భార్య, మామ వేధింపులతో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
బెంగళూరులో మరో ఘోరం
కృష్ణరాజపురం: నా భార్య, ఆమె కుటుంబీకుల వేధింపులను భరించలేను. అన్ని విధాలా వేధించి నరకం చూపుతున్నారు. నాకు కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు, డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ న్యాయం చేయాలని వేడుకుంటూ అతుల్ సుభాష్ అనే టెక్కీ బెంగళూరులో ఉరివేసుకోవడం దేశమంతటా చర్చనీయాంశమైంది. కుటుంబ హింస చట్టాలను సవరించాలని డిమాండ్లు ఊపందుకున్నాయి.
నీవు చచ్చినా ఫరవాలేదని దూషణలు
అంతలోనే ఐటీ నగరిలో మరో హృదయ విదారక దుర్ఘటన జరిగింది. భార్య, మామ వేధింపులను భరించలేక ఓ హెడ్‌కానిస్టేబుల్ ఇక జీవితం చాలనుకున్నాడు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన బైయప్పనహళ్లి రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. వివరాలు.. విజయపుర జిల్లా సిందగి తాలూకా హందిగనూరు గ్రామానికి చెందిన తిప్పణ్ణ (35) బెంగళూరు సిటీ పోలీసు విభాగం పరిధిలో హుళిమావులో సివిల్ హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అయితే అతని భార్య, మామ వేధిస్తున్నట్లు తెలిసింది. తరచూ అతన్ని కించపరుస్తూ సతాయించేవారు. ఈ నెల 12న కూడా భార్య, మామ ఫోన్ చేసి తీవ్రంగా దూషించారు. నీవు చచ్చినా ఫరవాలేదు, నా కూతురు హాయిగా జీవిస్తుంది అని మామ నిందించాడు. ఈ పరిణామాలతో జీవితంపై విరక్తి చెందిన తిప్పణ్ణ డెత్‌నోట్ రాసి, రైలు కింద పడ్డాడు. డ్యూటీ నుంచి నేరుగా అక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది.
తండ్రి ఫిర్యాదు
తన కుమారుని మృతిపై న్యాయం చేయాలని శుక్రవారం అర్ధరాత్రి మృతుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో బైయప్పనహళ్లి రైల్వే పోలీసు స్టేషన్‌లో ఆత్మహత్యకు ప్రేరేపణ తదితర సెక్షన్ల కింద భార్య, మామపై కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని మర ణోత్తర పరీక్ష కోసం సీవీ రామన్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
Atul Subhash Case: అతుల్.. అంతులేని ఆవేదన
Comments
Please login to add a commentAdd a comment