బాలీవుడ్ బాద్‌షా 'షారుఖ్ ఖాన్' (Shahrukh Khan) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పఠాన్‌తో దుమ్మురేపిన కింగ్ ఖాన్.. తాజాగా 'జవాన్' చిత్రంతో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. మన దేశంలో అన్ని భాషలలో కలిపి రూ. 75 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.125 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాలో కథానాయకుడైన షారుఖ్ నెట్‍వర్త్, లగ్జరీ కార్లు వంటి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఐదు పదుల వయసు దాటినా ఎంతో హుందాగా బాక్సాఫీస్ బద్దలు కొడుతున్న షారుఖ్ ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫ్యాన్ పాలోయింగ్ కలిగి ఉన్నారు. ఈయన ఒక సినిమాకు రూ.130 నుంచి రూ.150 కోట్లు తీసుకుంటారని సమాచారం. ఇది మాత్రమే కాకుండా బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, వివిధ వ్యాపార సంస్థల నుంచి రూ. 100 కోట్లు కంటే ఎక్కువ తీసుకుంటున్నట్లు.. వార్షిక ఆదాయం మొత్తం రూ. 280 కోట్లు వరకు ఉంటుందని తెలుస్తోంది.
రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్..
రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ అనే సినీ నిర్మాణ సంస్థ ద్వారా వీరు సంవత్సరానికి రూ.500 కోట్లు ఆర్జిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిని ఆయన భార్య గౌరీ ఖాన్ చూసుకుంటున్నట్లు సమాచారం. ఇవి కాకుండా దుబాయ్‌లో రూ.200 కోట్లు విలువ చేసే విల్లా, అమెరికాలో ఒక ఖరీదైన విల్లా ఉన్నట్లు చెబుతారు.
ఇదీ చదవండి: ఇంజినీర్ జాబ్ వదిలి వ్యవసాయం - సంపాదన తెలిస్తే షాకవుతారు!
కార్ కలెక్షన్స్..
షారుఖ్ ఖాన్ వద్ద ఉన్న కార్ల విషయానికి వస్తే.. వీరి వద్ద సుమారు రూ. 7 కోట్లు విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ డ్రాప్ హెడ్ కూప్, బెంట్లీ కాంటినెంటల్ జిటి, బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్, టయోటా ల్యాండ్ క్రూయిజర్, ఆడి ఏ8 ఎల్, బిఎమ్‌డబ్ల్యూ ఐ8, బిఎమ్‌డబ్ల్యూ 6-సిరీస్ కన్వర్టిబల్, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ స్పోర్ట్, మిత్సుబిషి పజెరో, హ్యుందాయ్ క్రెటా మొదలైన కార్లు ఉన్నాయి. మొత్తం మీద అయన ఆస్తుల విలువ ఏకంగా రూ. 6300 కోట్లు కంటే ఎక్కువని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment