న్యూఢిల్లీ: భార్య వేదింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డ బెంగళూరు టెక్కీ అతుల్ సుభాష్ నాలుగేళ్ల కుమారుడి సంరక్షణ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే అంశంపై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. బాలుడి తల్లి నిఖితా సింఘానియా సంరక్షణలోనే ఉంచాలని సుప్రీం కోర్టు ఈ మేరకు తీర్పిచ్చింది. తన మనువడిని తనకు అప్పగించాలని కోరుతూ అతుల్ సుభాష్ తల్లి అంజు దేవి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌పై దేశ అత్యున్నత న్యాయ స్థానంలో ఇవాళ విచారణ జరిగింది.
బాలుడి కస్టడీని కోరిన సుభాష్ తల్లి అంజు దేవి చేసిన విజ్ఞప్తికి ప్రతిస్పందనగా సుప్రీం కోర్టు ధర్మాసనం జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎస్‌సీ శర్మ సోమవారం అతుల్ సుభాష్ కుమారుడు ఆన్‌లైన్‌లో వీడియో ద్వారా మాట్లాడారు. అనంతరం తీర్పును వెలువరించారు.
విచారణ సందర్భంగా అతుల్ సుభాష్ కుమారుణ్ని న్యాయమూర్తులకు చూపించేందుకు నిఖితా సింఘానియా నిరాకరించారు. దీనిపై జస్టిస్ బీవీ నాగర్నత ధర్మాసనం మాట్లాడుతూ.. ఇది హెబియస్ కార్పస్ పిటిషన్. మేం ఆ పిల్లాడిని చూడాలనుకుంటున్నాం. వెంటనే మాకు చూపించండి. బాలుడిని విచారణ చేపట్టిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.
విచారణ సందర్భంగా అతుల్ సుభాష్ కుమారుణ్ని న్యాయమూర్తులకు చూపించేందుకు నిఖితా సింఘానియా నిరాకరించారు. దీనిపై జస్టిస్ బీవీ నాగర్నత ధర్మాసనం మాట్లాడుతూ.. ఇది హెబియస్ కార్పస్ పిటిషన్. మేం ఆ పిల్లాడిని చూడాలనుకుంటున్నాం. వెంటనే మాకు చూపించండి. బాలుడిని విచారణ చేపట్టిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.
కోర్టు వ్యాఖ్యలపై 45 నిమిషాల విరామం తర్వాత బాలుడు వీడియో లింక్‌లో ప్రత్యక్షమయ్యాడు. వీడియోలో కనిపిస్తున్న అతుల్ సుభాష్ కుమారుడితో మాట్లాడారు. ఆ సమయంలో కోర్టు విచారణను ఆఫ్ లైన్ చేసింది. ఇక బాలుడితో మాట్లాడిన తర్వాత అతుల్ సుభాష్ భార్య నిఖితా సింఘానియా కుటుంబసభ్యుల సమక్షంలో ఉండాలని సుప్రీం అత్యున్నత న్యాయ స్థానం తీర్పును వెలువరించింది.
అతుల్ సుభాష్ కేసేంటి?
ఉత్తర ప్రదేశ్‌కు చెందిన అతుల్ సుభాష్, నిఖిత 2019లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆ జంట బెంగళూరుకు వెళ్లి తమ తమ ఉద్యోగాల్లో చేరింది. ఆ మరుసటి ఏడాది వారికి బాబు పుట్టాడు. 2021లో నిఖిత బెంగళూరులోని భర్తను విడిచిపెట్టి కొడుకుతో సహా పుట్టింటికి చేరింది. ఆపై భర్త, అతని కుటుంబంపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. అలా.. విచారణ కోసం అతుల్‌ను భార్య స్వస్థలం జౌన్‌పురలోని ఫ్యామిలీ కోర్టుకు కోసం వెళ్లాల్సి వచ్చేది.
ఈ క్రమంలో.. మానసికంగా, శారీరకంగా అలసిపోయిన అతుల్ సుభాష్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. చనిపోయే క్రమంలో తన భార్య, ఆమె కుటుంబం ఏ స్థాయిలో మానసికంగా వేధించిందో పేజీల కొద్దీ రాసిన సూసైడ్ లేఖ, 90 నిమిషాల నిడివితో తీసిన సెల్ఫీ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. కొడుకును అడ్డుపెట్టుకుని తన భార్య ఆర్థికంగా తనను దోచుకుందని.. న్యాయస్థానంలోనూ తనకు అన్యాయం జరిగిందని, ఇంక తన వల్ల కాకనే ఇలా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నాడతను. అంతేకాదు.. తన కొడుకును తన తల్లిదండ్రులకు అప్పగించాలని ఆఖరికి కోరికగా కోరాడు. ఈ ఘటన తర్వాత.. లక్షల మంది మద్ధతుతో మెన్‌టూతో పాటు జస్టిస్ ఈజ్ డ్యూ, జస్టిస్ ఫర్ అతుల్ ట్యాగ్స్ ట్రెండింగ్‌లో కొనసాగాయి.
అతుల్ సోదరుడి ఫిర్యాదు మేరకు బెంగళూరు పోలీసులు.. పరారీలో ఉన్న నిఖితా సింఘానియాను, ఆమె తల్లీ, సోదరుడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా.. రిమాండ్ విధించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment