రియల్ ఎస్టేట్ బాగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో 'మహీంద్రా లైఫ్‌స్పేస్' తనను తాను ప్రీమియం హౌసింగ్ కంపెనీగా రీబ్రాండ్ చేసుకోవాలని.. ముంబై, పూణె, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో తన వ్యాపారాన్ని మరింత విస్తరించాలని యోచిస్తున్నట్లు.. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ అమిత్ కుమార్ సిన్హా అన్నారు.
అమిత్ కుమార్ సిన్హా.. మహీంద్రా కార్లను గురించి ప్రస్తావిస్తూ, అద్భుతమైన ఫీచర్స్ కలిగిన బ్రాండ్ (మహీంద్రా) కార్ల మాదిరిగానే గృహాలను కూడా ఫ్రీమియం సౌకర్యాలతో అందించడమే లక్ష్యమని ఆయన అన్నారు. రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఓ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయాలని పేర్కొన్నారు.
మహీంద్రా XUV700 కారును ఉపయోగించే వినియోగదారుడు ఎంత అనుభూతి పొందుతాడో.. తప్పకుండా మహీంద్రా లైఫ్‌స్పేస్ గృహాలు కూడా అంత అనుభూతిని అందించేలా రూపొందిస్తామని అమిత్ అన్నారు. మా ప్రాజెక్ట్ నిర్మించే గృహాలు.. ఉత్తమమైన స్థలంలో, పచ్చదనం, కావలసిన సౌకర్యాలను అందిస్తాయని అన్నారు.
మహీంద్రా లైఫ్‌స్పేస్ ముంబై, పూణె, బెంగళూరులలో తన ఉనికిని మరింత విస్తరించడంపై దృష్టి పెట్టాయి. దీనికోసం కంపెనీ ఏకంగా రూ. 45000 కోట్లను వెచ్చిస్తోంది. అంతే కాకుండా 2028నాటికి రూ. 8000 కోట్ల నుంచి రూ. 10000 కోట్ల మధ్య ప్రీ-సేల్స్ సాధించడం కంపెనీ లక్ష్యం అని అమిత్ కుమార్ సిన్హా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment