Techie
-
ఆ దేశంలో ఆఫీసులు.. స్వర్గాలు!
భారతదేశంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే.. తెల్లవార్లు కోడింగ్, అర్ధరాత్రి వరకు మీటింగ్స్, వీకెండ్స్‌లో కూడా ఆఫీస్ కాల్స్. కానీ, అదే వృత్తిలో ఉంటూ స్వీడన్లో స్థిరపడిన ఓ భారతీయ యువతి షేర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. "నిజంగా ఆఫీసులు ఇలా కూడా ఉంటాయా?" అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.వైరల్ వీడియోలో ఏముంది?స్వీడన్లో టెక్నాలజీ ప్రొఫెషనల్‌గా పనిచేస్తున్న స్వాతి అనే యువతి, తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. సాయంత్రం సరిగ్గా 4:30 గంటల సమయం.. ఆమె పనిచేసే ఆఫీసులో ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించరు. అందరూ తమ పని ముగించుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. నిశ్శబ్దంగా ఉన్న ఆ కార్యాలయాన్ని చూపిస్తూ, అక్కడి పని సంస్కృతి గురించి ఆమె వివరించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది.పని కంటే మనిషికే ప్రాధాన్యం!స్వీడన్ కార్యాలయాల్లో అనుసరించే విధానాలు మన దేశానికి పూర్తి భిన్నంగా ఉంటాయని స్వాతి పేర్కొన్నారు. అక్కడ పని గంటల కంటే నాణ్యతకే పెద్దపీట వేస్తారు. ఆఫీసులో ఎన్ని గంటలు కూర్చున్నాం అన్నది కాదు, చేసిన పనిలో ఎంత క్వాలిటీ ఉందన్నదే అక్కడ ముఖ్యం.వ్యక్తిగత సమయం: ఉద్యోగులు ఆలస్యంగా ఉండాలని గానీ, వారాంతాల్లో పనిచేయాలని గానీ అక్కడి కంపెనీలు కోరుకోవు. పని ముగిశాక మిగిలిన సమయం పూర్తిగా వారి వ్యక్తిగత జీవితానికే (Work-Life Balance).కుటుంబానికి ప్రాముఖ్యత: కుటుంబంతో గడపడం, సొంత అభిరుచులను (Hobbies) కొనసాగించడం వల్ల ఉద్యోగులు మానసిక ప్రశాంతతతో ఉంటారని, అది వారి పనితీరును మరింత మెరుగుపరుస్తుందని స్వీడన్ యాజమాన్యాలు నమ్ముతాయి.నెటిజన్ల రియాక్షన్ వైరల్‌గా మారిన ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. "భారతదేశంలో రాత్రి 9 గంటలైనా ఆఫీసు లైట్లు ఆరవు, ఇలాంటి వాతావరణం మాకెప్పుడు వస్తుందో?" అని కొందరు ఆవేదన వ్యక్తం చేయగా.. "అందుకే విదేశాల్లో ఒత్తిడి తక్కువగా ఉంటుంది" అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి వ్యక్తిగత శ్రేయస్సు (Well-being), వృత్తిపరమైన బాధ్యతల మధ్య ఉండాల్సిన సమతుల్యతపై ఈ వీడియో మరోసారి పెద్ద చర్చకే దారితీసింది. View this post on Instagram A post shared by LifeWithSwati (@ekduniyaaisibhi) -
3 గంటలు పని.. రూ.40 లక్షలు సంపాదన
సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే ఉదయం నుంచి రాత్రి వరకు కంప్యూటర్ ముందు కుస్తీ పట్టడమే అనుకుంటున్నారా? అయితే ఈ 24 ఏళ్ల యువకుడి కథ వింటే మీ అభిప్రాయం మారిపోతుంది. గ్లోబల్ ఏఐ (AI) స్టార్టప్‌లో రిమోట్‌గా పనిచేస్తున్న ఇతను, ఏడాదికి ఏకంగా రూ. 40 లక్షల ప్యాకేజీ అందుకుంటున్నాడు. అయితే ఇక్కడ విశేషం జీతం కాదు.. అతను పనిచేసే విధానం!రోహన్ ధావన్ అనే ఎంట్రాప్రెన్యూర్ తన మేనల్లుడి గురించి లింక్డ్ఇన్ (LinkedIn)లో షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సదరు యువ డెవలపర్ రోజుకు కేవలం 2 నుండి 3 గంటలు మాత్రమే లాప్టాప్ తెరిచి పనిచేస్తాడట. పని ముగియగానే దర్జాగా లాగ్-ఆఫ్ అవుతాడు. మిగిలిన రోజంతా ఖాళీగా ఉండటం చూసి అతని తల్లిదండ్రులు సంతోషపడాల్సింది పోయి, తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు."వీడు అసలు పనేం చేయడం లేదు.. ఇంత జీతం ఇస్తున్నారంటే ఏదైనా చట్టవిరుద్ధమైన పనులు చేస్తున్నాడా?" అని ఆ తండ్రి తన ఆందోళనను ధావన్‌తో పంచుకున్నారు.కష్టపడటం అంటే గంటలు గడపడమేనా?సాధారణంగా భారతీయ మధ్యతరగతి ఇళ్లలో ఒక వ్యక్తి రోజుకు 10-12 గంటలు ఆఫీసులో కష్టపడితేనే అదే 'నిజమైన పని' అని నమ్ముతారు. "అలసటను ఒక గౌరవ చిహ్నంగా, పని సులభంగా అవ్వడాన్ని అనుమానంగా చూసే మనస్తత్వం మన సమాజంలో ఉంది" అని ధావన్ తన పోస్ట్‌లో విశ్లేషించారు. ఒకవేళ అదే అబ్బాయి తక్కువ జీతానికి టీసీఎస్ (TCS) లేదా ఇన్ఫోసిస్ వంటి కంపెనీల్లో పగలూరాత్రి కష్టపడితే, ఆ తల్లిదండ్రులు గర్వంగా ఫీలయ్యేవారని ఆయన పేర్కొన్నారు.పని తీరును మార్చిన ఏఐ2026 నాటి ఆధునిక పని వాతావరణంలో కృత్రిమ మేధ (AI) విప్లవాత్మక మార్పులు తెచ్చింది. గతంలో 8 గంటలు పట్టే పనిని, సరైన ఏఐ టూల్స్ వాడి 3 గంటల్లోనే పూర్తి చేయొచ్చు. రిమోట్ ఉద్యోగాల్లో మీరు ఎన్ని గంటలు లాగిన్ అయ్యారనే దానికంటే, ఎంత నాణ్యమైన పనిని డెలివరీ చేశారన్నదే ముఖ్యం. టెక్నాలజీపై పట్టున్న యువత ఇప్పుడు 'హార్డ్ వర్క్' కంటే 'స్మార్ట్ వర్క్' వైపు మొగ్గు చూపుతున్నారు.బిజీగా ఉన్నట్లు నటన!చాలా మంది యువ నిపుణులు తమ పనిని త్వరగా ముగించినప్పటికీ, సమాజం లేదా బాస్‌ల నుండి వచ్చే విమర్శల భయంతో "బిజీగా ఉన్నట్లు నటిస్తున్నారని" ధావన్ ఎత్తి చూపారు. ఉత్పాదకతను గంటలతో కొలిచే పద్ధతి ఇంకా పోలేదని ఇది నిరూపిస్తోంది. -
రూ.47 లక్షల జాబ్ రిజెక్ట్ చేసిన టెకీ.. కారణం ఏమిటంటే!
పోటీ ప్రపంచంలో లక్షల జీతం లభించే జాబ్ వస్తే ఎవరు మాత్రం వద్దనుకుంటారు. కానీ.. తాను ఎంపికైన ఉద్యోగానికి కావలసిన నైపుణ్యం తన దగ్గర లేదని ఒక టెకీ రూ.47 లక్షల వేతనం లభించే ఉద్యోగాన్ని వదులుకున్నారు. దీనికి సంబందించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వనేష్ మాలి అనే వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన సమాచారం ప్రకారం.. తనకు పూణేలో ఒక మంచి కంపెనీలు సీనియర్ ఉద్యోగానికి రూ.47 లక్షల వేతనంతో జాబ్ ఆఫర్ వచ్చిందని పేర్కొన్నారు. ప్యాకేజీ బాగుంది, కంపెనీ కూడా గొప్పదే, కానీ ఆ పదవికి అవసరమైన నైపుణ్యాలు నాకు ఇంకా పూర్తిగా లేవని.. తాను ప్రస్తుతం ఆ స్థాయిలో పని చేయడానికి సిద్ధంగా లేనని, ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు వెల్లడించారు.ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఆ ఆఫర్‌ను అంగీకరించి, ఉద్యోగంలోనే అవసరమైన నైపుణ్యాలను నేర్చుకోవాల్సిందని అన్నారు. కాగా మరికొందరు అతని నిజాయితీని ప్రశంసించారు. అలాంటి జాబ్ ఆఫర్ వదులుకోవడానికి ధైర్యం కావాలని మరికొందరు అన్నారు.Career Update:I recently got a fantastic job offer of Rs. 47 LPA in Pune for a senior role.The package was good and the company was great, but the position demanded skills I don’t fully possess yet.I politely rejected the offer, explaining that I am not ready to deliver at…— Vanesh Mali (@vaneshmali) March 20, 2026 -
లక్షన్నర జీతం.. రూ.15 వేలు కూడా మిగల్లేదు!
బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో అధిక జీతాలు ఉన్నప్పటికీ, పెరుగుతున్న జీవన వ్యయం కారణంగా నెలాఖరుకు పెద్దగా పొదుపు మిగలకపోవడం చాలా మంది ఉద్యోగుల వాస్తవ పరిస్థితిగా మారుతోంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక పోస్టు ఈ పరిస్థితిని స్పష్టంగా చూపించింది.తన బంధువు అనుభవాన్ని సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’(గతంలో ట్విట్టర్)లో ఓ యూజర్ పంచుకున్నారు. కంప్యూటర్ సైన్స్‌లో పట్టభద్రుడైన అతని బంధువు మొదటి సాఫ్ట్వేర్ డెవలపర్ ఉద్యోగం కోసం నెలకు రూ.1.5 లక్షల జీతంతో బెంగళూరుకు వెళ్లాడని చెప్పారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు అతను పెద్ద విజయాన్ని సాధించాడని భావించినప్పటికీ, కొన్ని నెలల తర్వాత నగర జీవన వ్యయం ఎంత భారంగా ఉంటుందో అతనికి అర్థమైంది.వచ్చే జీతంలో దేనికి ఎంత ఖర్చు అవుతోందన్నది ఆయన వివరంగా తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఇంటి అద్దె: ఆఫీస్‌కు సమీపంలోని చిన్న అపార్ట్‌మెంట్‌కు సుమారు రూ.36,000కిరాణా సామాగ్రి: రూ.13,000 – రూ.15,000ప్రయాణ ఖర్చులు: ట్రాఫిక్ కారణంగా క్యాబ్‌లు, ఆటోల కోసం రూ.6,000 – రూ.8,000ఇతర ఖర్చులు: ఆన్లైన్ ఫుడ్, కాఫీ, వీకెండ్ విహారాలు కోసం రూ.10,000 – రూ.12,000ఇవి కాకుండా సబ్స్క్రిప్షన్లు, వైద్య ఖర్చులు, అనుకోని బిల్లులు, అలాగే ఇంటికి డబ్బు పంపడం వంటి ఖర్చులు కూడా ఉంటాయని పేర్కొన్నారు. ఈ అన్ని ఖర్చుల తర్వాత నెలాఖరుకు అతనికి కేవలం రూ.15,000 నుంచి రూ.20,000 వరకు మాత్రమే పొదుపు మిగులుతుందని తెలిపారు.ఈ అనుభవం ద్వారా అతను ఒక ముఖ్యమైన విషయాన్ని గ్రహించాడని పోస్టులో పేర్కొన్నారు. “సొంతూరులో నెలకు రూ.1 లక్షకుపైగా జీతం చాలా పెద్దదిగా అనిపిస్తుంది. కానీ బెంగళూరు వంటి మెట్రో నగరంలో అదే జీతం కేవలం ప్రారంభ స్థాయి మాత్రమే” అని వ్యాఖ్యానించారు.సోషల్ మీడియాలో భిన్న స్పందనలుఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వేలల్లో వ్యూస్, వందలాది లైక్‌లను సాధించింది. చాలా మంది నెటిజన్లు తమ అనుభవాలను కూడా పంచుకున్నారు. “సొంతూరులో అదే జీతంతో ఎక్కువగా పొదుపు చేయవచ్చు”, “పెద్ద నగరాలు మీకు తెలియకుండానే డబ్బును వేగంగా ఖర్చు చేయిస్తాయి” అని కొందరు వ్యాఖ్యానించగా “సరైన ఎంపికలు చేస్తే ఖర్చులను నియంత్రించుకోవచ్చు” అని మరో యూజర్ కామెంట్ చేశారు. -
నాలుగేళ్లలో రూ. 3.5 లక్షల నుంచి రూ. 65 లక్షల రేంజ్..!
ఉద్యోగ కెరీర్లో అంచలంచెలుగా ఎదుగుతూ..అత్యున్నతి స్థాయికి చేరుకోవాలనే ఎవరైన కోరుకుంటారు. అందుకోసం చాలా కష్టపడుతుంటారు కూడా. కానీ కొందరు మాత్రమే చాలా తక్కువ సమయంలోనే అత్యధిక జీతం అందుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటారు. అలాంటి కోవకు చెందినవాడే ఈ టెకీ. తన కెరీర్ సక్సెస్‌ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కేవలం నాలుగేళ్లలో ఏడాకి రూ. 3.5 లక్షలు అందుకునే స్థాయి నుంచి ఏకంగా ఏడాదికి రూ. 65 లక్షలు అందుకునే రేంజ్‌కి వెళ్లిపోయాడు. అప్పుల భారంతో సతమతమవుతున్న అతడి మధ్యతరగతి కుటుంబానికి అతి పెద్ద ఊరట తోపాటు సంతోషాలు వెల్లివెరిశాయి. 2021లో క్యాంపస్ ఇంటర్వ్యూలో తక్కువ ప్యాకేజీతో నియమాకం అందుకున్నట్లు టెకీ తెలిపారు. అప్పుడు తన జీతం కేవలం రూ. 26 వేలు అని. అయితే ఆ టైంలో జాబ్‌లో ఉన్నత స్థానానికి చేరుకోవాలన్న లక్షం, కష్టబడేతత్వం పెద్దగా ఏమి లేవని, హాయిగా సినిమాలు చూస్తూ, ఎంజాయ్ చేస్తూ జాబ్ చేసేవాడినని అన్నారు. అయితే ఇంట్లో అప్పులభారం పెరిగిపోవడం, అందుకున్న జీతం ఏమాత్రం సరిపోకపోవడంతో..అప్పుడు వాస్తవికంగా నాలాంటి సాఫ్ట్వేర్ అందుకనే జీతం ఇది కాదని గ్రహించానంటున్నాడు. అప్పటి నుంచి మరింత కష్టపడటం మొదలుపెట్టా. అందులోనూ లాజికల్ మ్యాథ్స్‌లో ఉన్న పట్టుతో..లక్షల వేతనం అందుకునే టెకీల మాదిరి ఉద్యోగాలు అందుకునే వేటలో ఉన్నాను. అప్పుడు నా లక్ష్యం అప్పులు క్లియర్ చేసేలా మంచి ఉద్యోగం పొందడం. ఆ క్రమంలో 2023లో 45 శాతం జీతం పెంపు, 2024లో 28 శాంతం పెంపు కూడా అందుకోగలిగా. సరిగ్గా ఆ టైంలో ఇంజనీర్‌గా రూ. 19 లక్షలు వార్షిక జీతంతో కొత్త కంపెనీలో చేరా. విహారయాత్రాలు, ఎంజాయ్మెంట్ వంటి వాటితో సంబంధం లేకుండా చాలా కష్టపడ్డ..అయితే ఆ క్రమంలో కొన్ని ఇంటర్వ్యూలను చాలా త్రుటిపాయంలో పోగొట్టుకున్నట్లు తెలిపాడు. చివరికి తన కష్టం ఫలించి సర్వీస్‌నౌ, పేపాల్, సిస్కో వంటి అత్యున్న కంపెనీల ఆఫర్లు అందుకోగలిగా. చివరికి తాను అనుకున్నట్లుగానే ఒక అగ్రశ్రేణి ఉత్పత్తి సంస్థ నుంచి రూ. 65 లక్షల ఆఫర్ అందుకున్నా. తనను అందురు కార్పొరేట్ బానిసగా భావించి ఉండొచ్చు..కానీ తన తల్లిదండ్రులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అలాగే ఎన్నటికీ ఊహించని గొప్ప వస్తువులను సైతం కొనుగోలు చేయగలను అని ఆనందంగా చెబుతూ పోస్ట్‌ని ముగించాడు. నెటిజన్లు సైతం సదరు టెక్నీషియన్ సక్సెస్ జర్నీ చాలా స్పూర్తిదాయకమైన విజయవంతంగా కెరీర్‌ని నిర్మిచుకోవడం ఎలా అనేందుకు గొప్ప స్ఫూర్తి అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.(చదవండి: సహానుభూతి పవర్..! ఎలా బిల్డ్ చేయాలంటే..) -
ఏఐ వాడకం.. అప్పుడొచ్చింది ఒక సందేహం!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అన్ని రంగాల్లోనూ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అయితే ఈ టెక్నాలజీపై ఎక్కువగా ఆధారపడటం వల్ల తన వ్యక్తిగత నైపుణ్యాలు తగ్గుతున్నాయేమో అనే అనుమానం కలుగుతోందని ఒక యంగ్ బ్యాక్ఎండ్ ఇంజనీర్ ఆందోళనల వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.టెక్ ప్రొఫెషనల్ 11 నెలలుగా బ్యాక్ఎండ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. తాను రోజువారీ ఆఫీస్ పనుల్లో ఎక్కువ భాగం ఏఐ టూల్స్ సహాయంతోనే పూర్తిచేస్తున్నాడు. ముఖ్యంగా కర్సర్ ఏఐ కోడ్ ఎడిటర్ & క్లౌడ్ ఏఐ అసిస్టెంట్ వంటివి కోడ్ రాయడంలో, APIలు రూపొందించడంలో మాత్రమే కాకుండా.. ఇతర సాంకేతిక పనులను పూర్తి చేయడంలో సహాయం చేస్తున్నాయి. ఈ టూల్స్ ఇచ్చిన సూచనల ప్రకారం పనులు పూర్తి చేస్తున్నానని అతను తెలిపాడు.ఇలాంటి సమయంలో అతనిలో ఒక సందేహం కలిగింది. సుమారు ఏడాదిగా పనిచేస్తున్నప్పటికీ.. నేను నిజంగా ఏమి నేర్చుకున్నాను. నేను ఇప్పటికే కొత్తగా ఉద్యోగంలో చేరిన వ్యక్తి మాదిరిగానే ఉన్నానని తన పోస్టులో పేర్కొన్నాడు. ఒకరోజు కర్సర్ ఏఐ సాంకేతిక సమస్య వల్ల పనిచేయకుండా పోయింది. అప్పుడు నేనే ఆ పనిని పూర్తి చేయాల్సి వచ్చింది. కానీ నేను ఏఐ సహాయం లేకుండా స్వతంత్రంగా పనిచేయలేకుండా పోతున్నానని, పని కష్టమవుతోందని వాపోయాడు.టెక్ రంగంలోకి ప్రవేశించడం తనకు అంత సులభం కాదని కూడా సోషల్ మీడియా పోస్టులో వివరించాడు. 2023లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి.. అనేక ఇంటర్వ్యూలు విఫలమైన తర్వాత 2025లో ఉద్యోగం సంపాదించాడు. ఇప్పుడు ఏఐ ఉపయోగించకుండా.. చేయాల్సిన పని కష్టం అయితే.. ఉద్యోగం బహుశా పోవచ్చు కూడా.ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కర్సర్ లేకుండా పని చేయడం కష్టమే అని కొందరు సీనియర్లు సరదాగా కామెంట్ చేశారు. ప్రస్తుతం ఏఐ ఉపయోగిస్తూ.. పని సులభంగా ఉందని సంబరపడిపోయే వారికి ఇదొక హెచ్చరిక అని ఇంకొందరు చెబుతున్నారు. -
చపాతీలు చేస్తూ చెత్త బుట్ట.. వంట మనిషిని పట్టుకున్న ఏఐ బాట్
బెంగళూరు: సాంకేతిక నగరం బెంగళూరులో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన మేధస్సుకు పదునుపెట్టి, వంటగదిలో జరుగుతున్న బాగోతాన్ని బయట పెట్టారు. తన ఇంట్లో పని చేసే వంటమనిషిపై కలిగిన అనుమానంతో ఆయన ఏఐ (కృత్రిమ మేధ) ఆధారిత నిఘా వ్యవస్థను వంటగదిలో ఏర్పాటు చేశారు. పంకజ్ తన్వర్ అనే ఈ టెక్కీ తాను రూపొందించిన ఈ వ్యవస్థను ‘ఏఐ రూమ్మేట్’గా అభివర్ణించారు. రిఫ్రిజిరేటర్ నుంచి ఆపిల్స్, బ్లూబెర్రీస్, అరటిపండ్లను వంటమనిషి పదేపదే తస్కరించడాన్ని ఈ ఏఐ బాట్ క్లిప్పింగులతో సహా రిపోర్ట్ చేయడంతో, పంకజ్ తన్వర్ ఆమెను వెంటనే పనిలోంచి తొలగించారు.ఈ వినూత్న నిఘా వ్యవస్థ కేవలం దొంగతనాన్ని పట్టుకోవడానికే పరిమితం కాకుండా, ఆ వంటమనిషి పనితీరును, శుభ్రతను కూడా నిశితంగా పరిశీలించింది. ఏ సమయంలో ఆమె వంటగదిలోకి వచ్చింది.. ఫ్రిజ్ ఎన్నిసార్లు తెరిచింది అనే వివరాలతో పాటు ఆమె పాటించే పరిశుభ్రతను కూడా యజమానికి నివేదించింది. చెత్త బుట్ట మూతను తాకిన చేతులతోనే చపాతీలు చేయడం, స్టౌ వెనుక భాగాన్ని శుభ్రం చేయకుండా నిర్లక్ష్యం వహించడం లాంటి అంశాలను ఏఐ బాట్ ఫోటోలతో సహా పంకజ్ దృష్టికి తీసుకెళ్లింది.నెలకు రూ. 5,000 వేతనం తీసుకుంటూ, ఇలాంటి అక్రమాలకు పాల్పడటం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేశారు. పంకజ్ తన్వర్ ఈ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో గోప్యతకు కూడా ప్రాధాన్యతనిచ్చారు. కెమెరా రికార్డ్ చేసే దృశ్యాల్లో ముఖాలను బ్లర్ చేసి, కేవలం చర్యలను మాత్రమే విశ్లేషించేలా దీనిని రూపొందించారు. భవిష్యత్తులో గ్యాస్ లీకేజీని గుర్తించే ఫీచర్లను కూడా దీనికి జోడించనున్నట్లు ఆయన వెల్లడించారు.అయితే ఈ ఉదంతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. కొందరు ఆయన సాంకేతిక నైపుణ్యాన్ని మెచ్చుకుంటుండగా, మరికొందరు అతి తక్కువ వేతనానికి పని చేసే సామాన్యులపై ఇంతటి నిఘా ఉంచడం నైతికంగా సరికాదని విమర్శిస్తున్నారు. ఈ విమర్శలపై స్పందించిన పంకజ్.. సదరు వంటమనిషిని తాను ఇదివరకే రెండుసార్లు హెచ్చరించానని అన్నారు. తన అనుమతితో ఆహారం తీసుకుంటే తనకు ఏమాత్రం అభ్యంతరం లేదని, కానీ దొంగతనాన్ని తాను సహించేదిలేదని స్పష్టం చేశారు.ఇది కూడా చదవండి: హోలీ తర్వాత ఉంటదీ.. బయటకొస్తే చుక్కలే! -
ఏఐ సదస్సులో ఎనిమిదేళ్ల చిచ్చరపిడుగు..! టెక్ దిగ్గజాలు సైతం..
భారత్ మండపంలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026ను గురువారం ప్రధాని నరేంద్ర మోదీ అట్టహాసంగా ప్రారంభించారు. దిగ్గజ సీఈవోలు, ప్రపంచ సాంకేతిక నిపుణులు, ప్రముఖ నాయకులు విచ్చేసిన ఈ సదస్సులో ఒక ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. అందరి ప్రసంగాలు పూర్తి అయ్యాక ఎనిమిదేళ్ల రణ్వీర్ సచ్‌దేవా అతి పిన్న వయస్కుడైన ‘కీ నోట్ స్పీకర్’గా వేదికపైకి వచ్చినప్పుడు ఒక్కసారిగా గది అంతా నిశబ్దంగా మారిపోయింది. విప్లవాత్మక అల్గారిథంలు, తదుపరి తరం మౌలిక సదుపాయాల గురించి తన వయసుకి మించిన జ్ఞానంతో అలవోకగా మాట్లాడి అందర్ని నిశ్చేష్టులయ్యేలా చేశాడు. ఆ బాలుడి ప్రసంగం అక్కడున్న వారందర్నీ మంత్రముగ్ధుల్ని చేసింది. అలాగే భారతీయ తత్వశాస్త్రం కృత్రిమ మేధస్సు (AI)తో ఎలా జతకడుతుంది, AI పట్ల తనకున్న తన ప్రత్యేక ఆసక్తిని, దృక్పథాన్ని పంచుకున్నాడు. ఈ ఏఐ సాంకేతికతకు సంబంధించిన పలు అంశాల గురించి మాట్లాడుతూ..సాంకేతికత పట్ల ఉన్న తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ శిఖరాగ్ర సమావేశంలో రణవీర్ గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మన్‌లను కలిశాడు. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. కాగా, ఈ ఏఐ విప్లవం వెనుకున్న ఇద్దరు ప్రముఖులతో ఎనిమిదేళ్ల బాలుడు కలిసి పనిచేయడం, అక్కడున్న టెక్ దిగ్గజాలతో సంభాషించడం తదితరాలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.ప్రపంచంలోని ప్రముఖ టెక్నాలజీ కాన్ఫరెన్స్‌లలో ఒకదానిలో మాట్లాడటం అంత చిన్న విషయం కాదు. అయితే రణ్వీర్ టెక్ ప్రపంచానికి కొత్తేమీ కాదు. అతను మూడేళ్ల వయసులోనే కోడింగ్ ప్రారంభించాడు, గతంలో ప్రపంచవ్యాప్తంగా కీనోట్స్‌లో మాట్లాడాడు. తన వయస్సుకు మించి మెషిన్ లెర్నింగ్ మోడల్స్‌ను అధ్యయనం చేశాడు. అప్పటి నుండి అతను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. లక్షలాది మందికి ప్రేరణగా మారుతున్నాడు. పైగా టెక్నాలజీకి వయోపరిమితి లేదని రణ్వీర్ ప్రపంచానికి చాటి చెప్పాడు. View this post on Instagram A post shared by Asian News International (@ani_trending) (చదవండి: Actress Sneha and Prasanna: మైండ్‌ఫుల్ పేరెంటింగ్ మంత్ర!) -
లే ఆఫ్‌ని ఎలా హ్యాండిల్ చేయాలంటే..?: మాజీ అమెజాన్ టెక్కీ
ఇటీవల కాలంలో లేఆఫ్స్ కామన్‌గా మారాయి. ఇంతకుమునుపు కేవలం ఐటీ రంగానికే పరిమితమవ్వగా, ఇప్పుడు అన్నిరంగాలకు ఇది పాకింది. దీని ప్రభావంతో ఉద్యోగుల్లో అభద్రతా, ఏ క్షణం ఏం జరుగుతోందన్న ఒత్తిడి ఎక్కువయ్యాయి. తమ సహోద్యోగులు ఉద్యోగాలు పోయాయంటేనే..మనకేం జరుగుతోందో అనే ఆందోళన. ఇది ఉద్యోగం సంపాదించడాని కంటే భయంకరమైన టెన్షన్. సింపుల్‌గా చెప్పాలంటే 40 ఏళ్లు వస్తే ఆ ఉద్యోగి జాబ్ ఉంటుందా లేదా అన్నంత గుబులు మదిలో మెదులుతోంది. అలాగని టెన్షన్‌తో బతకలేం కదా..మరి ఆ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేసి..మళ్లీ మన ట్రాక్‌లోకి రావాలో ఈ మాజీ అమెజాన్ ఉద్యోగి మాటల్లో తెలుసుకుందామా..!.అతడే 47 ఏళ్ల మాజీ టెక్ ప్రొఫెషనల్ హేమంత్ విర్మానీ. ఈ భారత సంతతి వ్యక్తి తన అనుభవాన్ని వివరిస్తూ..లేఆఫ్ని ధైర్యంగా ఫేస్ చేయక తప్పదని అంటున్నాడు. తన గురించి వివరిస్తూ ఇలా చెప్పుకొచ్చారు హేమంత్. "నేను యూఎస్‌లోని అమెజాన్‌లో సుమారు పదకొండున్నరేళ్లుగా సీనియర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మేనేజర్‌గా పనిచేశాను. సరిగ్గా 2023 నుంచి మా కంపెనీలో తొలగింపులు చేపట్టడం చూశాను. నా బృందంలోని సభ్యులను తొలగించడం చాలా దగ్గరగా చూశాను. అది ఎంత కష్టంగా ఉంటుందో కూడా తెలుసు. ఏదో ఒక రోజు ఆ పరిస్థితి నాకు వస్తుందని అప్పుడు తెలియలేదు. సరిగ్గా అక్టోబర్ 2025 అర్థరాత్రి నన్ను తొలగిస్తున్నట్లు మెయిల్ వచ్చాక గానీ తెలిసిరాలేదు. ఆ క్షణం ఒక్కసారిగా షాక్‌కి గురయ్యా..!. కళ్లముందే పరిస్థితి తలకిందులైనట్లుగా అనిపించింది. ఏం చేయాలో పాలుపోలేదు. చాలా రోజుల వరకు ఉద్యోగం పోగొట్టుకున్నా అనే బాధలోనే ఉండిపోయా. అయితే ఆ రోజు నా ఉద్యోగం పోయిన వెంటనే నా మేజనర్తో దాదాపు 30 నిమిషాల పాటు మాట్లాడాను. ఆయన నాతో చాలా సానుకూలంగా, మానవీయంగా మాట్లాడారు, పైగా నా స్కిల్స్‌ని అభినందించారు కూడా. అంతేగాదు ఆ తదుపరి మరసటి రోజు ధైర్యంగా ఉన్నానా? లేదా? అని నా పాత మేనేజర్ కాఫీషాప్ వద్దకు వచ్చి కలుస్తుండేవాడు. తప్పనిసరి పరిస్థితుల్లో జరిగిన లేఆఫ్ అని నచ్చచెప్పే ప్రయత్నం చేసేవాడు. కానీ వాళ్లంతా సానుకూలంగా వ్యవహరిస్తున్నా..నా(హేమంత్) పరిస్థితి రోజురోజుకి దిగజారిపోతున్నట్లుగా..నిరాశ నిస్ప్రుహలకు లోనయ్యేవాడిని. ఈ పరిస్థితిలో నా కూతురు ఎలా ఉంటుందా అని గమనించగా..నా చిట్టితల్లే నాకు గొప్ప పాఠం నేర్పిందని చెబుతున్నాడు హేమంత్. పరిస్థితులు మారినప్పుడూ వాటిని అంగీకరిస్తూ..ఆమె తన ఖర్చులను సర్దుబాటు చేసుకున్న తీరు..ఎప్పటికీ ఇలానే ఉండపోమన్న ఆమె నమ్మకం..మళ్లీ నన్ను భుజం తట్టి నిలబడేలా చేశాయి. అప్పుడే తెలిసింది..లేఆఫ్తో..అప్పటి వరకు నేను వదిలేసిన ప్రతి పనులను తిరిగి చేయడం మొదలుపెట్టా. ముఖ్యంగా నా కూతురు ప్రాజెక్ట్ వర్క్స్‌లో హెల్ప్ చేయడం దగ్గర నుంచి ఆరోగ్యంపై కేర్ తీసుకోవడం వరకు అన్నిటిపై ఫోకస్ పెట్టా. అలాగే ఇక తదుపరి నేనేం చేయాలనే దిశగా అడుగులు వేస్తూ.. ఏఐ స్కిల్స్‌పై దృష్టిసారించాను. అలాగే మళ్లీ పుంజుకోవడానికి మార్గాలేంటో అన్వేషించడం ప్రారంభించా. గోడకు కొట్టిన బంతిలా తిరిగి వచ్చేసినప్పుడూ..అలా ఉండిపోకూడదు..మరింత బలంగా పైకి ఎగరడం ఎలాగో ఆలోచించడం నేర్చుకున్నా. అంతేగాదు ఆ లేఆఫ్ని మన అభ్యున్నతికి వరంగా మార్చుకోవాలని తెలుసుకున్నా" అంటూ..తన అనుభవాన్ని అత్యద్భుతంగా వివరించాడు హేమంత్. అతని పోస్ట్ నెటిజన్లను అమితంగా ఆకర్షించడమే కాదు..గొప్ప స్ఫూర్తిని నింపావు బాస్ అని పోస్ట్‌లు వెల్లువెత్తాయి.(చదవండి: టీనేజ్ వయసులో చదువుకి డుమ్మా..! కట్‌చేస్తే..) -
ఉబర్ సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదులుకుని మరి.. యూట్యూబ్‌లో కోడింగ్..!
మంచి కార్పొరేట్ ఉద్యోగాన్ని వదలుకుని నచ్చిన జాబ్‌లో కొనసాగాలంటే చాలా ధైర్యం కావాలి. తీరా మనకు నచ్చిన రంగంలో కొనసాగాక..సమస్యలు వెంటాడితే ఇక అంతే సంగతులు. అంతా సవ్యంగా ఉంటే పర్లేదు. ఏదైనా సమస్య వస్తేనే ఇబ్బంది. అందులోనూ భారీ వేతనం లభిస్తున్న ఉద్యోగం వదలాలన్న గట్స్ కావాలి. అయితే ఈ టెక్కీ అంత సాహసం చేశాడు. అది కూడా యూట్యూబ్‌లో కోడింగ్ నేర్పడం కోసం అంత పెద్ద ఉద్యోగం వదిలేశాడు. అబ్బా ఇదేంటని అడిగితే.. తాను కోరుకున్నది ఇదేనని నవ్వుతూ చెబుతాడు సదరు టెక్కీ. సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన పోస్ట్ వైరల్‌గా మారడమే గాక టెక్కీ తీసుకున్న అనూహ్య నిర్ణయం అందర్నీ అమితంగా ఆకర్షిస్తోంది. ఆ వ్యక్తే అక్షయ్ సైనీ. సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్‌లో మాజీ ఉబర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అక్షయ్ సైనీ ఐదేళ్ల క్రితం సురక్షితమైన కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకున్న తన జర్నీని పంచుకున్నాడు. ఈ నిర్ణయం అతడికి తన డడ్రీమ్ లైఫ్‌ని నిర్మించుకునేందుకు సహాయపడింది. అంతేగాదు సైనీ తన యూట్యూబ్ ఛానెల్లో రెండు మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లను కలిగి ఉన్నాడు. నిజానికి తాను ఉబర్‌లో ఉద్యాగాన్ని వదులుకోవడానికి సిద్ధపడినప్పుడూ..అందరు తనని మతిస్థిమితం లేనివాడిగా చూశారని చెప్పుకొచ్చాడు. కేవలం యూట్యూబ్‌లో బోధించేందుకు మంచి జీతం, మంచి బ్రాండెడ్ కంపెనీ తదితరాలన్నీ కాదనుకుంటున్నావా అని కూడా ప్రశ్నించారని రాసుకొచ్చాడు. ఇది చాలా తెలివితక్కువ నిర్ణయమని. అంతగా కావాలనుకుంటే జాబ్ చేస్తూనే వారాంతాలలో య్యూట్యూబ్ కంటెంట్క్రియేటర్గా, కోడింగ్ బోధించమని సలహ ఇచ్చారని తెలిపాడు. కొందరైతే ఏకంగా ఉబర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ట్యాగ్‌తో పెళ్లి అయిపోని.. ఆ తర్వాత నచ్చినదాంట్లో కొనసాగమని సూచించారు కూడా. అయితే నా దృష్టిలో వివాహాం పెద్ద మేటర్ కాదు కాబట్టి..గౌరవప్రదమైన వృత్తిలో కొనసాగాలనే నిర్ణయించుకున్నా. అందుకోసం తొందరపడలేదని..జీతం లేకుండా పది నెలలకు పైగా సెలవులు తీసుకుని మరి ఒక నిర్ణయానికి వచ్చినట్లు వివరించాడు. ఆ విరామ సమయంలో బోధన, డెవలపర్ విద్యపై దృష్టి సారించి నమస్తేదేవ్ అనే వేదికపై పనిచేయడం ప్రారంభించినట్లు తెలిపారు. గతంలో తాను కేవలం సాఫ్ట్వేర్ ఇంజనీర్ని మాత్రమే ఇప్పుడు..వ్యవస్థాపకుడిగా, సీఈవోగా, మార్కెటర్‌గా, సేల్స్గైగా, ప్రొడక్ట్ మేనేజర్‌గా, ఫైనాన్స్గైగా, కొన్నిసార్లు కస్టమర్ సపోర్ట్‌గా అన్ని రోల్స్ నిర్వరిస్తున్నా అని ఆనందంగా చెబుతున్నాడు. అంతేగాదు మనకు బయట స్టార్టప్‌లు ఎంతో అందంగా కనిపిస్తుంటాయి. కానీ చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఏళ్లుగా ఎన్నో విమర్శలు, ఆన్లైన్ ద్వేషాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ వెనుతిరగలేదని, ఎన్నోప్రతికూలతలను దాటుకుంటూ చాలా దూరం వచ్చానంటూ భావోద్వేగంగా చెప్పుకొచ్చాడు సైని. అలా ఇప్పటికీ ఐదేళ్లు అయ్యిందని, స్వస్థలం డెహ్రాడూన్, అక్కడే ఒక చిన్న రిమోట్ బృందంతో పనిచేస్తున్నట్లు తెలిపాడు. దీని వల్ల కుటుంబంతో గడపగలుగుతున్నానని, పనిని ఆనందిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఈ పోస్ట్..అందరి మనుసుని గెలుచుకోవడమే గాక..ఇలాంటి నిర్ణయాల తీసుకునేందుకు చాలా గట్టి ధైర్యం కావాలని, ఆత్మసంతృప్తినిచ్చే పని ఎంతో నచ్చుతుందని. దానికి మించింది మరొకటి లేదని పోస్టులు పెట్టారు. అలాగే అన్నివేళలా సురక్షితమైన ఉద్యోగం కంటే..ఓర్పుతో నచ్చిన వృత్తిలో గెలుపు అందుకోవడంలో ఉన్న కిక్ వేరేలెవెల్ అంటూ మరికొందరూ పోస్టుల్లో పేర్కొన్నారు.When I left Uber, a lot of people thought I had lost my mind.Good salary, big brand, stable life.And I was walking away from it to do YouTube, teaching, content creation. In India.People told me very seriously, “This is not a good decision.”Some said, why don’t you do…— Akshay Saini (@akshaymarch7) February 9, 2026 (చదవండి: ప్రేమను విజయవంతంగా పెళ్లిపీటలెక్కించారు..కానీ..!) -
యాక్సిడెంట్ కాదు.. డాష్‌బోర్డ్ కెమెరా షాకింగ్ విజువల్స్
కర్ణాటకలోని బెంగళూరులోని హెబ్బగోడి ఠాణా పరిధిలో ఆదివారం సాయంత్రం ఎలక్ట్రానిక్స్ సిటీలోని అనంతనగర్ రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది. హెబ్బగోడి నివాసి ప్రశాంత్ (28), రోషన్ హెగ్డే (27) ఆదివారం క్రికెట్ మ్యాచ్ ముగించుకుని సాయంత్రం మద్యం తాగారు. మద్యం మత్తులో కారును అడ్డదిడ్డంగా నడపడంతో కారు చెట్టుకు ఢీకొంది. దీంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇదీ తొలుత అందరూ అనుకున్న స్టోరీ. కానీ ఈ ఘటనకు సంబంధించి మరో ట్విస్ట్ వెలుగులో వచ్చింది. ప్రమాదంగా భావించిన ఈ ఘటన చివరికి ఒళ్లు గగుర్పొడిచే హత్యగా తేలింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ప్రశాంత్, రోషన్ ఇద్దరు స్నేహితులు. ప్రశాంత్ బాడీబిల్డర్‌గా పనిచేస్తుండగా, రోషన్ డొమ్లూరులోని ఒక సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. కారులోని డాష్‌క్యామ్‌ను డీసీపీ (ఎలక్ట్రానిక్స్ సిటీ) ఎం నారాయణ గమనించి, ఆ ఫుటేజీని పరిశీలించమని ఆదేశించడంతో ఈ హత్య వెలుగులోకి వచ్చింది.ఆదివారం సాయంత్రం కమ్మసంద్రలో కొంతమందితో కలిసి క్రికెట్ ఆడిన వీరు తరువాత మద్యం సేవించారు. మద్యం మత్తులో ప్రశాంత్ లైటర్ కోసం రోషన్ వద్దకు వచ్చి అతనిని దుర్భాషలాడాడని, దీనితో వాగ్వాదం చెలరేగింది. ఇద్దరూ బీర్ బాటిళ్లతో ఒకరినొకరు దాడి చేసుకున్నాడు. పరిస్థితి దిగజారడంతో, రోషన్ తన టాటా సఫారీలోకి ఎక్కి అక్కడి నుండి వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే, ప్రశాంత్ కారును వెంబడించి, కదులుతున్న వాహనం ఎడమవైపు ఫుట్‌బోర్డ్‌పైకి ఎక్కి డోర్‌ను పట్టుకుని వేలాడాడు. కారు ఆపమని ప్రశాంత్ వేడుకుంటున్నా రోషన్ పట్టించుకోలేదు. సుమారు 600 మీటర్ల దూరం వరకు కారును వేగంగా, ప్రమాదకరంగా నడిపాడు. ఆ తర్వాత ఉద్దేశపూర్వకంగానే మొదట ఓ కాంపౌండ్ గోడను, ఆ వెంటనే వెనక్కి తిప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో ప్రశాంత్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విజువల్స్ డాష్‌క్యామ్‌లో రికార్డయ్యాయని పోలీసు అధికారి తెలిపారు.ఇది ఉద్దేశపూర్వకమైన హత్య అని తేలడంతో, తీవ్ర గాయాలతో రోషన్ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి విచారణకోసం అదుపులోకితీసుకున్నామని అధికారి నారాయణ తెలిపారు. రోషన్‌కు నాలుక దాదాపు తెగిపోయిందని, చిన్న శస్త్రచికిత్స జరిగిందని వైద్యులు మాకు తెలిపారు. సోమవారం అతన్ని డిశ్చార్జ్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.Drunk Driving Nightmare: Bengaluru Roads Claim Another Life in Shocking Car-Ramming IncidentShocking incident from Bengaluru.A drunken brawl turned deadly when Prashanth M (33), a bodybuilder, was killed after Roshan Hegde (37), a software engineer from Mangaluru, allegedly… pic.twitter.com/sJ2c3zldMM— Karnataka Portfolio (@karnatakaportf) January 26, 2026 -
ప్రాణం తీసిన పని ఒత్తిడి.. టెక్కీ దుస్థితి వైరల్
గ్వాంగ్జౌ: విపరీతమైన ఆఫీసు పని ఒత్తిడి ఒక యువకుడి ప్రాణాలను కబళించింది. చైనాలోని గ్వాంగ్జౌలో చోటుచేసుకున్న ఒక విషాదకర ఘటన టెక్ ఉద్యోగులపై పడే విపరీతమైన పని ఒత్తిడిని మరోసారి తెరపైకి తెచ్చింది. 32 ఏళ్ల ప్రోగ్రామర్ గావో గ్వాంగ్ హూయ్ వారాంతపు సెలవు దినమైన శనివారం నాడు కూడా ఇంటి నుండే విధులు నిర్వర్తిస్తూ కుప్పకూలిపోయాడు.విపరీతమైన పని ఒత్తిడి కారణంగానే గావో గ్వాంగ్ హూయ్ అస్వస్థతకు గురయ్యాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శనివారం ఉదయం పనిలో నిమగ్నమై ఉండగా, అకస్మాత్తుగా స్పృహ కోల్పోయిన గావోను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందించినప్పటికీ, ఆయన ప్రాణాలు దక్కలేదు. ఈ ఘటన చైనా సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశంగా నిలిచింది.గావోను ఉదయం 9:46 గంటల సమయంలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్షియల్ హాస్పిటల్ ఆఫ్ ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్‌కు తరలించినట్లు ఆస్పత్రి రికార్డులు వెల్లడిస్తున్నాయి. వైద్యులు ఆయనను కాపాడేందుకు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో బాధితుడు క్లినికల్‌గా మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. అతని మరణానికి ప్రధాన కారణం ‘సడన్ రెస్పిరేటరీ అండ్ కార్డియాక్ అరెస్ట్’ (శ్వాస మరియు గుండె ఆగిపోవడం) అని వైద్యులు ధృవీకరించారు. దీనికి ‘స్టోక్స్-ఆడమ్స్ సిండ్రోమ్’ కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఇది గుండె కొట్టుకోవడంలో తీవ్రమైన అంతరాయాల వల్ల సంభవించే ప్రాణాంతక పరిస్థితి అని వైద్య నిపుణులు చెబుతున్నారు.ఈ ఉదంతంలో అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే ఆస్పత్రిలో గావో ప్రాణాల కోసం పోరాడుతున్న సమయంలోనే ఆఫీసు వర్గాలు ఆయనను 'వీ చాట్’ టెక్నికల్ వర్క్ గ్రూప్‌లో యాడ్ చేసి, వర్క్ అప్పగించాయి. గావో మరణించిన రోజున కూడా ఆయన ఐదు సార్లు కంపెనీ సిస్టమ్‌లోకి లాగిన్ అయినట్లు డేటా ద్వారా తెలుస్తోంది. ఈ వ్యవహారం దరిమిలా సంస్థ పని తీరు, అమానవీయ వైఖరిపై తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.గావో మృతికి పనిభారమే కారణమని ఆయన భార్య యాంగ్ ఆరోపించారు. డిపార్ట్మెంట్లో సిబ్బంది కొరత కారణంగా, ఆరుగురు చేసే పనిని గావో ఒక్కడే చేయాల్సి వచ్చేదని ఆమె వాపోయారు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్తో పాటు సేల్స్, మేనేజ్మెంట్ బాధ్యతలు కూడా ఆయనపై ఉండేవని, రాత్రి 11 గంటల వరకు పనిచేయడం సర్వసాధారణమైపోయిందని ఆమె తెలిపారు. ఈ ఘటనపై ‘వర్క్-రిలేటెడ్ ఇంజ్యూరీ’ (పని సంబంధిత గాయం) కింద కేసు నమోదు చేసి, సంబంధిత అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: 40 ఏళ్లకే రిటైర్మెంట్? వణికిస్తున్న ‘లే-ఆఫ్’లు -
నోయిడా టెక్కీ ఆఖరి క్షణాలు.. వీడియోలో ఏముందంటే..!
నోయిడా: కారుతో సహా నీటి గుంతలో పడి మరణించిన నోయిడాకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ చివరి క్షణాలకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో సహాయక బృందాలు గాలిస్తున్న దృశ్యాలతో పాటు.. దట్టమైన మంచులో నీటిపై ఆ వ్యక్తి తన ఫోన్ టార్చ్ లైట్ ఆన్ చేసి ఉంచిన వెలుగు కనిపిస్తోంది. రక్షణ సిబ్బంది అతడిని కంగారు పడొద్దంటూ ధైర్యం చెబుతున్న మాటలు కూడా వీడియోలో వినిపించాయి. జనవరి 16 రాత్రి 27 ఏళ్ల యువరాజ్ మెహతా ప్రాణాలు కోల్పోగా.. ఈ ఘటనపై దర్యాప్తు సాగుతోంది. ఈ క్రమంలో ఈ వీడియో బయటకొచ్చింది.గురుగ్రామ్‌లో సాప్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న యువరాజ్ మెహతా... ఇంటికి తన కారులో తిరిగి వస్తుండగా నోయిడాలోని సెక్టార్-150లో నిర్మాణ స్థలం దగ్గర తవ్విన లోతైన గోతిలో కారు పడిపోయింది. అతను దాదాపు రెండు గంటల పాటు సహాయం కోసం అభ్యర్థించాడు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మంచు కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతూ రక్షణ చర్యలు చేపట్టినప్పటికీ ఫలితం లేకపోయింది. యువరాజ్ తండ్రి రాజ్‌కుమార్ మెహతా కూడా ఘటన స్థలంలోనే ఉన్నారు. మూడు రోజుల తర్వాత మంగళవారం సాయంత్రం కారును బయటకు తీశారు.Another saddening video of 27 year old techie shows mediocre efforts by specialised authorities ultimately leading to his death in Noida's Sector 150.PS: The white dot you see in this video is the flashlight from victim Yuvraj Mehta's phone seeking help! pic.twitter.com/2OT0NR5RG6— Harsh Trivedi (@harshtrivediii) January 22, 2026లోటస్ గ్రీన్స్ కన్స్ట్రక్షన్, ఎం.జెడ్ విజ్‌టౌన్ ప్లానర్స్ సంస్థలకు చెందిన ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పర్యావరణ నిబంధనల ఉల్లంఘన, ఆ నీటి గోతి వల్ల జరిగిన మరణానికి వీరిని బాధ్యులను చేస్తూ కేసు నమోదైంది. 2014లో కొనుగోలు చేసిన ఈ ప్లాట్‌లో భారీ యంత్రాలతో గోతిని తవ్వి, ఏళ్ల తరబడి నీటితో అలాగే వదిలేశారు. దీంతో నీటితో నిండిపోయి చెరువులా మారింది. బురద నీరు, చెత్తాచెదారంతో కలుషితమైంది. ఎం.జెడ్ విజ్‌టౌన్ ప్లానర్స్ డైరెక్టర్ అభయ్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ప్రస్తుతం ఈ కేసును విచారిస్తోంది. -
ఏఐ వాడకుంటే ‘ఫెయిల్’.. టెక్కీ ఇంటర్వ్యూ వైరల్
ఏఐ వినియోగం ఇప్పుడు అన్ని రంగాలకూ విస్తరించింది. మొన్నటి వరకూ ఫోను లేకుంటే ఏ పనీ జరగదనేవారు.. ఇప్పుడు ఏఐ సాయం లేకపోతే అంతా శూన్యమే అంటున్నారు. ఏఐ వినియోగించకపోవడంతో ఇంటర్య్యూలో ఫెయిలయిన ఒక యువకుని ఉదంతం ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా విజయం సాధించాలంటే కేవలం కోడింగ్ వస్తే సరిపోదని, కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం ఇప్పుడు తప్పనిసరి అని ఆకాష్ విశాల్ హజారికాకు ఎదురైన అనుభవం స్పష్టం చేస్తోంది.గూగుల్, అమెజాన్, స్ప్లంక్, సేల్స్‌ఫోర్స్ తదితర దిగ్గజ సంస్థలలో ఎనిమిదేళ్ల అనుభవం కలిగిన సీనియర్ ఇంజనీర్ ఆకాష్ విశాల్ ప్రస్తుత టెక్ ప్రపంచంలో చోటుచేసుకున్న మార్పులను వివరించారు. ఏఐ అనేది ఇప్పుడు ఒక ఐచ్ఛికం కాదని, డెవలప్మెంట్ను వేగవంతం చేయడానికి, కోడింగ్ పనులను తగ్గించడానికి, నాణ్యతను పెంచడానికి ఇంజనీర్లు ఏఐని వాడాలని కంపెనీలు ఆశిస్తున్నాయని ఆయన వివరించారు.ఈ నూతన మార్పుల కారణంగా ఇంజనీర్లు సిస్టమ్ డిజైన్, క్లిష్టమైన బిజినెస్ లాజిక్‌పై అధికంగా దృష్టి పెట్టగలుగుతారని ఆయన తెలిపారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు సన్నద్ధమవడం అనేది ఐదేళ్ల క్రితం నాటి పరిస్థితులతో పోలిస్తే పూర్తిగా మారిపోయిందని ఆయన ‘ఎన్డీటీవీ’తో అన్నారు. 2020లో డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్, సిస్టమ్ డిజైన్‌లో పట్టు ఉంటే అభ్యర్థులు సులభంగా ఉద్యోగాలు సాధించేవారు. కానీ నేడు ఆ నైపుణ్యాలను కేవలం కనీస అర్హతగా మాత్రమే పరిగణిస్తున్నారన్నారు. ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్, క్లౌడ్ నైపుణ్యాలతో పాటు, ‘ప్రాంప్ట్ ఇంజనీరింగ్’ ఏఐ సహాయంతో డీబగ్గింగ్ చేయడం వంటి కొత్త నైపుణ్యాలు అత్యవసరంగా మారాయని ఆకాష్ విశాల్ తెలిపారు.ఏ పరిస్థితుల్లో సంప్రదాయ పద్ధతులు వాడాలి? ఎప్పుడు ఏఐని సిస్టమ్స్‌తో అనుసంధానించాలి అనే అవగాహన ఉన్న అభ్యర్థులకే కంపెనీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇంటర్వ్యూల తీరులో కూడా భారీ మార్పులు వచ్చాయంటూ, ఆయన తన సొంత అనుభవాన్ని పంచుకున్నారు. సిలికాన్ వ్యాలీకి చెందిన ఒక స్టార్టప్ కంపెనీ 2024లో నిర్వహించిన ఇంటర్వ్యూలో, ఒక పెద్ద కోడ్‌బేస్‌ను డీబగ్ చేయడానికి ఆయనకు అవకాశం ఇచ్చింది. ఆ సమయంలో ఏఐ టూల్స్ వాడుకోవచ్చని కంపెనీ సూచన చేసింది. అయితే ఆయన సొంత నైపుణ్యంతోనే చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఏఐని ఉపయోగించుకోకపోవడం కారణంగానే తాను ఆ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యానని, అది తనకు ఒక మేల్కొలుపులా మారిందని అని ఆయన తెలిపారు.ఇప్పుడు చాలా కంపెనీలు లైవ్ కోడింగ్ సెషన్లలో అభ్యర్థులు ఏఐని ఎంత సమర్థవంతంగా వాడుతున్నారో కూడా గమనిస్తున్నాయని ఆకాష్ విశాల్ తెలిపారు. ప్రస్తుతం సిస్టమ్ డిజైన్ ఇంటర్వ్యూలలో ఏఐ ఇంటిగ్రేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్, మోడల్ లైఫ్‌సైకిల్ మేనేజ్మెంట్పై ప్రశ్నలు అడుగుతున్నారని తెలిపారు. కేవలం సాంకేతిక నైపుణ్యాలే కాకుండా, ఏఐని ఎంత బాధ్యతాయుతంగా వాడుతున్నారో, ఆటోమేషన్, మానవ పర్యవేక్షణ మధ్య సమతుల్యతను ఎలా పాటిస్తున్నారో కూడా బిహేవియరల్ ఇంటర్వ్యూలలో పరీక్షిస్తున్నారని ఆయన తెలిపారు.ఇది కూడా చదవండి: ‘పైలట్లపైకి తోసేస్తారా?’.. అమెరికా సంస్థ ఆగ్రహం -
నోయిడా టెకీ విషాదం : కీలక పరిణామం
న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్ నోయిడాలో ఒక నిర్మాణ స్థలంలో ఉన్న నీటి గుంత ప్రమాదంలో యువ ఇంజినీర్ ప్రాణాలు కోల్పోయిన ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరణానికి కారణంగా భావిస్తున్న కంపెనీ యజమానుల్లో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశాడు. నిర్మాణ పనుల కోసం తవ్విన, నీటితో నిండి ఉన్న గుంతలో తన ఎస్యూవీ వాహనం పడిపోవడంతో 27 ఏళ్ల యువరాజ్ మెహతా మృతికి సంబంధించి ఒక బిల్డర్‌ను అరెస్టు చేశారు. విష్‌టౌన్ ప్లానర్స్ ప్రైవేట్ లిమిటెడ్ యజమానులలో ఒకరైన అభయ్ కుమార్‌ను అరెస్టు చేశామని, మరో యజమాని మనీష్ కుమార్ కోసం గాలిస్తున్నామని నోయిడా పోలీసులు మంగళవారం ప్రకటించారు. కాగా గురుగ్రాంలోని ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న యువరాజ్ మోహతా విధినిర్వహణ తరువాత ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో నోయిడాలోని సెక్టార్-150లోని ఏటీఎస్ లే గ్రాండియోస్ కూడలి వద్ద ప్రమాదవశాత్తు కారు అదుపుతప్పి ఓ గోడను ఢీకొట్టి, పక్కనే ఉన్న నీటి గుంతలో పడిపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ సమయంలో సహాయక చర్యలు కూడా సకాలంలో అందలేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి -
అదే జరిగి ఉంటే..? నోయిడా టెక్కీ ప్రాణాలతో ఉండేవాడేమో!
నోయిడాలో సెక్టార్-150లో నీటితో నిండిన గోతిలో పడి సాఫ్ట్వేర్ ఇంజనీర్ యువరాజ్ మెహతా మరణించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాద ఘటనలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ గోతిలో నీరు చేరకుండా అడ్డుకట్ట వేసేందుకు ప్రాజెక్టు అవసరమని ఉత్తరప్రదేశ్ నీటిపారుదల శాఖ మూడేళ్ల క్రితమే నోయిడా అథారిటీకి లేఖ రాసింది. కానీ.. ఆ లేఖ ఫైళ్లలోనే మరుగునపడిపోయింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. చివరకు గత శుక్రవారం రాత్రి యువరాజ్‌ను ఆ నీటి గుంత బలితీసుకుంది.పీటీఐ కథనం ప్రకారం.. 2023లో యూపీ నీటిపారుదల శాఖ నోయిడా అథారిటీకి ఒక అధికారిక లేఖ పంపింది. వర్షపు, డ్రైనేజీ నీరు నిల్వ ఉండకుండా, దానిని హిండన్ నదిలోకి మళ్లించడానికి అక్కడ 'హెడ్ రెగ్యులేటర్లు' ఏర్పాటు చేయాలని సూచించింది. ఇందుకోసం బడ్జెట్ కేటాయింపులు కూడా జరిగాయి. కానీ, ఆ లేఖపై నోయిడా అథారిటీ ఎలాంటి చర్య తీసుకోలేదు. దీనిపై అడిగితే తమకు అలాంటి లేఖ ఏదీ అందలేదని ఒక అధికారి పీటీఐకి తెలిపాడు.గత శుక్రవారం(జనవరి 23) రాత్రి యువరాజ్ గురుగ్రామ్‌లోని తన ఆఫీసు నుంచి కారులో నోయిడా సెక్టార్ 150లోని ఇంటికి వస్తున్నాడు. ఇంటికి కిలోమీటర్ దూరంలో ఉండగా, మంచు కారణంగా దారి సరిగ్గా కనిపించకపోవడంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన లోతైన గోతిలో పడిపోయింది. ఆ గొయ్యి కేవలం వర్షపు నీటితోనే కాకుండా, సమీపంలోని నివాస ప్రాంతాల డ్రైనేజీ నీటితో నిండిపోయి ఉంది.కారు గోతిలో పడగానే యువరాజ్ తన తండ్రికి ఫోన్ చేశాడు. సాయం కోసం అభ్యర్థించాడు. వెంటనే తండ్రి పోలీసులుకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది వచ్చినా దట్టమైన మంచు కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. యువరాజ్ తన ఫోన్ టార్చ్ వెలిగించి సుమారు 90 నిమిషాల పాటు (అర్ధరాత్రి 1.30 గంటల వరకు) సహాయం కోసం కేకలు వేశాడని, ఆ తర్వాతే మునిగిపోయాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. తెల్లవారుజామున 4.30 గంటలకు అతని మృతదేహం లభ్యమైంది.ఈ ఘటనపై యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా స్పందించింది. దీనిపై విచారణకు ముగ్గురు సభ్యుల సిట్ బృందాన్ని నియమించింది. నిర్లక్ష్యం వహించినందుకు నోయిడా అథారిటీ సీఈఓను బదిలీ చేసి వెయిటింగ్ లిస్టులో పెట్టింది. కాగా, యువరాజ్ తండ్రి ఫిర్యాదు మేరకు విష్‌టౌన్ ప్లానర్స్, లోటస్ గ్రీన్స్ సంస్థలపై కేసు నమోదైంది. అయితే, లోటస్ గ్రీన్స్ ఈ ఘటనతో తమకు సంబంధం లేదని పేర్కొంది. తాము ఆ స్థలాన్ని 2019-20లోనే 'గృహప్రవేశ్ గ్రూప్'కు బదిలీ చేశామని, వారే బేస్మెంట్ పనులు మొదలుపెట్టి మధ్యలో ఆపేశారని క్లారిటీ ఇచ్చింది. అక్కడ కనీసం బారికేడ్లు గానీ, వెలుతురునిచ్చే రిఫ్లెక్టర్లు గానీ లేవని.. తన కుమారుడిలా మరెవరూ ప్రాణాలు కోల్పోకూడదంటూ యువరాజ్ తండ్రి కన్నీరుమున్నీరవుతున్నారు. -
రూ.2.7 కోట్ల జీతం.. జాబ్ వదిలేసిన 22 ఏళ్ల యువకుడు.. ఎందుకంటే..
ప్రస్తుతం ఉన్న జాబ్ మార్కెట్లో రూ.కోట్లలో జీతం అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ, ఆ భారీ జీతం వెనుక ఉన్న పని ఒత్తిడి వ్యక్తి ప్రాథమిక స్వేచ్ఛను, సంతోషాన్ని హరిస్తే? సరిగ్గా ఇదే ఆలోచనతో, న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న క్లూలీ (Kluly) అనే ఏఐ స్టార్టప్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ (CMO) డేనియల్ మిన్ తన పదవికి రాజీనామా చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఏడాదికి ఏకంగా 3 లక్షల డాలర్లు (సుమారు రూ.2.7 కోట్లు) వేతనం ఉన్న కొలువును వదులుకుని ఆయన కంపెనీ నుంచి బయటకు వచ్చేశారు.చిన్న వయస్సులోనే..ప్రఖ్యాత వార్టన్ స్కూల్ నుంచి మార్కెటింగ్, ఆపరేషన్స్ మేనేజ్మెంట్లో డిగ్రీ పూర్తి చేసిన డేనియల్ మిన్ మే 2025లో తన 21వ ఏటనే క్లూలీలో చేరారు. మిన్ తన ప్రతిభతో తక్కువ కాలంలోనే కీలక బాధ్యతలు చేపట్టారు. అయితే, ఆ విజయం వెనుక ఉన్న శ్రమ క్రమంగా అతని మానసిక స్థితిపై ప్రభావం చూపడం మొదలైందని తాను చెప్పారు.రాజీనామా అనంతరం తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోను షేర్ చేస్తూ మిన్ తన మనసులో మాటను పంచుకున్నారు. ‘కెరీర్ ప్రారంభంలో రోజుకు 12 గంటలు కష్టపడటం సహజమని నేను భావించాను. కానీ, కాలక్రమేణా ఆ ‘గ్రైండ్’(నిరంతర పని) నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. నా స్నేహితులతో కలిసి డిన్నర్ చేయడం లేదా నా సోదరుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం వంటి చిన్న చిన్న సంతోషాలను కూడా నేను కోల్పోయాను’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు ఎంతో ఉత్సాహంగా అనిపించిన పని, క్రమేణా భారంగా మారిందని, పని కాకుండా అసలు వేరే జీవితమే లేకుండా పోయిందని వెల్లడించారు.సీఈఓ ముందే..కంపెనీ సీఈఓ రాయ్ లీ తన పనితీరును గమనించి రాజీనామా గురించి అడిగినప్పుడు డేనియల్ మిన్ తన భావోద్వేగాలను దాచుకోలేకపోయారు. తన రాజీనామా నిర్ణయాన్ని చెబుతూ ఆయన సీఈఓ ముందే కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే, రాయ్ లీ ఎంతో సానుభూతితో స్పందించారని, ఉద్యోగం కంటే వ్యక్తిగత సంతోషమే ముఖ్యమని తనను ప్రోత్సహించారని మిన్ తెలిపారు. ‘తమ ఉద్యోగుల శ్రేయస్సును కోరుకునే ఇలాంటి బాస్ దొరకడం అదృష్టం’ అన్నారు.సోషల్ మీడియా స్పందనడబ్బు కంటే మానసిక ప్రశాంతత ముఖ్యం అని భావించి డేనియల్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ‘గ్రైండ్ కల్చర్ పేరుతో యువతను శ్రమదోపిడీకి గురిచేయడం సరికాదు’ అని కొందరు కామెంట్ చేశారు. ‘మీ నిజాయితీకి హ్యాట్సాఫ్’ అంటూ కొందరు కామెంట్లతో మద్దతు తెలుపుతున్నారు. మొత్తానికి, కెరీర్ ప్రారంభంలోనే భారీ ప్యాకేజీని వదులుకుని డేనియల్ మిన్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం కార్పొరేట్ ప్రపంచంలో వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌పై మరోసారి చర్చకు దారితీసింది.ఇదీ చదవండి: ముగిసిన ‘వైట్ కాలర్’ స్వర్ణయుగం -
షాకింగ్ ట్విస్ట్: కోరిక తీర్చలేదన్న కోపంతోనే..
ఇంటర్నెట్లో బూతు సినిమాలు, సోషల్ మీడియా ప్రభావంతో ఓ టీనేజర్ ఘాతుకానికి పాల్పడ్డాడు. చాలారోజులుగా ఆమెపై ఓ కన్నేసి ఉంచిన ఆ కామాంధుడు.. అదను చూసి ఆమెపై విరుచుకుపడ్డాడు. ప్రతిఘటించడంతో ఆ కోపంలో ఆమెను అత్యంత కిరాతకంగా చంపాడు. వారం కిందట ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయిందని భావిస్తున్న టెక్కీ షర్మిల(36) కేసులో ఈ షాకింగ్ ట్విస్ట్ బయటపడింది.రామమూర్తి నగర్‌లోని సుబ్రమణి లే అవుట్‌లోని ఓ అపార్ట్మెంట్ ప్లాట్‌లో జనవరి 3న అగ్నిప్రమాదం జరిగింది. ఆ ఘటనలో షర్మిల(36) అనే యువతి చనిపోయింది. షార్ట్ సర్క్యూట్‌తో ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఉండొచ్చని.. మంటలు చెలరేగడంతో ఊపిరాడకే ఆమె మరణించినట్లు తొలుత అంతా భావించారు. అయితే.. పోలీసులకు మాత్రం అనుమానం వచ్చింది. అందుకే బీఎన్ఎస్ (BNSS) సెక్షన్ 194(3)(iv) కింద అసహజ మరణం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే..ఆ ఎవిడెన్స్‌తో..దర్యాప్తులో భాగంగా సైంటిఫిక్ మెథడ్స్, టెక్నాలజీని ఉపయోగించి కీలక ఆధారాలు సేకరించారు. ఎలాంటి షార్ట్ సర్క్యూట్ జరిగిన ఆనవాళ్లు లేవని.. ఆమె ఊపిరి ఆడకే చనిపోయిందని.. అయితే అది హత్యే అని నిర్ధారించుకున్నారు. ఈ క్రమంలో ఆమె పక్కింట్లోనే ఉండే కర్నాల్ కురై(18) కదలికలపై నిఘా వేశారు. చివరకు.. అతనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించారు.ఆరోజు ఏం జరిగిందంటే.. కొడగు జిల్లా విరాజ్పేట్కు చెందిన కర్నాల్ తన తల్లితో కలిసి సుబ్రమణి లే అవుట్‌లోని సంకల్ప నిలయలో అద్దెకు ఉంటున్నాడు. ఇంటర్ చదివే ఈ కుర్రాడు.. నీలి చిత్రాలకు, సోషల్ మీడియాకు బానిస అయ్యాడు. ఈ క్రమంలో పక్క ఇంట్లోనే ఉంటున్న షర్మిల, ఆమె రూమ్మేట్లపై కన్నేశాడు. తన తల్లి ద్వారా వాళ్లతో పరిచయం చేసుకునే ప్రయత్నాలు చేశాడు. దక్షిణ కన్నడకు చెందిన షర్మిలకు ఇంకా పెళ్లి కాలేదు. ఓ ప్రముఖ కంపెనీలో జాబ్ చేస్తూ కొలీగ్‌తో ఉంటోంది. ఆమె రూమ్మేట్ రెండు నెలల కిందట స్వస్థలం అసోంకి వెళ్లింది. దీంతో షర్మిల ఒక్కతే ఉంటుందని గుర్తించాడు.ఘటన జరిగిన రోజు రాత్రి.. స్లైడింగ్ కిటికీ(పక్కకు జరిగే కిటికీ) గుండా లోపలికి చొరబడ్డాడు కర్నాల్. తన కోరిక తీర్చాలని బతిమిలాడాడు. ఆమె తిరస్కరించడంతో బలాత్కారం చేయబోయాడు. అయితే ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. అరుస్తుందేమోనన్న భయంతో.. నోరు, ముక్కు మూసి స్పృహ కోల్పోయేలా చేశాడు. ఆ పెనుగులాటలో ఆమెకు గాయాలై.. తీవ్ర రక్తస్రావం అయ్యింది కూడా. ఆపై భయంతో పారిపోయే ప్రయత్నం చేశాడు. ఆ షాక్ నుంచి తేరుకుని ఆమె బట్టలు, నేరానికి కారణమైన వస్తువులను బెడ్‌పై ఉంచి వాటికి నిప్పంటించి, ఆమె మొబైల్ ను తీసుకుని పారిపోయాడు. చేసిన నేరాన్ని కర్నాల్ ఒప్పుకోవడంతో అతనిపై బీఎన్ఎస్ 103(1), 64 (2), 66, 238 కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. -
16 అంతస్తుల బిల్డింగ్‌పైనుంచి పడి టెకీ దుర్మరణం
బెంగళూరులో భవనం 16వ అంతస్తు నుంచి పడి టెకీ (26) దుర్మరణం పాలయ్యాడు. విదేశాల్లో విద్య పూర్తి చేసుకొని వచ్చి, ఉద్యోగాన్వేషణలో ఉండగా ఈ విషాదం చోటు చేసకుంది.ఐరోపాలో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్‌లో తన విద్యను పూర్తిచేసిన నిక్షప్ ఇటీవలే ఇండియాకు తిరిగి వచ్చాడు. బెంగళూరులోని శెట్టిహళ్లిలోని ప్రిన్స్ టౌన్ అపార్ట్మెంట్స్ భవనం 16వ అంతస్తు నుండి పడి మరణించాడు. కొన్ని రోజులుగా హసరఘట్టలోని గౌడియ మఠంలో ఉంటున్నట్టు సమాచారం.బుధవారమే తన తల్లిదండ్రులు కిషోర్, జయశ్రీల వద్దకు వచ్చాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై గలగుంటె పోలీస్ స్టేషన్ అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. అయితే మృతుడు గత కొన్నేళ్లుగా గా స్కిజోఫ్రెనియాతో బాధపడుతున్నాడని తండ్రి పోలీసులకు తెలిపారు. మరణానికి దారితీసిన పరిస్థితులపై తాము దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు -
ఇంట్లో మంటలు.. మహిళా టెక్కీ మృతి
బెంగళూరు: అనుమానాస్పదంగా మహిళా టెక్కీ మృతిచెందిన ఘటన ఈ నెల 3 తేదీన రామమూర్తినగర పోలీస్‌స్టేషన్ పరిధిలోని సుబ్రమణ్య లేఔట్లో జరిగింది. మృతురాలు శర్మిలా (34) ఇంట్లో శవమై తేలింది. వివరాలు.. మంగళూరుకు చెందిన శర్మిలా గత ఏడాది నుంచి బెంగళూరులో ఓ కంపెనీలో టెక్కీగా పనిచేస్తోంది. 3వ తేదీ రాత్రి 10.30 సమయంలో ఆమె ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఇంటి యజమాని విజయేంద్ర చూసి రామమూర్తినగర పోలీసులకు సమాచారం అందించారు. వారు చేరుకుని తలుపులు బద్ధలుకొట్టి ఇంట్లోకి వెళ్లి పరిశీలించారు. సోఫా, తెరలు, బెడ్షీట్లు కాలిపోగా శర్మిలా స్పృహ కోల్పోయినట్లు కనబడింది. మంటలు అదుపుచేసిన పోలీసులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు చనిపోయిందని తెలిపారు. అగ్నిప్రమాదం ఎలా జరిగింది, ఆమె మృతికి కారణాలపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. -
జస్ట్ రెండేళ్లకే ఏడాదికి రూ. 12 లక్షల నుంచి రూ. 24 లక్షల అధిక వేతనం..! కానీ..
ఒక సాధారణ కాలేజీలో చదివిన అబ్బాయి..అంచెలంచెలుగా ఎదుగుతూ..ఐఐటీ రేంజ్లో స్టూడెంట్ రేంజ్లో వేతనం అందుకున్నాడు. అది కూడా..జస్ట్ రెండేళ్లలో అత్యున్నత వేతనం అందుకునే రేంజ్‌కి చేరి.. ఓ విద్యార్థి చదువుతుండగానే జాబ్ కెరీర్‌ని ఎలా నిర్మించుకోవాలో చూపించి.. యువతరానికి స్ఫూర్తిగా నిలిచాడు. ఆర్థిక పరిస్థితులు సహకరించక ఓ సాధారణ చిన్నకాలేజ్లో చదివి..ఉద్యోగం సంపాదించలేకపోయా అని సాకులు చెప్పేవాళ్లుకు అతడి కథ ఓ చెంపపెట్టు..మరి అతడి స్ఫూర్తిదాయకమైన స్టోరీ ఏంటో చకచక చదివేద్దామా..!.రెడ్డిట్‌లో ఒక యువ సాఫ్ట్వేర్ డెవలపర్ తన స్టోరీని షేర్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. ప్రేరణ కలిగించే అతడి స్టోరీ..అందరి దృష్టిని అమితంగా ఆకర్షించడమే కాదు ఇది కథ సక్సెస్ అని కితాబిచ్చేస్తున్నారు నెటిజన్లు. ఆ పోస్ట్‌లో తాను ఓ సాధారణ స్థానిక ఇంజనీరింగ్ కాలేజ్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యేయట్ చేశానని చెప్పుకొచ్చాడు. అయితే తాను కాలేజ్‌లో చదువుతున్నప్పుడే పనిచేయడం ప్రారంభించానని, మూడో ఏడాదిలోనే..ఒక స్టార్టప్‌లో ఎస్డీఈ ఇంటర్న్‌గా చేరి నెలకు రూ. 25 వేలు వరకు సంపాదించనని చెప్పాడు. జస్ట్ ఐదునెలలకే అతడి జీతం రూ. 35 వేలుకి పెరిగింది. ఆ తర్వాత చివరి ఏడాదిలో ఆ టెకీ నెలకు రూ. 45 వేల స్టైఫండ్‌తో మరో స్టార్టప్‌లో ఇంటర్న్‌గా చేరినట్లు తెలిపాడు. ఆరు నెలలకు ఏడాదికి రూ. 12 లక్షల వేతనంతో పర్మినెంట్ ఉద్యోగం ఆఫర్ అందుకున్నట్లు తెలిపాడు. చివరికి ఆ జీతం కూడా ఆ ఏడాదిలోపే రూ. 18 లక్షలకు మేర పెంచినట్లు పేర్కొన్నాడు. ఆ తదుపరి అప్రైజల్ తర్వాత తన జీతం ఏడాదికి రూ. 24 లక్షలకు చేరిందని వెల్లడించాడు. అయితే తాను ఇంటర్న్‌షిప్ సమయంలో ఒక్కసారి మాత్రమే కంపెనీని మారినట్లు తెలిపాడు. ర్యాపిడ్ రేంజ్లో వృద్ధిలో వచ్చినా..ఎందుకో తనలో అసంతృప్తి వెంటాడుతోందంటూ తన రెడ్డిట్ పోస్ట్‌లో రాసుకొచ్చాడు. అంతేగాదు తన కెరీర్ మరింత ఉత్సాహభరితంగా కొనసాగాలంటే ఏం చేయాలో సూచించండి ప్లీజ్ అంటూ సలహా కూడా కోరాడు. అలాగే ఆ పోస్ట్‌లో ఆ టెకీ తాను ఇంటర్న్‌షిప్‌లలో ఎలా అధిక వేతనం అందుకోగలిగాడో కూడా షేర్ చేసుకున్నాడు. ప్రారంభదశ స్టార్టప్‌ల వ్యవస్థాపకులకు నిధులు సమీకరించేందుకు నేరుగా మెసేజ్‌లు పంపేవాడిని. అలాగే స్టార్టప్‌కి సంబంధించిన వార్తల సాయంతో కొత్తస్టార్టప్లను ట్రాక్ చేసి..తన రెజ్యుమ్‌లో తాను కోరుకుంటున్న జాబ్ గురించి వివరాలను పొందుపరిచేవాడిని..దాంతో తనకు సులభంగా మంచి స్టార్ట్ప్లలో ఉద్యోగం దక్కించుకునేందుకు హెల్ప్ అయ్యిందన్నాడు ఈ పోస్ట్ చాలామంది నెటిజన్లను ఆకర్షించడమే కాదు..ఓ సాధారణ కాలేజ్ నుంచి ఈ రేంజ్లో వేతనం అందుకోవడం అంటే మాటలు కాదంటూ ప్రశంసించడమే కాదు..తాము కూడా ఆ మార్గంలోనే పయనిస్తామంటూ పోస్టులు పెట్టారు. ఇతడి కథ చూస్తుంటే సూపర్ స్టార్ మహేష్ మూవీలోని డైలాగ్ గుర్తొస్తుంది. ఈ టెకీని ఏ కాలేజ్‌లో చదివాం అన్నది కాదు..లక్షల్లో వేతనం అందుకున్నమా లేదా అన్నది మేటర్ అనొచ్చు కదూ.. -
భార్య హత్యకు గన్ ఫైరింగ్‌లో శిక్షణ
బెంగళూరు: బసవేశ్వర నగరలో గతనెల 24న చోటు చేసుకున్న బ్యాంక్ మహిళా ఉద్యోగి భువనేశ్వరి హత్య కేసు దర్యాప్తులో కొత్త అంశం వెలుగు చూసింది. భార్యను పిస్తోలుతో కాల్చేందుకు భర్త బాలమురుగన్ బిహార్‌లో 15 రోజుల పాటు శిక్షణ తీసుకున్నట్లు మాగడిరోడ్డు పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. బాలమురుగన్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేసేవాడు. దంపతుల మధ్య విభేదాలు రావడంతో భువనేశ్వరి తన పిల్లలతో కలిసి వేరే ఇంట్లో నివాసం ఉంటోంది. భార్యను హత్య చేయాలని భావించిన బాలమురుగన్ బిహార్‌కు వెళ్లి అక్కడ ఓ వ్యక్తితో రూ.50 వేలకు పిస్తోల్ కొనుగోలు చేసి 15 రోజుల పాటు అక్కడే మకాం పెట్టి గన్ ఫైరింగ్‌పై శిక్షణ తీసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. గతంలో తమిళనాడుకు చెందిన వ్యక్తికి భార్య హత్యకు రూ.1.25 లక్షలు సుపారీ ఇచ్చాడు. అయితే సుపారీ కిల్లర్ ఆమెను హత్యచేయకుండా వెనక్కి వచ్చేశాడు. దీంతో బాలమురుగన్ గతనెల 24 తేదీన నడిరోడ్డులో భార్యపై పిస్తోల్‌తో కాల్పులు జరిపి హత్య చేశాడు. -
స్మోకింగ్ కంటే దారుణం ఉద్యోగం? ఏం చేయాలి?
ఐటీ,కార్పొరేట్ ఉద్యోగం అంటే ఒత్తిడితో కూడుకున్నది అని చాలామంది వాపోతూ ఉంటారు. తాజాగా ఒక టెక్ ఉద్యోగి సోషల్ మీడియా వేదికగా తన ఆరోగ్యంపై వెల్లడించిన సంగతి నెట్టింట వైరల్ అవుతోంది. తన ఉద్యోగ జీవితంలో ఒత్తిడి చాలా ప్రమాదకరంగా మారిపోయిందని, దీంతో తనకు విశ్రాంతి అవసరమని వైద్యులు హెచ్చరించారని పేర్కొన్నాడు.వర్క్‌ప్లేస్ చర్చా యాప్ ‘బ్లైండ్’ లో ఒక పోస్ట్ ద్వారా ఓ టెక్నీషియన్ తన గోడును వెళ్లబోసుకున్నాడు. తన జీవితంలో ఉద్యోగ ఒత్తిడి, ధూమపానం కంటే ప్రమాద కరమని డాక్టర్ హెచ్చరించారని పేర్కొన్నాడు. ఆరోగ్యాన్నికాపాడు కోవాలంటే విశ్రాంతి అవసరమని చెప్పారంటూ తన అనుభవాన్ని పంచు కున్నాడు.గత ఐదేళ్లుగా ఒకే వైద్యుడిని సందర్శిస్తున్నట్లు పంచుకున్నారు. ఈ కాలంలో ఆయన పర్యవేక్షణలోనే ఒత్తిడి నియంత్రణకు మందులు వాడుతున్నానని చెప్పాడు. అయినా బరువు పెరగడం, జీర్ణవ్యవస్థ సమస్యలతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు గుర్తించారనీ,, ఉద్యోగ ప్రభావం తన శరీరంపై తీవ్రంగా కనిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారట వైద్యుడు. .ఉదయం వేళల్లో గుండె వేగంగా కొట్టుకోవడం జరగబోయే చెడుకు సంకేమతని, ఒత్తిడి దూరంగా ఉంటూ, విశ్రాంతి తీసుకోవాలని సూచించారని పేర్కొన్నాడు. అలాగే 40 ఏళ్ల వయసులో గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్ హెచ్చరించారని, ఆర్థికంగా వెసులుబాటు ఉంటే, ఉద్యోగం నుంచి విరామం తీసుకోవాలని సలహా ఇచ్చారన్నాడు. అయితే తనకు రెండు నెలల కంటే ఎక్కువ రోజులు ఉద్యోగం లేకుండా గడవడం కష్టమని, ఇలాంటి సలహా మీకెవరినైనా డాక్టర్ ఇచ్చారా? లేదంటే తాను మరో డాక్టర్ని సంప్రదించడం మంచిదా అని నెటిజనులను ప్రశ్నించాడు. నెటిజనుల స్పందనదీనికి కామెంట్లు వెల్లువెత్తాయి. చాలా మంది వినియోగదారులు బర్న్అవుట్ , నాది కూడా ఇలాంటి పరిస్థితే అంటూ తమ అనుభవాలను పంచుకున్నారు. వరస్ట్ వర్క్‌లైఫ్ బ్యాలెన్స్, టాక్సిక్ సహోదోగ్యులు, ఆఫీసు రాజకీయాలు, మేనేజ్మెంట్ ఒత్తిడి వీటినుంచి బైట పడటానికి 3 - 4 నెలలు పట్టింది. దాదాపు 6 నెలల తర్వాత కానీ మనిషిని కాలేపోయాను. కనుక ఆరోగ్యం కంటే విలువైందీ, ముఖ్యమైందీ ఏదీ లేదని ఒకరు సలహా ఇచ్చా 45 ఏళ్లు ఒకే కంపెనీలో గాడిద చాకిరీ చేశారు, కాని రిటైర్ అయిన వారానికే గుండెపోటుతో చనిపోయాంటూ తన తండ్రి అనుభవాన్ని మరొకరు షేర్ చేశారు. ఆయన మానసిక ఆరోగ్యం పూర్తిగా నాశనం అయిందన్నారు.ప్రతిరోజూ జాబ్ ఒత్తిడితో బాధపడుతూ డబ్బు / కెరీర్ అంటూ కాలయాపన వద్దు. విరామం తీసుకొని, మంచి జీవితాన్ని ఇచ్చే మరో కంపెనీలో చేరాలని మరొకరు సూచించారు. మీ డాక్టర్ సూపర్‌బాస్..కొత్త ఉద్యోగం వెతుక్కోవాల్సిన సమయం వచ్చిందని ఒకరు కామెంట్ చేశారు. ఇదీ చదవండి: ఎయిరిండియా పైలట్ నిర్వాకం, ఆందోళనలో ప్రయాణికులుకాగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా అవసరం. తీవ్ర ఒత్తిడి శరీరంపై అనేక దుష్ప్రభావాలను చూపిస్తుందని ఇప్పటికే పలు అధ్యయనాల్లో తేలింది. ఒత్తిడి మానసిక ఆరోగ్యం, నైపుణ్యం దెబ్బతింటుంది. ఆకలి పెరగడం లేదా మందగించడం, గుండెపోటు, బరువు పెరగడం లాంటి వాటితోపాటు, రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే కార్టిసాల్, అడ్రినలిన్ వంటి హార్మోన్లు అధిక విడుదలకు కారణం ఒత్తిడి. -
హాస్టల్లో గ్యాస్ సిలిండర్ పేలి, బళ్లారికి చెందిన టెకీ దుర్మరణం
బెంగళూరు : బెంగళూరులోని కుండలహళ్లిలో సోమవారం సాయంత్రం పేయింగ్ గెస్ట్ (పీజీ) వసతి గృహంలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో 23 ఏళ్ల ఐటీ ఉద్యోగం దుర్మరణం పాలయ్యాడు. ఏడు అంతస్తులు, 43 గదులున్న భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో జరిగిన ఈ పేలుడులో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు.చనిపోయిన వ్యక్తిని బళ్లారికి చెందిన అరవింద్‌గా గుర్తించారు. ఇతను ఐటీ సేవల సంస్థ క్యాప్‌జెమినీలో సీనియర్ విశ్లేషకుడిగా పనిచేస్తున్నాడు సెవెన్ హిల్స్ సాయి కో-లివింగ్ పేయింగ్ గెస్ట్ హాస్ట్‌లో ఉంటున్న అరవింద్. టెర్రస్‌పై ఉండగా గ్రౌండ్ ఫ్లోర్లో పొగను గమనించాడు. ఏం జరిగిందో చూద్దాం అని కిందికి వచ్చిన సమయంలో గ్యాస్ పేలుడు సంబంధించిందని దీంతో అతను అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (వైట్‌ఫీల్డ్) కె పరశురామ్ వెల్లడించారు. పోలీసుల ప్రకారం కమర్షియల్-గ్రేడ్ గ్యాస్ సిలిండర్ పేలుడుకు సంబంధించి ఖచ్చితమైన కారణం ఇంకా నిర్ధారించలేదు.సమాచారం అందించిన సంఘటనా స్థలానికి చేరుకున్నస్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర సేవల సిబ్బంది మంటలను అదుపు చేశాయి. గాయపడిన వారిలో ఒకరు హాస్టల్ పని చేస్తున్నవారు, ఇద్దరు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగులు. కర్నూలుకు చెందిన 28 ఏళ్ల వెంకటేష్, ఉత్తరాఖండ్‌కు చెందిన 23 ఏళ్ల విశాల్ వర్మ, ఉత్తరాఖండ్‌కు చెందిన 25 ఏళ్ల సివి గోయెల్ ప్రస్తుతం బెంగళూరులోని బ్రూక్‌ఫీల్డ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పీజీ యాజమాన్యంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: ప్రియురాలితో ప్రియాంక గాంధీ కొడుకు నిశ్చితార్థం : త్వరలోనే శుభకార్యం -
బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి రాంగ్ రూట్లో..
సాక్షి, హైదరాబాద్: నగరంలో డ్రగ్స్ దందా మరోసారి బయటపడింది. ఈసారి.. చిక్కడపల్లిలో బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్‌ను విక్రయిస్తున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుస్మిత అనే యువతి నగరంలోని ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్‌గా పని చేస్తోంది. అయితే.. తన బాయ్ ఫ్రెండ్ ఇమాన్యుల్‌తో కలిసి డ్రగ్స్ దందా నడుపుతోంది. ఈ క్రమంలో ముఠా గుట్టు రట్టు కావడంతో ఈ ప్రేమ జంట కటకటాల పాలైంది. సుస్మిత, ఇమాన్యుయెల్ సహా మొత్తం నలుగురి పోలీసులు అదుపులోకి తీసుకుని వాళ్ల నుంచి ఎండీఎంఏ, LSD బాటిళ్లు, ఓజీ కుష్ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.4 లక్షల దాకా ఉండొచ్చని అధికారులు తెలిపారు. -
ఆధార్, పార్సిల్ అంటూ : మహిళా టెకీని బెదిరించి రూ. 2 కోట్ల మోసం
డిజిటల్ అరెస్ట్ మోసానికి బలవుతున్న బాధితులు సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నకిలీ అధికారుల వలలో పడి బాధితులు కోట్ల రూపాయలను నష్టపోతున్నారు. బాధితుల్లో విద్యాధికులే ఎ క్కువగా ఉండటం మరింత విచారకరం. తాజగా బెంగళూరుకు చెందిన ఐటీ ఉద్యోగి 2 కోట్ల విలువైన ఆస్తులను అమ్ముకున్న వైనం ఆందోళన రేపుతోంది. బెంగుళూరుకు చెందిన ఒక సాఫ్ట్వేర్ నిపుణురాలు బబితా దాస్ డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లో రూ. 2 కోట్లు నష్టపోయింది. నకిలీ పోలీసుల డిమాండ్లను నెరవేర్చేందుకు తను ఉంటున్న ఇంటినీ, మరో రెండు ప్లాట్లను తెగనమ్ముకుంది. బాధితురాలు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ, తన 10 ఏళ్ల కొడుకుతో కలిసి విజ్ఞాన్ నగర్‌లోని ఫ్లాట్‌లో నివసిస్తోంది బబితా. జూన్‌లో, కొరియర్ అధికారిగా నటిస్తున్న ఒక వ్యక్తి నుండి ఆమెకు ఫోన్ వచ్చింది. ఆమె ఆధార్ కార్డుకు సంబంధించిన ఒక అనుమానాస్పద లగేజీని తాము స్వాధీనం చేసుకున్నట్లు నమ్మించాడు.ఆ కాల్‌ను తక్షణమే ముంబై పోలీసు అధికారులుగా చెప్పుకుంటున్న మరో కేటుగాళ్లకు బదిలీ చేశాడు. అరెస్టు చేస్తామని బెదిరించి, ధృవీకరణ పూర్తయ్యేవరకు బయటకు వెళ్లకూడదని హెచ్చరించారు. మోసగాళ్లు ఒక నిర్దిష్ట మొబైల్ అప్లికేషన్‌ను ఇన్స్టాల్ చేయాలని బెదిరించారు. తమకు సహకరించి అలా చేయకపోతే, కొడుకువిషయంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందన్నారు. తాము చెప్పినట్టుగా చెల్లింపులు చేసి, ఆ తరువాత పోలీసుల ద్వారా తిరిగి పొందవచ్చని నమ్మబలికారు.చదవండి: గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూ : 30 ఏళ్లుగా ఉంటున్నభారత సంతతి మహిళ అరెస్ట్దీంతో బిడ్డ భవిష్యత్తు గురించి భయపడిపోయిన ఆమె వాళ్లు చెప్పినట్టే చేసింది. తక్కువ ధరకే మలూరు లోని రెండు ప్లాట్లను , ఇటు తాను ఉంటున్న విజ్ఞాన్ నగర్ ఫ్లాట్‌ను కూడా అమ్మేసింది. తద్వారా వచ్చిన సొమ్మును ను మోసగాళ్ల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసింది. దీంతో పాటు ఆమె బ్యాంకు నుండి రుణం కూడా తీసుకుని సుమారు రూ. 2 కోట్లు మోసగాళ్లకు చెల్లించింది. ఆ తరువాత మోసగాళ్లు తరువాత డబ్బును తిరిగి పొందడానికి సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లమని చెప్పి, అకస్మాత్తుగా కాల్ కట్ చేశారు. ఆ తర్వాత యథావిధిగానే వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. దీంతో మోసపోయానని గ్రహించిన ఆమె వైట్‌ఫీల్డ్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు డిజిటల్ అరెస్ట్ స్కామ్‌పై దర్యాప్తు ప్రారంభించారు.ఇదీ చదవండి: ఆకు ఉమ్మితేనే భారీ జరిమానా; మనదగ్గర గుట్కా, ఖైనీల పరిస్థితి ఏంటి? -
ఇల్లు కట్టాలంటే రూ. 20 లక్షలు లంచం, టెకీ ఆత్మహత్య
బెంగళూరు ఐటీ ఉద్యోగి అకాల మరణం ఆందోళన రేపింది. నల్లురహళ్లిలో నిర్మాణంలో ఉన్న భవనంలో మాజీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మురళి గోవిందరాజు గురువారం ఆత్మహత్య చేసుకున్నడు. అయితే ఒక స్థలం కొనుగోలు విషయంలో లంచాలకు ఆశపడిన అధికారులు వేధింపుల కారణంగానే అతను బలవన్మరణానికి పాల్పడ్డాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి.మురళి గోవిందరాజుకు భార్య దుర్గాదేవి, పిల్లలు కనిష్ఠ, దేశిత ఉన్నారు. 2018లో నల్లురహళ్లిలో ఒక బంధువు నుండి ఒక స్థలాన్ని కొనుగోలు చేశాడు. ఆ స్థలంలో ఇల్లు కట్టే పనిలో ఉన్నాడు. అక్టోబర్ 25న, ఉషా నంబియార్, శశి నంబియార్ అనే ఇద్దరు వ్యక్తులు మురళిని పలుసార్లు (సుమారు 10 నుంచి 15 సార్లు) ఇంటికొచ్చి మరీ రూ. 20 లక్షలు ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీనికి మృతుడు నిరాకరించడంతో వేధింపులు మరింత ఎక్కువ అయ్యాయి. వారు కొంతమంది గ్రేటర్ బెంగళూరు అథారిటీ అధికారులతో కుమ్మక్కయ్యారని, నిర్మాణ స్థలాన్ని పదేపదే సందర్శించి, తమ కుమారుడిని మానసికంగా వేధించి, బెదిరించారని కుటుంబం ఆరోపించింది. నిరంతర వేధింపులతోనే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు దాఖలు చేసిన ఫిర్యాదులో తల్లి పేర్కొంది. సంఘటన జరిగిన రోజు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నాడన్నారు. తీవ్ర మనస్తాపానికి గురైన అతను ఉదయం 6 గంటలకు నిర్మాణంలో ఉన్న భవనానికి వెళ్లాడని తెలుస్తోంది. ఆ తర్వాత సీలింగ్ ఫ్యాన్ కోసం ఉద్దేశించిన ఇనుప హుక్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.పని కోసం వచ్చిన వడ్రంగి గణేష్ మృతదేహాన్ని గుర్తించి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు.ఉష, శశిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మురళి తల్లి కోరింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఇదీ చదవండి: నా వల్ల కాదు బ్రో..ఎన్ని కష్టాలున్నా ఇల్లు ఇల్లే, వచ్చేస్తున్నా! -
లైంగిక సమస్య : లోన్ తీసుకుని మరీ రూ. 48 లక్షలు, కట్ చేస్తే!
బెంగళూరు: నకిలీ ఆయుర్వేద దవాఖానా చేతిలో బెంగళూరుకు చెందిన ఐటీ ఉద్యోగి దారుణంగా మోసపోయాడు. ఒకటీ రెండూ కాదు ఏకంగా రూ. 48 లక్షలు పోగొట్టుకున్నాడు. కారణం తెలిస్తే నెటిజన్లే కాదు మీరు కూడా షాక్ అవుతారు. కొండ నాలుకకు మందిస్తే.. ఉన్న నాలుక ఊడిపోయిందన్నట్టు అయిపోయింది బాధితుడి పరిస్థితి.బెంగళూరుకు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోడ్డు పక్కన నకిలీ ఆయుర్వేద వైద్యుడి వద్దకు వెళ్లాడు. లైంగిక ఆరోగ్య చికిత్స పేరుతో 48 లక్షలు సమర్పించుకున్నాడు. ఉన్న సమస్య తీరడం మాట అటుంచి అశాస్త్రీయమైన వైద్యంతో కొత్త సమస్యలొచ్చి పడ్డాయి. ఆ నకిలీ మందుల కారణంగా కిడ్నీ సంబంధిత సమస్యలు అతణ్ని చుట్టుముట్టాయి. తరువాత విషయం తెలుసుకుని జ్ఞానభారతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.బాధితుడు పోలీసులకు అందించిన సమాచారం ప్రకారం 2023లో తన వివాహం అయింది. ఈ సందర్భంగా అతనిలోని లైంగిక లోపం బైటపడింది. దీంతో ఒక మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. అయినా ఫలితం లేదు. దీంతో కేఎల్ఈ లా కాలేజీ సమీపంలో రోడ్డు పక్కన కనిపించిన 'ఆయుర్వేదిక్ దవాఖానా' అతణ్ని ఆకర్షించింది. 'విజయ్ గురూజీ'గా పరిచయం చేసుకున్న అందులోని వ్యక్తి, తన దగ్గరున్న అరుదైన మందులతో సమస్యను శాశ్వతంగా నయం చేస్తానని నమ్మించాడు.ఆయుర్వేద గూడారం మోసం మే 3న, బాధితుడు లైంగిక సమస్యలకు 'త్వరిత నివారణ' హామీ ఇస్తూ యశ్వంత్‌పూర్‌లోని ఆయుర్వేద స్టోర్ నుండి 'దేవరాజ్ బూటీ' కొని వాడమని సిఫారసు చేశాడు. దీన్ని ప్రత్యేకంగా హరిద్వార్ నుండి తీసుకువచ్చామని, గ్రాముకు రూ. 1.6 లక్షలు ఖర్చవుతుందని గురూజీ బాగా నమ్మించాడు. అప్పు చేసి మరీ, రూ. 48 లక్షలుదొంగ గురూజీ మాటల్ని బాగా విశ్వసించిన టెక్కీ, ఆ మందును కొన్నాడు. ఈసారి మరో ఖరీదైన మందుతో వచ్చాడు. 'భావన బూటీ తైలా' అనే మరో మూలికా మిశ్రమాన్ని అతనితో కొనుగోలు చేయించాడు. దీని ధర గ్రాముకు రూ.76,000. దీని కోసం భార్య , తల్లిదండ్రుల నుండి రూ.17 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఇక్కడితో అయిపోలేదు. మందు క్రమంగా వాడాలని లేదంటే, ఇప్పటిదాకా వాడిందంతా వేస్ట్ అవుతుందని భయ పెట్టేశాడు విజయ్ గురూజీ . దీంతో బాధితుడు ఈసారి ఏకంగా బ్యాంకు నుంచి రూ. 20 లక్షల రుణం తీసుకున్నాడు. ఇలా మొత్తంగా గురూజీని నమ్మి 48 లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. కానీ ఫలితం శూన్యం. పైగా ఆరోగ్యం దెబ్బతింది.నెటిజన్ల స్పందనవిద్యావంతులు కూడా ఇలా మోసపోవడం షాక్ అంటూ నెటిజన్లు విస్మయం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని నమ్మవద్దని, సొంత అనుభవాలను సోషల్ మీడియాలో చాలామంది మొత్తుకుంటున్నా, జనం పిచ్చిగా మోసపోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఇలాంటి చిన్ని పట్టణాల్లోనూ, నగరాల్లోనూ లైంగిక ఆరోగ్యం కోసం మందు, హెర్బల్ మందులు అంటూ రోడ్డు పక్కన చాలా దుకాణాలు దర్శనిమిస్తూ ఉంటాయి. ఇలాంటి ఆయుర్వేద గుడారాల చట్టబద్ధతను పరిశీలించాలని బెంగళూరు వాసులు అధికారులను కోరారు. -
నెలకు రూ.7.5 లక్షల జీతం.. మూడునెలల్లో వదిలేసాడు!
చాలామంది ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం చేయాలని కలలు కంటారు. అలాంటి అవకాశం వస్తే బాగుంటుందని ఎదురు చూస్తారు. కానీ నెలకు రూ.7.5 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని ఒక వ్యక్తి వదులుకుని.. బెంగళూరులోని గూగుల్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. దీనికి కారణం ఏమిటి?, ఇతరత్రా వివరాలను ఈ కథనంలో చూసేద్దాం.బెంగళూరులోని గూగుల్‌లో.. ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న టెక్నీషియన్ 'అడ్వైన్ నెట్టో' యూఏఈలోని అబుదాబిలో అధిక జీతం వచ్చే ఉద్యోగాన్ని మూడు నెలల్లోనే వదులుకుని భారతదేశానికి ఎందుకు తిరిగి వచేసాడు. ఈ విషయాన్ని అతడు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పేర్కొన్నారు.అడ్వైన్ నెట్టో ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వెల్లడించిన సమాచారం ప్రకారం.. నెలకు రూ.7.5 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని ఆరు సంవత్సరాలకు ముందు వదిలిపెట్టేశాను అని పేర్కొన్నాడు. యూఏఈ వర్క్ వీసా రావడానికి దాదాపు ఐదు నెలలు పట్టింది. కానీ మూడు నెలల్లోనే ఉద్యోగన్ని వదిలేశాను. ఎక్కువ పనిగంటలు, ప్రతి రోజూ ఉదయం 9 గంటలకు పంచ్ వేయకపోతే.. సగం రోజు జీతం కట్ అవుతుంది.మౌలిక సదుపాయాలు, భౌతిక అభివృద్ధిలో యూఏఈ చాలా అద్భుతంగా ఉంది. కానీ డిజిటల్ రంగంలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఇంకా అభివృద్ధి చెందలేదు. ఇక్కడ డబ్బు సమస్య కాదు. అత్యున్నత పదవులు అర్హత కంటే.. జాతీయతపై ఆధారపడి ఉన్నాయని, దీనివల్ల నిజమైన నైపుణ్యం వృద్ధి చెందడం కష్టమైందని పేర్కొన్నారు.నేను యూఏఈలో నెలకు నెలకు 30000 AED సంపాదించడం చాలా పెద్దదిగా అనిపించవచ్చు. కానీ అక్కడ హాయిగా జీవించడానికి, సులభంగా 10000 AED ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే యూఏలో నెలకు 20000 AEDలను పొదుపుచేయగలిగాను. ఎంత సంపాదించిన అక్కడి పని వాతావరణం ఇబ్బందిగా అనిపించింది. ఇదీ చదవండి: ఎయిర్ పొల్యూషన్ ఎఫెక్ట్: అమల్లోకి కొత్త రూల్!నా పరిస్థితిని వెల్లడించినప్పుడు.. నువ్వు కంపెనీని మార్చి ఉండవచ్చు, దేశాన్ని (యూఏఈ) ఎందుకు వదిలి వెళ్లావని కొంతమంది స్నేహితులు అన్నారు. అలా కూడా ట్రై చేసాను. కొంతమంది సన్నిహితులను అడిగాను. వాళ్ల పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది. అంతే కాకుండా కొందరు వారానికి ఆరు రోజులు పనిచేస్తున్నట్లు చెప్పారు. కాబట్టే ఆ దేశంలో ఉద్యోగాన్ని వదిలేయాల్సి వచ్చిందని అడ్వైన్ నెట్టో పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Advin Roy Netto (@advinroynetto) -
రూ .18 వేల జీతం.. రూ.1.8 లక్షలైంది!
మంచి ఉద్యోగం.. ఆకర్షణీయమైన జీతం. సగటు యువత కోరుకునేది ఇదే కదా..? కానీ ఇది అందరికీ సాధ్యం కాదు. కొందరే కష్టపడి ఈ కలను సాకారం చేసుకుంటారు. ఎంత తక్కువ జీతంతో ప్రారంభించామన్నది ముఖ్యం కాదు.. ఎంత తక్కువ కాలంలో మంచి జీతానికి చేరుకున్నామన్నదే ప్రధానం.ఐదేళ్లలో పది రెట్లు జీతం పెంపును సాధించిన ఓ భారతీయ టెక్ ప్రొఫెషనల్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. తన ప్రయాణాన్ని ప్రొఫెషనల్ షేరింగ్ ప్లాట్‌ఫామ్ రెడిట్ (Reddit)లో పంచుకున్నారు. “ఒక చిన్న విజయాన్ని పంచుకోవాలనుకున్నాను. ఐదేళ్ల క్రితం నెలకు రూ.18,000 జీతంతో ఒక చిన్న స్టార్టప్‌లో నా కెరీర్ ప్రారంభించాను. అది సులభం కాదు.. గంటల కొద్దీ పని, నిరంతర అభ్యాసం, మధ్యలో ఎన్నో తప్పులు.. కానీ ప్రతీదీ అనుభవం నేర్పింది” అని రాసుకొచ్చారు.React, Node.js, Python, AWS వంటి టెక్ స్టాక్‌లో నైపుణ్యం కలిగిన ఈ ప్రొఫెషనల్ ప్రస్తుతం నెలకు రూ.1.8 లక్షల జీతంతో కొత్త ఆఫర్ అందుకున్నారని తెలిపారు. “ఐదేళ్లలో 10 రెట్లు ఎదుగుదల సాధించాను. ఈ ప్రయాణంపై నాకు నిజంగా గర్వంగా ఉంది. నిద్రలేని రాత్రులు, కఠినమైన ఫీడ్‌బ్యాక్, పట్టుదల.. ఇవన్నీ ఫలించాయి. ఇప్పటికీ కష్టపడుతున్న వారందరికీ నా సందేశం.. ఆగకండి, నేర్చుకుంటూ కొనసాగండి. కచ్చితంగా మెరుగవుతుంది” అని ఆయన అన్నారు.ఈ పోస్ట్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. యూజర్ల నుంచి అభినందనల వర్షం కురిసింది. “మీరు ఏమి నేర్చుకునేవారు? ఉద్యోగం, నైపుణ్యాభివృద్ధి రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేశారు?” అంటూ కొందరు సలహాలు కోరగా.. తామూ కూడా ఇలాగే పురోగతి సాధించినట్లు మరికొందరు తమ అనుభవాలను కామెంట్ల రూపంలో తెలియజేశారు.👉ఇది చదివారా? టీసీఎస్ షాకింగ్ శాలరీ.. -
ఇల్లు కొనడానికి ఈఎంఐ: టెకీ సలహా..
ఇల్లు కట్టుకోవడం లేదా కొనుక్కోవడం అనేది చాలామంది కల. ఈ కల నెరవేర్చుకోవడానికి.. లోన్ తీసుకోవడం లేదా ఇతరుల దగ్గర అప్పు చేయడం వంటివి చేస్తుంటారు. ఇవన్నీ ఆర్ధిక ఇబ్బందులను కలిగిస్తాయని, హోమ్ లోన్ తీసుకుంటే వచ్చే సమస్యలు.. ఎలా ఉంటాయో ఒక టెకీ తన అబుభవాలను షేర్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట్లో వైరల్ అవుతోంది.రూ.53 లక్షల లోన్ తీర్చడానికి తనకు ఆరు సంవత్సరాల కాలం పట్టిందని రెడ్దిట్ పోస్టులో వెల్లడించారు. అంతే కాకుండా నెలవారీ ఈఎంఐ మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ఒత్తిడిని కలిగిస్తుందో కూడా పేర్కొన్నాడు.2019లో రూ. 53 లక్షల హోమ్ లోన్ తీసుకున్నాను. 2025 నవంబర్ చివరి నాటికి లోన్ క్లియర్ చేసాను. అంటే ఈ లోన్ చెల్లించడానికి 6 సంవత్సరాల సమయం పట్టింది. ఎవరూ హోమ్ లోన్ తీసుకోవద్దని.. ఈ సందర్భంగా ఆ టెకీ సలహా ఇచ్చాడు. ఎందుకంటే అతిగా ఆలోచించేవారు.. మానసిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు.రూ.14 లక్షలు వడ్డీతో..జర్మనీలోని ఒక ఆటోమోటివ్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న కారణంగా.. లోన్ తొందరగా క్లియర్ చేయగలిగాను. నేను తీసుకున్న రూ. 53 లక్షల లోనుకు.. రూ.14 లక్షలు వడ్డీతో కలిపి.. మొత్తం రూ.67 లక్షలు చెల్లించాను. విదేశాల్లో ఉద్యోగం చేయడం.. లోన్ చెల్లించడంలో చాలా సహాయపడింది.ఇల్లు కొనడం మొదట్లో భావోద్వేగంగా ఉంటుంది, కానీ నిర్వహణ సమస్యలు ఎక్కువైనప్పుడు.. భావోద్వేగం భారమవుతోంది. 'ఇంటిని సొంతం చేసుకోవడం అంటే.. దాని సమస్యలను కూడా సొంతం చేసుకోవడమే' అని ఆ టెకీ పేర్కొన్నాడు. నేను లోన్ తీసుకుని కొనుగోలు చేసిన ఇల్లు విలువ.. ఇప్పుడు కోటి రూపాయలు. కానీ నా బ్యాంక్ బ్యాలెన్స్ దాదాపు ఖాళీ అని పేర్కొన్నాడు.హోమ్ లోన్ తీసుకోవడం వల్ల ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయంటే.. ఇది వ్యక్తులను మరింత కష్టపడి పనిచేసేలా చేస్తుంది. చిన్న చిన్న ఉద్యోగాలు చేసి మరింత డబ్బు ఆదా చేసేలా ప్రేరేపిస్తుందని ఆ టెకీ పేర్కొన్నాడు. దీనిపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తూ అభినందిస్తున్నారు.ఇదీ చదవండి: 39 టన్నుల బంగారం: అందుకే డిమాండ్! -
చావులే.. వారికి డబ్బులు పుట్టించే మెషిన్లు!
ఒక చావు.. కొందరిని కుంగదీస్తుంది. కుమిలిపోయేలా చేస్తుంది. అదే చావు.. మరికొందరికి మాత్రం కాసుల పంట పండిస్తుంది. ‘శవాల మీద పేలాలు ఏరుకుని తినే నీచులు..’ అంటూ.. మానవత్వం లేని మనుషుల గురించి మనం తిట్లు వింటూ ఉంటాం. కానీ.. ఈ సంఘటన గురించి తెలుసుకుంటే.. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులుగా ఉంటూ.. లంచాలు తెగమేసి బతకడానికి అలవాటుపడిన దుర్మార్గులు.. ఈ తరహా అమానవీయ పోకడల విషయంలో ఎంతటి మాస్టర్ డిగ్రీలు చేశారో అర్థమవుతుంది.తాము లంచాలు కాజేయడం మాత్రమే వారికి ప్రయారిటీ! సందర్భం ఏదైనా సరే వారికి పట్టింపులేదు. అవతలి వారు ఎంతటి దారిద్ర్యంలో ఉన్నారో, ఎంతటి వేదనలో ఉన్నారో కూడా వారికి అక్కర్లేదు. లంచాలు మింగడం మాత్రమే కాదు.. వేదనలో ఉన్న వారిని పరుషవ్యాఖ్యలతో నొప్పించడం వారి దుర్మార్గానికి మరింత పరాకాష్ట. ఆధునిక సమాజంలో మానవీయ విలువలు పూర్తిగా కనుమరుగైపోయాయని మనం చెప్పలేం. కాకపోతే.. ఇలాంటి ప్రభుత్వాధికారులు, ఉద్యోగులు మాత్రం ఆ మానవీయతకే తీరని కళంకం అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం.వివరాల్లోకి వెళితే.. బెంగుళూరులో ఒక వేదనాభరితమైన దుర్ఘటన చోటుచేసుకుంది. బీపీసీఎల్ సంస్థలో చీఫ్ ఫైనాన్షియల్ మేనేజర్‌గా పనిచేసిన 64 ఏళ్ల కె శివకుమార్ జీవితంలో చోటుచేసుకున్న విషాదం అది. ఆయనకున్న ఏకైక కూతురు అక్షయ శివకుమార్ (34). ఐఐటీ నుంచి బిటెక్ చేసింది, అహ్మదాబాద్ ఐఐఎం నుంచి ఎంబీయే చేసింది. ఓ మల్టినేషనల్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. విషాదం ఏంటంటే.. ఇటీవల ఆమె బ్రెయిన్ హెమరేజ్ తో దుర్మరణం పాలైంది. అసహజ మరణంగా గుర్తించడంతో మెడికో లీగల్ కేసు నమోదు అయింది. ఒక చావు సంభవిస్తే.. అనుబంధాలను పెనవేసుకున్న వందల వేల హృదయాలు దుఃఖిస్తాయి. ఇలాంటి చావు సంభవించినప్పుడు.. దాని నుంచి డబ్బులు ఏరుకోవడానికి పదుల సంఖ్యలో పరాన్నభుక్కుల వంటి కుక్కలు సదా సిద్ధంగా ఉంటాయి. ఇలాంటి దుర్మార్గాలు, శివకుమార్‌కు వరుసగా స్వానుభవంలోకి వచ్చాయి.అంబులెన్సులో ఆస్పత్రికి, శ్మశానానికి తరలించే వాడికి ఓ రేంజి లంచం, కేసు రిజిస్టరు అయింది గనుక.. బెలందూరు పోలీసు వారికి లంచం, అంతా పూర్తయి కూతురు డెత్ సర్టిఫికెట్ తీసుకోవాలనుకుంటే.. బెంగుళూరు నగరపాలిక సంస్థ వారికి లంచం.. ఈ వ్యవహారాలతో అసలే దుఃఖంలో ఉన్న ఆయన మరింతగా క్షోభకు గురయ్యారు. లంచాలు డిమాండ్ చేయడం మాత్రమే కాదు.. ఉన్న ఒక్కగానొక్క కూతురును కోల్పోయి పుట్టెడు బాధలో ఉంటే.. లంచం కోసం బెలందూరు పోలీసులు దూషించిన తీరు కూడా ఆయన క్షోభను మరింతగా పెంచింది. ఈ గోడు మొత్తం వెళ్లగక్కుతూ ఆయన ఎక్స్ లో ఒక పోస్టు పెట్టారు. ఇలాంటి వారి బారిన పడి.. ఎన్ని వేల లక్షల హృదయాలు ఎంతగా క్షోభిస్తూ ఉంటాయో.. ఆ పోస్టు కాస్తా వైరల్ అయింది. పోలీసు పెద్దలు కొంచెం జాగ్రత్త పడి.. బెలందూరు స్టేషన్లో ఇద్దరిని సస్పెండ్ చేశారు.లంచగొండితనం అనేది ఇవాళ్టి సమాజంలో ఒక యాక్సెప్టబుల్ వ్యవహారం అయిపోయింది. గవర్నమెంటుతో ముడిపడిన ఈ పని మనకు ఉన్నా.. తృణమో పణమో అడక్కముందే సమర్పించేసుకోవడం సాధారణ జనానికి అలవాటుగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఇలా పుట్టే డబ్బులు పుట్టెడు ఉంటాయి. అలాగని ఒకరో ఇద్దరో దారిద్ర్యంలో పడి అలమటిస్తున్న వారు.. డబ్బులు ఇవ్వలేని స్థితిలో ఉంటే.. ఈ లంచగొండులు విడిచిపెట్టడం లేదు. ఇలాంటి అమానవీయ పరిస్థితుల్లో, బాధాకరమైన వేళల్లో కూడా తమ దందా తాము సాగించాలనే అనుకుంటున్నారు. అక్కడే అసలు సమస్య మొదలవుతోంది.‘నేనంటే డబ్బున్న వాణ్ని గనుక.. అందరికీ అడిగినంత లంచాలు ముట్టజెప్పాను. డబ్బులేని పేదల పరిస్థితి ఏమిటి?’ అంటూ ఆ శివకుమార్ తన పోస్టులో ప్రశ్నించిన తీరు.. సమాజాన్ని ఆలోచింపజేస్తోంది. ఈసడించుకున్నంత మాత్రాన.. కించిత్తు కూడా ఈ లంచగొండి అవతారాల్లో మార్పు రాదన్నది నిజం. ఎందుకంటే.. ఆస్పత్రుల్లో లంచాలు, తప్పుడు చికిత్సలు, పోలీసుల లంచాలు, నీతిమాలిన వైనం గురించి.. కొన్ని వందల సినిమాల్లో ఘాటుగా చర్చిస్తూనే వచ్చారు. ఏం మారింది సమాజం? అలా లంచం తీసుకోవడాన్ని ఒక లాంఛనంగా, అధికారిక క్రతువులాగా మార్చేసుకుంటున్నారు. కేవలం ఒకటిరెండు సస్పెన్షన్లతో ఈ దుర్మార్గాలకు అడ్డుకట్ట పడుతుందా? ఆ అంబులెన్సు డ్రైవరూ, ఆ ఆసుపత్రి సిబ్బంది, శ్మశానం సిబ్బందీ, బెంగుళూరు కార్పొరేషన్ పెద్దలూ, పోలీసు మహానుభావులూ అందరివీ పత్రికల్లో పెద్దపెద్ద ఫోటోలు వేసి.. చావుల మీద లంచాల డబ్బులు ఏరుకుంటున్న నీచులు వీళ్లేనని తగుమాత్రం ప్రచారం కల్పించాలి. సోషల్ మీడియా లో ఫోటోలతో సహా వారి నీచత్వాన్ని డప్పు కొట్టి మరీ చెప్పాలి. నగరమంతా పోస్టర్లు వేయాలి. వారి బతుకుల్లో సిగ్గు పుట్టించాలి. లేకపోతే ఇలాంటి అరాచకత్వాలకు నిష్కృతి లేదు...ఎం.రాజేశ్వరి -
‘రూ.96 లక్షల ఉద్యోగం.. చేరాలా వద్దా?’
ఎంతటి అనుభవం, అవగాహన ఉన్నవారికైనా వృత్తిపరమైన జీవితంలో అనేక సందేహాలు, సందిగ్ధాలు ఎదురవుతుంటాయి. అలాంటి వాటిని ప్రొఫెషనల్ కమ్యూనిటీ వేదిక రెడిట్‌లో పంచుకుంటూ సలహాలు కోరుతుంటారు. ఇలాగే హైదరాబాద్‌కు చెందిన టెకీ కూడా తనకు ఎదురైన సందిగ్ధాన్ని షేర్ చేశారు.ఈ హైదరబాద్ టెకీ ప్రస్తుతం సంవత్సరానికి రూ.85 లక్షల జీతంతో స్థిరమైన ఉద్యోగం చేస్తున్నారు. అయితే తనకు యూఎస్ ఆధారిత స్టార్టప్ నుంచి వచ్చిన కొత్త రిమోట్ కన్సల్టెన్సీ ఆఫర్ గురించి సబ్‌రెడిట్ (కమ్యూనిటీ గ్రూప్) ఇండియన్వర్క్ప్లేస్లో షేర్ చేసి ఏం చేయమంటూరు? అంటూ సలహా కోరడంతో ఆన్లైన్లో చర్చకు దారి తీసింది.ఆ కొత్త స్టార్టప్‌లో ఉద్యోగానికి సంవత్సరానికి 1,10,000 డాలర్లు (సుమారు రూ.96.6 లక్షలు) జీతం ఇస్తామంటున్నారు. అయితే ఇది శాశ్వత ఉద్యోగం కాదు.. ప్రాజెక్టు ఆధారిత కన్సల్టెన్సీ కాంట్రాక్ట్. ఈ ఆఫర్‌ను తాను పరిశీలిస్తున్నప్పటికీ, పన్ను బాధ్యతలు, ఉద్యోగ భద్రత, అలాగే దీర్ఘకాలిక కెరీర్ ప్రమాదాలు వంటి అంశాలపై అనిశ్చితంగా ఉన్నట్లు టెకీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.తాను ఆ ఆఫర్‌ను అంగీకరించాలనుకుంటే, పన్ను ప్రయోజనాలను గరిష్ఠం చేయడానికి చార్టర్డ్ అకౌంటెంట్ సలహా తీసుకోవడం, జీఎస్టీ కింద రిజిస్ట్రేషన్ చేయడం గురించి కూడా ఆలోచిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, భవిష్యత్తులో స్టార్టప్ వ్యాపారం విజయవంతంగా పెరిగితే యునైటెడ్ స్టేట్స్కు మకాం మార్చమని కోరే అవకాశం కూడా ఉందని వెల్లడించారు.ఈ పోస్ట్ కొద్ది సమయంలోనే వైరల్ అయింది. వందలాది వర్కింగ్ ప్రొఫెషనల్స్, ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్ నుంచి విభిన్న అభిప్రాయాలు వచ్చాయి. కొంతమంది ఈ ఆఫర్‌ను ప్రమాదకరంగా పేర్కొంటూ, స్థిరమైన ఉద్యోగాన్ని కొద్దిపాటి జీతం పెరుగుదల కోసం విడిచిపెట్టడం సరైంది కాదని అన్నారు.మరికొందరు మాత్రం, వృద్ధి చెందుతున్న యూఎస్ స్టార్టప్‌లో చేరడం దీర్ఘకాలంలో పెద్ద అవకాశాలను అందించవచ్చని, ముఖ్యంగా యూఎస్ రీలొకేషన్ సాధ్యమైతే ఇది కెరీర్ బూస్టర్ అవుతుందని వ్యాఖ్యానించారు. కన్సల్టెన్సీ రోల్లో ఉండే ఉద్యోగ భద్రతా లోపం దృష్ట్యా ఈ వేతనం సరిపోదని, మరికొంత కోరాలని మరో యూజర్ సలహా ఇచ్చారు.ఇదీ చదవండి: ‘కొత్త’ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు.. కోట్లలో జీతాలు -
ఒకేసారి రెండు ఉద్యోగాలు : డాలర్లకు కక్కుర్తి పడితే ముప్పు తప్పదు!
మూన్‌లైటింగ్ ఆరోపణలపై భారత సంతతికి చెందిన వ్యక్తికి 15 ఏళ్ల జైలు శిక్ష విధించిన వార్త ఇంటర్నెట్లో దావాలనంలా వ్యాపించింది. న్యూయార్క్ స్టేట్ ఆఫీస్‌లో పనిచేస్తున్న భారతీయ సంతతికి చెందిన మెహుల్ గోస్వామిని యుఎస్ లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం అరెస్టు చేశారు. ఒకేసారి రెండు ఉద్యోగాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుండి జీతం తీసుకుంటున్నగోస్వామి మాల్టా పట్టణంలో మరో కాంట్రాక్ట్ ఉద్యోగం చేయడాన్ని నేరంగా పరిగణించింది. 2022 మార్చిలో గోస్వామి న్యూయార్క్ స్టేట్ ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీస్‌లో రిమోట్ వర్క్(work from home) తోపాటు, మాల్టాలోని సెమీకండక్టర్ కంపెనీకి కాంట్రాక్టర్‌గా పనిచేసేవాడు. గోస్వామిపై అందిన ఫిర్యాదును విచారణ చేపట్టిన మోహుల్ గోస్వామిని అదుపులోకి తీసుకున్నారు. గోస్వామి మూన్ లైటింగ్ కారణంగా రాష్ట్రఖజానాకు రూ.44 లక్షల నష్టం జరిగిందని అధికారులు భావించారు. డ్యూయల్ ఎంప్లాయ్ మెంట్ రూల్ ప్రకారం అమెరికాలో రెండు ఉద్యోగాలు చేయడం నేరంగా పరిగణించిన దర్యాప్తు సంస్థప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మరో ఉద్యోగం చేయడం ప్రజలను మోసం చేయడమే అని, ప్రజా వనరుల దుర్వినియోగం అని పేర్కొంది.ప్రభుత్వ ఉద్యోగులకు నిజాయితీతో సేవ చేసే బాధ్యత ఉంది కానీ గోస్వామి ఆ నమ్మకాన్ని తీవ్రంగా ఉల్లంఘించాడని న్యూయార్క్ స్టేట్ ఇన్స్పెక్టర్ జనరల్ లూసీ లాంగ్ అన్నారు.ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూనే రెండో పూర్తికాలం ఉద్యోగం చేయడం అంటే ప్రజల డబ్బుతోపాటు ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేయడమే అవుతుందని లూసీ లాంగ్ పేర్కొన్నారు.ఏంటీ నేరం; ఏలాంటి శిక్షసరటోగా కౌంటీ షెరీఫ్ కార్యాలయం ,రాష్ట్ర ఇన్స్పెక్టర్ జనరల్ కార్యాలయం ఈ విషయంపై సంయుక్త దర్యాప్తు చేపట్టి,గోస్వామి అరెస్టు చేసింది. సొంత పూచీకత్తుపై విడుదలయ్యాడు. ఈ కేసు ప్రస్తుతం తదుపరి చట్టపరమైన చర్యలు పెండింగ్‌లో ఉంది. రెండవ డిగ్రీలో గ్రాండ్ చోరీ అభియోగం మోపబడింది, ఇది న్యూయార్క్‌లో తీవ్రమైన క్లాస్ సి నేరం. ఈ నేరం రుజువైతే గోస్వా మికి గరిష్టంగా 15 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.13 లక్షల వరకు లేదా పొందిన ఆర్థిక ప్రయోజనాలకు రెట్టింపు మొత్తంలో జరిమానా విధించే అవకాశముంది.చదవండి: ఇషా, ఆకాష్ అంబానీ బర్త్‌డే: తరలి వెళ్లిన తారలుడాలర్లకు కక్కుర్తిపడితేడాలర్లకు ఆశ పడి విదేశాల్లో ఉద్యోగాలు చేసకుంటున్న నిపుణులైన ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. లక్షలకోసం ఆశపడితే దేశం పరువు ప్రతిష్టలకు భంగం కలగడంతో పాటు,వ్యక్తిగతంగా కూడా భారీ నష్టం తప్పదని, ఉద్యోగులు నిబద్దతగా నిజీయితీగా ఉండాలని సూచిస్తున్నారు.గతంలో అమెరికా సంస్థలతో మూన్లైట్ చేస్తూ మరో భారతీయుడు పరేఖ్, పట్టుబడ్డాడు. మూన్ లైటింగ్ ద్వారా ఐదు యుఎస్ స్టార్టప్‌లను మోసం చేశాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారాన్ని మొదట మిక్స్‌ప్యానెల్ సహ వ్యవస్థాపకుడు మరియు మాజీ CEO సుహైల్ దోషి సోషల్‌మీడియా ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే. (రూ. 1.75 - 5.27 కోట్లదాకా జీతం : ఆ 600 మందికి సుదర్శన్ కామత్ ఆఫర్) -
తదుపరి టెక్ హబ్‌గా మరో నగరం
బెంగళూరు భారతదేశంలోని టెక్ రాజధానిగా ప్రసిద్ధి చెందినప్పటికీ కర్ణాటకలోని తీరప్రాంత నగరం మంగళూరు కొత్త టెక్, స్టార్టప్ హబ్‌గా అభివృద్ధి చెందుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త మోహన్ దాస్ పాయ్, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి వంటి ప్రముఖులు దీన్ని భవిష్యత్ ఆవిష్కరణల కేంద్రంగా ప్రచారం చేస్తున్నారు. అయితే మౌలిక సదుపాయాల్లో ముఖ్యంగా అంతర్జాతీయ విమానాశ్రయం మెరుగుపరచాల్సిన అవసరం ఉందని బెంగళూరు వైద్యుడు డాక్టర్ దీపక్ కృష్ణమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో ఎక్స్ వేదికగా వెలసిన పోస్ట్‌లు వైరల్‌గా మారాయి.ఆరిన్ క్యాపిటల్ సహ వ్యవస్థాపకుడు మోహన్ దాస్ పాయ్ పోస్ట్ ప్రకారం.. ‘మంగళూరులో ఇప్పటికే 25,000 మంది టెక్ నిపుణులు ఉన్నారు. గొప్ప ప్రతిభ, మెరుగైన జీవన నాణ్యత, సరసమైన గృహాలు, ఉన్నత విద్యా సంస్థలు, అద్భుతమైన బీచ్ ఉంది’ అని తెలిపారు. ఈ పోస్ట్‌కు ప్రముఖ నటుడు సునీల్ శెట్టి మద్దతు తెలియజేస్తూ..‘మంగళూరు కేవలం టెక్ హాట్ స్పాట్ మాత్రమే కాదు. యువ పారిశ్రామికవేత్తలు, సమతుల్య జీవితం కోసం చూసే నిపుణులకు ఆదర్శ గమ్యస్థానం. ఇది ఆత్మీయమైన, ఆధ్యాత్మికమైన ప్రదేశం. ఇది ఆసియాలో ఆవిష్కరణలకు కొత్త గమ్యస్థానంగా మారుతుంది’ అన్నారు.The first step should be to build a proper International Airport away from the hill on which it is perched currently. https://t.co/VIF0QBWoep— Dr Deepak Krishnamurthy (@DrDeepakKrishn1) October 6, 2025అయితే, బెంగళూరుకు చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ దీపక్ కృష్ణమూర్తి స్పందిస్తూ..‘మంగళూరు తదుపరి సిలికాన్ కోస్ట్ కావడానికి ముందు చుట్టూ కొండ ప్రాంతం కావడంతో ప్రమాదకరమైన రన్‌వే కాకుండా మెరుగైన అంతర్జాతీయ విమానాశ్రయం అవసరం’ అని అన్నారు. ఈ వ్యవహారంపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.కొందరు మంగళూరు విమానాశ్రయం ఇప్పటికే బెంగళూరు విమానాశ్రయం మాదిరిగా సౌకర్యవంతంగా, నగరానికి దగ్గరగా ఉందని చెప్పారు. అయితే, టెక్ హబ్‌గా మారిన తర్వాత ట్రాఫిక్ నిర్వహణ సాధ్యమా అని డాక్టర్ దీపక్ ప్రశ్నించారు. మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం 2024-25 ఆర్థిక సంవత్సరంలో 2.32 మిలియన్ల ప్రయాణికులను నిర్వహించించినట్లు నెటిజన్లు తెలిపారు. ఇది మునుపటి రికార్డును మించిపోయిందని, ప్రస్తుతం రన్‌వేను 150 మీటర్లు పొడిగించే పనులు జరుగుతున్నాయని చెప్పారు.ఇదీ చదవండి: మధ్యతరగతి వారికి వారెన్ బఫెట్ ఆర్థిక సలహా -
ఒకప్పుడు సెక్యూరిటీ గార్డు..ఇవాళ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్‌గా..
కనీసం డిగ్రీ కూడా లేకుండా ఉద్యోగం సంపాదించడం కష్టం. అందులోనూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే..అస్సలు సాధ్యం కాదు. కానీ ఈ వ్యక్తి ఏ కంపెనీకి సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడో అదే కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. డిగ్రీ కూడా పూర్తి చేయని ఈ వ్యక్తి ఎలా ఇంత పెద్ద ఉద్యోగాన్ని సంపాదించగలిగాడో వింటే..నేర్చుకోవడం విలువ కచ్చితంగా తెలుస్తుంది. లింక్డ్ఇన్లో వైరల్‌గా మారిన ఇతని స్టోరీ నేటి తరాని స్ఫూర్తి. ఎన్ని డిగ్రీలు చేశామన్నాది కాదు స్కిల్ ఎంత ఉంది అన్నది ముఖ్యం అని చెబుతోంది ఇతడి కథ.అతడే అబ్దుల్ అలీమ్. లింక్డ్ ఇన్ పోస్ట్‌లో తన సెక్యూరిటీ గార్డు నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా మారిన తన సక్సెస్ జర్నీని షేర్ చేసుకున్నారు. 2013లో ఇంటి నుంచి వెయ్యి రూపాయలతో బయటకొచ్చేశానని, రైలు టికెట్ కోసం రూ. 800లు ఖర్చు చేశానంటూ నాటి పరిస్థితిని గుర్తుచేసుకున్నాడు అబ్దుల్. చిన్నపాటి ఉద్యోగం కూడా లేకపోవడంతో ఎక్కడకి వెళ్లలేని తన దీనస్థితిని గురించి వివరించాడు. అలా రెండు నెలలు వీధుల్లో గడిపిన అనంతరం..జోహో సాఫ్ట్వేర్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనికి కుదిరాడు. అదే అతడి జీవితాన్ని మలుపు తిప్పింది. పదోతరగతి వరకే చదివిన అతడికి హెచ్‌టీఎంఎల్(HTML)పై కొంచెం పట్టు ఉంది. అయితే మరింతగా నేర్చుకోవాలన్న ఆసక్తి ఉన్నా..అదెలా అనేది తెలియలేదు అబ్ధుల్కి. సరిగ్గా ఆ సమయంలో జోహోలో సీనియర్ ఉద్యోగి శిబు అలెక్సిస్‌తో పరిచయం..ఒక్కసారిగా అబ్దుల్ జీవితమే మారిపోయింది. అతడు అబ్దుల్ మాటల్లో ఏదో చేయాలనే తపనను గుర్తించి..మార్గనిర్దేశం చేసేందుకు ముందుకొచ్చాడు. అలా ఎనిమినెలల పాటు పగటిపూట భద్రతా విధులను పూర్తి చేసి, సాయంత్రం ప్రోగ్రామింగ్ నేర్చుకునేవాడు అబ్దుల్. చివరికి ఒకరోజు వినియోగదారు ఇన్పుట్ను దృశ్యమానం చేసే ఒక సాధారణ యాప్‌ను రూపొందించాడు. దానిని అలెక్సిస్ జోహూ మేనేజర్‌కు చూపించాడు. దీంతో మేనేజర్ అబ్దుల్ని ఇంటర్వ్యూకి పిలిచారు. అయితే తనకు డిగ్రీ లేకపోవడంతో కాస్త తడబడుతున్న అబ్దుల్ని చూసి ఆ కంపెనీ మేనేజర్..కాలేజ్ డిగ్రీ అవసరం లేదు, నైపుణ్యం ఉంటే చాలు అంటూ అతడిని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్‌గా నియమించారు. అలా సెక్యరిటీ గార్డుగా పనిచేసిన ఎనిమిదేళ్ల తర్వాత అదే కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్‌గా నియమాకం అందుకున్నాడు. ఇలా తన కథను వివరిస్తూ..తనకు గురువులా మార్గనిర్దేశం చేసిన శిబు అలెక్సిస్‌కు, అలాగే తనని తాను నిరూపించుకునేలా అవకాశం ఇచ్చిన జోహో కంపెనీ మేనేజర్‌కి ధన్యావాదాలు తెలిపాడు పోస్ట్‌లో. చివరగా ఆయన "నేర్చుకోవడం అనేది ఎప్పుడైనా ప్రారంభించొచ్చు..ఆలస్యం అనే పదానికి ఆస్కారం లేదు" అని పోస్ట్‌ని ముగించారు. కాగా, జోహో అనేది చెన్నైకి చెందిన గ్లోబల్ సాఫ్ట్వేర్ కంపెనీ. 1996లో శ్రీధర్ వెంబు స్థాపించిన ఈ కంపెనీ సరసమైన సాంకేతికత, డేటా గోప్యత, భారతదేశంలో ఉత్పత్తులను నిర్మించడంలో ప్రసిద్ధి చెందింది. యూఎస్ సుంకాల ఉద్రిక్తతల నేపథ్యంలో అనేకమంది మంత్రులు ఈ దేశీ టెక్కంపెనీని ప్రమోట్చేయడంతో జోహూ కంపెనీ వార్తల్లో నిలిచింది. (చదవండి: Parenting Tips: పిల్లలు ప్రయోజకులు అవ్వాలంటే..? ఐఏఎస్ అధికారిణి పేరెంటింగ్ టిప్స్లు..!) -
జాబ్‌లో చేరిన 4 నెలల్లోనే రూ.1లక్ష వేతనం పెంపు
వేతనాల పెంపు కోసం చాలా మంది ఉద్యోగులు సంవత్సరాల తరబడి ఎదురుచూస్తుంటారు. కానీ ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్ కేవలం నాలుగు నెలల్లోనే భారీ వేతన పెంపును అందుకున్నాడు. కంపెనీలో చేరినప్పుడు తన సీటీసీ(CTC)లో 100% పెరిగిన కొద్ది నెలలకే మరోసారి వేతన పెంపు అందుకున్నాడు. ఈమేరకు రెడ్డిట్‌లో చేసిన పోస్ట్ కాస్తా వైరల్‌గా మారింది.పోస్ట్‌లోని వివరాల ప్రకారం..‘నేను ప్రముఖ కంపెనీలో ఇటీవలే చేరాను. నాకు 7.2 ఏళ్ల పని అనుభవం ఉంది. అంతకుముందు పని చేసిన కంపెనీతో పోలిస్తే కొత్త సంస్థ 100 శాతం సీటీసీను పెంచింది. నేను ఇంటర్వ్యూలో అడిగిన దానికంటే ఎక్కువగానే వేతనం ఇచ్చారు. దాంతో నాకు ఏటా రూ.31 లక్షలు ఆఫర్ చేశారు. కొత్త సంస్థలో చేరి నాలుగు నెలలైంది. ఇటీవల అప్రైజల్స్ వచ్చాయి. అందులో ఆశ్చర్యంగా నాకు మరో లక్ష పెంచారు. దాంతో నా వార్షిక వేతనం రూ.32 లక్షలైంది’ అని రాసుకొచ్చారు.ఈ వ్యవహారంపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘ఇది అసాధారణమైనది కాదు. మంచి స్టార్టప్ కంపెనీలు నైపుణ్యాలున్న వారి కోసం ఇలా చేస్తాయి’ అని ఒకరు తెలిపారు. మరోవ్యక్తి స్పందిస్తూ..‘కేవలం 5 నెలల్లోనే నేను 16% పెంపు పొందాను’ అని చెప్పారు.ఇదీ చదవండి: అమెరికా పొమ్మంటూంటే.. ఇవి రమ్మంటున్నాయి! -
మేనేజర్ కావాలనే నాపై కక్ష కట్టాడు!
వర్క్ ఫ్రం హోం విధానంలో పని చేస్తున్న బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఇటీవల సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసిన కథనం వైరల్‌గా మారింది. రిక్రూట్మెంట్ సమయంలో పూర్తిస్థాయి వర్క్ ఫ్రం హోం అని చెప్పిన కంపెనీ సడెన్‌గా ఫిజికల్‌గా ఆఫీస్‌కు రావాలని ఆదేశించినట్లు అందులో రాసుకొచ్చారు. అయితే మేనేజర్ కావాలనే ఇలా తనను వేదిస్తున్నట్లు చెప్పారు. తాను ఉంటున్న ప్రాంతం ఆఫీస్‌కు 300 కి.మీ ఉండడంతో సదరు ఉద్యోగి తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు.‘రిక్రూట్మెంట్ సమయంలో పర్మనెంట్ వర్క్ ఫ్రం హోం అన్నారు. నేను కంపెనీలో చేరి ఇప్పటికి ఏడాది గడిచిపోయింది. నేను ప్రస్తుతం ఉంటున్న ప్రాంతం మా ఆఫీస్‌కు 300 కి.మీ. ఇప్పటివరకు ప్రతి రెండు నెలలకు ఒకసారి ఆఫీస్‌కు రమ్మనారు. కానీ ఇప్పడు నన్ను మేనేజర్ కావాలనే ప్రతివారం రమ్మంటున్నాడు. టీమ్ బిల్డింగ్, ఆఫీస్ సంస్కృతిని సంరక్షించడం అనేవి కారణంగా చెబుతున్నాడు. ఈ వ్యవహారంపై మేనేజర్‌తో మాట్లాడినా లాభం లేకుండా పోయింది. ఇది స్నేహపూర్వకమైన వృత్తిపరమైన సంబంధాన్ని ఘర్షణకు, ఒత్తిడికి తావిస్తుంది. మేనేజర్ ప్రవర్తనకు వ్యతిరేకంగా ఉన్నత స్థాయి యాజమాన్యాన్ని ఆశ్రయించాలని భావిస్తున్నాను. అదేసమయంలో కెరియర్ అవకాశాలు, టీమ్ రిలేషన్స్ దెబ్బతింటాయేమోనని ఆలోచలున్నాయి’ అని పోస్ట్‌లో తెలిపారు.రెడిట్ ప్లాట్ఫామ్లో వెలసిన ఈ పోస్ట్‌పై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. చాలా మంది ఉద్యోగి పట్ల సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. ఇది ఒక అనివార్య సమస్య అని పేర్కొన్నారు. ‘టీమ్ బిల్డింగ్’ లేదా ‘ఆఫీస్ సంస్కృతి’ని సంరక్షించడం అనే సాకుతో చాలామంది ఇలా ఉద్యోగులను ఇబ్బందిపెడుతున్నట్లు కొందరు చెప్పారు. కొంతమంది మేనేజర్లు తాము రిమోట్‌గా పని చేస్తూనే కింది సిబ్బందిని కార్యాలయానికి రావాలని బలవంతం చేస్తున్నట్లు చెప్పారు.ఇదీ చదవండి: పెళ్లి నిధిని ఎలా సమకూర్చుకోవాలి? -
నెలకు రూ.20 లక్షల జీతం.. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం
ఏఐ విజృంభణతో వేలాదిగా ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ఫ్రెషర్లకు మంచి జీతంతో ఉద్యోగాలు రావడమే కష్టమైపోతున్న ప్రస్తుత తరుణంలో ఓ 23 ఏళ్ల కుర్రాడు మాత్రం మరో విధంగా నిరూపించాడు. ఈశాన్య భారతదేశంలోని ఒక చిన్న పట్టణానికి చెందిన ఈ టెకీ పట్టుదల, నైపుణ్యం అన్ని సవాళ్లను, వైఫల్యాలను అధిగమించగలవని నిరూపించాడు.ఏకంగా 500 పైగా తిరస్కరణలను ఎదుర్కొన్న ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇప్పుడు ఏఐలోనే అగ్ర సంస్థలలో ఒకటైన ఓపెన్ఏఐలో పనిచేస్తున్నారు. నెలకు రూ.20 లక్షల జీతం. అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం.బీటెక్ చేసిన మొదటి వ్యక్తిఈ యువ ఇంజనీర్ రెడ్డిట్ పోస్టు ప్రకారం.. తన కుటుంబంలో కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ చేసిన మొదటి వ్యక్తి ఇతనే. ఏడాదికి రూ.3.6 లక్షల వేతనంతో మొదట్లో క్యాంపస్ ప్లేస్మెంట్ ఆఫర్ వచ్చింది. తీసుకున్నాడు. అయితే జాయిన్ డేట్ కోసం ఎదురుచూడకుండా మరింత క్రియాశీలకంగా వ్యవహరించాడు.ఒక్క ఇంటర్వ్యూ దక్కింది.. పట్టేశాడువందలాది రిమోట్ అంతర్జాతీయ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడం ప్రారంభించాడు. ఈ మార్గం ప్రారంభంలో లెక్కలేనన్ని తిరస్కరణలకు దారితీసింది, కానీ చివరికి ఫలించింది. ‘నెలల తరబడి తిరస్కరణ తరువాత తిరస్కరణ. ఆ అప్లికేషన్లలో నాకు ఒక్క ఇంటర్వ్యూ కాల్ మాత్రమే వచ్చింది, ఎలాగోలా క్లియర్ చేశాను’ అంటూ రెడిట్ పోస్ట్‌లో పేర్కొన్నాడు.దాదాపు 500-600 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న టెక్కీ ఓపెన్ఏఐ లింక్డ్ ప్రాజెక్టుతో ఒకే ఇంటర్వ్యూను పొంది విజయవంతంగా ఉత్తీర్ణత సాధించాడు. మొదట్లో ఏడాదికి రూ.3.6 లక్షలుగా ఉన్న ఆయన జీతం ఇప్పుడు నెలకు రూ.20 లక్షలకు చేరింది.అయినా ‘ఆగడు’రూ.లక్షల జీతంతో చేతిలో ఉద్యోగం ఉన్నా టెక్కీ మాత్రం ఆగడం లేదు. ఓపెన్ఏఐ లింక్డ్ ప్రాజెక్టు ద్వారా వచ్చే అదనపు డబ్బుతో సొంతంగా టెక్ సంస్థను ఏర్పాటు చేసుకునే పనిలో ఉన్నాడు. ఇది పూర్తయితే అతను తన లాంటి మరింత మందిని చేర్చుకుని పెద్ద ప్రాజెక్టులపై పనిచేయాలనుకుంటున్నాడు. మంచి కంపెనీల్లో సౌకర్యవంతమైన ఒక్క జాబ్ వస్తే చాలు స్థిరపడాలనుకుంటున్న యువతకు ఈ కుర్రాడు భిన్నంగా ఆలోచిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. -
టెకీకి భారీ ఊరట, కంపెనీకి షాకిచ్చిన కోర్టు
బెంగళూరు టెక్నీషియన్ ఉగాండాలో ఒంటరిగా వదిలేసినందుకు యజమానిపై కేసు వేసి, రూ.3 లక్షలకు పైగా గెలుచుకున్నాడు. టెక్నికల్ కన్సల్టెంట్ - కంపెనీ యాజమాన్యం మధ్య నెలకొన్న వివాదంలో కోర్టు సంచలన తీర్పు చెప్పింది. అతని బకాయిలు, ఇతర పత్రాలను ఉద్దేశపూర్వకంగానే నిలిపివేసిందన్న ఐటీ ఉద్యోగి వాదనను సమర్ధించిన కోర్టు రూ. 3 లక్షల బకాయిలు, 6 శాతం వార్షిక వడ్డీ, రిలీవింగ్ లెటర్ ,అతని ఒరిజినల్ విద్యా సర్టిఫికెట్లను అతనికి తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం పాపారెడ్డిపాళ్యంలోని ఐటీఐ లేఅవుట్లో నివసించే రక్షిత్ ఎంవీ, సెప్టెంబర్ 2016లో లోకస్ ఐటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో చేరారు. డిసెంబర్ 2019లో ఉగాండాలోని కంపాలాలో ఒక క్లయింట్ ప్రాజెక్ట్ కోసం రక్షిత్‌ను నియమించారు. ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అయింది. అయితే పదే పదే అభ్యర్థించినప్పటికీ అతనికి ఎలాంటి సపోర్ట్ ఇవ్వకుండా కంపెనీ నిర్లక్ష్యం చేసింది. పైగా పొడిగించిన స్టే సమయంలో తన జీత భత్యాలను ఏకపక్షంగా సగానికి తగ్గించిందనీ, నెలకు చెల్లించాల్సిన పీఎఫ్ రూ.3,600 రూపాయలు జమ చేయలేదని వాదించారు. అలాగే దేశీయ ప్రయాణం,ఇతర ఛార్జీలు మొత్తం రూ. 3 లక్షలతో సహా అదనపు ఖర్చులను కూడా చెల్లించలేదు. దీంతో జూలై 2020 వరకు తాను అక్కడ చిక్కుకుపోయానని రక్షిత్ ఆరోపించారు. చివరికి2020 ఆగస్టులో రాజీనామా చేశానని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. జీతం కోత , పొడిగించిన స్టేతో సహా అన్ని నిర్ణయాలను సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అధికారిక ఇమెయిల్ కమ్యూనికేషన్ లేకుండా మౌఖికంగా తెలియజేశారని, అందువల్లే తనకు వ్రాతపూర్వక రుజువు లేకుండా పోయిందని రక్షిత్ చెప్పారు.రాజీనామా చేసిన తర్వాత, రక్షిత్ 2021లో కంపెనీకి లీగల్ నోటీసు పంపాడు. ఆ తర్వాత 2022 జనవరిలో తన బకాయిల చెల్లింపు, తనకు సంబందించిన సర్టిఫికెట్లను, ఇతర పత్రాలను విడుదల చేయాలని కోరుతూ సివిల్ దావా వేశాడు.ఇదీ చదవండి: ఉద్యోగాన్ని వదలేసిన ఇంజనీర్ కపుల్.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలుఎండీ రోహిత్ కుడుకులి ప్రాతినిధ్యం వహిస్తున్న కంపెనీ రక్షిత్ ఆరోపణలను ఖండించింది. రక్షిత్ ప్రాజెక్ట్ మధ్యలో పరారయ్యాడని వాదించింది. కానీ, న్యాయమూర్తి శివానంద్ మారుతి జిపారే అధ్యక్షతలోని అదనపు సిటీ సివిల్ మరియు సెషన్స్ కోర్టు రక్షిత్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. 6 శాతం వార్షిక వడ్డీతో రూ. 3 లక్షలు బకాయిలు చెల్లించాలని, అతని సర్టిఫికెట్లను విడుదల చేయాలని ఆదేశించింది. కపెంనీ తన చర్య ద్వారా బాధితుడికి కోలుకోలేని నష్టాన్ని కలిగించిందని వ్యాఖ్యానించింది. కరీర్‌ను ప్రమాదంలో పడేసేలా, బకాయిలు, ఇతర పత్రాలను నిలిపివేయడానికి కోర్టు తప్పుబట్టింది. -
ఉద్యోగం మానేసి నా స్టోర్‌లో పనిచెయ్ అన్నాడు: కానీ ఇప్పుడు..
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మనిషి ప్రయత్నిస్తే సాధించలేని ఏదీ లేదు. ఒకప్పడు ఏడాదికి రూ.2.19 లక్షల జీతం అందుకునే వ్యక్తి.. తొమ్మిదేళ్లలో సంవత్సరానికి ఏకంగా రూ. 92.5 లక్షల వేతనం తీసుకునే స్థాయికి చేరుకున్నాడు. ఇంతకీ ఇదెలా సాధ్యమైంది?, దాని వెనుకున్న అతని కృషి ఏమిటనే విషయాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.2016లో మాస్ హైరింగ్ ద్వారా మొదటి ఉద్యోగం పొందాను. నా జీతం రూ.2.16 లక్షలు. అప్పుడు జావాలో ట్రైనింగ్ తీసుకున్న సమయంలో.. నా కజిన్ ఒకరు నా స్టోర్‌లో సేల్స్‌పర్సన్‌గా పని పనిచేస్తే.. అంతకంటే ఎక్కువ జీతం ఇస్తాను అన్నాడు. ఆ మాటలు నన్ను ఎంతగానో బాధించాయి. ఆ మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి.ఆ సమయంలో నేను నిజంగా సిగ్గుపడ్డాను. అయితే 2017లో నా వేతనం రూ. 3.35 లక్షలకు చేరింది. ఆ తరువాత ఇంకో కంపెనీలో రూ.6.6 లక్షల ప్యాకేజీకి చేరాను. అంతటితో నా ప్రయాణం ఆపలేదు.2018లో ఇంకొన్ని కంపెనీలలో ఇంటర్వ్యూలకు హాజరయ్యాను. అప్పుడు రూ.7.3 లక్షల వేతనానికి ఉద్యోగంలో చేరాను. అదే సంస్థ 2019లో నా ప్యాకేజీని రూ.9.75 లక్షలు చేసింది. వేతనం పెరగడం, ఉద్యోగంలో సుఖంగా ఉండటం చేత.. ఇంటర్వ్యూలకు హాజరవ్వడం మానేశాను. 2020లో నా జీతం రూ. 12.5 లక్షలకు చేరింది. కోవిడ్ రావడంతో వర్క్ ఫ్రమ్ హోమ్ మొదలైంది. కంపెనీ బాగానే ఉన్నప్పటికీ.. బోనస్‌లు, ఇతర ప్రోత్సాహకాలు ఇవ్వకుండా కోవిడ్‌ను సాకు చెప్పారు. ఆ సమయంలోనే మళ్ళీ ఇంటర్వ్యూలకు హాజరవ్వాలని అనుకున్నాను.2020లోనే మరో ఇంటర్వ్యూకు హాజరైతే.. రూ.25 లక్షల ప్యాకేజ్ లభించింది. కొత్త కంపెనీ, ఎక్కువ పని. అయినా చాలా విషయాలను నేర్చుకున్నాను. ఆ తరువాత 2021, 2022, 2023, 2024లలో కూడా ఇంటర్వ్యూలకు హాజరయ్యాను, జీతం కూడా పెరిగింది. 2025లో ఓ ఇంటర్వ్యూకు వెళ్తే అక్కడ రూ. 92.5 లక్షల ప్యాకేజ్ లభించింది. దీంతో ఈ ఏడాది చాలా ఆనందంగా గడుస్తోంది. ఇప్పుడు వస్తున్న జీతం.. ప్రారంభంలో నా నెల జీతంకంటే చాలా ఎక్కువ. ఇప్పుడు నన్ను ఎగతాళి చేసిన నా కజిన్.. తన పిల్లలకు నాలాగే ఉండాలని చెబుతున్నాడు.ఇదీ చదవండి: అందని జీతం.. ఫుట్‌పాత్‌పై పడుకున్న టీసీఎస్ ఉద్యోగిరూ.2.19 లక్షల వేతనం తీసుకునే స్థాయి నుంచి రూ.92.5 లక్షల వేతనం తీసుకునే స్థాయికి ఒక్క రోజులో చేరుకోలేదు. ఎంతో కష్టపడ్డాను. అయితే సరైన సమయంలో సరైన స్థలంలో ఉండటం నా అదృష్టమని నమ్ముతున్నానని పేర్కొన్నాడు. అతని ఎదుగుదలను కొందరు నెటిజన్లు మెచ్చుకుంటుంటే.. మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.My 9 years in corporatebyu/noob-expert inIndian_flex -
ఐఐటీ, ఎంబిఏ వంటి డిగ్రీలు చేయలేదు.. కానీ ఏడాదికి రూ. 70 లక్షల శాలరీ..!
డిగ్రీల మీద డిగ్రీలు చేయడం కాదు. చదువుకి తగ్గ ఉద్యోగం, వేతనం అందుకున్నవాడే అసలైన అదృష్టవంతుడు. అలాంటి లక్ కొందరికే సొంతం. కానీ ఇక్కడొక వ్యక్తి మాత్రం అలాంటి పెద్ద పెద్ద చదువులు చదవకుండానే జస్ట్ రెండు ఉద్యోగాల మారి..ఏకంగా రూ. 26 లక్షల నుంచి రూ. 70 లక్షల వేతనం అందుకుంటున్నాడు. అందుకు సంబంధించిన పోస్ట్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌గా మారి రకరకాల చర్చలకు తెరలేపింది. సౌరబ్ యాదవ్ అనే వ్యక్తి ఎలాంటి ఐఐటీ డిగ్రీలు, ఎంబిఏ డిగ్రీలు పూర్తి చేయలేదు. కేవలం కష్టపడి ఈ భారీ స్థాయిలో జీతాన్ని అందుకుంటున్నాడు. జస్ట్ రెండు ఉద్యోగాలు మారుతూ భారీ స్థాయిలో వేతనం అందుకునే రేంజ్‌కి ఎదిగాడు. తొలి ఉద్యోగంలో ఏడాదికి రూ. 26 లక్షలు తీసుకోగా, రెండో ఏడాది రూ. 28 లక్షలు, మూడో ఏడాది రూ. 70 లక్షలు అందుకునే స్థాయికి చేరుకున్నాడు. అదంతా కేవలం తన హార్డ్ వర్క్‌తోనే ఈ ఘనతను సాధించాడు. ఈ విషయాన్ని ఒక సాఫ్ట్వేర్ టెక్కీ నెట్టింట పోస్ట్ చేయడంతో పెద్ద దుమారం రేపి చర్చలకు దారితీసింది. ఉన్నత చదువులు చదివితే భారీ స్థాయిలో వేతనం ఇస్తారన్న అపోహా ఈ పోస్ట్‌తో తొలిగిపోతుందని కొందరూ. అతడు పనిచేసే చోట వాతావరణం ఎలా ఉండేది, ఎలా తన పై అధికారులను ఆ స్థాయిలో జీతాలు ఇవ్వమని చర్చించాడు తదతరాల గురించి తెలుసుకోవాలనుంది అంటూ పోస్టులు పెట్టారు. ఈ పోస్ట్ కష్టపడితే అనితర సాధ్యమైనది కూడా సాధించొచ్చు అన్నే విషయాన్ని హైలెట్ చేసింది కదూ..!.(చదవండి: భారత్ వ్యక్తినే పెళ్లి చేసుకోవడానికి రీజన్..! రష్యన్ మహిళ పోస్ట్ వైరల్) -
వయసు 34.. 10 ఏళ్లు ఉద్యోగం.. రూ.4 కోట్లు సంపద
మారుమూల గ్రామంలో పుట్టిన ఓ టెక్కీ చదువు పూర్తయిన తర్వాత 10 ఏళ్లు ఉద్యోగం చేసి తన 34వ ఏట ఏకంగా రూ.4 కోట్ల కార్పస్ సృష్టించాడు. ఈమేరకు ఆయన అనుసరించిన ఆర్థిక విధానాలు, క్రమశిక్షణ గురించి తెలుపుతూ రెడ్డిట్‌లో వివరాలు పోస్ట్ చేశాడు. దాంతో అదికాస్తా వైరల్‌గా మారింది.ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ పోస్ట్ ‘ఆర్/నోయిడా’ అనే రెడ్డిట్ కమ్యూనిటీలో వెలసింది. అందులో ‘ఈ రోజు నాకు 34 ఏళ్లు. వ్యక్తిగతంగా నేను రూ.4 కోట్లు పొదుపు చేశాను. ఎలాంటి ఆర్థిక వారసత్వం లేదు. లాటరీలు లేవు. పదేళ్లు నిరంతర కృషి, సహనం, క్రమశిక్షణతో కూడిన జీవనంతోనే ఇది సాధ్యమైంది. నేను ఒక చిన్న పల్లెటూరులో పుట్టి పెరిగాను. హిందీ మీడియం ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను. మా నాన్న రోజువారీ కూలీ. నిత్యం కుటుంబ పోషణకు సరిపడా మాత్రమే సంపాదించేవాడు. ఆ సమయంలో తాను ఎలాగోలా నాకు కొన్ని పుస్తకాలు కొని, ఎన్నో మంచి విషయాలు పంచుకున్నాడు. ఆయన ఒకసారి నాతో మాట్లాడుతూ.. నా వల్ల ప్రజలు మా నాన్నను గుర్తించినరోజే తనకు గర్వంగా ఉంటుందన్నారు. ఆ వాక్యం నా మనసులోనే ఉండిపోయింది’ అన్నారు.‘ఆకలి ఎలా ఉంటుందో నాకు ఇంకా గుర్తుంది. నేను అనుకోకుండా కంప్యూటర్లోని కొన్ని టెక్నాలజీలను కనుగొన్నాను. నేను వాటితో ప్రేమలో పడ్డాను. నెమ్మదిగా అవి నా చుట్టూ ఉన్న జీవితాన్ని మార్చడం ప్రారంభించాయి. దాంతో టెక్నాలజీ రంగంలో మంచి ఉద్యోగం వచ్చింది. చిత్తశుద్ధితో పనిచేశాను. అనవసర ఖర్చులను తగ్గించాను. తెలివిగా పొదుపు చేశాను. చివరికి పార్ట్ టైమ్‌గా ట్రేడింగ్ ప్రారంభించాను. నాకు గురువు లేడు. నా తప్పుల నుంచి, యూట్యూబ్‌లో ఉచిత కంటెంట్ ద్వారా, కొన్ని పుస్తకాల నుంచి ఎంతో నేర్చుకున్నాను’ అని చెప్పారు.ఇదీ చదవండి: రోజుకు 12 గంటలు.. వారానికి 6 రోజులు.. సండే కూడా ఆఫీస్ఎందుకు చెబుతున్నారంటే..‘ఎక్కడో ఒక చిన్న గ్రామంలో లేదా ఏదో పట్టణంలో ఎవరైనా నిస్సహాయతతో ఉండవచ్చు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వ్యక్తి.. తమ ఇంగ్లిష్ బాగోలేదని నమ్మే వ్యక్తి.. కలలు కేవలం ధనవంతుల కోసమే అనుకునే వ్యక్తులు ఉండవచ్చు. నేను ఆర్థికంగా సాధించగలిగింది.. మీరూ సాధిస్తారు. మీరు అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడాల్సిన అవసరం లేదు. పెద్ద డిగ్రీలు వద్దు. కానీ, జీవితంగా ఎదగాలంటే పట్టుదల, గెలుస్తామనే తపన, మీపై నమ్మకం ఉండాలి’ అన్నారు. -
అమ్మో ఏఐతో జాబ్ ఇంటర్వ్యూ.. అన్నీ పట్టేస్తుంది!
ఆర్టిఫీషియల్ వినియోగం విస్తృతంగా పెరిగిపోయింది. ఇది లేదనకుండా ఏఐ అన్ని పనులూ చేసేస్తోంది. నోయిడాకు చెందిన అనుభవజ్ఞురాలైన ప్రొడక్ట్ మేనేజర్ రాధికా శర్మకు ఇటీవల ఒక ప్రత్యేకమైన ఉద్యోగ ఇంటర్వ్యూ అనుభవం ఎదురైంది. అక్కడ ఆమెను హ్యూమన్ ప్యానెల్‌కు బదులుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత రోబోట్ ఇంటర్వ్యూయర్ అంచనా వేశారు.టెక్ లో దాదాపు దశాబ్ద అనుభవం ఉన్న శర్మ బిజినెస్ ఇన్ సైడర్ తో తన అనుభవాన్ని పంచుకున్నారు. వర్చువల్ స్క్రీనింగ్ సిస్టమ్ ఆమె నైపుణ్యాలను అంచనా వేయడమే కాకుండా ఆమె వస్త్రధారణపైనా ఫీడ్ బ్యాక్ అందించిందని వెల్లడించారు. ఈ అనుభవాన్ని "అద్భుతమైన అదేసమయంలో కలవరపరిచేది"గా ఆమె అభివర్ణించారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఇంటర్వ్యూ ప్రక్రియ నుండి లాభనష్టాలు, ఇతర కీలక అంశాలను చర్చించారు.చిన్నదైన కుమార్తె సంరక్షణ కోసం రాధికా శర్మ తన ప్రొడక్ట్ ఓనర్ బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. ఇప్పుడు ప్రొడక్ట్ మేనేజ్ మెంట్ పొజిషన్ ను వెతుక్కుంటూ మళ్లీ జాబ్ మార్కెట్లోకి రీఎంట్రీ ఇస్తోంది. ఒక సాస్ కంపెనీ ఆమెను ఏఐ(AI) ఆధారిత స్క్రీనింగ్ ఇంటర్వ్యూకు ఆహ్వానించింది. ఇంటర్వ్యూ ప్రక్రియ ప్రారంభానికి ముందు నిశ్శబ్ద వాతావరణం ఉండేలా చూసుకోవాలని, కంప్యూటర్లోని ట్యాబ్ లను మార్చవద్దని, పర్యవేక్షణ కోసం స్క్రీన్ షేరింగ్ చేయాలని అవతల నుంచి సూచనలు వచ్చాయి.‘ఇంటర్వ్యూ ప్రారంభమైన వెంటనే, సుమారు 20 నిమిషాల టైమర్ ప్రారంభమైంది. అటు పక్క నుంచి మహిళా వాయిస్ తో కూడిన ఖాళీ స్క్రీన్ నన్ను పలకరించింది. ప్రొడక్ట్ మేనేజ్మెంట్ గురించి చాలా నిర్దిష్టమైన ప్రశ్నలు అడగడం ప్రారంభించింది" అని రాధికా శర్మ చెప్పారు. ఈ ఇంటర్వ్యూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జరుగుతుందని కంపెనీ ముందుగానే స్పష్టంగా పేర్కొంది. ఇంటర్వ్యూ ముగిసిన వెంటనే శర్మ ఏఐ టూల్ నుంచి సవివరమైన పనితీరు మదింపును అందుకున్నారు.తాను నిమగ్నమయ్యే విధానం, ఐ కాంటాక్ట్, ముఖ కవళికలు, భంగిమలు, వస్త్రధారణ వంటి అన్ని కొలమానాలతో పాటు ఆమె సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏఐ అంచనా వేసింది. ఆమె సాంకేతిక నైపుణ్యాలు బాగా సాధించినప్పటికీ, ఆమె దుస్తులు ప్రొఫెషనల్‌గా ధరించలేదని, ఐ కాంటాక్ట్ సక్రమంగా లేదని పేర్కొంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను తక్కువగా అంచనా వేశానని, అమ్మో ఏఐ అన్నింటినీ క్షణ్ణంగా గమనిస్తుందని రాధికా శర్మ చెప్పుకొచ్చారు. -
సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్.. ఇప్పుడు ఫుడ్‌డెలివరీ బాయ్..
మనం రోజూ ఎంతో మంది చిరు ఉద్యోగులను చూస్తుంటాం. ముఖ్యంగా ఫుడ్ డెలివరీ సిబ్బందిగా చాలా మంది ఉపాధి పొందుతున్నారు. ఇలాంటి వారిని కొంత మంది చిన్నచూపు చూస్తారు. కానీ వారి నేపథ్యాలు తెలిస్తే పశ్చాత్తాపడక తప్పదు. అలాంటి వారిలో ఒకరే పద్మనాభన్.బెంగళూరుకు చెందిన నితిన్ కుమార్ ఫుడ్ కోసం స్విగ్గీలో ఆర్డర్ పెట్టారు. ఆర్డర్ అతని ఇంటి ముంగిటకు వచ్చినప్పుడు, తాను ఆహారాన్ని మాత్రమే ఆశించగా అతన్ని లోతుగా కదిలించే కథ పరిచయమైంది. కేవలం బతడం కోసమే కాకుండా ఒకప్పుడు తాను నడుపుతున్న వ్యాపారాన్ని పునరుద్ధరించుకునేందుకు ఫుడ్ డెలివరీలు చేస్తున్న పద్మనాభన్ అనే ఎంట్రప్రెన్యూర్ పరిచయమయ్యారు. ఆయన కథనే నితిన్ కుమార్ ‘ఎక్స్’లో షేర్ చేశారు."ఇదితో నా స్విగ్గీ డెలివరీ పార్టనర్ ఇది నాకు అప్పగించారు" అంటూ పోస్ట్‌ను ప్రారంభించిన నితిన్ కుమార్ దానికి ఓ రెజ్యుమ్ మొదటి పేజీ చిత్రాన్ని జతచేశారు. ‘డెలివర్డ్ విత్ కర్, బట్ విత్ కోడ్’ అని రెజ్యుమ్పై క్యాప్షన్ ఉంది. డెలివరీ పార్ట్నర్ పద్మనాభన్దే ఆ రెజ్యుమ్. అందులో "19+ సంవత్సరాల అనుభవం ఉన్న ఫుల్-స్టాక్ డెవలపర్" అని ఆయన వృత్తిపరమైన సమాచారం ఉంది.పద్మనాభన్ ఒకప్పుడు ఓ సాఫ్ట్ వేర్ కంపెనీని నడిపారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా క్లయింట్స్ ఉండేవారు. కానీ ఆయనిప్పుడు ఫుడ్ డెలివరీ ఉద్యోగం చేస్తున్నారు. అయితే తాను ఈ పని చేస్తున్నది "మనుగడ కోసం మాత్రమే కాదు, (తన వ్యాపారాన్ని) మొదటి నుండి నిర్మించడానికి" ఆయన రెజ్యూమ్ హైలైట్ చేస్తోంది.👉ఇదీ చదవండి: అప్పుడు రూ.1.25 లక్షల జీతం.. ఇప్పుడు ఫుడ్ డెలివరీ ఉద్యోగం..డెలివరీ బాయ్‌కు బదులుగా మరేదైనా మంచి ఉద్యోగం ఇప్పించమంటావా అని అడిగితే.. ‘వద్దు, నా వ్యాపారాన్ని తిరిగి ట్రాక్‌లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను‘ అంటూ పద్మనాభన్ బదులిచ్చాడని నితిన్ కుమార్ పేర్కొన్నారు. కాగా పద్మనాభన్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, ఆయన 2018లో తమిళనాడులో తన సంస్థను స్థాపించాడు. టెక్కీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ లో డిగ్రీ చేశారు. -
జాబ్ చేంజ్ అంటే ఇదీ.. ఏకంగా రూ.45 లక్షల జీతానికి..
తరచూ ఉద్యోగాలు మారడం కార్పొరేట్ సంస్కృతిలో భాగంగా మారింది. ఎందుకంటే జాబ్ మారిన ప్రతీసారి జీతాలు, హోదాలు, ఇతర ప్రయోజనాలు పెరుగుతాయి. సాధారణంగా ఉద్యోగాలు మారడం ద్వారా సగటున 30–40 శాతం లేదా కొన్ని సందర్భాల్లో 100 శాతానికి పైగానే ఉద్యోగులు జీతాలను పెంచుకుంటున్నారు. కానీ ఒక్క స్విచ్‌లో ఏకంగా 700 శాతానికి పైగా జీతం పెరిగిందంటే నమ్ముతారా?మీరు నమ్మినా.. నమ్మకపోయినా ఓ టెక్కీ విషయంలో ఇలాగే జరిగింది. ఢిల్లీకి చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి జాబ్ స్విచ్ స్టోరీ ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఒక ప్రముఖ టెక్ కంపెనీలో తన వార్షిక వేతనం రూ.5.5 లక్షల నుంచి కేవలం ఏడాదిలోనే రూ.45 లక్షలకు పెరిగిందని ఆ యువ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఇటీవల తన కెరీర్ విశేషాలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఎక్స్ (గతంలో ట్విట్టర్) లో అతని పోస్ట్ త్వరగా దృష్టిని ఆకర్షించింది. విస్తృతమైన చర్చను రేకెత్తించింది.దేవేష్ అనే డెవలపర్ ఏడాది క్రితమే ఫుల్ టైమ్ కెరీర్ ప్రారంభించారు. మామూలు వేతనంతో ప్రారంభమైన ఆయన ఇప్పుడు తన ప్రారంభ వేతనానికి దాదాపు తొమ్మిది రెట్లు సంపాదిస్తూ ఒక అగ్రశ్రేణి గ్లోబల్ టెక్ కంపెనీలో స్థానం సంపాదించినట్లు పేర్కొన్నారు. అదే సమయంలో ఇప్పుడిప్పుడే కెరీర్లో అడుగుపెడుతున్నవారికి కొన్ని సూచనలూ ఇచ్చారు. అధిక ప్రారంభ వేతనాల కంటే నేర్చుకోవడం, నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, ఆ తర్వాత భారీ వేతనాలను సాధించవచ్చని సూచించారు. -
రూ.5.5 లక్షల నుంచి.. ఏడాదికే రూ.45 లక్షలు: టెకీ ట్వీట్
సాధారణంగా ఉద్యోగంలో చేరితే.. ప్రతిఏటా 10 శాతం లేదా 20 శాతం శాలరీ హైక్ ఉంటుంది. కొన్ని కంపెనీలలో హైక్ అనేమాట చాలా అరుదుగా వినిపిస్తుంది. కానీ ఓ సాఫ్ట్వేర్ డెవలపర్ ఒక ఏడాదిలోనే కనీవినీ ఎరుగని ఆఫర్ పొందినట్లు. తన జీతం కూడా దాదాపు 10 రెట్లు పెరిగినట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ క్కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఢిల్లీకి చెందిన ఒక యువ సాఫ్ట్వేర్ డెవలపర్ తన కెరీర్ ప్రారంభించిన కేవలం ఒక సంవత్సరం వ్యవధిలోనే తన జీతం.. రూ. 5.5 లక్షల నుంచి రూ. 45 లక్షలకు చేరిందని పేర్కొన్నాడు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.దేవేష్ అనే టెక్నీషియన్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. తాను ఐబీఎంలో రూ. 5.5 లక్షల సీటీసీకి ఉద్యోగంలో చేరాను. ఇప్పుడు ఏకంగా ఏడాదికి రూ. 45 లక్షల ఆఫర్ ఉందని చెప్పాడు. నాలాంటి మధ్యతరగతి వ్యక్తికి, ఇది ఇప్పటికీ ఒక కల అని చెప్పుకొచ్చాడు. ఇది చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. కొందరు అతన్ని ప్రశంసించారు, మరొకొందరు తమ అనుమానాలను వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: ఏఐ పరిస్థితి ఇంతే!.. ఉద్యోగులకు భయమేలకెరీర్ ప్రారంభంలో జీతం కంటే నైపుణ్యాలపై ద్రుష్టి పెట్టాలి. అలాంటప్పుడే మీకు మంచి ప్యాకేజీ లభిస్తుంది. ప్రారంభంలో తక్కువ ప్యాకేజీతో ఉద్యోగంలో చేరినా దిగులు పడొద్దు, ఎందుకంటే మీ నైపుణ్యాలను పెంచుకుంటూ పోతే తప్పకుండా మంచి ఆఫర్స్ వస్తాయని టెకీ పేర్కొన్నాడు.Never mentioned it but tbh, I still sometimes think I am still in a dream, bcoz I started my full time career last year at IBM with just a CTC of 5.5 LPA, and now having an offer of over 45 LPA CTC in hand within an year, for a middle class guy like me, it's still a dream❤️.— Devesh (@theywayshhh) May 26, 2025 -
అమెరికాలో ఘోరం : భారత సంతతి పర్వతారోహకుడి సహా ముగ్గురు దుర్మరణం
అమెరికాలోని వాషింగ్టన్లో పర్వతారోహణ చేస్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. ఇందులో భారత సంతతికి చెందిన విష్ణు ఇరిగిరెడ్డితో సహా ముగ్గురు పర్వతారోహకులు మరణించారు. అయితే, నాల్గవ సహచరుడు తీవ్రంగా గాయపడ్డాడు. పర్వతారోహణంపై ఆసక్తితో ఎంతో ఉత్సాహంగా మొదలైన వీరి ప్రయాణం విషాదాంతమైంది. దీంతో బాధిత కుటుంబాలు శోక సంద్రంలో మునిగిపోయాయి.పశ్చిమ ఉత్తర అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలోని నార్త్ కాస్కేడ్స్ పర్వతాలపై ఈ ప్రమాదంచోటు చేసుకుంది. ఈ క్లైంబింగ్ ప్రమాదంలో మరణించిన ముగ్గురిలో భారత సంతతికి చెందిన టెక్కీ విష్ణు ఇరిగిరెడ్డి కూడా ఉన్నారు. సియాటిల్ నివాసి అయిన 48 ఏళ్ల విష్ణు తన ముగ్గురు స్నేహితులు టిమ్ న్గుయెన్ (63), ఒలెక్సాండర్ మార్టినెంకో (36) ఆంటన్ సెలిక్‌లతో (38), త్సేలిఖ్ లతో కలిసి శనివారం కాస్కేడ్స్‌లోని నార్త్ ఎర్లీ వింటర్స్ స్పైర్ ప్రాంతాన్ని ఎక్కడానికి ప్రయత్నిస్తుండగా ప్రమాదం జరిగిందని NBC న్యూస్ నివేదించింది. అయితే ఈ ఘోర ప్రమాదంనుంచి ప్రాణాలతో బయటపడిన ఏకైక అధిరోహకుడు త్సేలిఖ్,తన ముగ్గురు స్నేహితుల మరణానికి దారి తీసిన ప్రమాదం గురించి అధికారులకు తెలియజేయడానికి 64 కిలోమీటర్లు ప్రయాణించాడు. త్సేలిఖ్ ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నాడు ,అంతర్గత రక్తస్రావం, మెదడు గాయానికి చికిత్స పొందుతున్నాడు.అయితే పైకి ఎక్కుతున్నపుడు తుఫాను ప్రమాదాన్ని గుర్తించిన వీరు వెనక్కి తగ్గినప్పటికీ ఫలితం లేకపోయింది. కిందికి దిగుతున్న సమయంలో జట్టు యాంకర్ పాయింట్ విఫలం కావడంతో వారు 200 అడుగుల కిందకు పడిపోయారని క్లైంబింగ్ వెబ్సైట్ నివేదించింది. ఈ ప్రమాదంలోపై విష్ణు స్నేహితులు, కుటుంబ సభ్యులు తీవ్ర విచారాన్ని వ్యకతం చేశారు. విష్ణు అనుభవజ్ఞుడైన పర్వతారోహకుడని ప్రకృతిని బాగా ఇష్టపడేవారని గుర్తు చేసుకున్నారు. అంతేకాదు సియాటిల్‌లో అత్యంత నైపుణ్యమున్న టెక్నీషియన్లలో గొప్పవాడని, తనదైన విలువలతో జీవితాన్ని నిర్మించు కున్నాడంటూ కంట తడిపెట్టుకున్నారు. విష్ణు గౌరవార్థం అతని స్నేహితులు , కుటుంబ సభ్యులు రెండు లాభాపేక్షలేని సంస్థలకు విరాళాలు అందించనున్నారు. అలాగే మే 22 వరకు ఆ స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు ఇవ్వాలని వారు ఇతరులకు విజ్ఞప్తి చేశారు.విష్ణు గ్రేటర్ సియాటిల్ ప్రాంతంలోని టెస్ట్ పరికరాల తయారీ సంస్థ ఫ్లూక్ కార్పొరేషన్లో ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నాడు. విష్ణు గొప్ప టీం లీడర్ అనీ, ఆయన మరణం తీరని లోటు అంటూ కంపెనీ కూడా నివాళులర్పించింది. నార్త్ కాస్కేడ్స్‌లోని లిబర్టీ బెల్ సమూహంలోని గ్రానైట్ శిఖరం, నార్త్ ఎర్లీ వింటర్స్ స్పైర్, అనుభవజ్ఞులైన పర్వాతారోహకులకు ప్రసిద్ధి చెందింది. -
మైక్రోసాఫ్ట్ సీఈవో, టెక్కీ తండ్రుల ఆవేదన ఫలితం..ఏఐ హెల్త్‌కేర్ రివల్యూషన్..!
మనల్ని చుట్టుముట్టే సమస్యలే ఆవిష్కరణలకు దారితీస్తాయి. ఒకరకంగా అవి మనలోని టాలెంట్‌ని పదునుపెట్టేలా చేస్తాయి. మనలా ఇబ్బంది పడుతున్న వాళ్లెందరికో మార్గం చూపే కాంతికిరణలవుతాయి. అందుకు నిదర్శనం ఈ మైక్రోసాఫ్ట్ సీఈవో, టెక్కీ తండ్రులే. వాళ్ల పిల్లలు ఎదుర్కొన్న సిండ్రోమ్ ఫలితంగా వచ్చిన ఫ్రీ ఏఐ హెల్త్‌కేర్ ఎందరికో మార్గం చూపి, వైద్యులే గుర్తించడంలో విఫలమైన వ్యాధులను ఐడెంటిఫై చేసి ఇవాళ ఎందరి ప్రాణాలనో కాపాడుతోంది.మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ డెవలపర్ జూలియన్ ఇస్లా కొడుకు సెర్గీయో అరుదైన నాడీ సంబంధిత రుగ్మత డ్రావెట్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నాడు. నిజానికి ఈ వ్యాధిని అంతతొందరగా ఏంటన్నది వైద్యుల కూడా త్వరగా గుర్తించలేకపోతున్నారు. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఈ పరిస్థితితో బాధపడుతున్నారని తెలుసుకోవడానికి ఎన్నో నిరీక్షణల తర్వాత గానీ తెలుసుకోలేకపోతున్నారు. ఇక్కడ జూలియన్ ఇస్లా కూడా తన పసికందు సమస్య ఏంటన్నది ఒక ఏడాది వరకు తెలుసుకోలేకపోతాడు. అప్పుడే ఆయన ఈ అరుదైన వ్యాధి నిర్ధారణలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని కంకణం కట్టుకున్నాడు. అందుకోసమే ఇస్లా వైద్య పురోగతి కోసం AIని ఉపయోగించేలా లాభాపేక్షలేని సంస్థ ఫౌండేషన్ 29ని స్థాపించారు. సరిగ్గా ఆ సమయంలోనే అనుకోకుండా మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల ప్రసంగం వింటాడు. ఆయన తన స్పీచ్‌లో కొడుకు పోరాడుతున్న సెరిబ్రల్ పాల్సీ వ్యాధి తీరును హృదయవిదారకంగా వెల్లడిస్తాడు. దీంతో ఇస్లా వెంటనే నాదెళ్లను ఇమెయిల్ ద్వారా సంప్రదించి.. తన కొడుకు సెర్గియో కథను పంచుకుంటాడు. అలాగే ఇలా ఒక పట్టాన వ్యాధులు నిర్ధారణ కాని రోగులకు ఏఐ సాంకేతికత గేమ్-ఛేంజర్‌గా ఎలా ఉంటుందో వివరిస్తాడు ఇస్లా. ఆ వెనువెంటనే నాదెళ్ల ఐదు నిమిషాల్లోనే రిప్లై ఇచ్చి.. మైక్రోసాఫ్ట్ AI హెల్త్‌కేర్ బృందాలతో కనెక్ట్ అయ్యారు. అంతేగాదు ప్రాథమిక AI అల్గారిథమ్‌లను ఉపయోగించి క్లినికల్-గ్రేడ్ డయాగ్నస్టిక్ సాధనాన్ని అభివృద్ధి చేశాడు. ఇది ఇస్లా స్థాపించిన లాభాపేక్షలేని సంస్థ ఫౌండేషన్ 29 అతిపెద్ద విజయం అని చెప్పొచ్చు. 2023 నాటికి, వారు అధునాతన భాషా నమూనాల ఆధారిత డయాగ్నస్టిక్ అసిస్టెంట్ అయిన DxGPT అభివృద్ధి చేశారు. ఇదెలా పనిచేస్తుందంటే..DxGPT అంటే ..ఇది వ్యాధిని నిమిషాల వ్యవధిలోనే నిర్థారిస్తుంది. ఇది ప్రజా వైద్య వనరులు, ఆరోగ్య సంరక్షణ భాగస్వాముల కలయికతో ూకూడిన పజీపీటీ-40, 01 నమునాలను ఉపయోగిస్తుంది. ోగోప్యత దృష్టిలో ఉంచుకుని రూపొందించిన సాంకేతికత. అలాగే ఏ రోగి డేటాను సేకరించదు, స్టోర్ చేయదు. జస్ట్ రోగులు లేదా సంరక్షకులు ఇచ్చే లక్షణాలు, వివరణల ఇన్‌పుట్‌ని ఆధారంగా చేసుకుని రోగనిర్ధారణ సారాంశాన్ని పొందుతారు. దీని ఆధారంగా వైద్య పరీక్షలు చేయించుకుని ధృవీకరించుకోవచ్చు. ప్రస్తుతం ఆన్లైన్లో ఉచితంగా యాక్సెస్ అయ్యే DxGPT అంతుచిక్కని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కుటుంబాల బాధను తీర్చడంలో కీలకంగా ఉంటుంది.(చదవండి: పిల్లిలా కనిపించాలనుకోవడం ఎంత పనైపాయే..! ఏకంగా రూ. 6 లక్షలు పైనే..) -
నిందితుడిని పట్టించిన ఫోన్ కాల్
బనశంకరి: భార్యను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా కత్తరించి సూట్‌కేసులో పెట్టి ఉడాయించిన టెక్కీ రాకేశ్ రాజేంద్ర ఖడేకర్ ఎట్టకేలకు పట్టుబడ్డాడు. మిత్రుడికి చేసిన ఫోన్ కాల్ అతన్ని పోలీసులకు పట్టించింది. భార్యను చంపి మృతదేహాన్ని ముక్కలుగా కత్తిరించి సూట్‌కేస్‌లో పెట్టి బాత్రూమ్లో దాచి మహారాష్ట్రకు వెళ్తూ మార్గమధ్యంలో భార్య కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. మీ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పి కాల్ కట్ చేశారు. అదే సమయంలో ఇతను నివాసం ఉండే అద్దె ఇంటి కింద ఉన్న స్నేహితుడికి ఫోన్ చేసి తన భార్యను హత్యచేసినట్లు తెలిపాడు. స్నేహితుడి మొబైల్‌కు వచ్చిన ఫోన్ కాల్ ఆధారంగా పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పుణె మార్గమధ్యంలో సంచరిస్తున్నట్లు గుర్తించి అక్కడి పోలీసులకు సమాచారం చేరవేశారు. పుణె చేరుకోగానే రాకేశ్ కారు రోడ్డు పక్కన నిలిపి దుకాణంలో ఫినాయిల్‌ను కొనుగోలు చేసి తాగి ఆత్మహత్యకు ప్రయతి్నంచాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న పుణె పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. దీంతో ప్రాణాలతో బయటపడినట్లు పోలీసులు తెలిపారు. పుణెకు చేరిన హుళిమావు పోలీసులు పుణే వైపు వెళుతున్నట్లు సమాచారం అందుకున్న హుళిమావు పోలీసుల బృందం కూడా అక్కడికి చేరుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాకేశ్ కోలుకోగానే అదుపులోకి తీసుకుని నగరానికి తీసుకు వస్తారు. టెక్కీ రాకేశ్ భార్యను హత్య చేయడానికి కచ్చితమైన కారణం తెలియరాలేదు. కుటుంబ కలహాల కారణంతో హత్య చేసినట్లు సమాచారం ఉందని కమిషనర్ దయానంద్ శుక్రవారం విలేకరులకు తెలిపారు. అతడి ఆరోగ్యం స్దిరంగా ఉందని డాక్టర్లు తెలిపిన అనంతరం బెంగళూరుకు తీసుకువచ్చి విచారణ చేపడతామన్నారు. విచారణ అనంతరం భార్య హత్యకు కారణాలు ఏమిటో తెలియనుంది. మృతురాలు గౌరీ కుటుంబ సభ్యులు నగరానికి చేరుకోగా వారి నుంచి కూడా సమాచారం సేకరించామన్నారు. -
భార్యను హత్య చేసిన ఘటన.. టెకీ ఆత్మహత్యాయత్నం!
బెంగళూరు: భార్యను హత్య చేసిన భర్త, భర్తను హత్య చేసిన భార్య.. ఇవే ఇటీవల కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. వైవాహిక బంధాన్ని తేలిగ్గా తీసుకుంటున్నారో.. లేక ఆ బంధంలో భారాన్ని మోయలేకపోతున్నారో కానీ ఈ తరహా హత్యోదంతాలు కుటుంబాల్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి.తాజాగా మరో హత్య వెలుగుచూసింది. బెంగళూరులో టెకీగా పని చేస్తున్న 36 ఏళ్ల వ్యక్తి.. భార్యను హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాకేష్ రాజేంద్ర ఖేదకర్.. ఒక సాప్ట్ వేర్ కంపెనీలో ప్రొఫెషనల్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. అయితే భార్యా భర్తల మధ్య చోటు చేసుకున్న చిన్నపాటి గొడవ కారణంగా భార్య గౌరీ అనిల్ షెంబేకర్ (32)ను హత్య చేశాడు . బుధవారం వీరిద్దరూ కలిసి డిన్నర్ చేసే క్రమంలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే తన చేతిలో ఉన్న కత్తిని భర్తపైకి విసిరింది భార్య. దీంతో భర్త రాజేంద్రకు గాయమైంది. దాంతో సహనాన్ని కోల్పోయిన భర్త.. అదే కత్తితో భార్యపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. దాంతో ఆమె స్పాట్ లోనే చనిపోయింది.సూట్ కేస్ లో ప్యాక్ చేసి..అయితే భార్య మృతదేహాన్ని సూట్ కేస్ లో పార్శిల్ చేసి ఇంటి లోపల పెట్టిన భర్త.. అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఇదే విషయాన్ని తన అత్త మామలకు ఫోన్ చేసి చెప్పాడు. తాను మీ కూతుర్ని హత్య చేశానంటూ ఫోన్ చేప్పాడు. డెడ్ బాడీని బయట సూట్ కేస్ లో ప్యాక్ చేసినట్లు వెల్లడించాడు. దాంతో ఆ విషయాన్ని మహారాష్ట్ర పోలీసులకు సమాచారం అందించారు. అక్కడన్నుంచి కర్ణాటక పోలీసులకు సమాచారం అందడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ఒక ప్యాక్ చేసి ఉన్న ఒక సూట్ కేస్ కనిపించింది. అందులో మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్ మార్టంకు పంపగా అది హత్యగా ధృవీకరించారు. మెడపై, చాతీలో కత్తిపోట్లు ఉన్నట్లు పోస్టుమార్టం రిపోర్ట్ లో వెల్లడైంది.ఆత్మహత్యకు యత్నంభార్యను హత్య చేసిన తర్వాత పుణెకు పారిపోయాడు భర్త రాజేంద్ర.. అయితే అక్కడ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అతను ఎక్కుడున్నాడో విషయాన్ని ట్రేస్ చేసిన పోలీసులు.. పుణె పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు వెళ్లిన పుణె పోలీసులకు అతను అపస్మారక స్థితిలో కనిపించాడు. దాంతో అతన్ని పుణె ఆస్పత్రిలో చేర్చించారు. ఈ సమాచారం అందుకున్న బెంగళూరు పోలీసులు పుణెకు చేరుకున్నారు. రాజేంద్ర సృహలోకి వచ్చిన తర్వాత అరెస్ట్ చేసి బెంగళూరు తీసుకురానున్నట్లు పోలీసులు తెలిపారు.ఏడాది క్రితమే బెంగళూరుకు..మహారాష్ట్రకు చెందిన వీరిద్దరికి రెండేళ్ల క్రితమే వివాహం జరగ్గా, ఏడాది క్రితమే బెంగళూరుకు వచ్చారు. కొంతకాలంగా వీరి వైవాహిక సాఫీగానే సాగింది. భర్త ఒక ప్రైవేటు కంపెనీ సాప్ట్ వేర్ ఇంజనీర్ గా చేస్తున్నాడు. ప్రస్తుతం అతను వర్క్ ఫ్రమ్ హోమ్ విధులు నిర్వర్తిస్తున్నాడు. భార్య మాస్ మీడియలో బ్యాచలర్ డిగ్రీ కంప్లీట్ చేసింది. -
'విద్యార్థి భవన్ బెన్నే దోసె': యూకే ప్రధాని, ఐకానిక్ డ్రమ్మర్ శివమణి ఇంకా..
కొన్ని రెస్టారెంట్ ఏళ్లనాటివి అయినా.. అక్కడ అందించే రుచే వేరు అనిపిస్తుంది. ఎన్నో కొంగొత్త హైరేంజ్ రెస్టారెంట్లు వచ్చినా..! ఏళ్ల నాటి మధురస్మృతులకు నిలయమైన ఆ పాత రెస్టారెంట్లకే ఎక్కువ ప్రజాదరణ ఉంటుంది. ఎన్ని హంగు ఆర్భాటలతో ఐదు నక్షత్రాలలాంటి హోటల్స్ వచ్చినా.. వాటి క్రేజ్ తగ్గదు. కేవలం సామాన్యులే కాదు ప్రముఖులు, సెలబిట్రీలు సైతం అలనాటి రెస్టారెంట్ పాక రుచికే మొగ్గుచూపుతారు. వాటి టేస్ట్‌కి ఫిదా అంటూ కితాబిస్తారు కూడా. అలాంటి ప్రఖ్యాతిగాంచిన రెస్టారెంటే ఈ బెంగళూరుకి చెందిన 'విద్యార్థి భవన్'. ఈ రెస్టారెంట్ అందించే విభిన్న దోసె, వాటిని మెచ్చిన ప్రముఖులు గురించి ఈ కథనంలో సవివరంగా తెలుసుకుందామా..!. బెంగళూరు వాసులు ఇష్టపడే 1943ల నాటి రెస్టారెంట్ ఈ 'విద్యార్థి భవన్'. ఇది ఐకానిక్ బెన్నే దోసెలకు ఫేమస్. ఇక్కడ చేసే బెన్నే దోసెల రుచే వెరేలెవెల్. గాంధీనగర్‌లోని గల్లో ఉండే ఈ ఐకానిక్ రెస్టారెంట్ స్థానికులు, పర్యాటకులకు నోరూరించే రుచులతో మైమరిపిస్తోంది. ఎవ్వరైనా బెన్నే దోస తినాలంటే అక్కడకే వెళ్లాలనేంతగా పేరు తెచ్చుకుంది ఈ రెస్టారెంట్. నిత్యం రద్దీగా క్యూలైన్లు కట్టి ఉంటారు జనాలు ఆ రెస్టారెంట్ వద్ద. అంతేగాదు అక్కడ యాజమాన్యం 50% అడ్వాన్స్డ్ బుకింగ్ సీటింగ్‌కి ప్రాద్యాన్యత ఇస్తుందంటే..ఆ రెస్టారెంట్ ఎంత బిజీగా ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముందుగా బుక్ చేసుకోకపోతే వారాంతల్లో వెళ్లక పోవడమే బెటర్.ఈ రెస్టారెంట్ చరిత్ర..ఎనిమిది దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన ఈ రెస్టారెంట్లో బెన్నే దోసెలు, ఫిల్టర్ కాఫీలను ఆస్వాదించడానికి వచ్చే కస్టమర్లే ఎక్కువట. ఇక్కడ ఉండే సిబ్బంది కూడా విలక్షణంగా ఉంటారు. ఎందుకంటే ఒకేసారి ఎనిమిది ప్లేట్ల బెన్నెదోసెలను సర్వ్ చేస్తుంటారు. ఆ విధానం చూస్తే..కచ్చితం కళ్లు బైర్లుకమ్ముతాయి. దీన్ని 1943-1944 ప్రారంభంలో వెంకటరామ ఉడల్ నగరం వెలుపల విద్యార్థుల కోసం ఏర్పాటు చేశారు. అదీగాక ఆ టైంలో రెస్టారెంట్లకు చివర్లో భవన్ అని పెట్టేవారట. అలా దీనికి విద్యార్థి భవన్ అని పెట్టడం జరిగింది. అప్పట్లో ఈ రెస్టారెంట్ సమీపంలో ఉంటే ఆచార్య పబ్లిక్ స్కూల్, నేషనల్ కాలేజ్ తదితర సమీప పాఠశాల విద్యార్థులకు బోజనం అందుబాటులో ఉండేలా దీన్ని ఏర్పాటు చేశారు. అదీగాక ఆ రెస్టారెంట్ ఉన్న ప్రాంతం విద్యాసంస్థలకు నిలయం కావడంతో అనాతికాలంలోనే మంచి ఫేమస్ అయిపోయింది. అంతేగాదు ఇక్కడకు వచ్చే కస్టమర్లలో ఎక్కువ మంది ప్రముఖుల, సెలబ్రిటీలు, రచయితలేనట.ఈ దోసెను మెచ్చిన అతిరథులు..ముఖ్యంగా యూకే ప్రధాన మంత్రి రిషి సునక్, చెఫ్ సంజీవ్ కపూర్, స్టార్‌బక్స్ సహ వ్యవస్థాపకుడు జెవ్ సీగల్, ఐకానిక్ డ్రమ్మర్ శివమణి వంటి ఎందరో ఈ రెస్టారెంట్ బెన్నే దోసకు అభిమానులట. అంతేగాదు ఈ రెస్టారెంట్ అనగానే ఠక్కున గుర్తువచ్చేది బెన్నేదోసనే అట. అందువల్ల ఆ హోటల్ సిగ్నేచర్ డిష్‌గా ఆ వంటకం మారిపోవడం విశేషం. ఇక్కడ ఆ దోస తోపాటు ఇడ్లీలు, కేసరి బాత్ లేదా రవా బాత్, మేడు వడ వంటి విభిపకప అల్పాహారాలను కూడా సర్వ్ చేస్తారు. అంతేగాదు అక్కడ టిఫిన్ ముగించి చివరగా ఫిల్టర్ కాఫీని ఆస్వాదించకుండా వెళ్లరట. అంతలా ప్రజాదారణ పొందిన ఈ ఐకానిక్ విద్యార్థి భవన్ రెస్టారెంట్ రుచిని మీరు కూడా ఓ పట్టు పట్టేయండి మరీ..!.(చదవండి: work life Balance: అలా చేస్తే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఈజీ..! టెకీ సలహ వైరల్) -
నాన్నా.. నేనేం నేరం చేశాను..!
నాన్న.. పిల్లలకు కంటి రెప్ప, నాన్న.. పిల్లల భవిష్యత్ కు భరోసా, నాన్న..పిల్లలకు నడత నేర్పించే మార్గదర్శి.. అన్నింటీకి మించి నాన్న అంటే వెనుక ఉండి నడిపించే శక్తి. మరి అటువంటి నాన్న అత్యంత కర్కశంగా తన బిడ్డను చంపేసుకుంటే ఏమనాలి. రాక్షసుడు అనే పదం సరిపోదేమో. నాన్నే తన పాలిట రాక్షసుడై జీవితాన్నే ఛిదిమేస్తే.. ఆ నరక యాతన ఎంతలా ఉంటుంది. ‘నాన్నా.. నేనేం నేరం చేశాను’ అని అసువులు బాసేముందు మూగరోదన తప్ప.ఈ తరహా ఘటనలు ఎన్నో ప్రతీ రోజూ ఏదొకటి మనకు తారసపడుతూనే ఉన్నాయి. తాజాగా మహారాష్ట్రలోని పుణెలో తన కన్న కొడుకునే పొట్టబెట్టుకున్నాడు తండ్రి.. అభం శుభం తెలియని మూడున్నరేళ్ల చిన్నారి బాలుడిని దారుణంగా చంపేశాడు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా చేస్తున్న ఆ తండ్రి.. ఆ బాలుడి పాలిట యముడయ్యాడు. భార్యపై అనుమానంతో కొడుకును హత్య చేశాడు. అతి దారుణంగా హత్య..ఆ బాలుడి గొంతును కోసేసి, ఆ తర్వాత అటవీ ప్రాంతంలో పడేశాడు కర్కశ తండ్రి. మాధవ్ తికేతీ, స్వప్నాలకు హిమ్మాత్ మాధవ్ ఒకే ఒక్క కొడుకు. ఎంతో గారంగా పెరగాల్సిన ఆ చిన్నారి.. తల్లి దండ్రుల మనస్పర్థలకు బలయ్యాడు. ఒకవైపు భార్యపై అనుమానం పెంచుకున్నాడు మాధవ్ తికేతి. ఇదే విషయంలో వీరిద్దరికి తీవ్రమైన ఘర్షణ ఈ గురువారం జరిగింది. దాంతో కొడుకును తీసుకుని వెళ్లిపోయాడు మాధవ్ తికేతి. అయితే తిరిగిరాలేదు. కొడుకును హత్య చేసి పుణేలోని చందాన్ నగర్ ఫారెస్ట్ ఏరియాలో పడేశాడు. భర్త, కొడుకును తీసుకుని వెళ్లి ఇంకా తిరిగి రాలేదని భార్య స్వప్ప ఆందోళన చెందింది. పోలీసులకు సమాచారం అందించింది. దీనిపై మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆ పసిబాలుడు హత్యకు గురైనట్లు గుర్తించారు.హత్య చేసిన రోజు’(గురువారం) ఇంటి నుంచి మధ్యాహ్నం గం. 12.30 నిం.లకు కొడుకును తీసుకుని బయటకు వెళ్లిన మాధవ్ తివేతి.. ఆ తరువాత అదే రోజు గం. 2.30ని.లకు ఒక చోట పిల్లాడితో కనిపించినట్లు సీసీ టీవీ ఫుటేజ్ లో నమోదైంది. ఆపై అదే రోజు గం. 5.30 ని.లకు ఒంటరిగా వస్త్ర దుకాణంలో దుస్తులు కొనుగోలు చేసినట్లు సీసీ టీవీల ఫుటేజ్ ల ఆధారంగా గుర్తించారు. అంటే ఆ బాలుడ్ని గం. 2.30ని.ల నుంచి గం. 5.30 ని.ల మధ్యలో హత్య చేసి ఫారెస్ట్ ఏరియాలో పడేశాడు.దీనిపై గత రాత్రి(శుక్రవారం) ఆ బాలుడి తల్లి, మాధవ్ భార్య స్వప్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త.. కుమారుడిని తీసుకువెళ్లి ఇంటికి రాలేదని ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈరోజు(శనివారం) పిల్లాడు హత్య గావించబడిన విషయాన్ని గుర్తించారు. అదే సమయంలో మాధవ్‌ను అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకున్నారు. అయితే కొడుకును తానే చంపినట్లు మాధవ్ ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంకా కేసును దర్యాప్తు చేస్తున్నామని, హత్యా అభియోగాలు కింద కేసు కింద నమోదు చేసి విచారణ జరుపుతున్నామని ఒక సీనియర్ పోలీస్ అధికారి స్పష్టం చేశారు. -
మా గోడు వినండి..భార్య వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న భర్త కథ
లక్నో: కట్టుకున్న భార్య (wife) రాచిరంపాన పెడుతోందంటూ జీవితాల్ని అర్థాంతరంగా జీవితాల్ని ముగుస్తున్న భర్తల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఇప్పటికే బెంగళూరులో అతుల్ సుభాష్, కర్ణాటకలో ఓ కానిస్టేబుల్ తిప్పన్న.. రాజస్థాన్‌లో ఓ డాక్టర్ అజయ్.. ఇలా రోజుకొక ఉదంతం వెలుగులోకి వస్తోంది. ఇదిలా ఉండగానే.. ఉత్తరప్రదేశ్‌లో మరో అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది.ప్రముఖ టెక్ కంపెనీ టీసీఎస్ (tcs)లో మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న 25ఏళ్ల మానవ్ శర్మ(manav sharma) బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఫిబ్రవరి 24న తన ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు. అయితే,మరణానికి ముందు మానవ్ శర్మ ఆవేదనతో కూడిన ఆరు నిమిషాల 50 సెకన్ల నిడివిగల ఓ వీడియోను రికార్డ్ చేశాడు. ఆ వీడియోలో తన వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నాయని, తన భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని, ఇదే విషయంలో తనకు, తన భార్యకు గొడవలు జరిగేవని అన్నారు. అయినా తనలో మార్పు రాలేదన్నారు. మగాళ్లకు రక్షణే లేదామానవ్ శర్మ ఏడుస్తూ.. దేశంలో మహిళలను రక్షించేలా చట్టాలు ఉన్నట్లు.. పురుషులను రక్షించేలా చట్టాలు ఉంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశాడు. పురుషుల గురించి ఆలోచించండి’ అని న్యాయస్థానాల్ని వేడుకున్నాడు. పురుషులకు రక్షణ కల్పించకపోతే.. వారు అంతమవుతారని హెచ్చరించారు. కోడలి నిర్వాకం వల్లే ఈ సందర్భంగా తన మణికట్టుపై కత్తికోసుకున్న గుర్తులను చూపిస్తూ అంతకుముందు తాను ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు శర్మ వెల్లడించాడు. నా మరణానంతరం నా తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టొద్దని అర్జిస్తూ వీడియోను ముగించాడు. అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యపై సమాచారం అందుకున్న శర్మ తండ్రి సదర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన కుమారుడు మరణానికి తన కోడలు కారణమని ఆరోపించారు.అన్నీ అవాస్తవాలేమానవ్ శర్మ ఆత్మహత్యపై ఆయన సతీమణి ఖండించారు. నా భర్త మద్యానికి బానిసయ్యారు. అతిగా మద్యం సేవించి పలుమార్లు ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించారు. మూడు సార్లు నేనే రక్షించా. మద్యం సేవించిన తరువాత నాపై దాడి చేసేవారు. ఇదే విషయాన్ని తన అత్తమామల దగ్గర ప్రస్తావించినా వారు పట్టించుకోలేదు.అవన్నీ పెళ్లికి ముందే.. పెళ్లి తర్వాత భర్తే నా సర్వసంవివాహేతర సంబంధంపై మీడియా ఆమెను ప్రశ్నించగా..అవన్నీ పెళ్లికి ముందే. పెళ్లి తర్వాత భర్తే నా సర్వసం’అని అన్నారు. ఈ సందర్భంగా వాట్సాప్ చాట్‌ను బహిర్ఘతం చేశారు. ఆ చాట్‌లో దీదీ, దయచేసి ఏదో ఒకటి చేయండి. తనను తాను చంపుకుంటాడు అని తన భర్త సోదరికి(వదిన) మెసేజ్ చేసింది. బదులుగా అతన్ని ఒంటరిగా ఉండనివ్వండి. నిద్రపోండి’ అని బదులిచ్చినట్లు గమనించవచ్చు.ఇప్పటి వరకూ జరగని అరెస్టులుమానవ్ శర్మ ఆత్మహత్యపై ఆగ్రా ఏఎస్పీ వినయక్ గోపాల్ మాట్లాడారు. ‘మాకు ఆగ్రాలోని మిలటరీ హాస్పిటల్లో మానవ్ మృతదేహం ఉందనే సమాచారం వచ్చింది. మానవ్ బలవన్మరణానికి పాల్పడ్డారు. అతని ఆత్మహత్య కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు. బాధితుడు రికార్డ్ చేసిన వీడియోను గుర్తించాం. అందులో తన భార్యతో విభేదాలు, ఇతర సమస్యల కారణంగా ప్రాణాలు తీసుకున్నట్లు గుర్తించామని’ చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. -
'ఉచితంగా పనిచేస్తా.. ఉద్యోగమివ్వండి': టెకీ పోస్ట్ వైరల్
చదువు పూర్తయిన తరువాత మంచి జాబ్ తెచ్చుకోవాలని, ఎక్కువ ప్యాకేజ్ పొందాలని అనుకుంటారు. కానీ ఇటీవల ఒక టెకీ 'ఉద్యోగం ఇవ్వండి, ఉచితంగానే పని చేస్తా' అని అంటున్నాడు. అతని రెజ్యూమ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్.. తాను 2023లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశానని, కానీ దాదాపు రెండు సంవత్సరాల తర్వాత కూడా సమయం ఉద్యోగం పొందలేకపోయానని చెప్పాడు. ఉద్యోగం సంపాదించాలనే తపనతో, ఉచితంగా పనిచేయడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నాడు.నా రెజ్యూమ్‌ను కాల్చండి.. కానీ దయచేసి సహాయం చేయండి. సమీపంలో ఉద్యోగం దొరికితే ఉచితంగానే చేస్తాను. ఉద్యోగం కోసం వేచి చూస్తున్నాను.. అని ఆ యూజర్ రెడ్డిట్‌లో రాశారు. “నేను జావా, పైథాన్, డెవ్ఆప్స్ (DevOps), క్లౌడ్ కంప్యూటింగ్,మెషిన్ లెర్నింగ్ వంటి వాటిలో ప్రావీణ్యం పొందాను. సీఐ/సీడీ పైప్లైన్లు, డాకర్, కుబెర్నెట్స్, ఏపీఐ డెవలప్మెంట్తో పనిచేసిన అనుభవం కూడా ఉందని.. రెజ్యూమ్‌లో పేర్కొన్నాడు.ఇదీ చదవండి: జీతాల పెంపుపై టీసీఎస్ ప్రకటన.. ఈ సారి ఎంతంటే?కాలేజీలో చదువు పూర్తయిన తరువాత.. ఫుల్ టైమ్ జాబ్ పొందలేకపోయాను. ఇప్పటికే రెండు కంపెనీలలో ఒక్కో నెల ఇంటర్న్‌గా పనిచేశాను. ఇంటర్న్‌షిప్‌లు, ఫ్రీలాన్స్ గిగ్‌లు లేదా ఓపెన్-సోర్స్ ప్రాజెక్ట్‌లు వంటి ఏవైనా అవకాశాల గురించి ఎవరికైనా తెలిస్తే దయచేసి చెప్పండని టెకీ తన పోస్టులో పేర్కొన్నాడు.నేను ప్రొడక్ట్ ఇంజనీర్ ఇంటర్న్, టెక్నికల్ ఇంటర్న్‌గా ఇంటర్న్‌షిప్‌లు చేస్తున్నప్పుడు.. వెబ్ క్రాలర్లు, ఏపీఐ టెస్టింగ్, ఎంఎల్ సిస్టమ్‌లపై పనిచేశాను. ఐఈఈఈలో రీసర్చ్ పేపర్ కూడా సబ్మిట్ చేశాను. డీప్ లెర్నింగ్, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్లో ప్రాజెక్టులను నిర్మించాను" అని టెకీ చెప్పారు.Burn my resume but please help. Desperate & Ready to Work for Free Remotely – 23' Grad Looking for a Job ASAPbyu/employed-un inIndianWorkplace -
నా జీతం 7కోట్లు.. ఏం చేసుకోను.. నా భార్య విడాకులు అడుగుతోంది!
మీరు చెప్పినట్లేగానే నేను వారానికి 70గంటలకు పైగా పనిచేశా. చివరికి నాకు మిగిలిందేంటి? నా భార్య విడాకులు ఇవ్వమని అంటోంది. ఇప్పుడేం ఏం చేయాలో అర్థం కావడం లేదంటూ ఓ టెక్కీ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.ఇటీవల, ప్రపంచ దేశాలతో పోటీపడాలంటే భారత్‌లోని యువత వారానికి 70గంటల పాటు పనిచేయాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సూచించారు. అయితే, నారాయణ మూర్తికి సూచనకు పలువురు మద్దతు పలికితే.. మరికొందరు విమర్శించారు. ప్రముఖ సంస్థ లార్సన్ అండ్ టూబ్రో (ఎల్అండ్టీ) చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ మరో అడుగు ముందుకేసి వారానికి 90 గంటలు పనిచేయండి. ఎంత కాలం భార్యలను చూస్తూ కూర్చుంటారు? అని ప్రశ్నించారు. అలా మీరు చెప్పినట్లు చేస్తే అందరికి నాకు పట్టిన గతే పడుతోంది. మీరు చెప్పినట్లుగా చేసినందుకే నా భార్య నన్ను విడాకులు కోరుతోంది’అని ఓ టెక్కీ పరోక్షంగా సోషల్ మీడియా వేదికగా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు.ప్రస్తుతం, ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. ప్రముఖలు చెప్పినట్లుగా పనిచేసే తమ భవిష్యత్ ఇలాగే ఉంటుందేమోనంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.పేరు ప్రస్తావించని టెక్కీ.. అధిక పనిగంటల కారణంగా తన జీవితంలో ఎదురైన సంఘటనను ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ సైట్ బ్లిండ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. ఆ పోస్టులో ‘నేను ఐటీ రంగంలో ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని కలలు కన్నా. కలల్ని సాకారం చేసుకునే ప్రయత్నంలో మూడేళ్లలు అహర్నిశలు కష్టపడి పనిచేశా. ప్రమోషన్ కోసం జూనియర్ నుంచి సీనియర్ స్థాయికి చేరుకున్నాను. జీతం, ప్రమోషన్ పెరిగే కొద్ది పనికూడా పెరిగింది. ఎంతలా అంటే నా విధుల్లో భాగంగా యురోపియన్ యూనియన్ దేశాలతో పాటు ఆసియా దేశాల ఉద్యోగుల్ని సమన్వయం చేసుకోవాల్సి వచ్చేంది. ఫలితంగా, ఆఫీస్ మీటింగ్స్ సైతం ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 9 గంటలకు ముగిసేవి. అది చాలదన్నట్లు కొన్ని సార్లు రోజుకు 14 గంటలు కంప్యూటర్‌తో కుస్తీ పడేవాడిని. ఆ కష్టానికి ప్రతిఫలం దక్కింది. మూడేళ్లకే సీనియర్ మేనేజర్‌గా ప్రమోషన్‌తో పాటు ఏడాదికి రూ.7.8 కోట్ల జీతం కూడా తీసుకున్నాను.కానీ ఏం లాభం ఇప్పుడు నా భార్య నాకు విడాకులు కావాలని అడుగుతోంది. అందుకు కారణం నేనే. ఆఫీస్ వర్క్ కారణంగా నా భార్య డెలివరీ సమయంలో అందుబాటులో లేకపోయాను. డెలివరీ తర్వాత తనతో గడిపానా అంటే అదీలేదు. తోడు లేక, నా కూతురు పుట్టిన రోజులకు అటెండ్ కాలేకపోయాను. పాపం నా భార్య డిప్రెషన్‌కు గురైంది. డిప్రెషన్ ఎక్కువైంది. డాక్టర్‌కు చూపించుకోవాలని అడిగేది. అది సాధ్యమయ్యేది కాదు. చివరికి ఈ బాధల్ని తట్టుకోలేక నా భార్య విడాకులు ఇవ్వమని అడిగింది. ఇప్పుడు నాకు ఏం చేయాలో పాలుపోవడం లేదు."నా జీవితంలో నేను ఏమి చేస్తున్నానో, ఏ కోల్పోయానోనని నన్ను నేను ప్రశ్నించుకోకుండా ఉండలేకపోతున్నాను. కానీ ఈ లేఆఫ్ తుఫాన్ యుగంలో నా దగ్గర ఉన్నదానితో నేను సంతోషంగా ఉండాలి కదా? కానీ సంతోషంగా ఎలా ఉండాలి?’ అని ప్రశ్నిస్తూ తన పోస్ట్‌కు ముగింపు పలికాడు. View on Blind -
సాధారణ టెకీ.. రూ.5 కోట్ల నెట్‌వర్త్..
కోటీశ్వరులు కావాలని, సంపద పెంచుకోవాలని చాలా మంది కలలు కంటారు. కానీ కొంత మంది మాత్రమే వాటిని నిజం చేసుకుంటారు. అలాంటి వారిలో ఒకరు గుర్గావ్కు చెందిన యాక్సెంచర్ ఉద్యోగి గుర్జోత్ అహ్లువాలియా. కేవలం 11 ఏళ్లలో జీరో నుండి రూ. 5 కోట్ల నెట్‌వర్త్‌ను నిర్మించుకున్నారు. తన అద్భుతమైన ఆర్థిక ప్రయాణాన్ని ఆయనే వెల్లడించారు.2025లో ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్న అహ్లువాలియా.. తాను సాధించిన మైలురాయిని సోషల్ మీడియాలో పంచుకున్నారు. 2024 తనకు అతిపెద్ద విజయంగా అభివర్ణించారు. రూ. 5 కోట్ల నెట్‌వర్త్‌ను చూపుతున్న తన ఆర్థిక ట్రాకింగ్ యాప్ స్క్రీన్‌షాట్‌ను కూడా అహ్లువాలియా పోస్ట్ చేశారు. ఇందులో రూ. 2.7 లక్షల మేర మాత్రమే అప్పులు చూపుతోంది.మూడే సూత్రాలు తన విజయానికి మూడు అంశాల విధానం కారణమని అహ్లువాలియా చెబుతున్నారు. అవి అధిక ఆదాయాల కోసం కెరీర్ పురోగతి, ఆలస్యమైన సంతృప్తి ద్వారా క్రమశిక్షణతో కూడిన పొదుపు, వ్యూహాత్మక ఈక్విటీ పెట్టుబడులు. ఇవే కేవలం 11 ఏళ్లలో తాను రూ. 5 కోట్ల నెట్‌వర్త్‌ను చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాయని ఆయన చెబుతున్నారు.జీతం పొందే మధ్యతరగతి వ్యక్తి నుండి రూ. 5 కోట్ల నెట్‌వర్త్‌కు చేరడానికి రెండు ముఖ్య కారణాలు ఉన్నాయని ఆయన గుర్తించారు. ఒకటి అప్పు లేకపోవడం (విద్యకు తల్లిదండ్రులు నిధులు సమకూర్చినందున) అద్దె ఖర్చు లేకపోవడం (ఆయన తల్లిదండ్రులతో కలిసే ఉంటున్నారు). అయితే ఇటీవలి మార్కెట్ దిద్దుబాట్లు తన నెట్‌వర్త్‌లో 8-10% క్షీణతకు దారితీశాయని కూడా ఆయన అంగీకరించారు.Hitting this milestone was my biggest achievement in 2024.A salaried middle class person like me went from 0 to ₹5,00,00,000 in 11 years.3 Key Elements1. Professional Growth - high income2. Aggressive savings - delay gratification3. Equity investing - owning businesses pic.twitter.com/t3niPluPW7— Gurjot Ahluwalia (@gurjota) February 2, 2025 -
‘సుప్రీం’ ఆదేశాలు.. తల్లి వద్దే అతుల్ సుభాష్ కుమారుడు!
న్యూఢిల్లీ: భార్య వేదింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డ బెంగళూరు టెక్కీ అతుల్ సుభాష్ నాలుగేళ్ల కుమారుడి సంరక్షణ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే అంశంపై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. బాలుడి తల్లి నిఖితా సింఘానియా సంరక్షణలోనే ఉంచాలని సుప్రీం కోర్టు ఈ మేరకు తీర్పిచ్చింది. తన మనువడిని తనకు అప్పగించాలని కోరుతూ అతుల్ సుభాష్ తల్లి అంజు దేవి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌పై దేశ అత్యున్నత న్యాయ స్థానంలో ఇవాళ విచారణ జరిగింది. బాలుడి కస్టడీని కోరిన సుభాష్ తల్లి అంజు దేవి చేసిన విజ్ఞప్తికి ప్రతిస్పందనగా సుప్రీం కోర్టు ధర్మాసనం జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎస్సీ శర్మ సోమవారం అతుల్ సుభాష్ కుమారుడు ఆన్లైన్లో వీడియో ద్వారా మాట్లాడారు. అనంతరం తీర్పును వెలువరించారు.విచారణ సందర్భంగా అతుల్ సుభాష్ కుమారుణ్ని న్యాయమూర్తులకు చూపించేందుకు నిఖితా సింఘానియా నిరాకరించారు. దీనిపై జస్టిస్ బీవీ నాగర్నత ధర్మాసనం మాట్లాడుతూ.. ఇది హెబియస్ కార్పస్ పిటిషన్. మేం ఆ పిల్లాడిని చూడాలనుకుంటున్నాం. వెంటనే మాకు చూపించండి. బాలుడిని విచారణ చేపట్టిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. విచారణ సందర్భంగా అతుల్ సుభాష్ కుమారుణ్ని న్యాయమూర్తులకు చూపించేందుకు నిఖితా సింఘానియా నిరాకరించారు. దీనిపై జస్టిస్ బీవీ నాగర్నత ధర్మాసనం మాట్లాడుతూ.. ఇది హెబియస్ కార్పస్ పిటిషన్. మేం ఆ పిల్లాడిని చూడాలనుకుంటున్నాం. వెంటనే మాకు చూపించండి. బాలుడిని విచారణ చేపట్టిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. కోర్టు వ్యాఖ్యలపై 45 నిమిషాల విరామం తర్వాత బాలుడు వీడియో లింక్‌లో ప్రత్యక్షమయ్యాడు. వీడియోలో కనిపిస్తున్న అతుల్ సుభాష్ కుమారుడితో మాట్లాడారు. ఆ సమయంలో కోర్టు విచారణను ఆఫ్ లైన్ చేసింది. ఇక బాలుడితో మాట్లాడిన తర్వాత అతుల్ సుభాష్ భార్య నిఖితా సింఘానియా కుటుంబసభ్యుల సమక్షంలో ఉండాలని సుప్రీం అత్యున్నత న్యాయ స్థానం తీర్పును వెలువరించింది. అతుల్ సుభాష్ కేసేంటి?ఉత్తర ప్రదేశ్‌కు చెందిన అతుల్ సుభాష్, నిఖిత 2019లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆ జంట బెంగళూరుకు వెళ్లి తమ తమ ఉద్యోగాల్లో చేరింది. ఆ మరుసటి ఏడాది వారికి బాబు పుట్టాడు. 2021లో నిఖిత బెంగళూరులోని భర్తను విడిచిపెట్టి కొడుకుతో సహా పుట్టింటికి చేరింది. ఆపై భర్త, అతని కుటుంబంపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. అలా.. విచారణ కోసం అతుల్‌ను భార్య స్వస్థలం జౌన్‌పురలోని ఫ్యామిలీ కోర్టుకు కోసం వెళ్లాల్సి వచ్చేది. ఈ క్రమంలో.. మానసికంగా, శారీరకంగా అలసిపోయిన అతుల్ సుభాష్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. చనిపోయే క్రమంలో తన భార్య, ఆమె కుటుంబం ఏ స్థాయిలో మానసికంగా వేధించిందో పేజీల కొద్దీ రాసిన సూసైడ్ లేఖ, 90 నిమిషాల నిడివితో తీసిన సెల్ఫీ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. కొడుకును అడ్డుపెట్టుకుని తన భార్య ఆర్థికంగా తనను దోచుకుందని.. న్యాయస్థానంలోనూ తనకు అన్యాయం జరిగిందని, ఇంక తన వల్ల కాకనే ఇలా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నాడతను. అంతేకాదు.. తన కొడుకును తన తల్లిదండ్రులకు అప్పగించాలని ఆఖరికి కోరికగా కోరాడు. ఈ ఘటన తర్వాత.. లక్షల మంది మద్ధతుతో మెన్టూతో పాటు జస్టిస్ ఈజ్ డ్యూ, జస్టిస్ ఫర్ అతుల్ ట్యాగ్స్ ట్రెండింగ్‌లో కొనసాగాయి.అతుల్ సోదరుడి ఫిర్యాదు మేరకు బెంగళూరు పోలీసులు.. పరారీలో ఉన్న నిఖితా సింఘానియాను, ఆమె తల్లీ, సోదరుడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా.. రిమాండ్ విధించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతుంది. -
Cyber Scam: రూ. 11 కోట్లు పోగొట్టుకున్న టెకీ..!
బెంగళూరు: ‘ మీరు సైబర్ స్కామ్ నేరగాళ్ల(Cyber Scam) నుంచి జాగ్రత్తగా ఉండండి. తాము ప్రభుత్వ అధికారులమని మీ వివరాలు కావాలంటూ ఫోన్ చేసే వారి పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండండి’ అంటూ మనకు ఫోన్లో కాలర్ టోన్ రూపంలో తరచు వినిపిస్తున్న మాట. అది పాట అయినా మాట అయినా కానీ ఆ కాలర్ ట్యూన్ ఉద్దేశం మాత్రం.. ఫోన్ చేసే ఎవరైనా మీ వ్యక్తిగత డేటా ఏ రూపంలో అడిగినా ఇవ్వొద్దనేది దాని సారాంశం.అయితే బెంగళూరు టెకీ(Bengaluru Techie) మాత్రం,, అచ్చం ఇదే తరహాలో మోసం పోయి రూ. 11 కోట్లు పోగొట్టుకున్నాడు. ఓ సంస్థలో టెకీగా ఉద్యోగం చేస్తూ కొంత నగదును ‘మార్కెట్ ఇన్వెస్ట్మెంట్’లో పెట్టాడు. రూ. 50 లక్షలు పెడితే దాని విలువ రూ. 12 కోట్లకు చేరింది.ఈ విషయాన్ని పసిగట్టిన నిందితుడు.. బాధితుడ్ని అత్యంత చాకచక్యంగా వలలో వేసుకున్నాడు. విజయ్ కుమార్ అనే టెకీ నుంచి భారీ మొత్తంలో దోచుకుపోయాడు. తాము ఈడీ అధికారులమని, ప్రభుత్వ అదికారులమని చెబుతూ విజయ్ కుమార్ భయభ్రాంతలకు గురి చేసిందో ఓ ముఠా. మీరు మనీ లాండరింగ్ కేసులో ఉన్నారని, మిమ్ముల్ని అరెస్ట్ చేస్తామని తరచు బెదిరింపులకు పాల్పడ్డారు. దాంతో భయపడిన విజయ్ కుమార్.. వారు చెప్పినట్లు చేశాడు. వారు అడిగిన ఆధార్, పాన్ కార్డువివరాలతో పాటు తన వ్యక్తిగత బ్యాంకింగ్ సమాచారాన్ని కూడా వారికి అందించాడు.అంతే.. దాంతో సైబర్ నేరగాళ్ల పని ఈజీ అయ్యింది. ఇంకేముంది బాధితుడికి ఉన్న ఏడు బ్యాంక్ అకౌంట్ల నుంచి రూ. 11 కోట్లను స్వాహా చేశారు. సుమారు ఏడు కోట్ల రూపాయలను ఒకే అకౌంట్ సుంచి దొంగిలించడం గమనార్హం.ముగ్గుర్ని అరెస్ట్ చేసిన పోలీసులుతాను నష్టపోయిన తర్వాత అసలు విషయం తెలుసుకున్నబాధితుడు విజయ్ కుమార్ లబోదిబో మన్నాడు. పోలీసుల్ని ఆశ్రయించాడు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఇదే దుబాయ్ కేంద్రంగా జరిగినట్లు తెలుస్తోంది. ఈ స్కామ్(Cyber Fraud) కు సంబంధించిన ఘటనలో తరుణ్ నటానీ, కరణ్, దవల్ షాలను అరెస్ట్ చేశారు. షా అనే నిందితుడు దుబాయ్ చెందిన సైబర్ స్కామ్‌లో ఆరితేరిన ఓ వ్యక్తి సలహాలు ఇచ్చినట్లు సమాచారం. దీనికి గాను కోటిన్నరకు ఒప్పందం చేసుకున్నాడు సదరు దుబాయ్ చెందిన సైబర్ నేరగాడు. -
వింటేజ్ క్రేజ్ : ఆమె ‘పద్మిని’ జాతి స్త్రీ... ఇంట్రస్టింగ్ స్టోరీ!
నీకు ఇష్టమైన కారు ఏదో చెప్పు? అంటే క్రెటా అనో ఆడి అనో మెర్సిడెస్ అనో, బిఎండబ్ల్యూ అనో...ఇంకా మరికొన్ని అత్యాధునిక, ఖరీదైన లగ్జరీ కార్ల పేర్లు చెప్పేవాళ్లనే మనం చూసి ఉంటాం కాబట్టి అదేమీ విశేషం కాదు. కానీ నీ కలల కారు గురించి చెప్పు అంటే ప్రీమియర్ పద్మిని అని ఎవరైనా చెబితే... కేవలం ఆశ్చర్యపోవడం మాత్రమే కాదు స్పృహ తప్పినా ఆశ్చర్యం లేదు. అవును మరి ప్రీమియర్ పద్మిని అనే కార్ ఒకటి ఉండేదని, ఉందని కూడా చాలా మందికి తెలియని నవ నాగరిక ప్రపంచంలో... ఆ పురాతన కార్ కోసం అన్వేషించి పట్టుకుని అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని దానికి జవసత్వాలను సమకూర్చి.. తన పుట్టిన రోజున తనకు దక్కిన అపురూప బహుమతిగా మురిసిపోతూ ప్రపంచానికి పరిచయం చేయడం ఏదైతే ఉందో... అందుకే ఆ అమ్మాయి నెటిజన్ల ప్రశంసలకు నోచుకుంటోంది.సొగసైన, హై–టెక్ కార్లు రోడ్లపై ఆధిపత్యం చెలాయించే కార్పొరేట్ ప్రపంచంలో, ఒక బెంగళూరు ఐటీ ఉద్యోగిని క్లాసిక్ కార్ ప్రీమియర్ పద్మినికి సరికొత్త యజమానిగా మారారు. భారతదేశంలో ఒకప్పుడు హుందాతనానికి అధునాతనతకు చిహ్నంగా కొంత కాలం పాటు హల్చల్ చేసిన ఈ కారు, గడిచిన విలాసవంతమైన యుగానికి ప్రాతినిధ్యం వహించింది అని చెప్పొచ్చు. అంతేకాదు రచన మహదిమనే అనే యువతి చిన్ననాటి జ్ఞాపకాలలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది.ఆమె ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా తాను కొనుగోలు చేసిన పాతకాలపు కారును, ఇంటికి తెచ్చుకున్న ఆనందాన్ని తన అనుభవాన్ని ఇన్‌స్ట్రాగామ్‌లో వీడియోలో పంచుకున్నారు. View this post on Instagram A post shared by Rachana Mahadimane (@rachanamahadimane) ఆమె తన ప్రియమైన ప్రీమియర్ పద్మిని మహదిమనే తన చిన్ననాటి కలను జీవం పోస్తున్నట్లు వీడియో చూపిస్తుంది. కొన్నేళ్ల తర్వాత తన కలల కారును ఎలా కనిపెట్టిందో ఆమె దీనిలో తెలియజేసింది. నెలల తరబడి ఖచ్చితమైన చేయించిన మరమ్మతులు అందమైన పౌడర్ బ్లూ పెయింట్ జాబ్ తరువాత, పాతకాలపు కారు ఎలా దాని పూర్వ వైభవానికి పూర్వపు అందానికి చేరుకుందో వివరించింది.‘నాకు నేను పించింగ్ వేస్తున్నాను. నా పుట్టినరోజు కోసం నేను ఈ కారు కొన్నాను ఇది నా కలల కారు, నేను చిన్నప్పటి నుండి ఈ కారు గురించి కలలు కన్నాను‘ అని ఎమ్మెల్యే మహదిమనే వీడియోలో తెలిపారు. ఆమె చిన్ననాటి జ్ఞాపకాలు ఎన్నో ఈ కార్‌తో ముడిపడి ఉండడం తో ఈ కార్ తనకొక భావోద్వేగ అనుబంధం అంటూ ఆ యువతి పొందుతున్న ఉద్వేగాన్ని ఇప్పుడు నెటిజనులు సైతం ఆస్వాదిస్తున్నారు.‘‘గత ‘సంవత్సరాన్ని అత్యద్భుతంగా ముగించడం అంటే ఇదే ఇది ఇంతకంటే మెరుగ్గా ఏదైనా ఉండగలదా? నా డ్రీమ్ కారులో ఓపికగా పనిచేసి, దానిని ఈ అందానికి మార్చినందుకు కార్ రిపేర్ చేసిన బృందానికి ధన్యవాదాలు’’ అంటూ ఆమె ఈ వీడియోలో చెప్పింది.అత్యాధునిక ఖరీదైన కార్లు లేదా మరేదైనా సరే కొనుగోలు చేయడం అంటే మనం సాధించిన, అందుకున్న విజయ ఫలాలను నలుగురికీ ప్రదర్శించడమే కావచ్చు కానీ పాతవి, మరపురాని మధుర జ్ఞాపకాలను నెమరువేసుకోవడం, ఆ అనుభూతులను తిరిగి మన దరికి చేర్చుకోవడం మాత్రం ఖచ్చితంగా గొప్ప విజయమే అని చెప్పాలి. అలాంటి విజయాలను అందిస్తుంది కాబట్టే... వింటేజ్ ఇప్పటికీ కొందరికి క్రేజ్. -
నాడు టెక్కీ ఇవాళ లెహంగాల వ్యాపారవేత్త.. ఏడాదికి రూ. 5 కోట్లు..
ఓ టెక్కీ ఫ్యాషన్ రంగంలోకి అడుపెట్టి అద్భుతమైన డిజైన్లను క్రియేట్ చేసి ఫ్యాషన్‌కే సరికొత్త అర్థం ఇచ్చాడు. మహామహా ఫ్యాషన్ డిజైనర్లకు పోటీ ఇచ్చేలా లెహాంగాలు తీర్చిదిద్ది ఫ్యాషన్ సామ్రాజ్యాన్ని ఏలుతున్నాడు. ఏడాదికి రూ 5 కోట్ల టర్నోవర్‌తో దూసుకుపోతూ స్టైలిష్ రంగంలో తనదైన ముద్ర వేశాడు. ఎవరతను..? ఎలా ఈ రంగంలోకి వచ్చారు. మనీష్ మల్హోత్రా, అనామిక ఖన్నా, నాన్సి త్యాగి వంటి ప్రముఖ డిజైనర్లు భారతీయ ఫ్యాషన్‌ని తమదైన శైలిలో పునర్నిర్వచించారు. ఆ కోవలోకి సూరత్‌కి చెందిన మాజీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మయూర్ భరత్‌భాయ్(Mayur Bharatbhai) కూడా చేరిపోయాడు. ఆయన మహిళల కోసం తయారు చేసే ప్రసిద్ధ పెళ్లి లెహంగాల(Lehenga Business) బీఎల్ ఫ్యాబ్రిక్ వ్యవస్థాపకుడు. ఈ కంపెనీ మూడు రకాల ఎంబ్రాయిడరీ లెహంగాలను తయారు చేస్తుంది. థ్రెడ్‌వర్క్, జరీ వర్క్, సీక్విన్ వర్క్‌లతో రూపొందిస్తుంది. ఈ కంపెనీకి చెందిన సెమీ-స్టిచ్డ్ లెహంగాలు చాలా సరసమైన ధరకే అందుబాటులో ఉంటాయి. ఈస్టార్టప్ వెంచర్ తన ఉత్పత్తులను సాంప్రదాయ మార్కెట్ల కంటే దాదాపు 65% నుంచి 70% వరకు తక్కువ ధరకే విక్రయిస్తుంది. అంతేగాదు వినియోగదారులు తమకు నచ్చిన రీతిలో లెహంగాలను డిజైన్ చేయించుకునే వెసులబాటు కూడా అందిస్తోది. అందుకోసం ఈ కంపెనీలో దాదాపు 25 మంది అంతర్గత కళాకారుల బృందం ఉంటారు. ప్రస్తుతం ఈ ఎల్బీ ఫ్యాబ్రిక్ వద్ద దాదాపు 200 డిజైన్ల అద్భుతమైన కలెక్షన్లు ఉన్నాయి ప్రారంభమైంది..మయూర్ తన దుస్తుల వ్యాపారాన్ని 2021లోనే ప్రారంభించారు. అంతకుముందు తన సోదరుడి దుస్తుల వ్యాపారంలో కొన్నాళ్లు పనిచేశారు. ఆయన సృజనాత్మకతతో కూడిన పనికి ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆ ఆసక్తే ఆయన్ను సాఫ్ట్వేర్ రంగం నుంచి ఫ్యాషన్వైపు అడుగులు వేసేలా చేసింది. గతేడాది సెప్టెంబర్ నాటికి బీఎల్ ఫ్యాబ్రిక్ 10 శాతం నికర లాభల మార్జిన్‌తో సుమారు రూ. 5 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అంటే ఈ కంపెనీ 2025 నాటికి రూ. 18 కోట్లకు చేరుకుంటుందని అంచనా. అంతేగాదు సోనీ టెలివిజన్ సీరీస్ షార్క్‌ట్యాంక్ ఇండియా 4(Shark Tank India 4)సీజన్లో న్యాయూమర్తులుగా వ్యవహరించే కునాల్ బహల్, రితేష్ అగర్వాల్ నుంచి కూడా 5% ఈక్విటీకి ఒక కోటి రూపాయల ఉమ్మడి షరతులతో కూడిన ఆఫర్‌ని అందుకుని ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారారు. అంతేగాదు ఈ షో కోసం తానే స్వయంగా డిజైన్ చేసిన దుస్తులను ధరించారు మయూర్. కుర్తా డిజైన్ కోసం నల్లటి ఫాక్స్ జార్జెట్ ఫాబ్రిక్ను ఎంచుకున్నారు. నీలం, గులాబీ, ఆకుపచ్చ , తెలుపు రంగుల బహుళ వర్ణ షేడ్స్‌లో సంక్లిష్టమైన ప్రకృతి-ప్రేరేపిత అలంకరణతో పరిపూర్ణ వైవిధ్యాన్ని అందించారు. ఒక ఇంజనీర్ ఫ్యాషన్ పరిశ్రమలో తన క్రియేషన్స్‌తో అద్భుతాలు సృష్టించి, ఆధాయాలు ఆర్జించడం విశేషం. View this post on Instagram A post shared by 🅑🅛 🅕🅐🅑🅡🅘🅒 (@blfabric) (చదవండి: మంచు దుప్పటిలో విలక్షణమైన ఇల్లు..ఒక్క రాత్రికి ఎంతో తెలుసా...!) -
8 నెలల్లోనే ప్రమోషన్.. రూ.80 లక్షల బోనస్
గూగుల్ కంపెనీలో మూడేళ్లకు పైగా పనిచేసిన ఒక మాజీ ఉద్యోగి.. తన ప్రమోషన్ గురించి, 30 శాతం పెంపు ఎలా వచ్చింది అనే విషయాన్ని గురించి థ్రెడ్‌లో వెల్లడించాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన 'జెర్రీ లీ' అనే వ్యక్తి 2018లో గూగుల్‌లో చేరాడు. ఆ తరువాత అతి తక్కువ కాలంలోనే సీనియర్ స్ట్రాటజీ అండ్ ఆపరేషన్స్ మేనేజర్‌గా ఎదిగారు. తన పోస్ట్‌లో..తన సహచరులు ఎక్కువగా తనను బాధ్యతగా భావించారని వెల్లడించాడు.గూగుల్‌లో నా మొదటి రెండు నెలలు? నిజాయితీగా, అవి విచిత్రంగా సాగాయని వివరించాడు.పనిని సులభంగా తీసుకో అని చెప్పడం, ఉచిత భోజనం తినమని చెప్పడం, క్యాంపస్ చూడమని చెప్పడం చేసేవారు. ఎందుకంటే నేను కంపెనీలో ఉన్న ఇతరుల కంటే చిన్నవాడిని. ఆరు ఏళ్లు దాటిన వారితో కూడిన బృందంలో వారు నన్ను మొదటి కొన్ని నెలలపాటు నెగిటివ్‌గా చూశారని భావించినట్లు పేర్కొన్నాడు.రెండు నెలలు గడిచినా ఏమీ చేయకపోవడంతో విసుగు వచ్చిందని, ఎలాగైనా తన విలువ పెంచుకోవాలని భావించానని చెప్పాడు. నేను ప్రాజెక్ట్‌ల కోసం అడగడం మొదలుపెట్టాను. చివరగా నా మేనేజర్లలో ఒకరు, మీరు ఈ మార్కెట్ ల్యాండ్‌స్కేప్ విశ్లేషణను ఎందుకు చూడకూడదు? అని చెప్పారు. నేను దానిని గమనించాను.ఇదీ చదవండి: అక్కడ భారీగా బయటపడ్డ తెల్ల బంగారంఆ తరువాత ఇద్దరు ప్రాజెక్ట్ మేనేజర్లు, ఆరుగురు ఇంజనీర్లు, మరో ఐదుగురు విశ్లేషకులు, కార్యకలాపాలు, చట్టపరమైన విభాగాలకు చెందిన ఇతర ఉద్యోగులతో కలిసి ఒక ప్రాజెక్ట్‌ను నడిపిస్తున్నట్లు నన్ను గుర్తించారు. దీంతో కంపెనీలో చేరిన ఎనిమిది నెలల తరువాత 80 లక్షల బోనస్ అందుకోవడం మాత్రమే కాకుండా.. ప్రమోషన్ కూడా పొందినట్లు పేర్కొన్నాడు. -
ఎక్స్‌లో లేఆఫ్, కట్ చేస్తే : వైట్‌హౌస్‌లోకి సగర్వంగా ‘ప్రియాంక’
నా ఉద్యోగం పోయింది అని బాధపడుతూ కూర్చోలేదు ఆమె. కొత్త కరియర్‌ను వెతుక్కుంది. పడిలేచిన కెరటంలా ఒక కొత్త సామ్రాజ్యాన్ని సృష్టించుకొంది. కట్ చేస్తే వైట్ హౌస్‌లో స్పెషల్ గెస్ట్‌గా అవతరించింది.ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగిన దీపావళి వేడుకలకు ఆహ్వానం అందుకున్న 600 మంది ప్రముఖ భారతీయ అమెరికన్లలో ఒకరిగా నిలిచింది. టెక్కీ-నుంచి ఫుడ్ ఆర్టిస్ట్‌గా పాపులర్ చెఫ్ ప్రియాంక నాయక్ సక్సెస్ స్టోరీని తెలుసుకుందాం రండి!అమెరికాలోని బోస్టన్ యూనివర్శిటీలో చదువుకున్న భారతీయ సంతతికి చెందిన స్టేటెన్ ద్వీపానికి చెందిన ప్రియాంక నాయక్ ఎక్స్(ట్విటర్)లో పనిచేసింది. లేఆఫ్స్‌లో భాగంగా 2022 లో ఉద్యోగాన్ని కోల్పోయింది. అంతకుముందు దాదాపు పదేళ్ల పాటు వివిధకంపెనీల్లో టెకీగా పని చేసింది. టెక్ ప్రపంచంలోతనకంటూ ఒక పేరు సంపాదించుకుంది. టెకీగా విజయం సాధించినప్పటికీ, నాయక్ మనసు మాత్రం ఎపుడూ వంటలు చుట్టూ తిరుగుతూ ఉండేది. ఇందలో ఉద్యోగం మీద దెబ్బ పడింది. కానీ ఆమె పట్టుదల మాత్రం చెక్కు చెదరలేదు. వంట చేయడం పట్ల ఆమెకున్న అభిరుచినే పెట్టుబడిగా మల్చుకుంది. సోషల్ మీడియాలో పాకశాస్త్ర బ్లాగ్‌తో ఆమె అవార్డ్ విన్నింగ్ జర్నీ మొదలైంది. ప్రత్యేకమైన తన వంటకాలను నెటిజన్లుతో పంచుకొనేది.సుస్థిరత, పర్యావరణ అనుకూల విధానాలతో శాకాహారి చెఫ్‌గా మంచి ఆదరణను దక్కించుకుంది. క్రిస్సీ టీజెన్ లాంటి టాప్ సెలబ్రిటీలను ఆకర్షించింది. తొలి తరం భారతీయ అమెరికన్‌గా, నాయక్ తన బ్రాండ్‌లో వంట పుస్తక విక్రయాలు, సోషల్ మీడియా స్పాన్సర్షిప్స్, వాషింగ్టన్ పోస్ట్‌లోని ఆమె ప్రత్యేకమైన “ఎకోకిచెన్” కాలమ్ ద్వారా మంచి ఖ్యాతిని సంపాదించింది. అటు ఆర్థికంగా సక్సెస్‌ను అందుకుంది. లక్షల్లో ఆర్జించడంతో పాటు ఇటు పాపులారిటీని కూడా దక్కించుకుంది. (తాతగారి సెన్సేషనల్ విడాకులు : భరణం ఎంతో తెలిస్తే అవాక్కే!)ఈ క్రమంలోనే 2024 అక్టోబర్‌లో నాయక్ వైట్ హౌస్‌లో జరిగిన అతిపెద్ద దీపావళి వేడుకలకు స్పెషల్‌గా నిలిచింది. దేశవ్యాప్తంగా ఉన్న 600 మంది ప్రముఖ భారతీయ అమెరికన్లలో తాను కూడా ఉన్నానంటూ తన స్టోరీ సోషల్ మీడియాలో షేర్ చేసింది ప్రియాంక.‘‘జీవితంలో ఎన్నో కష్టాలు, వ్యక్తిగతంగా, వృతిపరంగా ఎన్నో అవమానాలు.. తిరస్కరణలు.. కానీ స్వయంకృషితో రచయిత/టీవీహోస్ట్గాఎదిగాను. ఇపుడు ప్రతిష్టాత్మక వైట్‌హౌస్ దీపావళి వేడుకలకు హాజరు.. ఇది చాలా సంతోషంగానూ,గర్వంగానూ ఉంది’’ అని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది ప్రియాంక. View this post on Instagram A post shared by Priyanka Naik | Eco Chef & Travel (@chefpriyanka) -
బెంగళూరు టెక్కీ తండ్రి సంచలన ఆరోపణలు
పాట్నా : భార్య, ఆమె బంధువులు పెట్టే వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న టెక్కీ అతుల్ సుభాష్ (34) కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భార్య తనపై పెట్టిన కేసు నుంచి విముక్తి పొందాలంటే రూ.5లక్షలు ఇవ్వాలని ఓ న్యాయవాది అతుల్ సుభాష్‌ను డిమాండ్ చేసినట్లు అతని తండ్రి పవన్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. బెంగళూరు ఐటీ ఉద్యోగులుగా పనిచేస్తున్న సుభాష్, నిఖితలకు 2019లో వివాహమైంది. అయితే వివాహం జరిగిన కొన్నేళ్లకు ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. దీంతో నిఖిత.. సుభాష్‌ను విడిచి పెట్టి బెంగళూరు నుంచి తన సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్‌కు వెళ్లింది. అక్కడే ఆమె తల్లి, సోదరుని ప్రోద్బలంతో అతుల్‌పై, అతని కుటుంబ సభ్యులపై తప్పుడు కేసులు పెట్టింది. ఈ కేసు విచారణ నిమిత్తం తన కుమారుడు సుభాష్ బెంగళూరు నుంచి ఉత్తరప్రదేశ్‌కి 40కి కంటే ఎక్కువ సార్లు తిరిగాడని బాధితుడి తండ్రి పవన్ కుమార్ మీడియా ఎదుట వాపోయాడు.కోర్టులో కేసు విచారణ కొనసాగుతుండగానే కేసును పర్యవేక్షిస్తున్న న్యాయమూర్తి ‘కేసు పరిష్కరించేందుకు’ రూ.5 లక్షలు అడిగారని ఆరోపించారు. దీంతో మధ్యవర్తిత్వం కోసం తాము సిద్దమైనట్లు చెప్పారు. ఆ సమయంలో తాను మధ్యవర్తిత్వం వహించినందుకు ఓ న్యాయవాది తనని ముందు రూ.20 వేల అడిగారని, ఆ తర్వాత రూ.40వేలకు పెంచారని అన్నారు. అప్పుడే న్యాయమూర్తి అతనికి (సుభాష్) సెటిల్మెంట్ కావాలనుకుంటే రూ. 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు చెప్పారు. Atul Subhash’s father shares how the judiciary systematically harassed his son and family. It’s so painful to watch. 😣To everyone involved, remember—karma is real, and you have your family too.😏#JusticeIsDue #JusticeForAtulSubhash pic.twitter.com/H8211785xL— Sann (@san_x_m) December 12, 2024 ప్రస్తుతం, అతుల్ సుభాష్ కేసు దర్యాప్తును బెంగళూరు మారతహళ్లి పోలీసులు వేగవంతం చేశారు. మృతుని సోదరుడు బికాస్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మారతహళ్లి పోలీసులు ఆత్మహత్యకు ప్రేరేపించడం తదితర సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌కి వెళ్లారు. అక్కడ అతుల్ భార్య నిఖితా సింఘానియా, తల్లి నిశా, సోదరుడు అనురాగ్, బంధువు సుశీల్‌ను విచారణ చేపట్టారు. బిహార్‌లో ఉండే మృతుని తల్లిదండ్రుల నుంచి కూడా వాంగ్మూలం తీసుకోనున్నారు. 👉చదవండి : సోషల్ మీడియాను కదిలించిన ఓ భర్త గాథ -
19 ఏళ్ల ఐటీ ఉద్యోగానికి బై చెప్పి, ప్రకృతి సేద్యంతో లాభాలు
దేశ విదేశాల్లో అధికాదాయాన్నిచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగంలో అంతకంతకూ పెరిగే పని ఒత్తిడి, తీవ్ర అసంతృప్తి నుంచి బయటపడటానికి ప్రకృతితో తిరిగి మమేకం కావటం ఒక్కటే మార్గమని మునిపల్లె హరినాద్(52) భావించారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మునిపల్లె గ్రామానికి చెందిన కేంద్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి కుమారుడు హరినాద్. 1994లో బీటెక్ పూర్తి చేసి చెన్నైలో సాఫ్ట్వేర్ ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ ఆస్ట్రేలియా, అమెరికా, యూకేలలో పనిచేశారు. నెలకు రూ. 1.5 లక్షల జీతంతో మిడిల్ మేనేజ్మెంట్ స్థాయిలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ 2013లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఎడతెగని పని వత్తిడితో నలుగుతూ కుటుంబానికి సమయం ఇవ్వలేని స్థితిలో ఎంత చేసినా సంతృప్తినివ్వని ఉద్యోగాన్ని కొనసాగించటం కన్నా.. సొంతూళ్లో కుటుంబ సభ్యులతో కలసి ప్రశాంతంగా జీవిస్తూ వారసత్వ భూమిలో సాధారణ రైతుగా కొత్త జీవితాన్ని ప్రారంభించటంలో నిజమైన ఆనందం ఉందని ఆయన భావించారు. ముందు నుంచే అధ్యయనంవిదేశాల్లో ఉన్న సమయంలో అక్కడి సూపర్ మార్కెట్లలో లభించే ఆర్గానిక్ ఉత్పత్తులకు ఆకర్షితులయ్యారు. ఖర్చు ఎక్కువైనా కల్తీలేని ఆహార పదార్ధాలను తాను కూడా ఎందుకు పండించేలేననే పట్టుదలతో ఇంటర్నెట్లో ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలనే అంశాలపై మూడేళ్లపాటు అధ్యయనం చేశారు. రసాయనిక అవశేషాల్లేని, పోషకాల సమతుల్యతతో కూడిన ఆరోగ్యాదాయకమైన ఆహారాన్ని పండించటమే ముఖ్యమైన పనిగా తలచి ఉద్యోగానికి 2013లో రాజీనామా ఇచ్చారు. ఆ కొత్తలోనే మధురైలో జరిగిన పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. సుభాష్ పాలేకర్ శిక్షణా శిబిరంలో హరినాధ్ పాల్గొన్నారు. అక్కడికి వచ్చిన ఇతర రైతులతో పరిచయాలు పెంచుకొని వారి క్షేత్రాలను సందర్శించి, వ్యవసాయం చేస్తూ నేర్చుకున్నారు. వారసత్వంగా సంక్రమించిన 2.5 ఎకరాల మాగాణి, అర ఎకరం మెట్టలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. (చిన్న ప్యాకెట్ : 30 రోజులైనా పండ్లు, కూరగాయలు పాడుకావు!)దిబ్బపై ఉద్యాన పంటలుమాగాణిలో సార్వాలో వరి, దాళ్వాలో మినుములు, పెసలు, నువ్వులు తదితర పంటలను హరినా«ద్ సాగు చేస్తున్నారు. మాగాణి పక్కనే 3 అడుగుల ఎత్తు దిబ్బగా ఉన్న అరెకరంలో పండ్లు, దుంపలు తదితర పంటలు పండిస్తున్నారు. అరటి, జామ, బొ΄్పాయి, కొబ్బరి, మునగ, కంద, అల్లం, కంద, మద్ది, మామిడి, టేకు పెంచుతున్నారు. తమ ప్రాంతంలో ఖరీఫ్‌లో వరి కోతలు అయ్యాక, రబీలో మొక్కజొన్న పూర్తయ్యాక పంట వ్యర్థాలను ఉత్తరాదిలో మాదిరిగా తగుల బెడుతున్నారని హరినా«ద్ తెలిపారు. గత ఏడాది ఇతర ΄÷లాల నుంచి వ్యాపించిన మంటలకు తమ అరెకరంలోని ఉద్యాన పంటలు కాలిపోయాయన్నారు. గోదావరి ఇసుకలు, కట్టుయానం...ప్రకృతి సేద్యానికి అనువైన దేశీ వరి రకాల సాగుపై హరినాద్ దృష్టి కేంద్రీకరించారు. వ్యవసాయం చేసిన అనుభవం లేక΄ోయినా కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఒక్కో పని నేర్చుకుంటూ నిలదొక్కుకున్నారు. కాశీవిశ్వనాద్ (130 రోజులు) అనే సన్న తెల్ల వరి రకాన్ని 8 ఏళ్ల పాటు వరుసగా సాగు చేశారు. బీపీటీ కన్నా సన్నని ఈ రకం ధాన్యాన్ని పూర్తిగా ప్రకృతి సేద్యంలో ఎకరానికి అత్యధికంగా 25 బస్తాల దిగుబడి పొందారు. ఈ ఏడాది నుంచి 1.25 ఎకరాల్లో గోదావరి ఇసుకలు (110 రోజులు) సాగు చేస్తున్నారు. ఇది తెల్ల, సన్న రకం. త్వరలో నూర్పిడి చేయనున్నారు. ఎకరానికి 20 బస్తాల దిగుబడి వస్తుందని భావిస్తున్నారు. మరో 1.25 ఎకరాల్లో కట్టుయానం (180 రోజులు) అనే రెడ్ రైస్‌ను సాగు చేస్తున్నారు. ఇది 15 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి రావచ్చని చెప్పారు.సంపూర్ణ సంతృప్తి, సంతోషం!ఉద్యోగ బాధ్యతల్లో అసంతృప్తి, పని ఒత్తిడితో ఏదో తెలియని వేదనకు గురయ్యాను. వారానికి 5 గంటలు నిద్రతో సరిపెట్టుకొని, పర్సనల్ పనులనూ మానుకొని, 3–4 నెలల ΄ాటు పనిచేసి ్ర΄ాజెక్టు పూర్తి చేసిన రోజులున్నాయి. డబ్బు వస్తుంది. కానీ, ఆ వత్తిడిమయ జీవితంలో సంతృప్తి, ఆనందం లేవు. గత 9 ఏళ్లుగా కుటుంబీకులతో ఉంటూ ప్రకృతి సేద్యం చేసే భాగ్యం కలిగింది. కుటుంబం అంతా మద్దతుగా నిలిచారు. రసాయనాల్లేకుండా వరి ధాన్యం తొలి ఏడాది 10 బస్తాల దిగుబడి తీయటం ఆశ్చర్యం కలిగించింది. ఇప్పుడు 25 బస్తాల దిగుబడినిచ్చే స్థాయికి ΄÷లం సారవంతమైంది. ఈ ఏడాది జీవామృతం కూడా ఇవ్వలేదు. పూర్తి ప్రకృతి వ్యవసాయం అంటే ఇదే. రైతుగా మారి 6 కుటుంబాలకు ఏడాది ΄÷డవునా ఆరోగ్యదాయకమైన ఆహారం అందిస్తున్నా. అనేక ఆరోగ్య సమస్యలు తగ్గాయని, షుగర్‌ను నియంత్రించటం సులువైందని వారు చెబుతుంటే సంతృప్తిగా ఉంది. సొంతూళ్లో ప్రకృతి సేద్యం సంపూర్ణంగా సంతృప్తిని, సంతోషాన్ని ఇస్తోంది. – మునిపల్లె హరినాద్ (93805 16443). మునిపల్లె, పొన్నూరు మండలం, గుంటూరు జిల్లా ఈ ఏడాది జీవామృతమూ లేదు!పొలం దుక్కి చేయటం, రొటోవేటర్ వేయటం, దమ్ము చేయటం వంటి పనులను సొంత చిన్న ట్రాక్టర్‌తో స్వయంగా చేసుకోవటం నేర్చుకున్నారు హరినా«ద్. పచ్చిరొట్ట పంటలను కలియదున్నటం, జీవామృతం పిచికారీ, కాలువ నుంచి తోడుకునే నీటితో కలిపి ఆవు మూత్రం పారించటం చేస్తుంటారు. ఈ సంవత్సరం అవేవీ చెయ్యలేదన్నారు. అయినా, గోదావరి ఇసుకలు రకం ధాన్యం ఎకరానికి 20 బస్తాలకు తగ్గకుండా వస్తాయని సంతోషంగా తెలిపారు. నాట్లు, కలుపు తీత, కోతలు మనుషులతోనే చేయిస్తున్న హరినాద్కు ఎకరా వరి సాగుకు రూ. 35 వేల నుంచి 40 వేల వరకు ఖర్చు అవుతోంది. అన్నీ అనుకూలిస్తే రసాయనిక రైతులకు 40–45 బస్తాలు, తనకు 25 బస్తాల వరకు ధాన్యం దిగుబడి వస్తుందని, అయినా తనకు మంచి ఆదాయమే వస్తున్నదన్నారు. ఆ ప్రాంతంలో అందరూ కౌలు రైతులే. కోత కోసి ఆ రోజే అమ్మేస్తుంటారు. హరినా«ద్ నెలకోసారి ధాన్యం మర పట్టించి కనీసం 6 కుటుంబాలకు నెల నెలా పంపుతూ ఉంటారు. కిలో బియ్యం రూ. వందకు అమ్ముతున్నారు. తాను నిర్ణయించిన ధరకు నేరుగా వినియోగదారులకు అమ్మటం వల్ల తనకు ఇతర రైతుల కన్నా అధికాదాయమే వస్తోందని హరినా«ద్ తెలిపారు. నేలను బాగు చేసుకుంటూ ఇతరులకూ ఆరోగ్యదాయక ఆహారాన్ని అందిస్తున్నానన్న సంతృప్తితో చాలా ఆనందంగా ఉన్నానని ఆయన తెలిపారు. – సయ్యద్ యాసిన్, సాక్షి, పొన్నూరు, గుంటూరు జిల్లా -
తొమ్మిదో అంతస్తు నుంచి దూకి టెకీ ఆత్మహత్య
సాక్షి,హైదరాబాద్:సాఫ్ట్వేర్ ఉద్యోగిని హరిత హైదరాబాద్ నగరం ఉప్పల్‌లోని బహుళ అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. సోమవారం(అక్టోబర్21) అర్ధరాత్రి ఉప్పల్ డీఎస్ఎల్ మాల్ పక్కన ఉన్న ఐటీ కంపెనీ భవనం తొమ్మిదవ అంతస్తు నుంచి దూకడంతో ఆమెను చికిత్స కోసం రామంతాపూర్‌లోని మ్యాట్రిక్స్ ఆస్పత్రికి తరలించారు.అయితే ఆస్పత్రికి తీసుకెళ్లేసరికే హరిత మృతి చెందిందని డాక్టర్లు నిర్ధారించారు. ఐటీ ఉద్యోగిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.ఇదీ చదవండి: పెళ్లి చేయడం లేదని తండ్రి హత్య -
గూగుల్ టెకీ వింత అనుభవం.. ఇలా కూడా రిజెక్ట్ చేస్తారా?
ఉద్యోగం కోసం ఏదైనా సంస్థకు దరఖాస్తు చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో వివిధ కారణాలతో తిరస్కరిస్తూ ఉంటారు. తగిన అర్హతలు, అనుభవం లేకపోవడం వంటివి సాధారణంగా ఆ కారణాల్లో ఉంటాయి. అయితే తనకు ఎదురైన అసాధారణ అనుభవం గురించి ఓ గూగుల్ టెకీ సోషల్ మీడియాలో షేర్ చేయగా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.గూగుల్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఢిల్లీకి చెందిన అనూ శర్మ గతంలో ఓ స్టార్టప్ సంస్థలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేయగా రిజెక్ట్ చేశారు. అయితే ఇందుకు ఆ కంపెనీ చెప్పిన కారణమే విడ్డూరంగా అనిపించింది. "మీ రెజ్యూమ్ని సమీక్షించిన తర్వాత, మీ అర్హతలు ఉద్యోగ అవసరాలను మించి ఉన్నట్లు మేము గ్రహించాం. అధిక అర్హతలు ఉన్న అభ్యర్థులు ఎక్కువ రోజులు పని చేయలేరని, చేరిన కొద్దిరోజులకే వెళ్లిపోతారని మా అనుభవం సూచిస్తోంది" అంటూ తిరస్కరణకు కారణాన్ని రిజెక్షన్ లెటర్లో రిక్రూటర్ వివరించారు.ఇదీ చదవండి: అమెజాన్ ఉద్యోగులకు కొత్త పాలసీ.. తేల్చిచెప్పేసిన సీఈవోమంచి అర్హతలు ఉన్నందుకు కూడా తిరస్కరిస్తారని తనకు తెలియదంటూ రిజెక్షన్ లెటర్ స్క్రీన్ షాట్‌ను అనూ శర్మ ‘ఎక్స్’ (ట్విటర్)లో షేర్ చేశారు. ఇది యూజర్లలో విస్తృత చర్చకు దారితీసింది. తామూ ఇలాంటి అనుభవాలను ఎదుర్కొన్నట్లు కామెంట్లు చేశారు. తాను ఉన్నత ర్యాంకింగ్ ఉన్న కాలేజీ నుంచి వచ్చినందుకు రిజెక్ట్ చేశారని ఓ యూజర్ చెప్పుకొచ్చారు. అదే సమయంలో మంచి అర్హతలను రిక్రూటర్ అభినందించడం మంచి విషయమని మరికొందరు అభిప్రాయపడ్డారు.Didn't know you could be rejected for being too good 🥲 pic.twitter.com/mbo5fbqEP3— Anu Sharma (@O_Anu_O) October 17, 2024 -
రూ.80 లక్షల జీతం: సలహా ఇవ్వండి.. టెకీ పోస్ట్ వైరల్
ఎవరైనా ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగాన్ని ఎంచుకుంటారనేది సర్వసాధారణం. ఓ వ్యక్తి తనకు రూ.80 లక్షల జీతం వస్తోందని, ఇప్పుడు బెంగళూరులో రూ.50 లక్షల జీతానికి ఆఫర్ వచ్చిందని వెల్లడించారు. అయితే ఇప్పుడు నేను బెంగుళూరుకు రావాలా? వద్దా? అనే సందేహాన్ని రెడ్డిట్‌లో వెల్లడించారు.నాకు ఐరోపాలో ఐదు సంవత్సరాలు ఉద్యోగానుభవం ఉంది. నా జీతం రూ.80 లక్షల సీటీసీ. నాకు బెంగళూరులో దాదాపు రూ.50 లక్షల సీటీసీ ఆఫర్ వచ్చింది. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం, జాబ్ మార్కెట్ కూడా బాగుంటుందని ఈ ఆఫర్‌కు అంగీకరించాలనుకుంటున్నాను. దీనికి నా కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదు. దీనికి ఓ సలహా ఇవ్వండి? అని రెడ్డిట్‌లో అడిగారు.ఈ పోస్ట్ రెడ్డిట్‌లో వైరల్ అవ్వడంతో పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందించారు. భారతదేశంలో పని ఒత్తిడి అధికం, అవినీతి, కల్తీ ఆహారం, కలుషితమైన గాలి, నీరు ఇలా చాలా ఉన్నాయని ఓ వ్యక్తి పేర్కొన్నారు.యూరప్‌లో ఉద్యోగంలో స్థిరత్వాన్ని, ముఖ్యంగా తొలగింపులు సందర్బాలను గురించి మరికొందరు వివరించారు. మీకు ఉద్యోగంలో స్థిరత్వం వద్దు, పని భారం ఎక్కువ కావాలనుకుంటే ముందుకు సాగండి అని పేర్కొన్నారు. భారతదేశ జీవన నాణ్యతలో విస్తృత సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని మరికొందరు హెచ్చరించారు.ఇదీ చదవండి: చాట్‌జీపీటీ రెజ్యూమ్.. చూడగానే షాకైన సీఈఓభారతదేశంలో ప్రభుత్వ అధికారులతో మంచి సత్సంబంధాలు ఉంటే, మీ దగ్గర డబ్బు ఎక్కువగా ఉంటే హాయిగా జీవించవచ్చు అని ఇంకొందరు అన్నారు. యూరోప్ నుంచి ఇండియాకు రావాలంటే మీకు నెల రోజుల సెలవు లభిస్తుంది.. కానీ మీరు బెంగుళూరుకు వెళ్లినట్లయితే 15 రోజులు సెలవు లభించడం కూడా కష్టం అని అన్నారు. -
మూడు రెట్ల జీతం వచ్చే ఉద్యోగం.. మకాం మార్చాలా?: టెకీ ప్రశ్న
ఉద్యోగం చేస్తున్న చాలామంది ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం వస్తే.. దాన్ని ఎంచుకుని ముందుకు సాగిపోతారు. అయితే ఇటీవల ఒక ఉద్యోగికి లక్షల జీతం లభించే ఉద్యోగం లభించినప్పటికీ.. ఓ సందేహం వచ్చింది. తన సందేహానికి సమాధానం కోరుతూ.. రెడ్డిట్‌లో పోస్ట్ చేశారు.నేను బెంగుళూరులో మెకానికల్ ఇంజనీర్, వయసు 31, పెళ్లయింది, ఇంకా పిల్లలు లేరు. నెలకు రూ.1.30 లక్షలు సంపాదిస్తున్నాను. ఇంటి అద్దె, తల్లితండ్రులకు డబ్బు పంపించిన తరువాత కూడా నాకు రూ. 50వేలు నుంచి రూ. 60వేలు మిగులుతుంది. అయితే ఇది ఈఎంఐ చెల్లించడానికి సరిపోతుంది. ఈఎంఐ ఇంకా సంవత్సరం పాటు చెప్పించాల్సి ఉంది.ఉద్యోగ జీవితం బాగానే ఉంది, ఆరోగ్య భీమాకు సంబంధించినవన్నీ కంపెనీ చూసుకుంటుంది. అయితే ఇటీవల నాకు స్వీడన్‌లోని హెల్సింగ్బోర్గ్లో నెలకు రూ.3.90 లక్షల జీతం పొందే ఆఫర్ వచ్చింది. నా స్వగ్రామంలో నా మీదనే ఆధారపడిన తల్లిదండ్రులు ఉన్నారు. వారికి నేను ఒక్కడినే సంతానం. కాబట్టి నేను ఇప్పుడు స్వీడన్‌కు వెళ్లి అక్కడే స్థిరపడాలా? లేదా ఇక్కడే ఉండి.. ఉన్న ఉద్యోగం చేసుకోవాలా? ఆర్థిక పరంగా ఎదగటానికి 4-5 సంవత్సరాలు స్వీడన్‌కు వెళ్లడం నా పరిస్థితికి సహాయపడుతుందా?.. దయచేసి ఎవరైనా సలహా ఇవ్వగలరా? అని రెడ్డిట్‌లో సలహా కోరారు.స్వీడన్ వెళ్లాలనుకుంటే.. మీరు ఒక్కరే కాకుండా, మీ భార్యను కూడా పని చేయడానికి ప్రేరేపించండి. లేకుంటే అక్కడ ఆమె ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. సొంతంగా ఏదైనా చేయడానికి ప్రయత్నించేలా చేయండి. అక్కడ కొన్ని భాషా తరగతులకు హాజరయ్యేలా చూడండి అని ఒకరి రాశారు.స్వీడన్ మీరు అధిక సంపాదన కోసం వెళ్లే దేశం కాదు. మీరు ఒంటరిగా ఉండి, పొదుపుగా జీవిస్తే మీరు ఎక్కువ ఆదా చేసుకోవచ్చని మరొకరు అన్నారు. మీరు సన్యాసిలా జీవిస్తే మీ జీతంలో సగం వరకు ఆదా చేయవచ్చు, కానీ ప్రయోజనం ఏమిటి, అని ఇంకొకరు వ్యాఖ్యానించారు. ఉద్యోగం మారితే మరింత ఎక్కువ సంపాదించవచ్చని మరికొందరు సలహా ఇచ్చారు. -
పని ఒత్తిడితో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య!
చెన్నై: ఇటీవల ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియాకు చెందిన 26 ఏళ్ల ఉద్యోగిని పని ఒత్తిడితో మృతిచెందిన ఘటన మరవక ముందే మరొకటి వెలుగులోకి వచ్చింది. తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడుతున్న 38 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెన్నైలోని తన ఇంట్లో ఆత్మహత్యకు చేసుకున్నాడు. పని ఒత్తిడి కారణంగానే తన భర్త ఆత్మ హత్య చేసుకొని ఉంటాడని అతని భార్య అనుమానం వ్యక్తం చేసినట్లు పోలిసులు తెలిపారు.పోలీసుల వివరాల ప్రకారం.. తమిళనాడులోని తేని జిల్లాకు చెందిన కార్తికేయన్ తన భార్య, ఇద్దరు పిల్లలతో చెన్నైలో నివసిస్తున్నారు. గత 15 ఏళ్లుగా ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో కార్తికేయ టెక్కీగా పని చేస్తున్నారు. ఇక.. కార్తికేయ తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా ఇబ్బంది పడుతున్నారు. రెండు నెలలుగా ఆయన డిప్రెషన్‌కు చికిత్స పొందుతున్నాడు.ఘటన సమయంలో కార్తికేయ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. సోమవారం ఆయన భార్య కె జయరాణి.. పిల్లలను తన తల్లి వద్దకు దింపి, చెన్నైకి 300 కిలోమీటర్ల దూరంలోని తిరునల్లూరు ఆలయానికి వెళ్లారు. గురువారం రాత్రి తిరిగి వచ్చి తలుపు కొట్టగా.. ఇంట్లో నుంచి ఎటువంటి స్పందన లేదు. ఇంట్లోకి ప్రవేశించడానికి స్పేర్ కీని ఉపయోగించి లోపలికి వెళ్లగా.. కార్తికేయ కరెంట్ తీగకు చుట్టుకొని విగతజీవిగా పడిఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి.. అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఇదికూడా చదవండి: పని ఒత్తిడితో మహిళా ఉద్యోగి షాకింగ్ డెత్, స్పందించిన కేంద్రం -
రూ.30 లక్షల జీతం.. ట్రైన్లోనే ప్రయాణం: ఓ టెకీ సమాధానం ఇదే
సాధారణంగా లక్షల జీతం తీసుకునే చాలామంది రైలు ప్రయాణం కంటే.. విమాన ప్రయాణాన్నే ఇష్టపడతారు. కానీ కొందరు మాత్రం ఎంత సంపాధించినా ట్రైన్ జర్నీ చేయడానికి ఇష్టపడుతుంటారు. దీని వెనుక అనేక కారణాలు ఉండొచ్చు.చిరాగ్ దేశ్‌ముఖ్.. ట్రైన్ జర్నీలో ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలపర్‌గా పనిచేస్తున్న & ఏడాదికి రూ. 30 లక్షల జీతం తీసుకునే వ్యక్తిని కలిశారు. సంవత్సరానికి ఇన్ని లక్షలు సంపాదిస్తున్నారు, ఎందుకు ట్రైన్ జర్నీ చేస్తున్నావు అనే ప్రశ్న వేశారు. దీనికి ఆ సాఫ్ట్వేర్ డెవలపర్ సమాధానమిస్తూ.. తన చదువు పూర్తయిన తరువాత ఉద్యోగం లేకుండా ఇబ్బంది పడ్డాను. ఆ సమయంలో ఒక రైలు ప్రయాణంలో, ఓ వ్యక్తి పరిచయమయ్యారు. ఆ వ్యక్తి అన్నయ్య కారణంగా నాకు జాబ్ వచ్చింది అని చెప్పారు. ఆ సమయంలో ఎప్పుడూ ట్రైన్ జర్నీ చేయాలని నిర్ణయించుకున్నా అని వివరించారు.ఈ విషయాన్నే చిరాగ్ దేశ్‌ముఖ్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇందులో కొందరు ట్రైన్ జర్నీ చాలా సరదాగా ఉంటుందని అన్నారు. తెలియని వ్యక్తులతో కూడా పరిచయం ఏర్పడుతుంది. విమాన ప్రయాణంలో ఈ అవకాశం ఉండదు. విమానంలో అందరూ బిజీగా ఉంటారని కొందరు అన్నారు.Funny story !!!!Today, I was traveling by train and met a guy who works as a software developer at a big company, earning over 30 lakhs a year. I asked him, "With that kind of money, why aren't you flying instead of taking the train?Thread... pic.twitter.com/GH5yssTtLT— Chirag Deshmukh (@Geekychiraag) August 20, 2024 -
రూ.1.5 కోట్లు.. నాలోని ఇంజినీర్ అర్థం చేసుకోలేడు
రియల్ ఎస్టేట్ మార్కెట్ రోజురోజుకి పుంజుకుంటోంది. ఎక్కువ మంది భూములు, అపార్ట్మెంట్స్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కొంతమంది నాసిరకం భవనాలను నిర్మించి, ఎక్కువ ధరలకు విక్రయించి చేతులు దులిపేసుకుంటున్నారు. ఇటీవల ఓ టెకీ రూ. 1.5 కోట్లు ఖర్చు చేసి కొనుగోలు చేసిన అపార్ట్మెంట్లో నీరు లీక్ అయిన దృశ్యాలను షేర్ చేశారు.బెంగళూరుకు చెందిన రిపుదామన్ అనే ఇంజినీర్ కొనుగోలు చేసిన తన ఖరీదైన అపార్ట్మెంట్లో నీరు లీక్ అయ్యాయి. దీనికి సంబంధించిన ఫోటోలను ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేస్తూ నగరంలో రియల్ ఎస్టేట్ క్వాలిటీ ఈ విధంగా ఉందని వెల్లడించారు.ఫోటోలను షేర్ చేస్తూ.. రూ. 1.5 కోట్లు ఖర్చు చేసి కొన్న అపార్ట్మెంట్లోని 5వ/16వ అంతస్తులోని నా గదిలో నీరు కారుతోంది. ఖరీదైన భవనాలు ఎంత మోసం బ్రో! నాలో ఉన్న సివిల్ ఇంజనీర్ దీన్ని అర్థం చేసుకోలేడు అంటూ ట్వీట్ చేశారు. దీనిపైన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.My room in 1.5CR apartment 5th/16th floor is leaking water These expensive buildings are such a scam bro!The civil engineer inside me can't comprehend this. pic.twitter.com/9EpTBTXXsH— Ripudaman (@mrtechsense) August 4, 2024 -
వనస్థలిపురం ఘటనలో స్నేహితుడి అరెస్ట్
హస్తినాపురం: తనను నమ్మి వచ్చిన చిన్ననాటి స్నేహితురాలికి మద్యం తాగించి.. స్నేహితుడితో కలిసి లైంగిక దాడికి పాల్పడిన ఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఏసీపీ పి.కాశిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హయత్‌నగర్‌కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని, గౌతంరెడ్డి అనే యువకుడు పాఠశాల స్నేహితులు. యువతికి సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడంతో పార్టీ చేసుకునేందుకు సోమవారం రాత్రి 7.30కు వీరిద్దరూ కలిసి వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓంకార్ నగర్ కాలనీలోని బొమ్మరిల్లు బార్ అండ్ రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ ఇద్దరూ మద్యం తాగారు... ఆ తర్వాత ఇదే రెస్టారెంట్లో గౌతంరెడ్డి గది అద్దెకు తీసుకుని యువతిని తీసుకెళ్లాడు. మద్యం మత్తులో ఉన్న యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం తన స్నేహితుడిని కూడా గదికి పిలిచాడు. ఇద్దరు కలిసి యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. మద్యం మత్తు నుంచి తేరుకున్న యువతి గదిలో గౌతంరెడ్డి తో పాటు మరో వ్యక్తి ఉండడంతో తనపై లైంగిక దాడి జరిగిందన్న విషయాన్ని గమనించి గట్టిగా కేకలు వేసింది. దీంతో కంగారు చెందిన ఇద్దరు యువకులు అక్కడ నుంచి పారిపోయారు... బాధితురాలు విషయాన్ని రెస్టారెంట్ సిబ్బంది దృష్టి తీసుకెళ్లగా వారు ఆమె స్నేహితులకు సమాచారం అందించారు. వెంటనే యువతి స్నేహితులు రెస్టారెంట్‌కు వచ్చి వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి ప్రధాన నిందితుడు గౌతంరెడ్డిని అదుపులోకి తీసుకున్నామని, మరో నిందితుడు శివాజీ కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని ఏసీపీ కాశిరెడ్డి వెల్లడించారు. -
4 BHK ఫ్లాట్ ధర రూ. 15 కోట్లు.. నోయిడా టెక్కీ పోస్టు వైరల్
నోయిడా: రోజులు గడుస్తున్న కొద్దీ రియల్ ఎస్టేట్‌కు డిమాండ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇళ్లు, ఫ్లాట్లు, ప్లాట్ల ధరలు పెరుగుతున్నాయి. ఏ ప్రాంతంలో అయినా చిన్నచిన్న ఇళ్ల నిర్మాణం నుంచి లగ్జరీ ప్రాజెక్టుల వరకు రేట్లు ఆకాశంలోనే ఉన్నాయి. సొంతింటిలో జీవించడం ప్రతి ఒక్కరి కల కావడంతో ఎంత డబ్బులు వెచ్చించినా ఒక ఇంటిని సొంతం చేసుకునేందుకు అందరూ తాపత్రయ పడుతుంటారు.ఇక లగ్జరీ విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీ, అపార్ట్మెంట్లలో ఫ్లాట్ కొనడమంటే కోట్లు వెచ్చించాల్సిందే. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఓ ఇంటి ధర తెలిసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. అక్కడ నోయిడాలో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్ ధర ఏకంగా రూ. 15 కోట్ల ధరగా నిర్ణయించారు. ఈ విషయాన్ని ఢిల్లీ ఎన్సీఆర్కు చెందిన ఓ ఇంజనీర్ తన సోషల్ మీడియా పోస్ట్ చేశాడు. దీంతో ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట్లో వైరల్‌గా మారింది.కాశిష్ అనే వ్యక్తి విట్టీ ఇంజనీర్ అనే ఇన్‌స్టా అకౌంట్లోని పోస్టు ప్రకారం.. నోయిడా సెక్టార్ 124 కు వర్చువల్ టూర్‌కు వెళ్లాడు. అక్కడ ఏటీఎస్ నైట్స్ బ్రిడ్స్ ప్రాజెక్ట్‌లో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్లో ఓ ఫ్లాట్ ధరను చూశారు. 4 BHK ఫ్లాట్ ధరను రూ. 15 కోట్లకు అమ్ముతున్నట్లు బోర్డు ఉంది. అలాగే 6 BHK ఫ్లాట్ ధర 25 కోట్లు అని ఉంది. ఇది చూసిన కాశిష్.. ఏ ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, పెట్టుబడులు పెట్టినా సొంత ఇంటిని కొనుగోలు చేయడం సాధ్యం కాదని పేర్కొన్నాడు. ఈ అపార్ట్మెంట్లు ఎవరు కొంటున్నారో ఆశ్యర్యం వేస్తుంది.. వారు ఏ పని చేస్తారని ప్రశ్నించారు. నేను అయితే ఎన్ని ఉద్యోగాలు మార్చుకున్నా, ఎంత వ్యాపారం చేసినా లేదా పెట్టుబడి పెట్టినా ఈ సమాజంలో 4BHKను కొనుగోలు చేయగలనా?" అని పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Witty Engineer (@wittyengineer_) ఈ వీడీయో వైరల్‌గా మారింది. దాదాపు 4 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అపార్ట్మెంట్ల అధిక ధరలపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అనేక మంది కామెంట్లు పెట్టారు. నోయిడా రియల్ ఎస్టేట్ మధ్యతరగతి భారతీయులకు అందుబాటులో లేకుండా పోతుందని కొందరు పేర్కొన్నగా.. 15 కోట్లతో యూరప్ లేదా యూఎస్‌లో పౌరసత్వంతోపాటు ఎక్కడైన ఒక అపార్ట్‌మెంటే కొనవచ్చని చెబుతున్నారు. మరికొందరు ఇది ల్గజరీ ప్రాజెక్ట్ అని, విశాలమైన ప్రదేశం, విలాసవంతమైన సౌకర్యాల వల్ల అంత ధర ఉందని వివరిస్తున్నారు. -
ముఖానికి రాసుకునే అలోవెరాతో బ్యాటరీ సెల్స్ !
అలోవెరాని తెలుగులో కలబంద అంటాం. దీన్ని ముఖానికి, శిరోజాల సంరక్షణకు ఉపయోగిస్తుంటారు. అంతేగాదు ఆరోగ్యానికి మంచిదని ఆహారం కూడా వినియోగిస్తుంటారు. ముఖ్యంగా ఆయుర్వేదంలో ఎక్కువగా వినియోగిస్తుంటారు. అలాంటి అలోవెరాతో బ్యాటరీల తయారు చేశారు ఇద్దరు టెక్కీలు. నూటికి నూరు శాతం పర్యావరణ హితమైన బ్యాటరీలు రూపొందించి అందరిచేత శభాష్ అనిపించుకున్నారు. పైగా కేంద్ర ప్రభుత్వంచే నేషనల్ స్టార్టప్ అవార్డును కూడా అందుకున్నారు. ఎవరా టెక్కీలు..? ఎలా ఈ ఆవిష్కరణకు పూనకున్నారంటే..మనం సాధారణంగా వాడే బ్యాటరీల్లో కాడ్మియం వంటి విషపదార్థాలు ఉంటాయి. ప్రతి ఏడాది లక్షలకొద్ది బ్యాటరీ వ్యర్థాలు భూమిపై పేరుకుపోతున్నాయి. వాటివల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుంది. వాటిని ఒకవేళ మండించిన విడుదల అయ్యే వాయువుల వల్ల ప్రజలు అనారోగ్యం బారినపడతారు. దీనికి ఎలా చెక్‌పెట్టాలని ఆలోచించారు జైపూర్ బీటెక్ విద్యార్థులు నిమిషా వర్మ, నవీన్ సుమన్‌లు. ఆ దిశగా వివిధ ప్రయోగాలు చేశారు. పర్యావరణ హితమైన బ్యాటరీలు చేయాలన్నది వారి లక్ష్యం. ఆ ప్రయత్నాల్లో ఈ వినూత్న ఆలోచన తట్టింది. కలబంద పదార్థాలతో పర్యావరణ అనూకూల బ్యాటరీలను రూపొందిచొచ్చని కనుగొన్నారు. దీన్నే ఆచరణలో పెట్టి అలో ఇ సెల్ పేరుతో స్టార్టప్‌ని 2018 ఏర్పాటు చేసి.. అలోవెరాతో బ్యాటరీలను ఉత్పత్తి చేశారు. ఈ బ్యాటరీలను మార్కెట్లో రూ. 9 నుంచి రూ.10 ధరల్లో అందుబాటులో ఉంచారు. బార్సిలోనాలో ష్నెడర్ ఎలక్ట్రిక్ నిర్వహించిన ఇన్నోవేషన్ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది స్టార్ట్‌ప్‌లో ఈ ఆవిష్కరణ కూడా ఒకటి. అకడున్న వారందర్నీ ఈ ఆవిష్కరణ ఎంతగానో ఆకట్టుకుంది. అంతేగా ఈఅద్భుత ఆవిష్కరణగానూ ఆ టెక్కీలిద్దర్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ స్టార్టప్ అవార్డుతో సత్కరించింది.(చదవండి: వ్యాయామం చేయని మహిళలు తీసుకోవాల్సిన డైట్ ఇదే! ఐసీఎంఆర్ మార్గదర్శకాలు) -
రూ.80 లక్షల ఉద్యోగాన్ని వదిలేసి, పూల సాగు..కట్ చేస్తే..!
సౌకర్యవంతమైన జీవితం, ఇంగ్లాండ్‌లో దిగ్గజ టెక్ కంపెనీలో ఆకర్షణీయమైన జీతం. యూరప్ టూర్లు, వీకెండ్ పార్టీలు.. అయినా మనసులో ఏదో వెలితి. ఏం సాధించాం అన్న ప్రశ్న నిరంతరం మదిలో తొలిచేస్తూ ఉండేది. కట్ చేస్తే, తాత ముత్తాతల వ్యవసాయ భూమిలో పూల వ్యాపారంతో కోట్లు సంపాదిస్తున్నాడు. అంతకు మించిన ఆత్మసంతృప్తితో జీవిస్తున్నాడు. ఎవరా అదృష్టవంతుడు ఈ కథనంలో తెలుసుకుందాం రండి.ఉత్తర ప్రదేశ్‌లో అజంగఢ్ జిల్లాలోని చిల్బిలా గ్రామానికి చెందిన అభినవ్ సింగ్ కష్టపడి చదివాడు. ప్రముఖ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ యూకేలో అధిక వేతనంతో ఉద్యోగం వచ్చింది. రూ. 80 లక్షల ప్యాకేజీతో జీవనం సాఫీగా సాగుతోంది. కానీ తన వ్యవసాయ మూలాలతో తిరిగి కనెక్ట్ అవ్వాలనే ఆశ ఒక వైపు, తోటి వారికి అవకాశాలను సృష్టించాలనే కోరిక మరోవైపు అభినవ్ సింగ్‌ను స్థిమితంగా కూర్చోనీయలేదు. రైతుల జీవన స్థితిగతులను మార్చడం. వ్యవసాయం గౌరవప్రదమైన వృత్తి అనేది నిరూపించాలనేది లక్ష్యం. చివరికి ఉద్యోగాన్ని వదిలేసి సొంత గ్రామానికి వెళ్లి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు.అభినవ్ 2014లో ఇండియాకు తిరిగి వచ్చాడు. గుర్గావ్లో కొన్నాళ్లు పనిచేశాడు. 2016లో 31 ఏళ్ల వయసులో అభినవ్ తన ఉద్యోగాన్ని పూర్తిగా వదిలేయాలని నిర్ణయించుకున్నాడు.సౌకర్యవంతమైన ఉద్యోగాన్ని వదిలి ఇండియాలో ఒక చిన్న గ్రామంలో వ్యవసాయాన్ని ఎంచుకోవడం అంత సులభం కాదు. కానీ పట్టుదలతో నిలిచి గెలిచాడు. స్వగ్రామంలో పూర్వీకుల భూమిలో గెర్బెరా వ్యవసాయం మొదలు పెట్టాడు. మొదట్లో సేంద్రీయ కూరగాయల సాగును ప్రయత్నించాడు, కానీ పెద్దగా సక్సెస్ అవ్వలేదు. అయితే ఉత్తరప్రదేశ్‌లో పెళ్లిళ్ల సీజన్లో అలంకరణకు కావాల్సిన రంగురంగుల పూలకు ఎక్కువ డిమాండ్ ఉందనీ, కానీ సప్లయ్ సరిగ్గా లేదని గుర్తించాడు. అంతే జెర్బెరా పువ్వుల సాగు వైపు మొగ్గు చూపాడు. 4వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న పాలీహౌస్లో పెట్టుబడి పెట్టాడు. మొత్తం రూ.58లక్షల పెట్టుబడిలో రూ.48 లక్షలు బ్యాంకు లోన్ కాగా, మిగతాది పొదుపు చేసుకున్నడబ్బు. ఫిబ్రవరి 2021లో తొలి పంటసాయం విజయవంతమైన వ్యాపారానికి నాంది పలికింది.ప్రారంభించిన కేవలం ఒక్క ఏడాదిలోనే జెర్బెరా సాగు నెలవారీ రూ. 1.5 లక్షల ఆదాయాన్ని సాధించాడు. అంతేకాదు పూలసాగు, ప్యాకేజింగ్, రవాణా , విక్రయాలు ఇలా పలు మార్గాల్లో 100 మంది వ్యక్తులకు జీవనోపాధిని అందించాడు. జెర్బెరా మొక్కలను స్థానికంగా ఇతర రైతులకు అందిస్తూ, స్థిరమైన వ్యాపార నమూనాను సృష్టించాడు. తోటి రైతులకు స్ఫూర్తినిగా నిలిచాడు. “ఉద్యోగంతో సంపాదించే దానికంటే తక్కువ సంపాదించవచ్చు, కానీ ఇతరులకు జీవనోపాధిని కల్పించడం, సొంత వూరిలో ఇష్టమైంది, ప్రత్యేకమైనది చేయడం. కుటుంబంతో కలిసి ఉండడం ఇన్ని ఆనందాల్ని ఎంత విలాసవంతమైన జీవితం మాత్రం అందిస్తుంది చెప్పండి’’ -అభినవ్. -
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
అమెరికన్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా గత కొన్ని రోజులుగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను తొలగిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే తాజాగా కంపెనీలో సుమారు ఏడు సంవత్సరాలు పనిచేసిన ఓ ఉద్యోగిని ఒక్క ఈమెయిల్‌తో తొలగించినట్లు వెల్లడించింది.దాదాపు ఏడేళ్ల పాటు ఎంతో నమ్మకంగా పని చేసిన తన సోదరి లేఆఫ్‌కి గురైన తీరుపై ఆమె సోదరుడు జతిన్ సైనీ లింక్డిన్లో పోస్ట్ చేశారు. ఇందులో గత నెలలోనే ఆమె ప్రమోషన్ (పదోన్నతి) పొందినట్లు పేర్కొన్నారు. ప్రమోషన్ పొందిన తరువాత వారు న్యూజెర్సీ నుంచి వాషింగ్టన్కు మకాం మార్చాలని కూడా అనుకున్నట్లు పేర్కొన్నారు.రోజు మాదిరిగానే జతిన్ సైనీ సోదరి మే 3న ఆఫీసుకు వెళ్తే తన కార్డు పనిచేయకపోవడాన్ని గమనించి విస్తుపోయింది. ఆశలన్నీ ఆవిరైపోవడంతో ఆమె చాలా బాధపడింది. ఆమెను మాత్రమే కాకుండా ఆమె టీమ్‌లో ఉండే దాదాపు 73 శాతం మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిసింది. ఏడు సంవత్సరాలు ఎంతో నమ్మకంగా పనిచేసినప్పటికీ ఒక్క మైయిల్ పంపి తీసివేయడంతో ఆమె తీవ్ర నిరాశకు గురైంది.పోస్ట్ చివరలో.. జతిన్ సైనీ తన సోదరి ఉద్యోగాన్ని కోల్పోవడంతో కార్పొరేట్ నిర్ణయాల వెనుక ఉన్న విలువలను గురించి వెల్లడించారు. టెస్లాలో ఏడు సంవత్సరాలు పనిచేస్తే.. కష్టాన్ని ఏ మాత్రం గుర్తించకుండా ఇప్పుడు బయటకు పంపారు. శ్రమ మొత్తం సున్నా అయిపోయిందని అన్నారు.టెస్లా కంపెనీ ఏప్రిల్ నెలలో కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులలో 10 శాతం కంటే ఎక్కువమందిని తొలగించింది. గ్లోబల్ మార్కెట్లో కంపెనీ కార్ల అమ్మకాలు తగ్గుముఖం పడుతుండటంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ కారణంగా ఇప్పటికి నాలుగు సార్లు ఉద్యోగులను తొలగిస్తూనే ఉంది. దీంతో టెస్లాలో ఉద్యోగం గాల్లో దీపంలాగా అయిపోయింది. -
Rameshwaram Cafe Bomb Blast: యువ టెకీని కాపాడిన అమ్మ ఫోన్ కాల్
బెంగళూరు: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు నుంచి ఒక యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్ సినీ ఫక్కీలో తృటిలో తప్పించుకున్నాడు. శుక్రవారం(మార్చ్ 1)మధ్యాహ్నం ఒంటిగంటకు పేలుడు జరిగిన సమయంలో బిహార్‌కు చెందిన టెకీ కుమార్ అలంకృత్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ చేస్తున్నాడు. పేలుడు జరడానికి కొద్ది క్షణాల ముందు అలంకృత్‌కు అతడి తల్లి నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ మాట్లాడటం కోసం అలంకృత్ కేఫ్ బయటికి వచ్చాడు. ఇంతలో కేఫ్ లోపల పేలుడు జరిగింది. ఈ పేలుడులో 9 మంది గాయపడ్డారు. ఘటన తర్వాత అలంకృత్ మాట్లాడుతూ‘నేను లంచ్ కోసం కేఫ్‌కు వచ్చాను. ఇడ్లీ తినడం పూర్తి చేసి దోశ తినడం స్టార్ట్ చేద్దామనుకునే లోపు మా అమ్మ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ పట్టుకుని బయటికి వెళ్లాను. ఇంతలో పేలుడు జరిగింది. గ్యాస్ సిలిండర్ పేలిందేమో అని మొదట అనుకున్నాను. ఎలా ఉన్నావు. తిన్నావా.. లేదా అని అడగడానికి మా అమ్మ ఫోన్ చేసింది. అమ్మ నుంచి ఫోన్ రాకపోయి ఉంటే నేను ఉండేవాడిని కాదు’అని అలంకృత్ చెప్పాడు. ఇదీ చదవండి.. రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్‌లో కీలకంగా ఏఐ -
ప్రశాంతత లేదని ట్వీట్.. తెల్లారేసరికి ఉద్యోగమే ఊడింది!
2024 ప్రారంభమైనా.. ఐటీ ఉద్యోగాలు గాల్లో దీపంలో అయిపోయాయి, ఏ కంపెనీ ఎప్పుడు లే ఆప్స్ అంటుందో తెలియక ఐటీ ఉద్యోగులు బిక్కుబిక్కుమంటున్నారు. గత నెలలో ఏకంగా 30000 కంటే ఎక్కువ మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు Layoffs.fyi ఒక నివేదికలో వెల్లడించింది. ఎప్పుడు పోతాయో తెలియని ఐటీ జాబ్స్ గురించి భయపడుతున్న తరుణంలో ఓ ఉద్యోగి చేసిన ట్వీట్.. అతని ఉద్యోగం పోయేలా చేసింది. బెంగళూరుకు చెందిన ఒక ఐటీ ఉద్యోగి తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ప్రస్తుత ఆర్ధిక మాంద్యం నేపథ్యంలో ప్రశాంతంగా లేనని, కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతోందని ట్వీట్ చేశారు. ట్వీట్ చేసిన మరుసటి రోజే అతని ఉద్యోగం ఊడిపోయిందని, ఉద్యోగం కోసం వెతుక్కుంటున్నానని, ఏదైనా జాబ్ ఉంటే చెప్పండని మరో ట్వీట్ చేశాడు. ఫోర్మా (Forma) అనే కంపెనీలో పనిచేసే సాఫ్ట్వేర్ ఇంజినీర్ 'జిష్ణు మోహన్' అనే వ్యక్తి 2019లో కొచ్చి నుంచి బెంగరూరు వచ్చి జాబ్ చేసుకుంటున్నాడు. ఇటీవల అతడు జాబ్ కోల్పోయే సమయానికి ఫుల్ టైమ్ రిమోట్ ఎంప్లాయ్‌గా పనిచేస్తున్నాడు. ఒక్క ట్వీట్ వల్ల ఉద్యోగం పోవడంతో ఇప్పుడు ఇతడే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచాడు. ఇదీ చదవండి: లే ఆఫ్స్.. 32000 మంది టెకీలు ఇంటికి - అసలేం జరుగుతోంది? జిష్ణు మోహన్ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. కొందరు రెస్యూమ్ పంపమని అడగ్గా.. ఇంకొందరు ఓపెన్ పొజిషన్స్ గురించి కామెంట్ సెక్షన్లలోనే ఆఫర్ చేశారు. That was quick. I got laid off today, as part of reorg. So actively looking for a job now. Please let me know if anyone is hiring. https://t.co/CqGWYQbgY6 — Jishnu (@jishnu7) February 8, 2024 -
పార్ట్‌టైమ్ జాబ్ నిలువునా ముంచేసింది.. ఇది ఓ టెకీ కథ.. తస్మాత్ జాగ్రత్త!
ఆన్లైన్, సైబర్ మోసాలు ఎవరినీ వదిలిపెట్టడం లేదు. సామాన్యులే కాకుండా బాగా చదువుకున్నవారు, టెక్నాలజీపై అవగాహన ఉండి ఐటీ రంగంలో పనిచేస్తున్న వారు కూడా ఈ ఆన్లైన్ ఫ్రాడ్లకు బలవుతున్నారు. ఆన్లైన్లో పార్ట్‌టైమ్ జాబ్‌తో నిలువునా మోసపోయిన ఓ టెకీ ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. గత ఏడాది ఫిబ్రవరి 11 నుంచి వివిధ ఆన్లైన్ టాస్క్‌లపేరుతో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సహా ఎనిమిది మందిని ఏకంగా రూ. 1.04 కోట్లకు మోసగించిన ఉదంతానికి సంబంధించి పుణే, పింప్రీ చించ్వాడ్లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు గురువారం ఎనిమిది ఎఫ్ఐఆర్లను నమోదు చేశాయి. రూ. 30.20 లక్షలు నష్టపోయిన టెకీ ఒక ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న మహారాష్ట్రలోని వాకాడ్ ప్రాంతానికి చెందిన 39 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ గత జనవరి 24 నుంచి 27 తేదీల మధ్య రూ.30.20 లక్షలు నష్టపోయారు. ఇటీవల జాబ్ పోవడంతో నిరుద్యోగిగా మారారు. దీంతో ఆన్లైన్ టాస్క్‌లు పూర్తి చేసే పార్ట్‌టైమ్‌లో చేరారు. పోలీసుల కథనం ప్రకారం.. ఈ పార్ట్‌టైమ్ జాబ్ ఆఫర్ గురించి జనవరి 24న తన మొబైల్ ఫోన్‌కు సందేశం వచ్చింది. దీనికి స్పందించిన ఆయనకు ఫోన్లో మెసెంజర్ యాప్‌ను డౌన్లోడ్ చేయాలని చెప్పారు. ఆపై ఆయన్ను ఓ గ్రూప్‌లో చేర్చారు. ఆ తర్వాత వివిధ రకాల వస్తువులు, కంపెనీలకు రేటింగ్ ఇచ్చే టాస్క్‌లు అప్పగించారు. ఈ టాస్క్‌లు పూర్తి చేశాక రూ.40 లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి ముందుగా కొద్దికొద్దిగా టెకీ నుంచి డబ్బు తీసుకున్నారు. ఇలా జనవరి 24 నుంచి 12 విడతల్లో రూ.30.20 లక్షలు మోసగాళ్లు చెప్పిన బ్యాంక్ అకౌంట్లకు బాధితుడు ట్రాన్స్ఫర్ చేశాడు. కంపెనీకి లాస్ వచ్చిందని మళ్లీ కొంత డబ్బు పంపించాలని చెప్పడంతో అనుమానం వచ్చిన అతను తాను అప్పటిదాకా ట్రాన్స్ఫర్ డబ్బును తిరిగిచ్చేయాలని డిమాండ్ చేశాడు. దీంతో మోసగాళ్లు అతని స్పందించడం మానేశారు. మేనేజర్ రూ.72.05 లక్షలు ఇదే విధంగా థెర్‌గావ్‌కు చెందిన 24 ఏళ్ల గ్రాడ్యుయేట్ యువతి కూడా రూ.2.39 లక్షలు నష్టపోయింది. ఈమే కాకుండా మరో ఆరుగురు కూడా ఆన్లైన్ టాస్క్‌లతో మోసపోయారు. వీరిలో ఓ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్ గా పనిచేస్తున్న మహిళ కూడా ఉన్నారు. ఆమె ఏకంగా రూ.72.05 లక్షలు నష్టపోవడం గమనార్హం. -
మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం కోసం 30 సార్లు అప్లై.. ఎట్టకేలకు జాబ్ కొట్టేసింది, కానీ..
గజినీ మహమ్మద్ 17 సార్లు భారతదేశం మీద దండయాత్ర చేసాడని చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం, అయితే ఓ మహిళ ఉద్యోగం కోసం ఏకంగా 30 కంటే ఎక్కువ సార్లు ఒకే కంపెనీకి అప్లై చేసి ఉద్యోగం సాధించింది, జాబ్‌లో చేరిన కేవలం ఏడాదికే రాజీనామా చేసి అందరికి షాక్ ఇచ్చింది. దీనికి బంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి ప్రాంతానికి చెందిన 'హిమాంతిక మిత్రా' (Haimantika Mitra) బెంగళూరులో నివశిస్తూ.. మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం చేయాలని దాదాపు 30 కంటే ఎక్కువ సార్లు అప్లై చేసుకుని, పట్టువదలని విక్రమార్కుని మాదిరిగా చివరకు అనుకున్నట్లుగానే ఉద్యోగంలో చేరింది. 30 సార్లు ఉద్యోగానికి అప్లై చేసి జాబ్ తెచ్చుకున్న హిమాంతిక కేవలం ఒక సంవత్సరం మాత్రమే అక్కడ పనిచేసి రాజీనామా చేసి కంపెనీకి మాత్రమే కాకుండా.. కుటుంబ సభ్యులు, స్నేహితులను కూడా అవాక్కయ్యేలా చేసింది. మైక్రోసాఫ్ట్ కంపెనీ 2020లో దేశవ్యాప్తంగా నిర్వహించిన హ్యాకథాన్ కార్యక్రమంలో పాల్గొనేవారి నుంచి సపోర్ట్ ఇంజినీర్లను ఎంపిక చేఉకోనున్నట్లు తెలుసుకుని మిత్రా జాబ్‌కి అప్లై చేసింది. అప్పుడు మొత్తం 11,000 జాబ్ కోసం అప్లై చేసుకోగా.. చివరి రౌండ్లో మిత్రా సెలక్ట్ కాలేకపోయింది. ఇదీ చదవండి: చైనాను దాటేసిన భారత్.. త్వరలో అమెరికా! - ఆనంద్ మహీంద్రా ట్వీట్ కంపెనీ ఆమె పనితీరుని చూసి మైక్రోసాఫ్ట్ రిక్రూటర్లు ఇంటర్వ్యూ చేయడానికి అంగీకరించారు, ఇందులో భాగంగానే 2021 ఏప్రిల్ నుంచి ఇంటర్న్‌షిప్ అనుకున్నట్లుగానే చివరకు ఇంటర్వ్యూలో నెగ్గి జాబ్ కొట్టేసింది. ఇంత కష్టపడి ఉద్యోగంలో చేరిన సంవత్సరం తరువాత మైక్రోసాఫ్ట్ కంటే మంచి కంపెనీలో.. మంచి పొజిషన్లో ఉండాలనే ఉద్దేశ్యంతో జాబ్ వదిలిసినట్లు తెలిపింది. భవిష్యత్తులో మళ్ళీ మైక్రోసాఫ్ట్‌లో అడుగు పెడతానని కూడా మిత్రా వెల్లడించింది. I applied to Microsoft 30+ times, and when I got hired, I was one among the 25 from the pool of 11000 applicants (It was off-campus hiring through a hackathon). I believe in - Send that DM. Apply to that job. Take the road not taken. Worst case? I fail. Soak it all in. Be sad.… https://t.co/3YQemnJ2Yj — Haimantika Mitra (@HaimantikaM) January 4, 2024 -
Chennai: మహిళా టెక్కీ హత్యకు కారణం ఇదే !
చెన్నై: సంచలనం రేపిన చెన్నై టెక్కీ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. టెక్కీ నందిని(26) వేరే వ్యక్తితో చనువుగా ఉంటోందన్న అసూయతోనే ఆమె స్నేహితుడు వెట్రిమారన్ ఈ దారుణ హత్యకు పాల్పడ్డట్టు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. నందిని, నిందితుడు వెట్రిమారన్ ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. వీరిద్దరూ కలిసి ఒకే స్కూల్లో చదివారు. చదువు అనంతరం ఇద్దరూ చెన్నై వచ్చి ఒకే కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. అయితే నిందితుని పాత పేరు మహేశ్వరి. కేవలం నందినిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోనే కొన్ని నెలల క్రితం అతడు లింగ మార్పిడీ సర్జరీ చేయించుకుని వెట్రిమారన్‌గా మారాడు. ఇద్దరూ ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీలో నందిని కొంతకాలంగా వేరే వ్యక్తితో చనువుగా ఉంటోందని, ఈ విషయంలో తాను తట్టుకోలేకే ఆమెను హత్య చేసినట్లు వెట్రిమారన్ పోలీసులకు చెప్పాడు. నందినిని హతమార్చాలనే ఉద్దేశంతోనే ఈ నెల 23న రాత్రి బర్త్ డే గిఫ్ట్ ఇస్తానని పిలిచి చైన్‌తో గొంతు నులిమి, బ్లేడ్‌తో కోసి నిప్పంటించాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నందిని మరణించింది. ఈ కేసులో పోలీసులు వెట్రిమారన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇదీ చదవండి: టెక్కీ దారుణ హత్య.. హద్దుల్లేని ప్రేమ పరిణామాలు ఇలాగే ఉంటాయా? -
బెడ్ అమ్మబోయి రూ.68 లక్షలు పోగొట్టుకున్న టెకీ.. ఎలా అంటే?
బెంగళూరుకు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రముఖ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ OLXలో తాను ఉపయోగించిన బెడ్‌ను విక్రయించడానికి ప్రయత్నించి ఏకంగా రూ. 68 లక్షల నష్టాన్ని చవిచూశాడు. హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో నివాసం ఉంటూ నగరంలోని ఓ ప్రైవేట్ సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఈ మోసానికి బలైపోయాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రముఖ జాతీయ మీడియా సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం, బెంగళూరుకు చెందిన 36 సంవత్సరాల ఇంజినీర్ రూ. 15000లకు బెడ్ విక్రయించడానికి ఓఎల్ఎక్స్ యాప్‌లో ఫోటోలను అప్లోడ్ చేసాడు. ఇది చూసి కొనుగోలు చేయాలనుకున్న ఓ వ్యక్తి (మోసగాడు), బెడ్ అమ్మాలనుకున్న ఇంజినీర్‌కు ఫోన్ చేసాడు. ఇంజినీర్ వెల్లడించిన ధరకే కొనుగోలు చేస్తానని చెప్పిన మోసగాడు UPI లావాదేవీకి సంబంధించిన సాంకేతిక సమస్యలున్నట్లు, పరిష్కరించుకోవడంలో భాగంగా తనకు రూ. 5000 పంపాలని వెంటనే తిరిగి పంపిస్తానని చెప్పాడు. ఆ మోసగాని మాటలు విన్న టెకీ రూ. 5వేలు పంపించాడు. మోసగాడు మొదట్లో రూ. 10వేలు పంపించాడు. ఇలాగే మళ్ళీ రూ. 5వేలు, రూ. 10వేలు, రూ. 15వేలు డిమాండ్ చేస్తూ మొత్తానికి భారీగానే సబ్బు గుంజేసాడు. ఇదీ చదవండి: ఆర్డర్ చేస్తే క్యాన్సిల్ అయింది.. కట్ చేస్తే.. ఆరు సార్లు డెలివరీ డబ్బు పంపించే క్రమంలో మోసగాడు టెకీకి రూ. 30000 షేర్ చేసాడు. మోసగాడు టెక్కీని లింక్‌ను ఉపయోగించి డబ్బును తిరిగి ఇవ్వమని, OTPని షేర్ చేయమని కోరాడు. ఇంజనీర్ OTP ట్రాప్‌లో పడిపోగానే, అతను ఏకంగా 68 లక్షల రూపాయల కోల్పోయాడు. రూ. 68 లక్షలు పోగొట్టుకున్న టెకీ పోలీసులకు పిర్యాదు చేసాడు. ప్రస్తుతం ఈ సంఘటన మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఇలాంటి సైబర్ లేదా ఆన్లైన్ మోసాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఈ తరహా మోసాల వల్ల పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్న సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. -
ఐటీ జాబ్ పోయి ఉబెర్ డ్రైవర్‌గా మారిన ఇండియన్ - వీడియో వైరల్
కరోనా మహమ్మారి ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలను ముప్పుతిప్పలు పెట్టి ఆర్థికమాంద్యంలోకి నెట్టివేసింది. ఈ ప్రభావం చాలామంది జీవితాల మీద పడింది. ఇప్పటికి కూడా కొన్నిదేశాల్లోని దిగ్గజ కంపెనీలు సైతం ఆర్థిక మాంద్యం తట్టుకోలేక తమ ఉద్యోగులను తీసేస్తున్నాయి. ఒకవైపు చదువు కోసం విదేశాలకు వెళ్లిన చాలా మంది భారతీయులు సమస్యలను ఎదుర్కొంటుంటే.. మరికొందరు ఉద్యోగాలు కోల్పోయి అగచాట్లు పడుతున్నారు. కెనడాలో ఉంటున్న ఒక భారతీయుడు ఉద్యోగం కోల్పోయి ఉబెర్ డ్రైవర్‌గా పనిచేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఉద్యోగం కోల్పోయిన తర్వాత, యూట్యూబ్ ఛానెల్ కలిగి ఉన్న టెకీ తన టెస్లాను డ్రైవ్ చేస్తూ నిత్యావసర వస్తువులను డెలివరీ చేస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనీష్ మావెలిక్కర తన యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేసిన వీడియోలో.. తాను ఐటీ ఉద్యోగం కోల్పోయినట్లు, కొత్త ఉద్యోగం కోసం వెతుక్కున్నట్లు.. ఇందులో భాగంగానే కొన్ని ఇంటర్వ్యూలకు హాజరైనట్లు, దానికి సంబంధించిన రిజల్ట్ ఇంకా రాలేదని వెల్లడించాడు. ఇదీ చదవండి: రెజ్యూమ్ ఇలా క్రియేట్ చేస్తే.. జాబ్ రావాల్సిందే! ఉద్యోగం వచ్చే వరకు పార్ట్ టైమ్ ఉద్యోగంగా కిరాణా సామాగ్రిని ఇంటింటికి డెలివరీ చేస్తున్నట్లు కూడా వీడియోలో తెలిపాడు. ప్రతి రోజూ తన పని తెల్లవారుజామున నాలుగు గంటలకు ప్రారంభమవుతుందని, తన టెస్లా కారుని ఉబెర్‌తో నడుపుతున్నట్లు స్పష్టం చేసాడు. ఒకవేళా ఉద్యోగం లభించకపోతే తన టెస్లా కారుని రోజంతా డ్రైవ్ చేయాల్సి ఉంటుందని తెలియజేస్తూ.. విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల జీవితం ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ వీడియో ఓ చిన్న ఉదాహరణగా వివరించాడు. -
రూ.6.5 కోట్ల జాబ్ వదులుకున్న మెటా ఉద్యోగి - రీజన్ తెలిస్తే..
ఎవరైనా ఎక్కువ శాలరీ వచ్చే జాబ్.. లేదా ప్రసిద్ధి చెందిన కంపెనీలో ఉద్యోగం చేయాలనుకుంటారు. ఫేస్బుక్లో జాబ్ సంపాదించి రూ.6.5 కోట్ల వేతనం తీసుకునే ఒక టెకీ ఉద్యోగం వదిలి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇంతకీ అతడెవరు, ఉద్యోగం వదిలేయడానికి కారణం ఏంటనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మెటాలో టెక్ లీడ్ అండ్ మేనేజర్‌గా ఐదేళ్లపాటు పనిచేసిన 'రాహుల్ పాండే' 2022లో తన ఉద్యోగాన్ని వదులుకున్నాడు. అప్పటికి అతని శాలరీ రూ. 6.5 కోట్లు కంటే ఎక్కువ. జాబ్ వదిలేసిన తరువాత ఫేస్బుక్లో పనిచేసిన అనుభవం గురించి వివరిస్తూ లింక్డ్ఇన్ పోస్ట్ చేసాడు. ఫేస్బుక్లో చేరిన ప్రారంభంలో సీనియర్ ఇంజనీర్‌గా ఎంతో ఆత్రుతగా పనిచేసాని, కంపెనీ స్టాక్ పడిపోవడంతో నైతికతకు దెబ్బ తగిలిందని, అర్హత లేని వ్యక్తిగా చేసిందని, దీంతో పనితీరును మరింత మెరుగుపరచుకోవడానికి గట్టిగా ప్రయత్నం చేసి రెండు సంవత్సరాల్లో మంచి స్థాయికి చేరుకున్నానని వెల్లడించాడు. ఇదీ చదవండి: సరికొత్త అధ్యాయానికి నాంది.. ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేకం! మెటాను మించిన ప్రపంచం కోసం.. ఫేస్బుక్లో నా చివరి సంవత్సరం మేనేజర్ బాధ్యతలు స్వీకరించి.. అదే సంస్థలో మంచి పురోగతి పొందాను. 2021 తరువాత మెటాను మించిన ప్రపంచాన్ని అన్వేషించడం ప్రారంభించాను. దాదాపు పదేళ్లపాటు టెక్‌లో పనిచేసిన తర్వాత, కొంతవరకు ఆర్థిక స్వేచ్ఛను సాధించాను, ఇంజినీరింగ్‌కు మించి ఇంకా ఎంత నేర్చుకోవాలో పూర్తిగా గ్రహించానని వెల్లడించాడు. -
ఏం చిక్కొచ్చి పడింది! అటు చూస్తే.. జవాన్!.. ఇటు చూస్తే.. ఆఫీస్..!
అటు చూస్తే జవాన్ ఇటు చూస్తే ఆఫీస్...అటు చూస్తే బాదం హల్వా ఇటు చూస్తే సేమ్యా ఇడ్లీ... అని శ్రీశ్రీ అన్నట్టుగా ఆ బెంగుళూరు ఐ.టి ఉద్యోగికి కూడా సంకటం వచ్చింది. ఒకవైపు జవాన్ రిలీజ్. మరోవైపు సాఫ్ట్వేర్ డ్యూటీ. చివరకు అతను రెండూ చేశాడు. వైరల్ అయ్యాడు. బెంగళూరులోనే ఇటువంటివి జరుగుతుంటాయి. మొన్నా మధ్య ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ర్యాపిడో బైక్ వెనుక కూచుని ఆఫీస్‌కు వెళుతూ ట్రాఫిక్‌లో చిక్కుకుపోతే బైక్ మీదే ల్యాప్‌టాప్ తెరిచి లాగిన్ అయ్యి డ్యూటీ మొదలెట్టేశాడు. భారీ ట్రాఫిక్ వల్ల క్యాబుల్లో ఎక్కగానే ల్యాప్‌టాప్‌లు తెరిచే వాళ్లూ అక్కడ ఎక్కువే. ఇప్పుడు ఒక ఉద్యోగి ఏకంగా సినిమా హాల్లోనే ల్యాప్‌టాప్ తెరిచాడు. ఏం చేస్తాడు మరి? షారూక్ ఖాన్ ఫ్యాన్. ఫస్ట్ డే ఫస్ట్ షో. సరిగ్గా ఆ టైమ్‌కే లాగిన్ అవ్వాలి. అందుకని థియేటర్లో ల్యాప్‌టాప్‌లో వేళ్లు టిక్కుటక్కుమంటుంటే కళ్లు సినిమాకు అంకితం అయ్యాయి. వెనుక కూచున్న ఒక వ్యక్తి ఇది ఫొటో తీసి ఇన్‌స్టాలో పెడితే లక్షల కొద్దీ వ్యూస్ వచ్చాయి. ‘బెంగళూరులో ఇక పని చేయకుండా వదిలేసిన చోటు ఏదీ లేదు’ అని కామెంట్లు చేస్తూ ఏడవలేక నవ్వుతున్నారు. When #Jawan first day is important but life is #peakbengaluru. Observed at a #Bangalore INOX. No emails or Teams sessions were harmed in taking this pic.@peakbengaluru pic.twitter.com/z4BOxWSB5W — Neelangana Noopur (@neelangana) September 8, 2023 (చదవండి: కాలం కలిసి వస్తే డంప్‌యార్డ్ కూడా నందనవనం అవుతుంది!) -
Korutla Death Mystery: కోరుట్ల టెక్కీ దీప్తి కేసులో సరికొత్త ట్విస్ట్
జగిత్యాల: కోరుట్ల సాఫ్ట్వేర్ దీప్తి మృతి కేసు ఊహించని మలుపు తిరిగింది. దీప్తి అనుమానాస్పద మృతి తర్వాత ఓ యువకుడితో వెళ్లిపోయిన దీప్తి సోదరి చందన పేరిట ఓ ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. తాము మద్యం సేవించిన మాట వాస్తవమేనని, కానీ తాను అక్కను చంపలేదంటూ.. తన సోదరుడు సాయికి చందన ఆ వాయిస్ మెసేజ్ పంపినట్లు తెలుస్తోంది. ‘‘అరేయ్ సాయి నేను చందక్కను రా.. నిజమెంటో చెప్పాలారా. దీప్తిక్క నేను తాగుదామనుకున్నాం. కానీ, నేను తాగలేదు. అక్కనే తాగింది. నేను నా ఫ్రెండ్ చేత తెప్పించా. అది నేను ఒప్పుకుంటా. కానీ, అక్కనే తాగింది. తాగిన తర్వాత తన బాయ్‌ఫ్రెండ్‌ను పిలుస్తా అంది. నేను వద్దన్నా.. అయినా పిలుస్తా అంటే చివరికి నీ ఇష్టం సరే అన్నా.. నేను ఇంట్లోంచి వెళ్లిపోదాం అనుకున్నాం. అది నిజం. అక్కకి చెప్పి వెళ్లిపోదాం అనుకున్నాం. అక్క హాఫ్ బాటిల్ కంప్లీట్ చేసింది. ఫోన్ మాట్లాడి.. సోఫాలో పడుకుంది. రెండుసార్లు లేపాను. సరే పడుకుందని డిస్టర్బ్ చేయొద్దని వెళ్లిపోయా. ఛాన్స్ దొరికిందని వెళ్లిపోయిన. నా తప్పేం లేదు సాయి. నాకు అక్కను చంపే ఉద్దేశం లేదు.. నన్ను నమ్ము సాయి.. నా తప్పేం లేదు.. ప్లీజ్‌రా నమ్మురా మేం రెండు బాటిల్స్ తెప్పించుకున్నాం. నేను బ్రీజర్ తాగా. అక్క వోడ్కా తాగింది. తర్వాత నాకు ఏమైందో తెలీదు. నేనైతే వెళ్లిపోయిన ఇట్లా అయితదనుకోలేదు. నేనెందుకు చంపుత సాయి.. నేనేందుకు మర్డర్ చేస్తా!.’’ అంటూ వాయిస్ మెసేజ్‌లో ఉంది. దీప్తి ఒంటిపై గాయాలు కోరుట్ల దీప్తి అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. దీప్తి శరీరంపై గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ఎడమ చేయి కూడా విరిగిపోయి ఉండడంతో.. ఇదే హత్యేననే నిర్ధారణకు వచ్చారు పోలీసులు. కిచెన్‌లో వోడ్కా, బ్రీజర్ బాటిళ్లు, వెనిగర్, నిమ్మకాయలు ఉండటంతో రాత్రి వేళ దీప్తి, చందన కలిసి మద్యం సేవించారా..? అనే అనుమానాలు వ్యక్తం కాగా.. తాజా ఆడియోక్లిప్‌తో అవి నిర్ధారణ అయ్యాయి. చందన ప్రియుడితో కలిసి వెళ్లిపోయే ప్రయత్నాన్ని దీప్తి అడ్డుకునే క్రమంలో గొడవ జరిగి ఆ గొడవలో తగలరాని చోట దెబ్బతగిలి దీప్తి చనిపోయిందా..? అనే సందేహాలు బలపడుతున్నాయి. ఇదిలా ఉంటే.. మృతురాలు దీప్తి సోదరి చందన దొరికితేనే ఈ కేసు చిక్కుముడి వీడేది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా వాళ్లు నిజామాబాద్ వైపు వెళ్లే బస్సు ఎక్కినట్లు తెలుస్తోంది. దీంతో చందన ఆచూకీ కోసం రెండు బృందాలను రంగంలోకి దించారు పోలీసులు. మరోవైపు చందనతో ఉన్న యువకుడు ఎవరు? అనే దానిపైనా ఆరాలు తీస్తున్నారు. కేసు నేపథ్యం ఇదే.. ఆంధ్రకు చెందిన బంక శ్రీనివాస్‌రెడ్డి–మాధవి దంపతులు సుమారు పాతికేళ్లుగా కోరుట్లలోని భీమునిదుబ్బలో స్థిరపడ్డారు. ఇటుకబట్టీ వ్యాపారం చేసుకునే శ్రీనివాస్‌రెడ్డికి కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కుమారుడు సాయి బెంగళూర్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్. పెద్ద కూతురు దీప్తి(24) పుణేలోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా వర్క్‌ఫ్రం హోం పద్ధతిన ఇంట్లో నుంచి పనిచేస్తోంది. చిన్నకూతురు చందన ఇటీవల బీటెక్ పూర్తి చేసింది. సోమవారం ఉదయం శ్రీనివాస్‌రెడ్డి– మాధవి హైదరాబాద్‌లోని బంధువుల గృహాప్రవేశం కార్యక్రమానికి వెళ్లగా దీప్తి, చందన మాత్రమే ఇంట్లో ఉన్నారు. రాత్రి 10 గంటల వరకు తండ్రితో అక్కాచెల్లెళ్లు ఫోన్లో మాట్లాడారు. మంగళవారం ఉదయం శ్రీనివాస్‌రెడ్డి తన కూతుళ్లతో మాట్లాడటానికి ప్రయత్నించగా పెద్ద కూతురు దీప్తి ఫోన్ లిఫ్ట్ కాలేదు. చిన్నకూతురు చందన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. రెండుమూడు సార్లు ఫోన్లో కూతుళ్లతో మాట్లాడేందుకు ప్రయత్నించిన శ్రీనివాస్‌రెడ్డి చివరికి పక్క ఇంట్లో ఉన్నవారికి ఫోన్ చేశాడు. తమ కూతుళ్లు ఫోన్ ఎత్తడం లేదని చెప్పి, ఓ సారి ఇంటిదాకా వెళ్లి చూడమని కోరాడు. పక్క ఇంట్లో ఉండే ఓ మహిళ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లోకి వెళ్లి చూడగా తలుపు బయట నుంచి గొళ్లెం పెట్టి ఉంది. పిలిస్తే ఎవరూ పలకలేదు. దీంతో తలుపు గొళ్లెం తీసి లోపలికి వెళ్లి చూడగా పెద్ద కూతురు దీప్తి సోఫాలో పడిపోయి ఉంది. చుట్టుపక్కల వారికి విషయం చెప్పగా వారు దీప్తిని పరిశీలించి అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు. బంధువులు, పోలీసులకు సమాచారం ఇవ్వగా మెట్పల్లి డీఎస్పీ వంగ రవీందర్‌రెడ్డి, సీఐ లక్ష్మీనారాయణ, ఎస్సైలు కిరణ్, చిరంజీవి ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. -
జీతం 17 లక్షలు..13 ఉద్యోగాల్ని రిజెక్ట్ చేసిన 21 ఏళ్ల యువతి!
కోవిడ్ -19, లేఆఫ్స్ వంటి కఠిన సమయాల్లో మీకొక జాబ్ ఆఫర్ వస్తే ? ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 13 కంపెనీలు మిమ్మల్ని ఆహ్వానిస్తే. అందులో టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్‌లాంటి సంస్థలుంటే! ఏం చేస్తారు? ఏం కంపెనీలో చేరాలో నిర్ణయించుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతారు. కానీ బెంగళూరుకు చెందిన ఈ టెక్కీ వచ్చిన ఆఫర్స్ అన్నింటిని తిరస్కరించింది. ఎందుకో తెలుసా? ఇండియన్ సిలికాన్ వ్యాలీ బెంగళూరుకు చెందిన రితి కుమారి (21). ఇప్పటి వరకు 13 కంపెనీల నుంచి ఆఫర్స్ వచ్చాయి. జీతం కూడా ఏడాదికి రూ.17లక్షలు పైమాటే. ఇంత శాలరీ వస్తుంటే ఎవరు కాదంటారు? చెప్పండి. కానీ రితి మాత్రం వద్దనుకుంది. తన మనసుకు నచ్చిన జాబ్ చేయాలని భావించింది. బదులుగా వాల్‌మార్ట్‌లో ఇంటర్న్‌షిప్ చేసేందుకు మొగ్గుచూపానంటూ జీవితంలో ఎల్లప్పుడూ కఠిన నిర్ణయాలు తీసుకోవాలంటూ తనకు ఎదురైన అనుభవాల్ని నెటిజన్లతో పంచుకున్నారు. అన్నట్లు ఇంటర్న్ షిప్ పూర్తి చేసిన ఆమె ఏడాదికి రూ. 20 లక్షల వేతనం తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనకు వచ్చిన జాబ్ ఆఫర్లు మంచివే. అందులో ఏదో ఒకటి సెలక్ట్ చేసుకోవాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేశారు. కానీ సోదరి ప్రేరణతో అన్నీ ఉద్యోగాల్ని కాదనుకున్నాను. మనసు మాట విని చివరికి వాల్‌మార్ట్‌ని ఎంచుకున్నారు. 6 నెలల ఇంటర్న్‌షిప్‌లో నెలకు స్టైఫండ్ రూ.85,000 సంపాదించారు. ‘నేను వాల్‌మార్ట్ ఇంటర్న్‌షిప్ ఆఫర్‌ను స్వీకరించినందుకు సంతోషంగా ఉన్నాను. నాకొచ్చిన జాబ్ ఆఫర్స్‌లో పొందే నెలవారీ వేతనం కంటే వాల్ మార్ట్ ఇచ్చే జీతం చాలా తక్కువ .ఈ విషయంలో నా తల్లిదండ్రులు సంతోషంగా లేరు. కఠినమైన సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో అర్ధం గాక ఆందోళన చెందా. ఎవరూ ఎలాంటి మద్దతు ఇవ్వలేదు. అప్పుడే నా సోదరి ప్రీతి కుమారి ఓ మాట చెప్పింది. ముందు నువ్వు నీ మనసు మాట విను. అది ఏం చెబితే అదే చేయి అంటూ ప్రోత్సహించింది. ప్రస్తుతం, ధన్‌బాద్‌లోని ఐఐటీలో పీహెచ్డీ చదువుతున్న నా సోదరి ప్రీతి కుమారి తల్లిదండ్రుల నిర్ణయాన్ని వ్యతిరేకించి గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్)లో పాల్గొనేందుకు వచ్చిన జాబ్ ఆఫర్స్‌ను తిరస్కరించారు. ఆ సమయంలో ప్రతి ఒక్కరూ ఆమె నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఐఐటీలో పీహెచ్డీ చేస్తూ ఆమె తీసుకున్న నిర్ణయం సరైందేనని నిరూపించారు. కాబట్టే, నేను వాల్‌మార్ట్‌లో ఇంటర్న్‌షిప్ ఆఫర్ తీసుకున్నాను.కష్టపడి నా ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ ఇంటర్వ్యూలు ఇచ్చాను. చివరికి వాల్‌మార్ట్ నుండి జాబ్ ఆఫర్ పొందాను అని కుమారి చెప్పారు. ఇప్పుడు తన కెరీర్ విషయంలో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాను తీసుకున్న నిర్ణయంపై స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్న తన తండ్రిని సహచర ఉపాధ్యాయులు సైతం అభినందించడం సంతోషంగా ఉందని అన్నారు. రితి లింక్డిన్ ప్రొఫైల్ ప్రకారం.. జనవరి 2022 నుండి జూలై 2022 వరకు వాల్‌మార్ట్‌లో ట్రైనింగ్ తీసుకుంది. ఆపై వాల్‌మార్ట్ గ్లోబల్ టెక్ ఇండియా (బెంగళూరు)లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ -2గా చేరింది. చదవండి👉 యాపిల్ కీలక నిర్ణయం.. చైనా గొంతులో పచ్చి వెలక్కాయ?! -
యాదాద్రి: ఫోన్‌ను రక్షించుకోబోయి టెక్కీ దుర్మరణం
సాక్షి, హన్మకొండ: విధి ఎంత విచిత్రమైందో.. సంతోషాన్ని క్షణాల్లోనే ఆవిరి చేసేస్తోంది. శ్రీకాంత్(25) అనే యువకుడిని జీవితం అలా అర్థాంతరంగా ముగిసిపోయింది. సెల్‌ఫోన్‌ను రక్షించుకోవాలనే తాపత్రయంతో రన్నింగ్ ట్రైన్ నుంచి పడి ప్రాణం కోల్పోయాడా యువకుడు. శాతావాహన్ ఎక్స్‌ప్రెస్‌లో బుధవారం బీబీనగర్(యాదాద్రి భువనగిరి) సమీపంలో ఈ విషాదం జరిగింది. కమలాపూర్ మండలం నేరెళ్లలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన ముప్పు శ్రీకాంత్ అనే యువకుడు బీబీనగర్ సమీపంలో శాతావాహన్ ఎక్స్‌ప్రెస్ నుంచి జారిపడి మృతి చెందాడు. శ్రీకాంత్ హైదరాబాద్‌లో ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో పని చేస్తున్నాడు. తొలిఏకాదశి, బక్రీద్ సెలవు దినం సందర్భంగా.. ఇంటికి వెళ్లేందుకు బుధవారం సాయంత్రం శాతవాహన ఎక్స్ ప్రెస్‌లో వరంగల్ బయల్దేరాడు. అయితే.. జనం రద్దీ ఎక్కువగా ఉండడంతో రైలులో ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తున్నాడు శ్రీకాంత్. మార్గం మధ్యలో బీబీ నగర్ వద్ద కర్రతో కొట్టి సెల్ ఫోన్ చోరీ చేసేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. అయితే సెల్‌ఫోన్‌ను కాపాడుకునే తాపత్రంలో శ్రీకాంత్ పట్టుజారి రైలు నుండి జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. పండుగకు ఇంటికి కొడుకు వస్తాడని సంతోషంగా ఎదురు చూసిన ఆ తల్లిదండ్రులకు.. కొడుకు శవం ఎదురు రావడంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇదీ చదవండి: తండ్రి చేతిలో హతం.. ప్రియురాలు లేని జీవితం ఎందుకనుకుని.. -
వర్చువల్ మీటింగ్.. స్క్రీన్‌పై చెడ్డీలు..
కొన్ని ఐటీ సంస్థల్లో ఇప్పటికీ వర్క్ ఫ్రం హొమ్ నడుస్తోంది. ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే హాయిగా పనిచేసుకుంటున్నారు. అయితే పని వేళల్లో ఆన్లైన్ షాపింగ్ చేస్తే పర్యవసానాలు ఎలా ఉంటాయో ఈ సంఘటన గురించి తెలుసుకుంటే అర్థమౌతుంది. ఢిల్లీకి చెందిన అమన్ సాఫ్ట్వేర్ డెవలపర్. ఇంటి నుంచి పని చేస్తున్న అతను వర్క్ టైమ్‌లో బాక్సర్ల కోసం ఆన్లైన్ షాపింగ్ చేశాడు. ఇందు కోసం తన బ్రౌజర్లోని ఒక ట్యాబ్‌లో ఈ-కామర్స్ సైట్‌ను ఓపెన్ చేశాడు. అయితే వర్చువల్ ఆఫీస్ మీటింగ్ సమయంలో తన స్క్రీన్‌ను షేర్ చేయమని అడిగినప్పుడు, అతను అనుకోకుండా షాపింగ్ పేజీకి సంబంధించిన ట్యాబ్‌ను షేర్ చేశాడు. ఇంతలో దురదృష్టవశాత్తూ స్క్రీన్ స్ట్రక్ అయిపోయింది. ఇంకేముంది అతని ఆన్లైన్ చెడ్డీల షాపింగ్ పేజీని అందరూ చూసేశారు. అతను ఆ స్క్రీన్ మార్చడానికి వీలు లేకుండా పోయింది. ఆ వర్చువల్ ఆఫీస్ మీటింగ్‌లో పాల్గొన్న అతని సహోద్యోగులు స్క్రీన్ మార్చరా నాయనా అంటూ ఎన్ని ఇన్కాల్ మెసేజ్‌లు పెట్టినా లాభం లేకోపోయింది పాపం. వర్క్ టైమ్‌లో జరిగిన ఈ పొరపాటు గురించి అమన్ సరదాగా ట్విటర్లో పేర్కొన్నాడు. ఈ సందర్భంగా తన సహోద్యోగుల నుంచి వచ్చిన సందేశాల స్క్రీన్షాట్లను షేర్ చేశాడు. వర్క్టైమ్లో ఆన్లైన్ షాపింగ్ వంటి ఇతర వ్యాపకాలు పెట్టుకుంటే పర్యవసానాలు ఎలా ఉంటాయో చెప్పకనే చెప్పాడు. guys pls pray for me 😭 pic.twitter.com/da5md2O4FC — Aman (@AmanHasNoName_2) June 1, 2023 ఇదీ చదవండి: హెచ్‌సీఎల్‌కు షాక్! కార్మిక శాఖను ఆశ్రయించిన ఐటీ ఉద్యోగులు.. ఎందుకంటే.. -
గన్నవరం: భానురేఖ కుటుంబానికి సీఎం సిద్ధరామయ్య పరిహారం ప్రకటన
సాక్షి, బెంగళూరు/గన్నవరం: కర్ణాటకలో ఊహించని రీతిలో వరద ప్రమాదంలో మృతి చెందింది ఏపీ యువతి భానురేఖా రెడ్డి(23). కుటుంబంతో సరదాగా బయటకు వెళ్లగా.. అండర్ పాస్‌లో భారీగా నిలిచిన నీటిలో ట్యాక్సీ చిక్కుకుని ఆమె కన్నుమూసింది. ఈ ఘటన గురించి తెలియగానే సీఎం సిద్ధరామయ్య వెంటనే సెయింట్ మార్తా ఆస్పత్రికి వెళ్లారు. భానురేఖ మృతదేహాన్ని పరిశీలించి.. ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు. బాధిత కుటుంబానికి ఐదు లక్షల పరిహారం ప్రకటించడంతో పాటు ఆస్పత్రిలో చేరిన నలుగురు కుటుంబ సభ్యులకు ఉచిత చికిత్స అందించనున్నట్లు ప్రకటించారు. కృష్ణా జిల్లా(ఏపీ) ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామానికి చెందిన భానురేఖ ఎలక్ట్రానిక్ సిటీలోని ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో పని చేస్తున్నారు. కుటుంబంతో సహా బెంగళూరు చూడాలని ఆదివారం సాయంత్రం ఓ క్యాబ్‌ను బుక్ చేసుకుని బయల్దేరింది. అండర్‌పాస్‌లోని బారికేడ్ పడిపోవడం, అది గమనించకుండా రిస్క్ చేసి ఆ నీళ్లలోంచి వెళ్లాలని డ్రైవర్ ప్రయత్నించడం వల్లే ఈ ఘోరం జరిగిందని సీఎం సిద్ధరామయ్య మీడియాకు ఘటన గురించి వివరించారు. దర్యాప్తు చేస్తాం! ఇదిలా ఉంటే.. భానురేఖను ఆస్పత్రికి తీసుకొచ్చే సమయానికి ఆమె కొన ఊపిరితో ఉందని, ఆమెకు చికిత్స అందించేందుకు వైద్యులు నిరాకరించారని, దానికి తామే సాక్షులమని కొందరు రిపోర్టర్లు సీఎం సిద్ధరామయ్య వద్ద ఆరోపించారు. ఈ ఆరోపణలపై సీఎం సిద్ధరామయ్య స్పందిస్తూ.. దర్యాప్తు జరిపి రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే ఆస్పత్రి వర్గాలు మాత్రం భానురేఖ ఆస్పత్రికి చేరుకునేలోపే చనిపోయిందని అంటున్నాయి. Karnataka CM Siddaramaiah met the family members of 23-year-old woman Bhanurekha who died after drowning in the waterlogged underpass in KR Circle area in Bengaluru. pic.twitter.com/aqQW3yG0Qy — ANI (@ANI) May 21, 2023 డ్రైవర్ దూకుడు వల్లే.. ఆదివారం సాయంత్రం తన కుటుంబంతో కలిసి సరదాగా బయటకు వెళ్తామని క్యాబ్ బుక్ చేసుకుంది భానురేఖ. భానురేఖ, ఐదుగురు కుటుంబ సభ్యులు క్యాబ్‌లో బయల్దేరారు. అయితే కేఆర్ సర్కిల్ అండర్ పాస్ వద్ద భారీగా వరద నీరు చేరి ఉంది. ఆ సమయంలో అవతలి ఎండ్‌లో ఎదురుగా కొన్ని వాహనాలు నిలిచి ఉండడం గమనించిన క్యాబ్ డ్రైవర్.. వెళ్లిపోవచ్చనే ఉద్దేశంతో కారును వేగంగా ముందుకు పోనిచ్చే యత్నం చేశాడు. కారు అండర్‌పాస్ మధ్యలోకి రాగానే.. ఒక్కసారిగా మునిగిపోయింది. దీంతో క్యాబ్‌లోని భానురేఖ కుటుంబ సభ్యులు కేకలు వేస్తూ సాయం కోసం ఆర్తనాదాలు చేశారు. బయటకు వచ్చి తమ ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఈలోపు అక్కడ గుమిగూడిన కొందరు వాళ్లను రక్షించే యత్నం చేశారు. చీరలు, తాడులు విసిరి వాళ్లను బయటకు లాగేందుకు ప్రయత్నించారు. నీరు క్రమక్రమంగా వేగంగా అండర్‌పాస్‌ను ముంచెత్తడంతో అది సాధ్యపడలేదు. ఈలోపు అక్కడికి చేరుకున్న సహాయక సిబ్బంది ఈదుకుంటూ వెళ్లిన ఇద్దరిని రక్షించారు. ఆపై నిచ్చెన ద్వారా అందరినీ బయటకు లాగి ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి చేరుకున్నాక భానురేఖ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అదే కేఆర్ సర్కిల్లోని అదే పాస్ వద్ద మరో మహిళా ప్యాసింజర్ ఆటోతో సహా చిక్కుకుపోగా.. పైకి ఎక్కి ఆమె తన ప్రాణాలను రక్షించుకుంది. రెస్క్యూ సిబ్బందిని ఆమెను బయటకు తీసుకొచ్చారు. కేవలం గంట పాటు కురిసిన భారీ వర్షానికి.. ఇలా ఆ లోతట్టు ప్రాంతం మునిగిపోవడంతోనే ఈ విషాదం నెలకొంది. స్వగ్రామంలో విషాద ఛాయలు సాక్షి, కృష్ణా: బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని బత్తుల భాను రేఖ మృతితో స్వగ్రామం తేలప్రోలులో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె తండ్రిది వీరపనేనిగూడెం. అయితే.. భాను రేఖ మాత్రం తల్లితో కలిసి అమ్మమ్మ ఇంట్లోనే పెరిగింది. బెంగళూరుకు వెళ్లకముందు ఆమె హైదరాబాద్‌లో ఉంది. ఆదివారం జరిగిన ఘటనలో ఆమె కన్నుమూసింది. ఉంగుటూరు మండలం తేలప్రోలులోని ఇంటివద్ద భాను రేఖ పార్థివదేహం కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. అయితే.. పోస్టుమార్టం అనంతరం బెంగుళూరు నుండి తేలప్రోలుకి భాను భౌతిక కాయం చేరుకోనుంది. -
యూట్యూబ్ వీడియో లైక్ చేస్తే..రోజుకు రూ. 8వేలు: కట్ చేస్తే!
న్యూఢిల్లీ: ప్రముఖ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్‌లో వీడియోలను లైక్ చేస్తే చాలు డబ్బులే డబ్బులు ఫేక్ మెసేజ్‌లతో సోషల్ మీడియా యూజర్లను నిండా ముంచుతున్న కొత్త స్కాం కలకలం రేపేతోంది. కేవలం వీడియోలని లైక్ చేసే పార్ట్‌టైమ్ ఉద్యోగంలో చేరమని వాట్సాప్ మెసేజ్ రావడంతో ఆశపడ్డ ఇంజనీర్‌కు భారీ షాక్ తగిలింది. ఒకటీ, రెండు కాదు ఏకంగా 45 లక్షల రూపాయలు స్వాహా అయిపోయాయి.మోసాన్ని ఆలస్యం గుర్తించిన అతగాడు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గుర్గావ్లోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు కేటుగాళ్లు దాదాపు రూ.42 లక్షల మేర కుచ్చుటోపీ పెట్టారు. మార్చి 24న అతనికి వాట్సాప్‌లో అతనికి ఒక మెసేజ్ వచ్చింది. కేవలం కొన్ని యూట్యూబ్ వీడియోలను లైక్ చేస్తే చాలు భారీ ఆదాయం వస్తుందంటూ నమ్మబలికారు స్కామర్లు. అదనపు ఆదాయం వస్తుందని కదా టెక్కీ ఆశపడ్డాడు. ఆ తరువాత మెల్లిగాపెట్టుబడి పెట్టమని అడిగారు. దీనికి అంగీకరించడంతో కేటుగాళ్లు తమ ప్లాన్‌ను పక్కాగా అమలు చేశారు. మొదట దివ్య అనే మహిళ సదురు టెకీని టెలిగ్రామ్ యాప్‌లోని గ్రూప్‌లో చేర్చుకుంది. దివ్యతో పాటు, కమల్, అంకిత్, భూమి, హర్ష్ అనే లాంటి కొంతమంది తాము రూ. 69 లక్షలకు పైగా భారీ లాభాన్ని ఆర్జించామని నమ్మ బలికారు. ఇక అంతే రెండో ఆలోచన లేకుండానే భార్య, తన బ్యాంకు ఖాతాల నుంచి మొత్తం రూ.42,31,600 బదిలీ చేశాడు. ఆ తరువాత నుంచి కనీస సొమ్మును విత్‌డ్రా చేయకుండా అడ్డుకోవడమే కాకుండా, మరో 11 వేలు ట్రాన్స్ఫర్ చేయాలని కోరారు. దీంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. టెకీ ఫిర్యాదుమేరకు సైబర్ క్రైమ్, ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (MG Comet EV: చీపెస్ట్ ఈవీ ‘ఎంజీ కామెట్’ వెయిటింగ్‌కు చెక్: బుకింగ్ ప్రైస్ తెలిస్తే!) ఇలాంటి అనుమానాస్పద సందేశాలు సాధారణంగా "హాయ్, ఎలా ఉన్నావు?" తో మొదలవుతాయి. ఇక్కడ టెంప్డ్ అయ్యామో..ఖేల్ ఖతం. ఉద్యోగం, అదనపు ఆదాయంఅంటూ ఊదర గొడతారు. అసలు మీరే మీ చెల్లించాల్సిన అవసరం లేదు మరియు ఇది పూర్తిగా ఉచితం. సింపుల్, మీరు చేయాల్సిందల్లా యూట్యూబ్ వీడియోలను లైక్ చేసి, స్క్రీన్షాట్లు పంపడమే అంటారు. దీనికి రూ.150 రూపాయలిస్తాం. ఇచ్చిన అన్ని టాస్క్‌లపై LIKE క్లిక్ చేస్తే రోజుకు 8000 రూపాయల వరకు సంపాదించవచ్చు. వెంటనే పేమెంట్. ఒక్కసారి ట్రై చేయండి అంటూ ముగ్గులోకి దించుతారు. ఆనక నిండా ముంచేస్తారు.ఇదీ స్కామర్ల లేటెస్ట్ మోడస్ ఆఫ్ ఓపరాండి ఇలాంటి మోసపూరిత సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. (టీ స్టాల్ కోసం ఐఏఎస్ డ్రీమ్‌ను వదిలేశాడు: ఏకంగా ఏడాదికి రూ. 150 కోట్లు ) -
మలేసియాలో ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి గ్రామానికి: రారాజులా లాభాల పంట
విదేశంలో ఉద్యోగం.. ఐదెంకల ఐటీ ఉద్యోగం. అయినా ఇవేవీ సంతోషాన్ని ఇవ్వలేదు. అందుకే లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేసి తనకెంతో ఇష్టమైన రైతుగా మారి పోయాడు. మలేషియాలో ఉద్యోగానికి బైబై చెప్పేసి ఆర్గానిక్ ఫామింగ్ (సేంద్రీయ వ్యవసాయం) ద్వారా లక్షలు సంపాదిస్తున్నాడు. ఒడిశాలోని రాయగడ జిల్లాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ సత్య ప్రబిన్ వినూత్న వ్యవసాయ పద్ధతులతో విజయం సాధించి సమాజానికి ప్రేరణగా నిలుస్తున్నాడు. బీటెక్ పూర్తి చేసిన సత్య, మలేషియా ఐటీ కంపెనీలో టెకీగా 11 ఏళ్లు పని చేశాడు. నెలకు రూ.2 లక్షల వేతనం సౌకర్య వంతమైన జీవితం. అయినా అతనికి వ్యవసాయం మీద ఉన్న మక్కువ పోలేదు. ముఖ్యంగా తన చిన్నతనంలో తండ్రి జీవనోపాధి కోసం కూరగాయలు పండించేవారు. అది అతని మనసులో ఎపుడూ మెదులుతూ ఉండేది. వన్ ఫైన్ మార్నింగ్ ఇక ఉద్యోగాన్ని వదిలేసి గ్రామానికి వెళ్లి వ్యవసాయాన్ని మొదలు పెట్టాలనుకున్నాడు. క్షణం ఆలస్యం చేయ కుండా చకచకా పనులన్నీ చక్క బెట్టుకుని తనకున్న అభిరుచుని నెరవేర్చుకునేందుకు రంగంలోకి దిగిపోయాడు. 2020లో సొంత గ్రామానికి వచ్చేసి 34 ఎకరాల భూమిలో డ్రిప్ సిస్టమ్, సేంద్రీయ ఎరువులు వంటి ఆధునిక పద్ధతులను ఉపయోగించి వ్యవసాయం ప్రారంభించాడు. అంతే నమ్ముకున్న భూమి అతనికి గొప్ప విజయాన్ని అందించింది. సేంద్రీయ పద్ధతుల్లో భూమి సారాన్ని కాపాడుకుంటూ, వ్యవసాయంలో చక్కటి ఫలాలను అందుకుంటూ మిగిలిన రైతులకు ఆదర్శంగా నిలిచాడు. సంకల్పం, పట్టుదల, వ్యవసాయంపై మక్కువతో కష్టపడి పనిచేస్తే విజయం తప్పక వరిస్తుందని ఆయన చేసి చూపించాడు. రైతుగా సత్య సాధించిన విజయాలు సమాజంలోని ఇతరులకు ఆదర్శంగా నిలవడమే కాదు ఆయన వ్యవసాయ విధానం అద్వితీయంగా, వినూత్నంగా ఉండడంతో స్థానికుల అభిమానాన్ని, అధికారుల దృష్టిని ఆకర్షించాడు. అంతేకాదు తన గ్రామం, చుట్టుపక్కల గ్రామాల్లో సుమారు 60 మందిని ఎంచుకుని వ్యవసాయాన్ని ముందుకు నడిపించాడు. తద్వారా అనేక కుటుంబాలకు అండగా నిలబడటమే కాదు, స్థానిక ఆర్థికవ్యవస్థకుగణనీయమైన ఎనలేని సహకారాన్ని అందించాడు. కలెక్టర్లు, ఇతర స్థానిక ఉ ఉన్నతాధికారులు పలువురి ప్రశంసలందుకున్నాడు. చుట్టుపక్కల సన్నకారు రైతులంతా సత్యను ఆదర్శంగా తీసుకుని సేంద్రియ ఎరువులతో తమ భూమిలో కూరగాయలు పండించి స్వయం సమృద్ధి సాధించి ఆర్థికస్థితిని మెరుగు పరుచుకోవాలని పిలుపునిచ్చారు. సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలతో అందరి ఆరోగ్యానికి తోడ్పటమే కాదు, స్థానికి ఆర్థిక పరిపుష్టికి తన వంతు సాయం అందించడం విశేషంగా నిలిచింది. వ్యవసాయంలో రారాజుగా నిలవాలన్న ఆత్మవిశ్వాసమే ఆయనను ఈరోజు విజయ వంతమైన రైతుగా నిలబెట్టి, ఎందరికో స్ఫూర్తి దాయకంగా నిలిచింది. -
టైర్ పేలి స్కూటర్ పల్టీ
బనశంకరి: స్కూటర్ టైర్ పేలిపోయి డివైడరును ఢీకొట్టిన ప్రమాదంలో మహిళా టెక్కీ మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కెంగేరి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం జరిగింది. డీసీపీ సుమన్ పన్నేకర్ తెలిపిన ప్రకారం వివరాలు... మండ్యకు చెందిన సులోచన (24) పద్మనాభనగర ఇట్టిమడులో నివాసం ఉంటూ కోరమంగలలో ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఆమె స్నేహితుడు అనంద్‌కుమార్ కూడా ఇదే కంపెనీలో పనిచేస్తుంటాడు. సాయంత్రం 5.30 సమయంలో కోరమంగల నుంచి హోసకెరెహళ్లికి స్కూటర్లో సులోచన, అనంద్‌కుమార్ బయలుదేరారు. ఆనంద్‌కుమార్ ఫుల్ హెల్మెట్ ధరించగా, సులోచనా హాఫ్ హెల్మెట్ పెట్టుకుంది. నైస్ రోడ్డులో వెళుతుండగా స్కూటర్ టైర్ పేలిపోవడంతో అదుపుతప్పి రోడ్డు పక్కన ఇనుప రైలింగ్‌ను ఢీకొన్నారు. హాఫ్ హెల్మెట్ వల్ల అధిక గాయాలు ఈ ప్రమాదంలో ఇద్దరికి తల, శరీర భాగాలకు తీవ్ర గాయాలు తగిలాయి. తీవ్ర రక్తస్రావమై స్పృహ కోల్పోయి పడి ఉండగా ఇతర వాహనదారులు అంబులెన్స్‌ను పిలిపించి ఆసుపత్రికి పంపించారు. సులోచనా తల, మెదడు భాగాల్లో రక్తం గడ్డ కట్టినట్లు వైద్యులు తెలిపారు. చికిత్స పొందుతూ ఆమె సోమవారం ఉదయం కన్నుమూసింది. హాఫ్ హెల్మెట్ వల్ల ఆమె తలకు ఎక్కువ గాయాలు తగిలి మరణానికి దారితీసింది. మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. మరో బాధితుడు ఆనంద్ కుమార్ స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సులోచనా మరణవార్త తెలియగానే కుటుంబసభ్యులు రోదనలు మిన్నంటాయి. కెంగేరి ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఇది మామూలు దండయాత్ర కాదు! 150కిపైగా కంపెనీలకు అప్లై చేశాడు.. మొత్తానికి...
టెక్ కంపెనీల్లో లేఆఫ్స్‌ల కారణంగా వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి నానా తంటాలు పడుతున్నారు. కొంత మంది నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీకి చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొత్త ఉద్యోగం చేసిన దండయాత్ర గురించి తెలుసుకుంటే విస్తుపోవడం ఖాయం.. ఇదీ చదవండి: పీఎఫ్‌ను ముందస్తుగా వెనక్కి తీసుకోవచ్చా? ఢిల్లీకి చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎనిమిది నెలల సుదీర్ఘ శోధన తర్వాత ఇటీవల ఒక టెక్ సంస్థలో ఉద్యోగం పొందాడు. ఆ ఎనిమిది నెలల సమయంలో అతను 150 కంటే ఎక్కువ కంపెనీలకు దరఖాస్తు చేసుకున్నాడు. తన ఉద్యోగ వేట కథను లింక్డ్ఇన్లో పోస్టు చేశాడు. సాఫ్ట్వేర్ డెవలపర్‌గా అనుభవం ఉన్నప్పటికీ కొత్త ఉద్యోగాన్ని పొందడం సవాలుగా మారిందన్నాడు. వందలాది కంపెనీలు తనను రిజెక్ట్ చేశాయన్నాడు. ఇదీ చదవండి: Get 1 Electric Scooter: రూ.38 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. భారీ డిస్కౌంట్! 150 కంపెనీలకు అప్లై చేస్తే 10 కంపెనీల నుంచి మాత్రమే రెస్పాన్స్ వచ్చిందని, వాటిలో కేవలం ఆరింటికి మాత్రమే ఇంటర్వ్యూ షెడ్యూల్ అయ్యాయని వివరించాడు. అమెజాన్ స్కాట్లాండ్తో ఇంటర్వ్యూలో అన్ని రౌండ్లు పూర్తయ్యాయని, కానీ చివరి దశలో నియామకం నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. గూగుల్ సంస్థలో అయితే డీఎస్ఏ రౌండ్లలో రిజెక్ట్ అయిందన్నారు. ఈ పోస్టు రాయడం వెనుక ఉద్దేశం.. పరిస్థితులు గతంలో మాదిరిగా లేవని, ఉద్యోగం కావాలంటే తీవ్రంగా కష్టపడాల్సిందేనని తెలియజేయడమేనని వివరించాడు. ఉద్యోగ వేటలో ఉన్నవారు నిరుత్సాహపడకుండా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉండాలని, నైపుణ్యాలు పెంచుకోవాలని సూచించాడు. ఇదీ చదవండి: ఇంట్లో ఎక్కువ డబ్బు పెట్టుకుంటున్నారా.. ఏమవుతుందో తెలుసా? -
బార్లో పరిచయం, టెక్కీకి శఠగోపం
సాక్షి, బనశంకరి: గుర్తు తెలియని వ్యక్తిని నమ్మి ఇంట్లో ఆశ్రయమిచ్చిన ఓ టెక్కీ రూ. లక్షల్లో వంచనకు గురయ్యాడు. ఈఘటన బెళ్లందూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. వివరాలు... సర్జాపురలో నివాసం ఉంటున్న ఆశీశ్ ఐటీ ఇంజినీర్. గతనె 15న ఇతను బార్‌కు వెళ్లాడు. ఓ గుర్తు తెలియని వ్యక్తి కలిశాడు. తన పేరు తుషార్ అలియాస్ డిటోసర్కార్ అని, ఢిల్లీకి చెందిన వాడినని, బంధువులు ఇంటికి వచ్చినట్లు నమ్మించాడు. ఒక్కరోజు తలదాచుకుంటానని.. బంధువులు నగరంలో లేరని, మరో ప్రాంతానికి వెళ్లారని, దీంతో తనకు ఇక్కడ తెలిసిన వారు ఎవరూ లేరని మాటలు కలిపాడు. ఒకరోజు ఆశ్రయం ఇవ్వాలని తన కష్టం చెప్పుకున్నాడు. అతని మాటలను నమ్మిన ఆశీశ్ అమాయకంగా ఫ్లాట్‌కు తీసుకెళ్లాడు. రాత్రి ఫ్లాట్‌లోనే నిద్రించిన తుషార్ మరుసటిరోజు ఉదయం అక్కడి నుంచి ఉడాయించాడు. ఆశీశ్ ఉదయం నిద్ర లేవగానే తుషార్ కనబడకపోగా ఫోన్లో సిమ్ కార్డు కూడా లేదు. అదేరోజు మధ్యాహ్నం ఆశీశ్ అకౌంట్ నుంచి రూ.1.64 లక్షల నగదు వేరే అకౌంట్‌కు జమ అయినట్లు మెసేజ్ వచ్చింది. ఇదే తరహాలో అతడి బ్యాంకు అకౌంట్ నుంచి దశల వారీగా పదిరోజుల్లో ఆన్లైన్లో షాపింగ్ చేసినట్లు సుమారు రూ.7.20 లక్షలు కట్ అయింది. మొత్తం రూ.8.84 లక్షలు పోయింది. తన సిమ్ కార్డు దొంగలించిన తుషార్ వేరే మొబైల్‌కు అమర్చుకుని అందులో డిజిటల్ బ్యాంక్ అకౌంట్ ద్వారా నగదు జమ చేసుకున్నట్లు తెలిసింది. బాధితుడు బెళ్లందూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. (చదవండి: వాట్సాప్‌తో ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు) -
గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ.. 20వ అంతస్తు నుంచి దూకిన సాఫ్ట్వేర్ ఇంజినీర్..
నోయిడా: గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవపడి అపార్ట్మెంట్ 20వ అంతస్తు నుంచి దూకేశాడు ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. నోయిడాలోని సెక్టార్ 168 హై రైస్ సొసైటీలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. హరియాణా సోనిపత్‌కు చందిన ఈ టేకీ వయసు 26 ఏళ్లు. బెంగళూరులోని ఓ ఐటీ సంస్థలో ఊద్యోగం చేస్తున్నాడు. చండీగఢ్‌కు చెందిన యువతిని(25) కలిసేందుకు నోయిడా వెళ్లాడు. ఆన్లైన్ యాప్ ద్వారా ఈ రూం బుక్ చేసుకున్నారు. అయితే ఏదో విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో సెక్యూరిటీ గార్డుతో మాట్లాడేందుకు యువతి కిందకు వెళ్లింది. ఈ సమయంలోనే 20వ అంతస్తు నుంచి టేకీ కిందకు దూకేశాడు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కెఫే టేబుల్స్‌పై పడ్డాడు. దీంతో ఆ టేబుల్స్ విరిగిపోయాయి. అక్కడ భోజనం చేస్తున్న ఓ మహిళకు గాయాలు కూడా అయ్యాయి. అక్కడున్నవారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఇద్దరూ గురువారం రోజే ఆపార్ట్మెంట్కి వచ్చారని పోలీసులు చెప్పారు. కలిసి మద్యం కూడా తాగారని పేర్కొన్నారు. ఆయితే శుక్రవారం రోజు గర్ల్‌ఫ్రెండ్ తన స్నేహితురాలిని కూడా అపార్ట్‌మెంట్‌కు పిలిచింది. సాయంత్రం 5 గంటల తర్వాత ఆమె తిరిగి వెళ్లిపోయింది. దీంతో మరో యువతిని అపార్ట్‌మెంట్‌కు ఎందుకు పిలిచావని సాఫ్ట్వేర్ ఉద్యోగి తన గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవపడ్డాడు. ఈ విషయంపైనే ఇద్దరి మద్య వాగ్వాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఆమె అతడికి బాల్య స్నేహితురాలని పేర్కొన్నారు. అతను త్వరలో విదేశాలకు వెళ్లాలనుకుంటున్నాడని, అందుకే ఓసారి స్నేహితురాలిని కలవాలనుకున్నాడని వివరించారు. చదవండి: భార్యకు భారం కాకూడదని భర్త అఘాయిత్యం.. పెద్దకూతురు ప్రాణాలు కాపాడిన హోంవర్క్ -
మైక్రోసాఫ్ట్ ఉద్యోగికి షాక్! అటు ఉద్యోగం, ఇటు పెళ్లి చేసుకునే పిల్లా?
ప్రపంచంలోని దిగ్గజ టెక్ సంస్థలు లేఆఫ్స్ పేరుతో వేల మంది ఉద్యోగుల్ని అర్థాంతరంగా తొలగిస్తున్న విషయం తెలిసిందే. ఉద్యోగం ఊడిపోడవంతో తమ జీవితాలు ఎలా తలకిందులు అయ్యాయో అనేక మంది టెకీలు సోషల్ మీడియాలో తమ గోడు వెల్లుబోసుకుంటున్నారు. మొన్నటివరకు రూ.లక్షలు సంపాదించిన తాము ఇప్పుడు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ యువతి సోషల్ మీడియాలో చేసిన పోస్టు వైరల్‌గా మారింది. తన జీవితంలో ఎంతో కీలకమైన నిర్ణయం తీసుకునేందుకు సలహా ఇవ్వాలని నెటిజన్లను అడిగింది. ఇంతకీ ఈమె చేసిన ఆ పోస్టు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ యువతికి కొద్దిరోజుల క్రితమే పెళ్లి నిశ్ఛయం అయింది. వరుడు మైక్రోసాఫ్ట్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఫిబ్రవరిలో ముహూర్తం ఫిక్స్ చేశారు. అయితే లేఆఫ్స్‌లో అతడి ఉద్యోగం పోయింది. ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. దీంతో అతడ్ని తాను ఇంకా పెళ్లి చేసుకోవాలా? లేకపోతే వివాహం రద్దు చేసుకోవాలా? అని యువతి సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ఏ నిర్ణయం తీసుకోవాలో తనకు అర్థం కావడంలేదని సలహాలు ఇవ్వాలని కోరింది. ఈమె పోస్టుపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయు. హృదయ ప్రమేయం లేనప్పుడు నిర్ణయం తీసుకోవడం ఎంత సులభం.. అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. మరో నెటిజన్ మాత్రం ఇది చాలా కామెడీగా ఉందని చమత్కరించాడు. మరొకరు మాత్రం ఆమెకు మూడు పరిష్కారాలు సూచించాడు. 1. అతనికి త్వరలో మంచి ఉద్యోగం వచ్చేంత వరకు వేచి చూడటం. 2. మెక్రోసాఫ్ట్ అతడ్ని అకస్మాతుగా ఉద్యోగం నుంచి తొలగించినందుకు డబ్బు బాగానే ఇస్తుంది కాబట్టి హ్యాపీగా పెళ్లి చేసుకోవడం. 3. నువ్వు హిపోక్రైట్ అని చెప్పి పెళ్లి రద్దు చేసుకో. అని బదులిచ్చాడు. పాపం ఇలాంటి పరిస్థితి పగోడికి కూడా రాకూడదు అని మరో నెటిజన్ స్పందించాడు. 😂😂😂😂😂😂 pic.twitter.com/9Ljx47SVh9 — (((Dominique Fisherwoman))) 💙 (@AbbakkaHypatia) February 1, 2023 చదవండి: నేను లాయర్.. నా ఇష్టం.. లోకల్ ట్రైన్లో యువతి రుబాబు.. -
ప్రకృతి సాగుతో అబ్బురపరుస్తున్న టెక్కీ! ‘గూగుల్ ఫామ్స్’ ద్వారా మార్కెటింగ్..
సాక్షి, అమరావతి: కర్నూలు జిల్లా జొహరాపురానికి చెందిన బాలభాస్కరశర్మ పదేళ్ల పాటు సింగపూర్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేశారు. తండ్రి మరణంతో కర్నూలు వచ్చేసిన ఆయన బెంగళూరు కేంద్రంగా ఉన్న ఓ కంపెనీలో ఇంటినుంచే పని చేస్తున్నారు. కొలువును కొనసాగిస్తూనే.. కల్లూరు మండలం నాయకల్లు గ్రామంలో తనకున్న 8.50 ఎకరాల్లో 20 రకాల కూరగాయలు, ఆకు కూరలతో పాటు 10కి పైగా పండ్లను సాగు చేస్తూ వినూత్న రీతిలో మార్కెటింగ్ చేస్తున్నారు. ఎర్ర బెండ, నల్ల పసుపు, మామిడి అల్లం వంటి విభిన్న పంటలతో పాటు నిమ్మ, జామ, సీతాఫలం, మామిడి, అంజూర, నేరేడు, అరటి, మునగ, పాల సపోట, చెర్రీ, టమాటా, చెన్నంగి కొబ్బరి, ముల్లంగి, ఆకు కూరలను సాగు చేస్తున్నాడు. మధురై నుంచి ఎర్ర బెండ సీడ్‌ను, ఆయుర్వేద మందుల్లో ఎక్కువగా ఉపయోగించే నల్ల పసుపును మేఘాలయ నుంచి తెప్పించి నాటారు. గూగుల్ ఫామ్స్ ద్వారా బుకింగ్ బాలభాస్కరశర్మ పండించిన పంటలన్నిటినీ గూగుల్ ఫామ్స్ ద్వారా మార్కెటింగ్ చేస్తున్నారు. వారానికి రెండుసార్లు కూరగాయలు, ఆకు కూరలు కోతకు వస్తుండగా.. కోతకొచ్చే రెండ్రోజుల ముందుగానే గూగుల్ ఫామ్స్‌లో తాను పండించే పంటలు, వాటి ధరల వివరాలను వినియోగదారులకు లింక్ ద్వారా పంపిస్తున్నారు. తమకు అవసరమైన వాటిని ఏ మేరకు కావాలో ఎంచుకొని.. ఆ వివరాలను వినియోగదారులు సబ్మిట్ చేయగానే బాలభాస్కరశర్మకు మెయిల్ మెసేజి వస్తుంది. ఆ వివరాలను ఎక్సెల్ షీట్లో క్రోఢీకరించుకుని కోతలు పూర్తి కాగానే వాటి నాణ్యత కోల్పోకుండా ప్యాకింగ్ చేసి స్వయంగా డోర్ డెలివరీ చేస్తున్నారు. ఇలా కర్నూలులోని 3 అపార్ట్‌మెంట్స్‌లో నివసిస్తున్న వారికి తన పంటలను విక్రయిస్తున్నారు. గూగుల్ ఫామ్స్‌ను వినియోగించడం వల్ల సొంత వెబ్సైట్, ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ అవసరం లేకుండా, ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా మొత్తం పంటల్ని విక్రయిస్తున్నారు. సాగులో ఆధునికత కూరగాయలు, ఆకు కూరలను మల్చింగ్ విధానంలో భాస్కరశర్మ సాగు చేస్తున్నారు. మల్చింగ్ వల్ల భూమిలో తేమ ఆరిపోకుండా ఉండటమే కాకుండా నీరు ఆదా అవుతుంది. చీడపీడల బెడద కూడా ఉండదు. కూరగాయలు, ఆకు కూరలు మంచి నాణ్యతతో ఉంటాయి. మామిడి, ఇతర పండ్ల తోటలకు వేరుశనగ పొట్టుతో మల్చింగ్ చేస్తున్నారు. సాగులో ఎరువులు, పురుగుల మందులు వాడరు. పూర్తిగా గో ఆధారిత వ్యవసాయం కోసం 5 దేశీవాళీ ఆవులను పోషిస్తున్నారు. వాటిద్వారా వచ్చే జీవామృతం మొక్కలకు వేస్తారు. రసం పీల్చే పురుగుల నివారణకు వావిలాకు కషాయం, గొంగళి పురుగుల నివారణకు అగ్ని అస్త్రం, దశపర్ణి కషాయం, పుల్లటి మజ్జిగ, చీడపీడలకు నీమాస్త్రం, వేప, సీతాఫలం నూనెలు వాడుతున్నారు. పండ్ల తోటలకు నష్టం కలిగించే పండు ఈగల నివారణకు సోలార్ ట్రాప్స్, తెలుపు, పసుపు జిగురు అట్టలు ట్రాప్స్‌ను ఉపయోగిస్తున్నారు. రసాయన అవశేషాలు లేని పంటల సాగే లక్ష్యం రసాయన అవశేషాలు లేకుండా పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తున్నాను. వారానికి ఐదు రోజులు వ్యవసాయ క్షేత్రంలోనే ఉంటాను. క్షేత్రంలో ఓ కుటుంబానికి ఉపాధి కల్పిస్తున్నాను. మొదట్లో పండ్ల మొక్కలు నాటాను. ఆరు నెలలుగా కూరగాయలు, ఆకు కూరలు సాగు చేస్తున్నాను. వారానికి రెండుసార్లు ఆపార్ట్మెంట్స్లో విక్రయిస్తున్నాను. మంచి ఆదరణ లభిస్తోంది. పెట్టుబడికి తగినట్టుగా ఆదాయం వస్తుంది. – బాలభాస్కరశర్మ, సాఫ్ట్వేర్ ఇంజనీర్, కర్నూలు -
అమెజాన్ ఉద్యోగంకోసం ఇల్లు,కార్లు అమ్మేశా, మీరు ఈ తప్పులు చేయకండి!
సాక్షి,ముంబై: టెక్ కంపెనీల్లో పెద్ద ఎత్తున ఉద్యోగుల తొలగింపు కలకలం రేపుతోంది. గ్లోబల్ ఆర్థికమాంద్యం ముప్పు, ఖర్చుల నియంత్రణలో భాగంగా దిగ్గజాల నుంచి స్టార్టప్లదాకా వందలాది ఉద్యోగులను ఇంటికి పంపిస్తుండటం ఆయా కుటుంబాల్లో తీవ్ర అలజడి సృష్టిస్తోంది. తాజాగా కెన్యాకు చెందిన టెకీ టామ్ ఎంబోయా ఒపియో సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. మరో నాలుగు రోజుల్లో యూరప్‌కు మకాం మార్చాల్సి ఉండగా అమెజాన్ ఉద్యోగాన్ని కోల్పోయిన వైనాన్ని ఒపియో లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారు. అంతేకాదు కొన్ని గ్లోబల్ ఐటీ ఉద్యోగాలకు సంబంధించి చిట్కాలను షేర్ చేయడం విశేషంగా నిలిచింది. వివరాల్లోకి వెళితే అమెజాన్ భారీ తొలగింపుల వల్ల ప్రభావితమైన 18వేల ఉద్యోగుల్లో తానూ ఒకడినని, ఐరోపా వెళ్లడానికి నాలుగు రోజుల ముందు తాను ఉద్యోగాన్ని కోల్పోయానంటూ కెన్యా టెకీ ఒపియో తెలిపారు. కుటుంబంతో సహా వెళ్లేందుకు, ఉన్న ఇల్లును, కార్లను అమ్మేశా. అన్నీ అనుకున్నట్టుగా జరిగి ఉండి ఉంటే ఈ సోమవారం (జనవరి16) అమెజాన్‌లో ఉద్యోగంలో చేరేవాడిని. కానీ పరిస్థితి తారుమారైంది. తర్జన భర్జన పడి, 6 నెలల నుంచి ఎంతో కష్టపడి ప్లాన్ చేసుకొని, ప్రయాణానికి సిద్ధమవుతుండగా, ఇంతలోనే ఉద్యోగాన్ని కోల్పోడంతో తన ఫ్యామిలీ కుప్పకూలి పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భారీ షాక్‌నుంచి తేరుకుని మళ్లీ కొత్తగా జీవితాన్ని ప్రారంభించాల్సి ఉందని రాసుకొచ్చారు. ఈ సందర్భంగా టెకీలకు కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. (రెండు దశాబ్దాల ప్రయాణం.. ఇండియన్ టెకీ భావోద్వేగం) ‘‘వేరే దేశానికి ఉద్యోగ నిమిత్తం వెళ్లాలనుకుంటే..ముందు మీరు వెళ్లి..ఆ తరువాత ఫ్యామిలీని తీసుకెళ్లడం గురించి ఆలోచించండి...వీసా వచ్చే వరకు తమ ప్రస్తుత జాబ్‌కు రాజీనామా చేయకండి’’ (మాకు వీసా రావడానికి 5 నెలలకు పైగా పట్టింది. ఫ్యామిలీ డాక్యుమెంట్ వెరిఫికేషన్, పోలీస్ క్లియరెన్స్, కొత్త పాస్‌పోర్ట్‌లు, EU వర్క్ ఆథరైజేషన్ అప్రూవల్స్, డాక్యుమెంట్ల నోటరైజేషన్ పొందడానికి చాలా సమయం పట్టింది). కరీయర్లో ఈ టైంలో ఇంతటి కష్టమైన పరిస్థితి వస్తుందని మాత్రం అస్సలు ఊహించ లేదు. కానీ జీవితం అంటే అదేకదా? మనకెదురైన అనుభవాలు, పరిస్థితులు, ఇతరులకు ఉదాహరణలుగా, పాఠాలుగా నిలుస్తాయంటూ పోస్ట్‌లో పేర్కొన్నారు. కాగా గత కొన్ని నెలల్లో ఉద్యోగాల కోతలను ప్రకటించిన పలు దిగ్గజ కంపెనీలలో అమెజాన్ కూడా ఒకటి. ట్విటర్, మెటా మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు ఉద్యోగులపై వేటు వేస్తున్న సంగతి తెలిసిందే. -
HYD: కాల్ గర్ల్ కోసం వెతికి వెతికి.. అడ్డంగా బుక్కయ్యాడు
క్రైమ్: కాల్‌గర్ల్ కోసం ఆన్లైన్లో వెతికిన ఓ టెక్కీ.. అడ్డంగా బుక్కయ్యాడు. మాయమాటలకు మోసపోయి.. రెండు లక్షల దాకా సొమ్ము పొగొట్టుకున్నాడు. హైదరాబాద్ నగరంలోని చందానగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉండే సదరు వ్యక్తి.. డిసెంబరు చివరివారంలో ఆన్లైన్లో ఎస్కార్ట్ సర్వీస్ ద్వారా కాల్‌గర్ల్ కోసం వెతికాడు. ఓ వెబ్సైట్లో కనిపించిన లింకు క్లిక్ చేయగానే ఒక నెంబర్ దొరికింది. ఆ నెంబర్ ద్వారా వాట్సాప్ ఛాటింగ్ కోసం యత్నించాడు. పటేల్ ఛార్మి పేరుతో పరిచయం చేసుకున్న అవతలి వ్యక్తి.. అమ్మాయిల ఫొటోలు పంపాడు. అయితే.. బుకింగ్ కోసం ముందుగా రూ.510 చెల్లించాలని కోరాడు. ఆ తర్వాత మరో రూ.5,500 పంపాలన్నాడు. మరోసారి మేసేజ్ చేసి.. సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.7,800 పంపమన్నాడు. కక్కుర్తితో సదరు ఐటీ ఉద్యోగి కూడా వివిధ సందర్భాల్లో డబ్బులు పంపుతూ పోయాడు. అలా.. మొత్తం రూ.1.97 లక్షలు పంపినట్లు చెబుతున్నాడు. చివరకు.. అంతా మోసం అని గుర్తించి సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలాంటి స్కామ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసులు సూచిస్తున్నారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగిని ప్రాణాన్ని బలితీసుకున్న గుంతల రోడ్డు
సాక్షి, చెన్నై: తమిళనాడులో గుంతల రోడ్డు ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని ప్రాణాన్ని బలి తీసుకుంది. చెన్నైలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 22 ఏళ్ల యువతి మృత్యువాతపడింది. రోడ్డుపై ఉన్న గుంతను తప్పించే ప్రయత్నంలో అదుపుతప్పి వాహనంపై నుంచి పడిపోవడంతో ఆమెను ట్రక్కు ఢీకొట్టింది. దీంతో యువతి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. మధుర వాయిల్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. పోరూర్ లక్ష్మీనగర్‌కు చెందిన సెల్వకుమార్ కుమార్తె శోభన(22) ఓ ప్రైవేటు కంపెనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది.. నీట్ కోచింగ్ క్లాస్ కోసం మంగళవారం తన సోదరుడిని స్కూల్‌కు దింపేందుకు ఆమె వెళ్లింది. మంగళవారం ఉదయం తన సోదరుడు హరీష్‌ను నీట్ కోచింగ్ కోసం స్కూల్ వద్ద దింపేందుకు ఇద్దరు కలిసి ద్విచక్రవాహనంపై బయల్దేరారు. మధురవాయిల్ ప్రాంతంలో వెళ్తుండగా సర్వీసు రోడ్డుపై ఉన్న గుంతను తప్పించబోయి వాహనంపై నుంచి జారి ఇద్దరు కిందపడిపోయారు. వెనకాల వెనుక వేగంగా వచ్చిన లారీ ఆమె మీదుగా వెళ్లడంతో శోభనా ఘటనా స్థలంలోనే మరణించింది. హరీష్ స్వల్ప గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. ఘటనా స్థలం నుంచి ట్రక్కు డ్రైవర్ పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్ మోహన్‌ను అదుపులోకి తీసుకున్నారు. చదవండి: సీఐతో మహిళా ఎస్ఐ ప్రేమ వ్యవహారం.. సీపీ సంచలన నిర్ణయం -
Himaja Apparascheruvu: మల్టిపుల్ వర్క్స్‌తో సక్సెస్.. ఇంగ్లీషు ఎంత ముఖ్యమో..
కెరీర్లో విజయం సాధించిన మహిళలు కుటుంబంపై దృష్టి పెట్టలేరని చాలామంది అనుకుంటారు. అలాగే, మహిళలు కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకున్నా, తమ కోసం తాము టైమ్‌ను కేటాయించుకోరు అనీ అంటుంటారు. అయితే ఈ ఊహలన్నీ తప్పని హిమజ అప్పరాశ్చెరువు రుజువు చేస్తోంది. మన శక్తి ఏంటో మనకే తెలుసు అని తన పనుల ద్వారా చూపుతోంది. అనంతపురం వాసి అయిన హిమజ అప్పరాశ్చెరువు బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిని. ఓ వైపు విధులు నిర్వర్తిస్తూనే జుంబా ఇన్‌స్ట్రక్టర్‌గా, మారథా రన్నర్‌గా సత్తా చాటుతోంది. ఇద్దరు పిల్లలకు తల్లిగా కుటుంబ బాధ్యతలతోనూ మల్టిపుల్ వర్క్స్‌తో రాణిస్తోంది. చిన్న పట్టణంలో పెరిగిన హిమజ పెద్ద కలలు కనడమే కాకుండా వాటిని సాకారం చేసుకుంటోంది. తన కెరీర్‌తో పాటు ఇద్దరు పిల్లల బాధ్యతనూ నిర్వహిస్తోంది. దీనితోపాటు, తన స్వంత అభిరుచినీ నెరవేర్చుకుంటోంది. సున్నా నుంచి మొదలు ‘నా జీవన ప్రయాణం సున్నాతో మొదలుపెట్టి ఈ రోజు చేరుకున్న చోటికి రావడం అంత తేలిక కాలేదు. ఐఐటీ రూర్కీలో ఇంజనీరింగ్ చేశాను. కాలేజీలో చేరేసరికి నాకు ఇంగ్లీషు సరిగా రాదు, హిందీలోనూ సరిగా మాట్లాడలేను. కానీ సంకల్పంతో, నేను ప్రతి సవాల్‌ను అధిగమిస్తూ, జీవితంలో చాలా నేర్చుకుంటూ విజయం వైపు పయనిస్తూనే ఉన్నాను. రానిదంటూ లేదని.. ఇంజినీరింగ్ తర్వాత ఐఐఎం అహ్మదాబాద్‌లో ఎంబిఏ పూర్తి చేశాను. ఆస్ట్రేలియన్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి బిఎఎమ్ పట్టా అందుకున్నాను. 2017లో అమెజాన్ కంపెనీలో సప్లై చైన్ ఎగ్జిక్యూషన్ టీమ్ పోస్ట్‌పై సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్‌గా చేరాను. నేటి కాలంలో విద్యార్థులైనా, పనిచేసే వృత్తి నిపుణులైనా వారికి ఇంగ్లీషు తెలుసుకోవడం ఎంత ముఖ్యమో నాకు కూడా అర్థమైంది. ఈ అవసరాన్ని స్వయంగా గ్రహించి, నేను అమెజాన్ అలెక్సాలో ఇంటరాక్టివ్ సెషన్స్ చేర్చాను. ఈ నైపుణ్యంతో ఏ వయసు వారైనా ఇంగ్లీష్ మాట్లాడటం నేర్చుకోవచ్చు. కుటుంబంపై పూర్తి శ్రద్ధ నా కెరీర్‌తో పాటు కుటుంబంపై పూర్తి శ్రద్ధ పెట్టాను. నా కెరీర్లో ముందుకు వెళుతున్న సమయంలోనే రెండుసార్లు తల్లిని అయ్యాను. ఈ సమయంలో కొత్తగా చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ నా భర్త ఎల్లప్పుడూ నాకు మద్దతుగా నిలిచాడు. కెరీర్ మాత్రమే ముఖ్యం కాదు, నా పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడమూ ముఖ్యమే. అందుకే, హోమ్‌వర్క్ చేయించడం, వారితో ఆడుకోవడం, వారిని పరీక్షలకు సిద్ధం చేయడం, వారితో సరదాగా గడపడం వంటి ప్రతి అవసరాన్ని తీరుస్తాను. సమతుల్యత అవసరం.. నా దినచర్యలో అడుగడుగునా నా భర్త సపోర్ట్ ఉంది. తన తల్లిదండ్రుల పూర్తి బాధ్యతనూ తీసుకుంటాడు. మేము మా పిల్లలను వ్యక్తిగతంగా చూసుకోవడం, వారితో సమయం గడపడం మంచిదని నమ్ముతాము. బయటి పని, ఇంటి పని ఈ రెండింటి మధ్య సమానమైన సమతుల్యతను పాటిస్తాను. నా పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడపడం, కొత్త పనులు చేయడం నాకు ఇష్టం. మల్టిపుల్ టాస్కింగ్ మనల్ని మరింత ఉత్సాహవంతులను చేస్తుంది. ఇందులో భాగంగానే రెండేళ్ల క్రితం జుంబా ఇన్‌స్ట్రక్టర్‌గా మారాను. ఆన్లైన్–ఆఫ్‌లైన్ క్లాసులతోనూ సేవలు అందిస్తుంటాను. మారథాన్ రన్నర్‌గానూ, నా ఇతర అభిరుచుల వైపుగా సాగుతుంటాను’ అని వివరిస్తారు ఈ మల్టీ టాలెంటెడ్ ఉమన్. (క్లిక్ చేయండి: రేణు ది గ్రేట్.. స్త్రీ హక్కుల గొంతుక) -
గుంటూరు: మెడికో గొంతు కోసి చంపిన టెకీ
పెదకాకాని: ప్రేమను నో చెప్పిందనే కోపంలో యువతి గొంతుకోసి చంపేశాడు ఓ ప్రేమోన్మాది. గుంటూరు జిల్లా తక్కెళ్లపాడు గ్రామంలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పెదకాకాని సీఐ సురేష్‌బాబు కథనం ప్రకారం.. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన తపస్వి (21) విజయవాడ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (బీడీఎస్) తృతీయ సంవత్సరం చదువుతోంది. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం మానికొండకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ జ్ఞానేశ్వర్‌తో రెండేళ్ల క్రితం ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయం ఏర్పడింది. కొంతకాలంగా జ్ఞానేశ్వర్ ప్రేమిస్తున్నానంటూ ఆ యువతిని వేధిస్తుండటంతో ఇటీవల విజయవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడిని స్టేషన్‌కు పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి.. మరోసారి ఇలా చేయవద్దని హెచ్చరించి పంపించారు. అయినప్పటికీ జ్ఞానేశ్వర్ వేధింపుల్ని ఆపలేదు. దీంతో తపస్విని 10 రోజుల క్రితం తక్కెళ్లపాడు డెంటల్ కాలేజీ విద్యార్థిని అయిన తన స్నేహితురాలి రూమ్‌కు వెళ్లి అక్కడే ఉంటోంది. ఈ విషయం తెలుసుకున్న జ్ఞానేశ్వర్ సోమవారం రాత్రి సర్జికల్ బ్లేడు, కత్తి వెంట తీసుకుని తపస్వి ఉంటున్న ప్రాంతానికి చేరుకుని.. సర్జికల్ బ్లేడుతో ఆమె గొంతు కోశాడు. అనంతరం తన చేతిని కూడా కోసుకున్నాడు. ఆమె స్నేహితురాలు కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని జ్ఞానేశ్వర్‌కు దేహశుద్ధి చేసి తాడుతో కట్టేసి పోలీసులకు సమాచారం అందించారు. తపస్విని చికిత్స నిమిత్తం మొదట ప్రైవేట్ ఆస్పత్రికి, ఆ తరువాత ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి తపస్వి (21) మరణించింది. హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న జ్ఞానేశ్వర్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. -
నెలకు లక్ష జీతం.. సాఫ్ట్వేర్ వదిలి ‘సాగు’లోకి..
తాంసి (ఆదిలాబాద్ జిల్లా): నెలకు రూ.లక్ష జీతం తీసుకుంటున్న ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి వ్యవసాయంపై మక్కువతో ఉద్యోగం మానేశాడు. తన భూమిలో విభిన్న పంటలను సాగుచేస్తూ నలుగురు కూలీలకు ఉపాధి కల్పిస్తున్నాడు. జిల్లా కేంద్రానికి చెందిన కోదే అన్వేశ్ ఎంటెక్ వరకు చదివాడు. 2016 నుంచి హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరాడు. వెబ్ డెవలప్మెంట్లో భాగంగా 2016 నుంచి 2019 వరకు పని చేశాడు. నెలకు రూ.లక్ష జీతం వస్తున్నా సంతృప్తి చెందలేదు. ఉద్యోగం వదులుకొని తనకు నచ్చిన వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. నాలుగేళ్లుగా తాంసి మండలం సావర్గాం గ్రామశివారులోని ఎనిమిదెకరాల సొంత భూమిలో వివిధ పంటలను సాగు చేస్తూ లాభాలను గడిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. మొదటగా నష్టాలు చవిచూసి.. హైదరాబాద్ నుంచి వచ్చిన అన్వేశ్ మొదటి సంవత్సరం పత్తి, జొన్న సాగు చేశాడు. పత్తి, జొన్న సాగుతో కూలీల కొరత, కష్టం ఎక్కువగా ఉండడంతో నష్టాలను చవిచూశాడు. ఏ మాత్రం కుంగిపోకుండా ఇతర పంటలను సాగుచేసి లాభాలను పొందాలని నిర్ణయించుకున్నాడు. ఏ పంటలను సాగుచేస్తే మేలని వ్యవసాయశాఖ అధికారుల సూచనలు తీసుకున్నాడు. స్నేహితుల సలహాలు తీసుకొని పంటలను సాగుచేస్తున్నాడు. అధికారుల సూచనలు పాటించి.. 2019లో హార్టికల్చర్ అధికారి శ్రీనివాస్‌రెడ్డి సలహాతో ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి నుంచి థైవాన్ జామ మొక్కలను తెప్పించాడు. రూ.2.50 లక్షల వరకు ఖర్చుచేసి నాలుగెకరాల్లో ఎకరాకు వెయ్యి చొప్పున నాటించాడు. మొక్కలను హైడెన్సిటీ విధానంతో ఆరు అడుగులకు ఒక్కటి చొ ప్పున ఉండేలా చూశాడు. రసాయన మందులు లే కుండా సేంద్రియ పద్ధతిలో సాగు చేశాడు. దీంతో మొక్కలను నాటిన 18 నెలలకే కాత ప్రారంభమైంది. సేంద్రియంగా పెంచిన జామపండ్లను పంటచేను పక్కనే ఉన్న రోడ్డు పక్కన షెడ్డు వేసి రూ.50కి కిలో చొప్పున విక్రయిస్తున్నాడు. పెద్దఎత్తున దిగుబడి వచ్చినప్పుడు బయటి మార్కెట్‌కు కూడా తరలిస్తున్నాడు. జామ ద్వారా మొదటి సంవత్సరం రూ.రూ.2.50 లక్షల ఆదాయం వచ్చింది. ఈ సంవత్సరం కాత ఎక్కువగా ఉండగా రూ.3 లక్షల వరకు వస్తుందని అన్వేశ్ చెబుతున్నాడు. షెడ్లు వేసి కోళ్లు పెంచుతూ.. జామతోటతో అంతరసాగు విధానంలో వివిధ పంటలు వేశాడు. దీనికి తోడు పంటచేనులో ప్రత్యేక షెడ్లు వేసి రెండేళ్లుగా నాటు, కడక్‌నాథ్, గిరిరాజా కోళ్లు, బాతులను పెంచుతున్నాడు. వాటిని విక్రయిస్తూ అదనపు లాభాలను గడిస్తున్నాడు. వచ్చే సంవత్సరం నుంచి బ్రాయిలర్ కోళ్ల పెంపకం చేపట్టనున్నట్లు అన్వేశ్ తెలిపాడు. ఇప్పటినుంచే షెడ్ల నిర్మాణం కూడా చేపడుతున్నాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం కన్నా ఇక్కడే తృప్తిగా, ప్రశాంతంగా ఉన్నట్లు చెబుతున్నాడు. వ్యవసాయంలోనే సంతృప్తి నేను ఎంటెక్ పూర్తిచేశా ను. మూడేళ్లపాటు హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యో గం చేశాను. జీతం సరిప డా వచ్చినా ఉద్యోగంపై ఆసక్తి లేక మానేశాను. మాకున్న భూమిలో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్న. నాన్న శ్రీనివాస్ సాయంతో మూడేళ్ల క్రితం వ్యవసాయం ప్రారంభించాను. ప్రస్తుతం వి విధ పంటలతోపాటు జామ సాగు చేపట్టా ను. అలాగే వివిధ రకాల కోళ్ల పెంపకం చేప ట్టి అదనపు ఆదాయాన్ని పొందుతున్న. రోజూ పంటచేనులో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. నాతోపాటు నిత్యం నలుగురు కూలీలకు పని కల్పించడం సంతృప్తినిస్తోంది. – కోదే అన్వేశ్, యువరైతు -
క్రిప్టో కరెన్సీ ట్రేడ్.. 20 శాతం కమీషన్.. టెకీ నుంచి రూ.22 లక్షలు స్వాహా
సాక్షి, హైదరాబాద్: క్రిప్టో కరెన్సీలో మీరు చేసిన ట్రేడ్‌కు లాభాలు వచ్చాయి. ఆ లాభాలు మీకు చెందాలంటే మాకు 20శాతం కమీషన్ ఇవ్వాల్సిందేనంటూ సైబర్ కేటుగాళ్లు నగరానికి చెందిన ఓ టెకీకి వల వేశారు. మొదట్లో 208 యూఎస్డీ డాలర్లు(రూ.17వేలకు పైగా మన కరెన్సీలో) క్రిప్టో కొనిపించారు. దీనికి రెండింతలు లాభాలు వచ్చాయంటూ నమ్మించి నిండా ముంచేశారు. తనని గుర్తు తెలియని వారు మోసం చేశారంటూ హబ్సిగూడకు చెందిన యేగేశ్ శర్మ మంగళవారం సిటీసైబర్ క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. నగరంలోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో మేనేజర్‌గా చేస్తున్న యేగేశ్ శర్మ ఫోన్ నంబర్‌ను టెలిగ్రామ్ గ్రూప్‌లో గుర్తుతెలియని వ్యక్తి యాడ్ చేశాడు. ఈ గ్రూప్‌లో అంతా క్రిప్టో లాభాలపై చర్చ, లాభాలు వచ్చినట్లు స్క్రీన్‌షాట్స్‌తో ఫొటోలు కనిపించాయి. గ్రూప్‌లో ఓ వ్యక్తి యేగేశ్‌శర్మతో మాట కలిపాడు. కేకో కాయిన్ డాట్‌కామ్ అనే లింకును పంపి ఆ లింకులో రిజిస్టర్ అయ్యాక మొదట్లో 208 ఎస్డీ డాలర్ల క్రిప్టో కొనుగోలు చేశాడు. దీనికి రెండింతలు లాభాలు వచ్చాయని చెప్పిన కేటుగాడు 20శాతం కమీషన్ ఇస్తేనే మీ లాభాలు మీ కొచ్చేలా చేస్తామన్నారు. దీనికి సరేనంటూ కేటుగాళ్లు చెప్పిన విధంగా యూఎస్, యూకే డాలర్లను క్రిప్టో పేరుతో కొనుగోలు చేయిస్తూనే ఉన్నారు. యేగేశ్‌శర్మకు ఇవ్వాల్సిన లాభాలు మాత్రం ఇవ్వట్లేదు. ఇలా వారు చెప్పిన విధంగా రూ.22 లక్షలు సమర్పించాడు. అంతటితో ఆగక మరో రూ.1.50 లక్ష క్రిప్టో కొనుగోలు చేసి తాము చెప్పిన అకౌంట్ నంబర్స్‌కు ట్రాన్స్ఫర్ చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. -
నకిలీ పత్రాలతో ఇల్లు విక్రయం
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ సంస్థ యజమాని తల్లిదండ్రుల పేరుతో ఉన్న ఇంటిని కొందరు వ్యక్తులు నకిలీ పత్రాలతో విక్రయించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సీసీఎస్ అధికారులు ప్రధాన సూత్రధారిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ అరెస్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తెల్లాపూర్‌కు చెందిన విజయ్‌కుమార్ సాఫ్ట్వేర్ సంస్థ నిర్వహిస్తున్నాడు. అతడి తల్లిదండ్రులకు నల్లకుంటలో ఇల్లు ఉంది. దానికి ప్రతి సంవత్సరం ఆస్తిపన్ను, ఇతర పన్నులు చెల్లిస్తున్నారు. రెండేళ్ల క్రితం వరకు అక్కడే నివసించిన విజయ్ తల్లిదండ్రులు కోవిడ్ నేపథ్యంలో కుమారుడి వద్దకే వెళ్లిపోయారు. దీంతో ఈ ఇంటిపై కన్నేసిన నాగ నాయక్ అనే వ్యక్తి మరికొందరితో కలిసి ముఠా కట్టాడు. నకిలీ పత్రాలు సృష్టించి రూ.2 కోట్ల విలువైన ఆ ఇంటిని రూ.75 లక్షలకు అమ్మేశారు. ఇంటిని ఖరీదు చేసుకున్న వారు జీహెచ్ఎంసీలో మ్యూటేషన్ ప్రక్రియ సైతం పూర్తి చేసుకున్నారు. ఇవేమీ తెలియని విజయ్ ఈ ఏడాది ప్రాపర్టీ ట్యాక్స్‌ను ఆన్లైన్లో చెల్లించేందుకు ప్రయత్నించారు. దీనికోసం పీటిన్ ఎంటర్ చేయగా... ఆ ఇల్లు బత్తిని భాస్కర్‌గౌడ్, బత్తిని భువనేశ్వరీ పేర్లతో ఉన్నట్లు కనిపించింది. వెబ్సైట్లోనే లభించిన నెంబర్‌కు ఫోన్ చేయగా భాస్కర్ మాట్లాడారు. తమకు కొడవత్ నాగ నాయక్ అనే వ్యక్తి ఇంటిని విక్రయించాడంటూ అతడి నెంబర్ ఇచ్చారు. అతడికి ఫోన్ చేయగా తన తండ్రి కొడావత్ సూక్య ద్వారా వచ్చిన ఆ ఆస్తిని భాస్కర్‌కు విక్రయించానని, 1978లో మీ తల్లి మాకు అమ్మిందంటూ చెప్పాడు. దీంతో బాధితుడు ఇదంతా అవాస్తవమని, మా తల్లి ఎవరికీ విక్రయించలేదని, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి క్రయ విక్రయాలు చేశారంటూ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న ఏసీపీ దామోదర్ రెడ్డి దర్యాప్తు ప్రారంభించారు. అనేక ఆధారాలు సేకరించిన నేపథ్యంలో నాగ నాయక్ సూత్రధారని, మరికొందరు సహకరించినట్లు గుర్తించారు. దీంతో అతడిని అరెస్టు చేసి నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. నాగ నాయక్‌పై వాడపల్లి పోలీసుస్టేషన్ ఓ డబుల్ మర్డర్ కేసు ఉందని, అందులో జైలు శిక్ష అనుభవించినట్లు పోలీసులు పేర్కొన్నారు. (చదవండి: హీటెక్కిన స్టేట్..!) -
పెంపుడు కుక్కతో ‘టెక్కీ’ లవ్ జర్నీ.. ఎందుకో తెలుసా..?
సాక్షి, విశాఖపట్నం: యువతరం.. మార్పు కోరుకుంటోంది. ఆ మార్పు తమ వద్ద నుంచే ప్రారంభం కావాలనీ.. పది మందికీ స్ఫూర్తిగా నిలిచేందుకు ఎంతటి శ్రమనైనా చిరునవ్వుతో అధిగమించాలనీ అభిలషిస్తోంది. సేవాకార్యక్రమాల నుంచి సాహసాల వరకూ ప్రతి విషయంలోనూ యువత ఇదే రీతిలో ఆలోచిస్తోంది. ఈ కోవకు చెందిన వారే సాహిత్యవర్ధన్. సాఫ్ట్వేర్ ఉద్యోగానికి స్వస్తి చెప్పి.. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ దేశాటన చేస్తున్నాడు. ఎందుకో తెలుసా..? విశ్వాసానికి ప్రతీకలైన శునకాల కోసం. అదీ ముఖ్యంగా వీధి కుక్కల కోసం. సాహిత్య వర్ధన్ ప్రయాణం. ఇదంతా ఇటీవల విడుదలై సంచలనం సృష్టించిన 777–చార్లీ సినిమా మాదిరిగా ఉంది. మరి ఈ శునకాల కోసం సాగిన ప్రయాణ విశేషాలను ఓసారి చూద్దాం. చదవండి: అఖండ గోదావరి.. ప్రాజెక్టుల గేట్లు బార్లా! అనగనగా.. ఓ ఒంటరి యువకుడు. హఠాత్తుగా ఆయన జీవితంలోకి ఓ కుక్క వస్తుంది. ఆ కుక్కకు ఇష్టమైన ప్రాంతాల్ని చూపించేందుకు ఆ యువకుడు చేసిన ప్రయాణమే 777–చార్లీ సినిమా వృత్తాంతం. కుక్కకి.. యువకుడికి మధ్య జరిగిన భావోద్వేగాలు ప్రేక్షకుల మనసుల్ని హత్తుకున్నాయి. సరిగ్గా ఇదే మాదిరి ప్రయాణం సాగింది సాహిత్యవర్ధన్.. పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన సాహిత్యవర్ధన్ కుటుంబం చిన్నతనం నుంచే విశాఖపట్నంలో నివసిస్తోంది. ప్రత్యేకంగా తయారు చేసిన వాహనంలో ప్రయాణం ఈ యువ టెక్కీకి చిన్నతనం నుంచే కుక్కలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా వీధి కుక్కలంటే ఎక్కువ ఆసక్తి చూపించేవాడు. తన పరిసరాల్లోని వీధుల్లో ఆకలితో అలమటించే కుక్కల్ని చూసి చలించిపోయిన సాహిత్యవర్ధన్.. తన దగ్గరున్న పాకెట్ మనీతో వాటి ఆకలి తీర్చేవాడు. అలా వాటితో అనుబంధం బలపడింది. ఆ్రస్టేలియాలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో మాస్టర్స్ చదివిన సాహిత్యవర్ధన్.. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాడు. అయినా తెలియని ఆందోళనతో ఉద్యోగానికి స్వస్తి చెప్పి.. వీధి కుక్కల పరిరక్షణకు నడుం బిగించాలని నిర్ణయించుకున్నాడు. పెంపుడు కుక్కతో దేశాటన వీధి కుక్కల పట్ల అవగాహన కల్పించేందుకు ‘కన్యాకుమారి టు కాశ్మీర్’యాత్రకు గతేడాది సెప్టెంబర్ 20న శ్రీకారం చుట్టాడు. ఐదు నెలల వయసున్న ఓ వీధికుక్క లెక్సీని దత్తత తీసుకొని.. దానితో కలిసి ఈ యాత్ర మొదలుపెట్టాడు. తన సైకిల్‌కు పక్కనే.. కుక్క కోసం ప్రత్యేకంగా ఓ బెడ్ మాదిరిగా ఏర్పాటు చేసి.. ప్రత్యేక ట్రైలర్ కస్టమ్ని రూపొందించాడు. తన ప్రయాణంలో వీధి కుక్కల దత్తతలోని ప్రాముఖ్యతను ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. వాటికి ఆహారం అందిస్తూ యాత్ర చేపట్టాడు. తాను తిరిగిన ప్రాంతాలన్నింటినీ లెక్సీకి చూపిస్తూ యాత్ర కొనసాగించాడు. మొత్తం 3,700 కిలోమీటర్ల దూరాన్ని 90 రోజుల్లో పూర్తి చేశాడు. చికెన్, అన్నం, గుడ్లు ఎప్పటికప్పుడు వంట చేసుకుంటూ లెక్సీ కోసం ఆహారం అందించాడు. ఈ ప్రయాణంలో జాతికుక్కల్ని కొనుగోలు చేయకుండా... వీధికుక్కల్ని దత్తత తీసుకోవాలని ప్రతి ఊరిలోనూ ప్రతి ఇంటిలోనూ ప్రచారం నిర్వహించాడు. ఈ ప్రచారంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో 56 వీధికుక్కల్ని దత్తత తీసుకోవడం విశేషం. అంతే కాకుండా వీధి కుక్కలకు ఆహారం అందించే అలవాటు కూడా చాలా మందిలో పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో యాత్ర వీధి కుక్కల దత్తతకు సంబంధించి.. మరింత విస్తృత ప్రచారం చేసేందుకు మరో యాత్రకు సాహిత్య వర్ధన్ శ్రీకారం చుట్టాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సైకిల్ యాత్ర ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వరకూ యాత్రను డ్రాగ్ ట్రావెలర్ సాహిత్యవర్ధన్ ఆగస్ట్ 1 నుంచి మొదలు పెట్టాడు. రోజుకు 50 నుంచి 60 కి.మీ. ప్రయాణం చేస్తూ.. నలుగురు కనిపించిన చోట వీధి కుక్కల గురించి అవగాహన కల్పిస్తున్నాడు. వీధికుక్కల్ని కాపాడాలి.. దత్తత తీసుకోవాలి.. వాటికి ఆహారం అందించాలంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్ట్ చేస్తూ అవగాహన కల్పిస్తూ ప్రయాణం సాగిస్తున్నాడు. అదే విధంగా కుక్కలు రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా మెడలో రేడియం బెల్ట్‌లు కడుతున్నాడు. ఏడాదిలో 3 నెలలు వీధికుక్కల కోసం.. వీధికుక్కల పట్ల క్రూరత్వానికి వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యవంతులను చేయడమే ఈ యాత్ర వెనుక ఉన్న ప్రధాన లక్ష్యమని డాగ్ ట్రావెలర్ సాహిత్యవర్ధన్ చెబుతున్నాడు. జాతి కుక్కలతో పోలిస్తే వీధికుక్కలు స్నేహపూర్వక జీవులే కాకుండా రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండే ప్రాణులని తెలిపాడు. అందుకే జాతి కుక్కలకు బదులుగా వీధి కుక్కలను దత్తత తీసుకోవాలని ప్రతి ఊరిలోనూ ప్రజలను కోరుతున్నానని వివరించాడు. ఇటీవల బెంగళూరులోని ఓ అపార్ట్మెంట్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదాన్ని పసిగట్టిన ఓ వీధికుక్క మొరుగుతూ 150 మందిని రక్షించిందన్నాడు. వీధికుక్కల ప్రేమను పొందడమే కాకుండా.. వాటికి ప్రేమను పంచేందుకు సమాజంలోకి వాటిని తీసుకురావాలన్న మార్పు కోసం.. ఏడాదిలో 3 నెలలు కేటాయించేందుకు సిద్ధపడినట్లు సాహితీవర్థన్ వెల్లడించారు. -
క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి
సాక్షి, హైదరాబాద్: స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతూ ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి గుండెపోటు రావడంతో మృతి చెందాడు. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఏఎస్సై రాజ్‌కుమార్ తెలిపిన మేరకు.. గుజరాత్ రాజ్‌కోట్ ప్రాంతానికి చెందిన తుషార్ అమ్రా బెడ్వా(32), పూజా బెడ్వా భార్యభర్తలు. వీరికి 18 నెలల క్రితం వివాహం జరిగింది. నగరంలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో తుషార్‌కు ఉద్యోగం రావడంతో నగరానికి వలస వచ్చాడు. బండ్లగూడ జాగీరు ప్రాంతంలోని రాయల్ ఎన్‌క్లేవ్‌లో నివసిస్తున్నారు. ప్రస్తుతం పూజా ఏడు నెలల గర్బిణి. మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తుషార్ స్నేహితులతో కలిసి స్థానికంగా ఉన్న ఖాళీ ప్రదేశంలో క్రికెట్ ఆడేందుకు వెళ్లాడు. ప్రతి రోజు క్రికెట్ ఆడి రాత్రి 7 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చేవాడు. 8 గంటలైనా రాకపోవడంతో భార్య పూజా తుషార్ సెల్‌ఫోన్‌కు ఫోన్‌చేయడంతో స్నేహితులు ఫోన్ లిఫ్ట్ చేశాడు. క్రికెట్ ఆడుతూ తుషార్ కిందపడ్డాడని దీంతో తాము స్థానికంగా ఉన్న రినోవా ఆసుపత్రికి తీసుకు వచ్చామని వెల్లడించారు. హుటాహుటిన పూజా ఆసుపత్రికి వెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు డ్యూటీ డాక్టర్లు వెల్లడించారు. దీంతో విషయాన్ని రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని ఉస్మానియా మార్చరీకి తరలించారు. బుధవారం పోస్టుమార్టం అనంతరం తుషార్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కుటుంబ సభ్యులు మృతదేహానికి రాజ్‌కోట్‌కు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: పెళ్లి మండపంలోకి ప్రియురాలి ప్రవేశం.. తాళి కట్టే సమాయానికి -
హైదరాబాద్ టెకీ పాడుపని.. ఇన్‌స్టాలో యువతులకు వీడియో కాల్ చేసి..
సాక్షి, హైదరాబాద్: ఇన్‌స్టాగ్రామ్‌లో మహిళను వేధింపులకు గురి చేసిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని రాచకొండ సైబర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్స్పెక్టర్ జే నరేందర్ గౌడ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్ కాల్వ శ్రీరాంపూర్‌కు చెందిన మూడెత్తుల ప్రశాంత్ చెంగిచెర్లలో ఉంటూ నగరంలోని ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. bhavii_098 ఐడీతో సోషల్ మీడియాలో మహిళల ప్రొఫైల్స్‌ను అన్వేషిస్తాడు. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించిన బాధితురాలి ప్రొఫైల్‌కు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడు. బాధితురాలు యాక్సెప్ట్ చేయగా.. గతంలో ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌ల నుంచి ఆమె వాట్సాప్ నంబర్ సేకరించాడు. దాని ద్వారా తన చిన్ననాటి స్నేహితుడి లాగా చాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. ఓ రోజు ప్రశాంత్ ఇన్స్టాగ్రామ్ ద్వారా బాధితురాలికి వీడియో కాల్ చేశాడు. ఆమె ఫోన్ లిఫ్ట్ చేయగానే తన మొహం కనిపించకుండా ప్రైవేట్ పార్ట్‌లను మాత్రమే చూపిస్తూ, దాన్ని రికార్డ్ చేసి స్క్రీన్ షాట్స్ తీశాడు. ఆపై బాధితురాలి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేసి, బాధితురాలి ఫొటో, పేరుతో నకిలీ అకౌంట్ తెరిచాడు. దీని ద్వారా స్నేహితులకు ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపాడు. యాక్సెప్ట్ చేసినవారికి అప్పటికే రికార్డ్ చేసిన అసభ్యకరమైన వీడియోలు, స్క్రీన్ షాట్లను పోస్ట్ చేశాడు. అనంతరం పోలీసులకు చిక్కకుండా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఐడీని, జీమెయిల్ ఐడీలను తొలగించేవాడు. మానసికంగా వేదనకు గురైన బాధితురాలి భర్త రాచకొండ సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరించి మంగళవారం నిందితుడు ప్రశాంత్‌ను అరెస్ట్ చేసి, జ్యూడిషియల్ రిమాండ్‌కు తరలించారు. సెల్‌ఫోన్, సిమ్‌కార్డ్‌లను స్వాధీనం చేసుకున్నారు. చదవండి: నీటి ట్యాంకు శుభ్రం చేయబోయి.. పైపులో జారిపడ్డ కార్మికుడు -
అమ్మానాన్న వేధిస్తున్నారు.. కాపాడండి ప్లీజ్!
సాక్షి, హైదరాబాద్: తల్లిదండ్రుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, వారి వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ ఓ కుమారుడు సోమవారం తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌ను(హెచ్చార్సీ) ఆశ్రయించాడు. మహబూబాబాద్ జిల్లా, ఎల్లంపేట గ్రామానికి చెందిన మాలె శ్రీనివాస్ హైదరాబాదులో సాప్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. తన తల్లిదండ్రులు మాలె సత్యనారాయణ, మాలె సత్యవతి ఊరిలో ఉన్న ఆస్తులను అమ్మేసి, మళ్లీ డబ్బులు ఇవ్వాలని వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తాను బ్యాంకు రుణం తీసుకుని ఎంసీఏ పూర్తి చేశానని, పార్ట్‌టైం జాబ్ చేస్తూ వాయిదాలు కట్టుకుంటున్నట్లు తెలిపాడు. అయితే తన తల్లిదండ్రులు ఆస్తులు అమ్మడమే కాకుండా అప్పులయ్యాయని చెప్పడంతో గత ఏడాది రూ. 22 లక్షలు నగదు ఇచ్చానని, మళ్లీ రూ.15 లక్షలు ఇవ్వాలని తల్లిదండ్రులు వేధిస్తున్నారన్నాడు. వారి కారణంగా బ్రెయిన్ టీబీ వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తనను మానసికంగా వేధిస్తున్న తల్లిదండ్రులపై, ఎల్లంపేట సర్పంచ్, మరిపెడ పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకుని తనకు రక్షణ కల్పించాలని కమిషన్‌ను కోరాడు. -
నెల్లూరు కాల్పుల ఘటన.. బిహార్‌లో పిస్టల్ కొన్న సురేష్‌రెడ్డి!
నెల్లూరు (క్రైమ్): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తాటిపర్తిలో పెళ్లికి నిరాకరించిందన్న అక్కసుతో కావ్యారెడ్డిని పిస్టల్‌తో కాల్చి, ఆపై సురేష్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై పోలీసులు క్షేత్రస్థాయిలో దర్యాప్తు ముమ్మరం చేశారు. సురేష్‌రెడ్డి బిహార్‌లో పిస్టల్ కొనుగోలు చేసినట్లు గుర్తించిన పోలీసులు దర్యాప్తు నిమిత్తం మంగళవారం అక్కడికి వెళ్లారు. సురేష్‌రెడ్డి సెల్ఫోన్లను సీజ్చేసిన పోలీసులు అతడు మాట్లాడిన, చాటింగ్ చేసిన వారి వివరాలు, మెస్సేజ్‌లు సేకరించి ఆ దిశగా దర్యాప్తు సాగిస్తున్నారు. అతడి స్నేహితుల వివరాలు సేకరించి పిస్టల్‌పై ఆరాతీస్తున్నారు. çఏడాదిన్నరగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న అతడు గత ఏడాది డిసెంబర్లో సుమారు 20 రోజులు బిహార్‌లో ఉన్నాడని, ఆ సమయంలోనే పిస్టల్ కొనుగోలు చేశాడని గుర్తించినట్లు తెలిసింది. సాంకేతికతను వినియోగించి ఎవరివద్ద కొనుగోలు చేశాడో కూడా తెలుసుకున్నట్లు సమాచారం. దీంతో ఎస్పీ విజయారావు ఆదేశాల మేరకు పోలీసులు మంగళవారం బిహార్ వెళ్లారు. పిస్టల్ అమ్మిన వ్యక్తిని పట్టుకుని నెల్లూరు తీసుకొస్తారని తెలిసింది. కొందరు పోలీసులు ముంబై కూడా వెళ్లనున్నట్లు తెలిసింది. ఐదోసారి తూటా పేలి.. సురేష్‌రెడ్డి వినియోగించిన పిస్టల్ 7.5 ఎంఎంగా గుర్తించారు. మ్యాగజిన్ సామర్థ్యం 9 బుల్లెట్లు. దా న్లో ఏడు బుల్లెట్లు మాత్రమే ఉంచి నట్లు పోలీసు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కావ్యారెడ్డిపై మొదటిసారి కాల్పులు జరపగా ఆమె తప్పించుకుందని, మరో మూడుసార్లు కాల్చినా తూటాలు పేలలేదని, అయిదోసారి కాల్చడంతో తూటాపేలి కావ్యారెడ్డి తలలోకి దూసుకూళ్లిందని భావిస్తున్నారు. మిస్సయిన, పేలని తూటాలను ఘటనాస్థలంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నా రు. సురేష్‌రెడ్డి ఆరో రౌండ్ కాల్చుకుని మృతిచెందాడు. ఏడో బుల్లెట్ పిస్టల్‌లోనే ఉంది. దాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు బుల్లెట్లపై నంబర్లను బట్టి దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతదేహాలకు పోస్టుమార్టం.. కావ్యారెడ్డి, సురేష్‌రెడ్డి మృతదేహాలకు నెల్లూరు జీజీహెచ్‌లో ఆత్మకూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో పోలీసులు శవపంచనామా, వైద్యులు పోస్టుమార్టం చేశారు. తాటిపర్తిలో రెండు కుటుంబాల నడుమ వివాదాలు తలెత్తే అవకాశం ఉందన్న అనుమానంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
Nellore: పేలిన తూటాలు.. రాలిన ప్రాణాలు.. ఉలిక్కిపడిన తాటిపర్తి
జిల్లాలోని పొదలకూరు మండలం తాటిపర్తి.. ఒకప్పుడు వర్గ రాజకీయ హత్యలతో అట్టుడికిన గ్రామం. ఆ ఊరంతా వ్యవసాయ ఆధారితంగా జీవనం సాగిస్తోంది. నేటితరం యువత ఉన్నత చదువులు చదువుకుని వివిధ రంగాల్లో స్థిరపడుతున్నారు. కాలంతో పాటు ఆ ఊరు రాజకీయ వైషమ్యాలకు దూరమైంది. ఒకరికొకరు కలుపుగోలుగా ఉండడంతో ప్రశాంతంగా ఉంటున్న ఆ పల్లె ఒక్కసారిగా ఉలిక్కి పడింది. గ్రామానికి చెందిన ఓ యువకుడు తాను ఇష్టపడిన యువతి పెళ్లికి నిరాకరించిందని తుపాకీతో కాల్చి, తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చదవండి: వివాహేతర సంబంధం.. భర్తను అడ్డు తొలగిస్తే కలసి జీవించవచ్చని.. పొదలకూరు(నెల్లూరు జిల్లా): వ్యవసాయం, పాడి–పంటలతో అలరారుతున్న ఆ పల్లెలో ప్రేమోన్మాద తూటాలు పేలాయి. ఆ ఊరు ఉలిక్కిపడింది. విషయం తెలిసి విషాదంలో మునిగిపోయింది. తాను మనసు పడిన యువతి పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో యువకుడు తుపాకీతో ఆమెను కాల్చి, తాను కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నా డు. మండలంలోని తాటిపర్తిలో దిగువ మధ్య తరగతికి చెందిన ఒకే సామాజిక వర్గానికి చెందిన ఆ రెండు కుటుంబాలు ఉన్నంతలో ఉన్నతంగా జీవనం సాగి స్తున్నారు. గౌరవంగా జీవిస్తున్న ఆ కుటుంబాలు విధి ఆడిన వింత నాటకంలో విషాదంలో మునిగిపోయా యి. హతురాలు కావ్య, ఆత్మహత్య చేసుకున్న సురేష్‌రెడ్డి కుటుంబాల నేప«థ్యాలు ఇంచుమించుగా ఒకటే. ఉన్నతంగా ఎదగాలని ఉన్నత చదువులు చదు వుకుని సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సంపాదించుకున్నారు. సాఫ్ట్‌వేర్‌గా సంతోషాన్ని ఆస్వాదిస్తుండగానే.. హతురాలు పలుకూరు కావ్య తండ్రి వెంకటనారపరెడ్డి మూడెకరాల రైతు. ఆయనకు ఇద్దరమ్మాయిలు. ఉన్నంతలో ఇద్దరు ఆడబిడ్డలను బాగా చదివించాడు. కావ్య పెద్దామ్మాయి. ఇంజనీరింగ్ పూర్తి చేసి ఏడాదిన్నర కిందట సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించింది. వర్క్ ఫ్రం హోమ్ చేసుకుంటూ తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటుంది. చిన్నమ్మాయి కూడా సాఫ్ట్వేర్ రంగాన్ని ఎంచుకుని చదువుతోంది. కావ్య సాఫ్ట్‌వేర్‌గా సంతోషాన్ని ఆస్వాదిస్తుంది. ఇంతలోనే ప్రేమోన్మాదానికి బలైపోయింది. పెళ్లి ఆశ నెరవేరలేదు.. మాలపాటి సురేష్‌రెడ్డి తండ్రి సుబ్బారెడ్డి సైతం సన్నకారు రైతు. వ్యవసాయంతో పాటు వరిగడ్డి వ్యాపా రం చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఆయనకు కొడుకు, కుమార్తె. ఆడపిల్లకు పెళ్లి చేశాడు. సురేష్‌రెడ్డి పెద్దవాడు కావడంతో బాగా చదివించాడు. ఐదేళ్ల కిందటే సురేష్‌రెడ్డి బెంగళూరులో సాప్‌్టవేర్ ఉద్యోగం సంపాదించాడు. ఇప్పుడు నెలకు రూ.లక్షకు పైగా జీతం పొందుతున్నాడు. తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆశ పడ్డాడు. ఆ అమ్మాయి పెళ్లికి నిరాకరించడంతో ఆమెను చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామంలో విషాదఛాయలు కాల్పుల ఘటనతో గ్రామం ఉలిక్కి పడింది. విష యం తెలియడంతో విషాదఛాయలు అలముకున్నా యి. ఇరు కుటుంబాలు శోకసముద్రంలో మునిగిపోయాయి. ఎంతో భవిష్యత్ ఉన్న యువతి, యువ కుల జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోవడంతో బంధువర్గాలు తల్లిడిల్లిపోతున్నాయి. పోలీసుల సమగ్ర దర్యాప్తు కాల్పుల ఘటనపై పోలీసు అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. ఎస్పీ విజయారావు, అడిషనల్ ఎస్పీ చౌడేశ్వరీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆత్మకూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో పొదలకూరు సీఐ సంగమేశ్వరరావు, ఎస్సై కరిముల్లా దర్యాప్తు చేపట్టారు. ఎస్పీ మాట్లాడు తూ కావ్యతో సురేష్‌రెడ్డి చాటింగ్ చేశాడని, అయితే ఆమె మాత్రం తిరిగి చాటింగ్ చేయలేదని తెలిపారు. ఇద్దరి సెల్ఫోన్లను స్వాధినం చేసుకున్న పోలీసులు మిస్టరీని ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే పిస్టల్ చుట్టూ క్రైమ్ స్టోరీ నడుస్తోంది. సురేష్‌రెడ్డి పిస్టల్ ఎక్కడ సంపాదించాడు? ఎవరి వద్ద పిస్టల్ కొనుగోలు చేశాడనే కోణంలో ప్రధానంగా పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పిస్టల్‌పై ‘మేడిన్ యూఎస్ఏ’ ఉంది. కావ్య అంటే ఇష్టంతో.. కావ్య, సురేష్రెడ్డిలది ఇద్దరిది ఒకే ఊరు. కావ్య అంటే ఇష్టం పెంచుకున్న సురేష్‌రెడ్డి ఏడాది కాలంగా తల్లిదండ్రుల ద్వారా ఆమెను తనకిచ్చి వివాహం జరిపించాల్సిందిగా కోరుతున్నాడు. ఇదే విషయాన్ని కావ్య కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లాడు. అయితే కావ్య తల్లిదండ్రులు ఈ వివాహానికి సమ్మతించలేదు. బహుశా ఇద్దరి మధ్య 12 ఏళ్ల వయస్సు తేడా ఉండడంతో ఒప్పుకోలేదని గ్రామస్తుల అభిప్రాయం. కానీ సురే‹Ù రెడ్డి పట్టు వదలకుండా కావ్యతోనే తన పెళ్లి జరగాలని తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో ఒంటిరి తనాన్ని అలవాటు చేసుకుని డిప్రెషన్లోకి వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ దారుణానికి తెగబడినట్లు సర్వత్రా వినిపిస్తోంది. ఈ ఘోరం ఊహించలేదు ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేదు. మా గ్రామంలో ఇలాంటి ఘటనలు ఇప్పటి వరకు జరగలేదు. అన్యాయంగా నా మనమరాలిని హత్య చేశాడు. ఏ పాపం తెలియని అమ్మాయి బలికావాల్సి వచ్చింది. – పలుకూరు మస్తాన్‌రెడ్డి, కావ్య తాత పిస్టల్ ఎలా వచ్చిందో తెలియదు మా అబ్బాయి సురేష్‌రెడ్డికి పిస్టల్ ఎలా వచ్చిందో తెలియదు. మా దురదృష్టం కొద్ది ఈ ఘటన జరిగింది. ఇంట్లో మా వాడు బాగానే ఉండేవాడు. ఎందుకు ఈ చర్యకు పాల్పడ్డాడో తెలియడం లేదు. మాకు పుత్రశోకం మిగిల్చి వెళ్లాడు. – మాలపాటి పరమేశ్వరి, సురేష్‌రెడ్డి తల్లి -
గూగుల్ కు దిమ్మ తిరిగే షాకిచ్చాడు, రూ.65కోట్ల జాక్ పాట్ కొట్టేశాడు!!
మనదేశానికి చెందిన ఓ యువకుడు గూగుల్‌కు భారీ షాకిచ్చాడు. గూగుల్ కు చెందిన వివిధ ప్రొడక్ట్‌లలో భారీ ఎత్తున లోపాల్ని(బగ్స్) గుర్తించాడు. లోపాల్ని గుర్తించడమే కాదు గూగుల్ నుంచి కోట్ల రూపాయిల రివార్డ్‌లును అందుకున్నాడు. భారత్‌కు చెందిన అమన్ పాండే ఎన్ఐటీ భోపాల్ లో పట్టభద్రుడయ్యాడు. అనంతరం ప్రముఖ కంపెనీలకు చెందిన సాఫ్ట్వేర్లలో లోపాల్ని గుర్తించేందుకు గతేడాది బగ్స్ మిర్రర్ పేరిట కంపెనీని స్థాపించాడు. ఈ నేపథ్యంలో గూగుల్ తమ సంస్థలకు చెందిన సాఫ్ట్వేర్లలో లోపాల్ని గుర్తించిన వారికి భారీ ఎత్తున ప్రోత్సాహకాల్ని అందిస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం వల్నరబిలటీ రివార్డ్ ప్రోగ్రామ్ 2021 ను నిర్వహించింది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న అమన్ పాండే.. గూగుల్, ఆండ్రాయిండ్, గూగుల్ క్రోమ్, గూగుల్ ప్లేస్టోర్ తో పాటు ఇతర ప్రొడక్ట్‌లలో వందల సంఖ్యలో బగ్స్‌ను గుర్తించాడు. ఒక్క ఏడాదిలోనే గూగుల్ తో పాటు ఆ సంస్థకు చెందిన మిగిలిన కంపెనీలకు చెందిన పలు సాఫ్ట్వేర్లలో మొత్తం 232 లోపాల్ని గుర్తించాడు. ఈ నేపథ్యంలో అమన్‌ను గూగల్ ప్రత్యేకంగా అభినందించింది. బగ్స్ ను గుర్తించినందుకు రూ.65కోట్ల రివార్డ్‌ను అందిస్తున్నట్లు గూగుల్ తన బ్లాగ్ పోస్ట్‌లో ప్రధానంగా హైలెట్ చేసింది. కాగా, 2019లో సారా జాకోబస్ అనే వ్యక్తి అండ్రాయిడ్ వల్నరబిలిటీస్ రివార్డ్ ప్రోగ్రామ్‌లో భాగంగా 280కి పైగా బగ్స్‌ను నివేదించి తొలిస్థానంలో నిలిచాడు. -
మహిళా టెక్కీ ఆత్మహత్య.. రెండేళ్ల క్రితమే వివాహం..
సాక్షి, బెంగళూరు: మహిళా టెక్కీ ఆత్మహత్య చేసుకున్న ఘటన అమృతహళ్లి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. రెండేళ్ల క్రితం వినయ్ అనే సివిల్ ఇంజనీర్‌తో టెక్కీ సంగీత (29)కు వివాహం జరిగింది. వివాహం అనంతరం వీరు ఇక్కడి వీరణ్ణపాళ్యలో నివాసం ఉంటున్నారు. దంపతుల మధ్య చిన్నపాటి గొడవల కారణంగా గురువారం సాయంత్రం సంగీత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న సంగీత తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని అల్లుడి వేధింపుల వల్లనే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదు చేశారు. చదవండి: (నర్సుని బంధించి అత్యాచారం.. అదే రోజు బస్సెక్కించి..) -
కాల్ లిఫ్ట్ చేయగానే నగ్న వీడియో.. అప్పుడే అసలు కథ మొదలైంది..
సాక్షి, హైదరాబాద్: అందివచ్చే ప్రతీ ఒక్క అవకాశాన్ని క్యాష్ చేసుకుంటున్నారు సైబర్ నేరస్తులు. ఏమ్రాతం అలసత్వంగా ఉన్నా లక్షలు పోగొట్టుకోకతప్పదు. తాజాగా హైటెక్‌సిటీలోని ప్రముఖ ఐటీ కంపెనీలోని ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు ఇదే అనుభవం ఎదురైంది. ఫేస్బుక్లో అమ్మాయి ప్రొఫైల్ ఫొటోతో ఫ్రెండ్ రెక్వెస్ట్ వచ్చింది. వచ్చిందే తడువు క్రాస్ చెక్ చేసుకోకుండా యాక్సెప్ట్ చేశాడు. కాసేపటికి న్యూడ్ వీడియో కాల్ అంటూ ఎఫ్బీలో మెసేజ్ పంపించింది. దీంతో సరేనని.. ఇతనూ రెడీ అయ్యాడు. కాల్ లిఫ్ట్ చేయగానే ఓ అమ్మాయి నగ్న వీడియో ప్లే అయింది. అయితే వాస్తవానికి అది ప్రత్యక్ష వీడియో కాదు.. రికార్డెడ్ వీడియో. అటువైపు నుంచి ఆడ గొంతుతో ఈ టెకీని కూడా బట్టలు విప్పమని కోరింది. దీంతో ఇతనూ ఒంటిపై దుస్తులు తీసేశాడు. ఈ తతంగాన్నంతా అటువైపు నుంచి సైబర్ నేరస్తులు వీడియో తీశారు. చదవండి: ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి.. మైనర్ బాలికపై.. ఢిల్లీ ఏసీపీని మాట్లాడుతున్నాను.. ఇకడ్నుంచి నేరస్తుల అసలు కథ మొదలైంది! వీడియో కాల్ పూర్తయ్యాక.. కాసేపటికి సదరు ఐటీ ఉద్యోగికి ఫోన్ వచ్చింది. ‘ఢిల్లీ ఏసీపీని మాట్లాడుతున్నాను. మీతో న్యూడ్ వీడియో కాల్ చేసిన అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. మీపైన ఢిల్లీలో కేసు నమోదయింది. అరెస్ట్ చేస్తామని’ బెదిరించారు. అమ్మాయి సెల్‌ఫోన్ వీడియోలను సంబంధించిన రికార్డ్ అంతా రికవరీ చేశామని తెలిపారు. పోలీస్ అనగానే టెకీ భయపడిపోయాడు. ఇతని వీడియో ఇతనికే పంపడంతో నిజమేనని నమ్మేశాడు. కేసు, అరెస్ట్ గట్రా లేకుండా ఉండాలంటే కొందరు అధికారులను మ్యానేజ్ చేయాలని, కొంత డబ్బు పంపిచమని కోరారు. సరేనని..గత నెల 7వ తేదీ నుంచి 20 రోజుల పాటూ విడతల వారీగా రూ.29 లక్షలు ఆన్లైన్లో సమర్పించుకున్నాడు. అయినా వదిలిపెట్టకుండా పదే పదే బెదిరిస్తుండటంతో తప్పని పరిస్థితులతో గురువారం సైబరాబాద్ సైబర్ క్రై మ్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో అసలు గుట్టరట్టయింది. ఇదంతా రాజస్తాన్ చెందిన సైబర్ ముఠా పనేనని పోలీసులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. చదవండి: ప్రియునికి ప్రియురాలి తండ్రి షరతు.. లాడ్జ్‌లో రూం తీసుకొని.. సిగ్గుపడి రిపోర్ట్ చేయడం లేదు ఇప్పటివరకు నగ్న వీడియో కాల్స్ ఘటనలపై 6–7 కేసులు నమోదయ్యాయి. సెక్ట్సార్షన్ అని పిలిచే ఈ తరహా బాధితులు చాలా మందే ఉంటారు కానీ, చెప్పుకోవటానికి సిగ్గుపడి ముందుకు రావటం లేదు. పోలీసులు ఏమంటారోనని భయపడుతుంటారు. ఇదే సైబర్ నేరస్తులకు ఆయుధంగా మారుతోంది. అపరిచితులతో ఫోన్లో సంభాషించొద్దు. అమ్మాయితో నగ్న వీడియో కాల్స్ అనగానే నమ్మొద్దు. – జీ. శ్రీధర్, ఏసీపీ, సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ -
నేర్చుకో.. లాభాలు అందుకో
ఈక్విటీలు నూతన గరిష్టాలకు చేరుతుండడం యువ ఇన్వెస్టర్లలో మరింత ఉత్సాహాన్ని కలిగిస్తోంది. పెట్టుబడులపై చక్కని రాబడులు సొంతం చేసుకునే దిశగా వారు అడుగులు వేస్తున్నారు. గతంతో పోలిస్తే నేటి తరానికి ఉన్న అనుకూలత.. డిజిటల్ వేదికలపై సమాచారం పుష్కలంగా లభిస్తుండడం. లెర్నింగ్ యాప్‌ల సాయంతో ఈక్విటీలపై మరింత అవగాహన పెంచుకునేందుకు టెక్కీ యువత ఆసక్తి చూపిస్తోంది. జెరోదా పెట్టుబడుల మద్దతు కలిగిన ‘లెర్న్‌యాప్’కు యూజర్ల సంఖ్య ఏడాదిలోనే మూడింతలు పెరిగింది. 2020లో యూజర్ల సంఖ్య 70,000 కాగా, ఈ సంఖ్య ప్రస్తుతం 2,00,000 దాటిపోయింది. అంతేకాదు 10 లక్షల మంది ఇతరులు ఈ యాప్‌పై సమాచారాన్ని ఆన్వేషిస్తున్నారు. స్టాక్స్, క్రిప్టోలకు సంబంధించిన పాఠాలు ఇందులో వీడియోల రూపంలో ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. 50 లక్షల మంది యూజర్లకు చేరువ కావాలన్నది లెర్న్‌యాప్ లక్ష్యం. ‘‘2020 నుంచి మా ఆదాయంలో 300 శాతం వృద్ధి కనిపిస్తోంది. గతేడాది ఆదాయంతో పోలిస్తే 2021లో ఆదాయం 350 అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నాం’’ అని లెర్న్‌యాప్ వ్యవస్థాపకుడు, సీఈవో ప్రతీక్‌సింగ్ తెలిపారు. డాక్యుమెంటరీ రూపంలోని వీడియోలు, క్విజ్‌లతో ఇందులోని సమాచారాన్ని మరింత ఆసక్తికంగా మార్చే ప్రయత్నాలను లెర్న్‌యాప్ అమలు చేస్తోంది. సాధారణంగా ఆర్థిక అంశాల పట్ల ఎక్కువ మందిలో ఆసక్తి ఉండదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్థిక అంశాలను ఆకర్షణీయంగా రూపొందించడంపై ఈ సంస్థ దృష్టి పెట్టడం గమనార్హం. మహిళలకు ప్రత్యేకంగా.. పట్టణ మహిళల కోసం ఉద్దేశించినది ‘బేసిస్’ యాప్. క్రిప్టోలు, పెట్టుబడులపై ఈ యాప్‌లో ఆసక్తికర చర్చలు కూడా సాగుతుంటాయి. మార్కెట్లకు సంబంధించి తమ ఐడియాలను యూజర్లు ఇతరులతో పంచుకుంటుంటారు. 2019లో బేసి స్ మొదలు కాగా.. ఈ ప్లాట్‌ఫామ్‌పై మహిళా యూజర్ల సంఖ్య లక్ష దాటిపోయింది. వీరిలో ఎక్కువ మంది మిలీనియల్స్ కావడం గమనార్హం. కాలేజీ విద్యార్థినులు కూడా ఇందులో యూజర్లుగా ఉన్నారు. పెట్టుబడులను మెరుగ్గా నిర్వహించే విషయంలో నేర్చుకోవాలన్న ఆకాంక్ష వీరి లో వ్యక్తం కావడం భవిష్యత్తు పట్ల వారు ఎంత ప్రణాళికాబద్ధంగా ఉన్నారో తెలుస్తోంది. ‘‘సభ్యు లు మా ప్లాట్ఫామ్లో చేరిన తర్వాత తమ ఆదాయంలో సగటున 40 శాతం మేర ఆదా చేయగలుగుతున్నారు’’ అని బేసిస్ సహ వ్యవస్థాపకురాలు దీపికా జైకిషన్ తెలిపారు. నిపుణుల సాయంతో తమ ఖర్చులను క్రమబదీ్ధకరించుకోవడం వల్లే ఇది సాధ్యమవుతున్నట్టు చెప్పారు. ఈ యాప్‌లో సభ్యత్వానికి వార్షిక చందా రూ.9,000. ‘ఫైనాన్స్’కు సంబంధించి ఎన్నో ఆరి్టకల్స్ ఈ యాప్‌పై అందుబాటులో ఉన్నాయి. ‘‘ఫైనాన్స్’ గురించి సౌకర్యవంతంగా నేర్చుకునేందుకు మహిళలకు ఒక సురక్షితమైన వేదికను ఏర్పాటు చేయాలన్నదే మా లక్ష్యం’’ అని జైకిషన్ వెల్లడించారు. సొంత సామర్థ్యాలపై ఆసక్తి నేటి తరానికి తాము స్వయంగా ఆర్థిక అంశాలను తెలుసుకుని, తమ పెట్టుబడులను తామే నిర్వహించుకోవాలన్న ఆసక్తి పెరుగుతున్నట్టు ఈ సంస్థలు చెబుతున్నాయి. ఆర్థిక సలహాదారులపై ఆధారపడేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదు. లెర్న్యాప్ను బెంగళూరు, పుణె, ముంబై తదితర పట్టణాల నుంచి ఇంజనీర్లు, టెక్నాలజీ నిపుణులు వినియోగిస్తున్నారు. ప్రాంతీయ మార్కెట్లకూ చేరువ కావాలని, హిందీతోపాటు కనీసం రెండు భారతీయ భాషల్లో కంటెంట్‌ను అందించాలన్న ప్రణాళికతో ఉన్నట్టు ప్రతీక్‌సింగ్ తెలిపారు. ప్రతీ నెలా రూ.375 చందా చెల్లించడం ద్వారా లెర్న్‌యాప్‌పై ఎన్ని కోర్స్‌లను అయినా నేర్చుకోవచ్చు. యూజర్ల విచారణలకు నిపుణులతో జవాబులను కూడా ఇప్పిస్తోంది. నాణ్యతపై దృష్టి.. ఆన్లైన్లో ఎన్నో వేదికలపై ఫైనాన్స్‌కు సంబంధించి వీడియోలు అందుబాటులో ఉన్నాయి. కానీ, నాణ్యమైన సమాచారాన్ని అందించాలన్న లక్ష్యంతో లెర్న్‌యాప్, బేసిస్ పనిచేస్తున్నాయి. లెర్న్‌యాప్‌పై పరిశ్రమలకు చెందిన నిపుణులు, దిగ్గజాలు చెప్పిన అనుభవ పాఠాలు అందుబాటులో ఉంటాయి. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ చైర్మన్ రామ్‌దియో అగర్వాల్, బీఎస్ఈ సీఈవో ఆశిష్ చౌహాన్, ఎడెల్వీజ్ అస్సెట్ మేనేజ్మెంట్ సీఈవో రాధికా గుప్తా, రాకేశ్ జున్‌జున్‌వాలాకు చెందిన రేర్ ఎంటర్ప్రైజెస్ సీఈవో ఉత్పల్సేత్ తదితరులు చెప్పిన అంశాలతో వీడియోలో ఈ వేదికపై ఉన్నాయి. ‘‘పరిశ్రమలకు చెందిన దిగ్గజ నిపుణులు పాఠాలు చెప్పడం సమాజానికి తిరిగి ఇవ్వాలన్న ఉద్దేశ్యంతోనే. అంతేకానీ, యూజర్ల నుంచి డబ్బులు సంపాదించుకోవాలని కాదు’’ అని ప్రతీక్‌సింగ్ తెలిపారు. లెర్న్‌యాప్ స్టోరీ రూపంలో వీడియోలను రూపొందిస్తోంది. తద్వారా ఆర్థిక అంశాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతోంది. ప్రతి రోజూ 45 నిమిషాల వర్క్‌షాప్‌ను, అనంతరం ప్రశ్న/జవాబుల సెషన్‌ను నిర్వహిస్తోంది. దీంతో తాము నేర్చుకున్న అంశాలపై వారిలో మరింత అవగాహన ఏర్పడే దిశగా పనిచేస్తోంది. ‘‘మేము ప్రత్యక్ష ఫలితాలను కూడా అందిస్తున్నాం. ఈ రోజు నేర్చుకుని.. పెట్టుబడులు వృద్ధి చెందేందుకు 20 ఏళ్లు వేచి చూసే విధంగా ఇది ఉండదు’’ అని ప్రతీస్ సింగ్ చెప్పడం గమనార్హం. -
ఈ కొత్త ఆవిష్కరణతో ఇంధనం మరింత ఆదా...!
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు కొండేక్కుతున్నాయి. పెట్రోలు, డిజీల్ ధరలు పెరగడంతో సామాన్యుడి నెత్తిమీద మరింత భారంపడనుంది. సుమారు 13 రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు సెంచరీ దాటింది. కాగా వాహనాల్లో ఇంధన వాడకం, కర్బన ఉద్గారాలను తగ్గించడానికి హైదరాబాద్‌కు చెందిన డేవిడ్ ఎష్కోల్ సరికొత్త ఆవిష్కరణ రూపొందించారు. అందుకోసం ‘5M మైలేజ్ బూస్టర్’ను ఆవిష్కరించారు. ఈ వ్యవస్థతో ఇంజిన్ నుంచి విడుదలయ్యే కర్బన ఉద్గారాలను తగ్గించడమే కాకుండా వెహికిల్ మైలేజీను కూడా పెంచుతుంది. 5M మైలేజ్ బూస్టర్‌లో ముఖ్యంగా ఐదు రకాల ప్రయోజనాలను కల్పించే వ్యవస్థను ఏర్పాటుచేశారు. ఈ బూస్టర్‌ను వాహనాలకు అమర్చడంతో.. అధిక మైలేజీను, అధిక పిక్ అప్ను, స్మూత్ డ్రైవింగ్, అధిక టార్క్‌ను, పొందవచ్చునని డేవిడ్ తెలిపారు. తక్కువ మోతాదులో కర్బన ఉద్గారాలను వెలువడేలా చేస్తుంది. 5M మైలేజ్ బూస్టర్ ఇంజిన్‌కు అమర్చనున్నారు. బైక్ సీసీ పవర్ ఆధారంగా నిర్దిష్ట సమయంలో అల్ట్రా సోనిక్ తరంగాలను, గ్యాస్ రూపంలోని ప్లాస్మాను మైలేజ్ బూస్టర్‌తో ఇంజిన్‌కు పంపిస్తారు. కాగా ఇప్పటివరకు సుమారు 8 వేల వాహనాలకు 5M మైలేజ్ బూస్టర్‌ను అమర్చారు. 100సీసీ నుంచి 10,000 సీసీ సామర్థ్యం కలిగిన ఇంజిన్ లకు మైలేజ్ బూస్టర్‌ను ఏర్పాటుచేయవచ్చునని డేవిడ్ పేర్కొన్నారు. కాగా ఏదైనా ఆటోమొబైల్ కంపెనీ తో జతకడితే ఈ టెక్నాలజీను సామాన్యులకు అందుబాటులో వస్తోందని డేవిడ్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
‘ఎలా చావాలి’ అని యూట్యూబ్‌లో సెర్చ్ చేసి..
కృష్ణరాజపురం: ఇప్పటివరకు తానేమీ సాధించలేదని, ఇకపై కూడా ఏమి సాధించలేనని జీవితంపై విరక్తి చెందిన టెకీ యూట్యూబ్‌లో చూసి ఆత్మహత్య చేసుకున్నాడు. కర్ణాటకలో బీదర్‌కు చెందిన జీవన్ అంబటె (33) బెంగళూరులోని మహదేవపురా.. లక్ష్మీనగర్ లేఅవుట్లో నివాసం ఉంటున్నాడు. మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన అతడు.. అమెజాన్ కంపెనీలో టీం లీడర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఇటీవల కాలంలో తాను జీవితంలో ఏమీ సాధించలేదని తరచూ బాధపడేవాడు. అనంతరం డిప్రెషన్‌కు లోనయి ‘ఎలా మరణించాలి (హౌ టు డై)’ అని యూట్యూబ్‌లో సెర్చ్ చేయసాగాడు. యూట్యూబ్‌లో వెతికి చివరికి కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్‌ను ఎన్నుకున్నాడు. ఆన్లైన్లో ప్రయోగాల కోసమని ఆర్డర్ చేసి తెప్పించుకున్నాడు. ముఖాన్ని ప్లాస్టిక్ సంచితో కప్పుకున్నాడు. అందులోకి పైప్‌ను పెట్టుకుని వాయువును పీల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు రోజుల తర్వాత అతని స్నేహితులు గదికి వచ్చి చూడగా చనిపోయి కనిపించాడు. వెంటనే స్నేహితులు మహదేవపుర పోలీసు స్టేషన్లో విషయం తెలియజేశారు. అయితే తన చావుకు ఎవరూ కారణం కాదని సూసైడ్ నోట్లో రాశాడు. జీవితంలో ఎన్నో సాధించాలని కలలు కన్నానని, కానీ అవన్నీ నేరవేదని వాపోయాడు. తానో యంత్రంలా మారిపోయానని, ఈ జీవితం తనకు నచ్చలేదని సూసైడ్ నోట్లో జీవన్ పేర్కొన్నాడు. డోర్‌కు కాగితం అతికించి.. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు జీవన్ తాను ఉంటున్న ఇంటి డోర్‌కు స్వయంగా రాసిన కాగితం అతికించాడు. తలుపు ఎలా తెరవాలో బొమ్మ గీశాడు. అంతేకాదు తలుపు తెరిచిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అందులో రాశాడు. లోపలికి వచ్చిన తర్వాత కరెంట్ స్విచ్‌లు వేయవద్దని.. వేస్తే మంటలు అంటుకునే ప్రమాదం ఉందని హెచ్చరించాడు. కిటికీలు, తలుపులన్నీ తెరవాలని.. గ్యాస్ సిలిండర్ వాల్వ్ మూసివేయాలని సూచించాడు. డోర్‌కు అతికించిన కాగితంలో తన ఫొటోను కూడా అతడు పెట్టాడు. చదవండి: కర్ణాటకలో బ్లాయిమెయిల్: 400 సీడీలున్నాయి! యువకుడి నగ్న వీడియోలు రికార్డు చేసి.. -
డేటింగ్ యాప్: నగ్నంగా వీడియో కాల్..
బెంగళూరు : డేటింగ్ యాప్ ఓ టెకీ కొంపముంచింది. సదరు యాప్‌లో పరిచయమైన యువతులు అతడ్ని బ్లాక్ మెయిల్ చేస్తూ ఏకంగా 16 లక్షల రూపాయలు దోచేశారు. ఈ సంఘటన కర్ణాటకలోని బెంగళూరులో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బెంగళూరుకు చెందిన టెకీకి డిసెంబర్ 3న ఓ డేటింగ్ యాప్ ద్వారా శ్వేత అనే యువతి పరిచయమైంది. డిజిటల్ పేమెంట్ ద్వారా తనకు 2 వేల రూపాయలు పంపాలని ఆమె టెకీని కోరింది. పేమెంట్ కోసం తన ఫ్రెండ్ నిఖిత నెంబర్ అతడికి ఇచ్చింది. కొద్దిసేపటి తర్వాత నిఖిత టెకీకి నగ్నంగా వీడియో కాల్ చేసింది. అతడు వీడియో కాల్లో నగ్నంగా ఉన్న ఆమెను చూశాడు. ( కాలేజీ క్లర్కుతో ఎఫైర్: 21 ఏళ్లుగా.. ) ఈ వీడియో కాల్‌ను ఆమె రికార్డ్ చేసింది. అనంతరం వీడియోను అడ్డం పెట్టుకుని బెదిరింపులకు పాల్పడింది. ఆమెతో పాటు మరో ఇద్దరు యువతులు ప్రీతి అగర్వాల్, షెరైన్లు తాము అడిగినంత డబ్బులు చెల్లించకపోతే వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామంటూ బెదిరించసాగారు. ఇలా అతడి వద్ద నుంచి డిసెంబర్ 3-13 వరకు 10 రోజుల్లో 16 లక్షల రూపాయలు దోచేశారు. దీంతో విసిగెత్తిపోయిన అతడు పోలీసులను ఆశ్రయించాడు. నిందితురాళ్లపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
పగబట్టిన ప్రేమ; సాఫ్ట్వేర్ యువతికి..!
సాక్షి, కర్ణాటక: ప్రేమను తిరస్కరించిన యువతికి హైటెక్ తరహాలో వేధింపులకు పాల్పడిన ఓ టెక్కీ ఎట్టకేలకు చిక్కాడు. పరిహార కుటుంబ సలహా కేంద్రం సమాలోచనతో కేసు సుఖాంతమైంది. ఉత్తరభారతదేశానికి చెందిన 24 ఏళ్ల యువతి నగరంలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో టెక్కీగా పనిచేస్తూ వైట్‌ఫీల్డ్‌లో నివాసం ఉంటోంది. నెలక్రితం స్కైప్ ద్వారా గుర్తు తెలియని నెంబర్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చా యి. సదరు వ్యక్తి అశ్లీలంగా మాట్లాడాడు. లాక్డౌన్ నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సాధ్యం కాలేదు. ప్రతిరోజు ఇదే విధంగా కాల్స్ వస్తుండటంతో కొద్ది రోజుల క్రితం ఇతరుల సాయంతో కుటుంబ సలహా కేంద్రానికి ఫోన్లో ఫిర్యాదు చేసింది. కుటుంబ సలహా కేంద్రం సిబ్బంది సైబర్ పోలీసులసహకారం తీసుకున్నా సదరు నిందితుడి ఆచూకీ లభించలేదు. మీకు శత్రువులు, బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారా ? కుటుంబ సలహా కేంద్రం కౌన్సిలర్ డాక్టర్ బింద్య సదరు బాధితురాలితో మీకు ఎవరైనా కానివారు, బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారా అంటూ ప్రశ్నించింది. అలాంటి వారు ఎవరూ లేరని ఆమె సమాధానమిచ్చింది. రెండు రోజుల తరువాత ఫోన్ చేసి ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో క్లాస్‌మెట్ తనను ప్రేమిస్తున్నట్లు వేధింపులకు పాల్పడినట్లు గుర్తు చేసింది. ప్రేమ తిరస్కరించిందని.. : కళాశాలలో చదువుతున్న సమయంలో తన ప్రేమను తిరస్కరించిందని క్లాస్‌మెట్ అయిన యువకుడు యువతిపై కక్ష పెంచుకున్నాడు. రెండేళ్ల తరువాత ఆమె గురించి ఆరా తీసి ఫోన్ చేయ డం ప్రారంభించాడు. యువతి ఫిర్యాదు మేరకు కుటుంబ సలహా కేంద్రం అధికారులు వివిధ మార్గాల్లో సదరు వ్యక్తి గురించి ఆరా తీయగా అతను ముంబయిలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నట్లు బయటపడింది. అంతేకాకుండా యువతి క్లాస్‌మెట్‌గా గుర్తించారు. కుటుంబ సలహా కేంద్రం అధికారులు సదరు యువకుడికి ఫోన్ చేసి విచారణ చేయగా మొదట తనకు సంబంధం లేదని చెప్పినా చివరకు తానే చేసినట్లు ఒప్పుకున్నాడు. ఈ విషయం తెలిసి యువతి ఆశ్చర్యపోయింది. అనంతరం ఇద్దరిని కలపడంతో సదరు వ్యక్తి యువతికి క్షమాపణ చెప్పడంతో బాధితురాలు కేసు ఉపసంహరించుకోవడంతో కథ సుఖాంతమైంది. ఈ సందర్భంగా కుటుంబ సలహా కేంద్రం ఇన్చార్జ్ రాణి శెట్టి మాట్లాడుతూ... సైబర్ క్రైం పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని, మేనెలలో 433 ఫిర్యాదులు అందగా అందులో 25 కేసులు ఇంటర్నెట్ ద్వారా వేధింపుల కేసులేనని చెప్పారు. చదవండి: నలుగురూ స్నేహితులు.. ఒకే గ్రామం -
ఫాసిస్టు చట్టంపై టెకీల బహిరంగ లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సీఏఏ, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ) తీవ్ర ఆందోళన రోజురోజుకు రాజుకుంటున్న తరుణంలో భారతీయ ఐటీ నిపుణులు ఘాటుగా స్పందించారు. పౌరసత్వ సవరణ చట్టం ఫాసిస్ట్ చట్టంగా పేర్కొంటూ బహిరంగ లేఖ రాశారు. అంతేకాదు దీనిపై స్పందించాల్సిందిగా వ్యాపారవేత్తలు ముకేశ్ అంబానీ, టెక్ దిగ్గజాలు గూగుల్, ఉబెర్, అమెజాన్, ఫేస్బుక్ అధిపతులకు విజ్ఞప్తి చేశారు. 'టెక్అగైన్‌స్ట్ ఫాసిజం' అనే పేరుతో ప్రచురించిన లేఖలో ఫాసిస్ట్ భారత ప్రభుత్వ చర్యల్ని టెకీలుగా తీవ్రంగా నిరసించారు. పౌరులపై క్రూరత్వాన్ని ఆపాలని, ఇష్టానుసారం ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు సాంకేతిక పరిజ్ఞానం మంచి కోసం ఉపయోగించాలి తప్ప, ప్రభుత్వం అణచివేతకు వినియోగించడాన్నినిరాకరించాలని కోరారు. సీఏఏ 2019, ఎన్ఆర్సీ ముస్లింలకు వ్యతిరేకమైన పథకాలనీ, ప్రపంచవ్యాప్తంగా వారి పట్ల మరింత అసమానతలకు దారితీస్తుందని లేఖలో పేర్కొన్నారు. భారత ప్రభుత్వ తన అసమర్థతను కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తోందనీ, భారతదేశ ఆర్థిక క్షీణత, రికార్డు స్థాయిలో నిరుద్యోగం, వృద్ధి మందగమనం, తీవ్రమైన రైతు ఆత్మహత్యల తోపాటు దేశంలోని అతిపెద్ద సామాజిక-ఆర్థిక సంక్షోభాలపై "అల్ట్రా-నేషనలిస్ట్,డైవర్షనరీ వ్యూహాలను ప్రభుత్వం అవలంబిస్తోందని మండిపడ్డారు. పౌరులు,ఆందోళనకారులపై ప్రభుత్వ అణచివేతను, దమనకాండను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అలాగే భారత ప్రభుత్వ ఫాసిస్ట్ చర్యలను బహిరంగంగా ఖండించాలని సుందర్ పిచాయ్ (ఆల్ఫాబెట్), సత్య నాదెళ్ల (మైక్రోసాఫ్ట్), మార్క్ జుకర్‌బర్గ్ (ఫేస్బుక్), జాక్ డోర్సే (ట్విటర్), దారా ఖోస్రోషాహి (ఉబెర్), ముకేశ్ అంబానీ (జియో), గోపాల్ విట్టల్ (భారతి ఎయిర్టెల్), కళ్యాణ్ కృష్ణమూర్తి (ఫ్లిప్‌కార్ట్),శాంతను నారాయణ్ (అడోబ్)కు విజ్ఞప్తి చేశారు. ఒకవైపు డిజిటల్ ఇండియా అంటూ గొప్పగా ప్రచారం చేస్తూ, మరోవైపు తిరోగమన ప్రభుత్వం ఇంటర్నెట్ను పౌరులకు దూరం చేస్తూ వారిని అణచివేయడానికి ఒక రాజకీయ సాధనంగా చూస్తోందనీ, అన్ని నెట్‌వర్క్‌లను నకిలీ వార్తల వ్యాప్తికి ఉపయోగించుకుంటోందని విమర్శించారు. శాన్ఫ్రాన్సిస్కో, సియాటెల్, లండన్, ఇజ్రాయెల్, బెంగళూరులలో పనిచేస్తున్న దాదాపు 150 మంది టెక్ ఉద్యోగులు ( సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, పరిశోధకులు, ఎనలిస్టులు, డిజైనర్లు )ఈ లేఖపై సంతకాలు చేశారు. -
అమెరికాలో తెలుగు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
కురబలకోట(చిత్తూరు జిల్లా): అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్న చిత్తూరు జిల్లాకు చెందిన గుమ్మడికాయల ద్వారకానాథరెడ్డి(38) గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సమాచారం శుక్రవారం కుటుంబ సభ్యులకు అందింది. కుటుంబంలో మనస్పర్థల వల్లే అతడు బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లా కురబలకోట మండలం మట్లివారిపల్లెకు చెందిన ద్వారకానాథరెడ్డికి చిన్నతనంలోనే తండ్రి జయచంద్రారెడ్డి చనిపోయారు. తల్లి రమణమ్మ కష్టపడి చదివించింది. బీఎస్సీ కంప్యూటర్స్ చేసిన ద్వారకానాథరెడ్డి బెంగళూరులో సాఫ్ట్వేర్ కోర్సులు అభ్యసించాడు. హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తుండగా, గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన మరో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కల్యాణితో పరిచయమైంది. అది ప్రేమకు దారితీసింది. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వారికి ధృవన్, యువన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 12 ఏళ్ల క్రితం ద్వారకనాథరెడ్డికి అమెరికాలోని అమెజాన్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ విభాగంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది. అతడి భార్య కల్యాణి కూడా అక్కడే మరో కంపెనీలో పనిచేస్తున్నారు. న్యూజెర్సీ ప్రాంతంలో కాపురం ఉంటున్నారు. సజావుగా సాగుతున్న వీరి కాపురంలో కొన్నాళ్లుగా కలతలు రేగినట్లు వారి బంధువుల ద్వారా తెలిసింది. భర్త నుండి విడిపోడానికి కల్యాణి విడాకులు కోరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అతడు మనస్తాపానికి గురై, న్యూజెర్సీలోని ఓ హోటల్లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందింది. కాగా, గుమ్మడికాయల ద్వారకానాథరెడ్డి మృతదేహాన్ని అమెరికా నుంచి రప్పించడానికి కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
పాపం టెకీ.. మతిస్థిమితం కోల్పోయి..
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లో మతిస్థిమితం లేని ఓ యువకుడు హల్చల్ చేశాడు. శుక్రవారం తెల్లవారుజామున బంజారాహిల్స్‌రోడ్ నెంబర్ 3లోని టీవీ–9 చౌరస్తాలో ఓ యువకుడు దుస్తులులేకుండా న్యూసెన్స్‌కు పాల్పడుతూ రాళ్లతో అటునుంచి రాకపోకలు సాగిస్తున్నవారిపై దాడి చేశాడు. అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పెట్రోలింగ్ కార్–2 వాహనం అక్కడకు చేరుకుంది. పోలీసులు వాహనంచూడగానే ఆ యువకుడు మరింత రెచ్చిపోయి రాళ్లతో కారు అద్దాలను ధ్వంసం చేశాడు.దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆ యువకుడిని అదుపులోకి తీసుకునేందుకు అటు పోలీసు, ఇటు అక్కడ నుంచివెళుతున్న వాహనదారులు, పాదచారులు ప్రయత్నించగా వారిపై రాళ్లతో దాడి చేసేందుకు యత్నించాడు. ఎట్టకేలకు పోలీసులు బాధిత యువకుడిని అదుపులోకి తీసుకుని ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయానికి పంపించారు. ఆరా తీయగా ఆ యువకుడి పేరు అక్షయ్(25)గా గుర్తించారు. తిరుమలగిరిలో నివాసముండే అక్షయ్ హైటెక్ సిటీలోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తుంటాడని ఎప్పటిలాగే గురువారం రాత్రి 7 గంటలకు తిరుమలగిరిలో క్యాబ్ ఎక్కి డ్యూటీకి వెళ్లాడని తండ్రి వెల్లడించాడు. అయితే తెల్లవారు ఉదయం 7 గంటలకు ఇంటికి చేరాల్సివుంది. ఎంతకూ రాకపోయేసరికి ఆందోళనచెందిన కుటుంబసభ్యులు వెతుకుతుండగానే బంజారాహిల్స్‌లో బట్టలు విప్పేసి నగ్నంగా రోడ్డుపై తిరుగుతూ బీభత్సం సృష్టిస్తున్నట్లు సమాచారం అందింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అక్షయ్‌కి నాలుగేళ్ల క్రితం పెళ్లి జరిగిందని, ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారని కుటుంబసభ్యులు తెలిపారు. ఇలా ఎందుకు తయారయ్యాడో తమకు అంతుపట్టడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తానికి రెండు గంటల పాటు బంజారాహిల్స్ రహదారిపై అక్షయ్ చేసిన న్యూసెన్స్‌తో స్థానికంగా ఉద్రిక్తత ఏర్పడింది. -
మీరు హాస్టల్లో ఉంటున్నారా? కచ్చితంగా చదవండి!!
-
మీరు హాస్టల్లో ఉంటున్నారా? కచ్చితంగా చదవండి!!
సాక్షి, హైదరాబాద్: అంతా యంగ్ అండ్ ఎనర్జిటిక్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు.. సైబర్ నేరాలపై పూర్తి అవగాహన ఉన్నవాళ్లు. ఎవరైనా ఫోన్ చేసి బంపర్ లాటరీ తగిలిందనో.. బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాం ఓటీపీ చెప్పండనో అడిగితే అడిగిన వాళ్ల తాట తీసేంత టెక్నాలజీ తెలిసిన వాళ్లు. కానీ సైబర్ నేరాలకు బాధితులుగా మారారు. తమ ప్రమేయం లేకుండా లక్షల రూపాయలు పోగొట్టుకొని ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు.. అసలు వాళ్లు ఎలా మోసపోతున్నారు. సిటీల్లో మొదలైన ఈ కొత్తతరహా మోసాన్ని హాస్టళ్ల జీవితాలు గడిపే వాళ్లంతా కచ్చితంగా చూసి తీరాలి. మీరు హాస్టల్లో ఉంటున్నారా..? అయితే మీకు మాత్రమే విడిగా రూమ్ ఉండేలా చూసుకోండి. పొరపాటున కూడా మరొకరితో రూమ్ షేర్ చేసుకోకండి. ఒకవేళ రూమ్ షేర్ చేసుకోకతప్పకపోతే మీరూ బాధితులు కావొచ్చు ఈ కార్తీక్ లాగా... ! చెన్నైకి చెందిన కార్తిక్ హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. మూడేళ్లుగా మాదాపూర్‌లోని సెరెన్ హాస్టల్ లో ఉంటున్నాడు. అది షేరింగ్ రూమ్. ఈ నెల 17న కార్తీక్ ఉంటున్న హాస్టల్ రూమ్ లో పక్కబెడ్ పై ఓ కుర్రాడు వచ్చి స్టే చేసి వెళ్లిపోయాడు. అతను వెళ్లిన తర్వాత కార్తీక్ ఫోన్లోని సిమ్ కార్డు పని చెయ్యలేదు. ఫోన్ తీసి చూస్తే సిమ్ కార్డ్ కరెక్టుగానే ఉంది. కానీ ఎందుకు వర్క్ చెయ్యలేదో అర్థం కాలేదు. కార్తీక్ దగ్గర మనీ వాలెట్.. క్రెడిట్, డెబిట్ కార్డ్స్ అన్నీ ఉన్నాయ్.. జస్ట్ ఫోన్ పని చెయ్యలేదంతే. వెంటనే మొబైల్ రిపేర్ షాప్‌కి వెళ్లాడు.. అప్పుడు తెలిసింది తాను ఆ సిమ్ కార్డు పనిచెయ్యని కారణంగా ఏకంగా రెండు లక్షల రూపాయలు మోసపోయినట్లు.. సిమ్ కార్డు ఎందుకు పనిచెయ్యలేదు? సిమ్ కార్డుకూ పోయిన డబ్బుకీ ఏంటి సంబంధం? కార్తీక్ ఫోన్లో సిమ్ కార్డ్ ఉంది. కానీ అది అసలైనది కాదు. డమ్మీ సిమ్. సైబర్ కేటుగాడు హాస్టల్లో స్టే చేసిన రెండు రోజులు కార్తిక్‌పై నిఘా ఉంచాడు. కార్తిక్ నెట్ బ్యాంకింగ్ వాడుతున్నాడని గమనించాడు. హాస్టల్ ఖాళీ చేసి రోజు రాత్రి.. కార్తీక్ మొబైల్ లోని సిమ్ దొంగలించాడు. వాలెట్లోని డెబిట్, క్రిడిట్ కార్డులను ఫోటో తీసుకున్నాడు. వెళ్తూ వెళ్తూ కార్తిక్ ఫోన్‌ను నీళ్లలో పడేసి..పనిచేయకుండా చేసాడు. కార్తిక్ సిమ్ ఉపయోగించి...నెట్ బ్యాంకింగ్ ద్వారా రెండు రోజుల్లోనే రెండు లక్షలు కాజేశాడు. హాస్టల్లో ఉన్న సీసీటీవీలో నిందితుడిని పోలీసులు గుర్తించారు. హాస్టల్ నిర్వాహకులు అతని నుండి ఎటువంటి ధ్రువీకరణ పత్రాలు తీసుకోలేదని తెలిసింది. నిందితుడు ప్లాన్ ప్రకారం ఇటువంటి నేరాలకు పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. మొబైల్ లొకేషన్ ద్వారా సైబర్ కేటుగాన్ని త్వరలోనే పట్టుకుంటామని చెబుతున్నారు. ఇలాంటి హాస్టల్ మోసాలు సిటీల్లో ఎక్కువగా జరుగుతున్నాయి. డబ్బుకు కక్కుర్తి పడే హాస్టళ్ల నిర్వాహకులు ఎలాంటి ఐడీ కార్డులూ తీసుకోకుండా హాస్టళ్లలోకి ఇలాంటి నేరస్తులను రానివ్వడం వల్ల చాలా మంది విద్యార్థులు, ఉద్యోగులు లక్షల రూపాయల సొమ్ము పోగొట్టుకొని సైబర్ క్రైమ్ పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే కొన్ని సార్లు నిందితుల్ని పట్టుకుంటున్నా డబ్బు రికవరీ మాత్రం అసాధ్యంగా మారింది. అందుకే ఎప్పుడూ అలర్ట్‌గా ఉండటం మన బాధ్యతనని పోలీసులు చెబుతున్నారు. -
ఉరిశిక్ష అమలులో జాప్యం, సంచలన తీర్పు
సాక్షి,ముంబై : టెకీ కిడ్నాప్, అత్యాచారం, హత్య కేసులో బాంబేహైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. హత్య కేసులో దోషులుగా తేలిన వారి ఉరిశిక్ష అమలు ఆలస్యమైన కారణంగా దోషుల శిక్షను 35 ఏళ్ల కారాగార శిక్షగా మారుస్తూ తీర్పునిచ్చింది. తమకు విధించిన మరణశిక్షను అమలు చేయడంలో తీవ్రజాప్యం జరిగిందని, ఇది తమ ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అని, ఈ నేపథ్యంలో తమకు విధించిన శిక్షను మార్చాలని కోరుతూ దోషులు పురుషోత్తమ్ బొరాటే, ప్రదీప్ కోకడే కోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్‌ను విచారించిన బొంబాయి హైకోర్టు ఇద్దరికీ 35 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ సోమవారం తీర్పునిచ్చింది. 12 ఏళ్ల నాటి ఈ కేసు వివరాలు : నవంబర్ 1, 2007 టెక్ దిగ్గజం విప్రోకు చెందిన బీపీవో కంపెనీలో పనిచేస్తున్న 22 ఏళ్ల మహిళా ఉద్యోగి, విధుల నిమిత్తం క్యాబ్‌లో వెళ్తుండగా, ఆమెను కిడ్నాప్ చేసిన క్యాబ్ డ్రైవర్ పురుషోత్తం, అతని అనుచరుడు ప్రదీప్ కలిసి అత్యాచారం చేసి అతిదారుణంగా చంపేసారు. కనీసం గుర్తుపట్టలేని విధంగా ముఖాన్ని ఛిద్రం చేసి, పొదల్లో విసిరిపారేశారు. ఈ కేసులో వీరిని అరెస్టు చేసిన స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక సెషన్సు కోర్టులో విచారణ అనంతరం 2012 మార్చిలో వీరికి కోర్టు మరణ శిక్ష విధించగా, బాంబే హైకోర్టు, అనంతరం 2015 మే లో సుప్రీంకోర్టు కూడా ఈ శిక్షను సమర్ధించాయి. అలాగే దోషులు పెట్టుకున్న క్షమాపణ పిటిషన్‌ను 2016లో మహారాష్ట్ర గవర్నర్ తోసిపుచ్చగా, 2017లో రాష్ట్రపతి కూడా తిరస్కరించారు. ఈ నేపథ్యంలో జూన్ 24 ను వీరికి శిక్ష అమలు చేయాల్సిందిగా 2019 ఏప్రిల్10 న వారెంట్ జారీ చేసింది . అయితే ఇక్కడే ఈ కేసులో కీలక మలుపు తిరిగింది. ఉరిశిక్షను అమలు చేయడంలో 1,509 రోజులు (50 నెలలకు మించి) ఆలస్యం జరిగిందని, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌ను ఉల్లంఘించి, ఏడు సంవత్సరాల పాటు పూణేలోని యరవాడ సెంట్రల్ జైలులో తమని అక్రమంగా నిర్బంధించారంటూ దోషులు ఈ ఏడాది మే నెలలో కోర్టును ఆశ్రయించారు. తమకు ఉరిశిక్షనుంచి మినహాయింపునించి, శిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాల్సిందిగా కోరారు. దీంతో తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఉరిశిక్ష షెడ్యూల్ ప్రకారం జరగకూడదని హైకోర్టు జూన్ 21 ఆదేశించింది. ఉరిశిక్షలపై స్టే విధించిన అనంతరం వీరి వాదనలను పరిశీలించిన జస్టిస్ భూషణ్, జస్టిస్ స్వాప్నా జోషితో కూడిన బెంచ్ శిక్షను అమలు జాప్యంతోపాటు, ఇప్పటివరకు వారు జైలులో గడిపిన కాలాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని, శిక్షను 35 సంవత్సరాల కారాగార శిక్షగా మారుస్తూ తాజా తీర్పును వెలువరించింది. -
‘ఫన్ మొదలైంది.. త్వరలోనే కలుస్తాను శ్రీలంక’
కొలంబో : అమెరికాకు చెందిన ఓ టెకీ శ్రీలంక బాంబు పేలుళ్లలో చనిపోవడానికి ముందు తన ఫేస్బుక్లో పోస్ట్ చేసిన చివరి మెసేజ్ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. డైటర్ కోవల్స్కి(40) అనే వ్యక్తి బ్రిటన్‌కు చెందిన విద్యా, ప్రచురణ సంస్థ పియర్సన్‌లో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గత శుక్రవారం ఆఫీస్ పని నిమిత్తం శ్రీలంక బయలుదేరాడు. ప్రయాణం ప్రారంభం కావడానికి ముందు డైటర్ తన ఫేస్బుక్లో ‘ఫన్ మొదలైంది. వర్క్ ట్రిప్స్‌ని నేను చాలా ఇష్ట పడతాను. 24 గంటల ప్రయాణం. శ్రీలంక.. త్వరలోనే నిన్ను చూస్తాను’ అంటూ పోస్ట్ చేశాడు. శ్రీలంకలో దిగిన తరువాత కంపెనీ తన కోసం రూమ్ బుక్ చేసిన హోటల్‌కు చేరుకున్నాడు. ఫోన్ చేసి ఈ విషయాన్ని సీఈవోకు తెలియజేశాడు. ఓ వారం రోజుల్లో పని ముగించుకుని తిరుగు ప్రయాణం అవుతానని తెలిపాడు డైటర్. కానీ ఆదివారం జరిగిన బాంబు పేలుళ్లలో అతను మృతి చెందాడు. ఈ విషయం గురించి ఆ కంపెనీ సీఈవో మాట్లాడుతూ.. ‘డైటర్ ఎప్పుడూ తాను నవ్వుతూ ఉండటమే కాక.. తన చుట్టూ ఉండే వారిని కూడా సంతోషంగా ఉంచుతాడు. అతని మంచితనం వల్ల ఎక్కడి వెళ్తే అక్కడ కొత్త స్నేహితులను తయారవుతుంటారు. ఎలాంటి సమస్యనైనా ఓర్పుతో పరిష్కరిస్తాడు. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడానికి డైటర్ కొలంబో వెళ్లాడు. అక్కడ ఓ వారం రోజుల పాటు ఉండి.. తన స్థానిక స్నేహితులతో కలిసి ఈ సమస్యలను పరిష్కరించాలనుకున్నాడు. కానీ దుష్టులు చేసిన దాడిలో చాలా మంది అమాయకుల్లానే డైటర్ కూడా కన్ను మూశాడు. డైటర్ లాంటి వారు కొత్తవి సృష్టించడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ ఉగ్రదాడికి పాల్పడిని వారికి కేవలం నాశనం చేయడం మాత్రమే తెలుసు’ అంటూ సదరు సీఈవో విషాదం వ్యక్తం చేశారు. -
నెల్లూరుకు చెందిన విప్రో టెకీ దుర్మరణం
బెంగళూరు: టెక్ సేవల సంస్థ విప్రోలో మరో ఉద్యోగి ఆకస్మిక మరణం విషాదాన్ని రేపింది. ఇటీవల తల్లిదండ్రులకు వీడ్కోలు పలికేందుకు వచ్చి, కదులుతున్న రైలు దిగబోయి విప్రో టెకీ ఒకరు మరణించిన విషాద ఘటన మరువక ముందే మరో దుర్ఘటన చేసుకుంది. చెన్నైనుంచి బెంగళూరుకు వస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ కిరణ్‌కుమార్ కదులుతున్న రైల్లోంచి దిగబోతూ ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయారు. కెఆర్ పురం రైల్వేస్టేషన్లో గురువారం తెల్లవారుఝామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన కిరణ్‌కుమార్(38) ఈ మధ్యనే స్విట్జర్లాండ్ నుంచి ఇండియాకు తిరిగి వచ్చారు. ప్రస్తుతం ఆయన బెంగళూరులోని రామమూర్తి నగర్లో ఉంటున్నారు. అయితే తన మూడు నెలల కుమారుడిని చూసేందుకు నెల్లూరు వచ్చిన కిరణ్ అనంతరం చెన్నై మెయిల్ ఎక్స్‌ప్రెస్‌లో బెంగళూరుకు బయలుదేరారు. కెఆర్‌పురం స్టేషన్లో స్టాప్ లేక పోయినప్పటికీ, త్వరగా ఇంటికి చేరాలనే ఆతృతలో రైలు కొద్దిగా స్లో కావడంతో దిగేందుకు ప్రయత్నించారు. అయితే అదుపు తప్పి, ప్లాట్‌ఫాం, ట్రాక్‌నకు మధ్యలో ఇరుక్కుపోయి చనిపోయారు. తీవ్ర గాయాలతో కిరణ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడని పోలీసు అధికారి సత్యప్ప ధృవీకరించారు. కాగా గత నెల డిసెంబరులో విప్రో ఉద్యోగి, కేరళకు చెందిన విక్రం విజయన్ (28) కదులుతున్న రైలునుంచి దిగడానికి ప్రయత్నించి ప్రాణాలు కోల్పోగా, గత ఏడాది ఫిబ్రవరిలో ఇదే రైల్వే స్టేషన్లో కదులుతున్న రైలు నుంచి దిగబోతూ ఈశ్వరమ్మ(65) చనిపోయారు. -
నడుస్తున్న కారులో మంటలు : టెకీ మృతి
నోయిడాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న పవన్ (45) కారులో చెలరేగిన మంటల్లో చిక్కుకొని మరణించారు. రాత్రి షిప్ట్ ముగించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకుంది. దీంతో మరికొద్ది క్షణాల్లో ఇంటికి చేరాల్సిన ఆయన కారునుంచి బయటకు రాలేక ప్రాణాలు విడిచారు. మంగళవారం తెల్లవారు ఝామున ఈ విషాదం చోటు చేసుకుంది. అప్పటివరకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన పవన్ ఇకలేరన్నవార్తను, కుటుంబ సభ్యులు. సన్నిహితులు నమ్మలేకపోతున్నారు. గ్రేటర్ నోయిడా పొలీసు ఉన్నతాధికారి నిశాంత్ శర్మ అందించిన సమాచారం ప్రకారం హిమాచల్ ప్రదేశ్‌లోని అంబాకు చెందిన పవన్ ఒక ప్రయివేటు కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నారు. సోమవారం నైట్‌షిప్ట్ అనంతరం తిరిగి ఇంటికి వస్తుండగా పవన్ ప్రయాణిస్తున్న ఫోర్డ్ ఐకాన్ కారులో మంటలంటుకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేటప్పటికే బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్నిస్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. అయితే కారు నెంబరు ఆధారంగా మృతుడిని గుర్తించిన అధికారులు బంధువులకు సమాచారం అందించారు. షార్ట్ సర్క్యూట్, బ్లోవర్ సమస్యలు ప్రమాదానికి కారణం కావచ్చని ప్రాథమికంగా భావిస్తున్నామన్నారు. అయితే దర్యాప్తు కొనసాగుతోందని నిశాంత్ శర్మ చెప్పారు. ఉదయం 5గంటల వరకు క్రిస్మస్ స్నేహితులకు, బంధువులకు శుభాకాంక్షలు అందించినట్టు తెలుస్తోందనీ, అయితే అకస్మాత్తుగా మంటలంటుకోవడంతో వాహనం నుండి బయటికి రాలేక పవన్ చనిపోయారని మరో పోలీసు అధికారి రామ్‌పాల్ తోమార్ చెప్పారు. -
‘నీ భర్త తప్పేం లేదు.. ఈ లోకం అలాగే చూస్తుంది’
నోయిడా : తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం తట్టుకోలేని ఓ టెకీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నోయిడాలోని సెక్టార్ 137లో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. స్వరూప్ రాజ్(35) అనే టెకీ ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నాడు. కాగా ఇటీవల మీటూ ఉద్యమం ఉధృతమైన నేపథ్యంలో స్వరూప్ తమను లైంగికంగా వేధించాడంటూ ఇద్దరు సహోద్యోగినులు అతడిపై ఆరోపణలు చేశారు. దీంతో కంపెనీ యాజమాన్యం అతడిని తాత్కాలికంగా విధుల నుంచి తప్పించింది. ఈ నేపథ్యంలో మానసిక వేదనకు గురైన స్వరూప్ తన ఫ్లాట్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన అతడి భార్య పోలీసులకు సమాచారం అందించింది. అతడి శవం వద్ద సూసైడ్ నోట్ లభ్యమైనట్లు పోలీసులు పేర్కొన్నారు. నీ భర్త తప్పు చేయలేదు... ‘నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. మా కంపెనీలో ఇద్దరు మహిళలు నాపై నిందలు మోపారు. అయితే ఏదో ఒకరోజు అవి నిందలు మాత్రమే అనే విషయం నీతో పాటు ప్రపంచానికి కూడా తెలుస్తుంది. అయినా నాకు నీతో, మన రెండు కుటుంబాలతో తప్ప ఎవరేమనుకున్నా సంబంధం లేదు. ఒకవేళ నేను నిర్దోషినని తెలిసినా సరే ఎంతో కొంత అనుమానం మీలో గూడు కట్టుకుని ఉంటుందని తెలుసు. అది నేను భరించలేను. అందుకే వెళ్లిపోతున్నా. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకో నీ భర్త ఎలాంటి తప్పు చేయలేదు. కానీ ఈ ప్రపంచం నన్ను ఎప్పుడూ అలాగే చూస్తుంద’ని స్వరూప్ తన భార్యను ఉద్దేశించి సూసైడ్ నోట్లో పలు విషయాలు రాసుకొచ్చాడు. -
తివారి హత్య: కీలకంగా పోస్ట్‌మార్టమ్ నివేదిక, ప్రత్యక్ష సాక్షి
లక్నో : బుల్లెట్ కారణంగా గాయపడిన ఆపిల్ కంపెనీ ఉద్యోగి వివేక్ తివారి సరైన సమయంలో చికిత్స అందలేదు కాబట్టే మృతి చెందాడని పోస్ట్‌మార్టమ్ నివేదిక వెల్లడించింది. కాల్పుల్లో గాయపడిన తర్వాత 55 నిమిషాల పాటు వివేక్ ప్రాణాలతోనే ఉన్నాడని పేర్కొంది. కాగా బూటకపు ఎన్కౌంటర్ వల్లే వివేక్ మరణించాడని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో పోస్ట్‌మార్టమ్ నివేదిక, ఈ ఘటనలో ప్రత్యక్ష సాక్షి వెల్లడించిన విషయాలు కీలకంగా మారాయి. ఈ ఘటనలో ప్రత్యక్షసాక్షి అప్సా ఖాన్(పేరు మార్చాం) తెలిపిన వివరాలు ఆమె మాటల్లోనే.. ‘కాల్పులు జరిగిన తర్వాత తివారి తన కారును నడుపుకొంటూ సుమారు 300 మీటర్లు ప్రయాణించాడు. ఆ తర్వాత షాహిద్ పాత్‌లోని అండర్‌పాస్ పిల్లర్‌ను ఢీకొన్నాడు. అప్పటివరకు అతడిని వెంబడించిన కానిస్టేబుల్లు ప్రశాంత్ చౌధురి, సందీప్ కుమార్ మాయమయ్యారు. ఆ తర్వాత పోలీసు పెట్రోలింగ్ వాహనం వచ్చింది. అయితే వారు అంబులెన్స్ కోసం ఫోన్ చేశారు. చాలా సేపటివరకు ఎదురుచూశారు. అంబులెన్స్ రాకపోవడంతో ఓ కారులో అతడిని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. నిజానికి ఆ సమయంలో కేవలం పది నిమిషాల్లో ఆస్పత్రికి చేరుకోవచ్చు. అయితే ఆస్పత్రికి తీసుకువెళ్లిన తర్వాత కూడా తివారి చికిత్సపై కాకుండా.. కేవలం నా సాక్ష్యాన్ని రికార్డు చేయడంలోనే వారు దృష్టి కేంద్రీకరించారు’. 55 నిమిషాల పాటు బతికే ఉన్నాడు.. శుక్రవారం ప్రశాంత్ చౌధురి అనే కానిస్టేబుల్ జరిపిన కాల్పుల్లో టెకీ వివేక్ తివారి మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే అర్ధరాత్రి 1. 45 నిమిషాల ప్రాంతంలో తివారిపై దాడి జరగగా అతడిని 2.05 నిమిషాలకు ఆస్పత్రిలో చేర్చారు. తీవ్ర గాయాలపాలైన అతడు 2.25 నిమిషాలకు ప్రాణాలు కోల్పోయాడు. అయితే గాయపడినప్పటి నుంచి మృతి చెందేవరకు సుమారు 55 నిమిషాల పాటు తివారి ప్రాణాలతో ఉన్నాడని పోస్ట్‌మార్టమ్ నివేదిక పేర్కొనడం, ప్రత్యక్ష సాక్షి చెప్పిన వివరాలను బట్టి చూస్తుంటే కేవలం పోలీసుల నిర్లక్ష్య వైఖరి కారణంగానే వివేక్ మృతిచెందాడనే విమర్శలకు బలం చేకూరుతోంది. కాగా ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపానని ప్రశాంత్ చౌధురి చెబుతుండగా... ఇది ప్రభుత్వ హత్యే అంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీంతో గత కొన్ని రోజులుగా ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ దుమారం రేగుతోంది. దీంతో ఈ ఘటనపై సిట్‌తో విచారణ జరిపిస్తామని సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. -
తివారి హత్య : భార్యకు ప్రభుత్వ ఉద్యోగం
లక్నో : పోలీస్ కాల్పుల్లో మరణించిన ఆపిల్ సంస్థ ఉద్యోగి వివేక్ తివారి కుటుంబాన్ని ఆదుకోవడానికి యూపీ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇందులో భాగంగా వివేక్ భార్య కల్పన తివారికి మున్సిపల్ కార్పోరేషన్లో ఉద్యోగం ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయం గురించి మున్సిపల్ కమిషనర్ ఇంద్రమణి త్రిపాఠి మాట్లాడుతూ.. ‘ప్రభుత్వ ఆదేశాల మేరకే మేం వికేక్ తివారి భార్యకు ఉద్యోగం కల్పిస్తున్నాం. ఆమె పోస్ట్ గ్రాడ్యూయేట్ చదివింది. ఆమె అర్హతలకు తగిన ఉద్యోగాన్ని ఇస్తాము. ఇందుకోసం అవసరమైన సర్టిఫికెట్లు, ఫోటోలు, డాక్యుమెంట్స్ తీసుకున్నాం. అన్ని ఫార్మలిటీస్ పూర్తయ్యాయి. త్వరలోనే ఆమెను మున్సిపల్ కార్పొరేషన్‌లోని ఏదో ఒక డిపార్ట్మెంట్కి కేటాయిస్తాం’ అని తెలిపారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వివేక్ కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం అన్ని రకాలుగా వివేక్ కుటుంబాన్ని అదుకుంటుందని తెలిపారు. అంతేకకా వివేక్ మృతికి నష్ట పరిహారంగా ప్రభుత్వం తరుఫున నుంచి రూ. 25 లక్షల రూపాయలు అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సొమ్మును వివేక్ కూతుర్ల పేరున ఫిక్సిడ్ డిపాజిట్ చేస్తామన్నారు. -
తివారి హత్య; కానిస్టేబుల్ భార్యకు భారీ విరాళం!
లక్నో : ఆపిల్ ఉద్యోగి వివేక్ తివారి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న కానిస్టేబుల్ ప్రశాంత్ చౌధురి భార్య రేఖా మాలిక్ అకౌంట్లోకి రాత్రి రాత్రే అక్షరాలా ఐదు లక్షల రూపాయలు జమయ్యాయి. కేవలం 447 రూపాయలు మాత్రమే కలిగి ఉన్న తన అకౌంట్లోకి ఇంత పెద్ద మొత్తంలో డబ్బు వచ్చి చేరడంతో ఆమె ఆశ్చర్యానికి గురయ్యారు. వివరాలు.. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో వివేక్ తివారి అనే టెకీ ప్రశాంత్ చౌధురి జరిపిన కాల్పుల్లో మృతిచెందాడు. దీంతో తన భర్తను అన్యాయంగా బలి తీసుకున్నప్రశాంత్కు కఠిన శిక్ష పడాలంటూ వివేక్ భార్య కల్పనా తివారి డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో ఆత్మరక్షణ కోసమే తన భర్త కాల్పులు జరిపారని, ఆయన్ని అనవసరంగా కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రశాంత్ భార్య రాఖీ మాలిక్(పోలీసు కానిస్టేబుల్) ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తోటి ఉద్యోగి కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో వీర్ సింగ్ రాజు అనే మరో యూపీ కానిస్టేబుల్(ఫేస్బుక్ ప్రొఫైల్ ప్రకారం) ఫేస్బుక్ ద్వారా ఓ క్యాంపెయిన్ ప్రారంభించాడు. ‘ఈ విషయంలో మన సోదరులకు సీనియర్ పోలీసు అధికారులు ఏమాత్రం అండగా నిలవడం లేదు. కాబట్టి ప్రశాంత్ చౌధురి, సందీప్ రానాలకు మన వంతు సాయం చేయాలి. వారికి న్యాయం జరిగేలా చూడాలి’ అంటూ రాజు ఫేస్బుక్లో ఓ పేజీ క్రియేట్ చేశాడు. ‘సాయం చేయాలనుకుంటున్న వారు ఈ అకౌంట్లోకి మీకు తోచినంత డబ్బు జమచేయగలరు’ అని ప్రశాంత్ భార్య అకౌంట్ నంబరును షేర్ చేశాడు. అయితే పోస్టు వైరల్‌గా మారడంతో ప్రశాంత్, సందీప్‌ల కుటుంబాలకు సాయం చేసేందుకు వేలాది మంది ముందుకొచ్చారు. ఎవరికి తోచినంత వారు సాయం చేయడం మొదలు పెట్టారు. దీంతో రేఖా మాలిక్ అకౌంట్లోకి 5 లక్షల 28 వేల రూపాయలు వచ్చి చేరాయి. కాగా వివేక్ తివారి హత్యతో ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ దుమారం రేగుతోంది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. తాను రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించడం కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేశానని యోగి వాదిస్తున్నారు. -
టెకీ మృతిపై బెహన్ స్పందన ఇలా..
లక్నో : యాపిల్ ఎగ్జిక్యూటివ్ వివేక్ తివారీ మృతి కేసులో బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో జాప్యం జరగడం పట్ల బీఎస్పీ అధినేత్రి మాయావతి యోగి సర్కార్‌పై మండిపడ్డారు. ప్రభుత్వ తీరుతో యూపీలో శాంతిభద్రతల వ్యవస్థ కుప్పకూలినట్టు కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘తాను ముఖ్యమంత్రినైతే ముందుగా టెకీ హత్యకు బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకుని, ఆ తర్వాతే బాధిత కుటుంబానికి భరోసా ఇస్తానని, యూపీ సీఎం తరహాలో అందుకు భిన్నంగా వ్యవహరించబో’నని ఆమె స్పష్టం చేశారు. లక్నోలోని గోమతి ప్రాంతంలో శనివారం రాత్రి మహిళా సహోద్యోగితో కలిసి కారులో వెళుతున్న వివేక్ తివారీ (38)పై పోలీస్ కానిస్టేబుల్ కాల్పులు జరపగా, విండోనుంచి దూసుకెళ్లిన బుల్లెట్ టెకీ ప్రాణాలను బలిగొంది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్ట్ చేశారు. టెకీ మృతిపై విపక్షాల నుంచి యోగి సర్కార్‌పై ముప్పేట దాడి తీవ్రమైంది. మరోవైపు బాధితుడి కుటుంబ సభ్యులు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ను కలుసుకున్నారు. ప్రభుత్వం వారికి అన్ని విధాలా సాయం చేస్తుందని ఈ సందర్భంగా సీఎం వారికి భరోసా ఇచ్చారు. -
ఆపిల్ ఉద్యోగి హత్యకు ఎవరు బాధ్యులు?
లక్నో : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయో పోలీసు కాల్పుల్లో ఆపిల్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగి వివేక్ తివారి మరణించిన సంఘటన సూచిస్తోంది. శనివారం తెల్లవారు జామున రెండు గంటల ప్రాంతంలో జరిగిన ఈ సంఘటనపై ప్రస్తుతం రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఈ సంఘటనకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుండగా, తాను రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, తాను సకాలంలో స్పందించి జరిగిన సంఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించడం కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేశానని యోగి వాదిస్తున్నారు. మరోపక్క తన భర్తను అన్యాయంగా పొట్టన పెట్టుకున్న పోలీసులను కఠినంగా శిక్షించాలని కోరుతూ వివేక్ తివారి భార్య కల్పనా తివారి ఆదివారం రెండో ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఆత్మరక్షణ కోసమే తన భర్త కాల్పులు జరిపారని, ఆయన్ని అనవసరంగా కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ విషయంలో కౌంటర్ ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి తనకూ అవకాశం ఇవ్వాలని పోలీసు కానిస్టేబుల్ ప్రశాంత్ చౌధరి భార్య రాఖీ మాలిక్ డిమాండ్ చేస్తున్నారు. ఆమె కూడా పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. కారు మీదకు దూసుకరావడంతో కాల్పులు జరపాల్సి వచ్చిందని కానిస్టేబుల్ ప్రశాంత్ చౌధరి చెబుతున్నారు. కారు దూసుకొస్తే కాల్పులు జరపాల్సిన అవసరం ఎందుకొస్తుందన్న ప్రశ్నకు ఆయన నుంచి సరైన సమాధానం రావడం లేదు. ‘అనుమానంతోని ఎవరినైనా చంపేయడానికి ఇదేమన్న జమ్మూ కశ్మీరా?’ అని వివేక్ తివారి బావమరిది మీడియాతో వ్యాఖ్యానించారు. ‘ఎంతో విశ్వాసంతో బీజేపీ ప్రభుత్వాన్ని మేము ఎన్నుకున్నాం. ఆ తర్వాత యోగిని ముఖ్యమంత్రిని చేస్తున్నారంటే మరెంతో సంతోషించాం. అందుకు ప్రభుత్వం నా భర్తను పొట్టన పెట్టుకుంటుందని అనుకోలేదు’ అని కల్పనా తివేరి మీడియా ముందు తన ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మాటల్లో కచ్చితమైన అంతరార్థం ఉంది. ఆమె భర్త చావుకు యోగి ప్రభుత్వం ప్రత్యక్షంగా కారణం కాకపోయినా, పరోక్షంగా కారణమైంది. యోగి ప్రభుత్వం హయాంలో దాదాపు 1400 బూటకపు ఎన్కౌంటర్లు జరగ్గా, వాటిల్లో 60 మందికిపైగా మరణించారు. తొలి 10 నెలల్లోనే 921 ఎన్కౌంటర్లు యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలి పది నెలల కాలంలోనే అంటే, 2017, ఏప్రిల్ నెల నుంచి 2018, ఫిబ్రవరిలోగా రాష్ట్రంలో 921 ఎన్కౌంటర్లు జరిగాయి. వీటిల్లో 33 మంది మరణించారు. వీటిపై సమాధానం ఇవ్వాల్సిందిగా జాతీయ మానవ హక్కుల కమిషన్ యోగి ప్రభుత్వానికి నోటీసు కూడా జారీ చేసింది. ఇదే కాలంలో 365 లాకప్ మరణాలు చోటుచేసుకున్నాయి. యోగి ఆదిత్యనాథ్ అండదండలు, ఆశీర్వాదంతో రాష్ట్రంలో పోలీసులు తమ ఇష్టా రాజ్యంగా చెలరేగిపోతున్నారంటూ ప్రతిపక్షాలు ఆది నుంచి గొడవ చేస్తున్నాయి. ఈ బూటకపు ఎన్కౌంటర్లకు స్వస్తి చెప్పాలంటూ కూడా డిమాండ్ చేశాయి. ఆపే ప్రసక్తే లేదన్న యోగి ‘రాష్ట్రంలో 1200 ఎన్కౌంటర్లు జరగ్గా, వాటిల్లో 40 మంది నేరస్థులు మరణించారు. నేరస్థులను సమూలంగా నిర్మూలించేంత వరకు వీటిని ఆపే ప్రసక్తే లేదు’ అని 2018, ఫిబ్రవరి 14వ తేదీన శాసన మండిలిలో, జీరో అవర్‌లో యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే శనివారం తెల్లవారు జామున కారు ఆపమంటే ఆపలేదన్న కారణంగా ప్రశాంత్ చౌధరి నిర్ధాక్షిణ్యంగా కాల్పులు జరిపారు. ఈ సంఘటనను యోగితోపాటు పలువురు మంత్రులు ఖండించినప్పటికీ, ‘తూటాలు నేరస్థులకు మాత్రమే తగులుతాయి’ అంటూ కొందరు మంత్రులు సమర్థిస్తున్నారు. పోలీసు కాల్పుల్లో ఇంత వరకు సామాన్యులు, నిమ్న కులాల వారే మరణించడంతో వాటి గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు అగ్ర కులానికి చెందిన వ్యక్తే కాకుండా ఆపిల్ ఉద్యోగి అవడం వల్ల దుమారం రేగుతోంది. -
యోగిని కలిసిన టెకీ వివేక్ తివారీ కుటుంబ సభ్యులు
లక్నో : పోలీస్ కానిస్టేబుల్ చేతిలో హతమైన యాపిల్ ఎగ్జిక్యూటివ్ వివేక్ తివారీ కుటుంబ సభ్యులు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ను సోమవారం కలుసుకున్నారు. తమకు అన్నివిధాలా సాయం చేస్తామని సీఎం హామీ ఇచ్చారని, ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందనే విశ్వాసం ఉందని వివేక్ తివారీ భార్య కల్పనా తివారీ అన్నారు. తాము చెప్పింది సావధానంగా విన్న ముఖ్యమంత్రి తమకు సాయం చేస్తామని భరోసా ఇచ్చారని, ప్రభుత్వం పట్ల తమకు పూర్తి విశ్వాసం ఉందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రితో భేటీ అనంతరం ప్రభుత్వంపై తమ నమ్మకం రెండింతలైందన్నారు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారు ఆపనందుకు ఆగ్రహంతో శనివారం లక్నోలోని గోమతీపూర్ వద్ద పోలీస్ కానిస్టేబుల్ వివేక్ తివారీపై కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఘటన జరిగిన సమయంలో తివారీతో ప్రయాణిస్తున్న కొలీగ్ సనా ఖాన్ ఫిర్యాదు మేరకు ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్ట్ చేశారు.కాగా, బాధితుడి కుటుంబంతో సీఎం యోగి ఆదిత్యానాథ్ గతంలో ఫోన్లో మాట్లాడారు. ప్రభుత్వం అన్ని విధాలా బాధిత కుటుంబాన్ని ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. -
పెళ్లి: మతం మార్పించి.. మొహం చాటేశాడు!
మల్కాజిగిరి: ఓ యువతిని పెళ్లి పేరుతో మోసగించి ఏడు నెలలుగా తప్పించుకు తిరుగుతున్న నిందితుణ్ని ఎల్ఓసీ(లుక్ అవుట్ సర్టిఫికెట్) ద్వారా ఎయిర్‌పోర్టు అధికారులు అదుపులోకి తీసుకొని మల్కాజిగిరి పోలీసులకు అప్పగించారు. ఎస్హెచ్ఓ మన్మోహన్ కథనం ప్రకారం..దారుల్‌షిఫాకు చెందిన సఫ్దర్ అబ్బాస్ జైదీ(28) దుబాయిలో 2014 నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అంతకు ముందు 2012 నుంచి దుబాయికి వెళ్లే వరకు హైటెక్ సిటీ ప్రాంతంలో పనిచేశాడు. ఆ సమయంలో పరిచయమైన ఓ హిందూ యువతిని ప్రేమించాడు. అనంతరం దుబాయికి వెళ్లిన అబ్బాస్ కొన్ని రోజుల తర్వాత ఆ యువతిని కూడా అక్కడికి పిలిపించుకొని ఉద్యోగంలో చేర్చాడు. వివాహం చేసుకోవడానికి అబ్బాస్ తన తల్లితండ్రులను ఒప్పిస్తానని అందుకు మతం మారాలని నమ్మించి మత మార్పిడి చేయించాడు. అనంతరం వారిద్దరూ గతేడాది నగరానికి తిరిగి వచ్చారు. తల్లితండ్రులతో మాట్లాడానని ఏప్రిల్ 17న పెళ్లి, 28న రిసెప్షన్ ఏర్పాటు చేశామని ఫంక్షన్ హాల్ బుక్ చేసి ఆ యువతిని నమ్మించారు. జనవరిలో దుబాయికి వెళ్లిన అనంతరం అబ్బాస్ ఆమెతో మాట్లాడడం మానేశాడు. ఈ సంఘటనపై ఆ యువతి తల్లి ఫిబ్రవరిలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. రాచకొండ కమిషనరేట్ కమిషనర్ మహేష్ భగవత్ నిందితునిపై ఎల్ఓసీ జారీ చేశారు. ఈ నెల 27న నగరానికి వచ్చిన అబ్బాస్‌ను ఎయిర్‌పోర్టు పోలీస్ అధికారులు అదుపులోకి తీసుకొని మల్కాజిగిరి పోలీసులకు అప్పగించారు. విచారణలో నేరం ఒప్పుకోవడంతో శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
చెన్నై టెక్కీకి మరణశిక్ష ; సమర్ధించిన హైకోర్టు
చెన్నై : మైనర్‌పై అత్యాచారానికి, హత్యకు పాల్పడ్డ ఓ టెక్కీకి కింది కోర్టు విధించిన మరణశిక్షను మద్రాస్ హైకోర్టు సమర్ధించింది. ఆ కేసులో దోషిగా తేలిన 23 ఏళ్ల దశ్వంత్‌కు మరణ శిక్ష సరైనదే అంటూ మంగళవారం తీర్పు వెలువరించింది. చెన్నై సమీపంలోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న దశ్వంత్.. గతేడాది ఫిబ్రవరిలో ఏడేళ్ల బాలికకు బొమ్మలు ఆశగా చూపి ఇంటికి పిలిచి.. అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ బాలికను హత్యచేసి.. మృతదేహాన్ని బ్యాగులో పెట్టి హైవే పక్కన కాల్చేశాడు. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో ప్రభుత్వం ఈ కేసును సీరియస్‌గా తీసుకుంది. కేసు విచారణ వేగంగా జరిగేలా చర్యలు తీసుకోంది. ఈ కేసుపై విచారణ చేపట్టిన లోకల్ కోర్టు దశ్వంత్‌కు మరణశిక్ష విధిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 19న తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ అతను మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు లోకల్ కోర్టు తీర్పును సమర్ధించింది. తల్లిని చంపిన కేసు కూడా.. లోకల్ కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతునప్పుడు.. గతేడాది డిసెంబర్లో దశ్వంత్ బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఆ సమయంలో అతడు తన తల్లి సరళ చంపి ఆమె ఆభరణాలతో ముంబై పారిపోయాడు. చివరకు అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు చెన్నై తరలించారు. ఇంకా సరళ హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. -
ఛీ.. జీవితం! ఏంది భయ్యా ఇది..
బెంగళూరు: ‘‘ఉద్యోగవేటలో భాగంగా ఎనిమిదేళ్ల కిందట సిటీకి వచ్చాను. మంచి ఉద్యోగమైతే దొరికిందిగానీ, జీవితం నానాటికీ నరకప్రాయంగా తయారైంది. అందుకు మొదటి కారణం ట్రాఫిక్ ఇబ్బందులైతే, రెండోది సాఫ్ట్వేర్ రంగంలో సాగుతోన్న శ్రమదోపిడి. చాలా విసుగెత్తిపోయా. ఏందీ జీవితం? అనిపించేది. అందుకే నిరసనగా గుర్రం మీద ఆఫీసుకొచ్చా. లైఫ్‌లో ఇంకెప్పుడూ మల్టీనేషన్ కంపెనీలో పనిచేయను...’’ అంటోన్న ఈ టెకీ.. తన వెరైటీ నిరసనతో సోషల్ మీడియా నయా సంచలనంగా మారాడు. పేరు రూపేశ్ కుమార్ వర్మ. బెంగళూరులో ఓ పేరుమోసిన కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ట్రాఫిక్ రద్దీని నిరసిస్తూ ఇలా గుర్రం మీద ఆఫీసుకొచ్చాడు. మరి సంస్థ ఊరుకుందా? గుర్రానికి పార్కింగ్ ప్లేస్ కల్పించిందా? అని అడగొద్దు! లాస్ట్ వర్కింగ్ డే కాబట్టి మనోడిలా వెరైటీ చర్యకుదిగాడు. బెంగళూరు నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు నానాటికీ పెరిగిపోతున్నాయని, పరాష్కార మార్గాలను వెదకడంలో వెనుకబడ్డామని ఆవేదన చెందుతోన్న రూపేశ్.. తానీ పనిచేసింది సెన్సెషన్ కోసం కాదని, అయినాసరే పాపులర్ అయిపోవడంతో థ్రిల్ అయ్యానని చెప్పాడు. అతి త్వరలోనే సొంత కంపెనీని ప్రారంభించబోతున్నట్లు తెలిపాడు. తద్వారా దేశంలో నెలకొన్ని సమస్యలు కొన్నింటికైనా పరిష్కారాలు చూపగలననే దీమా వ్యక్తంచేశాడు. ఆటోడ్రైవర్లు, ట్రక్కుడ్రైవర్లకు సైతం యూనియన్లు ఉండగా, సాఫ్ట్వేర్ ఉద్యోగులు మాత్రం సంఘటితం కాకపోవడం శోచనీయమని, ఎంఎన్సీల్లో పనిచేసే భారత టెకీలు.. లైక్‌మైండెడ్ ఫ్రెండ్స్‌తో కలిసి స్టార్టప్స్ ప్రారంభిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. ఇలా ఉద్యోగం చివరిరోజు అశ్వంపై వచ్చిన రూపేశ్ సొంతకంపెనీ పెట్టి పేరు సాధించకముందే సెలబ్రిటీ అయిపోయాడు! -
భార్య, బిడ్డను చంపి ఆత్మహత్యాయత్నం
మైసూరు: కుటుంబ కలహాలతో తీవ్ర ఆవేదనకు గురైన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ భార్య, కుమార్తెల గొంతు కోసి చంపి, అనంతరం తాను కూడా ఆత్మహత్యకు యత్నించిన ఘటన కర్ణాటకలోని మైసూరు నగరంలో శుక్రవారం వెలుగుచూసింది. విషయం బయటకి తెలియనీయకుండా 24 గంటలపాటు అతను భార్యాబిడ్డల శవాలతో సహవాసం చేయడం గమనార్హం. మైసూరు జిల్లాలోని నంజనగూరు గ్రామానికి చెందిన ప్రజ్వల్ (45) బెంగళూరులోని ఒక ప్రముఖ ఐటీ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేసేవాడు. ఇతనికి భార్య సవిత (39), కుమార్తె సించన (10) ఉన్నారు. ప్రజ్వల్ ఏడాది కిందట ఐటీ ఉద్యోగానికి రాజీనామా చేసిన అనంతరం మైసూరుకు వచ్చి విజయనగర 4వ స్టేజ్‌లో నివసిస్తూ వ్యాపారాలు చేయాలని ప్రయత్నిస్తున్నాడు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. బుధవారం వీరు తమ పెళ్లి రోజు జరుపుకొన్నారు. అదే రోజు రాత్రి అందరూ నిద్రపోయాక ప్రజ్వల్ లేచి... కత్తితో భార్య సవిత, కుమార్తె సించనలను గొంతుకోసి చంపాడు. అప్పటి నుంచి గురువారం రాత్రి వరకూ ఇంట్లోనే శవాల మధ్యే గడిపాడు. ఈ విషయం ఎవరికీ తెలియనివ్వలేదు. తరువాత తన కుటుంబ సభ్యులకు ఈ ఘోరం గురించి తెలిపి, తాను కూడా చాకుతో గొంతు కోసుకున్నాడు. హుటాహుటిన ఇంటికి చేరుకున్న బంధువులు పోలీసుల సహకారంతో కొనప్రాణంతో ఉన్న ప్రజ్వల్‌ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు సవిత, సించన మృతదేహాలకు శవ పరీక్షలు నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. విజయనగర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మద్యం మత్తులో టెక్కీ ర్యాష్ డ్రైవింగ్..
-
టెక్కీ ర్యాష్ డ్రైవింగ్.. ఆటో డ్రైవర్ మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కొనసాగుతున్న తాగుబోతు డ్రైవర్ల ఆగడాలు మాత్రం రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. టెక్కీ నవీన్ మద్యం మత్తులో కారుతో బీభత్సం సృష్టించాడు. టెక్కీ ర్యాష్ డ్రైవింగ్‌తో ముందుగా వెళ్తున్న ఆటోను ఢీకొట్టాడు. ప్రమాద సమయంలో కారు ఆటోను కొంతదూరం అలానే ముందుకు ఈడ్చుకెళ్లింది. తీవ్ర గాయాలైన ఆటో డ్రైవర్ రఫిక్ ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. ప్రమాద సమయంలో ఎయిర్ బ్యాగ్‌లు తెరుచుకోవడంతో టెక్కీ ప్రాణాలతో బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. బేగంపేట పోలీసులు టెక్కీ నవీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు బావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. -
ఆ దుండగులు దొరికారు..
సాక్షి ప్రతినిధి, చెన్నై: నాలుగురోజుల క్రితం దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన తెలుగమ్మాయి లావణ్య చెన్నైలోని ఒక ప్రయివేటు ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. వివరాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్టణానికి చెందిన లావణ్య (26) చెన్నై నావలూరులోని ఒక ఐటీ సంస్థలో పనిచేస్తున్నారు. ఈనెల 13న తెల్లవారుజామున విధులు ముగించుకుని నుంగంపాళయంలోని సోదరి ఇంటికి బైక్‌పై బయలుదేరారు. అరసన్‌కళని రోడ్డులో వెళుతుండగా దారిదోపిడీ ముఠా ఆమె తలపై ఇనుపరాడ్‌తో మోదడంతో కిందపడిపోయారు. ఈ సమయంలో ఆమె తల రోడ్డుపై ఉన్న ఒక బండరాయికి తగలడంతో తీవ్రంగా గాయపడి స్పృహకోల్పోయారు. దుండగలు ఆమె మెడలోని నగలు, డబ్బు, సెల్‌ఫోన్, బైక్ దోచుకెళ్లారు. స్పృహలేని స్థితిలో పడిఉన్న లావణ్యను కొందరు స్థానికులు గుర్తించి పల్లికరణై పోలీసులకు సమాచారం ఇవ్వగా ఆమెను ప్రయివేటు ఆస్పత్రి చేర్పించి విచారణ చేపట్టారు. ఈనెల 14న సెంమ్మంజేరీలోని ఒక మద్యం దుకాణం ముందు లావణ్య బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. సెమ్మంజేరీ ప్రాంతానికి చెందిన నలుగురు యువకులు మద్యం తాగేందుకు వచ్చి మోపెడ్ అక్కడే వదిలివెళ్లినట్లు తెలుసుకున్నారు. పోలీసులు ఆరు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలించగా ప్రధాన నిందితుడు సూర్య సహా నలుగురు పట్టుబడినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ఒక ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లావణ్య బుధవారం సాయంత్రం స్పృహలోకి వచ్చింది. అయితే ఆమె మాట్లాడే స్థితిలో లేకపోవడంతో పోలీస్ సహాయ కమిషనర్ ముత్తుస్వామి గురువారం సాయంత్రం మరోసారి లావణ్యను కలుసుకోగా తనను కాపాడినందుకు కృతజ్ఞతలు అన్నట్లుగా తన రెండుచేతులూ జోడించి పోలీసులకు నమస్కరించింది. సంఘటన జరిగిన రోజున ఐదు కిలోమీటర్లు తనను వెంబడించి దాడిచేసిన నిందితులను గుర్తుపట్టే ఆనవాళ్లను పోలీసులకు వివరించినట్లు సమాచారం. తలపై శస్త్రచికిత్స చేసినందున ఎక్కువసేపు మాట్లాడరాదని వైద్యులు అభ్యంతరం చెప్పపడంతో పోలీసుల తిరిగి వెళ్లిపోయారని సమాచారం. -
జుట్టు రాలిపోతోందని టెకీ ఆత్మహత్య!
సాక్షి, మధురైః ప్రస్తుతం మనిషి ఏ చిన్న సమష్యను అధిగమించలేక పోతున్నాడు. టెక్నాలజీ యుగంలో కూడా జుట్టు రాలిపోతుందని ఏకంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓ 27 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ విషాద ఘటన తమిళనాడులోని మధురైలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లో వెళితే.. అతని పేరు ఆర్.మిథున్ రాజ్. బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. చాలా సంవత్సరాలుగా అతడు హేర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నాడు. ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేకపోయింది. దీంతో అతను కొన్ని రోజులుగా డిప్రెషన్‌కి లోనయ్యాడు. ఈ విషయాన్ని మధురైలోని జైహిందూపురంలో ఉండే తన తల్లి వాసంతికి పదే పదే చెబుతుండేవాడు. కొడుకుకి పెళ్లి చేయాలని ఆమె ఎన్ని సంబంధాలు చూసినా.. ఫలితం లేదు. దీంతో మిథున్ మరింత కుంగిపోయాడు. ఈ మధ్య ఉద్యోగానికి సెలవు పెట్టి మధురైకి వచ్చాడు. వాసంతి ఇంట్లో లేని సమయం చూసి ఉరేసుకున్నాడు. స్థానికుల సాయంతో అతన్ని ఆసుపత్రికి తరలించినా.. అతను అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. -
ప్రేమించలేదని దారుణం..టెకీ మరణం
సాక్షి, చెన్నై: ప్రేమను నిరాకరించిందన్న అక్కసుతో ఓ టెకీ కుటుంబంపై దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన కలకలం రేపింది. చెన్నై అదాంబక్కంలో సోమవారం రాత్రి ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తీవ్ర గాయాలతో ఇందూజ ప్రాణాలు కోల్పోగా, ఆమెతల్లి, సోదరి మృత్యువుతో పోరాడుతున్నారు. ప్రేమించమని వెంటబడి ఈ దారుణానికి ఒడిగట్టిన అశోక్ పరారీలో ఉన్నాడు. వివరాల్లోకి వెళితే...ఇందుజా, అశోక్ ఒకే కాలేజీలో ఇంజనీరింగ్ చదువుకున్నారు. ఇందుజాను ప్రేమిస్తున్నానని గత నెలరోజులుగా వెంటడుతున్నాడు. కానీ దీన్ని ఇందూజ తిరస్కరించింది. ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న ఇందూజ స్థానిక కంపెనీలో ఇటీవలే ఉద్యోగంలో చేరింది. అయితే అశోక్ వేధింపులకు తట్టుకోలేక గత నెల రోజులుగా ఇంట్లోనే ఉంటోంది. ఇంతలోనే అశోక్ ఈ అఘాయిత్యానికి తెగబడ్డాడు. ప్రేమించమని వేధిస్తోన్న అశోక్ సోమవారం మరోసారి ఆమె ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు అతనితో వాగ్వాదానికి దిగారు. ఒక్కసారి తలుపు తీయమని అశోక్ వాదనకు దిగాడు. దీంతో వారు తలుపు తీయగానే... క్యాన్‌తో వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఇందూజ, ఆమె తల్లి రేణుక, సోదరి నివేదితపై పోసి నిప్పంటించి పారిపోయాడు. విషయం గమనించిన ఇరుగు పొరుగువారు వారిని హుటాహుటిన స్థానిక కేంఎసీ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో..ఇందూజ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచింది. తల్లి రేణుక 49శాతం కాలిన గాయాలతో, నివేదిత 23శాతం గాయాలతో చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఇందూజ సోదరుడు విదేశంలో ఉన్నారని ఇందూజ బంధువు ఒకరు చెప్పారు. అలాగే గత నెల రోజులుగా అశోక్ ఇందూజ వెంటపడుతున్నాడని.. అన్న ఇంట్లో లేడనితెలిసి దాడికి దిగాడని ఆరపించారు. -
బెజవాడలో సాప్ట్వేర్ ఇంజినీర్ అదృశ్యం
-
వ్యక్తిగత విషయాలు భార్య షేర్ చేసిందని..
పూణె: సోషల్ మీడియాలో వ్యక్తిగత విషయాలు షేర్ చేసిందని విచక్షన కోల్పోయిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ భార్యను హత్య చేసి ఆ తర్వాత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. హడాస్పుర్ సమీపంలో మంజ్రీ బడ్రక్లోని శివ్ పార్క్ అపార్ట్ మెంట్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ రాకేష్ గంగుర్డే(34) తన భార్య సోనాలీ(28)కి మధ్య గత కొన్ని రోజులుగా వాగ్వాదం నడుస్తోందని సూసైడ్ నోట్లో వెల్లడించాడు. తమ వివాహానికి సంబంధించిన సమాచారంతోపాటూ, వ్యక్తిగత విషయాలను ఫేస్ బుక్ ఫ్రెండ్స్‌కి సోనాలి షేర్ చేసినట్టు రాకేష్ తెలిపాడు. నాసిక్ జిల్లాలోని సతనా తాలుకాకు చెందిన వీరి వివాహం నాలుగేళ్ల కింద జరిగింది. వారికి ఇంకా సంతానం కలుగలేదు. ఆమ్మ నుంచి సోనాలీ ఫోన్ కలవడంలేదని బుధవారం సాయంత్రం సమాచారం వచ్చిందని బనెర్లో నివసించే సోనాలీ సోదరుడు హర్ష పవార్ పోలీసులకు తెలిపారు. తాను కూడా ఎంత ప్రయత్నించినా ఫోన్ ఎవరూ లిఫ్ట్ చేయకపోవడంతో గురువారం ఫ్లాట్‌కి వెళ్లానని చెప్పారు. డోర్ కొట్టినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చామని పేర్కొన్నారు. పోలీసులు తాళం పగులగొట్టి ఇంట్లోకి వెళ్లేసరికి ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. వివాహబంధం సాఫీగా కొనసాగే సమయంలోనే సోనాలీ కుటుంబనియంత్రణకు సంబంధించి వ్యక్తిగత విషయాలను కూడా తన స్నేహితులతో షేర్ చేసుకున్న విషయాన్ని రాకేష్ గమనించాడు. అప్పటి నుంచి వారి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయని అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ కిరణ్ లోందే తెలిపారు. రాకేష్ గొంతునులిమి సోనాలిని హత్య చేసి, అనంతరం నైలాన్ తాడుతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని లోందే పేర్కొన్నారు. మరాఠిలో రాకేష్ రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాకేష్ పై సోనాలీ కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. ఇంతకు ముందు వారిరివురి మధ్య ఎలాంటి గొడవలు జరగలేదని కుటుంబ సభ్యులు కన్నీటిపర్యాంతమయ్యారు. మృతదేహాలను పోస్ట్ మార్టం అనంతరం ఇరువురి కుటుంబసభ్యులకు అప్పగించారు. -
మహిళా టెక్కీపై లైంగిక దాడి
బెంగళూరు (బనశంకరి): దొంగతనం కోసం పీజీ హాస్టల్లోకి చొరబడిన దుండగుడు మహిళా టెక్కీపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బెంగళూరులోని పరప్పన అగ్రహార పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. డీసీపీ బోరలింగయ్య కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బెంగళూరులోని పరప్పన అగ్రహారంలో ఉన్న ఓ పీజీ (పేయింగ్ గెస్ట్) హాస్టల్లో తమిళనాడుకు చెందిన ఓ మహిళా టెక్కీ(20) ఉంటోంది. ఈమె నగరంలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తోంది. ఈ నెల 26న రాత్రి విధులు ముగించుకొని హాస్టల్‌కు చేరుకుంది. అర్ధరాత్రి సమయంలో హాస్టల్లోకి చొరబడిన దుండగుడు ఆ యువతి ఉన్న గదిలోకి ప్రవేశించాడు. నగదు, బంగారు ఆభరణాలు ఇవ్వాలని బెదిరించాడు. తన వద్ద అలాంటివి ఏవీ లేవని చెప్పడంతో కత్తితో బెదిరించి లైంగికదాడికి పాల్పడి ఉడాయించాడు. ఘటనపై బాధితురాలు మూడు రోజుల క్రితం పరప్పన అగ్రహార పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమెను వైద్యపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దుండగుడి కోసం గాలిస్తున్నారు. -
టెకీపై పోలీసుల జులుం
బెంగళూరు : బ్రిటీష్ నిరంకుశ పాలన నుంచి భారత్‌కు స్వాతంత్య్రం వచ్చినా.. లంచం అనే మహమ్మారి నుంచి ఇంకా స్వేచ్ఛ రాలేదు. ఓ భారతీయుడిగా తానెందుకు లంచం ఇవ్వాలని ప్రశ్నించిన ఆంద్రప్రదేశ్ కు చెందిన సాప్ట్వేర్ ఉద్యోగి వెంకీకి స్వాతంత్ర్య దినోత్సవ రాత్రిపూటే పోలీసుల నుంచి ఊహించని ఘటన ఎదురైంది. పోలీసు స్టేషన్ లాక్కెళ్లి మరీ బాధితుడిని తీవ్రంగా హింసించారు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. బాధితుడు అందించిన సమాచారం ప్రకారం... సిటీకి కొత్తగా వచ్చిన వెంకీ కజిన్, తెలియక నాన్-పార్కింక్ జోన్లో కారును నిలిపాడు. దీంతో కే.ఆర్ పురమ్ పోలీసు స్టేషన్ దగ్గర్లో వినాయక దేవాలయం వద్ద ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న వెంకీ ఘటనా స్థలానికి చేరుకున్నాడు. స్పాట్‌కు వెళ్లిన వెంకీని పోలీసులు లెక్కచేయకపోయే సరికి, చలాన్ ఇవ్వకుండా ఫైన్ ఎలా చెల్లిస్తామని అతను ప్రశ్నించాడు.. దీంతో పోలీసుల ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. మమల్ని ప్రశ్నిస్తావా అంటూ విరుచుకుపడ్డారు. భారతీయుడిని ప్రశ్నించే హక్కు తనకు ఉందని ఎదురు తిరగడంతో పోలీసులు తమదైన శైలిలో రెచ్చిపోయి దాడికి పాల్పడ్డారు. కేఆర్ పురమ్ పోలీసు స్టేషన్‌కు లాక్కెళ్లి మరీ క్రూరంగా హింసించారు. 40వేల విలువ చేసే గోల్డ్ చైన్, మూడు వేల రూపాయల నగదును లాగేసుకున్నారు. కేవలం లంచాన్ని డిమాండ్ చేస్తున్న పోలీసులను, చలాన్ ఇవ్వమని ప్రశ్నించినందుకే తనపై ఈ ఘటనకు పాల్పడారని ఆరోపించాడు. అయితే ఈ విషయంపై బాధితుడి నుంచి పూర్తి సమాచారం తెలుసుకున్నామని, ఆ పరిధికి చెందిన ఏసీపీ, అతని ఫిర్యాదును విచారిస్తారని ఈస్ట్ ట్రాఫిక్ డీసీపీ చెప్పారు.


