left
-
అమ్మను అనాథను చేశాడు!
మన్సూరాబాద్(హైదరాబాద్): రోజు రోజుకూ మానవ సంబంధాలు దిగజారిపోతున్నాయి. కన్నతల్లిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కుమారుడు ఆమెను రోడ్డుపై ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయాడు. వృద్ధురాలి దీనస్థితిని గమనించిన కాలనీవాసులు అక్కున చేర్చుకుని అన్న పానీయాలు అందించి ఆశ్రయం కల్పించారు. ఈ ఘటన మన్సూరాబాద్‌లో చోటుచేసుకుంది. వృద్ధురాలు చెప్పిన వివరాల ప్రకారం.. భువనగిరి– యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం వావిళ్లపల్లి గ్రామానికి సమీపంలోని సీత్యా తండాకు చెందిన ధర్మీ (80)కి ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె. వీరిలో ఇద్దరు పెద్ద కుమారులు గతంలోనే చనిపోయారు. చిన్న కుమారుడు లక్ష్మణ్ నాయక్ వద్ద ధర్మీ ఉంటోంది. లక్ష్మణ్‌నాయక్ బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చాడు. ఎల్బీనగర్లో ఉంటూ ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. గురువారం సాయంత్రం లక్ష్మణ్‌నాయక్ తన తల్లి ధరీ్మని మన్సూరాబాద్‌లోని చిత్రసీమ కాలనీలోని లిటిల్ చాంప్ స్కూల్ వద్ద తన ఆటోలో తీసుకువచ్చి వదిలేసి వెళ్లిపోయాడు. దిక్కుతోచని స్థితిలో వృద్ధురాలు ధర్మీ కాలనీలోని రోడ్ నంబర్–4లో ఓ మూలన కూర్చుండిపోయింది. రాత్రి 10 గంటల ప్రాంతంలో కాలనీకి చెందిన రిటైర్డ్ అధికారి బొప్పిడి కరుణాకర్‌రెడ్డి, సైదులు గమనించి వివరాలు తెలుసుకునేందుకు ప్రయతి్నంచారు. తన కుమారుడు ఆటోలో తీసుకువచ్చి ఇక్కడ వదిలేసి వెళ్లాడని చెప్పింది. దీంతో ఆమెకు ఆశ్రయం కల్పించి ఈ సమాచారాన్ని 108తో పోలీసులకు అందించారు. శుక్రవారం ఉదయం 11 గంటల వరకూ వృద్ధురాలి కోసం ఎవరూ రాకపోవడంతో కాలనీ వాసులు వనస్థలిపురం పోలీసులకు సమాచారం అందించారు. అబ్దుల్లాపూర్ మెట్ సమీపంలోని ఆలేటి వృద్థాశ్రమానికి ధరీ్మని తరలించారు. కన్నతల్లిని నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిన కుమారుడికి తగిన బుద్ధి చెప్పాలని కాలనీ వాసులు కోరారు. -
ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసిన స్మృతీ ఇరానీ
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేశారు. ఆమె గత పదేళ్లుగా ఈ బంగ్లాలో ఉంటున్నారు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆమె ప్రభుత్వం కేటాయించిన నివాసాన్ని ఖాళీ చేయవలసి వచ్చింది. ఎన్నికల్లో ఓడిపోయిన ఎంపీలంతా జూలై 11లోగా తమ నివాసాలను ఖాళీ చేయాల్సివుంది. దీనిపై స్మృతీ ఇరానీకి నోటీసు రావడంతో ఆమె బంగ్లాను ఖాళీ చేశారు.2024 లోక్‌సభ ఎన్నికల్లో స్మృతి ఇరానీ యూపీలోని అమేథీ నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆమె ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ నేపధ్యంలో ఆమె నివాసం ఉంటున్న ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలంటూ ఆమెకు పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని స్టేట్ డైరెక్టర్ నుంచి నోటీసు వచ్చింది. దీంతో ఆమె బంగ్లాను ఖాళీ చేశారు. -
కాంగ్రెస్‌పై మమతా బెనర్జీ సంచలన కామెంట్స్
కలకత్తా: ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఆమె ఇండియా కూటమి పార్టీలు కాంగ్రెస్, వామపక్షాలపైనే విరుచుకుపడ్డారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీతో కలిసి కాంగ్రెస్, వామపక్షాలు తృణమూల్ కాంగ్రెస్‌పై కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. అసలు ఇండియా కూటమిని ఏర్పాటు చేసిందే తానని, కూటమికి ఇండియా అనే పేరు కూడా తానే పెట్టానన్నారు. ఇంత చేస్తే పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ బీజేపీ కోసం పనిచేస్తోందని మండిపడ్డారు. ‘రాష్ట్రంలో బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్,వామపక్షాలకు ఎవరూ ఓటు వేయకండి’అని మమత పిలుపునిచ్చారు. కాగా,లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమిలో భాగంగా తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పశ్చిమబెంగాల్లో పొత్తు కుదరలేదు. సీట్ల పంపకం ఒప్పందం కుదరకపోవడం వల్లే ఒంటరిగా పోటీ చేయాల్సి వచ్చిందని తృణమూల్ ప్రకటించింది. ఇదీ చదవండి.. కోయంబత్తూరులో రూ.1000 కోట్లు.. బీజేపీ చీఫ్ సంచలన ఆరోపణలు -
స్కూలు వ్యానులో తిరుగుతూ.. అత్యధిక ఆదాయం సంపాదిస్తూ..
డబ్బు సంపాదించడం అంత తేలికైన పనేమీ కాదు. ఎంతో కష్టపడితేనే తగిన ఆదాయం వచ్చి, జీవితం సజావుగా సాగుతుంది. అయితే దీనికి భిన్నమైన సిద్దాంతాన్ని అనుసరిస్తున్న ఒక మహిళ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ మహిళ పేరు అలిస్ఎవర్డీన్(32). అమెరికాలోని ఆస్టిన్‌లో ఉంటోంది. అలిస్ గతంలో ఒక కంపెనీలో పనిచేసేది. అక్కడ ఆమె వారానికి 50 నుండి 60 గంటలు పని చేయాల్సి వచ్చేది. దీనికి విసిగిపోయిన ఆమె ఉద్యోగం వదిలివేయాలని నిర్ణయించుకుంది. తరువాత ఆమె ఒక స్కూల్ వ్యాన్ కొనుగోలు చేసి, దానిని తన ఇంటిలా మలచుకుంది. ప్రస్తుతం ఆమె ఆ స్కూలు వ్యానులో దేశమంతా తిరుగుతోంది. తనకు నచ్చినట్టు జీవితాన్ని గడుపుతున్న ఆలిస్ ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ వర్క్ ద్వారా కోటి రూపాయలకు పైగా మొత్తాన్ని సంపాదిస్తోంది. ఆలిస్ ఫ్రీలాన్సర్ కంటెంట్ మేనేజర్‌గా పనిచేస్తోంది. ఆమె రోజుకు రెండు నుంచి మూడు గంటలు మాత్రమే పనిచేస్తుంది. గతంలో ఆఫీసుకు వెళ్లి సంపాదించిన దానికంటే ఇప్పుడు రెట్టింపు సంపాదిస్తున్నానని అలిస్ తెలిపింది. ఆలిస్ వాయిస్ ఓవర్ వర్క్‌తో పాటు యూజర్ జనరేటెడ్ కంటెంట్ (యూజీసీ)కి సంబంధించిన వీడియోలను కూడా రూపొందిస్తుంటుంది. దీంతోపాటు ఇతర ప్రాజెక్ట్‌లలోనూ పనిచేస్తుంది. ఫలితంగా ఆమెకు అత్యధిక ఆదాయం వస్తోంది. టెక్సాస్‌లో నివసించడం చాలా ఖరీదైనదని, పాఠశాల బస్సులో నివసించడం ఎంతో చౌక అని అలిస్ తెలిపింది. పార్కింగ్, ఆహారం కోసం మాత్రమే డబ్బు చెల్లిస్తే సరిపోతుందని ఆమె పేర్కొంది. పార్కింగ్‌కు నెలకు ఆరు వేలు, పెట్రోలుకు రూ.80 వేలు, ఆహార ఖర్చులకు 20 నుంచి 40 వేల రూపాయలు వెచ్చించాల్సి వస్తోందని ఆమె తెలిపింది. ఈ మొత్తం టెక్సాస్‌లో నివసించడం కంటే చౌకైనదని ఆమె వివరించింది. -
Rameshwaram Cafe Bomb Blast: రవ్వ ఇడ్లీ తీసుకుని, ‘బ్యాగు’ను వదిలి..
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడుకు సంబంధించిన ఆసక్తికర మరో అప్డేట్ ముందుకు వచ్చింది. అనుమానితుడు తన బ్యాగ్‌ను రెస్టారెంట్లో ఉంచే ముందు, రవ్వ ఇడ్లీని తీసుకోవడం చూశానని కేఫ్ యజమాని దివ్య రాఘవేంద్రరావు మీడియాకు తెలిపారు. రామేశ్వరం కేఫ్ వైట్‌ఫీల్డ్ అవుట్‌లెట్‌లో పేలుడుకు దారితీసిన సంఘటనల క్రమాన్ని దివ్య రాఘవేంద్రరావు వివరిస్తూ ‘పేలుడు జరిగినప్పుడు నా మొబైల్ ఫోన్ నా దగ్గర లేదు. నేను దానిని తీసుకోగానే, దానిలో చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి. నేను మా సిబ్బందికి కాల్ చేయగా, వారు రెస్టారెంట్లో పేలుడు జరిగిందని చెప్పారు. తొలుత వంటగదిలో ఏదో కారణంగా పేలుడు సంభవించిందని అనుకున్నాను. కానీ వంటగదిలో పేలుడుకు సంబంధించిన ఆనవాళ్లు లేవు. దీంతో కస్టమర్లున్న ప్రాంతంలో పేలుడు జరిగిందని గుర్తించాం. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాక మాస్క్, మఫ్లర్ ధరించిన ఓ వ్యక్తి బిల్లింగ్ కౌంటర్ వద్దకు వచ్చి, రవ్వ ఇడ్లీ ఆర్డర్ చేసినట్లు కనిపించింది. Bengaluru cafe blast suspect caught on CCTV. Wearing a cap 👇#RameshwaramCafe#BengaluruBlast pic.twitter.com/NjlnEiAOzL — Stranger (@amarDgreat) March 2, 2024 అతను ఆర్డర్ తీసుకున్న తర్వాత ఒక మూలన కూర్చున్నాడు. ఆ ఇడ్లీలను తీనేశాక, రెస్టారెంట్ నుండి బయటకు వెళ్లే ముందు బ్యాగ్‌ను ఒక మూలన ఉంచాడు. ఇది జరిగిన కొద్ది సమయానికే పేలుడు సంభవించింది. అదృష్టవశాత్తూ పేలుడు జరిగిన చోట సిలిండర్లు లేవు. నేను ఇటీవలే బిడ్డకు జన్మనిచ్చాను. రామేశ్వరం కేఫ్, ఈమధ్యనే పుట్టిన నా బిడ్డ.. రెండింటిలో ఎలాంటి తేడా లేదు. మా అవుట్లెట్కు జరిగిన నష్టం తీవ్రంగా బాధిస్తోంది. రామేశ్వరం కేఫ్ త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది. మరింత పటిష్టమైన భద్రతా వ్యవస్థతో పనిచేస్తుంది. కేఫ్ పేలుడులో ఎటువంటి ప్రాణ నష్టం జరగనందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని కేఫ్ యజమాని దివ్య రాఘవేంద్రరావు పేర్కొన్నారు. -
కరీంనగర్: ముసలమ్మ నాకొద్దు!
నవ మాసాలు మోసి కనాలి. పాలిచ్చి పెంచాలి. అడిగివన్నీ చేసి పెట్టాలి. అపురూపంగా చూసుకోవాలి. కానీ, వయసు మీద పడితే.. ఆ తల్లి భారమైపోతుందా?.. అలాగే అనుకున్నాడు ఇక్కడ ఓ కొడుకు.. వృద్ధురాలైన తన తల్లిని చూసుకోలేనంటూ చలిలో రోడ్డు పక్కన పడేశారు. కరీంనగర్ శంకరపట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన బొల్లం లచ్చమ్మకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. భర్తతోపాటు పెద్ద కొడుకు రాజయ్య, ఓ కూతురు కొన్నాళ్ల కిందట చనిపోయారు. వయసు పైబడడంతోపాటు ఇళ్లు పాడుబడి పోయింది. దీంతో ఆమె ఇద్దరు కొడుకుల కుటుంబాలు వంతులవారీగా లచ్చమ్మను చూసుకుంటూ వస్తున్నారు. రాజయ్య కుటుంబం మహారాష్ట్రంలో ఉంటోంది. తమ వంతు ముగియడంతో శుక్రవారం లచ్చమ్మను వాహనంలో తాడికల్ తీసుకొచ్చి దిగబెట్టింది. అయితే తల్లిని ఇంట్లోకి రానివ్వకుండా చిన్న కొడుకు కుటుంబం అడ్డుకుంది. రాజయ్య కొడుకు వెళ్లిపోయే దాకా చూసి.. ఆటోలో పాత ఇంటి సమీపంలో రోడ్డు పక్కన దించేశాడు. చలిలో రోడ్డు మీద వణుకుతూ కనిపించిన లచ్చమ్మను స్థానికులు చూశారు. డయల్ 100కు సమాచారం అందించారు. పోలీసులు చిన్న కొడుకును పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చే యత్నం చేశారు. కానీ, అతను ముసలి అమ్మ వద్దంటూ కరాకండిగా చెప్పేశాడు. కావాలంటే పాత ఇంట్లో ఆమె ఉండొచ్చని.. తిండి కావాలంటే అక్కడికే తీసుకెళ్లి ఇస్తానని చెప్పాడు. దీంతో.. చేసేది ఏం లేక ఆ 80 ఏళ్ల వృద్ధురాలిని పోలీసులు ఆమె పాత ఇంటి వద్ద దిగబెట్టారు. -
రైళ్లను వదిలేసి వెళ్లిపోయిన లోకోపైలట్లు.. ప్రయాణికులకు గంటలకొద్దీ నరకం!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలోని బుర్వాల్ జంక్షన్లో బుధవారం రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు గంటలకొద్దీ ఆగిపోయాయి. తమ డ్యూటీ అయిపోయిందని ఒక లోకోపైలట్, ఒంట్లో నలతగా ఉందని మరో లోకోపైలట్ రైళ్లను వదిలేసి వెళ్లిపోయారు. దీంతో రెండు రైళ్లలోని సుమారు 2,500 మంది ప్రయాణికులు గంటల కొద్దీ నరకం చేశారు. రైలు లోపల నీరు, ఆహారం, విద్యుత్ సరఫరా కూడా లేకపోవడంతో ఆగ్రహానికి గురైన ప్రయాణికులు నిరసనకు దిగారు. రైలు పట్టాల మీదకు వచ్చి ఇతర రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. సహర్సా - న్యూఢిల్లీ స్పెషల్ ఫేర్ ఛత్ పూజ స్పెషల్ (04021), బరౌని-లక్నో జంక్షన్ ఎక్స్‌ప్రెస్ (15203) రైళ్లలో ఈ సంఘటన జరిగింది. కొన్ని గంటల తర్వాత పరిస్థితిని శాంతింపజేయడానికి ఈశాన్య రైల్వే ఆగిపోయిన రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు గోండా జంక్షన్ నుంచి సిబ్బందిని పంపించింది. రైల్వే ప్రకారం.. సహర్సా నుంచి నవంబర్ 27న రాత్రి 7.15 గంటలకు బయలుదేరాల్సిన సహర్సా - న్యూఢిల్లీ స్పెషల్ ట్రైన్ నవంబరు 28న ఉదయం 9.30 గంటలకు బయలుదేరింది. దీంతో ఈ రైలు 19 గంటలు ఆలస్యంగా గోరఖ్‌పూర్ చేరుకుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌కు బుర్వాల్ జంక్షన్లో హాల్ట్ లేదు, కానీ మధ్యాహ్నం 1:15 గంటలకు షెడ్యూల్ లేకుండా ఆగింది. మరో రైలు బరౌని-లక్నో జంక్షన్ ఎక్స్‌ప్రెస్ అప్పటికే 5.30 గంటలకు పైగా ఆలస్యంగా నడుస్తోంది. సాయంత్రం 4.04 గంటలకు ఈ ట్రైన్ బుర్వాల్ జంక్షన్‌కు చేరుకుంది. ఇక్కడే ఈ రైలు సిబ్బంది కూడా వెళ్లిపోయారు. 25 గంటల 20 నిమిషాల్లో తమ ప్రయాణం ముగియాల్సి ఉండగా రైలు ఆలస్యం కారణంగా మూడో రోజూ రైలులోనే గడపాల్సి వచ్చిందని సహర్సా నుంచి తన బంధువులతో కలిసి న్యూఢిల్లీకి వెళ్తున్న ఒక ప్రయాణికుడు వాపోయారు. నిద్రమత్తు కారణంగా లోకో పైలట్లు, రైలు గార్డ్ రైలు వదిలి వెళ్లిపోయారని ఆరోపించారు. రైల్లో నీరు, ఆహారం కోసం ప్యాంట్రీ కారు లేదని, విద్యుత్ సరఫరా కూడా లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడినట్లు ఆయన పేర్కొన్నారు. -
పాలేరు కోసం సీపీఎం.. మునుగోడు కోసం సీపీఐ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, వామపక్షాల పొత్తు వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఆయా పార్టీల మధ్య రాజకీయ అవగాహన కుదిరినా, సీట్లపై ఇంకా అస్పష్టత కొనసాగుతూనే ఉంది. వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వాలు ఇప్పటికీ సీట్లపై కసరత్తు చేస్తూనే ఉన్నాయి. సీపీఐ, సీపీఎంలకు చెరి రెండేసి అసెంబ్లీ స్థానాలు, చెరో ఎమ్మెల్సీ ఇచ్చేలా అంగీకారం కుదిరింది. సీపీఐ కొత్తగూడెం, మునుగోడు కోరుతుండగా, సీపీఎం మాత్రం మిర్యాలగూడతో పాటు భద్రాచలం లేదా పాలేరు స్థానాలను ప్రతిపాదించింది. సీపీఐకి కొత్తగూడెం స్థానం ఇచ్చేందుకు అంగీకారం తెలిపిన కాంగ్రెస్, మునుగోడుకు బదులు చెన్నూరు స్థానాన్ని ఇస్తామని తేల్చి చెప్పింది. అయితే చెన్నూరు తమకు వద్దని, మునుగోడు ఇవ్వాల్సిందేనని సీపీఐ పట్టుబడుతోంది. ఒకటి మీరడిగేది.. రెండు మేమిచ్చేది తీసుకోండి కాంగ్రెస్ మాత్రం ‘మీరడుగుతున్న రెండు స్థానాల్లో ఒకటి మీరు కోరుకున్న సీటు ఇస్తాం. మరోటి మేం ఇచ్చే సీటు తీసుకోవాలని’చెబుతోంది. దీంతో సీపీఐ కంగుతింది. ఇక సీపీఎం విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే సూత్రాన్ని అమలు చేయనుంది. దీంతో కాంగ్రెస్ చెప్పిన ఏదో ఒక స్థానంలో పోటీ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మిర్యాలగూడ స్థానాన్ని సీపీఎంకు ఇచ్చేందుకు అంగీకరించిన కాంగ్రెస్, మరో స్థానం విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వడంలేదు. పాలేరు నుంచి పొంగులేటి? పొంగులేటి, తుమ్మల ఇప్పుడు కాంగ్రెస్‌లో రాష్ట్రస్థాయిలో ప్రముఖులుగా ఉన్నారు. దీంతో పొంగులేటికి పాలేరు, తుమ్మలకు ఖమ్మం స్థానాలు ఇచ్చే యోచనలో కాంగ్రెస్ ఉంది. ఈ నేపథ్యంలో పాలేరు స్థానాన్ని సీపీఎంకు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ స్థానంలో సీపీఎం తరపున ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అభ్యర్థిగా ఉండాలని భావిస్తున్నారు. ఆ స్థానం ఇవ్వకుంటే పొత్తుకు సీపీఎం అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదు. విచిత్రమేంటంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీపీఎం కోరే సీట్లన్నీ కీలకమైనవే. గతంలో మధిర స్థానాన్ని కూడా సీపీఎం ప్రతిపాదించింది. ఆ స్థానంలో భట్టి విక్రమార్క అనేకసార్లు విజయం సాధించారు. ఇలా కాంగ్రెస్‌కు పట్టున్న స్థానాలను సీపీఎం కోరుతుండటంతో కాంగ్రెస్ పార్టీ చిక్కుల్లో పడింది. ఏదిఏమైనా ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం కోర్టులో లెఫ్ట్ సీట్ల వ్యవహారం ఉంది. పొత్తు అంశం త్వరగా కొలిక్కి రావాలని కామ్రేడ్లు వేచి చూస్తున్నారు. భద్రాచలం ఇచ్చినా బాగుండేదంటున్న సీపీఎం... సీపీఎం మాత్రం పాలేరు లేదా భద్రాచలం కోరింది. అయితే భద్రాచలంలో తమ అభ్యర్థిని ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించింది. తమ సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని ఎలా ఇస్తామని కాంగ్రెస్ చెబుతోంది. దీంతో ఇప్పుడు పాలేరు స్థానంపై సీపీఎం పట్టుబడుతోంది. కానీ కాంగ్రెస్ పార్టీ దీనికి అంగీకరించే పరిస్థితులు కనిపించడంలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో మూడు మాత్రమే జనరల్ స్థానాలు ఉండగా, మిగిలినవన్నీ రిజర్వుడు స్థానాలు. ఈ నేపథ్యంలో జనరల్ స్థానాల్లో కొత్తగూడెంను సీపీఐకి కాంగ్రెస్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి మరో రెండు జనరల్ స్థానాలే మిగిలాయి. వాటిల్లో సీపీఎంకు పాలేరు ఇస్తే జనరల్ స్థానం ఖమ్మం ఒకటే మిగులుతుంది. కానీ ఆ జిల్లాలో కాంగ్రెస్‌కు కీలకమైన నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావులకు టికెట్ ఇవ్వాల్సి ఉంది. -
నిరుద్యోగ భర్తకు చేదోడువాదోడు.. అధికారి కాగానే ఆమెకు అన్యాయం చేస్తూ..
ఆ బాధిత మహిళ న్యాయం కోసం కళ్లుకాయలు కాచేలా ఎదురుచూస్తోంది. ఆమె పేరు మమత. తన భర్త పెద్ద ఆఫీసర్ కాగానే తనను విడిచిపెట్టి మరో వివాహం చేసుకుని తనకు అన్యాయం చేశాడని ఆమె ఆరోపిస్తోంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం వారి పెళ్లినాటికి భర్త నిరుద్యోగి. దీంతో ఆమె కూలీ పనులు చేసి, అతని ఉన్నత చదువులకు ఆసరా అందించి, అతను పెద్ద ఆఫీసర్ అయ్యేందుకు సహాయపడింది. అయినా ఆమెకు అన్యాయమే ఎదురయ్యింది. నిరుద్యోగిగా ఉన్న భర్తను చదివించి.. ఈ ఉదంతం మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ఒక మహిళ రోదిస్తూ మీడియా ముందు తన గోడు వెళ్లగక్కింది. మమతకు 2015లో కమరూ హఠీలేతో వివాహం జరిగింది. కమరూ ఆ సమయంలో నిరుద్యోగి. అయితే గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు. నిరుద్యోగిగా ఉన్న భర్తకు ఆమె అన్ని విధాలుగా చేదోడువాదోడుగా నిలిచింది. ఆమె అండతో కమరూ పెద్ద అధికారి అయ్యాడు. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇళ్లలో వంట పనులు చేస్తూ.. భర్తను చదివించేందుకు ఆమె పలు ఇళ్లలో వంట పనులు, పాచిపనులు చేసింది. కొన్నిరోజులు దుకాణాలలోనూ పనిచేసింది. ఇలా వచ్చిన ఆదాయంతో భర్తను ఉన్నత చదువులు చదివించింది. భార్య సాయంతోనే అతను పోటీ పరీక్షలకు కూడా సిద్ధం అయ్యాడు. ఇది కూడా చదవండి: ఆవు మొదలు ఆడ కుక్క వరకూ.. చెత్తపనులుచేసే మసలోడికి అరదండాలు! 2019-20లో కమర్షియల్ టాక్స్ అధికారిగా.. చివరాఖరికి 2019-20లలో కమరూ పోటీపరీక్షల్లో విజయం సాధించాడు. కమర్షియల్ టాక్స్ అధికారిగా పదవీ బాధ్యతలు చేపట్టాడు. రత్నాం జిల్లాలో అతనికి పోస్టింగ్ వచ్చింది. ఈ నేపధ్యంలో అతను జోబట్ ప్రాంతానికి చెందిన మరో యువతితో సంబంధం పెట్టుకున్నాడు. మమతను ఆమె పుట్టింటికి పంపివేసి, ఆ యువతితో ఉండసాగాడు. వారిద్దరూ ఆరేళ్లుగా కలిసే ఉంటున్నారు. మమత పెళ్లి వెనుక.. మమత తెలిపిన వివరాల ప్రకారం ఆమెకు మొదటి వివాహం 16 ఏళ్ల క్రితం జరిగింది. పెళ్లియన రెండేళ్లకే ఆమె భర్త మరణించాడు. ఆ మెదటి భర్తతో ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు 15 ఏళ్ల వయసులో మృతి చెందాడు. కమరూ.. మమతకు దూరపు బంధువు. ఈ నేపధ్యంలో ఇద్దరిమధ్య ప్రేమ చిగురించింది. అనంతరం ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. భర్త చేతిలో మోసపోయి.. ఆ సమయంలో కమరూ చదువుకునేవాడు. అతను చదువు కొనసాగించేందుకు మమత ఎంతగానో సహాయం చేసింది. కమరూ తనకు ఉద్యోగం వచ్చాక పూర్తిగా మారిపోయాడు. ఒక ఆదివాసీ మహిళను వివాహం చేసుకుని, మమతను విడిచిపెట్టాడు. భర్త కారణంగా మోసపోయిన ఆమె న్యాయం కోసం పలువురు అధికారులకు కలసి వేడుకుంటోంది. భర్త నుంచి నెలకు రూ.12 వేల భరణం ఇప్పించాలని కోరుతూ ఆమె కోర్టు చుట్టూ తిరుగుతోంది. ఇది కూడా చదవండి: నాటకీయ పరిణామంలో అత్యాచార బాగోతం వెల్లడి.. -
నిర్ధాక్షిణ్యంగా బిడ్డను వదిలేసింది..అదే ఉచ్చులా మారి కటకటాల్లోకి నెట్టింది!
నాలుగేళ్ల క్రితం నాటి కేసు అనుహ్యంగా ఆమె అరెస్టుతో చిక్కుముడి వీడింది. ఆమె బిడ్డను కని వదిలించేసుకున్నా.. అనుకుంది. కనివినీ ఎరుగని రీతిలో అదే తనకు ఉచ్చులా బిగిసి జైల్లోకి వెళ్లేలా చేస్తుందని ఊహించుకుని కూడా ఉండదు ఆ తల్లి. ఈ షాకింగ ఘటన యూఎస్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..యూఎస్‌లోని జార్జియాలో ఓ మహిళ ఆడ శిశువుని కని నిర్ధాక్షిణ్యంగా అడవిలో ఒక చెక్పెట్టేలో వదిలేసింది. సమీపంలోని ఓ కుటుంబం ఫోర్సిత్ కౌంటీ షెరీఫ్(పోలీసులు)కు సమాచారం అందించడంతో వారు ఆ శిశువుని స్వాధీనం చేసుకుని ఆస్పత్రిలో జాయిన్ చేశారు. ఆ చిన్నారికి ప్రస్తుతం నాలుగేళ్లు. ఆమె పూర్తి ఆరోగ్యంతో బాగానే ఉంది. సదరు ఆస్పత్రి ఆ చిన్నారిని 'బేబి ఇండియాగా' పిలిచేది. ఆ తర్వాత ఆ శిశువును ఒక కుటుంబం దత్తత కూడా తీసుకుంది. అయితే కౌంటీ షెరీఫ్ ఆ చిన్నారి గోప్యత నిమిత్తం పూర్తి వివరాలను అందించలేదు. ఐతే ఆ శిశువుని ఎవరో అలా వదిలేశారనే దానిపై గత నాలుగేళ్లుగా కౌంటీ షెరీఫ్ అధికారులు దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. పది నెలల క్రితం ఆ శిశువు డీఎన్ఏ ఆధారంగా ఆ చిన్నారి తండ్రిని పట్టుకోగలిగారు. గానీ ఆ మహిళ గర్భవతి అని కూడా అతనికి తెలియకపోవడం, ఆమెను వదిలేశానని చెప్పడం తదితర కారణాలతో కేసు మళ్లి మొదటికి వచ్చినట్లు అనిపించింది అధికారులకు. చేసేదేమిలేక అధికారులు సదరు తండ్రిని అరెస్టు చేయకుండా వదిలేశారు. ఎట్టకేలకు వారి దర్యాప్తు ఫలించి..ఆ చిన్నారి తల్లి ఆచూకిని కనుగొనడమే గాక బిడ్డ తల్లిని కరిమా జివానీగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఆమె ప్రసవం తర్వాత వదిలేయాలనే ఉద్దేశ్యంతోనే ఓ కారులో నిర్మానుష్యమైన అడవికి వచ్చినట్లు పేర్కొంది. అక్కడే ప్రసవించి శిశువుని ఓ ప్లాస్టిక్ సంచిలో చుట్టి ఓ చెక్కబాక్స్లో ఉంచినట్లు విచారణలో ఒప్పుకుంది. జార్జియ నిబంధనల ప్రకారం ఆస్పత్రి, పోలీస్టేషన్, అగ్నిమాపక స్టేషన్లో పిల్లలను వదిలేసినట్లయితే ఎలాంటి నేరారోపణ ఎదుర్కొనవలసిన అవసరం లేదు. కానీ ఈ తల్లి కనీసం అలాంటి నిబంధనలను ఏమి ఉపయోగించకుండా ఆ శిశువు చనిపోవాలనే ఉద్దేశంతోనే ఇలా నిర్మానుష్యమైన అడవిలో వదిలేసిందని కౌంటీ షరీష్ అధికారులు చెప్పుకొచ్చారు. దేవుడిలా ఓ కుటుంబ మాకు సమాచారం అందించడంతోనే ఆ శిశువుని కాపాడగలిగామని చెప్పారు. ఈ మేరకు అధికారులు నాలుగేళ్ల అనంతరం సదరు మహిళపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఐతే ఆ తల్లి జివానీకి మరో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు తెలిపారు అధికారులు. ఎప్పుడో చేసిన నేరం కనుమరగవుతుందనుకుంటే నీడలా వెంటాడి దోషిలా పట్టించేంత వరకు వదలలేదు ఆ తల్లిని. (చదవండి: ఓ తండ్రి దుశ్చర్య.. పొరపాటున తన కూతుర్ని ఢీ కొట్టాడని ఆ బుడ్డోడిని..) -
ఆస్పత్రి నుంచి 23 మంది కరోనా బాధితులు పరార్
ఢిల్లీ: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులు చెప్పాపెట్టకుండా అదృశ్యమయ్యారు. ఆస్పత్రి సిబ్బందికి చెప్పకుండా ఎక్కడికి వెళ్లారో తెలియదు. అలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 23 మంది ఆస్పత్రి నుంచి పరారయ్యారు. ఈ ఘటన ఢిల్లీలోని బారా హిందూ రావ్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. అకస్మాత్తుగా మాయమవుతుండడంతో ఆస్పత్రి అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్డీఎంసీ) మేయర్ జై ప్రకాశ్ వెల్లడించారు. హిందూ రావు ఆస్పత్రిలో మొత్తం 250 బెడ్లు ఉన్నాయి. ప్రస్తుతం కరోనా ఆస్పత్రిగా మార్చారు. బెడ్లన్నీ ఎప్పుడూ నిండుగా ఉంటున్నాయి. అయితే రికార్డుల్లో ఏప్రిల్ 19 నుంచి మే 6వ తేదీ వరకు జాబితా పరిశీలించగా 23 మంది కనిపించలేదు. వారు చెప్పాపెట్టకుండా వెళ్లిపోయారని గుర్తించారు. అయితే ఆ కరోనా బాధితులు మంచి సౌకర్యాలు ఉన్న ఆస్పత్రిలో చేరేందుకు వెళ్లి ఉంటారని మేయర్ చెప్పారు. ఈ విధంగా ఢిల్లీలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరగడం సాధారణంగా మారిందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. చదవండి: కరోనా కల్లోలం: 14 రాష్ట్రాల్లో లాక్డౌన్ చదవండి: హిందూ యువతికి పాక్‌లో అత్యున్నత పదవి -
ప్రేమించిన యువతితో పెళ్లి వద్దన్నారని..
సాక్షి, హైదరాబాద్ (సైదాబాద్): ప్రేమించిన యువతితో పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు నిరాకరించడంతో ఓ యువకుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. సైదాబాద్ సబ్ ఇన్స్పెక్టర్ రామ్‌లాల్ నాయక్ తెలిపిన వివరాలు.. మాధవనగర్‌లో నివసించే జి.నాగేశ్వర్ కుమారుడు ప్రజ్వల్ (28) ఎంబీఏ చదువుతున్నాడు. తాను ప్రేమించిన యువతితో పెళ్లి చేయమని ఇంట్లో తల్లిదండ్రులను కోరాడు. అయితే తండ్రి ఇప్పుడు కాదు తర్వాత చూద్దామని చెప్పడంతో అలిగిన ప్రజ్వల్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుమారుని గురించి బంధు మిత్రుల దగ్గర విచారించినా ఫలితం లేకపోవటంతో తండ్రి సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రజ్వల్ గతంలోనూ ఇలా ఇంటి నుంచి అలిగివెళ్లి తిరిగివచ్చాడని ఫిర్యాదులు పేర్కొన్నాడు. సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ( చదవండి: పెళ్లి చేసుకుంటావా.. లేదా అంటూ యువతిని నడిరోడ్డుపై ) -
కాంగ్రెస్ అభ్యర్థిపై 193, బీజేపీ అభ్యర్థిపై 242 కేసులు
సాక్షి, న్యూఢిల్లీ : కేరళలోని ఇదుక్కి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డీన్ కురియాకోస్‌పై 193 కేసులు ఉన్నాయి. ఎన్నికల్లో పోటీ చేసినట్లయితే ఆ కేసుల వివరాలను ఎన్నికల ముందు కనీసం మూడు రోజులపాటు వార్తా పత్రికలు, కనీసం ఒక్క టీవీ ఛానల్ ద్వారా ప్రజలకు తెలియజేయాలని సుప్రీం కోర్టు 2018లో ఆదేశాలు జారీ చేసింది. ప్రముఖ మలయాళ పత్రిక ‘వీక్షణం’లో తనపై నమోదైన కేసులను వివరిస్తూ కురియాకోస్ ఎనిమిది పేజీల యాడ్ ఇచ్చారు. ఆ పత్రిక యాడ్ టారిఫ్ ప్రకారం ఆ యాడ్ కనీసంగా కోటి రూపాయలు అవుతుంది. ఈ ఒక్క కారణంగా ఆయన్ని ఎన్నికల్లో పోటీ చేయకుండా చేయవచ్చు. ఎందుకంటే లోక్‌సభ అభ్యర్థి ఎన్నికల ఖర్చు 70 లక్షల రూపాయలు దాటవద్దు. కురియాకోస్ యాడ్‌ను ఏప్రిల్ 17,18,19 తేదీల్లో పత్రికా ఇదుక్కి ఎడిషన్‌లో ప్రచురించారు. అలాగే ‘జైహింద్ టీవీ’ ఛానల్లో యాడ్‌ను ప్రసారం చేశారు. అయితే ఈ రెండు మీడియా సంస్థలు కాంగ్రెస్ పార్టీకే చెందినవి అవడం వల్ల యాడ్స్‌కు కేవలం 2.4 లక్షల రూపాయలు మాత్రమే చార్జి చేసినట్లు చూపించారు. తమ పార్టీ అభ్యర్థి అవడం వల్ల ఆ మాత్రం రాయితీ ఇవ్వక తప్పలేదని వీక్షణం పత్రిక అడ్వర్టయిజ్ విభాగం అధిపతి అనిల్ జార్జి తెలిపారు. గత ఫిబ్రవరిలో జరిగిన ఇద్దరు యువజన కాంగ్రెస్ కార్యకర్తల హత్యకు నిరసనగా నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలకు సంబంధించే ఆయనపై ఎక్కువ కేసులు నమోదయ్యాయి. పట్టణంతిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కే. సురేంద్రన్‌పై ఏకంగా 242 కేసులు ఉన్నాయి. ఆయన ‘జన్మభూమి’ పార్టీ పత్రికలో మూడు రోజుల పాటు కేసులకు సంబంధించిన యాడ్‌ను ఇవ్వడంతోపాటు ఆరెస్సెస్‌కు చెందిన ‘జనం టీవీ’ ఛానల్లో యాడ్ ఇచ్చారు. పత్రికలో వచ్చిన సురేంద్రన్ యాడ్‌కు టారిఫ్ ప్రకారం 40 లక్షల రూపాయలు అవుతుందని, అయితే ఇంకా బిల్లు చేయలేదని, పార్టీ నాయకత్వంతో మాట్లాడాక బిల్లును సెటిల్ చేస్తామని పత్రిక యాడ్ విభాగం అధిపతి శరత్ చంద్రన్ తెలిపారు. శబరిమల ఆలయంలోకి అన్ని వయస్కుల మహిళలను అనుమతించాలంటూ సుప్రీం కోర్టు జారీ చేసిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఆందోళనా కార్యక్రమాలను నిర్వహించిన కారణంగానే ఆయనపై ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఇక పాలకపక్ష సీపీఎం పార్టీ ఎనిమిది మంది పార్టీ అభ్యర్థుల నేర చరితను వివరిస్తూ పార్టీ పత్రిక ‘దేశాభిమాని’లో ఏప్రిల్ 19, 20, 21 తేదీల్లో వరుసగా యాడ్స్ ఇచ్చింది. వాటి బిల్లు ఎంతయిందని పత్రికా యాజమాన్యాన్ని మీడియా ప్రశ్నించగా, ఈ బిల్లును రూపొందించలేదని, ఎన్నికల అనంతరం బిల్లు సంగతి చూస్తామని చెప్పారు. అభ్యర్థు నేర చరితలకు సంబంధించిన యాడ్స్ బిల్లులను ఎన్నికల ఖర్చు పరిమితి నుంచి తప్పించాలని వివిధ పార్టీలు ఎప్పటి నుంచో కోరుతున్నప్పటికీ ఎన్నికల కమిషన్ మినహాయింపు ఇవ్వడం లేదు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై కేసులు ఉన్నట్లయితే ఆ కేసుల వివరాలను ప్రజలకు బహిర్గతం చేయాలంటూ 2018లో సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను భారత ఎన్నికల కమిషన్ అమలు చేస్తోంది. గతంలో రాజస్థాన్, తెలంగాణ, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, మిజోరమ్ అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లోను సుప్రీం తీర్పును ఎన్నికల కమిషన్ అమలు చేసింది. కేరళలో ప్రతి రాజకీయ పార్టీకి పత్రికలు, టీవీ ఛానళ్లు ఉండడం వల్ల ఎన్నికల పరిమితి వ్యయం నుంచి అభ్యర్థులు తప్పించుకోగలుగుతున్నారు. -
వామపక్షాల అంతర్థానం దేశానికి తీవ్ర విపత్తు!
న్యూఢిల్లీ : తాజాగా జరిగిన త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో మాణిక్ సర్కారు నేతృత్వంలోని వామపక్ష ప్రభుత్వం ఓడిపోయిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ స్పందించారు. వామపక్షాలు అంతర్థానం అవుతుండటం దేశానికి తీవ్ర విపత్తు అని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో వామపక్షాలు బలంగా ఉండాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. నిజానికి కాంగ్రెస్, వామపక్ష పార్టీలు ప్రత్యర్థులు అయినప్పటికీ, వామపక్షాలు లేని లోటును దేశంలో భరించలేదని ఆయన పేర్కొన్నారు. అయితే, సమాజంలో, ప్రజల ఆకాంక్షల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా వామపక్షాలు తమ దృక్పథాన్ని మార్చుకోవాల్సిన అవసరముందని సూచించారు. త్రిపురలో పాతికేళ్లుగా అధికారంలో ఉన్న వామపక్ష కూటమి సర్కారును కూల్చి.. బీజేపీ కూటమి అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. -
త్రిపురలో ఆధిక్యంలోకి వచ్చిన బీజేపీ
-
త్రిపురలో బీజేపీ సంచలనం!
సాక్షి, న్యూఢిల్లీ : కమ్యూనిస్టుల కంచుకోటగా పేరొందిన త్రిపురను కైవసం చేసుకునే దిశగా బీజేపీ సాగుతోంది. ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో 25 ఏళ్ల వామపక్ష పాలనకు చరమగీతం పాడుతూ.. బీజేపీ కూటమి సంచలన విజయం దిశగా సాగుతోంది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి 40కిపైగా స్థానాల్లో ఆధిక్యంలో నిలిచి.. సాధారణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేస్థితిలో పటిష్టంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ నేతృత్వంలోని వామపక్ష కూటమి కౌంటింగ్ ప్రారంభంలో గట్టిపోటీనిచ్చినట్టు కనిపించడంతో త్రిపురలో హోరాహోరీ తప్పదని భావించారు. మొదట్లో బీజేపీ కొంత వెనుకబడినట్టు కనిపించినా.. తాజాగా అందుతున్న ట్రెండ్స్ ప్రకారం.. బీజేపీ కూటమి 42 స్థానాల్లో, వామపక్ష కూటమి 16 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. దీంతో త్రిపురలో బీజేపీ పాగా వేయడం ఖాయమని తేలిపోయింది. ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. త్రిపురలో మొత్తం 59 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటుచేయాలంటే కావాల్సిన సంఖ్యబలం 31. ప్రస్తుత ట్రెండ్స్‌ను బట్టి చూస్తే బీజేపీ కూటమి సునాయాసంగా అధికారం చేపట్టనుందని తెలుస్తోంది. త్రిపురలో 25 ఏళ్లుగా కొనసాగుతున్న వామపక్ష కూటమికి పరాభవం తప్పదని, ఇక్కడ బీజేపీ అధికారం కైవసం చేసుకునే అవకాశం ఉందని రెండు ఎగ్జిట్‌పోల్ సర్వేలు ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. నిజాయితీపరుడిగా పేరొందిన ముఖ్యమంత్రి మాణిక్ సర్కారు నేతృత్వంలోని సీపీఎం కూటమికి ఈసారి గడ్డు పరిస్థితి తప్పకపోవచ్చునని ఎన్నికల సర్వేలు అంచనా వేశాయి. ఎన్నికల ఫలితాలు సర్వేల అంచనాలు నిజమేనని అంటున్నాయి. ఈ ఫలితాలతో బీజేపీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. -
ఏమిటీ మతలబు
పరిహారం లెక్కల్లో భారీ వ్యత్యాసం ∙ మండిపడుతున్న బాధితులు తుని రూరల్ :పోలవరం ఎడమ ప్రధాన కాలువ నిర్మాణంతో ఇళ్లు కోల్పోతున్న బాధితులు తమకు అందించే పరిహారం లెక్కల్లో మతలబులు అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఈ నెల 14న కుమ్మరిలోవ పంచాయతీ కార్యాలయం వద్ద ప్రచురించిన కాలనీ బాధితుల పరిహారం జాబితాపై తహసీల్దార్ కార్యాలయానికి అభ్యంతరాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఒకే విధమైన ఇళ్లకు ఒక్కొక్కరికి ఒక్కోలా పరిహారం నమోదు చేశారు. రెండు పోర్షన్ల ఇళ్లకు కొందరికి రూ.1.28 లక్షలుగా, మరికొంతమందికి రూ.ఐదు నుంచి రూ.ఆరు లక్షలుగా ఇంకొంతమందికి రూ.పది లక్షలకుపైగా రికార్డుల్లో నమోదు చేశారు. మరింత విచిత్రంగా రెండు పోర్షన్ల సాధారణ స్లాబు ఇంటి యజమానిని ఏకంగా కోటిశ్వరుడినే చేసేశారు. ఎంతో కాలంగా సొంత ఇళ్లల్లో నివాసం ఉంటున్న పది మంది బాధితుల పేర్లు పరిహారం జాబితాలో గల్లంతయ్యాయి. అంతూ, పొంతూలేని తప్పుడు లెక్కలను సరిచేసి తమకు న్యాయం చేయాలని గడిచిన వారం రోజుల్లో 50కిపైగా అభ్యంతరాలు తహసీల్దార్ కార్యాలయానికి చేరాయి. రాజకీయ జోక్యంతో అన్యాయం జరిగిందని భావిస్తున్న కొంతమంది కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే జరిగితే కాలువ పనుల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకునే అవకాశం ఉంది. పరిహారం జాబితాపై... పోలవరం ఎడమ కాలువ నిర్మాణానికి వీలుగా తుని మండలం కుమ్మరిలోవ కాలనీలో 309 ఇళ్లు తొలగించాల్సి ఉంది. ప్రకటించిన పరిహారం జాబితాలో 304 పేర్లకే స్థానం లభించింది. బాధిత లబ్ధిదారులను గుర్తించేందుకు ఆరేడేళ్లుగా సర్వేలు చేస్తూ వచ్చారు. ఫిబ్రవరి మొదటి వారంలో బాధితులు, అధికారుల మధ్య ఒప్పందం కుదరడంతో సమస్య కొలిక్కి వచ్చింది. నష్ట పరిహారంతోపాటు అదనంగా రూ.ఐదు లక్షలు, ఇతర ఖర్చులకు రూ.136 లక్షలు, ఇళ్లస్థలాలు, ఇంటి రుణాలు ఇస్తామని అధికారులు ప్రకటించడంతో బాధితులు అంగీకరించారు. ఆ క్రమంలో గత నెలలో రోడ్లు, భవనాల శాఖకు చెందిన ఇంజినీర్ల ఆధ్వర్యంలో ఆ శాఖ అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి కుమ్మరిలోవ కాలనీలో ఇళ్లకు అంగుళం అంగుళం కొలతలు వేశారు. ఎంతెంత పరిహారం ఇవ్వనున్నారో తెలిపే జాబితాలను పంచాయతీ కార్యాలయంలో ఈ నెల14న లబ్ధిదారులకు అందుబాటులో ఉంచారు. జాబితాలో తమ పేర్ల మీద ఉన్న మొత్తాలను చూసుకుని బాధితులు నివ్వెరపోయారు. ఉదాహరణకు నాలుగు సెంట్ల స్థలంలో రెండు ఫోర్షన్లు ఒకే విధమైన పెంకుటిళ్లకు రూ.ఆరేడు లక్షలు పరిహారం అందాల్సి ఉంది. అలాకాకుండా బాధితులు కోట గోవిందుకు రూ.1.28 లక్షలు, గొర్రిపాటి పైడియ్యకు రూ.3.20 లక్షలు, సుర్ల లక్షి్మకి రూ.4.60 లక్షలు, నాలం అచ్చన్నకు రూ.10.18 లక్షలు పరిహారంగా పేర్కొన్నారు. సూరెడ్డి అప్పారావుకు చెందిన రెండు ఫోర్షన్ల స్లాబు ఇంటికి రూ.98,82,045లు పరిహారంగా జాబితాలో చూపించారు. అదనంగా మరో రూ.6.36 లక్షలతో పరిహారం అందుకునే జాబితాలో అప్పారావు కోటీశ్వరుడయ్యాడు. పరిహారం లెక్కింపుల్లో అక్రమాలు జరిగాయని పలువురు బాధితులు అందోళన చెందుతున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు కోరి వారం రోజులైనా ఆర్అండ్బీ అధికారులు స్పందించకపోవడంతో బాధితుల్లో అసహనం పెరుగుతోంది. బినామీ పేర్లపై విచారణ పూర్తి జాబితాలో 45 మంది అర్హుల పేర్లను తొలగించి 117 బినామీ పేర్లను సమోదు చేశారని అజ్ఞాత వ్యక్తులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఈ నెల 15న నాలుగు ప్రత్యేక రెవెన్యూ బృందాలు విచారణ చేశాయి. నివేదిక ఉన్నతాధికారులకు చేరింది. బాధిత ఫిర్యాదులు వాస్తవమే... ఈ విషయంపై తహసీల్దార్ బి.సూర్యనారాయణను వివరణ కోరగా తేడాలు వచ్చినట్టు బాధితులు రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారన్నారు. వాటన్నింటినీ ఆర్ అండ్ బీ అధికారులకు పంపించామన్నారు. ఫిర్యాదులపై ఆర్డీఓ, కలెక్టర్లకు సమాచారం ఇచ్చి బాధితులకు న్యాయం చేస్తామన్నారు. -
తల్లిదండ్రుల్ని వదిలేసిన కన్న కొడుకులు
-
భార్య చనిపోయిందని శవాన్ని వదిలేసిన భర్త
-
కాంగ్రెస్, వామపక్షాలకు కనువిప్పు కావాలి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: బీజేపీపై మతతత్వ ముద్రతో విషం చిమ్మిన కాంగ్రెస్, వామపక్షాలకు అస్సాం ఎన్నికల ఫలితాలతో కనువిప్పు కలగాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. అస్సాంలో బీజేపీ విజయాన్ని పురస్కరించుకుని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం సంబరాలను జరుపుకున్నారు. పెద్ద ఎత్తున బాణసంచా పేల్చారు. మిఠాయిలు పంచుకుని, నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ 40 శాతం మైనారిటీ ఓటర్లున్న అస్సాంలో బీజేపీ ఘనవిజయం సాధించడం ప్రజలు తమ పార్టీవైపే ఉన్నారన్న విషయాన్ని స్పష్టంచేస్తోందన్నారు. టీఆర్ఎస్ ఒంటెత్తు పోకడలను, నియంతృత్వ విధానాలను నిలువరించేవిధంగా బీజేపీ పోరాడుతుందన్నారు. సమస్యలపై బీజేపీ పోరాడుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తిగత విమర్శలకు, బెదిరింపులకు దిగడం సరైందికాదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ప్రభాకర్, నేతలు ప్రేమేందర్‌రెడ్డి విజయలక్ష్మి, సత్యనారాయణ, ఎస్.మల్లారెడ్డి, బద్దం బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కేరళ పీఠం ఎవరిదంటే..??
సోమవారం జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ పాత చరిత్రే పునరావృతమయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆశలు కానీ, కేరళ సీఎం ఊమెన్ చాందీ ఆకాంక్షలు కానీ ఫలించే అవకాశం లేదని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చాటుతున్నాయి. మోదీ అభివృద్ధి అజెండాను, చాందీ ప్రగతి నినాదాన్ని తోసేసి కేరళ వాసులు సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్కు పట్టం కట్టే అవకాశముందని తాజాగా ఇండియా టుడే సర్వే స్పష్టం చేసింది. సీపీఎం నేతృత్వంలోని వామపక్ష కూటమి (ఎల్డీఎఫ్)కు 88 నుంచి 101 సీట్లు వచ్చే అవకాశముందని, ఆ పార్టీ క్లియర్ మెజారిటీతో అధికారాన్ని సొంతం చేసుకుంటుందని ఎగ్జిట్ పోల్ సర్వే తెలిపింది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు 38 నుంచి 48 సీట్లు రావొచ్చునని పేర్కొంది. బీజేపీతోపాటు ఇతరులకు కలిపి సున్నా నుంచి మూడు సీట్ల వరకు వచ్చే అవకాశమున్నట్టు తెలిపింది. కేరళలో మొత్తం 140 స్థానాలు ఉండగా.. మొత్తం అన్ని స్థానాల్లోనూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే తన అభ్యర్థులను నిలిపిన సంగతి తెలిసిందే. -
ప్రీపోల్ సర్వే: కేరళలో గెలుపెవరిదంటే..
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ పాత చరిత్రే పునరావృతమయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆశలు కానీ, కేరళ సీఎం ఊమెన్ చాందీ ఆకాంక్షలు కానీ ఫలించే అవకాశం లేదని సంకేతాలు చాటుతున్నాయి. మోదీ అభివృద్ధి అజెండాను, చాందీ ప్రగతి నినాదాన్ని తోసేసి కేరళ వాసులు సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్కు పట్టం కట్టే అవకాశముందని తాజాగా ప్రీపోల్స్ సర్వే ఒకటి స్పష్టం చేసింది. తిరువనంతపురానికి చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ మానిటరింగ్ ఎకనామిక్ గ్రోత్ (ఐఎంఈజీ) సంస్థ నిర్వహించిన ఈ సర్వేలో ఎల్డీఎఫ్కు 83 నుంచి 90 సీట్లు వచ్చే అవకాశముందని తేలింది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు 50 నుంచి 57 సీట్లు రావొచ్చునని వెల్లడైంది. ఎప్పటిలాగే బీజేపీ కేరళలో మరోసారి ఖాతా తెరిచే అవకాశం లేదని ఈ సర్వే అభిప్రాయపడింది. కేరళలో మొత్తం 140 స్థానాలు ఉండగా.. మొత్తం అన్ని స్థానాల్లోనూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే తన అభ్యర్థులను నిలిపిన సంగతి తెలిసిందే. కేరళలోని దక్షిణ, ఉత్తర, సెంట్రల్ ప్రాంతాల్లో 60వేలమంది ఓటర్ల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఈ ప్రీ పోల్ సర్వే నిర్వహించారు. ఎజావా నేతృత్వంలోని బీజేడీఎస్ బీజేపీకి మద్దతు పలికినప్పటికీ, ఈ కూటమి అభ్యర్థులు గెలిచే అవకాశాలు చాలా స్పల్పంగా ఉన్నాయని సర్వే అభిప్రాయపడింది. కాంగ్రెస్ పార్టీ కి రెబల్ పోరు బాగా ఎక్కువగా ఉంటుందని, రెబల్ అభ్యర్థుల వల్ల ఆ పార్టీ ఏడు స్థానాలు కోల్పోయే అవకాశముందని సర్వే విశ్లేషించింది. సోలార్ కుంభకోణంలో సీఎం ఊమెన్ చాందీ ప్రమేయముందని 63శాతం మంది కేరళ వాసులు ఈ సర్వేలో అభిప్రాయపడ్డారు. ఇక, 51శాతం మంది వామపక్షాల నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి ప్రజా అనుకూల విధానాలను అనుసరిస్తోందని అభిప్రాయపడ్డారు. -
ఆడ కవల పిల్లలు పుట్టారని ఆస్పత్రిలో వదిలేశారు
-
భర్త డబ్బులివ్వలేదని కూతురురిని వదిలేసింది
-
తల్లిదండ్రులు ఉన్నా 'అనాధగా'
-
అక్కడ కొట్టుకుందాం.. ఇక్కడ కలిసివెళ్దాం!
న్యూఢిల్లీ: త్వరలో పశ్చిమ బెంగాల్, కేరళలో అసెంబ్లీ ఎన్నికలు రానుండటంతో కాంగ్రెస్, వామపక్షాల మధ్య పొత్తు అంశం హాట్ టాపిక్‌గా మారింది. పశ్చిమ బెంగాల్లో వామపక్షాలతో కలిసి వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. బెంగాల్లో సుత్తెకొడవలితో కలిసి వెళ్లేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆ రాష్ట్ర కాంగ్రెస్ విభాగం పార్టీ అధిష్ఠానానికి నివేదించినట్టు తెలుస్తోంది. దీంతో వామపక్షాలతో వ్యూహాత్మక సర్దుబాటు చేసుకొని మమతా బెనర్జీని ఎదుర్కోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే, బహిరంగంగా బెంగాల్లో కాంగ్రెస్, వామపక్షాలు పొత్తు పెట్టుకొనే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే అదే సమయంలో కేరళలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటం. అక్కడ ఈ రెండు పార్టీలు బద్ధ శత్రువులుగా ఒకరితో ఒకరు తలపడటం.. ఈ నేపథ్యంలో బెంగాల్‌లోని రాజకీయ సమీకరణలపై ఆ రాష్ట్ర పరిశీలకులుగా ఉన్న కాంగ్రెస్ నేతలు త్వరలోనే అధిష్టానానికి నివేదిక ఇవ్వనున్నారు. అధికార తృణమూల్ కాంగ్రెస్‌ను ఓడించాలనే లక్ష్యంతోనే కాంగ్రెస్, వామపక్షాలు కలిసి ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నాయని, పొత్తు పెట్టుకోవడమే మంచిదనే అభిప్రాయంతో రెండు పార్టీల శ్రేణులు కూడా ఉన్నాయని బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధీర్ రంజన్ చౌదరి పేర్కొన్నారు. కాంగ్రెస్, వామపక్షాల పొత్తుతో బెంగాల్లో రాజకీయ ముఖచిత్రం సమూలంగా మారిపోతుందని ఆయన అన్నారు. -
తవ్వారు.. వదిలేశారు!
ముందుచూపు లేని అధికారులు.. మంజూరైన నిధులు రూ.6 కోట్లు.. నాలుగు నెలల కిందటే పనులు ప్రారంభం తవ్విన రోడ్లు 1.2 కిలో మీటర్లు.. సీసీ వేసిన రోడ్డు 600 మీటర్లు మాత్రమే.. వికారాబాద్: దుమ్ము.. దూళితో పట్టణ ప్రజలు రోజూ అవస్థలు పడుతూ.. శ్వాసకోస వ్యాధులతో ఆస్పత్రుల పాలవుతున్నారు. అనేక ఆరోగ్య సమస్యలతో పట్టణ ప్రజలు భాదపడుతున్నా అధికారులకు మాత్రం చీమకుట్టినట్టయినా లేదు. ‘ఎవరికేమైతే మాకేంటి’ అనే ధోరణిలో పట్టణ వ్యాపారస్తులు వ్యవహరిస్తున్నారు. పట్టణలో పూర్తిస్థాయిలో రోడ్లు వేసి సుందరంగా తీర్చిదిద్దాలని ఆర్అండ్బీ అధికారుల ఆలోచనబాగున్నప్పటికీ.. అమలులో ముందుచూపు లేకపోవడంతో అధికారుల తీరుపై ప్రజలు ఒకింత అసహనాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చే స్తున్నారు. పట్టణ రోడ్డు వెడల్పుపై న్యాయస్థానాల్లో కేసులున్నప్పుడు కాంట్రాక్టర్లతో రోడ్లను ఎలా తవ్విస్తారని అధికారులపై ప్రజలు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. పట్టణంలో ప్రధాన దారులను అడ్డదిడ్డంగా తవ్వి రెండు నెలలకు పైగా అయింది. ఇటు అధికారుల తీరు, అటు వ్యాపారుల వైఖరితో ఇబ్బందులకు గురవుతున్నది మాత్రం సామాన్య ప్రజలే.. రాష్ట్ర ప్రభుత్వం జీఓ నంబర్ 129,130,131లో వికారాబాద్ ఆర్అండ్బీ డివిజన్ పరిధిలో వందల సంఖ్యలో రోడ్లు మంజూరయ్యాయి. పట్టణంలో రోడ్లన్నీ అధికలోడ్‌తో లారీలు వెళ్లడంతో ధ్వంసమవుతున్నాయి. గమనించిన ఆర్అండ్బీ అధికారులు దీర్ఘాకాలంపాటు రోడ్డు ధ్వంసం కాకుండా ఉండేందుకు సీసీ రోడ్డు ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టారు. దీంట్లోభాగంగానే వికారాబాద్ పట్టణం లో 1.5 కిలోమీటరు మేరకు ప్రధాన రహదారులను సీసీ రోడ్డుగా మార్చేందుకు రూ.6 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో నాలుగు నెలల కిందట పట్టణంలో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు బీజేఆర్ చౌరస్తా నుంచి ఆలంపల్లి సీసీ రోడ్డు నిర్మాణం పనులను ప్రారంభించారు. ఆలంపల్లి నుంచి ఎంఆర్పీ చౌరస్తా వరకు సీసీ పనులు పూర్తయ్యాయి. కానీ మహాశక్తి టాకీస్ నుంచి కెనరా బ్యాంకు వరకు సీసీ పనులు ఆగిపోయాయి. అడ్డుకున్న వ్యాపారులు.. పట్టణంలో పెరుగుతున్న జనాభా, వాహనాల రాకపోకల దృష్ట్యా రోడ్డు వెడల్పు కార్యక్రమానికి ఆర్అండ్బీ అధికారులు 8 సంవత్సరాల కిందట రోడ్డు విస్తరణకు శ్రీకారం చుట్టారు. అప్పట్లో వ్యాపారులకు సంబంధించిన కొన్ని దుకాణాలకు నష్టం వాటిల్లింది. దీంతో కొందరు కోర్టును ఆశ్రయించారు. గతంలో చేసిన రోడ్డు వెడల్పు సంబంధించిన పనులు పూర్తిచేసిన తరువాతే ప్రస్తుతం సీసీ రోడ్డు పనులను ప్రారంభించాలని కోర్టు ద్వారా మధ్యంతర ఉత్తర్వులు పొంది అడ్డుకున్నారు. దీంతో ఎక్కడి పనులు అక్క డే ఆగిపోయాయి. నాలుగు నెలల కిందట తవ్వేసిన రోడ్ల తో పట్టణంలో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. మధ్యంతర ఉత్తర్వులు ఎత్తేస్తే.. ఆర్అండ్బీ అధికారులకు చిత్తశుద్ధి ఉంటే కోర్టులో వేసిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయించి పనులు పూర్తి చేయొచ్చని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
భగ్గుమన్న వామపక్షాలు, కాంగ్రెస్
పలుచోట్ల సీఎం, పీఎంల దిష్టిబొమ్మల దహనం కాకినాడ : ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని, ముఖ్యమంత్రుల తీరుపై కాంగ్రెస్, వామపక్షా లు శుక్రవారం జిల్లావ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. వారి దిష్టిబొమ్మలను దహ నం చేయడంతో పాటు పలుచోట్ల ధర్నాలు చేశారు. రాజమండ్రిలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్వీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. డీసీసీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ మాట్లాడుతూ చంద్రబాబు, మోదీలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. కాకినాడలో ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ పంతం నానాజీ ఆధ్వర్యంలో కల్పనా సెంటర్ లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను తగలబెట్టగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కంపర రమేష్ తదితరులు పాల్గొన్నారు. కొత్తపేట నియోజకవర్గ ఇన్చార్జి ఆకుల రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. గోకవరంలో డీసీసీ అధికార ప్రతినిధి గుల్లా ఏడుకొండలు ఆ ధ్వర్యంలో ధర్నా చేశారు. అమలాపురంలో కాంగ్రెస్ నేత కల్వకొలను తాతాజీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రంపచోడవరంలో కాంగ్రెస్ నేత కె.సుధాకరబాబు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కాకినాడలో కలెక్టరేట్ ఎదుట సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వా శేషుబాబ్జి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. పిఠాపురంలో సీపీఐ నే త కోరాకుల సింహాచలం ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. పెద్దాపురంలో సీపీఐ నేతలు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. రామచంద్రపురంలో సీపీఐ, సీపీఎం నేతలు సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఉండవల్లి గోపాలరా వు, ఎన్.రాము, శారదాదేవి, పి.జానకీరాం తది తరులు పాల్గొన్నారు. అమలాపురంలో సీపీఐ, సీపీఎంల ఆధ్వర్యంలో గడియారస్తంభం సెంట ర్లో ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. రాజోలులో సీపీఐ నేత దేవ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మండపేటలో వామపక్షాల ఆధ్వర్యంలో మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. -
సీఎం బ్లాక్ వద్ద విపక్షాల మెరుపు ధర్నా
లెఫ్ట్, టీడీపీ, వైఎస్సార్సీపీ, లోక్‌సత్తా నేతల అరెస్ట్ సాక్షి, హైదరాబాద్: ప్రజా సమస్యలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ సమయం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలు, టీడీపీ, వైఎస్సార్సీపీ, లోక్‌సత్తా నేతలు సచివాలయంలోని సీఎం అధికారిక కార్యాలయం సమతా బ్లాక్ ఎదుట మెరుపు ధర్నా నిర్వహించారు. మున్సిపల్ కార్మికుల సమ్మె సహా ఇతర ప్రజా సమస్యల పరిష్కారంపై చర్చించేందుకు సీఎం అపాయింట్మెంట్ కోరినా ఇవ్వనందుకు నిరసనగా సచివాలయంలో బైఠాయించారు. మున్సిపల్ కార్మికులసమ్మెను పరిష్కరించాలి, సీఎం కేసీఆర్ వెంటనే చర్చలకు పిలవాలి, రైతు ఆత్మహత్యలు, ప్రజాసమస్యలపై అఖిలపక్ష భేటీ నిర్వహించాలంటూ వారు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినే ని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, నేతలు పల్లా వెంకటరెడ్డి, రవీంద్రకుమార్, టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, వైఎస్సార్సీపీ నేతలు కె. శివకుమార్, కొండా రాఘవరెడ్డి, బీష్వ రవీందర్‌లతోపాటు వేములపల్లి వెంకటరామయ్య (న్యూడెమోక్రసీ-రాయల), ఎండీ గౌస్ (ఎంసీపీఐ-యూ), జానకిరాములు, గోవింద్ (ఆర్ఎస్పీ), మురహరి (ఎస్‌యూసీఐ-సీ), దయానంద్, నరేందర్ (ఫార్వర్డ్ బ్లాక్), భూతం వీరయ్య (సీపీఐ-ఎంఎల్), రామ్మోహనరావు (లోక్‌సత్తా) తదితరులను అరెస్ట్ చేసి గాంధీభవన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి, వైఎస్సార్సీపీ నేత కొండా రాఘవరెడ్డి, న్యూడెమోక్రసీ నేత వి.వెంకటరామయ్య తదితరుల మధ్య తోపులాట జరిగింది. దీంతో వారు సీఎం డౌన్ డౌన్, కేసీఆర్ ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించాలి.. అంటూ నినాదాలు చేశారు. అంతకుముందు మఖ్దూం భవన్ నుంచి అఖిలపక్ష నేతలు బయలుదేరి సచివాలయం గేటు వద్దకు చేరుకున్నారు. సీఎం అపాయింట్మెంట్ లేదు కాబట్టి అనుమతించబోమని అక్కడున్న పోలీసులు వారిని నిలిపివేశారు. పోలీసులతో కొద్దిసేపు వాగ్వాదం జరిగాక, ఈ నేతలు వారిని తోసుకుని సచివాలయం ‘సీ’ (సీఎం బ్లాక్) బ్లాక్ ఎదుటకు చేరుకోగా అక్కడ వారిని ఆపేశారు. సీఎం ఎప్పుడు సమయం ఇచ్చినా అప్పటివరకు తాము వేచి ఉంటామని వారు పోలీసులకు చెప్పారు. దీనిపై చర్చ జరుగుతుండగానే వారంతా రోడ్డుపై బైఠాయించారు. ఇదేం ప్రజాస్వామ్యం..: విపక్షాల నేతలు సమస్యలపై మాట్లాడేందుకు సీఎంను కలుద్దామని వస్తే రోడ్డుపైనే ఆపేయడం ఏ రకమైన ప్రజాస్వామ్యం, ఇదేమి పాలన అంటూ సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం ధ్వజమెత్తారు. తెలంగాణ పరిపాలన ఇలానే సాగించదలుచుకున్నారా? అని ప్రశ్నించారు. నెలరోజులకు పైగా సమ్మె చేస్తూ పేద మున్సిపల్ కార్మికులు కష్టాల్లో ఉంటే సీఎం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నారు. మున్సిపల్ కార్మికులు, ఇతర కార్మికుల సమస్యలపై చర్చించేందుకు సమయమివ్వాలని అన్ని పార్టీలు లేఖ రాస్తే సీఎం కేసీఆర్ నుంచి ఏ స్పందన లేదని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి చెప్పారు. గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్మికుల సమ్మెలపై అఖిలపక్ష భేటీ నిర్వహించాలని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం చేసి దానిని నిలబెట్టుకోలేదన్నారు. ఎమ్మెల్యేలు, ప్రజలెవరినీ సీఎం కలవకపోవడం ఏమిటని వైఎస్సార్సీపీ నేత కొండా రాఘవరెడ్డి ప్రశ్నించారు. తాము కూడా ఉద్యమాలు చేశామని, ఇటువంటి పద్ధతిని ఎక్కడా చూడలేదన్నారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో మాట్లాడుతూ 14 నెలల పాలనలో సీఎం కేసీఆర్ ఎవరికీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం అప్రజాస్వామికమని వైఎస్సార్సీపీ నేత కె.శివకుమార్ ధ్వజమెత్తారు. ఒకవైపు ఉద్యోగాలిస్తామంటూ, సమ్మె చేస్తున్న ఉద్యోగులను తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మహానేత డాక్టర్ వైఎస్సార్ సీఎంగా ఉండగా ప్రజలను కలుసుకునేందుకు రోజూ పొద్దున సమయమిచ్చినట్లుగా సీఎం కేసీఆర్ కూడా సమయమివ్వాలని డిమాండ్ చేశారు. -
బీజేపీ అవినీతిపై లెఫ్ట్ శంఖారావం
నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా దేశ వ్యాప్త పోరాటం నిర్వహించాలని సీపీఐ, సీపీఐ(ఎం), ఆర్ఎస్పీ, ఫార్వర్డ్‌బ్లాక్, సీపీఐ ఎంఎల్. ఎస్‌యూసీఐ (కమ్యూ నిస్టు) పార్టీలు నిర్ణయించాయి. జూలై 20వ తేదీన ‘అవినీతి వ్యతిరేక పోరాటం దినం’గా జరపాలని కూడా భావిస్తున్నా యి. వాస్తవానికి మోదీ ప్రభుత్వ తొలి వార్షికోత్సవం సందర్భంగా తమది ‘అవినీతి రహిత ప్రభుత్వమ’ని బీజేపీ ప్రకటించింది. 13వ నెలలోనే ఈ ప్రకటన బండారం బద్దలైంది. ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ ఇంగ్లండ్ నుండి పోర్చుగల్ వెళ్లేందుకు సహాయం చేయాల్సిందిగా విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ బ్రిటిష్ హైకమిషనర్‌ను కోరినట్లు లండన్ నుండి వార్త వచ్చింది. లలిత్ మోదీ భార్య పోర్చుగల్ రాజధాని లిస్బన్లోని క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నందునే మానవతా దృక్పథంతో సహాయం చేసినట్లు సుష్మా వివరించారు. 1,700 కోట్ల రూపాయల ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసుల నుండి తప్పించుకునేందుకు లలిత్‌మోదీ లండన్‌లో దాగాడు. నేరగాళ్లను కూడా మానవతా దృక్పథంతో ఆదుకోవడం మాటెలా ఉన్నా, ఢిల్లీకి తిరిగి వచ్చి విచారణను ఎదుర్కోమని ఆయనకు చెప్పకపోవటం, సుష్మా భర్త స్వరాజ్ 23 సంవత్సరాలుగా అడ్వొకేట్‌గా, ఆయన కుమార్తె రెండేళ్లుగా సుప్రీం కోర్టులో లలిత్ మోదీ తరఫున వకాల్తా పుచ్చుకోవడం అనేక అనుమానాలకు దారి తీస్తుంది. రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, లలిత్‌మోదీ తరపున గతంలో విదేశాలకు వీసా కోసం రహస్యంగా ఒక అఫిడవిట్ సమర్పించిన విషయం కూడా బహిర్గతమైంది. ఈ రహస్యం ఎందుకో ఆమె వివరించాలి. వసుంధరా రాజే కుమారుడు దుష్యంత్ కూడా పార్లమెం ట్ సభ్యుడు. మహారాజా దుష్యంత్‌కు ఒక పరిశ్రమ ఉంది. ఆ సంస్థ షేరు ధర పది రూపాయలు. లలిత్‌మోదీ ఒక షేరు రూ 98,000 చొప్పున 11 కోట్ల రూపాయల షేర్లు కొన్నాడు. రాజస్తాన్ ప్రభుత్వానికి చెందిన రెండు రాజ భవ నాలను (అంబర్ ప్యాలెస్) నామ మాత్రపు ధరకు మహారాజా దుష్యంత్ లలిత్‌మోదీకి అమ్మేశాడు. ఇవి వారి కుటుంబ వార సత్వ ఆస్తులని బీజేపీ నాయకులు చెప్తున్నారు. కానీ గత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భవనాలు స్వాధీనం చేసుకొని తాళాలు వేస్తే, ఈ మహారాజుల కుటుంబం తేలుకుట్టిన దొంగల లాగా నిశ్శబ్దంగా ఎందుకు ఉంది? గతంలో కూడా వసుంధరా రాజే రాజస్తాన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లలిత్‌మోదీ పరిపాలన సాగించాడని, ప్రభుత్వంతో పనులు చేయించేందుకు 10% కమీషన్లు వసూలు చేసేవాడని, ఆయనకు మిస్టర్ టెన్ పర్సంట్‌గా పేరుండేదని పత్రికా విలేకరులు బయటపెట్టారు. మహారాష్ట్ర మహిళా మంత్రి పంకజ్ ముండే చట్ట ప్రకారం పిలవాల్సిన టెండర్లు పిలవకుండా, అంగన్వాడీలకు సరఫరా చేసే చిక్కీల కాంట్రాక్టు 2,600 కోట్ల రూపాయల మేరకు ప్రైవేటు కాంట్రాక్టర్లకిచ్చింది. ప్రపంచంలో ఎక్కడ చీమచిటుక్కుమన్నా ట్వీట్ చేసే నరేంద్ర మోదీ ఈ అంశాలపై మౌనంగా ఉంటున్నారు. క్రికెట్ పిచ్చిని వ్యాపారం చేసేందుకు ఐపీఎల్ పేరుతో ఒక సంస్థను లలిత్‌మోదీ స్థాపించాడు. ఆ క్రీడను బాగా కుదించి 20:20గా చేశాడు. ఏనాడూ బ్యాట్ పట్టని రాజకీయ నాయకులు, కార్పొరేట్ల అధిపతులు రాష్ట్రాల క్రికెట్ బోర్డు అధ్యక్షులయ్యారు. నేషనలిస్టు కాంగ్రెస్ అధ్యక్షులు శరద్ పవార్, బీజేపీ నరేంద్ర మోదీ, అమిత్‌షా, అరుణ్‌జైట్లీ, కాంగ్రెస్‌కు చెందిన రాజీవ్ శుక్లా, శశిథరూర్, జ్యోతిరాదిత్య సింథియా, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్, కార్పొరేట్ల అధినేతలు శ్రీనివాసన్, దాల్మియాలు ఇందులో భాగమే. నరేంద్రమోదీకీ, బీజేపీకీ అవినీతిని నిర్మూలించాలని గానీ, స్వచ్ఛమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గానీ లేదు. అవినీతి కారణంగా కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన యడ్యూరప్పను మోదీ ఆహ్వానించి, పార్లమెంట్ సభ్యుడినిగా చేయటమేగాక, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిని చేశారు. నకిలీ ఎన్కౌంటర్ కేసులో ముద్దాయిగా ఉండి మంత్రి పదవిని కోల్పోయి, జైలుకెళ్లే స్థితిలో ఉన్న అమిత్‌షాను బీజేపీ జాతీయ అధ్యక్షునిగా చేసి, కేసులు ఉపసంహరింపజేసిన ఘనుడు నరేంద్ర మోదీ. మధ్యప్రదేశ్ బీజేపీ సర్కారు ఆధ్వ ర్యంలో జరిగినది ‘వ్యాపమ్ స్కాం’. వృత్తి విద్యల పరీక్షల బోర్డులో, రాష్ట్ర గవర్నర్, అధికారులు, మంత్రులు, బీజేపీ నాయకుల మాయాజాలంతో రెండు వేల కోట్ల రూపాయల అవినీతి, రెండు వేల మంది ముద్దాయిలు, 48 మంది మిస్టరీ మరణాలు, విచారణకు వెళ్లిన జర్నలిస్టులను హత్య చేయటం వంటి వాటితో వ్యాపమ్ కేసు క్రైమ్ థ్రిల్లర్‌ను తలదన్ను తున్నది. తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో ఒక నామినేటెడ్ శాసన సభ్యుడిని ఐదు కోట్లకు బేరం చేసి, యాైభై లక్షలు లంచం ఇస్తూ పట్టుబడిన టీడీపీ నాయకుడు రేవంత్‌రెడ్డి సిగ్గు పడకపోగా మీసం దువ్వి, తొడలు కొట్టి వేలాది మందితో బెయిల్ విజయోత్సవం జరుపుకుంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి, టీడీపీ అధ్యక్షులు చంద్రబాబునాయుడు ఈ దురంతానికి మద్దతు ఇస్తున్నారు. ఆ పార్టీకి బీజేపీ మద్దతి స్తున్నది. బీజేపీ నిజరూపం ఇప్పుడిప్పుడే బహిర్గత మవుతున్నది. ‘‘అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బు బిళ్ల కాదేది కవితకనర్హం’’ అని మహాకవి శ్రీశ్రీ చెప్పారు. క్రికెట్, ఇసుక, కాంట్రాక్టులు, కాలువలు, మరుగుదొడ్లు, చౌకడిపోలు, మందుల పంపిణీ, స్పెక్ట్రమ్, బొగ్గు గనుల వేలం, ఉద్యోగాల కేటాయింపులు, ఎంఎల్సీల ఎన్నికలు, కావేవి దోపిడీకనర్హమని కాంగ్రెస్, బీజేపీ నాయకులు రుజువు చేశారు. జూలై 20వ తేదీని ‘అవినీతి వ్యతిరేక పోరాట దినం’గా జరుపుకుందాం. నయవంచకుల బీజేపీ పార్టీ నిజ స్వరూపాన్ని బహిర్గతం చేయవలసిన తరుణం వచ్చింది. దీనిని ప్రజాస్వామిక లౌకికశక్తులు గుర్తించాలి. (జూలై 20న ‘అవినీతి వ్యతిరేక పోరాట దినం’ నిర్వహిస్తున్న సందర్భంగా) -
బంద్ ఉద్రిక్తం
ధర్నాలు, రాస్తారోకోలు బంద్‌కు అఖిల పక్షాల మద్దతు హన్మకొండ : మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలు శుక్రవారం చేపట్టిన బంద్ జిల్లాలో విజయవంతమైంది. బంద్ సందర్భంగా అఖిల పక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు, దిష్టిబొమ్మల ద హనం కార్యక్రమాలు చేపట్టారు. హన్మకొండలో మున్సిపల్ కార్మికులచే హన్మకొండ జిల్లా బస్టేషన్ దిగ్భంధించారు. ఉదయం 5 గంటలకే జిల్లా బస్‌స్టేషన్‌కు చేరుకొని బస్‌స్టేషన్ మూడు గేట్లలో బైఠాయించి నాలుగు గంటల పాటు బస్సులు బయటకు రాకుం డా అడ్డుకున్నారు. ఈ బంద్‌కు వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, వామపక్షాలు, టీడీపీ, బీజేపీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు మద్దతు పలికారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అరెస్టు చేసి ప్రత్యేక వాహనాల్లో పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తుండగా కార్మికులు వాహనాలను అడ్టుకున్నారు. పోలీసులు చెరగొట్టే క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులను అదుపులోకి తీసుకుని హన్మకొండ పోలీసు స్టేషన్‌కు తరలించారు. బంద్‌ను పర్యవేక్షిస్తున్న టీఎన్ఎస్ఎఫ్ నాయకులు హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహం కూడలిలోని ఓ దుస్తుల దుకాణం అద్దాలు పగులకొట్టారు. కాజీపేటలో మునిసిపల్ కార్మికుల ధర్నా చేశారు. వైఎస్ఆర్సీపీ, బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ నాయకుల మద్దతు పలికారు. బాపూజీనగర్ నుంచి కాజీపేట సెంటర్ వరకు ర్యాలీ తీశారు. హన్మకొండ, వరంగల్‌లో దుకాణాలను బీజేపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీల నాయకులు మూసి వేయించారు. జనగామ, నర్సంపేట, భూపాలపల్లి, పరకాల, మహబూబాబాద్, కురవి, ములుగు, స్టేషన్ ఘన్‌పూర్‌లో వామ పక్షాల బంద్ సంపూర్ణంగా జరిగింది. బంద్‌లో సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ, వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, టీడీపీ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీల నాయకులు, కార్మికులు రాస్తారోకో చేసీ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. -
వామపక్షాలు సంఘటితం కావాలి
దోమలగూడ: వామపక్షాల మధ్య సైద్దాంతిక విభేధాలు ఉన్నప్పటికీ అంగీకరించిన అంశంపై ఐక్య పోరాటాలు నిర్వహిస్తూ కమ్యూనిస్టు, వామపక్షాల ఐక్యతకు సీపీఎం కృషి చేస్తుందని సిపిఎం పోలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. గురువారం చిక్కడపల్లిలోని హోటల్ సాయికృపలో ఎంసీపీఐ (యు) 3 వ అఖిల భారత మహాసభల్లో భాగంగా మూడవ రోజు కమ్యూనిస్టుల ఐక్యతపై సదస్సు నిర్వహించారు. ఎంసీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎండి గౌస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంసీపీఐ (యు) జాతీయ ప్రధానకార్యదర్శి కుల్దీప్సింగ్, పోలిట్‌బ్యూరో సభ్యులు రాజన్, ఆర్ఎస్పి రాష్ట్ర కార్యదర్శి జానకిరాములు, సిపిఐఎంఎల్ కమిటీ సభ్యులు కొల్లిపర వెంకటేశ్వర్రావు, ఎస్‌యూసిఐ నాయకులు రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వామపక్షాలు సంఘటితం కావాల్సిన అవసరం ఉందన్నారు. వామపక్షాల్లో అంతర్గతంగా భిన్నాభిప్రాయాలున్నప్పటికీ సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. అమెరికా సామ్రాజ్యవాదాన్ని అనుకున్న స్థాయిలో ప్రతిఘటించలేక పోతున్నామని, ప్రపంచ వ్యాప్తంగా యువత వామపక్ష ఆలోచనా విధానం, అభ్యుదయ భావాలకు ఆక ర్షితులు కాలేకపోతున్నారన్నారు. పాలక వర్గాలు పెట్టుబడిదారి వర్గాల కొమ్ముకాస్తూ, ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారన్నారు. ఈ పరిస్థితుల్లో నైతిక విలువలు కలిగిన కమ్యూనిస్టు, వామపక్షాలు ఏకమై ప్రత్యామ్నాయంగా ఎదగాలన్నారు. గౌస్ మాట్లాడుతూ దేశంలో బూర్జువా పార్టీలు ఒకరి బలహీనతలను మరొకరు సొమ్ము చేసుకుంటూ అధికారాన్ని సాధించుకుంటున్నారన్నారు. వామపక్షాలు ఐక్యంగా ఉంటేనే వారిని ఎదుర్కోవడం సాధ్యపడుతుందన్నారు. గత ఏడాది జరిగిన ఎన్నికల ఫలితాలు వామపక్షాల ఐక్యత తప్పనిసరిగా మారిందన్నారు. కార్యక్రమంలో నాయకులు గోపి కిషన్, ఎం వెంకట్‌రెడ్డి, మద్దికాయల అశోక్ తదితరులు పాల్గొన్నారు.