
ఆ బాధిత మహిళ న్యాయం కోసం కళ్లుకాయలు కాచేలా ఎదురుచూస్తోంది. ఆమె పేరు మమత. తన భర్త పెద్ద ఆఫీసర్ కాగానే తనను విడిచిపెట్టి మరో వివాహం చేసుకుని తనకు అన్యాయం చేశాడని ఆమె ఆరోపిస్తోంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం వారి పెళ్లినాటికి భర్త నిరుద్యోగి. దీంతో ఆమె కూలీ పనులు చేసి, అతని ఉన్నత చదువులకు ఆసరా అందించి, అతను పెద్ద ఆఫీసర్ అయ్యేందుకు సహాయపడింది. అయినా ఆమెకు అన్యాయమే ఎదురయ్యింది.
నిరుద్యోగిగా ఉన్న భర్తను చదివించి..
ఈ ఉదంతం మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ఒక మహిళ రోదిస్తూ మీడియా ముందు తన గోడు వెళ్లగక్కింది. మమతకు 2015లో కమరూ హఠీలేతో వివాహం జరిగింది. కమరూ ఆ సమయంలో నిరుద్యోగి. అయితే గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు. నిరుద్యోగిగా ఉన్న భర్తకు ఆమె అన్ని విధాలుగా చేదోడువాదోడుగా నిలిచింది. ఆమె అండతో కమరూ పెద్ద అధికారి అయ్యాడు. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఇళ్లలో వంట పనులు చేస్తూ..
భర్తను చదివించేందుకు ఆమె పలు ఇళ్లలో వంట పనులు, పాచిపనులు చేసింది. కొన్నిరోజులు దుకాణాలలోనూ పనిచేసింది. ఇలా వచ్చిన ఆదాయంతో భర్తను ఉన్నత చదువులు చదివించింది. భార్య సాయంతోనే అతను పోటీ పరీక్షలకు కూడా సిద్ధం అయ్యాడు.
ఇది కూడా చదవండి: ఆవు మొదలు ఆడ కుక్క వరకూ.. చెత్తపనులుచేసే మసలోడికి అరదండాలు!
2019-20లో కమర్షియల్ టాక్స్ అధికారిగా..
చివరాఖరికి 2019-20లలో కమరూ పోటీపరీక్షల్లో విజయం సాధించాడు. కమర్షియల్ టాక్స్ అధికారిగా పదవీ బాధ్యతలు చేపట్టాడు. రత్నాం జిల్లాలో అతనికి పోస్టింగ్ వచ్చింది. ఈ నేపధ్యంలో అతను జోబట్ ప్రాంతానికి చెందిన మరో యువతితో సంబంధం పెట్టుకున్నాడు. మమతను ఆమె పుట్టింటికి పంపివేసి, ఆ యువతితో ఉండసాగాడు. వారిద్దరూ ఆరేళ్లుగా కలిసే ఉంటున్నారు.
మమత పెళ్లి వెనుక..
మమత తెలిపిన వివరాల ప్రకారం ఆమెకు మొదటి వివాహం 16 ఏళ్ల క్రితం జరిగింది. పెళ్లియన రెండేళ్లకే ఆమె భర్త మరణించాడు. ఆ మెదటి భర్తతో ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు 15 ఏళ్ల వయసులో మృతి చెందాడు. కమరూ.. మమతకు దూరపు బంధువు. ఈ నేపధ్యంలో ఇద్దరిమధ్య ప్రేమ చిగురించింది. అనంతరం ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.
భర్త చేతిలో మోసపోయి..
ఆ సమయంలో కమరూ చదువుకునేవాడు. అతను చదువు కొనసాగించేందుకు మమత ఎంతగానో సహాయం చేసింది. కమరూ తనకు ఉద్యోగం వచ్చాక పూర్తిగా మారిపోయాడు. ఒక ఆదివాసీ మహిళను వివాహం చేసుకుని, మమతను విడిచిపెట్టాడు. భర్త కారణంగా మోసపోయిన ఆమె న్యాయం కోసం పలువురు అధికారులకు కలసి వేడుకుంటోంది. భర్త నుంచి నెలకు రూ.12 వేల భరణం ఇప్పించాలని కోరుతూ ఆమె కోర్టు చుట్టూ తిరుగుతోంది.
ఇది కూడా చదవండి: నాటకీయ పరిణామంలో అత్యాచార బాగోతం వెల్లడి..
Comments
Please login to add a commentAdd a comment