్ పోలీసులు నిర్ణయించారు. ఒకే తీరులో ఒకటి కంటే ఎక్కువ నేరాలు నమోదైతే తక్షణం ఆ వివరాలను ఫేస్బుక్ పేజ్‌లో అప్లోడ్ చేయడం ద్వారా ప్రజలు అప్రమత్తం చేస్తారు. ఈ తరహా నేరాల బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల్నీ వివరించేందుకు ‘అలెర్ట్స్’ను అందుబాటులోకి తేనున్నారు. భవిష్యత్తులో బాధితులు సంప్రదింపులు జరపడానికి, సందేహాలు తీర్చుకోవడానికీ ఈ పేజ్ ఉపయోగపడేలా చేయాలని సీసీఎస్ డీసీపీ జి.పాలరాజు నిర్ణయించారు. సైబర్ క్రైమ్ పోలీసులు కేవలం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ పరిధిలోకి వచ్చే నేరాలను మాత్రమే నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తారు. అయితే ప్రస్తుతం బాధితులకు ఏ తరహా నేరం ఈ చట్టపరిధిలోకి వ స్తుందనేది స్పష్టంగా తెలియట్లేదు. ఫలితంగా సమయం, ఖర్చుల్ని వెచ్చిస్తూ సీసీఎస్ వరకు వచ్చి వెళ్లాల్సి వస్తోంది. దీనికి పరిష్కారంగా ఫేస్బుక్ పేజ్‌ను తీర్చిదిద్దాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇది అమలైతే ఓ బాధితుడు తాను మోసపోయిన తీరు, ఎదుర్కొన్న ఇబ్బంది తదితరాలను సైబర్ క్రైమ్ పోలీసుల ఫేస్బుక్ పేజీలో నిర్దేశించిన ప్రాంతంలో పొందుపరిస్తే... వాటిని పరిశీలించే పోలీసులు అవసరమైన సహాయసహకారాలు అందిస్తారు. దశల వారీగా ఈ విధానాన్ని అమలులోకి తేనున్నారు.