bungalow
-
కోల్‌కతా: ఈడీ దాడుల్లో సందీప్ ఘోష్ లగ్జరీ బంగ్లా గుర్తింపు!
కోల్‌కతా:కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌తో పాట ఆయన బంధువుల నివాసాలు, కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శుక్రవారం సోదాలు చేశారు. ఈ సోదాల్లో పలు కీలకమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు సందీప్ ఘోష్‌కు సంబంధించిన ఓ లగ్జరీ రెండతస్తుల ఇంటిని ఈడీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. సౌత్ 24 పరగణాల జిల్లాలోని ఇంటి ప్రాపర్టీ సందీప్ ఘోష్, ఆయన భార్య సంగీతకు చెందినదిగా ఈడీ వర్గాలు పేర్కొంటున్నాయి.ఈడీ గుర్తించిన లగ్జరీ బంగ్లా చుట్టూ వందల ఎకరాల ఖాళీ స్థలం ఉంది. ‘‘సంగీతసందీప్ విల్లా’’ అనే నేమ్‌ప్లేట్‌ను కలిగి ఉన్న ఈ బిల్డింగ్ సందీప్ ఘోష్, ఆయన భార్య సంగీత పేరు మీద ఉన్నట్లు తెలుస్తోంది. ఇక.. ఆ బంగ్లాను ‘డాక్టర్ బాబు’ ఇల్లు అని పిలుస్తామని.. సందీప్ ఘోష్ తరచూ కుటుంబంతో ఇక్కడికి వస్తారని స్థానికులు చెబుతున్నారు. డాక్టర్ సందీప్ ఘోష్ సూచనల మేరకు ఈ ప్రాంతంలో అనేక ఫామ్ హౌస్‌లు నిర్మించారని, భూములను కూడా కొనుగోలు చేసినట్లు ఈడీ వర్గాలు ఆరోపణలు చేస్తున్నాయి. మొత్తం 9 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు కోల్‌కతా జాతీయ వైద్య కళాశాలలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ప్రసూన్ ఛటోపాధ్యాయ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.డాక్టర్ కేసు విచారణను సీబీఐకి బదిలీ చేసిన కోల్కత్తా హైకోర్టు.. సందీప్ ఘోష్‌పై అవినీతి ఆరోపణల కేసు దర్యాప్తును సైతం సీబీఐకే అప్పజెప్పింది. ఈ క్రమంలో హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సందీప్ ఘోష్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఆయన అభ్యర్ధనను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసులో మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌తో పాటు మరో ముగ్గురు నిందితులకు కోల్‌కతా కోర్టు ఇటీవల ఎనిమిది రోజల సీబీఐ కస్టడీ విధించింది. ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసులో సందీప్ ఘోషతో పాటు, మరో ముగ్గురు నిందితులు బిప్లవ్ సింఘా, సుమన్ హజ్రా, అఫ్సర్ అలీ ఖాన్‌లను సోమవారం రాత్రి సీబీఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. -
ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసిన స్మృతీ ఇరానీ
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేశారు. ఆమె గత పదేళ్లుగా ఈ బంగ్లాలో ఉంటున్నారు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆమె ప్రభుత్వం కేటాయించిన నివాసాన్ని ఖాళీ చేయవలసి వచ్చింది. ఎన్నికల్లో ఓడిపోయిన ఎంపీలంతా జూలై 11లోగా తమ నివాసాలను ఖాళీ చేయాల్సివుంది. దీనిపై స్మృతీ ఇరానీకి నోటీసు రావడంతో ఆమె బంగ్లాను ఖాళీ చేశారు.2024 లోక్‌సభ ఎన్నికల్లో స్మృతి ఇరానీ యూపీలోని అమేథీ నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆమె ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ నేపధ్యంలో ఆమె నివాసం ఉంటున్న ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలంటూ ఆమెకు పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని స్టేట్ డైరెక్టర్ నుంచి నోటీసు వచ్చింది. దీంతో ఆమె బంగ్లాను ఖాళీ చేశారు. -
124 ఏళ్ల భవనం కూల్చివేతకు నోటీసు.. కోర్టును ఆశ్రయించిన యజమాని!
ముంబైలోని ‘సాత్ బంగ్లా’ అనే ప్రాంతం ఎంతో ప్రసిద్ధి చెందింది. సుమారు 124 సంవత్సరాల క్రితం ఇక్కడ ఏడు బంగ్లాలు నిర్మించారు. వాటిలో ఇప్పుడు రెండు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పుడు వాటిలో ఒకదానిని కూల్చివేసేందుకు బీఎంసీ సిద్ధమవుతోంది. దీంతో భవన యజమాని కోర్టును ఆశ్రయించారు. సముద్రతీరానికి దగ్గరలో నిర్మించిన ఈ బంగ్లాలో పలు గదులు, గ్లాస్ వర్క్‌తో కూడిన హాలు, ఇటాలియన్ మార్బుల్ ఫ్లోరింగ్‌లు, బసాల్ట్ స్టోన్ ఫ్లోరింగ్ ఉన్నాయి. ఈ బంగ్లాను ‘1900 ఏడీ’లో నిర్మించినట్లు ఆధారాలున్నాయి. ఈ భవనం చరిత్రకు ఆనవాలుగా నిలిచింది. కాగా గత ఫిబ్రవరి 29న రతన్ కుంజ్ పేరుతో ఉన్న ఈ భవనాన్ని కూల్చివేయనున్నట్లు బీఎంసీ దాని యజమానికి నోటీసు జారీ చేసింది. ఈ భవనం శిథిలావస్థలో ఉందని, కూలిపోయే అవకాశం ఉందని ఆ నోటీసులో పేర్కొంది. అయితే ఈ ఆస్తి సహ యజమానులు షాలు రాహుల్ బరార్‌తో పాటు అతని ఇద్దరు కుమారులు ఈ నోటీసు వెనుక కుట్ర ఉందని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ‘మా ఆడిట్, ఇన్‌టేక్ నివేదికలో ఈ ఆస్తిని భద్రంగా చూస్తామని పేర్కొన్నాం. భవనానికి మరమ్మతులు చేశాం. ఈ కూల్చివేత నోటీసు మాకు పెద్ద దెబ్బ లాంటిది. మా చివరి శ్వాస వరకూ ఈ బంగ్లాను కాపాడుకునేందుకు పోరాడుతాం’ అని పేర్కొన్నారు. ఒకప్పుడు ఈ బంగ్లాను ‘తలాటి బంగ్లా’ అని పిలిచేవారు. సొరాబ్జీ తలాటి పార్సీ కుటుంబం దీనికి ఈ పేరు పెట్టింది. 1896లో దేశంలో ప్లేగు వ్యాప్తి చెందుతున్న సమయంలో ఈ ‘ఏడు బంగ్లాలు’ నిర్మితమయ్యాయి. ఈ భవనం పూర్వ యజమానులు గ్వాలియర్ మహారాజా, కచ్ మహారాజా, దాదాభాయ్ నౌరోజీ, రుస్తమ్ మసాని, సొరాబ్జీ తలాటి, చైనాస్, ఖంబటాస్. ఇటువంటి వారసత్వ సంపదను కాపాడుకోవడం అవసరమని ఆ కుటుంబ సభ్యులు అంటున్నారు. దీనిని చారిత్రక భవనాలు జాబితాలో చేర్చాలని వారు కోరుతున్నారు. -
కోట్ల విలువైన బంగ్లాను కొనుగోలు చేసిన ప్రముఖ యూట్యూబర్!
ప్రముఖ యూట్యూబర్ కమ్ కమెడియన్ భువన్ బామ్ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారు. గుజరాత్‌కు చెందిన భువన్ దేశ రాజధాని ఢిల్లీలో విలాసవంతమైన బంగ్లాను తీసుకున్నారు. యూట్యూబ్‌లో తన వీడియోలతో ఓవర్‌నైట్ స్టార్‌గా దాదాపు రూ. 11 కోట్లకు బంగ్లాను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో బంగ్లాను తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బీబీ కి వైన్స్ అనే యూట్యూబ్ ఛానెల్‌ను నిర్వహిస్తున్నాడు. వడోదరకు చెందిన భువన్ బామ్ యూట్యూబ్‌లో వీడియోల ద్వారానే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2015లో తన యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించగా.. 26.4 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్స్ కలిగి ఉన్నారు. అతని కంటెంట్ ప్రధానంగా హాస్య భరితమైన పాత్రల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా కుటుంబం, స్నేహితులతో కలిసి కామెడీ కంటెంట్‌ను రూపొందిస్తుంటారు. అంతే కాకుండా భువన్ సంగీతంలోకి అడుగుపెట్టారు. ఇప్పటికే చాలా సాంగ్స్ కూడా రిలీజ్ చేశారు. అంతే కాకుండా దిండోరా, రాఫ్తా రాఫ్తా, తాజా ఖబర్ వంటి వెబ్ సిరీస్‌లలో కూడా నటించాడు. ఇటీవలే ప్రసిద్ధ జపనీస్ గేమ్ షో తకేషిస్ కాజిల్‌కు కామెంటర్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ వార్తలపై భువన్ ఇంకా స్పందించలేదు. View this post on Instagram A post shared by Bhuvan Bam (@bhuvan.bam22) -
అమితాబ్ కూతురికి బహుమతిగా కోట్లు విలువ చేసే బంగ్లా!
నటనకు వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్నాడు బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్. 80 ఏళ్లు దాటినా కుర్రాళ్లకంటే హుషారుగా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. అంతేకాదు పాపులర్ టీవీ షో ‘కౌన్ బనేగా క్రోర్‌పతి’కి హోస్ట్‌గానూ వ్యవహరిస్తున్నాడు. ఇలా వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. ఫ్యామిలీకి మాత్రం దూరంగా ఉండలేరు బిగ్‌బీ. బాధ్యత గల తండ్రిగా ఇప్పటికీ తన పిల్లల బాగోగులను చూసుకుంటున్నారు. (చదవండి: పరశురామ్‌తో గొడవ..గతంలో జరిగింది ఇదే: బన్నీ వాసు) కొడుకుతో పాటు కూతురు శ్వేతా బచ్చన్‌పై కూడా అమితాబ్‌కి ఎనలేని ప్రేమ. పెళ్లి చేసి అత్తారింటికి పంపించినా.. ఇప్పటికీ ఆమెకు ఆర్థికంగా ఆదుకుంటూనే ఉంటాడు. తాజాగా తన కూతురుకి ఖరీదైన బహుమతిని అందించి, తండ్రి ప్రేమను చాటుకున్నాడు. తనకెంతో ఇష్టమైన జుహు బంగ్లా ‘ప్రతీక్ష’ను కూతురు శ్వేతా బచ్చన్‌కు గిఫ్ట్‌గా అందించారు. దీని విలువల దాదాపు 50 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. (చదవండి: అన్నదమ్ముల మధ్య ఈగో, డబ్బు సమస్యలు ఉండొద్దు: మనోజ్) ముంబైలోని అంత్యంత ఖరీదైన జై జుహు ప్రాంతంలో అమితాబ్ బంగ్లా ‘ప్రతీక్ష’ ఉంది. ఈ బంగ్లా అంటే అమితాబ్‌కు చాలా ఇష్టం. తన పేరెంట్స్‌తో కలిసి అమితాబ్ ఇక్కడే ఉండేవాడు. అంతేకాదు అభిషేక్, ఐశ్వర్యల పెళ్లి కూడా ఇక్కడే జరిగింది. ఇది మొత్తం 674 చదరపు మీటర్లు, 890.47 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రెండు ప్లాట్స్‌లో విస్తరించి ఉంది. అమితాబ్ ఫ్యామిలీ ప్రస్తుతం జుహులో ఉన్న జల్సా బంగ్లాలో నివసిస్తోంది. View this post on Instagram A post shared by S (@shwetabachchan) -
నోరు నొక్కేందుకే ఈ కుట్ర: భయపడుతూ కూచుంటే ఎలా?
న్యూఢిల్లీ: బాలీవుడ్నటి పరిణీతి చోప్రో భర్త, ఆప్ ఎంపీ, రాఘవ్ చద్దాకు ఊరట లభించింది. ఢిల్లీలోని ప్రభుత్వం బంగ్లాను ఖాళీ చేయాలన్న ట్రయల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులను ఢిల్లీ హైకోర్టు పక్కన పెట్టింది. అయితే ఏప్రిల్ ఆర్డర్‌ను రద్దు చేస్తూ అక్టోబర్ 5న ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రాఘవ్ చద్దా సవాలు చేయడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. దీంతో రాఘవ్ చద్దాకు భారీ ఊరట లభించింది. పాటియాలా హౌస్ కోర్టు ఆదేశాలను పక్కన పెడుతూ, రాఘవ్ చద్దా తన ప్రభుత్వ బంగ్లాలో ఉండవచ్చని, దానిని ఖాళీ చేయాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు మంగళవారం తెలిపింది. ఏప్రిల్ 18న సిటీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను జస్టిస్ అనుప్ జైరామ్ భంభానీతో కూడిన సింగిల్ బెంచ్ సమర్ధించింది. రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాటం ఈ తీర్పుపై స్పందించిన రాఘవ్ చద్దా ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టారు. తన పోరాటం ఇల్లు లేదా దుకాణం గురించి రాజ్యంగ రక్షణ గురించి అని ట్వీట్ చేశారు. యువ ఎంపీగా తన నోరు నొక్కే ప్రయత్నంలో భాగంగా, రాజకీయ కక్షతోనే తన బంగ్లా కేటాయింపు రద్దు చేశారని విమర్శించారు.కోట్లాది మంది భారతీయుల తరపున మాట్లాడేవారిని, ప్రతిపక్షాలను ఉద్దేశ పూర్వకంగా టార్గెట్ చేశారని ధ్వజమెత్తారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రాన్ని విమర్శిస్తూ తాను పార్లమెంటులో రెండు ప్రసంగాలు చేశానని, తన తొలి ప్రసంగం తర్వాత తన అధికారిక వసతి రద్దు చేశారన్నారు.అలాగే రెండో ప్రసంగం తరువాత ఎంపీగా తన సభ్యత్వాన్ని సస్పెండ్ చేశారని పేర్కొన్నారు. నీతిగా, నిజాయితీగా మాట్లాడితే ఏమవుతుందో భయపడుతూంటే ఇక ఏ ఎంపీ పని చేయలేరంటూ తన ఎక్స్ పోస్ట్‌లో తెలిపారు. Ye makan ya dukan ki nahin, Samvidhan ko bachane ki ladhayi hai In the end, truth and justice have prevailed My statement on the Hon'ble Delhi High Court's ruling to set aside the unjust order to evict me from my official residence. pic.twitter.com/fA7BJ2zLYm — Raghav Chadha (@raghav_chadha) October 17, 2023 -
రూ.400 కోట్లకు అలనాటి మేటి హీరో బంగ్లా అమ్మకం: దాని స్థానంలో భారీ టవర్?
బాలీవుడ్ అలనాటి మేటి హీరో, దివంగత దేవానంద్కుచెందిన లగ్జరీ బంగ్లాను విక్రయించినట్టు మీడియాలో వార్తలుగుప్పుమన్నాయి. దేవానంద్ డ్రీమ్ హౌస్ ముంబైలోని జుహూ బంగ్లాని ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి భారీ మొత్తానికి రూ .400 కోట్లకు విక్రయించినట్టు తెలుస్తోంది. దాని స్థానంలో బహుళ అంతస్థుల భవనం నిర్మించబడుతుందనే వార్తలు హల్చల్ చేశాయి. అయితే ఇవన్నీ పుకార్లేనని తేలిపోయింది. ఈ రూమర్లపై దేవానంద్ మేనల్లుడు,నిర్మాత కేతన్ ఆనంద్ తాజాగా స్పందించారు. అలాంటి ఉద్దేశమేదీ లేదని, అవన్నీ తప్పుడు వార్తలని ఆయన ఖండించారు. దీనికి సంబంధించి దేవానంద్ కుమార్తె దేవీనా, ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడి ధృవీకరించుకున్నట్టు వెల్లడించారు. దాదాపు 40ఏళ్లపాటు దేవానంద్ తన భార్య కల్పనా కార్తీక్, పిల్లలు సునీల్ ఆనంద్ , దేవినా ఆనంద్‌లతో కలిసి గడిపారు. (భారీ తగ్గింపు: రూ. 48,900లకే ఐఫోన్ 15 దక్కించుకునే చాన్స్) అలాంటి ఇల్లును విక్రయించారని, డీల్ కూడా పూర్తయి పేపర్ వర్క్ జరుగుతోందని వార్తలొచ్చాయి. ప్రస్తుతం ఈ బంగ్లాను చూసుకోడానికి ఎవరూ లేని కారణంగా ముఖ్యంగా కొడుకు సునీల్ అమెరికాలోనూ, కూతురు దేవినా, తల్లి కల్పనాతో కలిసి ఊటీలో ఉంటోంది. అందుకే దీన్ని విక్రయించాలని నిర్ణయించుకున్నారు. దాదాపు అదే కారణంతో మహారాష్ట్రలోని పన్వెల్‌లో కొంత ఆస్తిని కూడా విక్రయించారని కథనాలొచ్చాయి. (వాట్సాప్ చానెల్: ప్రధాని మోదీ రికార్డ్..షాకింగ్ ఫాలోవర్లు) ఈ ప్రాంతంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సినీ సెలబ్రిటీల బంగ్లాలు ఉన్న ప్రధాన ప్రదేశం కాబట్టి అంత దర పలికిందనీ, ఈప్లేస్లో 22 అంతస్తుల భారీ టవర్‌ను నిర్మించనున్నారని కూడా అంచనావేశారు. అంతేకాదు 10 సంవత్సరాల క్రితం ఆనంద్ స్టూడియో అమ్మినప్పుడు, ఆ డబ్బుతో మూడు అపార్ట్మెంట్లు కొని, ఒకటి సునీల్‌కు, మరొకటి దేవీనాక, మూడోది అతని భార్య కల్పనకు ఇచ్చారనీ జుహు బిల్డింగ్ అమ్మకం ద్వారా వచ్చిన సొమ్మును కూడా అలాగే పంచుకుంటారనేది కథనం. -
రాహుల్ గాంధీ ఇక ఆ బంగ్లాకు వెళ్లలేరు!
ఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి అధికారిక నివాసంగా తుగ్లక్ లేన్ 12 బంగ్లాను కేటాయించిన విషయం తెలిసిందే. దీనిపై రాహుల్ తన సమ్మతిని తెలపడానికి పార్లమెంటరీ కమిటీ విధించిన 15 రోజుల గడువు విధించింది. బుధవారంతో ఆ గడువు ముగిసినప్పటికీ.. లద్దాఖ్ యాత్రలో ఉన్న రాహుల్ ఆ బంగ్లాను తీసుకుంటానని సమ్మతిని తెలపలేదు. దీంతో మరో బంగ్లాను ఆయనకు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. మోదీ వ్యాఖ్యల కేసులో సూరత్ కోర్టు రాహుల్‌కు రెండేళ్ల శిక్ష విధించిన నేపథ్యంలో పార్లమెంట్ పదవిని కోల్పోయారు. దీంతో 2005 నుంచి ఎంపీగా నివాసం ఉంటున్న తగ్లక్ లేన్ 12 బంగ్లాను ఏప్రిల్ 22న ఆయన ఖాలీ చేశారు. జన్‌పథ్ 10లోని తన తల్లి సోనియా గాంధీ నివాసానికి మారారు. తాజాగా సూరత్ కోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో రాహుల్ మళ్లీ తన ఎంపీ పదవిని పొందారు. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ కమిటీ ఆయనకు అధికారికంగా భవనాన్ని కేటాయించాల్సి వచ్చింది. 2005 నుంచి ఆయన ఉంటున్న తగ్లక్ లేన్‌లోని 12 బంగ్లానే ఇచ్చారు. కానీ దీనికి ఆయన సమ్మతించనట్లు తెలుస్తోంది. బంగ్లా 12పై రాహుల్ సమ్మతి తెలపనంత మాత్రనా పార్లమెంట్ నివాసాన్ని తిరస్కరించినట్లు కాదని కాంగ్రెస్ వర్గాలు తెలుపుతున్నాయి. ప్రస్తుతం రాహుల్.. ఆగష్టు 17న ప్రారంభమైన కశ్మీర్ పర్యటనలో ఉన్నారు. కార్గిల్‌ను కూడా సందర్శించనున్నారు. ఆగష్టు 25న ఈ యాత్ర ముగుస్తుందని సమాచారం. ఇదీ చదవండి: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర-2 ఖరారు.. ఎప్పటి నుంచి అంటే.. -
బాలీవుడ్ హీరో విల్లా వేలానికి నోటీసులు.. అంతలోనే ట్విస్ట్
బీజేపీ ఎంపీ, సినీ నటుడు సన్నీడియోల్‌కు చెందిన బంగ్లా వేలం నోటీసును ఉపసంహరించుకోవడం కలకలం రేపుతోంది. ఈ మేరకు ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది."అజయ్ సింగ్ డియోల్ అలియాస్ సన్నీ డియోల్‌కు సంబంధించి అమ్మకపు వేలం నోటీసుకు సంబంధించి ఇ-వేలంకు సంబంధించిన కొరిజెండం సాంకేతిక కారణాల వల్ల ఉపసంహరించబడింది" అని బ్యాంక్ ఆఫ్ బరోడా వెల్లడించింది. (అప్పుడు ఆఫీసు బోయ్..ఇపుడు ఎవ్వరూ ఊహించని శిఖరాలకు!) తాజా పరిణామంపై విమర్శలకు తావిచ్చింది. దీనిపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఎక్స్ (ట్విటర్)లో విస్మయాన్ని వ్యక్తం చేశారు. వేలం నోటీసు జారీ చేసిన 24 గంటలలోపు దాన్ని విత్‌డ్రా చేసుకోవడంపై ఆయన మండిపడ్డారు. బీవోబీ ప్రకటించిన టెక్నికల్ కారణాలను ఎవరు లేవనెత్తారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. (ఎస్‌డబ్ల్యూపీ అంటే? నెక్ట్స్ మంత్ నుంచే ఆదాయం పొందొచ్చా? ) Yesterday afternoon the nation got to know that Bank of Baroda had put up the Juhu residence of BJP MP Sunny Deol for e-auction since he has not paid up Rs 56 crore owed to the Bank. This morning, in less than 24 hours, the nation has got to know that the Bank of Baroda has… — Jairam Ramesh (@Jairam_Ramesh) August 21, 2023 బ్యాంకును సంప్రదించారంటున్న బీవోబీ జుహు బంగ్లాను వేలనోటీసుల నేపథ్యంలో రుణగ్రహీత (సన్నీ డియోల్), బకాయలను చెల్లించేందుకు తమను సంప్రదించినట్లు బరోడాకు చెందిన బీవోబీ బ్యాంకు తన ప్రకటనలో వెల్లడించింది. నోటీసులోని మొత్తం బకాయిలు రికవరీ చేయాల్సిన బకాయిల ఖచ్చితమైన పరిమాణాన్ని పేర్కొనలేదని బ్యాంక్ తెలిపింది.అలాగే ప్రాపర్టీ సంకేత స్వాధీనత ఆధారంగా నోటీసు లిచ్చామని, "...సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్ఫోర్స్మెంట్) రూల్స్ 2002లోని రూల్ 8(6) ప్రకారం ఆస్తిని స్వాధీనం చేసుకోవడం ఆధారంగా విక్రయ నోటీసు అందించినట్టు వివరణ ఇచ్చింది. pic.twitter.com/L4BdXxeuyN — Bank of Baroda (@bankofbaroda) August 21, 2023 కాగా మధ్యప్రదేశ్‌లో గురుదాస్ ఎంపీ సన్నీడియోల్. 2016లో ఒక సినిమా కోసం రుణం తీసుకున్నాడు. చెల్లింపులు చేయకపోవడంతో ఈ బకాయి రూ. 56 కోట్లుకు చేరింది. గత ఏడాది డిసెంబర్ నుంచి మొండి బకాయిల జాబితాలో చేరింది. ఈ నేపథ్యంలో ఆయన ఇంటిని సెప్టెంబరు 25న ఈ-వేలం వేయనున్నట్టు, ఈ వేలంలో పాల్గొనేందుకు సెప్టెంబరు 22 లోపు దరఖాస్తు చేయాల్సిందిగా బ్యాంకు అధికారులు తొలుత ప్రకటించారు. ఈ ఆస్తికి బ్యాంకు 51.43 కోట్లు రిజర్వ్ ప్రైస్‌గా నిర్ణయించారు. జుహులోని గాంధీగ్రామ్ రోడ్లో సన్నీ విల్లా, సినీ పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియో ‘సన్నీ సూపర్ సౌండ్’ కూడా ఉన్న 599.44 చదరపు మీటర్ల ఆస్తిని కూడా వేలం వేయడానికి బ్యాంకు సిద్ధపడింది. సన్నీ సౌండ్స్ డియోల్స్ యాజమాన్యంలోని కంపెనీ, లోన్‌కు సంబంధించిన కార్పొరేట్ గ్యారెంటర్. సన్నీ డియోల్ తండ్రి, బాలీవుడ్ హీరో నటుడు, బీజేపీ మాజీ ఎంపీ, తండ్రి ధర్మేంద్ర వ్యక్తిగత హామీదారు. ధర్మేంద్ర భార్య, నటి హేమామాలిని కూడా బీజేపీ ఎంపీ కావడం గమనార్హం. -
Saif Ali Khan Pataudi House: సైఫ్ అలీ ఖాన్ బంగ్లా అంటే అట్లుంటది (ఫొటోలు)
-
ఇషా అంబానీ నివాస భవనం ఎన్ని కొట్లో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది!
భారతదేశంలో అత్యంత సంపన్న కుటుంబం ఎవరిదీ అంటే వెంటనే గుర్తొచ్చేది 'అంబానీ ఫ్యామిలీ'. ఈ కుటుంబం విలాసవంతమైన జీవితం గడుపుతారన్న విషయం అందరికి తెలిసిందే. 2018లో ముఖేష్ అంబానీ గారాల తనయ ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్‌ని వివాహం చేసుకుంది. వివాహానంతరం ఈ కొత్త జంట అప్పట్లో కొత్త ఇంట్లోకి ప్రవేశించారు. ఈ లగ్జరీ బంగ్లా విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం. గులిటాలోని ఇషా అంబానీ మాన్షన్ అని పిలువబడే సంపన్నమైన ఎస్టేట్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఆధునిక సదుపాయాలు, అధునాతన వసతులు కలిగిన ఈ భవనం భూలోక ఇంద్ర భావనాన్ని తలపిస్తుంది. వర్లీలోని హిందూస్తాన్ యూనిలీవర్‌కి చెందిన ఈ భవనాన్ని 2012లో జరిగిన వేలంలో పిరమాల్ కుటుంబం దక్కించుకుంది. ఈ అద్భుతమైన భవనం అరేబియా సముద్రానికి ఎదురుగా ఉంటుంది. దీనిని అజయ్ పిరమల్ అండ్ స్వాతి పిరమల్ ఇషా అంబానీకి కానుకగా అందించారు. (ఇదీ చదవండి: కొత్త కారు కొంటున్నారా.. ఈ రూల్స్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు!) 50000 చదరపు అడుగుల అల్ట్రా లగ్జరీ బంగ్లా ఖరీదు సుమారు రూ. 450 కోట్లు అని తెలుస్తోంది. ఐదు అంతస్తులు కలిగిన ఈ సౌధం మొదటి అంతస్థులో విశాలమైన మల్టి పర్పస్ రూమ్స్, ఓపెన్ ఎయిర్ వంటి వాటితో పాటు ఆ తరువాత అంతస్తుల్లో లివింగ్, డిన్నర్, డ్రెస్సింగ్ వంటి వాటి కోసం ప్రత్యేకమైన రూమ్స్ వంటివి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇషా ఆనంద్ కోసం ప్రత్యేకంగా రూపొందించారు. -
కొత్త ఇంటికి మారబోతున్న రాహుల్..
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆగ్నేయ ఢిల్లీలోని తూర్పు నిజాముద్దీన్ ప్రాంతంలో తన నివాసం, కార్యాలయాన్ని త్వరలో ఏర్పాటు చేసుకొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. నివాసం, కార్యాలయం ఒకే ప్రాంగణంలో ఉంటాయని తెలిపాయి. మోదీ ఇంటి పేరుకు సంబంధించిన పరువు నష్టం వ్యాఖ్యల కేసులో జైలు శిక్ష పడడం, తద్వారా లోక్‌సభ సభ్యత్వం కోల్పోవడంతో ఆయన అప్పటి వరకూ నివసిస్తున్న 12, తుగ్లక్ లేన్‌లోని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాల్సి వచ్చిన విషయం తెలిసిందే. రాహుల్ ప్రస్తుతం తన తల్లి సోనియా గాంధీ అధికారిక నివాసమైన 10, జన్‌పథ్‌లో ఉంటున్నారు. అయితే అక్కడి నుంచి మరో చోటుకు మారాలని భావిస్తున్న రాహుల్.. తూర్పు నిజాముద్దీన్ ప్రాంతంలోని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, దివంగత కాంగ్రెస్ నేత షీలా దీక్షిత్ నివాసాన్ని ఎంపిక చేసుకున్నట్లు తెలిసింది. షీలాదీక్షిత్ మరణానంతరం ఆ ఇంట్లో నివసించిన ఆమె తనయుడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్ అక్కడికి దగ్గరిలోనే సమీప బంధువుల ఇంటికి మారడంతో అది ఖాళీగా ఉంది. చదవండి: ఢిల్లీలో జల ప్రళయం.. యమునా ఉధృతరూపం.. ఆల్‌టైమ్ రికార్డు -
రూ.190 కోట్లతో లగ్జరీ బంగ్లా కొన్న గ్లామర్ క్వీన్, ఆ నిర్మాత ఇంటిపక్కనే!
గ్లామర్ క్వీన్ ఊర్వశి రౌతేలా మళ్లీ వార్తల్లోకి వచ్చేసింది. ఫ్యాషన్, లగ్జరీకి పెట్టింది పేరైన ఈ అమ్మడు తాజాగా దిమ్మదిరిగే విలువతో లగ్జరీ బంగ్లాను కొనుగోలు చేసిందిట. దీని విలువ రూ. 190 కోట్లు ఉంటుందని పలుమీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. (అంబానీ మనవరాలంటే అట్లుంటది! పాపాయి పేరు, రాశి ఇదేనట? ) అది కూడా సినీ నిర్మాత యశ్ చోప్రా ఇంటి పక్కనే , బ్రహ్మాండమైన ఎమినిటీస్‌తో విలాసవంతమైన బంగ్లాకు ఊర్వశి రౌతేలా షిష్ట్ అయినట్టు తెలుస్తోంది. యంగెస్ట్ మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ ఇన్‌ది యూనివర్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నతరువాత, 2013లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఇకఅప్పటినుంచి గ్లామరస్ లుక్స్‌తో, సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. (రూ.749 కే బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్ నథింగ్ ఫోన్ (1), డిస్కౌంట్ ఎంతంటే?) తాజా నివేదికల ప్రకారం అత్యంత ఖరీదైన ఏరియాలో ఉన్న ఈ బంగ్లాలో నాలుగు అంతస్తులున్నాయి. పర్సనల్ జిమ్ విశాలమైన బాల్కనీ గార్డెన్, తదితర లగ్జరీ సౌకర్యాలున్నాయి. వందల కోట్ల విలువైన ఈ బంగ్లాకు దానికి తగ్గట్టుగానే అద్భుతమైన ఇంటీరియర్స్, ఖరీదైన పెయింటింగ్స్, క్లాసీ లుక్‌లో అదిరిపోతోందట. కేవలం 15 సంవత్సరాల వయస్సులో, ఊర్వశి విల్స్ లైఫ్‌స్టైల్ ఇండియా ఫ్యాషన్ వీక్‌లో అదరగొట్టింది. 2013లో సింగ్ సాబ్ ది గ్రేట్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టినప్పటికీ, హనీ సింగ్ మ్యూజిక్ వీడియో లవ్ డోస్‌తో సూపర్ పాపులారిటీ సంపాదించింది. యాక్టింగ్ కంటే కూడా లావిష్ లైఫ్ స్టయిల్‌తో హెడ్‌లైన్స్‌లో నిలుస్తూ వస్తోంది. రూ. 40 కోట్ల గోల్డెన్ గౌను ,భారీ జాకెట్ తోపాటు, ఫిల్మ్‌ఫేర్ రెడ్ కార్పెట్ ఈవెంట్లో తన ఫేవరెట్ డిజైనర్ మైఖేల్ సిన్కో డిజైన్ చేసిన పర్ఫెక్ట్ స్టైల్ బాడీకాన్ డ్రెస్‌లో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసింది. ఈ డ్రెస్ ధర దాదాపు రూ. 60 లక్షలు. (అంబటి రాయుడు: లగ్జరీ కార్లు, ఇల్లు, బిజినెస్, నెట్‌వర్త్ గురించి తెలుసా?) ఇటీవల కొద్ది రోజుల క్రితం ఊర్వశి తన 29వ పుట్టినరోజును ప్యారిస్‌లో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. ఇందుకోసం దాదాపు రూ. 93 లక్షలు వెచ్చించిందంటేనే ఆమె రేంజ్ అర్థం చేసుకోవచ్చు. ఈ వేడుకలో 100 వజ్రాలు పొదిగిన గులాబీల 24 క్యారెట్ల గోల్డ కప్ కేక్‌లు డైమండ్ కేక్స్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. ఇటీవలి ఫ్రాన్స్ కేన్స్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా తళుక్కున మెరిసిన ఈ భామ మంచి సందడి చేసిన సంగతి విదితమే. అంతేనా 10 ఏళ్ల దుబాయ్ గోల్డెన్ వీసా అందుకున్న తొలి బాలీవుడ్ నటిగ కూడా ఊర్వశి రౌతేలానే. -
కేజ్రీవాల్ బంగ్లా దర్యాప్తు అధికారికి ఉద్వాసన
న్యూఢిల్లీ: ఢిల్లీలో పాలనాధికారం రాష్ట్ర సర్కార్కే ఉంటుందని సుప్రీంకోర్టు తేల్చిన నేపథ్యంలో ఆప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం కేజ్రీవాల్ అధికార బంగ్లా ఆధునీకరణకు రూ.45 కోట్లు వెచ్చించారన్న ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న విజిలెన్స్ అధికారి, సీనియర్ ఐఏఎస్ రాజశేఖర్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దర్యాప్తును విజిలెన్స్ విభాగంలోని ఇతర అసిస్టెంట్ డైరెక్టర్లు పంచుకోవాలని, నివేదికలను నేరుగా విజిలెన్స్ సెక్రటరీకి సమర్పించాలని ఆదేశించింది. దర్యాప్తు మాటున రాజశేఖర్ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదుల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు విజిలెన్స్ మంత్రి సౌరభ్ భరద్వాజ్ చెప్పారు. -
ఐఏఎస్ ఆఫీసర్ నిర్వాకం..స్మారక కట్టడాన్ని కూల్చి బంగ్లాగా..
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఓ ఐఏఎస్ ఆఫీసర్ నిర్వాకం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ని ఉలిక్కిపడేలా చేసింది. 15వ శతాబ్దపు స్మారక కట్టడాన్ని కూల్చివేసి బంగ్లాను నిర్మించాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పలు రాజకీయా పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీనిపై సత్యరమే చర్చలు తీసుకోమని డిమాండ్ చేశాయి. ఈ అనూహ్య ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..ఢిల్లీలో జల్ విహార్‌లో 15వ శతాబ్దపు రాజభవనం(ప్యాలెస్) ఉంది. ఆ ప్యాలెస్‌లో ఢిల్లీ జల్ బోర్ మాజీ చీఫ్ ఉదిత్ ప్రకాశ్ రాయ్ అతని కుటుంబం ఉంటోంది. వాస్తవానికి ఈ స్మారక కట్టడం పఠాన్ కాలం నాటి రాజభవనం, ఇది సయ్యద్ రాజవంశానికి చెందిన ఖిజర్ ఖాన్ స్థాపించిన ఖిజ్రాబాద్ నగరానికి గుర్తుగా మిగిలిన కట్టడం. ఇది ఢిల్లీ జల్ బోర్డు పరిధిలో ఉంది. ఐతే 2007 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఉదిత్ ప్రకాశ్ రాయ్, అతని కుటుంబం ఇందులో ఉంటోంది. కానీ ఆయన ప్రస్తుతం మిజోరాంలో విధులు నిర్వహిస్తున్నారు. దీంతో ఆ ప్యాలెస్‌ను ఖాళీ చేయాల్సిందిగా బుధవారం విజిలెన్స్ డిపార్ట్మెంట్ నోటీసులు జారీ చేసింది. అయినప్పటికీ అతని కుటుంబం అక్కడే నివశిస్తుంది. నిజానికి ఈ స్మారక కట్టడాన్ని జల్ బోర్డు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు అప్పగించాల్సి ఉంది. ఐతే జనవరిలో అధికారుల సంయుక్త సోదాల్లో అది మిస్ అయ్యినట్లు విజిలెన్స్ డిపార్ట్మెంట్ నోటీసులో పేర్కొంది. అంతేగాదు 2021 జనవరిలో ఈ ప్యాలెస్‌ను అప్పగించాలని పురావస్తు శాఖ కోరిందని, ఐతే దాన్ని జరగనివ్వకుండా ఉదిత్ ప్రకాశ్ రాయ్ అడ్డుకున్నారని విజిలెన్స్ డిపార్ట్మెంట్ నోటీసులో తెలిపింది. ఇదిలా ఉండగా, ఈ ప్రదేశంలో అది పెద్ద విస్తీర్ణంలో కోట లాంటి నిర్మాణం ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ఐతే దాని ప్లేస్‌లో బంగ్లా నిర్మించినట్లు సమాచారం. సమీపంలో అందుకు సంబంధించి శిథిలాల భాగాలు కూడా కనిపించాయి. దీంతో ఈ ఘటనపై తక్షణమై చర్యలు తీసుకోవాల్సిందిగా బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్‌తో సహా పలు రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ లేఖ రాశారు. కాగా, ఇలాంటి దిగ్భ్రాంతి కర ఘటన భారత్‌లోనే జరిగింది, ఈ ఘటనతో భారత పురావస్తు, సాంస్కృతిక శాఖలు మరోసారి నిద్రపోతున్నాయనే అనే విషయాన్ని ప్రూవ్ చేశాయి. ఈ మేరకు సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డిని దుయ్యబడుతూ..దీనిపై విచారణ జరిపించాల్సిందిగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా ట్వీట్ చేశారు. (చదవండి: అప్పుడు జనజీవనంలో కలిసి.. ఇప్పుడు 50 కేజీల మందుపాతరకు బలి) -
Rahul Gandhi: 'నిజం మాట్లాడినందుకు మూల్యం!'
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యునిగా అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఈ రోజు (శనివారం) ఢిల్లీలోని తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి.. అధికారులకు అప్పగించిన సంగతి తెలిసిందే. అనంతరం రాహుల్ గాంధీ మీడియా ముందు మాట్లాడుతూ.. నిజం మాట్లాడినందుకు ఎంతటి మూల్యాన్ని చెల్లించేందుకైనా రెడీ అంటూ తనదైన శైలిలో బీజేపీకి కౌంటరిచ్చారు. అదీగాక శుక్రవారం సూరత్ సెషన్స్ కోర్టుని ఆశ్రయించినా.. రాహుల్‌కి ఊరట లభించలేదు. ఈ నేపథ్యంలో బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టారు. దీన్ని రాజకీయ కక్ష సాధింపు చర్యగా అభివర్ణించారు రాహుల్. తనను లక్ష్యంగా చేసుకుని అధికార బీజేపీ బలవంతపు దాడులకు దిగుతోందన్నారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.."హిందూస్తాన్ ప్రజల నాకు 19 సంవత్సరాలుగా ఈ ఇంటిని ఇచ్చారు. అందుకు వారికి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నా. ఇది నిజం మాట్లాడినందుకు మూల్యం. నేను నిజం మాట్లాడినందుకు ఎంత ధరనైనా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా." అని తన అధికారిక నివాసం వెలుపల విలేకరులతో అన్నారు. తన వస్తువులను జన్‌పథ్ 10లోని తన తల్లి సోనియా గాంధీ నివాసానికి తరలిస్తున్నట్లు రాహుల్ చెప్పారు. బంగ్లాను ఖాళీ చేసి వెళ్లేందుకు సోదరి ప్రియాంక గాంధీ రాహుల్‌కి సహాయం చేస్తూ కనిపించారు. కాగా, సూరత్ హైకోర్టులో సైతం రాహుల్‌కి చుక్కెదురు కావడంతో కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలు దీన్ని ప్రజాస్వామ్యంపై దాడి అని ముక్త కంఠంతో నినదించాయి. కానీ బీజేపీ మాత్రం కోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ..అతని పార్టీ న్యాయవ్యవస్థను ప్రశ్నిస్తూ చట్టాన్ని అగౌరపరుస్తుందని ఆరోపణలు చేస్తోంది. #WATCH | "People of Hindustan gave me this house for 19 years, I want to thank them. It's the price for speaking the truth. I am ready to pay any price for speaking the truth...," says Congress leader Rahul Gandhi as he finally vacates his official residence after… pic.twitter.com/hYsVjmetYw — ANI (@ANI) April 22, 2023 (చదవండి: షిర్డి ఆలయం నుంచి నాణేలను బ్యాంకులు తీసుకోమన్నాయ్! ఎందుకంటే..) -
నేడు బంగ్లాను అధికారులకు అప్పగించేసిన రాహుల్!
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన అధికారిక నివాసం 12 తుగ్లక్ లైన్‌ను పూర్తిగా ఖాళీ చేశారు. ఆయనపై అనర్హత వేటు పడటంతో లోక్‌సభ హౌసింగ్ కమిటీ ఏప్రిల్ 22 నాటికి బంగ్లాను ఖాళీ చేయాల్సిందిగా నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ అతని సోదరి ప్రియాంగ గాంధీ గడుపు ముగిసే చివరి రోజైన శనివారం సెంట్రల్ ఢిల్లీలోని తన అధికారిక నివాసాన్ని రెండుసార్లు సందర్శించారు. వాస్తవానికి రాహుల్ ఢిల్లీ ప్రభుత్వ బంగ్లాలో 2005 నుంచి దశాబ్దాలుగా ఇక్కడే నివాసం ఉంటున్నారు. నిజానికి ఏప్రిల్ 14న రాహుల్ గాంధీ తన కార్యాలయంలోని కొన్ని వ్యక్తిగత వస్తువులను బంగ్లా నుంచి తీసుకెళ్లిపోయారు. శుక్రవారం సాయంత్రం బంగ్లాలో మిగిలిపోయిన వస్తువులను రాహుల్ గాంధీ తీసుకెళ్లినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈమేరకు ఆయన ఈ రోజు(శనివారం) మధ్యాహ్నం 3 గంటలకు బంగ్లా కీలను లోక్‌సభ సెక్రటేరియట్‌కు నివాసం తాళాలు సమాచారం. ఇదిలా ఉండగా, పరువు నష్టం కేసులో రెండేళ్లు జైలు శిక్ష పడటంతో రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యుత్వం గత నెలలోనే ముగిసింది. ఆ తర్వాతే ఆయనకు బంగ్లా ఖాళీ చేయాల్సిందిగా నోటీసులు వచ్చాయి. అదీగాక ప్రోటోకాల్ ప్రకారం రాహుల్ బయటకు వెళ్లాల్సిందే. ఈ నేపథ్యంలోనే రాహుల్ అనివార్య పరిస్థితుల్లో బంగ్లా ఖాళీ చేయాల్సి వచ్చింది. ఐతే కేంద్రం రాజకీయ కక్ష సాధిస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. వాస్తవానికి పరువు నష్టం కేసులో రాహుల్‌కి గుజరాత్ కోర్టు తిరిగి అప్పీలు దాఖలు చేయడానికి 30 రోజులు గడువు ఇచ్చింది. ఈ నిమిత్తం శుక్రవారం కోర్టును ఆశ్రయించినా..రాహుల్‌కి ఊరట లభించలేదు. దీంతో ఆయన తన ఎంపీ అభ్యర్ధిత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఐతే బీజేపీ సూరత్ సెషన్స్ కోర్టు తీర్పుని గాంధీ కుటుంబాని చెంపదెబ్బగా అభివర్ణించింది. చట్టం అందరికీ సమానమని ఎవరికీ ప్రాధాన్యత ఉండదని కోర్టు నిరూపించిందని పేర్కొంది. దీంతో రాహుల్ సూరత్ కోర్టు తీర్పను వ్యతిరేకిస్తూ..గుజరాత్ హైకోర్టు లేదా సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. #WATCH | Delhi: Trucks leave from Rahul Gandhi's 12 Tughlak Lane bungalow as he vacates the residence after his disqualification as a Lok Sabha MP. pic.twitter.com/CEvWhMeev9 — ANI (@ANI) April 22, 2023 (చదవండి: కర్నాటక: డీకే శివకుమార్ ప్రయాణించిన ఛాపర్లో ఈసీ అధికారుల తనిఖీలు ) -
బంగ్లా ఖాళీ చేయడంపై రాహుల్ లేఖలో ఏమన్నారంటే..
రాహుల్ గాంధీకి అనర్హత వేటు పడిన తర్వాత ఆయన నివాసముంటున్న అధికారిక బంగ్లా ఖాళీ చేయాలని సోమవారం లోక్‌సభ హౌసింగ్ ప్యానెల్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ భవనం న్యూఢిల్లీలోని తుగ్లక్ లేన్ 12లో ఉంది. రాహుల్ వాస్తవానికి జెడ్ ప్లస్ ప్రొటెక్షన్‌తో 2005 నుంచి అదే బంగ్లాలో ఉంటున్నారు. నోటీసులు అందుకున్న తర్వాత రాహుల్ లోక్‌సభ సెక్రటేరియేట్ కు ఒక లేఖ రాశారు. ఆ లేఖలో.. ఆ బంగ్లాతో ముడిపడి ఉన్న కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. గత నాలుగు పర్యాయాలుగా లోక్‌సభకు ఎన్నికైన సభ్యుడిగా ప్రజలిచ్చిన తీర్పుతో ఇక్కడ ఉంటున్న నాకు ఈ భవనంతో చిరస్మరణీయ జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. నన్ను ఎన్నుకున్నందుకు ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని, అలాగే నా హక్కులకు భంగం వాటిల్లకుండా లేఖలో పేర్కొన్న వాటికి కట్టుబడి ఉంటాను అని రాహుల్ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే డిస్ క్వాలిఫై అయ్యాను కాబట్టి, నిబంధనల మేరకు నడుచుకుంటానని, లోక్ సభ సభ్యత్వం ద్వారా సంక్రమించిన బంగాళాను ఖాళీ చేస్తానని తెలిపారు. అయితే బంగళా ఖాళీ చేయాలన్న లోక్ సభ సెక్రటేరియట్ ఆదేశంపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడ్డాయి. దీనిపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని కించపరిచే ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ ను దెబ్బతీసేందుకే ఇలా చేస్తున్నారని, తుగ్లక్ లేన్ లో ఉన్న బంగ్లా ఖాళీ చేస్తే రాహుల్ తన తల్లితో కలిసి ఉండొచ్చని, లేదా తనకు కేటాయించిన బంగళా అయినా వాడుకోవచ్చని ఖర్గే తెలిపారు. అయినా రాహుల్‌ని భయపెట్టి, బెదిరించడం, అవమానించడం సరికాదని, ఈ విషయంలో ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నానని ఖర్గే అన్నారు. (చదవండి: ప్రధాని ఇమేజ్‌ని డ్యామేజ్ చేయటం అంత ఈజీ కాదు!: స్మృతి ఇరానీ) -
బిగ్‌బీ ‘ప్రతీక్ష’ గోడ కూల్చివేతపై బీఎంసీ ఆలస్యం.. లోకాయుక్త ఫైర్
Maharashtra Lokayukta On BMC Delaying Amitabh Bungalow Wall Razing: ముంబైలో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ మొదటిసారిగా నిర్మించుకున్న బంగ్లా ప్రతీక్ష. ఇంద్రభవనంలా ఉండే ఈ బంగ్లా చుట్టూ వివాదం చుట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రతీక్షను అక్రమ కట్టడంగా పరిగణలోకి తీసుకుని దానిని వెంటనే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు స్వాధీనం చేసుకోవాల్సిందిగా కాంగ్రెస్ నేత తులిప్ బ్రియాన్ మిరండా అప్పట్లో డిమాండ్ చేశారు. అయితే రోడ్డు విస్తరణలో భాగంగా ఈ ప్రతీక్ష బంగ్లా కాంపౌండ్ వాల్ కూల్చివేసేందుకు, భవనంలోని కొంత భాగాన్ని స్వాధీనం చేసుకునేందుకు బీఎంసీ కుంటి సాకులు చెబుతోందని మహారాష్ట్ర లోకాయుక్త ఆరోపించింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కూల్చివేతకు కనీసం ఒక సంవత్సరం పడుతుందని, ఎందుకు ఆలస్యం చేస్తున్నారని మహారాష్ట్ర లోకాయుక్త న్యాయమూర్తి జస్టిస్ వీఎం కనడే తన ఇటీవలి ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు సమాచారం. అలాగే ఈ ఉత్తర్వుల్లో పనుల జాప్యంపై పశ్చిమ శివారు ప్రాంతాల డిప్యూటీ ఇంజినీర్ (రోడ్లు)కు పౌర సంఘం నోటీసు జారీ చేయాలన్నారు. రోడ్డు విస్తరణ ప్రాజెక్ట్ కోసం కాంట్రాక్టర్ లేనందున బంగ్లా నుంచి కొంత భాగాన్ని స్వాధీనం చేసుకోలేదని ఇంతకుముందు బీఎంసీ తెలిపింది. శివసేన నియంత్రణలో ఉన్న పౌర సంఘం కూడా గోడను కూల్చివేసి, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రోడ్డు కాంట్రాక్టర్‌ను నియమించినప్పుడు భూమిని స్వాధీనం చేసుకుంటుదని చెప్పింది. 'కూల్చివేతలను చేపట్టకపోవడానికి బీఎంసీ చెప్పిన ఈ కారణం సరైనదిగా కనిపించడం లేదు. రోడ్డు విస్తరణ చేపట్టినప్పుడల్లా అవి అమలు చేయడానికి తగిన బడ్జెట్‌ను బీఎంసీ అమలు చేస్తుంది. దీన్ని బట్టి బీఎంసీ ఆలస్యం చేస్తోందని స్పష్టంగా తెలుస్తోంది. కుంటి సాకులు చెబుతూ సరిహద్దు గోడ కూల్చివేత చేయట్లేదు' అని లోకాయుక్త తన ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. -
డైమండ్ కింగ్ ఆశల సౌధాన్ని కుప్పకూల్చిన అధికారులు
-
నీరవ్ మోదీ బంగ్లా కూల్చివేత
-
డైనమైట్లతో నీరవ్ మోడీ బంగ్లా పేల్చివేత
సాక్షి, ముంబై : పంజాబ్ నేషనల్ బ్యాంకులో రు.13 వేల కోట్ల రుణాన్ని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌మోడీ నివాస భవనాన్ని ఇవాళ (శుక్రవారం) అధికారులు కూల్చివేశారు. అలీబాగ్‌లో విలాసవంతమైన బంగ్లాను రాయగడ్ జిల్లా కలెక్టర్ విజయ సూర్యవంశి,ఇతర అధికారుల సమక్షంలో పూర్తిగా నేలమట్టం చేశారు. బిల్డింగ్ బుల్డోజర్లకు లొంగక పోవడంతో, ప్రత్యేక బృందాన్ని పిలిపించి మరీ పని పూర్తి చేశారు. దీంతో డైమండ్ కింగ్ ఆశల సౌధం కుప్పకూలింది. శక్తివంతమైన దాదాపు 100 డైనమైట్లు వినియోగించి బంగ్లాను ధ్వంసం చేశారు. రూ.33 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఈ బంగ్లాను నాణ్యమైన సిమెంట్‌తో నిర్మించడంతో బుల్డోజర్లతో కూల్చడం కష్టమని భావించిన అధికారులు డైనమైట్లతో పూర్తిగా పడగొట్టారు. ఈ భవనం విలువ రూ.100 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. ఇప్పటికే ఈ భవనాన్ని ఈడీ ఎటాచ్ చేసింది కూడా. -
ఆ భవనం కూల్చివేతకు ముహూర్తం ఫిక్స్
సాక్షి, ముంబై: డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీకి ఊహించని షాక్ తగిలింది. పీఎన్బీ స్కాంలో ప్రధాన నిందితుడు నీవర్‌కు చెందిన అలీబాగ్ విలాసవంతమైన భవనాన్ని అధికూరులు పూర్తిగా కూల్చి వేసే క్రమంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. భారీ డిటోనేటర్లతో ఈ భవనాన్నిపూర్తిగా నేలమట్టం చేయడానికి శుక్రవారం ముహర్తం పెట్టారు. ఇందుకు ప్రత్యేక టెక్నికల్ బృందాన్ని కూడా రప్పించారు. రాయగడ్ జిల్లాలో సముద్రతీర ప్రాంతంలో 30వేల చదరపుగజాల్లో విస్తరించి ఉన్న ఈ భవనానికి మూడు డ్రిల్లింగ్ మెషీన్ల సాయంతో రంధ్రాలు చేసిన డైనమేట్లు పేర్చి కుప్పకూల్చ నున్నామని అధికారులు చెప్పారు. ఇప్పటికే ఈ భవనం పిల్లర్స్‌లో రంధ్రాలు చేసే కార్యక్రమం చేపట్టామని తెలిపారు. అయితే ఈ విలువైన షాండ్లియర్‌ను, బుద్ధుని విగ్రహాన్ని భద్రపరిచామని దీన్ని ఈడీ అధికారులకు అప్పగిస్తామని చెప్పారు. పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారంటూ జిల్లా అధికారులు కూల్చివేతకు ఆదేశించిన ఈ భవనాన్ని పీఎన్ బీ కేసులో ఈడీ ఎటాచ్ చేసింది. ఈ బంగ్లా విలువ రూ.100 కోట్లు ఉంటుందని అంచనా. ఈ మేరకు రాయగఢ్ జిల్లా కలెక్టరు విజయ్ సూర్యవంశి అదనపు కలెక్టరు భరత్ షితోలేకు బాధ్యతలను అప్పగించారు. పేలుళ్ల ద్వారా భారీ బిల్డింగులను కూల్చిన అనుభవం భరత్ సొంతం. అంతేకాదు డిమోలిషన్ మ్యాన్‌గా పేరు కూడా తెచ్చుకున్నారు. కాగా బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద కుంభకోణానికి కారకులు డైమండ్ వర్తకుడు నీరవ్ మోదీ, ఆయన మేనమాడ, గీతాంజలి గ్రూప్ అధినేత మెహుల్ చోక్సీ. సుమారు రూ14వేలకోట్ల మేరకు ప్రభుత్వరంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకును ముంచేసి విదేశాలకు చెక్కేశారు. ఇప్పటికే వీరిపై సీబీఐ, ఈడీ కేసులను నమోదు చేయడంతోపాటు, పలు ఆస్తులను ఎటాచ్ చేశాయి. అటు ప్రభుత్వం నీరవ్, చోక్సీల పాస్ పోర్టులను రద్దు చేసింది. వీరిని తిరిగి దేశానికి రప్పించేందుకు కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. -
కలెక్టర్ బంగళా
నూరు, నూట పాతికేళ్ల పాటు మనుషులు బతికుండటం అనేది పెద్ద ఆసక్తికరమైన సంగతేం కాదు. ఆ నూరూ, నూటపాతికేళ్ల వాళ్లు చనిపోయినప్పుడే కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తుంది.. ఇన్నేళ్లు బతికారా అని! అదీ పెద్ద ఆశ్చర్యం ఏమీ కాదు. ఊరికే ఆశ్చర్యం. ఆ బంగళా వయసు నూటా ముప్పై ఏళ్లకు పైగానే. అన్నేళ్లపాటు ఒక మనిషి బతికి ఉన్నారంటే ఆ మనిషిని చూడాలని వెళ్లేవారు ఎవరైనా ఉంటే ఉంటారేమో కానీ.. ఒక బంగళా అన్నేళ్ల నుంచీ ఉందంటే ఆ బంగళా లోపలికి వెళ్లి, లోపలంతా ఒకసారి చుట్టి రావాలని అనిపించకుండా మాత్రం ఎవరికీ ఉండదు. మానవ జీవనంలో లేని ఆసక్తి మానవ నిర్మాణంపై ఉండడం సహజమే. అది ప్రభుత్వ బంగళా. బ్రిటిష్ ప్రభుత్వం కట్టించిన ఆ బంగళాను, మన ప్రభుత్వం వాడుతోంది. అది కూడా ప్రభుత్వ కార్యాలయంగా వాడడం లేదు. బదలీ అయి వచ్చే కలెక్టర్ల నివాసగృహంగా వాడుతోంది. ప్రజలు ఎవరైనా బంగళాను బయటి నుంచి చూసి వెళ్లిపోవడమే కానీ, లోపలికి వెళ్లి కలియదిరగడానికి లేదు. అలాంటి బంగళా ఇప్పుడు అకస్మాత్తుగా స్థానికుల్లో, చుట్టపక్కలవాళ్లలో ఆసక్తి రేకెత్తించింది! అందుకు ప్రధానంగా రెండు కారణాలు. ఒకటి.. ఓ ఎంగ్ అండ్ డైనమిక్ మహిళా కలెక్టర్ ఆ బంగళాలోకి దిగడం. ఇంకొకటి.. ఆ బంగళాలో దెయ్యం తిరుగుతోందని ఆ కలెక్టరమ్మతో.. ఆ బంగళాలో పనిచేసేవారెవరో అనడం! బంగళాలో దెయ్యం ఉందని పనివాళ్లలో ఒకరు మొదట అన్నప్పుడు.. ఆ కలెక్టరమ్మ పెద్దగా నవ్వారు. ‘‘నీకెలా తెలుసు జంగయ్యా.. బంగళాలో దెయ్యం ఉందనీ!’’.. నవ్వును ఆపుకుంటూ అడిగారు కలెక్టరమ్మ. బంగళాలో దెయ్యం ఉందని చెప్పిన మనిషే జంగయ్య. ‘‘ఉందమ్మా.. పైన రూమ్‌లో ఉంది. నా భార్య కూడా చూసింది. నా భార్య రూమ్ సాఫ్ చేస్తుంటే వచ్చి దాని మెడ పట్టుకుంది’’ అన్నాడు జంగయ్య. కలెక్టరమ్మ ఈసారి నవ్వలేదు. నవ్వీ నవ్వనట్లు ఊరుకున్నారు. ‘‘సర్లే.. జాగ్రత్తగా ఉందాం’’ అని మాత్రం అన్నారు.‘‘దెయ్యాల దగ్గర జాగ్రత్త ఏంటమ్మా.. దెయ్యాలు దెయ్యాలే. మనుషులం మనుషులమే’’ అన్నాడు జంగయ్య. ప్రెస్ మీట్లో అంతా కలెక్టరమ్మ చుట్టూ చేరారు. అది కలెక్టరమ్మ ఏర్పాటు చేసిన మీట్ కాదు. ప్రెస్ మీట్ కోసం కలెక్టరమ్మను ఒప్పించిన మీట్. కొత్త కలెక్టర్.. జిల్లాలో ప్రభుత్వ పథకాలను ఎలా అమలు చేయబోతున్నారో.. ప్రజలకు ఎలా చేరువ అవబోతున్నారో చెప్పే ‘గెట్ టుగెదర్’ లాంటి మీట్. మీడియా ప్రతినిధులు కలెక్టరమ్మను ప్రశ్నలు అడుగుతున్నారు. మీడియా కెమెరాలు కలెక్టరమ్మ నవ్వును, కలెక్టరమ్మ చీరకట్టును, కలెక్టరమ్మ కంఠం కింది అందమైన ఉడెన్ జ్యుయలరీని, ఆ ఉడెన్ జ్యుయలరీకి ఉన్న ఉడెన్ లాకెట్నీ, ఆహ్లాదకరమైన ఆమె హావభావాల్ని షూట్ చేస్తున్నాయి. మీడియా ప్రశ్నలకు కలెక్టరమ్మ సమాధానాలన్నీ అయ్యాక.. టీ–బిస్కెట్ సెషన్లో.. ‘‘ఏలా ఉంది మేడమ్.. ఈ బంగళా! మీకు కంఫర్ట్‌గా ఉందా?’’ అని ఓ ప్రతినిధి అడిగారు. వెంటనే జంగయ్య గుర్తుకొచ్చాడు కలెక్టరమ్మకు. ‘‘నా కంఫర్ట్ కోసం ప్రభుత్వం నన్నిక్కడ ఉంచలేదు. ప్రజల కంఫర్ట్ చూడ్డానికి ఉంచింది’’ అని నవ్వారు కలెక్టరమ్మ. ‘‘అది నిజమే. కానీ మీరు కంఫర్ట్‌గా ఉంటేనే కదా.. ప్రజలు కంఫర్ట్‌గా ఉండేది’’ అని ఇంకో ప్రతినిధి అన్నారు. ‘‘ప్రజా ప్రతినిధులు తమ కంఫర్ట్ చూసుకోకుండా ప్రజల కోసం పని చేస్తున్నప్పుడు.. ప్రజాసేవకులమైన మేమూ అలాగే ప్రజల కోసం పని చేయాలి కదా.. కంఫర్ట్ చేసుకోకుండా’’.. నవ్వుతూ చెప్పారు కలెక్టరమ్మ. ‘‘అంటే.. మీరిప్పుడు కంఫర్ట్‌గా లేరనేనా.. ఈ బంగళాలో’’.. మరో ప్రతినిధి. కలెక్టరమ్మ ఆశ్చర్యపోయారు.‘‘నేను అలా అనడం లేదు. ప్రజల్ని కంఫర్ట్‌గా ఉంచడమే మా డ్యూటీ అంటున్నాను’’ అన్నారు. ‘‘ప్రజల్ని కాసేపు పక్కన పెడదాం మేడమ్. స్ట్రయిట్‌గా చెప్పండి. ఈ బంగళాలో మీరు ధైర్యంగా ఉండగలుగుతున్నారా?’’ ఇంకో ప్రశ్న. కలెక్టరమ్మ నవ్వారు. ‘‘నేననుకోవడం ఏంటంటే.. మీరే స్ట్రయిట్‌గా నన్ను అడగదలచిన ప్రశ్నను అడగలేకపోతున్నారు. అసలు ధైర్యం అనే మాట ఎందుకొచ్చింది?’’ అన్నారు. ‘‘బంగళాలో దెయ్యం తిరుగుతోందని..’’ అన్నారా ప్రతినిధి!ఆ మాటకు పెద్దగా నవ్వారు కలెక్టరమ్మ. ఆమెకు మళ్లీ జంగయ్య గుర్తుకొచ్చాడు. ‘‘అవును. ఉందని అంటున్నారు’’ అన్నారు నవ్వుతూ.అక్కడితో మీట్ ముగిసింది. ఇలా మీట్ ముగియగానే అలా టీవీ చానల్స్‌లో బ్రేకింగ్ న్యూస్ మొదలైంది.‘కలెక్టర్ బంగళాలో దెయ్యం’‘దెయ్యానికి భయపడుతున్న యువ కలెక్టర్’‘ఉంటారా? ఖాళీ చేస్తారా?’‘ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా?’బ్రేకింగ్‌లతో పాటే.. ‘దెయ్యాలున్నాయా? లేవా?’ అనే డిబేట్. డిబేట్లో ఘన విజ్ఞాన వేదిక (ఘ.వి.వే) చాలెంజ్. ‘‘కలెక్టర్ అయ్యుండీ.. ప్రజల్లో మూఢనమ్మకాలను పెంచి పోషిస్తారా! అంత చదువు చదివి ఏం లాభం? అంత ఉద్యోగం చేస్తూ ఏం ప్రయోజనం? కలెక్టర్ గారి బంగళాలో దెయ్యం ఉందని నిరూపిస్తే.. ఇరవై ఐదు లక్షల రూపాయలిస్తాం. ఒక్కరాత్రి బంగళాలో ఉండేందుకు అనుమతి ఇవ్వండి చాలు. దెయ్యాలు లేవని మేము రుజువు చేస్తాం..’’ డిబేట్లో ఆవేశంగా చెప్పుకుపోతున్నారు ఘ.వి.వే. అధ్యక్షుడు. టీవీ చూస్తున్న కలెక్టరమ్మ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బంగళాలో దెయ్యం ఉందని, ఆ దెయ్యానికి తను భయపడుతున్నానని తనెప్పుడు చెప్పిందో ఆమెకు అర్థం కాలేదు. ‘దెయ్యం ఉందట కదా’ అని వాళ్లు అంటే, ‘ఉందని అంటున్నారు’ అనే కదా తను వాళ్లతో అన్నది! అది కూడా నవ్వుతూ అన్న మాటే.లైఫ్‌లో మొదటిసారి దెయ్యం అంటే భయమేసింది కలెక్టరమ్మకు. బంగళాలో ఉందని జంగయ్య చెప్పిన దెయ్యానికి కాదు ఆమె భయపడింది. తన మాటల్ని వక్రీకరించిన దెయ్యానికి! ఘ.వి.వే. అధ్యక్షుడి మాటలు కూడా కలెక్టరమ్మకు ఆశ్చర్యంగా అనిపించాయి. లేవని నిరూపిస్తారట!! దెయ్యాలు ఉన్నాయని నమ్మని వారు.. పనిగట్టుకుని వచ్చి దెయ్యాలు లేవని నిరూపించవలసిన అవసరమేంటి?నవ్వుకున్నారావిడ. - మాధవ్ శింగరాజు -
అసహనంతోనే బంగ్లా ధ్వంసం
లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసిన విషయంలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), బీజేపీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. లక్నోలో అఖిలేశ్ ఇన్నాళ్లూ నివసించిన ఆ బంగ్లా ఇప్పుడు బాగా ధ్వంసమైందనీ, ఇది ఆయనకు వచ్చిన అసహనానికి నిదర్శనమని బీజేపీ ఆరోపించింది. యూపీ మాజీ సీఎంలంతా ప్రభుత్వ అధికారిక బంగ్లాలను ఖాళీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడం తెల్సిందే. మాజీ సీఎంలు ములాయం సింగ్, కల్యాణ్ సింగ్, రాజ్‌నాథ్, మాయవతి, అఖిలేశ్ ఆయా భవనాలను ఖాళీ చేశారు. అయితే అఖిలేశ్ బంగ్లాను ఖాళీ చేశాక, దాని ఫొటోలు తీసుకోవడానికి అధికారులు ఫొటోగ్రాఫర్లను అనుమతించారు. సైకిల్ ట్రాక్, ఏసీలు పెట్టిన గోడలు, బ్యాడ్మింటన్ కోర్టు తదితరాలు బాగా దెబ్బతిన్నట్లు చిత్రాల్లో తెలుస్తోంది. నివాసం ఖాళీ చేయాల్సిరావడంతో అఖిలేశ్ కావాలనే బంగ్లాను ధ్వంసం చేశారనే కోణంలో బీజేపీ ఆరోపణలు చేయగా, అవన్నీ సాధారణంగా దెబ్బతిన్నవేననీ, కల్యాణ్ సింగ్, రాజ్‌నాథ్‌ల బంగ్లాల ఫొటోలను ఎందుకు బయటకు రానివ్వలేదని ఎస్పీ నాయకులు ప్రశ్నించారు. తాజా ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం, పెరిగిన అఖిలేశ్ ప్రజాదరణతో బీజేపీ ఆరోపణలు చేస్తోందని ఎస్పీ నాయకులు ఎదురుదాడి చేశారు.