
క్రైమ్: కాల్‌గర్ల్ కోసం ఆన్‌లైన్‌లో వెతికిన ఓ టెక్కీ.. అడ్డంగా బుక్కయ్యాడు. మాయమాటలకు మోసపోయి.. రెండు లక్షల దాకా సొమ్ము పొగొట్టుకున్నాడు. హైదరాబాద్ నగరంలోని చందానగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
స్థానికంగా నివాసం ఉండే సదరు వ్యక్తి.. డిసెంబరు చివరివారంలో ఆన్‌లైన్‌లో ఎస్కార్ట్ సర్వీస్ ద్వారా కాల్‌గర్ల్ కోసం వెతికాడు. ఓ వెబ్‌సైట్లో కనిపించిన లింకు క్లిక్ చేయగానే ఒక నెంబర్ దొరికింది. ఆ నెంబర్ ద్వారా వాట్సాప్ ఛాటింగ్ కోసం యత్నించాడు. పటేల్ ఛార్మి పేరుతో పరిచయం చేసుకున్న అవతలి వ్యక్తి.. అమ్మాయిల ఫొటోలు పంపాడు. అయితే.. బుకింగ్ కోసం ముందుగా రూ.510 చెల్లించాలని కోరాడు. ఆ తర్వాత మరో రూ.5,500 పంపాలన్నాడు. మరోసారి మేసేజ్ చేసి.. సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.7,800 పంపమన్నాడు.
కక్కుర్తితో సదరు ఐటీ ఉద్యోగి కూడా వివిధ సందర్భాల్లో డబ్బులు పంపుతూ పోయాడు. అలా.. మొత్తం రూ.1.97 లక్షలు పంపినట్లు చెబుతున్నాడు. చివరకు.. అంతా మోసం అని గుర్తించి సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలాంటి స్కామ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment