చాలామంది యువతులు తమ అభిరుచులను నెరవేర్చుకునేందుకు ధనవంతుడైన భర్త రావాలని కోరుకుంటుంటారు. ఇదేవిధంగా అమెరికాలో నివాసం ఉంటున్న ఇజీ అనాయా తన 7 ఏళ్ల వయసులో తను ఎలాగైనా ధనవంతుడి భార్యని కావాలని నిర్ణయించుకుంది. ఇది ఆమె ముందున్న కల. ఆమె పెరిగి పెద్దయ్యాక ఈ కలను నెరవేర్చుకోవడానికి మార్గాలను అన్వేషించి, చివరికి విజయం సాధించింది.
నేడు ఆమె ఒక ధనవంతునికి భార్యగా మారి, అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతోంది. ప్రతిరోజూ ఉదయం ఆమె జిమ్‌కి వెళ్లే ముందు తన తన పిల్లలను అత్యంత ఖరీదైన జీపు రాంగ్లర్ రూబికాన్‌లో ఎక్కించుకుని, వారిని స్కూల్‌లో దింపుతుంది. ఆమె ఖరీదైన దుస్తులు కొనుగోలు చేసేందుకు తరచూ షాపింగ్ చేస్తుంటుంది. ప్రతిరోజూ విలాసవంతమైన భోజనాల కోసం ఖరీదైన రెస్టారెంట్‌లకు వెళ్తుంది. ఆమె తాజాగా తన వ్యక్తిగత జీవితంలోని పలు రహస్యాలను బయటపెట్టింది.
బ్రూక్లిన్‌లో నివాసముంటున్న అనాయాకు ప్రస్తుతం 43 ఏళ్లు. ఆమె కేటర్స్ న్యూస్‌తో మాట్లాడుతూ ‘నేను నా జీవనశైలి గురించి నా 7 సంవత్సరాల వయస్సులోనే కలలుగన్నాను. నా చిన్నతనంలో ధనవంతులైన ఆడవాళ్లను చూసినప్పుడు ఏదో ఒక రోజు నేను కూడా వాళ్లలా మారాలి అని అనుకునేదాన్ని. ఎలాగైనా అలాంటి విలాసవంతమైన జీవితాన్ని గడపాలని భావించేదానిని. నా 33 ఏళ్ల వయస్సులో ఈ కల నెరవేరింది. నేను అనుకున్నవన్నీ నిజం అయ్యాయి’ అని తెలిపింది.
న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం అనయ ఒక ధనవంతుడిని తన ‘షుగర్ డాడీ’గా మార్చుకుంది. యూరోపియన్, అమెరికన్ దేశాలలో డేటింగ్‌లో వచ్చిన కొత్త కాన్సెప్ట్ ఇది. తమ అవసరాలను తీర్చుకునేందుకు కాలేజీకి వెళ్లే యువతులు ధనవంతులతో డేటింగ్ చేస్తారు. ఇందుకు బదులుగా వారు ఆ ధనవంతుల నుంచి డబ్బు, బహుమతులను పొందుతారు. ఈ విధంగా వచ్చిన సొమ్ముతో వారు తమ అభిరుచులను నెరవేర్చుకుంటారు.
అయితే అనాయా విషయంలో ఇందుకు భిన్నంగా జరిగింది. దీని గురించి అనాయా మాట్లాడుతూ ‘నేను నా షుగర్ డాడీని 10 సంవత్సరాల క్రితం ఆన్‌లైన్‌లో కలిశాను. మేము దాదాపు ఆరు నెలల పాటు డేటింగ్ చేశాం. ఆ తర్వాత వివాహం చేసుకున్నాం. ఈ రోజు నేను అద్భుతమైన జీవితాన్ని గడుపుతున్నాను’ అని చెప్పింది. అదేవిధంగా ఆమె టిక్‌టాక్‌లో తన కథను వివరించింది. ‘నేను ఉదయాన్నే నిద్ర లేస్తాను. తరువాత మా పిల్లలను పాఠశాలకు తీసుకువెళతాను. అనంతరం నేను జిమ్‌కి వెళ్తాను. నాకు నచ్చినది ఏదైనా వెంటనే కొంటాను. ఎంత ఖరీదు అయినా వెనుకాడను.
మా దగ్గర డబ్బుకు లోటు లేదు కాబట్టి నాకు ఇష్టమైనవన్నీ కొనుక్కోవచ్చు. మేము ప్రతి వారాంతంలో పారిస్ లాంటి విలాసవంతమైన ప్రదేశాలలో గడుపుతాం. నేను పుట్టుకతో ధనవంతురాలిని కాదు. పేద కుటుంబంలో పుట్టారు. నాకు కార్పొరేట్ ప్రపంచానికి చెందిన కొందరి నుండి సాయం లభించింది. దీంతో నేను అన్ని విషయాల్లోనూ అభివృద్ధి చెందాను. అయితే నేను దీని కోసం నేను నా స్నేహితులకు దూరం కావాల్సి వచ్చింది. నేను మాన్‌హాటన్‌కు వెళ్లి, కార్పొరేట్ ప్రపంచంలో పని చేయడం మొదలుపెట్టాను. స్వచ్ఛంద కార్యక్రమాలకు, ఇతర కార్యక్రమాలకు వెళ్లాను. అప్పుడే నేను ఒక వ్యక్తిని కలుసుకున్నాను అతనిని నా ‘షుగర్ డాడీ’గా మార్చుకున్నాను. మనం ఎలా జీవించాలనుకుంటున్నామో, అలా మనల్ని మనమే నిలబెట్టుకోవాలి’ అని తెలిపింది అనాయా.
ఇది కూడా చదవండి: గాంధీ హత్య కుట్రను వంటవాడు ఎలా భగ్నం చేశాడు?
Comments
Please login to add a commentAdd a comment