ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసిన స్మృతీ ఇరానీ | Smriti Irani left govt bungalow in delhi | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసిన స్మృతీ ఇరానీ

Jul 11 2024 1:24 PM | Updated on Jul 11 2024 3:08 PM

Smriti Irani left govt bungalow in delhi

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేశారు. ఆమె గత  పదేళ్లుగా ఈ బంగ్లాలో ఉంటున్నారు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆమె ప్రభుత్వం కేటాయించిన నివాసాన్ని ఖాళీ చేయవలసి వచ్చింది. ఎన్నికల్లో ఓడిపోయిన ఎంపీలంతా జూలై 11లోగా తమ నివాసాలను ఖాళీ చేయాల్సివుంది. దీనిపై స్మృతీ ఇరానీకి నోటీసు రావడంతో ఆమె బంగ్లాను ఖాళీ చేశారు.

2024 లోక్‌సభ ఎన్నికల్లో స్మృతి ఇరానీ యూపీలోని అమేథీ నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆమె  ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ నేపధ్యంలో ఆమె నివాసం ఉంటున్న ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలంటూ ఆమెకు పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని స్టేట్ డైరెక్టర్ నుంచి నోటీసు వచ్చింది. దీంతో ఆమె బంగ్లాను ఖాళీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement