
లక్నో: కట్టుకున్న భార్య (wife) రాచిరంపాన పెడుతోందంటూ జీవితాల్ని అర్థాంతరంగా జీవితాల్ని ముగుస్తున్న భర్తల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఇప్పటికే బెంగళూరులో అతుల్ సుభాష్, కర్ణాటకలో ఓ కానిస్టేబుల్ తిప్పన్న.. రాజస్థాన్‌లో ఓ డాక్టర్ అజయ్.. ఇలా రోజుకొక ఉదంతం వెలుగులోకి వస్తోంది. ఇదిలా ఉండగానే.. ఉత్తరప్రదేశ్‌లో మరో అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది.
ప్రముఖ టెక్ కంపెనీ టీసీఎస్ (tcs)లో మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న 25ఏళ్ల మానవ్ శర్మ(manav sharma) బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఫిబ్రవరి 24న తన ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు. అయితే,మరణానికి ముందు మానవ్ శర్మ ఆవేదనతో కూడిన ఆరు నిమిషాల 50 సెకన్ల నిడివిగల ఓ వీడియోను రికార్డ్ చేశాడు. ఆ వీడియోలో తన వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నాయని, తన భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని, ఇదే విషయంలో తనకు, తన భార్యకు గొడవలు జరిగేవని అన్నారు. అయినా తనలో మార్పు రాలేదన్నారు.
మగాళ్లకు రక్షణే లేదా
మానవ్ శర్మ ఏడుస్తూ.. దేశంలో మహిళలను రక్షించేలా చట్టాలు ఉన్నట్లు.. పురుషులను రక్షించేలా చట్టాలు ఉంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశాడు. పురుషుల గురించి ఆలోచించండి’ అని న్యాయస్థానాల్ని వేడుకున్నాడు. పురుషులకు రక్షణ కల్పించకపోతే.. వారు అంతమవుతారని హెచ్చరించారు.
కోడలి నిర్వాకం వల్లే
ఈ సందర్భంగా తన మణికట్టుపై కత్తికోసుకున్న గుర్తులను చూపిస్తూ అంతకుముందు తాను ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు శర్మ వెల్లడించాడు. నా మరణానంతరం నా తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టొద్దని అర్జిస్తూ వీడియోను ముగించాడు. అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యపై సమాచారం అందుకున్న శర్మ తండ్రి సదర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన కుమారుడు మరణానికి తన కోడలు కారణమని ఆరోపించారు.
అన్నీ అవాస్తవాలే
మానవ్ శర్మ ఆత్మహత్యపై ఆయన సతీమణి ఖండించారు. నా భర్త మద్యానికి బానిసయ్యారు. అతిగా మద్యం సేవించి పలుమార్లు ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించారు. మూడు సార్లు నేనే రక్షించా. మద్యం సేవించిన తరువాత నాపై దాడి చేసేవారు. ఇదే విషయాన్ని తన అత్తమామల దగ్గర ప్రస్తావించినా వారు పట్టించుకోలేదు.
అవన్నీ పెళ్లికి ముందే.. పెళ్లి తర్వాత భర్తే నా సర్వసం
వివాహేతర సంబంధంపై మీడియా ఆమెను ప్రశ్నించగా..అవన్నీ పెళ్లికి ముందే. పెళ్లి తర్వాత భర్తే నా సర్వసం’అని అన్నారు. ఈ సందర్భంగా వాట్సాప్ చాట్‌ను బహిర్ఘతం చేశారు. ఆ చాట్‌లో దీదీ, దయచేసి ఏదో ఒకటి చేయండి. తనను తాను చంపుకుంటాడు అని తన భర్త సోదరికి(వదిన) మెసేజ్ చేసింది. బదులుగా అతన్ని ఒంటరిగా ఉండనివ్వండి. నిద్రపోండి’ అని బదులిచ్చినట్లు గమనించవచ్చు.
ఇప్పటి వరకూ జరగని అరెస్టులు
మానవ్ శర్మ ఆత్మహత్యపై ఆగ్రా ఏఎస్పీ వినయక్ గోపాల్ మాట్లాడారు. ‘మాకు ఆగ్రాలోని మిలటరీ హాస్పిటల్‌లో మానవ్ మృతదేహం ఉందనే సమాచారం వచ్చింది. మానవ్ బలవన్మరణానికి పాల్పడ్డారు. అతని ఆత్మహత్య కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు. బాధితుడు రికార్డ్ చేసిన వీడియోను గుర్తించాం. అందులో తన భార్యతో విభేదాలు, ఇతర సమస్యల కారణంగా ప్రాణాలు తీసుకున్నట్లు గుర్తించామని’ చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.