పాట్నా : భార్య, ఆమె బంధువులు పెట్టే వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న టెక్కీ అతుల్ సుభాష్ (34) కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భార్య తనపై పెట్టిన కేసు నుంచి విముక్తి పొందాలంటే రూ.5లక్షలు ఇవ్వాలని ఓ న్యాయవాది అతుల్ సుభాష్‌ను డిమాండ్ చేసినట్లు అతని తండ్రి పవన్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు.
బెంగళూరు ఐటీ ఉద్యోగులుగా పనిచేస్తున్న సుభాష్, నిఖితలకు 2019లో వివాహమైంది. అయితే వివాహం జరిగిన కొన్నేళ్లకు ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. దీంతో నిఖిత.. సుభాష్‌ను విడిచి పెట్టి బెంగళూరు నుంచి తన సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్‌కు వెళ్లింది. అక్కడే ఆమె తల్లి, సోదరుని ప్రోద్బలంతో అతుల్‌పై, అతని కుటుంబ సభ్యులపై తప్పుడు కేసులు పెట్టింది. ఈ కేసు విచారణ నిమిత్తం తన కుమారుడు సుభాష్ బెంగళూరు నుంచి ఉత్తరప్రదేశ్‌కి 40కి కంటే ఎక్కువ సార్లు తిరిగాడని బాధితుడి తండ్రి పవన్ కుమార్ మీడియా ఎదుట వాపోయాడు.
కోర్టులో కేసు విచారణ కొనసాగుతుండగానే కేసును పర్యవేక్షిస్తున్న న్యాయమూర్తి ‘కేసు పరిష్కరించేందుకు’ రూ.5 లక్షలు అడిగారని ఆరోపించారు. దీంతో మధ్యవర్తిత్వం కోసం తాము సిద్దమైనట్లు చెప్పారు. ఆ సమయంలో తాను మధ్యవర్తిత్వం వహించినందుకు ఓ న్యాయవాది తనని ముందు రూ.20 వేల అడిగారని, ఆ తర్వాత రూ.40వేలకు పెంచారని అన్నారు. అప్పుడే న్యాయమూర్తి అతనికి (సుభాష్) సెటిల్మెంట్ కావాలనుకుంటే రూ. 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు చెప్పారు.
Atul Subhash’s father shares how the judiciary systematically harassed his son and family. It’s so painful to watch. 😣
To everyone involved, remember—karma is real, and you have your family too.😏#JusticeIsDue #JusticeForAtulSubhash pic.twitter.com/H8211785xL— Sann (@san_x_m) December 12, 2024
ప్రస్తుతం, అతుల్ సుభాష్ కేసు దర్యాప్తును బెంగళూరు మారతహళ్లి పోలీసులు వేగవంతం చేశారు. మృతుని సోదరుడు బికాస్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మారతహళ్లి పోలీసులు ఆత్మహత్యకు ప్రేరేపించడం తదితర సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌కి వెళ్లారు. అక్కడ అతుల్ భార్య నిఖితా సింఘానియా, తల్లి నిశా, సోదరుడు అనురాగ్, బంధువు సుశీల్‌ను విచారణ చేపట్టారు. బిహార్‌లో ఉండే మృతుని తల్లిదండ్రుల నుంచి కూడా వాంగ్మూలం తీసుకోనున్నారు.
👉చదవండి : సోషల్ మీడియాను కదిలించిన ఓ భర్త గాథ
Comments
Please login to add a commentAdd a comment