'ఉచితంగా పనిచేస్తా.. ఉద్యోగమివ్వండి': టెకీ పోస్ట్ వైరల్ | Ready to Work For Free Bengaluru Techie Post Viral | Sakshi
Sakshi News home page

'ఉచితంగా పనిచేస్తా.. ఉద్యోగమివ్వండి': టెకీ పోస్ట్ వైరల్

Published Mon, Feb 17 2025 4:26 PM | Last Updated on Mon, Feb 17 2025 4:54 PM

Ready to Work For Free Bengaluru Techie Post Viral

చదువు పూర్తయిన తరువాత మంచి జాబ్ తెచ్చుకోవాలని, ఎక్కువ ప్యాకేజ్ పొందాలని అనుకుంటారు. కానీ ఇటీవల ఒక టెకీ 'ఉద్యోగం ఇవ్వండి, ఉచితంగానే పని చేస్తా' అని అంటున్నాడు. అతని రెజ్యూమ్‌ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. తాను 2023లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశానని, కానీ దాదాపు రెండు సంవత్సరాల తర్వాత కూడా సమయం ఉద్యోగం పొందలేకపోయానని చెప్పాడు. ఉద్యోగం సంపాదించాలనే తపనతో, ఉచితంగా పనిచేయడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నాడు.

నా రెజ్యూమ్‌ను కాల్చండి.. కానీ దయచేసి సహాయం చేయండి. సమీపంలో ఉద్యోగం దొరికితే ఉచితంగానే చేస్తాను. ఉద్యోగం కోసం వేచి చూస్తున్నాను.. అని ఆ యూజర్ రెడ్డిట్‌లో రాశారు. “నేను జావా, పైథాన్, డెవ్‌ఆప్స్ (DevOps), క్లౌడ్ కంప్యూటింగ్,మెషిన్ లెర్నింగ్‌ వంటి వాటిలో ప్రావీణ్యం పొందాను. సీఐ/సీడీ పైప్‌లైన్‌లు, డాకర్, కుబెర్నెట్స్, ఏపీఐ డెవలప్‌మెంట్‌తో పనిచేసిన అనుభవం కూడా ఉందని.. రెజ్యూమ్‌లో పేర్కొన్నాడు.

ఇదీ చదవండి: జీతాల పెంపుపై టీసీఎస్ ప్రకటన.. ఈ సారి ఎంతంటే?

కాలేజీలో చదువు పూర్తయిన తరువాత.. ఫుల్ టైమ్ జాబ్ పొందలేకపోయాను. ఇప్పటికే రెండు కంపెనీలలో ఒక్కో నెల ఇంటర్న్‌గా పనిచేశాను. ఇంటర్న్‌షిప్‌లు, ఫ్రీలాన్స్ గిగ్‌లు లేదా ఓపెన్-సోర్స్ ప్రాజెక్ట్‌లు వంటి ఏవైనా అవకాశాల గురించి ఎవరికైనా తెలిస్తే దయచేసి చెప్పండని టెకీ తన పోస్టులో పేర్కొన్నాడు.

నేను ప్రొడక్ట్ ఇంజనీర్ ఇంటర్న్, టెక్నికల్ ఇంటర్న్‌గా ఇంటర్న్‌షిప్‌లు చేస్తున్నప్పుడు.. వెబ్ క్రాలర్లు, ఏపీఐ టెస్టింగ్, ఎంఎల్ సిస్టమ్‌లపై పనిచేశాను. ఐఈఈఈలో రీసర్చ్ పేపర్ కూడా సబ్మిట్ చేశాను. డీప్ లెర్నింగ్, ఆండ్రాయిడ్ డెవలప్‌మెంట్‌లో ప్రాజెక్టులను నిర్మించాను" అని టెకీ చెప్పారు.

Burn my resume but please help. Desperate & Ready to Work for Free Remotely – 23' Grad Looking for a Job ASAP
byu/employed-un inIndianWorkplace

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement