2024 ప్రారంభమైనా.. ఐటీ ఉద్యోగాలు గాల్లో దీపంలో అయిపోయాయి, ఏ కంపెనీ ఎప్పుడు లే ఆప్స్ అంటుందో తెలియక ఐటీ ఉద్యోగులు బిక్కుబిక్కుమంటున్నారు. గత నెలలో ఏకంగా 30000 కంటే ఎక్కువ మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు Layoffs.fyi ఒక నివేదికలో వెల్లడించింది. ఎప్పుడు పోతాయో తెలియని ఐటీ జాబ్స్ గురించి భయపడుతున్న తరుణంలో ఓ ఉద్యోగి చేసిన ట్వీట్.. అతని ఉద్యోగం పోయేలా చేసింది.
బెంగళూరుకు చెందిన ఒక ఐటీ ఉద్యోగి తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ప్రస్తుత ఆర్ధిక మాంద్యం నేపథ్యంలో ప్రశాంతంగా లేనని, కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతోందని ట్వీట్ చేశారు. ట్వీట్ చేసిన మరుసటి రోజే అతని ఉద్యోగం ఊడిపోయిందని, ఉద్యోగం కోసం వెతుక్కుంటున్నానని, ఏదైనా జాబ్ ఉంటే చెప్పండని మరో ట్వీట్ చేశాడు.
ఫోర్మా (Forma) అనే కంపెనీలో పనిచేసే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ 'జిష్ణు మోహన్' అనే వ్యక్తి 2019లో కొచ్చి నుంచి బెంగరూరు వచ్చి జాబ్ చేసుకుంటున్నాడు. ఇటీవల అతడు జాబ్ కోల్పోయే సమయానికి ఫుల్ టైమ్ రిమోట్ ఎంప్లాయ్‌గా పనిచేస్తున్నాడు. ఒక్క ట్వీట్ వల్ల ఉద్యోగం పోవడంతో ఇప్పుడు ఇతడే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచాడు.
ఇదీ చదవండి: లే ఆఫ్స్.. 32000 మంది టెకీలు ఇంటికి - అసలేం జరుగుతోంది?
జిష్ణు మోహన్ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. కొందరు రెస్యూమ్ పంపమని అడగ్గా.. ఇంకొందరు ఓపెన్ పొజిషన్స్ గురించి కామెంట్ సెక్షన్లలోనే ఆఫర్ చేశారు.
That was quick. I got laid off today, as part of reorg.
— Jishnu (@jishnu7) February 8, 2024
So actively looking for a job now. Please let me know if anyone is hiring. https://t.co/CqGWYQbgY6
Comments
Please login to add a commentAdd a comment