భారతదేశంలో అత్యంత సంపన్న కుటుంబం ఎవరిదీ అంటే వెంటనే గుర్తొచ్చేది 'అంబానీ ఫ్యామిలీ'. ఈ కుటుంబం విలాసవంతమైన జీవితం గడుపుతారన్న విషయం అందరికి తెలిసిందే. 2018లో ముఖేష్ అంబానీ గారాల తనయ ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్‌ని వివాహం చేసుకుంది. వివాహానంతరం ఈ కొత్త జంట అప్పట్లో కొత్త ఇంట్లోకి ప్రవేశించారు. ఈ లగ్జరీ బంగ్లా విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
గులిటాలోని ఇషా అంబానీ మాన్షన్ అని పిలువబడే సంపన్నమైన ఎస్టేట్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఆధునిక సదుపాయాలు, అధునాతన వసతులు కలిగిన ఈ భవనం భూలోక ఇంద్ర భావనాన్ని తలపిస్తుంది.
వర్లీలోని హిందూస్తాన్ యూనిలీవర్‌కి చెందిన ఈ భవనాన్ని 2012లో జరిగిన వేలంలో పిరమాల్ కుటుంబం దక్కించుకుంది. ఈ అద్భుతమైన భవనం అరేబియా సముద్రానికి ఎదురుగా ఉంటుంది. దీనిని అజయ్ పిరమల్ అండ్ స్వాతి పిరమల్ ఇషా అంబానీకి కానుకగా అందించారు.
(ఇదీ చదవండి: కొత్త కారు కొంటున్నారా.. ఈ రూల్స్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు!)
50000 చదరపు అడుగుల అల్ట్రా లగ్జరీ బంగ్లా ఖరీదు సుమారు రూ. 450 కోట్లు అని తెలుస్తోంది. ఐదు అంతస్తులు కలిగిన ఈ సౌధం మొదటి అంతస్థులో విశాలమైన మల్టి పర్పస్ రూమ్స్, ఓపెన్ ఎయిర్ వంటి వాటితో పాటు ఆ తరువాత అంతస్తుల్లో లివింగ్, డిన్నర్, డ్రెస్సింగ్ వంటి వాటి కోసం ప్రత్యేకమైన రూమ్స్ వంటివి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇషా ఆనంద్ కోసం ప్రత్యేకంగా రూపొందించారు.
Comments
Please login to add a commentAdd a comment