settle
-
బీమా పథకాలు: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: ఆపదలో విలవిల్లాడే పేద కుటుంబాలకు అండగా ఉంటున్న రాష్ట్ర ప్రభుత్వం బీమా పథకాల క్లెయిమ్‌లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. 4 రకాల బీమా పథకాల క్లెయిమ్స్‌ను 30 రోజుల్లో పరిష్కరించాలని స్పష్టం చేసింది. దీన్ని అమలుచేసే బాధ్యతను జిల్లా జాయింట్ కలెక్టర్లకు (గ్రామ, వార్డు సచివాలయాలు–అభివృద్ధి) అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. వైఎస్సార్ బీమా, రైతులు ఆత్మహత్య చేసుకుంటే పరిహారం చెల్లింపు, వైఎస్సార్ మత్స్యకార భరోసా పరిహారం, వైఎస్సార్ పశునష్ట పరిహారం పథకాల అమలు, వివిధ శాఖల మధ్య సమన్వయం, పర్యవేక్షణ బాధ్యతలను గ్రామ, వార్డు సచివాలయాలకు అప్పగించడమే కాకుండా క్లెయిమ్ సొమ్మును సంబంధిత కుటుంబాలకు వారి ఇంటివద్దే వలంటీర్ల ద్వారా అందించాలని నిర్ణయించింది. బీమా క్లెయిమ్స్ పరిష్కారంలో తీవ్రజాప్యం జరుగుతుండటాన్ని గమనించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ బీమా పథకం అమల్లో సమూల మార్పులు తీసుకొచ్చారు. బీమా పరిహార ఆర్థిక సహాయాన్ని సకాలంలో అందించడం ద్వారా మరణించిన లేదా బాధిత కుటుంబాలకు ఉపశమనం కలిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ, వార్డు సచివాలయాలతో పరిపాలన వికేంద్రీకరణ ద్వారా ఇప్పటికే అనేక ప్రభుత్వ సేవలను వలంటీర్ల ద్వారా ప్రజల ఇంటి వద్దకే అందిస్తున్న తరహాలోనే ఈ బీమా పథకాల పరిహారం కూడా అందించనుంది. ఈ క్లెయిమ్‌ల పరిష్కారం విషయమై జాయింట్ కలెక్టర్ 15 రోజులకోసారి జిల్లా, మండల, పట్టణ స్థానికసంస్థల అధికారులు, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో సమీక్ష నిర్వహించి కలెక్టర్‌కు నివేదికను ఇవ్వాలని, కలెక్టర్ నెలకోసారి సమీక్షించి గ్రామ, వార్డు సచివాలయాలశాఖ డైరెక్టర్‌కు నివేదిక సమర్పించాలని ప్రభుత్వం నిర్దేశించింది. గ్రామ, వార్డు సచివాలయాలశాఖ డైరెక్టర్ నెలవారీ నివేదికలను ప్రభుత్వానికి సమర్పించాలని సూచించింది. బీమా పథకాలు సజావుగా సకాలంలో అమలవుతున్నాయా లేదా అనేదానిపై రాష్ట్ర ప్రభుత్వం 3 నెలలకు ఒకసారి సమీక్షించనుంది. 4 బీమా పథకాలు.. ►పేద కుటుంబాల్లో సంపాదించే వ్యక్తి.. 18 నుంచి 50 ఏళ్ల వయసులోపు సహజంగా మరణిస్తే ఆ కుటుంబానికి లక్ష రూపాయలను పరిహారంగా ప్రభుత్వమే నేరుగా చెల్లిస్తుంది. 18 నుంచి 70 ఏళ్ల వయసులోపు ప్రమాదవశాత్తు మరణించినా లేదా శాశ్వత వైకల్యం పొందినా 5 లక్షల రూపాయలను బీమా ద్వారా పరిహారం చెల్లిస్తుంది. ►వ్యవసాయ కారణాలతో రైతులు, కౌలు రైతులు ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే ఆ బాధిత కుటుంబానికి పునరావాస ప్యాకేజీ కింద రూ.7 లక్షల పరిహారం చెల్లించాలి. ►చేపలవేట సమయంలో 18 నుంచి 60 ఏళ్ల వయసులోపు మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద రూ.10 లక్షల పరిహారం చెల్లించాలి. ►వైఎస్సార్ పశునష్ట పరిహార పథకం కింద గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెలు మరణిస్తే ప్రభుత్వం నిర్ధారించిన పరిహారాన్ని చెల్లించాలి. -
టాటా, డొకోమో వివాదానికి ముగింపు
న్యూఢిల్లీ: ప్రముఖ వ్యాపారసంస్థ టాటా గ్రూప్ మేజర్ ఆపరేటింగ్ ప్రమోటర్ టాటా సన్స్ లిమిటెడ్, జపాన్‌కు చెందిన టెలికాం కంపెనీ నిప్పాన్ టెలిగ్రాఫ్ అండ్ టెలిఫోన్ కార్పొరేషన్ (ఎన్టీటీ) డొకోమో మధ్య వివాదపరిష్కారానికి ఎట్టకేలకు ముగింపు పడింది. టాటా టెలీసర్వీసెస్, డొకొమో సేవల నేపథ్యంలో ఏర్పడ్డ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు టాటా సన్స్, ఎన్టీటీ డొకోమో ఒక అంగీకారానికి వచ్చాయి. ఎన్టీటీ కోరుతున్న పూర్తిస్థాయి నష్టపరిహార మొత్తాన్ని చెల్లించేందుకు ప్రమోటర్ టాటా సన్స్ అంగీకరించింది. 1.17బిలియన్ డాలర్లను చెల్లించేందుకు టాటాగ్రూప్ అంగీకరించడంతో ఈ వివాదం పరిష్కారమైంది. దీంతో సుమారు రెండు సంవత్సరాలకుపైగా సాగుతున్న వివాదాన్ని ముగిసినట్టయింది. తమ మధ్య వివాదాన్ని ముగింపు పలకనున్నట్టు ఇరు సంస్థలు మంగళవారం ఢిల్లీ హైకోర్టుకు నివేదించారు. ఈ మేరకు డొకోమోపై ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు టాటా సన్స్ అంగీకరించింది. మార్చి 8 దీనికి సంబంధించిన అప్లికేషన్ ను కోర్టు పరిశీలించనుంది. దీంతోపాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోక్యానికి వ్యతిరేకంగా తాము ఈ నిర్ణయం తీసుకోలేదని ఇరు సంస్థలు స్పష్టం చేశాయి. గత సంవత్సరం టాటా సన్స్ ఛైర్మన్ గా సైరస్ మిస్త్రీ ఉద్వాసన తరువాత, డొకొమొ వివాదం పరిష్కారం చర్చలను పునఃప్రారంచింది టాటా గ్రూపు. అయితే విదేశీ పెట్టుబడి నిబంధనలు ఉల్లంఘించినట్లు అవుతుందనే సంకేతాలను కేంద్రబ్యాంకు వెల్లడించింది. మరోవైపు ఈ వార్తలతో టాటా టెలీ సర్వీసెస్ కౌంటర్‌కు మార్కెట్లో డిమాండ్ పుట్టింది. ట్రేడర్ల కొనుగోళ్లతో దాదాపు 9 శాతం లాభాలతో కొనసాగుతోంది. టాటా సన్స్ తో కలసి టాటా టెలి సర్వీసెస్ లో వాటాల బదలీపై ముందు చేసుకున్న ఒప్పందాన్ని టాటా సన్స్ పాటించలేదని డొకోమో ఆరోపించింది ఈ వివాదంలో మధ్యవర్తిత్వం కోరుతూ డొకోమో లండన్‌లోని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో ఈ వివాదంలో సుమారు ఎనిమిదివేల కోట్ల రూపాయల భారీ జరిమానా చెల్లించాలని కోర్టు తీర్పుచెప్పింది. డొకొమోతో చేసుకున్న ఒప్పందాన్ని బేఖాతరు చేశారని ఆరోపణలపై 1.17 బిలియన్ డాలర్ల నష్టపరిహారాన్ని చెల్లించాలని లండన్ లోని అంతర్జాతీయ వివాదాల పరిష్కారాల కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. -
ఇపీఎఫ్ఓ మరో గుడ్ న్యూస్
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపీఎఫ్ఓ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల వాడుకలో లేని పీఎఫ్ ఖాతాల నిధులకు సైతం వడ్డీ చెల్లించేందుకు యోచిస్తున్నామని ప్రకటించిన సంస్థ తాజాగా ఉద్యోగుల సంక్షేమం కోసం మరో కీలక అడుగు వేసింది. ఈమేరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ మంగళవారం ఒక ప్రకటన చేశారు. దీని ప్రకారం పీఎఫ్ ఖాతాదారులు చనిపోయిన వారం రోజుల్లోపు వారి క్లెయిములను పూర్తి చేసేందుకు, అలాగే ఒక కార్మికుడు ఉద్యోగం నుంచి వైదొలగే ముందే పీఎఫ్ సమస్యల్ని పరిష్కరించేలా కార్మిక మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకోనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో అక్టోబర్ 26 న జరిగిన సమీక్షా సమావేశంలో ఆదేశించిన ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. ఈమేరకు పూర్తి మార్గదర్శకాలను జారీ చేసినట్టు చెప్పారు. సత్వరమే చర్యలు తీసుకునేలా ఫీల్డ్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు.ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ 64 వ వ్యవస్థాపక ఉత్సవాలను జరుపుకున్నట్టు మంత్రి తెలిపారు. ఈ ఉత్సవాల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్న దత్తాత్రేయ సంస్థ భవిష్యత్తు ప్రణాళికను వివరించారు. అలాగే సంస్థ చేపట్టిన సంస్కరణలపై ప్రశంసలు కురిపించిన మంత్రి అక్టోబర్ 25, 2016 న కామన్ సేవా కేంద్రాల (సీఎస్ సీ) ఇ-గవర్నెన్స్ తో ఒప్పందం చేసుకున్నట్టు చెప్పారు. అలాగే ఈపీఎఫ్ చందాదారులకు కోసం ఒక గృహ పథకం ఏర్పాటుకు ఆలోచిస్తున్నట్టు చెప్పారు. పీఎఫ్ ఖాతాకు ఆధార్ ను అనుసంధానం చేసిన 50 లక్షలమంది పెన్షనర్లను జీవన్ ప్రమాణ పత్రాలతో గౌరవించనున్నట్టు దత్తాత్రేయ ప్రకటించారు.